1 00:00:13,972 --> 00:00:16,099 జనాల అభిప్రాయం ఏంటో తెలుసుకోవడానికి, 2 00:00:16,183 --> 00:00:17,893 ఇప్పుడు మేము శాంటియాగో పార్క్ దగ్గరికి వచ్చాం. 3 00:00:17,976 --> 00:00:22,856 ఎట్టకేలకు వివస్త్ర హంతకుడిని పోలీసులు పట్టుకోవడంపై వారి ప్రతిస్పందన ఏంటో తెలుసుకుందాం. 4 00:00:22,940 --> 00:00:26,944 చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది, దేవుని దయ వల్ల, పొద్దుపోయింది కదా బయటే ఉన్నామని ఆందోళన పడక్కర్లేదు. 5 00:00:27,027 --> 00:00:29,905 మా ప్రార్థనలు ఫలించి, అతను పట్టుబడ్డాడు. 6 00:00:29,988 --> 00:00:32,323 - నాకేం అనిపిస్తోందంటే… - ఇప్పటి దాకా అతడిని ఎందుకు పట్టుకోలేకపోయారో 7 00:00:32,406 --> 00:00:33,742 నాకు తెలుసుకోవాలనుంది. 8 00:00:33,825 --> 00:00:37,371 ఎట్టకేలకు వివస్త్ర హంతకుడు పట్టుబడ్డాడు కాబట్టి, ఒక పోలీసు ఆఫీసరుగా 9 00:00:37,454 --> 00:00:39,706 మీకు రెట్టింపు ఆనందంగా ఉండి ఉంటుంది. 10 00:00:41,166 --> 00:00:45,546 బయట తిరిగే పౌరులందరూ ఇక నుండి నిశ్చింతగా తిరగగలరు. 11 00:00:45,629 --> 00:00:47,589 ఇదంతా మీడియా మాయాజాలం, సర్. 12 00:00:47,673 --> 00:00:49,842 ఈ దేశంలో ఉండే అసలైన సమస్యల నుండి 13 00:00:49,925 --> 00:00:51,802 మనల్ని పక్కదోవ పట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 14 00:00:51,885 --> 00:00:54,137 బాధితుల తరఫున పోలీసులకి అభినందనలు చెప్తున్నా. 15 00:00:54,221 --> 00:00:57,015 మనం దీన్నే కొనసాగించామంటే, చాలా మంది నేరస్థులకు శిక్ష తప్పక పడుతుంది. 16 00:00:57,099 --> 00:01:00,102 రాత్రి బిక్కుబిక్కుమంటూ జాగ్రత్తగా ఉండాల్సిన పని లేదు కాబట్టి, చాలా హాయిగా ఉంది. 17 00:01:00,185 --> 00:01:02,437 అతని కేసుపై విచారణ అసలు జరగలేదు కదా. 18 00:01:02,521 --> 00:01:05,691 వివస్త్ర హంతకుడు ఆత్మహత్మ చేసుకున్నాడు కదా. 19 00:01:06,358 --> 00:01:07,693 హా, అది నాకు తెలుసు, కానీ… 20 00:01:09,152 --> 00:01:11,029 నిజంగా అతనే వివస్త్ర హంతకుడా? 21 00:01:11,113 --> 00:01:13,365 ఇప్పటికైనా మంచే జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది శుభవార్తే. 22 00:01:13,448 --> 00:01:15,242 ఈ ప్రాంతంలో మేమందరం ఇక నిశ్చింతగా ఉండవచ్చు. 23 00:01:15,325 --> 00:01:18,453 అమ్మా, తమౌలిపాస్ లో ఉన్న నీపై ఇక్కడి నుండి నా ప్రేమనంతా గుమ్మరిస్తున్నాను! 24 00:01:18,537 --> 00:01:21,123 అతని ఆత్మశాంతి కోసం మనం ప్రార్థించాలి. 25 00:01:21,206 --> 00:01:24,918 నాకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు, చెడు వారి దరిదాపుల్లోకి వెళ్లడం కూడా నాకు ఇష్టం లేదు. 26 00:01:25,002 --> 00:01:26,545 ఇప్పటికైనా పోలీసులు సరైన పని చేశారు. 27 00:01:26,628 --> 00:01:28,005 ఒకవేళ అతను హంతకుడు కాకపోయి ఉంటే? 28 00:01:30,799 --> 00:01:34,261 మేడమ్, మీరేం చేస్తున్నారు? ప్రేక్షకులని బెదరగొట్టాలని చూస్తున్నారా? 29 00:01:34,344 --> 00:01:36,597 దీన్ని మేము స్ఫూర్తిదాయకమైన కార్యక్రమంగా చూపాలనుకుంటున్నాం. 30 00:01:36,680 --> 00:01:37,931 - వెళ్దాం పద. - క్షమించండి. 31 00:01:42,352 --> 00:01:45,522 - ఏంటి? - మాట్లాడేటప్పుడు ఇంకాస్త నవ్వి ఉంటే బాగుండేది. 32 00:01:45,606 --> 00:01:46,857 ఏమంటావు? ఇంకా నమ్మకంగా చెప్పుండాల్సిందేమో? 33 00:01:47,357 --> 00:01:48,358 నా అభిప్రాయం సరైనదని మీకూ తెలుసు. 34 00:01:50,611 --> 00:01:54,031 ఇక్కడే నిలబడి ఏం చేస్తున్నారు? మన రౌండ్స్ వేద్దాం పదండి. 35 00:03:20,576 --> 00:03:22,995 కంగారుపడకండి. మిమ్మల్ని నేను బయటపడేస్తాను. 36 00:03:27,708 --> 00:03:28,917 మరియా! 37 00:04:50,499 --> 00:04:53,168 వివస్త్ర హంతకుడు పట్టుబడ్డాడు! 38 00:04:56,505 --> 00:04:58,674 వాళ్లందరినీ ఎందుకు ఇలా చంపావు, టీటో? 39 00:04:59,258 --> 00:05:01,552 బాగా చూడు, ఎందుకంటే నీ పాపాలు పండాయిరా, దరిద్రుడా! 40 00:05:02,636 --> 00:05:03,804 ఏం చేశావో చూడరా, చచ్చినోడా! 41 00:05:05,222 --> 00:05:06,431 భయపడిపోయా. 42 00:05:06,932 --> 00:05:08,100 ఏమైంది? 43 00:05:08,183 --> 00:05:10,185 ఏమీ లేదు, నా బుర్ర పని చేయట్లేదు అసలు. 44 00:05:10,269 --> 00:05:11,979 నిన్న రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. 45 00:05:12,062 --> 00:05:13,063 హలో? 46 00:05:13,856 --> 00:05:17,067 మిస్టర్ కాబోస్. ఎన్నాళ్లకెన్నాళ్లకు కాల్ చేశారు! 47 00:05:17,150 --> 00:05:21,113 లేదు, మీరేమీ పని మధ్యలో కాల్ చేయలేదు. హా, ఇక్కడే ఉన్నాడు. ఫోన్ అతనికే ఇస్తున్నాను. 48 00:05:21,196 --> 00:05:22,197 రోజంతా కులాసాగా గడపండి. 49 00:05:24,783 --> 00:05:27,494 గుడ్ మార్నింగ్, మిస్టర్ కాబోస్? ఎలా ఉన్నారు? 50 00:05:28,954 --> 00:05:30,747 నేను బాగానే ఉన్నాను. థ్యాంక్యూ. 51 00:05:33,041 --> 00:05:35,878 ఇవాళ రాత్రి ఎనిమిదింటికి. తప్పకుండా. 52 00:05:36,628 --> 00:05:39,631 థ్యాంక్యూ. బై. 53 00:05:40,674 --> 00:05:41,717 ఏంటి సంగతి? 54 00:05:42,217 --> 00:05:44,553 - మనల్ని డిన్నర్ కి ఆహ్వానించాడు. - డిన్నర్ కా? 55 00:05:44,636 --> 00:05:46,889 అవును, నువ్వు, నేను, అతను, అతని భార్య. అంతే. 56 00:05:46,972 --> 00:05:48,056 ఆయన ఇంట్లోనే. 57 00:05:48,891 --> 00:05:50,100 అది నీకు ఓకేనా… 58 00:05:50,184 --> 00:05:52,144 - డబుల్ ఓకే, బంగారం. - వద్దు, వద్దు. 59 00:05:52,227 --> 00:05:53,937 - అభినందనలు! - వద్దు, వద్దు, కాస్త ఆగు. 60 00:05:54,021 --> 00:05:54,980 - భలే ఆనందంగా ఉంది! - వద్దు! 61 00:05:55,063 --> 00:05:56,273 ఇప్పుడే సంబరాలు వద్దు. 62 00:05:56,356 --> 00:05:58,192 మనకి ఇంకా ఏమీ తెలీదు కదా. నా ఉద్దేశం… 63 00:05:58,859 --> 00:06:00,694 ఆకపూల్కోలో పని చేయనని చెప్పాక, నాకేం అనిపించిందంటే… 64 00:06:00,777 --> 00:06:03,155 బంగారం, భలేవాడివే. అది నీదే. అందులో ఏ సందేహమూ లేదు. 65 00:06:03,238 --> 00:06:05,199 - మనకి ఇంకా తెలీదు కదా. - ఏంటి నీది? నాకు అర్థం కాలేదు. 66 00:06:05,282 --> 00:06:08,785 నాన్నకి ఆఫీసులో, తన కష్టానికి తగ్గ పదోన్నతి లభిస్తోంది. 67 00:06:08,869 --> 00:06:09,870 మనకి తెలీదు ఇంకా. 68 00:06:09,953 --> 00:06:11,622 ఈ సందర్భంగా ఆయన్ని హత్తుకోవాల్సిందే. 69 00:06:11,705 --> 00:06:12,664 అభినందనలు, నాన్నా! 70 00:06:12,748 --> 00:06:14,082 - హా, బంగారం. - అదీ… 71 00:06:14,166 --> 00:06:15,751 నీకు తప్పకుండా వస్తుంది. 72 00:06:16,627 --> 00:06:17,794 హేయ్, అమ్మా. 73 00:06:17,878 --> 00:06:21,340 అంటే, నువ్వు ఇక పని చేయాల్సిన అవసరం లేదా? 74 00:06:24,801 --> 00:06:28,055 లేదు, బంగారం. నేను ఉద్యోగం చేస్తూనే ఉంటా. 75 00:06:31,141 --> 00:06:33,310 - ఆలెక్స్. ఆలెక్స్! - ఆలెక్స్. ఆలెక్స్! 76 00:06:35,896 --> 00:06:37,731 కూర్చో. 77 00:06:40,150 --> 00:06:42,110 - అయితే నీకు ఓకే కదా? - అవును, బంగారం. 78 00:06:42,694 --> 00:06:44,196 మనం ఎనిమిదింటికల్లా వాళ్ల ఇంటికి వెళ్లిపోవాలి. 79 00:06:44,821 --> 00:06:46,949 - ఆలస్యం కాకూడదు. - హా, అలాగే. 80 00:06:50,619 --> 00:06:55,040 హలో. నా పేరు మరియా దె లా తొర్రె. ఎలా ఉన్నారు? 81 00:06:57,459 --> 00:06:59,920 సరే, త్వరలోనే డిన్నర్ కి వెళ్దాంలే. 82 00:07:10,806 --> 00:07:13,517 యాంగలెస్, టిఫిన్ సిద్ధంగా ఉంది! 83 00:07:16,228 --> 00:07:18,814 - ఆఫీసులో పని ఎలా ఉంది? - జీతం శుక్రవారం ఇస్తారు. 84 00:07:20,107 --> 00:07:21,775 నేను అడిగింది దాని గురించి కాదు. 85 00:07:23,652 --> 00:07:24,945 నీ స్నేహితులు ఎలా ఉన్నారు? 86 00:07:26,655 --> 00:07:30,242 వాళ్లు నా స్నేహితులు కాదు, బామ్మా. నా సహోద్యోగులు, అంతే. 87 00:07:33,620 --> 00:07:35,122 వాళ్లలో మగవాళ్లు ఎవరైనా ఉన్నారా? 88 00:07:35,664 --> 00:07:40,919 - అంటే, పోలీసులలో ఎవరైనా ఉన్నారా? - హా. చాలా మంది ఉన్నారు. ఎక్కువ వాళ్లే ఉన్నారు. 89 00:07:42,087 --> 00:07:47,009 నీకు ఎవరైనా నచ్చారా? లవరుగా కానీ, ఇంకే విధంగానైనా కానీ. 90 00:07:47,092 --> 00:07:48,760 నీకు తోడుగా ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా అని. 91 00:07:49,511 --> 00:07:52,639 ఇప్పుడు నేనేం ఒంటరిదాన్నా ఏంటి! నువ్వు ఉన్నావుగా. 92 00:07:53,765 --> 00:07:57,144 అవును, కానీ నీ పక్కన ఒక ముసలి బామ్మ ఉండటానికి, 93 00:07:57,227 --> 00:07:59,730 ఒక మగాడు ఉండటానికి, తేడా ఉంది కదా. 94 00:08:00,230 --> 00:08:01,523 వాళ్లుంటే నీకు బాగుంటుంది. 95 00:08:10,157 --> 00:08:11,450 ఇక నేను బయలుదేరుతాను. 96 00:08:12,409 --> 00:08:13,410 యాంగలెస్? 97 00:08:15,829 --> 00:08:16,830 ఏంటి? 98 00:08:17,456 --> 00:08:19,166 నీకు లవర్ ఉంటే బాగుండు అనిపిస్తోందా? 99 00:08:23,462 --> 00:08:24,713 హా. 100 00:08:25,923 --> 00:08:27,174 చాలా. 101 00:08:44,983 --> 00:08:46,860 ఎప్పుడు లేచావు? 102 00:08:48,487 --> 00:08:49,863 చాలా సేపైంది. 103 00:08:52,574 --> 00:08:53,909 ఇదంతా నువ్వు శుభ్రం చేశావా? 104 00:08:53,992 --> 00:08:56,495 వాలంటీనా, అంతా చిందరవందరగా ఉంటే, ఎవరికీ నచ్చదు. 105 00:08:56,578 --> 00:09:01,458 అవును, కానీ చిందరవందరగా ఉండేది నా ఇల్లు కదా. కాబట్టి, తర్వాతి సారి నన్ను అడుగు, సరేనా? 106 00:09:01,542 --> 00:09:04,002 మా నాన్న నన్ను క్షమించేశాక, నీ ఇంట్లో ఉండనులే. 107 00:09:05,379 --> 00:09:08,507 మీ నాన్న మర్చిపోయి క్షమించేసే వ్యక్తిలా అనిపించట్లేదు. 108 00:09:08,590 --> 00:09:12,761 - ఆయన క్షమిస్తాడు. ఈసారి కాస్త ఎక్కువ చేశాడు, అంతే. - ఆయన నీ చెంప చెళ్లుమనిపించాడమ్మా. 109 00:09:12,845 --> 00:09:14,721 నేను అబద్ధం చెప్పినందుకే కదా. 110 00:09:15,347 --> 00:09:19,351 మా కుటుంబం సాంప్రదాయబద్ధమైనదే కావచ్చు. కానీ మా మధ్య చాలా సాన్నిహిత్యం ఉంది. 111 00:09:20,686 --> 00:09:22,187 ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది. 112 00:09:35,033 --> 00:09:37,494 సగం అద్దె ఇచ్చి, శుభ్రం చేయడం మానుకున్నావనుకో, 113 00:09:37,578 --> 00:09:39,538 నువ్వు ఎంత కాలం కావాలంటే అంత కాలం ఇక్కడ ఉండవచ్చు, సరేనా? 114 00:09:52,676 --> 00:09:53,677 అతను ఇంకా తాగిన మత్తులోనే ఉన్నాడా? 115 00:09:53,760 --> 00:09:55,387 అతడిని చూస్తేనే, నాకు హ్యాంగ్ ఓవర్ వచ్చేస్తోంది. 116 00:09:56,597 --> 00:09:58,056 ప్లాన్లలో మార్పు జరిగింది. 117 00:09:58,140 --> 00:10:02,936 ఇక నుండి మీరు, కొంత సేపు స్టేషనులో, కొంత సేపు పార్కులలో పని చేయాల్సి ఉంటుంది. 118 00:10:03,604 --> 00:10:05,522 అదిగాక, ఇంకా ఒకట్రెండు ప్రదేశాలలో అన్నమాట. 119 00:10:05,606 --> 00:10:06,607 ఎందుకు? 120 00:10:07,232 --> 00:10:08,734 - అడిగింది ఎవరు? - నేను. 121 00:10:08,817 --> 00:10:10,110 చీఫ్ ఆదేశాలు అవి. 122 00:10:10,194 --> 00:10:11,904 మేము శవాన్ని కనుగొన్నామనా? 123 00:10:11,987 --> 00:10:13,989 - శవాన్ని మీరు కనుగొన్నారంటే? - అవును, మేమే కదా శవాన్ని కనుగొంది. 124 00:10:14,072 --> 00:10:17,075 వివస్త్ర హంతకుడిని పట్టేసుకున్నారు కదా, ఇక మేము పార్కులో ఉంటే ఏమైంది? 125 00:10:17,159 --> 00:10:19,328 ఓరి నాయనోయ్. ముందేమో, మాకు తుపాకులు ఇవ్వలేదు, 126 00:10:19,411 --> 00:10:22,080 ఇప్పుడు మాకు శవం కనిపించిందని పార్కులో కూడా మేము పని చేయకూడదా? 127 00:10:22,164 --> 00:10:25,542 ఇదంతా కాకుండా, మమ్మల్ని ఒక చిన్న గదిలో బందించేస్తే సరిపోతుంది కదా? 128 00:10:25,626 --> 00:10:26,627 నిన్ను ఒకదాన్ని బందిస్తే చాలు. 129 00:10:27,628 --> 00:10:29,379 హేయ్, ఇది మంచి విషయమే. 130 00:10:29,463 --> 00:10:32,174 అసలైన పని స్టేషనులోనే ఉంటుంది. 131 00:10:33,008 --> 00:10:34,009 అంతే కదా, కెప్టెన్? 132 00:10:34,092 --> 00:10:36,720 ఉదయం జరిగే మన ఈ సమావేశాలు ఎలా జరుగుతాయో మీకు చెప్తాను. 133 00:10:37,721 --> 00:10:40,349 నేను ఆదేశాలిస్తాను, మీరు పాటించాలి. 134 00:10:41,058 --> 00:10:42,434 ముచ్చట్లు పెట్టకూడదు. 135 00:10:43,310 --> 00:10:46,897 సూచనలు ఇవ్వవద్దు, మరీ ముఖ్యంగా తొక్కలో చర్చలు పెట్టవద్దు. 136 00:10:51,318 --> 00:10:53,654 ప్రతీ బృందానికి ఒక వార్డును కేటాయించడం జరిగింది. 137 00:10:54,488 --> 00:10:56,156 ఆ జాబితా బయట ఉంది, దాన్ని చూసుకోండి. 138 00:11:03,747 --> 00:11:04,915 ఇది మరీ అంత దారుణమైన విషయమేమీ కాదు. 139 00:11:07,000 --> 00:11:08,126 మనకి డ్యూటీ ఇక్కడే అప్పగించారు. 140 00:11:08,627 --> 00:11:10,337 మనం చేయాల్సిన పనేంటి అసలు? 141 00:11:10,420 --> 00:11:12,381 ఎవరికైనా సాయం చేయాలేమో. 142 00:11:12,464 --> 00:11:14,383 ముందు వెళ్లినోడిదే రాజ్యం మరి. 143 00:11:18,262 --> 00:11:21,515 దీని గురించి మనం ఒక లక్ష సార్లైనా మాట్లాడుకొని ఉంటాం. 144 00:11:23,517 --> 00:11:24,518 అవును. 145 00:11:27,771 --> 00:11:28,772 హా. 146 00:11:29,356 --> 00:11:30,941 హా, వింటూనే ఉన్నా. 147 00:11:37,239 --> 00:11:40,450 సరే. ఇంతకీ దీనికి, మీ అమ్మకి సంబంధం ఏంటి? 148 00:11:42,035 --> 00:11:43,245 అసలు నా కూతురుకి, దీనికి సంబంధం ఏంటి? 149 00:11:46,206 --> 00:11:47,207 చెప్పేది జాగ్రత్తగా విను. 150 00:11:47,833 --> 00:11:51,545 నా కూతురి విషయంలో మీ అమ్మ జోక్యాన్ని నేను సహిస్తాను అనుకుంటున్నావేమో… 151 00:11:52,337 --> 00:11:53,338 ఒక్క నిమిషం ఆగు. 152 00:11:54,840 --> 00:11:56,633 నువ్వు అటుఇటు తిరగడం ఆపుతావా? 153 00:11:57,134 --> 00:11:58,135 భలే చికాకుగా ఉంది. 154 00:11:58,635 --> 00:11:59,636 అలాగే. 155 00:12:03,640 --> 00:12:04,683 ఏంటి? 156 00:12:07,186 --> 00:12:09,229 ఇవాళ ఇక్కడ సాయం అందించే పని మాకు అప్పగించారు. 157 00:12:10,898 --> 00:12:11,899 మీకేమైనా సాయం కావాలా? 158 00:12:13,025 --> 00:12:14,568 అవును అంటే, ఇక్కడి నుండి వెళ్లిపోతావా? 159 00:12:15,777 --> 00:12:19,781 నేను వేరే ఎక్కడికైనా వెళ్లిపోవడమే మీకు కావాలంటే, తప్పకుండా వెళ్లిపోతాను. 160 00:12:22,367 --> 00:12:23,577 సరే. 161 00:12:24,870 --> 00:12:26,288 మళ్లీ కాల్ చేస్తా, బంగారం. 162 00:12:27,873 --> 00:12:29,041 - డియాజ్. - ఏంటి సంగతి? 163 00:12:29,124 --> 00:12:31,793 భవిష్యత్తులో ఏ కేసుల విషయంలో ఏమైనా మీకు సాయం కావాలంటే, ఒక సహోద్యోగిగా నేను సాయపడతాను. 164 00:12:31,877 --> 00:12:32,878 - అలాగే. - సరే. 165 00:12:32,961 --> 00:12:35,881 నేను పోలీసు మాన్యువల్ ని చాలా సార్లు చదివాను. 166 00:12:35,964 --> 00:12:39,051 నాకు విచారణలోని మెళకువలు తెలుసు, ముష్టి యుద్ధంలో పిస్తాని నేను, 167 00:12:39,134 --> 00:12:41,887 తుపాకులతో ఆడుకుంటా, మరీ ముఖ్యంగా ఒత్తిడికి తలొగ్గే మనిషిని కాదు నేను. 168 00:12:42,387 --> 00:12:43,889 సరే. 169 00:12:44,598 --> 00:12:46,975 నిజానికి, నువ్వు ఒక విషయంలో నాకు సాయం చేయాలి. 170 00:12:51,271 --> 00:12:52,648 ఇది కదా అసలైన పనంటే, హా? 171 00:12:58,362 --> 00:13:00,197 నాకు కూడా ఒకటి తీసుకురండి, సరేనా? 172 00:13:00,280 --> 00:13:02,783 చూశావా? పోలీసుల్లో అమ్మాయిలు ఉంటే మనకి ఎంత ఉపయోగమో. 173 00:13:05,494 --> 00:13:06,662 - ఇక్కడ. - థ్యాంక్యూ. 174 00:13:06,745 --> 00:13:07,996 మరేం పర్వాలేదు. 175 00:13:08,830 --> 00:13:10,791 ఇంకేమైనా కావాలా? 176 00:13:11,375 --> 00:13:14,253 ఉదాహరణకు, ఏదైనా… పోలీసులు చేసే పని ఉందా? 177 00:13:17,005 --> 00:13:18,173 కాగితాల పని ఉందిగా. 178 00:13:18,257 --> 00:13:19,925 నిజమే. 179 00:13:20,008 --> 00:13:22,553 నిజానికి, మీరు చేయగల పని ఒకటి ఉంది. 180 00:13:22,636 --> 00:13:24,012 భోజనానికి స్పాన్సర్ నువ్వే కదా? 181 00:13:24,096 --> 00:13:26,682 ఈ వారంలో ఇప్పటికే రెండు సార్లు పెట్టా. ఇప్పుడు నువ్వే పెట్టాలి. 182 00:13:30,018 --> 00:13:32,437 - ఏంటివన్నీ? - వాంగ్మూలాలు. 183 00:13:32,521 --> 00:13:35,607 ఇవి 1964వి. ఇవి 1965వి. 184 00:13:35,691 --> 00:13:37,693 వీటిని భ్రద్రపరచాలంటే, ముందు క్రమపద్ధతిలో అమర్చాలి. 185 00:13:37,776 --> 00:13:39,570 ఆల్ఫబెటికల్ ఆర్డరులో, ఇంకా తేదీల ఆధారంగా అమర్చండి. 186 00:13:41,488 --> 00:13:43,615 - ఇక పని మొదలుపెడదాం రండి. - ఇక్కడ కాదు! 187 00:13:43,699 --> 00:13:45,450 - హేయ్… - పద్ధతిగా సర్దాకే, లోపలికి తీసుకెళ్లాలి. 188 00:13:45,534 --> 00:13:48,120 తను చెప్పింది విన్నారుగా. అంతా పద్ధతిగా సర్దాక ఇక్కడికి తీసుకురండి. 189 00:13:48,203 --> 00:13:50,289 అయితే, మీరు మాకు ఆఫీసు ఏదీ ఇవ్వరా? 190 00:13:52,833 --> 00:13:53,834 లేదు. 191 00:13:54,751 --> 00:13:57,880 స్టేషన్ చీఫ్ తో మీ కెప్టెన్ ముందే మాట్లాడి ఉండాల్సింది. 192 00:13:57,963 --> 00:13:59,631 అయితే, మేమెక్కడ పని చేయాలి? 193 00:13:59,715 --> 00:14:03,468 బాత్రూములో పని చేస్తారో, ఇంకెక్కడైనా పని చేస్తారో నాకు అనవసరం. 194 00:14:03,969 --> 00:14:05,512 పని మాత్రం ఇవాళే అయిపోవాలి. 195 00:14:06,847 --> 00:14:08,765 - మనం వెళ్లి భోజనం చేద్దామా? - హా, పద. 196 00:14:32,873 --> 00:14:34,583 ఇక్కడ ఏం పని నీకు? 197 00:14:35,334 --> 00:14:38,712 ఏమీ లేదు. మీకేమైనా సాయం కావాలేమో అని వచ్చా. 198 00:14:39,213 --> 00:14:42,132 లేదు. నాకు సాయమేమీ అక్కర్లేదు, చాలా చాలా థ్యాంక్స్. ఇక బయలుదేరు. 199 00:14:44,593 --> 00:14:47,930 సారీ, నేను చెప్పింది అర్థం కాలేదా? నాతో రా. 200 00:14:50,724 --> 00:14:52,017 - డిటెక్టివ్. - చెప్పు. 201 00:14:52,100 --> 00:14:56,855 హతురాలి శవంపై మీకు ఒక యువకుని వేలి ముద్రలు లభించాయని నాకు తెలుసు. 202 00:14:56,939 --> 00:14:57,940 అవును. 203 00:14:58,482 --> 00:15:01,276 ఇతర శవాలపై కూడా మీకు అతని వేలిముద్రలు దొరికాయా? 204 00:15:01,360 --> 00:15:04,613 అది గోప్యమైన సమాచారం. నీకు చెప్పాల్సిన పని లేదు. 205 00:15:04,696 --> 00:15:09,034 అది నేను అర్థం చేసుకోగలను, కానీ కేసును ఎలాగూ మూసేశారు కాబట్టి, 206 00:15:09,117 --> 00:15:13,038 వివస్త్ర హంతకుడు కూడా చనిపోయాడు కాబట్టి, ఏమైనా నేర్చుకుందామని అనుకుంటున్నాను. 207 00:15:14,873 --> 00:15:16,416 నీకు నేర్చుకోవాలని ఉందా? 208 00:15:18,126 --> 00:15:19,127 తనని చూడు. 209 00:15:20,963 --> 00:15:23,131 ఈరోజుల్లో జనాలు ఎంత దారుణాలకి పాల్పడుతున్నారో చూడు. 210 00:15:26,176 --> 00:15:28,220 కాబట్టి, నువ్వు మీ ఇంటి బయటకు రాకపోవడమే మేలు. 211 00:15:33,058 --> 00:15:34,643 - పద. - ఏంటి అవి? 212 00:15:34,726 --> 00:15:37,479 చూశావా? మనం బానిసలం, పోలీసులం కాదు. 213 00:15:37,563 --> 00:15:39,106 రేపు మనకి చీపుర్లు ఇచ్చి, అంతా ఊడ్చమంటారు. 214 00:15:39,189 --> 00:15:42,150 వాళ్లకి మట్టిలో, అలాగే శవం మీద కూడా వేలిముద్రలు దొరికాయి. 215 00:15:42,234 --> 00:15:45,112 అదీగాక, అతడిని పార్కులోనే అరెస్ట్ చేశారు. 216 00:15:45,195 --> 00:15:46,446 అతను పని చేసే చోటే. 217 00:15:46,530 --> 00:15:50,826 ఎవరైనా పని చేసే చోటే, చంపినవారిని వదిలేస్తారా? 218 00:15:50,909 --> 00:15:52,619 నేనైతే అసలు ఎవరినీ చంపను. 219 00:15:53,704 --> 00:15:57,457 అది మాకు తెలుసు, యాంగలెస్. కానీ విషయం ఏంటంటే, అది ఖచ్చితంగా తెలుసుకోవాలని మీకు లేదా? 220 00:15:58,917 --> 00:16:00,586 మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? 221 00:16:01,545 --> 00:16:03,422 మీ కోసం అంతా వెతికి వస్తున్నా. 222 00:16:03,505 --> 00:16:07,009 జనాలని కాపాడుతున్నాం, కెప్టెన్, అది మీకు తెలియట్లేదా? 223 00:16:07,092 --> 00:16:09,052 మాకు ఈ పనే అప్పగించారు. 224 00:16:09,136 --> 00:16:10,971 పని చేయడానికి మాకు లోపల ఏ గదీ ఖాళీ లేదట. 225 00:16:11,722 --> 00:16:12,723 అయ్య బాబోయ్. 226 00:16:15,767 --> 00:16:18,687 అతను మందుకు దూరంగా ఉంటే, కాస్తోకూస్తో అందంగానే ఉంటాడు. 227 00:16:22,733 --> 00:16:25,944 మీ గురించి నాకు తెలీదు కానీ, టీటో ఫ్లోర్సే వివస్త్ర హంతకుడని 228 00:16:26,028 --> 00:16:27,696 నేనైతే నిర్ధారించుకోవాలనుకుంటున్నాను. 229 00:16:27,779 --> 00:16:28,864 నిజంగానా? 230 00:16:28,947 --> 00:16:29,948 అవును మరి. 231 00:16:30,449 --> 00:16:33,994 నువ్వు క్రైమ్ నవల్స్ చాలా చదివావు కదా. నీకు నేరాలకు సంబంధించి కొంచెమైనా తెలిసి ఉంటుంది కదా, మరియా? 232 00:16:34,870 --> 00:16:37,956 మనం తెగించి ఏదోక పని చేసి, ఏమవుతుందో చూద్దాం. 233 00:16:38,040 --> 00:16:39,458 నీ ప్లాన్ ఏంటి? 234 00:16:39,541 --> 00:16:42,753 యాంగలెస్, నువ్వు వేలిముద్రల శాఖలో పని చేశావు కదా. 235 00:16:42,836 --> 00:16:44,505 మార్గరీటో వేలిముద్రలు వేరే శవాల మీద కూడా దొరికాయో లేదో 236 00:16:44,588 --> 00:16:46,215 ఒకసారి చెక్ చేసి చెప్పగలవా? 237 00:16:46,298 --> 00:16:48,008 అది ప్రోటోకాల్ కి విరుద్ధం. 238 00:16:48,091 --> 00:16:49,301 ఒక్క నిమిషం ఆగండి. 239 00:16:50,093 --> 00:16:52,971 మా అన్నయ్య చెప్పిన దాన్ని మనం వినాలనుకుంటా. 240 00:16:53,055 --> 00:16:55,057 అతనితో వేగడం కష్టమని నాకు తెలుసు. 241 00:16:55,724 --> 00:16:59,353 కానీ అతను మంచి పోలీసు, ఆధారాలు లేకుండా అతను ఎవరినీ అరెస్ట్ చేయడని నాకు అనిపిస్తోంది. 242 00:16:59,436 --> 00:17:01,563 నువ్వు చాలా అమాయకురాలివి, గబీనా. 243 00:17:02,648 --> 00:17:05,567 నువ్వు వేలిముద్రలను చెక్ చేయవచ్చు. దాని గురించి ఎవరికీ తెలియాల్సిన పని లేదు. 244 00:17:05,651 --> 00:17:06,902 నాకు తెలుస్తుంది కదా. 245 00:17:06,984 --> 00:17:08,237 నీకు తెలుస్తుందని నాకు తెలుసు. 246 00:17:08,319 --> 00:17:10,155 నేను చెప్పేది అక్కడ ఉండే వెధవలకు తెలియాల్సిన పని లేదని. 247 00:17:10,239 --> 00:17:13,407 మనం ఏమైనా కనిపెడితే, నేరుగా వెళ్లి గెరార్డోకి చెప్దాం. 248 00:17:13,492 --> 00:17:14,492 అదే ప్రోటోకాల్. 249 00:17:15,452 --> 00:17:18,872 వేలిముద్రలు దొరకనంత మాత్రాన, అతను హంతకుడు కాదని అర్థం కాదు కదా. 250 00:17:18,955 --> 00:17:21,834 జెస్సికా మచాదో చెప్పిన దాని ప్రకారం, తన చెల్లి ఏ రాత్రి అయితే హత్యకు గురైందో, 251 00:17:21,916 --> 00:17:23,877 ఆ రాత్రి తను ఒక తెల్లని పైకప్పు గల కారు ఎక్కి వెళ్లింది. 252 00:17:23,961 --> 00:17:27,589 మార్గరీటోని అరెస్ట్ చేసిన రోజు, అతని తల్లి ప్రస్తావన వచ్చింది. 253 00:17:29,091 --> 00:17:30,259 మనం ఆమెతో మాట్లాడవచ్చు. 254 00:17:36,682 --> 00:17:39,560 తను ఏ బట్టలు వేసుకుంది? అవునులే, ఎంతైనా తను వేశ్య కదా. 255 00:17:39,643 --> 00:17:42,855 డిటెక్టివ్ శాంచేజ్ కో, రామిరెజ్ కో కుటుంబ సభ్యుల చిరునామా కావాలట, 256 00:17:42,938 --> 00:17:44,731 వస్తువులని పంపడానికి, ఇంకా… 257 00:17:45,274 --> 00:17:46,650 నేను ఫోన్ మాట్లాడుతున్నాను. 258 00:17:50,487 --> 00:17:51,905 నేను సమస్యలో ఉన్నాను. 259 00:17:53,740 --> 00:17:54,741 దగ్గరికి రా. 260 00:17:55,576 --> 00:17:58,787 నేను వస్తువులని ఇవాళే ఇవ్వకపోతే, నా ఉద్యోగం పోతుంది. 261 00:17:59,413 --> 00:18:00,831 ఇంకా దారుణమైన విషయం ఏంటో చెప్పనా? 262 00:18:00,914 --> 00:18:02,916 దానికి కారణం ఒక ఉద్యోగి అని, ఆఫీసు సమయంలో ఆమె 263 00:18:03,000 --> 00:18:06,170 ఆఫీసు పనిని వదిలేసి ఫోనులో సొల్లు కొడుతూ ఉండిందని నేను చెప్పాల్సి రావడం. 264 00:18:07,421 --> 00:18:09,131 నేనేమీ సొల్లు కొట్టట్లేదు. 265 00:18:11,758 --> 00:18:13,594 నువ్వు బిల్ గేట్స్ తో మాట్లాడుతున్నా నాకు అనవసరం. 266 00:18:13,677 --> 00:18:15,429 బయట పోలీసు కారు ఉంది, దానికి చిరునామా కావాలి. 267 00:18:15,512 --> 00:18:16,680 మరి ఏం చేద్దామంటావు? 268 00:18:21,185 --> 00:18:22,102 నీకేం కావాలి? 269 00:18:23,061 --> 00:18:24,771 మార్గరీటో ఫ్లోర్స్ ఇంటి చిరునామా. 270 00:18:25,522 --> 00:18:26,773 అతను ఎవరు? 271 00:18:28,567 --> 00:18:29,693 నీ పేరేంటి? 272 00:18:29,776 --> 00:18:31,278 - చేలా. - చేలా. 273 00:18:33,197 --> 00:18:35,032 మార్గరీటో ఫ్లోర్స్, వివస్త్ర హంతకుడు. 274 00:18:39,786 --> 00:18:42,080 సరే. నీకు కావాల్సింది ఇస్తా. 275 00:18:42,581 --> 00:18:43,582 థ్యాంక్యూ. 276 00:18:46,251 --> 00:18:47,252 కెప్టెన్. 277 00:18:47,961 --> 00:18:50,380 మేము లంచ్ కి బయటకు వెళ్తున్నామని చెప్పడానికి వచ్చా. 278 00:18:50,464 --> 00:18:52,424 సరే, అది నాకు చెప్పాల్సిన పని లేదు. 279 00:18:52,508 --> 00:18:54,092 - వెళ్లండి. - సరే. 280 00:18:55,761 --> 00:18:56,762 దె లా తొర్రె. 281 00:18:57,721 --> 00:18:59,515 మరియా అని పిలవండి చాలు. 282 00:19:00,390 --> 00:19:02,935 "దె లా తొర్రె" అని విన్న ప్రతిసారి, నా భర్త పక్కనే ఉన్నాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. 283 00:19:03,018 --> 00:19:04,811 అయితే, 284 00:19:05,312 --> 00:19:06,313 మరియా. 285 00:19:07,940 --> 00:19:08,941 చూడు. 286 00:19:10,067 --> 00:19:13,111 మీరు ఇక్కడ ఉండటం వాళ్లకి ఇష్టం లేదన్నట్టు మీకు అనిపిస్తూ ఉండవచ్చు. 287 00:19:13,695 --> 00:19:16,073 అనిపించడం కాదు, అదే నిజం. 288 00:19:16,657 --> 00:19:17,699 అవును. 289 00:19:18,575 --> 00:19:22,955 విషయం ఏంటంటే… వాళ్లింకా పాతకాలపు మనుషుల్లా ప్రవర్తిస్తున్నారు. 290 00:19:23,997 --> 00:19:26,333 అకాడమీలో నేను చూసిన అద్భుతాలని వాళ్లు చూడలేదు కదా. 291 00:19:27,167 --> 00:19:30,295 స్టేషనుకు నేను మొదటిసారి వచ్చినప్పుడు నాకు ఎలా అనిపించిందో ఇంకా గుర్తుంది. 292 00:19:30,379 --> 00:19:33,799 అప్పుడు నాకు 24 ఏళ్లు, యమ జోష్ గా… 293 00:19:33,882 --> 00:19:36,385 - సర్. - ఏంటి? 294 00:19:36,468 --> 00:19:39,513 లంచ్ కి వెళ్లడానికి నా సహోద్యోగులు నా కోసం ఎదురు చూస్తున్నారు. 295 00:19:39,596 --> 00:19:42,683 హా, తప్పకుండా. వెళ్లు. వెళ్లు. 296 00:19:42,766 --> 00:19:44,226 థ్యాంక్యూ. 297 00:19:48,730 --> 00:19:49,731 వెళ్దాం పదండి. 298 00:19:49,815 --> 00:19:51,441 - నేను రాను. - ఎందుకు? 299 00:19:51,525 --> 00:19:53,819 ఎందుకంటే, నేనెప్పుడు చెత్త పని చేసి, ఇక్కడ ఉండే అర్హత నాకు లేదు అని 300 00:19:53,902 --> 00:19:57,281 నిరూపించుకుంటానా అని నా కుటుంబం కాచుకు కూర్చుంది. వాళ్లకి ఆ అవకాశం నేను ఇవ్వను. 301 00:19:58,198 --> 00:20:00,576 - మనం ఇలా చేసినట్టు ఎవరికి తెలుస్తుంది? - నా అన్నయ్యలకి. 302 00:20:01,702 --> 00:20:02,953 మరి చనిపోయిన వారి సంగతేంటి? 303 00:20:03,620 --> 00:20:05,622 వాళ్ల వల్లే కదా మనం పోలీసులం అయింది? 304 00:20:05,706 --> 00:20:07,040 మరేం పర్వాలేదులే. 305 00:20:07,124 --> 00:20:10,627 మాకు ఆలస్యమైతే, ఎందుకైనా మంచిది నువ్వు ఫైల్స్ పని చేస్తూ ఉండు. సరేనా? 306 00:20:11,295 --> 00:20:12,296 పర్వాలేదని అనుకోకు. 307 00:20:16,842 --> 00:20:17,968 ఏంటి? 308 00:20:22,764 --> 00:20:25,267 ఆమెని భరించడం చాలా కష్టం. 309 00:20:25,350 --> 00:20:27,936 ఆమె భర్త ఖచ్చితంగా చనిపోయి ఉండడు. ఆమెని భరించలేక ఎటైనా పారిపోయి ఉంటాడు. 310 00:20:28,020 --> 00:20:29,521 నువ్వు తనని ఎలా భరించావు? 311 00:20:30,397 --> 00:20:35,444 మా ఇద్దరి మధ్యా ఒక కనెక్షన్ ఏర్పడింది. ఆమె నన్ను నమ్మింది. 312 00:20:35,527 --> 00:20:37,029 అమె నా దగ్గర ఫ్రీగా ఉండేది. హా? 313 00:20:37,863 --> 00:20:40,574 అవును, నువ్వు ఓపిగ్గా ఉండాలి. 314 00:20:40,657 --> 00:20:42,242 ఆమెకి అలవాటవుతుంది. 315 00:20:42,326 --> 00:20:44,411 లేకపోతే, ఈ వారాంతాం నువ్వు నాతో పాటు ఆకపూల్కోకి రా… 316 00:20:44,494 --> 00:20:46,288 - లేదు. - ఆమెని డిన్నరుకి తీసుకెళ్దాం. 317 00:20:46,788 --> 00:20:48,916 నన్ను బాగా పరిచయం చేయ్. నేనేమీ వెధవని కాదు అని… 318 00:20:48,999 --> 00:20:50,792 - నేను ఆకపూల్కోకి రాను. - …నా పనెలా చేయాలో నాకు తెలుసని చెప్పు. 319 00:20:50,876 --> 00:20:52,211 - అలెహాండ్రో, ప్లీజ్. - ఆ అవసరం లేదు. 320 00:20:52,294 --> 00:20:54,922 - అది ఎంత అవసరమో నీకు అర్థం కావట్లేదు. - ఆ అవసరం లేదు. 321 00:20:56,298 --> 00:20:57,549 - అది అవసరమే… - నీకు ముందే చెప్పా కదా, 322 00:20:57,633 --> 00:20:59,092 నేను నా కుటుంబంతో ఉండాలనుకుంటున్నా. 323 00:20:59,176 --> 00:21:03,514 నేను మాటిచ్చా. మాట ఇచ్చాను. దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నా. 324 00:21:03,597 --> 00:21:05,474 అందులో నీకు అర్థం కానిది ఏంటి? 325 00:21:05,557 --> 00:21:09,603 నీ మాట వల్ల మన సంస్థకి భారీ నష్టం జరగవచ్చు. 326 00:21:10,812 --> 00:21:14,483 ఈ ప్రాజెక్ట్ మన నుండి చేజారిపోతుంది. నీ మాటకు ఒక దండం, అలెహాండ్రో. 327 00:21:14,566 --> 00:21:15,984 పిచ్చిపిచ్చిగా మాట్లాడవద్దు. 328 00:21:16,068 --> 00:21:19,780 మిగెల్. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు నీది. 329 00:21:19,863 --> 00:21:22,616 కాబట్టి, ఆకపూల్కోకి నువ్వే వెళ్లాలి. 330 00:21:23,700 --> 00:21:26,578 నువ్వే బాధ్యత తీసుకొని, ఎలా అయితే దీన్ని చూసుకోవాలో, 331 00:21:26,662 --> 00:21:28,622 అలాగే నువ్వు చూసుకోవాలి, మిగెల్. 332 00:21:29,414 --> 00:21:30,415 దయచేసి నా మాట విను. 333 00:21:34,628 --> 00:21:35,629 సరే. 334 00:21:37,256 --> 00:21:38,966 - నేను చూసుకుంటాలే. - మంచిది. 335 00:21:41,426 --> 00:21:43,595 ఈరాత్రి జరగబోయే దానికి అభినందనలు. 336 00:21:44,137 --> 00:21:45,138 నీకు దక్కాల్సినదే అది. 337 00:21:46,223 --> 00:21:47,224 ఓపిక. 338 00:21:48,809 --> 00:21:50,310 వివస్త్ర హంతకుని అరెస్టుతో 339 00:21:50,394 --> 00:21:51,937 నగరమంతా సంబరాలలో మునిగి తేలుతూ ఉన్నా, 340 00:21:52,020 --> 00:21:54,815 అందరూ ఒకసారి పునరాలోచించాల్సిన అవసరముందని అధ్యక్షుల వారి భార్య అందరికీ గుర్తు చేశారు. 341 00:21:54,898 --> 00:21:56,900 బాధితుల ఆత్మ శాంతి కోసం అందరూ ప్రార్థించాలని ఆమె కోరారు. 342 00:21:56,984 --> 00:21:59,611 ప్రత్యేకించి, ఇటీవలే హత్యకు గురైన పావోలా మచాదో గురించి ప్రార్థించాలని కోరారు, 343 00:21:59,695 --> 00:22:02,698 ఆమె ఖననం రేపు ఉదయం పది గంటలకు పాంతియోన్ హర్దీన్ వద్ద జరుగుతుంది. 344 00:22:03,407 --> 00:22:04,867 హేయ్, నేను అది వింటూ ఉన్నా. 345 00:22:05,450 --> 00:22:07,452 క్షమించు, దాని వల్ల మ్యాప్ పై నేను ఏకాగ్రత్త పెట్టలేకపోతున్నా. 346 00:22:07,536 --> 00:22:08,996 ఎటు వెళ్లాలో మనం ఎవరినైనా అడిగితే సరిపోతుంది కదా? 347 00:22:09,079 --> 00:22:10,414 అక్కర్లేదులే. 348 00:22:11,290 --> 00:22:12,583 నాకు దారి తప్పాలని లేదు. 349 00:22:12,666 --> 00:22:13,667 మనమేమీ దారి తప్పిపోలేదు. 350 00:22:13,750 --> 00:22:18,380 ఇక్కడున్న కొన్ని వీధుల పేర్లు, మ్యాపులో కనిపించట్లేదు, అంతే. 351 00:22:18,463 --> 00:22:19,840 అంటే, మనం దారి తప్పామనే అర్థం. 352 00:22:19,923 --> 00:22:22,134 నువ్వు బండిని ఎడమ వైపుకు తిప్పాలనుకుంటా. 353 00:22:22,217 --> 00:22:23,218 అనుకుంటావా? 354 00:22:24,178 --> 00:22:25,721 నేను నడుపుతాను, నువ్వు మ్యాప్ తీసుకుంటావా? 355 00:22:26,221 --> 00:22:27,890 లేదు. నా కారు నీ చేతికి ఇచ్చే ప్రసక్తే లేదు. 356 00:22:27,973 --> 00:22:32,311 అయితే అన్నీ మూసుకొని ఎడమ వైపుకు తిప్పు. తిప్పు. తిప్పమ్మా తిప్పు. 357 00:22:38,233 --> 00:22:39,234 వచ్చేశాం. 358 00:22:45,949 --> 00:22:52,956 హంతకుడు 359 00:23:04,259 --> 00:23:07,429 మిసెస్ నోర్మా హిదాల్గో హారెజ్. మేము పోలీసులం. 360 00:23:08,180 --> 00:23:10,140 దయచేసి వెళ్లిపోండి. 361 00:23:10,224 --> 00:23:13,060 మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం, అంతే. ప్లీజ్. 362 00:23:13,769 --> 00:23:16,688 అలా నా కొడుకు గురించి ఇంకొన్ని అబద్ధాలు చెప్పాలనుకుంటున్నారా? 363 00:23:17,356 --> 00:23:21,527 లేదు, మేము నిజం తెలుసుకోవాలనుకుంటున్నాం, అంతే. మేడమ్! 364 00:23:21,610 --> 00:23:22,945 ఛ! 365 00:23:24,738 --> 00:23:29,493 మిసెస్ నోర్మా. ఈ మహిళలని చంపింది మీ అబ్బాయే అని మేము అనుకోవట్లేదు. 366 00:23:31,703 --> 00:23:35,123 నా కొడుకు హంతకుడు కాదు, మిస్. వాడు చాలా మంచి వాడు. 367 00:23:35,624 --> 00:23:37,709 అయితే, దాన్ని నిరూపించడంలో మీరు మాకు సాయం చేయవచ్చు కదా. 368 00:23:39,586 --> 00:23:42,381 నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నా. 369 00:23:46,677 --> 00:23:49,888 వివస్త్ర హంతకుడు చంపిన వారి మృతదేహాలపై దొరికిన వేలిముద్రల కాపీలు నీ దగ్గర ఉన్నాయా? 370 00:23:49,972 --> 00:23:51,223 వాటితో నీకేంటి పని? 371 00:23:51,306 --> 00:23:55,519 నేనేమీ ప్రోటోకాల్ కి విరుద్ధంగా చేయట్లేదు. కానీ ప్రస్తుతానికి రహస్యంగా ఉంచాలనుకుంటున్నా. 372 00:23:58,730 --> 00:24:02,526 పోలీసువి అయి కొన్ని రోజులు కూడా కాలేదు, అప్పుడే రహస్యాలా? 373 00:24:03,861 --> 00:24:06,613 నా దగ్గర అన్ని వేలిముద్రల కాపీలు ఉన్నాయి. 374 00:24:07,364 --> 00:24:09,992 నువ్వే కదా అది నాకు నేర్పింది, మర్చిపోయాను అనుకున్నావా? 375 00:24:12,369 --> 00:24:13,370 ఒక్క నిమిషం. 376 00:24:16,707 --> 00:24:18,917 నీ కొత్త సహోద్యోగులు ఎలా ఉన్నారు? 377 00:24:19,918 --> 00:24:22,171 వాళ్లని ఇంకా అర్థం చేసుకొనే పనిలో ఉన్నా. 378 00:24:23,630 --> 00:24:25,215 వాళ్లు కాస్త వింతగా ఉన్నారు. 379 00:24:27,009 --> 00:24:29,970 పర్వాలేదులే. ఇప్పుడు కాకపోతే, ఎప్పటికైనా వారిని అర్థం చేసుకుంటావులే. 380 00:24:30,596 --> 00:24:31,805 నన్ను అర్థం చేసుకున్నావు కదా. 381 00:24:34,057 --> 00:24:35,058 తీసుకో. 382 00:24:36,435 --> 00:24:37,436 థ్యాంక్యూ. 383 00:24:39,021 --> 00:24:42,774 అతను పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు. ఒక గుర్రం అతని తలని తన్నింది. 384 00:24:42,858 --> 00:24:45,152 మా అన్నయ్య అశ్వశాలలో. 385 00:24:46,945 --> 00:24:50,532 దెబ్బ ఇంకొన్ని అంగుళాలు ఎడమ వైపుకు తగిలి ఉంటే, 386 00:24:50,616 --> 00:24:52,618 అతని తల తెగి పడి ఉండేదని డాక్టర్ అన్నాడు. 387 00:24:59,124 --> 00:25:01,627 ఆ తర్వాత ఏమైంది? 388 00:25:03,253 --> 00:25:05,964 అంతా. అంతా మారిపోయింది. 389 00:25:06,048 --> 00:25:09,718 వాడు కదలలేకపోయాడు. మాటలు కూడా పెద్దగా మాట్లాడలేకపోయేవాడు. 390 00:25:10,260 --> 00:25:12,679 వాడికి స్కూల్ నుండి టీసీ ఇచ్చి పంపించేశారు. 391 00:25:12,763 --> 00:25:15,098 వాడికి ఎలా సాయపడాలో వాళ్లకి అర్థం కావట్లేదని చెప్పారు. 392 00:25:16,225 --> 00:25:19,019 అతని నేర చరిత్ర గురించి ఏమైనా చెప్పగలరా? 393 00:25:19,102 --> 00:25:24,525 నేరచరిత్ర అస్సలు లేదు మా వాడికి. అది వాడి గురించి చెప్పిన మరో చెత్త అబద్ధం. 394 00:25:26,151 --> 00:25:28,487 దగ్గర్లో ఒక పార్క్ ఉంది. 395 00:25:29,613 --> 00:25:35,327 నా టీటో అక్కడ ఉండే ఉయ్యాలలో చాలా సేపు గడిపేవాడు. 396 00:25:35,994 --> 00:25:37,579 అక్కడ వాడికి ఇనేస్ పరిచయం అయింది. 397 00:25:37,663 --> 00:25:44,378 ఆమెకి అప్పుడు 13 ఏళ్లు, కానీ టీటోకి, ఆమె అక్క లాంటిది. 398 00:25:44,461 --> 00:25:47,798 ఒకరోజు, ఆమె వాడికి ఒక పువ్వు ఇచ్చింది. 399 00:25:47,881 --> 00:25:49,550 నా టీటో ఆమెకి ఓ ముద్దు ఇవ్వాలనుకున్నాడు. 400 00:25:50,175 --> 00:25:52,177 అప్పుడు వాడు టీనేజ్ కుర్రాడు. 401 00:25:52,928 --> 00:25:54,304 తప్పు చేశాడు. 402 00:25:56,139 --> 00:26:01,019 ఆ అమ్మాయి అమ్మ కేసు వేసింది. 403 00:26:01,103 --> 00:26:03,480 లైంగిక వేధింపులకి పాల్పడ్డాడని ఆరోపించింది. 404 00:26:06,984 --> 00:26:09,570 పోలీసులు వాడిని జైల్లో వేశారు. 405 00:26:11,905 --> 00:26:15,701 వాడిని విడిపించడానికి, నాకు ఒక నెల పట్టింది. 406 00:26:18,370 --> 00:26:20,080 కానీ వాడు విడుదలై వచ్చాక… 407 00:26:22,457 --> 00:26:24,459 జైల్లో ఉండగా ఏదో అయింది. 408 00:26:26,336 --> 00:26:27,880 వచ్చినప్పటి నుండి వాడు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. 409 00:26:32,926 --> 00:26:36,847 మీ అబ్బాయి పనికి ఎలా వెళ్లేవాడు? కారు ఉండేదా? 410 00:26:38,473 --> 00:26:40,267 మిస్. 411 00:26:40,893 --> 00:26:43,729 వాడు పెన్సిల్ కూడా సరిగ్గా పట్టుకోలేడు. 412 00:26:46,440 --> 00:26:48,358 వాడిని నేనే బస్సులో తీసుకెళ్లి దింపేదాన్ని. 413 00:26:48,442 --> 00:26:49,818 బండి నడపడం రాదు 414 00:26:50,527 --> 00:26:52,446 మళ్లీ అక్కడికి వెళ్లి నేనే ఇంటికి తీసుకువచ్చేదాన్ని. 415 00:26:53,071 --> 00:26:57,075 ఎందుకంటే, వాడికి బస్సుల మార్గాలు గుర్తుండట్లేదని నాకు అర్థమైంది. 416 00:26:59,453 --> 00:27:02,289 అలాంటివాడికి బండిని నడపడం ఎలా వస్తుంది! 417 00:27:05,584 --> 00:27:07,085 మన్నించాలి. 418 00:27:55,300 --> 00:27:58,804 ఈ షూకి జత ఎక్కడ దొరుకుతుందో చెప్పగలవా? 419 00:27:59,888 --> 00:28:02,766 ఇవాళ వద్దు, నన్ను వదిలేయ్. నాకు చాలా పని ఉంది. 420 00:28:03,267 --> 00:28:06,603 నేను వినియోగదారుడిని, షూలు తీసుకుందామని వచ్చాను. 421 00:28:07,354 --> 00:28:09,064 నాకు సేవ చేయడానికి నిరాకరిస్తావా? 422 00:28:13,861 --> 00:28:14,862 సైజ్ ఎంత? 423 00:28:15,863 --> 00:28:16,864 నీ షూ సైజ్ ఎంత? 424 00:28:18,282 --> 00:28:19,783 నా షూ సైజ్, 23. 425 00:28:21,493 --> 00:28:25,622 ఎంత చిన్న పాదాలో. నాకు నచ్చాయి. 426 00:28:26,331 --> 00:28:27,332 హేయ్, హేయ్. 427 00:28:28,250 --> 00:28:29,251 క్షమించు. 428 00:28:31,670 --> 00:28:33,046 ఒక అంగీకారానికి వద్దాం. 429 00:28:35,132 --> 00:28:39,052 నేను నీకు షూలు కొనిస్తాను, దానితో మీ బాస్ ఖుషీ అవుతాడు. 430 00:28:39,595 --> 00:28:43,765 మనిద్దరి డిన్నరుకి వాటిని వేసుకొని రా, నేను ఖుషీ అవుతాను. 431 00:28:45,767 --> 00:28:47,060 అందరికీ లాభమే కదా. 432 00:28:52,441 --> 00:28:56,153 చూడు. నీకు ఎన్నిసార్లు చెప్పానో కూడా నాకు తెలీదు. 433 00:28:57,446 --> 00:28:58,906 నేను నీతో డేట్ కి రాను. 434 00:29:01,158 --> 00:29:04,077 - మగాళ్లంటే నీకు ఇష్టముండదా? - పరుషంగా మాట్లాడకు. 435 00:29:07,414 --> 00:29:08,665 కాదన్నందుకు నువ్వే బాధపడతావు. 436 00:29:18,509 --> 00:29:19,801 ఏమన్నాడు? 437 00:29:20,302 --> 00:29:22,721 కాదంటే, నేనే బాధపడతానంట. 438 00:29:24,181 --> 00:29:25,724 నువ్వు అతనితో డేట్ కి వెళ్లాలి. 439 00:29:25,807 --> 00:29:29,019 అతని దగ్గర ఎంత డబ్బు ఉందంటే, నువ్వు జీవితాంతం ఉద్యోగం చేయాల్సిన అవసరమే ఉండదు. 440 00:29:29,102 --> 00:29:31,438 నాకు ఆసక్తి లేదు. దానికి ఏమంటావు? 441 00:29:31,522 --> 00:29:34,483 నీ వెంట పడేవాళ్లు కూడా పెద్దగా లేరు కదా. 442 00:29:34,566 --> 00:29:35,859 నేనైతే మరీ అంత పట్టుదలకు పోను. 443 00:29:36,777 --> 00:29:38,529 కానీ నీ జీవితం, నీ ఇష్టం. మనోడు వస్తున్నాడు. 444 00:29:41,782 --> 00:29:43,116 నాకు ఇవి ఇవ్వండి. 445 00:29:44,117 --> 00:29:45,369 సైజ్ 23. 446 00:29:52,417 --> 00:29:54,753 కమాండర్ హెరేరా. మిమ్మల్ని కలిసి చాలా కాలమైంది. 447 00:30:02,302 --> 00:30:06,014 - మీరు ఇంకా నవ యువకుడిలానే కనిపిస్తున్నారు. - కూర్చోమని ఎవరు చెప్పారు. 448 00:30:14,356 --> 00:30:16,942 నా ఆఫీసర్లకు పని చేయడానికి చోటు కావాలి. 449 00:30:17,734 --> 00:30:20,779 పార్క్ పెద్దగానే ఉంది కదా? 450 00:30:20,863 --> 00:30:24,533 కానీ, చీఫ్ ఎస్కొబేడో వాళ్లకి ఈ స్టేషనునే కేటాయించారు. స్టేషన్ చీఫ్ మీరే కాబట్టి… 451 00:30:24,616 --> 00:30:27,494 స్టేషనులో నా పని ఏంటంటే, ఇక్కడి అణువణువూ నేరాల విచారణలకు, 452 00:30:27,578 --> 00:30:32,165 నేరస్థులను పట్టుకోవడానికే ఉపయోపపడేలా చూసుకోవడం. 453 00:30:32,249 --> 00:30:35,377 అంతే కానీ, ఒక రాజకీయ నాయకుడు, ప్రచారంలో చేసిన వాగ్దానాల కోసమని 454 00:30:35,460 --> 00:30:38,547 తలాతోక ఆలోచించకుండా చేసే ప్రతీ అడ్డమైన పనికి తలాడించడం కాదు. 455 00:30:40,090 --> 00:30:43,302 కమాండర్, సగౌరవంగా చెప్తున్నాను. 456 00:30:44,636 --> 00:30:45,888 నాకు కళ్లు కనిపించవు అనుకోకండి. 457 00:30:45,971 --> 00:30:48,390 వాళ్లకి వ్యక్తిగతంగా నేను శిక్షణ ఇచ్చాను. 458 00:30:50,142 --> 00:30:55,147 ఆ బృందంలో కత్తిలాంటి పోలీసు ఆఫీసర్లు కూడా ఉన్నారు. 459 00:30:55,230 --> 00:30:56,857 మీ కూతురితో సహా. 460 00:31:01,653 --> 00:31:03,238 నీకు పిల్లలు ఉన్నారా? 461 00:31:10,329 --> 00:31:12,122 లేరు, నాకు పిల్లలు లేరు. 462 00:31:12,206 --> 00:31:13,540 లేరని తెలుస్తోందిలే. 463 00:31:13,624 --> 00:31:18,378 పిల్లలు ఉంటే నీకు తెలిసి ఉండేది, నాకున్న ఏకైక కూతురు పొట్టి గౌను వేసుకొని 464 00:31:19,296 --> 00:31:23,091 ఈ ప్రమాదకరమైన నగరంలో వయ్యారంగా తిరుగుతూ ఉండటం 465 00:31:23,175 --> 00:31:25,511 నాకు ఎందుకు నచ్చే విషయం కాదో. 466 00:31:39,149 --> 00:31:40,609 నిజానికి, నాకు అంతా వివరంగా తెలుసు. 467 00:31:40,692 --> 00:31:41,985 లేదు, నీకు తెలీదు. 468 00:31:42,069 --> 00:31:46,240 డిటెక్టివ్స్ మాత్రమే కూర్చొనే టేబుల్ దగ్గరికి యూనిఫామ్ వేసుకొన్న పోలీసును మనం ఎప్పుడు పిలిచాం అబ్బా? 469 00:31:46,323 --> 00:31:48,158 డిటెక్టివ్, ఒక నిమిషం మీతో మాట్లాడవచ్చా? 470 00:31:49,201 --> 00:31:50,786 పని అయిపోయిందా? 471 00:31:50,869 --> 00:31:52,371 దాని కన్నా మేము చెప్పబోయేది చాలా ముఖ్యమైనది, సర్. 472 00:31:54,498 --> 00:31:56,250 ఏది ముఖ్యమో, ఏది కాదో మీరు నాకు చెప్పకండి. 473 00:31:56,333 --> 00:31:59,628 - ఏది ముఖ్యమో నేను మీకు చెప్తాను. - లొజానో, వాళ్లని వదిలేసేయ్, గురూ. 474 00:31:59,711 --> 00:32:03,966 మేము చాలా బిజీగా ఉన్నామని తెలుస్తోంది కదా, అమ్మాయిలు. ఏం కావాలి మీకు? 475 00:32:04,049 --> 00:32:05,259 మార్గరీటో ఫ్లోర్స్. 476 00:32:06,969 --> 00:32:09,596 - అతని గురించి ఏం చెప్పాలి? - అతను వివస్త్ర హంతకుడు కాదు. 477 00:32:11,598 --> 00:32:12,808 మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. 478 00:32:14,351 --> 00:32:16,228 - ఆధారాలు ఉన్నాయా? - అవును. 479 00:32:22,568 --> 00:32:24,361 వెధవల్లారా, ఎవరి ఐడియా ఇది? 480 00:32:24,444 --> 00:32:26,446 - డియాజ్ పనే అయ్యుంటుంది. - నువ్వే కదా? 481 00:32:26,530 --> 00:32:28,031 నువ్వే అన్నావు. 482 00:32:28,115 --> 00:32:29,116 నేనా? 483 00:32:29,199 --> 00:32:30,868 అమాయకుడిలా నటించకు. 484 00:32:30,951 --> 00:32:32,035 మేమేమీ జోక్ చేయడం లేదు. 485 00:32:34,204 --> 00:32:36,248 - జోక్ కాదా? - కాదు. 486 00:32:38,250 --> 00:32:39,418 అయితే ఆధారాలని చూపించండి. 487 00:32:39,501 --> 00:32:40,961 తప్పకుండా, సర్. 488 00:32:42,045 --> 00:32:46,300 మార్గరీటో ఫ్లోర్స్ కి మెదడులోని సెరిబెల్లమ్ భాగానికి, అంటే కదలికలని నియంత్రించే భాగానికి 489 00:32:46,383 --> 00:32:48,802 బాగు చేయలేని గాయమైందని వైద్యులు తేల్చి చెప్పారు. 490 00:32:48,886 --> 00:32:51,930 నేరాంగీకార పత్రంపై సంతకం చేసేటప్పుడు అతను పెన్నును సరిగ్గా పట్టుకోలేకపోయింది అందుకే. 491 00:32:52,639 --> 00:32:55,058 అలాంటి వాడు తాడుతో ఆరుగురిని కట్టి, ఎలా చంపుతాడు? 492 00:32:55,809 --> 00:32:58,604 చేతులపై 19 వేలిముద్రలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. 493 00:32:59,104 --> 00:33:03,025 కానీ మెడ మీద కానీ, మణికట్టు మీద కానీ, చీలమండలాల మీద కానీ, ఒక్క వేలి ముద్ర కూడా లేదు. 494 00:33:03,108 --> 00:33:05,986 అతను అందరినీ తాడుతో కట్టేసి, గొంతు నులిమి చంపినా కూడా. 495 00:33:06,069 --> 00:33:08,906 విచిత్రంగా, అక్కడ ఒక్క వేలి ముద్ర కూడా లేదు. 496 00:33:08,989 --> 00:33:12,284 అంత జాగ్రత్త తీసుకొనే వ్యక్తి, చేతులపై అస్తవ్యస్తంగా వేలి ముద్రలను వదిలే అవకాశం లేదు. 497 00:33:13,118 --> 00:33:15,662 అతనికి బండి నడపడం రాదని, వాళ్ల అమ్మ మాకు చెప్పింది. 498 00:33:16,330 --> 00:33:19,416 వేరొకరి సాయం లేకుండా అతను బస్సు కూడా ఎక్కలేడు. 499 00:33:19,499 --> 00:33:23,629 అలాంటి మనిషి, ఒక్కో చోటికి ఒక్కడే వెళ్లి, 500 00:33:23,712 --> 00:33:25,714 అంత మందిని చంపేసి, ఒక్క ఆధారం కూడా లేకుండా 501 00:33:25,797 --> 00:33:28,592 ఎలా తప్పించుకోగలిగాడో ఎవరైనా వివరించగలరా? 502 00:33:28,675 --> 00:33:32,346 ఏం జరిగి ఉంటుంది అంటే, అతను పని చేస్తున్న పార్కులో ఉండుంటాడు. 503 00:33:33,096 --> 00:33:36,433 పని మీద పార్కులో తిరిగే సమయంలో, శవాన్ని చూసి, ఆమె బతికే ఉందనుకొని ఉంటాడు. 504 00:33:37,017 --> 00:33:40,521 లేపడానికి ప్రయత్నించి ఉంటాడు, అలా ఆమె చేతుల మీద అతని వేలి ముద్రలు పడుంటాయి. 505 00:33:40,604 --> 00:33:43,065 ఆమె చనిపోయిందని గ్రహించాక, 506 00:33:43,148 --> 00:33:46,151 పారిపోయి ఉంటాడు, ఆ క్రమంలో మట్టిలో అతని బూటు ముద్ర పడుంటుంది. 507 00:33:47,819 --> 00:33:49,780 అయితే పరిశోధన బాగానే చేశారు అన్నమాట. 508 00:33:50,364 --> 00:33:51,573 అవును, సర్. 509 00:34:00,374 --> 00:34:01,834 నేర్చుకోండిరా, సన్నాసులారా. 510 00:34:09,257 --> 00:34:10,467 మిత్రులారా. 511 00:34:13,262 --> 00:34:15,429 దర్యాప్తు చేయాల్సిన విధానం ఇది. 512 00:34:18,516 --> 00:34:21,270 రొమాండీయా! ఇలా రా! 513 00:34:28,443 --> 00:34:29,444 ఏమైంది? 514 00:34:30,946 --> 00:34:35,158 ఏమీ కాలేదు. అంతా బాగానే ఉంది. నిజానికి, నీకు అభినందలు చెప్పాలి. 515 00:34:36,159 --> 00:34:39,161 చూడు, నీ కింద పని చేసే ముగ్గురు, 516 00:34:40,496 --> 00:34:43,333 అనధికారికంగా దర్యాప్తు చేశారు, 517 00:34:43,958 --> 00:34:46,503 ఆ క్రమంలో ఇక్కడి అధికార వ్యవస్థను ధిక్కరించారు, 518 00:34:47,754 --> 00:34:49,339 ఇవన్నీ చేసి ధైర్యంగా 519 00:34:50,132 --> 00:34:52,259 నా దగ్గరికి వచ్చి, నా ముఖం మీద 520 00:34:52,342 --> 00:34:54,511 నేను అమాయకుడిని అరెస్ట్ చేశానని చెప్తున్నారు. అంతే కదా? 521 00:34:54,594 --> 00:34:55,596 మేము… 522 00:34:56,889 --> 00:34:59,016 నువ్వు మాట్లాడకు. సరేనా? 523 00:35:00,058 --> 00:35:03,770 పై అధికారి ముందు ఉన్నప్పుడు, మాట్లాడకు. 524 00:35:03,854 --> 00:35:06,023 ఇది నువ్వు, ఇంకా నువ్వు కూడా గుర్తుంచుకోండి. 525 00:35:07,274 --> 00:35:08,734 మేము మాట్లాడమని చెప్తేనే మాట్లాడండి. 526 00:35:11,195 --> 00:35:12,988 నువ్వు అతని తల్లి దగ్గరికి వెళ్లావు కదా? 527 00:35:14,198 --> 00:35:16,617 ఆమె ఏం చెప్తుందని అనుకున్నావు? 528 00:35:16,700 --> 00:35:20,329 తన కొడుకుని కాపాడుకోవడానికి, అతను హంతకుడు కాదు అని మిమ్మల్ని నమ్మించడానికి 529 00:35:20,871 --> 00:35:22,206 ఆమె ఏమైనా చెప్తుంది కదా. 530 00:35:23,999 --> 00:35:25,000 ఇక వేలిముద్రల విషయానికి వద్దాం. 531 00:35:26,126 --> 00:35:29,546 చెప్పాలంటే, చాలా చక్కగా పని చేశావు. 532 00:35:30,047 --> 00:35:32,674 అభినందనలు. కానీ ఒక చోట పొరపాటు జరిగింది. 533 00:35:33,759 --> 00:35:35,928 హంతకులు తప్పులు చేయని పిస్తాలేం కాదు. 534 00:35:36,470 --> 00:35:40,098 వాళ్లు తప్పులు తప్పక చేస్తారు. ఆ తప్పుల ద్వారానే వాళ్లని మనం పట్టుకుంటాం. 535 00:35:40,682 --> 00:35:41,683 అర్థమైందా? 536 00:35:47,105 --> 00:35:52,152 ఇది ఎస్కొబేడో వ్యక్తిగత పనైనా కూడా నాకు అనవసరం. 537 00:35:53,904 --> 00:35:56,240 నేను అధికార ధిక్కారణ కింద ఫిర్యాదు చేస్తున్నాను. 538 00:35:56,990 --> 00:36:00,619 ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు ఆడ ఆఫీసర్లను తక్షణమే సస్పెండ్ చేస్తున్నా. 539 00:36:03,288 --> 00:36:04,665 పోలీసోళ్లగా మీ మూణ్ణాళ్ల ముచ్చట తీరిపోయింది. 540 00:36:07,000 --> 00:36:10,337 మిత్రులారా, ఇక ముచ్చట్లను ఆపి, పని మొదలుపెడదాం. 541 00:36:10,921 --> 00:36:12,005 మీరు బయలుదేరండి. 542 00:36:17,594 --> 00:36:19,930 నా ఆఫీసుకు వెళ్లండి. పదండి. 543 00:36:26,186 --> 00:36:27,312 చూడు, హెరేరా… 544 00:36:29,648 --> 00:36:30,649 నువ్వు అన్నది నిజమే. 545 00:36:32,067 --> 00:36:35,028 ఇక్కడ విధివిధానాలు ఏంటో ఇంకా వాళ్లకి తెలీదు. 546 00:36:35,112 --> 00:36:36,321 వాళ్లకి ఇంకో అవకాశం ఇచ్చి చూడు. 547 00:36:36,405 --> 00:36:39,032 వాళ్లు నియమాలను అనుసరించేలా చూసుకొనే బాధ్యత నాది. 548 00:36:40,033 --> 00:36:41,702 ఈ విధంగా, మనం ఎస్కొబేడో దాకా ఈ విషయం వెళ్లకుండా ఆపవచ్చు. 549 00:36:43,912 --> 00:36:45,122 సరే. 550 00:36:46,206 --> 00:36:48,292 అ పని నేనెందుకు చేయాలి? 551 00:36:48,375 --> 00:36:51,461 నువ్వు చేయకుంటే, నేను మానేస్తాను కాబట్టి. 552 00:36:54,464 --> 00:36:55,465 ఓయబ్బో. 553 00:36:56,133 --> 00:36:57,718 హీరో అయిపోదాం అనుకుంటున్నావా! 554 00:37:01,763 --> 00:37:05,350 నీకు కావాల్సింది చేసుకో, రొమాండీయా. పర్యవసానాలను భరించాల్సింది నువ్వే, నేను కాదు. 555 00:37:08,896 --> 00:37:10,772 ఆ స్ట్రిప్ క్లబ్ నిన్ను బాగానే మార్చేసిందే, హా? 556 00:37:21,283 --> 00:37:22,284 థ్యాంక్యూ. 557 00:37:25,287 --> 00:37:26,914 మీరు ముందు నాకు ఎందుకు చెప్పలేదు? 558 00:37:26,997 --> 00:37:29,082 ఆయన డిటెక్టివ్ అని ఆయన దగ్గరికి వెళ్లాం, సర్. 559 00:37:29,708 --> 00:37:31,418 అవును, కానీ మీకు నేనే కదా బాస్! 560 00:37:33,420 --> 00:37:35,005 నన్ను వెధవని చేసి పారేశారు. 561 00:37:35,881 --> 00:37:37,966 నా వెనుక ఇంత నడిపించారు. 562 00:37:39,593 --> 00:37:43,138 మళ్లీ కేసును తెరిపించాలనే ఇలా చేశాం, సర్. మన్నించండి. 563 00:37:43,222 --> 00:37:45,098 మీ క్షమాపణలు వినాలని నాకు అస్సలు లేదు. 564 00:37:45,724 --> 00:37:48,310 మళ్లీ అతని దరిదాపుల్లోకి కూడా వెళ్లమని నాకు మాటివ్వండి. 565 00:37:48,393 --> 00:37:49,853 వాళ్ల వైపు అసలు చూడమని మాటివ్వండి! 566 00:37:52,731 --> 00:37:56,109 మీరు చేసే పనులకు నేను కూడా బలి అవుతాను. అర్థమైందా? 567 00:37:58,654 --> 00:37:59,821 ఇక బయటకు వెళ్లండి. 568 00:37:59,905 --> 00:38:00,906 నువ్వు ఆగు. 569 00:38:07,204 --> 00:38:10,999 నీకు నచ్చినా, నచ్చకపోయినా, నువ్వు చేసే పనులకు పర్వవసానాలు అనుభవించాల్సిందే. 570 00:38:12,751 --> 00:38:13,919 వాళ్లకి నాయకురాలివి కావాలనుకుంటున్నావా? 571 00:38:15,504 --> 00:38:17,005 అయితే, ముందు ఆ విషయాన్ని అర్థం చేసుకో. 572 00:38:31,979 --> 00:38:33,105 హెరేరా. 573 00:38:33,188 --> 00:38:36,149 కమాండర్. నేను ఎస్కొబేడోని మాట్లాడుతున్నా. 574 00:38:36,233 --> 00:38:39,403 సర్, ఇప్పుడు నాకు చాలా పని ఉంది. 575 00:38:39,486 --> 00:38:41,280 నేను మరీ ఎక్కువ సేపు మాట్లాడనులే. 576 00:38:42,072 --> 00:38:43,699 మహిళా పోలీసుల గురించి కాల్ చేశా, కమాండర్. 577 00:38:44,867 --> 00:38:45,909 చెప్పండి. 578 00:38:46,493 --> 00:38:50,163 మీరు, కెప్టెన్ రొమాండీయా మాట్లాడుకున్నారని తెలిసింది. 579 00:38:50,247 --> 00:38:53,083 నేను అతనికి స్పష్టంగా చెప్పాను, అదేంటంటే… 580 00:38:53,166 --> 00:38:54,293 మీరేమన్నారో నాకు తెలుసు. 581 00:38:55,127 --> 00:38:57,713 కానీ, కమాండర్, నా ఆఫీసర్లను పనిలో పెట్టాలనుకుంటున్నాను. 582 00:38:57,796 --> 00:38:59,506 వాళ్లకి కాస్తంత చోటు కావాలి. అంతకు మించి ఇంకేమీ లేదు. 583 00:38:59,590 --> 00:39:02,342 ప్రస్తుతానికి, స్టేషనులో ఖాళీ లేదు. 584 00:39:02,426 --> 00:39:05,679 ఇటీవలి ఏళ్లలో, పోలీసులపై దురభిప్రాయం ఏర్పడిపోయింది కాబట్టి, 585 00:39:05,762 --> 00:39:08,265 మీకు సిబ్బంది తక్కువ అయ్యారని నాకు తెలుసు. మీకు కావాల్సినంత మంది నా దగ్గర ఉన్నారు. 586 00:39:08,348 --> 00:39:11,310 - కావాలంటే, వాళ్లని మీకు ఇవ్వగలను. - సిబ్బంది ఎంత మంది ఉన్నారో నాకు తెలుసు, సర్. 587 00:39:13,312 --> 00:39:16,815 ఆ నలుగురు మహిళా పోలీసుల వల్ల మీకు ప్రమాదమని భయపడుతున్నారా? 588 00:39:18,483 --> 00:39:19,985 అంతేనా, కమాండర్? 589 00:39:20,777 --> 00:39:22,154 అస్సలు కాదు, సర్. 590 00:39:24,990 --> 00:39:29,453 నాకు సకల సదుపాయాలున్న చోటేమీ అక్కర్లేదు. ఒక సాదాసీదా చోటు చాలు. అంతే. 591 00:39:31,788 --> 00:39:32,789 సరే, సర్. 592 00:39:33,373 --> 00:39:38,337 మన దేశ అధ్యక్షులు, నేను మీ తోడ్పాటుకు రుణపడి ఉంటాం. 593 00:39:48,263 --> 00:39:49,556 స్వాగతం, సుస్వాగతం. 594 00:39:51,725 --> 00:39:52,726 పదండి, లోపలికి పదండి. 595 00:39:54,269 --> 00:39:55,646 ఎలా ఉంది? 596 00:39:59,483 --> 00:40:01,860 ఇదీ మరి. 597 00:40:02,444 --> 00:40:04,738 "ఇది" అంటే? 598 00:40:05,364 --> 00:40:07,157 ఇదే మీ కొత్త ఆఫీసు. 599 00:40:07,241 --> 00:40:08,492 ఏంటి ఆ వాసన? 600 00:40:08,575 --> 00:40:11,411 తేమ వాసన. చచ్చిన ఎలుక వాసన కూడా వస్తోంది. 601 00:40:12,079 --> 00:40:14,331 ఈ చోటును ఎంపిక చేసింది మీ నాన్నే. 602 00:40:18,377 --> 00:40:21,046 సరే మరి. ఇంట్లో ఉన్నట్టే ఇక్కడా ఉండండి, సరేనా? 603 00:40:37,771 --> 00:40:38,772 హలో. 604 00:40:40,065 --> 00:40:41,400 హలో. 605 00:40:42,234 --> 00:40:43,485 నేను, అదీ… 606 00:40:44,820 --> 00:40:46,238 ఎక్కడికి వెళ్తున్నారు? 607 00:40:46,780 --> 00:40:48,115 మీకెందుకు? 608 00:40:48,907 --> 00:40:50,242 లేదు, అంటే నేను… 609 00:40:52,494 --> 00:40:53,912 తప్పుగా అనుకోకండి, నేను కేవలం… 610 00:40:56,290 --> 00:40:58,250 సర్లేండి. గుడ్ నైట్. 611 00:41:02,379 --> 00:41:03,630 ఒక విషయం. 612 00:41:03,714 --> 00:41:06,508 ఈ స్టేషనులో మా అన్నయ్యకి ఎదురు చెప్పేవాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. 613 00:41:06,592 --> 00:41:08,719 అతను వినడని కూడా నాకు తెలుసు, 614 00:41:08,802 --> 00:41:11,680 కానీ మీరు అదరగొట్టేశారు. 615 00:41:11,763 --> 00:41:12,931 అన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 616 00:41:13,765 --> 00:41:15,893 అవును. నాకు తెలుసు. 617 00:41:17,895 --> 00:41:21,690 అదన్నమాట. మీకు అదే చెప్పాలనుకున్నాను. 618 00:41:27,821 --> 00:41:29,156 నా పేరు యాంగలెస్ క్రూజ్. 619 00:41:31,450 --> 00:41:32,743 మీ పేరేంటి? 620 00:41:33,493 --> 00:41:35,329 గాబ్రియెల్. గాబ్రియెల్ హెరేరా. 621 00:41:37,039 --> 00:41:38,457 అయితే… 622 00:41:39,541 --> 00:41:41,710 - గుడ్ నైట్, గాబ్రియెల్. - గుడ్ నైట్. 623 00:41:42,503 --> 00:41:43,712 మిమ్మల్ని ఇంటి దాకా దింపనా? 624 00:41:45,255 --> 00:41:48,050 అలాగే. మీ కారు ఎక్కడ ఉంది? 625 00:41:49,343 --> 00:41:50,344 నాకు… 626 00:41:51,553 --> 00:41:53,347 నాకు కారు లేదు. 627 00:41:54,890 --> 00:41:56,391 కావాలంటే, మనిద్దరం నడిచి వెళ్లవచ్చు. 628 00:41:59,436 --> 00:42:00,437 సరే. 629 00:42:01,146 --> 00:42:02,147 అలాగే. 630 00:42:02,981 --> 00:42:03,982 అలాగే వెళ్దాం. 631 00:42:04,608 --> 00:42:05,609 నిజంగానా? 632 00:42:07,819 --> 00:42:09,071 వెళ్దాం పదండి అయితే. 633 00:42:16,745 --> 00:42:17,955 సరే మరి, వచ్చేశాం. 634 00:42:19,081 --> 00:42:20,123 మరి, 635 00:42:21,708 --> 00:42:22,835 బహుశా… 636 00:42:22,918 --> 00:42:28,715 నువ్వు పోలీసువని చెప్పకపోవడం మంచిది అనుకుంటా. 637 00:42:29,216 --> 00:42:32,427 ఎందుకైనా మంచిదని… 638 00:42:32,511 --> 00:42:33,929 నన్ను అబద్ధమాడమంటున్నావా? 639 00:42:34,513 --> 00:42:39,518 లేదు. ఆ ప్రస్తావన తీసుకురావద్దు అంటున్నా. 640 00:42:40,686 --> 00:42:41,937 సరేనా? ప్రస్తుతానికి. 641 00:42:44,398 --> 00:42:46,024 నాకు ఈ ప్రమోషన్ కావాలి. 642 00:42:46,817 --> 00:42:48,360 మనిద్దరికీ కావాలి. 643 00:42:50,821 --> 00:42:51,947 సరే మరి. 644 00:42:59,413 --> 00:43:02,499 - చూడు. ఈమె మా మనవరాలు. - ఇలా ఇవ్వండి, చూస్తాను. 645 00:43:04,168 --> 00:43:05,794 - చాలా బాగుంది. - థ్యాంక్యూ. 646 00:43:06,461 --> 00:43:08,463 - తన బామ్మ కళ్లే వచ్చాయి తనకి. - నిజంగానా? 647 00:43:08,547 --> 00:43:09,798 - అవును. - థ్యాంక్యూ. 648 00:43:11,592 --> 00:43:13,510 మీకు ఇద్దరు పిల్లలు కదా? 649 00:43:13,594 --> 00:43:15,804 - అవును. - అవును, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. 650 00:43:15,888 --> 00:43:18,724 ఒక్కోసారి, వారిని నేను భరించలేకపోతూ ఉంటా. 651 00:43:18,807 --> 00:43:22,603 నమ్మినా, నమ్మకపోయినా మీకు ఒక సత్యం చెప్తాను, వాళ్లు వెళ్లిపోయాక, మీరు వాళ్లని మిస్ అవుతారు. 652 00:43:23,812 --> 00:43:26,815 మీరు ఇంకో బిడ్డని కనే ఆలోచన చేయాలి. 653 00:43:26,899 --> 00:43:28,358 మీకు తోడు కోసం. 654 00:43:28,442 --> 00:43:32,321 హా, మేము దాని గురించి మాట్లాడుకున్నాం. ఆ ప్రస్తావన కూడా వచ్చింది మా మధ్య. 655 00:43:32,404 --> 00:43:33,488 - అవును కదా, బంగారం? - అవును. 656 00:43:33,572 --> 00:43:37,451 అయితే, మీరు త్వరపడాలి, ఎందుకంటే మీ వయస్సు ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది. 657 00:43:37,534 --> 00:43:39,703 వాళ్లని వదిలేయవమ్మా. 658 00:43:40,329 --> 00:43:43,665 ఎవరికైనా చికెన్ లెగ్ పీస్ కావాలా? 659 00:43:44,166 --> 00:43:45,042 నాకు కావాలి. 660 00:43:45,125 --> 00:43:48,045 చికెన్ లెగ్ పీస్ అంటే నాకు నోరూరిపోతుంది. 661 00:43:48,795 --> 00:43:50,672 - నాకు కూడా. - నిజంగా? 662 00:43:50,756 --> 00:43:52,174 అవును, నాకు అది ఇష్టం. 663 00:43:54,134 --> 00:43:55,135 లూకాస్! 664 00:43:57,513 --> 00:43:59,848 లూకాస్, నేను నీకు ఒకటి చెప్పాలి. వింటే, ఎగిరి గంతేస్తావు. 665 00:43:59,932 --> 00:44:01,934 - లూకాస్… - ఎవరు? 666 00:44:02,518 --> 00:44:03,810 మీరు లూకాస్ కోసం వచ్చారా? 667 00:44:04,770 --> 00:44:07,272 అవును. ఉన్నాడా? 668 00:44:07,356 --> 00:44:09,942 ఇంకా రాలేదు. ఇంతకీ ఎవరు మీరు? 669 00:44:11,068 --> 00:44:12,110 నా గురించి ఎందుకులే. 670 00:44:12,194 --> 00:44:14,279 అతనికి చెప్తావా, తన కోసం నేను వచ్చానని… 671 00:44:14,363 --> 00:44:16,073 వాలంటీనా తన కోసం వచ్చిందని? 672 00:44:16,156 --> 00:44:19,243 వాల్… వాలంటీనా? 673 00:44:21,578 --> 00:44:22,913 వాల్! 674 00:44:22,996 --> 00:44:24,957 నిన్ను కలవడం చాలా బాగుంది. 675 00:44:25,541 --> 00:44:27,042 నీ గురించి లూకాస్ చాలా చెప్పాడు. 676 00:44:27,125 --> 00:44:29,044 నిజంగానా? ఏం చెప్పాడేంటి? 677 00:44:29,127 --> 00:44:30,546 పెద్ద విషయాలేవీ కాదులే. 678 00:44:31,255 --> 00:44:33,632 లూకాస్ కి, నాకు మధ్య రహస్యాలు ఏవీ ఉండవు, నేనేమంటున్నానో అర్థమవుతోంది కదా. 679 00:44:34,508 --> 00:44:35,551 అర్థం కాలేదు. 680 00:44:35,634 --> 00:44:37,928 - లోపలికి రా. - లేదు, నాకు వేరే పనులు ఉన్నాయి. 681 00:44:38,011 --> 00:44:39,263 ఇప్పుడే గుర్తొచ్చింది. 682 00:44:39,346 --> 00:44:43,100 లూకాస్ ఏ క్షణమైనా వచ్చేసేయవచ్చు. నిజానికి, ఈపాటికే అతను వచ్చేసి ఉండాల్సింది. 683 00:44:43,183 --> 00:44:44,518 డిన్నర్ కి ఉండేసి వెళ్లు. 684 00:44:44,601 --> 00:44:45,602 నేను డిన్నర్ తిననులే. 685 00:44:45,686 --> 00:44:46,687 వాల్. 686 00:44:47,229 --> 00:44:48,564 ఏంటి? 687 00:44:48,647 --> 00:44:50,482 నువ్వు పోలీసువి అయ్యావు కదా, 688 00:44:52,234 --> 00:44:55,404 అది మామూలు విషయం కాదు. 689 00:44:57,489 --> 00:44:58,532 సరే మరి. 690 00:44:59,867 --> 00:45:01,785 - థ్యాంక్యూ. - మళ్లీ కలుద్దాం, సరేనా? 691 00:45:01,869 --> 00:45:03,745 - సరే. - బై. 692 00:45:09,793 --> 00:45:14,006 స్కాట్లాండులో 24 ఏళ్లు ఇది నిల్వ ఉండింది. 693 00:45:14,089 --> 00:45:16,049 - ఇరవై నాలుగేళ్లా? - అవును. 694 00:45:16,133 --> 00:45:19,136 దీన్ని తాగుతుంటేనే అదోలా ఉంది నాకు. 695 00:45:19,219 --> 00:45:22,222 - ఇరవై నాలుగేళ్లంటే చాలా ఏళ్లు కదా? - దాని గురించి ఆలోచించకు. తాగేయ్. 696 00:45:23,891 --> 00:45:27,561 గొప్ప గొప్పవేవీ కలకాలం ఉండిపోవు. 697 00:45:28,854 --> 00:45:29,855 విస్కీ. 698 00:45:30,647 --> 00:45:31,648 అందం. 699 00:45:32,733 --> 00:45:33,567 జీవితం. 700 00:45:37,404 --> 00:45:40,616 ఆ విషయంలో నేను మీతో ఏకిభవించలేను. 701 00:45:42,492 --> 00:45:43,535 ఎందుకో చెప్పు. 702 00:45:44,620 --> 00:45:48,040 ఉదాహరణకు, ఆర్కిటెక్చర్ నే తీసుకోండి. 703 00:45:49,499 --> 00:45:52,336 ఆర్కిటెక్చర్ లేకపోతే, ప్రవైటుగా కానీ, లేదా పబ్లిక్ గా కానీ, 704 00:45:52,419 --> 00:45:54,546 మనం ఎవరో, ఒకప్పుడు ఎలా ఉన్నామో, 705 00:45:54,630 --> 00:45:57,799 భవిష్యత్తులో ఏం కావాలనుకుంటామో మనకి తెలిసే అవకాశం లేదు. 706 00:45:57,883 --> 00:46:00,385 కొలోజియం, గోల్డెన్ గేట్ వంటివి ఉన్నాయి. 707 00:46:00,469 --> 00:46:05,474 పానిస్ టవర్ కూడా ఉంది. ఇవన్నీ గత వైభవాలకు సాక్ష్యాలు, ఏమంటారు? 708 00:46:06,600 --> 00:46:09,228 ఒకప్పుడు మనకి ఏం ఉండేవో అవి మనకి తెలుపుతాయి. 709 00:46:10,062 --> 00:46:12,981 ఆ సమయంలో మనకి ఉన్న సాంకేతికతకు అవి అద్దం పడుతాయి. 710 00:46:13,065 --> 00:46:16,985 ఆ సమయంలో మనం అనుసరించిన ఆచారాలను చూపుతాయి. 711 00:46:18,737 --> 00:46:22,783 కాబట్టి, ఆర్కిటెక్చర్ కలకాలం నిలిచిపోతుందని చెప్పగలను. 712 00:46:22,866 --> 00:46:26,954 కాబట్టి, ఆర్కిటెక్టులైన మనకి 713 00:46:27,496 --> 00:46:29,373 తరతరాల పాటు నిలిచిపోయేలా 714 00:46:30,290 --> 00:46:32,459 మన అస్థిత్వాన్ని నిర్మించే అవకాశం, 715 00:46:33,460 --> 00:46:34,461 బాధ్యత ఉన్నాయి. 716 00:46:35,045 --> 00:46:38,340 "తరతరాల పాటు నిలిచిపోయేలా మన అస్థిత్వాన్ని నిర్మించడం." 717 00:46:39,800 --> 00:46:42,636 - నాకు అది బాగా నచ్చింది. - హా. 718 00:46:42,719 --> 00:46:44,805 అందుకే 719 00:46:45,472 --> 00:46:46,974 ఈ పనిని 720 00:46:48,016 --> 00:46:50,018 నేను కేవలం వ్యాపారంగా మాత్రమే భావించను. 721 00:46:50,102 --> 00:46:52,604 నా దృష్టిలో, ఇది ఒక సంస్కృతి. 722 00:46:52,688 --> 00:46:53,689 కళ. 723 00:46:55,065 --> 00:46:56,692 దానికి చీర్స్ కొడదాం. 724 00:46:57,192 --> 00:46:58,193 చీర్స్. 725 00:46:59,945 --> 00:47:01,029 చాలా బాగుంది. 726 00:47:02,656 --> 00:47:07,494 వాల్ పేపర్, ఉపయోగించిన రంగులు. అంతా చాలా బాగుంది. 727 00:47:08,453 --> 00:47:10,706 మీకున్న టేస్టులో నాకు రవ్వంత ఉన్నా బాగుండేది. 728 00:47:12,541 --> 00:47:13,542 ఇదేమంత తేలిక కాదు. 729 00:47:14,418 --> 00:47:17,212 మీకు ఈ ప్రతిభ పుట్టుకతో పాటే వచ్చి ఉంటుంది. 730 00:47:18,380 --> 00:47:19,631 నేను ఒక విషయాన్ని బయటపెట్టనా? 731 00:47:23,218 --> 00:47:25,304 నేను ఇంటీరియర్ డిజైన్ క్లాసులకి వెళ్తున్నా. 732 00:47:26,346 --> 00:47:28,098 - నిజంగానా? - హా. 733 00:47:28,182 --> 00:47:31,768 చెప్తున్నా కదా, నాకు ఇదంటే పిచ్చి. 734 00:47:33,228 --> 00:47:35,564 నేను మా సన్నిహితుల ఇంటికి వెళ్లిన ప్రతిసారి, 735 00:47:35,647 --> 00:47:38,150 ఏమో మరి, ఏమైనా మార్పులు చేయాలేమో అనిపిస్తూ ఉంటుంది. 736 00:47:41,153 --> 00:47:43,280 మీకు నచ్చినది మీరు చేస్తున్నారు, అది చాలా మంచి విషయం. 737 00:47:47,826 --> 00:47:49,745 నువ్వు కూడా ఏదో చేస్తూ ఉన్నావు కదా? 738 00:47:51,496 --> 00:47:52,497 లేదు. 739 00:47:53,707 --> 00:47:55,250 - అస్సలు లేదు. - చేస్తున్నావు. 740 00:47:55,334 --> 00:47:58,879 పర్వాలేదులే చెప్పు. నేను నీకు చెప్పేశా కదా. నువ్వు నన్ను నమ్మవచ్చు. 741 00:47:59,838 --> 00:48:00,839 సరే. 742 00:48:02,299 --> 00:48:04,843 మొదట్లో, అది నాకు సరిపడదు అనుకున్నా, 743 00:48:06,428 --> 00:48:08,514 కానీ, ఇప్పుడు దాని గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. 744 00:48:09,097 --> 00:48:10,557 చెప్పు పర్లేదు. నువ్వు ఏ పని చేస్తున్నావు? 745 00:48:13,101 --> 00:48:14,353 నేను పోలీసు ఆఫీసరుని. 746 00:48:18,190 --> 00:48:21,193 వావ్. పోలీసు ఆఫీసరువా! 747 00:48:25,113 --> 00:48:28,825 కానీ ఒక్క విషయం, నా కుటుంబమే నాకు లోకం. 748 00:48:30,160 --> 00:48:32,287 అవును, అందులో సందేహం ఏముంటుందిలే! 749 00:48:54,601 --> 00:48:58,188 గిల్బెర్టో. హమ్మయ్య. 750 00:48:59,481 --> 00:49:02,526 నన్ను పిచ్చపిచ్చగా కొట్టగలిగే వాళ్లేమో అని కంగారుపడిపోయా. 751 00:49:04,111 --> 00:49:07,197 నువ్వు ఇక్కడ చాలా కాలం లేవు కదా, ఇక్కడ వ్యవహారాల సంగతి మర్చిపోయినట్టున్నావు. అవునా? 752 00:49:08,282 --> 00:49:09,449 నేను వాళ్లతో మాట్లాడేశాను. 753 00:49:16,582 --> 00:49:17,958 ఇక చాలు. 754 00:49:19,501 --> 00:49:20,794 లేవరా, చచ్చినోడా. 755 00:49:26,425 --> 00:49:28,135 చెప్పేది వినరా, చచ్చినోడా. 756 00:49:29,344 --> 00:49:32,347 మా నాన్న అధికారాన్ని ఇంకెప్పుడైనా తక్కువ చేసి చూశావనుకో… 757 00:49:34,349 --> 00:49:35,809 ఏం జరుగుతుందో నీకు తెలుసుగా. 758 00:49:40,397 --> 00:49:43,025 ఎస్కొబేడోకి చాడీలు చెప్తే, ఇక అంతే సంగతి. 759 00:49:44,526 --> 00:49:46,820 నీకున్న కొద్దిపాటి గౌరవాన్ని అయినా నిలుపుకో. 760 00:49:49,448 --> 00:49:51,700 మళ్లీ హెరేరాలతో పెట్టుకున్నావనుకో, 761 00:49:51,783 --> 00:49:55,204 ముక్కలు ముక్కలుగా నరికేస్తా, దరిద్రుడా. అర్థమైందా? 762 00:49:55,954 --> 00:49:57,289 గిల్బెర్టో. 763 00:49:58,790 --> 00:50:00,125 వెళ్దాం పద. 764 00:50:01,418 --> 00:50:02,753 వాడు ఉత్త సన్నాసి, కొట్టి లాభం లేదు. 765 00:50:10,135 --> 00:50:12,179 - బంగారం… - నువ్వు పోలీసు ఆఫీసర్ అని ఆమెకి చెప్పావా? 766 00:50:14,139 --> 00:50:16,517 నువ్వేమీ చెప్పకూడదని మనం ఒక మాట అనుకున్నాం కదా. 767 00:50:16,600 --> 00:50:17,935 చెప్పకుంటేనే మంచిదని అనుకున్నాం కదా. 768 00:50:18,018 --> 00:50:19,353 మరి ఆమెకి ఎందుకు చెప్పావు? 769 00:50:19,436 --> 00:50:21,813 మేము రహస్యాలు పంచుకుంటూ ఉన్నాం, బంగారం. 770 00:50:21,897 --> 00:50:26,527 రహస్యాలనా? అవును, ఇంటీరియర్ డిజైన్ క్లాసులకి వెళ్లడం, 771 00:50:26,610 --> 00:50:27,653 పోలీసు ఉద్యోగం రెండూ వేర్వేరు. 772 00:50:27,736 --> 00:50:29,154 నీకు అర్థం కావట్లేదా, మరియా? 773 00:50:29,238 --> 00:50:31,740 బంగారం, వాళ్లకి నువ్వంటే చాలా అభిమానం ఉంది. 774 00:50:33,909 --> 00:50:36,745 కానీ నీకు కావాలంటే, రేపు నేను వాళ్లకి కాల్ చేసి, ఇదంతా నా ఆలోచనే అని, 775 00:50:36,828 --> 00:50:40,040 ఇందులో నీకేమీ ప్రమేయం లేదని చెప్పేస్తాను. 776 00:50:40,123 --> 00:50:43,252 అవును. పోలీసు అవ్వాలనుకుంది నువ్వు, అందులో నాకేమీ ప్రమేయం లేదు. 777 00:50:44,002 --> 00:50:46,046 అప్పుడు నన్ను ఇంకా దారుణంగా చూస్తారు. 778 00:50:46,129 --> 00:50:47,631 పూర్తిగా వెధవనైపోతాను నేను. 779 00:50:48,507 --> 00:50:50,717 - నువ్వు మరీ అతిగా ఆలోచిస్తున్నావు. - అతిగా ఆలోచిస్తున్నానా? 780 00:50:50,801 --> 00:50:54,054 అవును, అతిగా ఆలోచిస్తున్నావు! ఎప్పటికైనా వాళ్లకి ఆ విషయం తెలియాల్సిందే కదా. 781 00:50:54,137 --> 00:50:55,389 - వాళ్లకి తేలిసే నాటికి… - హా. 782 00:50:55,472 --> 00:50:57,474 …నాకు ప్రమోషన్ వచ్చేసి ఉండేది! 783 00:50:58,267 --> 00:51:00,769 ఇక ఇప్పుడు, తమరి పుణ్యమా అని ఇక జీవితంలో నాకు ప్రమోషన్ రాదు! 784 00:51:00,853 --> 00:51:02,855 - అరవకుండా, మెల్లగా చెప్పగలవా? - బ్రహ్మాండంగా చెప్పగలను! 785 00:51:03,397 --> 00:51:04,940 నా దగ్గర ఇంకా అదిరిపోయే ఐడియా ఒకటి ఉంది. 786 00:51:21,540 --> 00:51:24,668 దేవుడే మనకి మార్గనిర్దేశం చేస్తాడు. 787 00:51:24,751 --> 00:51:27,546 దైవాభిష్టం మేరకే, చివరికి మనం మట్టిలో ఏకమైపోతాం. 788 00:51:29,423 --> 00:51:30,632 ఆమెన్. 789 00:51:30,716 --> 00:51:31,925 - ఆమెన్. - ఆమెన్. 790 00:52:18,555 --> 00:52:20,891 నటాలియా కమాచో మొరాలెస్ ఆగస్ట్ 27, 1937 - మార్చ్ 14, 1956 791 00:52:20,974 --> 00:52:22,476 ముద్దుల కూతురు, సోదరి 792 00:53:09,106 --> 00:53:11,233 నన్ను క్షమించు! 793 00:54:07,789 --> 00:54:08,707 తర్వాతి ఎపిసోడులో… 794 00:54:08,790 --> 00:54:10,417 తను కూడా వేరే బాధితుల లాగానే కనిపించింది. 795 00:54:11,084 --> 00:54:14,213 వివస్త్ర హంతకుడిని అనుకరించాలనుకున్నాడంటే వాడు ఇంకెంత పిచ్చోడు అయ్యుంటాడు? 796 00:54:14,796 --> 00:54:17,257 పోలీసులు పట్టుకుంది అసలైన హంతకుడిని కాదు. 797 00:54:17,841 --> 00:54:19,259 కెప్టెన్, నేను జెస్సికాని కలిసి వస్తున్నాను. 798 00:54:19,343 --> 00:54:21,428 నేను తనకి ఈ కార్లన్నింటినీ చూపించాను, తను ఈ కారుని ఎంచుకొంది. 799 00:54:21,512 --> 00:54:22,763 దీన్ని నేనేమంటానో తెలుసా? 800 00:54:22,846 --> 00:54:24,264 కాకతాళీయమని అంటా. 801 00:54:24,348 --> 00:54:26,350 ఈ ఉదయం నువ్వు ఆలస్యంగా వచ్చావు. 802 00:54:26,433 --> 00:54:28,477 నీ పని నువ్వు చేయ్, మరియా. 803 00:54:28,560 --> 00:54:30,229 లేదా నిన్ను ఉద్యోగంలోంచి నేనే తీసేయాల్సి వస్తుంది. 804 00:55:56,023 --> 00:55:58,025 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్