1 00:00:38,330 --> 00:00:39,998 {\an8}బెన్ వెబర్ 2 00:00:41,500 --> 00:00:42,667 హేయ్. 3 00:00:42,668 --> 00:00:45,795 హాయ్ జనా. నువ్వు ఫోన్ కి బదులిచ్చినందుకు సంతోషంగా ఉంది. 4 00:00:45,796 --> 00:00:46,922 బెన్? 5 00:00:52,803 --> 00:00:55,012 ఎమర్జెన్సీ రూమ్, న్యూరియా కాస్ట్రోఫ్ హాస్పిటల్, నర్సింగ్ డిపార్ట్మెంట్. 6 00:00:55,013 --> 00:00:57,099 హలో, బెన్? 7 00:00:58,016 --> 00:00:59,892 - జనా? - ఒక్క క్షణం. 8 00:00:59,893 --> 00:01:02,688 హేయ్. కియాన్ నీతో ఉన్నాడా? 9 00:01:03,814 --> 00:01:05,440 అవును, నన్ను చూసుకుంటున్నాడు. 10 00:01:06,525 --> 00:01:08,402 - జనా! - ఒక్క నిమిషం! 11 00:01:10,112 --> 00:01:11,113 ఎలా ఉన్నావు? 12 00:01:14,032 --> 00:01:15,033 ఘోరంగా ఉన్నా. 13 00:01:21,623 --> 00:01:22,999 జనా! 14 00:01:23,000 --> 00:01:24,376 ఒక సెకను లైన్ లోనే ఉండు, సరేనా? 15 00:01:27,087 --> 00:01:28,881 బెర్లిన్ విపత్తు హెచ్చరిక. 16 00:01:29,798 --> 00:01:31,341 నైకాన్ లో భారీ అగ్నిప్రమాదం! 17 00:01:33,719 --> 00:01:35,344 ఎమర్జెన్సీ అలారం పేపర్ వేస్ట్ ఫ్యాక్టరీ ఆవరణలో అగ్నిప్రమాదం 18 00:01:35,345 --> 00:01:36,471 జనా? 19 00:01:37,014 --> 00:01:38,015 నువ్వు ఇంకా లైన్ లోనే ఉన్నావా? 20 00:01:40,017 --> 00:01:42,102 మొత్తం ఎమర్జెన్సీ సర్వీసుని రంగంలోకి దించండి! 21 00:01:43,061 --> 00:01:44,313 జనా? 22 00:01:51,278 --> 00:01:52,279 కియాన్? 23 00:01:53,614 --> 00:01:55,364 లే! వెంటీ క్లబ్ కాలిపోతోంది! 24 00:01:55,365 --> 00:01:58,535 అందుబాటులో ఉన్న అన్ని యూనిట్లూ నైకాన్ లో అగ్నిప్రమాద స్థలానికి వెళ్లాలి. 25 00:02:09,588 --> 00:02:14,593 BERLIN ER 26 00:02:24,144 --> 00:02:25,854 మీరు బాగానే ఉన్నారా? ఏమైనా సాయం కావాలా? 27 00:02:26,396 --> 00:02:27,647 లేదు. థాంక్స్. మేము బాగానే ఉన్నాం. 28 00:02:27,648 --> 00:02:32,109 అందరూ బయటకి వెళ్లండి! అక్కడ ఉన్న మీరిద్దరూ, బయటకి వెళ్లండి! 29 00:02:32,110 --> 00:02:34,404 సారీ, ఆ క్లబ్ లో మీరు ఉన్నారా? లోపల ఇంకా చాలామంది ఉన్నారా? 30 00:02:39,368 --> 00:02:42,411 - వెళ్లండి! అందరూ, బయటకి వెళ్లండి! - సాయం చేయండి! 31 00:02:42,412 --> 00:02:44,539 మంటలు! ఫైర్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేయండి! 32 00:02:44,540 --> 00:02:48,376 సాయం చేయండి! మాకు సాయం చేయండి! 33 00:02:48,377 --> 00:02:51,420 నీకేం కాదు, నన్ను చూడు! 34 00:02:51,421 --> 00:02:52,589 మీకు ఏమైనా సాయం కావాలా? 35 00:02:53,423 --> 00:02:55,634 - అవును. - నేను డాక్టర్ ని. నన్ను చూడమంటారా? 36 00:02:56,718 --> 00:02:58,177 సరే, చాలా రక్తం పోతోంది... 37 00:02:58,178 --> 00:02:59,929 నీ స్వెటర్ ని పైకి తీయగలవా? 38 00:02:59,930 --> 00:03:01,557 నీ స్వెటర్ ని నేను తీస్తున్నాను, సరేనా? 39 00:03:03,809 --> 00:03:06,102 - నీ పేరు ఏంటి? - సింథియా. 40 00:03:06,103 --> 00:03:08,771 - సింథియా. - సింథియా? సింథియా, నా పేరు డోమ్. 41 00:03:08,772 --> 00:03:11,608 నీకేం కాదు. ఈ ప్రమాదం నుంచి బయటపడతావు, సరేనా? 42 00:03:12,526 --> 00:03:13,901 ఏం జరిగింది? 43 00:03:13,902 --> 00:03:15,654 కింది అంతస్తులో పైకప్పు కొద్ది భాగం కూలిపోయింది. 44 00:03:16,822 --> 00:03:18,364 - మరి నీ పేరు? - నయోమి. 45 00:03:18,365 --> 00:03:19,448 - నయోమి? - అవును. 46 00:03:19,449 --> 00:03:21,075 అక్కడ ఇంకా చాలామంది జనం ఉన్నారా? 47 00:03:21,076 --> 00:03:22,828 - అవును, కొంతమంది ఉన్నారు. - అవునా? 48 00:03:24,329 --> 00:03:27,164 - నీ చేయి ఇలా ఇవ్వు. - వాళ్లలో సగం మంది ఇంకా డాన్స్ చేస్తున్నారు. 49 00:03:27,165 --> 00:03:29,375 ఇక్కడ నీకు వీలైనంత బలంగా నొక్కు. 50 00:03:29,376 --> 00:03:31,377 తరువాత నీ ఫ్రెండ్ ని చాలా నెమ్మదిగా బయటకి తీసుకువెళ్లు 51 00:03:31,378 --> 00:03:34,422 - ఇంకా ఎవరైనా వచ్చేవరకూ అక్కడే ఎదురుచూడు, సరేనా? - సరే. 52 00:03:34,423 --> 00:03:37,049 ఎవరైనా వచ్చేవరకూ ఇద్దరూ కలిసే ఉండండి! సరేనా? 53 00:03:37,050 --> 00:03:39,010 సరే. మంచిది. 54 00:03:39,011 --> 00:03:42,638 బయటకి వెళ్లే మార్గం అక్కడ ఉంది. లేవండి! వెళ్లండి! 55 00:03:42,639 --> 00:03:45,350 అగ్నిమాపక దళం వాళ్లు దారిలో ఉన్నారు. వెళ్లండి, బయటకి వెళ్లండి! బయటకి వెళ్లే దారి అక్కడ ఉంది. 56 00:03:52,566 --> 00:03:54,067 బయటకి వెళ్లే దారి అదే, వెళ్లండి! 57 00:04:03,452 --> 00:04:06,038 - ఆగు, ఆగు! - కుదరదు! 58 00:04:08,248 --> 00:04:09,374 నేను కూడా నీతో వస్తున్నాను. 59 00:04:10,375 --> 00:04:12,168 నువ్వు పని చేసే పరిస్థితిలో లేవు. 60 00:04:12,169 --> 00:04:15,171 - నా పని పూర్తయ్యాక తిరిగి వచ్చేస్తాను. - లేదు. నేను పని చేస్తాను. 61 00:04:15,172 --> 00:04:17,591 నువ్వు ఉంటున్నావు! సరేనా? 62 00:04:18,634 --> 00:04:19,760 నేను చెప్పేది అర్థం అవుతోందా? 63 00:04:25,974 --> 00:04:27,559 సరే. నేను అర్థం చేసుకున్నాను. 64 00:04:46,703 --> 00:04:47,746 చెత్త! 65 00:04:56,421 --> 00:04:58,506 మీరంతా బయటకి వెళ్లాలి, ఇక్కడ ఉండటం క్షేమం కాదు! 66 00:04:58,507 --> 00:05:00,092 మీరు బయటకి వెళ్లాలి! 67 00:05:01,927 --> 00:05:04,847 1501 ప్రమాద స్థలానికి చేరుకుంది, మేము లోపలికి వెళ్తున్నాం... 68 00:05:07,307 --> 00:05:09,767 యూనిట్ 1204కి సాయంగా లోపలికి వెళ్లండి... 69 00:05:09,768 --> 00:05:11,311 దయచేసి ఈ భవనాన్ని ఖాళీ చేయండి! 70 00:05:17,568 --> 00:05:19,694 - అందరూ బయటకి వెళ్లండి! - ఎట్టకేలకి! 71 00:05:19,695 --> 00:05:21,070 మీరు బయటకి వెళ్లాలి! 72 00:05:21,071 --> 00:05:23,155 నేను డాక్టర్ ని. మీకు సాయం చేయడానికి వచ్చాను. 73 00:05:23,156 --> 00:05:24,407 నువ్వు సాయం చేయకూడదు. 74 00:05:24,408 --> 00:05:25,492 ముందు బయటకి వెళ్లు! 75 00:05:27,035 --> 00:05:28,495 అందరూ బయటకి వెళ్లండి! 76 00:05:53,979 --> 00:05:55,606 మనం బయటకి వెళ్లాలి! 77 00:06:00,027 --> 00:06:03,154 - లోపల ఇంకా జనం ఉన్నారు. - మొత్తం కూలిపోతే మనం ఏమీ చేయలేము! 78 00:06:03,155 --> 00:06:05,282 - నాతో పాటు రా. - నీ సంచి ఇలా ఇవ్వు. 79 00:06:05,908 --> 00:06:07,284 నీ సంచి ఇలా ఇవ్వు! 80 00:06:11,747 --> 00:06:12,956 అది పిచ్చితనం! 81 00:06:14,875 --> 00:06:16,250 హలో, అందరూ వినండి. 82 00:06:16,251 --> 00:06:18,669 ఇంకో నిమిషంలో ఈ హాస్పిటల్ లో రద్దీ పెరిగిపోతుంది. 83 00:06:18,670 --> 00:06:21,839 దయచేసి మీరు కుడి వైపు కూర్చుంటారా? 84 00:06:21,840 --> 00:06:23,007 చాలా ధన్యవాదాలు. 85 00:06:23,008 --> 00:06:25,676 రిజిస్ట్రేషన్ డెస్క్ 86 00:06:25,677 --> 00:06:27,053 ఏంటి విషయం, జెన్నీ? 87 00:06:27,054 --> 00:06:28,763 నాలుగు విభాగాల నుంచి పదిమందిని పంపిస్తున్నారు. 88 00:06:28,764 --> 00:06:31,974 మంచిది. మనకి ఎక్కువ రెస్పిరేటర్లు, వాళ్లని తరలించడానికి పరికరాలు, బెడ్స్ కావాలి. 89 00:06:31,975 --> 00:06:34,352 అన్నీ ఎక్కువగా ఉండాలి. నువ్వు వెంటనే లోపలికి రావాలి. 90 00:06:34,353 --> 00:06:35,478 అలాగే. 91 00:06:35,479 --> 00:06:37,980 ఇక్కడ ఏం జరుగుతోంది? 92 00:06:37,981 --> 00:06:41,609 వెంటీ క్లబ్ లో ఒక భాగం కుప్పకూలిపోయింది. అది ఈ దగ్గరలోనే ఉంది. 93 00:06:41,610 --> 00:06:43,736 మన హాస్పిటల్ కి చాలామంది పేషంట్లు వస్తున్నారు. 94 00:06:43,737 --> 00:06:45,530 మనం పేషంట్లని వేరే చోట్లకి పంపించాలి. 95 00:06:45,531 --> 00:06:47,573 వాళ్లందరినీ చేర్చుకోవడానికి మన హాస్పిటల్ సరిపోకపోవచ్చు. 96 00:06:47,574 --> 00:06:48,824 కానీ ఎక్కడికి పంపిస్తాం? 97 00:06:48,825 --> 00:06:50,869 వాళ్లు ఇప్పటికే ఇక్కడికి వచ్చేశారు. 98 00:06:52,287 --> 00:06:53,997 మీరు అందుబాటులో ఉండండి. 99 00:06:56,834 --> 00:07:00,212 వెంటీ క్లబ్, ఆవరణలో మూడు యూనిట్లు ఉన్నాయి, అదనపు యూనిట్లు కావాలి. 100 00:07:01,713 --> 00:07:03,924 1501, సహాయం కావాలి. 101 00:07:11,682 --> 00:07:15,726 నైకాన్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని యూనిట్లకి పిలుపు: పేషంట్లని సర్దుబాటు చేయండి... 102 00:07:15,727 --> 00:07:17,562 రండి, త్వరపడండి. 103 00:07:17,563 --> 00:07:19,940 ...ఈ ఏరియాలో ఉన్న అన్ని హాస్పిటల్స్ కి తరలించండి. 104 00:07:23,777 --> 00:07:25,361 71204, వింటున్నాం. 105 00:07:25,362 --> 00:07:27,572 హేయ్, అంతా బాగానే ఉందా? 106 00:07:27,573 --> 00:07:28,656 ఫర్వాలేదు. 107 00:07:28,657 --> 00:07:30,284 ఓలాఫ్ లేకుండా మొదటిసారి వస్తున్నాను. 108 00:07:32,035 --> 00:07:33,245 నీకేం ఫర్వాలేదు. 109 00:07:53,182 --> 00:07:56,310 వెనుక వైపు ఎంట్రెన్సు దగ్గర అర్జెంటుగా అదనపు సహాయక బృందాలు కావాలి, నదికి ఉత్తరం వైపు. 110 00:08:00,939 --> 00:08:03,692 నన్ను అనుసరించు, ప్లీజ్! 111 00:08:05,194 --> 00:08:07,529 హేయ్, అక్కడ దారికి అడ్డులెండి! 112 00:08:10,365 --> 00:08:12,033 నదిలో జనం ఉన్నారు. 113 00:08:12,034 --> 00:08:14,745 నది దగ్గర లైఫ్ గార్డుల్ని సాయం చేయాలని కోరుతున్నాం. 114 00:08:25,714 --> 00:08:27,049 ట్రౌమా రూమ్! 115 00:08:31,720 --> 00:08:33,971 చాలా నెమ్మదిగా రండి... 116 00:08:33,972 --> 00:08:38,226 డాక్టర్ బెక్ కోసం ఆక్సిజన్, ఇంకా నా ట్రౌమా సర్జన్ ఎక్కడ? 117 00:08:38,227 --> 00:08:40,144 ట్రౌమా సర్జన్ వచ్చింది. 118 00:08:40,145 --> 00:08:42,022 హాయ్, నా మాట వినిపిస్తోందా? 119 00:08:42,731 --> 00:08:44,941 ఈ పేషంట్ ఇక్కడ ఎంత సేపటి నుంచి ఉంది? 120 00:08:44,942 --> 00:08:45,942 తెలియదు. 121 00:08:45,943 --> 00:08:47,653 ఇది యుద్ధభూమిలా ఉంది. 122 00:08:54,368 --> 00:08:56,118 నేను అది ఆగుతుంది అనుకున్నాను! 123 00:08:56,119 --> 00:08:57,245 చెత్త. 124 00:08:57,246 --> 00:08:59,455 నాకు ఎవరూ సాయం చేయరా? 125 00:08:59,456 --> 00:09:03,042 అందరూ దయచేసి వినండి! 126 00:09:03,043 --> 00:09:06,295 స్వయంగా ఏ సాయం లేకుండా నడవగలిగిన వారంతా, 127 00:09:06,296 --> 00:09:10,424 దయచేసి ఈ తలుపు ద్వారా వెయిటింగ్ హాల్ లోకి వెళ్లండి. 128 00:09:10,425 --> 00:09:11,384 పరిగెత్తకండి. 129 00:09:11,385 --> 00:09:15,013 మేము వీలైనంత త్వరగా మీకు వైద్యం అందిస్తాం. థాంక్యూ. 130 00:09:17,933 --> 00:09:18,934 మే-లీ... 131 00:09:19,893 --> 00:09:23,062 ఈ చక్కని వెస్ట్ ని నువ్వే తొడుక్కుని వెంటనే రంగంలోకి దిగు 132 00:09:23,063 --> 00:09:26,440 అలాగే ఇంకో ఇద్దరు నర్సులు కూడా అడ్మిషన్స్ విభాగంలో ప్రాథమిక చికిత్స చేస్తారు. 133 00:09:26,441 --> 00:09:29,652 ప్రాథమిక పరీక్ష జరగకుండా లోపలికి ఒక్కరు కూడా రావడానికి వీల్లేదు. 134 00:09:29,653 --> 00:09:34,240 అందరు పేషంట్లకి ట్యాగులని బాగా కనిపించే చోట్ల పెట్టండి... మణికట్టు, కాలి మడమ, ఇంకా అలాంటి చోట్ల. 135 00:09:34,241 --> 00:09:38,703 చిన్న గాయాలకి ఆకుపచ్చ ట్యాగులు పెట్టండి. వాళ్లు అడ్మిషన్ ఏరియాలో వేచి ఉంటారు. 136 00:09:38,704 --> 00:09:43,332 తలకి గాయాలు, కాలిన గాయాలు, తీవ్రమైన చీలికలు ఉంటే గనుక పసుపుపచ్చ ట్యాగ్స్ పెట్టండి... 137 00:09:43,333 --> 00:09:47,587 వాళ్లకి వెంటనే చికిత్స చేయాలి అయితే వాళ్లు కాసేపు వేచి ఉన్నా ఫర్వాలేదు. 138 00:09:47,588 --> 00:09:51,799 ఎర్ర ట్యాగ్: శ్వాస సమస్యలు ఉన్నవారికి, గాయాల వల్ల రక్తస్రావం అవుతున్న వారికి ఇవ్వండి. 139 00:09:51,800 --> 00:09:54,844 వాళ్లకి ట్రౌమా రూమ్ లో తక్షణం చికిత్స చేయాలి 140 00:09:54,845 --> 00:09:59,682 లేదా, ఒకవేళ ట్రౌమా రూమ్ ఖాళీగా లేకపోతే, అలా జరిగే అవకాశం ఉంది కాబట్టి, దాని దగ్గరలో చేయండి. 141 00:09:59,683 --> 00:10:01,018 బాస్, నన్ను ఎక్కడ ఉండమంటారు? 142 00:10:01,685 --> 00:10:04,687 చూడు, ఎర్ర ట్యాగ్ ఉన్న పేషంట్లకి చికిత్స చేయి, సరేనా? 143 00:10:04,688 --> 00:10:07,148 - మనం విడివిడిగా చేస్తే, ఎక్కువమందికి చికిత్స అందచ్చు. - అర్థమైంది. 144 00:10:07,149 --> 00:10:08,567 నువ్వు నాతో పాటు రా! 145 00:10:09,151 --> 00:10:13,487 ఎవరికైనా పని లేకపోతే, నా దగ్గరకి రండి. 146 00:10:13,488 --> 00:10:15,990 ఏమైనా సందేహాలు ఉన్నాయా? లేవా? పని కానివ్వండి. 147 00:10:15,991 --> 00:10:17,491 - డాక్టర్ పార్కర్? - ఏంటి? 148 00:10:17,492 --> 00:10:18,577 ఇక్కడ. 149 00:10:20,162 --> 00:10:23,039 నా గర్భం నుంచి ద్రవం కారుతోంది. 150 00:10:23,040 --> 00:10:24,166 అయితే అది గొప్ప విషయం! 151 00:10:26,084 --> 00:10:28,878 - నిన్ను పై అంతస్తుకి తీసుకువెళ్లడానికి మనుషులు కావాలి. - తనని నేను తీసుకువెళతాను. 152 00:10:28,879 --> 00:10:30,796 వద్దు, నువ్వు ఇక్కడ నాతో ఉండాలి. 153 00:10:30,797 --> 00:10:32,131 ఒక్క క్షణం. 154 00:10:32,132 --> 00:10:33,634 డాక్టర్ బెక్! 155 00:10:34,218 --> 00:10:35,052 స్టెఫెన్! 156 00:10:36,386 --> 00:10:38,721 ఈమెకి పురుటి నొప్పులు మొదలయ్యాయి. ఆమెని పై అంతస్తుకి తీసుకువెళతారా? 157 00:10:38,722 --> 00:10:40,515 - థాంక్స్. - చాలా సారీ. 158 00:10:40,516 --> 00:10:42,141 ఓహ్, అలా అనద్దు. 159 00:10:42,142 --> 00:10:44,393 పండంటి బిడ్డకి జన్మనివ్వు చాలు. సరేనా? 160 00:10:44,394 --> 00:10:46,146 మిగతా విషయాలు మేము చూసుకుంటాము. 161 00:10:50,567 --> 00:10:52,193 - జనా! - ఏంటి? 162 00:10:52,194 --> 00:10:54,571 - మీరు ఇక్కడికి రావాలి. - వస్తున్నా. 163 00:10:55,572 --> 00:10:58,157 సరే, ఇక్కడ రకరకాల గాయాలు పాలైన వాళ్లు ఉన్నారు! 164 00:10:58,158 --> 00:11:00,952 కాలిన గాయాలు, పైకప్పు కూలి గాయపడిన వారు, ఎముకలు విరిగి గాయాల పాలైన వారు... 165 00:11:00,953 --> 00:11:02,955 మంటల్లో గాయపడిన వారు వస్తున్నారు! 166 00:11:04,331 --> 00:11:06,917 జాగ్రత్త, దారి ఇవ్వండి, పారామెడిక్ బృందం వస్తోంది! 167 00:11:13,131 --> 00:11:16,968 తీవ్రంగా గాయపడిన వ్యక్తి మొదటగా మనతో ఉన్నాడు, అతనితో పాటు డాక్టర్ ఉన్నారు. 168 00:11:16,969 --> 00:11:18,928 అక్కడ నుండి మనం చికిత్సలు ప్రారంభిద్దాం, సరేనా? 169 00:11:18,929 --> 00:11:21,223 సరే, స్ట్రెచర్ నుంచి దించి మెట్లు ఎక్కిద్దాం. 170 00:11:21,932 --> 00:11:24,560 మూడు లెక్కపెడుతున్నా, ఒకటి, రెండు, మూడు... 171 00:11:26,103 --> 00:11:27,187 జాగ్రత్త! 172 00:11:31,525 --> 00:11:33,067 మిస్టర్ కోన్? 173 00:11:33,068 --> 00:11:36,529 - ఇక్కడ ఏం చేస్తున్నావు? - పక్కటెముకలకి ఫ్రాక్చర్లు అయ్యాయి. 174 00:11:36,530 --> 00:11:40,992 ఆగి ఆగి ఊపిరి తీసుకుంటున్నాడు. నేను కొన్ని ద్రవాలు రాశాను, కుడి వైపు ఇంకా ఎడమ వైపు. 175 00:11:40,993 --> 00:11:41,993 ఇతనిని తక్షణం తీసుకువెళ్లాలి. 176 00:11:41,994 --> 00:11:43,536 - నీ పేరు ఏంటి? - సోఫియా. 177 00:11:43,537 --> 00:11:45,538 సరే, సోఫియా, ఏం అయింది? 178 00:11:45,539 --> 00:11:48,791 అందరూ పరిగెడుతున్నారు, తను పడిపోయాడు, 179 00:11:48,792 --> 00:11:51,837 కానీ ఆ మొద్దువెధవలు తనని తొక్కుకుంటూ పోయారు. 180 00:11:52,671 --> 00:11:54,882 తనని హాస్పిటల్ కి తరలించేంత ఆరోగ్యంగా ఉన్నాడా? 181 00:11:58,302 --> 00:11:59,511 నాకు తెలియదు. 182 00:12:00,429 --> 00:12:01,638 కానీ మనం ఒక ప్రయత్నం చేయాలి. 183 00:12:05,976 --> 00:12:08,269 అందరూ బిల్డింగ్ ని ఖాళీ చేయాలి! 184 00:12:08,270 --> 00:12:10,105 లోపల జనాన్ని బయటకి తరలించండి! 185 00:12:11,565 --> 00:12:13,442 - తన సంగతి ఇక మీరు చూసుకుంటారా? - మేము చూసుకుంటాం. 186 00:12:14,067 --> 00:12:16,361 ఇక పదండి! వెళ్లండి, వెళ్లండి, వెళ్లండి! 187 00:12:19,781 --> 00:12:22,158 హేయ్! హేయ్, నిన్నే! 188 00:12:22,159 --> 00:12:23,409 ఎక్కడికి వెళ్తున్నావు? 189 00:12:23,410 --> 00:12:24,869 ఇక్కడే ఉండు! 190 00:12:24,870 --> 00:12:28,248 - నువ్వు లోపలికి వెళ్లకూడదు! - లోపల ఇంకా జనం ఉన్నారు! 191 00:12:34,087 --> 00:12:37,424 పది నిమిషాల్లో నువ్వు తిరిగి రాకపోతే, నిన్ను తీసుకురావడానికి ఇంకో మనిషిని పంపిస్తాను! 192 00:12:59,780 --> 00:13:00,906 సరే. 193 00:13:23,262 --> 00:13:24,763 నా గర్ల్ ఫ్రెండ్ కనిపించడం లేదు. 194 00:13:29,017 --> 00:13:29,893 హేయ్! 195 00:13:33,981 --> 00:13:35,023 హేయ్! 196 00:13:35,816 --> 00:13:38,150 బయటకి వెళ్లు! త్వరగా! 197 00:13:38,151 --> 00:13:39,486 మరి ఈ మనుషుల సంగతి ఏంటి? 198 00:13:40,612 --> 00:13:41,821 నేను చెప్పేది విను, డాక్టర్. 199 00:13:41,822 --> 00:13:42,990 మనం వెంటనే బయటకి వెళ్తున్నాం. 200 00:13:47,286 --> 00:13:48,787 సాయం చేయండి! 201 00:13:50,455 --> 00:13:51,455 సాయం చేయండి! 202 00:13:51,456 --> 00:13:52,624 హలో? 203 00:13:54,418 --> 00:13:55,710 సాయం చేయండి! 204 00:13:55,711 --> 00:13:58,088 ఇదిగో, కనీసం ఈ రెస్పిరేటర్ అయినా తీసుకువెళ్లు. 205 00:14:01,842 --> 00:14:02,885 హలో! 206 00:14:03,427 --> 00:14:04,886 ఎవరికైనా నా మాట వినబడుతోందా? 207 00:14:04,887 --> 00:14:06,263 సాయం చేయండి! 208 00:14:07,431 --> 00:14:09,183 హలో? ఎవరికైనా నా మాట వినిపిస్తోందా? 209 00:14:18,192 --> 00:14:20,944 పోలీస్ 210 00:14:23,238 --> 00:14:24,531 అతడిని బయటకి లాగుతున్నాం! 211 00:14:29,995 --> 00:14:31,370 ఇది ఘోరంగా ఉంది! 212 00:14:31,371 --> 00:14:33,457 వెళదాం రండి! బయటకి పదండి, వెంటనే! 213 00:14:46,094 --> 00:14:48,971 - నీ పేరు ఏంటి, మిత్రమా? - ఆక్సెల్. ఆక్సెల్ విటె. 214 00:14:48,972 --> 00:14:50,891 మనం బయటపడతాం, ఆక్సెల్! 215 00:14:53,727 --> 00:14:56,021 అంతా బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. 216 00:14:59,733 --> 00:15:00,651 సరే. 217 00:15:11,411 --> 00:15:15,039 మేమిద్దరం కలిసి లోపలే ఉన్నాం, కానీ ఆ తరువాత ఆమె కనిపించలేదు ఇంకా తన ఫోన్ కూడా స్విచాఫ్ అయింది. 218 00:15:15,040 --> 00:15:19,210 - దయచేసి మీరు... నా మాట మీకు వినిపిస్తోందా? - హా, వినిపిస్తోంది. కానీ ముందు నువ్వు కూర్చో. 219 00:15:19,211 --> 00:15:22,463 - ఆమె ఇక్కడ ఉందా లేదా అది చెప్పు చాలు! - ప్రశాంతంగా ఉండు, ప్లీజ్. 220 00:15:22,464 --> 00:15:25,508 తను ఇక్కడ ఉందా లేదా అనేది మీరు చెబితే నేను ప్రశాంతంగా ఉంటాను! 221 00:15:25,509 --> 00:15:28,679 ముందు కూర్చో, డామిట్! 222 00:15:30,597 --> 00:15:31,640 జనా ఎక్కడ? 223 00:15:34,434 --> 00:15:36,395 - జనా ఎక్కడ ఉందో తెలుసా? - అదిగో అక్కడ ఉంది. 224 00:15:44,236 --> 00:15:45,403 ఇక్కడ ఏం చేస్తున్నావు? 225 00:15:45,404 --> 00:15:46,655 సాయం చేస్తున్నా. 226 00:15:47,489 --> 00:15:49,241 - నువ్వు ఇక్కడికి రాకూడదు. - ఏంటి? 227 00:15:49,867 --> 00:15:51,242 జనా, మాకు ప్రోపోఫోల్ కావాలి! 228 00:15:51,243 --> 00:15:52,410 నేను వెళ్లి తీసుకువస్తాను. 229 00:15:52,411 --> 00:15:53,829 నీ చేత్తో దాన్ని కాసేపు పట్టుకుంటావా? 230 00:15:54,788 --> 00:15:56,289 నన్ను పని చేయనివ్వు! 231 00:15:56,290 --> 00:15:58,082 ఇవన్నీ వినడానికి నాకు టైమ్ లేదు. 232 00:15:58,083 --> 00:15:59,959 ఇక్కడ పరిస్థితి నీకు కనిపించడం లేదా? 233 00:15:59,960 --> 00:16:03,880 నువ్వు ఉన్న స్థితిలో సాయం చేస్తావంటే ఎవరూ నమ్మలేరు! 234 00:16:03,881 --> 00:16:05,340 లేదు, నేను వైద్యం చేయగలను! 235 00:16:15,976 --> 00:16:18,311 నువ్వు డ్రగ్స్ మోతాదుకి మించి తీసుకుని దాదాపు చనిపోబోయావు. 236 00:16:18,312 --> 00:16:19,521 అవును. 237 00:16:20,814 --> 00:16:22,524 ఓవర్ డోసు! 238 00:16:24,735 --> 00:16:25,736 అవును. 239 00:16:30,324 --> 00:16:32,242 నువ్వు చికిత్స తీసుకోకుండా వచ్చి వైద్యం చేయలేవు. 240 00:16:35,913 --> 00:16:36,787 అయితే... 241 00:16:36,788 --> 00:16:38,122 సరే, నాకు మోర్ఫిన్ ఇవ్వు. 242 00:16:38,123 --> 00:16:39,917 అది నాకు మత్తు వదిలిస్తుంది. 243 00:16:41,877 --> 00:16:43,419 - ఏంటి? - నాకు మోర్ఫిన్ ఇవ్వు. 244 00:16:43,420 --> 00:16:45,254 అప్పుడు పని చేయగలుగుతాను! 245 00:16:45,255 --> 00:16:47,840 జనా, పక్కటెముకల ఫ్రాక్చర్ కేసు నాలుగు నిమిషాల్లో వస్తుంది. 246 00:16:47,841 --> 00:16:50,635 ఆ పేషంట్ ని ఎమీనాకి అప్పగించగలవా, ప్లీజ్? 247 00:16:50,636 --> 00:16:51,761 ఆమె బిజీగా ఉంది. 248 00:16:51,762 --> 00:16:56,974 ఇంకొకరు తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్నారు, నలభై శాతం ఒళ్లు కాలిపోయింది. 249 00:16:56,975 --> 00:16:59,394 అదిగో! ఆ చికిత్స నేను చేస్తాను. 250 00:17:08,403 --> 00:17:10,988 జెన్నీ, నీ దగ్గర మందుల అల్మారా తాళం ఉందా? 251 00:17:10,989 --> 00:17:12,074 ఉంది. 252 00:17:15,035 --> 00:17:18,287 సరే, ఆ పక్కటెముకల ఫ్రాక్చర్ కేసుని బెన్ చూస్తాడు, 253 00:17:18,288 --> 00:17:21,541 కాలిన గాయాల కేసుని ఎమీనా చూస్తుంది, మిగతా రెడ్ ట్యాగ్ కేసుల్ని నేను చూస్తాను. సరేనా? 254 00:17:42,521 --> 00:17:44,064 నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసు అనుకుంటా. 255 00:18:00,038 --> 00:18:01,247 సరే, ఈ పేషంట్ పరిస్థితి ఏంటి? 256 00:18:01,248 --> 00:18:04,375 పక్కటెముకల ఫ్రాక్చర్, ఇరుక్కుపోయాడు, న్యూమోథోరాక్స్ టెన్షన్ లేదు. 257 00:18:04,376 --> 00:18:06,669 ఆగి ఆగి శ్వాస పీలుస్తున్నాడు కానీ రక్తపోటు తగ్గిపోతోంది, 258 00:18:06,670 --> 00:18:08,212 అది 90, 65 ఉంది, గుండె వేగంగా కొట్టుకుంటోంది. 259 00:18:08,213 --> 00:18:09,380 సరే, ట్రౌమా రూమ్ కి తీసుకురండి. 260 00:18:09,381 --> 00:18:11,466 నువ్వు బయటే ఉండాలి, సారీ. 261 00:18:20,517 --> 00:18:21,894 నువ్వు వేచి ఉంటావా? 262 00:18:22,895 --> 00:18:25,730 సరే, ఒకటో నెంబరు గదికి తీసుకురండి, అతని శ్వాస కోశాల్ని మనం పరిశీలించాలి. 263 00:18:25,731 --> 00:18:29,233 - బెన్, ఇక్కడ ఏం చేస్తున్నావు? - ఇప్పుడు కాదు, జనా అనుమతి ఇచ్చింది. 264 00:18:29,234 --> 00:18:32,237 నీజిరీ, నాకు ప్రోపోఫోల్ కావాలి. తనని పై అంతస్తుకి తరలించచ్చు. 265 00:18:32,738 --> 00:18:34,281 త్వరగా చేయండి, ప్లీజ్. 266 00:18:35,115 --> 00:18:36,700 త్వరగా, అతను చావుబతుకుల మధ్య ఉన్నాడు. 267 00:18:38,493 --> 00:18:39,744 అతడిని కదిలించండి. 268 00:18:39,745 --> 00:18:42,623 మూడు, రెండు, ఒకటి... 269 00:18:43,248 --> 00:18:44,917 మంచిది. అది పని చేసింది. 270 00:18:46,627 --> 00:18:48,378 త్వరపడండి, ప్లీజ్. 271 00:18:49,254 --> 00:18:50,839 పుర్రె భాగం స్థిరంగా ఉంది. 272 00:18:52,132 --> 00:18:54,050 - శ్వాస కోశంలోకి ట్యూబు ఎక్కిస్తున్నాం. - ఎడమ వైపు స్థిరంగా లేదు. 273 00:18:54,051 --> 00:18:56,219 తుంటి భాగం స్థిరంగా ఉంది. 274 00:18:56,220 --> 00:18:57,930 బ్లడ్ ప్రెషర్ గుర్తించలేకపోతున్నాం. 275 00:18:58,555 --> 00:19:00,431 మేము 'ఎ' ఫిక్స్ చేస్తున్నాం. ఇది చాలా అరుదైనది. 276 00:19:00,432 --> 00:19:02,308 సరే, ఇతనికి ఇంకో యూనిట్ 'ఓ' నెగెటివ్ రక్తం ఎక్కించండి. 277 00:19:02,309 --> 00:19:06,396 మనకి ఇంకో ఐదు యూనిట్ల రక్తం ఇంకా రెండు తాజా ఫ్రోజెన్ ప్లాస్మాలు కావాలని బ్లడ్ బ్యాంక్ కి చెప్పండి! 278 00:19:07,064 --> 00:19:08,524 ఇది పట్టుకో, ప్లీజ్! 279 00:19:09,107 --> 00:19:10,691 నొక్కు. అదీ. 280 00:19:10,692 --> 00:19:12,944 కార్బన్ డయాక్సయిడ్ పెరుగుతోంది. ఇతనికి వెంట్ పెట్టారు. 281 00:19:12,945 --> 00:19:14,488 అయితే గాలి లోపలికి వెళుతోందా? 282 00:19:15,113 --> 00:19:16,323 - ఏదీ అడ్డుకోవడం లేదు. - మంచిది. 283 00:19:17,991 --> 00:19:20,576 రక్తపోటు పెరిగిపోతోంది, బహుశా లోపల బ్లీడింగ్ అవుతోంది అనుకుంటా. 284 00:19:20,577 --> 00:19:22,913 - కడుపు ఎలా ఉంది? - గట్టిగా రాయిలా ఉంది. 285 00:19:23,914 --> 00:19:25,999 నాకు జెల్ కావాలి. ఒలీవియా, జెల్ ఇవ్వు, ప్లీజ్! 286 00:19:29,211 --> 00:19:30,337 థాంక్స్. 287 00:19:31,588 --> 00:19:33,257 కాలేయం బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. 288 00:19:36,718 --> 00:19:38,929 సరే. ఇక్కడ చాలా ద్రవాలు ఉన్నాయి. 289 00:19:39,596 --> 00:19:41,557 ప్లీహంలో ప్రతిధ్వనులు తీవ్రంగా ఉన్నాయి. లోపల రక్తస్రావం అవుతోంది! 290 00:19:43,976 --> 00:19:46,352 - గుండె కొట్టుకోవడం లేదు. - నాకు నాడి అందడం లేదు. 291 00:19:46,353 --> 00:19:47,603 చెత్త, చెత్త, చెత్త! 292 00:19:47,604 --> 00:19:49,273 బెడ్ కిందికి దించండి! 293 00:19:50,983 --> 00:19:52,317 ఆడ్రెనలైన్ ఇస్తున్నాం. 294 00:19:54,862 --> 00:19:57,072 రక్తస్రావాన్ని ఆపనంతవరకూ మనం ఏం చేసినా ప్రయోజనం ఉండదు. 295 00:19:58,073 --> 00:19:59,574 ఇరవై ఎనిమిది, ఇరవై తొమ్మిది, ముప్పై. 296 00:19:59,575 --> 00:20:00,783 ఎవరైనా ఇది చేయండి, ప్లీజ్! 297 00:20:00,784 --> 00:20:01,742 తీసుకోండి. 298 00:20:01,743 --> 00:20:03,619 నీజిరీ, నాకు ఆపరేషన్ పరికరాలన్నీ కావాలి. 299 00:20:03,620 --> 00:20:06,497 స్కాల్పెల్, రిట్రాక్టర్లు, మీరు తీసుకురాగలిగినవి అన్నీ తెండి, సరేనా? 300 00:20:06,498 --> 00:20:08,083 నువ్వు ఇక్కడే ఆపరేట్ చేస్తావా? 301 00:20:10,419 --> 00:20:11,836 అవును, ఖచ్చితంగా. అతని శరీరాన్ని తెరవాలి. 302 00:20:11,837 --> 00:20:15,423 సరే. అందరూ, విన్నారుగా. మనం ఎమర్జెన్సీ లాపరోటోమీ చేస్తున్నాం. 303 00:20:15,424 --> 00:20:16,884 నేను వెళ్లి వాటిని తీసుకుని వస్తాను... 304 00:20:33,525 --> 00:20:35,485 సాయం చేయండి! 305 00:20:41,575 --> 00:20:42,701 హలో? 306 00:20:44,036 --> 00:20:45,578 హలో? 307 00:20:45,579 --> 00:20:48,165 హేయ్! హేయ్! హేయ్! 308 00:20:57,925 --> 00:20:59,176 ప్లీజ్ వద్దు. 309 00:21:00,093 --> 00:21:01,136 మనం ఇది చేయగలం. 310 00:21:26,495 --> 00:21:28,162 కంట్రోల్ సెంటర్, మేము వచ్చాం. 311 00:21:28,163 --> 00:21:30,624 పోలీస్ ఆఫీసర్, తీవ్రమైన కాలిన గాయాలు. 312 00:21:38,924 --> 00:21:40,132 నీకు స్పర్శ తెలుస్తోందా? 313 00:21:40,133 --> 00:21:41,509 ఎమీనా! 314 00:21:41,510 --> 00:21:42,970 - ఏంటి? - ఎమీనా! 315 00:21:43,637 --> 00:21:46,931 - కాలిన గాయాలతో ఉన్న పేషంట్ వచ్చాడు. - వస్తున్నా. నువ్వు ఇది చూసుకుంటావా? 316 00:21:46,932 --> 00:21:49,308 ఆక్సిజన్ లెవెల్ ని స్థిరంగా ఉంచి ఆర్టిరియల్ బ్లడ్ గ్యాస్ ని గమనిస్తూ ఉండు. 317 00:21:49,309 --> 00:21:50,768 అలాగే. 318 00:21:50,769 --> 00:21:52,311 బెన్, నేను ఇక్కడే ఉన్నాను. 319 00:21:52,312 --> 00:21:54,272 క్లబ్ లో తొక్కిసలాటలో నా పేషంట్ గాయపడ్డాడు. 320 00:21:54,273 --> 00:21:55,898 స్పెలెనిక్ ఆర్టరీ చీలిపోయింది. 321 00:21:55,899 --> 00:21:58,401 - నా అవసరం ఉందా? - లేదు, వేరే పేషంట్ సంగతి చూడు. 322 00:21:58,402 --> 00:21:59,528 నేను చూసుకుంటాను. 323 00:22:05,909 --> 00:22:07,327 కంగారుపడకండి, మిస్టర్ విటె. 324 00:22:11,915 --> 00:22:13,125 విటె? 325 00:22:29,141 --> 00:22:30,809 ఆక్సెల్ విటె... 326 00:22:31,852 --> 00:22:33,395 నలభై నాలుగు, 327 00:22:34,605 --> 00:22:36,022 పోలీస్ ఆఫీసర్... 328 00:22:36,023 --> 00:22:37,315 ఎమీనా. 329 00:22:37,316 --> 00:22:39,818 ...ఆఫ్రిమ్ ఏర్టాన్ ని కోమాలోకి వెళ్లేలా కొట్టాడు. 330 00:22:45,324 --> 00:22:46,325 ఎమీనా? 331 00:22:48,160 --> 00:22:49,411 బాగా కోలుకో. 332 00:22:50,746 --> 00:22:52,580 ఎమీనా, అంతా బాగానే ఉందా? 333 00:22:52,581 --> 00:22:54,541 ఎమీనా, హేయ్! 334 00:22:55,542 --> 00:22:57,127 హేయ్, నువ్వు ఇక్కడికి రావాలి! 335 00:22:58,086 --> 00:22:59,755 నువ్వు చేయగలిగింది చేయి, సరేనా? 336 00:23:02,174 --> 00:23:03,217 ఎమీనా... 337 00:23:06,011 --> 00:23:07,471 ఏం చేస్తున్నావు? 338 00:23:08,096 --> 00:23:09,263 నేను అతనికి చికిత్స చేయను. 339 00:23:09,264 --> 00:23:11,140 నువ్వు సాయం చేయకపోతే అతను చనిపోతాడు. 340 00:23:11,141 --> 00:23:13,018 నా నుంచి ఏం ఆశిస్తున్నావు? 341 00:23:14,770 --> 00:23:16,979 నువ్వు జోక్యం చేసుకోకు, నీకు కనీసం అవగాహన లేదు! 342 00:23:16,980 --> 00:23:18,565 నన్ను ఒంటరిగా వదిలేయ్! 343 00:23:22,528 --> 00:23:23,820 నిజంగా అంటున్నావా? 344 00:23:25,948 --> 00:23:27,991 ఒక మనిషి చనిపోతున్నాడు. 345 00:23:31,995 --> 00:23:33,080 వెళ్లు. 346 00:23:35,624 --> 00:23:36,791 సరే. 347 00:23:36,792 --> 00:23:38,043 చాలా దారుణం. 348 00:23:44,508 --> 00:23:45,508 స్వాబ్ ఇవ్వు, ప్లీజ్! 349 00:23:45,509 --> 00:23:46,634 మరింత ఒత్తిడి పెట్టాలి! 350 00:23:46,635 --> 00:23:47,885 ఇతని రక్తంలో యాసిడ్ శాతం పెరిగిపోతోంది. 351 00:23:47,886 --> 00:23:49,887 రెండో ఆర్.సి.సి. సిద్ధం అయింది. 352 00:23:49,888 --> 00:23:50,888 సరే, రిట్రాక్టర్. 353 00:23:50,889 --> 00:23:52,807 రెండు కొషర్ క్లాంపుల్ని సిద్ధం చేయండి. 354 00:23:52,808 --> 00:23:55,184 - పట్టుకో, ప్లీజ్. - బెన్, కంప్రెషన్లు ఇవ్వు. 355 00:23:55,185 --> 00:23:56,310 అవును, అవును. 356 00:23:56,311 --> 00:23:59,021 నేను ఆ నరాన్ని నొక్కి పట్టి ఉంచాలి. 357 00:23:59,022 --> 00:24:00,231 ఛ. 358 00:24:00,232 --> 00:24:01,525 ప్యాడ్స్ ఇవ్వండి, ప్లీజ్. 359 00:24:02,359 --> 00:24:04,236 నాకు కనిపించడం లేదు. ఆస్పిరేటర్ పెట్టండి! 360 00:24:05,571 --> 00:24:06,612 చాలా రక్తం పోతోంది. 361 00:24:06,613 --> 00:24:07,865 ఆస్పిరేటర్... 362 00:24:08,532 --> 00:24:10,659 కార్డియాక్ మసాజ్ చేస్తూ ఉండండి. 363 00:24:11,201 --> 00:24:12,202 సరే. 364 00:24:15,414 --> 00:24:16,957 నాకు స్పందన తెలియడం లేదు. 365 00:24:17,457 --> 00:24:19,209 మోర్ఫిన్ ఇంజెక్ట్ చేశాను. 366 00:24:21,587 --> 00:24:22,753 నేను సాయం చేయనా? 367 00:24:22,754 --> 00:24:23,881 కాళ్ల సంగతి చూడు, ప్లీజ్. 368 00:24:30,637 --> 00:24:31,680 ఇంకో టిష్యూ ఇవ్వు... 369 00:24:35,809 --> 00:24:38,228 ఛ, ఆ ఆర్టరీ ఎక్కడ ఉంది? 370 00:24:40,272 --> 00:24:41,648 నేనే దానిని కనుక్కోవాలి అనుకుంటా... 371 00:24:42,983 --> 00:24:44,193 చెత్త. 372 00:24:47,279 --> 00:24:50,239 ఆ ద్రవం అలా పారనివ్వు ఇంకా ఆ గొట్టాన్ని పెట్టు, నీజిరీ. 373 00:24:50,240 --> 00:24:54,244 ఆన్నా, శ్వాస కోశాలు మూసుకుపోవడానికి ముందే ట్యూబ్ పెట్టాలి. ట్యూబ్ సైజు ఎనిమిది. 374 00:25:09,635 --> 00:25:12,053 - బెన్, ఇతను చేజారిపోతున్నాడు. - ఇంకా ద్రవాలు అందించు. 375 00:25:12,054 --> 00:25:13,596 రింగర్స్ లాక్టేట్ ఇంకో లీటరు కావాలి. 376 00:25:13,597 --> 00:25:15,723 ఆ బీప్ శబ్దాన్ని ఆఫ్ చేస్తావా? 377 00:25:15,724 --> 00:25:17,517 ఆడ్రెనలైన్ ని సిద్ధం చేయండి. 378 00:25:17,518 --> 00:25:18,935 సరే, కార్డియాక్ మసాజ్ కోసం కాసేపు ఆపండి. 379 00:25:18,936 --> 00:25:20,436 ఆపు. ఆ ఫీల్ కలగాలి... 380 00:25:20,437 --> 00:25:22,147 ఐదు మైక్రోగ్రాముల ఎపినఫ్రీన్. 381 00:25:25,275 --> 00:25:27,986 - నాకు ఇంకా ఎలాంటి స్పందన తెలియడం లేదు. - కంప్రెషన్లు! 382 00:25:28,946 --> 00:25:31,030 బెన్, ఇతనిలో రక్తప్రసరణ జరగడం లేదు. 383 00:25:31,031 --> 00:25:32,866 నాకు తెలుసు, నాకు తెలుసు, బాబు! 384 00:25:34,326 --> 00:25:35,619 సరే, వదిలేయ్! 385 00:25:40,707 --> 00:25:43,377 సరే, వదిలేయ్, బెన్, వదిలేయ్... 386 00:25:46,171 --> 00:25:47,214 ఆగు... 387 00:25:49,466 --> 00:25:50,466 సరే... 388 00:25:50,467 --> 00:25:53,053 నాకు దొరికింది అనుకుంటా. ఏదో తలుగుతోంది అనిపిస్తోంది. 389 00:25:54,304 --> 00:25:55,556 క్లాంప్ ఇవ్వండి, ప్లీజ్! 390 00:26:00,227 --> 00:26:01,311 ఇంక స్పందించు. స్పందించు... 391 00:26:03,480 --> 00:26:04,313 సరే. 392 00:26:04,314 --> 00:26:08,193 క్లాంప్ అతికించడం అయింది. ఇక నేను చూసుకుంటాను. నాకు మరిన్ని యూనిట్లు తీసుకురండి, సరేనా? 393 00:26:10,529 --> 00:26:11,697 స్పందించు. 394 00:26:14,616 --> 00:26:15,784 స్పందించు! 395 00:26:18,078 --> 00:26:20,455 ఆగు, నాకు నాడి అందింది అనుకుంటా. 396 00:26:21,373 --> 00:26:23,709 బెన్! 397 00:26:24,334 --> 00:26:27,087 మనకి నాడి అందింది. కార్బన్ డయాక్సయిడ్ పెరుగుతోంది. 398 00:26:28,088 --> 00:26:30,256 ఇరవై నాలుగు... ముప్పై... 399 00:26:30,257 --> 00:26:33,135 - ఇక ఆపరేషన్ రూమ్ కి అప్పగిస్తున్నా. - అలాగే. 400 00:26:43,854 --> 00:26:46,105 సరే, ఒలీవియా, ఇక్కడి నుండి నేను చూసుకుంటాను. 401 00:26:46,106 --> 00:26:47,274 థాంక్యూ. 402 00:26:56,658 --> 00:26:59,745 ఇతనిని చల్లని వస్త్రాలతో చుట్టాలి. కాలిన గాయాలకి చికిత్స చేసే టీమ్ ఎక్కడ? 403 00:27:03,749 --> 00:27:05,458 నువ్వు ఇంట్లోనే ఉంటానని చెప్పావు కదా. 404 00:27:05,459 --> 00:27:06,710 అవును. 405 00:27:10,380 --> 00:27:12,049 - కియాన్, ఇక చూసుకుంటావా? - అలాగే. 406 00:27:32,277 --> 00:27:33,362 ఒలీవియా! 407 00:27:42,037 --> 00:27:43,163 సారీ. 408 00:27:45,749 --> 00:27:46,834 దేనికి? 409 00:27:49,086 --> 00:27:50,963 నువ్వు నన్ను ఒంటరిగా వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు. 410 00:27:55,050 --> 00:27:56,176 సారీ. 411 00:27:58,053 --> 00:27:59,304 మరేం ఫర్వాలేదు. 412 00:28:03,809 --> 00:28:04,935 థాంక్స్. 413 00:28:07,521 --> 00:28:08,856 దేని కోసం? 414 00:28:13,151 --> 00:28:14,361 నువ్వు నీలా ఉన్నందుకు. 415 00:28:28,709 --> 00:28:30,752 - బయలుదేరుదామా? - అలాగే. 416 00:29:02,034 --> 00:29:04,202 అత్యవసర సేవల బృందాలు 417 00:29:04,203 --> 00:29:06,538 వెంటీ క్లబ్ లో అగ్నిప్రమాద బాధితులలో చివరిగా మిగిలిన వారికి వైద్యసేవలు అందిస్తున్నాయి. 418 00:29:10,751 --> 00:29:12,752 పద, ఒలీవియా, ఇంకొక రౌండ్ వేద్దాం. 419 00:29:12,753 --> 00:29:13,837 అలాగే. 420 00:29:26,767 --> 00:29:28,434 వద్దు, హేయ్! 421 00:29:28,435 --> 00:29:31,103 ఇంక ఎవరినీ మేము అనుమతించలేము. ఈ మొత్తం ప్రదేశం అంతా ప్రమాదకరంగా ఉంది. 422 00:29:31,104 --> 00:29:33,065 అక్కడే ఆగండి, ప్లీజ్. 423 00:29:34,775 --> 00:29:35,817 థాంక్యూ. 424 00:29:39,530 --> 00:29:40,781 సారీ, డోమ్ ఎక్కడ? 425 00:29:41,990 --> 00:29:43,699 డాక్టర్ ఎక్కడ ఉన్నాడు? 426 00:29:43,700 --> 00:29:44,825 డాక్టరా? 427 00:29:44,826 --> 00:29:46,577 ఇక్కడే ఎక్కడో ఉండాలి. 428 00:29:46,578 --> 00:29:48,329 లేదా అతనే వెళ్లిపోయి ఉంటాడు. 429 00:29:48,330 --> 00:29:50,665 కానీ అందరూ బయటకి వచ్చేశారు. నా ఉద్దేశం... 430 00:29:50,666 --> 00:29:51,959 అతను ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు. 431 00:30:23,282 --> 00:30:25,826 సరే, మన పని దాదాపు పూర్తయిపోయింది. 432 00:30:26,410 --> 00:30:27,828 ఇంక సర్దుకుని బయలుదేరుదాం! 433 00:30:34,543 --> 00:30:38,213 ఎక్స్ క్యూజ్ మీ! మీరు ఇప్పటికైనా చెప్పగలరా... 434 00:30:43,719 --> 00:30:46,596 బాధితుల కుటుంబాలకి మీరు ఎప్పుడు సమాచారం అందిస్తారు? 435 00:30:46,597 --> 00:30:48,806 ఇక్కడ ఎంత ప్రాణనష్టం జరిగింది? 436 00:30:48,807 --> 00:30:50,142 డోమ్! 437 00:30:55,564 --> 00:30:56,940 హలో! 438 00:31:00,444 --> 00:31:01,987 డోమ్! 439 00:31:04,698 --> 00:31:05,824 హలో? 440 00:31:10,329 --> 00:31:11,872 డోమ్! 441 00:31:14,917 --> 00:31:16,418 డోమ్! 442 00:31:17,753 --> 00:31:18,962 డోమ్? 443 00:31:20,172 --> 00:31:21,673 డోమ్! 444 00:31:23,133 --> 00:31:24,133 హలో? 445 00:31:24,134 --> 00:31:25,510 డోమ్! 446 00:31:25,511 --> 00:31:26,929 ఒలీవియా? 447 00:31:27,429 --> 00:31:28,638 హలో? 448 00:31:28,639 --> 00:31:31,934 - డోమ్! డోమ్? - ఒలీవియా! 449 00:31:32,726 --> 00:31:34,227 డోమ్! 450 00:31:34,228 --> 00:31:35,521 సాయం చేయండి! 451 00:31:36,355 --> 00:31:37,689 సాయం చేయండి! 452 00:31:38,774 --> 00:31:41,568 డోమ్, నేను వెళ్లి ఎవరినైనా తీసుకువస్తాను, సరేనా? 453 00:31:45,739 --> 00:31:47,823 డోమ్, పైకప్పు కూలేలా ఉంది జాగ్రత్త! 454 00:31:47,824 --> 00:31:49,701 డోమ్! 455 00:31:50,661 --> 00:31:52,037 సాయం చేయండి! 456 00:32:26,154 --> 00:32:27,405 డోమ్, 457 00:32:27,406 --> 00:32:29,616 నేను ఎవరినైనా పిలుస్తాను, సరేనా? 458 00:32:38,250 --> 00:32:41,670 డోమ్, నేను వెళ్లి సాయం అడుగుతాను. నువ్వు ఉన్నచోటే ఉండు, సరేనా? 459 00:33:45,025 --> 00:33:48,278 సరే, ట్రౌమా రూమ్ కి తరలించండి, కాలిన గాయాలకి చికిత్స చేసే టీమ్ కి చెప్పండి. 460 00:33:57,746 --> 00:33:58,622 ఎమీనా. 461 00:33:59,790 --> 00:34:01,041 నువ్వు బాగానే ఉన్నావా? 462 00:34:02,209 --> 00:34:05,587 బాగున్నాను, కొద్దిగా కాగితాల పని చేస్తున్నా. 463 00:34:07,589 --> 00:34:10,926 ఇలాంటి విషయాలలో మా బాస్ చాలా నస పెడుతుంది. 464 00:34:15,097 --> 00:34:17,266 మన ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాం, 465 00:34:18,100 --> 00:34:21,728 ఈ ఘోరమైన ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారందరికీ... 466 00:34:23,188 --> 00:34:25,440 ఇంకా వారి కుటుంబ సభ్యులకి కూడా సంతాపం తెలియజేస్తున్నాం. 467 00:34:26,859 --> 00:34:28,150 ఎక్స్ క్యూజ్ మీ? 468 00:34:28,777 --> 00:34:31,863 సారీ, మీరు దారికి అడ్డుగా నిలుస్తున్నారు. 469 00:34:31,864 --> 00:34:34,782 మీరు ఈ తోవ నుండి తప్పుకోవాలి. ఇదంతా ఏంటి? 470 00:34:34,783 --> 00:34:36,993 మన ఆరోగ్య శాఖ సెనేటర్, నీనా రాథ్స్. 471 00:34:36,994 --> 00:34:39,912 ఆమె పత్రికల వాళ్లతో మాట్లాడటానికి వచ్చారు. 472 00:34:39,913 --> 00:34:42,665 సరే, కానీ ఈ మీడియా సమావేశాన్ని ఇంకెక్కడయినా చేయగలరా? 473 00:34:42,666 --> 00:34:45,335 ఆమె కొద్దిసేపు మీడియా వాళ్లతో మాట్లాడతారు ఆ తరువాత అందరూ వెళ్లిపోతారు. 474 00:34:46,043 --> 00:34:48,129 - డాక్టర్ పార్కర్? - చెప్పండి? 475 00:34:48,130 --> 00:34:51,340 మీరు కూడా మాట్లాడాలని సెనేటర్ కోరుతున్నారు. 476 00:34:51,341 --> 00:34:52,425 వద్దు, థాంక్స్. 477 00:34:52,426 --> 00:34:56,345 ఇలా చూడు, ఏవో రెండు మంచి మాటలు చెప్పు. తరువాత మనం ఇంక ముగించేయచ్చు. 478 00:34:56,346 --> 00:34:57,556 ఎప్పుడూ చేసే పనే ఇది. 479 00:34:58,140 --> 00:34:59,766 రోజు తరువాత రోజు, 480 00:35:00,350 --> 00:35:03,896 ఈ హీరోలూ ఇంకా హీరోయిన్లు 481 00:35:04,771 --> 00:35:08,024 మన బెర్లిన్ ప్రజలందరి కోసం అద్భుతాలు చేస్తుంటారు. 482 00:35:08,025 --> 00:35:10,484 నేను మీకు ఒక అవకాశం ఇవ్వదల్చుకున్నాను 483 00:35:10,485 --> 00:35:15,364 అదేమిటంటే ఎమర్జెన్సీ రూమ్ హెడ్ తన బృందం తరపున మాట్లాడబోయే మాటల్ని మీరు నేరుగా వింటారు, 484 00:35:15,365 --> 00:35:17,951 డాక్టర్ సుజానా పార్కర్. 485 00:35:20,662 --> 00:35:22,206 క్లుప్తంగా చెప్పు. 486 00:35:32,674 --> 00:35:34,051 అలాగే. 487 00:35:34,760 --> 00:35:36,094 థాంక్యూ. 488 00:35:36,637 --> 00:35:38,888 థాంక్యూ, మిస్ రాథ్స్. 489 00:35:38,889 --> 00:35:44,644 ఈ రోజు మాకు చాలా కఠినమైన రోజు. 490 00:35:44,645 --> 00:35:46,230 నా ఉద్దేశం, మనందరికీ కఠినమైనదే. 491 00:35:47,648 --> 00:35:50,692 మొత్తం ఎమర్జెన్సీ రూమ్ టీమ్, మేము ఎప్పుడూ... 492 00:35:54,071 --> 00:35:57,365 చాలా కష్టపడి పని చేస్తుంటాం, 493 00:35:57,366 --> 00:36:01,703 ఇంకా ఈ రోజు కూడా మేము నిస్వార్థంగా సేవలు అందించాం 494 00:36:02,329 --> 00:36:04,373 మేము చేయగలిగింది అంతా చేశాం... 495 00:36:09,628 --> 00:36:14,298 ఎక్స్ క్యూజ్ మీ, మేము అద్భుతాలు చేసే హీరోలు ఇంకా హీరోయిన్లుగా మీరు సంబోధించారు కదా? 496 00:36:14,299 --> 00:36:16,510 కానీ మేము అలాంటి వాళ్లం కాదు. 497 00:36:17,135 --> 00:36:21,557 మిగతా మనుషులకి సాయం చేయాలి అనుకునే మామూలు మనుషులం మేము, 498 00:36:22,224 --> 00:36:27,020 మేము కూడా అలసిపోతాం, ఇంకా అందువల్ల, మేము కూడా తప్పులు చేస్తుంటాం. 499 00:36:31,233 --> 00:36:33,901 మేము నిరంతరం డబుల్ షిఫ్టులలో పని చేస్తుంటాం 500 00:36:33,902 --> 00:36:38,824 ఎందుకంటే మాకు చాలా ఎక్కువ పని ఉంటుంది కానీ మేము మాత్రం చాలా తక్కువమంది ఉన్నాం. 501 00:36:39,867 --> 00:36:45,622 ఎందుకంటే మేము మా పనిని సక్రమంగా చేయడానికి సరిపడా పరికరాలు కూడా మా దగ్గర కొన్నిసార్లు ఉండవు. 502 00:36:47,332 --> 00:36:52,379 ఈ ఎమర్జెన్సీ రూమ్ హెడ్ గా, ఈ హాస్పిటల్ ని మరింత అభివృద్ధి చేయాలని నేను ప్రయత్నించాను, ఇంకా ప్రయత్నిస్తున్నాను. 503 00:36:55,382 --> 00:37:02,306 కానీ అది సాధ్యం కావాలంటే, మరింతమంది ప్రజలకి మెరుగైన వైద్యం అందించాలంటే, నా ముందు... 504 00:37:04,349 --> 00:37:08,187 పేషంట్ల ఆరోగ్యం కన్నా డబ్బు సమస్యలు నిలుస్తున్నాయి. 505 00:37:10,522 --> 00:37:13,025 మాకు మరిన్ని నిధులు కావాలి. 506 00:37:14,568 --> 00:37:17,820 ఇంకా ఈ పరిస్థితి కేవలం క్రాంక్ లో మాత్రమే లేదు, కేవలం బెర్లిన్ కే పరిమితం కాదు, 507 00:37:17,821 --> 00:37:19,489 అంతటా ఇదే పరిస్థితి. 508 00:37:23,619 --> 00:37:25,828 డాక్టర్ పార్కర్ నిజం చెప్పారు. వీరికి నిధులు సరిపడా లేవు, 509 00:37:25,829 --> 00:37:29,625 సిబ్బంది కొరత ఉంది, ఇంకా తగిన వనరులు కూడా లేవు. 510 00:37:33,378 --> 00:37:38,133 ప్రజా వైద్యశాల ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరించడంలో మేము విఫలం అయ్యాం. 511 00:37:40,844 --> 00:37:44,639 నేను ఈ ప్రకటనని మరో అధికారిక వేదిక మీద చేయాలని అనుకున్నాను కానీ, 512 00:37:44,640 --> 00:37:49,352 నేను ముందే చెప్పిన కారణాల వల్ల, ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చింది 513 00:37:49,353 --> 00:37:54,941 అదేమిటంటే ఈ హాస్పిటల్ ని ఒక ప్రముఖ ఆరోగ్య సంస్థకి విక్రయించాలని నిర్ణయించాము, 514 00:37:54,942 --> 00:37:58,152 అదే క్యూర్ పల్స్ ఈక్విటీ, 515 00:37:58,153 --> 00:38:01,572 ఎంతో అనుభవజ్ఞుడైన డాక్టర్ స్టెఫెన్ బెక్ సారథ్యంలో ఈ సంస్థ పని చేస్తుంది. 516 00:38:01,573 --> 00:38:04,867 సమస్యలతో ఉన్న ఈ హాస్పిటల్ ని 517 00:38:04,868 --> 00:38:08,412 ఈ రంగంలో ఎన్నో ఏళ్లుగా రాణిస్తున్న ఒక ప్రైవేటు సంస్థకి అప్పగించడం అనేది 518 00:38:08,413 --> 00:38:11,123 సముచితమైన చర్యగా మేము భావిస్తున్నాం 519 00:38:11,124 --> 00:38:14,544 దాని వల్ల క్రయిజ్ బెర్గ్ ప్రజలకి, 520 00:38:14,545 --> 00:38:18,882 నైకాన్, ఇంకా చెప్పాలంటే, మొత్తం బెర్లిన్ ప్రజలందరికీ ఇది మేలు చేస్తుంది. 521 00:38:20,634 --> 00:38:23,094 ఈ హాస్పిటల్ కి చక్కని భవిష్యత్తుని 522 00:38:23,095 --> 00:38:28,641 క్యూర్ పల్స్ ఈక్విటీ సంస్థ కల్పిస్తుందని 523 00:38:28,642 --> 00:38:33,856 క్రయిజ్ బెర్గ్, నైకాన్ హాస్పిటల్ గా, ప్రైవేటు క్లినిక్ గా ఇది అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. 524 00:39:26,867 --> 00:39:28,826 హేయ్. గుడ్ మార్నింగ్. 525 00:39:28,827 --> 00:39:30,870 డోమ్ మరణించాడని ఇప్పుడే వాళ్లు ఖరారు చేశారు. 526 00:39:30,871 --> 00:39:32,623 తలకి గాయమై చనిపోయాడు. 527 00:39:39,171 --> 00:39:40,671 అవును. 528 00:39:40,672 --> 00:39:42,049 తలకి గాయం. 529 00:39:50,349 --> 00:39:51,558 డోమ్ కోసం. 530 00:39:56,939 --> 00:39:58,232 డోమ్ కోసం. 531 00:40:09,993 --> 00:40:13,872 నేను ఇంకో నిమిషంలో మన టీమ్ ని పిలవబోతున్నాను. వాళ్లకి ఏం చెప్పాలో తెలియడం లేదు. 532 00:40:14,373 --> 00:40:17,459 కానీ రేపు మనం చేసే పనిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. 533 00:40:21,088 --> 00:40:23,215 రేపు షెడ్యూలులో నేను ఉన్నాను. 534 00:40:31,098 --> 00:40:33,767 నిన్ను ఈ పరిస్థితిలో పని చేయించలేనని నీకు తెలుసు. 535 00:40:39,481 --> 00:40:40,649 నేను అర్థం చేసుకోగలను. 536 00:40:58,542 --> 00:41:01,711 క్యూర్ పల్స్ అంటే ఆ వృద్ధాశ్రమం నిర్వహించే వెధవలే, కదా? 537 00:41:01,712 --> 00:41:03,045 అవును. 538 00:41:03,046 --> 00:41:03,963 అద్భుతం. 539 00:41:03,964 --> 00:41:07,217 ఈ హాస్పిటల్ ఇంతకన్నా ఘోరంగా ఉండదు అనుకుంటున్న సమయంలో... 540 00:41:08,802 --> 00:41:09,803 హేయ్. 541 00:41:10,888 --> 00:41:12,431 కనీసం మనమంతా ఇక్కడే ఉన్నాం. 542 00:41:13,307 --> 00:41:15,433 వాళ్లు ఏం చేయగలరో చూద్దాం. 543 00:41:15,434 --> 00:41:16,476 "మనం"? 544 00:41:17,019 --> 00:41:18,311 నువ్వు ఉంటున్నావా? 545 00:41:18,312 --> 00:41:20,689 మీకు ఉల్లాసం కలిగించే మనిషి ఎవరైనా ఒకళ్లు ఉండాలి, కాదంటావా? 546 00:41:24,401 --> 00:41:27,320 అన్నట్లు ట్రిక్సీికి ఆడబిడ్డ పుట్టింది. 547 00:41:27,321 --> 00:41:28,739 అది మంచి విషయం. 548 00:41:42,419 --> 00:41:44,129 నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తావా? 549 00:41:49,384 --> 00:41:51,010 లేదు. 550 00:41:51,011 --> 00:41:52,721 నేను ఏం ఆలోచిస్తున్నానంటే... 551 00:41:55,682 --> 00:41:57,893 ఇక్కడ నుండి మన ప్రయాణం ఎలా ఉంటుందో నాకు తెలియదు. 552 00:41:59,102 --> 00:42:00,229 "మన," అంటున్నావా? 553 00:42:01,563 --> 00:42:02,731 నీ ప్రయాణం గురించి అంటున్నాను. 554 00:42:05,359 --> 00:42:06,818 చికిత్స కేంద్రానికి వెళ్లు. 555 00:42:17,037 --> 00:42:19,081 కనీసం నా బదులు ఇంకొకడు నీకు ఉన్నాడు. 556 00:42:21,625 --> 00:42:23,001 ఓహ్, వోకర్... 557 00:42:27,673 --> 00:42:29,883 కనీసం నువ్వు ఏం చెబితే అది వాడు చేస్తాడు. 558 00:42:33,679 --> 00:42:35,472 నీ చికిత్స పూర్తయ్యాక నాకు ఫోన్ చేయి. 559 00:42:40,727 --> 00:42:43,145 కానీ ముందు మనం కలిసి బీర్ తాగుదాం, సరేనా? 560 00:42:43,146 --> 00:42:44,356 అది ఇంక వదిలేయ్. 561 00:43:58,305 --> 00:44:00,307 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్