1
00:00:16,812 --> 00:00:19,646
{\an8}2000
ముంబై
2
00:00:27,396 --> 00:00:28,896
మన కూతురు గురించి చెప్పు.
3
00:00:35,937 --> 00:00:37,146
ఎందుకు చెప్పలేదు?
4
00:00:37,771 --> 00:00:41,396
నువ్వు బ్రతికే ఉన్నావని,
మనకో కూతురు ఉందని, ఎందుకు చెప్పలేదు?
5
00:00:42,187 --> 00:00:43,812
కనీసం ఇది చెప్పాలని అనిపించలేదా?
6
00:00:49,104 --> 00:00:50,146
నిన్ను నమ్మలేదు.
7
00:00:51,187 --> 00:00:52,271
నన్ను నమ్మలేదా?
8
00:00:53,687 --> 00:00:55,936
హనీ, నన్ను నమ్మలేదా?
నిన్ను ప్రేమించా.
9
00:00:55,937 --> 00:00:57,728
బాబానే నీ జీవితం.
10
00:00:57,729 --> 00:01:00,479
- అవును, నాకు అంతకంటే మంచి తెలియలేదు.
- అదే కదా.
11
00:01:05,104 --> 00:01:08,521
ఇన్నేళ్ళు నాకు ఎలాంటి ఆలోచనలు
వచ్చేవో తెలుసా?
12
00:01:08,646 --> 00:01:11,020
ఒక్కోసారి, నువ్వు చనిపోయావని సంతోషించాను.
13
00:01:11,021 --> 00:01:13,979
అప్పుడైనా నిన్ను
నా మనసు నుండి దూరం చేయగలిగేవాడిని.
14
00:01:15,146 --> 00:01:18,271
హనీ, బన్నీ అధ్యాయం ముగిసిందని.
మన మధ్య ముగిసేది!
15
00:01:22,396 --> 00:01:23,812
కానీ ఒక్కోసారి నాకనిపించేది
16
00:01:24,896 --> 00:01:27,271
ఎక్కడో ఒకచోట
సురక్షితంగా, సంతోషంగా ఉన్నావని.
17
00:01:28,937 --> 00:01:30,937
నీ జీవితంలో నేను లేకపోవడం మంచిదేనని.
18
00:01:32,271 --> 00:01:33,937
ఎందుకంటే నేను లేకపోతే బాగుంటావు.
19
00:01:55,271 --> 00:01:56,604
తనొక ఏజెంట్ అవుతు౦దట.
20
00:01:59,812 --> 00:02:02,646
కరాటేలో వరుసగా
రెండుసార్లు బంగారు పతకాలు గెలిచింది.
21
00:02:03,229 --> 00:02:04,812
నాలుగు భాషలు మాట్లాడగలదు.
22
00:02:05,812 --> 00:02:08,687
ఒక మామిడి జూస్తో
24 గంటలు బతకగలదు.
23
00:02:10,104 --> 00:02:12,229
ఏ పరిస్థితులలోనైనా స్పష్టంగా ఆలోచించగలదు.
24
00:02:12,771 --> 00:02:15,437
దాక్కోగలదు, దాని నుండీ బయటకూ రాగలదు.
25
00:02:17,062 --> 00:02:18,729
తను మానసికంగా చాలా దృఢమైనది.
26
00:02:21,521 --> 00:02:22,979
తనకు కాల్చడం
నేర్చుకోవాలట.
27
00:02:23,812 --> 00:02:27,396
నేను తనకు నేర్పించకపోతే,
తనే సొంతంగా నేర్చుకుంటానంటుంది.
28
00:02:28,312 --> 00:02:31,771
లేదా, ఏదో ఒకరోజు
వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకుంటుందట.
29
00:02:35,021 --> 00:02:36,396
తను మనలో ఉత్తమమైనది.
30
00:02:39,146 --> 00:02:40,271
మనలో దారుణమైనది కూడా.
31
00:02:56,229 --> 00:02:57,312
తనను ఎప్పుడూ కలవలేదు.
32
00:02:59,896 --> 00:03:01,229
కానీ నాకు ఒకటి అర్థమయింది
33
00:03:02,562 --> 00:03:04,396
నువ్వు నాడియాను బాగా పెంచావని.
34
00:03:18,729 --> 00:03:20,771
బన్నీ, సిద్ధం.
35
00:03:22,062 --> 00:03:24,979
సరే. మనం ఇక వెళ్ళాలి.
36
00:03:28,437 --> 00:03:30,270
మీరు ఏమి చేయాలో మీకు తెలుసుగా.
37
00:03:30,271 --> 00:03:33,645
- హా, తెలుసు.
- సరే.
38
00:03:33,646 --> 00:03:36,770
బన్నీ, మేము సిద్ధంగా ఉంటాము, సరేనా?
39
00:03:36,771 --> 00:03:39,478
చాకో, నేను చూసుకుంటాను.
నీ కుటుంబం దగ్గరకు వెళ్ళు.
40
00:03:39,479 --> 00:03:41,521
- లేదు, నేను...
- చెప్పానుగా. వెళ్ళు.
41
00:03:43,354 --> 00:03:44,771
- ధన్యవాదాలు.
- చనిపోకు.
42
00:03:47,312 --> 00:03:49,354
- హే, నేను ఇవన్నీ చేయను.
- ఇలా రావోయ్!
43
00:03:51,604 --> 00:03:52,729
గర్ల్‌ఫ్రెండ్ చూసుకో.
44
00:03:54,646 --> 00:03:56,103
ఏదో చెబుతుంటాడు.
45
00:03:56,104 --> 00:03:57,312
సరైనదే చెప్పాడు.
46
00:03:59,896 --> 00:04:02,145
ఇది నీ కోసం ఇంకా ఇది నాడియా కోసం.
47
00:04:02,146 --> 00:04:03,562
ఇవి సింక్ చేయబడ్డాయి.
48
00:04:04,062 --> 00:04:06,646
ఇది శాటిలైట్ ఫోన్,
ట్రాకర్ ఫోన్ అనుసంధానించబడ్డాయి.
49
00:04:07,562 --> 00:04:11,437
తనతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు
లేదా తనను ట్రాక్ చేయవచ్చు.
50
00:04:12,521 --> 00:04:13,521
ధన్యవాదాలు.
51
00:04:13,937 --> 00:04:15,062
జాగ్రత్త.
52
00:05:04,479 --> 00:05:06,562
సీటడెల్
హాని బని
53
00:05:22,979 --> 00:05:24,271
ఒక కథ వింటావా?
54
00:05:25,937 --> 00:05:27,479
ఇద్దరు స్నేహితులది.
55
00:05:29,271 --> 00:05:30,312
అజయ్ ఇంకా విజయ్.
56
00:05:32,562 --> 00:05:34,104
అజయ్ ఒక అనాథ.
57
00:05:34,687 --> 00:05:36,104
అతనిది కష్టతరమైన జీవితం.
58
00:05:36,896 --> 00:05:39,104
జీవితం అతని పట్ల
చాలా కఠినంగా వ్యవహరించింది.
59
00:05:40,396 --> 00:05:43,104
మరోవైపు, విజయ్ చాలా
సంపన్న కుటుంబంలో పుట్టాడు.
60
00:05:44,062 --> 00:05:45,812
అతని దగ్గర అన్నీ ఉన్నాయి.
61
00:05:46,604 --> 00:05:47,771
మంచి జీవితం.
62
00:05:49,729 --> 00:05:53,479
కానీ వాళ్ళిద్దరివీ ఒకే కలలు.
63
00:05:55,854 --> 00:05:59,187
కుటుంబంలా, కలిసి పనిచేయాలని
నిర్ణయించుకున్నారు.
64
00:06:02,312 --> 00:06:04,271
నేను ప్రతి ఒక్క నివేదిక చదివాను.
65
00:06:06,229 --> 00:06:08,104
రింజీ రక్తం నీ పైన ఉంది.
66
00:06:08,812 --> 00:06:10,396
నువ్వు సిటడెల్ అధిపతిని చంపావు.
67
00:06:11,271 --> 00:06:12,646
నా భర్తను చంపేశావు.
68
00:06:16,437 --> 00:06:20,146
అయితే, నువ్వు కూడా నేను నా సోదరుడి
ప్రాణం తీశానని అనుకుంటున్నావు.
69
00:06:25,562 --> 00:06:27,354
నేను ఇలా చెబితే...
70
00:06:29,271 --> 00:06:31,187
నేను రింజీని మోసం చేయలేదు, అంటే?
71
00:06:37,687 --> 00:06:41,729
మా మిషన్ విఫలమయ్యాక
మాకు ఒకటే అవకాశం ఉండింది.
72
00:06:42,354 --> 00:06:43,979
చాలా కష్టపడి తప్పించుకున్నాము.
73
00:06:46,229 --> 00:06:48,562
రింజీ నా వెనుకే ఉన్నాడని అనుకున్నాను.
74
00:06:50,271 --> 00:06:52,104
అతను కలవాల్సిన చోట కలుస్తాడని.
75
00:06:55,479 --> 00:06:57,146
నేను అతని కోసం వేచి చూశాను.
76
00:07:02,229 --> 00:07:04,312
చాలా సమయం వరకు, కానీ తను రాలేదు.
77
00:07:07,396 --> 00:07:10,395
ఆ తరువాత నేను దాక్కుంటూ జీవితం గడిపాను.
78
00:07:10,396 --> 00:07:15,312
సిటడెల్ నన్ను ద్రోహిగా ముద్రించింది.
అది కూడా భరించాను.
79
00:07:16,271 --> 00:07:18,812
దేనికోసం? మేము కన్న కల కోసం, జూని.
80
00:07:19,437 --> 00:07:20,771
రింజీది ఇంకా నా కల.
81
00:07:22,646 --> 00:07:24,854
ఇది దానికి చాలా చిన్న మూల్యం.
82
00:07:26,229 --> 00:07:27,312
ఏమి కల?
83
00:07:28,312 --> 00:07:29,354
తెలుసుకోవాలని ఉందా?
84
00:07:30,854 --> 00:07:31,854
నువ్వది భరించగలవా?
85
00:07:33,104 --> 00:07:34,521
అది నీ సిటడెల్ గురించే.
86
00:07:42,979 --> 00:07:44,896
- మమ్మల్ని ఒంటరిగా వదిలేయ్.
- సరే, మేడం.
87
00:07:50,479 --> 00:07:53,062
2000
ముంబై
88
00:07:55,729 --> 00:07:59,146
{\an8}కాఫే
యూనివర్సల్
89
00:08:10,479 --> 00:08:13,604
చాలా వెన్న.
మృదువైన రొట్టెకు రహస్యం.
90
00:08:14,396 --> 00:08:15,729
నాకు ఒక కాఫే ఉండేది.
91
00:08:18,729 --> 00:08:21,271
నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు?
92
00:08:25,437 --> 00:08:29,562
నిన్ను ఇంతకుముందు కలవలేకపోయాను.
అందుకే నీ కారులో ట్రాకర్ పెట్టాను.
93
00:08:30,312 --> 00:08:31,562
ఉపయోగపడుతుందని అనుకున్నా.
94
00:08:35,062 --> 00:08:36,562
నా చేతిలో తుపాకీ ఉంది.
95
00:08:37,896 --> 00:08:39,187
నా వేలు
ట్రిగ్గర్ మీదుంది.
96
00:08:41,937 --> 00:08:43,021
లేదు, నీ దగ్గర లేదు.
97
00:08:47,021 --> 00:08:48,479
నేను నీకు ముప్పు కాదు.
98
00:08:49,229 --> 00:08:52,771
నేను ఇక్కడకు నీకు సమస్య సృష్టించాలని
రాలేదు. నీకు సాయం చేయగలను.
99
00:08:54,687 --> 00:08:56,437
నేను ఒక ముఖ్యమైన సమాచారం ఇవ్వాలి.
100
00:08:56,937 --> 00:08:57,812
ఏంటి అది?
101
00:08:58,729 --> 00:09:00,812
మీ స్థావరం నుండి ఒక ఆసక్తికరమైన సమాచారం.
102
00:09:02,187 --> 00:09:05,437
సిటడెల్‌లో ఎవరో
విశ్వాతో సంప్రదిస్తున్నారు.
103
00:09:06,021 --> 00:09:07,187
ఒక సంవత్సరం నుండి.
104
00:09:08,687 --> 00:09:11,229
విశ్వాతోనా? సంవత్సరం నుండా?
105
00:09:11,812 --> 00:09:15,146
మీ సంస్థలో వేగు ఎవరో తెలుసుకోవాలని ఉందా?
106
00:09:19,729 --> 00:09:21,104
మేము నిర్ణయించుకున్నాము...
107
00:09:22,479 --> 00:09:27,520
...మేమిద్దరం కలిసి
సిటడెల్ వదిలేయాలని. శాశ్వతంగా.
108
00:09:27,521 --> 00:09:29,396
సిటడెల్ రింజీ ఇల్లు.
109
00:09:31,021 --> 00:09:32,729
ఎప్పటికీ వదిలివెళ్ళాలని అనుకోడు.
110
00:09:36,437 --> 00:09:40,229
నీ మనసు ఒక వైపుకు,
నీ ఆలోచన మరో వైపుకు లాగుతుంటే...
111
00:09:42,146 --> 00:09:43,396
...అది నిజంగా చాలా కష్టం.
112
00:09:44,104 --> 00:09:47,354
కానీ చివరకు, ప్రతి మనిషి
ఆలోచన వైపుకే మొగ్గుతాడు.
113
00:09:48,312 --> 00:09:52,145
మా మనసులో ఉన్నది
వివరించడం కష్టం.
114
00:09:52,146 --> 00:09:53,895
అది నీకు అర్థమవుతుందని అనుకోను.
115
00:09:53,896 --> 00:09:56,312
- ఏము౦ది మీ మనసులో?
- నీకు తెలియడంలేదా?
116
00:09:56,812 --> 00:09:59,895
మనల్ని ఒక స్థితిలో ఉంచుతారు.
117
00:09:59,896 --> 00:10:03,811
వాళ్ళు మనకు చెబుతూ ఉంటారు,
మీ విధేయత ఏజెన్సీకి మాత్రమే చూపాలని,
118
00:10:03,812 --> 00:10:04,979
ఇంకెవరికీ చూపకూడదు.
119
00:10:05,562 --> 00:10:08,521
మీ స్నేహితులకు, కుటుంబానికి
లేదా దేశానికి లేదా ఇంకెవరికీ.
120
00:10:09,104 --> 00:10:11,354
మేము ప్రశ్నించాము.
రింజీ, నేను ప్రశ్నించాము.
121
00:10:11,854 --> 00:10:15,729
సిటడెల్ సిద్ధాంతాలను ప్రశ్నించాము.
మేము చేసింది అదే.
122
00:10:16,312 --> 00:10:17,937
మేమనుకున్నాం,
చాలు! ఇకపై వద్దని.
123
00:10:19,146 --> 00:10:21,854
మేము మా సొంత సంస్థ
ప్రారంభించాలని అనుకున్నాం.
124
00:10:22,646 --> 00:10:24,854
సిటడెల్‌లో జరిగే తప్పులు,
125
00:10:25,396 --> 00:10:28,186
మేము ఆ తప్పుల నుండి నేర్చుకుని,
126
00:10:28,187 --> 00:10:30,561
ఇక్కడ మా సంస్థలో వాటిని పునరావృతం చేయము.
127
00:10:30,562 --> 00:10:34,229
మేము పరిపూర్ణమైన సంస్థను తయారు చేస్తాము.
మేము అదే చేస్తాము!
128
00:10:34,812 --> 00:10:37,812
నువ్వు నన్ను ఇవన్నీ
కళ్ళమూసుకుని నమ్మమంటావా,
129
00:10:38,687 --> 00:10:41,396
నువ్వు, రింజీ
సిటడెల్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నారని?
130
00:10:42,021 --> 00:10:43,021
అస్సలు కాదు.
131
00:10:45,062 --> 00:10:46,604
నా దగ్గర సాక్ష్యం ఉంది, జూని.
132
00:10:49,146 --> 00:10:52,437
నీకు తెలుసా, నేను నా
జ్ఞాపకాల లాకర్ అని పిలిచే చోటుంది.
133
00:10:54,062 --> 00:10:55,562
అక్కడ నీకు రుజువు దొరుకుతుంది.
134
00:10:57,271 --> 00:11:00,437
కొన్నేళ్ళుగా రింజీ, నేను
ఈ సంస్థ కోసం పని చేస్తున్నాము.
135
00:11:01,729 --> 00:11:04,562
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు
మాతో చేరారు.
136
00:11:06,229 --> 00:11:07,812
మా అందరిదీ ఒకటే కల...
137
00:11:09,521 --> 00:11:13,854
...సిటడెల్‌కు వ్యతిరేకంగా, మా సొంత సంస్థ.
138
00:11:15,646 --> 00:11:17,229
ఈరోజు రింజీ మనతో లేకపోవచ్చు,
139
00:11:17,979 --> 00:11:20,187
కానీ నేను అతని కల నిజమయ్యేలా చేస్తా.
140
00:11:21,062 --> 00:11:22,646
నా సొంత సంస్థను స్థాపిస్తాను.
141
00:11:29,437 --> 00:11:30,311
పేరు జూని - డైరక్టర్, సిటడల్ ఇండియా.
అలియాస్ రూహి, రాగిణి, అనితా, టీనా, నీతా.
142
00:11:30,312 --> 00:11:31,312
మాజీ పార్ట్నర్ రింజీ సత్‌సంగ్,
మాజీ డైరెక్టర్, సిటడెల్ ఇండియా.
143
00:11:34,312 --> 00:11:35,312
జూని?
144
00:11:36,521 --> 00:11:37,562
కాదు.
145
00:11:38,271 --> 00:11:40,604
ఆమె ఏడాదిగా సిటడెల్‌ను
మోసం చేస్తుందంటున్నావా?
146
00:11:41,229 --> 00:11:42,312
సాధ్యం కాదు.
147
00:11:45,729 --> 00:11:46,771
నీకోసం రుజువు.
148
00:11:47,646 --> 00:11:49,562
ఈ సీడీలో అన్ని వివరాలు ఉన్నాయి.
149
00:11:58,562 --> 00:12:00,062
అది అంత సులభంగా కాదు, కదా?
150
00:12:02,354 --> 00:12:03,479
బదులుగా నీకేం కావాలి?
151
00:12:06,146 --> 00:12:08,604
- నాకు ఏమీ వద్దని అంటే?
- నేను అది నమ్మను.
152
00:12:13,104 --> 00:12:13,937
విను...
153
00:12:15,854 --> 00:12:17,021
...అర్మాడా ఎక్కడ?
154
00:12:24,896 --> 00:12:27,896
అతనిని ఎందుకు కొడుతున్నారు? దీనికోసమా?
155
00:12:30,521 --> 00:12:31,896
ఇది వాళ్ళ నాన్నది.
156
00:12:33,979 --> 00:12:35,396
అతను నీ హీరో, కదా?
157
00:12:36,354 --> 00:12:37,354
మీ నాన్న.
158
00:12:39,937 --> 00:12:41,396
అయినా నిన్ను ఇక్కడ వదిలేశాడా?
159
00:12:42,729 --> 00:12:43,771
అనాథాశ్రమంలో.
160
00:12:44,396 --> 00:12:45,396
ఒంటరిగా.
161
00:12:46,104 --> 00:12:47,104
ఇది...
162
00:12:49,146 --> 00:12:50,354
...నీకు మిగిలినది ఇదే.
163
00:12:51,562 --> 00:12:53,062
ఇది నా ఉంగరం.
164
00:12:54,479 --> 00:12:56,311
దీన్ని ఎవరినీ తీసుకోనివ్వను.
165
00:12:56,312 --> 00:12:58,229
ఈ ఉంగరం కోసం పోరాడడం అనవసరం, బాబు.
166
00:12:59,229 --> 00:13:01,521
ఇవి ప్రతి వీధి చివర్లో చాలా దొరుకుతాయి.
167
00:13:02,312 --> 00:13:04,146
రేపు ఇంకొన్ని తీసుకురమ్మంటావా?
168
00:13:06,646 --> 00:13:07,812
నీకు పోరాడాలని ఉంటే...
169
00:13:09,187 --> 00:13:10,811
...నువ్వు దేనికి పోరాడాలంటే
170
00:13:10,812 --> 00:13:12,604
నీకు తిరిగి ఏదైనా ఇచ్చేదానికోసం.
171
00:13:22,479 --> 00:13:24,603
నీ ఉత్సాహము, నీ ఆవేశం
172
00:13:24,604 --> 00:13:26,937
అవి ఎక్కడ కావాలో అక్కడ ఉపయోగించు.
173
00:13:28,937 --> 00:13:29,937
వృథా చేయకు.
174
00:13:31,437 --> 00:13:32,521
సరే, సర్.
175
00:13:33,854 --> 00:13:37,604
సర్ కాదు. నన్ను బాబా అని పిలువు.
176
00:13:43,562 --> 00:13:45,312
బాబా, మీ క్రమం మారలేదు కదా?
177
00:13:45,854 --> 00:13:50,021
ప్రతి ఆదివారం అనాథాశ్రమానికి రావడం,
పిల్లలకు అదే కథ మళ్ళీ చెప్పడం.
178
00:13:51,646 --> 00:13:53,104
నాకూ అదే కథ చెప్పారు, కదా?
179
00:13:53,854 --> 00:13:55,271
అది వేరే కథ కదా, రాహి.
180
00:13:58,437 --> 00:14:00,979
నేను నీకు పోరాడడానికి
ఒక కారణాన్ని కనుగొనమన్నాను.
181
00:14:02,021 --> 00:14:04,271
పోరాడడానికి తగిన పోరాటం.
182
00:14:05,896 --> 00:14:09,229
స్పష్టంగా, నువ్వు అన్నీ మర్చిపోయావు.
అది నాకు కనబడుతోంది.
183
00:14:10,979 --> 00:14:12,354
నువ్విలానే ఉండేవాడివి.
184
00:14:13,812 --> 00:14:14,896
ఎంతో శక్తితో.
185
00:14:16,854 --> 00:14:17,979
ఏకాగ్రత లేకుండా.
186
00:14:19,979 --> 00:14:23,437
నీకు ఆ శక్తిని సరైన
మాధ్యమంలో పెట్టే అవకాశం కావాలనుకున్నావు.
187
00:14:24,229 --> 00:14:25,770
ఆ అవకాశం మీరు ఇచ్చారు.
188
00:14:25,771 --> 00:14:28,645
బదులుగా, నా జీవితం మొత్తం ఇచ్చాను.
189
00:14:28,646 --> 00:14:29,729
సమానం అయిపోయాము.
190
00:14:41,146 --> 00:14:42,271
నేను నీకు చెప్పాను...
191
00:14:44,646 --> 00:14:46,104
...నువ్వు నా ముందుకు వస్తే...
192
00:14:47,146 --> 00:14:48,187
నన్ను చంపేస్తారా?
193
00:14:49,437 --> 00:14:51,771
నాకు తెలుసు,
అయినా నేను ఇక్కడకు వచ్చాను.
194
00:14:52,812 --> 00:14:54,229
కారణం, మీక్కావాల్సింది...
195
00:14:57,229 --> 00:14:58,229
...నా దగ్గర ఉంది.
196
00:15:11,771 --> 00:15:14,396
ఒక్క క్షణం. నన్ను ఇది పూర్తి చేయనివ్వు.
197
00:15:16,021 --> 00:15:17,896
మీరు నాతో రావాలి, మేడం.
198
00:15:18,604 --> 00:15:20,146
కమాండ్ ఆదేశించారు.
199
00:15:20,812 --> 00:15:22,271
మీరు నిర్బంధంలో ఉంటారు.
200
00:15:27,104 --> 00:15:28,729
ఏ హై కమాండ్ నుండి?
201
00:15:31,771 --> 00:15:32,770
చూడు, వివరించగలను...
202
00:15:32,771 --> 00:15:35,104
మరో పది నిమిషాల్లో
ఇక్కడకు ఏజెంట్లు వస్తారు.
203
00:15:36,646 --> 00:15:38,229
వాళ్ళు ఇక్కడకు రాకముందే,
204
00:15:38,979 --> 00:15:40,770
మీరు నాతో వస్తే మంచిది.
205
00:15:40,771 --> 00:15:42,937
అది మీకు ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది.
206
00:16:01,396 --> 00:16:02,562
అభినందనలు, బాబా.
207
00:16:03,062 --> 00:16:05,396
మొదటిసారి ఒకరు
ఒక సిటడెల్ ఏజెంట్‌ను మార్చారు.
208
00:16:06,271 --> 00:16:08,812
జూని మిమ్మల్ని నిర్బంధం నుండి తప్పించింది.
209
00:16:09,437 --> 00:16:12,603
బయటకు వచ్చి, ఫౌండేషన్ సహాయంతో
కార్యకలాపాలు తిరిగి ప్రారంభించారు.
210
00:16:12,604 --> 00:16:16,312
ఆ తరువాత, మీరు మీ ఏజెంట్లకు
వెంబడించమని ఆదేశించారు, హనీని ఇంకా
211
00:16:17,271 --> 00:16:18,396
నా కూతురును.
212
00:16:20,354 --> 00:16:21,770
ఇదేగా మీకు కావాల్సింది?
213
00:16:21,771 --> 00:16:24,978
అర్మాడా కోసం హనీని, నా కూతురును
చంపించాలని అనుకున్నారు, కదా?
214
00:16:24,979 --> 00:16:27,437
- అది కాదు, రాహి.
- తీసుకోండి.
215
00:16:37,854 --> 00:16:40,479
అది ముగిసింది. అది ముగిసింది, బాబా.
216
00:16:42,229 --> 00:16:46,479
మీకు ఇక హనీని లేదా నా బిడ్డను
వెంబడించడానికి కారణం లేదు.
217
00:16:48,104 --> 00:16:49,104
ఏమి చేశావు?
218
00:16:49,604 --> 00:16:51,104
ఏమి చేశావు?
219
00:16:52,312 --> 00:16:54,312
నీది ఎంత కుంచితమైన ఆలోచన, రాహి!
220
00:16:57,354 --> 00:16:59,437
నువ్వు నా కల్పనను చూడాల్సింది!
221
00:17:01,312 --> 00:17:03,562
నువ్వు నా ఆలోచనను అర్థం చేసుకోవాల్సింది.
222
00:17:04,229 --> 00:17:05,646
నేను ప్రయత్నించాను, బాబా.
223
00:17:06,271 --> 00:17:08,646
మిమ్మల్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించాను.
224
00:17:09,479 --> 00:17:12,021
నీకు తెలుసా, ఒక పెంపుడు కుక్క...
225
00:17:14,021 --> 00:17:16,270
ఉన్నట్టుండి అదొక పాముగా మారి కొరికితే,
226
00:17:16,271 --> 00:17:20,104
నేను ఎవరిని నిందించాలి,
నన్ను నేను కాకుండా?
227
00:17:23,396 --> 00:17:26,645
మనం ఒక కొత్త ప్రపంచాన్ని
నిర్మించేవాళ్ళం, మనిద్దరమే.
228
00:17:26,646 --> 00:17:28,770
దాన్ని నియంత్రించే వాళ్ళం.
229
00:17:28,771 --> 00:17:31,645
నాకు అలాంటి ప్రపంచం వద్దు.
నాకు అది వద్దు.
230
00:17:31,646 --> 00:17:33,812
నాకు అప్పుడూ వద్దు,
ఇప్పుడూ వద్దు!
231
00:17:34,646 --> 00:17:37,311
అది కోరుకున్నది మీరు, బాబా.
నాకది వద్దు!
232
00:17:37,312 --> 00:17:40,646
నాకు నా చిన్ని ప్రపంచం కావాలి.
233
00:17:41,479 --> 00:17:42,521
నా కుటుంబం.
234
00:17:43,687 --> 00:17:46,437
మిమ్మల్ని నా కుటుంబానికి
హాని తలపెట్టనివ్వను.
235
00:17:49,479 --> 00:17:50,479
అయితే, ఇప్పుడు ఏంటి?
236
00:17:52,437 --> 00:17:54,562
నన్ను చంపాలి, అంతేగా?
సరే. కానీయ్.
237
00:17:57,146 --> 00:17:58,146
రా, చంపు.
238
00:18:00,187 --> 00:18:01,396
రా, పిరికివాడా!
239
00:18:03,979 --> 00:18:05,146
నేను అలా చేయలేను.
240
00:18:08,062 --> 00:18:09,479
మీరు నాకోసం చాలా చేశారు.
241
00:18:11,771 --> 00:18:12,937
నాకు చాలా ఇచ్చారు.
242
00:18:14,771 --> 00:18:15,771
కానీ ఇప్పుడు...
243
00:18:17,021 --> 00:18:18,562
...నా కుటుంబాన్ని వదిలేయండి.
244
00:18:20,896 --> 00:18:21,812
దయచేసి వదిలేయండి.
245
00:18:24,854 --> 00:18:26,146
నాకు తెలిసిన ఆ రాహి...
246
00:18:29,687 --> 00:18:31,354
...నేను జాగ్రత్తగా పెంచాను.
247
00:18:33,562 --> 00:18:34,937
అతను ఇంత మాట్లాడేవాడు కాదు.
248
00:18:35,687 --> 00:18:37,603
నేరుగా వచ్చి, నన్ను చంపేవాడు.
249
00:18:37,604 --> 00:18:38,771
నాకు నువ్వు తెలియదు.
250
00:18:41,146 --> 00:18:42,021
మీరన్నది నిజమే.
251
00:18:44,187 --> 00:18:45,229
నేను ఆ రాహిని కాదు.
252
00:19:00,687 --> 00:19:04,729
చాకో నా గతం గురించి విచారించలేదు,
అందుకని నేనూ అడగలేదు.
253
00:19:05,187 --> 00:19:07,187
మాకు మా భవిష్యత్తే ముఖ్యం.
254
00:19:08,021 --> 00:19:10,936
మేము కలవకముందు ఎవరిమో,
255
00:19:10,937 --> 00:19:14,146
మా జీవితాలు ఎలా ఉండేవో,
అది మాకు ముఖ్యం కాదు.
256
00:19:14,562 --> 00:19:16,728
కానీ మీరు ఇప్పుడు వచ్చారు కనుక,
కేదర్ అన్నా,
257
00:19:16,729 --> 00:19:20,436
నేను చాకోను తెలుసుకునే
అవకాశాన్ని వదులుకోను.
258
00:19:20,437 --> 00:19:22,228
ఇంకొంచెం చెప్పండి.
259
00:19:22,229 --> 00:19:23,936
నన్ను ఏమి చెప్పమంటారు?
260
00:19:23,937 --> 00:19:27,103
చాకో తను కనిపించినట్టుగా ఉండడు.
261
00:19:27,104 --> 00:19:28,645
అతను ఒక జ్వాలాముఖి.
262
00:19:28,646 --> 00:19:32,479
అంటే, అతను మణికట్టు కుస్తీలో దిట్ట.
మీకు అది తెలుసా?
263
00:19:32,979 --> 00:19:34,646
ఆయన ఆ కోణం నేను ఏనాడు చూడలేదు.
264
00:19:35,312 --> 00:19:38,020
మీకు ఆకలి వేస్తుందేమో.
నేను ఏదైనా చేయనా?
265
00:19:38,021 --> 00:19:39,604
నాకు టీ ఇస్తే తాగుతాను.
266
00:19:42,562 --> 00:19:44,520
వంటగదిలో సాయం చేయనా?
267
00:19:44,521 --> 00:19:47,187
వద్దు, అన్నా,
మీరు హాయిగా కూర్చోండి.
268
00:19:50,271 --> 00:19:51,687
అన్నట్టు, మీరు ఏమన్నారు...
269
00:19:52,896 --> 00:19:54,311
...ఎక్కడికి వెళ్ళాడు?
270
00:19:54,312 --> 00:19:55,604
నేను ఏమీ చెప్పలేదు.
271
00:19:56,729 --> 00:19:58,561
తను ఎక్కడికి వెళ్ళేది నాతో చెప్పరు.
272
00:19:58,562 --> 00:20:01,062
వెళ్ళే ముందూ చెప్పరు,
వచ్చే ముందూ చెప్పరు.
273
00:20:01,646 --> 00:20:04,145
ఎక్కువగా బయటకు వెళుతుంటాడా?
274
00:20:04,146 --> 00:20:08,103
ఎప్పుడూ. కానీ ఇంటికి వచ్చినప్పుడు,
అతని దృష్టంతా కుటుంబంపైనే ఉంటుంది.
275
00:20:08,104 --> 00:20:09,728
రోజంతా ఇంట్లోనే ఉంటారు.
276
00:20:09,729 --> 00:20:11,812
బహుశా తప్పు చేస్తున్న భావనవలనేమో.
277
00:20:12,354 --> 00:20:17,187
చాకో ఒక కుటుంబ వ్యక్తిగా మారడం
నమ్మలేకపోతున్నాను.
278
00:20:17,896 --> 00:20:19,811
తను నేను కలిసి చాలా పనులు చేశాము.
279
00:20:19,812 --> 00:20:21,354
మీకు ఎప్పుడూ చెప్పలేదా?
280
00:20:21,812 --> 00:20:23,061
మీరు చెప్పవచ్చుగా?
281
00:20:23,062 --> 00:20:25,271
తను బాబా గురించి చెప్పాడా?
282
00:20:26,437 --> 00:20:27,437
లేదు.
283
00:20:29,104 --> 00:20:30,395
ఆయన మా గురువు.
284
00:20:30,396 --> 00:20:32,186
నిజంగానా? గురువు ఎవరు?
285
00:20:32,187 --> 00:20:33,811
అతని గురించి నాకేమీ చెప్పలేదు.
286
00:20:33,812 --> 00:20:36,020
అరే, వదినా, నేను ఏదోదో వాగుతుంటాను.
287
00:20:36,021 --> 00:20:38,104
చాకో వచ్చాక తనే చెబుతాడులే.
288
00:20:38,812 --> 00:20:42,062
అన్నట్టు మన దీనా
ఆదర్ష్ విద్యా మందిరంలోనేగా చదివేది?
289
00:20:42,979 --> 00:20:45,687
అవును, కానీ మీకు ఎలా తెలుసు?
290
00:20:49,729 --> 00:20:52,645
మీరు చెప్పనేలేదు,
మీకు దెబ్బ ఎలా తగిలింది?
291
00:20:52,646 --> 00:20:54,561
నాకు తరుచుగా గయాలు అవుతుంటాయి.
292
00:20:54,562 --> 00:20:56,604
మీరు ఇంకొకతని ముఖం చూసుండాల్సింది.
293
00:20:57,604 --> 00:20:58,812
మీకు చాకో ఎలా...
294
00:21:14,896 --> 00:21:16,896
మీరు ఇక్కడేం చేస్తున్నారు?
295
00:22:08,979 --> 00:22:11,645
లూడో అడ్రస్ దొరికింది.
వాళ్ళంతా అక్కడే ఉన్నారు.
296
00:22:11,646 --> 00:22:13,354
అన్నా, బాబా ఆపేయమని చెప్పారు.
297
00:22:17,562 --> 00:22:19,146
ఈ అధ్యాయం ముగిసింది.
298
00:22:20,104 --> 00:22:21,104
మనల్ని రమ్మన్నారు.
299
00:22:23,771 --> 00:22:24,854
బాబా బలహీనంగా మారారు.
300
00:22:27,312 --> 00:22:30,479
నాకు తెలిసిన బాబా ఎప్పుడూ వెనకడుగు వేయరు.
301
00:22:31,479 --> 00:22:37,229
ఎప్పుడూ మొదలుపెట్టిన పని పూర్తి చేసేదాకా
మన ముఖాలు చూపించవద్దని అనేవారు.
302
00:22:39,229 --> 00:22:41,104
మనం పని పూర్తి చేయాలి, నకుల్.
303
00:22:42,562 --> 00:22:43,562
నేనది పూర్తి చేస్తా.
304
00:22:45,187 --> 00:22:46,479
సరే, నేనూ మీతో వస్తా.
305
00:22:47,771 --> 00:22:50,896
ఆలోచించుకో. బాబాకు నచ్చదు.
306
00:22:51,937 --> 00:22:55,729
ఆలోచించుకున్నా. నాకు మీరున్న చోటు
వివరాలు పంపండి. వస్తున్నాను.
307
00:23:30,021 --> 00:23:31,979
ఆగు! దగ్గరకు రాకు.
308
00:23:38,604 --> 00:23:40,271
- హాయ్, నాడియా.
- ఎవరు నువ్వు?
309
00:23:43,187 --> 00:23:45,978
- నాడియా, నేను...
- ఆగు! లేదంటే కాల్చేస్తాను!
310
00:23:45,979 --> 00:23:47,020
సరే...
311
00:23:47,021 --> 00:23:49,146
నాడియా! ఏమి చేస్తున్నావు?
తుపాకీ దించు!
312
00:23:50,187 --> 00:23:51,312
ఇతనెవరు? సురక్షితమేనా?
313
00:23:55,729 --> 00:23:56,896
ఈయన మీ నాన్న.
314
00:24:01,479 --> 00:24:04,896
ఈయన మా... ఇతను స్టంట్‌మ్యాన్ బన్నీనా?
315
00:24:05,312 --> 00:24:08,271
అవును. ఇంకా మీ నాన్నను కూడా.
316
00:24:08,937 --> 00:24:10,896
నేను మిమ్మల్ని నమ్మను.
నిరూపించండి.
317
00:24:11,896 --> 00:24:13,521
మీ అమ్మను అడుగు.
ఆమె నాకు రుజువు.
318
00:24:24,229 --> 00:24:26,437
- మీ నాన్నను హత్తుకోవా?
- హత్తుకోను.
319
00:24:30,187 --> 00:24:32,562
సరే. హై ఫైవ్?
320
00:25:50,979 --> 00:25:53,104
ఇక్కడ ఎవరూ లేరు.
అందరూ పారిపోయారు.
321
00:25:54,396 --> 00:25:56,646
కంగారుపడకండి, వాళ్ళను పట్టుకుంటాము.
322
00:25:57,646 --> 00:26:00,061
ఈ డ్రైవ్స్ అన్నీ టెక్ టీంకు ఇవ్వండి.
323
00:26:00,062 --> 00:26:02,521
మిగిలిఉన్న అన్నిటినీ డీకోడ్ చేసి ఇవ్వండి.
324
00:26:12,604 --> 00:26:13,937
నాడియా, ఎక్కడికెళుతున్నాం?
325
00:26:18,937 --> 00:26:20,561
- ఏంటిది?
- ఇదిగోండి!
326
00:26:20,562 --> 00:26:21,687
గైర్
కానూని
327
00:26:23,354 --> 00:26:24,354
ఇది నువ్వు చూశావా?
328
00:26:24,979 --> 00:26:27,104
హనీ, బన్నీ ఇద్దరూ ఇందులో ఉన్నారు. తెలుసా?
329
00:26:28,521 --> 00:26:31,061
మీ మొదటి స్టంట్ 35వ నిమిషంలో ఉంది,
330
00:26:31,062 --> 00:26:33,978
రెండవ స్టంట్ 45వ నిమిషంలో ఉంది.
331
00:26:33,979 --> 00:26:36,395
మీ ముఖం కనిపిస్తుందేమోనని చాలా చూశాను.
332
00:26:36,396 --> 00:26:40,436
ఆ తరువాత, హనీ వస్తుంది,
23వ నిమిషం డాన్స్ చేయడానికి.
333
00:26:40,437 --> 00:26:43,854
ఆ తరువాత చనిపోతుంది. సుమారు...
334
00:26:54,104 --> 00:26:57,187
సరే. ముఖ్యమైనవి అన్నీ అయిపోయాయి.
335
00:26:58,937 --> 00:27:00,187
ఇక చూడాలని లేదు.
336
00:27:01,354 --> 00:27:04,979
ఇది మంచి సినిమా కాదు,
ఖచ్చితంగా పిల్లలకు కాదు.
337
00:27:08,812 --> 00:27:10,312
ఇది హనీకి ఇష్టమైన సినిమా.
338
00:27:14,062 --> 00:27:16,729
మనం ఇప్పుడు
మాములు కుటుంబంలా ఉండవచ్చు, కదా?
339
00:27:17,354 --> 00:27:18,771
నాన్న కూడా వచ్చేశారు.
340
00:27:19,812 --> 00:27:21,854
ఇక, ప్లే మోడ్ ముగిసినట్టే, కదా?
341
00:27:41,271 --> 00:27:42,271
దీనా!
342
00:27:45,937 --> 00:27:46,937
దీనా!
343
00:27:48,021 --> 00:27:48,896
దీనా!
344
00:27:56,729 --> 00:27:57,729
దొరికిందా?
345
00:27:58,604 --> 00:28:00,853
చాలావరకూ కాలిపోయాయి.
పూర్తిగా నాశనమయిపోయాయి,
346
00:28:00,854 --> 00:28:03,062
- కానీ ఎలాగో అలా...
- లొకేషన్ చెప్పు చాలు.
347
00:28:03,646 --> 00:28:04,520
తప్పకుండా.
348
00:28:04,521 --> 00:28:06,061
{\an8}కనుగొంటుంది...
యాక్సెస్ కనుగొనబడింది
349
00:28:06,062 --> 00:28:08,270
{\an8}ఈ డ్రైవ్స్‌ను రెండు శాటిలైట్ ఫోన్లకు
350
00:28:08,271 --> 00:28:11,437
లింక్ చేశారు, అవి ఈ లోకేషన్‌లో
క్రియాశీలంగా ఉన్నాయి.
351
00:28:14,979 --> 00:28:18,187
రాయ్‌చూర్
352
00:28:44,229 --> 00:28:45,229
హెచ్చరిక!!!
353
00:28:51,854 --> 00:28:53,561
ట్రాకర్ డేటా ప్రాప్యత
354
00:28:53,562 --> 00:28:54,646
ఛ!
355
00:29:00,604 --> 00:29:03,354
కె డి వస్తున్నాడు
356
00:29:08,187 --> 00:29:10,104
వాళ్ళొస్తున్నారు,
మనం సిద్ధంగా ఉండాలి.
357
00:29:18,479 --> 00:29:21,521
నాకర్థం కాలేదు.
బాబాకు మన వెనుక వచ్చే ఉద్దేశ్యంలేదు.
358
00:29:22,104 --> 00:29:23,561
అంతా ముగిసింది.
359
00:29:23,562 --> 00:29:26,436
ఖచ్చితంగా కె డి చేస్తున్నాడు,
బాబా అనుమతి లేకుండా.
360
00:29:26,437 --> 00:29:27,771
బాబా మనసు మారిందేమో.
361
00:29:29,312 --> 00:29:31,104
- అయన అలా చేయరు.
- బన్నీ.
362
00:29:32,687 --> 00:29:34,187
తిరిగి ప్లే మోడ్‌కా?
363
00:29:47,271 --> 00:29:48,437
నీపై మా ప్రేమ తెలుసుగా?
364
00:29:49,604 --> 00:29:51,937
నిన్ను ఎప్పుడూ రక్షిస్తామని నీకు తెలుసుగా?
365
00:29:53,646 --> 00:29:57,396
ఇప్పుడు జరుగుతున్నది,
అది త్వరలో ముగుస్తుంది. సరేనా?
366
00:30:29,479 --> 00:30:31,478
మాకై వెతుకుతున్నవారికి,
మా జాడ తెలిసింది.
367
00:30:31,479 --> 00:30:33,728
నాడియాను అవుట్‌హౌస్‌కు
తీసుకెళ్ళండి. త్వరగా.
368
00:30:33,729 --> 00:30:35,020
నేనూ మీకు సాయపడగలను.
369
00:30:35,021 --> 00:30:37,311
నాడియాను సురక్షితంగా ఉంచండి.
అదే పెద్ద సాయం.
370
00:30:37,312 --> 00:30:39,229
- తప్పకుండా, కానీ...
- అన్నా, వెళ్ళండి.
371
00:30:42,854 --> 00:30:44,561
ఎవరైనా వస్తే, కాల్చేయండి.
372
00:30:44,562 --> 00:30:45,937
నా దగ్గర ఉంది. ఇది ఉంచు.
373
00:30:47,271 --> 00:30:49,521
- నువ్వు?
- ధైర్యవంతురాలిని, నిర్భయురాలిని.
374
00:30:50,146 --> 00:30:52,354
- మరి నేను?
- మా అమ్మవి.
375
00:30:53,187 --> 00:30:55,187
ఇంకా నాకు ఏమీ జరగనివ్వవు.
376
00:31:00,979 --> 00:31:02,187
వెళదామా, నాడియా?
377
00:31:10,229 --> 00:31:12,479
జాగ్రత్త. త్వరగా రా.
378
00:31:38,146 --> 00:31:40,812
- సిద్ధమేనా?
- నీతో.
379
00:32:25,479 --> 00:32:26,479
పడండి, పదండి!
380
00:32:49,229 --> 00:32:50,354
కారు ముందుకు పోనీ!
381
00:33:05,437 --> 00:33:06,521
నీకు రక్షణగా ఉంటా, వెళ్ళు!
382
00:34:00,646 --> 00:34:01,646
రెడీనా?
383
00:35:20,604 --> 00:35:21,604
రాహి.
384
00:35:22,729 --> 00:35:24,187
బాబా నిన్ను క్షమించవచ్చు,
385
00:35:24,812 --> 00:35:25,812
కానీ నేను క్షమించను.
386
00:35:27,104 --> 00:35:28,104
బయటకు రా!
387
00:36:53,687 --> 00:36:55,062
వెళ్ళండి, పిల్లను వెతకండి!
388
00:36:57,104 --> 00:36:58,729
నకుల్, నువ్వు హనీ వెనుక వెళ్ళు.
389
00:38:48,854 --> 00:38:49,854
హనీ!
390
00:38:50,562 --> 00:38:51,521
హనీ!
391
00:38:56,437 --> 00:38:57,729
- బాగానే ఉన్నావా?
- ఆ.
392
00:38:59,271 --> 00:39:00,312
పరవాలేదా?
393
00:39:05,062 --> 00:39:07,479
మనం నాడియాను తీసుకుని వెళ్ళిపోవాలి. పద.
394
00:39:08,479 --> 00:39:11,146
ఇక్కడ ఒక సొరంగం ఉంది. నాతో రా.
395
00:39:53,812 --> 00:39:55,021
పరిగెత్తు! పరిగెత్తు!
396
00:40:07,562 --> 00:40:08,562
అన్నా?
397
00:40:09,937 --> 00:40:11,145
- హనీ.
- హనీ!
398
00:40:11,146 --> 00:40:12,104
బాగానే ఉన్నావా?
399
00:40:13,312 --> 00:40:16,353
- నీకేమీ కాలేదుగా?
- మనం నాడియాని తీసుకుని వెళ్ళాలి.
400
00:40:16,354 --> 00:40:18,146
- మనం ఇక్కడ ఉన్నాం, సరేనా?
- సరే.
401
00:40:20,021 --> 00:40:21,187
జాగ్రత్తగా ఉండు.
402
00:40:22,937 --> 00:40:24,979
అన్నిటికీ మన్నించు. ధన్యవాదాలు.
403
00:40:25,979 --> 00:40:27,854
పదండి వెళదాం. ధన్యవాదాలు.
404
00:41:37,646 --> 00:41:38,687
కిందకు ఉండు, నాడియా.
405
00:41:39,146 --> 00:41:41,104
- అంతా బాగున్నప్పుడు చెబుతా.
- సరే, బన్నీ.
406
00:41:42,479 --> 00:41:44,687
తను నన్ను బన్నీ అనే పిలుస్తుందా?
నాన్న అనదా?
407
00:41:45,437 --> 00:41:46,896
తను సమానమని నేర్పించాను.
408
00:41:59,646 --> 00:42:00,646
నాడియా, కిందకు ఉండు!
409
00:42:24,896 --> 00:42:27,062
- నాడియా, బాగానే ఉన్నావా?
- ఆ.
410
00:42:30,187 --> 00:42:31,603
- బానేఉన్నావా, తల్లీ?
- ఆ.
411
00:42:31,604 --> 00:42:32,853
రా, రా.
412
00:42:32,854 --> 00:42:35,229
హనీ, నువ్వు బాగానే ఉన్నావా? పరవాలేదా?
413
00:42:37,396 --> 00:42:38,562
పరవాలేదు.
414
00:42:58,312 --> 00:43:00,478
పడవ దగ్గరకెళ్ళండి, హనీ.
రక్షణగా ఉంటాను.
415
00:43:00,479 --> 00:43:02,186
ఏంటి? మనం కలిసి వెళదాం.
416
00:43:02,187 --> 00:43:04,896
హనీ, ఇది మన కోసం కాదు.
ఇది నాడియా కోసం.
417
00:43:05,729 --> 00:43:06,937
నువ్వు వెళ్ళాలి.
418
00:43:10,271 --> 00:43:12,604
అమ్మతో ఉండు.
నాన్న వస్తారు, సరేనా?
419
00:43:16,604 --> 00:43:18,312
హనీ, ఇది నా కారణంగా మొదలయింది.
420
00:43:18,937 --> 00:43:20,937
నేనే ఇది ముగించాలి. వెళ్ళు.
421
00:43:22,187 --> 00:43:24,312
హనీ, దయచేసి వెళ్ళు. వెళ్ళు.
422
00:43:26,187 --> 00:43:27,271
వెళ్ళు.
423
00:43:36,687 --> 00:43:39,437
నువ్వు రాకపోతే,
నేను వచ్చి నిన్ను వేటాడి, చంపుతా!
424
00:44:27,854 --> 00:44:30,396
నీ కారణంగానే ఇదంతా! ఇదంతా!
425
00:44:32,812 --> 00:44:34,020
బాబాకు.
426
00:44:34,021 --> 00:44:35,521
మన కుటుంబానికి.
427
00:44:35,896 --> 00:44:37,021
నకుల్‌కు.
428
00:44:38,937 --> 00:44:41,646
అన్నీ నీ కారణంగానే జరిగాయి.
429
00:45:46,396 --> 00:45:47,396
రా.
430
00:46:03,312 --> 00:46:04,854
ఛ, చెత్తవెధవ!
431
00:46:05,937 --> 00:46:06,937
ఏయ్, కె డి.
432
00:46:08,771 --> 00:46:10,479
నువ్వు చాలా ప్రత్యేకం అనుకుంటావు.
433
00:46:12,479 --> 00:46:13,979
బాబాకు ముఖ్యమైన వాడివని, కదా?
434
00:46:14,646 --> 00:46:16,354
బాబా నిన్ను ఇంటికి పిలిచి ఉంటారు,
435
00:46:17,437 --> 00:46:18,812
అమ్మకు పరిచయం చేసి ఉంటారు.
436
00:46:21,229 --> 00:46:22,479
నన్నలాగే
పరిచయం చేశారు.
437
00:46:24,271 --> 00:46:25,312
అదంతా ఒక బూటకం.
438
00:46:26,979 --> 00:46:30,354
ఈ ఇల్లూ, భార్య, అన్నీ.
439
00:46:33,396 --> 00:46:35,186
ఖచ్చితంగా
440
00:46:35,187 --> 00:46:38,521
నువ్వు కలిసిన అమ్మ,
నేను కలిసిన ఆమ్మ ఒకటే అయి ఉండదు.
441
00:46:41,146 --> 00:46:43,479
నీకోసం వంట చేశారా? మాడిపోయిన కోడి.
442
00:46:44,562 --> 00:46:45,729
నువ్వది తినుంటావు.
443
00:46:51,729 --> 00:46:53,229
బాబా విధేయత కార్యక్రమం.
444
00:46:55,021 --> 00:46:56,021
మనకు పరీక్ష.
445
00:46:57,271 --> 00:46:58,646
అందరితో అలానే చేస్తారు.
446
00:46:59,479 --> 00:47:00,479
చెత్తసన్నాసి!
447
00:47:01,937 --> 00:47:03,771
అనాథలను ప్రత్యేకంగా ఎంచుకుంటారు,
448
00:47:04,687 --> 00:47:06,604
వాళ్ళకు కుటుంబం ఇస్తారు,
తరువాత,
449
00:47:07,479 --> 00:47:09,771
ఆయన కోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతాము.
450
00:47:11,437 --> 00:47:12,479
చంపడానికైనా...
451
00:47:13,687 --> 00:47:14,771
చావడానికైనా.
452
00:47:16,312 --> 00:47:17,521
అదే బాబా పన్నాగం.
453
00:47:19,354 --> 00:47:23,146
ఈరోజు నేను ఎవరినో, అది బాబా కారణంగానే.
454
00:47:26,854 --> 00:47:28,021
నాతో వద్దని చెప్పారు.
455
00:47:29,312 --> 00:47:30,646
"రాహిని వదిలేయ్" అన్నారు.
456
00:47:33,062 --> 00:47:34,979
నేను ఆయన మాట వినాల్సింది, ఛత్.
457
00:47:37,521 --> 00:47:38,604
కానీ చివరకు, కె డి...
458
00:47:40,479 --> 00:47:42,062
...నువ్వూ ఆయనను వ్యతిరేకించావు.
459
00:47:43,187 --> 00:47:44,187
నాలాగే.
460
00:47:45,854 --> 00:47:47,271
మనం ఇద్దరం ఒకటే.
461
00:47:48,187 --> 00:47:51,812
అనాథలం, ప్రేమకోసం,
కుటుంబం కోసం తపించేవాళ్ళం.
462
00:47:55,521 --> 00:47:57,146
నిన్ను బాగా గాయిపరిచానులే.
463
00:47:58,854 --> 00:48:00,479
యూనిట్ ఏ, మాట్లాడండి.
ఇది యూనిట్ సీ.
464
00:48:00,979 --> 00:48:02,979
ఆ ప్రదేశానికి
పది నిమిషాల దూరంలో ఉన్నాము.
465
00:48:05,312 --> 00:48:06,854
దళం మొత్తం వస్తోంది రాహి.
466
00:48:10,312 --> 00:48:11,521
నీకు పది నిమిషాలుంది.
467
00:48:13,729 --> 00:48:14,729
వెళ్ళిపో.
468
00:48:25,979 --> 00:48:27,729
నాన్న ఒంటరిగా ఉన్నారు.
469
00:48:29,146 --> 00:48:30,687
ఆయనతో ఎవరూ లేరు.
470
00:48:33,146 --> 00:48:34,646
ఆయనకు ఏమీ కాదు.
471
00:51:37,896 --> 00:51:39,895
సబ్‌టైటిల్ అనువాద కర్త సమత
472
00:51:39,896 --> 00:51:41,979
క్రియేటివ్ సూపర్‌వైజర్
నిశాంతి ఈవని