1 00:00:20,646 --> 00:00:21,939 {\an8}ఏవైనా వెకిలిపనులు ఉన్నాయా? 2 00:00:21,939 --> 00:00:23,315 {\an8}ట్రంప్ 2016 3 00:00:28,529 --> 00:00:30,781 {\an8}ట్రంప్, పెన్స్ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్! 4 00:00:32,824 --> 00:00:34,535 {\an8}అందరికీ థ్యాంక్యూ. 5 00:00:35,160 --> 00:00:36,954 {\an8}థ్యాంక్యూ వెరీమచ్. 6 00:00:36,954 --> 00:00:38,413 {\an8}ట్రంప్ ప్రచార ర్యాలీ ఎలక్షన్‌ ముందు రోజు 7 00:00:38,413 --> 00:00:39,581 {\an8}చెప్పాలంటే... 8 00:00:39,581 --> 00:00:42,125 {\an8}విమానంలో ఉండగా ఒక లేఖ ఇచ్చారు నాకు, 9 00:00:42,125 --> 00:00:45,003 {\an8}అది కోచ్ బెలిచిక్ నుంచి. 10 00:00:48,340 --> 00:00:49,508 దాంతో వాళ్లని అడిగాం, 11 00:00:49,508 --> 00:00:53,262 {\an8}"న్యూ హ్యాంప్‌షైర్ ప్రజలకు ట్రంప్ ఈ లేఖ చదివి వినిపిస్తారని 12 00:00:53,262 --> 00:00:55,264 {\an8}మీరు అనుకుంటున్నారా?" అని. 13 00:00:55,973 --> 00:00:58,892 {\an8}తను, "మీరు తలచుకుంటే కానిదేముంది" అన్నాడు. 14 00:00:59,351 --> 00:01:03,272 {\an8}తను ఏం రాశాడంటే, "ప్రచారం అద్భుతంగా నడిపినందుకు అభినందనలు. 15 00:01:04,105 --> 00:01:07,943 {\an8}ఏకపక్ష, ప్రతికూల మీడియాతో 16 00:01:07,943 --> 00:01:10,779 {\an8}మీరు బాగా పోరాడారు... 17 00:01:11,655 --> 00:01:13,115 {\an8}...వారి దాడి నుంచి చక్కగా... 18 00:01:14,032 --> 00:01:15,409 ...తప్పించుకున్నారు. 19 00:01:15,409 --> 00:01:17,411 అమెరికాని మళ్లీ గొప్పగా చేయడానికి 20 00:01:17,411 --> 00:01:22,249 రేపటి ఎలక్షన్ అవకాశమిస్తుందని ఆశిద్దాం." 21 00:01:23,584 --> 00:01:25,127 మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్! 22 00:01:26,378 --> 00:01:30,591 "రేపటి ఫలితాలు గొప్పగా ఉండాలని ఆశిస్తున్నాం... 23 00:01:30,591 --> 00:01:31,967 బిల్ బెలిచిక్." 24 00:01:31,967 --> 00:01:36,638 {\an8}యూ-ఎస్-ఏ! యూ-ఎస్-ఏ! 25 00:01:36,638 --> 00:01:38,849 {\an8}గత రాత్రి, పేట్రియాట్స్ కోచ్ బిల్ బెలిచిక్ నుంచి 26 00:01:38,849 --> 00:01:41,059 మద్దతుగా వచ్చిందని ట్రంప్ ఒక లేఖ చదివారు. 27 00:01:41,059 --> 00:01:44,438 {\an8}వాళ్ల జట్టులో ఉన్న సమస్యలు అన్నిటికంటే, 28 00:01:44,438 --> 00:01:46,607 {\an8}రాజకీయాలు ముఖ్యం అయ్యాయా? 29 00:01:46,607 --> 00:01:48,984 {\an8}బెలిచిక్ ఇలా చేస్తాడని ఊహించలేదు, ఎందుకంటే, నిజంగా, 30 00:01:48,984 --> 00:01:51,570 సాధారణంగా ఆయన దేని గురించీ మాట్లాడరు. 31 00:01:51,570 --> 00:01:55,282 మీడియా ముందు ఏమీ వాగొద్దు. మీ పని చూసుకుని వెళ్లిపోండి. 32 00:01:55,282 --> 00:01:57,201 మీ నుంచి వినాల్సింది ఏమీ లేదు. 33 00:01:57,826 --> 00:02:00,621 {\an8}లాకర్ రూమ్‌లో మీరు ఎప్పుడూ చెప్తుంటారు 34 00:02:00,621 --> 00:02:03,457 {\an8}బయట ఏమీ మాట్లాడవద్దని, ఎందుకంటే అది ఏకాగ్రతనిని దెబ్బతీస్తుందని, 35 00:02:03,457 --> 00:02:04,791 {\an8}మీరెందుకు డొనాల్డ్ ట్రంప్‌ని 36 00:02:04,791 --> 00:02:09,713 మీ స్టేట్‌మెంట్‌ ప్రజల ముందు చదవాలని అడిగారు? 37 00:02:10,422 --> 00:02:13,842 డొనాల్డ్ ట్రంప్‌తో నా అనుబంధం రాజకీయ పరమైంది కాదు. 38 00:02:13,842 --> 00:02:17,304 రాజకీయాల్లోకి రాకముందే ఆయన నాకు తెలుసు. 39 00:02:17,304 --> 00:02:21,099 కాబట్టి... డొనాల్డ్ నాకు స్నేహితుడు... 40 00:02:21,099 --> 00:02:23,602 వ్యక్తిగతంగానే ఆ లేఖ రాశా. 41 00:02:24,978 --> 00:02:26,897 ఆ లేఖ బయటికి వచ్చినప్పుడు, 42 00:02:26,897 --> 00:02:30,192 {\an8}మమ్మల్ని వెర్రివాళ్లని చేసినట్టు అనిపించింది. 43 00:02:31,568 --> 00:02:34,696 బిల్ ఎప్పుడూ చెప్పేవాడు, "మనం ఎప్పుడూ మీడియా ముందు 44 00:02:34,696 --> 00:02:36,365 ఏది పడితే అది చెప్పకూడదు" అని. 45 00:02:36,365 --> 00:02:39,826 నాక్కూడా కొన్ని అభిప్రాయాలు చెప్పాలని ఉంటుంది, 46 00:02:39,826 --> 00:02:42,996 కానీ జట్టుపై గౌరవంతో వాటిని చెప్పను. 47 00:02:44,498 --> 00:02:46,375 ఆయన చేసింది మోసంలా అనిపించింది నాకు. 48 00:02:47,668 --> 00:02:51,380 పేట్రియాట్ పద్ధతి ఏంటంటే, మనతో పనిచేస్తున్న వాళ్లని గౌరవించడం, 49 00:02:51,380 --> 00:02:53,257 జట్టుకే తొలి ప్రాధాన్యత ఇవ్వడం. 50 00:02:53,257 --> 00:02:56,134 దీనికున్న పునాది అదే. 51 00:02:57,094 --> 00:03:00,222 {\an8}దాని ప్రభావం లాకర్‌ రూమ్‌పై పడుతుంది అని 52 00:03:00,222 --> 00:03:02,558 {\an8}ఆయనకు తెలిసే స్థాయిలో, ఆటగాళ్లతో ఆయనకి 53 00:03:02,558 --> 00:03:05,519 {\an8}సరైన సంబంధాలు ఉన్నాయని నేను అనుకోలేను. 54 00:03:08,105 --> 00:03:12,526 సూపర్ బౌల్ చరిత్రలో వాళ్లు తమ పునరాగమనం గొప్పగా చాటారు. 55 00:03:13,986 --> 00:03:16,572 ఆ 2016 సీజన్ ముగింపులో, 56 00:03:17,072 --> 00:03:19,741 {\an8}పేట్రియాట్స్, సూపర్ బౌల్ గెలిచి చరిత్ర సృష్టించారు. 57 00:03:21,118 --> 00:03:25,122 కానీ అది జట్టుని స్థిరపరచడం, పటిష్టం చేయడానికి బదులు, 58 00:03:25,122 --> 00:03:27,708 జట్టు పునాదుల్ని బలహీనం చేయసాగింది. 59 00:03:27,708 --> 00:03:29,710 {\an8}విజేతలు 60 00:03:29,710 --> 00:03:34,798 {\an8}తర్వాత ఏడాది పాటు, జట్టులో సంబంధాలు దెబ్బతినడం, ఆనందం తగ్గడం... 61 00:03:35,799 --> 00:03:37,259 {\an8}...అనుకున్నంతగా పనిచేయకపోవడం... 62 00:03:38,427 --> 00:03:41,346 ...లాంటివి చూస్తూ ఉన్నాం. 63 00:03:51,565 --> 00:03:53,108 "మనం అంతా పేట్రియాట్స్" రాబర్ట్ క్రాఫ్ట్ 64 00:03:53,108 --> 00:03:56,111 ఈ సీజన్ మొదలవడం నుంచి 65 00:03:56,111 --> 00:03:58,780 ముగింపు వరకూ చూసినట్టయితే, 66 00:03:58,780 --> 00:04:02,075 {\an8}ఈ సూపర్ బౌల్ విజయం కచ్చితంగా 67 00:04:02,075 --> 00:04:06,163 {\an8}అన్నిటికంటే గొప్పదని చెప్పగలను. 68 00:04:07,039 --> 00:04:09,458 అదే గొప్పని మీరు భావిస్తుంటే, 69 00:04:09,458 --> 00:04:13,921 తర్వాత జరగబోయే దాని వరకు ఆగండి. 70 00:04:14,713 --> 00:04:19,091 డెజర్ట్‌లో మామూలు క్యారట్ కేక్ బదులుగా, 71 00:04:19,091 --> 00:04:23,222 క్యారట్లు పొదిగిన బహుమతి ఇస్తున్నాం. 72 00:04:23,931 --> 00:04:27,851 సూపర్ బౌల్ విజేతల్లారా, మీ ఉంగరాలు తెరవండి. 73 00:04:43,992 --> 00:04:45,619 మీకు ముందే చెప్పా 74 00:04:45,619 --> 00:04:48,121 దీన్ని మళ్లీ మన ఇంటికి తెస్తాం అని. 75 00:04:48,830 --> 00:04:52,251 అలాగే తీసుకొచ్చాం దీన్ని. పదండి ఇక! 76 00:04:52,793 --> 00:04:54,419 పదండి ఇక! 77 00:04:59,258 --> 00:05:01,009 {\an8}ఆ సూపర్ బౌల్ విజయం తర్వాత, 78 00:05:01,009 --> 00:05:04,972 {\an8}పేట్రియాట్స్ క్వార్టర్‌బ్యాక్‌గా టామ్ బ్రాడీ స్థిరపడిపోయాడు. 79 00:05:06,181 --> 00:05:08,308 తర్వాత కొన్ని నెలల పాటు, తన విజయాల ఫలితాన్ని 80 00:05:08,308 --> 00:05:11,186 పూర్తిగా వాడుకునేలా టామ్ జీవించబోతున్నాడని 81 00:05:11,186 --> 00:05:13,397 మనం అర్ధం చేసుకోవాలి. 82 00:05:14,147 --> 00:05:17,943 బిల్ ఏమనుకుంటాడో అనే దాని గురించి ఆలోచించడం తగ్గించిన టామ్ 83 00:05:17,943 --> 00:05:19,695 తనకి నచ్చినట్టు చేశాడు. 84 00:05:19,695 --> 00:05:24,283 అత్యంత వేగంగా బ్రాడీ ఇండస్ట్రీ పురుడుపోసుకుని పెద్దదైంది. 85 00:05:27,911 --> 00:05:29,663 ఫుట్‌బాల్ ఆటని ప్రేమిస్తా నేను, 86 00:05:29,663 --> 00:05:32,708 టోక్యోలో మీతో ఇలా నా ప్రేమని పంచుకోవడం బాగుంది. 87 00:05:32,708 --> 00:05:37,045 మనం ఇప్పుడున్న స్థాయి నుంచి మెరుగైన స్థాయికి వెళ్లాలంటే ఏం కావాలి? 88 00:05:37,045 --> 00:05:38,881 కష్టపడేతత్వం, అంకితభావం, 89 00:05:38,881 --> 00:05:42,467 {\an8}మనం చేయలేము, అని ఎవరూ మనతో అనకూడదు. 90 00:05:45,846 --> 00:05:48,557 నేను ఫుట్‌బాల్ ఆడటం మొదలు పెట్టినప్పటి కంటే, 91 00:05:48,557 --> 00:05:50,517 ఇప్పుడే వేగంగా, చురుగ్గా ఉన్నాను. 92 00:05:50,517 --> 00:05:51,727 నీ 18 ఏళ్ల వయసు కంటే, 93 00:05:51,727 --> 00:05:53,854 - 40 ఏళ్ల వయసులోనే వేగంగా ఉన్నావా? - అవును. 94 00:05:53,854 --> 00:05:56,273 ఇందులో ఏదైనా రహస్యం ఉంటే 95 00:05:56,273 --> 00:05:59,902 జిలెట్ స్టేడియం దగ్గరున్న ఈ భవనంలో దాన్ని కనుక్కోవచ్చు. 96 00:05:59,902 --> 00:06:04,489 ఈ భవనం పేరు టీబీ12 స్పోర్ట్స్ థెరపీ సెంటర్. 97 00:06:05,449 --> 00:06:08,493 టీబీ12 కార్యకలపాలు జరిగే ఈ భవనం 98 00:06:08,493 --> 00:06:13,207 {\an8}టామ్‌కి అందిన కొత్త తరహా స్వేచ్ఛకి ప్రతీక. 99 00:06:13,874 --> 00:06:19,087 {\an8}"ఎప్పుడూ జట్టే మొదటి ప్రాధాన్యత" అనే సూత్రం నుంచి టామ్ దూరమవడం మొదలైంది. 100 00:06:20,464 --> 00:06:22,090 అలా మొదలవగానే, 101 00:06:22,090 --> 00:06:25,761 బిల్‌తో ఘర్షణ వాతావరణం ఏర్పడేలా చేసింది అది. 102 00:06:26,678 --> 00:06:32,059 ముఖ్యంగా అలెక్స్ గెరీరోతో టామీ అనుబంధం విషయంలో కనిపించింది అది. 103 00:06:37,189 --> 00:06:39,107 సరే, మనం రెడీనా? 104 00:06:42,611 --> 00:06:47,074 పాదాల నుంచి మొదలుపెట్టి, తర్వాత కాళ్లు, రెండు ప్రత్యేక స్థానాలు మరియు చేయి. 105 00:06:47,074 --> 00:06:49,451 అంతే. సరే, మొదలు పెడదాం. 106 00:06:53,038 --> 00:06:54,957 ఓహ్, ఇవాళ సరిగ్గా పట్టుకున్నావు. 107 00:06:55,832 --> 00:06:57,960 అక్కడే కాస్త ఇబ్బంది మిగిలుంది. 108 00:06:59,419 --> 00:07:03,674 టామ్ మరియు నేను, మాది ప్రత్యేకమైన అనుబంధం. 109 00:07:10,764 --> 00:07:12,224 సరే, రిలాక్స్ అవ్వు. 110 00:07:12,224 --> 00:07:15,310 ఎవరికైనా మ్యాన్యువల్‌ థెరపీ చేస్తున్నప్పుడు, భౌతిక స్పర్శ వల్ల, 111 00:07:15,310 --> 00:07:20,232 ఒకరు నొప్పి నుంచి బయట పడేందుకు సాయం చేస్తున్నామన్న భావన ఉంటుంది, 112 00:07:20,232 --> 00:07:22,317 {\an8}ఒక రకమైన అనుబంధం లాంటిది ఉంటుంది. 113 00:07:22,317 --> 00:07:24,194 {\an8}వాళ్లనే మనసుకు దగ్గరైన మిత్రుడు అంటారు. 114 00:07:24,194 --> 00:07:25,821 అది హాయిగా ఉంది. 115 00:07:26,321 --> 00:07:30,075 అది స్నేహమైంది, కుటుంబమైంది, అదే సోదరతత్వం అయింది. 116 00:07:35,789 --> 00:07:37,040 బ్లూబెర్రీ నురగా? 117 00:07:37,040 --> 00:07:40,377 - ఏంటి అది? - ఇది బాగా కలిపా. 118 00:07:40,377 --> 00:07:44,298 ఏళ్లుగా, అలెక్స్‌తో నా అనుంబంధం నిజంగా పెరిగి పెద్దదైంది. 119 00:07:46,800 --> 00:07:50,470 నా కష్టకాలంలో ఎన్నోసార్లు అలెక్స్‌ నాకు శారీరకంగా, మానసికంగా 120 00:07:50,470 --> 00:07:52,431 ఎంతో సాయం చేశాడు. 121 00:07:53,140 --> 00:07:57,144 నాకు గుర్తుంది, 2004లో మోచేతి నొప్పితో బాధ పడుతూ 122 00:07:57,144 --> 00:07:59,897 శిక్షణ శిబిరంలో బంతి విసరలేకపోయా. 123 00:08:00,772 --> 00:08:03,066 ఒరేయ్, మంపు వదుల్చుకోరా! 124 00:08:03,901 --> 00:08:06,445 క్వార్టర్‌బ్యాక్స్ విషయంలో, వరుసగా 12 రోజులు విసురుతాం, 125 00:08:06,445 --> 00:08:07,863 దాంతో అంతా అరిగినట్టు ఉంటుంది. 126 00:08:08,780 --> 00:08:12,868 చికిత్స కోసం చాలామంది దగ్గరకెళ్లా, కానీ లాభం లేదు. 127 00:08:12,868 --> 00:08:15,954 కానీ అలెక్స్‌ని కలిసిన తొలిసారే, 128 00:08:15,954 --> 00:08:18,415 నా మోచేతి నొప్పి మాయం అయింది, జీవితంలో మళ్లీ రాలేదు. 129 00:08:18,415 --> 00:08:20,375 దాంతో "ఎలా చేశావురా బాబూ?" అని అడిగా. 130 00:08:21,376 --> 00:08:24,129 ప్లయబిలిటీ అనేది మా పద్ధతిలో కీలకం. 131 00:08:24,880 --> 00:08:27,090 కండరాలని వంచగలిగేలా ఉంచగలిగేతే, 132 00:08:27,090 --> 00:08:30,093 అవి ఎలాంటి ఒత్తిడి అయినా తట్టుకుంటాయని నేను నమ్ముతా. 133 00:08:30,844 --> 00:08:35,515 కానీ అవి గట్టిగా, కట్టడి చేసినట్టు ఉంటే వాటిపై భారం పడుతుంది. 134 00:08:35,515 --> 00:08:38,602 అందుకే, భారం అనేది చీలమండ, మోకాలు, తుంటి, వెన్ను దిగువన పడుతుంది, 135 00:08:38,602 --> 00:08:41,020 చాలామందికి అక్కడే నొప్పి ఉంటుంది. 136 00:08:41,980 --> 00:08:44,441 ఈ ప్లయబిలిటీ శిక్షణ ఎంత తరచుగా తీసుకుంటారు మీరు? 137 00:08:44,441 --> 00:08:45,859 ఎంత ఎక్కువ వీలైతే అంత. 138 00:08:45,859 --> 00:08:49,696 వారంలో ఐదారు రోజులు అలెక్స్‌, నేను కలిసి పని చేస్తుంటాం. 139 00:08:49,696 --> 00:08:52,282 టామ్ దీన్ని ముందు పట్టుకున్నాడు, ఫలితాన్నీ ముందే చూశాడు. 140 00:08:52,282 --> 00:08:55,410 కాబట్టి, ఏళ్ల బట్టి గమనిస్తే, మీరు దాని ప్రభావం చూడగలరు. 141 00:08:55,410 --> 00:08:57,371 నలభై ఏళ్ల వయసులో అత్యున్నత స్థాయిలో ఆడటం. 142 00:08:58,038 --> 00:08:59,623 ఆహ్, 40 అనేది కేవలం సంఖ్యే. 143 00:09:00,916 --> 00:09:04,211 మేము కలిసి ఈ ప్రయాణం మొదలు పెట్టాం. 144 00:09:04,211 --> 00:09:07,256 ఆరోగ్యం గురించి ముందే జాగ్రత్త పడటం అనే ప్రయాణం. 145 00:09:08,549 --> 00:09:09,633 అదే సమయంలో, 146 00:09:09,633 --> 00:09:13,053 నా మిగిలిన టీంమేట్స్‌ని కూడా ఇదే చేసేలా ప్రోత్సహించాను. 147 00:09:13,053 --> 00:09:16,348 {\an8}ప్రతిదానిలో ఒక మాధ్యమం ఉండాలి అనుకుంటా నేను. చెప్పాలంటే... 148 00:09:16,348 --> 00:09:17,516 {\an8}మనం బలంగా ఉండాలి, 149 00:09:17,516 --> 00:09:20,644 {\an8}కానీ వంగే గుణంతో, మృదువుగానూ ఉండాలి. 150 00:09:20,644 --> 00:09:23,981 {\an8}నేను బరువులు ఎత్తడానికి వ్యతిరేకం కాదు. నేను దానికి వ్యతిరేకం అనుకుంటారు. 151 00:09:23,981 --> 00:09:27,401 {\an8}ప్లయబిలిటీకి అనువైన బరువులు సరైనవి అని నేనంటాను. అవే మీకు కావాలి. 152 00:09:27,401 --> 00:09:30,362 మీ శిక్షణకి ఏది అవసరమో దానికే శిక్షణ తీసుకోవాలని నేను భావిస్తాను. 153 00:09:30,362 --> 00:09:32,865 జ్యూల్స్, నువ్వు బలంగా ఉండాలి. ఒకసారి చూడు. 154 00:09:32,865 --> 00:09:34,324 నువ్వు బలంగా ఉండాలి. 155 00:09:35,659 --> 00:09:37,494 "చూడండీ, ఇది నాకు పనిచేసింది" అని చెప్పా. 156 00:09:37,494 --> 00:09:39,955 నా జీవితమంతా మోచేతి నొప్పి ఉండేది. ఇప్పుడు లేదు. 157 00:09:39,955 --> 00:09:44,376 నా భుజంతో కొన్ని లక్షల త్రోలు విసిరి ఉంటా, 158 00:09:44,376 --> 00:09:48,755 ఒకవేళ మీరు దాని ఎమ్ఆర్ఐ తీస్తే, అది చాలా తాజాగా కనిపిస్తుంది. 159 00:09:49,798 --> 00:09:52,759 అలా, అలెక్స్ తన కోసం చేసినవాటిని 160 00:09:52,759 --> 00:09:54,845 భగవద్గీత సూక్తుల్లా బ్రాడీ చూశాడు. 161 00:09:55,345 --> 00:10:00,267 ఒక్కసారిగా చాలామంది ఆటగాళ్లు గెరీరోతో కలిసి పని చేయసాగారు. 162 00:10:00,267 --> 00:10:02,019 రాబ్ గ్రంకోవ్‌స్కీతో సహా. 163 00:10:03,061 --> 00:10:05,772 అయితే ఇది బెలిచిక్‌కి తెలిసి, 164 00:10:05,772 --> 00:10:08,901 పరిస్థితులు కాస్త కఠినంగా మారాయి! 165 00:10:10,068 --> 00:10:12,446 {\an8}శిక్షణా శిబిరానికి స్వాగతం. 166 00:10:12,446 --> 00:10:13,864 {\an8}2017 శిక్షణ శిబిరం 167 00:10:14,573 --> 00:10:17,034 దానికి ముందటేడాది, నా ఊపిరితిత్తికి గాయమైంది 168 00:10:17,034 --> 00:10:21,371 {\an8}నా వెన్ను పగిలినట్టు అయింది, ఫలితంగా అక్కడితో నా సీజన్ ముగిసింది ఆ ఏడాది. 169 00:10:22,706 --> 00:10:25,334 అంటే, తిరిగి పుంజుకోవడం చాలా కష్టం. 170 00:10:29,254 --> 00:10:31,465 నాకు అది భయంకరమైన ఆఫ్ సీజన్. 171 00:10:31,465 --> 00:10:34,635 కోచ్ బెలిచిక్ నాతో సమావేశమై, నేను సరిగా ఆడలేక పోతున్నానని, 172 00:10:34,635 --> 00:10:36,929 స్లోగా ఉన్నానని, ఇబ్బందిగా ఉన్నానని చెప్పాడు. 173 00:10:36,929 --> 00:10:39,139 బిల్ నన్ను తొలగించడం ఖాయం అనిపించింది. 174 00:10:42,351 --> 00:10:46,271 ఆ తర్వాత, నేను టీబీ12కి వెళ్లా, ఏం జరిగింది అంటే, 175 00:10:46,271 --> 00:10:49,483 రెండు సెషన్లలోనే నాలో మార్పు అర్ధమైంది. 176 00:10:50,567 --> 00:10:53,612 గుడ్. రిలాక్స్. సరిగ్గా చేస్తున్నావు. బాగా చేస్తున్నావు. 177 00:10:53,612 --> 00:10:56,865 నా వెన్ను తేలికైంది. నొప్పి మొత్తం మాయం అవసాగింది. 178 00:10:57,783 --> 00:11:02,329 ప్రాక్టీసుకి వెళ్లినప్పుడు, నాలో వేగం మళ్లీ వచ్చింది 179 00:11:02,329 --> 00:11:05,332 "దేవుడా, ఇది మాయే!" అనుకున్నా నేను. 180 00:11:06,041 --> 00:11:10,212 అయితే నేను టామ్ బ్రాడీ పద్ధతిని ఫాలో కావడం 181 00:11:10,212 --> 00:11:11,797 ఎందుకో కొంతమందికి నచ్చలేదు. 182 00:11:13,966 --> 00:11:14,967 గ్రంకోవ్‌స్కీ విషయంలో 183 00:11:14,967 --> 00:11:18,345 ఆసక్తికర విషయం ఏంటంటే, తను బ్రాడీ, అలెక్స్ గెరీరోల టీబీ12కి చెందిన 184 00:11:18,345 --> 00:11:22,349 బరువులు ఎత్తొద్దు అనే పద్ధతిని సబ్‌స్క్రయిబ్ చేసుకోవడం. 185 00:11:22,349 --> 00:11:24,476 దాంతో, పేట్రియాట్స్ వ్యాయామ కోచ్‌లు అడిగనప్పుడు 186 00:11:24,476 --> 00:11:28,355 గ్రాంక్ "నేను స్క్వాట్స్ చేయను" అనేవాడు. 187 00:11:28,355 --> 00:11:32,734 అప్పుడు, బెలిచిక్, మిగతా ఆటగాళ్ల ముందు గ్రాంక్‌కి చెప్పాడు, 188 00:11:32,734 --> 00:11:36,238 "నువ్వు స్క్వాట్స్ చేయడం లేదు, ఆ చెత్త బ్యాండ్ వ్యాయామం చేస్తున్నావు. 189 00:11:36,238 --> 00:11:39,825 గ్రౌండ్‌లో నిన్ను ఎత్తి పడేసినా ఆశ్చర్యం లేదు. నువ్వు బలహీనంగా ఉన్నావు" అని. 190 00:11:41,910 --> 00:11:45,122 బిల్ మదిలో, అనవసరమైన వాళ్లు ఎక్కువయ్యారన్న అభిప్రాయం ఉంది. 191 00:11:46,665 --> 00:11:51,336 పేట్రియాట్స్‌కు సంబంధం లేని ప్రొఫెషనల్ ఆ భవనంలోకి వస్తుండటం, 192 00:11:51,336 --> 00:11:55,299 {\an8}అది కూడా పేట్రియాట్స్‌ శిక్షకుడిగా రావడం, 193 00:11:55,299 --> 00:11:58,927 {\an8}అక్కడ ఘర్షణ వాతావరణం సృష్టించింది. 194 00:12:00,554 --> 00:12:02,181 గెరీరో రాక 195 00:12:02,181 --> 00:12:05,434 బెలిచిక్ యొక్క వ్యాయామ సిబ్బందిలో మంట పుట్టించింది. 196 00:12:05,434 --> 00:12:07,728 అలెక్స్ గెరీరోపై ఉన్న వ్యతిరేకత ఏంటంటే 197 00:12:07,728 --> 00:12:10,564 ఆయనని గతంలో, 198 00:12:10,564 --> 00:12:13,567 ఒక మోసగాడిగా, నకిలీ వైద్యుడిగా చూసిన సందర్భాలు ఉన్నాయి. 199 00:12:13,567 --> 00:12:17,613 {\an8}తనని తాను వైద్యుడుగా చెప్పుకుంటాడు తను, కానీ వైద్యుడు కాదు. 200 00:12:17,613 --> 00:12:20,157 {\an8}- అవును. - తను చెప్పుకుంటాడు, 201 00:12:20,157 --> 00:12:23,118 {\an8}ప్రాణాంతక రోగుల్ని రక్షించగలను అని. 202 00:12:24,286 --> 00:12:25,704 {\an8}- అది నమ్మేది కాదు. - కాదు. 203 00:12:25,704 --> 00:12:28,081 {\an8}- ఇప్పుడు ఆటగాళ్లతో పనిచేస్తున్నాడు. - అవును. 204 00:12:28,081 --> 00:12:31,084 {\an8}దీనిపై శిక్షణా సిబ్బంది, కచ్చితంగా అసంతృప్తిగా ఉంటారు, 205 00:12:31,084 --> 00:12:33,045 {\an8}ఎందుకంటే వాళ్లకి దీనిపై నమ్మకం లేదు. 206 00:12:33,045 --> 00:12:37,216 {\an8}ఆటగాళ్లు బయట ఎవరితో అయినా మాట్లాడొచ్చు. 207 00:12:37,925 --> 00:12:41,094 కానీ మా శిక్షణా సిబ్బంది చెప్పేదానికి వ్యతిరేకంగా, 208 00:12:41,094 --> 00:12:44,139 {\an8}మా వ్యాయామ సిబ్బంది చెప్పేదానికి వ్యతిరేకంగా 209 00:12:44,139 --> 00:12:47,684 {\an8}సలహాలు ఇచ్చే మనిషి, తమ మధ్య తిరగడానికి ఎవరూ ఒప్పుకోరు. 210 00:12:47,684 --> 00:12:50,187 {\an8}చెప్పాలంటే, అది అనుమానాలకి కారణమవుతుంది. 211 00:12:50,187 --> 00:12:53,440 {\an8}టామ్ బ్రాడీ శిక్షకుడు, వ్యాపార భాగస్వామి, సన్నిహితుడు అలెక్స్ గెరీరోకి 212 00:12:53,440 --> 00:12:58,237 {\an8}పలు అధికారాలు కట్ చేసింది న్యూ ఇంగ్లండ్ పేట్రియాట్స్. 213 00:12:58,237 --> 00:13:02,241 పేట్రియాట్స్ కార్యాలయంలో బ్రాడీతో తప్ప వేరే ఆటగాళ్లతో పనిచేయడానికి ఇకపై 214 00:13:02,241 --> 00:13:05,702 గెరీరోని అనుమతించరు, పేట్రియాట్స్ విమానాల్లో కూడా తనపై నిషేధం విధించారు. 215 00:13:05,702 --> 00:13:09,331 {\an8}గెరీరో సైడ్‌లైన్‌ అనుమతినీ రద్దు చేశారు. 216 00:13:17,339 --> 00:13:20,717 అలెక్స్‌ని సైడ్‌లైన్ నుంచి జట్టు విమానాల నుంచి తొలగించామని 217 00:13:20,717 --> 00:13:23,387 బిల్ మీకు చెప్పినప్పుడు ఎలా స్పందించారు? 218 00:13:25,848 --> 00:13:27,808 {\an8}మీ ప్రశ్న సరిగా లేదు. 219 00:13:27,808 --> 00:13:28,934 {\an8}టామ్ బ్రాడీ క్వార్టర్‌బ్యాక్ 220 00:13:28,934 --> 00:13:30,894 {\an8}మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. 221 00:13:32,229 --> 00:13:33,647 ఆయన ఏం మాట్లాడారో మీకెలా తెలుసు? 222 00:13:34,940 --> 00:13:38,318 అంటే మీరు అనుమతి గురించి చెప్తున్నారా...? 223 00:13:38,318 --> 00:13:41,446 నేను ఏమీ చెప్పడం లేదు. ఆయన ఏదో చెప్పారని మీరెలా అంటున్నారు? 224 00:13:41,446 --> 00:13:42,990 దాని గురించి మీకేమీ తెలియదు. 225 00:13:42,990 --> 00:13:47,327 ఆయనతో నేను చాలా మాట్లాడాను. కాబట్టి, అవన్నీ మా ఇద్దరి వ్యక్తిగతం. 226 00:13:47,327 --> 00:13:49,913 మేము ఏం మాట్లాడుకున్నామో వేరేవాళ్లకి తెలుసని నేను అనుకోను. 227 00:13:49,913 --> 00:13:52,499 దాని గురించి నేనెప్పుడూ చెప్పలేదు. ఆయనా ఎప్పుడూ చెప్పలేదు. 228 00:13:54,501 --> 00:13:57,713 ఈ మొత్తం పరిస్థితి, చాలా శత్రుత్వాన్ని రగిల్చింది. 229 00:13:58,297 --> 00:14:02,676 ఇదంతా పనికిమాలిన వ్యవహారం. ఎందుకంటే అలెక్స్ అద్భుతమైన వ్యక్తి. 230 00:14:02,676 --> 00:14:04,803 నన్ను ఆరోగ్యంగా ఉంచగలిగాడు. చూసుకుంటే... 231 00:14:04,803 --> 00:14:07,806 నా మీద, జట్టు మీద తను శ్రద్ధ పెట్టకపోయుంటే 232 00:14:07,806 --> 00:14:10,100 ఎన్ఎఫ్ఎల్‌లో నేను 12 ఏళ్లు ఆడేవాడినే కాదు. 233 00:14:10,100 --> 00:14:13,437 దానికి అతడు అభినందనలు పొందకపోగా, నిందించబడ్డాడు, 234 00:14:13,437 --> 00:14:16,273 నేను పదే పదే ప్రశ్నించా, "మీ అందరికీ ఏమైంది?" అని. 235 00:14:16,273 --> 00:14:17,482 పేట్రియాట్స్ డైనాస్టీలో అంతర్గత చిచ్చు? 236 00:14:17,482 --> 00:14:20,110 అలెక్స్ మరియు పేట్రియాట్స్ విషయంలో గందరగోళం ఏర్పడింది 237 00:14:20,110 --> 00:14:22,112 అదే నాకు అర్ధం కాలేదు. 238 00:14:22,112 --> 00:14:24,990 నేను అడిగా, "టామ్, అంతా మీ వెంట ఎందుకు పడుతున్నారు... 239 00:14:25,824 --> 00:14:29,369 ...మీ వయసు 40 ఏళ్లయినా, 23 ఏళ్ల వాడిలా... 240 00:14:30,120 --> 00:14:31,830 ...గణాంకాలు నమోదు చేస్తున్నా సరే? 241 00:14:31,830 --> 00:14:33,999 ఇంకా లీగ్‌లో మీరే ఉత్తమ క్వార్టర్‌బ్యాక్" అని. 242 00:14:33,999 --> 00:14:37,169 నాకు అర్ధం కాలేదు. నా ప్రశ్నకి తన దగ్గరా సమాధానం లేదు. 243 00:14:37,169 --> 00:14:40,339 తను, "నాకూ తెలియదు రాబ్" అని చెప్పాడు. 244 00:14:40,339 --> 00:14:43,675 {\an8}బ్రాడీ, బెలిచిక్ మధ్య అంతా సవ్యంగా ఉందా అనుకోవడానికి కారణమేంటి? 245 00:14:43,675 --> 00:14:46,178 {\an8}మీరు అలా ఎలా అనుకుంటున్నారో అర్ధం కావడం లేదు, 246 00:14:46,178 --> 00:14:48,805 {\an8}ఎందుకంటే టామ్ బ్రాడీ గురించి మనకి తెలిసింది ఏందంటే, 247 00:14:48,805 --> 00:14:52,601 {\an8}తన జీవితం, అంతర్గత వ్యవహారాల విషయంలో 248 00:14:52,601 --> 00:14:54,311 {\an8}చాలా వరకు గుట్టుగా ఉంటాడు, 249 00:14:54,311 --> 00:14:56,313 {\an8}అందులో అలెక్స్ గెరీరో కేంద్రబిందువు. 250 00:14:56,313 --> 00:14:58,023 {\an8}తను టామ్ బ్రాడీ గురువు. 251 00:14:58,023 --> 00:15:01,693 {\an8}- తను టామ్ బ్రాడీని ఒప్పించాడు... - అవకాడో ముక్కలు తినమనా? 252 00:15:01,693 --> 00:15:04,863 {\an8}- అవును. తనే అవకాడో షేక్-మైస్టర్. - అవును. 253 00:15:04,863 --> 00:15:07,366 {\an8}వందేళ్లు వచ్చేదాకా ఆడతానని టామ్ బ్రాడీ భావిస్తున్నాడు. 254 00:15:07,366 --> 00:15:09,618 {\an8}ఇది చూసి నాకేం అనిపిస్తుంది అంటే? ఇదొక వర్గ పోరు. 255 00:15:10,410 --> 00:15:13,830 గెరీరో విషయంలో జరుగుతున్నదంతా ఆధిపత్య పోరు. 256 00:15:14,331 --> 00:15:16,917 {\an8}ఇక్కడ పెత్తనం కోసం బ్రాడీ ప్రయత్నిస్తున్నాడు 257 00:15:16,917 --> 00:15:19,044 {\an8}తన పెత్తనం నిలుపుకోవాలని బెలిచిక్ చూస్తున్నాడు. 258 00:15:19,044 --> 00:15:21,755 వాళ్ల బంధం ఎలాంటి మార్పులకి గురైందో మీరు ఆలోచించాలి. 259 00:15:23,340 --> 00:15:28,011 {\an8}ఆట ముగిసింది. సూపర్ బౌల్ విజేతలుగా పేట్రియాట్స్ నిలిచారు. 260 00:15:29,346 --> 00:15:32,224 హూ! ఎలా ఉందిది, బేబీ? ఎలా ఉంది ఈ గెలుపు? 261 00:15:32,975 --> 00:15:36,979 మొదట్లో, బెలిచిక్‌ని గురువులా చూశాడు బ్రాడీ, 262 00:15:36,979 --> 00:15:39,398 ఆయనని ఆరాధించాడు, నమ్మాడు. 263 00:15:39,398 --> 00:15:42,484 ఒకరినొకరు నమ్మితే ఏం సాధించగలమో అనడానికి ఇది ఉదాహరణ. 264 00:15:42,484 --> 00:15:45,779 మా కోచ్, ఎప్పుడూ మద్దతుగా నిలిచాడు. 265 00:15:45,779 --> 00:15:47,531 కల నిజమైంది. 266 00:15:47,531 --> 00:15:51,201 తను ఏమి చెప్పాలని బిల్ కోరుకునేవాడో, అదే చెప్పేవాడు తను. 267 00:15:52,202 --> 00:15:57,165 ఆ సీజన్ అప్పుడు, బిల్ బెలిచిక్ కోసం తను పంచింగ్ బ్యాగ్‌లా మారడానికీ సిద్ధపడేవాడు. 268 00:15:57,833 --> 00:15:59,042 నాకిది నచ్చలేదు. 269 00:15:59,042 --> 00:16:01,712 మళ్లీ చేయండి. దగ్గరకొచ్చి మళ్లీ చేయండి, బ్రాడీ. 270 00:16:01,712 --> 00:16:05,215 జట్టుకి మంచిది అని బెలిచిక్ ఏదైనా చెప్తే, బ్రాడీ అది చేసేవాడు. 271 00:16:06,884 --> 00:16:09,678 {\an8}కానీ ఇప్పుడు, 15 ఏళ్ల తర్వాత, 272 00:16:09,678 --> 00:16:12,723 బ్రాడీ కొంత స్వేచ్ఛ ప్రదర్శిస్తున్నాడు 273 00:16:12,723 --> 00:16:14,725 బిల్ అధికారం కాస్త తగ్గుతోంది. 274 00:16:15,642 --> 00:16:17,144 గెరీరో విషయంలోనే కాదు. 275 00:16:17,144 --> 00:16:21,857 సీజన్ మధ్యలో, జిమ్మీ గెరాపొలోకి సంబంధించి ఒక సంఘటన జరిగింది. 276 00:16:21,857 --> 00:16:24,943 ఊహించని బదిలీ గురించి ఈ రాత్రి మొదలు పెట్టబోతున్నాం. 277 00:16:24,943 --> 00:16:29,907 {\an8}జిమ్మీ గెరాపొలోని శాన్‌ఫ్రాన్సిస్కో 49 జట్టుకి అమ్మాలి అనుకుంటోంది పేట్రియాట్స్. 278 00:16:29,907 --> 00:16:34,494 {\an8}గెరాపొలోని, టామ్ బ్రాడీకి వారసుడిగా చూశారు. 279 00:16:34,494 --> 00:16:39,625 {\an8}టామ్ బ్రాడీ లేకుండానే కోచ్ బెలిచిక్ మందుకెళ్తాడు అనుకున్నా. 280 00:16:39,625 --> 00:16:44,463 టామ్ బ్రాడీని మిస్టర్ క్రాఫ్ట్ కొడుకులా చూశాడు, అందుకే బెలిచిక్‌కి చెప్పాడు, 281 00:16:44,463 --> 00:16:47,049 "నువ్వు జిమ్మీ గెరాపొలోని పంపించు" అని. 282 00:16:47,049 --> 00:16:48,258 ట్రేడ్ సీక్రెట్స్ 283 00:16:48,258 --> 00:16:50,385 అలా చేయాలని నేనెప్పుడూ అడగలేదు. 284 00:16:50,385 --> 00:16:55,891 {\an8}నేను బిల్‌కి చెప్పింది, మనం ఎప్పటికీ బ్రాడీని వదులుకోము అని మాత్రమే, 285 00:16:55,891 --> 00:16:59,353 అది కాస్త ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. 286 00:16:59,353 --> 00:17:03,357 వాళ్లు గెరాపొలోని పంపించాక బిల్ బెలిచిక్ బాధ పడ్డాడు. 287 00:17:03,357 --> 00:17:06,693 తన ఉత్తమ క్వార్టర్‌బ్యాక్ మిత్రుడిని కోల్పోయినట్టు బాధ పడ్డాడు. 288 00:17:08,069 --> 00:17:13,367 బ్రాడీ, బెలిచిక్ మధ్య దూరం పెరగడం మీరు గమనించొచ్చు... 289 00:17:14,367 --> 00:17:15,493 ...అది ఇంకా పెరిగింది. 290 00:17:17,871 --> 00:17:20,457 మీరు ఇంకా ప్రతి ఏడాది లాగే 291 00:17:20,457 --> 00:17:23,544 ఇప్పటికీ టామ్ మరియు క్వార్టర్‌బ్యాక్‌లతో 292 00:17:23,544 --> 00:17:25,753 వారం వారం కలుస్తున్నారా? 293 00:17:26,547 --> 00:17:28,799 నేను అందరు ఆటగాళ్లతో ఎప్పుడూ కలుస్తుంటా. 294 00:17:30,133 --> 00:17:33,637 మీకు, టామ్‌కి మధ్య పని విషయంలో మారిన పరిస్థితుల్ని 295 00:17:33,637 --> 00:17:35,931 ఎలా విశ్లేషిస్తారు? 296 00:17:35,931 --> 00:17:38,016 ఈ ఏడాది ఏమైనా మారిందా? 297 00:17:40,060 --> 00:17:41,854 ప్రతి సంవత్సరం వేరుగా ఉంటుంది. 298 00:17:44,273 --> 00:17:48,861 2017 సీజన్‌కి సంబంధించి చాలామంది మాజీ ఆటగాళ్లతో మేము మాట్లాడాం. 299 00:17:49,486 --> 00:17:53,740 {\an8}తాము చూసిన కఠినమైన ఏడాది అదే అని చాలామంది చెప్పారు. 300 00:17:53,740 --> 00:17:55,576 {\an8}అలా ఎందుకు అనిపించింది? 301 00:17:58,036 --> 00:18:01,248 తెలియదు. ఎన్ఎఫ్ఎల్‌లో ప్రతి సంవత్సరం సవాల్‌గానే ఉంటుంది. 302 00:18:01,248 --> 00:18:03,667 అలా ఎందుకు చెప్పారో వాళ్లనే అడగాల్సింది. 303 00:18:05,794 --> 00:18:08,630 ఆ సంవత్సరం అంతా, టామ్ మరియు బిల్, 304 00:18:08,630 --> 00:18:11,133 ఇద్దరు పేరెంట్స్‌లా పోట్లాడుకుంటూ ఉన్నారు. 305 00:18:11,758 --> 00:18:13,260 ఎప్పుడూ చాలా టెన్షన్‌గా ఉండేది. 306 00:18:13,260 --> 00:18:16,597 ఎలా అంటే, అక్కడికి వెళ్లి తలుపు తెరవగానే, 307 00:18:16,597 --> 00:18:19,308 అందరం బిగుసుకుని పోయేవాళ్లం, 308 00:18:19,308 --> 00:18:22,644 పిర్రలు బిగబట్టి నడుస్తున్నట్టు ఉండేది. 309 00:18:22,644 --> 00:18:26,023 ఆ పరిస్థితి అలా ఉండేది. నా ఒక్కడికే ఇలా అనిపిస్తోంది అనుకున్నా. 310 00:18:26,023 --> 00:18:27,357 అయితే మిగతావాళ్లని అడిగా. 311 00:18:27,357 --> 00:18:30,235 {\an8}ఆ జట్టు ఆటగాడిగా ఆ ఏడాది, 312 00:18:30,235 --> 00:18:32,654 {\an8}అక్కడ ఘర్షణ వాతావరణం పెరగడం చూశా. 313 00:18:32,654 --> 00:18:35,199 {\an8}అది వింతగా ఉండేది. అనుభవించాల్సిందే. 314 00:18:35,199 --> 00:18:36,825 {\an8}మనుషుల్లో, మనలో, జట్టులో 315 00:18:36,825 --> 00:18:40,454 ఏదో జరుగుతున్నట్టు అనిపించేది. 316 00:18:40,454 --> 00:18:43,081 {\an8}అది కఠిన పరీక్ష లాంటి సంవత్సరం. 317 00:18:43,081 --> 00:18:46,460 ఆ భవనంలో తెర వెనుక జరిగే 318 00:18:46,460 --> 00:18:47,961 విషయాలు మాత్రమే కాదు... 319 00:18:48,670 --> 00:18:53,592 ...దేశమంతా జరిగిన విషయాలు కూడా. 320 00:18:54,968 --> 00:18:57,596 ప్రతిచోటా ఘర్షణ వాతావరణం ఉన్నట్టు అనిపించేది. 321 00:18:59,765 --> 00:19:01,934 ఈ దేశం పట్ల గర్విస్తున్నాం. 322 00:19:01,934 --> 00:19:04,686 మన జెండాని గౌరవిస్తున్నాం. 323 00:19:08,440 --> 00:19:11,527 కొంతమంది ఎన్ఎఫ్ఎల్ యజమానుల్ని చూస్తే ముచ్చటగా ఉంటుంది, 324 00:19:11,527 --> 00:19:13,820 ఎవరైనా మన జెండాని అవమానించడం చూస్తే, 325 00:19:13,820 --> 00:19:19,076 వాళ్లు, "ఆ ముండాకొడుకుని గ్రౌండ్ నుంచి ఈడ్చేయండి, వాడు అయిపోయాడు, తీసేస్తున్నాం! 326 00:19:20,285 --> 00:19:21,870 వాడిని తీసేస్తున్నాం!" అనేవాళ్లు. 327 00:19:26,375 --> 00:19:29,169 {\an8}ట్రంప్, ఎన్ఎఫ్ఎల్ మీద వ్యాఖ్యలు చేసినప్పుడు... 328 00:19:29,169 --> 00:19:31,672 {\an8}నేను విస్తుపోయా. అమెరికా అధ్యక్షుడు 329 00:19:31,672 --> 00:19:33,924 {\an8}మాటల దాడికి దిగింది, ప్రధానంగా జాతీయ గీతాలాపనలో 330 00:19:33,924 --> 00:19:36,885 మోకాళ్లపై నిరసన తెలిపిన నల్లజాతి ఆటగాళ్ల పైనే. 331 00:19:37,845 --> 00:19:41,014 వాళ్లంతా అసమానతపై శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. 332 00:19:42,224 --> 00:19:45,519 దేశం పట్ల గౌరవం లేకపోవడంగా దీన్ని నేను భావిస్తున్నా. 333 00:19:45,519 --> 00:19:49,523 వాళ్లు మరో దేశం చూసుకోవాలి, అక్కడ మెరుగ్గా ఉంటుందేమో చూడమనండి. 334 00:19:49,523 --> 00:19:52,985 ట్రంప్ చెప్పే విషయాలకి, నాకు కోపం వచ్చింది. 335 00:19:54,027 --> 00:19:57,406 {\an8}కానీ ఇక్కడ మమ్మల్ని, ట్రంప్ జట్టులా చూస్తున్నారు. 336 00:19:59,199 --> 00:20:04,872 మా సంస్థలో అగ్రస్థానంలో ఉన్న ముగ్గురూ ట్రంప్‌కి దగ్గరవాళ్లు. 337 00:20:06,039 --> 00:20:08,750 తనతో క్రాఫ్ట్‌కి అనుబంధం ఉంది, వాళ్లిద్దరూ స్నేహితులు. 338 00:20:08,750 --> 00:20:10,836 టామ్ లాకర్‌లో ట్రంప్‌ టోపీ ఉంది. 339 00:20:11,503 --> 00:20:13,422 బిల్ ఆయనకి లేఖ రాశాడు. 340 00:20:14,798 --> 00:20:17,885 జట్టులో కీలకమైనవాళ్లు 341 00:20:17,885 --> 00:20:21,388 జట్టుకి సంబంధం లేకపోయినా, ఆయనకి మద్దతు ఇస్తున్నప్పుడు, 342 00:20:21,388 --> 00:20:25,142 అది జట్టు మొత్తానికీ వర్తిస్తుంది, దాన్ని తప్పక భరించాలి. 343 00:20:25,851 --> 00:20:31,857 దాంతో, ట్రంప్ మమ్మల్ని ముండాకొడుకులు అన్నప్పుడు, లాకర్ రూమ్‌ మొత్తం ఒకటే చర్చ, 344 00:20:31,857 --> 00:20:34,860 "జాతీయగీతం పాడేటప్పుడు ఏంచేయాలి?" అని. 345 00:20:36,195 --> 00:20:38,488 పేట్రియాట్స్ వర్సెస్ హూస్టన్ టెక్సన్స్ సెప్టెంబర్ 24, 2017 346 00:20:38,488 --> 00:20:42,159 జాతీయ గీతం పాడబోతున్నారు కాబట్టి, గ్రౌండ్ దగ్గరకు వెళ్దాం ఇప్పుడు. 347 00:20:45,746 --> 00:20:48,290 నిలబడండి! 348 00:20:53,128 --> 00:20:55,130 ఇది అవమానకరం. వాళ్లు నిలబడి ఉండాలి. 349 00:20:55,130 --> 00:20:56,924 అధ్యక్షుడు చెప్పిందే బాగుంది. 350 00:20:56,924 --> 00:20:59,551 ఎవరైనా దేశం కోసం నిలబడకపోతే, వాళ్లని తీసేయాలి. 351 00:21:00,177 --> 00:21:03,597 బెలిచిక్, క్రాఫ్ట్ ఈ విషయంలో ఏదొకటి చేయాలి. వాళ్లని తీసేయాలి. 352 00:21:05,724 --> 00:21:09,853 ప్రభావం వెంటనే కనిపించింది. ఆ వ్యతిరేకత మీరు విని ఉంటారు. 353 00:21:11,104 --> 00:21:14,608 మా పేట్రియాట్స్ అభిమానుల్లో ఎక్కువమంది అభిప్రాయం ఇదే అయితే, 354 00:21:14,608 --> 00:21:16,485 అప్పుడు వాళ్లకి మేము ఆటగాళ్లుగా తెలియనట్టే. 355 00:21:17,444 --> 00:21:21,823 వాళ్లు వచ్చి కేరింతలు కొట్టేది, వాళ్లు కొనుక్కున్న జెర్సీలకే... 356 00:21:22,658 --> 00:21:24,159 ...వాళ్లు మా ఆటని గుర్తించరు. 357 00:21:24,952 --> 00:21:30,040 అందరూ అలసిపోయి ఉన్నారు. ఇది చాలా బాధగా ఉంది. 358 00:21:30,582 --> 00:21:34,670 ఇదే ప్రత్యేక సమయం, ప్రత్యేక చోటు, కానీ మనం చేయాల్సిందంతా చేస్తున్నాం. 359 00:21:34,670 --> 00:21:38,632 మనదారిలో మనం వెళ్తున్నాం. ఆ దారిలోనే మనం గెలుస్తాం. 360 00:21:39,216 --> 00:21:42,886 అయితే, పేట్రియాట్స్‌కి ఆడేటప్పుడు, ఒక విషయం ఏంటంటే, 361 00:21:42,886 --> 00:21:46,849 ప్రతి ఏటా మాకు చాంపియన్‌షిప్ గెలిచే అవకాశం ఉన్నట్టే అనుకుంటాం. 362 00:21:46,849 --> 00:21:52,688 అలా అనిపించిప్పుడు, ప్రతి ఒక్కరూ తమకి తాము చెప్పుకుంటారు, 363 00:21:52,688 --> 00:21:54,565 "చాంపియన్‌షిప్ గెలిచేలా ప్రయత్నించాలి" అని. 364 00:21:54,565 --> 00:21:56,733 అర్ధమైందా? "మన పని మనం చేయాలి" అన్నట్టు. 365 00:21:58,652 --> 00:22:01,363 చూడండి మిత్రులారా, ఇక్కడ మన పని మనం చేస్తే చాలు. 366 00:22:01,363 --> 00:22:03,615 మనవాడిని కవర్ చేయండి. 367 00:22:03,615 --> 00:22:06,034 మీకు అప్పగించిన పని చేయండి. 368 00:22:06,743 --> 00:22:08,287 "మీ పని మీరు చేయండి." 369 00:22:09,079 --> 00:22:12,082 {\an8}ఇంకోవైపు, ఇందులో ఆసక్తికర అంశం కూడా ఉంది. 370 00:22:12,082 --> 00:22:15,919 {\an8}అమెరికా స్వయంగా రాసుకున్న ఆలోచన ఇది. 371 00:22:15,919 --> 00:22:18,130 {\an8}మేము చేయాల్సింది పని మాత్రమే అని. 372 00:22:18,130 --> 00:22:20,716 అయితే అది కూడా దుర్భర పరిస్థితుల్లో చేయాలి. 373 00:22:21,466 --> 00:22:23,385 బ్రాడీ మధ్యలో ఉన్నాడు. 374 00:22:23,385 --> 00:22:26,722 బర్క్‌హెడ్ దూసుకెళ్లాడు, బంతితో పోరాడుతున్నాడు. 375 00:22:26,722 --> 00:22:28,182 టచ్‌డౌన్. 376 00:22:29,099 --> 00:22:30,601 మరో విజయంతో ముందుకెళ్లారు. 377 00:22:30,601 --> 00:22:34,146 వరుసగా 14 విజయాలు. 378 00:22:35,105 --> 00:22:37,441 వారు గెలుస్తూనే ఉన్నారు. 379 00:22:38,442 --> 00:22:41,445 బ్రాడీ. గ్రాంక్ దాన్ని అందుకుని రెండో డౌన్ ముగించాడు. 380 00:22:41,445 --> 00:22:45,199 అతి గొప్ప క్వార్టర్‌బ్యాక్‌ని చూస్తున్నారు. ఈ లీగ్ ఎంవీపీ తను. 381 00:22:45,949 --> 00:22:48,076 వాళ్లు ఇదంతా నవ్వు లేకుండా చేస్తున్నారు. 382 00:22:48,660 --> 00:22:51,580 పెద్దగా సలహాలు తీసుకోకుండానే చేస్తున్నారు ఇది. 383 00:22:51,580 --> 00:22:53,707 ఇక ప్రతి వారం, గేమ్స్ కీలకంగా మారుతుంటాయి. 384 00:22:54,166 --> 00:22:55,584 ప్రతి వారం ఎక్కువ ఆడబోతున్నాం. 385 00:22:55,584 --> 00:22:58,128 అవి కీలకం అవుతున్నాయి, మనం వాటిని అలాగే ఎదుర్కోవాలి. 386 00:22:58,128 --> 00:22:59,963 చాలా పద్ధతిగా చేస్తున్నారు. 387 00:23:00,839 --> 00:23:02,257 మౌనంగా కానిచ్చేస్తున్నారు. 388 00:23:03,550 --> 00:23:04,635 సంతోషం లేకుండా. 389 00:23:05,552 --> 00:23:07,471 బ్రాడీ, ఎండ్ జోన్ వైపు చూస్తున్నాడు. 390 00:23:07,471 --> 00:23:10,015 బంతి విసిరాడు టచ్‌డౌన్ దిశగా! 391 00:23:10,015 --> 00:23:12,017 న్యూ ఇంగ్లండ్ తేలికైన టచ్‌డౌన్. 392 00:23:12,017 --> 00:23:14,895 సీజన్‌లో తుది ఘట్టానికి వెళ్తోంది పేట్రియాట్స్. 393 00:23:14,895 --> 00:23:19,483 వాళ్లు ప్లే ఆఫ్స్‌కి వెళ్లినా కూడా, ఎలాంటి పార్టీ చేసుకోలేదు. 394 00:23:19,483 --> 00:23:20,943 పార్టీ లేదు. 395 00:23:20,943 --> 00:23:24,738 హేయ్, నీ పని చెయ్, సరేనా? అక్కడికి వెళ్లి స్కోర్ చేయండి, సరేనా? 396 00:23:24,738 --> 00:23:26,990 బ్రాడీ విసిరాడు. 397 00:23:26,990 --> 00:23:28,784 టచ్‌డౌన్, అమెండోలా. 398 00:23:28,784 --> 00:23:30,160 బెలిచిక్‌లో సంబరం. 399 00:23:30,160 --> 00:23:31,870 బెలిచిక్ వింతగా ఉన్నాడు. 400 00:23:32,788 --> 00:23:34,289 ఆట ముగిసింది 401 00:23:34,289 --> 00:23:37,251 పేట్రియాట్స్, సూపర్ బౌల్‌కి వెళ్తున్నారు. 402 00:23:37,251 --> 00:23:39,878 వేరే ఏదైనా జరుగుతుందని అనుకున్నారా? 403 00:23:40,379 --> 00:23:44,216 ఈ జట్టు ఎప్పుడూ ఒక ఆలోచనకి 404 00:23:44,216 --> 00:23:46,760 కట్టుబడి ఉంటుంది 405 00:23:46,760 --> 00:23:49,847 మేము గెలిస్తే... 406 00:23:50,556 --> 00:23:51,849 ...ఇదంతా విలువైంది అవుతుంది. 407 00:23:52,683 --> 00:23:53,684 యూఎస్ బ్యాంక్ స్టేడియం 408 00:23:53,684 --> 00:23:56,645 మిత్రులారా, చలిని పక్కనబెట్టి 409 00:23:56,645 --> 00:24:00,065 మినియాపొలీస్‌లోని యూఎస్ బ్యాంక్ స్టేడియంకి రండి. 410 00:24:00,732 --> 00:24:05,988 {\an8}సూపర్ బౌల్ 52లో ఫిలడెల్ఫియా, న్యూ ఇంగ్లండ్‌ని ఢీకొంటోంది. 411 00:24:07,656 --> 00:24:10,742 ఇక ఇప్పుడు, ఏఎఫ్‌సీ చాంపియన్లు, 412 00:24:10,742 --> 00:24:13,328 న్యూ ఇంగ్లండ్ పేట్రియాట్స్. 413 00:24:15,914 --> 00:24:18,292 ఈ గేమ్‌లోకి వెళ్లే ముందు పేట్రియాట్స్, 414 00:24:18,292 --> 00:24:21,587 ఐదు సార్లు సూపర్ బౌల్ విజేతగా నిలిచింది, 7 సార్లు సూపర్ బౌల్‌కి చేరుకుంది. 415 00:24:21,587 --> 00:24:23,964 ఇద్దరు పోటీదారులు, బిల్ బెలిచిక్, కోచ్, 416 00:24:23,964 --> 00:24:26,008 ఇంకా క్వార్టర్‌బ్యాక్, టామ్ బ్రాడీ. 417 00:24:26,842 --> 00:24:28,594 బిల్ బెలిచిక్, టామ్ బ్రాడీ 418 00:24:28,594 --> 00:24:30,971 ఎన్ఎఫ్ఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జంట. 419 00:24:30,971 --> 00:24:34,808 అయితే ప్రస్తుతం పేట్రియాట్స్ సంస్థలో ఏదో రచ్చ నడుస్తోంది, 420 00:24:34,808 --> 00:24:37,019 అది అనుకుంటున్నంత చిన్న విషయం కాదు అనిపిస్తోంది. 421 00:24:39,271 --> 00:24:42,191 గేమ్‌లోకి వెళ్తుండగా అనిపించింది, 422 00:24:42,191 --> 00:24:44,401 "ఇది ఇప్పుడు ముగిసేది కాదులే" అని. 423 00:24:44,401 --> 00:24:46,945 ఆ ఏడాది గురించి మిత్రులు మీకు చెప్పొచ్చు, 424 00:24:46,945 --> 00:24:49,781 "నేను ఆటని మునుపటిలా ప్రేమించకపోయి ఉండొచ్చు." 425 00:24:49,781 --> 00:24:54,453 కానీ టైటిల్ గెలవాలన్న మా లక్ష్యంలో మాత్రం మార్పు లేదు. 426 00:24:54,453 --> 00:24:56,872 మా అంతిమ లక్ష్యం ఎప్పటిలాగే ఉంది. 427 00:24:56,872 --> 00:24:59,249 చాంపియన్‌షిప్ గెలవాలి, సూపర్ బౌల్ నెగ్గాలి అనేదే అది. 428 00:24:59,249 --> 00:25:02,628 జీవితంలో అరుదుగా వచ్చే అవకాశం ఇదని నాకు చెప్పారు! 429 00:25:02,628 --> 00:25:04,421 కానీ మనం మళ్లీ వచ్చాం! 430 00:25:05,130 --> 00:25:07,257 ఆటలోకి వెళ్లే ముందు, 431 00:25:07,257 --> 00:25:11,386 సాధారణంగా చేసే పని, జట్టుకి ఊపు ఇవ్వడం లాంటిది చేయడం గుర్తుంది. 432 00:25:11,386 --> 00:25:13,639 మనదే ఆధిపత్యం, మిత్రులారా, రేపు అనేది లేదు. 433 00:25:13,639 --> 00:25:15,265 త్రీ అనగానే డామినేట్ అనాలి. ఒన్, టూ, త్రీ! 434 00:25:15,265 --> 00:25:16,517 డామినేట్! 435 00:25:16,517 --> 00:25:19,186 మాకు తెలిసిందల్లా, ఎప్పటికీ నిలిచే 436 00:25:19,186 --> 00:25:22,814 న్యూ ఇంగ్లండ్ మిస్టరీల్లో ఒకదానికి మేము సాక్షులుగా నిలవబోతున్నాం అని. 437 00:25:23,649 --> 00:25:27,819 సైడ్‌లైన్‌పై మాల్కం బట్లర్ చాలా ఉద్వేగంగా ఉన్నాడు. 438 00:25:29,112 --> 00:25:30,906 నేను చాలా ఉద్వేగంగా ఉన్నా. 439 00:25:30,906 --> 00:25:33,825 నన్ను సరిగా గౌరవిస్తున్నట్టు నాకు అనిపించలేదు. 440 00:25:33,825 --> 00:25:37,955 ఎందుకంటే గేమ్ మొదలయ్యే వరకూ నాకు తెలియదు 441 00:25:37,955 --> 00:25:39,915 {\an8}నేను ఆడటం లేదన్న విషయం. 442 00:25:39,915 --> 00:25:42,167 బిల్ బెలిచిక్‌తో మాట్లాడే అవకాశం చిక్కింది, 443 00:25:42,167 --> 00:25:45,003 ఆయన్ని అడిగా, ఎందుకు మాల్కం బట్లర్ జట్టులో లేడు, 444 00:25:45,003 --> 00:25:47,548 ఎందుకు తను డిఫెన్స్‌లో ఆడటం లేదని, దానికి ఆయన 445 00:25:47,548 --> 00:25:51,260 "మా గెలుపుకి అసవరమైన నిర్ణయాలు తీసుకున్నా" అని చెప్పాడు. 446 00:25:52,010 --> 00:25:53,929 ఆటకి ముందు ఎవరైనా నన్ను 447 00:25:53,929 --> 00:25:55,389 "మాల్కం బట్లర్ అడటం లేదు. 448 00:25:55,389 --> 00:25:57,724 అది గెలిపిస్తుందా?" అనడిగితే, కాదనే చెప్తా. 449 00:25:58,725 --> 00:26:01,645 ఆ ఏడాది, 98 శాతం సమయం, 450 00:26:01,645 --> 00:26:04,857 మా జట్టు డిఫెన్స్‌లో మాల్కం ఆడాడు. 451 00:26:05,941 --> 00:26:09,945 మూడేళ్ల క్రితం, సూపర్ బౌల్ 49లో, 452 00:26:09,945 --> 00:26:12,072 తనే గేమ్‌ గెలిపించాడు. 453 00:26:13,282 --> 00:26:15,659 అడ్డుకున్నాడు! మాల్కం బట్లర్ అడ్డుకున్నాడు! 454 00:26:17,619 --> 00:26:20,789 మాల్కం బట్లర్, అద్భుతం! 455 00:26:22,124 --> 00:26:24,751 ఆటగాళ్లుగా, మేమంత బలంగా కోరుకున్నాం 456 00:26:24,751 --> 00:26:27,796 మాల్కం మైదానంలో ఉండాలని, కానీ నిర్ణయం తీసుకునేది మేము కాదు. 457 00:26:28,589 --> 00:26:32,801 ఆఖరికి, మేము కోచ్‌నే నమ్మాం. 458 00:26:34,928 --> 00:26:38,599 రెండు వారాల హైప్ తర్వాత, ప్రఖ్యాత జాన్ మ్యాడెన్ చెప్పినట్టు, 459 00:26:38,599 --> 00:26:40,601 "గేమ్ కీలక మలుపు తిరగబోతోంది." 460 00:26:42,603 --> 00:26:44,438 బ్రాడీ ఈ డ్రైవ్ ప్రారంభించాడు. 461 00:26:48,192 --> 00:26:49,651 ఎడమ వైపు, ఖాళీగా ఉంది. 462 00:26:49,651 --> 00:26:54,239 జేమ్స్ వైట్, పది గజాల పరిధిలోకి వచ్చాడు, బంతిని ఎండ్ జోన్‌లోకి తీసుకెళ్లాడు. 463 00:26:54,239 --> 00:26:55,490 టచ్‌డౌన్, పేట్రియాట్స్. 464 00:26:57,117 --> 00:26:58,952 అలాగే దూసుకెళ్లండి! 465 00:27:00,954 --> 00:27:02,414 మేము స్కోర్ చేసినప్పుడు, 466 00:27:02,414 --> 00:27:05,125 {\an8}బిల్, "వాళ్లు మనల్ని ఆపగలరని అనుకోవడం లేదు" అనడం గుర్తుంది. 467 00:27:05,792 --> 00:27:08,170 అయితే, సమయం గడిచేకొద్దీ, 468 00:27:08,170 --> 00:27:11,590 ఆట పూర్తిగా అదుపు తప్పింది. 469 00:27:12,174 --> 00:27:14,009 వాళ్లు వెనక్కి విసరబోతున్నారు, 470 00:27:14,009 --> 00:27:17,930 ట్రే బర్టన్ బంతి విసిరాడు... పట్టుకున్నాడు, టచ్‌డౌన్! 471 00:27:17,930 --> 00:27:19,723 వావ్! 472 00:27:19,723 --> 00:27:21,099 ఫిలడెల్ఫియా దూసుకెళ్తోంది... 473 00:27:21,725 --> 00:27:23,310 బ్రాడీ. పట్టుకున్నాడు! 474 00:27:23,310 --> 00:27:25,562 గ్రంకోవ్‌స్కీ టచ్‌డౌన్ చేశాడు. 475 00:27:26,188 --> 00:27:27,981 మనం మళ్లీ పుంజుకున్నాం. 476 00:27:28,774 --> 00:27:31,985 ఇరు జట్లూ భారీగా స్కోర్లు చేస్తున్నాయి, 477 00:27:31,985 --> 00:27:33,695 చూస్తుంటే, "బాబోయ్, 478 00:27:33,695 --> 00:27:36,406 చివరికి తీవ్ర ఉత్కంఠకి తెరతీయబోతుందా?" అన్నట్టు ఉంది. 479 00:27:39,493 --> 00:27:41,954 పాస్ 23 గజాల లైన్ వరకూ వెళ్లింది. 480 00:27:41,954 --> 00:27:46,124 అఘోలర్ చొచ్చుకుపోయి ఫస్ట్ డౌన్ అందుకున్నాడు. 481 00:27:46,124 --> 00:27:48,877 న్యూ ఇంగ్లండ్ పేట్రియాట్స్‌లో ఈ డిఫెన్స్, 482 00:27:48,877 --> 00:27:51,547 నిజంగా దూకుడుగా వెళ్లడంలో తడబడుతోంది. 483 00:27:51,547 --> 00:27:55,801 బట్లర్ ఇంకా బెంచ్ మీదే ఉన్నాడు. ఇవాళ డిఫెన్స్‌లో ఆడేలా లేడు తను. 484 00:27:57,052 --> 00:27:59,972 ఆటలో మార్పు గమనిస్తుంటే, 485 00:27:59,972 --> 00:28:02,432 వెంటనే తను దిగాలి అనిపించింది. 486 00:28:02,432 --> 00:28:05,853 నష్టం ఆపడానికి తనని దించుతారా? 487 00:28:08,146 --> 00:28:09,565 బ్లంట్ చేతికి బంతి. 488 00:28:09,565 --> 00:28:12,234 ఫోల్స్, సైడ్‌లైన్ వైపు విసిరాడు. పట్టుకున్నాడు, ఫస్ట్ డౌన్. 489 00:28:12,818 --> 00:28:14,236 చ్ఛ! 490 00:28:14,236 --> 00:28:16,864 డిఫెన్స్‌లోనే వాళ్లు దెబ్బతింటున్నారు. 491 00:28:16,864 --> 00:28:18,949 అయినా బిల్, తనని దించడం లేదు. 492 00:28:19,950 --> 00:28:22,119 ఆటతీరు ఆధారంగా ఆడించడం లేదు. 493 00:28:22,119 --> 00:28:24,580 {\an8}మొత్తం సీజన్‌లో ప్రతి స్నాప్ తనే ఆడాడు. 494 00:28:24,580 --> 00:28:26,957 {\an8}"అసలు ఏం జరుగుతోంది ఇక్కడ?" అన్నట్టుంది. 495 00:28:27,457 --> 00:28:30,043 మాల్కం బట్లర్‌ని ఎందుకు సైడ్‌లైన్స్‌పై కూర్చోబెట్టారు? 496 00:28:30,043 --> 00:28:35,966 ఆ రోజు ఏం జరిగిందో ఇప్పటికీ నాకు తెలియదు. 497 00:28:35,966 --> 00:28:38,427 నేను కోచ్‌లతో, మిగతా అటగాళ్లతో మాట్లాడాను, 498 00:28:38,427 --> 00:28:42,389 ఏం జరిగింది, ఎందుకలా జరిగిందో ఎవరికీ తెలియదు. 499 00:28:42,973 --> 00:28:47,811 జనం ఇప్పటికీ నన్ను అడుగుతుంటారు, "నువ్వెందుకు ఆ సూపర్ బౌల్‌లో ఆడలేదు? అని." 500 00:28:47,811 --> 00:28:50,022 "నాకు తెలియదు, అదంతా కోచ్ నిర్ణయం" అని చెప్తుంటా. 501 00:28:51,857 --> 00:28:54,651 కానీ ఏం జరిగిందో, నిజంగా నాకు తెలియదు. 502 00:28:54,651 --> 00:28:56,486 నిజంగా తెలియదు. 503 00:28:57,863 --> 00:29:02,409 ఎలా అనిపించింది అంటే, నా జట్టు దెబ్బతినడం చూడమన్నట్టు ఉంది 504 00:29:02,409 --> 00:29:05,329 నేను వాళ్లకి సాయపడగలను అనిపిస్తోంది... 505 00:29:06,580 --> 00:29:08,582 ...అయినా, ఒక్కసారీ దించలేదు. 506 00:29:10,083 --> 00:29:11,710 ఒక్కసారి కూడా. 507 00:29:16,298 --> 00:29:19,551 ఎండ్ జోన్ వరకు పాస్... 508 00:29:19,551 --> 00:29:21,720 యస్, టచ్‌డౌన్! 509 00:29:22,763 --> 00:29:26,892 తమ డిఫెన్స్ బద్దలవడం బిల్ బెలిచిక్ చూస్తున్నాడు. 510 00:29:32,731 --> 00:29:34,691 2017 సీజన్‌లో, 511 00:29:34,691 --> 00:29:37,444 స్నాప్స్ 98 శాతం వరకు మాల్కం బట్లర్ ఆడాడు. 512 00:29:37,444 --> 00:29:41,990 సూపర్ బౌల్ ఒక్క దాంట్లోనే తనని ఎందుకు పక్కనబెట్టారు? 513 00:29:43,200 --> 00:29:44,910 మనం దాని గురించి మాట్లాడుకున్నాం. 514 00:29:47,579 --> 00:29:49,456 నేను దాని గురించి అడగలేదు. 515 00:29:56,713 --> 00:29:58,590 నాకు తెలిసింది ఏంటంటే 516 00:29:58,590 --> 00:30:02,594 వ్యక్తిగతంగా ఏదో గొడవ ఉంది 517 00:30:02,594 --> 00:30:07,474 బిల్, మాల్కం మద్య, అది ఫుట్‌బాల్‌కి సంబంధించి కాదు. 518 00:30:08,725 --> 00:30:13,063 మిత్రులారా, మీ పని మీరు చేయండి. ఆటలో మీ భాగం ఏంటో చదువుకోండి. 519 00:30:13,063 --> 00:30:14,523 కేవలం మీ పని మీరు చేయండి! 520 00:30:15,399 --> 00:30:19,987 బిల్ తీసుకునే ప్రతి నిర్ణయం, జట్టు అవసరాలకి అనుగుణంగా 521 00:30:19,987 --> 00:30:24,950 జట్టే తొలి ప్రాధాన్యంగా తీసుకుంటాడని భావోద్వేగాల్ని పక్కన పెడతాడని 522 00:30:24,950 --> 00:30:26,869 నేను ఎప్పుడూ భావిస్తుంటా. 523 00:30:27,703 --> 00:30:31,707 కానీ మాల్కం విషయంలో, దానికి భిన్నంగా నిర్ణయం తీసుకున్నాడు. 524 00:30:32,457 --> 00:30:36,420 ఒక్క పాయింట్‌తో తేలిపోతుంది. సమయం మించి పోతోంది. 525 00:30:36,420 --> 00:30:39,590 ఈ గేమ్‌ గెలిచేందుకు ఫిలడెల్ఫియా ఈగల్స్ ప్రయత్నిస్తున్నారు. 526 00:30:47,848 --> 00:30:51,268 మధ్యలో అందుకుని, ఎండ్ జోన్‌కి తీసుకెళ్లాడు! 527 00:30:51,268 --> 00:30:52,728 అయిపోయింది! 528 00:30:53,812 --> 00:30:56,607 న్యూ ఇంగ్లండ్ పేట్రియాట్స్‌ని ఈగల్స్ ఓడించారు! 529 00:30:57,524 --> 00:30:59,151 కాగితపు ముక్కలు ఎగురుతున్నాయి, 530 00:30:59,151 --> 00:31:01,612 ఎటు చూసినా ఆకుపచ్చ వర్ణమే. 531 00:31:10,245 --> 00:31:14,791 ఆ రాత్రి మైదానం నుంచి నడిచి వెళ్తుంటే అంతా అయోమయంగా ఉంది. 532 00:31:15,542 --> 00:31:18,337 ఆ గేమ్ మా జీవితాలకి చాలా ముఖ్యమైన విషయం, 533 00:31:18,337 --> 00:31:20,214 అయినా మైదానంలో మాల్కం లేడు. 534 00:31:20,964 --> 00:31:23,634 ఇప్పటికీ ఆ విషయం నాకు కోపం తెప్పిస్తుంది. 535 00:31:25,636 --> 00:31:28,597 అంటే, మేము కష్టపడి ఆడాం. 536 00:31:29,723 --> 00:31:32,267 టామ్ 500 గజాల కంటే ఎక్కువ విసిరి ఉంటాడు, 537 00:31:32,267 --> 00:31:35,729 సూపర్‌ బౌల్‌లో ఎప్పుడూ జరగని విషయం అది. 538 00:31:37,189 --> 00:31:40,400 {\an8}మేము అక్కడ నిజంగా, మా శరీరాల్ని మా జీవితాల్ని రిస్కులో పెట్టాం, 539 00:31:40,400 --> 00:31:44,196 {\an8}మా స్నేహితులు, మా కుటుంబాలు, మా సహచరులకి 540 00:31:44,196 --> 00:31:46,698 ఎలాంటి వివరణా ఇవ్వలేదు, అది... 541 00:31:47,491 --> 00:31:50,494 నిజం చెప్పాలంటే, మమ్మల్ని మోసం చేశారు అనిపించింది, అలా... 542 00:31:50,494 --> 00:31:52,246 అలా చెప్పడానికి నేను సిగ్గు పడటం లేదు. 543 00:31:54,706 --> 00:31:56,792 ఫిలడెల్ఫియా ఈగల్స్ చేతిలో ఓడినప్పుడు, 544 00:31:56,792 --> 00:31:59,628 "హమ్మయ్య" అనిపించింది. గేమ్ అయ్యాక స్నానాల దగ్గర 545 00:31:59,628 --> 00:32:03,215 {\an8}చాలా మంది అనుకున్నారు, "మిత్రులారా, ఈ సీజన్ ముగియడం ఆనందంగా ఉంది. 546 00:32:03,215 --> 00:32:04,925 {\an8}ముందు ఇక్కడి నుంచి పోవాలి" అని. 547 00:32:06,760 --> 00:32:08,470 సూపర్ బౌల్ ముగిశాక... 548 00:32:09,388 --> 00:32:11,932 ...అంత నిస్తేజమైన, నిరుత్సాహమైన 549 00:32:11,932 --> 00:32:13,892 లాకర్ రూమ్‌ని... 550 00:32:14,977 --> 00:32:16,228 ...నేనెప్పుడూ చూడలేదు. 551 00:32:18,522 --> 00:32:22,776 బెలిచిక్ జట్టుకి దూరమయ్యాడని స్పష్టంగా కనిపిస్తోంది, 552 00:32:22,776 --> 00:32:26,822 అసంతృప్తిగా ఉన్న పలువురు ఆటగాళ్లు 553 00:32:26,822 --> 00:32:28,866 ఆఫ్ సీజన్‌లో బయటకి వెళ్లిపోతున్నారు... 554 00:32:30,284 --> 00:32:32,119 ...మాల్కం బట్లర్‌తో సహా. 555 00:32:33,453 --> 00:32:37,916 {\an8}తను ఒక గుడ్‌బై పోస్ట్ పెట్టాడు, దానిపై... 556 00:32:37,916 --> 00:32:41,545 {\an8}బ్రాడీ చాలా ప్రేమతో కామెంట్ రాశాడు. 557 00:32:41,545 --> 00:32:43,714 {\an8}లవ్ యూ మాల్కం. నువ్వు అద్భుతమైన ఆటగాడివి సహచరుడివి, స్నేహితుడివి. ఎల్లప్పుడూ! 558 00:32:43,714 --> 00:32:46,508 మాల్కంని ఇబ్బంది పెట్టిన తీరుపై 559 00:32:46,508 --> 00:32:49,261 అందులో ఏం జరిగి ఉన్నా, తను చాలా సానుభూతి వ్యక్తం చేశాడు. 560 00:32:50,554 --> 00:32:53,932 తర్వాత డ్యానీ అమెండోలా, బ్రాడీకి అత్యంత సన్నిహితుడుగా పేరున్నవాడు 561 00:32:53,932 --> 00:32:56,852 తను కూడా జట్టుని వీడాడు. 562 00:32:57,936 --> 00:33:00,939 {\an8}అదే సమయంలో, డ్యానీ అమెండోలా పెట్టిన ఓ పోస్ట్‌పై 563 00:33:00,939 --> 00:33:04,776 {\an8}గ్రాంక్ ఇలా కామెంట్ రాశాడు, 564 00:33:04,776 --> 00:33:06,778 "స్వేచ్ఛగా, సంతోషంగా ఉండు." 565 00:33:06,778 --> 00:33:09,072 ఏదో తిరుగుబాటు జరుగుతున్నట్టు అనిపించింది! 566 00:33:09,072 --> 00:33:10,991 టామ్‌బ్రాడీ: బాగా చెప్పావు గ్రాంక్!!! 567 00:33:10,991 --> 00:33:14,411 ఇదంతా కోచ్‌ బెలిచిక్‌ మీద అసంతృప్తి వెళ్లగక్కడంలో భాగమే, 568 00:33:14,411 --> 00:33:18,123 ఎందుకంటే పేట్రియాట్స్ జట్టులో ఎలా ఉంటుందో 569 00:33:18,123 --> 00:33:22,503 ఆ ఏడాదంతా అలాంటి వాతావరణం కనిపించలేదు. 570 00:33:22,503 --> 00:33:23,587 గో! 571 00:33:25,589 --> 00:33:28,800 అంతా వింతగా ఉంది. పుట్‌బాల్ అంటే మామూలుగానే ఒత్తిడి. 572 00:33:28,800 --> 00:33:33,764 మేము చేయాల్సిందంతా చేస్తూ కూడా అదనంగా ఇంకా ఒత్తిడి చేయడం ఎందుకు? 573 00:33:33,764 --> 00:33:37,017 ఇదంతా పనికిమాలిన వ్యవహారం. 574 00:33:38,227 --> 00:33:41,730 {\an8}సూపర్ బౌల్ 52 ముగిసిన 3 రోజుల తర్వాత 575 00:33:41,730 --> 00:33:43,607 {\an8}హాయ్, మిత్రులారా. 576 00:33:47,027 --> 00:33:50,197 ఎలా అనిపిస్తోంది ఇప్పుడు? 577 00:33:51,281 --> 00:33:53,075 నాకు... 578 00:33:55,827 --> 00:33:57,412 ఇది క్లిష్టమైన ప్రశ్నే. 579 00:34:01,166 --> 00:34:02,543 ఇది నిబద్ధతతో కూడినది. 580 00:34:03,961 --> 00:34:08,382 పద్దెనిమిది ఏళ్లుగా నా శరీరం, నా శక్తి అంతా దీనికి ధారపోశాను. 581 00:34:09,675 --> 00:34:11,717 మీరు అడగొచ్చు "దేనికి ఇదంతా చేస్తున్నారు?" అని. 582 00:34:12,344 --> 00:34:15,304 "దేనికి ఇదంతా చేస్తున్నాం? ఎవరికోసం ఇదంతా చేస్తున్నాం? 583 00:34:15,304 --> 00:34:16,514 ఎందుకు ఇది చేస్తున్నాం?" 584 00:34:17,181 --> 00:34:19,393 ఈ ప్రశ్నలకి సమాధానాలు ఉండాలి, 585 00:34:19,393 --> 00:34:21,645 అవి చాలా నమ్మకం కలిగించాలి. 586 00:34:22,688 --> 00:34:25,983 నమ్మకం కోల్పోతే, వేరే ఏదైనా చేసుకోవాలి. 587 00:34:31,071 --> 00:34:32,447 ఆ సమయంలో... 588 00:34:33,614 --> 00:34:35,534 ...అవి టామీ మాటలు అనిపించలేదు. 589 00:34:37,034 --> 00:34:42,498 ఏళ్ల తరబడి, మాతో కలిసి ఉండేందుకు తను ఎన్నో త్యాగాలు చేశాడు. 590 00:34:43,708 --> 00:34:47,713 అతనికి దక్కాల్సింది దక్కిందని అనుకోవడం లేదు. 591 00:34:49,339 --> 00:34:53,385 మేము ముగింపుకి చేరామని అర్ధమైంది, 592 00:34:53,385 --> 00:34:58,432 దాన్ని ఆపడానికి నాకు చేతనైనదంతా చేస్తున్నాను. 593 00:36:23,809 --> 00:36:25,811 సబ్‌టైటిల్స్: బడుగు రవి కుమార్