1 00:00:13,639 --> 00:00:15,307 {\an8}2000 ఎన్‌ఎఫ్ఎల్ డ్రాఫ్ట్ 2 00:00:15,307 --> 00:00:17,100 {\an8}గుడ్ ఆఫ్టర్‌నూన్ 3 00:00:18,018 --> 00:00:22,105 {\an8}నవశతాబ్దిలో ఎన్ఎఫ్ఎల్ కాలేజీ ఆటగాళ్ల తొలి డ్రాఫ్ట్ కార్యక్రమానికి స్వాగతం. 4 00:00:24,233 --> 00:00:27,236 మాతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అభిమానులందరికీ అభినందనలు. 5 00:00:27,236 --> 00:00:30,197 ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. 6 00:00:30,197 --> 00:00:31,907 డ్రాఫ్ట్ డే నాకు గుర్తుంది. 7 00:00:31,907 --> 00:00:33,700 మా వాళ్లతో కలిసి ఇంట్లో చూస్తున్నా. 8 00:00:33,700 --> 00:00:37,329 ఈ డ్రాఫ్ట్‌లో ఏడెనిమిది మంది క్వార్టర్‌బ్యాక్స్‌ ఎంపికవుతారు అనుకుంటున్నా. 9 00:00:37,329 --> 00:00:39,206 తొలిరౌండ్‌లో ఎంపిక కానని నాకు తెలుసు. 10 00:00:39,206 --> 00:00:41,667 రెండు లేదా మూడో రౌండ్‌లో ఎంపిక కావచ్చు అనుకున్నా. 11 00:00:41,667 --> 00:00:44,044 {\an8}మూడో రౌండ్ వచ్చాక వింతగా అనిపించింది నాకు. 12 00:00:44,044 --> 00:00:45,128 {\an8}టామ్ బ్రాడీ, క్వార్టర్‌బ్యాక్ 13 00:00:45,128 --> 00:00:48,215 ఆటగాళ్లని ఎంచుకునే జట్లని మీరు చూడొచ్చు, 14 00:00:48,215 --> 00:00:50,467 అందుబాటులోని క్వార్టర్‌బ్యాక్స్‌నీ చూడొచ్చు, 15 00:00:50,467 --> 00:00:52,553 అందరూ నాతో సమానస్థాయి ఆటగాళ్లే. 16 00:00:52,553 --> 00:00:54,429 వాళ్లలో చాలామంది ఎంపికయ్యారు. 17 00:00:54,429 --> 00:00:59,935 మార్షల్ నుంచి క్వార్టర్‌బ్యాక్ చాడ్ పెనింగ్టన్‌ని జెట్స్ ఎంచుకున్నారు. 18 00:01:01,436 --> 00:01:03,021 {\an8}రౌండ్లు మొదలయ్యాయి, 19 00:01:03,021 --> 00:01:07,025 {\an8}ఒక పాతమోడల్ టీవీ ముందు కూర్చున్నాం మేము... 20 00:01:07,025 --> 00:01:08,151 {\an8}న్యాన్సీ బ్రాడీ, టామ్ సోదరి 21 00:01:08,151 --> 00:01:10,654 {\an8}...ఎదురు చూస్తున్నాం, చూస్తున్నాం. 22 00:01:10,654 --> 00:01:13,115 శాన్‌ఫ్రాన్సిస్కో 49 వాళ్లు జియోవానీ కార్మాజీ అనే 23 00:01:13,115 --> 00:01:17,077 క్వార్టర్‌బ్యాక్‌ని ప్రాంతీయ అభిమానంతో ఎంచుకున్నారు. 24 00:01:17,077 --> 00:01:20,873 టెన్నెసీ యూనివర్సిటీ క్వార్టర్‌బ్యాక్ టీ మార్టిన్‌ని 25 00:01:20,873 --> 00:01:23,750 ఐదో రౌండ్‌లో ఎంచుకున్నారు పిట్స్‌బర్గ్ స్టీలర్స్. 26 00:01:23,750 --> 00:01:26,962 {\an8}ఐదో రౌండ్ అయిపోయింది, అయినా తను ఎంపిక కాలేదు, 27 00:01:26,962 --> 00:01:28,630 {\an8}"అసలేం జరుగుతోంది" అనిపించింది. 28 00:01:28,630 --> 00:01:31,258 "ఇక్కడి నుంచి పోతున్నా" అన్నాడు వాడు. 29 00:01:31,717 --> 00:01:33,719 బేస్‌బాల్ బ్యాట్ పట్టుకుని వీధిలో నడిచా, 30 00:01:33,719 --> 00:01:37,181 నేను ఎప్పటికీ ఎంపిక కాకపోతే పరిస్థితి ఏంటి అనుకుంటూ, 31 00:01:37,723 --> 00:01:39,933 బేస్‌బ్యాల్‌ బ్యాటుని చేతిపై కొట్టుకున్నా. 32 00:01:39,933 --> 00:01:42,186 తాము ఎంపిక అవుతామా లేదా అని ఎదురుచూస్తున్న 33 00:01:42,186 --> 00:01:44,563 {\an8}ఎంతో మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లకి ఉద్విగ్న సమయం ఇది. 34 00:01:44,563 --> 00:01:46,648 {\an8}కాసేపట్లో ఫోన్ వస్తుందేమో లేక 35 00:01:46,648 --> 00:01:49,276 {\an8}తమ పేర్లు ప్రకటిస్తారేమో అని కొందరిలో ఆశ. 36 00:01:49,276 --> 00:01:50,944 ఆ ఏడు డ్రాఫ్ట్‌లో 37 00:01:50,944 --> 00:01:53,906 {\an8}మాకంత అత్యవసరం కాని స్థానం... 38 00:01:53,906 --> 00:01:54,990 {\an8}స్కాట్ పియాలీ ప్లేయర్ పర్సనల్ విపి 39 00:01:54,990 --> 00:01:56,200 {\an8}...క్వార్టర్‌బ్యాక్. 40 00:01:56,200 --> 00:01:58,785 - ఎంత టైముంది మనకి? - నిమిషం 20 సెకండ్లు. 41 00:01:58,785 --> 00:02:00,287 - నిమిషం 20 సెకండ్లు. - కానివ్వు. 42 00:02:00,287 --> 00:02:02,206 సరే. అంతముఖ్యం కాకున్నా తీసుకుందాం. 43 00:02:02,206 --> 00:02:04,666 తీసుకుందామా? తీసుకుందాం. 44 00:02:04,666 --> 00:02:07,503 తన కంటే ముందు కొంతమంది ఆటగాళ్లని ఎంపిక చేశాం, 45 00:02:07,503 --> 00:02:10,088 అయితే ఆరో రౌండ్‌లోకి వచ్చేసరికి, 46 00:02:10,088 --> 00:02:12,382 బోర్డు మీద చూస్తే, బ్రాడీ ఇంకా ఉన్నాడు, 47 00:02:12,382 --> 00:02:13,800 "ఏం చేస్తున్నాం మనం?" అనుకున్నా 48 00:02:15,010 --> 00:02:16,845 మనకి క్వార్టర్‌బ్యాక్ అవసరం లేదు, 49 00:02:16,845 --> 00:02:19,181 కానీ అందుబాటులో ఉన్న ఉత్తమ ఆటగాడు తనే. 50 00:02:19,765 --> 00:02:22,726 అంతా సరైన సమయంలో అయిపోతుందో లేదో చూసుకో, జిమ్మీ డి. 51 00:02:22,726 --> 00:02:24,228 - ఓకే చేయమంటారా? - చెయ్. 52 00:02:24,228 --> 00:02:25,771 సరే, అయిపోయింది. 53 00:02:25,771 --> 00:02:29,191 ఫ్యామిలీ రూంలోని సోఫాలో కూర్చుని ఉన్నాం అందరం, 54 00:02:29,191 --> 00:02:33,403 చివరికి ఫోన్ వచ్చింది, బిల్ బెలిచిక్ లైన్‌లో ఉన్నాడు. 55 00:02:34,905 --> 00:02:36,323 {\an8}అభినందనలు. 56 00:02:36,323 --> 00:02:38,408 {\an8}బిల్ బెలిచిక్ ప్రధాన కోచ్ 57 00:02:38,408 --> 00:02:41,578 {\an8}మీతో కలవాలని ఉత్కంఠగా ఉన్నాం. వెయిట్ చేయించినందుకు క్షమించాలి. 58 00:02:41,578 --> 00:02:43,455 {\an8}"టామీతో మాట్లాడొచ్చా?" అన్నారు, 59 00:02:43,455 --> 00:02:45,624 {\an8}వాడికి ఫోన్ ఇచ్చాం... 60 00:02:49,044 --> 00:02:53,757 ...వాడు పేట్రియాట్‌గా మారాడు, అవి మా కుటుంబానికి సంతోషపు క్షణాలు. 61 00:02:53,757 --> 00:02:55,467 చివరిగా తీసుకున్న ఆరుగురిలో, 62 00:02:55,467 --> 00:02:59,471 199వ ఎంపికగా టామ్ బ్రాడీ న్యూ ఇంగ్లండ్‌ పేట్రియాట్స్ సొంతమయ్యాడు. 63 00:02:59,471 --> 00:03:02,432 మా నాన్న ఆనందంతో షాంపేన్ సీసా తెరిచాడు. 64 00:03:02,432 --> 00:03:03,767 చాలా సంతోషం అనిపించింది. 65 00:03:03,767 --> 00:03:06,937 ఎప్పుడు ఎంపికయ్యాడు, ఏ నంబర్‌లో ఎంపికయ్యాడో మేము పట్టించుకోలేదు. 66 00:03:06,937 --> 00:03:09,731 చెప్పాలంటే 199 కూడా మంచి సంఖ్యే 67 00:03:10,399 --> 00:03:13,110 {\an8}చూడు. దాన్ని పది సెకండ్లు పట్టుకో. 68 00:03:13,110 --> 00:03:15,821 తొలిరోజు అక్కడికి వెళ్లడం గుర్తుంది. 69 00:03:15,821 --> 00:03:17,739 ఆరో రౌండ్‌లో ఎంపికైన నేను ఎక్కువ కాలం 70 00:03:17,739 --> 00:03:21,076 జట్టులో ఉంటానని ఎవరూ అనుకోరని కచ్చితంగా అనిపించింది. 71 00:03:21,076 --> 00:03:26,206 నాకు గుర్తుంది, బక్కగా పొడుగ్గా ఉన్న ఒక కుర్రాడు వచ్చి, 72 00:03:26,206 --> 00:03:30,043 {\an8}"మిస్టర్ క్రాఫ్ట్, టామ్ బ్రాడీ అంటే నేనే" అని చెప్పడం. 73 00:03:30,043 --> 00:03:31,712 {\an8}నేను చెప్పా "నువ్వు నాకు తెలుసు. 74 00:03:31,712 --> 00:03:35,299 {\an8}మిషిగన్‌ యూనివర్శిటీ మొత్తంలో ఆరో రౌండ్ డ్రాఫ్ట్ ఎంపికవి నువ్వు" అని. 75 00:03:35,299 --> 00:03:40,387 దాంతో తను చూసిన చూపు ఇంకా గుర్తుంది, ఎప్పటికీ మర్చిపోను. 76 00:03:40,387 --> 00:03:45,684 తను అన్నాడు, "అవును, మీ సంస్థ తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం నేను" అని. 77 00:03:46,643 --> 00:03:48,061 నేను తననే చూశా. 78 00:03:48,061 --> 00:03:49,396 "సరే. 79 00:03:50,480 --> 00:03:53,775 పైవాడు తథాస్తు అంటాడేమో చూద్దాం." 80 00:04:02,910 --> 00:04:06,705 పేట్రియాట్స్ వర్సెస్ సెయింట్ లూయిస్ రామ్స్ నవంబర్ 18, 2001 81 00:04:07,456 --> 00:04:08,373 టామ్ బ్రాడీ 8వ స్టార్ట్ 82 00:04:08,373 --> 00:04:11,001 కిక్కిరిసిన ఫాక్స్‌బరో స్టేడియంలోకి తిరిగి స్వాగతం. 83 00:04:11,001 --> 00:04:12,753 ద రామ్స్ మరియు ద పేట్రియాట్స్. 84 00:04:12,753 --> 00:04:14,922 న్యూ ఇంగ్లండ్ చేతిలో బంతి. 85 00:04:14,922 --> 00:04:16,632 కమాన్, బ్రాడీ! 86 00:04:17,507 --> 00:04:18,926 గత ఏడు గేమ్స్ నుంచి, 87 00:04:18,926 --> 00:04:21,970 అఫెన్స్‌ని టామ్‌ బ్రాడీ బాగా నడిపిస్తున్నాడు. 88 00:04:21,970 --> 00:04:26,141 అయితే డ్రూ బ్లెడ్‌సో కూడా జట్టులో అందుబాటులో ఉన్నాడు, 89 00:04:26,141 --> 00:04:30,270 ఈ సమయంలో, ఒక క్వార్టర్‌బ్యాక్‌గా టామ్ మరింత మెరుగ్గా ఆడాలి. 90 00:04:41,323 --> 00:04:42,282 అడ్డుకున్నారు! 91 00:04:44,451 --> 00:04:45,619 చ్ఛ, దారుణం! 92 00:04:45,619 --> 00:04:47,788 అసలక్కడ బంతి అందుకునే ఆటగాడే లేడు. 93 00:04:48,455 --> 00:04:51,250 పేట్రియాట్స్‌కి ఆ గేమ్ చాలా ముఖ్యం. 94 00:04:52,167 --> 00:04:55,128 {\an8}ఫుట్‌బాల్‌లో రామ్స్ అత్యుత్తమ జట్టు. 95 00:04:55,963 --> 00:04:58,632 పేట్రియాట్స్ గెలవడానికి చాలా అవకాశాలు వచ్చాయి. 96 00:04:58,632 --> 00:05:01,718 కానీ జట్టుని గెలిపించడంలో బ్రాడీ విఫలం అయ్యాడు. 97 00:05:01,718 --> 00:05:03,387 తను అదృష్టవశాత్తూ ఒక మ్యాచ్ గెలిపించాడు. 98 00:05:03,804 --> 00:05:07,683 వాడు బెంచ్‌ మీద ఉండాల్సిన ఆటగాడు. అంతే! 99 00:05:09,059 --> 00:05:13,480 సైడ్‌లైన్స్ దగ్గర కూర్చుని చూస్తూ, ఏం ఆలోచించానంటే, 100 00:05:13,480 --> 00:05:15,065 {\an8}"వీడి పని అయిపోయినట్టే. 101 00:05:15,065 --> 00:05:17,109 {\an8}బహుశా నాకు ఆడే అవకాశం రావచ్చు" అని. 102 00:05:17,860 --> 00:05:21,154 {\an8}ఫైనల్ స్కోర్, సెయింట్ లూయిస్ 24, న్యూ ఇంగ్లండ్ 17 103 00:05:21,154 --> 00:05:24,241 న్యూ ఇంగ్లండ్ పేట్రియాట్స్ మళ్లీ మొదటికి వచ్చింది. 104 00:05:27,244 --> 00:05:28,704 ఓటమి మహాచెడ్డది. 105 00:05:28,704 --> 00:05:31,748 మంచి జట్టుతో ఆడేటప్పుడు, తప్పులు చేస్తే చాలా కష్టం. 106 00:05:32,833 --> 00:05:36,295 కానీ, బంతిపై పట్టు సాధించడానికి ఇవాళ మాకు మంచిరోజు కాదు. 107 00:05:36,295 --> 00:05:38,839 మీ ఆటతీరు గురించి ఏం చెప్తారు? 108 00:05:41,341 --> 00:05:44,136 దాని గురించి కోచ్‌ బెలిచిక్‌ను అడిగితే మంచిది అనుకుంటా. 109 00:05:52,978 --> 00:05:55,606 ఈ ఓటమి తర్వాత పేట్రియాట్స్ 5 విజయాలు, 5 ఓటములతో ఉంది. 110 00:05:56,648 --> 00:06:00,194 మీడియాలో చాలామంది ఇంకా బ్లెడ్‌సో వైపే చూస్తున్నారు 111 00:06:00,194 --> 00:06:03,697 గెలవడానికి తనే మంచి ఎంపిక అని, తనే ఫ్రాంచైజీలా చూస్తున్నారు. 112 00:06:04,573 --> 00:06:06,783 బ్రాడీకి అవకాశం వచ్చింది. 113 00:06:07,326 --> 00:06:08,911 ఇక బ్లెడ్‌సో వంతు. 114 00:06:10,162 --> 00:06:13,457 బిల్, మరోసారి తన పద్ధతిలోనే వెళ్లాడు. తన మాట సూటిగా చెప్పాడు. 115 00:06:14,458 --> 00:06:16,752 {\an8}నా వృత్తిలో, ఇక్కడ రెండేళ్ల నుంచి ఉన్నాను, 116 00:06:16,752 --> 00:06:19,922 {\an8}ఫుట్‌బాల్‌ జట్టు కోసం నిర్ణయాలు తీసుకోవడమే నా పని. 117 00:06:19,922 --> 00:06:22,883 అందుకే మిస్టర్ క్రాఫ్ట్ నాకు డబ్బులు ఇస్తున్నారు, అదే నేను చేస్తా, 118 00:06:22,883 --> 00:06:25,969 ఫుట్‌బాల్‌ జట్టుకి ఏది మంచి అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకుంటా. 119 00:06:25,969 --> 00:06:28,096 జట్టు అంటే జట్టే. 120 00:06:28,096 --> 00:06:31,099 ఏ ఒక్కరి కోసమో, ఓ గ్రూప్ కోసమో కాకుండా, 121 00:06:31,099 --> 00:06:33,852 జట్టు మంచి కోసమే ఏదయినా చేస్తా. 122 00:06:35,062 --> 00:06:38,273 ఇక ముందు కూడా, స్టార్టర్‌గా టామ్ ఉంటాడు... 123 00:06:39,274 --> 00:06:40,692 ...అలా మందుకెళ్తాం. 124 00:06:40,692 --> 00:06:43,028 ఏదైనా గాయం అయితే తప్ప తనే స్టార్టర్, 125 00:06:43,028 --> 00:06:45,739 తను ఆడకపోవడం అనేది ఉండదు. 126 00:06:45,739 --> 00:06:48,492 బిల్, ఈ అంశంలో మీ మనసు మార్చుకునే అవకాశం ఉందా? 127 00:06:53,038 --> 00:06:55,457 ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు, 128 00:06:55,457 --> 00:06:57,251 దాని పర్యవసనాలు తెలిసుండాలి, కదా? 129 00:06:57,251 --> 00:06:58,961 ఎవరో చెప్పారని నిర్ణయించకూడదు. 130 00:07:00,379 --> 00:07:03,298 క్వార్టర్‌బ్యాక్ వివాదం మీడియాకి పండగలా మారింది. 131 00:07:04,550 --> 00:07:06,927 పెద్ద రచ్చ అవుతుందని కూడా తెలిసుండాలి. 132 00:07:06,927 --> 00:07:09,763 {\an8}చూడు టోనీ, నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ చరిత్రలోనే 133 00:07:09,763 --> 00:07:11,849 {\an8}ఇది అత్యంత చెత్త కోచింగ్ అంటున్నా. 134 00:07:11,849 --> 00:07:14,935 {\an8}ఇది మరెవరో కాదు, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బిల్ బెలిచిక్. 135 00:07:15,394 --> 00:07:18,397 మిగతా సీజన్ మొత్తానికి టామ్ బ్రాడీనే స్టార్టర్‌ అని 136 00:07:18,397 --> 00:07:19,857 ఇవాళ ఆయన ప్రకటించాడు. 137 00:07:19,857 --> 00:07:22,734 {\an8}ఇప్పుడే తనని విమర్శించాల్సిన పని లేదు అనుకుంటా. 138 00:07:22,734 --> 00:07:25,112 {\an8}సీజన్‌లో మున్ముందు తను విజయవంతం అయితే ఏమంటావు? 139 00:07:25,112 --> 00:07:27,030 {\an8}బ్లెడ్‌సోకి ఇలా ఎందుకు చేశావు? 140 00:07:27,030 --> 00:07:29,366 {\an8}అంటే వంద మిలియన్ డాలర్ల క్వార్టర్‌బ్యాక్‌ 141 00:07:29,366 --> 00:07:31,618 {\an8}- బెంచ్‌పై కూర్చోవాలా? - తను సిద్ధంగా ఉన్నాడంటారా? 142 00:07:31,618 --> 00:07:33,787 {\an8}- అది నాకు తెలియదు. - తను రెడీగా లేడేమో కూడా తెలియదు. 143 00:07:33,787 --> 00:07:36,123 {\an8}గత మూడు మ్యాచ్‌ల్లో రెండిట్లో 144 00:07:36,123 --> 00:07:38,000 {\an8}టామ్ బ్రాడీ సరిగా ఆడలేదు. 145 00:07:38,000 --> 00:07:40,878 కాబట్టి డ్రూ బ్లెడ్‌సోకి అవకాశం ఇవ్వాలి. 146 00:07:43,130 --> 00:07:47,384 మీడియా అంటే రాతగాళ్ల గుంపు. 147 00:07:48,594 --> 00:07:51,889 నిజంగా వాళ్లేం రాస్తారో వాళ్లకే తెలియదు. 148 00:07:52,931 --> 00:07:55,934 కానీ న్యూ ఇంగ్లండ్‌లో ఫుట్‌బాల్ గురించి తెలిసిన నిపుణులు ఉన్నారు 149 00:07:55,934 --> 00:07:57,186 {\an8}ఎర్నీ ఆడమ్స్ డైరెక్టర్ ఆఫ్ ఫుట్‌బాల్ రీసెర్చ్ 150 00:07:57,186 --> 00:08:00,022 {\an8}వాళ్లంతా పేట్రియాట్స్ కోచింగ్ స్టాఫ్ కోసం పనిచేస్తున్నారు. 151 00:08:01,106 --> 00:08:04,193 వాళ్లతో కలిసి లేకపోతే, వాళ్ల గురించి ఏమీ తెలుసుకోలేం. 152 00:08:05,903 --> 00:08:10,282 బిల్ నాకు మంచి మిత్రుడు. హైస్కూల్ నుంచి తెలుసు తను. 153 00:08:13,243 --> 00:08:15,412 రకరకాల పరిస్థితుల మధ్య 154 00:08:15,412 --> 00:08:17,164 ఒకరితో యాభయ్యేళ్లు సావాసం చేశామంటే, 155 00:08:17,164 --> 00:08:19,958 వాళ్ల ఆలోచనలు, వ్యూహాలు ఒకరివి ఒకరికి తెలిసిపోతాయి. 156 00:08:19,958 --> 00:08:22,878 కొన్నిసార్లు తన మొహం చూసే ఏం చేస్తాడు అనేది 157 00:08:22,878 --> 00:08:25,005 అంచనా వేస్తా, నా విషయంలో తనూ అంతే. 158 00:08:25,005 --> 00:08:26,089 బ్రాడీనా లేక బ్లెడ్‌సోనా? 159 00:08:26,089 --> 00:08:29,051 ఇక, క్వార్టర్‌బ్యాక్ వివాదంలోకి వస్తే, 160 00:08:29,051 --> 00:08:31,136 తనేం ఆలోచించేది నాకు స్పష్టంగా తెలుసు. 161 00:08:31,970 --> 00:08:36,099 మా స్టార్టింగ్ క్వార్టర్‌బ్యాక్‌గా బ్లెడ్‌సోని ఎంచుకోవడం లేదు. 162 00:08:38,143 --> 00:08:39,561 {\an8}పద, డ్రూ! 163 00:08:39,561 --> 00:08:41,980 {\an8}8 ఏళ్ల క్రితం 1993 శిక్షణా శిబిరం 164 00:08:41,980 --> 00:08:45,108 {\an8}నువ్వు ఇప్పుడే రావచ్చు, ఆటకి కొత్త కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. 165 00:08:45,108 --> 00:08:48,737 గ్రౌండ్‌లో నోరు మూసుకుని సరిగ్గా ఆడగలిగితే, 166 00:08:48,737 --> 00:08:51,114 ఎవరైనా నిన్ను అంగీకరించాల్సిందే. 167 00:08:51,114 --> 00:08:52,908 మాజీలు అందరితో మాట్లాడాం, 168 00:08:52,908 --> 00:08:55,827 వాళ్లంతా, మొదట్లో తగిలే దెబ్బలు నలిగిపోయేలా చేస్తాయన్నారు. 169 00:08:55,827 --> 00:08:57,496 మొదట్లో అలా తగలకూడదని కోరుకుంటావా, 170 00:08:57,496 --> 00:08:59,498 ఎప్పటికీ తగలకూడదనా.? 171 00:08:59,498 --> 00:09:02,334 అలా ఉంటుందని తెలుసు, అది మొదట్లోనే జరగాలని కోరుకుంటున్నా. 172 00:09:02,334 --> 00:09:05,838 దెబ్బతోనే "ఎన్‌ఎఫ్ఎల్‌కి స్వాగతం" పలకాలి, అంతటితో ఆ భయం పోవాలి, 173 00:09:05,838 --> 00:09:08,215 ఆ తర్వాత ఎక్కువ సార్లు దెబ్బలు తగలకూడదు. 174 00:09:09,258 --> 00:09:10,717 తన కెరీర్ మొదట్లో, 175 00:09:10,717 --> 00:09:14,137 తన పరిస్థితి బాగున్నప్పుడు, డ్రూ అద్భుతమైన క్వార్టర్‌బ్యాక్. 176 00:09:15,180 --> 00:09:17,140 కానీ తను గాయపడ్డాడు. 177 00:09:18,225 --> 00:09:19,434 చాలా సార్లు. 178 00:09:21,144 --> 00:09:23,105 ఎన్నిసార్లు కింద పడతావురా నాయనా? 179 00:09:23,105 --> 00:09:25,566 పదకొండా? పన్నెండా, చెప్పరా? 180 00:09:26,316 --> 00:09:29,444 అలా వందల సార్లు దెబ్బలు తగిలాక, 181 00:09:29,444 --> 00:09:32,865 డ్రూ కూడా మామూలు మనిషి అయిపోయాడు. 182 00:09:32,865 --> 00:09:33,949 హట్! 183 00:09:34,908 --> 00:09:37,327 బ్లెడ్‌సో బంతి విసరాలి, ఒత్తిడిలో ఉన్నాడు. 184 00:09:38,495 --> 00:09:39,705 తను అలా ఒత్తిడిలో పడితే, 185 00:09:39,705 --> 00:09:42,416 తన పాదాలు కదలవని మీరు చూడొచ్చు. 186 00:09:43,584 --> 00:09:46,670 సరైన ఒత్తిడి ఎదురైతే 187 00:09:46,670 --> 00:09:49,006 డ్రూ కాస్త ఇబ్బంది పడతాడు. 188 00:09:49,006 --> 00:09:51,133 తనపై దాడి జరగబోతుందని పసిగట్టగానే, 189 00:09:51,133 --> 00:09:54,178 పూర్తిగా ఆగిపోయి, జరగబోయే దానికోసం ఎదురుచూస్తాడు. 190 00:09:55,888 --> 00:09:58,515 దాని గురించి స్కాట్ పియాలీతో కూడా మాట్లాడా నేను. 191 00:09:59,600 --> 00:10:02,352 "స్కాట్, ఇలా రా" అన్నాడు. 192 00:10:02,352 --> 00:10:05,647 తను వీడియో చూస్తూ, చెప్పాడు, 193 00:10:05,647 --> 00:10:09,026 "ఇదే, మనం దీని గురించే మాట్లాడుకుంటున్నాం" అని. 194 00:10:09,026 --> 00:10:10,903 ఇంకా, "డ్రూ. 195 00:10:12,279 --> 00:10:15,365 దాడి జరిగేటప్పుడు తను జడలబర్రెలా అయిపోతాడు" అన్నాడు. 196 00:10:28,587 --> 00:10:31,924 కోచ్‌లుగా, ఆ సమస్య ఉందని మాకు తెలుసు. 197 00:10:32,799 --> 00:10:34,134 టామ్‌ విషయానికొస్తే, 198 00:10:34,134 --> 00:10:38,514 ఆ సమస్యకి సమాధానంలా తనని నమ్మొచ్చు అనిపించింది మాకు. 199 00:10:40,140 --> 00:10:41,642 తనపై నమ్మకం ఎందుకంటే, 200 00:10:41,642 --> 00:10:46,438 తను ఏంటనేది తెలుసుకోవడానికి వీలైనంత సమయం మాకు దొరికింది. 201 00:10:50,692 --> 00:10:53,153 18 ఏళ్ల క్రితం శాన్ మటేయో, కాలిఫోర్నియా 202 00:10:53,153 --> 00:10:56,031 కొంచెం రౌడీల్లా మారదాం! 203 00:10:57,366 --> 00:11:00,327 మంచి ఆటగాడివి కావాలంటే ఏంచేయాలి, టామ్? 204 00:11:05,457 --> 00:11:07,042 - తెలియదు. - తెలియదా? 205 00:11:07,918 --> 00:11:11,171 పెరిగేకొద్దీ, బాల్‌పార్క్‌కి అంకితమైపోయాడు టామీ. 206 00:11:11,797 --> 00:11:14,550 తన అక్కలు అందరూ అన్ని ఆటలు ఆడేవాళ్లు. 207 00:11:14,550 --> 00:11:17,094 {\an8}దాంతో, తను పాకే వయసు నుంచే, 208 00:11:17,094 --> 00:11:20,305 {\an8}సాకర్ మైదానాలు, సాఫ్ట్‌బాల్ మైదానాల్లోకి, 209 00:11:20,305 --> 00:11:21,640 ఎప్పుడూ వెళ్తుండేవాడు. 210 00:11:23,058 --> 00:11:27,896 ఎలాగో తెలియదు కానీ, మాకు ఆటలంటే ఇష్టమని ఈ బుడతడు పసిగట్టాడు. 211 00:11:28,730 --> 00:11:30,482 మా నాన్నతో బాల్‌పార్క్‌కి వెళ్లేవాళ్లం, 212 00:11:30,482 --> 00:11:33,610 {\an8}ఆయన తన చొక్కా మడుచుకుని, ఒక చేత్తో చిన్న బ్యాట్ పట్టుకుని, 213 00:11:33,610 --> 00:11:35,779 {\an8}ఇంకో చేతికి గ్లవ్ వేసుకుని బంతి పట్టుకునేవాడు. 214 00:11:35,779 --> 00:11:38,240 {\an8}గ్లవ్‌లో ఉన్న బంతిని పైకి విసిరి 215 00:11:38,240 --> 00:11:40,492 {\an8}నా వైపు కిందకి కొట్టేవాడు. 216 00:11:40,492 --> 00:11:44,162 నేనెప్పేడూ అడిగేవాడిని, "డైవ్ చేసేలా పైకి కొట్టు" అని, కష్టంగా ఉండాలని. 217 00:11:45,205 --> 00:11:47,249 బంతి దూరంగా కిందకి వస్తే, 218 00:11:47,249 --> 00:11:49,001 భుజం దించి, దాని వైపు వెళ్లి ఆడాలి. 219 00:11:49,001 --> 00:11:52,254 {\an8}టామీకి, ప్రతిదీ పోటీనే. 220 00:11:52,254 --> 00:11:56,633 {\an8}ఆదివారాలు మేము చర్చి నుంచి ఇంటికి రేస్ పెట్టుకునేవాళ్లం. 221 00:11:56,633 --> 00:12:01,138 {\an8}ఎవరు ముందు ఇంటి వాకిట్లోకి చేరితే వాళ్లు వేలు ఊపాలి, 222 00:12:01,138 --> 00:12:05,142 వాడు గెలవలేదంటే, కోపం వచ్చేది వాడికి. 223 00:12:06,185 --> 00:12:07,853 ఒకసారి రిమోట్ తీసుకుని, 224 00:12:07,853 --> 00:12:11,064 వాడికి వీలయినంత బలంగా గోడకేసి విసిరాడు 225 00:12:12,524 --> 00:12:15,694 గోడకి అయిన కన్నం గురించి నా భార్యని అడిగా, 226 00:12:15,694 --> 00:12:19,823 "ఏంటి అది?" అని, దానికి తను "అది టామీ కోపం" అని చెప్పింది. 227 00:12:20,616 --> 00:12:23,327 బ్రాడీ రాకెట్‌లా విసిరాడు, కిర్బీ వరకు వెళ్లిందది. 228 00:12:23,327 --> 00:12:26,246 హైస్కూలులో ఉండగా ఫుట్‌బాల్ మొదలుపెట్టాడు టామీ. 229 00:12:27,080 --> 00:12:32,503 పోటీ పడాలని, గెలవాలని తనలో విపరీతమైన కోరిక ఉండేది. 230 00:12:33,378 --> 00:12:35,506 {\an8}- నీ బలాలు ఏంటి? - నా బలాలా? 231 00:12:35,506 --> 00:12:37,966 {\an8}నా చేయి బలమైందని అంతా అంటారు, మంచి విషయమే అది. 232 00:12:37,966 --> 00:12:39,510 {\an8}దీంతో చాలా కచ్చితంగా విసరగలను. 233 00:12:39,510 --> 00:12:42,471 నా వేగం విషయంలో కాస్త కష్టపడాలి అనుకుంటా. 234 00:12:43,013 --> 00:12:46,266 తను కోరుకున్నంత వేగం తనలో లేదు. 235 00:12:46,266 --> 00:12:49,853 ఫైవ్ డాట్ డ్రిల్ అని ఒక డ్రిల్ ఉంటుంది. 236 00:12:50,896 --> 00:12:53,690 అందరూ అసహ్యించుకునే డ్రిల్ అది. 237 00:12:53,690 --> 00:12:59,446 కానీ తను మాత్రం మా ఇంటి వెనుక గచ్చు మీద ఆ చుక్కలు గీసుకున్నాడు. 238 00:12:59,446 --> 00:13:02,366 బయట తను ఆ డాట్ డ్రిల్ చేసేవాడు, 239 00:13:02,366 --> 00:13:07,538 తనలో వేగం తక్కువ అని అంటున్నారనే, తన ఫుట్‌వర్క్‌ కోసం సాధన చేసేవాడు. 240 00:13:08,497 --> 00:13:10,123 తను పర్ఫెక్షనిస్ట్. 241 00:13:10,123 --> 00:13:12,417 అంటే, అదే ధ్యాస ఉంటుంది వారిలో. 242 00:13:12,835 --> 00:13:17,256 {\an8}ఒక విధంగా పర్ఫెక్షనిస్ట్‌తో ఎప్పుడూ కొన్ని సమస్యలు ఉంటాయి. 243 00:13:17,256 --> 00:13:19,424 {\an8}ఎందుకంటే, నువ్వెంత అద్భుతంగా చేసినా, 244 00:13:19,424 --> 00:13:21,802 నీకది సంతృప్తి ఇవ్వదు. 245 00:13:22,845 --> 00:13:24,930 హైస్కూల్లో ఉండగా 246 00:13:24,930 --> 00:13:28,141 తనని మెరుగు పరచుకోవడానికి ప్రతిదీ చేయడం అనేది మొదలై 247 00:13:28,141 --> 00:13:30,519 చాలాకాలం కొనసాగింది. 248 00:13:33,355 --> 00:13:37,150 న్యూ ఇంగ్లండ్ వచ్చి పేట్రియాట్స్‌లో చేరాక కూడా, 249 00:13:37,860 --> 00:13:40,404 తనకి సంతృప్తి లేదు. 250 00:13:41,488 --> 00:13:45,325 నాకు తెలిసి బిల్, అతడిలోని సామర్ధ్యం చూడగలిగాడు అనుకుంటా. 251 00:13:45,826 --> 00:13:47,536 న్యూ ఇంగ్లండ్‌లో ఈ వారమంతా 252 00:13:47,536 --> 00:13:49,955 ఒకే అంశంపై చర్చ జరిగింది. 253 00:13:49,955 --> 00:13:52,040 స్టార్టింగ్ క్వార్టర్‌బ్యాక్ ఎవరు అని? 254 00:13:52,040 --> 00:13:55,460 ఒకవైపు టామ్ బ్రాడీ, ఇంకోవైపు డ్రూ బ్లెడ్‌సో. 255 00:13:55,460 --> 00:13:58,922 ప్రధాన కోచ్ బెలిచిక్ మాత్రం, టామ్ బ్రాడీకే ఓటు వేశాడు. 256 00:14:00,299 --> 00:14:02,551 ఫస్ట్ డౌన్‌లో, పరిగెత్తినట్టు నటించాడు బ్రాడీ. 257 00:14:02,551 --> 00:14:04,219 ఎండ్‌జోన్‌కి రాకెట్‌లా వెళ్లింది. 258 00:14:04,219 --> 00:14:06,430 పట్టుకున్నాడు, టచ్‌డౌన్, ట్రాయ్ బ్రౌన్. 259 00:14:06,430 --> 00:14:08,056 అద్భుతమైన ప్లే! 260 00:14:08,056 --> 00:14:09,975 బెలిచిక్, టామ్ బ్రాడీని ఎంచుకున్నాడు 261 00:14:09,975 --> 00:14:11,476 క్వార్టర్‌బ్యాక్ తనే అన్నాడు. 262 00:14:11,476 --> 00:14:15,772 టామ్ బ్రాడీ అద్భుతంగా ఆడాడు, జట్టంతా బాగా ఆడింది. 263 00:14:19,151 --> 00:14:21,695 చెప్పాలంటే, టామ్ చాలా మంచి పని చేశాడు, 264 00:14:21,695 --> 00:14:24,781 ఇప్పుడిది తొమ్మిదో వారం, ప్రతివారం తను బాగానే ఆడాడు. 265 00:14:24,781 --> 00:14:27,826 మరీ అద్భుతంగా కాదు, కానీ బాగా ఆడాడు. సరిగా చెప్పలేను, 266 00:14:27,826 --> 00:14:29,995 ఇవాళ చేసిన మూడు నాలుగు టచ్‌డౌన్స్ అద్భుతం. 267 00:14:29,995 --> 00:14:32,623 ఆట అర్ధభాగం చివరలో విసిరిన త్రో 268 00:14:32,623 --> 00:14:34,124 నిజంగా బీభత్సమైన త్రో. 269 00:14:34,124 --> 00:14:36,001 గ్రౌండ్ లోపల బయటా జట్టుకి ఎలా అండగా ఉండాలో 270 00:14:36,001 --> 00:14:37,461 అర్ధం చేసుకున్నాడు టామ్. 271 00:14:37,461 --> 00:14:42,674 {\an8}వ్యక్తిగతంగా తన ప్రాథమిక అంశాలు టెక్నిక్స్‌పై తీవ్రంగా కష్టపడి సిద్ధమయ్యాడు. 272 00:14:44,593 --> 00:14:45,969 కెమెరాలకి ఇది సమయం కాదు. 273 00:14:46,970 --> 00:14:48,764 టామ్, నాలోంచి ఉత్తమ కోచింగ్‌ బయటకి తీసుకొచ్చాడు అనిపించిది 274 00:14:48,764 --> 00:14:50,724 ఎందుకంటే తను చాలా సిద్ధంగా ఉండేవాడు, 275 00:14:50,724 --> 00:14:53,685 తన ప్రిపరేషన్ విషయంలో నేనింకా మెరుగవ్వాలేమో అనిపించేది. 276 00:14:54,353 --> 00:14:57,314 ఇదుగో, ఇక్కడ కొంతమంది ఆటగాళ్లని చూపించాలి అనుకుంటున్నా. 277 00:14:57,314 --> 00:14:59,858 తను మెరుగు పరచగల ఏదో అంశాన్ని కోచ్ నాలో చూశాడు. 278 00:15:01,026 --> 00:15:04,321 నేను, కోచ్ బెలిచిక్ మాత్రమే ఉండే ఒక క్వార్టర్‌బ్యాక్ స్కూల్ మాది. 279 00:15:04,321 --> 00:15:06,448 ఫుట్‌బాల్ బానిసల్లా అక్కడ కూర్చునేవాళ్లం. 280 00:15:06,448 --> 00:15:09,993 పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, ఫుట్‌బాల్ గురించే మాట్లాడుకునేవాళ్లం. 281 00:15:09,993 --> 00:15:12,329 టామ్‌తో రోజూ పనిచేయడానికి ఇష్టపడేవాడిని. 282 00:15:12,329 --> 00:15:13,956 క్వార్టర్‌బ్యాక్ కళ్లతో గేమ్‌ని చూడటం, 283 00:15:13,956 --> 00:15:15,874 తను చూసినదానిని అర్ధం చేసుకోవడం. 284 00:15:15,874 --> 00:15:18,460 అలాంటి విషయాలే మంచి కోచ్‌ అయ్యేలా నాకు సాయం చేశాయి. 285 00:15:19,169 --> 00:15:22,089 నువ్విక్కడ ఉంటే, ఒక మంచి క్వార్టర్‌బ్యాక్ ఏం చేస్తాడంటే... 286 00:15:22,089 --> 00:15:24,258 కోచ్ బెలిచిక్ ఎంతో నేర్పించాడు. 287 00:15:24,258 --> 00:15:27,135 తను లేకపోతే నేను ఆటగాడిగా కాలేకపోయేవాడిని. 288 00:15:27,678 --> 00:15:30,389 అది ఇవాళ ఎలా ఉందో చూడండి. అది ఎలా ఉందో చూడండి. 289 00:15:32,474 --> 00:15:33,642 బ్రాడీ స్పాంజ్ లాంటివాడు. 290 00:15:33,642 --> 00:15:37,104 సమాచారం అంతా గ్రహించి, దాన్ని గ్రౌండ్‌లో అమలు చేసేవాడు. 291 00:15:37,104 --> 00:15:43,110 బెలిచిక్ విలువ ఇచ్చే అంశం ఏదైనా ఉందంటే, అది మెరుగు పడటం. 292 00:15:43,652 --> 00:15:45,070 ఆల్‌రైట్, బాగుంది. 293 00:15:45,070 --> 00:15:47,906 బ్లెడ్‌సో ఇక్కడే ఇలా ఉండేవాడు, 294 00:15:47,906 --> 00:15:50,325 బ్రాడీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లిపోయేవాడు. 295 00:15:50,951 --> 00:15:53,912 బెలిచిక్ దాన్ని గౌరవించేవాడు. ఇష్టపడేవాడు. 296 00:15:53,912 --> 00:15:55,122 నైస్ బాల్. 297 00:15:56,290 --> 00:16:00,544 ఒకసారి జరిగింది ఇది, బిల్‌తో మాట్లాడాను నేను, 298 00:16:00,544 --> 00:16:03,213 తను చెప్పాడు, "ఈ బ్రాడీ అసాధ్యుడు. 299 00:16:03,213 --> 00:16:06,758 వాడు ఆడే ఆట, వాడి త్రో, ఆటతీరు మార్చుకోవడం, 300 00:16:06,758 --> 00:16:10,470 మనం అసలు చెప్పే అవసరమే లేదు, పరిస్థితి మొత్తం అర్ధం చేసుకుంటాడు. 301 00:16:10,470 --> 00:16:12,139 ఇలాంటివాడిని ఎప్పుడూ చూడలేదు" అని. 302 00:16:13,098 --> 00:16:15,475 టామ్, ఈ సిరీస్‌ బాగా అనిపిస్తోంది. 303 00:16:15,475 --> 00:16:16,935 బాగా అనిపిస్తున్న సిరీస్ ఇది. 304 00:16:17,519 --> 00:16:20,397 అంటే బిల్‌కి, బ్రాడీపై నమ్మకం కుదిరింది. 305 00:16:21,273 --> 00:16:26,236 ఆటగాళ్లు అది అర్ధం చేసుకోగలరు, వాళ్లూ మద్దతుగా నిలిచారు. 306 00:16:27,029 --> 00:16:31,408 ఎందుకంటే మిగతా రెగ్యులర్ సీజన్ అంతా, వాళ్లు మరో గేమ్ ఓడిపోలేదు. 307 00:16:35,871 --> 00:16:38,957 బ్రాడీ, పైకి విసిరాడు, పట్టుకున్నాడు దాన్ని. 308 00:16:38,957 --> 00:16:42,252 కోల్‌మన్, దాన్ని ఎండ్‌జోన్ వైపు తీసుకెళ్తున్నాడు. 309 00:16:42,252 --> 00:16:44,922 అద్భుతమైన క్యాచ్, అద్భుతమైన పరుగు. 310 00:16:44,922 --> 00:16:46,924 జెట్స్ జట్టు షాక్ అయింది. 311 00:16:46,924 --> 00:16:49,426 - అదీ లెక్క! అద్భుతం! - ఇలాగే ముందుకెళ్లాలి. 312 00:16:49,426 --> 00:16:50,886 కీపిటప్ బ్రో! 313 00:16:50,886 --> 00:16:53,764 ఫుట్‌బాల్ అనేది అనుబంధాల వ్యాపారం. 314 00:16:53,764 --> 00:16:57,267 {\an8}టామ్ బ్రాడీ దాన్ని సరిగ్గా అర్ధం చేసుకున్నాడు. 315 00:16:58,143 --> 00:17:02,439 నేను, మిగతా అఫెన్స్ లైన్‌మెన్లు మందు పోటీలు పెట్టుకునేవాళ్లం. 316 00:17:02,439 --> 00:17:04,316 టామ్ మాతో కలిసేవాడు. 317 00:17:04,983 --> 00:17:08,694 నేను "దారుణం, వీడు నాకంటే ఎక్కువ తాగుతున్నాడు" అనేవాడిని. 318 00:17:08,694 --> 00:17:10,030 అది నిజంగా గొప్పసంగతి. 319 00:17:10,489 --> 00:17:11,949 ఇవాళ టామీ కాస్త తాగినట్టున్నాడు. 320 00:17:11,949 --> 00:17:15,327 నా వైపు చూస్తున్నావా? నా వైపు చూస్తున్నావా? 321 00:17:15,327 --> 00:17:17,954 అందరితో కలవాలి. ఎందుకంటే నువ్వు వాళ్లలో వాడివే. 322 00:17:17,954 --> 00:17:21,541 వాళ్లు నీతో మాట్లాడరు అనే పరిస్థితిని నువ్వు కోరుకోకూడదు. 323 00:17:21,541 --> 00:17:24,127 అయితే అందరూ బీర్ తాగడానికి బయటకి వెళ్తున్నప్పుడు, 324 00:17:24,127 --> 00:17:27,214 కచ్చితంగా ఎక్కడో చోట ఎవరో ఒకరు శృతిమించుతారు కదా? 325 00:17:27,214 --> 00:17:31,385 టామ్‌కి తెలుసు, పెద్దవాళ్ల ముందు ఎప్పుడు తలవంచాలో, 326 00:17:31,385 --> 00:17:35,180 దానికి తప్పక జవాబు ఇచ్చేవాడు, మైదానంలో. 327 00:17:35,180 --> 00:17:36,431 హట్! 328 00:17:36,431 --> 00:17:38,183 బ్రాడీ, ప్రత్యర్ధి రక్షణవలయం ఛేదించాడు. 329 00:17:38,767 --> 00:17:40,936 నేరుగా సైడ్‌లైన్ వైపు విసిరాడు. 330 00:17:40,936 --> 00:17:43,230 ప్యాటెన్ బంతితో బౌండరీ దాటాడు. 331 00:17:43,230 --> 00:17:45,524 ఈ అఫెన్సివ్ లైన్‌కి పొగరుంది. 332 00:17:45,524 --> 00:17:48,360 స్మిత్, సందు కోసం చూస్తున్నాడు! 333 00:17:48,360 --> 00:17:50,445 టచ్‌డౌన్, న్యూ ఇంగ్లండ్. 334 00:17:51,029 --> 00:17:53,740 ఫాక్స్‌బరో అరుపులతో దద్దరిల్లుతోంది. 335 00:17:55,284 --> 00:17:57,828 కొత్త ఉత్సాహంతో పేట్రియాట్స్ దూసుకెళ్తున్నారు. 336 00:18:00,455 --> 00:18:02,499 తనకి బలంగా గుద్దుకున్నాడు. 337 00:18:02,499 --> 00:18:05,127 అయితే బ్రాడీ వెంటనే లేచాడు. 338 00:18:05,127 --> 00:18:06,753 సరే, వాళ్ల అంతు చూద్దాం పదండి. 339 00:18:07,880 --> 00:18:09,131 బంతి దొరికింది. 340 00:18:11,258 --> 00:18:14,636 వెళ్లేకొద్దీ, టామ్ ధృఢంగా మారాడు. 341 00:18:14,636 --> 00:18:16,513 శారీరకంగానే కాదు, మానసికంగా కూడా. 342 00:18:17,556 --> 00:18:20,350 {\an8}కానీ ఆ తత్వం ఆడేటప్పుడు వచ్చేది కాదు. 343 00:18:20,350 --> 00:18:21,894 దానికి సాధన కావాలి. 344 00:18:22,311 --> 00:18:24,479 ఒన్ యార్డ్ లైన్‌పై బాల్ పెట్టండి. 345 00:18:24,479 --> 00:18:25,856 ఏంటి కుర్రోడా? 346 00:18:25,856 --> 00:18:28,192 నన్ను పట్టుకోనివ్వద్దు, లేదంటే నీ తిక్క కుదిరిస్తా. 347 00:18:28,192 --> 00:18:30,569 ప్రాక్టీసులో టామ్ మాకు ప్రత్యర్ధిగా ఉంటే, 348 00:18:30,569 --> 00:18:33,197 తన పైకి వెళ్లేవాళ్లం, బూతులు తిట్టేవాళ్లం. 349 00:18:33,197 --> 00:18:36,408 ఎందుకంటే తనకి ఆ ఒత్తిడి తెలియాలి. 350 00:18:38,076 --> 00:18:40,412 - అరె, పట్టుకున్నారు. - చ్ఛ! 351 00:18:40,412 --> 00:18:42,331 భయపడ్డాడు. దొరికిపోయాడు. 352 00:18:42,331 --> 00:18:45,542 {\an8}టామ్‌ని టార్గెట్ చేసేటప్పుడు "ఏంట్రా బాబూ ఇది? మా బామ్మ కూడా 353 00:18:45,542 --> 00:18:47,294 {\an8}వాడి సంగతి చూడగలదు!" అనిపించేది. 354 00:18:47,294 --> 00:18:49,671 {\an8}అంటే తనని ఏడిపించడమే పని. 355 00:18:49,671 --> 00:18:52,299 తనని హింసించేలా దాడి చేసేవాళ్లం. 356 00:18:53,217 --> 00:18:55,928 ఆటగాళ్లకి చిరాకు పుట్టించడంలో, 357 00:18:55,928 --> 00:19:00,557 టై, రేబెల్ లాంటి వాళ్లయితే మరీ దారుణం. 358 00:19:00,557 --> 00:19:05,437 మైక్ రేబెల్ అయితే ఎంతకయినా తెగించేవాడు. 359 00:19:05,437 --> 00:19:06,772 పోరా, బ్రాడీ! 360 00:19:08,023 --> 00:19:09,691 కొన్నిసార్లు తనని చూసి అనిపించేది, 361 00:19:09,691 --> 00:19:13,195 "రేబ్స్ నువ్వు మరీ శృతిమించి పోతున్నావు" అని. 362 00:19:13,779 --> 00:19:16,198 {\an8}నేను అనేవాడిని "టామ్‌ లెక్కచేయడు. నమ్ము" అని. 363 00:19:16,698 --> 00:19:18,534 మూడు ఒకటి మధ్య షాట్‌గన్ పొజిషన్‌లో బ్రాడీ. 364 00:19:18,534 --> 00:19:20,327 బ్రాడీ బాగా మాయ చేశాడు. 365 00:19:20,327 --> 00:19:22,746 ఫాక్ తిరిగి బ్రాడి వైపు విసిరాడు. 366 00:19:22,746 --> 00:19:24,081 తను అందుకున్నాడు. 367 00:19:24,831 --> 00:19:27,584 స్టాండ్స్‌ని చూడండి, ఒక్క ఖాలీ సీటు కూడా లేదు. 368 00:19:27,584 --> 00:19:29,378 అందరూ పేట్రియాట్స్ రంగుల్లో ఉన్నారు... 369 00:19:29,962 --> 00:19:30,963 ఆటని ఎంజాయ్ చేస్తున్నారు. 370 00:19:30,963 --> 00:19:34,424 వెళ్లి బ్రాడీ, విసురు! విసురు! 371 00:19:34,424 --> 00:19:36,760 బ్రాడీ మెరుపులా పాస్ ఇచ్చాడు. 372 00:19:36,760 --> 00:19:40,514 పాస్ పూర్తి చేయడానికి పరిగెత్తుతున్నాడు. టచ్‌డౌన్. 373 00:19:41,640 --> 00:19:45,018 న్యూ ఇంగ్లండ్ పేట్రియాట్స్‌కి ఇది వరుసగా ఐదో గెలుపు. 374 00:19:45,811 --> 00:19:48,480 జట్టులో అందరికంటే కీలక ఆటగాడు, 375 00:19:48,480 --> 00:19:51,316 ఆ సూపర్‌స్టార్‌ కాకుండా, 376 00:19:51,316 --> 00:19:55,320 ప్రతి ఒక్కరూ గెలుపులో వాటాలు పంచుకున్నట్టు అనిపించింది. 377 00:19:55,320 --> 00:19:58,365 {\an8}అంతకంటే ఎక్కువే హక్కుదారులుగా మారారు. 378 00:19:58,365 --> 00:19:59,575 ఇది మా జట్టు. 379 00:20:00,409 --> 00:20:03,787 ఇది టామ్ జట్టు కాదు. బిల్ జట్టు కాదు. 380 00:20:03,787 --> 00:20:05,998 ఇది క్రాఫ్ట్ జట్టు, కానీ క్రాఫ్ట్ జట్టు కూడా కాదు. 381 00:20:05,998 --> 00:20:08,792 ఇది మా జట్టు. మేమంతా కలిసి ఇది సాధిస్తున్నాం. 382 00:20:09,501 --> 00:20:11,211 నాలుగేళ్లలో తొలి డివిజన్ 383 00:20:11,211 --> 00:20:14,047 టైటిల్ వేటలో ఆఖరి అంచుకి చేరిన న్యూ ఇంగ్లండ్ పేట్రియాట్స్. 384 00:20:14,047 --> 00:20:16,466 ఎండ్‌జోన్‌లో బ్రాడీ. టచ్‌డౌన్! 385 00:20:17,384 --> 00:20:20,429 ఇంతకన్నా కావల్సింది ఏముంది, రెగ్యులర్ సీజన్ ముగింపుకి చేరింది. 386 00:20:20,971 --> 00:20:23,682 ఎఎఫ్‌సికి మా అభినందనలు 387 00:20:23,682 --> 00:20:26,727 ఈస్టర్న్ డివిజన్ విజేతగా న్యూ ఇంగ్లండ్‌ పేట్రియాట్స్. 388 00:20:28,270 --> 00:20:30,522 ఇప్పుడీ న్యూ ఇంగ్లండ్ పేట్రియాట్స్ 389 00:20:30,522 --> 00:20:32,482 ప్లే ఆఫ్స్‌లో అడుగు పెడుతున్నారు. 390 00:20:41,033 --> 00:20:44,244 మిస్టర్ క్రాఫ్ట్, ఫ్లే ఆఫ్స్. దూసుకెళ్లండి! 391 00:20:48,916 --> 00:20:50,417 హాయ్, ప్యాట్. 392 00:20:51,043 --> 00:20:55,255 {\an8}థ్యాంక్యూ, మేమంతా సంతోషంలో మునిగి ఉన్నాం. 393 00:20:55,255 --> 00:21:00,093 {\an8}అవును గొప్ప విషయమే, హెరాల్డ్ పత్రికలు మరిన్ని అమ్ముడవుతాయిలే. 394 00:21:02,554 --> 00:21:04,473 లేదు, సంతోషం, నువ్వు చేసింది... 395 00:21:04,473 --> 00:21:07,976 ఆ సీజన్‌లో మేము ఆఖరి గేమ్ గెలిచాక, 396 00:21:07,976 --> 00:21:10,103 మేమ ప్లేఆఫ్స్‌కి చేరాం. 397 00:21:10,562 --> 00:21:12,898 - బాబీ, అభినందనలు. - థ్యాంక్స్. 398 00:21:12,898 --> 00:21:14,399 సాధించావు! 399 00:21:14,399 --> 00:21:16,360 ఈ జట్టుని కొన్నప్పుడు, ఎప్పుడూ కలగనలేదు 400 00:21:16,360 --> 00:21:18,612 ఇంత త్వరగా ఇది సాధిస్తావని, కదా? 401 00:21:18,612 --> 00:21:25,285 ఈ జట్టుని కొనకముందు, 34 ఏళ్లుగా దీనికి అభిమానిని. 402 00:21:25,285 --> 00:21:30,749 ఆ 34 ఏళ్లలో, ఈ జట్టు ఆడింది ఒకే ప్లే ఆఫ్ గేమ్. 403 00:21:30,749 --> 00:21:33,210 ఒకసారి ఆలోచించండి. ఒకే ప్లే ఆఫ్ గేమ్. 404 00:21:35,963 --> 00:21:40,509 మొత్తం న్యూ ఇంగ్లండ్ ప్రాంతానికి ఇది సంబరం. 405 00:21:40,509 --> 00:21:44,179 ఆఫ్ సీజన్‌లో ఫాక్స్‌బరో స్టేడియం కూల్చబోతున్నారు. 406 00:21:44,179 --> 00:21:47,850 సూపర్‌బౌల్‌ దక్కించుకోవడానికి రెండు గేమ్స్ దూరంలో ఉన్నారు పేట్రియాట్స్, 407 00:21:47,850 --> 00:21:51,895 ఆఖరుసారి ఓ మ్యాచ్‌కి ఆతిధ్యం ఇవ్వబోతోంది ఈ మైదానం. 408 00:21:52,980 --> 00:21:57,276 ఓల్డ్ ఫాక్స్‌బరో స్టేడియం యొక్క 30 ఏళ్ల చరిత్రలో 409 00:21:57,276 --> 00:21:59,778 అందరికీ గుర్తుండబోయే గేమ్ అది. 410 00:21:59,778 --> 00:22:02,155 అక్కడ ఆడే ఆఖరి గేమ్ అదే. 411 00:22:15,419 --> 00:22:18,046 గేమ్ డే, దీనికి సాటి ఇంకోటి లేదు. 412 00:22:20,132 --> 00:22:21,800 ముఖ్యమైన గేమ్ ఉన్నప్పుడు, 413 00:22:21,800 --> 00:22:24,595 గుండె గొంతులోకి వచ్చినట్టు ఉంటుంది. 414 00:22:25,929 --> 00:22:29,308 కానీ జట్టు పూర్తి చేయాల్సిన వాటి పైనే దృష్టి పెట్టాలి మనం. 415 00:22:33,645 --> 00:22:36,732 మిత్రులారా, వినండి, ఇదొక అద్భుతమైన రన్. 416 00:22:36,732 --> 00:22:38,275 దాదాపుగా అనితర సాధ్యమైన కథ. 417 00:22:38,275 --> 00:22:40,652 అయితే ఇవాళ రాత్రి, మనం ఇంటికి వెళ్తామో లేదో 418 00:22:40,652 --> 00:22:42,863 అని భయం వేస్తోంది. 419 00:22:42,863 --> 00:22:45,157 నిజం చెప్పాలంటే, రైడర్స్ దూకుడుగా కనిపిస్తున్నారు. 420 00:22:45,157 --> 00:22:46,825 దానితో పోటీ పడలేము. 421 00:22:46,825 --> 00:22:49,244 బ్రాడీ, బెలిచిక్‌తో మనం వాళ్లతో సరితూగలేం. 422 00:22:49,244 --> 00:22:51,663 ఫాక్స్‌బరో స్టేడియంలో ఆఖరి మ్యాచ్ ఓడిపోబోతున్నాం. 423 00:22:51,663 --> 00:22:54,208 దారుణంగా ఓడిపోతామేమో అని బయపడుతున్నా. 424 00:22:54,208 --> 00:22:57,169 {\an8}రేడియోలో కాలర్ల కామెంట్లు రెండు నిమిషాలు వినేసరికి, 425 00:22:57,169 --> 00:23:00,881 {\an8}"అందుకేరా ఇలాంటివి వినొద్దు" అని నన్ను నేను తిట్టుకున్నా. 426 00:23:00,881 --> 00:23:03,467 {\an8}ఇంకో మూడు వారాల పాటు దాన్ని ఆఫ్ చేశా. 427 00:23:04,426 --> 00:23:07,304 నిజానికి వాళ్ల మాటల్లో తప్పు లేదు. 428 00:23:07,304 --> 00:23:09,723 మేము దుష్ట సామ్రాజ్యంగా మారే ముందు ఇదీ పరిస్థితి. 429 00:23:09,723 --> 00:23:11,975 అంటే, అండర్‌డాగ్స్‌గానే మా ప్రయాణం సాగింది. 430 00:23:14,186 --> 00:23:16,772 కారులో గేమ్‌కి వెళ్లడం గుర్తుంది, 431 00:23:16,772 --> 00:23:19,983 నేను వెళ్లేకొద్దీ మంచు కురవడం మొదలైంది, 432 00:23:19,983 --> 00:23:22,569 నాకది చాలా ఆహ్లాదంగా అనిపించింది. 433 00:23:28,450 --> 00:23:30,327 మంచులో ఆడుకోవడం మాకు ఇష్టం. 434 00:23:31,787 --> 00:23:36,375 పరిశీలనగా చూస్తే, ఆ చలికాలం మొత్తంలో ఆ ఒక్కరోజే మంచు కురిసింది, 435 00:23:36,375 --> 00:23:39,545 అది మాకు అవసరమైన, ఆ సాయంత్రమే. 436 00:23:39,545 --> 00:23:43,590 వాతావరణం చెప్పేవాడు స్వయంగా మంచునే మైదానంలోకి పంపినట్టున్నాడు. 437 00:23:45,968 --> 00:23:48,178 మాకు ఆ రాత్రి నిజంగా మాయే. 438 00:23:49,596 --> 00:23:51,139 విధి అలా రాసినట్టు అనిపించింది. 439 00:23:53,225 --> 00:23:55,561 గేమ్ ముందు కార్యక్రమానికి వెళ్లాను, 440 00:23:55,561 --> 00:23:58,939 "ఇవాళ మనం ప్రపంచానికి షాక్ ఇస్తున్నాం" అనుకున్నా. 441 00:23:58,939 --> 00:24:02,943 పేట్రియాట్స్ వర్సెస్ ఓక్‌లాండ్ రైడర్స్ డివిజనల్ ప్లేఆఫ్ జనవరి 19, 2002 442 00:24:14,705 --> 00:24:16,123 అందరికీ గుడ్ ఈవెనింగ్, స్వాగతం 443 00:24:16,123 --> 00:24:18,876 వింటర్ వండర్‌ల్యాండ్ ఫాక్స్‌బరో స్టేడియానికి. 444 00:24:18,876 --> 00:24:22,754 ఎఎఫ్‌సి సెమీఫైనల్స్‌లో ఇవాళ ఓక్‌లాండ్ రైడర్స్‌తో పేట్రియాట్స్ తలపడుతోంది, 445 00:24:22,754 --> 00:24:24,965 ఫాక్స్‌బరోలో మంచు కూడా పడుతోంది, 446 00:24:24,965 --> 00:24:28,010 ఈ సాయంత్రం అంతా ఇలాగే పడుతోంది. 447 00:24:28,719 --> 00:24:32,181 మంచు ఆగకుండా పడుతోంది. 448 00:24:32,181 --> 00:24:38,270 రూల్స్ ప్రకారం దాన్ని తొలగించాలని ప్రయత్నించాం, కానీ కొంచెమే తొలగించాం. 449 00:24:38,270 --> 00:24:41,231 ఇది నేను చెప్పకూడదు, కానీ ఇదే నిజం. 450 00:24:42,900 --> 00:24:45,110 వినండి! ఇక్కడ చాంపియన్‌షిప్ రింగ్ ఎవరి దగ్గరుంది? 451 00:24:45,110 --> 00:24:46,028 - ఎవరి దగ్గరా లేదు. - పదండి మరి. 452 00:24:46,028 --> 00:24:47,905 మీరు దేనికోసం పోరాడుతున్నారో మర్చిపోవద్దు! 453 00:24:47,905 --> 00:24:50,741 సరేనా? మూడు అనగానే వెళదాం. ఒన్, టూ, త్రీ, పదండి! 454 00:24:53,118 --> 00:24:54,328 మనం ఇది గెలవబోతున్నాం. 455 00:24:54,328 --> 00:24:56,121 - ఒట్టు? - ఒట్టేస్తున్నా. 456 00:24:57,497 --> 00:25:00,584 బిల్, ఈ పరిస్థితులు, ఎంత అనుకూలం అవుతాయి? 457 00:25:00,584 --> 00:25:02,544 ఈ గ్రౌండ్, మనకి పెద్ద సమస్య ఏమీ కాకపోవచ్చు. 458 00:25:02,544 --> 00:25:04,505 గేమ్‌కి ముందున్నంత దారుణంగా లేదు. 459 00:25:04,505 --> 00:25:06,590 ఇవాళ రాత్రికి సిద్ధంగా ఉన్నాం అనిపిస్తోంది. 460 00:25:08,967 --> 00:25:12,513 చూస్తుంటే ఈ మంచు బెలిచిక్ ప్లాన్‌లా ఉంది. 461 00:25:12,513 --> 00:25:13,639 {\an8}అందుకు కారణం ఉంది. 462 00:25:13,639 --> 00:25:16,808 {\an8}నిన్న వాతావరణం బాగుంది, ఇవాళే ఇలా అయింది. 463 00:25:16,808 --> 00:25:18,727 మంచుతుఫాన్ వచ్చేలా ఉంది. 464 00:25:20,270 --> 00:25:22,022 ఇది మనకి సరిగ్గా సరిపోతుంది. 465 00:25:22,940 --> 00:25:24,691 మనం ఆడేది రైడర్స్‌తో. 466 00:25:25,442 --> 00:25:27,653 వస్తున్నది పశ్చిమ కోస్తా తీరానికి చెందిన జట్టు. 467 00:25:27,653 --> 00:25:31,031 బురదగా ఉంది. మసగ్గా ఉంది. 468 00:25:31,031 --> 00:25:33,367 వాళ్లకి ఇది అలవాటు లేదు. 469 00:25:33,367 --> 00:25:36,328 మరీ చల్లగా లేదు. అంత చల్లగా లేదు. ఇదేమీ చల్లగా లేదు. 470 00:25:37,621 --> 00:25:40,415 అనుకూలతల్ని వెదకడానికి ఎప్పుడూ ప్రయ్నతించాలి. 471 00:25:41,375 --> 00:25:43,210 ముఖ్యంగా ఆ గేమ్‌కి. 472 00:25:43,752 --> 00:25:45,963 ఎందుకంటే వాళ్లు బాగా ఆడతారని మాకు తెలుసు. 473 00:25:45,963 --> 00:25:47,965 వాళ్లది మంచి ఫుట్‌బాల్ జట్టు. 474 00:25:47,965 --> 00:25:50,425 వాళ్లు అన్నీ కోరుకుంటున్నారు. మంచుని కోరుకున్నారు. 475 00:25:50,425 --> 00:25:52,427 చల్లగా ఉండాలని కోరుకున్నారు. 476 00:25:52,427 --> 00:25:55,597 వాళ్లు ఒక్కదాన్ని కోరుకోవడం లేదు. రైడర్స్‌తో ఆడాలని కోరుకోవడం లేదు. 477 00:25:55,597 --> 00:25:56,932 రైడర్స్ మూడు లెక్కపెట్టాలి. 478 00:25:56,932 --> 00:25:59,309 ఒన్, టూ, త్రీ, రైడర్స్! 479 00:26:02,312 --> 00:26:04,439 ఫాక్స్‌బరోలో పోటీ తీవ్రమైంది. 480 00:26:07,234 --> 00:26:09,111 గ్యానన్ ఎండ్‌ జోన్‌ వైపు విసిరాడు, దాన్ని అందుకున్నారు. 481 00:26:09,111 --> 00:26:10,779 టచ్‌డౌన్! 482 00:26:13,323 --> 00:26:16,451 ఇవాళ మీ వల్లకాదు. 483 00:26:18,287 --> 00:26:20,789 గ్రౌండ్‌లోకి టామ్ బ్రాడీ వచ్చాడు. 484 00:26:20,789 --> 00:26:22,833 పేట్రియాట్స్ ఎలా తిరగబడతారో చూద్దాం. 485 00:26:22,833 --> 00:26:23,959 హట్! 486 00:26:25,836 --> 00:26:28,755 బ్రాడీ, బంతిని లాగిపెట్టి విసిరాడు, కానీ అడ్డుకున్నారు. 487 00:26:31,717 --> 00:26:34,553 క్వార్టర్‌బ్యాక్‌గా టామ్ బ్రాడీ సహనం కోల్పోయాడు. 488 00:26:34,553 --> 00:26:36,555 దాన్ని ఓక్‌లాండ్ రైడర్స్ అవకాశంగా మలచుకున్నారు, 489 00:26:36,555 --> 00:26:39,057 బంతి మరోసారి వాళ్ల చేతుల్లోకి వెళ్లింది. 490 00:26:40,809 --> 00:26:46,148 ఆ గేమ్‌లో చెత్తగా ఆడాం దాంతో గెలుపు దాదాపు అసాధ్యంగా మారింది. 491 00:26:47,357 --> 00:26:48,692 నేను వేసిన బంతి దొరికిపోయింది. 492 00:26:48,692 --> 00:26:49,693 హట్! 493 00:26:50,110 --> 00:26:51,653 మేము చెత్తగా ఆడలేదు. 494 00:26:51,653 --> 00:26:53,614 అసలు బంతినే కదిలించలేకపోయాం. 495 00:26:54,531 --> 00:26:56,533 అంతా అయోమయం అయింది. 496 00:26:57,117 --> 00:26:59,745 బ్రాడీకి బాగా సమయం దొరికింది. 497 00:27:01,246 --> 00:27:03,749 విసిరాడు, అక్కడ ఎవరూ లేకుండానే విసిరాడు. 498 00:27:05,876 --> 00:27:08,337 బంతి విసరడానికి బాగా సమయం దొరికింది. 499 00:27:09,588 --> 00:27:11,882 టామ్ బ్రాడీ మౌనంగా అయిపోయాడు. 500 00:27:12,841 --> 00:27:14,468 పదండి! 501 00:27:15,344 --> 00:27:19,723 నిద్ర లేవండి, లేస్తారా? ఆట ఆడండి! 502 00:27:20,474 --> 00:27:22,267 స్కోర్‌బోర్డు చూశా. 503 00:27:22,267 --> 00:27:27,397 ఒక పెద్ద జట్టుతో నాలుగో క్వార్టర్‌కి పది పాయింట్లు వెనకబడ్డాం. 504 00:27:27,397 --> 00:27:30,442 మాకు అనిపించింది, మేము ఆడిన ఆటతో, 505 00:27:30,442 --> 00:27:32,945 ఇది గెలవడం అసాధ్యం అని. 506 00:27:32,945 --> 00:27:35,781 కానీ కోచ్ వచ్చి చెప్పాడు, 507 00:27:35,781 --> 00:27:38,909 "ఇప్పటికీ మనకి అవకాశం ఉంది" అని. 508 00:27:38,909 --> 00:27:40,577 బంతిని ఎండ్‌జోన్‌లో వేయడమే మనం చేయాల్సింది. 509 00:27:40,577 --> 00:27:42,788 మనలోన ఆటనంతా వాడి, ఆ పని చేయగలగాలి. 510 00:27:42,788 --> 00:27:43,872 ఓకే. నేను చెప్పేది... 511 00:27:43,872 --> 00:27:45,541 అంటే, గుంపుకట్టడం తగ్గించాలి. 512 00:27:45,541 --> 00:27:47,584 కేవలం మనలోని వేగాన్ని చూపించాలి. 513 00:27:49,169 --> 00:27:50,963 గ్రౌండ్‌లోకి వెళ్లాం. 514 00:27:50,963 --> 00:27:53,131 సహచరుల్ని చూస్తూ చెప్పాను, 515 00:27:53,131 --> 00:27:55,259 "నాకోసం మీ జీవితపు అత్యుత్తమ ఆట ఆడండి" అని. 516 00:27:57,511 --> 00:27:58,679 హట్! 517 00:27:59,137 --> 00:28:00,764 మూడు, ఐదు. 518 00:28:01,557 --> 00:28:04,184 మెరుపు పాస్. విగ్గిన్స్. ఫస్ట్ డౌన్. 519 00:28:05,227 --> 00:28:07,813 బ్రాడీ. మళ్లీ మెరుపులాంటి పాస్. 520 00:28:07,813 --> 00:28:09,982 ట్రాయ్ బ్రౌన్ వరకు చేరిందది. 521 00:28:11,024 --> 00:28:13,151 సరికొత్త న్యూ ఇంగ్లండ్ అపెన్స్‌ని చూస్తున్నాం. 522 00:28:13,151 --> 00:28:16,446 కాస్త తొందరతో కూడిన ఉత్సాహం కనిపిస్తోంది. 523 00:28:16,446 --> 00:28:17,948 లయ దొరికించుకున్న విధానం చెప్పండి. 524 00:28:17,948 --> 00:28:18,907 హట్! 525 00:28:19,741 --> 00:28:20,742 బ్రాడీ. 526 00:28:22,828 --> 00:28:25,539 దాన్ని పట్టుకున్నాడా? పట్టుకున్నాడు. 527 00:28:26,248 --> 00:28:29,835 డేవిడ్ ప్యాటన్ నుంచి జెర్మయిన్ విగ్గిన్స్ అందుకున్నాడు. 528 00:28:30,335 --> 00:28:31,920 పేట్రియాట్ ఫ్యాన్స్ ఉత్కంఠ పెరిగింది. 529 00:28:31,920 --> 00:28:34,256 సెకండ్ డౌన్ నుంచి గోల్ చేస్తారని వాళ్లు అంచనా వేశారు. 530 00:28:34,256 --> 00:28:35,299 హట్! 531 00:28:37,134 --> 00:28:39,219 ముందుకెళ్లాడు. అమలు చేయబోతున్నాడు. 532 00:28:39,219 --> 00:28:41,180 ఐదు గజాల లోపు, టచ్‌డౌన్. 533 00:28:44,683 --> 00:28:50,272 పేట్రియాట్స్ సీజన్ సజీవంగా ఉంచడం బ్రాడీ వల్లే సాధ్యమని ఆశలు పెట్టుకున్నారు. 534 00:28:50,856 --> 00:28:54,276 ఇదొక గొప్ప కమ్‌బ్యాక్. కీపిటప్ బేబీ. 535 00:28:55,027 --> 00:28:57,404 నాలో ఉత్సాహం పెరిగింది. సహచరులపై అరుస్తున్నా. 536 00:28:58,238 --> 00:28:59,698 ఇంతలో అవకాశం దొరికింది. 537 00:29:00,115 --> 00:29:00,991 హట్! 538 00:29:02,910 --> 00:29:05,579 బ్రాడీ క్రమంగా, సమయం లేదని తెలుసుకున్నాడు. 539 00:29:05,579 --> 00:29:07,122 పరిగెత్తుతున్నాడు. 540 00:29:07,122 --> 00:29:10,459 ఫస్ట్ డౌన్ కోసం పరిగెత్తుతున్నాడు, అసాధ్యాన్ని సాధించాడు. 541 00:29:10,459 --> 00:29:11,960 యా, అలాగే ఆడు. 542 00:29:12,669 --> 00:29:15,380 టామ్ బ్రాడీ ఏం చేయాలి అనే ప్రశ్నే అక్కర్లేదు ఇక్కడ, 543 00:29:15,380 --> 00:29:17,424 కానీ ఆఖరి డ్రైవ్‌లో, తను చేసింది చూస్తే 544 00:29:17,424 --> 00:29:19,343 అవసరమైతే జట్టునంతా నడపగలడు అనిపించింది. 545 00:29:19,343 --> 00:29:21,386 తనకి వేసిన కొన్ని సంకెళ్లని 546 00:29:21,386 --> 00:29:24,097 తీసేశారు అనుకుంటా, దాంతో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. 547 00:29:25,140 --> 00:29:26,934 బ్రాడీ, షాట్‌గన్ పొజిషన్ నుంచి. 548 00:29:28,393 --> 00:29:29,895 బంతి చేజారింది. 549 00:29:29,895 --> 00:29:31,772 రైడర్స్ చుట్టుముట్టారు. 550 00:29:36,235 --> 00:29:38,320 దాంతో న్యూ ఇంగ్లండ్‌ల ఓక్‌లాండ్ విజయం 551 00:29:38,320 --> 00:29:41,198 దాదాపు ఖరారు అయిపోయింది. 552 00:29:43,617 --> 00:29:47,412 రైడర్స్ 13 పేట్రియాట్స్ 10 553 00:29:52,626 --> 00:29:54,336 చాలా కోపం వచ్చింది. 554 00:29:54,336 --> 00:29:57,214 గ్రౌండ్‌లోంచి బైటకెళ్లి, "చ్ఛ, సీజన్ అయిపోయింది" అనుకున్నా. 555 00:29:58,549 --> 00:30:00,384 అంటే, నేను నమ్మలేకపోయా, 556 00:30:00,384 --> 00:30:02,970 నేను బంతిపై పట్టు కోల్పోవడం వల్లే గేమ్ ఓడిపోయామని. 557 00:30:04,346 --> 00:30:05,931 మాకు మిగిలున్న సమయంతో, 558 00:30:05,931 --> 00:30:08,725 తిరిగి పుంజుకుని గేమ్‌ గెలవడం సాధ్యం కాని పని. 559 00:30:10,352 --> 00:30:13,230 ఆ క్షణం, చాలా బాధ అనిపించింది. 560 00:30:13,814 --> 00:30:16,441 ఈ సీజన్ మాకెంతో ప్రత్యేకంగా నిలిచింది, 561 00:30:16,441 --> 00:30:19,570 ఒక్కసారిగా అంతా ముగిసిపోయింది. 562 00:30:21,154 --> 00:30:25,242 ఈ ఫుట్‌బాల్ ఆట అంతా, నియంత్రణకి సంబంధించింది. 563 00:30:25,242 --> 00:30:27,327 మన విధిని మనం నియంత్రించాలి. 564 00:30:28,245 --> 00:30:30,497 {\an8}అప్పుడే, ఒక్కోసారి... 565 00:30:32,833 --> 00:30:36,712 {\an8}...దేవుడు మనకి చెప్తాడు, మనం నియంత్రణలో లేము అని. 566 00:30:37,921 --> 00:30:41,008 వాళ్లు రెండు నిమిషాల పాటు రివ్యూకి వెళ్తున్నారు, 567 00:30:41,008 --> 00:30:44,052 ఇది తడబాటా లేక అసంపూర్ణ పాసా అనేది తేల్చడానికి. 568 00:30:45,137 --> 00:30:47,723 చూస్తుంటే, టామ్ బ్రాడీ మనసు మార్చుకుని 569 00:30:47,723 --> 00:30:49,850 బంతి విసరకూడదు అనుకున్నట్టు ఉన్నాడు. 570 00:30:49,850 --> 00:30:53,520 బంతిని కిందకి అన్నాడు. దాన్ని నియంత్రించుకున్నాడు. 571 00:30:53,520 --> 00:30:55,189 ఇంతలో చార్లెస్ ఉడ్సన్ ఢీకొట్టాడు. 572 00:30:55,939 --> 00:30:59,026 అనుమానం లేదు గ్రెగ్, అది తడబాటే. 573 00:31:04,489 --> 00:31:07,075 మేము ఓడిపోయాం అనే అనుకున్నాం. 574 00:31:09,578 --> 00:31:15,167 మా అబ్బాయి జోష్, స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్ ఎంజాయ్ చేశాడు. 575 00:31:15,167 --> 00:31:17,044 తను వెళ్లిపోవడం చూశా. 576 00:31:17,044 --> 00:31:18,587 బెలిచిక్స్ బాయ్స్ సూపర్‌బౌల్! 577 00:31:18,587 --> 00:31:23,175 తను పార్కింగ్‌ దగ్గర ఉన్నాడు, కారు తీసుకుని వెళ్లిపోవాలని. 578 00:31:24,301 --> 00:31:26,553 అప్పుడే పెద్దగా గోల మొదలైంది. 579 00:31:26,553 --> 00:31:29,014 వాడు నాకు ఫోన్ చేసి అడిగాడు, "ఏం జరుగుతోంది?" అని 580 00:31:29,014 --> 00:31:30,432 "వెనక్కి రా" అన్నా. 581 00:31:31,225 --> 00:31:32,893 ఆటని పరిశీలించాక, 582 00:31:32,893 --> 00:31:35,354 క్వార్టర్‌బ్యాక్ చేయి ముందుకెళ్తోంది, 583 00:31:35,354 --> 00:31:37,648 కాబట్టి ఇది అసంపూర్ణ పాస్. 584 00:31:38,732 --> 00:31:39,775 వావ్. 585 00:31:40,400 --> 00:31:42,319 గేమ్ టైమ్ బేబీ. ఇది గేమ్ టైమ్! 586 00:31:43,862 --> 00:31:47,574 ఇదంతా రిఫరీ వాల్ట్ కోల్‌మన్ సొంత వివరణే. 587 00:31:47,574 --> 00:31:49,326 తిరిగి ఆటని వీక్షిద్దాం. 588 00:31:51,453 --> 00:31:54,206 అంటే, నేను తడబడ్డాననే అనుకున్నా. 589 00:31:54,206 --> 00:31:57,209 అందరికీ అది తడబాటులాగే అనిపించింది, 590 00:31:57,209 --> 00:31:59,545 కానీ రూల్ అలా రాసి లేదు. 591 00:31:59,545 --> 00:32:02,005 ఆ రూల్ మేము రాసింది కాదు! 592 00:32:03,257 --> 00:32:04,508 మాకు ఇప్పుడే చెప్పారు, గ్రెగ్, 593 00:32:04,508 --> 00:32:07,970 క్వార్టర్‌బ్యాక్ బంతిని కిందకి లాక్కున్నా, దగ్గరికి తీసుకున్నా, 594 00:32:07,970 --> 00:32:11,849 అప్పుడు తనకి బంతి విసిరే ఉద్దేశ్యం ఉన్నా లేకున్నా, 595 00:32:11,849 --> 00:32:14,226 అది అసంపూర్ణ పాసే అవుతుంది. 596 00:32:14,226 --> 00:32:17,771 దేవుడు ఆ "టక్‌ రూల్‌"ని, వాల్ట్ కోల్‌మన్‌ని ఆశీర్వదించాలి. 597 00:32:17,771 --> 00:32:21,525 మాకు మాత్రం దేవుడే మా వైపు ఉన్నాడు అనిపించింది. 598 00:32:22,401 --> 00:32:24,611 ఈ గేమ్‌లో నిజం... 599 00:32:25,863 --> 00:32:30,158 ...అదృష్టమా, కలసిరావడమా, విధా అనేది నాకు తెలియదు. 600 00:32:30,158 --> 00:32:33,120 ఏదో... ఏదో మాకు అండగా నిలిచింది. 601 00:32:34,997 --> 00:32:37,082 పేట్రియాట్స్‌కి కొత్త ఆశ. 602 00:32:37,082 --> 00:32:40,294 ఉన్న గేమ్‌ టైమ్‌లో వాళ్ల ఒకే అవకాశం ఫీల్డ్ గోల్. 603 00:32:40,878 --> 00:32:42,337 కమాన్, యాడమ్. 604 00:32:42,337 --> 00:32:46,175 యాడమ్ వినటెరీ, 54 మ్యాచ్‌ల కింద కిక్ కొట్టాడు. 605 00:32:46,175 --> 00:32:49,011 కానీ అది మంచుతుఫానులో కాదు. 606 00:32:50,220 --> 00:32:53,599 {\an8}ఆ సమయంలో, ఒకటి అర్ధమైంది, 607 00:32:53,599 --> 00:32:57,311 {\an8}"ఈ మంచుతుఫానులో ఈ కిక్ నీకు దక్కిన అదృష్టం మిత్రమా" అని. 608 00:32:58,020 --> 00:33:01,148 గ్రౌండ్‌లోకి వచ్చాడు యాడమ్ వినటెరీ. 609 00:33:01,148 --> 00:33:04,151 ఇది 45 గజాల దూరం కొట్టాల్సిన ప్రయత్నం. 610 00:33:04,151 --> 00:33:05,819 కమాన్. 611 00:33:05,819 --> 00:33:09,364 ఆరంగుళాలు పేరుకున్న మంచుపై 45 గజాలు అంటే, 612 00:33:09,364 --> 00:33:13,076 ఆ మంచుతుఫానులో చాలా చాలా తక్కువ అవకాశం ఉన్న కిక్. 613 00:33:13,785 --> 00:33:15,704 గ్రౌండ్‌ శుభ్రం చేసే సమయం కూడా మాకు లేదు. 614 00:33:15,704 --> 00:33:18,749 నా కాలితో కాస్త ఈడ్చినట్టు చేశా... 615 00:33:18,749 --> 00:33:21,126 "ఏం లాభం లేదు" అనిపించింది. 616 00:33:22,669 --> 00:33:24,588 నాతో నేనే చర్చించుకుంటూ అనుకున్నా, 617 00:33:24,588 --> 00:33:28,217 "యాడమ్, ఇది నీ జీవితంలోనే అత్యంత కష్టమైన కిక్. 618 00:33:29,176 --> 00:33:31,303 ఇంత తీవ్రమైన ఉత్కంఠలో, 619 00:33:31,887 --> 00:33:35,557 నువ్వు లక్ష్యంపై దృష్టి పెట్టాలి అంతా పక్కాగా చేయాలి. 620 00:33:36,683 --> 00:33:38,310 మిస్ చేశావా, నీ పని గోవిందా" అని. 621 00:33:50,572 --> 00:33:52,282 తను బంతిని కిక్ చేశాడు, 622 00:33:52,282 --> 00:33:54,993 కానీ అంతా మసగ్గా ఉంది, మంచు పడుతోంది, చూసే వీల్లేదు. 623 00:33:55,827 --> 00:33:58,956 "ఏమైంది?" అన్న ప్రధాన కోచ్ ఫేమస్ మాటలు నాకు గుర్తున్నాయి. 624 00:33:58,956 --> 00:34:01,375 దానికి నేను "ఫీల్డ్ గోల్ కొట్టాడు" అని చెప్పా 625 00:34:01,834 --> 00:34:04,044 అద్భుతం! 626 00:34:11,677 --> 00:34:13,887 బంతిని సరిగ్గా పట్టుకున్నాం... 627 00:34:13,887 --> 00:34:16,098 వాళ్లని ఆపడానికి వెళ్లాం, అప్పుడే బంతిని దొరికించుకున్నాం 628 00:34:16,098 --> 00:34:17,766 గెలవడానికి ఫీల్డ్‌ గోల్ కొట్టాడు. 629 00:34:17,766 --> 00:34:21,770 ఏఎఫ్‌సీ చాంపియన్‌షిప్‌లో మరో ముందడుగు ఇది. 630 00:34:38,954 --> 00:34:40,581 హేయ్, నాకు మాటలు రావడం లేదు. 631 00:34:40,581 --> 00:34:42,875 వీళ్లు చాంపియన్లలా ఆడారు. చాలా కష్టపడ్డారు. 632 00:34:42,875 --> 00:34:44,251 నాకు ఆడే అవకాశం ఇచ్చారు... 633 00:34:44,251 --> 00:34:47,629 {\an8}యాడమ్ వినటెరీ అద్భుతం! 634 00:34:47,629 --> 00:34:49,380 {\an8}టై లా కార్నర్‌ బ్యాక్ 635 00:34:49,380 --> 00:34:50,882 {\an8}అమ్మబాబోయ్... హేయ్. 636 00:34:50,882 --> 00:34:54,887 తన కాలికి కంచు తొడుగు తొడగాలి నిజంగా, కదా? 637 00:34:54,887 --> 00:34:59,641 రోల్స్ రాయిస్ కారు మీద యాడమ్ వినటెరీ పాదం ఉంచాలి. 638 00:35:01,435 --> 00:35:03,312 "అబ్బ, ఇది గుర్తుండిపోతుంది" 639 00:35:03,312 --> 00:35:06,148 అనుకునే లాంటి గేమ్ అది. 640 00:35:23,874 --> 00:35:25,501 అది ఫుట్‌బాల్ మ్యాచా లేక ఏంటి? 641 00:35:25,501 --> 00:35:26,877 ఏం జరిగింది ఇప్పుడసలు? 642 00:35:26,877 --> 00:35:29,129 ఏం జరిగింది అసలు! 643 00:35:30,672 --> 00:35:33,008 - చెప్పానుగా 14 గెలిపిస్తాడని. - అవును, అన్నట్టే అయింది. 644 00:35:36,762 --> 00:35:37,888 చాలా గొప్పగా ఆడారు. 645 00:35:37,888 --> 00:35:39,264 ప్రత్యర్ధులు కష్టపెట్టారు. 646 00:35:39,264 --> 00:35:42,601 థర్డ్ డౌన్ అఫెన్స్‌ని ఆపింది, స్పెషల్ టీమ్ పంట్ పూర్తి చేశాడు. 647 00:35:42,601 --> 00:35:44,978 నాలుగో క్వార్టర్‌లో మీరు చేయాల్సింది అంతా చేశారు. 648 00:35:44,978 --> 00:35:47,356 చివరిదాకా తెచ్చారు, కానీ గెలిచారు. 649 00:35:48,106 --> 00:35:49,274 సరే, చూడండి, 650 00:35:49,274 --> 00:35:50,776 ఈ ఏడాది మనం సాధించిన అంతటికీ, 651 00:35:50,776 --> 00:35:52,319 చాలా వాటికి కృతజ్ఞతలు చెప్పాలి, 652 00:35:52,319 --> 00:35:54,446 కానీ అదంతా మళ్లీ మొదలవుతుంది. 653 00:35:54,446 --> 00:35:57,032 ఈ ప్లేఆఫ్ గేమ్ మీకు అంకితం. 654 00:35:58,408 --> 00:35:59,910 మిస్టర్ క్రాఫ్ట్! 655 00:36:01,620 --> 00:36:05,040 మంగళవారం ఒంటిగంటకి. 656 00:36:05,040 --> 00:36:07,167 - సరే, సర్. - మంగళవారం ఒంటిగంటకి. 657 00:36:09,586 --> 00:36:11,630 ఇది మన సంవత్సరం! ఇది మన సంవత్సరం! 658 00:36:12,923 --> 00:36:15,384 హేయ్, మూడు అనగానే "చాంప్స్" అనాలి. ఒన్, టూ, త్రీ. 659 00:36:15,384 --> 00:36:16,885 చాంప్స్! 660 00:36:16,885 --> 00:36:19,471 ఇదే విధి. విధి, బేబీ. 661 00:36:21,098 --> 00:36:23,851 {\an8}మా అందరిలో ఒకే ఆలోచన, "బాబోయ్... 662 00:36:23,851 --> 00:36:29,022 {\an8}విధిరాత అంటే ఇవాళ జరిగిందే కాబోలు" అని. 663 00:36:33,986 --> 00:36:36,864 ఇలాంటి రోజు వస్తుందని అనుకున్నా. 664 00:36:36,864 --> 00:36:38,532 కానీ ఇవాళే అది నిజమైంది. 665 00:36:39,199 --> 00:36:41,410 "దీనికోసమే మేము పుట్టామేమో" 666 00:36:41,410 --> 00:36:43,579 అనిపించింది నాకు. 667 00:36:46,623 --> 00:36:47,833 పిట్స్‌బర్గ్‌కి స్వాగతం. 668 00:36:47,833 --> 00:36:51,420 ఇవాళ పేట్రియాట్స్ గట్టి పోటీ ఇవ్వబోతున్నారు, 669 00:36:51,420 --> 00:36:54,965 గత వారాంతంలో మంచులో టామ్ బ్రాడీ ఆట చూసిన ఎవరికైనా 670 00:36:54,965 --> 00:36:57,801 ఆ కుర్ర న్యూ ఇంగ్లండ్ క్వార్టర్‌బ్యాక్‌ ఏం చేయగలడో తెలుసు. 671 00:37:01,763 --> 00:37:03,182 హట్! 672 00:37:08,937 --> 00:37:10,355 బాబోయ్. 673 00:37:10,355 --> 00:37:14,359 పేట్రియాట్స్ క్వార్టర్‌బ్యాక్ గాయంతో పడిపోయాడు. 674 00:38:40,445 --> 00:38:42,447 సబ్‌టైటిల్స్ : బడుగు రవి కుమార్