1 00:00:21,563 --> 00:00:22,940 నేను ప్రయత్నించా. 2 00:00:23,023 --> 00:00:25,108 నిజంగానే అన్ని విధాలా ప్రయత్నించా. 3 00:00:25,192 --> 00:00:26,193 అయ్య బాబోయ్! 4 00:00:27,069 --> 00:00:28,570 నా శాయశక్తులా ప్రయత్నించి చూశా. 5 00:00:32,073 --> 00:00:33,951 కానీ కొందరు హింసా మార్గంలోనే జీవిస్తారు. 6 00:00:35,494 --> 00:00:38,288 అలాంటి వాళ్లకి… 7 00:00:39,790 --> 00:00:41,416 ఆ భాషలో బదులిస్తే కానీ అర్థం కాదు. 8 00:01:45,939 --> 00:01:47,816 సెర్గీ ఒహీడా? 9 00:01:47,900 --> 00:01:48,901 రెండు రోజుల క్రితం 10 00:01:48,984 --> 00:01:50,652 చెప్తున్నా కదా, నాకు ఇది నచ్చట్లేదు. అంత మంచి ఐడియా కాదు. 11 00:01:50,736 --> 00:01:51,862 ఎన్నిసార్లు అంటావు ఆ మాటని! 12 00:01:51,945 --> 00:01:53,322 దాని గురించే ఆలోచిస్తూ ఉన్నా మరి. 13 00:01:54,781 --> 00:01:56,700 ఎంతటి ధనవంతుడైనా అతనికి ఎంతో కొంత బాకీ ఉంటాడు. 14 00:01:56,783 --> 00:01:59,369 అవును. అతనికి తెలియాల్సిన వాళ్లందరూ తెలుసు. 15 00:01:59,453 --> 00:02:01,288 బదులుగా అతను పెద్ద సాయమే కోరుతాడు. 16 00:02:02,956 --> 00:02:05,834 చూడు, మనం కాస్త రిస్క్ తీసుకుని, చట్టం ప్రకారం పోదాం. 17 00:02:06,543 --> 00:02:09,295 ఇప్పుడు నీ దగ్గర వీడియోకన్నా మంచి సాక్ష్యమే ఉంది. 18 00:02:09,378 --> 00:02:11,131 ప్రమాద ఘంటికలని మోగిద్దాం, బాసూ. 19 00:02:11,215 --> 00:02:13,842 చూడు, కాపాడటానికి ఎవరు వస్తారు? పోలీసులా? 20 00:02:14,468 --> 00:02:15,719 అంటే… 21 00:02:15,802 --> 00:02:16,845 సిటీ అడ్మినిస్ట్రేషన్ వాళ్లా? 22 00:02:17,888 --> 00:02:22,643 ఏంటంటే, ఈ ఫైర్ సేల్ ఒక సాదాసీదా డెప్యూటీ రేంజ్ లోని విషయం కాదు, ఎవరో పెద్ద తలకాయే నడిపిస్తున్నాడు. 23 00:02:22,726 --> 00:02:25,729 టామ్, మనం సరైన నిర్ణయం తీసుకోకపోతే, 24 00:02:26,230 --> 00:02:27,648 డ్యానీ ప్రాణాలు పోతాయి. 25 00:02:37,074 --> 00:02:38,617 వేగా నన్ను ఇరుకున పెట్టేశాడు. 26 00:02:41,203 --> 00:02:43,747 మనకి సమయం లేదు, దీనిలో సెర్గీని లాగాల్సిందే. 27 00:02:44,581 --> 00:02:45,582 కాల్ చేయ్. 28 00:02:46,583 --> 00:02:48,919 మీటింగ్ ని ఏర్పాటు చేయ్. నేను డ్యానీ బాగా ఉన్నాడో లేదో చూడటానికి వెళ్తా. 29 00:02:50,879 --> 00:02:53,549 సరే, సిద్ధంగా ఉండు మరి. 30 00:02:57,177 --> 00:03:01,014 ఒక విషయం గుర్తుంచుకో, అది షెరిఫ్ అడ్డా. తప్పకుండా వాళ్ల నిఘా ఉంటుంది. 31 00:03:01,098 --> 00:03:02,599 హా. గట్టిగానే ఉంటుంది. 32 00:03:05,435 --> 00:03:06,478 మళ్లీ కలుస్తా మరి. 33 00:03:14,403 --> 00:03:16,780 - వేరా నోవాక్? - ఒకవేళ అది నేనే అయితే? 34 00:03:17,531 --> 00:03:19,449 - మీ కోసం ఒకటి తెచ్చా. - అవునా? 35 00:03:21,577 --> 00:03:22,911 నిఘా గట్టిగానే పెడతారు. 36 00:03:29,877 --> 00:03:32,004 - వేగా. - నేను అతడిని కలవాలి. 37 00:03:32,087 --> 00:03:33,797 నేను కూడా "జీ"ని కలవాలి. రేపే. 38 00:03:33,881 --> 00:03:35,841 సరే, నేను ఏమైనా చేసే ముందు, అతడిని కలిసి, 39 00:03:35,924 --> 00:03:37,301 అతనికేం కాలేదని నిర్ధారించుకోవాలనుకుంటున్నా. 40 00:03:37,384 --> 00:03:39,511 హా, చెప్తున్నా కదా, అతను బానే ఉన్నాడు, కానీ కలవాలనుంటే కలువు. 41 00:03:39,595 --> 00:03:41,638 - వచ్చేయ్ ఇక్కడికి. - వస్తున్నా. 42 00:03:57,362 --> 00:03:58,572 ర్యాబినూ! 43 00:04:12,419 --> 00:04:13,504 తలుపు తీస్తున్నా! 44 00:04:38,195 --> 00:04:39,446 హేయ్. 45 00:04:39,530 --> 00:04:41,114 - హేయ్. - ఎలా ఉన్నావు? 46 00:04:41,198 --> 00:04:42,199 బాగానే ఉన్నా. 47 00:04:42,282 --> 00:04:43,408 అవునా? 48 00:04:43,492 --> 00:04:45,994 హా, నిద్ర అంతగా పట్టలేదు, కానీ నాకేం పర్వాలేదులే. 49 00:04:46,078 --> 00:04:47,496 నిన్ను చూడటం బాగుంది. 50 00:04:47,579 --> 00:04:50,082 వచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు ఇంత దూరం రావాల్సి వచ్చినందుకు సారీ, 51 00:04:50,165 --> 00:04:52,042 నా అంత చెత్త క్లయింట్ నీకెప్పుడూ తగిలి ఉండడేమో, కదా? 52 00:04:52,125 --> 00:04:54,545 లేదు, డ్యానీ, అది నిజం కాదు. అస్సలు నిజం కాదు. 53 00:04:54,628 --> 00:04:57,714 హా, కానీ నేను నీకు ఫీజు ఇవ్వట్లేదు. గొడవలు పెట్టుకుంటున్నా, మాట వినట్లేదు. 54 00:04:57,798 --> 00:04:59,258 కానీ, నీ వల్లే నేను నా సూట్లని లెక్కపెట్టుకుంటున్నా. 55 00:04:59,341 --> 00:05:02,010 నువ్వు మొదట్నుంచే చేయాల్సిన పని అది. 56 00:05:02,094 --> 00:05:03,220 అది నిజమే. 57 00:05:03,929 --> 00:05:05,013 ఏంటంటే… 58 00:05:08,100 --> 00:05:09,268 మనకి ఓ సమస్య వచ్చి పడింది. 59 00:05:10,102 --> 00:05:12,896 సమస్య… సమస్య అంటే? జీ… జీ బాగానే ఉన్నాడా? 60 00:05:12,980 --> 00:05:14,690 హా, బాగానే ఉన్నాడు. ప్రస్తుతానికి. 61 00:05:14,773 --> 00:05:17,609 కానీ ఇదంతా, అంటే నువ్వు అరెస్ట్ అయి జైలు పాలవ్వడం అంతా 62 00:05:17,693 --> 00:05:18,902 ఒక ఆట. 63 00:05:18,986 --> 00:05:20,779 జీ కోసం వేగా ఆడుతున్న ఆట. 64 00:05:21,446 --> 00:05:22,739 వాడికి జీ గురించి తెలిసిందా? 65 00:05:24,741 --> 00:05:26,660 సరే మరి. అయితే ఆ పోలీసోడు ఏం చేస్తున్నాడు? 66 00:05:26,743 --> 00:05:27,744 ఏం కావాలి వాడికి? 67 00:05:27,828 --> 00:05:29,621 డ్యానీ, చెప్పేది విను. ఈ విషయంలో నువ్వు నన్ను నమ్మాలి, సరేనా? 68 00:05:29,705 --> 00:05:31,415 వాడికి ఏం కావాలి, షుగర్? 69 00:05:33,458 --> 00:05:34,543 ఎక్స్ ఛేంజ్ చేద్దామని వాడి ప్లాన్. 70 00:05:35,460 --> 00:05:36,461 ఏంటి? 71 00:05:36,545 --> 00:05:39,548 - మూన్. ఇక ముగించు. - ఆగాలి, ఇప్పుడే కదా వచ్చింది. 72 00:05:39,631 --> 00:05:41,842 - కానీ నువ్వు ఆ పని చేయవు, కదా? - డ్యానీ, చెప్పేది విను. 73 00:05:41,925 --> 00:05:42,926 వద్దు, ప్లీజ్, నేను… 74 00:05:43,010 --> 00:05:45,387 - ఇక పద. - ఒక్క నిమిషం… నిజంగానే చెప్తున్నా, ఆ పని చేయకు. 75 00:05:45,470 --> 00:05:48,056 డ్యానీ, చెప్పేది విను, ఏం జరిగినా కానీ, అది ఎలా అనిపించినా కానీ… 76 00:05:48,140 --> 00:05:50,309 ఎక్స్ ఛేంజ్ వద్దు… బాబోయ్! నేను ఇప్పుడే… 77 00:05:50,392 --> 00:05:52,394 - హేయ్! హేయ్! - ఆ పని మాత్రం చేయకు! 78 00:05:52,477 --> 00:05:54,229 షుగర్, ఆ పని చేయకు! 79 00:05:54,313 --> 00:05:56,732 సరే, సరే! సరే! 80 00:05:57,357 --> 00:05:58,358 వద్దు! 81 00:06:05,449 --> 00:06:07,159 హేయ్, స్టాన్లీ, ఏంటి సంగతి? 82 00:06:08,452 --> 00:06:10,954 ఇబ్బంది పెడుతున్నందుకు సారీ. నేను… 83 00:06:11,496 --> 00:06:12,497 బాగానే ఉన్నావా? 84 00:06:13,415 --> 00:06:17,294 ఎవరికి… ఎవరికి కాల్ చేయాలో అర్థం కాలేదు, అందుకని నేను… 85 00:06:17,377 --> 00:06:18,712 సరే. ఎక్కడ ఉన్నావు? 86 00:06:21,006 --> 00:06:22,716 పిచ్చి పక్షి. 87 00:06:22,799 --> 00:06:24,301 లేదులే, నీకు అదంటే ప్రాణం. 88 00:06:24,384 --> 00:06:27,346 నా కూతుళ్లు పెద్దవాళ్లు అయి, దూరంగా వెళ్లిపోయారు. 89 00:06:27,429 --> 00:06:31,183 నా భార్య నన్ను వదిలేసి ఓ హ్యుమానిటీస్ ప్రొఫెసరుని పెళ్లి చేసుకుంది. 90 00:06:31,266 --> 00:06:32,351 హ్యుమానిటీస్. 91 00:06:33,185 --> 00:06:34,561 అసలు అది ఏంటో ఆ దేవునికే తెలియాలి! 92 00:06:38,941 --> 00:06:41,568 ఈ… ఈ ముళ్ళని గమనించావా? 93 00:06:45,364 --> 00:06:49,451 హా, ఇవే వీటిని శాకాహార జంతువుల నుండి కాపాడతాయి. 94 00:06:54,915 --> 00:06:57,292 యవ్వనం గురించి పికాసో చెప్పిన కోట్ ఒకటుంది… 95 00:06:59,837 --> 00:07:02,005 ఏదో… గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా. 96 00:07:05,092 --> 00:07:07,135 అంటే, ఇప్పుడు నా బుర్ర… 97 00:07:08,470 --> 00:07:10,138 కూర్చుంటావా? 98 00:07:10,222 --> 00:07:11,265 హా, కాస్త ప్రాణానికి బాగుంటుంది. 99 00:07:11,932 --> 00:07:13,058 రా. 100 00:07:14,268 --> 00:07:15,727 దేవుడా. 101 00:07:22,568 --> 00:07:25,320 స్టాన్లీ, నేను ట్యాక్స్ అటార్నీని కాదు. 102 00:07:26,113 --> 00:07:28,115 - ఏంటి? - నేను ఉండేది కొవీనాలో కాదు. 103 00:07:29,283 --> 00:07:30,701 సరే, మరి ఎక్కడ ఉంటావు? 104 00:07:31,285 --> 00:07:34,746 నీతో… నీతో ఒక దాని గురించి మాట్లాడాలి, స్టాన్లీ. సెనెటర్ పావిచ్ గురించి నీతో మాట్లాడాలి. 105 00:07:37,958 --> 00:07:38,959 - పావిచ్? - అవును, 106 00:07:39,042 --> 00:07:40,586 ఏదో పని కోసం నిన్ను రిక్రూట్ చేసుకున్నాడు కదా. 107 00:07:40,669 --> 00:07:43,130 ఏదో ప్రాజెక్ట్ గురించి. 108 00:07:45,716 --> 00:07:46,800 నిరాశపరుస్తున్నందుకు సారీ, 109 00:07:46,884 --> 00:07:49,219 నువ్వు ఎవరైనా కానీ, దాని గురించి నేను చెప్పను. 110 00:07:49,303 --> 00:07:51,013 నువ్వు చెప్పాల్సిందే, స్టాన్లీ. 111 00:07:51,096 --> 00:07:52,973 స్టాన్లీ, స్టాన్లీ, ఆగు, చెప్పేది విను. 112 00:07:55,058 --> 00:07:56,059 ప్లీజ్. 113 00:07:58,103 --> 00:08:03,442 అయితే, టీవీ షోల గురించి మాట్లాడటం, మొక్కలపై మక్కువ చూపటం, 114 00:08:05,068 --> 00:08:08,906 నా చిలుక, మాంటీపై ప్రేమ చూపడం, అవన్నీ నాటకాలేనా? 115 00:08:08,989 --> 00:08:09,990 కాదు. 116 00:08:10,991 --> 00:08:14,036 అవేం నాటకాలు కావు. నిజంగానే నీకు స్నేహితునిగా ఉన్నా. ఇప్పటికీ ఉంటున్నా కూడా. 117 00:08:14,536 --> 00:08:16,455 నువ్వంటే చాలా అభిమానం ఉంది, స్టాన్లీ, కానీ నాకు నీ సాయం కావాలి. 118 00:08:18,540 --> 00:08:19,791 సరే మరి, నాలుగు సర్కిల్స్. 119 00:08:20,375 --> 00:08:21,418 ఏంటవి? 120 00:08:22,085 --> 00:08:24,296 అవి నాకు తరచుగా కనిపిస్తున్నాయి. కానీ అవేంటో నాకు తెలీట్లేదు. 121 00:08:27,216 --> 00:08:31,637 పావిచ్, హెన్రీ థోర్ప్ అనే ఓ మనిషితో కలిసి… 122 00:08:31,720 --> 00:08:36,058 నాకు ఆప్తులైన వారిని చాలా మందిని మోసం చేశాడు అనుకుంటా. 123 00:08:39,144 --> 00:08:42,688 అతని వల్ల వాళ్లు పారిపోయి, దాక్కుని బతకాల్సి వచ్చింది, కారణం… కారణం ఏంటో తెలీదు నాకు. 124 00:08:42,773 --> 00:08:44,650 ఎందుకో నాకు తెలీదు, ఏం జరిగిందో కూడా తెలీదు, 125 00:08:45,567 --> 00:08:49,321 కానీ దానికి, ఆ నాలుగు సర్కిళ్లకి ఏదో సంబంధముందని అనిపిస్తోంది, అందుకని నీ సాయం కావాలి. 126 00:08:55,327 --> 00:08:56,995 దయచేసి ఆ నాలుగు సర్కిల్స్ ఏంటో చెప్పు. 127 00:09:04,169 --> 00:09:05,379 అవి సర్కిల్స్ కాదు. 128 00:09:06,004 --> 00:09:10,008 అవి ట్రోపోస్ఫియర్లో పెట్టాలని ప్లాన్ చేస్తున్న నోడ్స్. 129 00:09:10,092 --> 00:09:11,677 ట్రోపోస్ఫియర్లో పెట్టాలని ప్లాన్ చేస్తున్న నోడ్సా? 130 00:09:17,391 --> 00:09:20,143 - ఎలా వాడాలనుకుంటున్నారు? ఆయుధంగానా? - కాదు. 131 00:09:20,227 --> 00:09:21,812 కానే కాదు. వాతావరణాన్ని నియంత్రించడంలో సాయం కోసం అవి. 132 00:09:23,522 --> 00:09:25,816 - వాతావరణాన్ని నియంత్రించడం అంటే ఎలా? - ఎలా కావాలంటే అలా. 133 00:09:27,317 --> 00:09:30,112 గ్రీన్ హౌస్ గ్యాసులని తొలగించడానికి, 134 00:09:30,195 --> 00:09:32,990 ఆక్సిజన్ స్థాయిని పెంచడానికి, కార్బన్ డైయాక్సిడ్ స్థాయిని తగ్గించడానికి, 135 00:09:33,907 --> 00:09:35,659 పంటల దిగుబడిని పెంచడానికి, 136 00:09:36,285 --> 00:09:39,705 దావాగ్నులని అదుపు చేయడానికి, ఆకస్మిక వరదలని నిరోధించడానికి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 137 00:09:41,415 --> 00:09:43,959 జాన్, ఇది ప్రపంచాన్ని మార్చగలదు. 138 00:09:44,668 --> 00:09:45,878 నిజంగానే చెప్తున్నా. 139 00:09:45,961 --> 00:09:47,171 దీన్ని కనిపెట్టింది నువ్వేనా? 140 00:09:47,254 --> 00:09:49,715 అయ్య బాబోయ్, కానే కాదు. నేను ఒకానొక ఇంజినీరుని మాత్రమే. 141 00:09:52,342 --> 00:09:54,803 ఆ ప్రాజెక్టుని డెవలప్ చేయడంలో, దానికి ఒక రూపును ఇవ్వడంలో నేను సాయపడ్డా. 142 00:09:54,887 --> 00:09:56,555 నేను దానిపై ఓ థియరీని రూపొందించా… 143 00:09:56,638 --> 00:10:01,935 కానీ ఈ టెక్నాలజీ వేరే లెవెల్ అసలు. కానీ ఆయుధమైతే కాదు. 144 00:10:02,019 --> 00:10:03,270 లేదు, నేను ఎప్పటికీ… 145 00:10:03,353 --> 00:10:04,688 హా, కానీ నీకు భయంగా ఉంది. 146 00:10:06,148 --> 00:10:10,068 అది నిజమే, నీ ముఖంపై అది చాలాసార్లు కనిపించింది. ఇప్పటికీ నువ్వు… సందిగ్ధంలోనే ఉన్నావు. ఎందుకు? 147 00:10:10,736 --> 00:10:12,696 అంటే, మనం ఏదోకటి చేయాలి కదా. 148 00:10:14,489 --> 00:10:18,911 ఈ గ్రహం నాశనమైపోతోంది! మన కారణంగానే ప్రపంచం తగలబడుతోంది. 149 00:10:19,578 --> 00:10:20,746 నన్ను భయపెట్టేది అదే. 150 00:10:21,580 --> 00:10:25,918 కానీ, ఇది చిన్న శక్తి కాదు. దేవుని పాత్ర పోషించినట్టే కదా. 151 00:10:26,001 --> 00:10:28,879 మరి భయం కలగకుండా ఎలా ఉంటుంది, కాబట్టి… 152 00:10:32,549 --> 00:10:34,801 - ఈ ఫోన్ మాట్లాడాలి, ఆగు… - ఇక నేను వెళ్తాను. 153 00:10:35,302 --> 00:10:36,303 స్టాన్లీ… 154 00:10:38,472 --> 00:10:39,598 - హేయ్. - అంతా రెడీ. 155 00:10:39,681 --> 00:10:42,559 - సెర్గీతో మీటింగ్ ఖాయమైంది. జాగ్రత్త. - సరే, మంచిది. 156 00:10:44,186 --> 00:10:46,396 వాల్ మొబైల్ 157 00:10:46,480 --> 00:10:48,774 - ఏంటి సంగతి? - జీ ఎలా ఉన్నాడు? 158 00:10:48,857 --> 00:10:52,110 ఏదో ఆయనే జైలు శిక్ష అనుభవిస్తున్నట్టు ఊరికే గొణుగుతూ, ఏడుస్తూ ఉన్నాడు. 159 00:10:52,194 --> 00:10:54,154 వ్యసనం నుండి బయటపడుతున్నాడు, కదా? 160 00:10:54,238 --> 00:10:55,697 ఈ సమయంలో మూడ్స్ మారిపోతూ ఉండటం మామూలే. 161 00:10:55,781 --> 00:10:57,324 హా, నాకు బాగా తెలుసులే. 162 00:10:58,700 --> 00:11:00,410 నువ్వు అక్కడ ఉండటం చాలా ముఖ్యం, వాల్. 163 00:11:00,494 --> 00:11:02,704 సరేనా? నువ్వు అతడిని గమనిస్తూ ఉండాలి. 164 00:11:02,788 --> 00:11:05,207 - సరే, బాస్. - సరే మరి. ఇక ఉంటా. 165 00:11:05,707 --> 00:11:07,084 మళ్లీ కాల్ చేస్తా, సరేనా? 166 00:11:23,100 --> 00:11:25,936 - మిస్టర్ షుగర్. నిన్ను చూడటం చాలా ఆనందంగా ఉంది. - డియేగో. 167 00:11:26,019 --> 00:11:29,022 నేను ఆఫీసులో ఉండి ఏదో వెలగబెడుతూ ఉండగా, 168 00:11:29,106 --> 00:11:31,817 నాన్న వచ్చి, నువ్వు కాల్ చేశావని చెప్పాడు. 169 00:11:33,235 --> 00:11:34,236 అతని ముఖాన్ని చూడాల్సింది నువ్వు. 170 00:11:35,320 --> 00:11:36,488 ఆనందంతో వెలిగిపోయింది. 171 00:11:37,281 --> 00:11:38,282 నిన్ను చెక్ చేయవచ్చా? 172 00:11:42,119 --> 00:11:44,329 నా దగ్గర ఆయుధాల్లాంటివి ఉండవని నీకు తెలుసు కదా, డియేగో. 173 00:11:44,413 --> 00:11:45,414 తెలుసు. 174 00:11:46,373 --> 00:11:47,708 క్షమించు. 175 00:11:48,375 --> 00:11:49,710 ముందు జాగ్రత్త కోసమే. 176 00:11:59,761 --> 00:12:01,471 సెర్గీ ఒహీడా. 177 00:12:01,555 --> 00:12:04,183 ఆయన లాస్ యూనివర్సాలీస్ అనే మాఫియాకి అధిపతి, 178 00:12:04,808 --> 00:12:07,895 అంటే "మేము అన్నిచోట్లా ఉంటాం" అనే అర్థం వస్తుంది. 179 00:12:09,229 --> 00:12:11,481 చాలా ఏళ్ల క్రితం అతని కోసం ఓ పని చేశా. 180 00:12:12,232 --> 00:12:14,067 నేను ఆ పని పూర్తిగా చేయలేదని అతను అంటూ ఉంటాడు, 181 00:12:14,151 --> 00:12:16,987 కానీ అతని దగ్గర సగం పనులు చేస్తే, ఇక అంతే. 182 00:12:21,074 --> 00:12:22,409 బాగున్నావు. 183 00:12:23,535 --> 00:12:25,621 - థ్యాంక్స్. - కూర్చో. 184 00:12:34,630 --> 00:12:35,714 నేను ఎలా ఉన్నాను? 185 00:12:39,051 --> 00:12:40,385 ముసలివాడివి అయిపోయావు. 186 00:12:43,096 --> 00:12:45,182 చూడు, నీతో మంచిగా ఉండాలని చూస్తున్నా. సరేనా? 187 00:12:45,974 --> 00:12:47,100 నువ్వే నా దగ్గరికి వచ్చావు. 188 00:12:47,684 --> 00:12:49,520 నీతో మంచిగా ఉండాలా వద్దా? 189 00:12:49,603 --> 00:12:52,648 మంచిగానే ఉండాలి, కానీ అది అంత ముఖ్యమేం కాదు. 190 00:12:52,731 --> 00:12:54,525 చేయాల్సిన పనులు నీకు కొన్ని ఉంటాయి, 191 00:12:55,817 --> 00:12:58,111 వాటిలో కొన్ని చేయగల సామర్థ్యం నాకు ఉంటుంది. 192 00:12:58,195 --> 00:13:00,113 మన మధ్య ఉండేది కేవలం వ్యాపార సంబంధమే. 193 00:13:00,614 --> 00:13:04,076 నాకు తెలిసి, దాని వల్లే మన మధ్య సమస్యలు వచ్చాయి. 194 00:13:04,743 --> 00:13:06,119 అదే, మన మధ్య ఉండేది ఏ బంధమో మర్చిపోవడం వల్ల. 195 00:13:07,829 --> 00:13:09,373 నువ్వు నాతో నిజాయితీగా ఉంటావు. 196 00:13:10,165 --> 00:13:13,544 నీ అభిప్రాయాలతో నేను ప్రతీసారి ఏకీభవించకపోవచ్చు, కానీ నువ్వు నిజాయితీగా ఉంటావు. 197 00:13:16,839 --> 00:13:19,091 ఆ గుణం అతికొద్ది మంది దగ్గరే ఉంటుంది. 198 00:13:25,639 --> 00:13:28,433 నీకు, బ్యాడ్ బన్నీ ఎవరో తెలుసా? 199 00:13:29,852 --> 00:13:30,978 అతని గురించి విన్నా. 200 00:13:31,520 --> 00:13:34,940 అతడిని కలవడానికి మయామీలో ఉన్న నా మనవరాలి దగ్గరికి వెళ్తున్నాను నేను. 201 00:13:35,023 --> 00:13:36,024 మంచిది. 202 00:13:36,567 --> 00:13:39,403 తను చాలా మంచిది, కానీ… నన్ను కలవడం తనకంత ఇష్టం లేదు. 203 00:13:42,489 --> 00:13:44,408 అయితే, ఇది పోలీసోడి పంచాయితీయా? 204 00:13:44,491 --> 00:13:45,868 అతని పేరు… 205 00:13:45,951 --> 00:13:47,744 రే వేగా. నీ దగ్గరే పని చేస్తున్నాడు. 206 00:13:48,245 --> 00:13:50,581 నీ ఫైర్ సేల్ దందాని నడిపిస్తున్న వ్యక్తి అతను. 207 00:13:52,165 --> 00:13:54,585 యాభైకి పైగా దేశాల్లో, నేను ఎన్నో దందాలు నడుపుతున్నా… 208 00:13:54,668 --> 00:13:58,046 హా, గుర్తింపు చోరీ, గృహ కల్పన స్కీమ్ లో మోసం, నిర్మాణ కాంట్రాక్టులలో కమిషన్లు. 209 00:13:59,715 --> 00:14:01,884 నిరాశ్రయులు, వ్యసనపరుల దయనీయ స్థితిని పెట్టుబడిగా పెట్టుకుని, 210 00:14:02,426 --> 00:14:04,511 వారి పేరుతో వందల కోట్ల ప్రభుత్వ కాంట్రాక్టులు కొట్టేస్తున్నారు. 211 00:14:04,595 --> 00:14:07,347 అది చాలా దిగజారుడు పని, సెర్గీ, నీ స్థాయికి కూడా అది దిగజారుడు పనే. 212 00:14:09,057 --> 00:14:11,059 జాన్, ఈ ప్రపంచంలో అందరూ చేసేది అలాంటి పనులే. 213 00:14:11,143 --> 00:14:13,103 మళ్లీ ఆ వాదన జోలికి వెళ్లకుండా ఉందామా? 214 00:14:13,187 --> 00:14:14,188 ప్లీజ్? 215 00:14:19,359 --> 00:14:22,821 అయితే, ఆ పోలీసోడిని ఏం చేయమంటావు? 216 00:14:22,905 --> 00:14:24,740 - చంపేయాలా? - వద్దు, వద్దు. 217 00:14:24,823 --> 00:14:26,992 అతను నా క్లయింటుని జైల్లో వేశాడు. 218 00:14:28,076 --> 00:14:31,705 నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నాడు, కాబట్టి నా జోలికి రాకుండా ఉండమని చెప్పాలి. 219 00:14:32,247 --> 00:14:33,540 నా క్లయింటుని విడుదల చేయాలి. 220 00:14:36,543 --> 00:14:37,669 అంతేనా? 221 00:14:38,754 --> 00:14:39,796 అంతే. 222 00:14:40,631 --> 00:14:41,673 మరి నాకు? 223 00:14:42,841 --> 00:14:44,134 నాకేంటి లాభం? 224 00:14:52,351 --> 00:14:53,852 నీ పనిని ఇప్పుడు పూర్తి చేస్తా. 225 00:15:00,150 --> 00:15:01,235 బై. 226 00:15:10,786 --> 00:15:15,290 దీంతో సెర్గీ ఒహీడా దగ్గర మళ్లీ పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 227 00:15:25,259 --> 00:15:27,427 ఏడుస్తూ పెద్దాయన దగ్గరికి వెళ్లినట్టున్నావే. 228 00:15:27,511 --> 00:15:29,221 మన ప్రయత్నం మనం చేయాలి కదా, రే. 229 00:15:29,763 --> 00:15:30,764 అతడిని విడుదల చేసేయ్. 230 00:15:31,765 --> 00:15:32,933 విడుదల చేయాలా? 231 00:15:33,016 --> 00:15:35,686 నువ్వు సినిమాలు మరీ ఎక్కువ చూసేస్తున్నావు, షుగర్. అలా ఎవరూ మాట్లాడరమ్మా. 232 00:15:35,769 --> 00:15:38,856 అంతా అయిపోయింది, రే. సెర్గీ తలుచుకుంటే ఓ క్షణంలో 233 00:15:38,939 --> 00:15:40,315 నీ శవం సముద్ర గర్భంలో కలిసిపోతుంది. 234 00:15:41,149 --> 00:15:44,236 సరేనా? ఇక నీ తప్పులని కప్పి పుచ్చుకోవడానికి నీకు కాస్త సమయం పడుతుందిలే. 235 00:15:44,319 --> 00:15:46,947 కాబట్టి, నకిలీ పత్రాలు సృష్టించుకో, నువ్వు చేయాల్సింది చేసుకో. 236 00:15:47,030 --> 00:15:49,283 కానీ డ్యానీని విడుదల చేయాలి, ఈ రాత్రికల్లా ఆ పని జరిగిపోవాలి. 237 00:15:50,033 --> 00:15:51,034 నీ ఖేల్ ఖతమ్ అయిపోయింది. 238 00:16:18,729 --> 00:16:19,938 చెప్పండి. 239 00:16:20,022 --> 00:16:22,858 నా దగ్గర నీ ఫోన్ నంబర్ లేదని గ్రహించా. 240 00:16:22,941 --> 00:16:26,069 - అది చాలా మంది దగ్గర ఉండదులే. - ఓకే. డిన్నర్ కలిసి చేద్దామా? 241 00:16:27,529 --> 00:16:30,073 ఇప్పుడు సమయం అయిదు కూడా కాలేదు. రెస్టారెంటుని అప్పుడే తెరవరు. 242 00:16:31,325 --> 00:16:33,911 ఓకే. రూమ్ సర్వీస్ తెప్పించుకుందామా? 243 00:16:33,994 --> 00:16:34,995 నీ రూమ్ కా? నా రూమ్ కా? 244 00:17:13,742 --> 00:17:18,539 "పసిఫిక్ కోస్ట్ హైవే వంపుల గుండా మేము మళ్లీ పశ్చిమం వైపుకు సాగిపోతున్నాము. 245 00:17:19,373 --> 00:17:22,416 చల్లటి పిల్ల గాలులు వీచే ఆ దారుల్లో, అద్భుతమైన శాన్ సిమియన్ వైపు వెళ్తూ ఉండగా, 246 00:17:22,501 --> 00:17:27,673 అడుగడుగునా ఆ సముద్రపు అందాలు మన చూపులను కట్టిపడేస్తూ ఉంటాయి." 247 00:17:27,756 --> 00:17:29,508 "చల్లటి పిల్ల గాలులు వీచే ఆ దారుల్లో…" 248 00:17:30,050 --> 00:17:31,552 చాలా బాగుంది. 249 00:17:42,145 --> 00:17:43,397 క్యాక్టస్. 250 00:17:44,356 --> 00:17:47,609 హా… నా స్నేహితుడు ఒకడు ఇచ్చాడు. 251 00:17:47,693 --> 00:17:48,694 బాగుంది. 252 00:17:52,030 --> 00:17:54,074 నా రూంలో రికార్డ్ ప్లేయర్ లేదే. 253 00:17:54,157 --> 00:17:56,034 నీ రూంలో ఎందుకు ఉంది? 254 00:17:56,118 --> 00:17:57,369 ఏమో మరి. 255 00:17:57,452 --> 00:17:59,288 నీ దగ్గర రికార్డ్ లేబుల్స్ ఏమైనా ఉన్నాయా? 256 00:17:59,371 --> 00:18:00,831 లేవు. 257 00:18:00,914 --> 00:18:02,833 అయినా కానీ, నీకు రికార్డ్ ప్లేయర్ ఇచ్చారా? 258 00:18:02,916 --> 00:18:04,293 అది న్యాయం కాదు. 259 00:18:06,795 --> 00:18:08,255 మీ ఊరు ఏది? 260 00:18:08,338 --> 00:18:11,008 ప్రశ్నలు మళ్లీ మొదలుపెట్టాడురోయ్. 261 00:18:11,925 --> 00:18:14,720 పెన్సిల్వేనియాలోని మెరియన్. ఫిలడెల్ఫియా బయటే ఉంటుంది. 262 00:18:16,430 --> 00:18:17,681 తోబుట్టువులు ఎవరూ లేరా? 263 00:18:17,764 --> 00:18:19,474 తోబుట్టువులు లేరు, పిల్లలు కూడా లేరు. 264 00:18:20,058 --> 00:18:21,059 నేను ఒక్కదాన్నే. 265 00:18:21,143 --> 00:18:22,477 అమ్మానాన్నలు? 266 00:18:22,561 --> 00:18:23,562 మా మధ్య మాటలు లేవు. 267 00:18:24,438 --> 00:18:25,439 ఎందుకని? 268 00:18:26,148 --> 00:18:27,149 సవాలక్ష కారణాలు ఉన్నాయిలే. 269 00:18:28,901 --> 00:18:30,694 నేను చేసే పని వాళ్లకి నచ్చదు. 270 00:18:30,777 --> 00:18:33,697 నువ్వు ఇష్టంగా చేసే సమాజ సేవ అంటే వాళ్లకి ఇష్టం లేదా? 271 00:18:33,780 --> 00:18:35,282 దారుణం కదా? 272 00:18:35,991 --> 00:18:37,117 వాళ్ళు సంప్రదాయవాదులు. 273 00:18:38,785 --> 00:18:44,499 ఎప్పుడో కాలం చెల్లిన ఆ పాత పద్ధతుల ప్రకారం నన్ను బతకమంటారు… 274 00:18:45,375 --> 00:18:46,960 ఎలాంటి కాలంలో అంటే… 275 00:18:47,044 --> 00:18:48,337 ఏమో అబ్బా. 276 00:18:49,046 --> 00:18:50,380 సంక్లిష్టంగా లేని కాలంలో అనుకో. 277 00:18:51,632 --> 00:18:55,177 కానీ నేను అలా ఉండలేను, ఉండను కూడా, అందుకని మా మధ్య మాటలు లేవు. 278 00:18:57,095 --> 00:18:58,388 అయ్యయ్యో. 279 00:18:59,848 --> 00:19:01,433 నేను నీకు ఇదంతా చెప్పకూడదు. 280 00:19:01,517 --> 00:19:03,810 అరె, ఎందుకు చెప్పకూడదు? 281 00:19:04,937 --> 00:19:06,480 ఎందుకంటే నువ్వు అపరిచితుడివి. 282 00:19:06,563 --> 00:19:08,190 ఇందాకే నీ ఫోన్ నంబర్ నాకు దొరికింది. 283 00:19:09,816 --> 00:19:12,486 - నాకు మింట్ చిప్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. - ఓకే. 284 00:19:13,946 --> 00:19:15,656 ఇప్పుడు నీ వంతు. మీది ఏ ఊరు? 285 00:19:18,367 --> 00:19:21,620 - అది అడగవద్దులే. - ఏంటి? దానికన్నా సులభమైన ప్రశ్న ఉంటుందా? 286 00:19:21,703 --> 00:19:24,498 ఉంటుంది, నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్, పిస్తా అనే సమాధానాన్ని ఇంకా సులభంగా చెప్పగలను. 287 00:19:24,998 --> 00:19:25,874 ఫ్యామిలీ? 288 00:19:27,292 --> 00:19:28,293 చెల్లి. 289 00:19:29,086 --> 00:19:30,087 తన పేరు జెన్. 290 00:19:30,587 --> 00:19:31,713 ఎలా ఉంటుంది తను? 291 00:19:32,256 --> 00:19:33,507 తను… 292 00:19:35,092 --> 00:19:36,260 తనేం… 293 00:19:39,513 --> 00:19:42,099 తను… తను తెలివైనది. 294 00:19:43,517 --> 00:19:44,768 చాలా తెలివైనది అన్నమాట. 295 00:19:44,852 --> 00:19:45,853 తనకి… 296 00:19:45,936 --> 00:19:48,981 పజిల్స్ అంటే ఇష్టం, అదే, చిక్కుముళ్లని విప్పడం ఇష్టం అన్నమాట, 297 00:19:50,482 --> 00:19:51,817 తన అభిప్రాయాలను చాలా బలంగా చెప్పేది. 298 00:19:52,943 --> 00:19:56,196 అంటే, తనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, వాటితో… 299 00:19:57,531 --> 00:19:59,157 మనం ఏకీభవించేదాకా తను నిద్రే పోదు. 300 00:20:00,075 --> 00:20:03,412 తను ఒప్పించేలా మాట్లాడేది, కాబట్టి మనం ఏకీభవించే అవకాశం ఉంది. 301 00:20:04,746 --> 00:20:05,747 హా. 302 00:20:06,456 --> 00:20:07,708 చాలా మంచిది. 303 00:20:09,042 --> 00:20:11,962 ప్రేమించే గుణం ఉంది. ఎంత ప్రేమిస్తుందో, అంతే కఠినంగా ఉంటుంది కూడా. 304 00:20:13,422 --> 00:20:14,923 నాకు గుర్తున్న మొదటి జ్ఞాపకం ఏంటంటే… 305 00:20:15,966 --> 00:20:19,344 నాకు గుర్తొచ్చే మొదటి ఫీలింగ్ ఏంటంటే, 306 00:20:20,554 --> 00:20:22,431 ఏది ఏమైనా సరే, తనని నిరుత్సాహపరచకూడదు అని. 307 00:20:23,557 --> 00:20:24,850 తను… 308 00:20:26,018 --> 00:20:27,519 తను చాలా గొప్పదిలే. 309 00:20:29,855 --> 00:20:32,274 తనకి… తనకి ఏమైంది? 310 00:20:34,318 --> 00:20:35,569 ఏమో. 311 00:20:36,778 --> 00:20:38,197 తను… తను చనిపోయింది. 312 00:20:42,701 --> 00:20:43,827 అయ్యయ్యో. 313 00:20:44,494 --> 00:20:45,787 అది చాలా దారుణం. 314 00:20:46,538 --> 00:20:48,624 అవును. దారుణమైనదే అది. 315 00:20:52,002 --> 00:20:53,086 హా. 316 00:21:01,762 --> 00:21:03,180 ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ తిందామా? 317 00:21:07,809 --> 00:21:09,478 - తప్పకుండా. - ఓకేనా? 318 00:21:09,561 --> 00:21:10,562 - ఓకే. - సరే. 319 00:21:10,646 --> 00:21:12,064 ఆ పని చేద్దాం. 320 00:21:17,528 --> 00:21:21,156 శామ్ కుకీ పోట్రెయిట్ ఆఫ్ ఎ లెజెండ్ 1951-1964 321 00:21:21,240 --> 00:21:24,868 బ్రెంటన్ వుడ్ ఊగమ్ బూగమ్ 322 00:21:51,436 --> 00:21:53,397 - టామ్? - సెర్గీ చనిపోయాడు. 323 00:21:57,776 --> 00:22:00,279 - ఇప్పుడు ఒకసారి కలవగలవా? - హా, లాబీలోనే ఉన్నా. 324 00:22:06,159 --> 00:22:11,498 అతను విమానంలో మయామీకి వెళ్తూ ఉండగా చార్లెస్ లేక్ దగ్గర అది కూలిపోయింది. 325 00:22:12,165 --> 00:22:16,086 అక్కడి పొగమంచు వల్లనో, పిడుగు తాకడం వల్లనో అంటున్నారు, కానీ అప్పుడే పక్కాగా చెప్పలేం. 326 00:22:16,170 --> 00:22:18,297 అందరి ప్రాణాలూ పోయాయని అంటున్నారా? నువ్వు ఎవరూ బతకలేదని అన్నావా? 327 00:22:18,380 --> 00:22:19,464 అవును, అందరి ప్రాణాలూ పోయాయట. 328 00:22:20,841 --> 00:22:22,342 అతనితో పాటు సిబ్బందిలో ఎవరి ప్రాణాలూ మిగల్లేదు. 329 00:22:25,596 --> 00:22:28,599 మరి అతని కొడుకు డియేగో సంగతేంటి? 330 00:22:28,682 --> 00:22:31,310 - అతనెప్పుడూ నాన్నతో తిరుగుతూ ఉంటాడు. - చూస్తా ఆగు. 331 00:22:32,686 --> 00:22:33,896 అతను ఆ విమానాన్ని ఎక్కి ఉండడు. 332 00:22:33,979 --> 00:22:36,273 ముగ్గురు చనిపోయారట, అందులో ఇద్దరు సిబ్బంది అట. 333 00:22:36,356 --> 00:22:37,482 కాబట్టి, నీ అంచనా సరైనదే. 334 00:22:42,779 --> 00:22:44,573 ఫైర్ సేల్ దందాని డియేగో నడుపుతున్నాడు. 335 00:22:46,325 --> 00:22:48,952 సెర్గీ కాదు, అసలు సెర్గీకి దానితో లింకే లేదు. దాన్ని నేనెందుకు గ్రహించలేకపోయా? 336 00:22:49,036 --> 00:22:50,329 అది నేను తెలుసుకొని ఉండాల్సింది. 337 00:22:50,412 --> 00:22:51,788 సరే, నువ్వు తెలివైనోడివే, కానీ పర్ఫెక్ట్ కాదుగా. 338 00:22:51,872 --> 00:22:54,750 హా, అది నాకు తెలుసు. తెలుసు. దీని వల్ల ఇప్పుడు డ్యానీ బయటకు రాడు, టామ్. 339 00:22:55,250 --> 00:22:58,712 అది అర్థమవుతోందా నీకు? నేను ఓ సమాధానంతో వేగాని కలవాలి… 340 00:22:58,795 --> 00:22:59,880 ఇంకో ఎనిమిది గంటల్లో. 341 00:22:59,963 --> 00:23:00,964 అదీ సంగతి. 342 00:23:04,760 --> 00:23:06,929 చెప్పు, గురూ. నేను ఏమైనా చేయగలనా? 343 00:23:11,558 --> 00:23:12,559 ఏమో, తెలీట్లేదు. 344 00:23:20,609 --> 00:23:21,985 సెర్గీ పక్కాగా గట్టెక్కిస్తాడని అనుకోలేదులే. 345 00:23:23,278 --> 00:23:25,864 అంటే, అది మనకు ముందే తెలుసు కదా. 346 00:23:26,782 --> 00:23:29,243 అంటే, ఇప్పుడు మనం… మనం ప్రత్యామ్నాయ ప్లాన్ ప్రకారం పోవాలి అనుకుంటా. 347 00:23:30,410 --> 00:23:31,411 సరే, మంచిది. 348 00:23:42,005 --> 00:23:43,423 హేయ్, పని అయిపోతుందిలే. 349 00:23:43,924 --> 00:23:46,176 ఇది తప్పదని మనకి తెలుసు, కదా? 350 00:23:49,346 --> 00:23:50,681 హా, అవును. అవును. 351 00:24:00,148 --> 00:24:01,733 ముందుగా బాక్సింగ్ లోకి అడుగుపెట్టింది నేనే, తెలుసా? 352 00:24:02,317 --> 00:24:03,735 డ్యానీ కంటే చాలా ముందే అడుగుపెట్టా. 353 00:24:05,070 --> 00:24:06,780 యూత్ సెక్షనల్స్ లో ఎంపికయ్యా. 354 00:24:06,864 --> 00:24:08,282 యూత్ రీజనల్స్ లో ఎంపికయ్యా. 355 00:24:09,324 --> 00:24:12,828 ఒకడైతే నేను మ్యూంగ్-వూ యా అంతటి వాడిని అవుతానని అనేశాడు. 356 00:24:14,371 --> 00:24:15,706 ప్యాకియా అంతటి వాడిని కూడా కావచ్చని అన్నాడు. 357 00:24:16,456 --> 00:24:19,126 - నా మీద అంచనాలు తారాస్థాయిలో ఉండేవి, తెలుసా? - నువ్వు నన్ను కాలుస్తూనే ఉన్నావు. 358 00:24:19,209 --> 00:24:20,252 సారీ. 359 00:24:23,714 --> 00:24:24,715 కానీ నేను అంతా చెడగొట్టేసుకున్నా. 360 00:24:26,133 --> 00:24:30,596 నా చేతిని విరగ్గొట్టుకున్నా, ఇక "ఇదిగో కొన్ని మందులు వాడు" అని చేతిలో పెట్టారు. 361 00:24:30,679 --> 00:24:32,806 ఇక ఆ తర్వాత వేరే గొడవలు కూడా మొదలయ్యాయి, 362 00:24:32,890 --> 00:24:37,811 అంటే, అమ్మకేమో క్యాన్సర్ వచ్చింది, నాన్నేమో అస్సలు పట్టించుకునే వాడే కాదు. 363 00:24:37,895 --> 00:24:42,024 ఆ తర్వాత నా చేయి ఇంకోసారి విరిగింది, "ఇంకొన్ని మందులు వాడు" అని మళ్లీ చేతిలో పెట్టారు, 364 00:24:42,107 --> 00:24:43,567 అలా అనేక ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 365 00:24:43,650 --> 00:24:46,320 - రాత్రంతా ఈ గేమ్స్ ఆడుతూనే ఉన్నారా? - నన్నేం అనవద్దు. 366 00:24:46,945 --> 00:24:48,739 ఇన్ సోమ్నియా, భయ్యా. నిద్ర పట్టట్లేదు. 367 00:24:51,617 --> 00:24:52,701 నాకంటూ మిగిలింది డ్యానీ ఒక్కడే. 368 00:24:53,285 --> 00:24:56,580 వాడితో ఉండటం, వాడు ఎదుగుతుంటే చూడటం. 369 00:24:57,998 --> 00:25:00,083 నా జీవితంలో ఏదైనా మంచి విషయం ఉందంటే, అదే. 370 00:25:01,335 --> 00:25:04,046 - ఇప్పుడు దాన్ని కూడా చెడదొబ్బుకుంటున్నా. - అలా ఏం జరగదు. ఏమీ కాదు. 371 00:25:04,129 --> 00:25:05,506 నా చేయి పడితే, ఏదైనా భస్మం అయిపోవాల్సిందే. 372 00:25:05,589 --> 00:25:07,674 ఆపవయ్యా. నువ్వు కూడా మా చెల్లిలా మాట్లాడుతున్నావు. 373 00:25:07,758 --> 00:25:08,759 మీ చెల్లిలానా? 374 00:25:08,842 --> 00:25:10,511 హా, వరుసగా సాకులు చెప్తున్నావు. 375 00:25:11,136 --> 00:25:12,554 మా అమ్మ అని, నా చేయి అని, మందులు అని. 376 00:25:13,931 --> 00:25:17,267 ప్రపంచంలో బాధలన్నీ నువ్వే భరిస్తున్నట్టు చెప్తున్నావు. 377 00:25:17,351 --> 00:25:20,395 కాబట్టి, నీ మీద జాలి కురిపించేసి, నిన్ను సమస్యల నుండి గట్టెక్కించాలా? 378 00:25:21,396 --> 00:25:23,065 - అమూల్ బేబీవి నువ్వు. - వామ్మోయ్. 379 00:25:23,148 --> 00:25:25,901 నీ కోసం ఇప్పుడు షుగర్ ఏం చేయడానికి సిద్ధమవుతున్నాడో తెలుసా? 380 00:25:27,069 --> 00:25:28,946 నీ కోసం ఏం త్యాగం చేయడానికి సిద్ధమవుతున్నాడో తెలుసా? 381 00:25:29,530 --> 00:25:30,531 ఎందుకో తెలుసా? 382 00:25:32,115 --> 00:25:33,909 నువ్వు గొప్పోడివని అంతా చేస్తున్నాడు అనుకుంటున్నావా? 383 00:25:37,037 --> 00:25:39,289 సాటి మనిషికి ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు. 384 00:25:41,083 --> 00:25:42,376 జీవితంలో ఎప్పుడైనా నువ్వూ అలాంటి పని చేయ్. 385 00:25:43,293 --> 00:25:45,170 నువ్వు పెద్ద పనికిమాలినదానివి, తెలుసా? 386 00:25:46,755 --> 00:25:47,965 నువ్వు ఏమీ చేతకాని చవటవి. 387 00:25:48,549 --> 00:25:50,217 పనికిమాలినోడిలా ఉండటం కన్నా అలా ఉండటమే మేలు. 388 00:25:50,300 --> 00:25:52,302 చేతకాని చవటలానే మాట్లాడావు ఇప్పుడు కూడా. 389 00:25:55,305 --> 00:25:56,306 బాసూ. 390 00:25:58,517 --> 00:26:00,185 బాసూ. కాస్త కవర్ చేయ్ నన్ను. 391 00:26:20,414 --> 00:26:23,083 ఫ్రాంక్స్ రెస్టారెంట్ ఫ్రాంక్స్ - కాఫీ షాప్ - పైస్ 392 00:26:50,694 --> 00:26:51,904 అన్నయ్యని అప్పగించట్లేదా? 393 00:26:52,696 --> 00:26:54,072 అప్పగించట్లేదు. 394 00:26:54,156 --> 00:26:55,449 లేదా? మరి నీ ప్లాన్ ఏంటి? 395 00:27:11,590 --> 00:27:12,799 పాస్ పోర్ట్ 396 00:27:12,883 --> 00:27:14,051 పనామా పాస్ పోర్టులా, హా? 397 00:27:14,134 --> 00:27:16,094 అవును, నీకు ఒకటి, నీ కూతురికి ఒకటి. 398 00:27:16,178 --> 00:27:18,764 నీ మాజీ భార్యని తీసుకెళ్లాలనుకుంటే, తన పాస్ పోర్ట్ కూడా అందులో ఉంది. 399 00:27:25,938 --> 00:27:28,482 అది ప్లాయా కోరొనాడోలో ఓ విల్లాకి సంబంధించిన పత్రం. 400 00:27:28,565 --> 00:27:30,609 అది నా స్నేహితుడిదే. ఇప్పుడు అతనికి అవసరం లేదట. 401 00:27:30,692 --> 00:27:32,611 ఆ విల్లా బాగుంటుంది. బీచ్ పక్కనే ఉంటుంది. 402 00:27:32,694 --> 00:27:34,112 ఆ రోడ్ చివర ఓ గోల్ఫ్ కోర్స్ కూడా ఉంటుంది. 403 00:27:36,114 --> 00:27:38,283 - అది బ్యాంక్ అకౌంట్. - "బ్యాంకో బనీస్తమో." 404 00:27:38,825 --> 00:27:40,244 అవును, డబ్బు కావాలి కదా. 405 00:27:45,749 --> 00:27:46,917 ఇది చాలా పెద్ద ఆఫర్. 406 00:27:48,460 --> 00:27:49,586 దీన్ని లంచం అంటారు. 407 00:27:50,879 --> 00:27:52,130 నా మనస్సులో ఆ ఉద్దేశం లేదు. 408 00:27:53,131 --> 00:27:54,132 అందరూ మంచివాళ్లే. 409 00:27:55,592 --> 00:27:57,135 చిన్నప్పట్నుంచీ నాకు అదే నేర్పారు. 410 00:27:58,303 --> 00:28:00,180 మొదట్లో అందరి మనస్సులు స్వచ్ఛంగా ఉంటాయి. 411 00:28:02,015 --> 00:28:04,518 ఇక ప్రపంచంలోకి అడుగుపెట్టి బతుకు బండిని లాగించే క్రమంలో, 412 00:28:04,601 --> 00:28:07,604 మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, వాటి వల్ల మన అసలైన వ్యక్తిత్వాలకి దూరమవుతుంటాం. 413 00:28:08,981 --> 00:28:13,151 కానీ, మనం సమయం మించిపోయేలోపు ఆ దారి నుండి తప్పుకోకపోతే, 414 00:28:13,235 --> 00:28:15,654 మనం దాన్ని వదిలేయకపోతే, 415 00:28:17,281 --> 00:28:20,200 మనం… మనం మన అసలైన వ్యక్తిత్వాలకి శాశ్వతంగా దూరమైనట్టే. 416 00:28:28,542 --> 00:28:30,460 ఇప్పుడు ఆ దారి నుండి తప్పుకునే అవకాశం నీ ముందుంది, రే. 417 00:28:40,387 --> 00:28:41,972 నువ్వు అన్నదంతా నిజమే. 418 00:28:44,224 --> 00:28:46,018 చాలా వరకు నిజమే. 419 00:28:50,355 --> 00:28:51,356 అవును. 420 00:28:53,567 --> 00:28:57,988 నేను పోలీస్ అకాడమీ నుండి గ్రాడ్యుయేట్ అయినప్పుడు మా నాన్న ముఖంలో ఆనందం నాకిప్పటికీ గుర్తుంది. 421 00:28:58,071 --> 00:29:01,325 నా గురించి గర్వంగా చెప్పుకోవాలని ఆయన ఎన్నాళ్ళ నుంచో ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నాడు. 422 00:29:06,872 --> 00:29:08,498 కానీ ఆ క్షణం ఉందే, అది… 423 00:29:09,666 --> 00:29:11,001 నువ్వు అప్పుడు మంచి వైపే ఉన్నావు. 424 00:29:14,630 --> 00:29:15,964 ఇప్పుడు మళ్లీ అలా ఉండవచ్చు. 425 00:29:17,591 --> 00:29:19,218 అప్పుడు నీలో ఆ సత్తా ఉంది. ఇప్పటికీ ఉంది. 426 00:29:29,019 --> 00:29:30,687 ఈ ఆఫర్ ని తీసుకో. తీసుకొని దూరంగా వెళ్లిపో. 427 00:29:33,315 --> 00:29:34,983 కొత్త జీవితం ప్రారంభించు. 428 00:29:43,867 --> 00:29:44,952 హా, కానీ… 429 00:29:46,328 --> 00:29:48,080 థ్యాంక్స్, బాసూ, కానీ లాస్ ఏంజలెస్ ని వదిలి వెళ్లలేను. 430 00:29:49,289 --> 00:29:51,667 వద్దు, ఇలా చేయకు. ఇంత మంచిగా చెప్పాక కూడా ఇలా చేస్తావే? 431 00:29:53,293 --> 00:29:54,628 ప్లీజ్. 432 00:29:55,337 --> 00:29:56,380 ఈ ఆఫర్ తీసుకుని, వెళ్లిపో. 433 00:29:59,883 --> 00:30:02,135 - జీ ఎక్కడ ఉన్నాడు? - అతడిని అప్పగించేది లేదని చెప్పాగా. 434 00:30:02,219 --> 00:30:04,888 అయితే, నేను జైలుకు వెళ్లి, డ్యానీ సెల్ తలుపులు తెరిచి, 435 00:30:04,972 --> 00:30:06,598 ఇతర ఖైదీలని లోపలికి పంపించి, ఊచకోత కోయిస్తా. ఏమంటావు? 436 00:30:06,682 --> 00:30:08,851 నేను "జీ"ని నా దగ్గరే ఉంచుకుంటా. అతను ఇచ్చే వాంగ్మూలం వల్ల 437 00:30:08,934 --> 00:30:11,270 జీవితాంతం ఊచలు లెక్క పెట్టే పరిస్థితి నీకు రాకూడదని దండం పెట్టుకో. 438 00:30:12,354 --> 00:30:13,814 స్టేట్ జైల్లో నిన్ను కాపాడటానికి షెరిఫ్ గార్డులు ఉండరు. 439 00:30:13,897 --> 00:30:15,941 ఇక పెలికన్ బే జైల్లో నీకు రక్త కన్నీరే. 440 00:30:21,738 --> 00:30:23,031 మరి ఇప్పుడేం చేద్దామంటావు? 441 00:30:27,452 --> 00:30:28,787 చూడు, నీ దోస్త్ వచ్చేసింది. 442 00:30:31,373 --> 00:30:32,708 తనకేం కావాలో ఏంటో, హా? 443 00:30:32,791 --> 00:30:33,876 తను ఆగగలదులే. 444 00:30:37,129 --> 00:30:38,130 లేదు, ఒకటి చెప్పనా? 445 00:30:38,630 --> 00:30:40,132 ప్రస్తుతానికి దీన్ని పక్కకు పెట్టేద్దాం. 446 00:30:41,175 --> 00:30:43,802 తను కాస్త కంగారుగా ఉంది. మీరు మాట్లాడుకుంటే మంచిదేమో. 447 00:30:43,886 --> 00:30:45,179 రే. 448 00:30:46,138 --> 00:30:48,056 సరే మరి. మళ్లీ కలుద్దాం, గురూ. 449 00:30:52,019 --> 00:30:53,228 చివరి అవకాశం నీకు ఇది. 450 00:30:53,312 --> 00:30:56,982 నువ్వు ఆ ముక్క చాలాసార్లు చెప్పావులే, నాకు అలా ఏం అనిపించట్లేదు. 451 00:31:21,256 --> 00:31:23,008 - …వీడియో గేమ్స్… - వీడియో గేమ్స్ ఆడుతూ ఉన్నారా? 452 00:31:23,091 --> 00:31:25,719 - నీకు ఒకే ఒక్క పని అప్పగించా. - తెలుసు. సారీ. 453 00:31:26,261 --> 00:31:27,930 సర్లే. అయితే మనం… 454 00:31:30,057 --> 00:31:32,935 అతను… అతను ఎక్కడికి వెళ్లాడో ఏమో. 455 00:31:33,018 --> 00:31:34,853 సరే, మనం అంతా మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టాల్సిందే. 456 00:31:34,937 --> 00:31:37,689 అతను తరచుగా వెళ్లే… ప్రతి అడ్డా మీద పడాలి మనం, 457 00:31:37,773 --> 00:31:40,359 డ్రగ్స్ కొనే స్థలాలకి వెళ్లాలి, పూల్ హాల్ కి వెళ్లాలి, అన్ని చోట్లా వెతకాల్సిందే. 458 00:31:42,986 --> 00:31:45,239 నువ్వన్నది నిజమే. వాడు వాళ్ల దగ్గరి నుండి పారిపోయాడు. 459 00:31:46,573 --> 00:31:47,574 మళ్లీ ప్లే చేయ్. 460 00:31:48,325 --> 00:31:49,910 - మొత్తాన్నా? - అవును. 461 00:31:53,789 --> 00:31:55,499 - ఏం చేస్తున్నావు? - అతను ఎటో వెళ్లిపోయాడు. 462 00:31:55,582 --> 00:31:57,626 - ఎటో వెళ్లిపోయాడంటే? - అంటే, ఎటో దొబ్బేశాడు. 463 00:31:57,709 --> 00:31:58,877 నా కారును దొంగిలించి, ఎటో చెక్కేశాడు. 464 00:31:59,378 --> 00:32:01,338 వాల్, నువ్వు అతడిని గమనిస్తూ ఉండాలి కదా. 465 00:32:01,421 --> 00:32:02,422 తెలుసు. సారీ. 466 00:32:02,506 --> 00:32:05,384 అతడిని గమనిస్తూనే ఉన్నా, పొద్దుపోయే దాకా నిద్ర పోలేదు మేము. 467 00:32:05,467 --> 00:32:07,594 - మేము వీడియో గేమ్స్ ఆడుతూ… - వీడియో గేమ్స్ ఆడుతూ ఉన్నారా? 468 00:32:07,678 --> 00:32:10,138 - నీకు ఒకే ఒక్క పని అప్పగించా. - తెలుసు. సారీ. 469 00:32:10,848 --> 00:32:11,849 - బాస్. - సర్లే. 470 00:32:11,932 --> 00:32:13,308 - అయితే మనం… - ఫోన్ వచ్చింది. 471 00:32:14,852 --> 00:32:15,853 అతను… 472 00:32:15,936 --> 00:32:17,479 లెఫ్టినెంట్ వేగా. 473 00:32:17,563 --> 00:32:18,814 నీ ఫోన్ నంబర్ ఏంటి? 474 00:32:19,690 --> 00:32:21,149 నువ్వు ఎవరు? 475 00:32:21,233 --> 00:32:22,484 అది నీకు తెలుసు. 476 00:32:22,568 --> 00:32:24,653 నీ నంబర్ ఇవ్వు, నీకు వీడియో కాల్ చేస్తా. 477 00:32:29,700 --> 00:32:32,035 హేయ్. నిన్ను మళ్లీ చూడటం బాగుంది. 478 00:32:32,119 --> 00:32:33,120 బాగానే ఉంటుందిలే. 479 00:32:34,329 --> 00:32:35,747 నువ్వు షుగర్ దగ్గర ఉన్నావు అనుకున్నా. 480 00:32:36,373 --> 00:32:38,208 - లేదు. - మరి అతను ఎక్కడ ఉన్నాడు? 481 00:32:38,292 --> 00:32:40,919 వాడికి, నీకు, నా జీవితానికి శతకోటి దండాలు. 482 00:32:42,212 --> 00:32:43,463 ఓకే. 483 00:32:45,966 --> 00:32:48,302 ఈ జీవితం మీద విరక్తి పుడుతోంది, బాసూ. 484 00:32:48,886 --> 00:32:51,388 అన్నింటినీ పాడు చేసే ఒక చెత్తగాడిలా మిగిలిపోవడం నచ్చట్లేదు. 485 00:32:53,223 --> 00:32:57,144 ఒక్కసారి, జీవితంలో ఒక్కటంటే ఒక్కసారి ఓ మంచి పని చేద్దామనుకుంటున్నా. 486 00:32:57,227 --> 00:32:59,980 ఐడియా బాగానే ఉంది. ఇంతకీ ఏం… ఏం చేద్దామనుకుంటున్నావు? 487 00:33:00,063 --> 00:33:01,148 నీకు ఎక్స్ ఛేంజ్ కావాలి కదా? 488 00:33:02,024 --> 00:33:03,317 అదే చేద్దాం. 489 00:33:03,400 --> 00:33:04,735 నా తమ్ముడికి బదులుగా నన్ను తీసుకో. 490 00:33:05,319 --> 00:33:10,157 డ్రామాలు వద్దు, మోసాలు గట్రా ఏమీ వద్దు. 491 00:33:10,240 --> 00:33:12,743 నువ్వు, నేను, డ్యానీ, అంతే. మన మధ్యే అంతా. 492 00:33:13,952 --> 00:33:15,245 కరెక్టే, అలాగే కానిద్దాం. 493 00:33:18,081 --> 00:33:19,416 ఇంతకీ ఎక్కడున్నావు? 494 00:33:45,526 --> 00:33:47,694 హేయ్, మీ అన్నయ్య విషయంలో సారీ. చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఇది. 495 00:33:52,449 --> 00:33:55,911 కానీ నిజం చెప్పాలంటే, అతను నీకు మంచి చేయాలని చూస్తున్నాడు, 496 00:33:55,994 --> 00:33:57,287 కాబట్టి అతనికి విలువ ఇవ్వాలి. 497 00:33:58,956 --> 00:34:01,542 చెప్పాలంటే, ఇది అతని చివరి కోరిక లాంటిది అనుకో. 498 00:34:06,213 --> 00:34:08,215 అరె! 499 00:34:13,804 --> 00:34:14,804 ఏం చేస్తున్నావు? 500 00:34:15,973 --> 00:34:17,349 నీకే దెబ్బలు తగులుతాయి. 501 00:34:42,373 --> 00:34:43,583 ఎలా ఉంది? బాగుందా? 502 00:35:10,694 --> 00:35:11,945 ఇప్పుడే వస్తా, ఆగు. 503 00:35:29,213 --> 00:35:30,380 హేయ్, జీ? 504 00:35:42,643 --> 00:35:45,103 హేయ్. మీ తమ్ముడిని తీసుకొచ్చా. 505 00:36:53,547 --> 00:36:55,048 ఈ డ్రగ్స్ పిచ్చోడిని తగలబెట్టా! 506 00:37:25,329 --> 00:37:27,414 సరే, ప్లాన్ మారింది. 507 00:37:43,680 --> 00:37:44,765 నీ యెంకమ్మ! 508 00:38:55,085 --> 00:38:56,128 చెప్పా కదా. 509 00:38:59,089 --> 00:39:00,090 చెప్పా కదా. 510 00:40:25,634 --> 00:40:26,718 జీ! 511 00:40:28,262 --> 00:40:29,263 డ్యానీ! 512 00:40:39,189 --> 00:40:41,900 నిన్ను మళ్లీ చూడలేనేమో అనుకున్నా, బ్రో! 513 00:40:42,943 --> 00:40:44,027 హేయ్, ఏమైంది? 514 00:40:44,111 --> 00:40:45,988 ఏమీ కాలేదులే, నేను బాగానే ఉన్నా, బాగానే ఉన్నా. 515 00:40:48,490 --> 00:40:49,741 నన్ను క్షమించు. 516 00:41:19,313 --> 00:41:21,940 - ఓకే, జో, చాలు ఇక. - కానివ్వు, మ్యాక్సీ. 517 00:41:22,482 --> 00:41:24,985 ఇప్పటిదాకా అయిదు రౌండులే అయ్యాయి. ఇంకో రెండు రౌండులకి అవకాశమివ్వవా? 518 00:41:25,777 --> 00:41:27,321 చెప్పా కదా. ఇప్పటికి ఇక చాలు. 519 00:41:28,447 --> 00:41:31,116 ఒక విషయం గుర్తుంచుకో, అది షెరిఫ్ అడ్డా. 520 00:41:31,200 --> 00:41:32,201 తప్పకుండా వాళ్ల నిఘా ఉంటుంది. 521 00:41:32,284 --> 00:41:33,785 హా. గట్టిగానే ఉంటుంది. 522 00:41:33,869 --> 00:41:35,579 దహనం చేసేశాడు, నేను అన్నది అదే. 523 00:41:35,662 --> 00:41:37,289 మీరు నన్ను ఇక్కడ మాటల్లో పెట్టి కాలక్షేపం చేస్తున్నారు, 524 00:41:37,372 --> 00:41:39,541 ఈలోపు ఆ కార్కుల్ గాడు నా బాడీని విమానంలోంచి దించేసి, దహనం చేసేశాడు. 525 00:41:44,004 --> 00:41:46,215 - ఎటో వెళ్లిపోయాడంటే? - అంటే, ఎటో దొబ్బేశాడు. 526 00:41:46,298 --> 00:41:48,759 - నా కారును దొంగిలించి, ఎటో చెక్కేశాడు. - వాల్, నువ్వు అతడిని గమనిస్తూ ఉండాలి కదా. 527 00:41:48,842 --> 00:41:51,178 తెలుసు, కానీ మేము పొద్దుపోయే దాకా వీడియో గేమ్స్ ఆడుతూ ఉన్నాం. 528 00:41:51,261 --> 00:41:53,805 - నిన్ను మళ్లీ తీసుకెళ్లిపోతున్నా. - హా, కానీ అది అసాధ్యం. 529 00:41:53,889 --> 00:41:55,682 ఇప్పుడే చెప్పాం కదా? నా బాడీ లేదు ఇప్పుడు. 530 00:41:55,766 --> 00:41:57,434 దానిదేముందిలే! నీకు ఇంకో బాడీని ఏర్పాటు చేస్తా. 531 00:41:58,143 --> 00:41:59,686 - ఏం చేస్తావు? - ఇంకో బాడీని ఏర్పాటు చేస్తావా? 532 00:41:59,770 --> 00:42:01,355 నేను ఇప్పుడు చెప్పింది అదే కదా. పద, జోసెఫ్. 533 00:42:01,438 --> 00:42:03,690 ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇదేం డీల్ అసలు? 534 00:42:03,774 --> 00:42:04,775 సిగ్నల్ లేదు 535 00:42:05,734 --> 00:42:07,236 అతనికి పునర్జన్మని ఇవ్వలేమా? 536 00:42:09,905 --> 00:42:11,865 మళ్లీ ఆ పంచాయితీని భరించడం నా వల్ల కాదు. 537 00:42:12,449 --> 00:42:15,369 డ్రామాలు వద్దు, సరేనా? మోసాలు గట్రా ఏమీ వద్దు. 538 00:42:15,452 --> 00:42:17,621 నువ్వు, నేను, డ్యానీ, అంతే. మన మధ్యే అంతా. 539 00:42:17,704 --> 00:42:19,039 కరెక్టే, అలాగే కానిద్దాం. 540 00:42:19,122 --> 00:42:20,207 ఇంతకీ ఎక్కడున్నావు? 541 00:42:36,265 --> 00:42:37,975 నువ్వు ఆ కారు డిక్కీలోకి వెళ్లి దాక్కో. 542 00:42:38,058 --> 00:42:38,934 సరే. 543 00:42:46,650 --> 00:42:49,486 మిస్టర్ జోర్డన్, నా జీవితంలో అంత అందమైన దాన్ని నేనెప్పుడూ చూడలేదు, స్వర్గంలో కూడా చూడలేదు. 544 00:42:51,864 --> 00:42:53,198 తను కష్టాల్లో ఉంది. 545 00:42:53,740 --> 00:42:58,078 తన తండ్రి కోసం ఒంటరిగా ఇక్కడి దాకా వచ్చి పోరాడుతోందంటే, తన గుండె ధైర్యాన్ని నిజంగా మెచ్చుకోవాలి. 546 00:42:58,161 --> 00:42:59,246 ఆయనంటే ఆమెకి ప్రాణం. 547 00:43:00,205 --> 00:43:01,874 కానీ ఆ రాబందుల్లాంటి వాళ్లను ఆమె ఎదిరించలేదు. 548 00:43:02,791 --> 00:43:05,544 తనకి సాయం కావాలి. చిక్కుల్లో ఉంది తను. ఇక నువ్వు రంగంలోకి దిగడం మంచిది! 549 00:43:06,044 --> 00:43:08,088 తనకి ఫార్న్స్ వర్త్ తప్ప ఇంకెవరూ సాయపడలేరు, జో. 550 00:43:08,172 --> 00:43:09,464 కానీ అతను ఇప్పుడు ప్రాణాలతో లేడు. 551 00:43:10,048 --> 00:43:11,925 కానీ ఆ ఫార్న్స్ వర్త్ వి నువ్వే కావచ్చు కదా. 552 00:43:33,071 --> 00:43:34,573 నిశ్శబ్దంగా ఉన్నావు. 553 00:43:38,577 --> 00:43:40,120 ఎలా ఉన్నావు, జాన్? 554 00:43:42,456 --> 00:43:43,540 బాగానే ఉన్నా. 555 00:43:45,375 --> 00:43:47,169 నీ చర్యలకి పర్యవసానాలు ఏంటో తెలుసు, కదా? 556 00:43:50,589 --> 00:43:54,718 ఆ పరిస్థితిలో నాకు అలా చేయక తప్పలేదు. మరో దారి లేకుండా పోయింది. 557 00:44:01,099 --> 00:44:02,559 ఏమన్నావు? 558 00:44:03,977 --> 00:44:05,020 ఏమీ లేదు. 559 00:44:07,981 --> 00:44:09,316 పడుకోవడానికి రా. 560 00:44:13,362 --> 00:44:15,989 సారీ. కన్నార్పకుండా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. 561 00:44:16,865 --> 00:44:19,076 పర్వాలేదు. నేను కూడా మిమ్మల్ని అలానే చూస్తున్నా. 562 00:44:19,576 --> 00:44:20,827 నాకంతా గందరగోళంగా ఉంది. 563 00:44:21,495 --> 00:44:24,248 నిజానికి, మీకు థ్యాంక్స్ చెప్పడం కంటే కూడా… 564 00:44:25,457 --> 00:44:27,084 మిమ్మల్ని మళ్లీ చూడాలని ఇక్కడికి వచ్చాను. 565 00:44:27,960 --> 00:44:29,419 అది చాలా గొప్ప విషయం. 566 00:44:29,920 --> 00:44:31,547 - చాలా గొప్ప విషయం! - అద్భుతమని చెప్పాలి. 567 00:44:32,297 --> 00:44:33,841 అద్భుతమా? ఎందుకు? 568 00:44:35,050 --> 00:44:37,719 నిజానికి బ్రూస్ ఫార్న్స్ వర్త్ లాంటి పెద్ద మనిషి కూడా మనుషుల గురించి 569 00:44:37,803 --> 00:44:40,389 నేను చిన్నప్పటి నుండి ఎలాగైతే ఆలోచిస్తూ వచ్చానో, అలానే ఆలోచిస్తాడని అనుకోలేదు. 570 00:44:41,098 --> 00:44:43,600 ఎదుటివాళ్లు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటారని నేను అస్సలు ఊహించలేదు. 571 00:44:44,601 --> 00:44:47,604 జీవితాన్ని ఇలా బతకడం కంటే ఇంకేం కావాలంటారు? 572 00:44:48,146 --> 00:44:49,940 అవును, నా ఉద్దేశం కూడా అదే. 573 00:44:51,149 --> 00:44:55,362 కాకపోతే, అలాంటి మంచి గుణం ఎవరిలోనైనా కనిపించినప్పుడు, అదో పెద్ద విషయంలా అనిపిస్తుంది. 574 00:44:57,072 --> 00:44:58,699 అందుకే మిమ్మల్ని అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోతున్నానేమో. 575 00:44:59,700 --> 00:45:00,784 అస్సలు ఆపుకోలేకపోతున్నా. 576 00:45:01,410 --> 00:45:05,038 అకస్మాత్తుగా ఏదో హాయిగా, ఉత్సాహంగా, సంతోషంగా అనిపిస్తోంది. 577 00:45:09,084 --> 00:45:13,046 మీ కళ్లలో ఏదో ఉంది, వాటి వెనుక కూడా ఏదో మాయ ఉంది… 578 00:45:14,131 --> 00:45:16,258 వాటిని చూడటానికే నేను ప్రయత్నిస్తూ ఉన్నా. 579 00:46:19,196 --> 00:46:21,198 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్