1 00:00:14,348 --> 00:00:18,685 మోనార్క్ కమాండ్ పోస్ట్ అలాస్కా 2 00:00:22,564 --> 00:00:23,941 మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు. 3 00:00:25,734 --> 00:00:30,030 "బ్లాక్ ఆప్స్" సీక్రెట్ పోలీసుల్లా నటించి భయపెడితే జడుసుకుంటా అనుకుంటున్నారా? 4 00:00:34,034 --> 00:00:35,035 గుడ్ లక్. 5 00:00:57,599 --> 00:00:58,600 హేయ్! 6 00:01:01,019 --> 00:01:02,312 కల్నల్ షా ఎక్కడ? 7 00:01:04,063 --> 00:01:05,566 మీరు నా మాటలు వినగలరని నాకు తెలుసు! 8 00:01:08,068 --> 00:01:10,195 నేను ఇక్కడి ఇన్-ఛార్జ్ తో మాట్లాడాలి! 9 00:01:11,488 --> 00:01:12,739 మా నాన్న పేరు 10 00:01:12,739 --> 00:01:14,157 హిరోషి రాండా! 11 00:01:14,825 --> 00:01:15,784 రాండా! 12 00:02:37,824 --> 00:02:40,035 గాడ్జిల్లా పాత్ర ఆధారంగా రూపొందించబడింది 13 00:03:00,264 --> 00:03:01,515 ఇప్పుడు బాగానే ఉందా? 14 00:03:02,724 --> 00:03:05,602 ప్రస్తుతానికి శరీరంలో అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. 15 00:03:06,687 --> 00:03:08,605 మేము మిమ్మల్ని రక్షించడం వల్ల మీకు కలిసొచ్చింది. 16 00:03:08,605 --> 00:03:09,690 మీరు మమ్మల్ని రక్షించలేదు. 17 00:03:10,566 --> 00:03:12,734 - కెంటారో రక్షించాడు. - మీరు అక్కడ ఏం చేస్తున్నారు? 18 00:03:13,944 --> 00:03:17,030 మీరు దొంగిలించిన మా ఫైల్స్ లో ఉన్న డేటాను ఫాలో అవుతున్నారు అనుకుంట. 19 00:03:19,241 --> 00:03:20,617 ఇందులో నుండి ఏమీ రికవర్ చేయలేకపోయాము. 20 00:03:20,617 --> 00:03:22,619 బహుశా మీరు అనుకునేంత తెలివితేటలు మీకు లేవు ఏమో. 21 00:03:22,619 --> 00:03:25,497 కానీ నీలాంటి తెలివైన పిల్ల ఎక్కడో ఒక చోట ఇంకొక బ్యాకప్ ని ఉంచి ఉంటుంది, కదా? 22 00:03:26,623 --> 00:03:29,376 - ఎవరికీ తెలీని ప్రదేశంలో. - మీరు భారీ, భయంకరమైన 23 00:03:29,376 --> 00:03:32,754 రాక్షస జీవులను వెంటాడుతూ ఉండాలి కదా? 24 00:03:33,338 --> 00:03:35,716 ఈ ప్రదేశానికి దగ్గరలోనే ఒకటి ఉంది. 25 00:03:38,135 --> 00:03:39,720 మేము ఒక బృందాన్ని పంపించాం. 26 00:03:39,720 --> 00:03:42,055 అలాంటి జీవిని వాళ్ళు ఇంతవరకు చూసింది లేదు. 27 00:03:42,931 --> 00:03:48,770 తెలుసా, ఎవరైనా ఒక కొత్త జాతి జంతువులను కనిపెడితే ఆ జంతు జాతికి వారి 28 00:03:49,813 --> 00:03:51,565 పేరు పెట్టడం ఒక ఆనవాయితీ. 29 00:03:53,734 --> 00:03:55,152 కానీ మాకు ఒక చిన్న అయోమయ పరిస్థితి ఏర్పడింది. 30 00:03:56,778 --> 00:03:58,155 మేము దాని పేరును... 31 00:04:00,282 --> 00:04:03,660 టైటాన్స్ మే హ్యూయిట్ అని పెట్టాలా? 32 00:04:04,661 --> 00:04:05,662 లేక... 33 00:04:06,830 --> 00:04:07,831 మరి... 34 00:04:10,042 --> 00:04:14,588 టకోమా, వాషింగ్టన్ నుండి వచ్చిన లైరా మటెయో అనాలా? 35 00:04:18,175 --> 00:04:20,135 ఈ ఫొటోలో నువ్వు నీలాగే లేవు. 36 00:04:33,273 --> 00:04:35,984 మనం ఒకరికి ఒకరం సాయం చేసుకోగలం అనే ఐడియా అంత దారుణమైంది కాదు. 37 00:04:38,737 --> 00:04:43,825 చెప్పాను కదా, ఒక బ్యాకప్ అంటూ ఉంటే ఎంతకైనా మంచిది, కదా? 38 00:05:03,262 --> 00:05:05,681 రాండా పిల్లకు ఏమీ తెలీదు. 39 00:05:06,306 --> 00:05:08,767 ఆగు. ఒక్క క్షణం. లేదు. అది... 40 00:05:08,767 --> 00:05:13,480 లేదు, వాళ్ళు హిరోషి రాండా పిల్లలు. 41 00:05:13,480 --> 00:05:16,400 వాళ్ళు బిల్ ఇంకా కెయ్కో రాండాల మనవళ్లు. 42 00:05:16,400 --> 00:05:18,610 మనం వాళ్ళను క్రిమినల్స్ లాగ చూస్తున్నాం. 43 00:05:18,610 --> 00:05:20,696 ఆ మాట వాళ్ళను కిడ్నాప్ చేయడానికి చూసిన నువ్వు అనకూడదు. 44 00:05:20,696 --> 00:05:22,489 సరే. నేను చేసింది తప్పే. 45 00:05:22,489 --> 00:05:27,286 ఆమె ఒక స్కూల్ టీచర్, సరేనా? ఎలాంటి రికార్డు లేదు. ఆ కొడుకు ఒక "ఆర్టిస్ట్." 46 00:05:27,286 --> 00:05:28,370 ఆమె సంగతి ఏంటి? 47 00:05:29,621 --> 00:05:31,123 ఈమె కాస్త ఆసక్తికరమైన కేసు. 48 00:05:31,123 --> 00:05:33,834 తన అపార్ట్మెంట్ ను ఖాళీ చేసిన విధానాన్ని బట్టి, ఒక చోట నుండి మాయం అవ్వడం ఎలాగో ఆమెకు తెలుసు. 49 00:05:35,419 --> 00:05:36,420 ఎందుకు? 50 00:05:36,920 --> 00:05:38,297 ఆమె దేని నుండి దాక్కుంటుంది? 51 00:05:38,964 --> 00:05:41,717 తెలీదు. ఆమె మీద ఎలాంటి వారెంట్లు లేవు. ఎవరూ ఆమె కోసం వెతుకుతున్నట్టు లేదు. 52 00:05:41,717 --> 00:05:43,844 అంటే, అధికారికంగా. 53 00:05:43,844 --> 00:05:45,554 అయితే, వీళ్ళతో మనం ఏం చేయాలి? 54 00:05:48,140 --> 00:05:52,644 ఈ సంస్థ వారి కుటుంబానికి చెందింది. వాళ్ళు ఏంటో మనం వాళ్లకు చెప్పగలం. 55 00:05:52,644 --> 00:05:54,563 అంటే వాళ్ళను చేర్చుకుందాం అంటున్నావా? 56 00:05:54,563 --> 00:05:56,565 మోనార్క్ వాళ్ళ వారసత్వం. 57 00:05:56,565 --> 00:06:00,444 ఈ ప్రదేశంలో వారసత్వాలను చూపి వచ్చినోళ్లకు పెద్దగా కలిసి రాలేదు, అవునా? 58 00:06:02,237 --> 00:06:04,740 అలా వచ్చినోళ్ళు చావడమో... లేక చచ్చుబడటమో జరిగింది. 59 00:06:04,740 --> 00:06:06,617 అంటే, ఇతను ఒక విషయం కరెక్టుగా చెప్పాడు. 60 00:06:06,617 --> 00:06:08,076 వాళ్ళు దేని కోసమో వెతకుతున్నారు. 61 00:06:08,577 --> 00:06:11,163 వాళ్ళ నాన్నకు సంబంధించింది అయ్యుండాలి. అంటే, మోనార్క్ కు కూడా సంబంధించింది అయ్యుండాలి. 62 00:06:11,163 --> 00:06:13,332 కాబట్టి వాళ్ళు తమ ప్రయత్నాన్ని మానుకునే అవకాశం లేదు, అవునా? 63 00:06:14,750 --> 00:06:18,587 అలాంటప్పుడు వాళ్ళను కొంచెం కాలం స్వతంత్రంగా పోనిచ్చి ఏం కనిపెడతారో చూద్దాం. 64 00:06:18,587 --> 00:06:19,755 అతని సంగతి ఏంటి? 65 00:06:27,554 --> 00:06:29,056 ఇతనితో వ్యవహరించడం ఇప్పుడు నా పని. 66 00:06:51,203 --> 00:06:52,412 హాయ్. 67 00:06:52,412 --> 00:06:54,456 మీరు కొంచెం కారు దిగొచ్చు కదా? 68 00:06:54,456 --> 00:06:56,542 కాస్త అడుగు వేసేటప్పుడు చూసుకుని దిగండి. జారుతుంది. 69 00:07:04,633 --> 00:07:05,884 పాస్పోర్ట్ లు. 70 00:07:08,637 --> 00:07:11,431 ఎలాంటి రికార్డు లేని కొత్తవి. 71 00:07:14,059 --> 00:07:16,728 అలాగే విమానం టికెట్లు, డబ్బు, ఫోన్లు. 72 00:07:16,728 --> 00:07:18,063 మోనార్క్ సంస్థ అందించినవి. 73 00:07:18,981 --> 00:07:21,066 నేను జరిగిన దానికి క్షమాపణలు అడుగుతున్నాను. 74 00:07:21,066 --> 00:07:22,442 - వెధవ. - సన్నాసి. 75 00:07:25,320 --> 00:07:26,780 మీ నష్టానికి నాకు నిజంగా బాధగా ఉంది. 76 00:07:26,780 --> 00:07:28,490 థాంక్స్, సన్నాసి-వెధవ. 77 00:07:34,413 --> 00:07:35,414 మీరు ఏమని అనుకుంటున్నారు? 78 00:07:36,123 --> 00:07:40,502 మీరేమైనా నిజాన్ని వెతికి కనిపెట్టడానికి వచ్చిన, హీరోలం అనుకుంటున్నారా, ఆహ్? 79 00:07:42,671 --> 00:07:43,881 కాస్త బుర్ర వాడండి! 80 00:07:44,548 --> 00:07:47,050 మీకు ఏమాత్రం అర్థం కాని విషయంలోకి మీరు తల దూర్చారు. 81 00:07:47,050 --> 00:07:49,553 అసలు మీరు ప్రాణాలతో ఉండటమే గొప్ప. 82 00:07:49,553 --> 00:07:51,847 కాబట్టి ఇక మీ కొత్త పాస్పోర్ట్స్ తీసుకుని ఇంటికి పోండి. 83 00:07:52,931 --> 00:07:54,933 ఇప్పటికే ఈ సారికి మీకు సాయం చేయడానికి 84 00:07:54,933 --> 00:07:56,393 నాకున్న కాస్త పరపతిని వాడాల్సి వచ్చింది. 85 00:07:57,519 --> 00:07:59,021 మళ్ళీసారి ఇలా జరుగుతుందని అనుకోకండి. 86 00:08:06,987 --> 00:08:09,072 - నటన ఎలా ఉంది? - బాగానే నేర్చుకుంటున్నావు. 87 00:08:26,048 --> 00:08:28,050 నోమ్, అలాస్కా 88 00:08:35,724 --> 00:08:38,227 "మీ నష్టానికి చింతిస్తున్నాము" అంట. వాళ్ళేదో లెక్క చేసేటట్టు. 89 00:08:38,227 --> 00:08:40,062 వాళ్ళేం లెక్క చేయడం లేదు. బేసిక్ ఎకానమీ టికెట్లు ఇచ్చారు. 90 00:08:42,188 --> 00:08:44,274 హేయ్, ఈ ఫ్లైట్ బోర్డింగ్ టైమ్ ఎన్నింటికి? 91 00:08:46,610 --> 00:08:47,861 టోక్యో. 92 00:08:47,861 --> 00:08:49,530 అమ్మో. 93 00:08:49,530 --> 00:08:53,075 అది ఇక్కడి నుండి చాలా దూరం. అలాస్కాలో మీ ట్రిప్ ని ఎంజాయ్ చేసారా? 94 00:08:53,075 --> 00:08:56,078 నేను చేయలేదు. ఆ విషయాన్ని ట్రిప్ అడ్వైసర్ రివ్యూలో రాస్తాను. 95 00:08:56,078 --> 00:08:57,204 మహా అయితే రెండు స్టార్స్ ఇస్తా. 96 00:08:57,204 --> 00:08:59,289 ఆగు. నువ్వు వెళ్ళిపోతున్నావా? 97 00:08:59,289 --> 00:09:03,126 అవును. అతను చెప్పింది విన్నావు కదా. మనకంటూ రోజువారీ జీవితాలు ఉన్నాయ్. 98 00:09:03,126 --> 00:09:04,461 ఏం జీవితం? 99 00:09:04,461 --> 00:09:06,380 టోక్యోలోనా? నేను నాశనం చేశాను అని నువ్వు అన్న జీవితమా? 100 00:09:06,380 --> 00:09:09,007 నేను వెళ్లి... 101 00:09:10,259 --> 00:09:12,469 ఆగు. ఇక్కడ దగ్గరలో బార్ ఏమైనా ఉందా? 102 00:09:13,595 --> 00:09:14,721 అది ఇంకా తెరవలేదు. 103 00:09:14,721 --> 00:09:15,806 ఒక్క స్టార్ ఇస్తాను. 104 00:09:18,225 --> 00:09:19,518 ఒక్క నిమిషం. నేను... 105 00:09:21,186 --> 00:09:22,312 క్షమించండి. 106 00:09:22,312 --> 00:09:24,273 - కల్నల్ షా సంగతి ఏంటి? - అతనితో మనకేంటి? 107 00:09:24,273 --> 00:09:27,359 ఆయన చెప్పిన విషయాలు అన్నీ నిజాలే. మా నాన్న ఇంకా బ్రతికే ఉన్నారని ఆయనకు తెలుసు. 108 00:09:27,359 --> 00:09:29,862 లేదు, లేదు, ఆయనకు తెలీదు. మీకు కూడా తెలీదు. 109 00:09:29,862 --> 00:09:32,322 కానీ ఆయన చనిపోయారని కూడా చెప్పలేం కదా. 110 00:09:32,322 --> 00:09:34,157 ఇక ఆ అంచనాకు రాలేం. 111 00:09:34,157 --> 00:09:36,952 నేను వెతకడం ఆపను. ఆయనకు ఏమైందో నేను తెలుసుకోవాలి. 112 00:09:36,952 --> 00:09:38,328 సరే. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? 113 00:09:39,246 --> 00:09:42,749 మోనార్క్ వాళ్లకు టైటన్లను ఎలా కనిపెట్టాలో తెలిసి ఉండొచ్చు, కానీ మా నాన్నను ఎలా కనిపెట్టాలో తెలీదు. 114 00:09:43,625 --> 00:09:45,586 మనకు తెలుసా? నేను ఇంతకు ముందే ఆయన ఆఫీసులో... 115 00:09:45,586 --> 00:09:47,421 సాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఆఫీసులో వెతకలేదు. 116 00:09:47,421 --> 00:09:49,089 బ్యాకప్ కుటుంబం. బ్యాకప్ ఆఫీసు. 117 00:09:49,715 --> 00:09:50,799 వెళ్లి చూస్తే బాగుంటుంది కదా? 118 00:09:52,176 --> 00:09:55,387 అలాగే నువ్వు ఆ ఫైల్స్ కాపీని ఏదైనా క్లౌడ్ లోకి ఎక్కించి ఉంటావు కదా, మే. 119 00:09:57,472 --> 00:09:58,724 ఆ ఫైల్స్ ని మీకు ఇస్తాను. 120 00:10:00,642 --> 00:10:02,728 - కానీ వాటి వల్ల మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లొచ్చు. - నీ ప్రాణానికి కూడా. 121 00:10:02,728 --> 00:10:04,563 మనం విడిపోకూడదు. 122 00:10:05,522 --> 00:10:07,065 మాకు నువ్వు కావాలి. 123 00:11:11,338 --> 00:11:12,631 ఎలా ఉన్నారు, లీ? 124 00:11:13,674 --> 00:11:16,093 డెప్యూటీ డైరెక్టర్ వెర్డుగో. 125 00:11:16,927 --> 00:11:18,011 నేను ముందే ఊహించి ఉండాల్సింది. 126 00:11:18,804 --> 00:11:20,973 దాదాపుగా అత్యున్నత స్థాయికి చేరుకొని పని చేయడం ఎలా ఉంది? 127 00:11:23,600 --> 00:11:24,810 అది కూడా దాదాపుగా అత్యున్నతంగానే ఉంది. 128 00:11:25,435 --> 00:11:26,687 పోనిలే, నీకు ఇంకా టైమ్ ఉంది. 129 00:11:26,687 --> 00:11:27,771 ఇంకా చాలా జీవితం ఉంది. 130 00:11:29,398 --> 00:11:31,483 ఈ వీడియో ఆ రాండా కుర్రాడి దగ్గర ఉంది. 131 00:11:32,109 --> 00:11:33,569 నేను దీనిని ముందెప్పుడూ చూడలేదు. 132 00:11:34,820 --> 00:11:37,030 మేము మాకు ముందు వచ్చిన వారి శ్రమ మీద ఆధారపడి నడుస్తున్నాం. 133 00:11:37,573 --> 00:11:38,699 ఇది వినడానికి ఫన్నీగా ఉంది. 134 00:11:38,699 --> 00:11:41,201 నాకైతే మిమ్మల్ని చూస్తుంటే, మీరు ఆ శ్రమను కాలరాస్తున్నట్టు ఉంది, సరేనా? 135 00:11:41,201 --> 00:11:44,329 మోనార్క్ కి బాగా తెలిసినట్టే ఆ శ్రమను వృధా చేస్తున్నారు. 136 00:11:45,330 --> 00:11:46,874 ఆ తెలిసిన విషయం ఏంటి, కల్నల్? 137 00:11:46,874 --> 00:11:48,000 ఏం లేదు. 138 00:11:49,459 --> 00:11:51,503 మీకు అస్సలు ఏం తెలీదు. 139 00:11:54,339 --> 00:11:57,885 అయితే హిరోషి రాండా పిల్లలతో ప్రపంచమంతా చక్కర్లు కొట్టడం సంగతి ఏమంటారు, 140 00:11:57,885 --> 00:11:59,136 అలా చేయడం వల్ల ఏమైనా లాభముందా? 141 00:11:59,136 --> 00:12:01,680 ఆ పిల్లలు ఇప్పటికే మీరు ఫీల్డ్ లో పనికి పెట్టిన వారిలో 142 00:12:01,680 --> 00:12:04,141 సగం మంది ఎదుర్కొన్న పరిస్థితులను మించి ఎదుర్కొన్నారు. 143 00:12:04,141 --> 00:12:06,268 మీ వల్ల వాళ్ళ ప్రాణాలు పోయినంత పనైంది. 144 00:12:06,268 --> 00:12:08,353 నువ్వు అనుకునేదానికన్నా వాళ్ళు చాలా గట్టొళ్లు. 145 00:12:09,229 --> 00:12:10,564 అదేం కాదు. 146 00:12:11,440 --> 00:12:13,734 వాళ్ళు భయపడుతున్నారు. ఎవర్నైనా ఉత్తినే నమ్ముతారు. 147 00:12:14,902 --> 00:12:16,862 - ఎక్కువగా మాట్లాడతారు. - ఆపు. 148 00:12:16,862 --> 00:12:18,822 వాళ్లకు ఏమీ తెలీదు. ఆ విషయాన్ని నేను ధృవీకరించుకున్నాను. 149 00:12:18,822 --> 00:12:19,948 అది నీకు కూడా తెలుసు. 150 00:12:26,079 --> 00:12:30,167 తన పిల్లలకు ఇక్కడ తన పని గురించి హిరోషి చెప్పకపోవడానికి కారణం ఏమై ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? 151 00:12:33,212 --> 00:12:35,297 బహుశా వాళ్ళు ఇలాంటి జీవితం బ్రతకడం అతనికి ఇష్టం లేదేమో. 152 00:12:35,297 --> 00:12:37,883 నిజానికి ఆ విషయాన్ని నేను ఆలోచించలేదు. అది పెద్ద విషయమే. 153 00:12:39,301 --> 00:12:40,677 ఈసారి కలిసినప్పుడు నేను వాడిని అడుగుతాను. 154 00:12:43,680 --> 00:12:45,933 మీ ఉద్దేశం చచ్చి పైకి వెళ్ళాక కాదు అనుకుంట కదా. 155 00:12:45,933 --> 00:12:47,100 కాదు. 156 00:12:47,100 --> 00:12:50,395 - మీరు ఎక్కడికీ వెళ్ళలేరు. - అలాగే నువ్వు ఏమీ చేయలేవు, కదా? 157 00:12:51,021 --> 00:12:53,607 డెప్యూటీ... డైరెక్టర్. 158 00:13:01,365 --> 00:13:04,868 అతను మోనార్క్ ను స్థాపించిన వారిలో ఒకడు అంటున్నారు. కానీ అది 1950లలో కదా జరిగింది. 159 00:13:04,868 --> 00:13:07,496 నిజానికి అది నలభైలలో జరిగింది, కానీ ఆయన తర్వాత ఏళ్లలో సంస్థతో కలిసాడు. 160 00:13:07,496 --> 00:13:10,541 అయితే అతని వయసు ఎంత? కనీసం తొంబై ఉంటుంది కదా? అయినా ఆయన అలా ఎలా కనిపిస్తున్నాడు? 161 00:13:11,083 --> 00:13:15,587 ఒక మిషన్ లో పొరపాటు జరిగింది అని పుకార్లు ఉన్నాయి. కానీ ఆ సమాచారం బయటకు రాలేదు. 162 00:13:16,171 --> 00:13:17,631 ఇప్పుడు అతని గురించి ఏమని అనుకోవాలి? 163 00:13:17,631 --> 00:13:20,592 ఆయన నేరుగా వృద్ధాశ్రమం నుండి 164 00:13:20,592 --> 00:13:24,304 మన సంస్థలో ఎవరికీ తెలీని టైటన్ ని కనిపెట్టడానికి ఎలా వెళ్ళాడు? 165 00:13:24,304 --> 00:13:27,933 అతనికి ఏం తెలుసు? ఇదంతా ఫైల్స్ లో ఉన్నాయి అని మాత్రం చెప్పకు. 166 00:13:32,938 --> 00:13:34,481 బహుశా ఉండి ఉండొచ్చు. 167 00:13:49,997 --> 00:13:52,291 ఇంకొక పది నిమిషాలలో కారు వస్తుంది. 168 00:13:52,291 --> 00:13:53,834 ప్యాసింజర్లకు గమనిక. 169 00:13:53,834 --> 00:13:55,627 అనిశ్చిత సమయంలో... 170 00:13:55,627 --> 00:13:56,712 ఓక్లాండ్ ఎయిర్పోర్ట్ 171 00:13:56,712 --> 00:13:59,548 ...హెచ్చరిక లేకుండా చెప్పశక్యం కానీ విపత్తు ఎదురైనప్పుడు, 172 00:13:59,548 --> 00:14:01,425 అదృష్టవంతులు బ్రతికి బయటపడొచ్చు, 173 00:14:02,009 --> 00:14:04,178 కానీ తెలివైన వారు హాయిగా బ్రతుకుతారు. 174 00:14:04,720 --> 00:14:09,183 స్ట్రాట సెక్యూర్ హోమ్స్ అనబడేది భూమి కింద ఉండే మల్టీ లెవెల్ లగ్జరీ లివింగ్ అపార్ట్మెంట్, 175 00:14:09,183 --> 00:14:12,311 టైటనియంతో భూగర్భంలో రక్షణ ఇస్తుంది, 176 00:14:12,311 --> 00:14:14,479 భయంకరమైన, ప్రమాదకరమైన విషయాల నుండి కాపాడుతూ... 177 00:14:14,479 --> 00:14:16,315 కస్టమ్ బంకర్లలో ఎవరు ఉండాలనుకుంటారు? 178 00:14:17,900 --> 00:14:20,152 టెక్ పరిశ్రమలోని వారు. వాళ్ళు మాత్రమే అంత డబ్బు ఖర్చు చేయగలరు. 179 00:14:27,659 --> 00:14:28,660 హేయ్. 180 00:14:30,537 --> 00:14:31,538 బాగానే ఉన్నావా? 181 00:14:33,582 --> 00:14:35,959 స్టేట్స్ కి వచ్చే నా మొదటి ట్రిప్ ఇలా ఉంటుంది అని అనుకోలేదు. 182 00:14:37,920 --> 00:14:39,296 ఏంటి? ఏమీ తోచడం లేదా? 183 00:14:39,838 --> 00:14:43,300 దేని కోసం వెతుకుతున్నావో, ఏం కనిపెడతావో తెలియని స్థితి. 184 00:14:44,218 --> 00:14:46,803 బహుశా మీ ఇంటికి వచ్చినప్పుడు ఆమె కూడా అలాగే ఫీల్ అయ్యుంటుంది. 185 00:14:54,061 --> 00:14:55,062 కేట్! 186 00:15:01,276 --> 00:15:02,277 అబ్బా. 187 00:15:06,365 --> 00:15:08,867 క్షమించు. కానీ నువ్వు ఎలాంటి కారు కావాలని అడిగావు? 188 00:15:08,867 --> 00:15:10,369 - అది ఎవరు? - అతను జేమ్స్. 189 00:15:11,161 --> 00:15:12,162 కేట్. 190 00:15:12,663 --> 00:15:16,291 - హేయ్, తిరిగి స్వాగతం. - నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, జేమ్స్? 191 00:15:16,291 --> 00:15:17,543 అమ్మతో మేము బాగానే ఉంటాం అని చెప్పాను. 192 00:15:17,543 --> 00:15:18,919 కానీ మనం బాగా ఏం లేము. 193 00:15:20,587 --> 00:15:24,299 హలో. నేను జేమ్స్. కారోలిన్ పని చేసే చోట ఆమె ఫ్రెండ్ ని. మిమ్మల్ని కలవడం సంతోషం. 194 00:15:24,299 --> 00:15:27,636 వీళ్ళు నేను పని చేయని చోట కలుసుకున్న ఫ్రెండ్స్. మే ఇంకా కెంటారో. 195 00:15:27,636 --> 00:15:29,096 - స్వాగతం. - హేయ్. 196 00:15:29,096 --> 00:15:31,765 స్వాగతం. రండి. 197 00:15:31,765 --> 00:15:32,891 నేను ఒక కారు తెప్పిస్తున్నాను. 198 00:15:32,891 --> 00:15:35,102 - దాన్ని క్యాన్సిల్ చెయ్. - నాకు క్యాన్సిల్ చేయాలని లేదు. 199 00:15:35,102 --> 00:15:36,645 మేము షేరింగ్ క్యాబ్ లో వస్తాం అని అమ్మతో చెప్పాను. 200 00:15:39,690 --> 00:15:40,941 ఆమె బలవంతం చేసింది. 201 00:15:40,941 --> 00:15:45,404 అలాగే మిమ్మల్ని తీసుకెళ్లడం నాకు సంతోషం. నేను వచ్చేసాను కదా. ఇక నీ కోటు ఇవ్వు. 202 00:15:45,404 --> 00:15:46,780 నీ కోటు కూడా ఇవ్వు. 203 00:15:47,447 --> 00:15:49,491 ఆమె తనది తాను తెచ్చుకోవచ్చు. పదండి. 204 00:15:50,075 --> 00:15:51,285 ఇక వెళదాం! 205 00:15:59,751 --> 00:16:03,463 {\an8}ఆలమీడ పాయింట్ ఫెమా హోసింగ్ 206 00:16:03,463 --> 00:16:07,176 {\an8}ఫెమా వారు జనాన్ని ఇంకొక చోటుకు తీసుకెళ్లాలని చూసారు, కానీ చాలా మంది వెళ్ళడానికి ఇష్టపడలేదు. 207 00:16:07,759 --> 00:16:09,845 సాన్ ఫ్రాన్సిస్కో రియల్ ఎస్టేట్ ను వదులుకోవడం కష్టం కదా. 208 00:16:10,387 --> 00:16:13,098 ఇక్కడి వారు నాశనమైన సిటీలోకి జనాన్ని టూర్ తీసుకెళ్తున్నారు అన్నది నిజమేనా? 209 00:16:14,016 --> 00:16:17,352 అవును. మిలటరీ వారు అడ్డుపడే వరకు అలా జరిగింది. 210 00:16:17,352 --> 00:16:20,105 "ట్రామా టూరిస్టులు," విపత్తును చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు, 211 00:16:20,105 --> 00:16:23,483 లేదా ఇదంతా ప్రభుత్వ కుట్ర అని నిరూపించడానికి చూసేవారు అలా వెళతారు. 212 00:16:24,234 --> 00:16:25,736 చెత్త వెధవలు. 213 00:16:28,155 --> 00:16:29,948 మా అమ్మ కూడా అలా వెళ్ళడానికి ప్రయత్నించింది... 214 00:16:31,241 --> 00:16:32,492 మా నాన్నను కనిపెట్టడానికి. 215 00:16:47,090 --> 00:16:48,091 అక్కడికి వెళ్ళండి. 216 00:16:49,760 --> 00:16:51,386 - పర్లేదా? - అవును. థాంక్స్. 217 00:16:51,386 --> 00:16:52,471 జాగ్రత్తగా ఉండు. 218 00:16:55,933 --> 00:16:57,809 మీ అమ్మతో నేను ఆమెను ఇవాళ రాత్రి కలుస్తాను అని చెప్పు. 219 00:16:58,685 --> 00:16:59,728 ఇంటికి స్వాగతం. 220 00:16:59,728 --> 00:17:00,812 థాంక్స్. 221 00:17:06,276 --> 00:17:08,444 అతన్ని చూస్తుంటే అచ్చమైన అమెరికన్ లా ఉన్నాడు. 222 00:17:14,535 --> 00:17:15,911 మేము కొంచెం అలా వెళతాం. 223 00:17:16,703 --> 00:17:19,330 అవును. ముందుగా మీరు కొంచెం మాట్లాడుకోవడానికి టైమ్ ఇస్తాము. 224 00:17:20,415 --> 00:17:21,708 మంచి ఐడియా. 225 00:17:21,708 --> 00:17:23,377 ఆమెతో నెమ్మదిగా మాట్లాడి విషయం చెప్పు. 226 00:17:23,919 --> 00:17:25,503 మీ అమ్మకు చెప్పినట్టా? 227 00:17:25,503 --> 00:17:28,632 వావ్. కేట్, నువ్వు తిరిగి వచ్చావు. 228 00:17:32,302 --> 00:17:33,303 నువ్వు తిరిగి వచ్చావు. 229 00:17:38,725 --> 00:17:39,768 హేయ్. 230 00:17:40,727 --> 00:17:42,479 నీతో ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చావు. 231 00:17:43,564 --> 00:17:46,692 అమ్మా, ఇది మే ఇంకా కెంటారో. 232 00:17:48,569 --> 00:17:49,570 నేను కారోలిన్ ని. 233 00:17:49,570 --> 00:17:50,654 హాయ్. చాలా సంతోషం. 234 00:17:50,654 --> 00:17:52,114 మిమ్మల్ని కలవడం సంతోషం. 235 00:17:52,114 --> 00:17:53,198 స్వాగతం. 236 00:17:54,032 --> 00:17:56,451 వావ్. మీరిద్దరూ టోక్యో నుండి వచ్చారా? 237 00:17:57,870 --> 00:17:59,246 - అవును. - ఏ ఏరియా నుండి? 238 00:17:59,246 --> 00:18:00,622 ఎందుకంటే నా భర్త అక్కడికి అస్తమాను వెళ్లి... 239 00:18:00,622 --> 00:18:02,457 అమ్మా, ఇతను కెంటారో రాండా. 240 00:18:07,754 --> 00:18:09,548 టోక్యోలో నేను ఏం కనిపెట్టానో అడిగావు కదా. 241 00:18:19,600 --> 00:18:23,562 మీరు అలసిపోయి ఉంటారు, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. 242 00:18:24,354 --> 00:18:25,647 లోనికి రావచ్చు కదా? 243 00:18:28,525 --> 00:18:31,486 ఓరి, నాయనో. ఇల్లు అస్తవ్యస్తంగా ఉంది, క్షమించండి. 244 00:18:33,280 --> 00:18:37,075 జేమ్స్ ఇంకా నేను... జేమ్స్ నేను పనిచేసే చోట... 245 00:18:38,619 --> 00:18:41,371 మేము శిథిలాల నుండి జనానికి సంబంధించినవి సేకరిస్తూ ఉంటాం. 246 00:18:41,371 --> 00:18:44,458 కానీ నేను నా పనికి సంబంధించినవి అస్తమాను ఇంటికి తెస్తుంటాను. 247 00:18:45,542 --> 00:18:46,668 దయచేసి కూర్చోండి. 248 00:18:46,668 --> 00:18:48,253 అమ్మా. 249 00:18:51,048 --> 00:18:52,299 తెలుసా, జనం భలే వింతైనోళ్లు. 250 00:18:52,299 --> 00:18:54,593 ఎవరూ డబ్బు కోసమో, విలువైన వాటి కోసమో అడగరు. 251 00:18:54,593 --> 00:18:56,762 అందరికీ ఇలాంటి వస్తువుల మీదే ఆసక్తి. 252 00:18:57,429 --> 00:18:58,555 వాళ్ళ వ్యక్తిగత జ్ఞాపకాల మీద. 253 00:19:00,182 --> 00:19:01,099 అమ్మా, ఆపు. 254 00:19:01,099 --> 00:19:02,851 - ఆగండి, నేను సాయం చేస్తాను. - నేను పట్టు... 255 00:19:05,479 --> 00:19:06,480 ఆపు! 256 00:19:09,066 --> 00:19:10,400 నేను తీస్తాను. 257 00:19:27,459 --> 00:19:30,671 మీరు కొంచెం నా రూమ్ లో ఎదురుచూస్తారా? హాల్ లో ఎడమ వైపు ఉంటుంది. 258 00:19:44,560 --> 00:19:45,936 అసలు ఏం జరుగుతోంది? 259 00:19:49,231 --> 00:19:50,315 నిజానికి చాలానే జరుగుతోంది. 260 00:19:50,315 --> 00:19:51,817 నేను ఏమని అడిగానో నీకు తెలుసు. 261 00:19:53,068 --> 00:19:54,778 నీ భర్తకు ఉన్న రహస్య కొడుకు రోజూ నీ ఇంటికి 262 00:19:54,778 --> 00:19:57,155 వస్తుంటాడు అన్నట్టు వాడికి స్వాగతం పలుకుతున్నావు. 263 00:19:58,782 --> 00:20:00,909 మరి నన్ను ఏం చేయమంటావు? వాడిని బయటకు పంపేయాలా? 264 00:20:02,703 --> 00:20:03,912 బొబ్బర్లు పెడుతూ ఏడవాలా? 265 00:20:03,912 --> 00:20:05,831 ఏడువు. నేనేం కాదు అనను. 266 00:20:06,748 --> 00:20:08,250 ఏం పర్లేదు. 267 00:20:12,462 --> 00:20:13,505 కేట్. 268 00:20:14,548 --> 00:20:15,549 కేట్... 269 00:20:19,970 --> 00:20:22,431 మీ నాన్న మనతో గడిపింది చాలా తక్కువ. 270 00:20:24,057 --> 00:20:26,101 అందుకే నీకు ఆ లీజ్ దొరికినప్పుడు, 271 00:20:26,852 --> 00:20:28,353 నువ్వు అక్కడికి వెళితే బహుశా... 272 00:20:29,188 --> 00:20:31,899 ఆయనకు వేరే సంబంధం లేదా గర్ల్ ఫ్రెండ్ ఉందేమో తెలుస్తుంది అని... 273 00:20:31,899 --> 00:20:33,192 అయితే నువ్వే నన్ను అక్కడికి పంపావు. 274 00:20:34,026 --> 00:20:35,861 - కానీ... - నువ్వు నిజం తెలుసుకోవాలనుకున్నావు కాబట్టి 275 00:20:35,861 --> 00:20:37,196 నన్ను బలవంతం చేసి మరీ పంపావు, 276 00:20:37,196 --> 00:20:39,156 కానీ ఆ పనిని నువ్వే చేయడానికి నీకు ధైర్యం చాలలేదు. 277 00:20:40,532 --> 00:20:43,327 నాతో అలా మాట్లాడకు. నేను నీకు ఏది మంచిదో దే... 278 00:20:43,327 --> 00:20:46,038 - ఇది నాకు మంచిదా? - అవును. అవును. 279 00:20:48,040 --> 00:20:50,584 సరే, నేను నిన్ను బలవంతం చేశా. 280 00:20:51,376 --> 00:20:52,878 కానీ నేను మాత్రం ఇంకేం చేయగలను? 281 00:20:52,878 --> 00:20:57,549 నువ్వు రోజంతా సమయం వృధా చేస్తూ నీ గదిలోనే ఉండేదానివి. 282 00:20:57,549 --> 00:20:59,259 కనీసం ఎలాంటి సపోర్ట్ గ్రూప్లలో చేరేదానివి కాదు... 283 00:20:59,259 --> 00:21:02,054 ఎందుకంటే నేను ఆ క్లాసులకు వెళ్లినంత మాత్రానా చనిపోయిన ఆ పిల్లలు తిరిగి రారు. 284 00:21:05,432 --> 00:21:08,060 కానీ నువ్వు నీ పరిస్థితిని మార్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. 285 00:21:08,936 --> 00:21:10,187 అది నా నిర్ణయం. 286 00:21:10,854 --> 00:21:14,816 కానీ నా కూతురు ఊరికే కూర్చొని తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే నేను చూడలేను. 287 00:21:18,445 --> 00:21:20,906 సరే. నేను నా గది నుండి బయటకు వెళ్లాలని అనుకున్నావు. 288 00:21:21,615 --> 00:21:22,866 బ్రతకడానికి కారణం ఉండాలి అనుకున్నావు. 289 00:21:23,659 --> 00:21:24,826 అంతా నువ్వు కోరుకున్నట్టే అయింది. 290 00:21:26,411 --> 00:21:27,746 మేము నాన్న ఆఫీసుకు వెళ్తున్నాం. 291 00:21:27,746 --> 00:21:29,540 ఏంటి? ఎందుకు? 292 00:21:29,540 --> 00:21:31,041 ఆయన మన నుండి ఇంకేం దాచాడో తెలుసుకోవడానికి. 293 00:21:31,041 --> 00:21:33,085 అసలు ఆయన ఆఫీసు ఇంకా ఉందో లేదో కూడా మనకు తెలీదు. 294 00:21:33,085 --> 00:21:35,087 సరే, కానీ అక్కడ ఏం ఉందో చూడటానికి నువ్వు మమ్మల్ని తీసుకెళ్లగలవు. 295 00:21:35,087 --> 00:21:36,755 లేదు, రెడ్ జోన్ లోకి తీసుకెళ్లలేను. 296 00:21:37,297 --> 00:21:39,883 మిలటరీ వారు ఆ ప్రదేశాన్ని మూసేసారు. రోజూ అక్కడికి వెళ్లే దొంగలను అరెస్టు చేస్తున్నారు. 297 00:21:39,883 --> 00:21:41,260 కొందరిని కాల్చి చంపుతున్నారు కూడా. 298 00:21:41,260 --> 00:21:43,136 అంటే వాళ్ళు వెళ్తున్నారు కదా. మేము వాళ్ళతో వెళతాం. 299 00:21:51,854 --> 00:21:55,858 పునర్నిర్మాణ ప్రదేశం ఎంట్రన్స్ దక్షిణ గోడ 300 00:22:11,957 --> 00:22:13,041 హలో అండి. 301 00:22:13,041 --> 00:22:15,794 హేయ్. ఇవాళ కొల్బీ ఎక్కడికి వెళ్ళాడు? 302 00:22:15,794 --> 00:22:18,046 - వాడికి అనారోగ్యం చేసింది. - మళ్లీనా? 303 00:22:25,262 --> 00:22:27,514 ఇదుగోండి. మీ సహకారానికి. 304 00:22:27,514 --> 00:22:28,599 రాండా, కారోలిన్ ఫెమా 305 00:22:29,183 --> 00:22:30,392 ఎక్కువ సేపు లైన్ లో ఉండము లెండి. 306 00:22:33,353 --> 00:22:35,105 సరే, గేటు తెరవండి. 307 00:22:36,273 --> 00:22:37,232 హేయ్! 308 00:22:38,358 --> 00:22:40,527 వీళ్ళను పోనివ్వండి. వీళ్ళు వెళ్లొచ్చు. 309 00:22:40,527 --> 00:22:42,237 - గేటు తెరవవచ్చు. - సరే. 310 00:22:45,657 --> 00:22:46,742 సరే. మీరు వెళ్లొచ్చు. 311 00:22:48,118 --> 00:22:49,161 వెళ్లొచ్చు. 312 00:22:52,873 --> 00:22:54,791 రేపు నీకు సెలవు ఇవ్వాలని ఆశిస్తున్నా, కార్లా. 313 00:22:56,001 --> 00:22:57,002 నీకు అది అవసరం. 314 00:22:57,628 --> 00:22:58,629 థాంక్స్. 315 00:22:58,629 --> 00:22:59,713 వీళ్ళు వెళ్లొచ్చు. 316 00:23:03,300 --> 00:23:04,593 సరే. వాళ్ళను వెళ్లనివ్వండి. 317 00:23:34,873 --> 00:23:37,334 ఫెమా - పరిమితం చేయబడిన ప్రదేశం అనుమతి కావలెను 318 00:23:54,643 --> 00:23:56,728 ఇది నిజం కాదని ఎవరైనా ఎలా అనుకోగలరు? 319 00:23:57,729 --> 00:24:00,190 రోజూ నిద్ర లేచిన తర్వాత మనకు కూడా ఇలాగే జరగొచ్చు, 320 00:24:00,899 --> 00:24:02,860 అని ఆలోచించడం కంటే అలా అనుకోవడమే సులభం. 321 00:24:10,576 --> 00:24:12,661 సరే. మేము ఇంతకు మించి లోనికి వెళ్లలేం. 322 00:24:13,245 --> 00:24:17,791 గార్డులు మాతో లోనికి వచ్చిన అందరూ తిరిగి బయటకు వచ్చేలా చూస్తారు. 323 00:24:17,791 --> 00:24:21,420 అక్కడ గనుక మీరు కనిపిస్తే, మిమ్మల్ని దొంగలు అనే అనుకుంటారు. 324 00:24:22,254 --> 00:24:25,883 ప్రశ్నించడం ఉండదు, సాకులు చెప్పలేరు. సరేనా? 325 00:24:26,466 --> 00:24:28,427 మనం రేపు ఉదయానికి వెళ్ళిపోవాలి. 326 00:24:28,427 --> 00:24:30,304 అందరం కలిసి వెళ్ళాలి. 327 00:24:30,304 --> 00:24:31,513 మేము ఇక్కడికి ఎనిమిది గంటలకు వస్తాం. 328 00:24:32,181 --> 00:24:34,224 ఎనిమిది పావుకు గేట్లు మూసేస్తారు. 329 00:24:34,224 --> 00:24:35,601 అమ్మా, మాకు అర్థమైంది. 330 00:24:35,601 --> 00:24:36,977 అయ్యుంటుందనే ఆశిస్తున్నా. 331 00:25:02,461 --> 00:25:04,796 అవును, మీరు ఈ సంస్థ కోసం ఎన్నో త్యాగాలు చేసాకా కూడా, 332 00:25:05,297 --> 00:25:08,467 వాళ్ళు మీకు చేసింది చూస్తుంటే నాకు కోపం వస్తోంది. 333 00:25:08,467 --> 00:25:10,093 నువ్వు నిజంగానే అలా అంటున్నావని నమ్ముతున్నా. 334 00:25:10,093 --> 00:25:12,095 కానీ ఆ విషయమై ఏమైనా చేయడానికి నువ్వు ప్రయత్నించావా? 335 00:25:12,095 --> 00:25:15,182 నేను నాకు వీలైంది చేశాను. కంపెనీని నడిపించడం నా డ్యూటీ కాదు. 336 00:25:15,182 --> 00:25:16,850 ఇప్పటికీ కాదనే తెలుస్తుంది. 337 00:25:20,812 --> 00:25:24,525 మీరు ఎన్నో ఏళ్లుగా తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు. 338 00:25:24,525 --> 00:25:26,693 ఇప్పుడే మళ్ళీ ఎందుకు ఇదంతా మొదలెట్టారు? 339 00:25:26,693 --> 00:25:31,823 ప్రపంచం నాశనం అవుతోంది. కాబట్టి నేను ఏమైనా చేయాలని నిర్ణయించుకున్నా. 340 00:25:35,244 --> 00:25:36,578 నీకు సాయం చేయాలని ఉందా? 341 00:25:37,412 --> 00:25:38,914 చేయాలని ఉంది అనే అనుకుంటున్నా. 342 00:25:38,914 --> 00:25:41,208 ఈ విషయం మీద ప్రపంచంలోనే అత్యంత తెలివైన వారితో పని చేయిస్తున్నాం. 343 00:25:41,208 --> 00:25:42,709 కల్నల్, మీరు ఇక వెనక్కి తగ్గొచ్చు. 344 00:25:43,377 --> 00:25:46,797 "ప్రపంచంలోనే అత్యంత తెలివైన" వారికి జి-డే కోసం సిద్ధపడటానికి 60 ఏళ్ళు ఇచ్చారు. 345 00:25:47,673 --> 00:25:48,674 "వాటిని కొట్లాడుకోనిద్దాం." 346 00:25:49,800 --> 00:25:51,385 అంతకంటే మంచి ఐడియా వాళ్లకు తట్టలేదా? 347 00:25:52,261 --> 00:25:56,515 గాడ్జిల్లా ఓడిపోయి ఉంటే ఏమయ్యేది? 348 00:25:59,476 --> 00:26:01,019 బిల్ రాండా ఫైల్స్ లో ఏముంది? 349 00:26:01,019 --> 00:26:04,606 నీకు తెలీనిది ఏం లేదు, కానీ నమ్మడానికి నీకు మనసు లేని ఎన్నో ఉన్నాయి. 350 00:26:04,606 --> 00:26:05,691 పదవినోదం చేయకండి. 351 00:26:06,358 --> 00:26:08,652 అయితే ఇలాగే నడుచుకుంటా అంటారా, కల్నల్? 352 00:26:08,652 --> 00:26:10,445 షఫల్ బోర్డు గేమ్స్ ఆడుతూ, 353 00:26:10,445 --> 00:26:12,948 బోన్సాయ్ మొక్కలు పెంచుతూ చాలా కష్టపడ్డాను అనుకుంటున్నారా? 354 00:26:12,948 --> 00:26:15,033 నేను కష్టపడ్డానని ఎప్పుడూ అనలేదు. బాచ్ బాల్ అయితే బాగా నేర్చుకున్నా... 355 00:26:15,033 --> 00:26:16,159 దేవుడి మీద ఒట్టు, 356 00:26:17,369 --> 00:26:21,498 నేను మిమ్మల్ని పాతాళంలో పాతేయగలను, లేక ఇంకెక్కడైనా పాతేయగలను. 357 00:26:24,668 --> 00:26:25,669 మీ ఇష్టం. 358 00:26:27,004 --> 00:26:28,005 నన్ను పాతేస్తావా? 359 00:26:29,506 --> 00:26:31,216 ఇప్పుడు నువ్వు పదవినోదం చేస్తున్నావా? 360 00:26:32,050 --> 00:26:34,720 అసలే టైమ్ లేని సమయంలో వృధా ముచ్చట్లు పెడుతున్నావు. 361 00:26:35,804 --> 00:26:39,224 మోనార్క్ తప్పటడుగు వేసింది. 362 00:26:40,642 --> 00:26:41,810 చాలా చాలా కాలంగా... 363 00:26:42,811 --> 00:26:45,772 తప్పే చేస్తూ వచ్చింది. 364 00:27:13,509 --> 00:27:14,635 ఆమె చెప్పింది నీకు వినిపించలేదా? 365 00:27:16,261 --> 00:27:17,513 వాళ్ళు దొంగలను షూట్ చేస్తారు. 366 00:27:18,430 --> 00:27:19,515 నేను ఆధారాలను తింటున్నాను. 367 00:27:26,271 --> 00:27:29,650 ఒక బిల్డింగ్ పాడైనట్టు కనిపించకపోయినా, ఆ దాడి వల్ల పునాది బలహీనమైపోయింది. 368 00:27:29,650 --> 00:27:31,652 కాబట్టి కొన్నిసార్లు ఇలా కొన్ని బిల్డింగులు అకస్మాత్తుగా కూలుతుంటాయి. 369 00:27:33,695 --> 00:27:34,947 పదండి. 370 00:28:01,515 --> 00:28:03,100 నేను ఇక్కడ పరీక్ష పేపర్లు దిద్దెదాన్ని. 371 00:28:05,018 --> 00:28:06,436 ఇది నువ్వు ఉండిన ప్రదేశమా? 372 00:28:06,937 --> 00:28:07,938 అవును. 373 00:28:10,983 --> 00:28:12,901 ఇది మా ఫేవరెట్ కాఫీ షాపు. 374 00:28:17,823 --> 00:28:19,825 జి-డేకి రెండు రోజుల ముందు 375 00:28:19,825 --> 00:28:22,494 - హాయ్. - హేయ్. 376 00:28:24,329 --> 00:28:25,747 నాకు ఇది కావాలి. 377 00:28:36,091 --> 00:28:37,342 నాకు ఇది కావాలి. 378 00:28:48,353 --> 00:28:49,855 ఎంత సేపటి నుండి ఎదురుచూస్తున్నావు? 379 00:28:49,855 --> 00:28:54,151 నేను నిద్ర లేచి, 5:30 కల్ల బయటికి వచ్చాను. శ్రీమతి యీకి కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నా. 380 00:28:54,151 --> 00:28:56,570 అవును, అర్థం చేసుకోగలను. నెలలో మొదటి తారీఖు కదా. 381 00:28:56,570 --> 00:29:00,699 మా ఇద్దరిదీ నిజంగానే పిల్లి ఎలుక జీవితంలా అయింది. నేను తప్పించుకోలేకుండా అన్ని చోట్లా వెతుకుతుంది. 382 00:29:01,783 --> 00:29:06,747 నువ్వు ఉండని అపార్ట్మెంట్ కోసం నువ్వు అనవసరంగా బోలెడంత డబ్బు ఖర్చు చేస్తున్నావు. 383 00:29:06,747 --> 00:29:10,083 ఒక్కదానివే ఉండటం కంటే ఇద్దరం కలిసి ఉంటే ఖర్చు కూడా తగ్గుతుంది. 384 00:29:11,877 --> 00:29:13,879 చూడు, నువ్వు రోజూ నీ ఇథియోపియన్ డార్క్ రోస్ట్ కాఫీ 385 00:29:13,879 --> 00:29:18,133 లేదా భోజనంలో ఏదో ఒక్కటే కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. 386 00:29:23,805 --> 00:29:25,349 ఇప్పటికే నీకు అర్థం కాలేదా? 387 00:29:26,975 --> 00:29:27,976 నీకు అర్థం కాలేదా? 388 00:29:36,902 --> 00:29:40,489 శ్రీమతి యీకి ఉద్యోగం మానేస్తున్నాని నోటీసు ఇవ్వొచ్చు కదా, 389 00:29:40,489 --> 00:29:44,201 ఈ నెలాఖరుకి బయటకు వచ్చేస్తానని చెప్పు. 390 00:29:57,631 --> 00:29:58,966 అయితే ఇక మొదలవుతుంది. 391 00:30:11,562 --> 00:30:14,273 జి-డేకి ఒక రోజు ముందు 392 00:30:14,273 --> 00:30:15,899 టీచర్ వస్తోంది. 393 00:30:15,899 --> 00:30:17,568 క్లాసులో ఫోన్లు వాడకూడదు. 394 00:30:18,235 --> 00:30:19,862 నేను చెప్పాను కదా. 395 00:30:22,322 --> 00:30:23,323 అందరూ ఎక్కడికి వెళ్లారు? 396 00:30:23,949 --> 00:30:25,158 ఇళ్లలో ఉండిపోయారు. 397 00:30:25,158 --> 00:30:27,369 భారీ రాక్షస జీవుల భయంతో వాళ్ళ అమ్మా నాన్నలు పంపలేదు. 398 00:30:27,369 --> 00:30:28,579 మా వాళ్లకు భయం లేదు. 399 00:30:28,579 --> 00:30:32,082 మా నాన్న ఇదంతా రియల్ ఎస్టేట్ రేట్లు తగ్గించడానికి చేస్తున్న దుష్ప్రచారం అన్నారు. 400 00:30:34,835 --> 00:30:37,713 బ్రేకింగ్ న్యూస్ పశ్చిమ తీర ప్రాంతాలు ఖాళీ చేయాలి 401 00:30:40,966 --> 00:30:42,426 సరే. ఫోన్లు పక్కన పెట్టండి. 402 00:30:43,760 --> 00:30:47,431 చాడ్ వాళ్ళ నాన్న అన్నది నిజమే కావచ్చు. ఇది ఏదైనా ఒక ఆకతాయి పని అయ్యుండొచ్చు. 403 00:30:48,891 --> 00:30:50,058 ఇక్కడ అందరూ బాగానే ఉన్నారా? 404 00:30:52,436 --> 00:30:54,021 - కేట్? - మేము బాగానే ఉన్నాం. 405 00:30:54,897 --> 00:30:57,983 ఇవాళ్టి పాఠం: ఇంటర్నెట్ లో చూసే ప్రతీదాన్ని నమ్మకూడదు. 406 00:30:59,151 --> 00:31:01,111 మేము పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. 407 00:31:01,111 --> 00:31:02,446 వీళ్ళ ఫోన్లలో ఛార్జింగ్ ఉండేలా చూసుకో, 408 00:31:02,446 --> 00:31:04,781 అలాగే వీళ్లను వారి కుటుంబాలతో తిరిగి చేర్చే ప్లానుల గురించి అంతా చెప్పు. 409 00:31:05,574 --> 00:31:07,576 స్కూల్ ని మూసేయాలా వద్దా అన్న నిర్ణయాన్ని తర్వాత చెప్తాము. 410 00:31:11,663 --> 00:31:12,873 మిస్ రాండా. 411 00:31:14,291 --> 00:31:15,959 అవి తర్వాత ఇక్కడికి వస్తున్నాయా? 412 00:31:22,090 --> 00:31:24,551 ఇది పిల్లుల పిచ్చిదాని దీవి లాగ ఉంది. 413 00:31:27,262 --> 00:31:28,430 లేదా పిల్లుల పిచ్చోడిది. 414 00:31:31,808 --> 00:31:33,143 మా అంకుల్ కి పిల్లుల పిచ్చి. 415 00:31:35,395 --> 00:31:36,396 సరే. 416 00:31:55,874 --> 00:31:56,875 మనం ముందుకు వెళితే మంచిది. 417 00:32:02,631 --> 00:32:04,341 సరే, నేను వెళ్లి చూస్తాను. 418 00:32:04,341 --> 00:32:05,634 అక్కడికి. 419 00:32:08,720 --> 00:32:11,515 ఎవరక్కడ? మిమ్మల్ని చూడటానికి బయటకు రండి! 420 00:32:22,442 --> 00:32:23,443 జి-డే 421 00:32:23,443 --> 00:32:25,404 - ఇది ఎటు వెళ్తోంది? - ఉత్తరం, గోల్డెన్ గేట్ బ్రిడ్జి దగ్గరకు. 422 00:32:25,404 --> 00:32:26,822 - పదండి. - పదండి. 423 00:32:26,822 --> 00:32:29,032 ఈవ, పదా. దానిని వదిలేయ్. ఏం కాదు. 424 00:32:29,032 --> 00:32:30,951 - నీకు ఏం సాయం కావాలి? - నీ ఇష్టం. 425 00:32:30,951 --> 00:32:33,370 నేను పిల్లల అమ్మా నాన్నలు వాళ్ళను తీసుకెళ్లే వరకు నేను వాళ్ళతోనే ఉంటాను. 426 00:32:33,954 --> 00:32:35,038 నువ్వు వెళ్ళు. నేను వెనుక వస్తాను. 427 00:32:35,038 --> 00:32:36,498 బార్ట్ స్టేషన్స్ లో ఆవాసం ఉందని మేయర్ అన్నారు. 428 00:32:36,498 --> 00:32:38,917 అవును, తల్లిదండ్రులు రాకపోతే మేము అక్కడికి వెళ్తాము. 429 00:32:38,917 --> 00:32:40,711 ఆ సన్నాసులు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారో తెలీడం లేదు. 430 00:32:40,711 --> 00:32:42,671 వాళ్ళు కేవలం బస్సులను మాత్రమే బ్రిడ్జిలను దాటనిస్తున్నారు. 431 00:32:42,671 --> 00:32:44,464 కేట్, నువ్వు ఇందులో వెళ్తున్నావా? 432 00:32:44,464 --> 00:32:46,383 నీకు డానీతో ఉండాలని ఉంటే నీకు బదులు నేను వెళ్తాను. 433 00:32:46,383 --> 00:32:47,467 పదండి. 434 00:32:50,679 --> 00:32:54,600 మీరు ఫెడరల్ ఆర్డర్ కి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. నెమ్మదిగా బయటకు రండి. 435 00:33:02,024 --> 00:33:03,525 ఓయ్, బయటకు రండి! 436 00:33:09,990 --> 00:33:11,283 మీరు ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు. 437 00:33:11,783 --> 00:33:12,784 కేట్. 438 00:33:14,411 --> 00:33:15,454 నేను హ్యాండిల్ చేస్తా. 439 00:33:30,636 --> 00:33:31,637 ఎవరైనా ఉన్నారా? 440 00:33:38,101 --> 00:33:39,603 చెత్త పిల్లులు ఉన్నాయి అంతే. 441 00:33:39,603 --> 00:33:41,355 మనం వీటిని కూడా కాల్చి పారేస్తే మంచిది. 442 00:33:41,355 --> 00:33:42,856 - ఊరుకో, మిత్రమా. - సరే. 443 00:33:42,856 --> 00:33:43,941 లేదు, నిజంగా అంటున్నా. 444 00:33:49,613 --> 00:33:50,822 మీరు బాగానే ఉన్నారా? 445 00:33:52,115 --> 00:33:53,116 నేను బానే ఉన్నా. 446 00:34:12,469 --> 00:34:14,638 ఓహ్, అవును. అది ఎక్కువ దూరంలో లేదు. 447 00:34:15,389 --> 00:34:16,389 ఇలా పదండి. 448 00:34:29,820 --> 00:34:31,071 మీకు మంచి పాట ఏమైనా తెలుసా? 449 00:34:36,118 --> 00:34:37,119 మెల్లిగా పాడు. 450 00:34:40,998 --> 00:34:43,583 నా దారికి అడ్డు లెగు. 451 00:34:51,257 --> 00:34:52,259 నిశ్శబ్దం. 452 00:34:56,679 --> 00:34:59,516 భలే రుచిగా ఉంది! ఇదే అది. 453 00:35:03,896 --> 00:35:05,856 నాన్న ఈ పిచ్చి కమర్షియల్స్ పాటలు పాడుతుండేవారు. 454 00:35:06,773 --> 00:35:09,234 ఆయన "నేను చెప్పేది విను" అన్నట్టు సీరియస్ గా చూస్తూ 455 00:35:09,234 --> 00:35:11,737 తర్వాత సిల్లీగా ఏమైనా చేసేవారు. 456 00:35:12,446 --> 00:35:13,530 అవును. 457 00:35:18,368 --> 00:35:20,454 త్రిభుజం ఆకారం వెనుక ఉన్న రహస్యం ఏంటి? 458 00:35:22,372 --> 00:35:24,958 రుచికరమైన ఆహారం వెనుకున్న రహస్యం... 459 00:35:24,958 --> 00:35:26,293 నేను నీకు చెప్పను! 460 00:35:26,293 --> 00:35:28,504 - టాడా! - కాస్త నెమ్మదిగా పాడండి. 461 00:35:30,464 --> 00:35:33,091 నీకు ఆర్నాల్డ్ యాడ్స్ గుర్తున్నాయా? 462 00:35:33,091 --> 00:35:34,301 హేయ్! ఇలా రండి! 463 00:35:37,554 --> 00:35:38,889 పదా! 464 00:35:45,270 --> 00:35:46,271 ఆ కిందకు. 465 00:35:48,065 --> 00:35:49,066 సరే. 466 00:35:50,359 --> 00:35:51,401 అటు వైపు నుండి. 467 00:35:52,486 --> 00:35:53,487 ఇటువైపు. 468 00:36:01,787 --> 00:36:02,788 ఏం కాదు. 469 00:36:08,836 --> 00:36:10,212 - వాళ్ళు ఇటు వెళ్లారు. - నాకు సాయం చెయ్. 470 00:36:11,213 --> 00:36:12,422 ఓహ్, దేవుడా! 471 00:36:13,674 --> 00:36:15,050 ఇటువైపు. 472 00:36:15,050 --> 00:36:16,677 రెండు స్వరాలు వినబడ్డాయి! 473 00:36:18,387 --> 00:36:20,722 వాళ్ళు కింద ఉన్నారు. నేను నీతో వస్తా. 474 00:36:22,558 --> 00:36:23,725 పదండి. 475 00:36:24,852 --> 00:36:26,979 రక్షిత ప్రాంతంలోకి ఎవరూ రాకూడదు. 476 00:36:37,406 --> 00:36:39,283 హేయ్, నిన్నే! వాళ్ళను పట్టుకో! 477 00:36:39,283 --> 00:36:40,659 నేల మీద పడుకో! 478 00:36:41,368 --> 00:36:43,203 మీరు ఇక్కడ నివసించకూడదు! 479 00:36:43,787 --> 00:36:44,788 ఆగండి! 480 00:36:49,585 --> 00:36:51,920 - ఇక్కడ చెక్ చేద్దాం. - పదా. 481 00:36:53,839 --> 00:36:55,465 - ఎటు వైపు? - ఇటు వైపు. 482 00:36:55,465 --> 00:36:56,550 పదండి. 483 00:37:05,601 --> 00:37:06,727 హేయ్. 484 00:37:07,644 --> 00:37:10,063 పదండి. కదులుతూనే ఉండండి. ఇలా. 485 00:37:10,063 --> 00:37:12,858 లేదు. నేను లేకుండా మీరే వెళ్ళండి. 486 00:37:14,818 --> 00:37:15,903 కేట్, మాకు నువ్వు కావాలి. 487 00:37:15,903 --> 00:37:19,531 - వెళ్తే అందరం కలిసే వెళ్ళాలి లేదంటే లేదు. - అవును. నడువు, నువ్వు ఈ పని చేయగలవు. 488 00:37:19,531 --> 00:37:20,741 ఇప్పటికే చాలా దూరం వచ్చావు. 489 00:37:22,117 --> 00:37:24,912 - నువ్వు ఇది చేయగలవు, సరేనా? - సరే. 490 00:38:15,379 --> 00:38:17,714 - మనం ఇంకొక మార్గంలో వెళ్ళాలి. - ఇక్కడ చాలా మార్గాలు ఉన్నాయి. 491 00:38:17,714 --> 00:38:19,633 - వాటిలో ఒక దాని ద్వారా వెళ్లొచ్చు. - లేదు, ఆ విషయం నీకు తెలీదు. 492 00:38:19,633 --> 00:38:22,177 అది నీకు తెలీదు. మనం ఇక్కడ చచ్చిపోతాం. 493 00:38:22,177 --> 00:38:23,637 నీకు ఏం కాదు. 494 00:38:25,848 --> 00:38:27,558 నన్ను క్షమించు, కేట్. 495 00:38:28,725 --> 00:38:30,853 కానీ నువ్వు బలమైనదానివి. 496 00:38:30,853 --> 00:38:32,896 నీకు ఏం కాదు. 497 00:38:33,939 --> 00:38:35,941 మాకంటే ముఖ్యమైన పని నీకు ఇంకేం ఉంది? 498 00:38:41,780 --> 00:38:43,282 నేను ముందు వెళ్లి ఏదైనా దారి ఉందేమో చూస్తా. 499 00:38:45,868 --> 00:38:46,869 వెళ్ళు. 500 00:38:54,585 --> 00:38:57,379 నాన్నా! 501 00:39:03,177 --> 00:39:05,262 నీకు కూర్చోవాలని ఉందా? 502 00:39:12,394 --> 00:39:13,520 అది నాకు ఇవ్వు. 503 00:39:14,313 --> 00:39:15,314 సరే. 504 00:39:21,278 --> 00:39:22,696 నాతో కలిసి శ్వాస తీసుకో. 505 00:39:24,323 --> 00:39:25,449 లేదు, నా వల్ల కాదు. 506 00:39:25,449 --> 00:39:28,785 గాడిద గుడ్డు. నువ్వు చేయగలవు. చెయ్, రాండా. 507 00:39:29,745 --> 00:39:30,746 శ్వాస తీసుకో. 508 00:39:32,164 --> 00:39:33,332 వదులు. 509 00:39:34,875 --> 00:39:36,168 బాగా చేసావు. ఇంకొకసారి. 510 00:39:36,710 --> 00:39:37,711 శ్వాస తీసుకో. 511 00:39:39,796 --> 00:39:40,797 వదులు. 512 00:39:43,842 --> 00:39:45,469 నా చేతుల స్పర్శ తెలుస్తుందా? 513 00:39:46,220 --> 00:39:47,429 అవును. 514 00:39:47,429 --> 00:39:49,056 నన్ను చూడు. 515 00:39:52,935 --> 00:39:54,937 నన్ను తప్ప ఇంకేం చూడకు. 516 00:39:59,775 --> 00:40:02,277 జి-డేకి ఒక రోజు ముందు 517 00:40:07,032 --> 00:40:08,242 హేయ్. 518 00:40:08,242 --> 00:40:09,493 అమ్మ - నాకు ఫోన్ చెయ్. డానీ - ఎక్కడ ఉన్నావు? 519 00:40:09,493 --> 00:40:10,827 నువ్వేం అంత లేట్ కాలేదు. 520 00:40:17,000 --> 00:40:18,001 నువ్వు ఇల్లు మారుతున్నావా? 521 00:40:25,759 --> 00:40:27,177 లేదు, నేను వెళ్తాను. ఏం కాదు. 522 00:40:27,177 --> 00:40:28,512 వెళ్ళండి. వెంటనే. 523 00:40:31,306 --> 00:40:32,516 ఎమిలీ, పదా. 524 00:40:34,142 --> 00:40:36,770 కేట్, నేను నా పాఠాన్ని నేర్చుకోలేదు. 525 00:40:38,105 --> 00:40:41,942 మనం చాలా బాగున్నాం. కానీ నీకు... నీకు బాగుంటే చాలలేదు. 526 00:40:49,241 --> 00:40:51,076 నాకు ఇలా జరగకూడదు. 527 00:40:51,076 --> 00:40:52,995 ఇలా ఎవరికీ జరగకూడదు. 528 00:40:52,995 --> 00:40:56,874 కాదు, నా ఉద్దేశం అందరూ నాకోసం ఏదొక సాయం చేస్తుంటారు, 529 00:40:56,874 --> 00:40:59,585 కానీ నేను మాత్రం వారిని నిరాశపెట్టడం తప్ప ఇంకేం చేయను. 530 00:41:00,836 --> 00:41:05,883 ఆయన మమ్మల్ని వదిలేసినందుకు నాకు కోపంగా ఉంది. కానీ నేను మాత్రం గొప్పదాన్ని కాదు కదా? 531 00:41:06,466 --> 00:41:10,721 అలాస్కాలో నేను చలికి చస్తుంటే నువ్వు నన్ను వదిలి వెళ్ళలేదు. 532 00:41:14,850 --> 00:41:17,811 మనం పరిస్థితిని ఎదుర్కొని ముందుకు వెళ్లడమే పరిష్కారం. 533 00:41:23,108 --> 00:41:25,319 - పైకి వెళ్ళడానికి మార్గం దొరికింది. - ఏంటి? 534 00:41:25,319 --> 00:41:26,612 పిల్లులను ఫాలో అవ్వండి. 535 00:42:00,354 --> 00:42:03,148 - అది ఏ ఫ్లోర్ లో ఉంది? - నాన్నకు మంచి వ్యూ అంటే ఇష్టం. 536 00:42:05,984 --> 00:42:07,069 సరే. 537 00:42:27,756 --> 00:42:29,007 సరే. 538 00:42:29,007 --> 00:42:30,884 మనం తలుపు తీసి చూసాకా 539 00:42:30,884 --> 00:42:33,053 లోపల ఏమీ లేకపోతే భలే సరదాగా ఉంటుంది కదా? 540 00:42:34,513 --> 00:42:35,514 చాలా బాగుంటుంది. 541 00:43:24,396 --> 00:43:25,856 కనీసం ఎక్కడ వెతకాలో తెలిసింది. 542 00:43:34,698 --> 00:43:39,077 ఏంటి? లేదు. ఇక్కడ ఏదైనా ఉండి ఉంటుంది. 543 00:43:39,578 --> 00:43:41,163 సరే, వెలుగు వస్తోంది. 544 00:43:41,163 --> 00:43:43,624 ఒకటి గుర్తుంచుకోండి, మనం ఇక్కడి నుండి త్వరగా వెళ్ళాలి. 545 00:43:44,416 --> 00:43:46,084 నీ మాటలు ఏం సాయం చేయడం లేదు. ఏదైనా పని చెయ్. 546 00:43:46,084 --> 00:43:48,253 నాకు మీ నాన్న గురించి ఏమీ తెలీదు. 547 00:43:58,430 --> 00:44:01,141 నేను ఇది ఆయన చేసే సాటిలైట్ పనికి సంబంధించింది అనుకునేదానిని. 548 00:44:02,309 --> 00:44:03,310 అంటే ఏంటి నీ ఉద్దేశం? 549 00:44:06,813 --> 00:44:09,149 ఈ సాటిలైట్ కక్ష్య వంపులు సైన్ తరంగాలు. 550 00:44:09,149 --> 00:44:13,987 ఈ మార్గాలు మాత్రం... అవి వేరే ఏవో. 551 00:44:15,113 --> 00:44:17,741 నాన్న సాటిలైట్ ల గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఇవన్నీ వింటూ ఉండేదానివా? 552 00:44:17,741 --> 00:44:20,661 నేను మిడిల్ స్కూల్ పిల్లలకు సైన్స్ చెప్తుంటాను. వాళ్లకు సందేహాలు చాలా ఎక్కువ. 553 00:44:23,247 --> 00:44:24,331 ఆ ఫైల్స్ ని ఒకసారి చూపించు. 554 00:44:30,629 --> 00:44:31,755 సరే. 555 00:44:36,885 --> 00:44:38,220 ఈ పాయింట్లు... 556 00:44:38,220 --> 00:44:39,888 ఇవి రాశుల్లా ఉన్నాయి. 557 00:44:41,139 --> 00:44:42,307 కానీ ఇది నక్షత్రాల మ్యాప్ కాదు. 558 00:44:43,016 --> 00:44:44,268 కాదు. 559 00:44:44,268 --> 00:44:48,105 ఇది ప్రపంచ మ్యాప్, కానీ ఆయన ఖండాలను తీసేసారు. 560 00:45:02,536 --> 00:45:03,579 అది నాకు ఇవ్వు. 561 00:45:09,418 --> 00:45:10,419 ఏం చేస్తున్నావు? 562 00:45:12,337 --> 00:45:14,131 దానిని అక్కడ నిలబెడతారా? 563 00:45:24,349 --> 00:45:25,392 మనం ఈ పని ఎందుకు చేస్తున్నాం? 564 00:45:26,268 --> 00:45:29,021 నా మొదటి ఆర్ట్ ప్రదర్శన ప్రొజెక్ట్ చేయబడే చిత్రాలకు సంబంధించింది. 565 00:45:29,646 --> 00:45:33,108 ఒక చిత్రం మీద ఇంకొక చిత్రం పెడితే వేరొక కొత్త చిత్రం ఎలా వస్తుందో చూపించేది. 566 00:45:33,609 --> 00:45:34,818 అవును, నాకు గుర్తుంది. 567 00:45:55,422 --> 00:45:56,423 అవును. 568 00:46:08,519 --> 00:46:09,811 సాన్ ఫ్రాన్సిస్కో. 569 00:46:10,896 --> 00:46:12,397 అలాస్కా. 570 00:46:16,443 --> 00:46:17,319 ఆఫ్రికా. 571 00:46:20,489 --> 00:46:22,074 ఆయన వెళ్లిన మార్గం ఇదే అయ్యుంటుంది. 572 00:46:22,950 --> 00:46:24,868 అవును, ఇదే అది. 573 00:46:24,868 --> 00:46:28,121 మనం తెలుసుకోవాలి అనుకున్నది కూడా ఇదే. భలే పని చేసాం. మనం వెళ్ళాలి. 574 00:46:54,690 --> 00:46:56,316 అయితే నువ్వు ఇంకా జేమ్స్ అన్నమాట. 575 00:46:57,734 --> 00:46:59,152 మీరిద్దరూ... 576 00:47:01,446 --> 00:47:05,158 నేను సిద్ధమయ్యేవరకు అతను ఎదురుచూస్తున్నాడు. 577 00:47:07,619 --> 00:47:09,413 నాన్న నీకు చేసిన అన్యాయానికి నాకు బాధగా ఉంది. 578 00:47:10,414 --> 00:47:12,040 ముప్పై ఏళ్ళు. ఆయన కోసం నీ జీవితాన్ని వృధా చేసుకున్నావు. 579 00:47:12,040 --> 00:47:13,375 లేదు, నేను... 580 00:47:16,128 --> 00:47:19,673 ఆయన నన్ను మోసం చేస్తున్నాడని నేను కనిపెట్టగలిగేదాన్ని. 581 00:47:20,299 --> 00:47:21,550 నేను అడిగి ఉండాల్సింది. 582 00:47:23,260 --> 00:47:24,928 నేనే టోక్యోకి వెళ్లి తెలుసుకోగలిగేదాన్ని. 583 00:47:26,263 --> 00:47:31,685 కానీ నేను నిజం తెలుసుకోవాలి అనుకోలేదు. పార్ట్-టైమ్ భర్తను ఉంచుకోవడం నాకు నచ్చింది. 584 00:47:32,269 --> 00:47:34,771 కానీ కారణంగా నీకు కూడా పార్ట్ టైమ్ నాన్న దొరికాడు... 585 00:47:36,356 --> 00:47:38,233 నీ విషయంలో అలా జరిగి ఉండకూడదు. 586 00:47:51,580 --> 00:47:53,373 నాన్న అలాస్కాలో చచ్చిపోలేదు. 587 00:47:54,750 --> 00:47:55,751 ఏంటి? 588 00:47:57,002 --> 00:48:03,217 ఆయన సిఐఏ లాంటి ఒక రహస్య సంస్థకు పనిచేసారు, కాకపోతే గాడ్జిల్లాకి సంబంధించింది. 589 00:48:08,972 --> 00:48:10,432 నేను ఆయన్ని కనిపెడతాను. 590 00:48:17,147 --> 00:48:18,357 ఇప్పుడు నీకెలా అనిపిస్తుంది? 591 00:48:19,525 --> 00:48:20,526 బాగానే ఉంది. 592 00:48:21,026 --> 00:48:23,278 అంటే, మా నాన్న మాయమైన తర్వాత మొదటిసారి, 593 00:48:23,278 --> 00:48:26,740 పరిస్థితి అంత దారుణంగా లేదేమోలే అనిపిస్తోంది, సరేనా? ఇలా అంటుంటే వింతగా ఉందా? 594 00:48:27,991 --> 00:48:31,995 వింతైన విషయాలు అనే దానికి నేను ఇచ్చే నిర్వచనాన్ని ఈ మధ్యనే మార్చాను. కాబట్టి, ఈ గురించి నేను చెప్పలేను. 595 00:48:34,581 --> 00:48:35,832 నేను మా అమ్మకు ఫోన్ చేస్తా. 596 00:48:36,625 --> 00:48:38,502 సరే. మనం రూల్ గుర్తుంచుకో. 597 00:48:38,502 --> 00:48:39,920 - మొత్తం విషయం చెప్పకూడదు. - సరే. 598 00:49:11,159 --> 00:49:15,664 నాకు ఇంటికి వెళ్లాలని ఉంది. నేను ఏం చేయాలో చెప్పు. 599 00:49:19,626 --> 00:49:21,920 తెలివైన పిల్లవి. నేను టచ్ లో ఉంటాను. 600 00:50:43,085 --> 00:50:45,087 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్