1 00:00:43,168 --> 00:00:44,378 కాపాడండి! 2 00:00:46,088 --> 00:00:48,048 నన్ను కాపాడండి! 3 00:00:51,093 --> 00:00:52,469 కాపాడండి! 4 00:01:59,995 --> 00:02:04,041 అనుమానితుడు తుపాకీ తీయగానే, 5 00:02:04,041 --> 00:02:08,336 నా ఆత్మరక్షణ కోసం, విధిలేక నేను కాల్చవలసి వచ్చింది. 6 00:02:09,086 --> 00:02:10,881 ఆ కాల్పుల వల్ల అతను చనిపోయాడు. 7 00:02:10,881 --> 00:02:13,091 కమాండర్, మిస్ వాలంటీనా కమాచో సంగతేంటి? 8 00:02:13,091 --> 00:02:16,303 - ఆమె ఆచూకీ ఇంకా మాకు తెలియలేదు. - ఆమె ఇంకా బతికే ఉందంటారా? 9 00:02:16,303 --> 00:02:21,016 మహిళా పోలీసు ప్రోగ్రామ్ వల్లే మిస్ కమాచో ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందని మీకు అనిపించట్లేదా? 10 00:02:21,016 --> 00:02:23,810 సరే. థ్యాంక్యూ, కమాండర్ హెరేరా. 11 00:02:23,810 --> 00:02:26,396 ఏం జరుగుతోంది? 12 00:02:26,396 --> 00:02:28,732 ఇది అందరికీ చాలా కష్టంగా అనిపించే రోజు, కదా? 13 00:02:29,650 --> 00:02:31,610 మేము అదే పనిలో ఉన్నాము. 14 00:02:32,110 --> 00:02:34,780 మేము మా వనరులన్నింటినీ ఉపయోగించుకుంటున్నాం, 15 00:02:34,780 --> 00:02:39,201 మా సహోద్యోగి క్షేమంగా తిరిగి వచ్చేదాకా నేను విశ్రమించనని మీకు మాటిస్తున్నాను. 16 00:02:39,201 --> 00:02:40,994 ఇవాళ్టికి ఇక ఏమీ అడగవద్దు. థ్యాంక్యూ. 17 00:02:42,037 --> 00:02:44,331 మన సహోద్యోగి మనకి ప్రాణాలతో కావాలి. 18 00:02:45,249 --> 00:02:46,917 ఆఫీసర్ వాలంటీనా కమాచో. 19 00:02:47,668 --> 00:02:52,339 పార్కులు, నదులు, లోతైన మురుగునీటి వ్యవస్థలు, నీటి ప్రాంతాలు, 20 00:02:52,339 --> 00:02:55,592 లేదా ఇతర బాధితులు కనిపించిన ప్రాంతాలను పోలి ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి. 21 00:02:56,218 --> 00:02:59,763 మీకేమైనా లభిస్తే, డిటెక్టివ్ లొజానోకి కానీ, డిటెక్టివ్ డియాజ్ కి కానీ, నాకు కానీ తెలియజేయండి. 22 00:03:00,389 --> 00:03:01,974 ఇక పదండి! ఇంకా ఇక్కడే ఉన్నారే! 23 00:03:02,891 --> 00:03:05,936 కంగారుపడకు, మరియా. మీ చెల్లెలు దొరికేదాకా మేము విశ్రమించము. 24 00:03:09,356 --> 00:03:10,732 ఈమె ఇతని కన్న తల్లా? 25 00:03:11,275 --> 00:03:12,359 బెనీటో తల్లి, అవును. 26 00:03:27,499 --> 00:03:30,544 ఈ దర్యాప్తును బట్టే మీరు ఆ శరణాలయానికి వెళ్లారా? 27 00:03:31,712 --> 00:03:34,339 మా దర్యాప్తులో ఇది కూడా భాగమంతే. మిగతా భాగం బేస్మెంటులో ఉంది. 28 00:03:39,011 --> 00:03:40,012 మిగతాదా? 29 00:03:47,936 --> 00:03:49,062 ఇది... 30 00:03:49,897 --> 00:03:50,939 చాలా బాగుంది. 31 00:03:55,819 --> 00:03:56,945 సూపర్. 32 00:04:02,159 --> 00:04:04,953 ఉద్యోగం చేయాలనుకొనే మహిళలను 33 00:04:04,953 --> 00:04:07,414 బెదిరించడానికి వివస్త్ర హంతకుడు ఆర్టికల్ 169 ని వాడుకున్నాడు. 34 00:04:09,791 --> 00:04:14,213 - అయితే వాళ్ల ఆఫీసులు కూడా ముఖ్యమైనవే అయ్యుంటాయి. - మేము కూడా అదే అనుకుంటున్నాం. 35 00:04:14,963 --> 00:04:17,132 అందుకే కదా అతను వాళ్ల యూనిఫామ్లను తీసుకుంది? 36 00:04:17,132 --> 00:04:18,216 వాళ్లకి శిక్షగా. 37 00:04:18,759 --> 00:04:20,135 అవును. 38 00:04:20,135 --> 00:04:23,388 - నీ పేరేంటి? - యాంగలెస్ క్రూజ్. 39 00:04:24,056 --> 00:04:25,766 అదరగొట్టేశావు, యాంగలెస్. 40 00:04:30,771 --> 00:04:32,064 గుడ్ మార్నింగ్, మేడమ్. 41 00:04:32,898 --> 00:04:36,235 - ఆమె ఎక్కడుందో కనిపెట్టారా? - ఆ పని మీదే ఉన్నాం. 42 00:04:37,861 --> 00:04:41,823 ఆ అమ్మాయిని కనుగొనకపోతే, మన పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతోందా? 43 00:04:42,866 --> 00:04:47,788 ఈ ప్రోగ్రామ్ సరైనది కాదని చెప్పిన వాళ్లందరి అభిప్రాయాలు నిజం అవుతాయని 44 00:04:48,413 --> 00:04:49,498 నీకు అర్థమవుతోందా? 45 00:04:51,458 --> 00:04:54,837 ఆమె బతికే ఉందని వివస్త్ర హంతకుడు చెప్పాడు. నేను... 46 00:04:54,837 --> 00:04:59,675 బాధితులను కాకుండా వీరనారీమణులను తయారు చేయాలి. నీకు అప్పజెప్పిన పని అది, ఎమీలో. 47 00:05:00,676 --> 00:05:02,219 ఒకటి చెప్పనా! 48 00:05:03,136 --> 00:05:06,390 ఈ ప్రోగ్రామ్ విఫలమైతే, అది నాకు అప్రతిష్ట కలిగించదు. 49 00:05:07,015 --> 00:05:10,143 - అలా జరగదు, ఎందుకంటే, నా శక్తినంతా ధారపోసి... - చెప్పేది జాగ్రత్తగా విను. 50 00:05:11,562 --> 00:05:16,066 వాలంటీనా కమాచో కనుక చనిపోతే, దానికి కారణం నువ్వే అవుతావు. 51 00:05:17,609 --> 00:05:22,072 ఆ విషయం అందరికీ తెలిసేలా దగ్గరుండి నేను చూసుకుంటాను. 52 00:05:28,245 --> 00:05:29,621 అతను మామూలు మనిషిలానే అనిపించాడు. 53 00:05:32,708 --> 00:05:33,959 గబీనా, ఒక మాట. 54 00:05:35,961 --> 00:05:38,672 ఆ దరిద్రుడు నీకన్నా ముందు చాలా మంది అమ్మాయిలను మోసం చేశాడు. 55 00:05:42,885 --> 00:05:45,721 ఆ దరిద్రుడు ఒక ప్రక్రియని అనుసరిస్తూ, దానిలో ఆరితేరాడు, అంతే. 56 00:05:47,931 --> 00:05:49,224 నీరు. 57 00:05:50,434 --> 00:05:51,602 తాడు. 58 00:05:53,145 --> 00:05:54,146 యూనిఫామ్లు. 59 00:05:56,523 --> 00:05:57,691 బస్సులో, 60 00:05:58,942 --> 00:05:59,943 నాకు, 61 00:06:01,195 --> 00:06:02,613 "ఎంత కాకతాళీయం." 62 00:06:04,364 --> 00:06:05,616 "ఎంత రొమాంటిక్ గా ఉన్నాడు," అనిపించింది. 63 00:06:07,826 --> 00:06:09,703 కానీ అదంతా పక్కా ప్లాన్ ప్రకారం చేశాడు. 64 00:06:10,746 --> 00:06:12,915 అది కూడా తన ప్రక్రియలో భాగం అయ్యి ఉంటుంది. 65 00:06:30,307 --> 00:06:32,017 బస్సులో అతడిని నేను మూడుసార్లు చూశాను. 66 00:06:32,559 --> 00:06:34,186 కానీ అతను బస్సు ఎక్కాల్సిన అవసరం లేదు. 67 00:06:34,186 --> 00:06:36,355 ఒకవేళ అతనికి కారు అవసరం అయ్యుంటే, తెల్ల పైకప్పు గల కారును, 68 00:06:36,355 --> 00:06:39,066 వ్యాన్ ని దొంగిలించినట్టు, ఒక కారును దొంగిలించి ఉండేవాడు. 69 00:06:39,066 --> 00:06:42,236 కానీ నాతో, అలాగే ఇతరులతో మాట్లాడటానికి అతను కావాలని బస్సు ఎక్కాడు. 70 00:06:46,114 --> 00:06:49,576 మన స్టేషన్ ఇక్కడ ఉంది. బస్ స్టాప్ కి చాలా దగ్గరగా ఉంది. 71 00:06:50,619 --> 00:06:51,703 అదే అతని ప్యాటర్న్ కావచ్చు. 72 00:06:51,703 --> 00:06:56,333 ప్యాటర్న్ ఉందేమో, కానీ... కానీ క్షమించాలి, అదేంటో ఇప్పటికీ నాకు తెలీట్లేదు. 73 00:06:56,333 --> 00:06:59,837 ఇక్కడ చాలా సమాచారం ఉంది. మనం అక్కర్లేనివి తీసేయాలి. 74 00:07:00,420 --> 00:07:02,339 బాధితుల ఇంటి చిరునామాలు, తీసేద్దాం. 75 00:07:03,257 --> 00:07:05,092 వాళ్ళు తరచుగా వెళ్లే స్థలాలు, తీసేద్దాం. 76 00:07:05,717 --> 00:07:07,427 కుటుంబ వివరాలు, సన్నిహితుల వివరాలు, తీసేద్దాం. 77 00:07:09,012 --> 00:07:14,268 బాధితుల ఆఫీసులు బస్ స్టాప్స్ దగ్గర్లోనే ఉన్నాయి. 78 00:07:14,768 --> 00:07:18,522 వివస్త్ర హంతకుడు, తను చంపిన వారి శవాలను, తర్వాత చంపబోయే వారి ఆఫీసుకు దగ్గరగా వదిలేసేవాడు. 79 00:07:19,106 --> 00:07:22,568 మరొక విధంగా చెప్పాలంటే, లూసీ శవాన్ని నోరా పని చేసే చోటుకు దగ్గరగా ఉన్న కొలనులో వదిలేశాడు. 80 00:07:23,443 --> 00:07:26,697 నోరా శవాన్ని, పావోలా పని చేసే కెఫేకి దగ్గరగా వదిలేశాడు. 81 00:07:26,697 --> 00:07:30,158 పావోలా శవాన్ని అల్మా పని చేసే షూ షాపుకు దగ్గరగా వదిలేశాడు. 82 00:07:31,660 --> 00:07:33,662 అల్మా శవాన్ని, స్టేషన్ కి సమీపాన వదిలేశాడు. 83 00:07:35,539 --> 00:07:37,457 అతనికి పన్నెండు బస్ స్టాప్స్ ఉన్నాయి. 84 00:07:37,958 --> 00:07:39,168 పన్నెండు బాధితులు. 85 00:07:39,168 --> 00:07:41,253 తర్వాత అతను తకూబా రోడ్డును ఎంచుకొని ఉంటాడు. 86 00:07:42,546 --> 00:07:46,300 డియాజ్, లొజానో. తకూబా రోడ్డు వద్ద మనం ఒక ఆపరేషన్ ని నిర్వహిద్దాం. 87 00:07:46,884 --> 00:07:47,968 పదండి. 88 00:07:48,927 --> 00:07:50,804 మిత్రులారా, శ్రద్ధగా వినండి! 89 00:07:50,804 --> 00:07:55,809 ఇక నుండి, మీకు అందే ఏ సమాచారమైనా కానీ, ఏ ఫోన్ కాల్ అయినా కానీ, 90 00:07:55,809 --> 00:07:57,603 కేసుకు సంబంధించినదని మీకు ఏది అనిపించినా కానీ, 91 00:07:58,645 --> 00:08:00,189 దాన్ని నేరుగా ఈ మహిళా పోలీసుకు చెప్పండి. 92 00:08:00,814 --> 00:08:03,150 కెప్టెన్ రొమాండీయా, ఇంకా వాళ్లు ఇక్కడ ఇన్ ఛార్జులు. 93 00:08:03,150 --> 00:08:05,110 - అర్థమైందా? - అర్థమైంది, సర్! 94 00:08:05,110 --> 00:08:06,278 ఇక పని కానివ్వండి! 95 00:08:12,451 --> 00:08:13,869 మరియా. 96 00:08:13,869 --> 00:08:16,205 నిన్ను చూడటానికి కొందరు వచ్చారు. ఏదో అత్యవసరమైన పని అంటున్నారు. 97 00:08:17,039 --> 00:08:18,290 వెళ్దాం పద. ఇంతకీ ఎవరు? 98 00:08:19,166 --> 00:08:20,834 మీరిద్దరూ పోలీసు శాఖలో ఎందుకు చేరారు? 99 00:08:21,960 --> 00:08:23,128 చెప్పిన మాట ఎందుకు వినలేదు మీరు? 100 00:08:24,630 --> 00:08:26,298 ఇందులో వీళ్ల తప్పేం లేదు. 101 00:08:28,217 --> 00:08:30,677 ఒక మామూలు జీవితం జీవించలేరా మీరు? 102 00:08:31,386 --> 00:08:33,804 ఒక ప్రశాంతమైన జీవితం? 103 00:08:33,804 --> 00:08:35,890 అది అంత కష్టమా? 104 00:08:35,890 --> 00:08:37,558 శాంతించు, లూజ్. 105 00:08:40,395 --> 00:08:42,438 మీ చెల్లిని కనిపెట్టడానికి ఏం చేస్తున్నారు మీరు? 106 00:08:43,565 --> 00:08:45,359 స్టేషన్ అంతా తన కోసమే గాలిస్తోంది. 107 00:08:47,236 --> 00:08:50,822 అదీగాక, అతను చనిపోయే ముందు... 108 00:08:53,033 --> 00:08:54,201 వాలంటీనా బతికే ఉందని అన్నాడు. 109 00:08:55,911 --> 00:08:57,913 ఒక హంతకుడి మాటలను నమ్ముతున్నావా నువ్వు? 110 00:09:01,375 --> 00:09:02,584 నాకు మరో దారి లేదు. 111 00:09:08,924 --> 00:09:10,425 మేము తనని కనుగొంటాం. 112 00:09:14,429 --> 00:09:15,430 ఒట్టేసి చెప్పు. 113 00:09:18,600 --> 00:09:19,601 నువ్వు... 114 00:09:20,811 --> 00:09:22,271 పెద్ద దానివి. 115 00:09:25,899 --> 00:09:26,900 ఒట్టేసి చెప్పు. 116 00:09:30,946 --> 00:09:31,947 ఒట్టేసి చెప్తున్నా. 117 00:09:41,039 --> 00:09:44,418 తూర్పు వైపున ఒక ఫౌంటెన్ ఉంది. ఆ తర్వాత మురుగునీటి గొట్టం ఉంది. 118 00:09:44,918 --> 00:09:47,462 పశ్చిమాన ఒక హోటల్ ఉంది. ఓవర్. 119 00:09:47,462 --> 00:09:49,131 సూపర్. విన్నాం. అందరూ విన్నారుగా. 120 00:09:49,131 --> 00:09:50,966 డియాజ్, నువ్వు ఫౌంటెన్ దగ్గరికి వెళ్లు. 121 00:09:50,966 --> 00:09:53,677 నువ్వు పార్కుకు వెళ్లు. నేను హోటల్ కి వెళ్తా. అందరం త్వరలోనే కలుసుకుందాం. 122 00:09:53,677 --> 00:09:54,970 రండి! 123 00:09:55,470 --> 00:09:57,139 మీరు పశ్చిమం వైపు వెతకండి. 124 00:09:57,139 --> 00:09:59,641 మేము సరస్సుకు దక్షిణం వైపు వెతుకుతాం. 125 00:09:59,641 --> 00:10:03,353 మన సహోద్యోగిని కనుక్కోవడానికి నీటి ప్రాంతాలన్నింటినీ జాగ్రత్తగా వెతకండి. 126 00:10:03,353 --> 00:10:04,479 పదండి. 127 00:10:04,479 --> 00:10:06,356 - వాలంటీనా! - వాలంటీనా! 128 00:10:06,940 --> 00:10:08,150 వాలంటీనా! 129 00:10:09,651 --> 00:10:10,652 ఏమైనా కనిపించిందా? 130 00:10:11,445 --> 00:10:12,446 లేదు, సర్. 131 00:10:16,867 --> 00:10:17,868 వెతుకుతూనే ఉండండి. 132 00:10:19,077 --> 00:10:20,871 - వెతుకుతూనే ఉండండి! - పదండి. 133 00:10:22,414 --> 00:10:23,957 తకూబా కాకుండా చాలా స్టాప్స్ ఉన్నాయిగా. 134 00:10:25,125 --> 00:10:26,627 తను ఇంకే స్టాప్ దగ్గరి ప్రాంతంలోనైనా ఉండవచ్చు. 135 00:10:26,627 --> 00:10:30,255 లాజిక్ ప్రకారం చెప్పాలంటే, వాలంటీనా తర్వాతి స్టాపులోనే ఉంటుంది, 136 00:10:31,298 --> 00:10:34,718 ఎందుకంటే, అతను ఆ ప్యాటర్న్ నే అనుసరిస్తున్నాడు, దాన్ని ఎప్పుడూ మార్చలేదు కూడా. 137 00:10:35,802 --> 00:10:37,387 కానీ మనం అతనికి అడ్డుపడ్డాం కదా. 138 00:10:37,387 --> 00:10:39,681 మనం అతని ప్లాన్స్ కి అడ్డుపడినప్పుడు, అతను ప్లాన్ ని మెరుగుపరుచుకున్నాడు. 139 00:10:40,182 --> 00:10:42,100 పనులను వేరేగా చేయడం మొదలుపెట్టాడు. 140 00:10:42,851 --> 00:10:45,270 మామూలుగా నీలి తాడును స్వయంగా తనే చేసేవాడు, కానీ ఈసారి కొన్నాడు. 141 00:10:45,270 --> 00:10:47,022 వాళ్లు దాదాపుగా ఆ ప్రాంతమంతా వెతికారు, 142 00:10:47,022 --> 00:10:48,440 వాలంటీనా జాడ మాత్రం తెలీలేదు. 143 00:10:48,440 --> 00:10:50,275 మనం ఇంకెక్కడైనా వెతకవచ్చేమో. 144 00:10:51,026 --> 00:10:54,530 లాజికల్ గా చెప్పాలంటే, క్షుణంగా ఒక స్టాప్ దగ్గర వెతికాకే, 145 00:10:54,530 --> 00:10:56,240 తర్వాతి స్టాప్ కి వెళ్లడం ఉత్తమం. 146 00:10:57,115 --> 00:11:02,287 తకూబా రోడ్డు, గిరాసోల్, చినాంపస్, హొసే మరియా మాతా, 147 00:11:02,788 --> 00:11:07,042 మెల్చోర్ ఒకాంపో, దె లా వీగా, విర్హీనియా, ఆజ్కపొత్జాల్కో. 148 00:11:08,001 --> 00:11:09,086 ఆజ్కపొత్జాల్కో. 149 00:11:10,629 --> 00:11:11,964 ఆ స్టాప్ నాకు తెలుసు. 150 00:11:13,465 --> 00:11:15,676 బెనీటో, అతని తల్లి శవాన్ని చూసింది అక్కడే. 151 00:11:16,593 --> 00:11:18,720 నీటి శుద్ది కర్మాగారం దగ్గర. 152 00:11:18,720 --> 00:11:20,472 ఏం మాట్లాడుతున్నావు? 153 00:11:21,390 --> 00:11:24,935 హసింటా హత్యకు గురైంది అక్కడే. వాడి చిన్నప్పుడు మొరాలెస్ వాడిని చూసింది అక్కడే. 154 00:11:24,935 --> 00:11:27,062 ఇది కాకతాళీయం కాదు. 155 00:11:27,062 --> 00:11:29,231 కానీ మనం వాడికి అడ్డుపడ్డాం కదా, మనం వాడి పనులని కనిపెడతామని అనిపించి, 156 00:11:29,231 --> 00:11:30,732 వాడు ప్యాటర్న్ ని మార్చుకొని ఉండవచ్చా? 157 00:11:31,441 --> 00:11:35,404 వాడికి ఒత్తిడిగా అనిపించినా, ప్యాటర్న్ ఎందుకు మారుస్తాడు? 158 00:11:35,904 --> 00:11:37,406 అది నాకు అర్థం కావట్లేదు. 159 00:11:37,406 --> 00:11:39,241 ఒత్తిడి ఉంటే, భావావేశపరంగా అలాగే చేస్తారు, యాంగలెస్. 160 00:11:39,741 --> 00:11:40,993 వాడు చాలా తొందరలో ఉండుంటాడు. 161 00:11:42,160 --> 00:11:44,705 తన తండ్రి అడుగుజాడల్లో నడవాలని అనుకొని ఉంటాడు. 162 00:11:45,747 --> 00:11:50,502 తన తల్లిని చంపిన చోటే చంపి, తన పనిని పూర్తి చేయాలని అనుకొని ఉంటాడు. 163 00:11:53,380 --> 00:11:56,675 కాపాడండి! ఎవరైనా కాపాడండి! 164 00:11:57,342 --> 00:11:59,052 రక్షించండి! 165 00:12:00,554 --> 00:12:02,181 ఎవరైనా నన్ను కాపాడండి! 166 00:12:35,631 --> 00:12:37,049 నిదానంగా, జాగ్రత్తగా రండి. 167 00:12:45,474 --> 00:12:46,558 ఛ. 168 00:12:47,142 --> 00:12:48,894 వాలంటీనా ఇక్కడే ఉంది. 169 00:12:50,312 --> 00:12:51,563 వాలంటీనా! 170 00:12:52,189 --> 00:12:53,440 - వాలంటీనా! - వాలంటీనా! 171 00:12:54,024 --> 00:12:56,276 వాలంటీనా! వాలంటీనా! 172 00:13:13,669 --> 00:13:15,254 వాలంటీనా! 173 00:13:25,389 --> 00:13:27,641 వివస్త్ర హంతకుడు \ తన ప్యాటర్న్ ని పక్కకు పెట్టేసి, 174 00:13:27,641 --> 00:13:30,310 తన తల్లిని చంపినట్టే వాలంటీనాని చంపాలని ప్లాన్ చేస్తే, 175 00:13:30,310 --> 00:13:33,230 తన తల్లి చనిపోయిన ట్యాంకులోనే వాలంటీనా కూడా ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది. 176 00:13:33,230 --> 00:13:35,274 అది ఏ ట్యాంకో మనకి ఎలా తెలుస్తుంది? 177 00:13:45,826 --> 00:13:46,827 ముప్పై ఏడు. 178 00:13:47,703 --> 00:13:48,829 ముప్పై ఏడవ ట్యాంక్! 179 00:14:01,383 --> 00:14:03,010 - తను ఇక్కడే ఉంది! - అవునా? 180 00:14:03,010 --> 00:14:04,344 హా, కాళ్లు, చేతులు కట్టేశాడు. 181 00:14:04,887 --> 00:14:07,347 ట్యాంకులోని నీళ్లని ఖాళీ చేయడానికి పనిముట్టు కానీ, ఏదైనా కానీ తీసుకురండి! 182 00:14:22,613 --> 00:14:24,781 వాలంటీనా. హేయ్! లే! 183 00:14:24,781 --> 00:14:26,700 - వాలంటీనా! వాలంటీనా! - హేయ్! 184 00:14:26,700 --> 00:14:28,911 లే! వాలంటీనా! 185 00:14:29,411 --> 00:14:31,330 - వాలంటీనా, నాతో మాట్లాడు! - లే! 186 00:14:31,330 --> 00:14:34,082 జరగండి. ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో నాకు తెలుసు. మరియా. మరియా. 187 00:16:31,158 --> 00:16:32,326 పక్కానా? 188 00:16:33,869 --> 00:16:36,163 పక్కా. నాకు ఒంటరిగా ఉండాలనుంది. 189 00:16:36,705 --> 00:16:37,706 కానీ... 190 00:16:39,041 --> 00:16:41,543 నీకెమైనా అవసరమైతే, నేను దగ్గరే ఉంటా. 191 00:16:42,878 --> 00:16:44,755 నాకు కాల్ చేయ్, వచ్చేస్తా. 192 00:16:45,464 --> 00:16:46,590 థ్యాంక్యూ. 193 00:18:10,132 --> 00:18:14,052 కంగారుపడకు. తనకి నీ అవసరం ఉంటే, కాల్ చేస్తుంది. 194 00:18:15,762 --> 00:18:17,347 నువ్వే చూస్తావు. తను కాల్ చేస్తుంది. 195 00:18:25,689 --> 00:18:27,691 థ్యాంక్స్. దాన్ని వదిలేయిలే. 196 00:18:27,691 --> 00:18:28,859 ఎలా ఉన్నావు? 197 00:18:30,694 --> 00:18:31,695 నా ఉద్యోగం పోయింది. 198 00:18:33,155 --> 00:18:34,531 ఏంటి? 199 00:18:37,451 --> 00:18:40,120 నిన్న రాత్రి కాబోస్ నన్ను ఉద్యోగంలోంచి తీసేశాడు. 200 00:18:41,121 --> 00:18:42,122 ఎందుకు? 201 00:18:42,623 --> 00:18:47,377 అది ముఖ్యం కాదులే. నాకు ఏం చెప్పాడు అనేదే ముఖ్యం. 202 00:18:49,421 --> 00:18:52,257 ఆ రాత్రి మనం అతని ఇంటికి డిన్నర్ కి వెళ్లాం కదా, 203 00:18:52,883 --> 00:18:55,385 అప్పుడు అతని భార్య అతనికేమీ చెప్పలేదు. 204 00:18:56,011 --> 00:18:58,555 నువ్వు పోలీసువి అన్న విషయం అతనికి ఆమె అస్సలు చెప్పలేదు. 205 00:18:58,555 --> 00:19:00,349 - ఏంటి? - అవును. 206 00:19:00,849 --> 00:19:03,769 నాకు ప్రమోషన్ రానిది అందుకు కాదు. అది రాకపోవడానికి కారణం నేనే. 207 00:19:05,604 --> 00:19:06,730 నిజంగానా? 208 00:19:09,983 --> 00:19:11,193 నేను నిన్ను నిందించాను. 209 00:19:14,112 --> 00:19:15,447 నిన్ను మాటలు అన్నాను, బంగారం. 210 00:19:18,659 --> 00:19:21,203 నేను అతడిని అన్న మాటలకు ఏమీ బాధపడట్లేదు. 211 00:19:22,829 --> 00:19:27,042 ఎందుకంటే, అతను నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నాడని చెప్పినప్పుడు, 212 00:19:27,626 --> 00:19:30,587 నాకు మళ్లీ స్వేచ్ఛగా అనిపించింది. 213 00:19:31,880 --> 00:19:34,758 మళ్లీ కొత్తగా ప్రారంభించగలనని అనిపించింది. 214 00:19:35,425 --> 00:19:36,969 నువ్వు ప్రారంభించినట్టుగానే. 215 00:19:39,763 --> 00:19:40,764 ఏమంటావు? 216 00:19:43,600 --> 00:19:45,060 ఏమైంది? 217 00:19:53,360 --> 00:19:56,572 నాదే తప్పు అని నువ్వు చాలా బలంగా నమ్మావు, ఎంత బలంగా అంటే... 218 00:19:58,156 --> 00:19:59,825 నేను అనరాని మాటలు అన్నానని తెలుసు. 219 00:19:59,825 --> 00:20:01,535 నువ్వు అనడం మాత్రమే కాదు. 220 00:20:05,247 --> 00:20:08,333 ఇక నువ్వు బయలుదేరు. పొద్దుపోతోంది. 221 00:20:40,991 --> 00:20:42,284 వాల్. 222 00:20:50,292 --> 00:20:53,420 అధికారిక పత్రాలను అక్రమంగా కలిగి ఉండటం. 223 00:20:54,004 --> 00:20:56,006 వేరే వారి బాధ్యతలను అక్రమంగా నిర్వర్తించడం. 224 00:20:56,507 --> 00:20:58,675 పోలీసు హోదాని దుర్వినియోగపరచడం. 225 00:20:59,676 --> 00:21:01,553 న్యాయాన్ని అడ్డుకోవడం. 226 00:21:02,304 --> 00:21:05,432 అనధికార దర్యాప్తులను నిర్వర్తించడం. 227 00:21:06,058 --> 00:21:08,894 మీడియా ప్రతినిధి అంటూ నకిలీ సర్టిఫికేషన్ వాడకం. 228 00:21:09,394 --> 00:21:10,812 అక్రమంగా చొరబడటం. 229 00:21:11,313 --> 00:21:14,775 పైఅధికారి ఆజ్ఞలను శిరసావహించకపోవడం. 230 00:21:16,068 --> 00:21:17,069 దొంగతనం. 231 00:21:18,070 --> 00:21:19,404 అబద్ధాలు. 232 00:21:19,404 --> 00:21:21,240 ఏమార్చడం. 233 00:21:21,240 --> 00:21:22,908 అధికార దుర్వినియోగం. 234 00:21:22,908 --> 00:21:25,494 మేము ఎవరికీ తెలీకుండా రహస్యంగా పని చేయాలనుకోలేదు. 235 00:21:26,286 --> 00:21:29,873 కానీ, ఎవరూ ఏం చేయట్లేదు, మేము చేస్తే సస్పెండ్ చేస్తామని బెదిరించారు. 236 00:21:30,666 --> 00:21:32,251 అలాంటప్పుడు మా పని మేమెలా చేయగలం? 237 00:21:32,251 --> 00:21:33,418 పనా? 238 00:21:34,795 --> 00:21:37,548 మీరేం మాట్లాడుతున్నారు? పనేంటి? 239 00:21:37,548 --> 00:21:40,342 మీకు అప్పజెప్పిన పని చాలా తేలికైనది. దర్యాప్తు చేయవద్దు అని. 240 00:21:41,051 --> 00:21:43,220 మీ పని నవ్వడం. 241 00:21:43,220 --> 00:21:47,474 ఫోటోలకు పోజులివ్వడం, యాత్రికులను పలకరించడం. 242 00:21:47,474 --> 00:21:49,518 అయ్య బాబోయ్, అందులో మీకు అర్థం కానిది ఏముంది? 243 00:21:53,272 --> 00:21:54,773 కానీ నేను ఒక విషయం ఒప్పుకోవాల్సిందే... 244 00:21:59,111 --> 00:22:02,030 అక్రమంగానే అయినా మీరు కేసును ఛేదించారు. 245 00:22:03,031 --> 00:22:06,410 కానీ మహిళా పోలీసుల ప్రోగ్రామ్ లో భాగంగా మొదటగా చేరిన మహిళా పోలీసులే 246 00:22:06,410 --> 00:22:11,540 చట్టాన్ని అతిక్రమించి పని చేస్తున్నప్పుడు, జనాలకు మన మీద నమ్మకం ఎలా కలుగుతుంది? 247 00:22:13,792 --> 00:22:15,460 నేను డిస్ట్రిక్ట్ అటార్నీతో మాట్లాడాను. 248 00:22:16,503 --> 00:22:19,256 ఇంకెవరూ మళ్లీ ఇలా చేయకుండా ఆయన మీకు శిక్ష విధించాలనుకున్నాడు. 249 00:22:21,842 --> 00:22:23,468 - నాలుగేళ్ల జైలు శిక్ష. - ఏంటి? 250 00:22:26,847 --> 00:22:31,727 కానీ నేను ఇంకో అవకాశం ఇచ్చి చూడాలని అనుకొనే రకమైన వాడిని, 251 00:22:32,352 --> 00:22:35,689 మీపై కేసు వేయవద్దని నేను ఆయనకి నచ్చజెప్పాను. 252 00:22:36,231 --> 00:22:37,649 కానీ ఇందులో ఒక చిన్న మెలిక ఉంది. 253 00:22:40,652 --> 00:22:42,446 ఈ పత్రాలపై... 254 00:22:44,489 --> 00:22:45,824 మీరు సంతకాలు చేసి ఇవ్వాలి. 255 00:22:46,783 --> 00:22:50,704 దర్యాప్తులో మీకు భాగం లేదని, ట్లాల్పాన్ వివస్త్ర హంతకుని అరెస్టులో మీ పాత్ర లేదని 256 00:22:51,663 --> 00:22:53,874 మీరు అంగీకరించి సంతకం చేస్తున్నారన్నమాట. 257 00:22:55,375 --> 00:23:00,214 ఈ పత్రంలో పేర్కొన్న దానికి విరుద్ధంగా మీలో ఏ ఒక్కరు మాట్లాడినా, 258 00:23:00,214 --> 00:23:01,507 మీ నలుగురికీ... 259 00:23:02,758 --> 00:23:03,967 జైలు శిక్ష తప్పదు. 260 00:23:07,221 --> 00:23:10,015 తొక్కేం కాదు! వెళ్లి గంగలో దూకమందాం వాళ్లని! 261 00:23:10,933 --> 00:23:12,893 మనమేం చేశామో జనాలకి తెలియాలి. 262 00:23:12,893 --> 00:23:14,269 మనం దీనిపై పోరాడదాం. 263 00:23:14,269 --> 00:23:16,897 మనం మీడియా వాళ్లకి చెప్పేద్దాం. 264 00:23:18,899 --> 00:23:19,900 వద్దు. 265 00:23:21,610 --> 00:23:23,237 వద్దు అంటావేంటి, వాలంటీనా? 266 00:23:23,237 --> 00:23:26,365 నువ్వు అన్నది నిజమే. పోలీసులు అవినీతిపరులు, చాలా అసహ్యంగా ఉంది నాకు! 267 00:23:26,365 --> 00:23:28,116 వాళ్లే దేశమంతటికీ అబద్ధాలు చెప్తున్నారు. 268 00:23:28,742 --> 00:23:31,203 మనం ఎదురుతిరగాలి. వాళ్ల చేత నిజం చెప్పించాలి. 269 00:23:34,456 --> 00:23:36,917 మా అక్క పిల్లలకి, వాళ్ల అమ్మ దూరం కాకూడదు. 270 00:23:40,420 --> 00:23:42,506 వాళ్లు ఎప్పుడో గెలిచేశారు, గబీనా. 271 00:23:43,298 --> 00:23:44,883 సంతకం చేసేయరాదూ? 272 00:23:45,843 --> 00:23:47,427 మరి మనమేం చేయకుండా ఎలా ఉండటం? 273 00:23:48,554 --> 00:23:51,056 మీరు ఎంత రిస్క్ తీసుకున్నారు? అది తెలియకూడదంటే ఎలా? 274 00:23:51,932 --> 00:23:54,142 వివస్త్ర హంతకుడి హత్యలు ఆపాలని మేము ఇంత కష్టపడ్డాం. 275 00:23:55,686 --> 00:23:56,937 మేము విజయం సాధించాం. 276 00:24:04,528 --> 00:24:08,448 ఇదంతా శాంటియాగో పార్కులో, మేము డ్యూటీలో చేరిన మొదటిరోజు ప్రారంభమైంది. 277 00:24:09,366 --> 00:24:15,038 మేము తప్పిపోయిన కుక్క పిల్ల కోసం వెతుకుతూ ఉండగా, పావోలా మచాదో శవం కనిపించింది. 278 00:24:16,331 --> 00:24:18,876 ఆమె ట్లాల్పాన్ వివస్త్ర హంతకుడికి బలైన ఆరవ బాధితురాలు. 279 00:24:20,669 --> 00:24:23,172 వాళ్ల పట్ల చాలా క్రూరంగా వ్యవహరిస్తున్నారు. 280 00:24:25,048 --> 00:24:27,176 వాళ్లని ఏమీ చేయరని నువ్వు అనుకున్నావా? 281 00:24:27,676 --> 00:24:30,429 అవును. కానీ నేను ఏదైతే చూశానో, అది నువ్వు కూడా చూశావు కదా. 282 00:24:30,929 --> 00:24:33,390 అంత క్షుణ్ణంగా, పద్ధతిగా చేయబడిన దర్యాప్తును నువ్వు ఎప్పుడైనా చూశావా? 283 00:24:34,892 --> 00:24:37,603 - లేదు. చూడలేదనే చెప్పాలి. - మరి? 284 00:24:38,270 --> 00:24:39,271 ఒకటి మాత్రం పచ్చి నిజం. 285 00:24:39,271 --> 00:24:41,857 వాళ్లే కనుక లేకపోతే, ఆ హంతకుడు ఇంకా బయటే తిరుగుతూ ఉండేవాడు. 286 00:24:41,857 --> 00:24:43,859 అందుకే, వాళ్లు తీవ్రమైన చర్యలు తీసుకోవడం లేదు, డియాజ్. 287 00:24:44,568 --> 00:24:46,820 వీళ్లు ఏం చేశారో, ఆ ఎస్కొబేడో గాడికి బాగా తెలుసు. 288 00:24:47,321 --> 00:24:50,199 అందుకే, వాళ్లకి తప్పించుకొనే దారిని ఇస్తున్నాడు, కేసులు దాఖలు చేయడం లేదు. 289 00:24:50,741 --> 00:24:53,160 - ఏదేమైనా, ఈ పని నాకు నచ్చట్లేదు. - నాకు కూడా నచ్చట్లేదు, డియాజ్. 290 00:24:53,994 --> 00:24:55,954 కానీ నేనేం చేయగలను? 291 00:25:13,805 --> 00:25:16,391 లోపలికి వస్తావా, లేదా అక్కడే నిలబడి ఉంటావా? 292 00:25:26,109 --> 00:25:27,110 నాన్నా. 293 00:25:34,743 --> 00:25:36,161 నేను పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేద్దామనుకుంటున్నా. 294 00:25:36,161 --> 00:25:38,497 ఆ సోది కొట్టకు. 295 00:25:39,790 --> 00:25:41,416 నేను అసలు పోలీసు అయ్యుండకూడదు. 296 00:25:43,001 --> 00:25:44,002 అది నీకూ తెలుసు. 297 00:25:46,004 --> 00:25:47,339 నేనెప్పుడూ ఏమీ అనలేదు. 298 00:25:48,048 --> 00:25:50,634 ప్రతిరోజు పనికి వచ్చేవాడిని, అలవాటు పడిపోతానులే అనుకున్నా. 299 00:25:52,427 --> 00:25:53,679 కానీ నేను అలవాటు పడలేకపోయాను. 300 00:25:55,347 --> 00:26:00,185 గత కొన్ని వారాలుగా, గబీనా, తన కుటుంబానికి దగ్గరవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలు చూశాను. 301 00:26:01,687 --> 00:26:05,691 తను పోలీసుగా ఆనందంగా ఉంది, అందుకు తనని శిక్షించే కుటుంబానికి అన్నమాట. 302 00:26:09,695 --> 00:26:11,363 ఈ గొప్ప ఉద్యోగం నీకు సెట్ కాదు. 303 00:26:11,363 --> 00:26:14,324 ఇక్కడ చాలా దారుణం జరుగుతోంది. 304 00:26:14,324 --> 00:26:18,036 అవును, మొదట్నుంచీ నీ కన్నా గబీనాకే ధైర్యం ఎక్కువ. 305 00:26:43,896 --> 00:26:46,523 ఇది చెప్పడం నాకు కష్టంగానే ఉంది. 306 00:26:46,523 --> 00:26:51,028 మహిళా పోలీసు విభాగం అధికారికంగా రద్దు చేయబడింది. 307 00:26:51,028 --> 00:26:52,362 ఏంటి? 308 00:26:52,362 --> 00:26:53,572 ఎందుకు? 309 00:26:54,156 --> 00:26:55,449 అలా అని నాకు ఆదేశాలిచ్చారు. 310 00:26:56,033 --> 00:26:57,951 అదెలా కుదురుతుంది? దారుణమది. 311 00:26:58,577 --> 00:27:01,705 ఎందుకంటే, మీరు చెప్పినవే కాక, మేము ఇంకా చాలా చేశాం. 312 00:27:02,497 --> 00:27:05,417 అయితే, మేము అధ్యక్షుల వారి భార్య దగ్గరికి వెళ్లి ఆమెకి అంతా వివరంగా చెప్పేస్తాం. 313 00:27:08,837 --> 00:27:10,547 ఆ ఆదేశం ఇచ్చింది ఆమే. 314 00:27:11,340 --> 00:27:15,093 రేపు మధ్యాహ్నం, మేము ఈ విషయాన్ని మీడియా వాళ్లకి చెప్పబోతున్నాం. 315 00:27:17,095 --> 00:27:18,430 నన్ను క్షమించండి. 316 00:27:42,579 --> 00:27:44,915 ఇక పని మొదలుపెట్టండి, మిత్రులారా. కానివ్వండి. 317 00:28:08,438 --> 00:28:09,439 వాల్. 318 00:28:14,778 --> 00:28:17,072 - సమయం ఎంత అయింది? - తెల్లవారు జామే ఇంకా. 319 00:28:31,837 --> 00:28:33,213 తనని కాపాడే అవకాశం నాకు ఉండింది. 320 00:28:35,674 --> 00:28:36,675 ఎవరిని? 321 00:28:37,801 --> 00:28:38,969 నటాలియాని. 322 00:28:41,388 --> 00:28:43,807 అమ్మ గురించి ఏమంటారో తెలుసా? 323 00:28:43,807 --> 00:28:45,309 నాన్న గురించి ఏమంటారో తెలుసా? 324 00:28:45,309 --> 00:28:49,479 - నా గురించి ఏమంటారో తెలుసా? - దీనికి, నీకు ఏ సంబంధమూ లేదు. 325 00:28:49,479 --> 00:28:51,356 ఒకసారి వాలంటీనా గురించి ఆలోచించు. తనకి 12 ఏళ్లే. 326 00:28:52,149 --> 00:28:54,234 తనకి ఆదర్శంగా ఉండాల్సింది పోయి, ఇలా చేస్తే ఎలా? 327 00:28:54,234 --> 00:28:58,447 ఆపు. వాలంటీనా తరఫున మాట్లాడకు. నువ్వు అనుకునే దాని కన్నా చాలా తెలివైనది తను. 328 00:28:59,615 --> 00:29:04,995 నీకు ఏది మంచిదో, అదే కావాలనుకుంటున్నా నేను. కానీ ఇప్పుడు పరిస్థితులను సరిగ్గా గమనించలేకపోతున్నావు. 329 00:29:07,873 --> 00:29:09,625 కానీ, పెళ్లి కాకుండా నువ్వు పిల్లలని కనలేవు. 330 00:29:11,835 --> 00:29:12,836 లేదు. 331 00:29:14,004 --> 00:29:17,132 నేను అసలు పిల్లలనే కనను, అంతే. 332 00:29:17,132 --> 00:29:18,467 నీకేమైనా పిచ్చా? 333 00:29:20,135 --> 00:29:23,388 ఏం చేయాలో, ఏం చేయకూడదో నిర్ణయించుకొనే స్వేచ్ఛ నాకు ఉంది. 334 00:29:23,972 --> 00:29:27,059 అది నీకు అర్థం కాకపోతే, అది నీ సమస్య. 335 00:29:28,310 --> 00:29:29,561 స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నావా? 336 00:29:30,938 --> 00:29:31,939 సరే మరి. 337 00:29:33,565 --> 00:29:34,691 అయితే నా కారు దిగేయ్. 338 00:29:35,692 --> 00:29:36,735 దిగు. 339 00:29:38,695 --> 00:29:40,572 - నువ్వంటే నాకు చిరాగ్గా ఉంది! - నాకు కూడా. 340 00:30:03,262 --> 00:30:04,888 నేను తనని అర్థం చేసుకోలేకపోయాను. 341 00:30:08,308 --> 00:30:09,810 అస్సలు అర్థం చేసుకోలేకపోయాను. 342 00:30:15,065 --> 00:30:17,192 నీ విషయంలో కూడా అదే తప్పు చేయాలని నాకు లేదు. 343 00:30:22,155 --> 00:30:24,741 నువ్వు మారాలని నాకు లేదు. 344 00:30:28,745 --> 00:30:30,497 నువ్వు పరిపూర్ణురాలివి. 345 00:30:34,585 --> 00:30:35,794 నువ్వంటే నాకు ప్రాణం, వలీతా. 346 00:30:36,795 --> 00:30:38,005 నువ్వంటే నాకు ప్రాణం. 347 00:30:56,023 --> 00:30:58,775 అందుకే మేము లెకుంబెర్రి జైలుకు వెళ్లి గొయో కదేనాస్ ని కలిశాం. 348 00:30:58,775 --> 00:31:03,697 ఒక హంతకుడి ఆలోచనల గురించి ఇంకో హంతకుడు ఏ సలహా అందించగలడు? 349 00:31:05,824 --> 00:31:06,950 చూశారా? 350 00:31:07,826 --> 00:31:12,372 మిస్టర్ ప్రెసిడెంట్, దీని వల్ల పోలీసులపై మాత్రమే కాకుండా, మెక్సికోలోని న్యాయవ్యవస్థపై కూడా 351 00:31:12,372 --> 00:31:14,833 జనాలకున్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. 352 00:31:20,214 --> 00:31:22,716 ట్లాల్పాన్ వివస్త్ర హంతకుడు చనిపోయాడు కాబట్టి, 353 00:31:23,258 --> 00:31:26,136 ఇంకా వాలంటీనా కమాచో మళ్లీ తన కుటుంబంతో ఏకమైంది కనుక, 354 00:31:26,136 --> 00:31:29,848 ఇవాళ మెక్సికోలో కొత్త శకం మొదలైందని చెప్పవచ్చు. 355 00:31:31,350 --> 00:31:32,643 దీనికి ఎవరికి ధన్యవాదాలు తెలపాలి? 356 00:31:33,477 --> 00:31:36,063 నా నాయకత్వంలో 357 00:31:36,063 --> 00:31:41,276 ఎనలేని ధైర్యసాహసాలను ప్రదర్శించి, దర్యాప్తు చేసి 358 00:31:41,276 --> 00:31:46,281 అద్భుతంగా కేసుని ఛేదించిన మగ పోలీసులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 359 00:31:46,281 --> 00:31:50,744 కానీ, ఒక వ్యక్తికి మాత్రం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, 360 00:31:50,744 --> 00:31:56,166 అతనే సాయపడకుంటే, ట్లాల్పాన్ వివస్త్ర హంతకుని హత్యలు ఇంకా జరుగుతూనే ఉండేవి. 361 00:31:57,000 --> 00:32:00,712 అతనే గొయో కదేనాస్ అనే పౌరుడు. 362 00:32:01,880 --> 00:32:05,259 లెకుంబెర్రిలోని బ్లాక్ ప్యాలెస్ నుండి 363 00:32:05,259 --> 00:32:09,596 వాలంటీనా కమాచో ప్రాణాలను కాపాడటానికి ఆయన అందించిన సాయం చాలా కీలకమైనది. 364 00:32:10,264 --> 00:32:14,309 జైల్లో ఉండగానే ఆయన న్యాయవాదిగా పటభద్రుడు అయ్యాడు. 365 00:32:14,935 --> 00:32:19,523 భర్త అయ్యాడు, ముగ్గురు పిల్లలకి తండ్రి అయ్యాడు, 366 00:32:19,523 --> 00:32:22,359 ఇటీవలే గౌరవ పోలీసు అధికారి కూడా అయ్యాడు. 367 00:32:23,944 --> 00:32:29,658 ప్రశంసాపూర్వకంగా, మన అధ్యక్షులు ఆయనకి క్షమాభిక్ష కూడా ప్రసాదించారు. 368 00:32:29,658 --> 00:32:33,912 నేటితో, ఆయన నేరస్థునిగా లెకుంబెర్రి జైలులోకి వెళ్లి ముప్పై ఏళ్లు అయ్యాయి. 369 00:32:33,912 --> 00:32:37,124 నేడు ఆయన ఒక వీరుడిగా విడుదలవుతున్నారు. 370 00:32:42,504 --> 00:32:46,550 నా స్వేచ్ఛే చెప్తోంది, నా దేశం ఎంత గొప్పదో అని. 371 00:32:47,342 --> 00:32:50,596 నా లాంటి వాళ్లకి కూడా మారే అవకాశం ఇవ్వాలని 372 00:32:50,596 --> 00:32:52,598 అది చెప్తోంది. 373 00:32:56,852 --> 00:32:59,062 ఇక చివరిగా... చివరిగా 374 00:32:59,062 --> 00:33:05,277 నా జీవితంలో ఇంతటి అద్భుతమైన మార్పును తీసుకువచ్చిన 375 00:33:06,778 --> 00:33:10,949 ఒక ముఖ్యమైన వ్యక్తికి నేను ధన్యవాదాలు తెలపకుండా ఉండలేను. 376 00:33:14,161 --> 00:33:15,412 ఆయన ఎవరో కాదు... 377 00:33:18,749 --> 00:33:22,794 మెక్సికో అధ్యక్షులైన, మిస్టర్ లూయిస్ ఎచెవెరియా ఆల్వరెజ్. 378 00:33:23,795 --> 00:33:26,548 హంతకులకైనా సలామ్ కొడుతున్నారు కానీ, ఒక మహిళకి జై కొట్టడానికి మాత్రం చేతులు రావట్లేదు. 379 00:33:27,090 --> 00:33:29,092 మన పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదేమో. 380 00:33:30,385 --> 00:33:32,804 అతను ఉండిన జైల్లోనే మనల్ని వేసేవారేమో. 381 00:33:44,983 --> 00:33:46,735 ఎందుకు? 382 00:33:50,113 --> 00:33:51,740 - అలెహాండ్రో. - హాయ్. 383 00:33:51,740 --> 00:33:53,784 మనం ఒక మాట అనుకున్నాం కదా, నువ్వు ఇలా చెప్పాపెట్టకుండా... 384 00:33:53,784 --> 00:33:57,287 సారీ. ముందే కాల్ చేసి రావాలని నాకు తెలుసు. 385 00:33:57,287 --> 00:33:59,540 - రెండే నిమిషాలు ఉండి వెళ్తాను. - నాన్నా! 386 00:34:00,332 --> 00:34:03,877 హలో, హలో! అంతా ఓకేనా? ఎలా ఉన్నావు? 387 00:34:03,877 --> 00:34:07,339 - నాన్నా. - హలో. హలో! 388 00:34:14,137 --> 00:34:15,347 ఇది నీకే. 389 00:34:17,181 --> 00:34:19,101 - థ్యాంక్స్. - నేను తెరుస్తా. హా. 390 00:34:29,652 --> 00:34:31,947 డిటెక్టివ్ ముర్రీతా సాహసాలు 391 00:34:35,742 --> 00:34:37,119 మొదటి పేజీ చూడు. 392 00:34:39,830 --> 00:34:41,748 "డిటెక్టివ్ మరియాకి. 393 00:34:42,498 --> 00:34:46,920 సత్యాన్వేషణ ఎప్పటికీ ఆపకండి. మీ, డేనియల్ హెకోబోస్." 394 00:34:48,672 --> 00:34:50,132 ఇవి పుస్తకాలేనా? 395 00:34:50,132 --> 00:34:52,967 లేదు, బంగారం. నాకు అవి అంతకన్నా ఎక్కువ. 396 00:34:52,967 --> 00:34:56,471 - నేను ఒక పుస్తకాన్ని చదవవచ్చా? - తప్పకుండా, ఒకటేంటి, అన్నీ చదవవచ్చు. 397 00:34:57,806 --> 00:35:01,810 సరే మరి. నాకు, మీ నాన్నకి ఒక నిమిషం ఏకాంతం ఇస్తారా? నాన్నకి బై చెప్పి వెళ్లండి. 398 00:35:01,810 --> 00:35:03,437 - ఐ లవ్ యూ. బై. - బై. 399 00:35:11,904 --> 00:35:14,948 మహిళా పోలీసుల ప్రోగ్రామ్ ని రద్దు చేసేశారు. 400 00:35:16,158 --> 00:35:17,618 మీరు ఇంత చేశాక కూడానా? 401 00:35:17,618 --> 00:35:19,661 మేము అంత చేశాము కాబట్టే రద్దు చేశారని చెప్పవచ్చు. 402 00:35:21,830 --> 00:35:25,667 నిజం ఏమిటంటే... తర్వాత ఏం చేయాలో నాకు తెలీట్లేదు. 403 00:35:27,544 --> 00:35:30,839 కానీ నాకు ఒంటరిగా ఉండాలని ఉంది. 404 00:35:31,965 --> 00:35:33,133 ఇది నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. 405 00:35:34,134 --> 00:35:36,386 చాలా మంచి కానుక తెచ్చావు. 406 00:35:37,679 --> 00:35:41,975 కానీ నువ్వు నాకు కానుకలు తెచ్చి ఇవ్వనక్కర్లేదు, అలెహాండ్రో, లేదా... 407 00:35:44,269 --> 00:35:46,021 నన్ను మళ్లీ నీ వైపు తిప్పుకోవాలని కూడా చూడకు. 408 00:35:48,148 --> 00:35:49,650 నాకు కాస్త సమయం కావాలి. 409 00:35:52,236 --> 00:35:56,448 నా భవిష్యత్తు ఎలా ఉండాలి అని నేను ఆలోచించాలి. 410 00:35:58,659 --> 00:35:59,868 నా సొంతంగా. 411 00:36:02,663 --> 00:36:03,914 అర్థమైంది. 412 00:36:05,457 --> 00:36:06,542 ఇంకా... 413 00:36:08,001 --> 00:36:09,211 దాన్ని నేను గౌరవిస్తున్నా కూడా. 414 00:36:11,213 --> 00:36:12,840 నీకు కావాల్సినంత సమయం తీసుకో. 415 00:36:14,299 --> 00:36:16,009 నిన్ను నేను అస్సలు... 416 00:36:18,053 --> 00:36:19,054 ఇబ్బంది పెట్టను. 417 00:36:20,931 --> 00:36:22,099 ఇక బయలుదేరుతా. 418 00:36:40,868 --> 00:36:42,077 థ్యాంక్స్, చెల్లీ. 419 00:36:58,218 --> 00:36:59,303 నీ భోజనం. 420 00:37:02,931 --> 00:37:03,974 థ్యాంక్స్. 421 00:37:03,974 --> 00:37:05,350 వంట గాబ్రియెల్ చేశాడు. 422 00:37:06,268 --> 00:37:09,021 అయితే బాగా రుచిగా ఉంటుంది, కదా? 423 00:37:09,855 --> 00:37:10,856 అవును. 424 00:37:11,940 --> 00:37:14,318 యాంగలెస్, ఇతను నీ స్నేహితుడా? 425 00:37:14,818 --> 00:37:17,988 దోన్ లూలే, ఇతనే గాబ్రియెల్. ఇతని గురించే నేను నీకు చెప్పింది. 426 00:37:18,488 --> 00:37:22,159 - కొన్ని రోజుల క్రితం, మేము ఇక్కడికి డిన్నర్ కి వచ్చాం. - గుర్తుంది. హాయ్, గాబ్రియెల్. 427 00:37:22,159 --> 00:37:24,411 - హాయ్. ఎలా ఉన్నారు? - మిమ్మల్ని కలవడం బాగుంది. 428 00:37:24,411 --> 00:37:27,289 వెనుక పక్కకు వెళ్లి ఆప్రాన్ తీసుకురండి, పని మొదలుపెట్టేయవచ్చు. 429 00:37:28,123 --> 00:37:30,000 - ఏంటి? - నువ్వు ఇతనికి చెప్పలేదా? 430 00:37:31,126 --> 00:37:34,338 ఇది సర్ప్రైజ్, ఎప్పుడు చెప్పాలో నాకు అర్థం కాలేదు. 431 00:37:34,922 --> 00:37:36,340 ఏంటి సర్ప్రైజ్? 432 00:37:36,340 --> 00:37:39,343 కిచెన్ లో నీకు ఉద్యోగం ఇవ్వడం గురించి నేను దోన్ లూలేతో మాట్లాడాను. 433 00:37:39,343 --> 00:37:40,636 అదే సర్ప్రైజ్. 434 00:37:41,720 --> 00:37:42,721 సర్ప్రైజ్! 435 00:37:44,306 --> 00:37:45,432 నువ్వు నిజంగానే అంటున్నావా? 436 00:37:45,432 --> 00:37:48,227 సరే, మీరిద్దరూ మాట్లాడుకోండి మరి. 437 00:37:49,144 --> 00:37:50,938 - మిమ్మల్ని కిచెన్ లో కలుస్తాను, సరేనా? - అలాగే, సర్. 438 00:37:55,776 --> 00:37:57,277 ఈ పని నా కోసం చేశావా? 439 00:37:58,862 --> 00:38:02,157 లవర్స్ అన్నాక ఆ మాత్రం చేయరా? సాయం చేస్తారుగా. 440 00:38:09,540 --> 00:38:11,625 మనం ముద్దు కూడా పెట్టుకోవచ్చు. 441 00:38:29,393 --> 00:38:31,436 గాబ్రియెల్, సిద్ధంగా ఉన్నారా? 442 00:38:32,729 --> 00:38:34,064 దోన్ లూలే నా కోసం ఎదురు చూస్తున్నాడు. 443 00:38:39,194 --> 00:38:41,655 - ఇదిగోండి మీ ఆప్రాన్. - హా, థ్యాంక్యూ. 444 00:38:43,365 --> 00:38:45,576 ముందు ఇక్కడ మొదలుపెడదాం. 445 00:38:46,451 --> 00:38:49,788 పిన్నీ, నువ్వు నేరస్థులెవరినైనా పట్టుకున్నావా? 446 00:38:51,874 --> 00:38:53,667 నిజానికి, మేము ఒకరినే పట్టుకున్నాం. 447 00:38:55,127 --> 00:38:57,713 - అతను చాలా చెడ్డవాడా? - చాలా చెడ్డవాడు. 448 00:38:58,672 --> 00:39:01,466 కానీ మీరు నలుగురు ఉన్నారు, అతను ఒక్కడే, కదా? 449 00:39:03,385 --> 00:39:04,386 అవును. 450 00:39:05,429 --> 00:39:08,891 మరి, అంత చెడ్డవాడిని మీరు పట్టుకుంటే, 451 00:39:09,808 --> 00:39:11,685 మిమ్మల్ని పోలీసులుగా ఎందుకు కొనసాగనివ్వలేదు? 452 00:39:11,685 --> 00:39:14,104 ఎందుకంటే, ప్రభుత్వానికి ఇప్పుడు మా అవసరం లేదు. 453 00:39:14,855 --> 00:39:16,440 కానీ అది న్యాయం కాదు. 454 00:39:17,441 --> 00:39:18,483 అవును, న్యాయం కాదు. 455 00:39:19,151 --> 00:39:21,445 మరి నువ్వు ఇదివరకటిలా నిరసన ర్యాలీలు చేపట్టవచ్చు కదా? 456 00:39:22,613 --> 00:39:24,323 ఎందుకంటే, ఇది ర్యాలీలతో తేలేది కాదు. 457 00:39:26,575 --> 00:39:29,036 ప్రభుత్వం దాని ప్రతిష్ట గురించి మాత్రమే ఆలోచిస్తుంది. 458 00:39:29,661 --> 00:39:32,539 ఏది న్యాయం, ఏది అన్యాయం అనేది వారికి అక్కర్లేదు. 459 00:39:33,165 --> 00:39:35,751 వాళ్లకి కావాల్సిందల్లా, వాళ్ల ఫోటోలు తీసుకోవడం, 460 00:39:35,751 --> 00:39:37,669 వాళ్లు పిస్తాలని జనాలకు చెప్పడం, అంతే. 461 00:39:41,215 --> 00:39:42,382 పిన్నీ? 462 00:39:49,097 --> 00:39:52,392 మీ మంచి మాటలకు చాలా చాలా థ్యాంక్స్, కామ్రేడ్ కాస్తెలానోస్. 463 00:39:52,392 --> 00:39:55,020 వివస్త్ర హంతకుడు చనిపోయాడన్నది నిజం... 464 00:39:56,146 --> 00:39:58,315 ఇంకా దేశ వాసులందరూ ఎట్టకేలకు ప్రశాంతంగా పడుకోవచ్చు. 465 00:39:58,315 --> 00:40:00,025 కానీ రేపు ఏం జరుగుతుంది? 466 00:40:01,235 --> 00:40:03,820 వివస్త్ర హంతకుడు లాంటి రాకాసులను ఎదుర్కోవడానికి 467 00:40:04,488 --> 00:40:09,368 మన కూతుళ్లను, అక్కాచెల్లెళ్లను, ఇంకా తల్లులను బయటకు పంపడానికి, 468 00:40:09,368 --> 00:40:13,330 ఒక ప్రభుత్వంగా మేము సిద్ధంగా ఉన్నామా? 469 00:40:14,164 --> 00:40:15,749 ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు, 470 00:40:15,749 --> 00:40:21,630 మన పౌరులకు ఏది మంచిది అని ఆలోచించి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి. 471 00:40:21,630 --> 00:40:24,216 అందుకే, ఒకటి ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాను... 472 00:40:56,540 --> 00:40:58,208 మీరు దేనిపై సంతకం చేశారో మర్చిపోవద్దు. 473 00:40:58,208 --> 00:40:59,585 మర్చిపోను. 474 00:41:01,628 --> 00:41:02,838 మిత్రులారా, 475 00:41:04,756 --> 00:41:08,343 ఇప్పుడు మీకు అమితానందంతో వాలంటీనా కమాచోని పరిచయం చేస్తున్నాను. 476 00:41:20,939 --> 00:41:23,358 చాలా చాలా థ్యాంక్స్, కామ్రేడ్ మరియా ఎస్తేర్. 477 00:41:27,321 --> 00:41:31,366 ముందుగా, నన్ను కాపాడటంలో సాయపడిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 478 00:41:35,621 --> 00:41:36,830 మీకు నా జీవితాంతం రుణపడి ఉంటా. 479 00:41:38,457 --> 00:41:42,544 నేను ప్రమాదంలో పడ్డానని మహిళా పోలీసుల ప్రోగ్రామ్ ని మూసేయాలని 480 00:41:42,544 --> 00:41:46,882 భావించే వ్యక్తులందరినీ ఉద్దేశించి ఇప్పుడు రెండు ముక్కలు మాట్లాడతాను. 481 00:41:50,177 --> 00:41:53,263 నాకు జరిగిందే, ఎవరికైనా జరగవచ్చు. 482 00:41:54,848 --> 00:41:58,810 కానీ, దాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులుగా మహిళలు ఉండకూడదు అంటే ఎలా? 483 00:42:00,187 --> 00:42:05,108 మీ ముందు ఇక్కడ ఉండటానికి, ఈ అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి మేము చాలా త్యాగాలు చేశాం. 484 00:42:09,112 --> 00:42:14,618 మాలో చాలా మందికి ఇప్పుడు కుటుంబాల అండ కూడా లేదనే చెప్పాలి. 485 00:42:15,869 --> 00:42:17,454 గతంలో ఉండిన రవ్వంత కూడా ఇప్పుడు లేదు. 486 00:42:18,497 --> 00:42:21,583 మా ఆత్మీయులతో, భాగస్వాములతో, పిల్లలతో మధురమైన క్షణాలను వదులుకొని 487 00:42:21,583 --> 00:42:25,796 ఇక్కడ... ఇక్కడ పని చేశాం. 488 00:42:26,588 --> 00:42:27,840 అయినా కానీ, ఒకటి చెప్పనా? 489 00:42:28,340 --> 00:42:31,510 అంత త్యాగం చేసినా మేమెన్నడూ బాధపడలేదు, ఎందుకంటే, బ్యాడ్జీ ధరించి 490 00:42:31,510 --> 00:42:35,639 దేశానికి సేవ చేసే గొప్ప అవకాశం మాకు దక్కింది. 491 00:42:40,269 --> 00:42:45,649 మేము గ్రాడ్యుయేట్ అయినప్పుడు, ఈ నగరంలో మమ్మల్ని మించినవారు ఎవరూ లేరని మీరు అన్నారు. 492 00:42:49,736 --> 00:42:51,196 మీరు అన్నది నిజమే. 493 00:42:51,905 --> 00:42:53,740 నేను గొప్పదాన్ని అని ఎప్పటికీ చెప్పలేకపోవచ్చు, 494 00:42:53,740 --> 00:42:58,078 కానీ, మీ ముందు నిలబడి ఉన్న ఈ 15 మంది మహిళలు మాత్రం గొప్పవాళ్లే అని చెప్పగలను. 495 00:42:58,579 --> 00:43:01,456 కాబట్టి, మహిళా పోలీస్ ఆఫీసర్లగా ఉన్న 16 మంది తరఫున, 496 00:43:02,749 --> 00:43:06,170 మా మీద నమ్మకం ఉంచినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. 497 00:43:06,795 --> 00:43:10,716 మీరు మా కోసం ఎలా పోరాడారు అనే విషయం చరిత్రలో నిలిచిపోతుందని కూడా గట్టిగా చెప్పగలను. 498 00:43:13,552 --> 00:43:15,637 మేము ఎప్పటికీ మిమ్మల్ని నిరాశపరచం. 499 00:43:18,223 --> 00:43:19,558 అందరికీ ధన్యవాదాలు. 500 00:43:25,314 --> 00:43:26,815 మిమ్మల్ని కూడా నేనెన్నడూ నిరాశపరచను. 501 00:43:28,775 --> 00:43:30,027 ఆఫీసర్ కమాచో. 502 00:43:31,862 --> 00:43:32,863 థ్యాంక్యూ. 503 00:43:51,965 --> 00:43:55,302 నేను వేరే తలుపును చెక్ చేయలేదు, దానికి తాళం వేసి లేదు, 504 00:43:55,302 --> 00:43:59,431 ఇక ఆ దొంగ, చల్లగా తలుపు తెరిచి జారుకున్నాడు. మాయమైపోయాడు, అంతే. 505 00:44:00,724 --> 00:44:04,895 సరే మరి, నేను... నేను ఇక వెళ్లాలి, 506 00:44:06,647 --> 00:44:10,400 కానీ వెళ్లే ముందు, అందరూ ఒక నిమిషం మౌనంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. 507 00:44:11,902 --> 00:44:14,488 - మరియా, ఒకసారి లేచి నిలబడతావా? - అయ్య బాబోయ్. 508 00:44:16,406 --> 00:44:17,699 లేచి నిలబడు. 509 00:44:23,872 --> 00:44:25,123 మరియా దె లా తొర్రె, 510 00:44:25,123 --> 00:44:30,212 విధి నిర్వహణలో భాగంగా నాయకత్వ లక్షణాలను, ధర్మ భక్తిని, ధైర్యసాహసాలను ప్రదర్శించినందుకు 511 00:44:31,171 --> 00:44:32,506 నీకు దీన్ని బహుకరిస్తున్నాను. 512 00:44:34,383 --> 00:44:36,718 అభినందనలు, లెఫ్టనెంట్ మరియా దె లా తొర్రె. 513 00:44:37,553 --> 00:44:38,971 - శభాష్! - శభాష్! 514 00:44:41,640 --> 00:44:43,725 - థ్యాంక్యూ, కెప్టెన్. - అభినందనలు. 515 00:44:44,309 --> 00:44:46,854 - సరే మరి, అందరికీ గుడ్ నైట్. - థ్యాంక్యూ. 516 00:44:46,854 --> 00:44:48,772 - గుడ్ ఈవినింగ్. - గుడ్ ఈవినింగ్. 517 00:44:50,148 --> 00:44:55,070 మీరిద్దరూ మళ్లీ విచిత్రంగా ప్రవర్తించారు, కానీ ఈసారి ఎందుకో నాకు తెలుసు అనుకుంటా. 518 00:44:56,029 --> 00:44:58,282 అది మా అందరికీ కూడా తెలుసనుకుంటా, అంతే కదా? 519 00:44:58,282 --> 00:45:02,619 నేను అతనితో మాట్లాడాను. అతను చాలా గొప్పవాడు, కానీ నేను ఎవరితోనూ సంబంధాన్ని ఏర్పర్చుకోవడానికి సిద్ధంగా లేను. 520 00:45:02,619 --> 00:45:06,498 అంటే, మనం పోలీసులం కదా, ఇక మనకి వేరే తోడు ఎందుకు? 521 00:45:08,417 --> 00:45:09,793 అందుకు నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. 522 00:45:09,793 --> 00:45:10,878 ఏంటి? 523 00:45:10,878 --> 00:45:13,505 "ఏంటి" అంటావేంటి? నువ్వు మా కోసం అంత చేశావు కదా. 524 00:45:14,423 --> 00:45:15,841 పైగా నువ్వు అది చాలా గొప్పగా చేశావు, వాల్. 525 00:45:17,634 --> 00:45:20,095 నువ్వలా మాట్లాడటం నేనెప్పుడూ చూడలేదు, అంటే నీ మాటల్లో నాకు ఒక... 526 00:45:20,596 --> 00:45:22,848 లక్ష్యం కనిపించిందని చెప్పవచ్చు. 527 00:45:23,765 --> 00:45:25,934 - దాని గురించి ఆలోచిస్తేనే, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. - నాకు కూడా. 528 00:45:25,934 --> 00:45:27,227 నాకు ఒక లవర్ ఉన్నాడు. 529 00:45:27,227 --> 00:45:29,021 - ఏమన్నావు? - ఏంటి? 530 00:45:29,021 --> 00:45:31,773 మన్నించాలి, నేను మనం మాట్లాడుకొనే విషయాన్ని మార్చాలనుకోలేదు. 531 00:45:32,482 --> 00:45:35,444 అది చెప్పడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నా, కానీ ఆ సరైన సమయం దొరకట్లేదు. 532 00:45:36,570 --> 00:45:37,571 ఒకసారి తనని చూడండి. 533 00:45:38,530 --> 00:45:41,575 నిశ్శబ్దంగా ఉంటూనే, ఒక లవర్ ని సంపాదించేసింది. 534 00:45:42,659 --> 00:45:43,869 ఇప్పుడు నాకు లవర్ ఉన్నాడు. 535 00:45:47,206 --> 00:45:48,332 స్నేహితులు ఉన్నారు. 536 00:45:49,958 --> 00:45:51,418 నాకు స్నేహితులు ఉన్నారు. 537 00:46:02,262 --> 00:46:03,347 గుడ్ మార్నింగ్. 538 00:46:22,991 --> 00:46:25,244 ఆకాశాన్ని చూస్తుంటే బాగుంది కదా? 539 00:46:28,247 --> 00:46:34,753 నా జైలు పైకప్పును చూసి చూసి, నాకు అదే అలవాటైపోయింది. 540 00:46:36,171 --> 00:46:40,926 చెప్పాలంటే, ఎవరైనా దేనికైనా అలవాటు పడిపోతారు. అది చాలా గొప్ప విషయం. 541 00:46:42,052 --> 00:46:44,429 ఉదాహరణకు, ఇప్పుడు నేను ఒక కుటుంబ సభ్యుడిని, ఈ జీవితానికి కూడా అలవాటు పడిపోయా. 542 00:46:44,429 --> 00:46:48,058 నా భార్య పందిలా గురక పెడుతుంది. 543 00:46:49,977 --> 00:46:51,186 ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? 544 00:46:51,186 --> 00:46:54,731 నీకు వ్యక్తిగతంగా అభినందనలు తెలపాలని వచ్చా. 545 00:46:56,275 --> 00:46:57,276 వాడిని పట్టుకుంది నువ్వు. 546 00:46:57,985 --> 00:46:59,862 ఒక రకంగా, వాడిని చంపింది నువ్వే. 547 00:47:01,113 --> 00:47:02,447 రెండూ ఒకటే. 548 00:47:03,615 --> 00:47:07,077 కానీ పోలీసులు నీ పేరును ప్రస్తావించనే లేదు. ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. 549 00:47:08,453 --> 00:47:11,957 మేము చేసిందేమిటో మాకు తెలుసు. మాకు అది చాలు. 550 00:47:12,457 --> 00:47:14,668 ఈ దేశంలోని పోలీసులు 551 00:47:15,169 --> 00:47:19,590 మీ పూర్తి సామర్థ్యానికి చేరుకోకుండా మీకు అడ్డుపడుతూనే ఉంటారు, మరియా. 552 00:47:20,215 --> 00:47:24,386 నాకు అది బాగా తెలుసు. నా జీవితంలోని 30 ఏళ్లని కాజేశారు వాళ్లు. 553 00:47:26,763 --> 00:47:29,766 నువ్వే కనుక లేకపోతే, ఇంకా ఎక్కువ ఏళ్లే జైల్లో ఉండేవాడిని. 554 00:47:30,267 --> 00:47:32,603 లేదు, లేదు. దానికి నేను కారణం కాదు. 555 00:47:32,603 --> 00:47:34,521 - నువ్వే. - లేదు, నేనేమీ చేయలేదు. 556 00:47:37,649 --> 00:47:40,277 ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, 557 00:47:41,653 --> 00:47:44,281 మన తర్వాతి అధ్యాయం ఎలా ఉండబోతోంది? 558 00:47:45,991 --> 00:47:46,992 విషయం ఏంటంటే... 559 00:47:50,287 --> 00:47:54,374 లెకుంబెర్రి కారాగారంలో ఉండగా, 560 00:47:54,875 --> 00:47:57,252 నేను కథలు బాగానే చదివాను. 561 00:47:57,252 --> 00:47:59,213 వేలల్లో చదివానని చెప్పవచ్చు. 562 00:47:59,922 --> 00:48:05,469 కానీ ఇప్పుడు విడుదల అయ్యాను కాబట్టి, ఆ కథల్లో ఒకటి 563 00:48:05,469 --> 00:48:07,012 నాకు తరచుగా గుర్తొస్తోంది. 564 00:48:09,223 --> 00:48:16,021 అది ఒక యువకునికి సంబంధించినది అన్నమాట, అతనికి తీరని అన్యాయం జరుగుతుంది కాబట్టి, 565 00:48:16,021 --> 00:48:20,192 వీరావేశంతో ఉంటాడు. 566 00:48:21,026 --> 00:48:26,281 కాబట్టి, అతని తాతయ్య దగ్గరికి వెళ్లి, ఏం చేయాలి, ఎలా ప్రతిస్పందించాలని అడుగుతాడు. 567 00:48:27,115 --> 00:48:29,451 అప్పుడు ఆ తాతయ్య అంటాడు, 568 00:48:30,327 --> 00:48:31,787 "చూడు, మనవడా, 569 00:48:32,704 --> 00:48:38,126 ప్రతీ మనిషి లోపల రెండు తోడేళ్లు ఉంటాయి. 570 00:48:39,378 --> 00:48:46,343 ఒక తోడేలు చెడుకు, ద్వేషానికి, అసూయకి, కోపానికి గుర్తు. 571 00:48:47,469 --> 00:48:53,225 ఇంకో తోడేలు శాంతికి, ప్రేమకి, మంచితనానికి గుర్తు. 572 00:48:54,059 --> 00:48:58,146 పై చేయి సాధించడానికి, అవి రెండు కూడా పరస్పరం కొట్టుకుంటూనే ఉంటాయి." 573 00:49:01,400 --> 00:49:03,527 అప్పుడు అతను తన తాతను, 574 00:49:05,028 --> 00:49:06,488 "ఏది గెలుస్తుంది?" అని అడుగుతాడు. 575 00:49:07,155 --> 00:49:08,532 అప్పుడు ఆ తాతయ్య ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? 576 00:49:10,492 --> 00:49:11,493 తెలీదు. 577 00:49:14,121 --> 00:49:15,414 "నువ్వు దేనికి ఆహారం వేస్తే, అది." 578 00:49:18,750 --> 00:49:21,336 ఇప్పుడు నాకు కూడా ఆ యువకునిలానే అనిపిస్తోంది. 579 00:49:22,379 --> 00:49:28,719 ఒకవైపు ఏమో, నీకు సాయపడినందుకు నాకు చాలా సంతృప్తిగా ఉంది. 580 00:49:30,387 --> 00:49:33,307 కానీ అదే సమయంలో, నాలో ద్వేషపూరిత ఆలోచనలు కూడా వస్తున్నాయి. 581 00:49:33,307 --> 00:49:36,393 ఏదో అంధకారం... 582 00:49:38,520 --> 00:49:39,938 నన్ను పిలుస్తున్నట్టుగా అనిపిస్తోంది. 583 00:49:39,938 --> 00:49:41,732 నన్ను లాగుతున్నట్టుగా అనిపిస్తోంది. 584 00:49:44,484 --> 00:49:47,404 నేను ఏ తోడేలుకు ఆహారం వేయాలి, మరియా? 585 00:49:51,366 --> 00:49:53,994 మీకు స్వేచ్ఛ రావడానికి కారణమైన దానికి. 586 00:49:54,703 --> 00:49:59,374 హంతకుడిని పట్టుకోవడంలో, నా చెల్లెలికి సాయపడటంలో నీకు ఉపయోగపడిన దానికి. 587 00:50:12,262 --> 00:50:14,056 అదే నాకు సరిగ్గా సరిపోతుంది అంటావా? 588 00:50:17,643 --> 00:50:20,771 దానికి కాలమే సమాధానం చెప్పగలదు. 589 00:54:04,161 --> 00:54:06,163 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్