1 00:00:09,635 --> 00:00:12,679 విచిత్రమైన విషయం ఏమిటంటే, నాది సాధారణ జీవనం కాదు. 2 00:00:13,555 --> 00:00:15,057 సాధారణమైన పనులే చేస్తాను. 3 00:00:15,140 --> 00:00:18,227 నేను సాధారణమైన వ్యక్తినే. కానీ నా జీవితం సాధారణమైనది కాదు. 4 00:00:18,310 --> 00:00:21,396 సెలేనా గోమెజ్ కు ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. 5 00:00:21,480 --> 00:00:24,650 టైమ్ పత్రికలో పేర్కొన్న ప్రపంచపు 100 అత్యంత ప్రభావవంతులైనవారు. 6 00:00:24,733 --> 00:00:26,318 సెలేనా గోమెజ్ కు దక్కిన పురస్కారం 7 00:00:26,401 --> 00:00:28,570 బిల్బోర్డ్ వుమన్ ఆఫ్ ద ఇయర్. 8 00:00:28,654 --> 00:00:30,989 -ఇది చాలా గొప్ప విషయం. మీకు ఎలా అనిపిస్తోంది? -చాలా అద్భుతంగా ఉంది. 9 00:00:31,073 --> 00:00:34,910 చిన్న వయసులో అంత ఘన విజయం వరించటం తట్టుకోలేనంత గొప్ప విషయం. 10 00:00:34,993 --> 00:00:39,206 కానీ నాకు రానురాను అర్థమయ్యింది ఏమిటంటే, నాకున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, 11 00:00:39,289 --> 00:00:43,961 నాకున్న ఈ ప్రాముఖ్యతతో నాకు అమితంగా ప్రీతిపాత్రమైన విషయం కోసం పాటుపడాలని. 12 00:00:44,044 --> 00:00:46,088 -డియర్ సెలేనా… -డియర్ సెలేనా… 13 00:00:46,171 --> 00:00:47,631 నీ వేదికను విస్తరిస్తూ 14 00:00:47,714 --> 00:00:52,219 సామాజిక న్యాయ సేవ చేసే నల్లజాతి నాయకుల గళాలను ప్రతిధ్వనింపజేశావు. 15 00:00:52,302 --> 00:00:53,846 నీ కథను పంచుకోవటం ద్వారా, 16 00:00:53,929 --> 00:00:57,432 కోట్ల మందికి కోలుకొనే ఆశను అందించావు. 17 00:00:57,516 --> 00:01:00,978 నా ఉనికికి నేను కాక ఇంకేదో పరమార్థం ఉందని ఖచ్చితంగా నమ్ముతాను. 18 00:01:01,061 --> 00:01:05,774 పక్కవారికి సాయపడదగ్గ సమర్ధతను పొందటంలో నాకు సహాయం చేసినందుకు థాంక్యూ. 19 00:01:05,858 --> 00:01:09,027 ఏదో ఒకటి సాధించటానికి ధైర్యం సంపాదించటంలో ప్రేరణనిచ్చావు. 20 00:01:09,111 --> 00:01:12,781 నా ఉనికి ఉద్దేశం జీవితాన్ని ఆస్వాదించటం, దాన్ని పక్కవారి కోసం వినియోగించటం, 21 00:01:13,365 --> 00:01:17,578 వారిలో నమ్మకాన్ని పెంపొందించటం, 22 00:01:17,661 --> 00:01:19,538 ప్రేమపాత్రులం అనే అనుభూతి వారికి ఇవ్వటం. 23 00:01:20,581 --> 00:01:21,790 డియర్ సెలేనా… 24 00:01:28,547 --> 00:01:32,092 సెలేనా గోమెజ్ 25 00:01:51,028 --> 00:01:53,155 చిన్నతనంలో ఎప్పుడూ అనిపించేది, "ఇంకా ఏదో ఉంది" అని. 26 00:01:53,906 --> 00:01:58,619 "ఖచ్చితంగా ఇంకా ఏదో ఉంది, అదేమిటో నేను చూడాలి, చేయాలి" అని నాకు నేనే చెప్పుకుంటూ ఉండేదాన్ని. 27 00:01:59,286 --> 00:02:04,666 టెక్సస్ లో పెరిగే రోజుల్లో, మా అమ్మ నన్ను మ్యూజియంలకు, నాటకాలకు తీసుకువెళ్ళేవారు. 28 00:02:04,750 --> 00:02:09,086 తనకు అపరిమితమైన ఊహ ఉండేది, 29 00:02:09,170 --> 00:02:12,007 నేను పెద్దదాన్ని అయ్యాక, నేను దాన్ని పొందాలని కోరుకునేది. 30 00:02:12,090 --> 00:02:16,428 అందుకు నేను కృతజ్ఞురాలిని. ఎందుకంటే ఇప్పుడు నా జీవితమంతా నాటకీయమైనది. 31 00:02:17,513 --> 00:02:20,390 చిన్నప్పుడు నేను నటనను ఇష్టపడేదాన్ని. 32 00:02:20,474 --> 00:02:23,060 గతంలోని నన్ను చూసుకొని నేనే నవ్వుకుంటూ ఉంటాను. 33 00:02:23,143 --> 00:02:26,730 ఎందుకంటే అప్పటికి నేను ప్రయత్నిస్తున్న మామూలు పిల్లని. 34 00:02:26,813 --> 00:02:30,150 నన్ను అంతా బాగా ఆటపట్టిస్తూ ఉండేవారు. ఎందుకు చేయరు? 35 00:02:32,444 --> 00:02:35,364 నీకిదే నా శాపం. తన గతి నీకు పట్టుగాక. 36 00:02:35,447 --> 00:02:39,451 జీవితంలో నన్ను మలచిన అతి ముఖ్యమైన భాగం అది. 37 00:02:40,577 --> 00:02:42,037 చాలా స్వచ్ఛమైన కాలం అది. 38 00:02:42,120 --> 00:02:43,121 ఇంటికి వచ్చేశానోచ్. 39 00:02:43,205 --> 00:02:44,581 నేను చాలా నేర్చుకున్నాను. 40 00:02:44,665 --> 00:02:47,376 అందులో ఎదురైన మంచిచెడులు రెండూ కూడా. 41 00:02:47,459 --> 00:02:49,503 ఎందుకంటే ఆ సమయంలోనే, 42 00:02:49,586 --> 00:02:56,552 నా జీవితంలో నేను పెద్దగా ఇష్టపడని అంశాలు జరిగాయి. 43 00:02:56,635 --> 00:02:59,763 దయచేసి దారివ్వండి. 44 00:03:00,264 --> 00:03:03,725 మీడియా, పత్రికలు వెల్లువలా మీదపడ్డాయి. 45 00:03:03,809 --> 00:03:06,687 సెట్ లోకి కూడా ఫోటోగ్రాఫర్లు వచ్చేవారు. 46 00:03:06,770 --> 00:03:08,939 నాకు చాలా భయం వేసేది. 47 00:03:09,022 --> 00:03:12,401 మొదటిసారి అలాంటి అనుభవం ఎదురైనప్పుడు చాలా ఆరాటంగా ఉండేది. 48 00:03:12,484 --> 00:03:14,319 నాకు హెడ్ లైన్ అవ్వాలని ఉండేది కాదు. 49 00:03:14,403 --> 00:03:16,321 నిరంతరం గమనించబడుతూ ఉండటం కష్టతరమైన విషయం కదా? 50 00:03:16,405 --> 00:03:18,240 మీ జీవితంలో అన్ని విషయాలూ, మీ సామాజిక జీవితం, 51 00:03:18,740 --> 00:03:20,534 ఎక్కడకి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో. 52 00:03:20,617 --> 00:03:23,620 -ఎప్పుడూ అన్నీ గమనిస్తూ ఉంటారు. -అవును. ఒక్కోసారి విసుగుగానే ఉంటుంది. 53 00:03:23,704 --> 00:03:24,538 కిస్ & టెల్ 54 00:03:24,621 --> 00:03:25,831 సెలేనా ప్రత్యేకం! టేలీనా తర్వాత జీవితం 55 00:03:25,914 --> 00:03:27,040 ఈ మలుపు తర్వాత… 56 00:03:27,124 --> 00:03:28,250 "నాకు ప్రియుడితో పనిలేదు!" 57 00:03:28,333 --> 00:03:30,919 …జనం నా వ్యక్తిగత జీవితాన్ని మరింత వాడుకోవటం మొదలుపెట్టారు. 58 00:03:31,003 --> 00:03:34,256 నాకు చాలా ఏళ్ళు పట్టింది ఆ విషయాల నుండి నా ధ్యాసను 59 00:03:34,339 --> 00:03:36,383 మళ్లీ నాకు ముఖ్యమైన అంశాల వైపుకు తిప్పుకోకపోవటానికి. 60 00:03:38,844 --> 00:03:40,262 యూనిసెఫ్ 61 00:03:40,345 --> 00:03:42,973 డిస్నీతో పనిచేయటానికి ఒప్పుకున్నాం అంటేనే, 62 00:03:43,056 --> 00:03:47,519 పిల్లలకు ఆదర్శప్రాయంగా ఉంటానని చెప్పకనే చెప్పినట్టు లెక్క. 63 00:03:47,603 --> 00:03:48,770 వేవర్లీ ప్లేస్ విజర్డ్ స్కూల్ 64 00:03:48,854 --> 00:03:51,106 నేను కొద్దిగా… అదుపులో ఉన్నానని చెప్పను కానీ, 65 00:03:51,190 --> 00:03:54,985 పర్యవేక్షణలో ఉన్నానని చెప్పచ్చేమో. 66 00:03:55,068 --> 00:03:57,070 నా పరిధి చాలా చిన్నది అయ్యింది. 67 00:03:57,154 --> 00:03:58,822 నువ్వు అచ్చం ఆమె లాగే ఉన్నావు. 68 00:03:58,906 --> 00:04:00,824 కానీ, అప్పుడిక నా వయసు పెరిగింది. 69 00:04:00,908 --> 00:04:04,119 కనుక, సహజంగానే నాకు పరిణితి చెందాలనిపించింది. 70 00:04:04,203 --> 00:04:05,996 అది నాకివ్వు. ఆపు! 71 00:04:06,079 --> 00:04:08,248 కానీ నిరంతరం భయపడుతూనే ఉండేదాన్ని 72 00:04:08,332 --> 00:04:11,710 "ఇలా చేస్తే, లేకపోతే ఈ మాట అంటే నేను అంతా కోల్పోవలసి వస్తానేమో" అని. 73 00:04:11,793 --> 00:04:14,129 "నన్ను ఎవ్వరూ ఇక మునుపటిలా చూడరు" అని. 74 00:04:14,213 --> 00:04:18,132 కానీ, అదే సమయంలో, ఒక కళాకారిణిగా నేను ఎదగాలంటే, 75 00:04:18,216 --> 00:04:20,302 ఆయా నిర్ణయాలు తీసుకోవలసివచ్చేది. 76 00:04:20,385 --> 00:04:24,014 ఎందుకంటే నీకు నేను చక్కగా కనిపించాలని 77 00:04:24,097 --> 00:04:25,098 "గుడ్ ఫర్ యూ" 2015 78 00:04:25,182 --> 00:04:30,521 ఇంటర్స్కోప్ తో నేను చేసిన మొదటి రికార్డ్ అయిన రివైవల్ ను విడుదల చేశాను. 79 00:04:30,604 --> 00:04:32,898 నీదాన్ని అయినందుకు నేను ఎంత గర్వపడుతున్నానో నీకు చూపించనీ 80 00:04:32,981 --> 00:04:38,570 ఆ ఆల్బమ్ కు రివైవల్ అని పేరు పెట్టటానికి కారణం ఆ సమయంలో నేను పునరుజ్జీవనం పొందటమే. 81 00:04:39,863 --> 00:04:42,533 ఓ, ఓ, ఓ ఓ 82 00:04:43,408 --> 00:04:44,910 నా చేతులని అధీనంలో ఉంచుకోలేకపోతున్నాను 83 00:04:44,993 --> 00:04:45,827 "హ్యాండ్స్ టు మైసెల్ఫ్" 2015 84 00:04:45,911 --> 00:04:49,122 "ఓహో, నేను ఇలా మాట్లాడచ్చు అన్నమాట" అనిపించింది. 85 00:04:49,206 --> 00:04:51,458 "ఇప్పుడు అవేం పర్వాలేదు, మాట్లాడచ్చు" అనిపించింది. 86 00:04:52,125 --> 00:04:54,253 నువ్వు మొత్తం నాకే కావాలి 87 00:04:54,336 --> 00:04:58,841 ఆ మలుపు దగ్గరే అనుకోవటం మొదలుపెట్టారు, "ఆమె మాటల్లో ఒక మహిళ వినిపిస్తోంది. 88 00:04:58,924 --> 00:05:01,677 ఆత్మ పరివర్తన చెందుతున్న ఒక పడుచు మహిళ, 89 00:05:01,760 --> 00:05:04,888 ఇక తను చిన్నపిల్ల కాదు" అని. 90 00:05:05,973 --> 00:05:09,977 ఈ ఎత్తులు, పల్లాలు ఒకరితో ఒకరు రమిస్తుండగా 91 00:05:10,060 --> 00:05:14,898 అదే మొదటిసారి నేను శృంగారభరితంగా, అల్లరిగా కనిపించటం. 92 00:05:15,774 --> 00:05:19,987 నేను ఎదగటానికి అది సహాయపడింది. నన్ను కొత్త కోణంలో చూపించింది అది. 93 00:05:20,070 --> 00:05:25,701 కనుక రివైవల్ నాపై నేను అధికారం సంపాదించటానికి 94 00:05:25,784 --> 00:05:27,202 ఒక ప్రతీక. 95 00:05:27,286 --> 00:05:30,581 అమెరికన్ మ్యూజిక్ అవార్డ్ ను గెలుచుకున్నవారు… 96 00:05:30,664 --> 00:05:32,332 సెలేనా గోమెజ్! 97 00:05:32,416 --> 00:05:34,877 ఐహార్ట్ రేడియో మ్యూజిక్ అవార్డ్ ను గెలుచుకున్నవారు… 98 00:05:34,960 --> 00:05:36,128 టీఎన్టీ #ఐహార్ట్ అవార్డ్స్ 99 00:05:36,211 --> 00:05:37,713 …సెలేనా గోమెజ్. 100 00:05:38,422 --> 00:05:43,218 ఇన్ని విజయాలు సాధిస్తున్నా, నాకు సంతృప్తి లేదు. 101 00:05:44,261 --> 00:05:46,013 ఎందుకో తెలియలేదు. 102 00:05:46,555 --> 00:05:51,393 కానీ కొన్ని విషయాల పట్ల ఇతరుల కంటే నాకు బలమైన భావన కలుగుతోందనిపించింది. 103 00:05:51,476 --> 00:05:53,812 -తలకి మించి ఇరుక్కున్నట్టు మీకు అనిపిస్తోందా… -లేదు. 104 00:05:53,896 --> 00:05:56,940 నాకు నా ప్రసిద్ధిని చూసుకొని అపరాధభావం కలిగింది. 105 00:05:57,024 --> 00:05:59,443 ఎందుకంటే నా స్థానంలో ఉన్న ఎవరిని చూసినా జనం అనుకుంటారు, 106 00:05:59,526 --> 00:06:03,363 "అబ్బో, వాళ్ళ పనే బాగుందే. వాళ్ళ జీవితానికేం తక్కువ!" అని. 107 00:06:03,447 --> 00:06:04,448 గ్రామీ అవార్డ్స్ 108 00:06:04,531 --> 00:06:06,408 అయితే వ్యక్తిగతంగా ఉన్న భావన వేరా? 109 00:06:06,491 --> 00:06:08,493 అవును. ఒంటరితనం అనిపిస్తుంది. 110 00:06:08,577 --> 00:06:10,704 నిత్యం పర్యవేక్షణలో ఉంటాము. మన మంచిచెడులు బేరీజు వేస్తుంటారు. 111 00:06:10,787 --> 00:06:11,788 లూయీ వ్యూటన్ సిరీస్ 3 112 00:06:11,872 --> 00:06:14,583 ప్రపంచంలో అంతకంటే దారుణమైన భావన మరొకటి లేదు. 113 00:06:15,709 --> 00:06:17,836 రడ్డర్లెస్ అక్టోబర్ 17 114 00:06:17,920 --> 00:06:21,965 శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం అని నాకు తెలిసివచ్చింది. 115 00:06:22,049 --> 00:06:24,009 సెలేనా గోమెజ్ ఇన్స్టాగ్రామ్ లో అలసట, మానసిక ఆరోగ్యం గురించి 116 00:06:24,092 --> 00:06:27,387 దానివల్ల బాధలు పడుతున్నవారి పట్ల నాకు ఎంతగానో 117 00:06:27,471 --> 00:06:29,765 కరుణ, సహానుభూతి కలిగాయి. 118 00:06:31,683 --> 00:06:36,021 ఎందుకంటే దాని గురించి నాకు తెలుసు. ఆ భావన నాకు తెలుసు. 119 00:06:36,104 --> 00:06:36,939 లవ్ యూ! 120 00:06:37,022 --> 00:06:39,566 సంగీతం విశ్వభాష అంటుంటారు. 121 00:06:39,650 --> 00:06:43,111 భాషా తారతమ్యాలు దాదాపు లేనట్టే. 122 00:06:43,195 --> 00:06:46,532 కనుక ఇది చాలా గొప్ప అనుబంధం, జీవనరేఖ 123 00:06:46,615 --> 00:06:48,200 నాకు, నేను ప్రేమించేవారికి మధ్య. 124 00:06:55,832 --> 00:06:59,044 బొగోటా - కొలంబియా 125 00:07:03,173 --> 00:07:04,883 డియర్ సెలేనా, 126 00:07:04,967 --> 00:07:08,303 నా జన్మస్థలం అయిన కొలంబియాలోని బొగోటా నుంచి మాట్లాడుతున్నాను. 127 00:07:09,137 --> 00:07:11,849 "మాది అనుబంధాలతో నిండిన లాటినా కుటుంబం. 128 00:07:11,932 --> 00:07:13,559 నా బాల్యం చాలా బాగా గడిచింది." 129 00:07:14,184 --> 00:07:17,479 కానీ హైస్కూల్ లో ఉన్నప్పుడు నా ఆరోగ్యం పాడవ్వసాగింది. 130 00:07:22,734 --> 00:07:24,069 లాంగ్ ఐల్యాండ్ - న్యూయార్క్ 131 00:07:24,152 --> 00:07:27,573 డియర్ సెలేనా, నాది న్యూయార్క్ లోని సేవిల్. 132 00:07:28,156 --> 00:07:30,117 అక్కడ పెరగటం అంటే ఉక్కిరిబిక్కిరి వ్యవహారం. 133 00:07:30,617 --> 00:07:35,914 ఎందుకో చిన్నప్పటి నుంచి అందరూ నన్నే ఆటపట్టించేవారు. 134 00:07:35,998 --> 00:07:39,001 "ఎప్పుడు మొదలయ్యిందో కూడా నాకు గుర్తులేనంత చిన్నప్పటి నుంచే". 135 00:07:40,294 --> 00:07:43,630 తర్వాత ఏం జరుగుతుందో అన్న భయంతో గడిపేవాడిని. 136 00:07:43,714 --> 00:07:47,176 ఎవరు ఎప్పుడు హాని చేస్తారో అని భయపడటంతోనే నా జీవితంలో ఎన్నో ఏళ్ళు గడచిపోయాయి. 137 00:07:47,843 --> 00:07:51,763 చివరికి తొమ్మిదో తరగతిలో థెరపీలో చేరాను. 138 00:07:51,847 --> 00:07:56,059 నాకు యాంక్సైటీ డిసార్డర్ ఉందన్నారు నా వైద్యులు. 139 00:07:56,685 --> 00:08:00,397 మా అమ్మ, నేను ఊరంతా తిరగటం నాకు గుర్తుంది 140 00:08:00,480 --> 00:08:04,526 ఏం తేడా ఉందో తెలుసుకోవటం కోసం డాక్టర్లను, హోమియోపతి వైద్యులను మారుస్తూ. 141 00:08:04,610 --> 00:08:07,404 కానీ నాకున్న డిప్రెషన్ కనుగొనబడ్డాక కూడా, 142 00:08:07,487 --> 00:08:10,449 మా అమ్మ దాన్ని "విపరీతమైన బాధ" అని మాత్రమే పిలిచేది. 143 00:08:11,491 --> 00:08:13,744 ఎందుకంటే కొలంబియాలో దీని గురించి ఎవ్వరూ మాట్లాడాలనుకోరు. 144 00:08:15,162 --> 00:08:18,874 నా కుటుంబం ఎల్లప్పుడూ మద్దతుగా ఉంది. 145 00:08:18,957 --> 00:08:22,503 కానీ ఈ సమస్యలను ఎదుర్కోని వాళ్ళకి 146 00:08:22,586 --> 00:08:24,880 ఇదంతా అర్థంకావటం కష్టం. 147 00:08:24,963 --> 00:08:28,425 ప్యానిక్ ఎటాక్ వచ్చినప్పుడు మన చుట్టూ గోడలు మూగి మనల్ని బంధించేసినట్టు అనిపిస్తుందని, 148 00:08:28,509 --> 00:08:32,596 ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయిపోతామని వాళ్ళకి తెలియదు. 149 00:08:33,889 --> 00:08:36,892 కొన్నేళ్ళు పోయాక, నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేయాల్సివచ్చాను. 150 00:08:37,808 --> 00:08:40,229 "నా డిప్రెషన్ మరీ ఎక్కువైపోయింది." 151 00:08:40,729 --> 00:08:43,232 నా అంతట నేను ఏమీ చేయలేకపోయేదాన్ని. 152 00:08:43,315 --> 00:08:44,733 ఒంటరిగా నిద్రపోగలిగేదాన్ని కాదు. 153 00:08:44,816 --> 00:08:46,693 బాత్రూమ్ కి కూడా ఒంటరిగా వెళ్ళలేకపోయేదాన్ని. 154 00:08:46,777 --> 00:08:47,903 డ్రైవ్ చేయలేకపోయేదాన్ని. 155 00:08:48,487 --> 00:08:53,408 ఇంట్లోనే మానసిక వైద్యం పొందాల్సివచ్చాను ఎందుకంటే ఇల్లు కూడా దాటగలిగేదాన్ని కాదు. 156 00:08:54,201 --> 00:08:58,205 అదే ఏడాది నాకు రుమటోయిడ్ ఆర్థ్రైటిస్ ఉందని కూడా తెలిసింది. 157 00:08:58,705 --> 00:09:01,416 నా మనసుకి నా శరీరం కూడా శత్రువయ్యింది. 158 00:09:02,334 --> 00:09:04,294 అదే నాకు పెద్ద దెబ్బ. 159 00:09:04,378 --> 00:09:06,129 ఆత్మహత్యాయత్నం చేశాను. 160 00:09:09,800 --> 00:09:13,720 వర్జీనియా టెక్ అనే పెద్ద కాలేజ్ లో చేరాను. 161 00:09:13,804 --> 00:09:15,722 అక్కడ 35,000 మంది ఉండేవారు. 162 00:09:16,348 --> 00:09:19,351 వాళ్ళందరి మధ్యా ఒక చిన్న ఊరి నుంచి వచ్చి 163 00:09:19,434 --> 00:09:21,144 మెలగటం విచిత్రంగా ఉండేది. 164 00:09:21,228 --> 00:09:23,522 ఒకోసారి యాంక్సైటీ పెరిగిపోయేది. 165 00:09:23,605 --> 00:09:25,691 నేను ఎప్పటినుంచో మీ అభిమానిని. 166 00:09:25,774 --> 00:09:28,694 అలా అవుతోందని అనిపించినప్పుడల్లా, 167 00:09:28,777 --> 00:09:30,988 మీ ఆల్బమ్ రివైవల్ ను పెట్టుకొని, 168 00:09:31,071 --> 00:09:33,365 మనసు కుదుటపరచుకొనేవాడిని. 169 00:09:34,116 --> 00:09:35,409 సెలేనా గోమెజ్! 170 00:09:35,993 --> 00:09:40,330 అప్పుడు అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ వేదికపై మీరు చేసిన ప్రసంగాన్ని చూశాను. 171 00:09:40,414 --> 00:09:45,586 నాకు అన్నీ ఉండేవి. కానీ మనసులో ప్రశాంతత లేదు. 172 00:09:45,669 --> 00:09:48,463 మీ మానసిక ఆరోగ్య పరిస్థితి గురించి మీరు చెప్పారు. 173 00:09:48,547 --> 00:09:51,133 -ఇంకా ఏమన్నారంటే… -"మీ మనసులో శాంతి లేకపోతే…" 174 00:09:51,216 --> 00:09:52,926 …అలాగే ఉండిపోవలసిన అవసరం లేదు. 175 00:09:56,138 --> 00:09:57,890 నాకు మతి పోయింది. 176 00:09:58,473 --> 00:10:01,810 ఒక అత్యంత ప్రసిద్ధ వ్యక్తి అయ్యుండి, 177 00:10:01,894 --> 00:10:06,148 "ఒకప్పుడు ఇదే సమస్యతో ఉండి, ఇప్పుడు హాయిగా గట్టెక్కాను" అంటుంటే, 178 00:10:06,857 --> 00:10:10,402 "నా భావాలన్నీ మీ నోట విన్నట్టు అనిపించింది. 179 00:10:11,236 --> 00:10:14,740 ఇంకా ఏదో చేయాలి అని నాకు అనిపించేలా చేసింది. 180 00:10:14,823 --> 00:10:18,785 సెలేనా, మీ ప్రయాణం గురించి చాలా బాహాటంగా చెప్పారు. 181 00:10:18,869 --> 00:10:20,621 అది చర్చకు ఒక నాంది. 182 00:10:20,704 --> 00:10:22,122 చాలా సహాయపడింది. 183 00:10:22,664 --> 00:10:24,166 నన్ను ఆలోచించేలా చేసింది. 184 00:10:24,875 --> 00:10:27,753 థెరపీ అంటే సిగ్గు పడాల్సిన విషయం కాదని 185 00:10:27,836 --> 00:10:30,964 కొలంబియాలోని జనానికి అర్థమయ్యేలా ఏదో చేయాలనిపించింది. 186 00:10:31,048 --> 00:10:34,635 నాకున్న సమస్యల గురించి రాసి ఆన్లైన్ లో ప్రచురించటం మొదలుపెట్టాను. 187 00:10:34,718 --> 00:10:39,056 తద్వారా నేను సాంత్వన పొందాను. 188 00:10:39,139 --> 00:10:42,059 సీనియర్ ఇయర్ లో ఉండగా, హోమ్ కమింగ్ కోర్ట్ లో పోటీ చేశాను. 189 00:10:42,142 --> 00:10:46,355 ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశం గురించి మాట్లాడాల్సి ఉండగా, ఆత్మహత్యా నివారణను ఎంచుకున్నాను. 190 00:10:46,438 --> 00:10:47,272 హోకీస్ 191 00:10:47,356 --> 00:10:50,734 అరవై వేల మంది ఎదురుగా నిలబడి 192 00:10:50,817 --> 00:10:53,987 ఆత్మహత్యా నివారణ అనే మాట పక్కన నా పేరును ప్రకటించారు. 193 00:10:54,071 --> 00:10:55,072 ఇది వీటీ హోమ్ 194 00:10:55,155 --> 00:10:57,950 ఇక జేక్ వేల్, ఫేయ్ వేల్ తో పాటు. 195 00:10:58,033 --> 00:11:00,994 యాంక్సైటీ డిసార్డర్ గల కుర్రాడినైన నేను. 196 00:11:01,620 --> 00:11:04,623 కానీ, సెలేనా, మానసిక చికిత్స గురించి మాట్లాడినప్పుడు 197 00:11:04,706 --> 00:11:07,543 ఎవరేం అనుకున్నా పర్లేదన్న మీ సంసిద్ధతే నాకు ఆశాదీపం. 198 00:11:07,626 --> 00:11:11,505 నా తోటివారికి సహాయం చేయటంలో నేను ఎదుర్కోబోయే యాంక్సైటీకి 199 00:11:11,588 --> 00:11:13,715 నేను సంసిద్ధుడిని అవ్వటానికి. 200 00:11:13,799 --> 00:11:17,094 "ఇక నా జీవితాన్ని భయం ఆక్రమించటాన్ని ఆపే సమయం వచ్చింది." 201 00:11:21,014 --> 00:11:23,600 మళ్లీ ప్రపంచం నన్ను గుర్తిస్తోంది అనిపించింది. 202 00:11:23,684 --> 00:11:26,937 మానసిక రుగ్మత ముసుగు చాటున దాక్కొని ఉండిపోలేదు నేను. 203 00:11:27,020 --> 00:11:31,817 ఇప్పుడు నేనే స్వయాన ఒక మానసిక నిపుణురాలిని. మానసిక ఆరోగ్య ఉద్యమ కార్యకర్తని. 204 00:11:32,568 --> 00:11:36,947 నేను కాలేజ్ లో చదువుతున్నాను. మానసిక ఆరోగ్యం విషయంలో అవగాహన పెంచటం కొనసాగిస్తున్నాను. 205 00:11:37,030 --> 00:11:39,449 మీ సందేశాన్ని వ్యాపింపజేయగలుగుతున్నాను. 206 00:11:39,533 --> 00:11:41,994 ప్రపంచమంతటా నాకు స్నేహితులు ఉన్నారు. 207 00:11:42,703 --> 00:11:46,206 మీ పట్ల నేను ఎంతో కృతజ్ఞుడిని, సెలేనా. 208 00:11:46,290 --> 00:11:51,461 మీ సమస్యల గురించి పంచుకొని, నాకు, ప్రపంచానికి ఆశను చిగురింపజేసినందుకు. 209 00:11:52,045 --> 00:11:55,966 సెలేనా, సమస్యను అధిగమించటం సాధ్యం అని జనానికి చూపించినందుకు థాంక్యూ. 210 00:11:56,049 --> 00:11:58,927 తలచుకుంటే సహాయం అడగటం సులభం అని తెలిపినందుకు థాంక్యూ. 211 00:12:01,305 --> 00:12:02,514 నాకిది ఎంతో నచ్చింది. 212 00:12:08,270 --> 00:12:12,065 నా చిన్నప్పుడు ఒక కంటి పరీక్షకి వెళ్ళాను. 213 00:12:12,858 --> 00:12:15,110 డాక్టర్ ని ఎప్పుడు కలిసినా, 214 00:12:15,194 --> 00:12:18,488 బీపీ, టెంపరేచర్ అవన్నీ చూస్తారు కదా? 215 00:12:18,572 --> 00:12:22,618 నా బీపీ 155/100 ఉంది. 216 00:12:22,701 --> 00:12:27,581 "ఇంత ఎక్కువ ఉంటే ఎమర్జెన్సీ రూమ్ కి వెళ్ళాలి" అన్నారు. 217 00:12:27,664 --> 00:12:30,167 మరిన్ని పరీక్షలు చేశారు. 218 00:12:30,250 --> 00:12:32,127 రాత్రంతా అక్కడే ఉండాల్సి వచ్చింది. 219 00:12:32,878 --> 00:12:38,926 అన్నీ అయ్యాక, నాకు లూపస్ ఉందని తేలింది. 220 00:12:39,009 --> 00:12:40,928 దాని అర్థం ఏమిటో సరిగ్గా తెలియలేదు. 221 00:12:41,011 --> 00:12:42,930 ఆటో ఇమ్యూన్ జబ్బు ఉందని తెలుసు. 222 00:12:43,013 --> 00:12:47,976 నా శరీరం తనతో తానే యుద్ధం చేసేసుకుంటోంది. 223 00:12:48,060 --> 00:12:49,895 మీరంతా ఎలా ఉన్నారు? 224 00:12:51,939 --> 00:12:57,152 విచిత్రం ఏమిటంటే, నాకు అలసట కూడా అనిపించలేదు ఎప్పుడూ. 225 00:12:57,236 --> 00:13:00,280 నేను చిన్నదాన్ని. అంతా బాగున్నట్టే అనిపించింది. 226 00:13:00,364 --> 00:13:01,949 ఇది నా పుట్టినరోజు కూడా కాదు 227 00:13:02,032 --> 00:13:04,243 కనుక, "నీ గుండె ఆగిపోయి ఉండచ్చు, 228 00:13:04,326 --> 00:13:07,371 వేదిక మీద ప్రాణాలు కూడా పోయి ఉండచ్చు" అని డాక్టర్ అంటుంటే, 229 00:13:07,996 --> 00:13:13,335 అది చాలా భయంకరమైన విషయం. కానీ నేను పట్టించుకోలేదు. 230 00:13:13,418 --> 00:13:14,920 నిజమని నమ్మాలి అనిపించలేదు. 231 00:13:17,422 --> 00:13:21,718 ఎప్పుడూ మందులు వాడుతూ ఉండటం వల్ల నా బరువు సవ్యంగా ఉండేది కాదు. 232 00:13:22,344 --> 00:13:24,388 ఎప్పటిలాగే జనం వాళ్ళ ఇష్టమొచ్చినట్టుగా ఊహాగానాలు చేశారు. 233 00:13:24,471 --> 00:13:26,098 లూపస్ కారణంగా పెరిగిన శరీర బరువు వల్ల విమర్శలు 234 00:13:26,181 --> 00:13:27,224 చాలా మనస్తాపం చెందారు 235 00:13:27,307 --> 00:13:29,977 నన్ను బాధపెట్టటానికి ఏదో ఒక అంశం దొరికేవరకు వాళ్ళకి మనశ్శాంతి లేనట్టుంది. 236 00:13:30,060 --> 00:13:31,979 లూపస్ తో బాధపడుతున్న సమయంలో పెరిగిన బరువుకు 237 00:13:32,062 --> 00:13:33,605 జనం తనపై దాడి చేస్తున్నారని సెలేనా గోమెజ్ అన్నారు. 238 00:13:33,689 --> 00:13:36,316 లూపస్ వల్ల బరువు పెరిగితే నన్ను గేలిచేశారు. 239 00:13:36,400 --> 00:13:38,986 ఇది నిజంగా సెలేనా యేనా? ఎంత లావుగా ఉంది? ముక్కు కూడా విచిత్రంగా ఉంది… 240 00:13:39,069 --> 00:13:40,279 చాలా కృతజ్ఞురాలిని. 241 00:13:40,362 --> 00:13:43,615 అబద్ధాలాడాను. ఆన్లైన్ లో నా ఫోటోలు పెట్టేదాన్ని. 242 00:13:43,699 --> 00:13:45,617 "ఏం పర్వాలేదు" అనేదాన్ని. 243 00:13:45,701 --> 00:13:47,119 #ప్రేమించటానికి ఇంకా ఎంతో ఉంది 244 00:13:47,202 --> 00:13:49,872 "మీరు అనేది నేను ఒప్పుకోవట్లేదు" అనేదాన్ని. 245 00:13:49,955 --> 00:13:52,332 కానీ అదే సమయానికి మూసి ఉన్న గదిలో 246 00:13:52,416 --> 00:13:56,170 కన్నీరు కారుస్తూ కూర్చొనేదాన్ని. ఎందుకంటే అవి ఎవ్వరూ పడరాని మాటలు. 247 00:13:57,171 --> 00:14:01,300 "నేనేం పట్టించుకోవట్లేదు" అని చెప్పే పోస్ట్స్ పెట్టేదాన్ని. 248 00:14:01,383 --> 00:14:03,844 ఎందుకంటే ఇదే పరిస్థితిలో ఉన్న ఇతరులు 249 00:14:03,927 --> 00:14:06,597 దీనివల్ల బాధపడకూడదని. 250 00:14:06,680 --> 00:14:11,018 వారి రూపాన్ని, నైజాన్ని, వాళ్ళ ఇష్టాయిష్టాలను చూసి గేలిచేయబడటం 251 00:14:11,852 --> 00:14:14,146 అన్యాయమని నా అభిప్రాయం. 252 00:14:14,229 --> 00:14:18,650 తమను తక్కువ చేసి మాట్లాడటం అనేది ఎవ్వరికీ జరగకూడనిది అనుకుంటాను. 253 00:14:18,734 --> 00:14:21,486 సెలేనా. తల తిప్పండి, సెలేనా. 254 00:14:21,570 --> 00:14:24,948 నా 20ల తొలినాళ్లలో లూపస్ మరింత తీవ్రమయ్యింది. 255 00:14:25,824 --> 00:14:30,495 నా కిడ్నీలు దానివల్ల చాలా సమస్య ఎదుర్కొన్నాయి. 256 00:14:30,579 --> 00:14:35,083 భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే అప్పుడిక, 257 00:14:35,167 --> 00:14:38,712 "నీకు కిడ్నీ మార్పిడి జరగాల్సిందే" అన్నారు. 258 00:14:41,089 --> 00:14:43,759 నాకు చాలా తీవ్రమైన భయం కలిగింది. 259 00:14:43,842 --> 00:14:46,303 కిడ్నీ దొరకటానికే చాలా కాలం పడుతుందని తెలుసు. 260 00:14:46,386 --> 00:14:48,597 చాలా కష్టతరమైన విధానమని తెలుసు. 261 00:14:48,680 --> 00:14:53,101 నా వైపు నుంచి ఎంతో ప్రయత్నం అవసరం. 262 00:14:53,185 --> 00:14:55,938 అందుకు నేను సంసిద్ధంగా లేను. 263 00:14:56,021 --> 00:14:58,732 ఒకరోజు ఇంటికి వచ్చి ఏడవటం మొదలుపెట్టింది. 264 00:14:58,815 --> 00:15:00,400 ఏమయ్యింది అన్నాను. 265 00:15:00,484 --> 00:15:01,818 అప్పుడే నాకు చెప్పింది. 266 00:15:01,902 --> 00:15:05,239 "నాకు ఏం చేయాలో తెలియట్లేదు. కిడ్నీ దొరకాలంటే ఏడేళ్ళో పదేళ్ళో కూడా పట్టచ్చు" అంది. 267 00:15:05,322 --> 00:15:08,700 అప్రయత్నంగానే అనేశాను "నేను పరీక్షలు చేయించుకుంటాను" అని. 268 00:15:08,784 --> 00:15:11,578 నా ప్రాణస్నేహితురాలు, ఫ్రాన్సియా. 269 00:15:11,662 --> 00:15:13,956 "ఖచ్చితంగా పరీక్షలు చేయించుకుంటాను" అంది. 270 00:15:14,039 --> 00:15:16,834 కనుక మూడు రోజుల్లో పరీక్షలు చేశారు. తన కిడ్నీ నాకు సరిపోతుందన్నారు. 271 00:15:16,917 --> 00:15:18,126 బిల్బోర్డ్ విమెన్ ఇన్ మ్యూజిల్ 2017 272 00:15:18,836 --> 00:15:24,675 ఆ సమయంలో నేను పరిరక్షించబడుతున్నాను అన్న అనుభూతి కలిగింది. 273 00:15:25,759 --> 00:15:28,846 నేను చాలా చాలా అదృష్టవంతురాలినని నాకు తెలుసు. 274 00:15:28,929 --> 00:15:31,682 అలా ఎంతమందికో జరగదని నాకు తెలుసు. 275 00:15:32,266 --> 00:15:37,729 అలాంటి పరిస్థితులు ఒకోసారి విషమించే అవకాశం కూడా ఉంటుందని తెలుసు. 276 00:15:37,813 --> 00:15:41,608 కనుక నాకు జరిగినదాన్ని తేలికగా తీసిపారేయను. 277 00:15:41,692 --> 00:15:43,110 నిజం చెప్పాలంటే, 278 00:15:43,652 --> 00:15:46,071 ఈ పురస్కారం దక్కాల్సింది ఫ్రాన్సియాకి. 279 00:15:47,948 --> 00:15:50,033 ఎందుకంటే తనే నా ప్రాణాలను నిలబెట్టింది. 280 00:15:51,243 --> 00:15:52,327 క్షమించండి. 281 00:15:53,787 --> 00:16:00,752 ఫ్రాన్సియా ఋణం ఏనాటికీ తీర్చుకోలేనిది. 282 00:16:01,962 --> 00:16:07,968 రెండో ఆలోచన లేకుండా దాతగా ముందుకి రావటం అనేది 283 00:16:08,552 --> 00:16:10,679 నమ్మలేని అసాధారణమైన విషయం. 284 00:16:11,763 --> 00:16:14,141 మా ఇద్దరికీ పచ్చబొట్టు కూడా ఉంది. 285 00:16:14,224 --> 00:16:15,225 19/6/2017 286 00:16:15,309 --> 00:16:17,853 ఇది కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిన తేదీ. 287 00:16:19,730 --> 00:16:22,482 నేను ఈరోజు ఇలా ఉన్నానంటే 288 00:16:23,525 --> 00:16:25,652 అలా జరగాలని రాసి ఉన్నట్టుంది. 289 00:16:26,278 --> 00:16:31,283 ఇతరుల కోసం నేను ఏదైనా చేయాలంటే నాకు అలా జరగాలని ఉన్నట్టుంది. 290 00:16:35,704 --> 00:16:39,499 టొరాన్స్ - కాలిఫోర్నియా 291 00:16:39,583 --> 00:16:41,168 డియర్ సెలేనా, 292 00:16:41,251 --> 00:16:44,421 మన రక్తనాళాల్లో లోతైన సంబంధం ఉంది. 293 00:16:44,505 --> 00:16:47,382 "నాదీ నీలాగే టెక్సస్,సెలేనా." 294 00:16:47,466 --> 00:16:51,261 అప్పట్లో 20 ఏళ్ళ క్రితం నా భర్తతో, కూతురితో దక్షిణ కాలిఫోర్నియాకు మారాను. 295 00:16:51,345 --> 00:16:56,767 అంతర్జాతీయ విద్యార్థులకు ఇంగ్లీష్, లెక్కలు, సైన్స్ బోధించటానికి వచ్చాను. 296 00:16:57,267 --> 00:17:02,064 నా జీవితానికి పరిపూర్ణత ఉండేది. కానీ అకస్మాత్తుగా మలుపు తిరిగింది. 297 00:17:02,147 --> 00:17:05,442 నాకు విచిత్రమైన లక్షణాలు కనిపించటం మొదలయ్యింది. 298 00:17:05,526 --> 00:17:08,529 అదుపు లేకపోయేది. తిన్నగా ఆలోచించగలిగేదాన్ని కాదు. 299 00:17:08,612 --> 00:17:10,280 జుట్టు రాలిపోవటం మొదలయ్యింది. 300 00:17:10,364 --> 00:17:12,782 ఉన్నట్టుండి బరువు పెరిగిపోయాను. 301 00:17:12,866 --> 00:17:16,161 సమయం గడిచినా ఏమీ మెరుగుపడలేదు. 302 00:17:16,787 --> 00:17:19,790 అదృష్టవశాత్తు నేను జీవశాస్త్రం చదువుకున్నదాన్ని. 303 00:17:19,873 --> 00:17:23,167 కనుక నా పరిశోధన నేను చేశాను. 304 00:17:23,252 --> 00:17:27,214 నా లక్షణాలను బట్టి, నా రిపోర్టులను పోల్చి చూసి, 305 00:17:27,297 --> 00:17:30,092 కీళ్ళ నిపుణులను సంప్రదించాలని తీర్మానించుకున్నాను. 306 00:17:30,175 --> 00:17:34,930 సెలేనా, నీ అనారోగ్యం గురించి నీకు తెలిసినప్పుడు నీకెలా అనిపించిందో తెలియదు. 307 00:17:35,013 --> 00:17:37,224 నాకు నిశ్చింత దొరికింది. 308 00:17:37,307 --> 00:17:39,685 "కనీసం నాకున్న జబ్బు పేరేమిటో తెలిసింది." 309 00:17:39,768 --> 00:17:41,228 లూపస్. 310 00:17:44,231 --> 00:17:46,483 లూపస్ అనేది ఒక అదృశ్య రోగం. 311 00:17:47,651 --> 00:17:50,821 ఏమీ తేడా కనిపించదు. 312 00:17:50,904 --> 00:17:55,075 చాలా మామూలుగా, ఇంకా చెప్పాలంటే, చాలా బాగా కూడా కనిపిస్తాము. 313 00:17:55,158 --> 00:17:57,661 రెడ్ కార్పెట్ మీద నువ్వు ఎలా ఉన్నావో చూడు. 314 00:17:57,744 --> 00:18:00,163 ఖచ్చితంగా జనాలు అనటం నీకు తెలిసే ఉంటుంది. 315 00:18:00,247 --> 00:18:03,834 "'ఆమెకసలు అనారోగ్యం ఉందంటావా? నాకు బాగున్నట్టే అనిపిస్తోందే.' 316 00:18:03,917 --> 00:18:05,252 బానే ఉన్నాము కూడా." 317 00:18:05,335 --> 00:18:06,587 బాగోలేమని తెలిసేవరకు. 318 00:18:08,422 --> 00:18:12,259 నేను ఆరు నెలలు ఐసీయూ లో ఉండాల్సివచ్చాను. 319 00:18:12,342 --> 00:18:16,013 నా లూపస్ సిస్టమిక్ అవ్వటం వల్ల నా కిడ్నీలు దెబ్బతిన్నాయి. 320 00:18:16,096 --> 00:18:19,433 తొమ్మిదేళ్ళు డయాలిసిస్ మీద ఆధారపడ్డాను. 321 00:18:19,516 --> 00:18:23,770 దానితో మనిద్దరికీ రెండో విషయంలో సామ్యం ఉన్నట్టయ్యింది. 322 00:18:23,854 --> 00:18:26,607 మనిద్దరికీ కిడ్నీ మార్పిడి జరిగింది. 323 00:18:28,150 --> 00:18:29,526 వావ్. 324 00:18:29,610 --> 00:18:32,446 సమస్య గురించి నువ్వు ఎలుగెత్తి చాటటం చాలా గొప్ప విషయం. 325 00:18:32,529 --> 00:18:33,614 హోప్ గాలా 326 00:18:33,697 --> 00:18:37,284 లాటినో జాతి, నల్లజాతులు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటాయి. 327 00:18:37,367 --> 00:18:40,370 మనకి అవసరమైన సమాచారం మన దగ్గర ఉండటం చాలా ముఖ్యం 328 00:18:40,454 --> 00:18:42,748 అవసరమైనవారికి తగిన సేవ అందించాలంటే. 329 00:18:42,831 --> 00:18:47,002 కనుక, ఇప్పుడు నేను లూపస్ ఫౌండేషన్ ఆఫ్ అమెరికాలో పనిచేస్తున్నాను. 330 00:18:49,254 --> 00:18:53,967 నాకిష్టమైన కార్యక్రమాల్లో ఒకటి ఈవెనింగ్ ఆఫ్ హోప్ అనే వార్షిక వేడుక. 331 00:18:54,051 --> 00:18:59,723 నాకు జబ్బు బయటపడ్డప్పుడు నాకు అవసరమైన సహాయం లూపస్ బాధితులకు ఇది అందిస్తుంది. 332 00:18:59,806 --> 00:19:03,018 "సంవత్సరంలో జరిగే వేడుకలన్నిటిలో ఇది చాలా గొప్పగా ఉంటుంది. 333 00:19:03,101 --> 00:19:03,936 నీలాగే…" 334 00:19:04,019 --> 00:19:05,938 నేను లూపస్ కి ప్రతినిధిని అయ్యాను. 335 00:19:06,021 --> 00:19:08,982 ఈ అనారోగ్యం గురించి అవగాహన పెంచే మొదటి జాతీయ ప్రకటన ఉద్యమంలో 336 00:19:09,066 --> 00:19:10,567 నేను భాగస్వామిని అయ్యాను. 337 00:19:10,651 --> 00:19:12,986 నేను బాగున్నట్టు కనిపించినా, ఇబ్బంది పడుతున్నాను. నాకు లూపస్ ఉండి ఉంటుందా? 338 00:19:13,070 --> 00:19:17,115 కానీ మనం చేసే పని మన శక్తికి మించింది అని నాకు తెలుసు. 339 00:19:17,741 --> 00:19:21,161 మన పరిస్థితి గురించి బహిరంగంగా మాట్లాడినందుకు చాలా సంతోషం, సెలేనా. 340 00:19:21,245 --> 00:19:23,789 లూపస్ అనేది భయంకరమైన శత్రువు. 341 00:19:23,872 --> 00:19:27,501 కానీ నీతో పాటు ఈ పోరాటంలో పాల్గొనటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. 342 00:19:28,627 --> 00:19:31,463 ఆహా. నేనిది అస్సలు ఊహించలేదు. 343 00:19:34,216 --> 00:19:36,051 చాలా గొప్ప విషయం, వెండీ. 344 00:19:36,969 --> 00:19:39,012 నాకేం చెప్పాలో అర్థంకావట్లేదు. థాంక్యూ. 345 00:19:42,224 --> 00:19:43,600 "రేర్" 2020 346 00:19:43,684 --> 00:19:45,811 ప్రియా, ప్రియా, చాలా దూరంగా ఉంటున్నావు… 347 00:19:45,894 --> 00:19:48,355 నాకు సున్నితమైన, సుకుమారమైన భావాలు ఉంటాయి. 348 00:19:48,981 --> 00:19:52,526 పాటలు రాసేటప్పుడు రకరకాల భావాలు తలెత్తుతాయి. 349 00:19:52,609 --> 00:19:57,197 దాగి ఉన్న భావాలను వెళ్ళగక్కటానికి వీలవుతుంది. నేను ఎప్పుడూ చేయాల్సినదే అది. 350 00:19:57,281 --> 00:19:59,616 భావప్రకటనకు అదొక మార్గం. 351 00:19:59,700 --> 00:20:02,744 మనం కలసిమెలసి పెరిగాము 352 00:20:02,828 --> 00:20:05,455 ఏదైనా హుషారు పాట మీద పనిచేస్తున్నా, 353 00:20:05,539 --> 00:20:10,169 అందులో ఏదో చీకటి కోణం దాగి ఉంటుంది. 354 00:20:10,752 --> 00:20:12,004 అయినా నాకు పర్వాలేదు. 355 00:20:13,463 --> 00:20:17,593 నా సంగీతంలో ఏదో ఒక అంశాన్ని చూసి, జనం ఆలోచిస్తారు, 356 00:20:17,676 --> 00:20:19,344 "అసలిది దేని గురించి?" అని. 357 00:20:19,970 --> 00:20:21,972 అప్పుడు అదేమిటో వాళ్ళే కనుగొంటారు. 358 00:20:23,348 --> 00:20:25,767 విచిత్రంగా, వాళ్ళ ఊహ సాధారణంగా నిజమే అవుతుంది. 359 00:20:25,851 --> 00:20:29,897 హే, మీకు ఒక విషయం చెప్దామనుకున్నాను. 360 00:20:29,980 --> 00:20:31,398 సెలెనాగోమెజ్ ఎ మెసేజ్ ఫ్రమ్ మీ 361 00:20:31,481 --> 00:20:34,359 అంతగా పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని కనుక. 362 00:20:34,443 --> 00:20:38,113 నాకు సామాజిక మాధ్యమాలతో చేదుతీపిలతో కూడిన పెద్ద అనుబంధం ఉంది. 363 00:20:39,239 --> 00:20:41,116 కానీ గడచిన ఎన్నికల్లో, 364 00:20:42,242 --> 00:20:44,786 నాకొక వేదిక దొరికినందుకు నా ఆనందానికి హద్దు లేదు. 365 00:20:44,870 --> 00:20:46,455 న్యాయం లేదు, శాంతి లేదు! 366 00:20:46,538 --> 00:20:48,165 సంఘీభావం జార్జ్ కి న్యాయం 367 00:20:48,248 --> 00:20:49,875 న్యాయం లేదు, శాంతి లేదు! 368 00:20:49,958 --> 00:20:50,959 నల్లజాతి ప్రాణాలకు విలువ ఉంది 369 00:20:51,043 --> 00:20:55,756 ప్రపంచంలోను, మన దేశంలోను ఎన్నో ఆసక్తికర విషయాలు జరుగుతున్నాయి. 370 00:20:55,839 --> 00:20:56,840 పోలీస్ 371 00:20:56,924 --> 00:21:01,303 చాలా దారుణమైనవి. ప్రమాదకరమైనవి. 372 00:21:01,386 --> 00:21:04,223 చాలా బాధకరమైనవి. చాలావరకు జాతివివక్షతో కూడుకున్నవి. 373 00:21:04,306 --> 00:21:06,141 మన సంస్కృతి వాళ్ళకిష్టం మనమంటే ఇష్టం లేదు 374 00:21:06,225 --> 00:21:07,226 న్యూయార్క్ నశించాలి 375 00:21:07,309 --> 00:21:12,105 నేను ఏదైనా చేయాలంటే ఎలాగో నాకు తెలియాలి. 376 00:21:12,898 --> 00:21:17,319 కానీ ధ్వనించాల్సిన గళం నాది కాదు. 377 00:21:18,529 --> 00:21:20,531 కానీ నా దగ్గర అవకాశం ఉంది. 378 00:21:20,614 --> 00:21:22,574 నా పేరు రూబీ బ్రిడ్జెస్. 379 00:21:22,658 --> 00:21:26,328 సెలేనాకు ధన్యవాదాలు తెలపాలి అనుకుంటున్నాను 380 00:21:26,411 --> 00:21:29,331 నేరుగా నీతో మాట్లాడే ఈ అద్భుతమైన అవకాశం కలిగినందుకు. 381 00:21:29,414 --> 00:21:31,416 సెలేనాగోమెజ్ @రూబీబ్రిడ్జెస్ అఫిషియల్ నుండి మెసేజ్ 382 00:21:31,500 --> 00:21:36,088 కనుక, ఆ జీవితాన్ని స్వయంగా అనుభవించిన వారికి 383 00:21:37,047 --> 00:21:40,843 నా వేదికను అందించాలి అనుకున్నాను. 384 00:21:41,552 --> 00:21:42,594 విషయం తెలిసినవారికి. 385 00:21:42,678 --> 00:21:45,264 మనిషి మానవత్వాన్ని కాగితాలు నిర్ధారించలేవు అని నమ్ముతున్నాము. 386 00:21:45,347 --> 00:21:47,349 జాతిని బట్టి విలువ ఉండదు అని నమ్ముతున్నాము. 387 00:21:47,432 --> 00:21:48,433 @స్టేసీఅబ్రామ్స్ 388 00:21:48,517 --> 00:21:50,602 దానితో నా ఆనందానికి అవధులు లేవు 389 00:21:50,686 --> 00:21:52,604 ఎందుకంటే నేను ఎంతో నేర్చుకోగలిగాను. 390 00:21:52,688 --> 00:21:53,689 @కెండ్రిక్38 391 00:21:53,772 --> 00:21:59,194 నేను నమ్మినదాని కోసం పోరాడటానికి అది నాలో ఉత్తేజాన్ని పెంచింది. 392 00:22:02,239 --> 00:22:05,909 బ్రూక్లిన్ - న్యూయార్క్ 393 00:22:05,993 --> 00:22:07,369 డియర్ సెలేనా, 394 00:22:08,537 --> 00:22:10,956 నా వృత్తిజీవితమంతా నేను 395 00:22:11,039 --> 00:22:15,502 నల్లజాతి నపుంసకుల గౌరవార్థం పోరాడే 396 00:22:15,586 --> 00:22:17,004 కార్యకర్తనని నీకు తెలుసు. 397 00:22:17,796 --> 00:22:22,426 కాలేజ్ నుంచి బయటకి రాగానే, ఒక చిన్న వార్తాపత్రికలో విలేఖరిగా చేరాను 398 00:22:22,509 --> 00:22:24,178 నా సొంత రాష్ట్రమైన జార్జియాలో. 399 00:22:24,845 --> 00:22:29,349 సహజంగానే, అప్పట్లో నపుంసకుడిగా నా గొప్పతనాన్ని, 400 00:22:29,433 --> 00:22:33,437 ప్రామాణికతను కనపరచటానికి అవకాశం తక్కువ ఉండేది. 401 00:22:34,021 --> 00:22:37,816 "సమాజంలో ఈనాటికి కూడా నపుంసకుల పట్ల 402 00:22:37,900 --> 00:22:39,526 చాలా వివక్ష ఉంది." 403 00:22:39,610 --> 00:22:42,237 ఉద్యోగ జీవితంలోను, పాఠశాలల్లోను, ప్రభుత్వంలోను, 404 00:22:42,321 --> 00:22:44,448 చివరికి సొంత ఇళ్ళలోను, నివసించే ప్రదేశాల్లో కూడా 405 00:22:44,531 --> 00:22:47,284 మాకు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. 406 00:22:48,076 --> 00:22:52,664 నపుంసక వర్గం కోసం పోరాడాలని, సేవ చేయాలని అనుకున్నాను. 407 00:22:53,332 --> 00:22:57,211 కనుక, అట్లాంటాలోని కమ్యూనిటీ ఆర్గనైజర్లతో పనిచేయటం మొదలుపెట్టాను. 408 00:22:57,836 --> 00:23:01,840 ట్రాన్స్ జెండర్ లా సెంటర్ కు జాతీయ నిర్వాహకుడిని అయ్యాను. 409 00:23:01,924 --> 00:23:05,385 ఇది దేశంలోని అతిపెద్ద నపుంసక నిర్వాహిత సమాజం. 410 00:23:05,469 --> 00:23:10,307 2018లో, ఔట్ పత్రికకు ఎగ్జిక్యుటివ్ ఎడిటర్ ని అయ్యాను. 411 00:23:10,390 --> 00:23:12,351 "…పత్రికలో సారధిగా 412 00:23:12,434 --> 00:23:14,436 పగ్గాలు చేపట్టిన తొలి నపుంసకుడిని అయ్యాను." 413 00:23:14,520 --> 00:23:16,104 చరిత్ర సృష్టించిన రాఖేల్ విల్లిస్ 414 00:23:16,188 --> 00:23:19,608 మా సమాజం యొక్క భావాలను వ్యాపింపజేయగలిగినందుకు చాలా సంతోషపడ్డాను. 415 00:23:19,691 --> 00:23:21,443 పరిచయం చేస్తున్నాము ఔట్100 నపుంసక సంస్మరణ ప్రాజెక్ట్ 416 00:23:22,653 --> 00:23:26,156 సెలేనా, నాకు నువ్వు ఎప్పుడూ ఒక తేజస్సులా కనిపిస్తావు. 417 00:23:26,823 --> 00:23:30,160 ట్రెండ్ లో భాగంగా మైక్ ను పంచుకున్న చాలామంది కంటే ముందు 418 00:23:30,244 --> 00:23:32,329 నీ వేదికను మా గళం వినిపించటం కోసం పంచుకున్నావు… 419 00:23:32,412 --> 00:23:33,247 న్యాయమే ప్రేమ 420 00:23:33,330 --> 00:23:35,332 …సమాజ న్యాయ సేవలో పాల్గొంటున్న నల్లజాతి నాయకుల గళాన్ని వినిపించావు. 421 00:23:35,415 --> 00:23:36,250 నల్లజాతి ప్రాణాలకు విలువుంది 422 00:23:36,333 --> 00:23:40,003 -ఎవరి వీధులు? ఎవరి వీధులు? -మన వీధులు! మన వీధులు! 423 00:23:40,087 --> 00:23:41,755 నల్లజాతి నపుంసకులకు, 424 00:23:41,839 --> 00:23:45,175 మేము ప్రభుత్వం నుంచి నిత్యం ఎదుర్కొనే అపాయమే కాక… 425 00:23:45,259 --> 00:23:46,468 నల్లజాతి నపుంసకుల ప్రాణాలను కాపాడండి 426 00:23:46,552 --> 00:23:49,346 …మా సొంత వర్గాలలో హింస, వివక్ష కూడా ఉన్నాయి. 427 00:23:49,429 --> 00:23:50,264 నపుంసక ప్రేమ 428 00:23:50,347 --> 00:23:52,891 2020 జూన్ 13 న, 429 00:23:52,975 --> 00:23:56,186 నీ ఇన్స్టాగ్రామ్ ను వాడే అవకాశాన్ని నాకు ఇచ్చావు. 430 00:23:56,270 --> 00:23:58,730 ఇది చిన్న విషయం కాదని నాకు తెలుసు. 431 00:23:58,814 --> 00:24:01,859 నీకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కోట్లలో ఉన్నారు. 432 00:24:01,942 --> 00:24:06,071 ఇన్స్టాగ్రామ్ లోనే అత్యధిక సంఖ్యలో అనుసరించేవారితో సహా. 433 00:24:06,154 --> 00:24:09,658 నల్లజాతి నపుంసక కార్యకర్తలైన మార్షా పీ. జాన్సన్, మిస్ మేజర్ వంటివారి 434 00:24:09,741 --> 00:24:12,744 చరిత్రలను నేను పంచుకోగలిగాను. 435 00:24:12,828 --> 00:24:17,249 ఇతర నల్లజాతి నపుంసక నాయకులు, సంఘాలు 436 00:24:17,332 --> 00:24:20,836 తయారుచేసిన సహాయక చిట్టాను పంచుకోగలిగాను. 437 00:24:20,919 --> 00:24:23,297 "ఇది ఒక ఉన్నతి, నాకు మాత్రమే కాదు. 438 00:24:23,380 --> 00:24:25,716 మా ఉద్యమం మొత్తానికే ఇది ఉన్నతి." 439 00:24:26,341 --> 00:24:28,343 మీ ఇన్స్టాగ్రామ్ ను వాడిన పిమ్మట, 440 00:24:28,427 --> 00:24:30,929 విస్తరించిన నా వేదికను వినియోగించి 441 00:24:31,013 --> 00:24:35,934 ఇక్కడ బ్రూక్లిన్ లో జరిగిన చారిత్రాత్మక మార్చ్ యొక్క ఏర్పాటును సమర్ధించగలిగాను. 442 00:24:36,476 --> 00:24:37,477 జూన్ 14, 2020 443 00:24:37,561 --> 00:24:39,229 న్యాయం! ఇప్పుడే! 444 00:24:39,313 --> 00:24:41,440 దాన్ని "బ్రూక్లిన్ విముక్తి" అని పిలిచాము. 445 00:24:41,523 --> 00:24:45,110 మేము కోల్పోయిన నల్లజాతి నపుంసక నాయకుల జీవితాల గౌరవార్థం అది నిర్వహించబడింది. 446 00:24:45,194 --> 00:24:46,278 నల్లజాతి నపుంసకుల ప్రాణాలకు విలువుంది 447 00:24:46,361 --> 00:24:48,113 మీ శక్తిపై నాకు నమ్మకం ఉంది. 448 00:24:48,197 --> 00:24:50,532 మీ శక్తిపై నాకు నమ్మకం ఉంది. 449 00:24:50,616 --> 00:24:53,327 -మన శక్తిపై నాకు నమ్మకం ఉంది. -మన శక్తిపై… 450 00:24:53,410 --> 00:24:57,372 అంతమంది కలసివచ్చి నిలబడటం అదే మొట్టమొదటిసారి. 451 00:24:57,456 --> 00:25:01,627 పదిహేను వేల మంది మద్దతుగా నిలబడ్డారు నల్లజాతి నపుంసక వర్గానికి. 452 00:25:01,710 --> 00:25:05,380 నల్లజాతి నపుంసకుల శక్తిపై నాకు నమ్మకం ఉంది. 453 00:25:05,464 --> 00:25:08,008 నల్లజాతి నపుంసకుల శక్తిపై నాకు నమ్మకం ఉంది. 454 00:25:08,091 --> 00:25:12,095 నల్లజాతి నపుంసకుల ప్రాణాలకు విలువ ఉంది 455 00:25:15,891 --> 00:25:17,768 అది అపూర్వమైన క్షణం. 456 00:25:17,851 --> 00:25:21,188 నా జీవితంలో నేను ఎప్పటికీ మరచిపోలేనిది. 457 00:25:21,271 --> 00:25:24,983 "నల్లజాతి నపుంసకుల విముక్తి అంటే అందరి విముక్తి." 458 00:25:25,651 --> 00:25:29,738 సెలేనా, నాయకత్వం అంటే ఏమిటో చూపించినందుకు థాంక్యూ. 459 00:25:29,821 --> 00:25:34,826 నల్లజాతి నపుంసక వర్గం కోసం మద్దతుగా అవసరమైన వెంటనే నిలబడ్డందుకు థాంక్యూ. 460 00:25:34,910 --> 00:25:37,204 మన గెలుపు వరకు. మన గెలుపు వరకు. 461 00:25:38,121 --> 00:25:39,373 మేమిద్దరం మ్యాచింగ్. 462 00:25:39,456 --> 00:25:42,584 నేను అంటరానిదానిగా ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. 463 00:25:43,502 --> 00:25:46,296 మా అమ్మ నాకు ఎప్పుడూ నేర్పిన విషయం మనకంటే పెద్ద ఎవరూ లేరు, 464 00:25:46,380 --> 00:25:48,298 మనకంటే మెరుగైనవారు లేరు, మనకంటే తక్కువవారు కూడా లేరు. 465 00:25:48,382 --> 00:25:51,969 అంతా ఒకటే, కాకపోతే వేరేగా పెరిగాము. 466 00:25:52,678 --> 00:25:54,096 నా జీవితాన్ని నేను అలాగే చూస్తాను. 467 00:25:55,055 --> 00:25:58,225 అందుకే నా పలకరింపు కార్యక్రమం గంటన్నరలో అవ్వాల్సి ఉన్నా, 468 00:25:58,308 --> 00:26:00,310 సాధారణంగా మూడు గంటలు సాగుతాయి. 469 00:26:00,394 --> 00:26:04,189 ఇది అక్షరాల నిజం. కావాలంటే అడగండి. 470 00:26:04,898 --> 00:26:09,236 ఎందుకంటే నా అభిమానులతో కబుర్లు చెప్పటం, 471 00:26:09,319 --> 00:26:11,446 నేను మచ్చలేని నికార్సైన మనిషిని అయ్యుంటే 472 00:26:11,530 --> 00:26:15,117 అసలు కుదిరేదే కాదు. 473 00:26:15,200 --> 00:26:19,371 అభిమానులు అనే కాదు, వాళ్ళు మనుషులు. 474 00:26:19,454 --> 00:26:22,040 మనుషులకు నా మనసులో స్థానం ఉంది. 475 00:26:23,250 --> 00:26:25,836 సెలేనా, నీ ఆదర్శం లేకపోతే, 476 00:26:25,919 --> 00:26:29,548 ఇలా దీని గురించి ధైర్యంగా మాట్లాడగలిగేవాడినే కాదు. 477 00:26:29,631 --> 00:26:33,010 మా శరీరాలు, మనసులు మా నియంత్రణలో లేవు అనుకొనే మాలాంటి వాళ్ళ 478 00:26:33,093 --> 00:26:36,346 పోరాటాన్ని బహిర్గతం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. 479 00:26:36,930 --> 00:26:38,473 ప్రేమతో, రాఖేల్. 480 00:26:38,557 --> 00:26:40,851 భవదీయురాలు, వెండీ. 481 00:26:40,934 --> 00:26:43,353 ప్రేమతో, మరియానా. 482 00:26:43,437 --> 00:26:45,689 గౌరవ మర్యాదలతో, జేక్. 483 00:26:45,772 --> 00:26:51,528 నాకున్నది అంతా వాడుతుంటాను, ఉన్నంతలో మంచి చేస్తుంటాను. 484 00:26:51,612 --> 00:26:55,115 అందులోనే నాకు అసలైన సంతృప్తి లభిస్తుంది. 485 00:27:39,034 --> 00:27:41,036 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్