1 00:00:19,686 --> 00:00:20,896 ఇదే కెనా, 2 00:00:21,563 --> 00:00:22,606 మా కుక్క. 3 00:00:26,902 --> 00:00:30,030 ఇది అమ్మ డైరీ. 4 00:00:30,989 --> 00:00:33,825 దాన్ని మొత్తం చదివేంత సాహసం చేయలేకపోయాను. 5 00:00:35,661 --> 00:00:38,288 {\an8}"బెనీటోని తొలిసారిగా కలిసిన రోజు నాకు ఇంకా చాలా బాగా గుర్తుంది." 6 00:00:38,914 --> 00:00:41,750 {\an8}మనోలోకి అప్పుడే 18 ఏళ్లు నిండిపోయాయి. 7 00:00:43,085 --> 00:00:44,545 {\an8}వాడు బాగా పెరిగిపోయాడు. 8 00:00:45,379 --> 00:00:47,965 వాడు లేకుంటే ఈ ఆశ్రమానికి ఉన్న కళ పోతుంది. 9 00:00:47,965 --> 00:00:52,386 వాళ్లు ఆశ్రమాన్ని వదిలి వెళ్లిపోతారు, కానీ మన హృదయాల్లో కలకాలం ఉంటారు. 10 00:00:54,221 --> 00:00:56,181 వాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో గుర్తుందా? 11 00:00:56,181 --> 00:00:58,100 దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. 12 00:00:59,184 --> 00:01:00,185 ఎలా మర్చిపోగలను? 13 00:01:05,607 --> 00:01:07,734 - అయ్య బాబోయ్! మీరు బాగానే ఉన్నారా? - పిచ్చి పిల్లాడు! 14 00:01:07,734 --> 00:01:10,696 - నేను చూస్తాను, ఆగండి! - దాన్ని వదిలేయ్, బెనీటో. 15 00:01:10,696 --> 00:01:11,780 దేవుడా. 16 00:01:13,365 --> 00:01:15,534 ఇదుగోండి. అదిమి పట్టుకోండి! 17 00:01:15,534 --> 00:01:17,619 - ఆసుపత్రికి వెళ్లండి. - లేదు. 18 00:01:17,619 --> 00:01:19,413 వీడితో నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లము. 19 00:01:19,413 --> 00:01:21,081 వీడొక మృగం! చేతిలో కత్తి ఉంది! 20 00:01:21,081 --> 00:01:23,750 అతనేమీ మృగం కాదు! చిన్నపిల్లాడు అతను, భయపడుతున్నాడు, అంతే! 21 00:01:23,750 --> 00:01:24,835 రోసా. 22 00:01:24,835 --> 00:01:28,630 - లూయిస్, ఈయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లు! - నిన్ను ఒక్కదాన్నే ఒంటరిగా వదిలి వెళ్లలేను. 23 00:01:28,630 --> 00:01:30,549 - నేను చూసుకుంటాలే. - సరే, రోసా. మన్నించు. 24 00:01:32,426 --> 00:01:33,427 నాతో రండి, ఫాదర్. 25 00:01:53,989 --> 00:01:55,449 నీ పేరేంటి? 26 00:01:57,492 --> 00:01:58,785 నా పేరు రోసా. 27 00:02:01,121 --> 00:02:03,874 నీ చేతుల్లో ఉన్న కత్తితో నువ్వు ఒకరిని గాయపరిచావు. 28 00:02:05,876 --> 00:02:07,044 దాన్ని నాకు ఇస్తావా? 29 00:02:08,920 --> 00:02:09,963 నీకు భయంగా ఉందా? 30 00:02:11,798 --> 00:02:13,175 నేను కూడా ఒకప్పుడు భయపడ్డాను. 31 00:02:16,678 --> 00:02:18,931 అలా నాకు భయం కలిగినప్పుడల్లా, నాకు నేను ఒక కథ చెప్పుకుంటాను. 32 00:02:21,391 --> 00:02:24,102 నువ్వు నాకు ఆ కత్తిని ఇస్తే, నీకు కూడా ఒక కథ చెప్తాను, సరేనా? 33 00:02:26,605 --> 00:02:29,316 కానీ ఒక హెచ్చరిక. నా కథలు చాలా సరదాగా ఉంటాయి. 34 00:02:35,364 --> 00:02:36,490 నా కళ్లలోకి చూడు. 35 00:02:42,120 --> 00:02:43,956 నేను నిన్నేమీ చేయను. 36 00:02:46,750 --> 00:02:47,876 నన్ను నమ్ము. 37 00:04:02,701 --> 00:04:03,994 మా అమ్మ చిన్నతనంలో 38 00:04:04,953 --> 00:04:09,333 ఒక ప్రమాదం బారిన పడింది, దాని వల్ల తను పిల్లలను కనలేదు. 39 00:04:12,252 --> 00:04:15,881 తనకి కుటుంబమంటే అందని ద్రాక్షే ఏమో అన్న ఆలోచనతో పెరిగింది. 40 00:04:18,216 --> 00:04:19,927 అందుకే తను నన్ గా చేరింది. 41 00:04:19,927 --> 00:04:25,474 అనాథలను, తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలను ఆదరిస్తూ, 42 00:04:25,474 --> 00:04:31,355 తను కలలు కన్న కుటుంబాన్ని సంపాదించుకొనే మార్గాన్ని కనుగొంది. 43 00:04:32,856 --> 00:04:33,857 తను పెళ్లి చేసుకుందా? 44 00:04:35,817 --> 00:04:37,069 నోర్బెర్తో అనే వ్యక్తిని వివాహమాడింది. 45 00:04:38,487 --> 00:04:40,197 అతను ఏదో పేరుకే భర్త. 46 00:04:41,573 --> 00:04:43,617 అతనికి వేరే పెళ్లయి, పిల్లలు కూడా ఉన్నారు. 47 00:04:44,117 --> 00:04:45,577 అతను చనిపోయి చాలా ఏళ్లయింది. 48 00:04:46,245 --> 00:04:49,790 నేను అతని అంత్యక్రియలకు వెళ్తే, అతని భార్య నన్ను రావద్దని పంపించేసింది. 49 00:04:50,916 --> 00:04:53,836 అతని రహస్యం, రహస్యం కాదేమో. 50 00:05:07,766 --> 00:05:09,059 కమీలా. 51 00:05:10,018 --> 00:05:11,103 మనోలో. 52 00:05:13,480 --> 00:05:14,481 ఆంటోనియో. 53 00:05:19,486 --> 00:05:20,904 "మామా రోసా, 54 00:05:20,904 --> 00:05:23,782 మమ్మల్ని ఎవరూ నమ్మనప్పుడు మీరు నమ్మినందుకు ధన్యవాదాలు." 55 00:05:23,782 --> 00:05:26,994 "మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈ లోకంలో నాకు నీ తర్వాతే ఎవరైనా." 56 00:05:26,994 --> 00:05:29,913 "అమ్మా, నాపై ఇంత ప్రేమ కురిపించినందుకు ధన్యవాదాలు. 57 00:05:29,913 --> 00:05:31,874 నాకు బాగా లేనప్పుడు నువ్వు నన్ను చూసుకున్నావు." 58 00:05:31,874 --> 00:05:33,834 ఇది బెనీటోది. 59 00:05:46,263 --> 00:05:49,433 ఆమె పోలీసులకు ఎందుకు కాల్ చేయలేదని ఇందాక అడిగారు కదా. 60 00:05:51,351 --> 00:05:52,436 తనకి ఉన్న స్వాభిమానమే అందుకు కారణం. 61 00:05:54,396 --> 00:05:57,232 బెనీటో గతం గురించి ఎలా అయినా తెలుసుకోవాలనుకుంది. 62 00:05:57,816 --> 00:06:00,444 అతని లోపల ఉన్న రాక్షసుడి చెర నుండి, అతడిని విడిపించగలిగింది 63 00:06:00,444 --> 00:06:02,529 కేవలం తనే అని అనుకుంది. 64 00:06:03,614 --> 00:06:05,949 అదే ఆమె హత్యకు కారణమైంది. 65 00:06:08,827 --> 00:06:11,163 బెనీటో, అతని అమ్మని చంపి ఉండవచ్చు, 66 00:06:12,122 --> 00:06:14,291 అంత మాత్రాన, అతనే వివస్త్ర హంతకుడు అయ్యుండాలని ఏమీ లేదు. 67 00:06:14,291 --> 00:06:15,375 అది నిజమే. 68 00:06:16,168 --> 00:06:19,338 దీనికి, వివస్త్ర హంతకుని హత్యలకు మధ్య లింక్ ఏంటో మనం కనుగొనాలి. 69 00:06:21,256 --> 00:06:22,257 కారణాన్ని మనం కనుగొనాలి. 70 00:06:25,511 --> 00:06:27,262 అతను ప్రతిరోజు రాత్రి నిద్రలో పడక తడుపుతుంటాడు. 71 00:06:28,931 --> 00:06:32,351 పడకకు ఇన్ ఛార్జీ అయిన ఫాదర్ అతడిని మందలిస్తే మేలని అనుకున్నాడు, 72 00:06:32,351 --> 00:06:35,229 కానీ దాని వల్ల అతని కన్ను పోయినంత పనైంది. 73 00:06:35,229 --> 00:06:36,730 అతనికి కుటుంబం లేదా? 74 00:06:36,730 --> 00:06:37,940 అదొక మిస్టరీ అని చెప్పవచ్చు. 75 00:06:38,690 --> 00:06:41,985 పోలీసులు వచ్చి అతడిని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్లిపోయారు, పెద్దగా వివరాలేవీ చెప్పలేదు. 76 00:06:43,570 --> 00:06:44,780 మరి అతనేమైనా చెప్పాడా? 77 00:06:45,781 --> 00:06:49,034 ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఒక్క మాట కూడా ఏమీ చెప్పలేదు. 78 00:06:51,578 --> 00:06:54,373 రోసా, నీ ఆలోచన నాకు అర్థమైంది. 79 00:06:55,249 --> 00:06:56,416 నేనేమీ చెప్పలేదే. 80 00:06:57,960 --> 00:06:59,253 నువ్వు చెప్పాల్సిన పని లేదులే. 81 00:06:59,253 --> 00:07:00,879 నీ గురించి అందరి కన్నా నాకే బాగా తెలుసు. 82 00:07:02,422 --> 00:07:04,424 చూడు, ఇవాళ జరిగిన దాన్ని బట్టి చూస్తే, 83 00:07:04,424 --> 00:07:08,554 బెనీటోని మానసిక వైద్యాలయానికి పంపిస్తే మేలని నా సలహా. 84 00:07:08,554 --> 00:07:10,264 అతడిని మానసిక వైద్యాలయంలో చేర్పించాల్సిన పని లేదు. 85 00:07:11,473 --> 00:07:13,767 వాడికి కావాల్సింది ఒక కుటుంబం. అంతకు మించీ ఏం లేదు. 86 00:07:15,435 --> 00:07:19,648 కొందరు పిల్లలను ఎంత చేసినా మనం మార్చలేం, రోసా, 87 00:07:19,648 --> 00:07:22,526 ఎందుకంటే, వాళ్లకి ఏదోక లోపం ఉంటుంది. 88 00:07:22,526 --> 00:07:25,863 మదర్, అలాంటి మానసిక వైద్యాలయాలకు వెళ్లే పిల్లలు 89 00:07:26,864 --> 00:07:29,074 బయటకు వచ్చాక కూడా పెద్దగా మారరని నీకూ తెలుసు కదా. 90 00:07:32,494 --> 00:07:34,580 అతను నాకు సమాధానమిచ్చాడు. 91 00:07:34,580 --> 00:07:35,664 నా మాట వింటాడు. 92 00:07:36,456 --> 00:07:37,499 రోసా. 93 00:07:39,960 --> 00:07:42,713 అతడిని కనుగొన్న పోలీసోళ్ళు నీకేమీ చెప్పలేదని అన్నావు కదా. 94 00:07:42,713 --> 00:07:43,797 అవును. 95 00:07:43,797 --> 00:07:45,841 అతని గతాన్ని తెలుసుకోనివ్వు. 96 00:07:47,509 --> 00:07:51,805 గతం తాలూకు గాయాలు మనకి తెలిస్తే, దాన్ని బట్టి నయమవ్వడం సులభం అవుతుందని 97 00:07:52,472 --> 00:07:53,974 నీకు బాగా తెలుసు. 98 00:08:03,942 --> 00:08:05,694 "నా గతం తాలూకు మచ్చని ఇంకా నేను మోస్తూ ఉన్నాను. 99 00:08:06,486 --> 00:08:11,325 దాని వల్ల తల్లిని కాలేని పరిస్థితి నాకు ఎదురైంది, కానీ దత్తత నాకు తల్లి అయ్యే అవకాశం ఇచ్చింది. 100 00:08:13,035 --> 00:08:14,494 అందుకే నాకు బాగా తెలుసు, 101 00:08:14,494 --> 00:08:21,210 నాలాగే, బెనీటోకి కూడా కుటుంబం ఉండాల్సిన అవసరం ఉందని." 102 00:08:23,212 --> 00:08:24,588 అమ్మ గుణం అది. 103 00:08:26,465 --> 00:08:28,717 చాలా మంచిది, ఆ మంచితనమే తన పాలిట శాపమైంది. 104 00:08:29,635 --> 00:08:31,637 పిల్లలూ, ఇలా రండి! 105 00:08:32,721 --> 00:08:34,389 మీకు ఒకరిని పరిచయం చేయబోతున్నాను. 106 00:08:36,475 --> 00:08:37,934 వీళ్లు నీ తోడబుట్టినవాళ్లనుకో. 107 00:08:37,934 --> 00:08:39,269 ఇతను ఆంటోనియో. 108 00:08:39,269 --> 00:08:40,938 హాయ్. నా పేరు విసెంటే. 109 00:08:42,563 --> 00:08:44,024 నిన్ను కలవడం బాగుంది. నా పేరు కమీలా. 110 00:08:45,234 --> 00:08:46,985 నీ వయస్సు ఎంత? నాకు తొమ్మిది ఏళ్లు. 111 00:08:49,905 --> 00:08:51,823 బెనీటో ఇంకా మాట్లాడే స్థితిలో లేడు, 112 00:08:52,366 --> 00:08:55,827 కానీ అతనితో మనం మాట్లాడవచ్చు, కదా? 113 00:08:56,495 --> 00:08:58,372 నువ్వు కలవాల్సిన వారు ఇంకొకరున్నారు. 114 00:08:58,997 --> 00:09:03,168 కెనా! ఇలా రా, తల్లీ. 115 00:09:04,878 --> 00:09:07,923 చాలా మంచి కుక్క, అస్సలు మొరగదు. ముసలి కుక్కే, కానీ చాలా స్నేహంగా ఉంటుంది. 116 00:09:10,592 --> 00:09:12,094 ఎవరెవరికి ఆకలిగా ఉందంట? 117 00:09:12,094 --> 00:09:13,554 - నాకు. - నాకు. 118 00:09:13,554 --> 00:09:16,265 - తిందాం పదండి. డైనింగ్ టేబుల్ పైకి అన్నీ తెచ్చి పెట్టండి. - పదండి. 119 00:09:17,683 --> 00:09:20,477 మొదటి రోజు నుండే విచిత్రంగా ఉండేవాడు అతను. 120 00:09:21,103 --> 00:09:22,771 ఎప్పుడూ మాట్లాడేవాడే కాదు. 121 00:09:24,273 --> 00:09:25,607 అలా అని బిడియస్థుడిలా అనిపించలేదు. 122 00:09:27,276 --> 00:09:28,735 అంటే... 123 00:09:29,820 --> 00:09:32,906 ఏదో ప్లాన్ వేస్తున్నట్టుగా అనిపించేవాడు. 124 00:09:35,909 --> 00:09:38,245 మీ అమ్మగారి గురించి చెప్పు. 125 00:09:39,621 --> 00:09:41,582 తన విషయంలో నీకు ఉన్న మంచి జ్ఞాపకాలను చెప్పు. 126 00:09:44,084 --> 00:09:45,919 లేదా మీ నాన్న గురించి అయినా పర్వాలేదు. 127 00:09:49,673 --> 00:09:50,674 హాయ్. 128 00:09:52,301 --> 00:09:53,886 నువ్వేనా బెనీటో అంటే! 129 00:09:55,596 --> 00:09:57,764 బెనీటో, ఈయన పేరు నోర్బెర్తో. 130 00:09:58,849 --> 00:10:00,934 అప్పుడప్పుడూ ఇక్కడికి వస్తుంటాడు. 131 00:10:00,934 --> 00:10:02,352 వీలైనప్పుడల్లా. 132 00:10:04,229 --> 00:10:05,856 నేను బయట ఉంటాను. 133 00:10:11,695 --> 00:10:13,113 ఏమైంది? 134 00:10:14,781 --> 00:10:16,783 ఇలా నీళ్లు వేయమంటావా, హా? 135 00:10:37,554 --> 00:10:38,931 నేను అతడిని పడుకోబెట్టి రావాల్సి వచ్చింది. 136 00:10:38,931 --> 00:10:40,098 ఇవాళ అతని మొదటి రోజు ఇక్కడ. 137 00:10:42,017 --> 00:10:44,895 ఇంకా పిల్లలని దత్తత తీసుకోవని చెప్పావు కదా. 138 00:10:44,895 --> 00:10:47,272 నువ్వు కూడా నీ భార్యని వదిలేస్తావని చెప్పావు కదా. 139 00:10:49,107 --> 00:10:50,150 అదీ, ఇదీ ఒకటేనా? 140 00:10:52,819 --> 00:10:54,363 అతనికి నేను అమ్మ కావాలని ఆ దేవుడి కోరిక. 141 00:10:56,865 --> 00:11:00,118 మనోలో వెళ్లిపోతే, నీకు ముగ్గురు పిల్లలుంటారు కదా. 142 00:11:01,078 --> 00:11:02,538 నలుగురు పిల్లలెందుకు? 143 00:11:03,288 --> 00:11:04,623 నువ్వు నాకు సాయం చేయవచ్చు. 144 00:11:05,249 --> 00:11:06,708 నువ్వు కూడా నాతో పాటు ఇక్కడే ఉంటే. 145 00:11:12,130 --> 00:11:13,340 ఆగు. 146 00:11:15,259 --> 00:11:17,010 హేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? 147 00:11:39,366 --> 00:11:40,534 ఏమీ కాలేదు, బంగారం. 148 00:11:41,285 --> 00:11:43,787 ఏమీ కాలేదు. శాంతించు. 149 00:11:44,454 --> 00:11:45,455 సరేనా? 150 00:11:49,710 --> 00:11:51,461 ఏమీ కాలేదు. 151 00:11:52,588 --> 00:11:53,589 చూద్దాం, ఆగు. 152 00:11:53,589 --> 00:11:54,840 నాకొక దుప్పటి ఇవ్వు, 153 00:11:57,301 --> 00:11:59,303 నీ నైట్ డ్రెస్ కూడా మార్చుకో. 154 00:12:03,807 --> 00:12:04,892 ఇది నువ్వే గీశావా? 155 00:12:05,517 --> 00:12:09,605 "ఎందుకు ఇంత నరకం అనుభవిస్తున్నావు? అంతలా నీ మనస్సును ఎవరు గాయపరిచారు?" 156 00:12:15,777 --> 00:12:21,658 "అతను దేని వల్ల లేదా ఎవరి వల్ల ఇంత భయపడుతున్నాడో నేను తెలుసుకోవాలి." 157 00:12:28,957 --> 00:12:30,375 మరి ఏం తెలుసుకున్నావు, రోసా? 158 00:12:33,212 --> 00:12:34,713 ఇతడిని నేనెలా మర్చిపోగలను? 159 00:12:35,839 --> 00:12:38,342 కానీ ఈ కేసు గురించి 160 00:12:39,134 --> 00:12:41,803 నేను మీకు ఏమీ చెప్పలేను, మన్నించండి. 161 00:12:41,803 --> 00:12:44,473 మీరు నాకు ఏం చెప్పినా, అది మూడో కంటికి తెలియనివ్వనని ఒట్టేసి చెప్తున్నాను. 162 00:12:45,057 --> 00:12:46,725 ఇది న్యాయస్థాన ఆదేశం, మేడమ్. 163 00:12:47,309 --> 00:12:48,977 ఈ నియమాలు నేను రూపొందించినవి కావు. 164 00:12:48,977 --> 00:12:51,146 అయితే, ఆ కేసు ఇంకా తెరిచే ఉందా? 165 00:12:52,397 --> 00:12:53,774 లేదు. 166 00:12:54,525 --> 00:12:56,527 ఆ పని ఎవరు చేశారో ఇంకా మాకు తెలీదు. 167 00:12:56,527 --> 00:13:00,447 - మీరేమో సాధారణ పౌరులు... - ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. 168 00:13:00,948 --> 00:13:04,660 చాలా భయానకమైన సంఘటనలను ఎదుర్కొన్న చిన్నారులను చూసుకోవడంలో నాకు చాలా ఏళ్ల అనుభవం ఉంది. 169 00:13:05,911 --> 00:13:09,164 వాళ్లకి సాయపడాలంటే, వాళ్ల గతం గురించి నాకు తెలియాలి. 170 00:13:12,125 --> 00:13:13,710 మానసికంగా వారు పడే బాధ గురించి నాకు తెలీకపోతే, 171 00:13:15,462 --> 00:13:16,964 ఆ బాధను నేనెలా దూరం చేయగలను? 172 00:13:16,964 --> 00:13:18,465 బెనీటో అస్సలు మాట్లాడడు. 173 00:13:19,633 --> 00:13:22,761 నెల నుండి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. 174 00:13:22,761 --> 00:13:25,639 కానీ పడుకున్న సమయంలో ప్రతి రాత్రి, 175 00:13:26,390 --> 00:13:28,892 పీడకలల వలన లేచేస్తాడు, ఒళ్లంతా చెమటలు పట్టేసి ఉంటాయి. 176 00:13:29,434 --> 00:13:32,855 ఒకవేళ అతడిని మాట్లాడగలిగించానంటే, అప్పుడు అతని తల్లికి ఏమైంది అనే దాని గురించి 177 00:13:34,231 --> 00:13:35,899 మాకు ఏమైనా చెప్తాడేమో. 178 00:13:36,441 --> 00:13:38,610 అది కూడా మీ దర్యాప్తుకు తోడ్పడుతుంది కదా. 179 00:13:38,610 --> 00:13:39,695 దయచేసి, నాకు సాయపడండి. 180 00:13:43,156 --> 00:13:45,742 మేము చూసిన దృశ్యం, ఎవరూ చూడకూడదు అన్నంత భయంకరమైనది, 181 00:13:46,994 --> 00:13:48,412 అంత చిన్న పిల్లాడు అయితే అస్సలు చూడకూడదు కదా. 182 00:13:51,164 --> 00:13:54,585 ఆ రాత్రి, నీటి శుద్ది కర్మాగారం నుండి మాకు ఒక కాల్ వచ్చింది. 183 00:14:03,844 --> 00:14:05,179 ఇన్స్పెక్టర్ మొరాలెస్. 184 00:14:05,679 --> 00:14:06,889 గార్సియా. 185 00:14:08,432 --> 00:14:10,893 - ఎవరి పైన అయినా అనుమానం ఉందా? - ఇంకా లేదు. 186 00:14:10,893 --> 00:14:13,228 మేనేజర్లని, సిబ్బందిని పిలుస్తున్నాం. 187 00:14:14,062 --> 00:14:16,023 అంతా మామూలుగానే ఉండిందని అందరి మాట. 188 00:14:16,815 --> 00:14:18,483 బాధితురాలు ఈ కర్మాగారంలోనే పని చేసింది. 189 00:14:19,026 --> 00:14:21,612 ఆమె పెరు, హసింటా పెరేయా. 190 00:14:21,612 --> 00:14:22,946 నాతో పాటు రండి, సర్. 191 00:14:29,203 --> 00:14:30,412 ఇక్కడ, సర్. 192 00:14:30,412 --> 00:14:32,080 ఆ 37వ ట్యాంకులో సర్. 193 00:14:32,080 --> 00:14:35,709 - ఆమెని బయటకు తీశారా? - లేదు. మీరు వచ్చేదాకా ఆగాం. 194 00:14:35,709 --> 00:14:37,419 ఏంటిది, గార్సియా? 195 00:14:37,419 --> 00:14:38,629 కాస్తయినా మర్యాద చూపాలి కదా? 196 00:14:39,546 --> 00:14:42,174 - ఈమె శవాన్ని బయటకు తీయండి! - విన్నారు కదా. బయటకు తీయండి! 197 00:14:44,468 --> 00:14:46,178 ఓయ్, పిల్లోడా, అక్కడ ఉండకూడదు నువ్వు! 198 00:14:46,929 --> 00:14:48,055 అక్కడ ఆ పిల్లాడు ఏం చేస్తున్నాడు? 199 00:14:48,055 --> 00:14:49,932 - వాడి వద్దకి వెళ్లి, ఏం చూశాడో అడగండి! - సరే, సర్. 200 00:14:49,932 --> 00:14:51,433 - త్వరగా. - వాడిని పట్టుకోండి! 201 00:14:51,433 --> 00:14:55,479 "ఆ రాత్రి, బెనీటో చూసిన దృశ్యం ఎలాంటి వారిని అయినా ముక్కలు చేసేయగలదు. 202 00:14:56,355 --> 00:14:58,774 శవమై పడి ఉన్న తన కన్నతల్లిని చూశాడు. 203 00:14:59,816 --> 00:15:01,735 చెత్త లాగా పడేసిన ఆమె శవాన్ని చూశాడు." 204 00:15:01,735 --> 00:15:05,447 కర్మాగారంలోని ఆమె మిత్రులు, తను ఎవరితోనూ మాట్లాడదని చెప్పారు. 205 00:15:05,989 --> 00:15:08,992 మేము ఆ పిల్లాడిని పట్టుకొని, వాడి ఇంటికి తీసుకెళ్లాము, 206 00:15:08,992 --> 00:15:11,495 అక్కడ ఇంకెవరైనా ఉంటారా, లేదా అని తీసుకెళ్లాం, 207 00:15:12,246 --> 00:15:13,247 కానీ అక్కడ ఎవరూ లేరు. 208 00:15:14,414 --> 00:15:15,415 వాళ్లిద్దరే ఉండేవాళ్లు. 209 00:15:15,958 --> 00:15:18,168 అయితే, అతని తండ్రి గురించి ఏ సమాచారమూ లేదా? 210 00:15:19,795 --> 00:15:21,046 దీన్ని నేను తీసుకెళ్లవచ్చా? 211 00:15:22,673 --> 00:15:24,341 గతం తాలూకు వస్తువులు... 212 00:15:26,426 --> 00:15:29,012 గుర్తుంచుకోవాలనే ఆకాంక్షని కలిగించవచ్చు. 213 00:15:32,099 --> 00:15:37,020 మేము ఆ పిల్లాడిని శరణాలయానికి తీసుకెళ్లే ముందు, 214 00:15:38,647 --> 00:15:41,483 సామాను సర్దడానికని వాడి ఇంటికి తీసుకెళ్లాం. 215 00:15:43,527 --> 00:15:46,113 అక్కడ మీకు మరింత సమాచారమేమైనా దొరకవచ్చు. 216 00:16:19,938 --> 00:16:21,231 క్షమించు, బెనీటో. 217 00:16:25,027 --> 00:16:27,946 నేను నీకు సాయపడదామనే అనుకుంటున్నా, కానీ నువ్వు కూడా మాట్లాడాలి, నాకు అవకాశమివ్వాలి. 218 00:16:33,744 --> 00:16:34,953 నిన్నేమీ నేను బలవంతపెట్టను, 219 00:16:35,829 --> 00:16:38,540 కానీ నాకు అవకాశం ఇస్తే, నీకే చాలా మేలు జరుగుతుంది. 220 00:16:41,376 --> 00:16:43,337 బహుశా దాని వల్ల నీకు పీడకలలు రావడం కూడా ఆగిపోవచ్చేమో. 221 00:16:45,339 --> 00:16:46,673 అది నీకు వద్దా? 222 00:16:51,428 --> 00:16:52,429 నన్ను క్షమించు, సరేనా? 223 00:16:55,098 --> 00:16:56,099 నన్ను మన్నించు. 224 00:17:00,062 --> 00:17:02,523 "అతని గతాన్ని తెలుసుకోవాలని నాకు ఎంత కుతూహలంగా ఉన్నా, 225 00:17:03,315 --> 00:17:07,027 ఇచ్చిన మాటకి కట్టుబడి, అతని అనుమతి లేకుండా అతని వస్తువులని ముట్టుకోవడం ఆపేశాను. 226 00:17:08,194 --> 00:17:12,616 తాడు చికిత్స వల్ల అయినా అతను నోరు తెరుస్తాడని అనుకున్నా, కానీ అది కూడా విఫలమైపోయింది." 227 00:17:14,117 --> 00:17:15,410 తాడు చికిత్స అంటే ఏంటి? 228 00:17:18,997 --> 00:17:23,752 మన బుర్రకి ఏదోక పని చెప్పి, 229 00:17:24,670 --> 00:17:27,297 మాటలు బయటకు వచ్చేలా చేయగల కార్యం అది. 230 00:17:29,967 --> 00:17:32,219 లేదు, విసెంటే. నువ్వు మళ్లీ మొదట్నుంచీ చేయాలి. 231 00:17:33,011 --> 00:17:35,389 చెప్పా కదా, ఇది ఇంకా బిగుతుగా ఉండాలి. 232 00:17:36,181 --> 00:17:37,349 సరే, అమ్మా. 233 00:17:38,225 --> 00:17:41,103 స్వర్గంలో ఉన్న మా అమ్మకి నేను ఒక లేఖని పంపుదామనుకుంటున్నా. 234 00:17:41,603 --> 00:17:42,604 అలా పంపడం కుదురుతుందా? 235 00:17:43,522 --> 00:17:44,898 కుదురుతుంది. 236 00:17:44,898 --> 00:17:46,483 దాన్ని ఒక బెలూన్ కి కట్టేసి పంపుదాం. 237 00:17:47,192 --> 00:17:48,735 పైకి వెళ్లేటప్పుడు ఏ పక్షి అయినా దాన్ని తినేస్తే? 238 00:17:48,735 --> 00:17:51,572 ఆ లేఖ దాని గొంతులోనే ఇరుక్కుపోతుంది. 239 00:17:54,741 --> 00:17:58,078 నీ సంగతేంటి, బెనీటో? నువ్వేమైనా చెప్తావా? 240 00:18:01,957 --> 00:18:04,251 బెనీటో అల్లిన తాడు చూశారా? 241 00:18:04,251 --> 00:18:05,919 తాడు చాలా బాగుంది. చూడండి. 242 00:18:05,919 --> 00:18:08,797 పైగా వీడు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. చూశారా? 243 00:18:08,797 --> 00:18:11,300 చాలా బాగా చేశావు. సూపర్. 244 00:18:16,597 --> 00:18:18,140 విసెంటే. 245 00:18:18,140 --> 00:18:19,474 విసెంటే! 246 00:18:19,474 --> 00:18:21,727 "విసెంటే గురించి నాకు కొంచెం ఆందోళనగా ఉంది. 247 00:18:21,727 --> 00:18:23,395 అతను బొనీటోని ఏదో శత్రువు చూసినట్టు చూస్తున్నాడు. 248 00:18:24,813 --> 00:18:26,148 వాడికి అసూయగా ఉందనుకుంటా." 249 00:18:26,148 --> 00:18:28,817 అది నిజం కాదు. నేనేమీ అసూయపడలేదు. 250 00:18:29,818 --> 00:18:33,864 ఏదో కీడు జరగబోతోందని నేను గ్రహించానంతే. 251 00:18:35,073 --> 00:18:36,491 మీకు ఎందుకలా అనిపించింది? 252 00:18:40,204 --> 00:18:41,955 వాడు అమ్మని అదోలా చూసేవాడు. 253 00:18:43,332 --> 00:18:44,541 ఆమె అంటే ఏదో అసహ్యం ఉన్నట్టు. 254 00:18:47,085 --> 00:18:48,462 నన్ను మిస్ అయ్యావా? 255 00:18:51,173 --> 00:18:52,424 మిస్ అయ్యానని నీకు తెలుసు కదా. 256 00:18:53,383 --> 00:18:55,344 కానీ నువ్వు చివరిసారిగా ఇక్కడికి వచ్చి నెల అయింది. 257 00:18:57,638 --> 00:18:58,764 నువ్వు వస్తావని నేను అనుకోలేదు. 258 00:19:05,229 --> 00:19:06,230 నా మీద ప్రేమ ఉందా? 259 00:19:08,607 --> 00:19:09,608 చచ్చేంత ఉంది. 260 00:19:11,944 --> 00:19:13,070 అందుకే కదా ఇక్కడికి వచ్చాను? 261 00:19:18,408 --> 00:19:19,409 అవును. 262 00:19:20,244 --> 00:19:23,205 మనం కోరుకున్నవన్నీ మనకి దక్కకపోవచ్చు, 263 00:19:24,706 --> 00:19:25,707 కానీ దీన్ని, 264 00:19:26,416 --> 00:19:27,501 ఈ డాన్స్ ని, 265 00:19:28,627 --> 00:19:30,337 మన నుండి ఎవరూ దూరం చేయలేరు. 266 00:19:36,051 --> 00:19:37,761 ఆపు! నన్ను వదులు! 267 00:19:39,304 --> 00:19:41,390 వాడు అమ్మని ఓ కంట గమనిస్తూనే ఉండేవాడు. అమ్మంటే వాడికి పడదు. 268 00:19:42,099 --> 00:19:45,435 బెనీటో చాలా ప్రమాదకరమైనవాడని నాకు తెలుసు. నాకు ముందే తెలుసు అది. 269 00:19:46,603 --> 00:19:48,939 - నా జోలికి రాకు! - శాంతించండి! ఆపండి ఇక! 270 00:19:48,939 --> 00:19:51,066 ఇక చాలు! ఏమైంది నీకు? 271 00:19:51,066 --> 00:19:53,151 నాకేం కాలేదు! వాడే దీనికి కారణం! వాడొక మృగం! 272 00:19:53,151 --> 00:19:54,987 అలా అనవద్దు! 273 00:19:56,780 --> 00:19:59,157 వాడు తలుపు చాటు నుండి నిన్ను దొంగచాటుగా చూస్తూ ఉన్నాడు! 274 00:19:59,157 --> 00:20:02,119 - అది నిజమా? బెనీటో, అది నిజమా? - శాంతించండి. 275 00:20:04,746 --> 00:20:07,416 మీ గదులకు వెళ్లండి! వెళ్లండి! 276 00:20:07,416 --> 00:20:08,876 - నీకేమీ కాలేదు కదా? - ఏమీ కాలేదు. 277 00:20:10,627 --> 00:20:11,628 వెళ్లు. 278 00:20:16,800 --> 00:20:19,052 ఇక చాలు, బెనీటో. నేను చాలా నిక్కచ్చిగా చెప్తున్నా. 279 00:20:20,429 --> 00:20:23,056 ఈ ఇంట్లో, ఎలాంటి హింసకైనా చోటు లేదు. 280 00:20:24,224 --> 00:20:26,268 ఒక్కోసారి నువ్వు మాట్లాడటానికి సిద్ధంగానే ఉన్నావేమో అనిపిస్తుంది. 281 00:20:28,979 --> 00:20:30,939 ఒక్కోసారి అది జరగని పని అని అనిపిస్తుంది. 282 00:20:32,691 --> 00:20:34,818 నీ బుర్రలో ఏం నడుస్తూ ఉందో నాకు అర్థం కావట్లేదు. 283 00:20:36,445 --> 00:20:38,280 అంత భయం ఎందుకు? అంత ద్వేషం ఎందుకు? 284 00:20:41,116 --> 00:20:43,535 ఒక్కోసారి, పెద్ద మదర్ చెప్పింది నిజమేనేమో అనిపిస్తుంది. 285 00:20:46,121 --> 00:20:49,333 బహుశా నీకు కావలసిన సాయం నేను చేయలేనేమో. 286 00:20:52,878 --> 00:20:55,797 "సరిగ్గా నేను ఇక నా వల్ల కాదని వదిలేయబోయే సమయంలో..." 287 00:20:56,715 --> 00:20:59,510 నేను మీకు చెప్తే, మీరెవరికీ చెప్పరని మాటిస్తారా? 288 00:21:06,517 --> 00:21:07,726 దేవుని మీద ఒట్టు, ఎవరికీ చెప్పను. 289 00:21:10,646 --> 00:21:12,648 మా అమ్మ పేరు హసింటా. 290 00:21:14,358 --> 00:21:16,610 "అతను నోరు తెరవడం అదే మొదటిసారి, 291 00:21:17,444 --> 00:21:19,947 అదీగాక, ఏం జరిగిందో అప్పుడు తప్ప ఇంకెప్పుడూ చెప్పలేదు. 292 00:21:21,365 --> 00:21:23,825 ఆ రోజు కూడా, అనేక ఇతర రాత్రుళ్ళ లాగానే... 293 00:21:24,535 --> 00:21:26,662 అమ్మ అరుపులకి వాడు నిద్ర లేచాడు." 294 00:21:32,459 --> 00:21:33,877 ఎందుకు నాతో అబద్ధమాడావు? 295 00:21:33,877 --> 00:21:35,045 నా ముఖం మీదే అబద్ధం చెప్పావే! 296 00:21:38,549 --> 00:21:40,300 ఎక్కడికెళ్లావు? 297 00:21:40,300 --> 00:21:42,344 అరగంట నుండి నీ కోసం ఎదురు చూస్తున్నా! 298 00:21:42,970 --> 00:21:43,971 అరగంట నుండి! 299 00:21:43,971 --> 00:21:46,723 ఎవరది? 300 00:21:48,016 --> 00:21:50,686 ఎవరితో కులుకుతున్నావు? 301 00:21:54,690 --> 00:21:56,233 లే, బెనీటో! 302 00:21:59,319 --> 00:22:01,029 ఇక్కడే ఉండు. కళ్లు తెరవకు. 303 00:22:11,957 --> 00:22:12,958 చూడవద్దు, బెనీటో. 304 00:22:17,171 --> 00:22:19,673 "ఆ రోజు అతనికి ఏం అనిపించిందో అడిగి చూశాను, 305 00:22:20,382 --> 00:22:23,177 కానీ అతను ఏం జరిగిందో మాత్రమే చెప్పాడు. 306 00:22:24,636 --> 00:22:27,139 ఏ తల్లి అయినా ఏం చేస్తుందో, హసింటా కూడా అదే చేసింది. 307 00:22:28,182 --> 00:22:30,642 తన కొడుక్కి మంచి జీవితం ఇవ్వాలనుకుంది, 308 00:22:32,519 --> 00:22:34,479 కాబట్టి అతడిని శాశ్వతంగా తనతో పాటు తీసుకెళ్లిపోయింది. 309 00:22:36,857 --> 00:22:41,153 అలా వెళ్లిపోవడం వల్ల... ప్రమాదం ఏంటో హసింటాకి బాగా తెలుసు, 310 00:22:42,571 --> 00:22:46,116 కానీ అక్కడే ఉంటే అది మరింత ప్రమాదకరమని కూడా తనకి తెలుసు." 311 00:22:47,868 --> 00:22:48,869 పాపం ఆవిడ. 312 00:23:07,513 --> 00:23:09,640 మనిద్దరం కలిసి ఉన్నాం కదా, అదే ముఖ్యం. 313 00:23:10,682 --> 00:23:12,518 ఇక ఇప్పటి నుండి మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. 314 00:23:13,101 --> 00:23:14,102 ఎప్పటికీ. 315 00:23:27,282 --> 00:23:29,368 నా ప్రాణం మీద ఒట్టేసి చెప్తున్నా. 316 00:23:30,035 --> 00:23:31,703 నిజమైన వాగ్దానాలు... 317 00:23:32,746 --> 00:23:33,747 ఎప్పటికీ వీగిపోవు. 318 00:23:43,257 --> 00:23:46,093 "హసింటా, తాను ఇచ్చిన వాగ్దానాన్ని కొంత కాలం బాగానే నిలుపుకుంది. 319 00:23:48,136 --> 00:23:51,306 నీటి శుద్ది కర్మాగారంలో ఉద్యోగం సంపాదించింది. 320 00:23:52,432 --> 00:23:55,811 ప్రతీ ఉదయం బెనీటో ఆమెతో బస్సు దాకా తోడు వెళ్లి, దగ్గర ఉండి ఎక్కించేవాడు. 321 00:24:03,277 --> 00:24:06,530 అంత చిన్న వయస్సులో కూడా ప్రతీరోజు మధ్యాహ్నం వెళ్లి ఆమెని పికప్ చేసుకునేవాడు. 322 00:24:07,406 --> 00:24:10,284 ఆమె రక్షణ తన బాధ్యతగా బెనీటో భావించాడు. 323 00:24:13,120 --> 00:24:17,082 కొంచెం కొంచెంగా, వారు పారిపోయి వచ్చిన, ఆ చిన్ని చీకటి చోటు 324 00:24:17,583 --> 00:24:20,169 వారి ఇల్లులా మారసాగింది. 325 00:24:20,919 --> 00:24:22,337 కానీ ఒక రోజు... 326 00:24:26,758 --> 00:24:31,430 బెనీటో, తాను పొరబడ్డాడని అనుకొని, తర్వాతి బస్సు కోసం వేచి చూశాడు, 327 00:24:31,430 --> 00:24:35,017 అలా ఒక్కో బస్సు కోసం పొద్దుపోయే దాకా వేచి చూశాడు." 328 00:24:36,393 --> 00:24:37,686 హేయ్, పిల్లోడా. 329 00:24:38,854 --> 00:24:39,855 ఎక్కు. 330 00:24:40,898 --> 00:24:42,816 మీ అమ్మ దిగే చోటుకు తీసుకెళ్తా. 331 00:24:48,530 --> 00:24:51,408 "చివరి స్టాప్ అయిన నీటి శుద్ది కర్మాగారం దాకా 332 00:24:52,242 --> 00:24:53,785 బెనీటో ఆ బస్సులో వెళ్లాడు. 333 00:25:39,665 --> 00:25:42,793 ఒక క్షణం పాటు, తాను దెయ్యాన్ని చూస్తున్నాడని అతను అనుకున్నాడు, కానీ... 334 00:25:43,585 --> 00:25:44,586 అది దెయ్యం కాదు. 335 00:25:45,462 --> 00:25:48,173 తన కళ్ల ముందు ఉండేది, తన తండ్రి, రెనే. 336 00:25:48,966 --> 00:25:51,218 అతను బతికే ఉన్నాడు, వాళ్లిద్దరి ఆచూకీని అతను కనిపెట్టేశాడు." 337 00:25:54,096 --> 00:25:56,765 దయచేసి నన్ను వదిలేయ్! 338 00:25:58,141 --> 00:25:59,810 కట్లు విప్పు! 339 00:25:59,810 --> 00:26:00,978 నా మాట విను. 340 00:26:02,354 --> 00:26:04,439 తప్పు చేసింది మీ నాన్న, నువ్వు కాదు. 341 00:26:06,525 --> 00:26:07,526 నువ్వు కానే కాదు. 342 00:26:12,030 --> 00:26:13,532 ఇక నువ్వు ప్రశాంతంగా పడుకోవచ్చు. 343 00:26:15,784 --> 00:26:17,286 నిన్ను ఇక ఎవరూ ఏమీ చేయరు. 344 00:26:20,956 --> 00:26:23,709 అయితే, నేను ఆసుపత్రికి వెళ్లాల్సిన పని లేదు, కదా? 345 00:26:25,169 --> 00:26:26,253 అస్సలు లేదు. 346 00:26:31,758 --> 00:26:33,302 నా మీద నమ్మకం ఉంచినందుకు థ్యాంక్యూ. 347 00:26:42,269 --> 00:26:44,521 ఇక విశ్రాంతి తీసుకో. కంటి నిండా నిద్రపో. 348 00:27:06,543 --> 00:27:08,462 "అప్పటి దాకా, నేను ఆడిన మాటను ఎప్పుడూ జవదాటలేదు, 349 00:27:09,087 --> 00:27:12,633 కానీ ఆ క్షణంలో, బెనీటోని కాపాడటానికి నిజాన్ని పోలీసులకు చెప్పడమే 350 00:27:12,633 --> 00:27:14,760 ఏకైక దారి అని నాకు బలంగా అనిపించింది. 351 00:27:16,094 --> 00:27:17,721 బెనీటో ఆ రోజు కళ్ళారా చూశాడు కాబట్టే, 352 00:27:17,721 --> 00:27:20,933 నెల కూడా తిరక్కుండానే, వాళ్ల నాన్న జైలుపాలయ్యాడు." 353 00:27:21,808 --> 00:27:23,936 తండ్రీకొడుకులు, ఒకళ్లకు మించినోళ్లు ఒకరు. 354 00:27:25,187 --> 00:27:27,022 ఇద్దరూ దుర్మార్గులే. 355 00:27:32,319 --> 00:27:33,820 నేను వెళ్లి కుక్కలకు ఆహారం పెట్టి వస్తాను. 356 00:27:39,243 --> 00:27:44,122 అంత హింస మధ్య పెరిగితే, ఎవరి మానసిక స్థితి అయినా ఛిద్రమైపోతుంది. 357 00:27:44,122 --> 00:27:45,499 అదేమీ నిజం కాదు. 358 00:27:45,499 --> 00:27:47,209 అది ముమ్మాటికీ నిజమే. 359 00:27:47,709 --> 00:27:51,296 - నిస్సందేహంగా... - నా తల్లిదండ్రులను నా కళ్ల ముందే చంపారు, 360 00:27:53,006 --> 00:27:56,677 కానీ ఇతరులకి హాని తలపెట్టాలని నాకెప్పుడూ అనిపించలేదు. 361 00:27:58,512 --> 00:28:03,559 ఒక వ్యక్తి గతాన్ని బట్టి, వారి ప్రస్తుత గుణాన్ని అంచనా వేయకూడదు. 362 00:28:07,062 --> 00:28:11,900 అయితే, బెనీటోనే వివస్త్ర హంతకుడా, కాదా? 363 00:28:13,235 --> 00:28:14,236 నాకు తెలీదు. 364 00:28:15,988 --> 00:28:18,740 మనకి తెలిసినది ఏదైనా ఉందంటే, అది బెనీటోకి తాడును అల్లడం బాగా వచ్చు అనే విషయమే. 365 00:28:20,075 --> 00:28:21,827 బెనీటో ఇతరులతో అంత ఎక్కువగా కలవడని మనకి అర్థమైంది, 366 00:28:22,494 --> 00:28:27,624 కానీ రోసాతో ఉండటం వల్ల అతనిలో హింస తగ్గిందనే అనిపిస్తోంది. 367 00:28:31,670 --> 00:28:33,130 ఇప్పుడే మనం ఏమీ చెప్పలేం. 368 00:28:34,548 --> 00:28:35,966 మనకి ఇంకా ఎక్కువ సమాచారం కావాలి. 369 00:28:38,635 --> 00:28:42,097 నేను కాస్త అలా తాజా గాలి పీల్చుకు వస్తా, ఆ తర్వాత మనం కొనసాగిద్దాం. 370 00:29:13,170 --> 00:29:14,546 నీ కోసం నేను వేచి చూశా. 371 00:29:15,797 --> 00:29:17,424 ఆ రాత్రి వేళ మనం మాట్లాడుకోవాలి అనుకున్నాం కదా. 372 00:29:19,259 --> 00:29:21,720 ఈమధ్య నా జీవితంలో చాలా ఆటుపోట్లు చోటుచేసుకుంటున్నాయి. 373 00:29:25,265 --> 00:29:26,350 మనం చేసిన పనికి బాధపడుతున్నావా? 374 00:29:29,311 --> 00:29:31,396 నేను చిన్నప్పటి నుండి నేర్చుకున్న దాన్ని బట్టి... 375 00:29:33,857 --> 00:29:37,569 మనిద్దరి మధ్య జరిగినది తప్పే అని చెప్పాలి. 376 00:29:40,739 --> 00:29:41,740 కానీ... 377 00:29:44,243 --> 00:29:45,577 నాకు అలా అనిపించట్లేదు. 378 00:29:46,411 --> 00:29:49,206 ప్రస్తుతం నా మనస్సంతా అయోమయంలో ఉంది. 379 00:29:51,250 --> 00:29:52,376 ఇప్పుడు నేను... 380 00:29:53,710 --> 00:29:56,672 నా ఫీలింగ్స్ పై దృష్టి పెట్టలేకపోతున్నా. 381 00:29:59,091 --> 00:30:03,220 ఏదైనా చేసే ముందు 382 00:30:03,220 --> 00:30:07,057 నా జీవితం ఏ తీరాలకు చేరుతోందో తెలియడం నాకు ముఖ్యం... 383 00:30:08,350 --> 00:30:10,561 లేదంటే మనిద్దరం బాధపడతాం. 384 00:30:12,354 --> 00:30:13,522 నా గురించి ఆలోచించకు. 385 00:30:16,733 --> 00:30:18,652 నాకు బాధ కొత్తేం కాదు, అది నాకు అలవాటే. 386 00:30:20,362 --> 00:30:22,364 మిమ్మల్ని అంతగా బాధపెట్టిన విషయం ఏంటి? 387 00:30:29,288 --> 00:30:30,289 నాకు ఒక కొడుకు ఉండేవాడు. 388 00:30:32,541 --> 00:30:33,834 ఈపాటికి వాడికి అయిదేళ్లు వచ్చుండేవి. 389 00:30:36,003 --> 00:30:37,921 కానీ 11 నెలల అప్పుడే చనిపోయాడు. 390 00:30:40,841 --> 00:30:41,884 అప్పుడు నేను వాడి దగ్గరే ఉన్నా. 391 00:30:43,969 --> 00:30:45,053 వాడి గదిలోనే ఉన్నా. 392 00:30:46,889 --> 00:30:48,390 నిద్రలోకి జారుకున్నా... 393 00:30:51,810 --> 00:30:52,853 వాడి పక్కన ఉండగానే అన్నమాట. 394 00:30:58,567 --> 00:31:04,239 వాడు ఊపిరి తీసుకోవడం లేని వాళ్ల అమ్మ పెట్టే కేకలకి లేచాను. 395 00:31:16,835 --> 00:31:18,504 పోలీసు ఉద్యోగం పోయింది. 396 00:31:20,380 --> 00:31:22,090 అది సరైన పనే. 397 00:31:25,135 --> 00:31:28,722 కన్న కొడుకునే చూసుకోలేకపోయాను, ఇక నగరాన్ని ఏం చూసుకుంటాను? 398 00:31:29,640 --> 00:31:30,891 అయ్యయ్యో. 399 00:31:36,438 --> 00:31:38,398 డైరీ చూస్తుండగా నాకు ఒకటి కంటపడింది. 400 00:31:39,566 --> 00:31:42,903 చాలా ఏళ్ల తర్వాత, బెనీటోకి 17 ఏళ్లు నిండినప్పటి ఘటన అది. 401 00:31:44,780 --> 00:31:48,659 బెనీటో, తన అమ్మ మరణం గురించి రోసాతో మాట్లాడిన తర్వాత, 402 00:31:48,659 --> 00:31:50,285 పరిస్థితులు మెరుగవుతున్నట్టే కనిపించాయి. 403 00:31:50,994 --> 00:31:52,162 అలా అనే తను భావించింది. 404 00:31:53,121 --> 00:31:55,499 కానీ, ఒకనాడు ఆ కుటుంబంలో భాగమైన ఒక కుక్క విషయంలో ఓ సంఘటన చోటుచేసుకుంది. 405 00:31:56,250 --> 00:31:57,251 కెనా. 406 00:31:58,210 --> 00:32:00,629 అవును. కెనానే. చూడు. 407 00:32:08,679 --> 00:32:12,683 "నా కొడుకుగా బెనీటో నా జీవితంలోకి వచ్చి ఏడేళ్లయింది, వాడిలో మార్పు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. 408 00:32:13,767 --> 00:32:15,394 ఎట్టకేలకు వాడు కుటుంబంలో మమేకమైపోయాడు అనిపిస్తోంది. 409 00:32:16,228 --> 00:32:17,312 పెద్దగా మాట్లాడడు, 410 00:32:17,312 --> 00:32:21,191 కానీ జీవితంలోని చిన్న చిన్న విషయాలపై, అంటే, పూల లాంటి వాటిపై వాడు ప్రేమ చూపిస్తున్నాడు. 411 00:32:21,775 --> 00:32:25,070 మా ఇంటి ముందు ఉండే తోటలోని గులాబీ తోట అంటే వాడికి మరింత ఇష్టం. 412 00:32:30,659 --> 00:32:33,036 శరణాలయంలో ఉండే ఒక హింసాత్మకమైన పిల్లాడిని 413 00:32:33,036 --> 00:32:35,455 మార్చానని నా మనస్సుకు అనిపించింది. 414 00:32:36,206 --> 00:32:38,458 కానీ, ఆ తర్వాత జరిగిన ఘటన నన్ను షాక్ కి గురి చేసింది." 415 00:32:38,458 --> 00:32:39,793 అమ్మా, అది నన్ను కరిచింది! 416 00:32:41,170 --> 00:32:42,421 అది నన్ను కరిచింది! 417 00:32:44,923 --> 00:32:46,925 అరవకు, బంగారం. ఏమీ కాలేదు! 418 00:32:47,968 --> 00:32:48,969 కెనా! 419 00:32:51,138 --> 00:32:52,222 ఓర్చుకో, బంగారం. 420 00:32:52,222 --> 00:32:53,307 కెనా. 421 00:32:54,016 --> 00:32:55,100 కెనా! 422 00:32:56,643 --> 00:32:57,936 దీన్ని చంపేశావు నువ్వు! 423 00:32:57,936 --> 00:32:59,855 - అదే నాపై దాడి చేసింది! - అబద్ధం! నువ్వే చంపేశావు! 424 00:32:59,855 --> 00:33:01,857 - అదే నాపై దాడి చేసింది! - నువ్వు మృగానివి! 425 00:33:01,857 --> 00:33:03,400 హంతకుడివి! 426 00:33:21,335 --> 00:33:22,336 విసెంటే. 427 00:33:24,546 --> 00:33:25,547 విసెంటే. 428 00:33:26,548 --> 00:33:29,384 కెనా చేసిన పనికి, బెనీటోని అంటే ఎలా? 429 00:33:30,761 --> 00:33:32,221 వాడిని క్షమించేసి, ముందుకు సాగిపోవాలి. 430 00:33:35,265 --> 00:33:37,392 వెళ్లి వాడితో మాట్లాడు. వాడు నీ సోదరుడు. 431 00:33:40,187 --> 00:33:42,898 ఒక హంతకుడితో ఏమీ జరగనట్టు నేను మామూలుగా ఉండలేను. 432 00:33:44,024 --> 00:33:46,902 విసెంటే, జరిగిన దానిలో కెనాదే తప్పు, బెనీటోది ఏ తప్పూ లేదు. 433 00:33:49,696 --> 00:33:51,031 అది నిజం కాదు. 434 00:33:53,325 --> 00:33:55,327 కెనా అలా పిచ్చిగా కరవడం కానీ, మొరగడం కానీ ఎప్పుడైనా చూశావా? 435 00:33:55,327 --> 00:33:59,039 బెనీటోకి 52 కుట్లు పడ్డాయి. ఇంకాస్త ఉంటే, వాడి చేయి పోయుండేది. 436 00:33:59,039 --> 00:34:01,792 - వాడి ప్రాణం పోయి ఉండాల్సింది! - ఇక చాలు! 437 00:34:01,792 --> 00:34:03,585 అలాంటి మాటలు మాట్లాడకు! 438 00:34:05,838 --> 00:34:08,757 బెనీటో చిన్నప్పటి నుండి కష్టాలనే చూశాడు, అది నీకు కూడా తెలుసు. 439 00:34:08,757 --> 00:34:09,842 మరి నా సంగతేంటి? 440 00:34:11,426 --> 00:34:12,969 కనీసం వాడికి నాన్న అయినా ఉన్నాడు. 441 00:34:12,969 --> 00:34:14,972 వాడి నాన్న మంచివాడు కాదు. 442 00:34:14,972 --> 00:34:18,016 మరి ఇద్దరూ ఉత్తరాలు ఎందుకు రాసుకుంటున్నారు? 443 00:34:19,518 --> 00:34:23,563 "బెనీటో, ఇంకా అతని తండ్రి నిజంగానే మాట్లాడుకుంటున్నారా అని అనుమానం మొదలయింది. 444 00:34:24,606 --> 00:34:26,692 ఆయన వాడిలో ఏయే పిచ్చి ఆలోచనలను నాటుతున్నాడు? 445 00:34:28,318 --> 00:34:31,947 వేరే దారి లేక ఒట్టు పక్కకు పెట్టేస్తున్నాను, అందుకు దేవుడు క్షమిస్తాడనే అనుకుంటున్నా. 446 00:34:34,824 --> 00:34:38,871 వాడు ప్రతిరోజూ గులాబీ తోటకి తప్ప ఇంకెక్కడికీ వెళ్లడు. 447 00:35:23,874 --> 00:35:26,960 జైలు నుండి వాడి నాన్న వాడికి పంపిన లేఖలు నాకు కనిపించాయి." 448 00:35:34,635 --> 00:35:37,012 నా వస్తువుల జోలికి వెళ్లవని నాకు మాట ఇచ్చావుగా. 449 00:35:46,522 --> 00:35:47,940 ఇలాంటి వాటిని నువ్వు నమ్ముతున్నావా? 450 00:36:04,623 --> 00:36:06,625 మీ అమ్మ ఎక్కడ ఉంటుందో మీ నాన్నకి చెప్పింది నువ్వేనా? 451 00:36:10,337 --> 00:36:11,713 అవును. 452 00:36:15,175 --> 00:36:17,052 కొంపదీసి మీ నాన్న ఏం చేయబోతున్నాడో నీకు తెలుసా ఏంటి! 453 00:36:20,013 --> 00:36:21,265 ఆమె చేసిన పనులకు అదే సరైనది. 454 00:36:30,315 --> 00:36:31,692 నువ్వు కాల్ చేసినందుకు ఆనందంగా ఉంది, బాబూ. 455 00:36:33,527 --> 00:36:34,820 మీ అమ్మ ఎక్కడ? 456 00:36:35,404 --> 00:36:36,405 ఆఫీసుకు వెళ్లింది. 457 00:36:37,406 --> 00:36:38,699 ఆఫీసుకు వెళ్లిందా! 458 00:36:38,699 --> 00:36:41,410 ఇదేనా తను నిన్ను చూసుకొనే పద్ధతి? నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయిందే, 459 00:36:42,035 --> 00:36:43,537 పైగా నీచేత అంట్లు తోమిస్తోందా? 460 00:36:44,705 --> 00:36:46,999 తనకే నీ మీద ప్రేమ ఉంటే, నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్లదు, 461 00:36:47,624 --> 00:36:49,459 నన్ను కూడా వదిలేసేది కాదు. 462 00:36:50,586 --> 00:36:53,297 ఉద్యోగం చేసే ఆడవాళ్లు, వాళ్ల కుటుంబాలని గాలికి వదిలేస్తారు. 463 00:36:53,297 --> 00:36:55,841 మనకి వాళ్ల అవసరం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, అప్పుడే మనల్ని నట్టేట ముంచుతారు. 464 00:36:57,176 --> 00:36:58,177 ఎందుకో తెలుసా? 465 00:36:59,970 --> 00:37:01,597 ఎందుకంటే, వాళ్ల స్థానం ఏంటో వాళ్లు మర్చిపోతారు. 466 00:37:03,891 --> 00:37:05,350 మీ అమ్మ సమయం ముగిసిపోయింది. 467 00:37:06,435 --> 00:37:07,895 తను ఇక నేర్చుకోలేదు. 468 00:37:09,313 --> 00:37:13,358 నా ప్రాణానికి ప్రాణమైన నా కొడుకుని నాకు దూరం చేయాలని చూసింది. 469 00:37:14,568 --> 00:37:16,153 దాన్ని నేను ఎప్పటికీ క్షమించలేను. 470 00:37:16,778 --> 00:37:18,197 నాన్న ఆమెకి సాయపడాలనే చూశాడు. 471 00:37:21,074 --> 00:37:22,326 ఆమెకి నేర్పించాలని చూశాడు. 472 00:37:24,369 --> 00:37:25,370 కానీ లాభం లేకుండా పోయింది. 473 00:37:27,706 --> 00:37:28,832 కాబట్టి... 474 00:37:30,334 --> 00:37:31,585 నాన్న ఆమె యూనిఫామ్ ని తీసేసి, 475 00:37:32,461 --> 00:37:34,588 నిండా నీరు ఉన్న ట్యాంకులో ఆమెని ముంచాడు. 476 00:37:37,925 --> 00:37:41,470 ఆమె ఊపిరితిత్తులో నీరు పూర్తిగా చేరుకొనే దాకా ముంచాడు. 477 00:37:46,558 --> 00:37:47,976 ఆ పని నా కోసమే చేశాడు. 478 00:37:50,854 --> 00:37:52,314 పిచ్చి కుక్కని... 479 00:37:53,815 --> 00:37:55,192 చంపేయాల్సిందే. 480 00:37:57,110 --> 00:37:58,946 తక్షణమే నా ఇంటి నుండి వెళ్లిపో. 481 00:37:59,863 --> 00:38:01,365 నువ్వెవరో కూడా నాకు తెలీట్లేదు. 482 00:38:01,365 --> 00:38:02,908 నువ్వు నా కొడుకువి కానే కాదు. 483 00:38:02,908 --> 00:38:04,117 అస్సలు కాదు! 484 00:38:05,494 --> 00:38:07,037 నువ్వు పరిచయమైనందుకు నా మీద నాకే విరక్తిగా ఉంది. 485 00:38:08,997 --> 00:38:10,290 నా పెట్టెని ఇచ్చేస్తావా? 486 00:38:11,291 --> 00:38:12,709 ప్లీజ్? 487 00:38:19,132 --> 00:38:20,467 ఉదయాన్నే వెళ్లిపోతాను. 488 00:38:48,495 --> 00:38:51,540 బెనీటో, మా అమ్మతో మాట్లాడిన మాటలను నేను విన్నాను. 489 00:38:54,001 --> 00:38:56,879 ఆమె తన గదికి వెళ్లినప్పుడు, నేను పోలీస్ స్టేషనుకు వెళ్లాను. 490 00:38:57,713 --> 00:39:00,966 వాడి కన్న తల్లి మరణంలో వాడికి కూడా పాత్ర ఉందని ఒప్పుకున్నాడు. 491 00:39:01,508 --> 00:39:03,802 వాడిని అరెస్ట్ చేయడానికి అది చాలు! 492 00:39:22,487 --> 00:39:26,074 మొదటిసారిగా, నా ప్రాణాలకి ఏమైనా అవుతుందేమో అని భయంగా ఉంది. 493 00:39:57,731 --> 00:39:59,149 తక్షణమే మీరు నాతో రావాలి! 494 00:39:59,149 --> 00:40:00,817 శాంతించు, బాబూ. ముందు కూర్చో. 495 00:40:00,817 --> 00:40:02,528 అంత సమయం లేదు! 496 00:40:02,528 --> 00:40:04,071 మీరు నాతో వెంటనే రావాలి! 497 00:40:04,071 --> 00:40:05,781 - మా అమ్మ ప్రమాదంలో ఉంది! - సరే. 498 00:40:05,781 --> 00:40:09,076 కానీ మాకు మరింత సమాచారం కావాలి. ఏం జరిగిందో చెప్పు. 499 00:40:09,076 --> 00:40:11,078 మా అమ్మ హత్యకు గురి కానుంది. 500 00:40:12,454 --> 00:40:14,915 మా అమ్మని బెనీటో చంపేయబోతున్నాడు! 501 00:40:35,769 --> 00:40:38,230 సమయం ఆసన్నమైంది. 502 00:41:16,685 --> 00:41:17,769 బెనీటో? 503 00:41:19,479 --> 00:41:20,480 విసెంటే? 504 00:41:47,382 --> 00:41:48,550 అమ్మా! 505 00:42:01,605 --> 00:42:04,525 అయ్యో! అయ్యయ్యో! 506 00:42:05,984 --> 00:42:07,569 దేవుడా! 507 00:42:08,862 --> 00:42:10,614 అయ్యయ్యో! అమ్మా! 508 00:42:14,993 --> 00:42:16,245 అమ్మా! 509 00:42:17,329 --> 00:42:21,625 ఈ డైరీ మీ దగ్గర 15 ఏళ్ల నుండి ఉంది కదా, దీన్ని ముందే పోలీసులకి ఎందుకు ఇవ్వలేదు మీరు? 510 00:42:21,625 --> 00:42:25,420 నేను పోలీసులకి ఇచ్చాను. అందుకే జైలు శిక్ష తప్పించుకోగలిగా. 511 00:42:25,420 --> 00:42:26,797 చేతులను తల వెనుక పెట్టు! 512 00:42:26,797 --> 00:42:31,802 బెనీటోని వాళ్లు పట్టుకోలేకపోయారు, కాబట్టి ఆ నేరం నాపై మోపాలని చూశారు. 513 00:42:32,845 --> 00:42:34,721 అతను మొదటగా చంపింది రోసాని అన్నమాట. 514 00:42:36,640 --> 00:42:39,685 ఇంకో మహిళ ప్రాణం పోక ముందే, మనం ఈ విషయం గెరార్డోకి చెప్పాలి. 515 00:42:52,447 --> 00:42:54,241 తర్వాతి ఎపిసోడులో... 516 00:42:54,241 --> 00:42:56,785 మనకి సైకో లక్షణాలు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. 517 00:42:56,785 --> 00:42:58,787 అతడిని పట్టుకోవడంలో ఇవి మనకి ఉపయోగపడవు కదా. 518 00:42:58,787 --> 00:43:00,664 కానీ అతని గురించి అర్థం చేసుకోవడంలో సాయపడగలవు. 519 00:43:00,664 --> 00:43:03,125 అతనికి 15 ఏళ్లు ఉన్నప్పుడు తీసిన ఫోటో మా దగ్గర ఉంది. 520 00:43:03,125 --> 00:43:05,127 ఎవరోకరు అతడిని గుర్తుపట్టవచ్చేమో. 521 00:43:06,420 --> 00:43:08,046 తనని వివస్త్ర హంతకుడు ఎత్తుకెళ్లిపోయాడు. 522 00:44:34,716 --> 00:44:36,718 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్