1 00:00:35,452 --> 00:00:36,453 ప్రొఫెసర్! 2 00:00:37,955 --> 00:00:38,956 ఏమైంది? 3 00:00:40,040 --> 00:00:41,041 నంబర్ 22! 4 00:00:42,793 --> 00:00:43,794 నాతో రండి! 5 00:00:44,294 --> 00:00:48,215 సైట్ 22 అటకామా ఎడారి, చిలీ 6 00:01:00,686 --> 00:01:01,895 ఇది పని చేసింది. 7 00:01:05,065 --> 00:01:06,066 చాలా బాగుంది. 8 00:01:06,900 --> 00:01:08,776 దీని గురించి పబ్లిష్ చేశాక ఉంటుంది అసలు… 9 00:01:08,777 --> 00:01:10,361 ప్రపంచానికి తెలియజేశాక ఇక మామూలుగా ఉండదు… 10 00:01:10,362 --> 00:01:12,698 దీని గురించి ఎవరికీ తెలీకూడదు. 11 00:01:13,824 --> 00:01:14,825 ఏంటి? 12 00:01:15,325 --> 00:01:17,703 ఇది ఓకే అని తెలిశాక చెప్దాం. 13 00:01:19,121 --> 00:01:22,290 ఇతర పర్యావరణాల్లో కూడా దీన్ని పరీక్షించాలి కదా. 14 00:01:22,291 --> 00:01:23,374 అడవుల్లో, 15 00:01:23,375 --> 00:01:25,335 మహాసముద్రాల్లో, ఆర్కిటిక్ ప్రాంతంలో. 16 00:01:27,838 --> 00:01:29,130 అవును. 17 00:01:29,131 --> 00:01:30,549 అర్థమైంది. 18 00:01:41,602 --> 00:01:43,020 ఇక్కడ చాలా అందంగా ఉంది. 19 00:01:47,649 --> 00:01:49,610 ఎవరది? 20 00:02:08,669 --> 00:02:10,380 - హేయ్. - ఎలా ఉన్నావు? 21 00:02:11,381 --> 00:02:12,382 బాగున్నా. 22 00:02:12,966 --> 00:02:13,967 చెప్పు. 23 00:02:15,427 --> 00:02:19,847 ఈమె, శృంగారం గురించి, అంతేగాక తను ఇక్కడ ఎంత హాయిగా గడుపుతోందో చెప్తోంది. 24 00:02:19,848 --> 00:02:20,933 చెప్పా కదా. 25 00:02:21,600 --> 00:02:24,228 మనలో ఎంతటి పిస్తాలైనా సరే, ఇక్కడికి వస్తే దారి తప్పిపోయే ప్రమాదముంది. 26 00:02:25,854 --> 00:02:27,356 ఎక్కడ ఉన్నావు? వింతగా మాట్లాడుతున్నావే. 27 00:02:29,107 --> 00:02:32,069 అంటే… నేను… నేను ఈమధ్య ఇంగ్లీష్ పెద్దగా మాట్లాడట్లేదులే. 28 00:02:34,071 --> 00:02:36,990 అంతా బాగానే ఉంది. కానీ నాకు వేరే పనుంది. 29 00:02:38,492 --> 00:02:40,285 ఐ లవ్ యూ మరి. 30 00:02:41,537 --> 00:02:43,872 సరే. హా, ఐ లవ్ యూ. 31 00:02:50,879 --> 00:02:52,798 వద్దు, వద్దు! 32 00:02:56,552 --> 00:02:57,678 నువ్వు సాధించావు. 33 00:03:04,434 --> 00:03:05,477 అభినందనలు. 34 00:03:20,242 --> 00:03:22,369 నా, సోదరి. 35 00:04:28,435 --> 00:04:29,436 ఏం చేద్దాం అంటావు? 36 00:04:30,854 --> 00:04:32,481 ఎందుకంటే, నిన్ను ఇప్పుడే చంపి పారేస్తాను. 37 00:04:39,321 --> 00:04:42,741 ఈ ఇహలోక జీవితం తర్వాత మనకు ప్రాప్తించే శాశ్వత జీవితానికి… 38 00:04:45,494 --> 00:04:47,203 …మనల్ని మనం సిద్ధం చేసుకునే క్రమంలో, 39 00:04:47,204 --> 00:04:51,124 మన సోదరసోదరీమణులు మనకు ఒక దిక్సూచిలా నిలుస్తారు. 40 00:04:52,209 --> 00:04:55,545 ఈ కష్టకాలంలో భగవంతుడు మనందరికీ మనోధైర్యాన్ని, శాంతిని, ఓర్పును 41 00:04:55,546 --> 00:04:57,213 అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. 42 00:04:57,214 --> 00:04:58,548 ఇక మన శేష జీవితంలో 43 00:04:58,549 --> 00:05:02,093 అత్యంత విశ్వాసంతో ముందుకు సాగడానికి భగవంతుడు మనందరికీ మనోనిబ్బరాన్ని 44 00:05:02,094 --> 00:05:03,594 అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. 45 00:05:03,595 --> 00:05:05,680 అందుకే, ఈ మనోహరమైన చోట… 46 00:05:05,681 --> 00:05:06,806 అస్థికలు పేరు: తెలియదు 47 00:05:06,807 --> 00:05:10,893 …ఈ అద్భుతమైన క్షణంలో మనం వీరిని స్మరించుకుంటున్నాము, 48 00:05:10,894 --> 00:05:14,188 మా జ్ఞాపకాల్లో మీరు పదిలంగా ఉంటారు. 49 00:05:14,189 --> 00:05:19,069 ఈ 2,719 మంది పవిత్ర ఆత్మల మధ్య నిలబడ్డాక 50 00:05:19,736 --> 00:05:21,195 నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది… 51 00:05:21,196 --> 00:05:22,823 2025వ సంవత్సరంలో మరణించిన గుర్తు తెలియనివారి జ్ఞాపకార్థం 52 00:05:23,407 --> 00:05:24,615 …మనం ఇంకా చేయాల్సింది చాలా ఉందని. 53 00:05:24,616 --> 00:05:26,367 శాసనసభ్యురాలైన స్పిరో, నా పేరు జాన్ షుగర్. 54 00:05:26,368 --> 00:05:27,827 - హా. - మిమ్మల్ని కలవడం బాగుంది. 55 00:05:27,828 --> 00:05:31,539 నిన్ను కలవడం కూడా. నువ్వు చేసిన ఈ సాయం అంతటికీ చాలా చాలా థ్యాంక్స్. 56 00:05:31,540 --> 00:05:32,915 పర్వాలేదు, దానిదేముందిలెండి. 57 00:05:32,916 --> 00:05:35,960 షెరిఫ్ డెప్యూటీలు, మెడికల్ ఎగ్జామినర్, చీఫ్ ఆఫ్ స్టాఫ్. 58 00:05:35,961 --> 00:05:37,796 ఇప్పుడు వాళ్లందరూ అరెస్ట్ అయ్యారు. 59 00:05:40,924 --> 00:05:42,885 బాబోయ్. 60 00:05:44,052 --> 00:05:45,554 లెఫ్టినెంట్ వేగా సంగతేంటి? 61 00:05:47,306 --> 00:05:48,515 అతని కోసం ఇంకా గాలిస్తున్నారు. 62 00:05:49,349 --> 00:05:50,975 మేము ఎఫ్.బీ.ఐ వాళ్లం. 63 00:05:50,976 --> 00:05:52,351 - ఫ్రీజ్. - సరే, సరే. 64 00:05:52,352 --> 00:05:54,228 ఒక్కోసారి బడా బాసులే తప్పించుకు తిరుగుతుంటారు. 65 00:05:54,229 --> 00:05:56,315 అతను బడా బాస్ కాదులెండి, ఏమంటారు? 66 00:05:57,566 --> 00:05:58,775 - ఏమో మరి. - కాదంటారా? 67 00:06:00,068 --> 00:06:01,152 పీటర్ బ్రూనో. 68 00:06:01,153 --> 00:06:03,863 డ్రగ్స్ దందా చేయడం, తప్పుడు డెత్ సర్టిఫికెట్లను సృష్టించడం ఒక ఎత్తు. 69 00:06:03,864 --> 00:06:06,073 కానీ ప్రభుత్వ గృహ నిర్మాణ నిధులను దక్కించుకోవడం అనేది, 70 00:06:06,074 --> 00:06:08,827 అది అసలు వేరే వాళ్ల పరిధిలోని విషయం. 71 00:06:09,578 --> 00:06:12,915 ఇందులో ఇంకా వేరే వాళ్ళ ప్రమేయం కూడా ఉండే ఉంటుంది. ఫైర్ సేల్ అంత పెద్ద స్కామ్ చేయాలంటే ఆషామాషీనా? 72 00:06:13,457 --> 00:06:15,791 మీరు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మీకు మొదటగా మద్దతు నిలిచిన వారిలో 73 00:06:15,792 --> 00:06:17,752 - జోనథన్ సీగల్ కూడా ఒకడు, కదూ? - అవును. 74 00:06:17,753 --> 00:06:19,545 1998లో. 75 00:06:19,546 --> 00:06:20,881 ఆయన మిమ్మల్ని… 76 00:06:22,132 --> 00:06:24,259 దిక్కులేని వారికి పెద్ద దిక్కు ఇక మీరే అవుతారని కొనియాడేవాడు. 77 00:06:32,684 --> 00:06:38,814 ఈ ప్రపంచంలో, అందులోనూ రాజకీయాల్లో మనం జీవితాంతం రాజీ పడాల్సి వస్తుంది. 78 00:06:38,815 --> 00:06:40,358 పరిస్థితి అలా ఉండకపోతే బాగుండేదని అనిపిస్తుంటుంది. 79 00:06:40,359 --> 00:06:42,653 - ఈ ఆటలో గెలవాలంటే… - బెట్టీ. 80 00:06:43,403 --> 00:06:45,405 మీరు గెలవలేదు. మళ్లీ ఓడిపోయారు. 81 00:07:14,852 --> 00:07:16,478 మరి ఎలా ఉన్నావు? 82 00:07:18,814 --> 00:07:19,897 బాగానే ఉన్నా. 83 00:07:19,898 --> 00:07:23,068 వేగా విషయం జరిగిన తర్వాతి నుండి నువ్వు పెద్దగా మాట్లాడలేదు. 84 00:07:23,861 --> 00:07:25,361 నీకు అపరాధ భావనగా ఉందో లేదో తెలుసుకోవాలనుంది. 85 00:07:25,362 --> 00:07:26,446 బాగానే ఉన్నాలే. 86 00:07:31,577 --> 00:07:34,078 ఈ మధ్య నేను ఒక పాడ్ కాస్ట్ వింటూ ఉన్నా. 87 00:07:34,079 --> 00:07:36,832 "ఆరోగ్యమే మహాభాగ్యం" అని ఏదో ఉంటుంది దాని పేరు. 88 00:07:38,834 --> 00:07:43,254 అతను ఏమంటాడంటే, మగవాళ్లకన్నా ఆడవాళ్లు ఎక్కువ కాలం బతకడానికి గల ప్రధాన కారణం, 89 00:07:43,255 --> 00:07:44,882 మగవాళ్లు మనస్సులో ఉన్నది చెప్పుకోకపోవడమట. 90 00:07:48,135 --> 00:07:51,013 పంచుకోకపోతే, అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందట. 91 00:08:01,106 --> 00:08:03,233 - ఏదేమైనా… - స్టాలింగ్స్ ని నేను చంపింది ఆత్మరక్షణలో భాగంగా కాదు. 92 00:08:06,153 --> 00:08:07,279 అవునా? 93 00:08:09,907 --> 00:08:12,242 హా, ఆత్మరక్షణలో భాగంగా చంపానని నీకు చెప్పా. కానీ అది నిజం కాదు. 94 00:08:14,661 --> 00:08:15,954 వేగా విషయంలో కూడా అంతే. 95 00:08:17,164 --> 00:08:18,956 ఆ తర్వాత నాకు… టామ్, నాకు పిచ్చెక్కినంత పనైంది. 96 00:08:18,957 --> 00:08:20,917 అసలు నాకు అర్థం కాలేదు… 97 00:08:20,918 --> 00:08:22,419 నాకు ఏమైందనే విషయం. 98 00:08:25,339 --> 00:08:27,840 అసలు నాకు… నాకు ఆ క్షణం కూడా గుర్తు లేదు. 99 00:08:27,841 --> 00:08:29,259 ఏం చేస్తున్నానో తెలీనంత క్రోధం అనుకో. 100 00:08:30,427 --> 00:08:31,595 ఇంకా అసలు… 101 00:08:35,057 --> 00:08:38,018 నన్ను నేను ఒకలా అనుకున్నా, కానీ అది నిజం కాదేమో. 102 00:08:39,061 --> 00:08:40,062 హేయ్, 103 00:08:41,188 --> 00:08:43,106 ఈ లోకానికి ఇద్దరు దుర్మార్గుల పీడ విరగడైంది. 104 00:08:43,649 --> 00:08:44,732 అది నాకు ఓకే. 105 00:08:44,733 --> 00:08:48,236 హా, కానీ వేగాకి ఓ కూతురు ఉంది, తనకి అతనంటే ప్రాణం. స్టాలింగ్స్ కి ఓ అమ్మ ఉంది. 106 00:08:48,237 --> 00:08:50,989 కానీ ఒక్కోసారి మనం, అలా జరగకపోయి ఉంటే, 107 00:08:51,907 --> 00:08:54,034 పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని సంతృప్తి పడాల్సి వస్తుంది. 108 00:08:57,829 --> 00:08:58,830 అంతే అనుకుంటా. 109 00:09:02,125 --> 00:09:06,212 పక్షికి మూడు అక్షరాల పదం ఇంకోటి చెప్పు. 110 00:09:06,213 --> 00:09:07,214 ఖగము. 111 00:09:08,799 --> 00:09:09,882 రేడియాలజీ 112 00:09:09,883 --> 00:09:11,175 బాబోయ్, అది కరెక్టే. 113 00:09:11,176 --> 00:09:12,177 మిస్టర్ ఫ్లైబర్గ్. 114 00:09:16,265 --> 00:09:18,100 హేయ్. నేనూ రావచ్చా? 115 00:09:19,852 --> 00:09:20,853 హా, తప్పకుండా. 116 00:09:23,313 --> 00:09:25,983 కొరాజన్ 117 00:09:39,705 --> 00:09:41,205 - ఒక్క నిమిషం. - అలాగే. 118 00:09:41,206 --> 00:09:42,916 - హేయ్. - హేయ్. 119 00:09:49,673 --> 00:09:50,883 - అంతా ఓకేనా? - హా. 120 00:09:53,510 --> 00:09:54,887 లేదు, ఏదో అయింది. 121 00:09:57,139 --> 00:09:58,389 నీ కేస్ ముగిసింది. 122 00:09:58,390 --> 00:10:00,475 నీ మనస్సంతా అల్లకల్లోలంగా ఉంది, ఏమీ తోచక సతమతమవుతున్నావు. 123 00:10:01,685 --> 00:10:02,769 కొంచెం అంతే. 124 00:10:03,979 --> 00:10:05,271 సినిమాకి పోవచ్చుగా? 125 00:10:05,272 --> 00:10:08,108 ఈ ఊళ్ళో ఎక్కడో ఒక చోట ఏదో ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా ఆడుతూ ఉంటుందిలే. 126 00:10:08,817 --> 00:10:10,818 యునైటెడ్ థియేటర్లో "అవుట్ ఆఫ్ ద పాస్ట్" సినిమా ఆడుతోంది. 127 00:10:10,819 --> 00:10:11,944 ఏ సినిమా అది? 128 00:10:11,945 --> 00:10:14,865 ఆ సినిమాలో రాబర్ట్ మిచమ్, జేన్ గ్రీర్ ని పిచ్చపిచ్చగా ప్రేమిస్తాడు. 129 00:10:15,699 --> 00:10:17,742 రాబర్ట్ మిచమ్ అంతగా ప్రేమించే రకం కాదే. 130 00:10:17,743 --> 00:10:19,077 అది ఎవరికైనా జరుగుతుందిలే. 131 00:10:21,413 --> 00:10:23,331 - అయ్యో, నాకూ రావాలనే ఉంది. - వద్దులే, నీకు పని ఉంది. 132 00:10:23,332 --> 00:10:26,375 హా, ఓ… ఓ ప్రెజెంటేషన్ ఇచ్చే పనిలో ఉన్నా. 133 00:10:26,376 --> 00:10:27,920 అందరూ ఉండాలి. 134 00:10:28,670 --> 00:10:30,463 నా గురించి వదిలేసి, వెళ్లి ప్రశాంతంగా గడుపు. 135 00:10:30,464 --> 00:10:31,507 మరీ ఎక్కువ కష్టపడకు. 136 00:10:32,591 --> 00:10:35,010 - రేపు బీచ్ కి వెళ్లే ప్లాన్లో ఏ మార్పూ లేదు కదా? - లేనే లేదు. 137 00:10:38,388 --> 00:10:40,014 మళ్లీ ఆలోచిస్తే, 138 00:10:40,015 --> 00:10:41,558 ఎందుకో సినిమాకి వెళ్లాలనిపించలేదు. 139 00:10:57,699 --> 00:10:59,076 సరే. లేచి పోరాడు. 140 00:11:00,118 --> 00:11:01,995 మనిషి అంటే ఇంతేనా? 141 00:11:03,413 --> 00:11:05,666 కానివ్వు, బ్రో. ఇరగదీయ్. 142 00:11:40,576 --> 00:11:41,827 కానివ్వు! 143 00:11:56,341 --> 00:11:58,760 "అబుదాబీలో ఓ కొత్త కేసు పని మీద వెళ్తున్నా." 144 00:12:00,053 --> 00:12:01,597 "ఇన్హెరెంట్ వైస్" 145 00:12:02,764 --> 00:12:06,101 "హెండ్రిక్ తన తండ్రిని చివరిసారిగా ఎప్పుడు చూశాడు అనే దాని గురించి అబద్ధం చెప్పాడు." 146 00:12:11,231 --> 00:12:15,694 "శాసరీ నగరంలోని ఆకాశ వీధుల్లో స్టార్లింగ్ పక్షుల విన్యాసాలు చూశాను." 147 00:12:21,617 --> 00:12:26,121 ఫుల్ సస్పెన్స్! 148 00:12:35,547 --> 00:12:37,673 {\an8}రిజర్వ్ చేసుకున్న సీట్ టికెట్ టోక్యో - క్యోటో 149 00:12:37,674 --> 00:12:38,758 {\an8}హోమ్ 150 00:12:38,759 --> 00:12:40,385 {\an8}బోస్టన్ 151 00:14:22,237 --> 00:14:25,240 {\an8}ప్రీమియర్ 152 00:14:38,253 --> 00:14:40,713 ఎట్టకేలకి నాకు కాల్ చేశారన్నమాట. 153 00:14:40,714 --> 00:14:42,048 నేను స్టాన్లీ ఓండాట్జేని. 154 00:14:42,049 --> 00:14:43,508 దయచేసి మెసేజ్ ఏంటో చెప్పండి. 155 00:14:43,509 --> 00:14:45,093 స్టాన్లీ, నేనే. నాకు తిరిగి కాల్ చేయ్. 156 00:14:48,597 --> 00:14:49,598 సిద్ధంగా ఉన్నావా? 157 00:14:53,393 --> 00:14:54,394 హా. 158 00:14:57,814 --> 00:14:59,023 చాలా అందంగా ఉన్నావు. 159 00:14:59,024 --> 00:15:00,025 థ్యాంక్యూ. 160 00:15:28,512 --> 00:15:29,555 ఓకే, సెట్ చేసేశా. 161 00:15:35,853 --> 00:15:37,937 ఈ గ్రహంలోని అతిపెద్ద మహాసముద్రం కూతవేటు దూరంలో ఉంది, 162 00:15:37,938 --> 00:15:40,023 ఎందుకో తెలీదు కానీ, అది ఇక్కడే ఉన్నదన్న విషయాన్ని మర్చిపోతుంటా. 163 00:15:40,732 --> 00:15:42,192 దాదాపు అందరి పరిస్థితీ అదేలే. 164 00:15:46,488 --> 00:15:48,490 ఈ మధ్య నాకు అస్సలు బాగుండట్లేదు. 165 00:15:50,325 --> 00:15:55,581 "నేను ఎవరిని? నా మూలాలు ఏంటి? నా ప్రయాణం ఎక్కడ మొదలైంది?" అనే విషయాలపై పట్టు కోల్పోతున్నట్టు అనిపిస్తోంది. 166 00:15:58,166 --> 00:16:02,921 ఒకప్పుడు దేన్ని అయినా ఇట్టే గమనించేసేవాడిని, పసిగట్టేసేవాడిని, కానీ ఇప్పుడైతే… 167 00:16:04,840 --> 00:16:07,718 ఏమో అబ్బా. ఇప్పుడేమీ అర్థం కావట్లేదు అసలు. 168 00:16:09,052 --> 00:16:10,429 హా, అది నాకు తెలుస్తోంది. 169 00:16:11,346 --> 00:16:12,431 సారీ. 170 00:16:14,892 --> 00:16:16,435 హోటల్ కి వెళ్లిపోదామా? 171 00:16:19,771 --> 00:16:23,150 నీతో ఇలా బీచ్ లోనే కూర్చోవాలనుంది, అది అపచారం అంటావా? 172 00:16:26,528 --> 00:16:29,907 బాధలన్నీ ముగిస్తేనే సంతోషం వస్తుంది అని మనం ఎదురు చూస్తుంటే, 173 00:16:30,824 --> 00:16:32,034 కూర్చోవడానికి ఇక్కడ బీచ్ కూడా మిగలదు. 174 00:16:52,679 --> 00:16:54,847 - అన్నట్టు, ఒక మాట చెప్పాలి. - హా. 175 00:16:54,848 --> 00:16:56,307 మిలాన్. 176 00:16:56,308 --> 00:16:57,767 మిలాన్? 177 00:16:57,768 --> 00:16:59,101 ఇక్కడ నా పని ముగిసింది, 178 00:16:59,102 --> 00:17:03,065 కాబట్టి రిపోర్ట్ ఇవ్వడానికి, తదుపరి బాధ్యతని స్వీకరించడానికి మిలాన్ కి వెళ్తున్నాను. 179 00:17:05,108 --> 00:17:06,317 వెళ్లిపోతున్నావా? 180 00:17:06,318 --> 00:17:07,569 అవును. 181 00:17:09,863 --> 00:17:10,864 ఎప్పుడు? 182 00:17:11,448 --> 00:17:12,491 త్వరలోనే. 183 00:17:14,326 --> 00:17:15,410 ఓకే. 184 00:17:16,703 --> 00:17:18,329 మనం చాలా బాగా గడిపాం. 185 00:17:20,040 --> 00:17:21,290 అది నిజమే. 186 00:17:22,416 --> 00:17:23,460 అందుకే నాతో వచ్చేయ్. 187 00:17:26,964 --> 00:17:28,423 నీతో రావాలా? మిలాన్ కా? 188 00:17:29,383 --> 00:17:30,384 ఎలా ఉంటుందో చూడు. 189 00:17:34,263 --> 00:17:36,973 నేను అక్కడికి వెళ్లాలే. అది… అది బాగుంటుంది. 190 00:17:36,974 --> 00:17:38,392 మనం కలిసి గడిపితే ఎలా ఉంటుందో చూడవచ్చు. 191 00:17:44,106 --> 00:17:48,151 నా స్నేహితురాలు పెనెలోపీకి చింకూ వీలో ఓ కెఫే ఉంది. 192 00:17:48,819 --> 00:17:52,154 బయట ఉన్న కుర్చీల్లో కూర్చుని, ఎస్ప్రెస్సో కాఫీ తాగుతూ 193 00:17:52,155 --> 00:17:55,659 వియా శాంటా మరియా వీధిలో తిరుగుతూ ఉండే జనాలని రోజంతా చూస్తూ గడిపేయవచ్చు. 194 00:18:00,205 --> 00:18:02,832 అయితే, అంతా సర్దేసుకుని వచ్చేయమంటావా? 195 00:18:02,833 --> 00:18:04,250 రావడానికి ఏమైంది? 196 00:18:04,251 --> 00:18:08,504 నీకు కాస్త బ్రేక్ కావాలి. నీ పని ముగిసింది. నీ… నీ స్నేహితులందరూ వెళ్లిపోయారు కూడా. 197 00:18:08,505 --> 00:18:11,216 - మన మధ్య అంతా బాగానే సాగుతోంది. - నా స్నేహితులందరూ వెళ్లిపోయారా? 198 00:18:12,551 --> 00:18:14,761 ఇంకా ఎందుకు ఇక్కడ ఉంటున్నావు? నేరాల కోసమా? 199 00:18:16,346 --> 00:18:17,556 ట్రాఫిక్ నచ్చిందా? 200 00:18:24,104 --> 00:18:25,564 ఇంకా ఎందుకు ఇక్కడ ఉంటున్నావు? 201 00:18:58,597 --> 00:19:02,518 మిలాన్ విషయంలో ఒత్తిడేం లేదు, సరేనా? ఓసారి ఆలోచించు, అంతే. 202 00:19:03,644 --> 00:19:04,645 తప్పకుండా. 203 00:20:11,128 --> 00:20:14,131 నేను నోరు జారాను. అతనికి తెలిసిపోయింది. క్షమించు. 204 00:20:16,300 --> 00:20:17,301 ఇప్పుడేం చేయాలి? 205 00:20:22,806 --> 00:20:23,890 తప్పకుండా. 206 00:20:23,891 --> 00:20:27,226 అయితే ఈరాత్రి వస్తారుగా. సరే, థ్యాంక్యూ. 207 00:20:27,227 --> 00:20:29,562 మిస్ ఫిషర్. మీ కారు రెడీగా ఉంది. 208 00:20:29,563 --> 00:20:30,564 థ్యాంక్యూ. 209 00:21:53,605 --> 00:21:54,898 గుడ్ ఈవినింగ్, సర్. 210 00:21:55,983 --> 00:21:57,066 ఇదుగో. 211 00:21:57,067 --> 00:21:58,068 థ్యాంక్యూ. 212 00:22:04,491 --> 00:22:06,742 గుడ్ ఈవినింగ్. రిజిస్టర్లో సైన్ చేస్తారా? 213 00:22:06,743 --> 00:22:07,827 లేదు. 214 00:22:07,828 --> 00:22:10,705 సర్. ఎక్స్ క్యూజ్ మీ, సర్. 215 00:22:10,706 --> 00:22:13,625 పర్వాలేదు. ఆయన జాన్ షుగర్. 216 00:22:20,299 --> 00:22:21,300 సారీ. 217 00:22:26,680 --> 00:22:28,182 నిన్ను ఒకరు కలవాలనుకుంటున్నారు. 218 00:22:39,651 --> 00:22:42,237 {\an8}అకాలికా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి స్వాగతం 219 00:22:45,324 --> 00:22:46,325 జాన్. 220 00:22:47,743 --> 00:22:48,744 జాన్. 221 00:23:12,893 --> 00:23:13,977 మిస్టర్ షుగర్. 222 00:23:16,146 --> 00:23:17,147 నేను సెనెటర్ పావిచ్ ని. 223 00:23:18,398 --> 00:23:19,399 మిమ్మల్ని కలవడం బాగుంది. 224 00:23:20,234 --> 00:23:21,527 నా ఇంటికి స్వాగతం. 225 00:23:26,281 --> 00:23:27,740 ఎక్కడికి వెళ్తున్నావు? 226 00:23:27,741 --> 00:23:29,409 ఆయన పావిచ్. నేను ఆయనతో మాట్లాడాలి. 227 00:23:30,160 --> 00:23:32,287 నువ్వు కలవాల్సింది ఆయన్ని కాదు. 228 00:23:52,558 --> 00:23:53,892 ఇది నీకు కాస్త కష్టంగానే ఉంటుంది. 229 00:23:55,269 --> 00:23:56,352 కానీ నీ విషయంలో ఆనందంగా ఉంది. 230 00:23:56,353 --> 00:23:57,354 ఏమంటున్నావు నువ్వు? 231 00:24:01,316 --> 00:24:02,693 ఒక్క నిమిషం. ఎవరది? 232 00:24:04,236 --> 00:24:05,237 అదెవరు? 233 00:24:34,099 --> 00:24:35,975 - అన్నయ్యా. - జెన్. 234 00:24:35,976 --> 00:24:37,769 - అన్నయ్యా. అన్నయ్యా. - జెన్. 235 00:24:40,272 --> 00:24:41,273 ఓరి దేవుడా. 236 00:24:42,649 --> 00:24:45,903 దేవుడా, నిన్ను చాలా మిస్ అయ్యాను, అన్నయ్యా. 237 00:24:48,822 --> 00:24:49,907 నాకు తెలుసు, తెలుసు. 238 00:24:50,741 --> 00:24:51,867 దయచేసి నన్ను క్షమించు. 239 00:24:57,080 --> 00:24:59,583 ఇన్నేళ్లూ ఏమైపోయావు? 240 00:25:01,585 --> 00:25:04,879 నువ్వు నాకోసం వెతుకుతున్నావని తెలిసి, చాలా బాధపడుతున్నావని తెలిసి 241 00:25:04,880 --> 00:25:06,214 నాకు చాలా బాధేసింది. 242 00:25:06,215 --> 00:25:08,633 నేను వెతకడం ఆపలేదు… నీకోసం నేను వెతకని చోటంటూ లేదు. 243 00:25:08,634 --> 00:25:10,427 - నాకు తెలుసు. - నువ్వు చనిపోయావేమో అనుకున్నా. 244 00:25:11,053 --> 00:25:12,136 ఎలా? 245 00:25:12,137 --> 00:25:16,307 - దేవుడా, నిన్ను చాలా మిస్ అయ్యా. - ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నావు? 246 00:25:16,308 --> 00:25:17,391 ఏమైంది? 247 00:25:17,392 --> 00:25:20,354 - హెన్రీ ఏమైనా చేశాడా? అతనేమైనా… - లేదు. లేదు. 248 00:25:20,896 --> 00:25:22,271 హెన్రీ నన్ను ఏమీ చేయడు. 249 00:25:22,272 --> 00:25:25,525 నువ్వు ఎటో వెళ్లిపోయావని అతనే చెప్పాడు. నన్ను నమ్మించే ప్రయత్నం చేశాడు, నువ్వు… 250 00:25:25,526 --> 00:25:26,735 ఎందుకంటే… 251 00:25:27,945 --> 00:25:29,279 ఎందుకంటే అతడిని ఆ పని నేనే చేయమన్నా. 252 00:25:32,533 --> 00:25:35,827 నేను నిన్ను కలవలేను. అది ఎంత నరకంగా ఉన్నా, ఏమీ చేయలేని పరిస్థితి. 253 00:25:36,328 --> 00:25:40,039 అప్పటికి నా పని ఇంకా పూర్తి కాలేదు. పైగా అప్పటికి నువ్వు ఇంకా సిద్ధంగా లేవని గ్రహించా. 254 00:25:40,040 --> 00:25:41,457 సిద్ధంగా దేనికి లేను? ఏ పని? 255 00:25:41,458 --> 00:25:44,127 నాకు పని ఉంది. అందరికీ ఉంది. నేను నీకు సాయపడి ఉండేవాడిని. 256 00:25:44,878 --> 00:25:46,088 ఈ పనిలో అది కష్టంలే. 257 00:25:51,051 --> 00:25:55,931 అప్పటికి నీకు ఈ చోటు గురించి ఇంకా సరిగ్గా తెలీదు. అప్పుడే దిగావు. 258 00:25:57,015 --> 00:26:01,186 నేను చూసినవి నువ్వు ఇంకా చూడలేదు, అంటే, కేవలం అందాన్నే కాదు… 259 00:26:01,687 --> 00:26:04,314 భయంకరమైన విషయాలని, క్రూరమైన వాస్తవాలని చూశాను నేను. 260 00:26:05,399 --> 00:26:08,068 పవిత్రమైన ప్రకృతి పట్ల వీళ్లు చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిని చూశా. 261 00:26:09,695 --> 00:26:13,698 ఆ పనిలోకి నీకు భాగం కల్పించలేకపోయా. 262 00:26:13,699 --> 00:26:15,033 నువ్వు అప్పుడే దిగావు, అది సరైన సమయం కాదు. 263 00:26:17,703 --> 00:26:19,871 ఏ పని? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 264 00:26:19,872 --> 00:26:21,914 గమనించాలి, నివేదిక అందించాలి. మన మిషన్ అదే కదా. 265 00:26:21,915 --> 00:26:24,084 అది చాలదని నీకూ తెలుసు. 266 00:26:25,669 --> 00:26:26,670 కదా? 267 00:26:27,462 --> 00:26:31,924 ఈ గ్రహం అంతమైపోతుంటే నేను ఊరికే చూస్తూ ఉండలేకపోయాను, 268 00:26:31,925 --> 00:26:34,468 అందుకని ఓ టెక్నాలజీని సృష్టించాను. 269 00:26:34,469 --> 00:26:36,053 - ఆ సర్కిల్స్. - అవును. 270 00:26:36,054 --> 00:26:37,346 - అది నీ సృష్టేనా? - అవును. 271 00:26:37,347 --> 00:26:39,016 హెన్రీ నాకు అండగా నిలిచాడు. 272 00:26:39,975 --> 00:26:43,937 రూబీతో పాటు ఇతరులకి నేను చేసే పని నచ్చలేదు. 273 00:26:44,980 --> 00:26:46,064 కాబట్టి నువ్వు… 274 00:26:47,107 --> 00:26:48,192 నేను చేయాల్సింది చేశా. 275 00:26:49,818 --> 00:26:51,111 వాళ్లని మన స్వగ్రహానికి పంపించేశా. 276 00:26:53,113 --> 00:26:54,323 మన గుట్టును బయటపెట్టేశావు నువ్వు. 277 00:26:56,742 --> 00:27:00,078 మనం ఇక్కడ ఉన్నట్టు మనుషులకి చెప్పావు. నీ వల్ల మన వాళ్ళ ప్రాణాలు… 278 00:27:01,455 --> 00:27:02,539 మనల్ని వేటాడారు. 279 00:27:03,624 --> 00:27:05,876 మనలో కొందరిని చంపేశారు, మన ఆప్తులని చంపేశారు. 280 00:27:06,627 --> 00:27:08,837 జెన్, ఇది సరైన పని కాదు. ఇది మనం చేయాల్సిన పని కాదు. 281 00:27:09,421 --> 00:27:11,047 మన చేతిలో లేని దానితో ఆటలు ఆడకూడదు. 282 00:27:11,048 --> 00:27:12,549 ప్రారంభానికి అంతా సిద్ధంగా ఉంది. 283 00:27:13,091 --> 00:27:14,092 ఇదుగో వచ్చేస్తున్నాం. 284 00:27:14,843 --> 00:27:16,136 ఒకేసారి ఇదంతా అర్థం చేసుకోవడం కష్టమే. 285 00:27:17,304 --> 00:27:18,889 కాస్త మనస్సు విశాలం చేసుకుని వస్తావా? 286 00:27:19,890 --> 00:27:21,475 నేను సృష్టించిన దాన్ని చూస్తావా? 287 00:27:22,559 --> 00:27:24,520 అంతా అయ్యాక, నీకేమనిపిస్తోందో చెప్పు. 288 00:27:27,356 --> 00:27:29,065 ఎక్కడ కూర్చోవాలో షార్లెట్ చెప్తుంది. 289 00:27:29,066 --> 00:27:30,067 తనకి తెలుసా? 290 00:27:31,193 --> 00:27:33,278 నేనెవరినో? మనం ఎవరమో? 291 00:27:35,822 --> 00:27:37,449 షో అయ్యాక మాట్లాడుకుందాం. 292 00:27:39,952 --> 00:27:41,161 నాకు భయంగా ఉంది. 293 00:27:42,037 --> 00:27:45,165 నువ్వు మారిపోయావు, చెల్లీ. 294 00:27:49,336 --> 00:27:50,963 నువ్వు కూడా మారిపోయావు కదా. 295 00:27:57,261 --> 00:27:59,972 మిత్రులారా, సమయం అయింది. బయటకు పదండి. 296 00:28:13,193 --> 00:28:14,278 నువ్వు బాగానే ఉన్నావా? 297 00:28:17,155 --> 00:28:19,365 ఈవెంట్ ప్రారంభమవుతోంది. బయటకు వెళ్దాం పద. 298 00:28:19,366 --> 00:28:22,743 మనందరం ఓ ప్రత్యేకమైన, అరుదైన గ్రహంలో ఉంటున్నాం. 299 00:28:22,744 --> 00:28:24,663 కానీ, మనుషులు చేస్తున్న పనుల వల్ల, 300 00:28:25,330 --> 00:28:32,004 లేదా చేయాల్సినవి చేయకపోవడం వల్ల, ఇక్కడి సున్నితమైన పర్యావరణ వ్యవస్థ చాలా వేగంగా వేడెక్కుతోంది. 301 00:28:33,130 --> 00:28:38,177 అందుకే చాలా ఏళ్ళ క్రితం నేను అకాలికా ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాను. 302 00:28:38,677 --> 00:28:42,556 ఈ అద్భుతమైన గ్రహంలోని సంపదని, ప్రకృతిని పరిరక్షించడానికి. 303 00:28:43,056 --> 00:28:48,270 కాస్తయినా శ్రద్ధ లేకుండా దీన్ని నాశనం చేస్తున్నవారి నుండి రక్షణ కల్పించడానికి. 304 00:28:49,104 --> 00:28:51,481 ఈ రాత్రి అది విజయవంతం కావాలని కోరుకుంటున్నా. 305 00:28:54,026 --> 00:28:56,528 ఎట్టకేలకి తిరగబడటానికి భూగ్రహం సిద్ధంగా ఉంది. 306 00:29:03,076 --> 00:29:04,995 ఇప్పుడు మీరేం చూడబోతున్నారంటే… 307 00:29:06,205 --> 00:29:07,664 అదేంటో మీరే చూడండి. 308 00:29:53,043 --> 00:29:54,253 అందరూ సిద్ధమేనా? 309 00:30:36,837 --> 00:30:37,838 కానివ్వు. 310 00:30:57,357 --> 00:31:01,028 ఇక చివరిగా, సోదరసోదరీమణులారా… 311 00:31:02,237 --> 00:31:03,238 వెలుతురును ప్రసరింపజేద్దాం. 312 00:31:29,264 --> 00:31:30,432 - జాన్. - చెప్పు. 313 00:31:55,249 --> 00:31:56,959 ఇప్పుడు నేను మళ్లీ వెళ్లిపోవాలి. 314 00:31:59,378 --> 00:32:00,629 మాటివ్వు, అన్నయ్యా. 315 00:32:01,171 --> 00:32:03,465 నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు నా కోసం వస్తావని మాట ఇవ్వు. 316 00:32:04,174 --> 00:32:06,718 ఎందుకంటే… చెప్పేది విను. 317 00:32:08,804 --> 00:32:10,931 వీళ్లు ఇదంతా తమ కోసమని అనుకుంటున్నారు. 318 00:32:12,140 --> 00:32:13,141 వాళ్ల కోసమట. 319 00:32:13,851 --> 00:32:15,310 వాళ్లకి అస్సలు తెలీదు… 320 00:32:17,104 --> 00:32:18,355 ఇది నేను మన కోసం చేస్తున్నానని. 321 00:32:24,486 --> 00:32:26,321 "జాన్ షుగర్ ని కలువు. 322 00:32:26,989 --> 00:32:28,490 మాటలు కలుపు. 323 00:32:29,992 --> 00:32:32,035 అతను ఎలాంటి వాడు? ఎలా ఉన్నాడు? 324 00:32:33,161 --> 00:32:35,664 నీకు అనిపించినవి రాసి, నాకు పంపించు." 325 00:32:38,250 --> 00:32:40,794 నాకు చెప్పింది అంతే. మిగతాదంతా నా సొంతంగా చేశాను. 326 00:32:44,548 --> 00:32:45,841 మిగతాదంతా నిజమే. 327 00:32:49,344 --> 00:32:50,470 మిగతాదంతా నా మనస్ఫూర్తిగా చేశాను. 328 00:32:58,604 --> 00:32:59,730 తను అన్నది నిజమే. 329 00:33:01,356 --> 00:33:02,733 నువ్వు చాలా మంచివాడివి. 330 00:33:58,705 --> 00:34:00,999 "ద థర్డ్ మ్యాన్" సినిమాలోని ఆఖరి సీన్. 331 00:34:01,834 --> 00:34:05,420 కేసు ముగుస్తుంది. అరెస్టులు జరిగిపోతాయి. 332 00:34:06,797 --> 00:34:07,798 హీరో గెలుస్తాడు. 333 00:34:09,757 --> 00:34:13,971 అతను ఇక రోడ్డు పక్కన నిలబడి తను మనసారా ప్రేమించిన అమ్మాయి 334 00:34:14,804 --> 00:34:18,559 పరుగెత్తుకుంటూ వచ్చి తన కౌగిట్లో వాలిపోయే క్షణం కోసం చూస్తుంటాడు. 335 00:34:20,726 --> 00:34:21,937 అతను అలానే అనుకుంటుంటాడు. 336 00:34:23,856 --> 00:34:25,107 కానీ హీరో ఓ పిచ్చోడు. 337 00:34:26,065 --> 00:34:28,985 తనకేమాత్రం అవగాహన లేని ఓ పరదేశంలో చిక్కుకుపోయిన అమెరికన్ అతను. 338 00:34:30,946 --> 00:34:32,697 ఇక అతని ప్రేయసి పక్క నుండే వెళ్తుంది… 339 00:34:34,992 --> 00:34:36,451 కనీసం అతని వైపు కూడా చూడకుండా. 340 00:34:46,712 --> 00:34:48,714 బహుశా నాకేం పూర్తిగా ఆశ్చర్యంగా అనిపించలేదేమో. 341 00:34:49,797 --> 00:34:52,676 మొదట్నుంచీ లోలోపల నాకు ఎంతో కొంత అనుమానంగా ఉందేమో. 342 00:34:54,261 --> 00:34:55,554 నా చెల్లెలు. 343 00:34:56,679 --> 00:34:58,097 షార్లెట్. ఈ చోటు. 344 00:34:58,098 --> 00:35:01,185 బహుశా నాకది ముందే తెలుసేమో, కానీ ఇంకేదైనా నమ్మడానికి నా మనసు ప్రయత్నించిందేమో. ఏమో. 345 00:35:02,811 --> 00:35:05,606 కానీ అస్సలు మిస్ అవ్వకూడని ఒక ముఖ్యమైన అపాయింట్మెంట్ ఉందని మాత్రం పక్కాగా తెలుసు. 346 00:35:17,576 --> 00:35:18,577 గడ్డం. 347 00:35:19,578 --> 00:35:20,661 గడ్డం. 348 00:35:20,662 --> 00:35:22,413 - నా గడ్డానికి ఏమైంది? - దాన్ని పైకెత్తుతున్నావు. 349 00:35:22,414 --> 00:35:23,581 - నేనేం ఎత్తట్లేదు. - నువ్వు… 350 00:35:23,582 --> 00:35:24,707 నువ్వు ఇందాక ఎత్తావు. ఎత్తావు. 351 00:35:24,708 --> 00:35:26,584 జీ, అబద్ధాలు చెప్పకు. 352 00:35:26,585 --> 00:35:27,753 మళ్లీ. దడదడలాడించు. 353 00:35:30,464 --> 00:35:33,591 ఓకే, ఓకే, ఓకే! ఏంటి సంగతి, బేబీ? అంతా సిద్ధమేనా? అంతా రెడీయా? 354 00:35:33,592 --> 00:35:35,760 - సోషల్ మీడియాల్లో పోస్ట్ చేయడానికి ఫైట్ ముందు ఫోటోలు తీయవచ్చా? - అలాగే. 355 00:35:35,761 --> 00:35:37,470 మీరు ఫోటోలు తీయడం మొదలుపెడతారా? అటు రండి. 356 00:35:37,471 --> 00:35:39,848 ఇక్కడ బాగా తీయాలి. అక్కడ కూడా బాగా తీయండి. 357 00:35:41,016 --> 00:35:42,017 హేయ్. 358 00:35:43,185 --> 00:35:44,186 చెప్పు. 359 00:35:44,686 --> 00:35:45,979 నేరుగా అతడిని పునరావాస కేంద్రానికి తీసుకెళ్లు. 360 00:35:46,605 --> 00:35:49,316 ఫైట్ అయ్యాక క్యాసినోలు, నైట్ క్లబ్బులు లాంటివేం వద్దు. 361 00:35:50,400 --> 00:35:52,860 అతను నన్ను "మద్యం లేని స్ట్రిప్ క్లబ్"కి తీసుకెళ్లమని కోరాడు. 362 00:35:52,861 --> 00:35:54,738 - ఏంటి? - అలాంటిది అసలు ఉందా అని అడిగా అతడిని. 363 00:35:56,323 --> 00:35:59,450 మామూలోడు కాదు. ఏదేమైనా మళ్లీ పునరావాస కేంద్రానికే.` 364 00:35:59,451 --> 00:36:02,204 సర్వీస్ బిజినెస్ అంటే ఇలాగే ఉంటుంది. ఇదంతా మన పనిలో భాగమే. 365 00:36:02,871 --> 00:36:04,665 కానీ అదొక్కటే భాగం ఉంటుందని అనుకోకు. ఒక్కసారి వాళ్లని చూడు. 366 00:36:05,582 --> 00:36:06,707 హా. 367 00:36:06,708 --> 00:36:09,043 నువ్వే లేకపోయి ఉంటే, వాళ్లిద్దరూ ఇలా కలిసి ఉండేవాళ్ళు కాదు. 368 00:36:09,044 --> 00:36:10,504 హా, ఆ భాగం సంతృప్తిని ఇస్తుంది. 369 00:36:12,089 --> 00:36:14,716 వాల్. థ్యాంక్యూ. 370 00:36:16,134 --> 00:36:18,345 సరే మరి. మళ్లీ కలుద్దాం. 371 00:36:25,060 --> 00:36:26,061 హా. అంతే. 372 00:36:28,272 --> 00:36:30,566 ఓయ్, షుగర్. ఎక్కడికి వెళ్తున్నావు? 373 00:36:31,149 --> 00:36:33,568 నీకు బై చెబుదామని వచ్చా, కానీ, నువ్వు చాలా బిజీగా ఉన్నావు. 374 00:36:33,569 --> 00:36:35,528 - ఫైట్ చూడవా? - లేదు, లేదు. తప్పకుండా చూస్తా. 375 00:36:35,529 --> 00:36:37,321 కానీ నీ చుట్టూ చాలామంది ఉంటారు కదా, 376 00:36:37,322 --> 00:36:38,406 మళ్లీ కలవగలనో లేదో అని వచ్చా. 377 00:36:38,407 --> 00:36:39,825 ఓకే. 378 00:36:45,038 --> 00:36:46,039 థ్యాంక్యూ. 379 00:36:47,583 --> 00:36:48,876 ఏం పర్వాలేదు. 380 00:36:51,461 --> 00:36:52,796 అయ్యో, నీ సూటుని పాడు చేసేశా. 381 00:36:53,338 --> 00:36:54,423 నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయిలే. 382 00:36:55,340 --> 00:36:56,341 అవునులే. 383 00:36:58,886 --> 00:36:59,887 హేయ్, డ్యానీ. 384 00:37:01,305 --> 00:37:02,556 గడ్డాన్ని పైకి ఎత్తకు. 385 00:37:22,159 --> 00:37:24,661 సీగల్ స్టూడియోస్ 386 00:37:26,788 --> 00:37:32,126 1970లు, 80లు, 90ల్లో కూడా అలాగే జరిగింది. 387 00:37:32,127 --> 00:37:34,004 అప్పట్లో లాస్ వేగస్ కి వెళ్లి సినిమాని స్క్రీన్ చేసే వాళ్లు. 388 00:37:34,922 --> 00:37:38,007 ఒకవేళ అదృష్టం బాగుండి సినిమా గనుక నిజంగా బాగుందని టాక్ వస్తే, 389 00:37:38,008 --> 00:37:42,638 ఇక థియేటర్ల వాళ్లు, మా థియేటర్లలో వేస్తామంటే మా థియేటర్లలో వేస్తామని కొట్టుకునేవారు. 390 00:37:43,263 --> 00:37:46,350 కానీ ఇప్పుడు సినిమా బిజినెస్ అంతా మునుపటిలా లేదు, రోజులు మారాయి. 391 00:37:48,018 --> 00:37:50,853 కనీసం నాకు నచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చి లంచ్ చేయగలుగుతున్నా, అది చాలు. 392 00:37:50,854 --> 00:37:53,690 అలా కాకుండా ఎలా ఉంటుంది! ఇదంతా నిర్మించింది మీరే కదా. 393 00:37:56,026 --> 00:37:57,236 ఎలా ఉన్నావు నువ్వు? 394 00:37:59,446 --> 00:38:00,613 ఏంటి? 395 00:38:00,614 --> 00:38:04,909 ఏం లేదు. నేను మొన్న మెలనీతో మాట్లాడా, అప్పుడు… 396 00:38:04,910 --> 00:38:08,121 ఏంటి? తను మీకు చెప్పిందా? 397 00:38:10,040 --> 00:38:13,126 నా గురించి… నేను ఎక్కడి వాడిని అనే దాని గురించి చెప్పిందా? 398 00:38:18,966 --> 00:38:23,387 షుగర్, నువ్వు ఒహాయో వాడివని అందరికీ తెలుసు. 399 00:38:29,560 --> 00:38:30,602 కంగారుపడకు. 400 00:38:32,479 --> 00:38:36,149 నా వ్యక్తిగత జీవితం గురించి నువ్వు ఎప్పుడూ ఎక్కడా నోరు జారలేదు. 401 00:38:37,609 --> 00:38:39,570 మరి నీ విషయంలో నేను కూడా అలాగే ఉండాలి కదా. 402 00:38:46,410 --> 00:38:47,619 వచ్చేస్తున్నారు. 403 00:38:49,288 --> 00:38:52,082 - ఎగ్జైటింగ్ గా ఉందా? - హా, కాస్త కంగారుగా కూడా ఉంది. 404 00:38:55,711 --> 00:38:58,547 కానీ ఇవాళ మిమ్మల్ని కలవడానికి వచ్చింది దాని కోసం మాత్రమే కాదు. 405 00:38:59,631 --> 00:39:00,715 ఓకే. 406 00:39:00,716 --> 00:39:03,552 నన్నొక్క ప్రశ్న తీవ్రంగా వేధిస్తోంది, 407 00:39:04,678 --> 00:39:07,055 ఎవరిని అడగాలో నాకు తెలీలేదు. 408 00:39:07,681 --> 00:39:08,682 అడిగేయ్. 409 00:39:10,976 --> 00:39:12,186 నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? 410 00:39:13,979 --> 00:39:18,525 అంటే, మనం చివరిసారిగా కలిసిన తర్వాత, నా… నాలో ఇప్పుడు మార్పు ఏమైనా కనిపిస్తోందా? 411 00:39:19,693 --> 00:39:20,985 మార్పు అంటే? 412 00:39:20,986 --> 00:39:22,738 నా మిత్రులు కొందరు… 413 00:39:24,364 --> 00:39:26,158 ఒహాయోలోని మిత్రులు, వాళ్లు… 414 00:39:27,201 --> 00:39:28,202 వాళ్లు… 415 00:39:30,120 --> 00:39:33,916 వాళ్లు నన్ను ఇక్కడి సమాజంలో భాగమైపోయే అవకాశముందని హెచ్చరించేవాళ్లు. 416 00:39:34,499 --> 00:39:37,419 ఇక్కడ ఎంత ఎక్కువ కాలం ఉంటే, అంతలా మారిపోయే అవకాశం ఉంది అని. 417 00:39:39,004 --> 00:39:40,422 మరి నీ మిత్రులు చెప్పింది నిజమేనా? 418 00:39:42,841 --> 00:39:45,677 నేను ఇక్కడికి వచ్చాక కొన్ని పనులు చేశా. అవి ఎలాంటివంటే… 419 00:39:48,180 --> 00:39:51,058 అలాంటివి చేయగలనని అప్పటిదాకా నేను అనుకోనే లేదు. 420 00:39:51,934 --> 00:39:53,060 ఓకే. 421 00:39:54,561 --> 00:39:58,190 అనుమానం, కోపం, కోరిక, పాపం. 422 00:39:59,274 --> 00:40:02,319 అవన్నీ ఇక్కడ ప్రతి అడుగులోనూ కనిపిస్తాయి. 423 00:40:04,071 --> 00:40:08,659 అవి మనల్ని ప్రభావితం చేయకుండా చూసుకోవడం చాలా కష్టం. అది అసాధ్యం అని కూడా చెప్పవచ్చు. 424 00:40:11,578 --> 00:40:13,121 కానీ అదంతా చెడేం కాదు. 425 00:40:15,916 --> 00:40:17,751 ఇక్కడ మంచివి కూడా కొన్ని ఉన్నాయి. 426 00:40:21,046 --> 00:40:22,255 సినిమాల లాగా. 427 00:40:22,256 --> 00:40:23,840 కొన్ని సినిమాల లాగా. 428 00:40:23,841 --> 00:40:25,341 {\an8}హంఫ్రీ బోగర్ట్ 429 00:40:25,342 --> 00:40:26,676 కొందరు మనుషుల లాగా. 430 00:40:26,677 --> 00:40:27,844 {\an8}హాలీవుడ్ బోలేవార్డ్ 431 00:40:27,845 --> 00:40:29,179 బీచ్, ఇంకా లేకర్స్ జట్టు లాగా. 432 00:40:29,847 --> 00:40:32,891 ఇంకా ఓ లిమోసిన్ కారు నుండి దిగబోతున్న కుక్క లాగా. 433 00:40:34,685 --> 00:40:38,564 కానీ ఒకటి మాత్రం చెప్పగలను. దీన్ని పొగడ్తగా తీసుకో. 434 00:40:39,481 --> 00:40:41,942 నువ్వు ఎప్పటికీ మాలాంటి కాలిఫోర్నియా వాడివి కాలేవు. 435 00:40:44,194 --> 00:40:46,738 అసలు నీకు, ఒహాయోలో ఉండే వాళ్లకి కూడా పోలిక లేదనుకుంటా. 436 00:40:50,325 --> 00:40:51,827 నువ్వు ఎలా కనిపిస్తున్నావా? 437 00:40:53,704 --> 00:40:56,039 షుగర్ లా కనిపిస్తున్నావు. 438 00:41:08,552 --> 00:41:09,635 థ్యాంక్యూ. 439 00:41:09,636 --> 00:41:11,471 దేనికి? అది నీ కుక్కే కదా. 440 00:41:15,267 --> 00:41:16,268 హేయ్. 441 00:41:16,810 --> 00:41:17,936 హాయ్. 442 00:41:29,573 --> 00:41:31,992 నేను సిద్ధంగా ఉన్నప్పుడు తన దగ్గరికి రమ్మని నా చెల్లి అంది. 443 00:41:33,327 --> 00:41:35,120 అంటే ఏంటో కూడా నాకు తెలీదు. 444 00:41:36,038 --> 00:41:37,121 కానీ ప్రస్తుతానికి… 445 00:41:37,122 --> 00:41:38,123 హాలీవుడ్ 446 00:41:38,707 --> 00:41:39,875 …నేను సెటిల్ అవుతున్నా. 447 00:41:41,376 --> 00:41:42,669 నా పెట్ డాగ్ మళ్లీ నా దగ్గరికి వచ్చేసింది. 448 00:41:43,712 --> 00:41:46,214 మేము కొంత మంది కొత్తవాళ్ళని కలుసుకుంటాం. 449 00:41:46,215 --> 00:41:47,715 నేను కొన్ని సినిమాలు చూస్తా. 450 00:41:47,716 --> 00:41:49,343 మేము డాగ్ పార్కుకు వెళ్తాం. 451 00:41:51,428 --> 00:41:52,513 అది ప్లాన్. 452 00:41:53,514 --> 00:41:55,098 బహుశా ఏదైనా కొత్త కేసు దొరుకుతుందేమో. 453 00:41:55,724 --> 00:41:56,934 దొరక్కపోవచ్చు కూడా. 454 00:41:58,268 --> 00:41:59,686 చూద్దాం ఏమవుతుందో. 455 00:42:09,071 --> 00:42:10,364 నాకు తెలిసిందల్లా… 456 00:42:11,782 --> 00:42:13,075 ఈ చోటు… 457 00:42:15,202 --> 00:42:17,913 ఈ మనుషులు… 458 00:42:22,084 --> 00:42:23,335 మళ్లీ ఇంటికి రావడం చాలా బాగుంది. 459 00:43:48,545 --> 00:43:50,464 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్