1 00:00:11,512 --> 00:00:13,055 {\an8}హేయ్, మనం మాట్లాడుకోవాలి, సరేనా! ఇప్పుడే? 2 00:00:13,055 --> 00:00:14,515 {\an8}వచ్చే ఆదివారం? ఎం.ఓ.పి దగ్గర? 11 గంటలకు? 3 00:00:17,309 --> 00:00:18,477 "మనం మాట్లాడుకోవాలా"? 4 00:00:19,478 --> 00:00:21,188 అదేమీ మంచిది కాదు. 5 00:00:27,277 --> 00:00:29,780 ఏం చేస్తున్నావు గురూ? 6 00:00:37,871 --> 00:00:39,581 అదీ! చూశావా. 7 00:00:40,541 --> 00:00:43,043 దానిపైనే దృష్టి పెట్టు. సిద్ధంగా ఉంచు. 8 00:00:43,043 --> 00:00:44,670 అదీ! భలే కొట్టావు! 9 00:00:45,337 --> 00:00:46,630 బాగుంది. 10 00:00:46,630 --> 00:00:49,550 మళ్లీ కొట్టు, రెడీ? అక్కడకి కొట్టు. 11 00:00:50,259 --> 00:00:51,760 భలే, బాగా కొట్టావు. కిందకి. 12 00:00:51,760 --> 00:00:52,761 స్కూల్ బస్ 13 00:01:18,412 --> 00:01:21,790 {\an8}మాక్బెత్ 14 00:01:29,381 --> 00:01:33,427 "కానీ నేనే చాలామంది రాజులకు మూలాన్ని, తండ్రినీ కావాలి." 15 00:02:49,711 --> 00:02:52,172 నీకేం కావాలి? 16 00:03:09,189 --> 00:03:11,024 రివర్ వ్యూ మిడిల్ అండ్ హై స్కూల్ 17 00:03:39,011 --> 00:03:40,804 {\an8}ఆన్ నాపోలిటానో రచించిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 18 00:03:59,156 --> 00:04:00,365 యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా 19 00:04:00,365 --> 00:04:02,451 మమ్మల్ని చారిటీ కేసుల మాదిరి పరిగణించడం మానేసి 20 00:04:02,451 --> 00:04:03,827 మీరు కట్టాల్సిన పన్నులు కడతారా? 21 00:04:04,453 --> 00:04:06,371 మరొకసారి నేను అడ్రియానా వాషింగ్టన్ తో ఉన్నాను, 22 00:04:06,371 --> 00:04:08,874 ఆవిడ న్యూ యార్క్ 13వ జిల్లా నుంచి కాంగ్రెస్ కు పోటీ చేస్తున్నారు. 23 00:04:09,416 --> 00:04:12,419 మిస్ వాషింగ్టన్, యూనివర్శిటీలో మీరు చేసిన ఆ ప్రసంగం తాలూకు వీడియో క్లిప్ పై 24 00:04:12,419 --> 00:04:15,422 అంతా కోపంగా ఉన్నారు, దాన్ని అందరూ సోషలిజం అంటున్నారు. 25 00:04:15,422 --> 00:04:19,259 సరే, మరి నేను షెల్ సిల్వర్ స్టీన్ ను కూడా ప్రస్తావించాను, కానీ దాన్ని ఎవరూ చూడలేదు. 26 00:04:19,259 --> 00:04:21,220 లేదు. అది మిమ్మల్ని మనిషిగా చూపిస్తుంది. 27 00:04:21,220 --> 00:04:26,391 సరే. ఆరీ, నేను ఆ విషయాలను ప్రస్తావించినప్పుడు చాలా చిన్నదాన్ని, ఆదర్శవంతురాలిని. 28 00:04:27,518 --> 00:04:30,145 అప్పట్లో వెస్ట్ వింగ్ సీరియల్ ను ఎక్కువగా చూసేదాన్ని 29 00:04:30,145 --> 00:04:33,190 అలాగే ఇలాంటి విషయాలపై నా అవగాహన పూర్తిగా సిద్ధాంతపరంగానే ఉండేది. 30 00:04:33,190 --> 00:04:34,691 ఆ తర్వాత వాస్తవిక ప్రపంచంలోకి అడుగుపెడితే 31 00:04:34,691 --> 00:04:37,069 ఇవన్నీ చాలా సంక్లిష్టమైన అంశాలని అర్ధమవుతుంది. 32 00:04:37,653 --> 00:04:40,948 మీకు తెలిసే ఉంటుంది, ఈ షోకి మీ అమ్మమ్మ తరచూ గెస్ట్ గా వచ్చి పాల్గొనేవారు. 33 00:04:40,948 --> 00:04:42,282 చాలామందిలాగ, నేను కూడా, 34 00:04:42,282 --> 00:04:43,909 ఆమెకు ఎంతో గౌరవం ఇచ్చేవాణ్ని, 35 00:04:43,909 --> 00:04:46,036 కానీ మేం మిమ్మల్ని కలవరపెట్టే విషయాన్ని కనుగొన్నాం, అదేంటంటే, 36 00:04:46,036 --> 00:04:50,624 ఆఫీసులోని మిగతా ఉద్యోగులకంటే మీ అమ్మమ్మ మీకు ఎక్కువ మొత్తాలు చెల్లించారని. 37 00:04:50,624 --> 00:04:53,085 ఈ ఆరోపణపై స్పందించేందుకు మీకొక అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను. 38 00:04:53,669 --> 00:04:55,128 అది పూర్తిగా అబద్ధం. 39 00:04:55,128 --> 00:04:57,214 మా అమ్మమ్మ అన్నీ నిబంధనల ప్రకారమే చేసింది. 40 00:04:57,214 --> 00:04:59,383 అన్నీ అలా చేయలేదు. 41 00:04:59,383 --> 00:05:01,677 మా వద్ద అంతర్గత బడ్జెట్లు ఉన్నాయి... 42 00:05:01,677 --> 00:05:03,345 సంబంధిత కాలంలో రోజ్ వాషింగ్టన్ సిబ్బంది జీతాలు: 43 00:05:03,345 --> 00:05:06,557 ...మీ స్థాయిలోని ఇతర అధికారులకంటే మీకే ఎక్కువ చెల్లింపులు జరిగినట్టు ఇవి చెబుతున్నాయి. 44 00:05:26,702 --> 00:05:27,661 వాడు నిన్ను దారుణంగా దెబ్బతీశాడు. 45 00:05:27,661 --> 00:05:29,288 నేను ఇంటికి వచ్చి పోతూ ఉంటాను. 46 00:05:29,288 --> 00:05:32,416 అడ్రియానా, ఈ పదవికి నువ్వు పూర్తిగా తగినదానివి. 47 00:05:33,041 --> 00:05:37,087 ఒకవేళ ఆ ఆరోపణ నిజమే అయినా, ఆ పని చేసింది మీ అమ్మమ్మే తప్ప, నువ్వు కాదు. 48 00:05:37,671 --> 00:05:40,215 - అందుకు జనం నిన్ను బాధ్యురాలిని చేయరు. - ఖచ్చితంగా చేస్తారు. 49 00:05:40,215 --> 00:05:42,092 - ట్విట్టర్ చూడలేదా? - హేయ్. 50 00:05:47,890 --> 00:05:50,142 ఓట్ మిల్క్ కాఫీ, జోయ్ కాఫీ షాప్ నుంచి తెచ్చా. 51 00:05:51,894 --> 00:05:55,147 కంగారుపడకు. ఇంత ఖరీదైన కాఫీ తాగుతున్నావని ఎవరికీ చెప్పనులే. 52 00:05:59,443 --> 00:06:00,903 నాటలీ నాకోసం కార్లో ఎదురుచూస్తోంది. 53 00:06:04,281 --> 00:06:06,867 సరే. అయితే. 54 00:06:06,867 --> 00:06:09,745 కాఫీ ఇచ్చినందుకు థాంక్స్. 55 00:06:12,581 --> 00:06:13,582 బై. 56 00:06:14,708 --> 00:06:16,043 అలాగే. 57 00:06:29,681 --> 00:06:30,682 హేయ్. 58 00:06:40,067 --> 00:06:41,944 మీ ప్రిన్సిపాల్ నన్ను పిలిచాడు. 59 00:06:42,903 --> 00:06:44,488 ఇవాళ స్కూల్ నుంచి చెప్పకుండా వచ్చేశావట? 60 00:06:46,448 --> 00:06:47,866 అనే అనుకుంటున్నాను. 61 00:06:47,866 --> 00:06:49,368 అనుకుంటున్నావా? 62 00:06:51,411 --> 00:06:54,081 మేడ మీద మ్యూజిక్ రూమ్ కి వెళ్లాను, కాసేపు ప్లే చేద్దామని. 63 00:06:55,207 --> 00:06:56,542 నిన్ను అడిగి వెళ్లనందుకు సారీ. 64 00:06:57,626 --> 00:06:58,836 అది మంచిదే. 65 00:06:59,419 --> 00:07:01,463 నువ్వు మ్యూజిక్ గురించి ఆలోచించడం మంచి విషయమే. 66 00:07:01,463 --> 00:07:04,174 నీ పియానోను మీ అంకుల్ జాన్ వచ్చి బాగు చేస్తాడేమో కనుక్కుందాం. 67 00:07:04,174 --> 00:07:05,551 ఆయనేం చేయలేడు. 68 00:07:06,218 --> 00:07:07,469 అది పియానో. 69 00:07:08,262 --> 00:07:09,888 నాకు తెలిసి, దాన్ని ట్యూన్ చేయాల్సి ఉంటుంది 70 00:07:09,888 --> 00:07:12,057 అలాగే దాని సౌండ్ బోర్డును రిపేర్ చేయాలి. 71 00:07:12,057 --> 00:07:14,768 - సామాన్లు తెచ్చేవారు దాన్ని పాడు చేశారు. - అవును. నాకు తెలుసు. 72 00:07:14,768 --> 00:07:16,854 దాన్ని ఎవరైనా బాగు చేయగలరేమో చూస్తా. 73 00:07:17,729 --> 00:07:18,730 నేను వెళ్లొచ్చా? 74 00:07:18,730 --> 00:07:20,858 మీ అంకుల్ అకస్మాత్తుగా వెళ్లిపోవడం 75 00:07:20,858 --> 00:07:22,734 నీకు చాలా బాధ కలిగించిందని నాకు తెలుసు. 76 00:07:23,694 --> 00:07:24,778 నిజానికి ఆయన గురించి నాకేం తెలియదు. 77 00:07:24,778 --> 00:07:26,864 ఎడ్వర్డ్, నీకు... నీకు రూల్స్ తెలుసు కదా. 78 00:07:26,864 --> 00:07:29,283 నువ్వు నీ రూమ్ కి భోజనం తీసుకెళ్లి తినకూడదు. 79 00:07:29,283 --> 00:07:30,826 - మీ రూల్స్ నాకు తెలుసు. - ఎడ్వర్డ్? 80 00:07:30,826 --> 00:07:32,077 - ఏది ఏమైనా. - ఎడ్వర్డ్! 81 00:07:32,077 --> 00:07:34,746 - ఏంటీ? - ఎక్కడ కావాలంటే అక్కడ తిను, 82 00:07:34,746 --> 00:07:39,042 కానీ నాతో దురుసుగా ప్రవర్తించకు నా ఉనికే తెలియనట్లుగా ఉండకు! 83 00:07:39,626 --> 00:07:42,921 నేనూ మనిషినే, తెలుసా? నేనూ మనిషినే. 84 00:07:52,848 --> 00:07:54,474 నీ శాండ్విచ్ తీసుకెళ్లి ఎక్కడ కావాలంటే అక్కడ తిను. 85 00:08:51,240 --> 00:08:56,537 పెళ్లి శుభలేఖలు పంపడానికి ఇదొక మార్గమని అనుకుంటే, 86 00:08:57,246 --> 00:08:58,539 నాకూ ఇష్టమే. 87 00:09:00,999 --> 00:09:02,167 అకస్మాత్తుగా ఈ ప్రవర్తనకు కారణమేంటో? 88 00:09:05,003 --> 00:09:06,255 ఏంటి నీ ఉద్దేశం? 89 00:09:08,757 --> 00:09:09,967 ఇది కాస్త భిన్నంగా ఉంది. 90 00:09:11,718 --> 00:09:12,970 నేనేమీ ఫిర్యాదు చేయట్లేదు. 91 00:09:15,597 --> 00:09:18,141 పెళ్లి గురించి నాకు కాస్త ఉత్కంఠగా ఉందంతే. 92 00:09:27,484 --> 00:09:28,569 ఐ లవ్యూ. 93 00:09:30,696 --> 00:09:31,989 నాకూ నువ్వంటే ఎంతో ఇష్టం. 94 00:09:43,667 --> 00:09:44,751 రాండ్ మెక్ నల్లీ రోడ్ అట్లాస్ 95 00:09:49,214 --> 00:09:50,465 ఏంటది? 96 00:09:53,594 --> 00:09:54,595 ఏంలేదు. 97 00:10:13,989 --> 00:10:15,699 చూస్తున్నారుగా, యజమానులు 98 00:10:15,699 --> 00:10:17,993 - చాలా బాగా కట్టించారు. - దేవుడా, అది భలే ఉంది. 99 00:10:17,993 --> 00:10:19,411 స్వీటీ, ఆ షాండ్లియర్ చూశావా? 100 00:10:19,411 --> 00:10:22,206 - అద్భుతంగా ఉంది కదూ? - ఇంటితోపాటు అది కూడా వస్తుందా? 101 00:10:22,206 --> 00:10:24,124 - ఓనర్ని అడుగుతా. - సరే. 102 00:10:24,124 --> 00:10:25,501 హాయ్! 103 00:10:25,501 --> 00:10:27,503 డీ డీ, మీరు ఇంట్లో ఉన్నారనుకోలేదు. 104 00:10:27,503 --> 00:10:29,129 ఎలా ఉన్నారు? 105 00:10:29,129 --> 00:10:32,424 - ఆ షాండ్లియర్ గురించి మీరు అడగడం విన్నాను. - అవును. 106 00:10:33,091 --> 00:10:34,718 మురానో గ్లాస్ తో చేసింది. 107 00:10:35,427 --> 00:10:37,346 నా భర్త ఇటలీ నుంచి తెప్పించారు. 108 00:10:37,346 --> 00:10:39,306 - చాలా అందంగా ఉంది. - అవును. 109 00:10:39,306 --> 00:10:40,933 - మీ ఇల్లు మాకు బాగా నచ్చింది. - అవును. 110 00:10:40,933 --> 00:10:42,476 - చాలా థాంక్స్. - కాబట్టి, నేను... 111 00:10:42,476 --> 00:10:44,436 మీరు ఇంకో చిన్న ఇంట్లోకి మారతారట కదా? 112 00:10:45,771 --> 00:10:48,774 మేం ఇప్పటికే మారిపోయాం. 113 00:10:48,774 --> 00:10:49,983 నా భర్త చనిపోయాడు. 114 00:10:50,859 --> 00:10:52,486 - దేవుడా. - క్షమించాలి. 115 00:10:52,486 --> 00:10:55,322 మార్చిలో జరిగిన ఆ విమాన ప్రమాదం మీకు గుర్తుందా? 116 00:10:55,322 --> 00:10:57,032 ఒక బాబు కూడా చనిపోయాడు, అదా? 117 00:10:57,032 --> 00:10:58,325 అవును, అదే. 118 00:10:58,951 --> 00:11:00,661 చార్ల్స్ 4సి నంబర్ సీట్లో కూర్చున్నాడు. 119 00:11:00,661 --> 00:11:01,954 దేవుడా. 120 00:11:01,954 --> 00:11:03,038 సారీ. 121 00:11:03,038 --> 00:11:05,916 ఎంత విషాదకరం. డీ డీ చాలా ధైర్యవంతురాలు. 122 00:11:05,916 --> 00:11:08,335 - ఏది ఏమైనా... - ఆగండి, నేనొకసారి? 123 00:11:09,002 --> 00:11:10,254 ఇంకా ఎప్పుడు బయటికొస్తావు? 124 00:11:10,254 --> 00:11:13,674 - ఐదు నెలల్లో. అవును. - ఓ దేవుడా. 125 00:11:13,674 --> 00:11:15,717 ఒక్క నిమిషం. లోపలున్నది పాప. 126 00:11:15,717 --> 00:11:17,553 - నిజానికి మేం తెలుసుకోవాలని అనుకోలేదు. - లేదు, లేదు. 127 00:11:17,553 --> 00:11:19,137 పాపేనని నేను చెప్పగలను. తెలుసా? 128 00:11:19,137 --> 00:11:22,516 నేను జోయీని కడుపుతో ఉన్నప్పుడే మేం ఈ ఇంటిని కొన్నాం. 129 00:11:22,516 --> 00:11:24,560 - అదే పునరావృతమవుతోంది. - అవును. 130 00:11:24,560 --> 00:11:26,520 - మనం ఇక బయల్దేరాలి. - తను ఇక్కడే పెరిగింది. 131 00:11:26,520 --> 00:11:30,023 మేమంతా ఇక్కడే పెరిగాం తెలుసా? మేమంతా ఒక కుటుంబం. 132 00:11:31,608 --> 00:11:33,026 ఆ తర్వాత అంతా ముగిసిపోయింది. 133 00:11:34,695 --> 00:11:36,655 ఏది ఏమైనా, సంతోషంగా ఉండండి. 134 00:11:37,447 --> 00:11:40,367 - వెనకాల అందమైన ఈతకొలను ఉంది. - వెళ్లి చూడండి. చాలా బాగుంటుంది. 135 00:11:40,367 --> 00:11:42,119 - థాంక్యూ, డీ డీ. - థాంక్స్. 136 00:11:57,759 --> 00:11:59,178 ఇదొక అలవాటుగా మారింది. 137 00:12:03,849 --> 00:12:05,726 ఇది అట్లాస్ లో ఉంది. 138 00:12:06,393 --> 00:12:10,063 ఇది మా అమ్మమ్మ పిండితో చేసే సూప్ అని నాకు ఖచ్చితంగా తెలుసు. 139 00:12:11,064 --> 00:12:12,316 ఓకే. 140 00:12:12,316 --> 00:12:13,942 అది... 141 00:12:14,568 --> 00:12:18,572 నేను బ్రెంట్ ని నా ఆఫీసు నుంచి గెంటేసిన రాత్రి అతను నాకు తెచ్చి ఇచ్చినది ఇదే. 142 00:12:24,494 --> 00:12:27,289 - అతన్ని చూడటం అదే చివరిసారి. - స్టీవ్... 143 00:12:27,289 --> 00:12:31,418 నా జీవితమంతా బ్రెంట్ కు ప్రతిస్పందనలాగే అనిపిస్తోంది. 144 00:12:34,129 --> 00:12:35,672 అతనొక అప్రయోజకుడు. 145 00:12:37,633 --> 00:12:39,551 నేనెప్పుడూ ఒక మంచి కొడుకులాగే ఉండాలనుకున్నాను. 146 00:12:43,597 --> 00:12:45,641 తను చనిపోయిన తర్వాత, 147 00:12:48,268 --> 00:12:52,314 మా అమ్మ కుంగిపోయిందని నాకు అనిపిస్తోంది. 148 00:12:52,314 --> 00:12:55,692 బాగా కుంగిపోయింది. 149 00:12:57,194 --> 00:12:58,820 ఆమె అవస్థను నేను చూడలేను. 150 00:13:04,243 --> 00:13:06,078 అందుకే డాఫ్నీకి ప్రపోజ్ చేసాను. 151 00:13:14,545 --> 00:13:16,046 నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. 152 00:13:16,046 --> 00:13:17,923 మానాలి, స్టీవ్. 153 00:13:18,715 --> 00:13:19,675 నాకు తెలుసు. 154 00:13:19,675 --> 00:13:21,760 నువ్వు గందరగోళంలో పడి, నన్ను ఇబ్బంది పెడుతున్నావు. 155 00:13:21,760 --> 00:13:23,387 ఇకపై నువ్వు ఇక్కడకు రాకు. 156 00:13:26,014 --> 00:13:27,182 అలాగే. 157 00:13:27,182 --> 00:13:29,852 - సీరియస్ గా చెబుతున్నాను. - సరే. 158 00:13:32,729 --> 00:13:34,439 నిన్ను గ్రూపులో కలుస్తాను. 159 00:13:34,439 --> 00:13:35,524 ఊ. 160 00:13:49,246 --> 00:13:50,581 ఎడ్వర్డ్ పై అరిచాను. 161 00:13:53,417 --> 00:13:55,502 నాతో దురుసుగా మాట్లాడాడు. దాంతో కోపంతో అతన్ని తిట్టేశాను. 162 00:14:02,217 --> 00:14:05,888 నేను చేసిందంతా తప్పే. అతను పియానో బాగా వాయిస్తాడు, తెలుసా? 163 00:14:05,888 --> 00:14:08,599 కచేరీలో వాయించినట్లుగా వాయిస్తాడు, 164 00:14:08,599 --> 00:14:13,228 కానీ దాన్ని నన్ను ముట్టుకోనివ్వడు, ఎందుకంటే నేను దాన్ని విరగ్గొట్టానని. 165 00:14:13,228 --> 00:14:15,772 నేను సామాన్లు తరలించేందుకు సరైన వాళ్లని నియమించలేదు, పియానో పాడు చేశాను. 166 00:14:15,772 --> 00:14:17,524 నేనే విరగ్గొట్టాను. 167 00:14:18,984 --> 00:14:19,985 నేనేమీ చేయలేను. 168 00:14:24,573 --> 00:14:26,074 నా భర్త జాన్ నన్నొదిలి వెళ్లిపోయాడు. 169 00:14:26,074 --> 00:14:28,911 నా భర్త నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయాడు. 170 00:14:33,081 --> 00:14:34,541 అదీ విషయం. 171 00:14:47,638 --> 00:14:48,639 లేసీ. 172 00:14:51,225 --> 00:14:52,226 లేసీ. 173 00:14:53,936 --> 00:14:55,229 - హేయ్. - హేయ్. 174 00:14:55,229 --> 00:14:58,649 కావాలంటే నేను సాయం చేస్తాను. ఎడ్వర్డ్ తో కాదు. 175 00:14:58,649 --> 00:15:02,402 ఒక అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ పియానోను మాత్రం బాగు చేయగలను. 176 00:15:03,111 --> 00:15:04,321 - నిజంగా? - అవును. 177 00:15:04,821 --> 00:15:06,823 కానీ దానికి చాలా ఖర్చవుతుంది. 178 00:15:08,283 --> 00:15:09,952 దేవుడా, జోక్ చేశానంతే. 179 00:15:09,952 --> 00:15:11,453 జోక్ చేశాను. 180 00:15:11,453 --> 00:15:13,121 నువ్వు సాయం చేస్తే చాలా సంతోషిస్తా. 181 00:15:13,705 --> 00:15:15,249 - థాంక్ యూ. - ఫరవాలేదు. 182 00:15:17,459 --> 00:15:19,336 ఇది చాలా వైరల్ అయిపోయింది. 183 00:15:19,336 --> 00:15:21,463 నన్ను సమాజం దూరంపెట్టింది. 184 00:15:21,463 --> 00:15:23,632 ఎన్నికల బరిలోంచి తప్పుకోవాలంటూ చాలా మంది జనం, అనేక సంస్థలు 185 00:15:23,632 --> 00:15:25,509 - పట్టుబడుతున్నాయి. - ఆ తర్వాత? 186 00:15:25,509 --> 00:15:26,593 ఏం చేయమంటావు? 187 00:15:30,097 --> 00:15:31,682 ఎవరైనా నా దేవుణ్ని నిలదీస్తే... 188 00:15:31,682 --> 00:15:33,892 - అవును. - ...ఎవరైనా నా సమాజ సేవను అనుమానిస్తే, 189 00:15:33,892 --> 00:15:36,311 నేను అన్నింటినీ ఎదిరించి పోరాడతాను. 190 00:15:36,311 --> 00:15:37,646 ఓకే. 191 00:15:37,646 --> 00:15:39,815 నిజాయితీగా ఉండు. ఇవి న్యూ యార్క్ రాజకీయాలు. 192 00:15:40,315 --> 00:15:42,192 ఈ అపవాదు పగలబోయే అగ్నిపర్వతానికి ముందు వచ్చే పొగలాంటిది మాత్రమే. 193 00:15:42,192 --> 00:15:43,819 నువ్వు ఎన్నికల్లో గెలిస్తే, 194 00:15:43,819 --> 00:15:46,780 నువ్వు రిటైరయ్యేంతవరకూ ప్రతి రోజూ నిన్ను సవాల్ చేస్తూనే ఉంటారు. 195 00:15:47,364 --> 00:15:50,826 కాబట్టి, ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకోవడం మంచిది, 196 00:15:51,743 --> 00:15:54,204 నువ్వు ఎంత సమర్ధురాలివైతే అంత బాగా ఎదుర్కొంటావు. 197 00:15:55,330 --> 00:15:58,375 ఈ సమాజానికి నువ్వెంత సేవ చేయగలవో నేను చెప్పగలను. 198 00:15:59,877 --> 00:16:01,920 కానీ ఈ పదవి నీకు ఎంత ముఖ్యమో, 199 00:16:02,880 --> 00:16:04,506 నువ్వు ఎంత రిస్క్ చేయగలవో మాత్రం నేను చెప్పలేను. 200 00:16:05,883 --> 00:16:07,593 నీ మనసులో ఏముందో నేను చెప్పలేను. 201 00:16:08,594 --> 00:16:10,012 అది నీకే తెలియాలి. 202 00:16:16,935 --> 00:16:19,396 - నన్ను కలిసినందుకు సంతోషం. - ఆ. 203 00:16:32,284 --> 00:16:34,077 - ఎడ్డీ. 204 00:16:35,621 --> 00:16:37,331 - హాయ్. - వచ్చినందుకు థాంక్స్. 205 00:16:38,040 --> 00:16:40,667 నువ్వు మాట్లాడాలన్నావు కదా? 206 00:16:42,753 --> 00:16:43,962 లోపలికి వెళ్దాం పద. 207 00:16:43,962 --> 00:16:46,006 - ఎలా చేయాలో నీకు తెలుసుగా? - ఆ. 208 00:16:46,507 --> 00:16:47,758 నాకు తెలుసు. 209 00:16:48,967 --> 00:16:50,177 {\an8}పని వేళలు 210 00:16:50,177 --> 00:16:54,264 {\an8}మంగళవారం నుంచి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ 211 00:16:55,432 --> 00:16:57,100 నిన్ను కలిసినందుకు సంతోషంగా ఉంది ఎడ్డీ. 212 00:16:58,769 --> 00:17:00,354 నాకూ అలాగే ఉంది. 213 00:17:07,027 --> 00:17:08,237 కొన్నిసార్లు అతన్ని చూస్తూ ఉంటా. 214 00:17:10,071 --> 00:17:11,490 నేనూ చూస్తూ ఉంటాను. 215 00:17:12,281 --> 00:17:13,492 నువ్వూ చూస్తూ ఉంటావా? 216 00:17:13,492 --> 00:17:14,576 అవును. 217 00:17:16,537 --> 00:17:17,454 అతనితో మాట్లాడావా? 218 00:17:18,163 --> 00:17:20,832 చాలా. 219 00:17:22,709 --> 00:17:24,837 మొదలుపెడితే మాట్లాడుతూనే ఉంటాడు. 220 00:17:28,799 --> 00:17:29,842 నువ్వు? 221 00:17:30,717 --> 00:17:31,718 లేదు. 222 00:17:33,053 --> 00:17:36,682 నేను అతన్ని చూస్తే, ఏదో ప్రార్ధిస్తున్నట్టుగా ఉంటాడు. 223 00:17:36,682 --> 00:17:38,767 - వింతగా అనిపిస్తుంది. - ఆ. 224 00:17:42,020 --> 00:17:43,021 సరే... 225 00:17:45,566 --> 00:17:46,900 కనీసం మనం ఒకరికొకరు ఉన్నాం. 226 00:17:53,991 --> 00:17:55,951 ఎడ్డీ, నేను నిన్నిక కలవలేను. 227 00:17:57,119 --> 00:18:00,038 ఏంటీ? నిన్ను ముట్టుకోనులే. సారీ. నీ చేతిని ముట్టుకోకుండా ఉండాల్సింది. 228 00:18:00,038 --> 00:18:04,793 లేదు, అది కాదు. నీకిది చెప్పాలి. 229 00:18:04,793 --> 00:18:07,921 ఇకపై నన్ను కలవనని చెప్పేందుకేనా 230 00:18:07,921 --> 00:18:09,798 ఇంత దూరం వచ్చావు? 231 00:18:10,591 --> 00:18:12,426 ఇదే మాట జోర్డన్ కు కూడా చెప్పాలి. 232 00:18:13,886 --> 00:18:15,596 మీ ఇద్దరినీ ఇకపై కలవలేను. 233 00:18:16,930 --> 00:18:18,849 ఈ విషయం ఇంతటితో వదిలేయాలి. 234 00:18:20,517 --> 00:18:21,518 గుడ్ లక్, ఎడ్డీ. 235 00:18:22,060 --> 00:18:23,770 ఇక నాకు మెస్సేజ్ లు పంపకు, సరేనా? 236 00:18:24,605 --> 00:18:27,232 ఆగు. నేను... 237 00:18:34,281 --> 00:18:37,784 హేయ్. హేయ్. ఎడ్డీ. 238 00:18:39,119 --> 00:18:40,412 దేవుడా, నీకు చెప్పానుగా. 239 00:18:42,581 --> 00:18:44,374 "మనం మాట్లాడుకోవాలి" అనేది ఏమంత బాగోదు. 240 00:18:55,093 --> 00:18:56,720 నేను ఇవాళ స్నానం చేయాలా? 241 00:18:56,720 --> 00:18:57,930 అవును, నా మేనకోడలా. 242 00:18:57,930 --> 00:18:59,806 దానికి బదులు పార్కుకు వెళ్దామా? 243 00:18:59,806 --> 00:19:01,308 లేదు, నా మేనకోడలా. 244 00:19:01,308 --> 00:19:04,228 - ఎందుకని? - నువ్వు నిన్నకూడా స్నానం చేయలేదు. 245 00:19:05,270 --> 00:19:08,190 రేపు రెండుసార్లు స్నానం చేస్తే సరిపోదా? 246 00:19:08,941 --> 00:19:11,109 - అలా కుదరదమ్మా. - ఎందుకని? 247 00:19:16,823 --> 00:19:18,909 హార్లెంలో ప్రేమ కలాపాలు సాగిస్తూ పట్టుబడిన 248 00:19:18,909 --> 00:19:20,536 కాంగ్రెస్ అభ్యర్ధి అడ్రియానా వాషింగ్టన్ 249 00:19:30,045 --> 00:19:31,255 హేయ్. 250 00:19:31,797 --> 00:19:33,257 - హేయ్, అడ్రియానా. - హాయ్. 251 00:19:38,595 --> 00:19:40,889 - ఏం జరుగుతోంది ఇక్కడ? - ఎరిక్ ఎలా ఉన్నాడు? 252 00:19:40,889 --> 00:19:42,474 నేను ఎరిక్ ని కలిసినట్టు నీకెలా తెలిసింది? 253 00:19:42,474 --> 00:19:44,309 నేనూ ఈ భూమ్మీదే ఉంటున్నా కాబట్టి. 254 00:19:44,810 --> 00:19:46,019 నీ యాప్ లన్నీ మూసేసుకుని కూర్చున్నావా? 255 00:19:46,019 --> 00:19:47,271 అవును, ఏం జరుగుతోంది? 256 00:19:53,735 --> 00:19:55,070 ఓరి దేవుడా. 257 00:19:55,070 --> 00:19:57,614 అవును. మీరిద్దరూ రాజూ, రాణీ. 258 00:19:57,614 --> 00:19:58,699 మేం డేటింగ్ చేయట్లేదు. 259 00:19:58,699 --> 00:20:00,284 - అదెవరికి కావాలి? - నాకు అవసరం, అలాగే... 260 00:20:00,284 --> 00:20:01,535 - కోజో? - లేదు. 261 00:20:01,535 --> 00:20:03,412 - అతను ఘనాకి వెళ్ళిపోతున్నాడు. - అది కాదు అసలు విషయం. 262 00:20:03,412 --> 00:20:05,122 ఇది అబద్ధం. ఇది ఇంటర్నెట్ లో పెద్దగా వ్యాపిస్తోంది. 263 00:20:05,122 --> 00:20:07,666 మొట్టమొదటిగా, మనకు కావలసినది ఒక మంచి పత్రికాలోకం. 264 00:20:07,666 --> 00:20:10,335 రెండోది, ఎరిక్ ని అందరూ కోరుకుంటారు. 265 00:20:10,335 --> 00:20:13,088 - దేవుడా. - ఆడా మగా తేడా లేకుండా అందరూ, 266 00:20:13,088 --> 00:20:15,716 అన్ని జాతులవారూ, అన్ని రాజకీయ సంఘాలూ అతనికి ఓటేస్తాయి. 267 00:20:15,716 --> 00:20:18,927 నువ్వు అతనితో ప్రేమాయణం నడుపుతున్నావని జనాలకు తెలిస్తే, వారు నీకు ఓట్లు వేస్తారు. 268 00:20:18,927 --> 00:20:20,596 అంటే, నేను యూనివర్శిటీలో చేసిన 269 00:20:20,596 --> 00:20:22,556 ప్రసంగం గురించి అబద్ధం చెప్పమంటున్నావు, 270 00:20:22,556 --> 00:20:24,892 అలాగే నాకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కూడా అబద్ధమాడమంటున్నావు, అవునా? 271 00:20:24,892 --> 00:20:27,811 మనం అబద్ధం చెప్పం. వాస్తవాన్ని నిర్ధారించం, అంతే. 272 00:20:27,811 --> 00:20:30,647 అడ్రియానా, ఎన్నికలకు ఇంకా వారం కూడా సమయం లేదు. 273 00:20:30,647 --> 00:20:32,524 జనం ఏది నమ్ముతారో నమ్మనీ. 274 00:20:32,524 --> 00:20:34,443 - ఒక్క వారం. - దేవుడా. 275 00:20:36,320 --> 00:20:37,738 ఇది నైతికంగా తప్పు. 276 00:20:38,447 --> 00:20:39,865 నా మాట విను. 277 00:20:43,535 --> 00:20:45,996 కిచెన్ ని మళ్లీ ఆధునీకరించారు. కొత్త పాత్రలతో. 278 00:20:45,996 --> 00:20:48,165 ఇంతకంటే మీకు మంచిది దొరకదు. 279 00:20:51,793 --> 00:20:54,755 - మీరిద్దరూ కలసి మాట్లాడుకోండి. - సరే, థాంక్యూ. 280 00:20:59,801 --> 00:21:02,930 మీకు నచ్చకపోతే, సరే. ఇంకా చాలామంది ఉన్నారు. 281 00:21:02,930 --> 00:21:06,725 వేర్వేరు స్థాయుల్లో వాళ్లు, వేర్వేరు అభిరుచులు గలవారు. 282 00:21:06,725 --> 00:21:10,771 కానీ ఈ ఇల్లు కొంటే మీపై ఆర్ధిక భారం చాలా వరకూ తగ్గుతుంది. 283 00:21:10,771 --> 00:21:12,397 నేను జోయీతో మాట్లాడాలనుకుంటున్నాను. 284 00:21:13,440 --> 00:21:14,858 - మీ కూతురుతోనా? - నేనింకా... 285 00:21:14,858 --> 00:21:16,527 ఈ విషయం తనతో చెప్పలేదు. 286 00:21:16,527 --> 00:21:20,697 డబ్బు గురించీ, వాళ్ల నాన్నకు "లాస్ ఏంజెలిస్ లో సంబంధాల గురించీ." 287 00:21:22,074 --> 00:21:23,617 ఆమెకు చెప్పేంతవరకూ 288 00:21:24,618 --> 00:21:26,286 మార్పేమీ ఉండదు. 289 00:21:26,286 --> 00:21:28,163 మీరు చెప్పడం మంచిదే. 290 00:21:28,163 --> 00:21:30,791 - చెప్పాలి నిజమే. థాంక్యూ. - ఆ. 291 00:21:32,334 --> 00:21:35,170 చెప్పడం తెలివైన పని. నాతోపాటు నువ్వూ ఉంటే బాగుంటుంది. 292 00:21:36,547 --> 00:21:38,674 ఆగండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? 293 00:21:38,674 --> 00:21:40,217 - ఎందుకంటే ఇవన్నీ ఆర్ధికపరమైన విషయాలు కదా. - కానీ... 294 00:21:40,217 --> 00:21:41,718 నేను మీతో రాలేను. 295 00:21:41,718 --> 00:21:43,470 అది మీరు చేయాల్సిన పని. 296 00:21:43,470 --> 00:21:48,016 నువ్వు ఆర్ధిక విషయాలు మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది. 297 00:21:48,016 --> 00:21:49,393 నువ్వు చెబితే తను వింటుంది. 298 00:21:49,393 --> 00:21:52,771 నేను చెబితే నామీద తిరగబడుతుంది. 299 00:21:52,771 --> 00:21:55,440 లేదు. ఇది తల్లీకూతుళ్ల వ్యవహారం. 300 00:21:55,440 --> 00:21:57,234 - మీకు తెలుసా? ఇది... - మనం మంచి పనే చేస్తున్నాం కదా? 301 00:21:57,234 --> 00:21:59,987 ఇది మాకు సంబంధించిన వ్యవహారమే, కానీ ఇదెలాంటిందంటే... 302 00:21:59,987 --> 00:22:02,072 ఇదొక కమ్యూనికేషన్ వ్యవస్థలాంటిది 303 00:22:02,072 --> 00:22:03,907 చాలా సున్నితమైన అంశం. 304 00:22:03,907 --> 00:22:07,327 నువ్వు కూడా ఉంటే, కాస్త మనుషుల్లా మాట్లాడుకోవచ్చు. 305 00:22:07,327 --> 00:22:08,829 ఇది గొప్ప ఆలోచనగా నాకు అనిపించట్లేదు. 306 00:22:08,829 --> 00:22:10,664 ఈ రాత్రికే మాట్లాడదాం. మనిద్దరం, సరేనా? 307 00:22:10,664 --> 00:22:13,041 ఈ పని చేసిపెట్టు. రాత్రి ఏడు గంటలకి. 308 00:22:13,041 --> 00:22:15,127 భోంచేసి రాకు. నీకోసం వంట చేస్తా. 309 00:22:15,127 --> 00:22:17,796 - బాగానే వండుతాలే. - అలాగే, ఫరవాలేదు... 310 00:22:17,796 --> 00:22:18,881 మంచిది. 311 00:22:18,881 --> 00:22:21,383 దేవుడా, నువ్వు లేకపోతే నేనేం చేయగలను. 312 00:22:21,383 --> 00:22:22,843 అపార్టుమెంటు గురించి ఏమనుకుంటున్నారు? 313 00:22:23,427 --> 00:22:25,637 నేను అన్నీ బాగా ఆలోచించి చూశాను. 314 00:22:25,637 --> 00:22:27,723 నాకు ఏమాత్రం నచ్చలేదు. నీకు థాంక్స్. 315 00:22:28,473 --> 00:22:29,850 మేం ఆలోచించుకుని చెబుతాం. 316 00:22:35,689 --> 00:22:37,024 ఫోటో తీసుకో. 317 00:22:40,485 --> 00:22:41,612 ఏయ్! 318 00:23:10,474 --> 00:23:12,226 ఇంటి సామాను తీసుకొచ్చినవాళ్లు నిజంగానే దీన్ని పాడుచేశారు. 319 00:23:12,226 --> 00:23:13,352 ఎవరు మీరు? 320 00:23:15,395 --> 00:23:16,522 నేను ఆమండా. 321 00:23:16,522 --> 00:23:18,565 మీ ఆంటీ గ్రీఫ్ గ్రూప్ లో స్నేహితురాల్ని. 322 00:23:20,651 --> 00:23:22,236 మీవాళ్లు కూడా ఎవరైనా పోయారా? 323 00:23:22,819 --> 00:23:26,740 నా ప్రియుడు బ్రెంట్. 19 డి సీటు. 324 00:23:28,534 --> 00:23:30,410 నాకు ఆయన గుర్తు లేరు. సారీ. 325 00:23:30,410 --> 00:23:32,037 ఫరవాలేదు. నిన్ను అడగనులే. 326 00:23:35,916 --> 00:23:37,459 ఇది చాలా మంచి పియానో. 327 00:23:38,710 --> 00:23:42,172 అమ్మాయిల్ని ఆకట్టుకునేందుకు మాత్రమే సంగీత వాయిద్యాలు ఉపయోగపడతాయని మా అన్న అంటూ ఉండేవాడు. 328 00:23:42,965 --> 00:23:44,883 అది మంచి కారణమే. 329 00:23:44,883 --> 00:23:48,720 చనిపోయిన మా అన్న గర్ల్ ఫ్రెండ్ ఒక్కతే నాకు ఇష్టమైన అమ్మాయి. 330 00:23:49,805 --> 00:23:54,101 చనిపోయిన నా ప్రియుడి తమ్ముడంటే నాకూ చాలా ఇష్టం, కాబట్టి... 331 00:23:55,227 --> 00:23:57,646 - నిజంగా? - ఎవరికీ చెప్పకు. 332 00:23:57,646 --> 00:23:58,981 చెప్పను. 333 00:23:58,981 --> 00:24:00,566 ఇది చాలా మంచి వాయిద్య పరికరం. 334 00:24:01,900 --> 00:24:03,151 అది మా నాన్నది. 335 00:24:05,737 --> 00:24:08,115 - ఆయనే నీకు టీచరా? - అవును. 336 00:24:10,158 --> 00:24:14,413 నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు ఆయన వాయిస్తుంటే, నేను దీనిపై వేళ్లు పెట్టేవాణ్ని. 337 00:24:15,664 --> 00:24:17,124 ఎక్కువగా చోపిన్ గీతాలు వాయించేవాణ్ని. 338 00:24:17,916 --> 00:24:21,211 మొదటిది ఇ మైనర్లో నాక్టర్న్ 19. 339 00:24:22,671 --> 00:24:25,382 కానీ నాకు ఎనిమిదేళ్ళు వచ్చేసరికి, మా నాన్న కంటే బాగా వాయించడం మొదలుపెట్టా, 340 00:24:25,382 --> 00:24:30,053 అప్పుడు మా అమ్మా నాన్నా నాకోసం ఒక టీచర్ ని పెట్టారు. 341 00:24:33,724 --> 00:24:36,018 కానీ మొదట్లో మాదిరి లేదు. 342 00:24:38,562 --> 00:24:40,647 నువ్వెప్పుడైనా 343 00:24:40,647 --> 00:24:42,357 వాయించాలనుకుంటే, దీన్ని పూర్తిగా బాగు చేస్తాను. 344 00:24:45,277 --> 00:24:46,528 నువ్వే నిర్ణయించుకో, సరేనా? 345 00:24:47,571 --> 00:24:49,448 అలాగే. 346 00:24:50,991 --> 00:24:53,452 ఇంతకీ చనిపోయిన మీ ప్రియుడి తమ్ముడి గురించి ఏమనుకుంటున్నారు? 347 00:24:55,078 --> 00:24:58,415 =ఏముందీ, మరిచిపోయి ముందుకు వెళ్లడమే. 348 00:25:01,210 --> 00:25:02,211 సరే. 349 00:25:04,171 --> 00:25:05,881 మహీరా కూడా సరిగ్గా అలాగే అంది. 350 00:25:08,675 --> 00:25:12,513 ఒకవేళ మీరు అతనితో ముందుకు వెళ్లకపోయినా అతను కోల్పోయిన సోదరుడు తిరిగి రాడు కదా. 351 00:25:15,224 --> 00:25:18,101 అతనితో కాస్త మృదువుగా వ్యవహరించండి. 352 00:25:56,849 --> 00:26:00,853 హేయ్ నీకొక విషయం చెబుదామని 353 00:26:27,421 --> 00:26:29,423 పాత సామాన్ల అమ్మకం విషయంలో నిన్ను నిరుత్సాహ పరిచినందుకు 354 00:26:29,423 --> 00:26:31,383 నీకు క్షమాపణ చెబుదామని. 355 00:26:38,056 --> 00:26:39,725 మరేం ఫరవాలేదు. 356 00:26:44,855 --> 00:26:47,524 నా టీఆరెక్స్ బ్యాండ్లు అమ్మేశావా? 357 00:26:52,362 --> 00:26:54,948 లేదు. వాటిని నేను వాడుకుంటున్నా. 358 00:26:59,494 --> 00:27:00,495 {\an8}ఛీ. నువ్వు కండలు పెంచితే, 359 00:27:00,495 --> 00:27:01,747 {\an8}ఇక బార్ కి రాకుండా ఉంటేనే మంచిది. 360 00:27:01,747 --> 00:27:03,081 {\an8}నువ్వు ప్రజలతో పోరాడాల్సి ఉంటుంది. 361 00:27:10,380 --> 00:27:15,928 {\an8}నీతో పోరాడాలా? 362 00:27:20,307 --> 00:27:22,059 {\an8}ప్రయత్నించు. 363 00:27:32,569 --> 00:27:34,530 {\an8}నీ వంతు. 364 00:27:55,467 --> 00:27:56,635 ఫోటోలు 365 00:28:14,528 --> 00:28:19,950 ప్రస్తుతం కాస్త సంక్లిష్టంగా ఉన్న మన ఆర్థిక పరిస్థితి గురించి నీకు 366 00:28:20,868 --> 00:28:25,747 వివరించేందుకు స్టీవ్ ని డిన్నర్ కి ఆహ్వానించాను. 367 00:28:25,747 --> 00:28:26,957 కాబట్టి నువ్వు... 368 00:28:27,499 --> 00:28:29,418 - స్టీవ్? - ఓకే. 369 00:28:33,255 --> 00:28:34,756 ముందుగా... ఎలా మొదలుపెట్టాలో, 370 00:28:35,966 --> 00:28:40,053 మీ నాన్న లాస్ ఏంజిలిస్ లో ఒక ఫ్లాట్ కొన్నారు, 371 00:28:41,180 --> 00:28:44,266 దురదృష్టవశాత్తూ మార్కెట్ ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు ఆ ఫ్లాట్ కొన్నారు. 372 00:28:44,266 --> 00:28:48,061 డబ్బు సంపాదించాలంటే రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు మంచిదేగా. అందువల్ల... 373 00:28:48,061 --> 00:28:49,646 అవును, అప్పుడప్పుడు నిజమే, 374 00:28:50,147 --> 00:28:52,316 కానీ ఉద్యోగం కోల్పోయినప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు కాదు కదా. 375 00:28:52,316 --> 00:28:55,903 మేం అప్పుల్లో లేం. పైగా మా నాన్న నిరుద్యోగి కూడా కాదు. 376 00:29:00,490 --> 00:29:01,617 చూడమ్మా... 377 00:29:03,202 --> 00:29:04,203 బంగారం, 378 00:29:04,203 --> 00:29:08,332 ఆయన తన ఉద్యోగం పోగొట్టుకున్నారు. 379 00:29:08,916 --> 00:29:10,542 ఆయన లెయిటన్ ను వదిలేశారు కదా? 380 00:29:10,542 --> 00:29:13,462 సాంకేతికంగా చూస్తే, ఆయన తొలగించబడ్డారు. 381 00:29:13,462 --> 00:29:15,964 ఆయన కంపెనీలో నంబర్ టూ, అమ్మా. 382 00:29:15,964 --> 00:29:17,049 నాకు తెలుసు. 383 00:29:17,049 --> 00:29:20,177 నా ఉద్దేశం, నాకు తెలియదు, ఎందుకంటే, నాకు ఆ వివరాలేవీ తెలియవు, 384 00:29:20,177 --> 00:29:22,471 ఆయన నాతో చెప్పలేదు. నాతో చెప్పలేదు. 385 00:29:22,471 --> 00:29:24,306 నీకూ చెప్పలేదుగా. ఇది దిగ్భ్రాంతి కలిగిస్తోంది. 386 00:29:24,306 --> 00:29:26,225 ఇప్పుడంతా తవ్వి తీయాలని నాకు లేదు, 387 00:29:26,225 --> 00:29:28,519 ఎందుకంటే జీవితంలో ముందుకు వెళ్లాలనుకుంటున్నా... 388 00:29:28,519 --> 00:29:30,854 - నువ్వు స్టీవ్ తో కలసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నావా? - ...భవిష్యత్తులో. 389 00:29:30,854 --> 00:29:33,398 నీ గ్రీఫ్ గ్రూప్ లో ఎవరితోనైనా? నిజంగా? 390 00:29:33,398 --> 00:29:35,692 - మరేం ఫరవాలేదు. - లేదు, అదేం కాదు. 391 00:29:35,692 --> 00:29:38,529 - నేను మీ ఇద్దరినీ ఒంటరిగా వదిలేసి ఉండాల్సింది. - లేదు, ఆర్ధిక పరిస్థితి గురించి చెప్పు. 392 00:29:38,529 --> 00:29:40,197 - ఆర్థిక పరిస్థితి గురించి చెప్పు, స్టీవెన్. థాంక్యూ. - అలాగే. 393 00:29:40,197 --> 00:29:42,950 మీ అప్పులు సుమారు మూడు మిలియన్ డాలర్ల వరకూ ఉన్నాయి. 394 00:29:42,950 --> 00:29:46,036 వాటిని వెంటనే తీర్చకపోతే, 395 00:29:46,036 --> 00:29:48,956 - అవి దారుణంగా పెరిగిపోతాయి. - ఏంటీ? 396 00:29:48,956 --> 00:29:50,832 కానీ దానికొక ప్లాన్ ఉంది. 397 00:29:50,832 --> 00:29:52,251 ఆ ప్లానేంటో వివరించు. 398 00:29:52,251 --> 00:29:54,086 వాటిని తీర్చే స్థోమత సమకూర్చుకోవాలంటే, 399 00:29:54,086 --> 00:29:57,422 కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. 400 00:29:57,422 --> 00:30:00,425 ఎలాంటి త్యాగాలు అవి? 401 00:30:00,425 --> 00:30:03,720 మొట్టమొదటగా, ఇంటిని అమ్మేయాలి. 402 00:30:03,720 --> 00:30:05,514 - ఏ ఇల్లు? - ఈ ఇల్లే. 403 00:30:06,515 --> 00:30:10,310 మా ఇల్లా? అదా నీ ప్లాన్? ఇంటిని అమ్మేయాలా? 404 00:30:10,310 --> 00:30:13,355 - ఇది ప్లాన్ లో భాగమే. - ఇది ప్లాన్ లో భాగమా? సరే. 405 00:30:13,355 --> 00:30:15,065 అలాగే నీ ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. 406 00:30:15,065 --> 00:30:16,608 ఎలా తగ్గించుకోవాలి? 407 00:30:16,608 --> 00:30:18,235 అన్ని రకాల ఖర్చులూ. 408 00:30:18,235 --> 00:30:21,113 దుస్తులు, ఆహారం, ట్రావెల్, చదువు. 409 00:30:23,156 --> 00:30:25,868 - చదువా? - కాదు, ఖచ్చితంగా... 410 00:30:25,868 --> 00:30:28,120 - అదింకా నిర్ణయించలేదు. - వావ్. 411 00:30:28,120 --> 00:30:30,873 - ఇతను కాలేజీ గురించి మాట్లాడుతున్నాడా? - మనం ఆర్ధిక సాయం గురించి చూస్తున్నాం. అది... 412 00:30:30,873 --> 00:30:33,375 మీరు దేనికి అర్హులో చూడాల్సి ఉంది, కానీ నిజం చెప్పాలంటే, 413 00:30:33,375 --> 00:30:34,668 ప్రస్తుత పరిస్థితి సవాల్ తో కూడుకున్నదే. 414 00:30:34,668 --> 00:30:37,212 నేనిక బర్నార్డ్ కాలేజీకి వెళ్లడం శాశ్వతంగా మానేయాలా? 415 00:30:37,212 --> 00:30:39,631 లేదు, లేదు. నిన్ను కాలేజీ మారమంటున్నానంతే. సియుఎన్ వైలో బోలెడు కాలేజీలున్నాయి. 416 00:30:39,631 --> 00:30:42,217 - బ్రూక్లిన్ కాలేజీ, సిటీ కాలేజీ, క్వీన్స్. - దేవుడా, నీకు ఓ సంగతి తెలుసా? 417 00:30:42,217 --> 00:30:43,468 - అవన్నీ బడ్జెట్ లోపే ఉన్నవి. - ఛీ. 418 00:30:43,468 --> 00:30:45,804 నేను పర్యటనకు వెళ్తున్నా, ఎందుకంటే నాకూ ప్లాన్స్ ఉన్నాయి మరి. 419 00:30:45,804 --> 00:30:48,098 - పర్యటనకు వెళ్లే ప్లాన్స్ ఉన్నాయి నాకు. - లేదు. ఎవరూ ఎక్కడికీ వెళ్లట్లేదు. 420 00:30:48,098 --> 00:30:49,474 ఎవరూ ఎక్కడికీ వెళ్లడం లేదు. 421 00:30:49,474 --> 00:30:50,642 ఛీ, స్టీవ్! 422 00:30:50,642 --> 00:30:52,561 బర్నార్డ్ గురించి మాట్లాడొద్దని చెప్పాను కదా. 423 00:30:53,353 --> 00:30:58,567 తల్లీ, మీ నాన్న ఆర్ధిక అవకతవకల కారణంగా నీ జీవితం దెబ్బ తినడం నాకిష్టం లేదు. 424 00:30:58,567 --> 00:31:00,569 లేదమ్మా, ఈ నెపం ఆయనపై పెట్టకు. 425 00:31:00,569 --> 00:31:03,280 డాడీ మనల్ని ఎంతో ప్రేమించారు. 426 00:31:03,280 --> 00:31:08,243 బహుశా ఆయన ఎక్కువ ఖర్చు పెట్టి ఉండొచ్చు. కానీ ఎక్కువ దుబారా చేసింది మనమే. 427 00:31:08,243 --> 00:31:12,414 నువ్వు నగల కోసం, షాపింగ్ ల కోసం 428 00:31:12,414 --> 00:31:15,292 వెకేషన్లల కోసం ఎంతో ఖర్చు పెట్టావు. 429 00:31:15,292 --> 00:31:17,961 ఆయన తన కోసం ఏమీ చేసుకోలేదు. 430 00:31:19,463 --> 00:31:21,924 తన కోసం ఏమీ చేసుకోలేదనడం నవ్వు తెప్పిస్తోంది. 431 00:31:23,717 --> 00:31:25,469 - నిజంగా? - అవును, నిజంగా. 432 00:31:25,469 --> 00:31:28,555 ఆయన ఎంతో తెలివైనవాడు, ఇప్పుడు నీకు చిక్కుకున్నాను! 433 00:31:28,555 --> 00:31:30,182 ఈ స్టీవ్ కు కూడా! 434 00:31:30,182 --> 00:31:32,184 ఆయన తెలివైైనవాడూ నేనేమో పిచ్చిదాన్నా? 435 00:31:32,184 --> 00:31:34,102 - ఎలా అరుస్తున్నావో చూడు! - నీకో సంగతి తెలుసా తల్లీ? 436 00:31:34,102 --> 00:31:37,773 ఇవి చూడు. ఈ కుప్పలన్నీ చూడు... 437 00:31:37,773 --> 00:31:39,816 ఇవన్నీ బిల్లులు. 438 00:31:39,816 --> 00:31:41,735 - మనం చెల్లించలేని బిల్లులు. - సరే. 439 00:31:41,735 --> 00:31:44,988 మీ నాన్న చేసిన ఖర్చుల తాలూకు బిల్లులు. 440 00:31:44,988 --> 00:31:46,073 నీకు మతిపోయింది. 441 00:31:46,073 --> 00:31:48,283 - ఆయన 1.2 మిలియన్లు ఖర్చు చేశాడు... - వీటిని నాపైకి నెడుతున్నారా? 442 00:31:48,283 --> 00:31:49,284 - ఇలా చూడు. - ఇక చాలు. 443 00:31:49,284 --> 00:31:51,411 - మీ నాన్న ఏం చేశాడో నువ్వు తెలుసుకోవాలి... - మీరిక ఆపండి. 444 00:31:51,411 --> 00:31:52,621 అబ్బా. 445 00:31:52,621 --> 00:31:53,830 - ఓరి దేవుడా. - ఛీ. 446 00:31:53,830 --> 00:31:55,374 - ఛీ! - స్టీవ్ నీకేం కాలేదు కదా? 447 00:31:55,374 --> 00:31:56,917 - దేవుడా. - అయ్యో, లేదు. 448 00:31:56,917 --> 00:31:59,545 దేవుడా, నేను వెళ్లాలి. 449 00:31:59,545 --> 00:32:00,879 బాగానే ఉందా... ముక్కు పగిలిందా? 450 00:32:00,879 --> 00:32:04,758 - దేవుడా. - జోయీ! జోయీ! 451 00:32:57,186 --> 00:32:59,771 హేయ్. హాయ్. 452 00:32:59,771 --> 00:33:04,651 నిజానికి మేం బయల్దేరేముందు మీ బాత్రూమ్ కి వెళ్ళాలనుకున్నాను. 453 00:33:04,651 --> 00:33:05,819 ఇప్పుడే వస్తా. 454 00:33:06,528 --> 00:33:08,280 నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? 455 00:33:08,280 --> 00:33:10,741 నా పాడిల్ బోర్డు తీసుకెళ్దామని వచ్చా. 456 00:33:11,617 --> 00:33:13,410 సారీ. నీకు ముందే కాల్ చేసి ఉండాల్సింది. 457 00:33:13,410 --> 00:33:16,205 నేను, అది... 458 00:33:16,872 --> 00:33:19,291 గ్రూప్ లో ఆమండా. తను పియానో బాగు చేసేందుకు వచ్చింది. 459 00:33:19,291 --> 00:33:21,251 సరే. ఎడ్వర్డ్ మళ్లీ వాయించడం మొదలుపెట్టాడా? 460 00:33:21,835 --> 00:33:23,670 - నాకు తెలియదు జాన్. - ఓకే. 461 00:33:23,670 --> 00:33:28,175 ఐదేళ్లుగా నువ్వు ఆ బోర్డును వాడటం లేదుగా? 462 00:33:28,800 --> 00:33:33,889 అవును. మళ్లీ దాన్ని వాడాలని అనుకుంటున్నా. 463 00:33:37,976 --> 00:33:42,940 నాకు కాస్త సమయం చిక్కింది, దాన్ని వాడితే ధ్యానం చేసినట్లుగా కూడా ఉంటుందని. 464 00:33:42,940 --> 00:33:44,900 - అలాగే నేను... - నేను... 465 00:33:44,900 --> 00:33:47,653 ...వేరుబడటం అంత తప్పేమీ కాదనుకుంటున్నా. 466 00:33:47,653 --> 00:33:50,739 పాత కారు ఇంజన్ చెడిపోతే దాన్ని బాగు చేసేందుకు మొత్తం 467 00:33:50,739 --> 00:33:53,367 అన్ని భాగాలను విప్పదీయాల్సి ఉంటుంది, అలాంటిదే ఇది కూడా. 468 00:33:53,367 --> 00:33:57,329 అయితే మన పెళ్లి కూడా పాత కారు ఇంజన్ లాంటిదేనంటావా? 469 00:33:57,329 --> 00:33:59,581 - నా ఉద్దేశం అది కాదు, లేసీ. - మరి నువ్వనేదేమిటి? 470 00:33:59,581 --> 00:34:01,750 మన బంధాన్ని ఇంతటితో ముగించకూడదని. 471 00:34:06,505 --> 00:34:09,382 నువ్వే నన్ను వదిలేసి వెళ్లావు జాన్. 472 00:34:12,094 --> 00:34:16,139 నువ్వే వదిలేశావు. 473 00:34:17,683 --> 00:34:18,934 నాకు తెలుసు. 474 00:34:24,606 --> 00:34:27,234 కొన్నేళ్లుగా ఆ బోర్డు ఎక్కడుందో నేను చూడలేదు. బహుశా పారేశానేమో. 475 00:34:29,402 --> 00:34:30,654 అలాగా, సరే. 476 00:34:34,283 --> 00:34:35,742 మళ్లీ కలుస్తా, లేస్. 477 00:34:52,592 --> 00:34:53,635 బాగానే ఉన్నావా? 478 00:34:56,597 --> 00:34:59,391 బాగాలేను. బాగాలేను. 479 00:35:10,194 --> 00:35:12,487 - అదిగో ఆంటీ అడ్రియానా! చూడు! - మళ్లీ క్యాంపెయిన్ 480 00:35:12,487 --> 00:35:14,907 ఆఫీసు నుంచి లైవ్ ఇస్తున్నాం, కాసేపట్లో విలేఖరుల సమావేశం 481 00:35:14,907 --> 00:35:17,659 - మొదలయ్యేలా ఉంది. - ఇది భోజన సమయం. టీవీ తర్వాత చూద్దాం. 482 00:35:17,659 --> 00:35:20,037 - కుదరదు. టీవీ చూడాల్సిందే. - నేను మా అమ్మమ్మ కోసం 483 00:35:20,037 --> 00:35:22,998 పనిచేసినప్పుడు ఆమె నాకు ఎక్కువ డబ్బు చెల్లించినట్లు ఈ వారం మొదట్లో నిర్ధారణ అయింది. 484 00:35:22,998 --> 00:35:25,417 మీ పన్నుల డబ్బును నాకు ఎక్కువ చెల్లించారు. 485 00:35:25,417 --> 00:35:26,376 అడ్రియానా వాషింగ్టన్ 486 00:35:26,376 --> 00:35:27,794 యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ కి డెమోక్రాట్ 487 00:35:27,794 --> 00:35:30,631 మనకు ఆదర్శంగా నిలిచిన ఒక మహిళ, ప్రత్యేకించి ఇప్పుడు మన మధ్య లేని మహిళ, 488 00:35:30,631 --> 00:35:32,633 తప్పు చేసిందంటే జీర్ణించుకోవడం కష్టం. 489 00:35:32,633 --> 00:35:34,843 అప్పట్లో ఆమె మనసులో ఏముందో నాకు తెలియదు. 490 00:35:34,843 --> 00:35:38,138 నేను పిచ్చిదాన్నని ఆమెకు చెప్పలేను. ఆమె అలా చేసి ఉండకపోతే బాగుండేది. 491 00:35:38,972 --> 00:35:41,642 కానీ ఇప్పుడు నేను చేయగలిగింది పరిస్థితుల్ని చక్కదిద్దడమే. 492 00:35:42,935 --> 00:35:47,105 మా అమ్మమ్మ కార్యాలయంలో నేను పనిచేసినప్పటినుంచీ నా పన్నుల 493 00:35:47,105 --> 00:35:50,317 రిటర్న్స్ ను పబ్లిష్ చేయదలచుకున్నాను, మిగులు నిధులను 494 00:35:50,317 --> 00:35:51,735 స్థానిక చారిటీ సంస్థలకు విరాళమిస్తాను. 495 00:35:51,735 --> 00:35:54,988 ఇది సరైన పరిష్కారం కాదు, కానీ ఇది ఒక ఆరంభం. 496 00:35:56,365 --> 00:35:58,283 ఇప్పుడు మీరేమైనా అడగొచ్చు. 497 00:35:58,283 --> 00:35:59,993 - అడ్రియానా, అడ్రియానా, అడ్రియానా. - ఇయాన్. 498 00:35:59,993 --> 00:36:02,746 మీరూ, ఎరిక్ టర్నర్ మళ్లీ కలిసి ఎన్నాళ్లయింది? 499 00:36:04,456 --> 00:36:06,208 దాని గురించి మాట్లాడేందుకు నేను ఇక్కడకు రాలేదు. 500 00:36:06,208 --> 00:36:09,878 - కానీ గతంలో కూడా మీరు డేటింగ్ చేశారుగా? - దానికీ, దీనికి ఏం సంబంధముందో తెలియట్లేదు. 501 00:36:09,878 --> 00:36:12,881 సంబంధిత విషయం గురించి మాట్లాడదామా? జీనా చెప్పు? 502 00:36:12,881 --> 00:36:15,342 మిమ్మల్నీ, ఎరిక్ నీ జనం న్యూ యార్క్ నగర రాజు, రాణి అని 503 00:36:15,342 --> 00:36:17,094 అంటున్నారు, దానిపై మీ స్పందన ఏంటి? 504 00:36:18,929 --> 00:36:21,014 జీనా, నువ్వన్నా, మీ పత్రిక అన్నా నాకెంతో గౌరవం, 505 00:36:22,724 --> 00:36:24,726 సీరియస్ గా చెప్పు, నువ్వు నన్ను అడిగేది ఇదా? 506 00:36:24,726 --> 00:36:26,895 తుపాకుల హింస గురించీ, 507 00:36:28,105 --> 00:36:30,649 నిరాశ్రయుల గురించీ, వాతావరణ మార్పుల గురించీ అడగొచ్చు కదా? 508 00:36:30,649 --> 00:36:31,817 లేకపోతే, 509 00:36:31,817 --> 00:36:35,195 మా అమ్మమ్మ చేసిన పని అనైతికమైనదని ఇప్పుడే చెప్పాను. 510 00:36:35,195 --> 00:36:37,990 దాని గురించైనా అడగొచ్చు కదా? నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధిని. 511 00:36:38,824 --> 00:36:41,034 ప్రభుత్వ ఉచిత కాలేజీలపైనా, 512 00:36:41,034 --> 00:36:44,204 రెంట్ కంట్రోల్, సంపద పన్ను, ఆరోగ్య సంరక్షణ వంటి వాటిపై నాకు నమ్మకం ఉంది, 513 00:36:44,746 --> 00:36:47,541 అలాగే ఇళ్ళు లేని పేదల సమస్యను పరిష్కరించాలనుకుంటున్నాను. 514 00:36:47,541 --> 00:36:50,252 నేను ఎన్నికల్లో గెలిచినా, గెలవకపోయినా 515 00:36:50,252 --> 00:36:53,422 వీధుల్లో నిద్రించే ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించేవరకూ నిద్రపోను. 516 00:36:55,424 --> 00:36:57,134 నేను మంచి రాజకీయవేత్తను కాను. 517 00:36:58,135 --> 00:37:01,805 చాతుర్యం లేదు, రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడలేను. 518 00:37:03,599 --> 00:37:07,895 కానీ ఓటుహక్కు కోల్పోయినవారి కోసం కష్టపడి పనిచేస్తా, 519 00:37:07,895 --> 00:37:10,564 ఎందుకంటే వారికి నా సాయం ఎంతో అవసరం. 520 00:37:11,690 --> 00:37:15,027 ఉన్నత వర్గాలకు చెందిన కొంతమందిని నా వైఖరి బాధపెడితే క్షమించండి. 521 00:37:17,029 --> 00:37:21,366 నేను దేని కోసం పోరాడుతున్నానో, అది మీకు నచ్చకపోతే నాకు ఓటు వేయకండి. 522 00:37:31,668 --> 00:37:37,674 హేయ్. నేను పిచ్చివాణ్నే. క్షమించు. 523 00:37:42,262 --> 00:37:45,599 నువ్వు ఇక్కడే ఉన్నావు 524 00:39:00,799 --> 00:39:02,092 ఆమండా 525 00:39:05,596 --> 00:39:09,057 - హేయ్ - ఈ రోజు ఎలా గడిచింది? 526 00:39:12,060 --> 00:39:14,563 నేను డీ డీ కూతుర్ని కలిశాను. 527 00:39:16,148 --> 00:39:17,524 నేను అదృష్ట బాలుణ్ని కలిశా. 528 00:39:18,192 --> 00:39:20,444 నువ్వే గెలిచావు. నువ్వే ముందు చెప్పు. 529 00:39:23,614 --> 00:39:25,657 తను చోపిన్ ఆడుతున్నాడు. 530 00:39:25,657 --> 00:39:27,117 చోపిన్? 531 00:39:27,701 --> 00:39:30,787 అయితే, అతను ఒక మేధావా? 532 00:39:38,128 --> 00:39:39,338 హాయ్. 533 00:39:40,005 --> 00:39:42,841 - విలేఖరుల సమావేశం విజయవంతమైంది. - థాంక్స్. 534 00:39:44,134 --> 00:39:45,552 అయితే నువ్వు మళ్లీ ఆ మంత్రిని కలిశావా? 535 00:39:46,553 --> 00:39:48,931 మేం కలిసి లంచ్ చేశాం. అతని సలహా అడిగా. అంతే. 536 00:39:48,931 --> 00:39:51,642 అడ్రియానా, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పక్కర్లేదు. 537 00:39:51,642 --> 00:39:53,393 నేనేమీ విలేఖరిని కాను. 538 00:39:53,393 --> 00:39:56,146 ఇది విడ్డూరంగా ఉంది. నేనేమీ తప్పు చేయలేదే? 539 00:39:56,146 --> 00:39:59,525 మన సంబంధం కంటే నువ్వు నీ వ్యాపారానికే ఎక్కువ విలువ ఇస్తున్నావు. 540 00:39:59,525 --> 00:40:02,152 మన రిలేషన్ షిప్ మొదలైనప్పుడు నేను ఘనాకు తిరిగి వెళ్తున్నానని నీకు తెలుసు. 541 00:40:02,152 --> 00:40:06,073 అవును, కానీ దానివల్ల పరిస్థితుల్లో మార్పు వస్తుందని నేను భావించాను. 542 00:40:06,865 --> 00:40:09,117 రిలేషన్ షిప్ అంటే నువ్వు ఘనాకు వెళ్తే నీతో నేనూ వస్తానని అనుకున్నావు. 543 00:40:09,117 --> 00:40:11,662 - అది చాలా వెనుకబడిన ప్రాంతం. - అది నా వ్యాపారం మాత్రమే కాదు. 544 00:40:11,662 --> 00:40:14,289 నా కుటుంబం, నా ఇల్లు కూడా. 545 00:40:14,289 --> 00:40:17,835 మరి నా వ్యాపారం మాటేమిటి? నా కుటుంబం? నా ఇల్లు? 546 00:40:19,628 --> 00:40:21,505 చూడు, నీతో వాదించాలని నాకు లేదు. 547 00:40:22,005 --> 00:40:23,423 నువ్వు అక్కడే ఉండాలి. 548 00:40:25,926 --> 00:40:27,636 నేను ఇక్కడే ఉండాలి. 549 00:40:30,973 --> 00:40:33,100 ఇది విచారకరమే. కానీ అలా జరగాలంతే. 550 00:40:39,815 --> 00:40:42,359 సరే. సరే. 551 00:40:43,986 --> 00:40:47,698 ఈ ప్రపంచంలో నా సొంత లక్ష్యాన్ని కనుగొనాలనే 552 00:40:47,698 --> 00:40:51,034 అవసరాన్ని మా అమ్మమ్మ నాలో రేకెత్తించింది. నేనొక మార్గదర్శకురాలిని కావాలనుకుంది. 553 00:40:53,620 --> 00:40:56,748 ఆ జీవితంతోపాటే త్యాగాలు కూడా అలవడ్డాయి. 554 00:40:56,748 --> 00:40:58,375 ప్రత్యేకించి ఒక మహిళకి. 555 00:40:59,626 --> 00:41:03,964 ఆమె తన 82వ ఏట ఎంతో అసంతృప్తితో మరణించింది, 556 00:41:03,964 --> 00:41:05,674 కానీ నన్ను ఈ దారిలో నిలబెట్టింది. 557 00:41:06,675 --> 00:41:08,218 నేను అనుసరించాల్సిందే. 558 00:41:12,306 --> 00:41:14,391 ఆ ఫోటో బయటకు వచ్చినందుకు క్షమించు. 559 00:41:16,518 --> 00:41:18,437 అది నిన్ను బాధ పెట్టి ఉంటే క్షమించు. 560 00:41:19,980 --> 00:41:22,524 ఎరిక్, నేనూ కలిసి లేము. నేను అతని రాణిని కాను. 561 00:41:26,278 --> 00:41:28,238 అలాగని నేను నీ రాణిని కూడా కాను. 562 00:41:36,747 --> 00:41:37,789 అర్ధమైంది. 563 00:41:37,789 --> 00:41:39,541 కోజో, నేను... 564 00:42:18,372 --> 00:42:22,167 సున్నితమైనవి జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి 565 00:42:36,265 --> 00:42:37,349 {\an8}ఎడ్డీ 566 00:43:19,683 --> 00:43:23,854 వ్యాఖ్యను జత చేయండి లేదా పంపించండి 567 00:43:24,855 --> 00:43:25,814 {\an8}పంపించబడింది 568 00:43:37,701 --> 00:43:38,911 ఓ దేవుడా! 569 00:43:38,911 --> 00:43:40,746 మనం అగ్ని మాపక దళాన్ని పిలవాలేమో. 570 00:43:42,331 --> 00:43:43,332 శామ్? 571 00:43:43,999 --> 00:43:45,250 ఈ పాన్ కేకులు బాగా కాలిపోయాయి. 572 00:43:45,250 --> 00:43:47,628 మొదట వేసినవి ఎందుకని కాలిపోతాయి? 573 00:43:47,628 --> 00:43:49,630 అవి నాకు ఇవ్వు. నాకు బాగా కాలిన పాన్ కేకులంటే ఇష్టం. 574 00:43:51,423 --> 00:43:52,466 అంతా బాగానే ఉందా? 575 00:43:53,008 --> 00:43:54,968 నువ్వు ఉదయంనుంచీ అదోలా ఉన్నావు. 576 00:43:54,968 --> 00:43:56,303 లేదు. అంతా బాగానే ఉంది. 577 00:43:57,429 --> 00:43:58,430 సరే. 578 00:43:58,972 --> 00:44:01,016 అమ్మా, నా బూట్లు కనిపించట్లేదు. 579 00:44:01,016 --> 00:44:02,434 మళ్లీ మొదలైంది. 580 00:44:02,434 --> 00:44:03,727 నేను వెళ్లి చూస్తాను. 581 00:44:03,727 --> 00:44:05,687 జెనీ బీన్, వాటిని ఎక్కడ వదిలేశావు? 582 00:44:15,113 --> 00:44:18,408 మీరూ చేరతారా? 583 00:45:32,816 --> 00:45:34,610 హల్లో? 584 00:45:34,610 --> 00:45:36,320 జేక్ 585 00:45:36,320 --> 00:45:37,988 డీ డీ నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి సరేనా? 586 00:45:37,988 --> 00:45:39,615 ఆ జంట ఒక ఆఫర్ ఇచ్చింది. 587 00:45:41,116 --> 00:45:42,409 చాలా త్వరగానే. 588 00:45:43,118 --> 00:45:45,329 నువ్వు ఖచ్చితంగా చెప్పలేనన్నావు, కానీ వారు ఆ ఫ్లాట్ ని కోరుకుంటున్నారు. 589 00:45:45,329 --> 00:45:48,582 మనం గట్టిగా పట్టుబడితే, అడిగిన ధరకంటే ఎక్కువకే చెల్లిస్తారు. 590 00:46:09,394 --> 00:46:10,646 ఎక్కడికి వెళ్తున్నావు? 591 00:46:14,608 --> 00:46:16,652 నన్ను నలిపేయకు, అమ్మా. 592 00:46:16,652 --> 00:46:19,071 నిన్ను నలపడం ఆపనే ఆపను తల్లీ. 593 00:46:19,071 --> 00:46:21,573 - నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. - ఐ లవ్యూ అమ్మా. 594 00:46:22,658 --> 00:46:23,659 అర్ధమైంది. 595 00:46:42,803 --> 00:46:44,388 డీ డీ వింటున్నావా? 596 00:46:48,684 --> 00:46:52,229 - వింటున్నా. - అయితే ఏమంటావు? 597 00:46:52,813 --> 00:46:54,731 నాకు 60 రోజుల హక్కు పత్రం కావాలి. 598 00:46:56,733 --> 00:46:58,777 అలాగే ఆ షాండ్లియర్ ను నేనే తీసుకెళ్తా. 599 00:47:08,495 --> 00:47:10,706 {\an8}యోలో 600 00:48:09,598 --> 00:48:11,934 హేయ్, అది చేసింది నువ్వే కదా? 601 00:48:12,935 --> 00:48:13,936 అక్కడ పచ్చగడ్డితో చేసింది నువ్వేగా? 602 00:48:14,937 --> 00:48:15,979 అవును. 603 00:48:15,979 --> 00:48:19,483 నిజానికి హోమ్ డిపోవారి వస్తువులు, పివిసి పైప్, 604 00:48:19,483 --> 00:48:21,151 మిగతా పనంతా నేనే చేశా. 605 00:48:26,156 --> 00:48:27,699 మీ నాన్న గురించి అలా అన్నందుకు సారీ. 606 00:48:29,785 --> 00:48:31,453 నిజంగా సారీ, సరేనా? 607 00:48:31,453 --> 00:48:35,457 ఎడ్వర్డ్, నాలో మార్పు వస్తోంది. 608 00:48:36,500 --> 00:48:38,126 పరిస్థితులన్నీ మారుతున్నాయి. 609 00:48:42,506 --> 00:48:44,049 నువ్వు ఇక ఎక్కడా పడుకోలేవు. 610 00:48:44,049 --> 00:48:47,678 ఎందుకని? అంటే ఏంటి? 611 00:48:47,678 --> 00:48:50,222 నా గదిలో ఇకపై అబ్బాయితో పడుకోలేను. 612 00:48:50,222 --> 00:48:51,515 ఎందుకని? 613 00:48:51,515 --> 00:48:53,225 అదంతా విడమరచి చెప్పాలా? 614 00:48:53,225 --> 00:48:55,060 నీకు నేనంటే ఇష్టం ఉన్నప్పుడు ఏంటి సమస్య? 615 00:48:56,478 --> 00:48:57,604 నేనిప్పుడు మహిళని. 616 00:48:59,898 --> 00:49:00,941 అంటే, ఇంతకుముందు? 617 00:49:03,443 --> 00:49:04,778 నాకు పీరియడ్లు వస్తున్నాయి. 618 00:49:05,988 --> 00:49:09,408 అదంతా నాకు తెలియదు. సరే. 619 00:49:09,408 --> 00:49:11,326 ఈ ప్రపంచం నడిచేది అలాగే. 620 00:49:11,326 --> 00:49:12,703 అదేమీ వ్యక్తిగతం కాదు. 621 00:49:15,455 --> 00:49:16,582 ఇవిగో నీ వస్తువులు. 622 00:49:27,551 --> 00:49:29,136 మనం ఇకపై స్నేహితులుగా ఉండమా? 623 00:49:31,180 --> 00:49:32,639 అప్పుడప్పుడు కలుద్దాం. 624 00:49:34,099 --> 00:49:35,517 అంతా బాగానే ఉంటుంది. అది... 625 00:49:36,059 --> 00:49:39,855 లేదు. లేదు. ఏమీ బాగోదు. 626 00:49:41,481 --> 00:49:42,941 నాకైతే ఇకపై ఏదీ బాగోదు. 627 00:49:42,941 --> 00:49:44,443 నీకు కొత్త ఫ్రెండ్స్ వస్తారు. 628 00:50:07,466 --> 00:50:12,513 ..."రెట్టింపు శ్రమ, ఇబ్బంది. మంట వెలుగుతోంది, కడాయి కాగుతోంది." 629 00:52:26,146 --> 00:52:28,148 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్