1 00:00:45,462 --> 00:00:46,630 జీ మూన్ చనిపోయాడు. 2 00:00:47,756 --> 00:00:49,550 డ్రగ్స్ డోస్ ఎక్కువై చనిపోయాడు. 3 00:00:51,552 --> 00:00:52,553 అదీ సంగతి. 4 00:00:52,636 --> 00:00:55,305 జరిగింది దురదృష్టకరమైన సంఘటనే, కానీ ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. 5 00:00:56,723 --> 00:00:57,724 అదే కథనం. 6 00:00:59,184 --> 00:01:02,521 అతడిని చంపింది నేనే అన్న విషయాన్ని పక్కకు పెట్టేస్తా. 7 00:01:07,985 --> 00:01:09,528 మళ్లీ అతనికి ప్రాణం పోశానన్న విషయాన్ని కూడా. 8 00:01:40,559 --> 00:01:41,560 హేయ్. 9 00:01:43,937 --> 00:01:45,105 జీ మూన్. 10 00:01:45,189 --> 00:01:47,107 హాయ్, నా పేరు ఎస్తర్. "ఓపెన్ రోడ్"కు స్వాగతం. 11 00:01:47,191 --> 00:01:50,861 తనని చంపాలని చూస్తున్న అవినీతి పోలీసుల నుండి తప్పించుకు తిరుగుతున్న డ్రగ్స్ వ్యసనపరుడు. 12 00:01:51,361 --> 00:01:53,238 కాబట్టి భద్రతాపరంగా పునరావాస కేంద్రం మేలనే అనిపించింది. 13 00:01:54,865 --> 00:01:58,076 గ్యారీ రహస్యంగా ఉంచుతాడు. అతనికి గతంలో నేను క్లయింట్స్ తెచ్చిపెట్టా. 14 00:01:59,369 --> 00:02:01,997 కానీ "జీ"ని సమాజానికి దూరంగా ఉంచడమనేది మొదటి అడుగు మాత్రమే. 15 00:02:04,124 --> 00:02:05,125 నేను అసలు నమ్మలేకపోతున్నా. 16 00:02:06,752 --> 00:02:07,920 అతను లేడనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. 17 00:02:08,419 --> 00:02:10,589 సరే. ఇదే ప్రాక్టీస్ చేస్తూ ఉండు. 18 00:02:13,300 --> 00:02:15,302 నా అసోసియేట్ నిన్ను ఇంటి దగ్గర దింపుతుంది, సరేనా? 19 00:02:18,096 --> 00:02:19,932 - థ్యాంక్యూ. - ఏం పర్వాలేదు. 20 00:02:27,731 --> 00:02:29,816 ఓపెన్ రోడ్ రికవరీ కొత్త అనుభూతినిచ్చే స్వేచ్ఛ 21 00:02:29,900 --> 00:02:31,151 నేను అడుగులు వేగంగా వేయాలి. 22 00:02:31,902 --> 00:02:34,446 ఏ రహస్యమైనా ఎంత ఎక్కువ మందికి తెలిస్తే, అది అంత త్వరగా బయటపడుతుంది. 23 00:02:35,614 --> 00:02:38,742 తర్వాత, జీ చనిపోయాడని నమ్మించడానికి ఓ నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించాలి. 24 00:02:40,244 --> 00:02:43,830 హిచ్కాక్ తీసిన "వర్టిగో" సినిమాలో, చనిపోని వ్యక్తిని చనిపోయినట్టు చాలా చక్కగా చూపెడతారు. 25 00:02:47,042 --> 00:02:49,419 నా కథ మాత్రం అంత హడావిడిగా ఉండకూడదని కోరుకుంటున్నా. 26 00:02:51,755 --> 00:02:55,050 సారీ. నా కారు మా బాస్ తీసుకెళ్లారు, అందుకని ఇందులో వచ్చా. 27 00:02:56,009 --> 00:02:57,010 కానీ పని అయింది. 28 00:02:57,094 --> 00:02:58,971 మీరు ఇచ్చిన సమాచారాన్నే అక్కడ ఎంటర్ చేశా. 29 00:03:00,055 --> 00:03:02,057 "ఫెంటనిల్ డ్రగ్ డోస్ మితిమీరడం వల్ల గుండె ఆగిపోయింది. 30 00:03:02,140 --> 00:03:04,685 కుటుంబ సభ్యుల కోరిక మేరకు అస్థికలని తిరిగి కొరియాకు పంపడం జరిగింది." 31 00:03:05,310 --> 00:03:07,646 ఈ వివరాలు పబ్లిక్ రికార్డులోకి వెళ్లేలా అంత్యక్రియల సంస్థే చూసుకుంటుందా? 32 00:03:07,729 --> 00:03:10,440 కౌంటీ క్లర్క్ అవసరం లేదు. మీరు అన్నీ కవర్ అయ్యేలానే కదా పేమెంట్ ఇచ్చారు. 33 00:03:10,941 --> 00:03:11,942 థ్యాంక్యూ, టామీ! 34 00:03:13,986 --> 00:03:14,987 మీకు జరిగిన నష్టానికి చింతిస్తున్నా. 35 00:03:15,487 --> 00:03:16,822 దిగమింగుకోవడానికి సమయం పడుతుందిలే. 36 00:03:18,073 --> 00:03:19,074 తెలివైనోడు. 37 00:03:46,185 --> 00:03:47,686 వేగా విచారణల్లో ఓ లోపం ఉంది. 38 00:03:49,938 --> 00:03:53,525 అతను "జీ"ని డ్రగ్స్ వ్యసనపరుడిగా చూస్తాడు, వాళ్లు ఇలా డోస్ ఎక్కువై చనిపోవడం మామూలే. 39 00:03:55,694 --> 00:03:57,070 కానీ వేగా తెలివితక్కువ గల వాడేం కాదు. 40 00:03:58,655 --> 00:03:59,781 నేను అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. 41 00:04:09,875 --> 00:04:11,418 నిన్న రాత్రి నేను కాస్త హడావిడిలో ఉన్నా. 42 00:04:12,044 --> 00:04:13,545 ఆధారం కాగల ఒక వస్తువు ఇక్కడ పడిపోయింది. 43 00:04:49,498 --> 00:04:50,582 పని దాదాపుగా పూర్తయింది. 44 00:04:53,210 --> 00:04:54,378 నాకు సెంటిమెంట్లు ఎక్కువ. 45 00:04:55,963 --> 00:04:57,673 మరీ ఎక్కువ పట్టించుకునే రకానికి చెందినవాడిని. 46 00:04:59,633 --> 00:05:01,343 ఆ అభిప్రాయం వేగాకి కూడా కలిగి ఉంటుంది. 47 00:05:15,023 --> 00:05:17,568 నా పాత్ర పోషించాలి, అతను ఆశించిన పనే చేయాలి. 48 00:05:18,360 --> 00:05:21,321 అతను నమ్మాలంటే, నేను చేయాల్సిందల్లా ఒకటే. 49 00:05:22,823 --> 00:05:24,408 - వేగా. - కోపం ప్రదర్శించడం. 50 00:05:24,491 --> 00:05:27,077 హేయ్, హేయ్, హేయ్. కాస్త తగ్గు. 51 00:05:28,537 --> 00:05:29,788 హేయ్. 52 00:05:30,372 --> 00:05:31,915 ఏం పర్వాలేదు. మరేం పర్వాలేదు. 53 00:05:33,292 --> 00:05:34,293 నేను అనుకున్నదేలే ఇది. 54 00:05:36,879 --> 00:05:38,839 - వాడిని వదిలేద్దాం. - వెళ్లిపో. 55 00:05:40,048 --> 00:05:42,885 సరే మరి. ఏం కాలేదు, మిత్రులారా. మనం పార్టీని కొనసాగిద్దాం. కానివ్వండి, కానివ్వండి. 56 00:05:42,968 --> 00:05:45,095 ఆ దెబ్బ అందరినీ నమ్మించిందనే ఆశిస్తున్నా. 57 00:05:45,929 --> 00:05:47,139 నేనైతే నమ్మించి ఉంటుందనే అనుకుంటున్నా. 58 00:05:50,642 --> 00:05:51,643 ఇక చివరి అడుగు, 59 00:05:52,686 --> 00:05:53,687 అన్నింటిలోకల్లా ఉత్తమమైనది అది. 60 00:05:55,314 --> 00:05:56,899 డ్యానీకి తన సోదరుడు క్షేమంగానే ఉన్నాడని చెప్పడం. 61 00:06:00,402 --> 00:06:01,570 ప్రస్తుతానికి. 62 00:07:16,311 --> 00:07:17,312 ఫ్లైబర్గ్? 63 00:07:21,066 --> 00:07:22,067 1827. 64 00:07:23,068 --> 00:07:24,403 హాల్ అవతలి వైపు ఉంది. అక్కడే వేచి ఉండండి. 65 00:07:24,903 --> 00:07:25,904 థ్యాంక్యూ. 66 00:07:43,505 --> 00:07:45,132 హేయ్. ఒక్క నిమిషం ఆగు. 67 00:07:50,304 --> 00:07:51,305 ఈ కువైటీ గాడు. 68 00:07:51,388 --> 00:07:54,391 మేము పూల్ దగ్గర కొన్ని పారాబోలిక్ మైక్రోఫోన్లని పెట్టాం, 69 00:07:54,474 --> 00:07:57,686 వాడు ఆ బంగ్లా నుండి బయటకు వచ్చి, అక్కడ కూర్చోవాలి. 70 00:07:57,769 --> 00:07:58,770 మరి అతను అక్కడికి రావట్లేదా? 71 00:07:58,854 --> 00:08:00,230 అస్సలు రావట్లేదు. 72 00:08:00,814 --> 00:08:02,316 మూడు రోజుల నుండి గమనిస్తూనే ఉన్నాం. 73 00:08:03,901 --> 00:08:05,402 - మూడు రోజుల నుండా? - హా. 74 00:08:05,485 --> 00:08:06,570 ఓసారి నాకు ఇవ్వు, చూస్తా. 75 00:08:08,697 --> 00:08:09,907 అతను ఈతకొట్టడేమో. 76 00:08:09,990 --> 00:08:11,200 అతను ఈతకొట్టాల్సిన పని లేదు. 77 00:08:11,909 --> 00:08:15,579 అక్కడ స్నేహితులతో కూర్చొని, వాడు చేసే అక్రమ పనుల గురించి మాట్లాడాలి. 78 00:08:15,662 --> 00:08:17,998 నాకు అర్థమైందిలే. వస్తాడులే. 79 00:08:19,583 --> 00:08:21,752 - ఇలా రా. ఏమైనా తీసుకుంటావా? - వద్దు. 80 00:08:21,835 --> 00:08:23,629 నిన్ను ఇక్కడిదాకా రప్పించినందుకు సారీ. 81 00:08:23,712 --> 00:08:25,506 భలేవాడివే. బిజీగా ఉన్నావు కదా. కలవడానికి ఓకే అన్నందుకు థ్యాంక్స్. 82 00:08:26,173 --> 00:08:27,174 ఏంటి సంగతి మరి? 83 00:08:28,759 --> 00:08:31,220 నేను ఒక కేసు మీద పని చేస్తున్నా కదా. దాని గురించి నీకు ఒకటి చెప్పాలి. 84 00:08:31,303 --> 00:08:32,596 సరే. 85 00:08:32,679 --> 00:08:35,097 కొంపదీసి, అది మరింత సంక్లిష్టంగా, ప్రమాదకరంగా మారిందా ఏంటి! 86 00:08:35,182 --> 00:08:36,517 ఆ రెండే కాదు, 87 00:08:37,558 --> 00:08:38,809 ఓ పోలీసోడు కూడా తగిలాడు. 88 00:08:40,520 --> 00:08:41,522 విషయం చెప్పు. 89 00:08:42,105 --> 00:08:44,066 తను కాలిన్స్ లానే ఉంటుంది. నిజమే చెప్తున్నా. 90 00:08:44,149 --> 00:08:46,652 - నాకు కాలిన్స్ అంటే ఇష్టమే, కానీ మరీ అంత కాదు. - ఏమో అబ్బా. 91 00:08:46,735 --> 00:08:48,946 నాకు… నాకు నేను బాగా అందంగా కనిపిస్తా. 92 00:08:49,029 --> 00:08:50,364 మరణ ధృవీకరణ పత్రం జీ-సోక్ మూన్ 93 00:08:50,447 --> 00:08:51,448 ఫెంటనిల్ ఓవర్ డోస్ 94 00:08:53,700 --> 00:08:55,452 అలాంటి పోలీసుల వల్ల సిగ్గుగా అనిపిస్తోంది. 95 00:08:55,536 --> 00:08:57,538 చాలా మంది షెరిఫ్స్ కూల్ గా ఉంటారు. మంచివాళ్లు, మంచి పోలీసులన్నమాట. 96 00:08:57,621 --> 00:09:00,290 కానీ కొందరు షెరిఫ్స్ ఉంటారు. రౌడీలతో చేతులు కలుపుతుంటారు వాళ్లు. 97 00:09:00,374 --> 00:09:01,583 అది జైళ్లలో మొదలవుతుందా? 98 00:09:01,667 --> 00:09:03,252 వాటిని లాస్ ఏంజలెస్ షెరిఫ్స్ శాఖ నిర్వహిస్తుందా? 99 00:09:03,335 --> 00:09:05,504 అవును. అక్కడే పరిచయాలు ఏర్పడతాయి. 100 00:09:05,587 --> 00:09:06,588 ఆ వేగా గురించి చెప్పు. 101 00:09:06,672 --> 00:09:08,924 అతనికి సంబంధం ఏంటి? అతని ప్లాన్ ఏంటి? 102 00:09:09,007 --> 00:09:12,803 ఏమో. కానీ ఈజీ4 అడ్డాలో ఫెంటనిల్ ధర 90% పడిపోయింది. 103 00:09:12,886 --> 00:09:14,680 అది అతని అధికారిక పరిధి కిందికి వస్తుంది. 104 00:09:14,763 --> 00:09:16,306 - బాబోయ్. - హా, అదే మరి. 105 00:09:16,390 --> 00:09:17,432 అంటే, మార్కెట్ ని కొనడంలో 106 00:09:17,516 --> 00:09:19,935 అతను ఎవరికో సాయపడుతున్నాడు అనుకుంటా, కానీ అది అర్థవంతంగా అనిపించట్లేదు. 107 00:09:20,435 --> 00:09:22,312 ఇక్కడ డౌనర్ టౌన్లో ఫైర్ సేల్ నడుస్తోంది. 108 00:09:22,396 --> 00:09:23,397 హా, అదన్నమాట. 109 00:09:24,356 --> 00:09:25,858 కానీ ముందుగా జీ మూన్ సంగతి చూడాలి. 110 00:09:25,941 --> 00:09:28,902 వేగా… వేగా సంగతి చూస్తూనే, అతడిని సురక్షితంగా ఉంచాలి నేను. 111 00:09:28,986 --> 00:09:31,613 - సరే. నువ్వేం అనుకుంటున్నావు? - సాక్షుల రక్షణ ప్రోగ్రామ్. 112 00:09:32,364 --> 00:09:33,448 అది కుదరదు. 113 00:09:36,493 --> 00:09:37,536 ఒక్క నిమిషం. 114 00:09:40,414 --> 00:09:41,415 కుదరదు. 115 00:09:43,000 --> 00:09:44,418 నువ్వేం అడుగుతున్నావంటే… 116 00:09:45,335 --> 00:09:46,962 ఒక విషయం సూటిగా చెప్తా, ఈ ఆర్థిక పరిస్థితిలో, 117 00:09:47,462 --> 00:09:50,174 ఒక పేరున్న పోలీస్ ఆఫీసరుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే ఒక వ్యక్తి కోసం రెండు లక్షల డాలర్లయ్యే 118 00:09:50,257 --> 00:09:51,925 సాక్షి రక్షణ రిక్వెస్టుని ఎవరు ఆమోదిస్తారు? 119 00:09:52,509 --> 00:09:53,760 అతను మంచి పోలీసు ఆఫీసర్ కాదు. 120 00:09:54,428 --> 00:09:55,596 ఏదేమైనా, పోలీస్ ఆఫీసరే కదా. 121 00:09:56,722 --> 00:09:58,891 ఆధారాలు చాలా బలంగా ఉండాలి, బాసూ. 122 00:09:58,974 --> 00:10:00,559 వేగా, ఓ ఆసుపత్రి గదిలో 123 00:10:00,642 --> 00:10:02,186 హత్య చేస్తూ ఉండగా చూసిన ప్రత్యక్ష సాక్షి ఉంటే? 124 00:10:02,269 --> 00:10:03,520 కానివ్వు. అది చాలా… అంటే… 125 00:10:03,604 --> 00:10:06,523 ఆ సాక్షి ఓ చిన్న నేరం చేస్తూ అది చూశాడు, అవునా? 126 00:10:06,607 --> 00:10:07,941 అతని మాటలకి విలువ ఉండదని అంటున్నావా? 127 00:10:08,025 --> 00:10:09,151 అంతే కదా. 128 00:10:11,612 --> 00:10:12,613 అలాగే. 129 00:10:13,447 --> 00:10:14,865 నువ్వన్నది నిజమే. పూల్ దగ్గరికి వచ్చాడు. 130 00:10:15,824 --> 00:10:18,577 చూడు, నేను ప్రోగ్రాంకి ఆమోదం దక్కే అవకాశం చాలా తక్కువ అనే అంటున్నా, ఇంకేం లేదు. 131 00:10:18,660 --> 00:10:20,120 కానీ, అటార్నీ ఆఫీసులో 132 00:10:20,204 --> 00:10:21,538 - ఉండే నా వాడిని కనుక్కుంటా. - అది చాలు. 133 00:10:21,622 --> 00:10:23,123 - సరే, నాకు పని ఉంది మరి. - ఓకే. 134 00:10:23,999 --> 00:10:25,751 కానీ, నన్ను వేధిస్తున్న విషయం ఏంటో తెలుసా? 135 00:10:26,335 --> 00:10:29,296 ఈ మార్కెట్ అంతటినీ కొనుగోలు చేసే యవ్వారం, అది అర్థవంతంగా అనిపించట్లేదు. 136 00:10:29,379 --> 00:10:32,591 అవును. అంటే డౌనర్ టౌన్, డౌన్ టౌన్, వెస్ట్ లేక్ అంతా కొనేస్తారని అర్థం. 137 00:10:33,800 --> 00:10:35,719 - అవును. - అది సెర్గేయ్ మార్కెట్. 138 00:10:35,802 --> 00:10:37,054 అవును. 139 00:10:37,137 --> 00:10:39,056 ఈ నగరమంతా అతని మార్కెటే. 140 00:10:39,139 --> 00:10:42,267 సరే. నేను డిస్ట్రిక్ట్ అటార్నీని సంప్రదిస్తా. తను ఏమంటుందో నీకు చెప్తా. 141 00:10:42,351 --> 00:10:43,393 థ్యాంక్స్. 142 00:10:47,606 --> 00:10:49,107 హా, అతను చనిపోయాడు. ఆ విషయం ఖరారైంది. 143 00:10:51,944 --> 00:10:54,446 దానంతట అదే జరిగిపోయింది. 144 00:10:56,615 --> 00:10:59,243 అర్థమైంది. హా, అర్థం చేసుకోగలను. 145 00:11:00,869 --> 00:11:01,954 ఇంకేం సమస్యలు ఉండవు, అవును. 146 00:11:05,832 --> 00:11:07,584 వేగా, తన అదృష్టాన్ని పూర్తిగా నమ్మడు. 147 00:11:08,126 --> 00:11:11,880 తను సేఫ్ అయితే బాగుండని అనుకుంటూ ఉంటాడు. కానీ ఎందుకైనా మంచిదని నాపై ఓ కన్నేసి ఉంచుతాడు. 148 00:11:11,964 --> 00:11:14,466 పారామౌంట్ పిక్చర్స్ 149 00:11:16,635 --> 00:11:19,596 - నాకేం పర్వాలేదు. - ఈ స్టేజ్ 17లో… 150 00:11:19,680 --> 00:11:20,764 ఎన్ని కళ్లేసినా నాకు ఓకే. 151 00:11:20,848 --> 00:11:24,977 సినిమా ప్రేమికులైన మీరు అది, బిల్లీ వైల్డర్ తీసిన 'సన్ సెట్ బౌల్ వార్డ్' సినిమాలోని 152 00:11:25,060 --> 00:11:28,146 సెకండ్ ఫ్లోర్ రీడర్స్ డిపార్టుమెంట్ అని గుర్తుపట్టే ఉంటారు. 153 00:11:28,230 --> 00:11:29,565 - ఇక మనం… - "అదుగో ఓ రచయితనైన నేను, 154 00:11:29,648 --> 00:11:31,024 కిటికీ పక్కన కూర్చుని ఉన్నా." 155 00:11:31,108 --> 00:11:33,569 - మీకు తెలుసే. ఇతనికి సినిమాలంటే పిచ్చి. - హా, కొంచెం తెలుసులే. 156 00:11:34,736 --> 00:11:39,658 నియామలని అస్సలు పట్టించుకోడని ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ కి పేరుంది. 157 00:11:39,741 --> 00:11:43,954 అందుకని ఆ స్టూడియో బాసులు తనపై ఒక కన్నేసి ఉంచాలని అనుకున్నారు, 158 00:11:44,037 --> 00:11:47,499 ఆ పెద్ద కిటికీ ద్వారా తనని గమనిస్తూ ఉండాలని, అతని ఆఫీసును తమకు దగ్గరగా మార్చారు, అప్పుడు… 159 00:11:47,583 --> 00:11:49,877 ఇప్పుడు మనం న్యూయార్క్ సెట్ కి వచ్చాం, 160 00:11:49,960 --> 00:11:55,090 ఇక్కడ బ్రూక్లిన్, గ్రీన్విచ్ విలేజ్, సోహో సెట్లు కూడా విడివిడిగా ఉన్నాయి… 161 00:11:55,174 --> 00:11:59,511 ఆడ్రీ హెప్బర్న్ నటించిన "బ్రేక్ఫాస్ట్ ఎట్ టిఫనీస్" సినిమా షూటింగ్ జరిగింది ఇక్కడే. 162 00:11:59,595 --> 00:12:01,138 మీలో ఎవరికైనా "బ్రేక్ఫాస్ట్ ఎట్ టిఫనీస్" అంటే ఇష్టమా? 163 00:12:01,221 --> 00:12:03,223 - నాకు ఆ సినిమా అంటే ప్రాణం. - హా. ప్రాణం. 164 00:12:04,641 --> 00:12:06,310 సరే మరి, మిత్రులారా, 165 00:12:06,894 --> 00:12:07,978 వచ్చేశాం. 166 00:12:08,729 --> 00:12:10,647 మీ అందరికీ టూర్ నచ్చిందనే ఆశిస్తున్నా. 167 00:12:10,731 --> 00:12:12,441 - రోజంతా కులాసాగా గడపండి… - మిమ్మల్ని కలవడం బాగుంది. 168 00:12:12,524 --> 00:12:13,901 - …హ్యాపీ ఫ్లయిట్ జర్నీ. - అందరికీ బై. 169 00:12:13,984 --> 00:12:15,861 - ఇంటికి క్షేమంగా వెళ్లండి. హ్యాపీ ఫ్లయిట్ జర్నీ. - బై! 170 00:12:15,944 --> 00:12:16,945 బై-బై. 171 00:12:17,029 --> 00:12:19,740 హేయ్, ఆ "రేర్ విండో" కథ ఇంకా నా బుర్రకెక్కడం లేదు. 172 00:12:19,823 --> 00:12:22,326 అంటే, హిచ్కాక్ ఏకంగా ఒక సౌండ్ స్టేజ్ బేస్మెంటుని తవ్వేసి, 173 00:12:22,409 --> 00:12:23,660 దాని లోపల ఒక పూర్తి అపార్టుమెంట్ బ్లాకునే 174 00:12:23,744 --> 00:12:24,870 - నిర్మించేశాడా? - అదే కదా. 175 00:12:24,953 --> 00:12:26,955 - మామూలు పిచ్చోడు కాదబ్బా. - అవును. అది సఫలమైంది కూడా. 176 00:12:27,039 --> 00:12:28,540 హా, బాగా సఫలమైంది. 177 00:12:29,249 --> 00:12:31,335 - ఇంకో రౌండ్ తిప్పమంటారా, మిస్టర్ షుగర్? - తప్పకుండా, స్టెఫ్. 178 00:12:40,302 --> 00:12:41,720 - హేయ్, డ్యానీ. - ఏంటి సంగతి? 179 00:12:41,803 --> 00:12:42,804 టెడ్డీ నిన్ను కలవమన్నాడు. 180 00:12:54,191 --> 00:12:55,192 వచ్చి కూర్చో. 181 00:13:03,450 --> 00:13:06,620 ఆ చైనీస్ రెస్టారెంట్లో జరిగినదంతా లెన్ పాంకోవ్ చెప్పాడు. 182 00:13:06,703 --> 00:13:08,080 అది జపనీస్ రెస్టారెంట్. 183 00:13:10,832 --> 00:13:12,376 ఎందుకలా చేశావు? 184 00:13:13,001 --> 00:13:15,379 అవకాశం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. 185 00:13:17,673 --> 00:13:18,674 ఎందుకలా చేశావో చెప్పు. 186 00:13:19,550 --> 00:13:21,134 వాడు నోటికొచ్చిందల్లా వాగాడు, 187 00:13:22,010 --> 00:13:23,387 వాడు అలా అవమానపరుస్తుంటే పడాలా? 188 00:13:23,470 --> 00:13:25,347 అందుకని అలా ప్రవర్తించి నిన్ను నువ్వు అవమానపరుచుకుంటావా? 189 00:13:25,973 --> 00:13:30,602 నీ అవకాశాలన్నింటినీ గాలికి వదిలేస్తున్నావు. నువ్వు కూడా మీ సోదరునిలా అవుదామనుకుంటున్నావా? 190 00:13:30,686 --> 00:13:32,312 జీకి, దీనికి ఏ సంబంధమూ లేదు. 191 00:13:33,856 --> 00:13:35,524 సోది ఆపు! 192 00:13:38,443 --> 00:13:39,945 చూడు, టెడ్డీ, నువ్వు… 193 00:13:41,154 --> 00:13:43,323 నువ్వు నాకోసం చాలా చేశావు, వాటన్నింటికీ నీకు జీవితాంతం రుణపడి ఉంటా. 194 00:13:44,157 --> 00:13:46,869 కానీ ఇంకొక్కసారి నా సోదరుడి గురించి చెడుగా మాట్లాడితే… 195 00:13:48,328 --> 00:13:49,872 నీ ముఖం పగలగొడతా. 196 00:13:53,876 --> 00:13:54,960 అది సమంజసమైనదే. 197 00:14:15,856 --> 00:14:18,567 టామ్ కి వాళ్ల ప్రాసిక్యూటర్ ఫ్రెండ్ నుండి రిప్లయి వచ్చేలోపు 198 00:14:19,902 --> 00:14:21,737 నా ఇంకో కేసు సంగతి ఏంటో చూద్దామని నిర్ణయించుకున్నా. 199 00:14:25,908 --> 00:14:29,119 మరీ ముఖ్యంగా, సెనెటర్ పావిచ్ ని కలుస్తుండగా నేను చూసిన ప్రొఫెసర్ సంగతి. 200 00:14:33,707 --> 00:14:36,043 అసలు విషయం ఏంటో అతని వల్ల నాకు తెలిసే అవకాశం ఉంది. 201 00:14:37,628 --> 00:14:39,421 అతనికి ఆ విషయం ఏంటో ఇంకా తెలీకపోయినా. 202 00:14:54,436 --> 00:14:56,480 ఏంటిది? ఏంటిది? 203 00:14:57,773 --> 00:14:58,857 ఏంటిది? 204 00:15:00,484 --> 00:15:01,527 ఏంటిది? 205 00:15:07,324 --> 00:15:08,492 హలో. 206 00:15:11,078 --> 00:15:12,371 ఏంటిది? 207 00:15:12,454 --> 00:15:13,705 నీకు కూడా "ఏంటిది?" 208 00:15:18,961 --> 00:15:20,921 ఏంటిది? ఏంటిది? 209 00:15:23,966 --> 00:15:25,342 ఏంటిది? 210 00:15:47,364 --> 00:15:51,577 సారీ, చిలకమ్మా. నా ప్లానర్ ని, ఫ్రెష్ మింట్స్ ని మర్చిపోయా. 211 00:15:51,660 --> 00:15:53,787 - మాంటీ, నేనమ్మా. - ఏంటిది? ఏంటిది? 212 00:15:53,871 --> 00:15:55,789 నేను ప్లానర్ ని మర్చిపోయా. 213 00:15:55,873 --> 00:15:58,500 చూడు, నేను రెండు గంటల్లో వచ్చేస్తా. అబ్బా. 214 00:15:58,584 --> 00:15:59,793 గోల చేయకుండా మంచిగా ఉండు, 215 00:15:59,877 --> 00:16:02,171 నేను కాసేపట్లో వచ్చేస్తా, ఇద్దరం కలిసి "బ్యాచెలరెట్"ని చూద్దాం, సరేనా? 216 00:16:03,505 --> 00:16:04,590 ఐ లవ్ యూ. 217 00:16:19,354 --> 00:16:20,480 హా, తృటిలో తప్పించుకున్నా. 218 00:16:49,843 --> 00:16:53,013 కాక్టై, సక్యూలెంట్స్: సంపూర్ణ ఫీల్డ్ గైడ్ 219 00:16:53,096 --> 00:16:55,098 వర్గీకరణ, సాగు, పెంపకం 220 00:17:26,797 --> 00:17:28,006 గుడ్ ఈవినింగ్, మిస్టర్ షుగర్. 221 00:17:28,507 --> 00:17:29,508 గుడ్ ఈవినింగ్, ఎలినార్. 222 00:17:30,092 --> 00:17:31,343 ఇది ఏ సంగీతమో తెలుసా? 223 00:17:31,885 --> 00:17:32,886 తెలుసు. 224 00:17:33,512 --> 00:17:34,513 చాలా బాగుంది. 225 00:17:34,596 --> 00:17:35,597 అవును. 226 00:17:37,975 --> 00:17:38,976 మీకు ఒక్కరికే టేబుల్ సెట్ చేయమంటారా? 227 00:17:42,688 --> 00:17:44,106 ఇవాళ వద్దులే. థ్యాంక్యూ. 228 00:17:44,606 --> 00:17:45,858 సరే. 229 00:18:07,129 --> 00:18:09,131 మీకు కొత్త మెసేజీలేవీ రాలేదు. 230 00:18:21,852 --> 00:18:26,106 రెండో బృందం, మూడో వేవ్, కాలిఫోర్నియా. జాన్ షుగర్. 231 00:18:27,941 --> 00:18:30,194 నేను ఇక్కడే ఉన్నా, ఇంకెవరైనా ఉంటే చెప్పండి. 232 00:18:35,574 --> 00:18:37,451 మాట్లాడటానికి ఒకరుంటే బాగుంటుంది. 233 00:18:46,001 --> 00:18:48,128 నేను ఇక్కడే ఉన్నా, ఇంకెవరైనా ఉంటే చెప్పండి. 234 00:18:59,681 --> 00:19:03,727 రెండో బృందం, మూడో వేవ్, కాలిఫోర్నియా. జాన్ షుగర్. 235 00:19:08,774 --> 00:19:10,567 కాక్టై, సక్యూలెంట్స్: సంపూర్ణ ఫీల్డ్ గైడ్ 236 00:19:10,651 --> 00:19:11,652 మాట్లాడటానికి… 237 00:19:13,862 --> 00:19:15,364 మాట్లాడటానికి ఒకరుంటే బాగుంటుంది. 238 00:19:23,455 --> 00:19:25,165 హేయ్, మెలనీ. 239 00:19:25,749 --> 00:19:30,045 లేదు, ఊరికే పలకరిద్దామని జోనథన్ కి కాల్ చేశా, అతనే నీ కొత్త నంబర్ ఇచ్చాడు. 240 00:19:30,629 --> 00:19:32,840 లేదు, లేదు. నేను… నేను వెళ్లలేదు. 241 00:19:34,091 --> 00:19:35,092 ఇక్కడే ఉండిపోయా. 242 00:19:38,470 --> 00:19:40,722 నీ బ్యాండుతో ఏదో టూర్లో ఉన్నావని తెలిసింది. అది ఎలా సాగుతోంది? 243 00:19:41,557 --> 00:19:43,433 ప్యారిసా? నేను అన్నది నిజమేనా? 244 00:19:43,517 --> 00:19:44,852 ఎప్పుడైనా ప్యారిస్ కి వెళ్లావా? 245 00:19:44,935 --> 00:19:46,103 లేదు. 246 00:19:47,646 --> 00:19:49,648 కాదా? ఓకే. 247 00:19:52,234 --> 00:19:53,819 హేయ్, వైలీ… వైలీ ఎలా ఉన్నాడు? 248 00:19:58,782 --> 00:20:00,742 హా, హా, లేదు. అర్థం చేసుకోగలను. 249 00:20:00,826 --> 00:20:01,827 హా, నువ్వు బిజీగా ఉన్నావు. 250 00:20:02,786 --> 00:20:04,413 సరే, ఇక్కడికి వచ్చాక కలుసుకుందాం. 251 00:20:20,721 --> 00:20:21,638 పుట్టుకతోనే లోపం 252 00:20:41,325 --> 00:20:44,620 హోటల్ డెల్ కోరెజాన్ 253 00:20:44,703 --> 00:20:47,331 సరే, అయితే "దాన్ని నిరూపించడం" అనేదే సమస్యనా? 254 00:20:47,414 --> 00:20:48,415 అవును. 255 00:20:52,961 --> 00:20:54,588 చూయ్ కి కూడా అదే సమస్య ఎదురై ఉంటే? 256 00:20:56,131 --> 00:20:59,718 పోలీసుల మాటల ముందు తన మాట నెగ్గదు, అది తనకి కూడా తెలుసు. 257 00:21:00,219 --> 00:21:01,887 - అలాంటప్పుడు అతను ఏం చేసే అవకాశముంది? - చెప్పు. 258 00:21:03,639 --> 00:21:06,016 బలమైన ఆధారాలని సంపాదిస్తాడు, కానీ ఆ పని ఎలా చేస్తాడు? 259 00:21:06,683 --> 00:21:09,186 - అతను కుర్రోడు. నేటి తరం "జెన్-జీ" కదా? - అవును. 260 00:21:10,729 --> 00:21:13,607 అతని దృష్టిలో, ఈ ప్రపంచంలో దేన్ని అయినా నిజం చేయగల ఏకైక విషయం ఏది? 261 00:21:16,693 --> 00:21:19,321 - ఫోనులో వీడియో తీయడం. - సరిగ్గా చెప్పావు. 262 00:21:19,404 --> 00:21:20,656 హా, సరే మరి. 263 00:21:21,406 --> 00:21:24,535 అంటే, చూయ్ వస్తువులని ఆసుపత్రి వాళ్లు అతని అమ్మమ్మకి ఇచ్చేసి ఉంటారు, 264 00:21:25,202 --> 00:21:26,828 కాబట్టి అతని ఫోనుని ఒకసారి చూడవచ్చా అని అడుగు. 265 00:21:27,996 --> 00:21:29,081 - నేను వెళ్లి అడగాలా? - అవును. 266 00:21:29,164 --> 00:21:32,251 నేను మళ్ళీ ఆ డౌనర్ టౌన్ కి ఎందుకు వెళ్తాను? నా కేస్ క్లోజ్ అయిపోయినట్టే లెక్క కదా. 267 00:21:32,751 --> 00:21:34,711 అదీగాక, ఇది నీ ఐడియా. 268 00:21:35,963 --> 00:21:36,964 సరే. 269 00:21:39,842 --> 00:21:41,510 ఆ స్వెటర్ వేసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? 270 00:21:43,554 --> 00:21:44,555 బయటకి. 271 00:21:44,638 --> 00:21:45,889 హా, బయటకేలే, ఎక్కడికి? 272 00:21:46,598 --> 00:21:47,599 ఒకరిని కలవడానికి. 273 00:21:50,602 --> 00:21:52,104 నీ దగ్గర చాలా రహస్యాలున్నాయి, బ్రో. 274 00:21:52,771 --> 00:21:53,897 నీ దగ్గర కూడా ఉన్నాయిగా. 275 00:21:54,565 --> 00:21:57,484 పంచ్ వేశావుగా. నేను వెళ్లి ఆ ఫోన్ సంగతి చూస్తా. 276 00:21:57,568 --> 00:21:59,778 - సరే. అయ్యాక, విషయం ఏంటో చెప్పు. - తప్పకుండా. 277 00:22:10,122 --> 00:22:12,291 నా పనిలో నాకు మొదట్నుంచీ నచ్చని విషయం ఏంటంటే, మోసం చేయడం. 278 00:22:13,208 --> 00:22:16,461 మొదట్లో అబద్ధాలు చెప్పడం నాకు అంతగా వచ్చేది కాదు, కానీ చెప్తున్నా కదా, 279 00:22:16,545 --> 00:22:19,256 ఇప్పుడైతే, అందులో నేను ఆరితేరిపోయాను. 280 00:22:19,923 --> 00:22:23,427 మంచి ఆశయం కోసం అప్పుడప్పుడు అలా చేయక తప్పదు. 281 00:22:23,510 --> 00:22:24,511 వావ్. 282 00:22:25,262 --> 00:22:27,347 వీటికి నిజంగానే పూలు పూస్తున్నాయి. 283 00:22:28,807 --> 00:22:29,808 కంగారుపడిపోయా. 284 00:22:30,559 --> 00:22:32,644 అంటే, వర్షం తక్కువగా పడింది కదా, అందుకని… 285 00:22:33,604 --> 00:22:35,189 కొచినేల్ నొపాల్. 286 00:22:36,148 --> 00:22:37,274 అవి చాలా సున్నితమైనవిగా అనిపిస్తున్నాయి. 287 00:22:39,234 --> 00:22:40,235 హా. 288 00:22:41,403 --> 00:22:42,738 కానీ అవి సున్నితమైనవి కాదు. 289 00:22:43,822 --> 00:22:45,199 అలా అనిపిస్తాయంతే. 290 00:22:46,533 --> 00:22:47,534 ఏమన్నారు? 291 00:22:48,368 --> 00:22:52,497 కొచినేల్ నొపాల్. ఒపుంచియా కోచెనిలిఫేరా. 292 00:22:53,582 --> 00:22:54,750 నాగజెముడు. అవి… 293 00:22:55,667 --> 00:22:59,922 అవి కనిపించేదానికన్నా చాలా దృఢమైనవి. నీటిని చాలా సమర్థవంతంగా నిల్వ చేసుకుంటాయి. 294 00:23:01,089 --> 00:23:02,257 ఇక్కడ కూర్చోవచ్చా? 295 00:23:02,341 --> 00:23:06,136 వాటికి కావాల్సిందల్లా కొంచెం ఎండ, సమయం, అంతే. అవి చాలు వాటి పూలు పూయడానికి. 296 00:23:08,305 --> 00:23:09,515 మీరు ఎడారి మొక్కలపై పరిశోధిస్తున్నారా? 297 00:23:10,891 --> 00:23:12,768 లేదు, నేను ఈమధ్యే వీటి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టా. 298 00:23:14,520 --> 00:23:15,896 అప్పుడే కనెక్ట్ అయిపోయా కూడా. 299 00:23:17,356 --> 00:23:18,357 మరి మీరు? 300 00:23:19,733 --> 00:23:20,734 హా, నాకు… 301 00:23:21,777 --> 00:23:23,362 ఇది నాకు నచ్చిన హాబీ అనుకోండి. 302 00:23:24,279 --> 00:23:25,280 హా, నాకు… 303 00:23:26,281 --> 00:23:27,407 నాకు ఇవి భలే నచ్చేశాయి. 304 00:23:28,659 --> 00:23:30,744 నిజంగానా? ఎలా? 305 00:23:34,289 --> 00:23:37,876 పెద్దగా వనరులేమీ లేకపోయినా, బతకడమే కాదు, బాగా వృద్ధి చెందుతాయి కూడా. 306 00:23:39,586 --> 00:23:41,046 ప్రతికూల పరిస్థితుల్లోనూ రాటుదేలడం. 307 00:23:42,005 --> 00:23:43,799 అలా అనిపిస్తూ ఉంటుంది. నేనేమంటున్నానో అర్థమవుతోందా? 308 00:23:46,343 --> 00:23:47,344 అర్థమవుతోంది. 309 00:23:52,140 --> 00:23:53,600 పుట్టినరోజు శుభాకాంక్షలు 310 00:24:47,613 --> 00:24:49,114 వీడియో లేదా? 311 00:24:49,198 --> 00:24:52,910 అసలు ఫోనే లేదు. అతని అమ్మమ్మ చాలా మంచావిడ. 312 00:24:53,410 --> 00:24:54,494 హా, అది నిజమే. 313 00:24:54,578 --> 00:24:57,206 ఆసుపత్రి నుండి వచ్చిన సామాను తను చూపించింది, కానీ వాటిలో ఫోన్ లేదు. 314 00:24:57,289 --> 00:24:58,749 అది నాకు షాకింగ్ గా అనిపిస్తోంది. 315 00:24:58,832 --> 00:25:00,876 హా, లేకపోవడం వింతగానే ఉంది. ఈరోజుల్లో ఫోన్ లేనిది ఎవరికి! 316 00:25:01,627 --> 00:25:03,462 - ఆ పోలీసు తీసుకుని ఉంటాడా? - తీసుకొని ఉండొచ్చు. 317 00:25:03,545 --> 00:25:05,297 క్యాబిన్ నుండి వెళ్లిపోయేటప్పుడు వాళ్లు జీ ఫోన్ తీసుకెళ్లారు. 318 00:25:05,380 --> 00:25:06,757 అబ్బా. 319 00:25:07,382 --> 00:25:08,675 కానీ నీకు మంచి ఐడియా వచ్చింది, వాల్. 320 00:25:10,844 --> 00:25:11,845 ఇప్పుడేంటి మరి? 321 00:25:12,346 --> 00:25:13,597 ఏం చేద్దాం ఇప్పుడు? 322 00:25:14,973 --> 00:25:17,601 వేగాకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించే పనిని కొనసాగిస్తూ ఉందాం. 323 00:25:19,686 --> 00:25:21,522 నా టేస్టులు మారుతున్నాయేమో. 324 00:25:22,564 --> 00:25:24,775 ఆ అవకాశముంది. అలా జరగడం నేను గతంలో చూశాను. 325 00:25:25,692 --> 00:25:27,152 రెస్టారెంట్ బంద్ అయిపోయింది. 326 00:25:27,236 --> 00:25:28,237 ఓకే. 327 00:25:29,488 --> 00:25:31,448 కావాలంటే ఏదైనా సింపుల్ వంటకం చేసివ్వగలం. 328 00:25:31,532 --> 00:25:34,409 సాలడ్ కానీ, వెజిటెబుల్ ప్లేట్ కానీ? 329 00:25:36,328 --> 00:25:37,371 అంటే… 330 00:25:39,373 --> 00:25:41,124 నేను ఇప్పటిదాకా ఛీజ్ బర్గర్ తిననే లేదు. 331 00:25:55,138 --> 00:25:56,223 హేయ్. 332 00:25:57,891 --> 00:25:58,892 నువ్వు వెళ్లిపోయావేమో అనుకున్నా. 333 00:26:00,310 --> 00:26:02,729 హఠాత్తుగా లండన్ కి వెళ్లాల్సి వచ్చింది, ఇప్పుడు వచ్చేశాలే. 334 00:26:04,314 --> 00:26:05,399 మంచిది. 335 00:26:07,484 --> 00:26:08,861 నన్ను క్షమించు. 336 00:26:09,653 --> 00:26:11,446 అంటే, నా పని ఎలాంటిదంటే, ఒక్కోసారి నేను… 337 00:26:14,825 --> 00:26:16,243 ఆ నోట్ కి థ్యాంక్స్. 338 00:26:17,661 --> 00:26:18,745 పొద్దుపోయాక తింటున్నావా? 339 00:26:20,038 --> 00:26:23,250 అవును. ఇది ఛీజ్ బర్గర్. 340 00:26:25,502 --> 00:26:27,713 మిస్ ఫిషర్, మీ సూట్ కేస్ నేను తీసుకొస్తాను. 341 00:26:45,189 --> 00:26:47,608 హా, ఏం అంటున్నావు? స్టూడియో టూర్ ఏంటి? 342 00:26:48,483 --> 00:26:49,860 అంటే, టూరిస్టులు తీసుకునే టూరా? 343 00:26:49,943 --> 00:26:53,071 అవును, అంతా సరిపోయిందిగా. అతనికి సినిమాలంటే ఇష్టం, అందుకే టూరుకి వెళ్లాడు. 344 00:26:53,989 --> 00:26:55,824 మరి ఎకో పార్కులోని వ్యక్తి సంగతేంటి? 345 00:26:56,325 --> 00:27:01,580 హా, అతని పేరు డాక్టర్ స్టాన్లీ, ఒండా… ఓండాట్జే, 346 00:27:02,247 --> 00:27:03,999 అతను అప్లైడ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్. 347 00:27:05,417 --> 00:27:07,503 హా, అతనికి, మనకి లింక్ ఉన్నట్టు అనిపించట్లేదు. 348 00:27:08,337 --> 00:27:10,130 అదే నేనూ చెప్పేది. మనకేం పర్వాలేదు. 349 00:27:10,714 --> 00:27:12,299 ఎక్కువ ఆలోచించకు, ఇంటికి వెళ్లు. 350 00:27:14,384 --> 00:27:15,511 హేయ్, క్రిస్టొఫర్. 351 00:27:18,430 --> 00:27:20,224 నాకు ఇంటికి వెళ్లాలని అనిపించినప్పుడు వెళ్తా. 352 00:27:21,099 --> 00:27:22,434 నేనేమంటున్నానో అర్థమవుతోంది కదా? 353 00:27:47,376 --> 00:27:49,837 చూయ్ విషయంలో వాల్ కి మంచి ఐడియానే వచ్చింది, 354 00:27:49,920 --> 00:27:53,632 కానీ ఫోన్ ముందు వేగాకి దొరికి ఉంటుందా? లేదా… నేను ఏమన్నా మిస్ అవుతున్నానా? 355 00:27:53,715 --> 00:27:56,760 హెసూస్ ఆమెని కలుస్తూ ఉంటాడా? 356 00:27:56,844 --> 00:27:58,846 హా, ఇద్దరూ ప్రాణ స్నేహితులని చెప్పవచ్చు. 357 00:27:58,929 --> 00:28:00,264 రహస్యాలు చెప్పుకుంటుంటారు. 358 00:28:06,061 --> 00:28:07,104 సాండ్రా. 359 00:28:10,190 --> 00:28:13,527 నేను, సాండ్రా ఇంతకుముందు మాట్లాడుకున్న చోటుకే వెళ్లాను, కానీ తను అక్కడ లేదు. 360 00:28:14,695 --> 00:28:17,197 నేను అక్కడి వారందరినీ అడిగి చూశాను. అంతటా వెతికా. 361 00:28:17,698 --> 00:28:21,368 సొరంగాల్లో, అండర్ పాసుల్లో, ఫ్రీవేల పక్కనున్న పాకల్లో, అన్ని చోట్లా వెతికా. 362 00:28:22,119 --> 00:28:23,161 చాలా సమయం పట్టింది. 363 00:28:26,164 --> 00:28:27,165 కానీ… 364 00:28:29,209 --> 00:28:31,962 తన ఆచూకీ కనుగొన్నా. చివరికి. 365 00:28:37,759 --> 00:28:38,969 ఎందుకు కనుగొన్నానా అని అనిపించింది. 366 00:28:48,228 --> 00:28:49,229 డ్రగ్స్ ఓవర్ డోస్. 367 00:29:12,127 --> 00:29:15,506 ఈ చోటును చూస్తుంటే మనస్సు ముక్కలైపోతోంది. 368 00:29:44,535 --> 00:29:45,536 టెడ్డీ రమ్మంటున్నాడు, ఏదో మాట్లాడాలట. 369 00:29:48,705 --> 00:29:49,957 సరే. 370 00:29:52,709 --> 00:29:53,919 మూన్. 371 00:29:54,628 --> 00:29:56,421 హేయ్. ఏంటి సంగతి? 372 00:29:57,798 --> 00:30:01,635 ఏంటి సంగతి అంటే, ఇక్కడున్న నా స్నేహితునికి నువ్వు సారీ చెప్పాలి, లేదంటే నీ మక్కెలు విరగ్గొడతా. 373 00:30:03,971 --> 00:30:05,264 నీ స్నేహితుడు ఒక పనికిమాలిన వెధవ. 374 00:30:09,685 --> 00:30:10,978 కానీ నువ్వు మంచోడివి. 375 00:30:11,770 --> 00:30:15,357 నువ్వు నాకు ఓ అవకాశం ఇచ్చావు, కానీ… కానీ నేను దాన్ని నాశనం చేసుకున్నా, కాబట్టి… 376 00:30:17,442 --> 00:30:18,777 నీకు అయితే సారీ చెప్తా. 377 00:30:20,612 --> 00:30:21,655 సారీ. 378 00:30:23,323 --> 00:30:24,658 ఏదేమైనా, నీ మక్కెలు మాత్రం విరగ్గొడతాను. 379 00:30:26,618 --> 00:30:27,661 లాస్ వేగస్ లో. 380 00:30:29,538 --> 00:30:31,498 ఒక్క నిమిషం, ఏంటి? నువ్వు… నువ్వు నిజంగానే అంటున్నావా? 381 00:30:31,582 --> 00:30:32,791 ఇంకా ఫైట్ రద్దు కాలేదా? 382 00:30:32,875 --> 00:30:34,418 అస్సలు కాలేదు. 383 00:30:34,501 --> 00:30:37,129 నువ్వు అన్నది నిజమే. వీడు పనికిమాలిన వెధవే. 384 00:30:38,338 --> 00:30:40,424 ఇంకా నువ్వు ఒప్పంద పత్రాలపై సంతకం చేయలేదు. 385 00:30:42,342 --> 00:30:43,969 అభినందనలు. 386 00:30:44,678 --> 00:30:46,430 ఈ శుభవార్తని వెళ్లి అందరికీ చెప్పు. 387 00:30:50,392 --> 00:30:52,019 పిచ్చెక్కిద్దాం! 388 00:30:56,523 --> 00:30:58,483 అంతే, డ్రగ్ ఓవర్ డోస్. 389 00:30:58,567 --> 00:30:59,943 హిపాక్సియా. 390 00:31:00,027 --> 00:31:03,572 అంటే, మెదడుకు తగినంత ఆక్సిజన్ అందక కోమా, ఆ తర్వాత మరణం సంభవించాయి. డ్రగ్ ఓవర్ డోస్. 391 00:31:04,072 --> 00:31:05,199 ఇవాళ ఇది అయిదో కేసు. 392 00:31:05,908 --> 00:31:08,619 నగర వ్యాప్తంగా డ్రగ్ ఓవర్ డోస్ మరణాలు చాలా వరకు తగ్గాయని అంటున్నారు, కానీ నాకలా అనిపించట్లేదు. 393 00:31:08,702 --> 00:31:10,162 నాకు ఇంకా పని ఎక్కువైనట్టు అనిపిస్తోంది. 394 00:31:10,954 --> 00:31:11,955 థ్యాంక్యూ. 395 00:31:14,041 --> 00:31:15,417 రంగురంగుల ట్యాగులు ఎందుకు? 396 00:31:15,501 --> 00:31:16,502 డబ్ల్యూటీఎన్ ట్యాగ్స్ ఇవి. 397 00:31:17,252 --> 00:31:18,253 అంటే "ఎవరికి తెలపాలి" అని. 398 00:31:18,795 --> 00:31:21,006 ఆకుపచ్చ ట్యాగ్ పెట్టామంటే, చనిపోయినవారికి బంధువులు ఉన్నారని, 399 00:31:21,089 --> 00:31:22,549 వాళ్లకి సమాచారం అందించడం జరిగిందని అర్థం. 400 00:31:22,633 --> 00:31:25,928 ఇక, ఎర్ర ట్యాగ్ పెట్టామంటే, బంధువులు ఉన్నారని… 401 00:31:26,011 --> 00:31:27,596 కానీ వారికి ఇంకా తెలపలేదని అర్థం. 402 00:31:27,679 --> 00:31:29,431 ఇక నీలి ట్యాగ్ అంటే, చనిపోయినవారి గుర్తింపు తెలీలేదని అర్థం. 403 00:31:30,390 --> 00:31:31,892 అంటే, అతని గురించి ఏమీ తెలీలేదనా? 404 00:31:32,476 --> 00:31:33,852 అతనైనా సరే, ఆమె అయినా సరే… 405 00:31:33,936 --> 00:31:36,188 దానర్థం ఏంటంటే, వాళ్లు చనిపోయారు, కానీ ఎవరికి సమాచారం చేరవేయాలో తెలీదు. 406 00:31:36,271 --> 00:31:37,940 మీ పని అయ్యాక చెప్పండి. 407 00:31:38,023 --> 00:31:39,858 - నేను మీ ఇన్వెంటరీ లిస్ట్ చూడాలనుకుంటున్నా. - సరే. 408 00:31:40,359 --> 00:31:41,360 థ్యాంక్స్, మిత్రులారా. 409 00:33:00,480 --> 00:33:01,732 ఈ కేసు… 410 00:33:04,109 --> 00:33:06,445 నేను దీన్ని ఎంతలా ముగించి, అదుపులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నానో, 411 00:33:07,529 --> 00:33:08,989 అది అంతలా నా మెడకు చుట్టుకుంటోంది. 412 00:33:11,283 --> 00:33:13,452 ఈ కేసు విషయంలో ముందు కష్టాలు వచ్చాకే మంచి రోజులు వచ్చేలా ఉన్నాయి. 413 00:33:28,300 --> 00:33:29,301 హేయ్. 414 00:33:30,344 --> 00:33:31,428 హలో. 415 00:33:48,153 --> 00:33:50,906 - చూడు, నేను మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా. - చెప్పాల్సిందే మరి. 416 00:33:55,077 --> 00:33:56,537 అంటే, రహస్యాలు అందరికీ ఉంటాయి. 417 00:33:57,246 --> 00:33:59,748 వాటిని అందరూ రహస్యంగా ఉంచుకోవాలనుకుంటారు, కాబట్టి… 418 00:34:01,375 --> 00:34:03,168 కానీ నా పని ఎలా ఉంటుందంటే… 419 00:34:03,252 --> 00:34:05,712 ఎప్పుడూ కాకపోయినా, చాలాసార్లు ఆ రహస్యాలేంటో తెలుసుకోవాల్సి వస్తూ ఉంటుంది. 420 00:34:06,380 --> 00:34:07,548 అందుకే గదిలో కెమెరాలు పెట్టుకున్నావా? 421 00:34:09,591 --> 00:34:12,969 అవును, అందుకే. కానీ, ఆ సాకు చెప్పి నేనేం సమర్థించుకోవట్లేదు. 422 00:34:13,594 --> 00:34:15,389 అవును, కానీ వివరణ ఇస్తున్నావుగా. 423 00:34:18,225 --> 00:34:20,060 అలాగే, నిజం చెప్పాలంటే, 424 00:34:21,061 --> 00:34:24,231 పచ్చిగా నిజం చెప్పాలంటే, నేను కూడా చాలా ఆవేశంగా బదులిచ్చా. 425 00:34:24,898 --> 00:34:26,733 - అదేం లేదులే. - నిజంగానే ఆవేశపడ్డా. 426 00:34:28,025 --> 00:34:29,902 అది నిజమైనా, నేనేం పట్టించుకోలేదులే. 427 00:34:32,781 --> 00:34:34,116 దానికి కారణం నాకు తెలిసి… 428 00:34:34,199 --> 00:34:35,324 ఇదే నా జీవితం. 429 00:34:35,409 --> 00:34:38,829 ప్రయాణాలు. హోటళ్లు, వాటిలోని రెస్టారెంట్లు, బార్లు. 430 00:34:39,871 --> 00:34:42,583 నేనేం అయిష్టత వ్యక్తం చేయట్లేదు. నేనే దీన్ని ఎంచుకున్నా. చెప్పాలంటే, నాకు ఇది ఇష్టమే. 431 00:34:43,083 --> 00:34:46,545 ప్రపంచంలో చాలా మంచి హోటళ్లు ఉన్నాయి. అలాగే కొన్ని అద్భుతమైన హోటల్ బార్లు కూడా ఉన్నాయి. 432 00:34:46,628 --> 00:34:48,964 ఇది కూడా అలాంటి మంచి హోటలే, కానీ… 433 00:34:51,049 --> 00:34:52,050 సర్లే. 434 00:34:54,094 --> 00:34:55,094 ఇక్కడ ఒంటరిగా అనిపిస్తుంది. 435 00:35:00,601 --> 00:35:02,561 నాకు, ఒక చిన్న జోక్ గుర్తుంది. 436 00:35:02,644 --> 00:35:04,813 అది అస్సలు బాగుండదు, కానీ నాకు అది తప్ప ఇంకేదీ గుర్తులేదు. 437 00:35:04,897 --> 00:35:06,899 - అవునా? - మీకు ఓ టేబుల్ రెడీ చేసి పెట్టాం, మిస్ ఫిషర్. 438 00:35:07,399 --> 00:35:08,942 - సరే, ఒక నిమిషం. - ఓహో. 439 00:35:10,110 --> 00:35:11,153 చెప్పు. 440 00:35:12,154 --> 00:35:13,405 సరే. ఏ పండు… 441 00:35:14,990 --> 00:35:17,034 ఏ పండుకు ఒంటరితనం అంటే తెలీదు? 442 00:35:21,246 --> 00:35:23,665 - ఒంటరితనం అంటే తెలియని పండు… - తెలియని పండు ఏంటి? 443 00:35:24,166 --> 00:35:25,167 నేను చెప్పేయనా? 444 00:35:25,918 --> 00:35:26,919 పెయిర్ పండా? 445 00:35:30,881 --> 00:35:32,216 అవును. 446 00:35:32,299 --> 00:35:34,676 - దేవుడా. అదేనా జోక్? - చెప్పా కదా. 447 00:35:34,760 --> 00:35:37,429 - ఆ జోక్ బాగుండదని చెప్పా కదా. - దేవుడా, నీ ముఖం చూసుకో. 448 00:35:38,305 --> 00:35:40,682 - నీకు తెలిసిన ఏకైక జోకుకి నేను సమాధానం చెప్పేశా. - అవును. 449 00:35:41,433 --> 00:35:43,519 - కడుపు నిండా తిను. - నువ్వు కూడా. 450 00:35:47,356 --> 00:35:48,482 ఇప్పుడు కూడా ఛీజ్ బర్గర్ తింటావా? 451 00:35:48,565 --> 00:35:50,234 అదే ఆలోచిస్తున్నా. చాలా బాగుంది అది. 452 00:35:50,317 --> 00:35:51,693 హా, నాకు కూడా ఒకటి తినాలనుంది. 453 00:36:04,957 --> 00:36:05,999 ఇద్దరం కలిసి తిందామా? 454 00:36:07,543 --> 00:36:08,544 తప్పకుండా. 455 00:36:16,051 --> 00:36:17,177 - ఇదుగోండి. - థ్యాంక్యూ. 456 00:36:17,261 --> 00:36:19,680 - నేను ఇంకో మెనూ, సిల్వర్ స్పూన్లు, ఫోర్కులు తెస్తా. - థ్యాంక్స్. 457 00:36:33,861 --> 00:36:35,779 పీస్ హోటల్ మేడ మీద నిలబడి, హ్వాంగ్పూ నదిలోని నీటిపై 458 00:36:35,863 --> 00:36:38,407 ప్రతిబింబిస్తూ మెరిసే భవనాల వెలుగులను చూస్తూ మైమరిచిపోతుంటా. 459 00:36:39,283 --> 00:36:41,076 - షాంఘై చాలా బాగుంటుంది. - అవును. 460 00:36:47,624 --> 00:36:50,919 "లేడీ ఫ్రమ్ షాంఘై" సినిమా చూశావా? ఓర్సన్ వెల్స్, రీటా హేవర్త్ నటించారు అందులో. 461 00:36:51,003 --> 00:36:53,213 బాబోయ్. నువ్వు సినిమాల గురించి ప్రస్తావించడం ఇది అయిదో సారి. 462 00:36:53,297 --> 00:36:55,507 - అంత లేదు. - ఇంకా ఎక్కువసార్లే చెప్పుంటావు. 463 00:36:55,591 --> 00:36:58,051 "ఇది నాకు ఆ సినిమాని గుర్తు తెప్పిస్తోంది." "ఆ సినిమాలో ఇలాగే జరుగుతుంది." 464 00:36:58,135 --> 00:37:00,429 - నాకు సినిమాలంటే ఇష్టం అనుకుంటా. - హా, అది నిజమే. 465 00:37:01,138 --> 00:37:02,306 బ్రేక్ ఫాస్ట్ మెనూ ఏమైనా కావాలా? 466 00:37:03,599 --> 00:37:05,184 బాబోయ్. సమయం ఎంత అయింది? 467 00:37:06,602 --> 00:37:07,811 నాకు పని ఉంది. 468 00:37:08,395 --> 00:37:10,230 నేను వెళ్లాలి. సారీ. 469 00:37:13,775 --> 00:37:14,776 షార్లెట్. 470 00:37:18,488 --> 00:37:20,240 మనం వీలు చూసుకుని ఓ సినిమాకి వెళ్తే బాగుంటుందేమో? 471 00:37:22,034 --> 00:37:23,035 హా, బాగుంటుందేమో. 472 00:37:49,311 --> 00:37:50,604 నీకు నరకం తప్పదు, జాన్. 473 00:37:52,814 --> 00:37:53,941 నరకం అనేదే లేదు అసలు. 474 00:37:54,024 --> 00:37:55,275 హా, నా ఉద్దేశం ఏంటో నీకు బాగా తెలుసు. 475 00:37:56,068 --> 00:37:58,153 ఛీజ్ బర్గర్లు, శృంగారం, హత్య. 476 00:37:58,654 --> 00:38:00,322 సమాజంలో భాగమైపోవడం అనేది జరిగేది ఇలానే. 477 00:38:00,989 --> 00:38:02,366 ఇలా ఒకటి తర్వాత ఒకటి జరగడం వల్లే. 478 00:38:19,341 --> 00:38:22,678 ఇది వీరి అస్థికల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక పాత్ర 479 00:38:22,761 --> 00:38:24,888 పేరు: తెలియదు దహనం చేసిన తేదీ: ఏప్రిల్ 13 480 00:40:00,067 --> 00:40:02,069 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్