1 00:01:17,078 --> 00:01:18,288 ఆగు. 2 00:01:45,148 --> 00:01:46,816 అయ్యయ్యో. 3 00:01:46,900 --> 00:01:47,943 అయ్యయ్యో. 4 00:01:50,278 --> 00:01:52,948 శాపాలు! 5 00:02:46,751 --> 00:02:49,671 ప్లీజ్, ప్లీజ్. ఈసారైనా పని చేయ్. 6 00:02:57,220 --> 00:02:58,221 సాధించేశాను. 7 00:02:59,306 --> 00:03:00,432 హమ్మయ్య! 8 00:03:17,824 --> 00:03:20,201 అయ్యయ్యో! ఏం చేశావో చూడు! 9 00:03:20,285 --> 00:03:22,662 నేనా? పిల్లోడా, ఇక్కడ నేను స్కేటింగ్ చేస్తానని నీకు తెలుసు కదా. 10 00:03:23,288 --> 00:03:24,456 నీ వల్ల ఇది పని చేయట్లేదు. 11 00:03:24,539 --> 00:03:26,708 అసలు ఈ సైన్సుకు సంబంధించినవన్నీ ఎందుకు చేస్తున్నావు? 12 00:03:26,791 --> 00:03:29,836 స్కూల్ కి ఇప్పుడే కదా సెలవులు ఇచ్చారు. కొంత కాలం బుర్రకి విరామం ఇవ్వు. 13 00:03:29,920 --> 00:03:31,671 మన ట్రిప్ కోసమని దీన్ని చేస్తున్నా. 14 00:03:32,839 --> 00:03:36,176 హేయ్! ఈ కూజా సుమారుగా 2,300 ఏళ్ల క్రింద టిది. 15 00:03:36,259 --> 00:03:39,638 ఎన్నో యుద్ధాలను, భూకంపాలను, మొంగోల్ ఆక్రమణలను తట్టుకొని నిలబడింది ఇది. 16 00:03:39,721 --> 00:03:42,265 కానీ మీ ఇద్దరి గొడవ వల్ల పగిలిపోబోయింది ఇది. 17 00:03:42,349 --> 00:03:43,934 దాన్ని గుద్దింది వీడు చేసిన డ్రోనే. 18 00:03:44,017 --> 00:03:46,561 కానీ… తను నన్ను గుద్దేసింది. 19 00:03:46,645 --> 00:03:49,981 నీ డ్రోన్ పని చేసేలా చేసినందుకు నీ మీద గర్వంగానే ఉంది, 20 00:03:50,065 --> 00:03:52,150 కానీ దీన్ని ఇంటి లోపల నువ్వు ఎగరవేయకూడదు. 21 00:03:52,234 --> 00:03:55,111 నీకు కూడా ఇంట్లో స్కేటింగ్ చేయవద్దన్ని ఎన్నిసార్లు చెప్పా? 22 00:03:55,612 --> 00:03:57,447 పదహారు సార్లు. 23 00:03:57,530 --> 00:03:59,282 వేసవి సెలవులంతా ఇలాగే రచ్చరచ్చ చేస్తూ ఉంటారా? 24 00:04:06,623 --> 00:04:08,250 నాకు ఇష్టమైన సమయం వచ్చేసింది. 25 00:04:15,298 --> 00:04:16,882 దాగుడు మూతలు ఆడే సమయమైంది. 26 00:04:16,966 --> 00:04:18,552 ఇక మేము ఆడుకోవచ్చా? 27 00:04:19,678 --> 00:04:20,845 -థ్యాంక్స్, అమ్మా. -థ్యాంక్స్, అమ్మా. 28 00:04:32,399 --> 00:04:34,150 అందరూ దాక్కొని ఉన్నారా? నేను వచ్చేస్తున్నా మరి! 29 00:05:01,386 --> 00:05:04,139 అబ్బా, ఈసారి దొరకను అనుకున్నానే. 30 00:05:04,890 --> 00:05:06,892 ఆధారాలను ఫాలో అయితే సరి. 31 00:05:21,573 --> 00:05:23,450 తను ఇక్కడ లేదు. వెళ్దాం పద. 32 00:05:42,594 --> 00:05:44,387 డిన్నర్ సిద్ధంగా ఉంది. పదండి, పిల్లలూ. 33 00:05:44,888 --> 00:05:47,182 సారీ. అప్పటికీ వెళ్లిపోదాం అని ఆయనతో చెప్పా. 34 00:05:51,061 --> 00:05:55,190 నన్ను ఎలా కనిపెట్టావో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. నా అడుగు జాడలు తెలీకుండా కూడా జాగ్రత్త పడ్డాను. 35 00:05:55,273 --> 00:05:59,110 హనీ, నేను ఈ ఇంట్లో పెరిగినవాడిని. రహస్యంగా ఎక్కడెక్కడ దాక్కోవచ్చో, అవన్నీ నాకు తెలుసు. 36 00:05:59,194 --> 00:06:00,695 కంగారు పడకు, పాండోరా. 37 00:06:00,779 --> 00:06:04,157 దాక్కోవడానికి కొత్త ప్రదేశాలను కనిపెట్టడానికి ఈ వెసవి సెలవులను పూర్తిగా ఉపయోగించుకో. 38 00:06:04,241 --> 00:06:05,742 వేసవి సెలవులను పూర్తిగానా? 39 00:06:05,825 --> 00:06:08,328 నువ్వు వెళ్లే యాత్రకు మమ్మల్ని తీసుకెళ్తావు కదా? 40 00:06:08,411 --> 00:06:10,205 హా. ఈ ఏడాది ఎక్కడికి వెళ్తున్నాం? 41 00:06:10,288 --> 00:06:11,831 సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్తున్నామా? 42 00:06:11,915 --> 00:06:13,792 మాయన్ శిథిలాలకు మనం వెళ్లినప్పుడు, నాకు చాలా బాగా నచ్చింది. 43 00:06:13,875 --> 00:06:16,711 ఆంగ్కోర్ వాట్ లో అద్భుతమైన కళాకండాలు చాలా ఉన్నాయి. 44 00:06:16,795 --> 00:06:20,465 నీ పుస్తకానికి ఒక మంచి చాప్టర్ దొరుకుతుంది, మాకు కూడా సెలవుల్లో తిరిగినట్టు ఉంటుంది. 45 00:06:22,092 --> 00:06:25,720 మనం ప్రతీసారి వేసవిలో వెళ్లే ట్రిప్ ని ఈ సారి వాయిదా వేయాల్సి వచ్చేలా ఉంది. 46 00:06:26,304 --> 00:06:28,056 -ఏంటి? -ప్రతీసారి మమ్మల్ని తీసుకెళ్తావు కదా. 47 00:06:28,139 --> 00:06:30,308 ట్రిప్ కి వెళ్తామని, దానికి తగ్గట్టుగా నా సెలవులని ప్లాన్ చేసుకున్నా. 48 00:06:30,850 --> 00:06:31,851 గడువు మారేలా లేదు, 49 00:06:31,935 --> 00:06:34,771 కాబట్టి పుస్తకాన్ని పూర్తి చేయడంపై నేను దృష్టి పెట్టాల్సి ఉంటుంది, 50 00:06:34,854 --> 00:06:36,898 కానీ మీకు అందుకు బదులుగా ఏదోకటి చేస్తా. 51 00:06:36,982 --> 00:06:38,233 హేయ్, ఒకటి చెప్పనా? 52 00:06:38,316 --> 00:06:41,778 రేపు, మీ వేసవి సెలవుల తొలి రోజు సందర్భంగా ఒక స్పెషల్ దాగుడు మూతల ఆట ఆడదాం. 53 00:06:42,654 --> 00:06:43,905 అది బాగుండాలి మరి. 54 00:06:44,406 --> 00:06:46,491 అందుకేనా ఈ మధ్య నువ్వు నీ ఆఫీసు నుండి బయటకు రావట్లేదు? 55 00:06:46,575 --> 00:06:48,410 నువ్వు నిద్రపోతున్నావేమో అనుకున్నా. 56 00:06:48,493 --> 00:06:51,121 ముసలాళ్లు ఎక్కువగా పడుకోవాలి కదా. 57 00:06:51,204 --> 00:06:55,458 నువ్వు అన్నది నిజమే. మేము ముసలాళ్లం, అలసిపోయి ఉన్నాం. 58 00:06:55,542 --> 00:06:58,086 కాబట్టి మీరిద్దరూ టేబుల్ నుండి అన్నీ తీసేసి, పాత్రలు తోమేయండి. 59 00:06:58,169 --> 00:07:00,505 -ఏంటి? -ఏంటి? అది అన్యాయం. 60 00:07:01,673 --> 00:07:05,176 నాతో మాట్లాడకుండా మన వేసవి ట్రిప్ ని రద్దు చేయడం ఏం బాగాలేదు. 61 00:07:05,927 --> 00:07:08,013 నాకు తెలుసు. సారీ. 62 00:07:08,096 --> 00:07:11,808 గడువుల గురించి నువ్వు అసలు చెప్పలేదే. ఇదంతా ఎప్పుడు జరిగింది? 63 00:07:11,892 --> 00:07:14,603 ఈ మధ్యే. చాలా పెద్ద కథలే. 64 00:07:15,103 --> 00:07:17,397 పెద్దదైనా నాకేం పర్లేదని నీకు తెలుసు కదా. 65 00:07:17,480 --> 00:07:19,482 అది కాదు నా ఉద్దేశం. 66 00:07:19,566 --> 00:07:21,192 మరి నీ ఉద్దేశం ఏంటి? 67 00:07:21,276 --> 00:07:26,072 ఆఫీసులో పొద్దుపోయేదాకా గడపడం, హడావిడిగా తిరగడం. నీ గురించి నాకు బాగా తెలుసు. 68 00:07:26,156 --> 00:07:28,700 ఏదో విషయంలో నువ్వు కంగారుపడుతున్నావు, దాన్ని దాచాలని చూస్తున్నావు, 69 00:07:28,783 --> 00:07:30,285 కానీ నువ్వు దాచాల్సిన పని లేదు, 70 00:07:31,411 --> 00:07:32,537 నువ్వు అన్నది నిజమే ఏమో. 71 00:07:33,246 --> 00:07:37,459 నా కుటుంబ చరిత్ర కాస్త విచిత్రంగా ఉంటుందని నీకు చెప్పా కదా? 72 00:07:38,251 --> 00:07:42,339 ఆలెక్స్, మనం అరుదైన కళాఖండాలతో నిండి ఉన్న ఈ భూత్ భంగళాలో ఉంటున్నాం. 73 00:07:42,422 --> 00:07:43,673 మీ కుటుంబం విచిత్రమైనదని నాకు తెలుసు. 74 00:07:44,674 --> 00:07:46,509 సారీ, ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. 75 00:07:46,593 --> 00:07:49,930 మనం ఊరికే అనేక ట్రిప్స్ కి వెళ్తుంటాం కదా, దానికి మీరు అనుకుంటున్న కారణం వేరు, 76 00:07:50,013 --> 00:07:53,433 అసలైన కారణం వేరు. 77 00:07:55,810 --> 00:07:59,022 ఇనుయిట్ సంస్కృతి ప్రకారం, అమ్మానాన్నలు మాట్లాడుకొనే మాటలను చాటుగా వింటే, 78 00:07:59,105 --> 00:08:02,192 వారిని నరకయాతన పెట్టే గుడిసెలో మూడు రోజులు పెట్టి శిక్షించాలి. 79 00:08:02,275 --> 00:08:04,361 ముందుగా, నరకయాతన పెట్టే గుడిసె అంటూ ఏమీ లేదు. 80 00:08:04,444 --> 00:08:06,571 రెండవది ఏంటంటే, నేనేమీ మీ మాటలను చాటుగా వినట్లేదు. 81 00:08:06,655 --> 00:08:09,741 నేను ప్లేట్స్ తీసుకోవడానికి వచ్చా. 82 00:08:10,742 --> 00:08:11,952 అవి ఇందాకే తీసుకున్నావు కదా. 83 00:08:14,204 --> 00:08:16,414 గంట మోగింది కాబట్టి, నేను పని చేసుకోవడానికి వెళ్తా ఇక. 84 00:08:16,498 --> 00:08:18,208 నువ్వేదో చెప్తున్నావుగా, ఏంటది? 85 00:08:18,291 --> 00:08:21,086 కాసేపయ్యాక చెప్తాలే. ఏమీ కాదు, కంగారుపడకు. 86 00:08:23,004 --> 00:08:24,005 మాటిస్తున్నాను. 87 00:08:35,225 --> 00:08:37,851 ఇందుకే నువ్వంటే నాకు భలే ఇష్టం, పాండోరా. 88 00:08:37,936 --> 00:08:39,395 నువ్వు అంత తేలిగ్గా పట్టు వదలవు. 89 00:08:43,441 --> 00:08:45,318 నువ్వు ఇక్కడ ఏం చేస్తావో తెలుసుకోవాలనుందంతే. 90 00:08:45,402 --> 00:08:47,696 అర్కియాలజిస్టులందరూ ఇలాగే రహస్యంగా పని చేస్తారా? 91 00:08:48,280 --> 00:08:49,656 అవసరమైనప్పుడు తప్పదుగా. 92 00:08:50,907 --> 00:08:53,076 ప్రస్తుతానికి, నేను ఒంటరిగా పని చేసుకోవాలి. 93 00:09:04,087 --> 00:09:05,672 వెళ్లి పడుకో, పాండోరా. 94 00:09:11,386 --> 00:09:13,471 నీ పిచ్చి సైన్స్ పనులు చేసుకుంటున్నావా? 95 00:09:16,349 --> 00:09:17,934 నువ్వు దాక్కొనే ప్రదేశాన్ని నాన్న కనిపెట్టేశాడా? 96 00:09:18,018 --> 00:09:20,729 హా. ఆయనకి దాక్కొనే ప్రదేశాలని చాలా బాగా తెలుసు. 97 00:09:20,812 --> 00:09:22,564 ఆయన ఆఫీసులో దాక్కొనే ప్రయత్నం ఎందుకు చేస్తావో నువ్వు? 98 00:09:22,647 --> 00:09:24,983 అయన ఎవరినీ రానివ్వడు. అమ్మని కూడా రానివ్వడు. 99 00:09:25,734 --> 00:09:27,319 అదీ చూద్దాం. 100 00:09:35,035 --> 00:09:36,369 నువ్వు వాళ్లకి చెప్పేయాలి. 101 00:09:36,453 --> 00:09:39,497 -వాళ్లు కంగారుపడటం నాకు ఇష్టం లేదు. -వాళ్లు కంగారుపడాలి మరి. 102 00:09:39,581 --> 00:09:41,958 దీన్ని త్వరలోనే పరిష్కరించేస్తా. నాకు తెలుసు. 103 00:09:42,042 --> 00:09:44,252 దీన్ని పరిష్కరించేస్తే, అప్పుడు… 104 00:09:48,882 --> 00:09:51,301 -అయ్యయ్యో. -అయ్యయ్యో. అది జరుగుతోందా? 105 00:09:58,600 --> 00:10:02,062 స్కై, నాకు చాలా సమయం ఉందనుకున్నాను, కానీ పొరబడ్డాను. 106 00:10:02,145 --> 00:10:03,313 నువ్వు… 107 00:10:24,376 --> 00:10:26,002 తమ్ముడు! 108 00:10:26,086 --> 00:10:29,256 వేసవి సెలవుల్లో మొదటి రోజు… 109 00:10:29,339 --> 00:10:31,383 ఎంజాయ్ చేయడానికి, నువ్వు సిద్ధంగా ఉన్నావా? 110 00:10:34,010 --> 00:10:35,971 నాకు చప్పట్లు కొడతారా కాస్త? 111 00:10:37,180 --> 00:10:38,974 ఇదైనా నాకు ఓకే. 112 00:10:44,271 --> 00:10:47,023 గుడ్ మార్నింగ్, అమ్మా. ఏం చేస్తున్నావు? 113 00:10:48,441 --> 00:10:50,652 ప్యాక్స్టన్ మ్యూజియం ఒక కొత్త ప్రదర్శనశాలను ప్రారంభించబోతోంది, 114 00:10:50,735 --> 00:10:53,071 వాళ్లకి ఇంకో కన్జర్వేటర్ కావాలట. 115 00:10:53,154 --> 00:10:54,406 నువ్వు గతంలో అదే చేసేదానివి కదా? 116 00:10:54,489 --> 00:10:55,824 అది పదిహేనేళ్ళ క్రిందటి మాట. 117 00:10:56,408 --> 00:10:59,077 ఒక నిమిషం, నువ్వు మళ్లీ ఉద్యోగంలో చేరాలనుకుంటున్నావా? 118 00:10:59,160 --> 00:11:00,829 మీ అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నా. 119 00:11:00,912 --> 00:11:03,623 మీరు పెద్దవాళ్లు అవుతున్నారు కాబట్టి, నా అవసరం ఇప్పుడు మీకు అంతగా ఉండదులే. 120 00:11:03,707 --> 00:11:05,625 కానీ మా గొడవలను ఎవరు ఆపుతారు? 121 00:11:05,709 --> 00:11:07,502 అమ్మ చెప్పింది నిజమే ఏమో. 122 00:11:07,586 --> 00:11:10,755 ఆస్ట్రేలియాలోని ఆబోరిజినల్ సంస్కృతిలో ఉండుంటే, మేము ఈపాటికి దేశ సంచారం చేస్తూ ఉండేవాళ్లం. 123 00:11:10,839 --> 00:11:13,466 ఇది బయటకు వెళ్లి బతకడం నేర్చుకోవడం గురించి కాదు. 124 00:11:13,550 --> 00:11:16,261 నేను ఆఫీసుకు వెళ్లినప్పుడు మీరు ఇంట్లో బుద్ధిగా ఉండటం గురించి. 125 00:11:16,344 --> 00:11:17,762 నేను బుద్ధిగా ఉండగలను. 126 00:11:17,846 --> 00:11:20,765 మరి నాన్న సంగతేంటి? ఆయన కూడా నీతో పాటు పనికి వస్తాడా? 127 00:11:20,849 --> 00:11:24,561 పాత రోజుల్లోలా, మేమిద్దరం మళ్లీ కలిసి పని చేయడం చాలా బాగుంటుంది. 128 00:11:24,644 --> 00:11:28,565 నాన్న అంటే గుర్తొచ్చింది, ఇంతకీ ఆ ముసలోడు ఎక్కడ? మళ్లీ టేబుల్ మీదే గురకపెడుతూ నిద్రపోతున్నాడా? 129 00:11:29,149 --> 00:11:30,525 ఇదేమీ మొదటిసారి కాదు కదా. 130 00:11:30,609 --> 00:11:33,403 -నేను వెళ్లి లేపి వస్తా. -వద్దు, నేను వెళ్తా. 131 00:11:33,486 --> 00:11:35,530 నువ్వు ఆయన్ని బెదరొగట్టేస్తావు. 132 00:11:36,990 --> 00:11:38,158 ఆలెక్స్? 133 00:11:38,241 --> 00:11:41,369 లోపల లేడే. ఇంటి నుండి బయటకు వెళ్లాడా? 134 00:11:41,453 --> 00:11:44,497 బై చెప్పలేదే. మామూలుగా అయితే, బై చెప్పే వెళ్తాడు బయటకి. 135 00:11:45,332 --> 00:11:48,585 స్పెషల్ దాగుడు మూతల ఆట అన్నాడు కదా, అది ఇక్కడే ఏమో. 136 00:11:48,668 --> 00:11:51,755 నిజమే అయ్యుంటుంది. సరే, ఆధారాల కోసం చూద్దాం. 137 00:12:06,478 --> 00:12:10,649 నాకు తెలుసు! నిన్న రాత్రి నన్ను నాన్న బయటకు పంపేసినప్పుడు, నాకు వినిపించిన శబ్దం ఇదే. 138 00:12:11,149 --> 00:12:12,484 ఇది ఆధారం అంటావా? 139 00:12:13,485 --> 00:12:16,529 చూడు! ఈ బాల్స్ మీద నంబర్లు ఉన్నాయి, 140 00:12:16,613 --> 00:12:18,657 ఇవి రెండు సెట్స్ లో పడ్డాయి. ఒక్కో సెట్ లో మూడు బాల్స్. 141 00:12:21,284 --> 00:12:22,661 ఏదైనా ప్రాంతానికి చెందిన కోఆర్డినేట్స్ లాగా. 142 00:12:38,969 --> 00:12:40,929 రస్, నువ్వు మేధావివబ్బా. 143 00:12:41,012 --> 00:12:42,973 ఇప్పటికైనా తెలుసుకున్నందుకు థ్యాంక్స్. 144 00:12:43,056 --> 00:12:44,766 ఆధారాలను ఫాలో అయితే సరి. 145 00:12:46,476 --> 00:12:48,645 అయ్య బాబోయ్. ఇక్కడ తలుపు ఉంది. 146 00:12:50,647 --> 00:12:51,731 తెరుచుకోవట్లేదు. 147 00:12:51,815 --> 00:12:53,817 ఇందాక నిన్ను మేధావి అన్నా కదా, అది తూచ్. 148 00:12:53,900 --> 00:12:55,318 అబ్బా, ఒకసారి అన్నాక తూచ్ లు కుదరవు. 149 00:12:55,402 --> 00:12:57,153 ఇంతకీ ఈ కోఆర్డినేట్స్ ఏ ప్రాంతానివి? 150 00:12:58,196 --> 00:13:00,407 చైనాలోని బీజింగ్. ఎందుకు? 151 00:13:01,074 --> 00:13:02,742 తలుపు అంటే గడి ఉండాలి కదా? 152 00:13:22,053 --> 00:13:23,430 ఇప్పుడు అమ్మ మేధావి. 153 00:13:23,513 --> 00:13:25,015 అదే అని నీకెలా తెలుసు? 154 00:13:25,098 --> 00:13:26,766 ఈ కూజా మింగ్ డైనస్టీకి చెందినది. 155 00:13:26,850 --> 00:13:28,518 ఇక్కడ ఉన్న వాటిలో ఇదొక్కటై చైనా వస్తువు. 156 00:13:28,602 --> 00:13:29,811 తెలివి బాగానే వాడావు. 157 00:13:30,478 --> 00:13:31,813 పాండోరా, ఆగు. 158 00:13:33,899 --> 00:13:37,110 వావ్! నాన్న నిజంగానే దాగుడు మూతల ఆటను వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. 159 00:13:37,193 --> 00:13:41,072 ఆట పెద్దగా ఉంటుంది అన్నాడు కానీ, మరీ ఇంత పెద్దగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. 160 00:14:05,180 --> 00:14:06,640 ప్యాంట్ తడిపేసుకోకు. 161 00:14:06,723 --> 00:14:08,475 అది బొమ్మ అంతే… 162 00:14:11,686 --> 00:14:13,396 వావ్. 163 00:14:15,774 --> 00:14:17,567 ఈ చోటు ఇక్కడ ఉన్నట్టు నీకు తెలుసా, అమ్మా? 164 00:14:29,913 --> 00:14:32,415 దాక్కొనే ప్రదేశం అంటే ఇలా ఉండాలి. 165 00:14:33,416 --> 00:14:35,835 ఇది ఆటలా అనిపించట్లేదు. 166 00:14:42,008 --> 00:14:43,176 నాన్న! 167 00:15:04,823 --> 00:15:05,824 నాన్నా? 168 00:15:08,660 --> 00:15:10,370 అది విగ్రహం. 169 00:15:10,453 --> 00:15:12,872 నాన్న విగ్రహం ఇక్కడేం చేస్తోంది? 170 00:15:13,623 --> 00:15:16,459 ఏం జరుగుతోంది ఇక్కడ? ఇది ఆటలో భాగమా? 171 00:15:18,044 --> 00:15:19,296 హా? నాన్నా, నువ్వేనా? 172 00:15:20,046 --> 00:15:20,881 ఎక్కడ? 173 00:15:25,343 --> 00:15:26,678 అది నాన్న కాదు. 174 00:15:26,761 --> 00:15:28,555 పరుగెత్తండి! 175 00:15:29,139 --> 00:15:30,348 ఇక్కడికి రండి! 176 00:15:34,394 --> 00:15:36,396 ఇక పీడకలలు వచ్చేస్తాయి! వచ్చేస్తాయి! 177 00:15:40,400 --> 00:15:41,693 అబ్బా, 178 00:16:02,756 --> 00:16:05,926 లైట్ కంట్లో పడుతోంది. నిద్రపోతుంటే ఏంటి ఈ గోల! 179 00:16:10,222 --> 00:16:11,223 అమ్మా? 180 00:16:11,723 --> 00:16:12,891 వస్తున్నా! 181 00:16:20,774 --> 00:16:22,442 నన్ను చంపడం ఆపెహె! 182 00:16:31,660 --> 00:16:33,954 చూసుకో! ఆ గద ఎక్కడిది? 183 00:16:34,037 --> 00:16:36,706 వేరే గదిలో ఉండింది, కానీ ఆ గదంతా ఉచ్చులతో నిండి ఉంది. 184 00:16:36,790 --> 00:16:38,375 ఎందుకు అలా అన్నావు? 185 00:16:45,674 --> 00:16:47,551 ఇప్పుడు నీకు కూడా తెలుస్తుందిలే. 186 00:16:50,971 --> 00:16:52,722 మన ఇల్లు మనపైనే దాడి ఎందుకు చేస్తోంది? 187 00:16:56,560 --> 00:16:57,727 చూసుకో 188 00:17:02,232 --> 00:17:04,818 అటు పద. ఇటు వెళ్తే ఇక అంతే. 189 00:17:04,901 --> 00:17:07,070 -మనం ఇటు కూడా వెళ్లకూడదు. -ఎందుకు? 190 00:17:08,487 --> 00:17:09,989 ఓయ్! ఆగండి! 191 00:17:10,073 --> 00:17:12,534 -ఇప్పుడు మనం ఎటు వెళ్లాలి? -ఇటు పోదాం, త్వరగా పదండి. 192 00:17:15,160 --> 00:17:16,329 ఇప్పుడు మనకేమీ కాదు అనుకుంటా. 193 00:17:20,250 --> 00:17:21,834 మనదేమైనా రాజ వంశమా? 194 00:17:23,460 --> 00:17:27,299 నాకు తెలీదు. కానీ పరిస్థితులను చూస్తుంటే, ఇప్పుడు ఏదైనా సాధ్యం కావచ్చు అనిపిస్తోంది. 195 00:17:39,269 --> 00:17:41,271 సరే, ఇది మాత్రం నన్ను అవాక్కయ్యేలా చేసింది. 196 00:17:42,397 --> 00:17:44,274 పాన్, అన్నిటినీ గెలకడం ఆపు! 197 00:17:44,357 --> 00:17:45,400 ఏదో అనుకోకుండా జరిగింది ఇది. 198 00:17:46,902 --> 00:17:47,944 లాక్ అయిపోయింది. 199 00:17:48,528 --> 00:17:49,529 ఇప్పుడు ఏం చేద్దాం? 200 00:17:50,697 --> 00:17:53,450 సరే, ఆలోచిద్దాం. నాన్న ఆఫీసు గుర్తుంది కదా? 201 00:17:53,533 --> 00:17:55,285 ప్రతీ తలుపుకి గడి ఉంటుంది. 202 00:17:58,121 --> 00:18:00,415 దీనికి కారణం నేనే. నేనే మనల్ని బయటపడేస్తాను. 203 00:18:34,282 --> 00:18:35,575 హమ్మయ్య, బతికిపోయాం. 204 00:18:40,914 --> 00:18:42,374 ప్లీజ్, మరింత జాగ్రత్తగా ఉండండి. 205 00:18:42,457 --> 00:18:44,626 ఇక్కడి సెక్యూరిటీ సిస్టమ్ కి మీరు బలి అయిపోవచ్చు. 206 00:18:44,709 --> 00:18:47,254 ప్రతిసారి నేను ఉండను కదా మిమ్మల్ని కాపాడటానికి. 207 00:18:47,337 --> 00:18:49,297 హా, తల పోతే బాగోదు మరి. 208 00:18:49,381 --> 00:18:51,716 తల జోకులు వేయడానికి ఇది సమయం కాదు, లారీ. 209 00:18:54,970 --> 00:18:57,556 దయచేసి నా వెంట రండి, అన్నీ వివరంగా చెప్తా. 210 00:19:02,060 --> 00:19:04,604 ఈ అంతస్థులోని గదులలో చాలా గదులు మీరు చూసేశారు, 211 00:19:04,688 --> 00:19:07,148 కానీ ఈ చోటు చాలా పెద్దది. 212 00:19:07,232 --> 00:19:10,277 ఇక్కడ టింబక్టు నుండి కాట్మండు దాకా వివిధ ప్రదేశాలకు చెందిన కళాఖండాలు ఉన్నాయి. 213 00:19:10,902 --> 00:19:14,698 తప్పుగా అనుకోకండి, అసలు మీరెవరు? 214 00:19:15,282 --> 00:19:17,075 మన్నించాలి, పరిచయం చేసుకోవాలన్న సంస్కారాన్ని మర్చిపోయా. 215 00:19:17,158 --> 00:19:19,953 ఈ నియంత్రిత చోటుకు మేము సంరక్షకులం. 216 00:19:20,453 --> 00:19:21,621 నా పేరు స్టాన్లీ. 217 00:19:21,705 --> 00:19:26,668 నా పేరు లారీ. సప్త సముద్రాలను గుప్పెట్లో బంధించిన, స్పానిష్ వీరాదివీరుడిని. 218 00:19:29,296 --> 00:19:32,465 ఇతడిని పట్టించుకోకండి, లేదంటే బతికి ఉన్నప్పుడు అది చేశా, ఇది చేశా అని డబ్బా కొట్టుకుంటాడు. 219 00:19:33,049 --> 00:19:34,301 నీకు కుళ్లు. 220 00:19:36,761 --> 00:19:39,014 నా బుర్ర పని చేయట్లేదు. 221 00:19:39,097 --> 00:19:41,433 ఇంతకీ ఆలెక్స్ కి ఏమైంది? అతను బాగానే ఉన్నాడా? 222 00:19:41,516 --> 00:19:43,351 హా, మా నాన్నకి ఏమైంది? 223 00:19:43,935 --> 00:19:45,437 మీకు చాలా ప్రశ్నలు ఉండే ఉంటాయి. 224 00:19:45,520 --> 00:19:49,691 సమయం వచ్చినప్పుడు అన్నిటికీ సమాధానాలు లభిస్తాయి, ప్రస్తుతానికి ఇటు రండి. 225 00:19:49,774 --> 00:19:52,027 ఆలెక్స్ మీకు ఒకటి చూపించాలనుకున్నాడు. 226 00:19:59,284 --> 00:20:00,702 నా కుటుంబం కోసం 227 00:20:02,412 --> 00:20:04,915 హాయ్, స్కై. రస్. పాండోరా. 228 00:20:04,998 --> 00:20:08,001 దీన్ని మీరు చూస్తున్నారంటే, నేను రాయిని అయిపోయి ఉంటా. 229 00:20:08,084 --> 00:20:09,836 లేదా మార్బుల్ అయ్యుంటానేమో? 230 00:20:09,920 --> 00:20:13,215 ఏదేమైనా, నేను ఇలా ఎందుకు అయ్యానంటే… 231 00:20:13,298 --> 00:20:16,426 మన కుటుంబానికి శాపం తగిలింది. 232 00:20:17,177 --> 00:20:20,680 మనం చేసిన పనుల వల్ల కాదు, మన పూర్వీకుల వల్ల. 233 00:20:21,348 --> 00:20:26,853 నిర్దిష్టంగా చెప్పాలంటే, మీ ముత్తాతకు ముత్తాత అయిన, కొర్నీలియస్ వాండర్హూవెన్ వల్ల. 234 00:20:26,937 --> 00:20:28,396 అక్రమ మార్గాల్లో, 235 00:20:28,480 --> 00:20:32,400 ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవరూ సేకరించనంత స్థాయిలో, కొర్నీలియస్ వ్యక్తిగతంగా 236 00:20:32,484 --> 00:20:34,361 చాలా అద్భుతమైన కళాఖండాలను సేకరించాడు. 237 00:20:34,444 --> 00:20:37,656 కానీ కొర్నీలియస్ ఈ కళాఖండాలను కొనుక్కున్నాడు అనుకోవద్దు. 238 00:20:37,739 --> 00:20:40,784 వాటి కోసం అతను ఎంతకైనా తెగించేవాడు. 239 00:20:40,867 --> 00:20:43,119 ఈ మిషన్ లో అతను చాలా దూకుడుగా వ్యవహరించాడు. 240 00:20:43,203 --> 00:20:45,205 ఎక్కువ సేకరించే కొద్దీ, ఇంకా ఎక్కువ కావాలనుకున్నాడు. 241 00:20:45,288 --> 00:20:48,833 అక్రమ మార్గాల్లో సంపాదించిన ఈ వస్తువుల్లో చాలా వాటికి శాపం ఉందని అతనికి తెలుసు, 242 00:20:48,917 --> 00:20:50,835 అది అతనిలో ఇంకా సేకరించాలి అనే కసినే పెంచింది, 243 00:20:50,919 --> 00:20:54,589 కాబట్టి ఈ నియంత్రిత ప్రదేశాన్ని నిర్మించి, ఈ ప్రమాదకరమైన కళాఖండాలని దాచాడు. 244 00:20:55,090 --> 00:20:57,801 చివరికి, అతని అత్యాశే అతని కొంపనే కాకుండా, 245 00:20:57,884 --> 00:21:01,930 మన కొంపను కూడా ముంచింది, ఎందుకంటే, మన వంశం అంతా శాపగ్రస్తమైంది. 246 00:21:02,013 --> 00:21:04,474 నేను చేయని పనులకు, సమస్యల్లో ఇరుక్కోవడం నాకు ఇష్టం ఉండదు. 247 00:21:05,267 --> 00:21:06,643 మీ నాన్న మాటలు విను. 248 00:21:06,726 --> 00:21:09,229 మిమ్మల్ని కంగారుపెట్టకూడదు అనే దీన్ని రహస్యంగా ఉంచాను. 249 00:21:09,312 --> 00:21:11,606 చాలా ఏళ్ల నుండి, నేను ఒక పుస్తకం మీద పని చేస్తున్నానని మీకు చెప్పాను, 250 00:21:11,690 --> 00:21:14,442 కానీ నిజానికి నేను దీనికి పరిష్కారాన్ని కనిపెట్టే పనిలో ఉన్నా. 251 00:21:14,526 --> 00:21:17,237 అందుకే రాత్రుళ్లు పొద్దుపోయేదాకా పని చేస్తున్నా. 252 00:21:17,320 --> 00:21:20,448 నాకు తెలిసి పరిష్కారం ఏంటంటే, సమయం ముగిసే లోపే, ఈ వస్తువుల విషయంలో 253 00:21:20,532 --> 00:21:24,244 జరిగిన తప్పును సరి చేయాలి, లేదంటే వంశంలోని తర్వాతి వ్యక్తి రాయి అయిపోతారు. 254 00:21:24,869 --> 00:21:27,831 ఎందుకంటే నా తర్వాత, పిల్లలైన మీకే ఈ శాపం అంటుకుంటుంది. 255 00:21:27,914 --> 00:21:30,792 ఏంటి, మేము కూడా రాయి అయిపోతామా? 256 00:21:30,875 --> 00:21:33,879 శాపం పోగొట్టగల మార్గాన్ని మీరు కనిపెడితే తప్ప. 257 00:21:33,962 --> 00:21:37,215 ఇప్పటిదాకా మీకు నిజం చెప్పనందుకు సారీ. 258 00:21:37,299 --> 00:21:38,842 ఈ పరిష్కారాన్ని నేను కనిపెట్టలేకపోయి ఉండవచ్చు, 259 00:21:38,925 --> 00:21:42,679 కానీ మీరు ఎంత శక్తివంతులో, ఎంత తెలివిమంతులో నాకు తెలుసు. 260 00:21:42,762 --> 00:21:47,684 ఈ పని ఎవరైనా చేయగలరా అంటే, అది మీరే. మీరు ఏదైనా చేయగల సమర్థులు. 261 00:21:48,602 --> 00:21:50,604 మీరంటే నాకు ప్రాణం. 262 00:22:06,536 --> 00:22:08,580 చింతించకు, నాన్నా. దీన్ని మేము సరి చేస్తాం. 263 00:22:14,002 --> 00:22:15,795 అది ఇంకో భద్రతాపరమైన చర్యనా? 264 00:22:15,879 --> 00:22:19,007 కాదు, ఇంకో కళాఖండం మేలుకున్నట్టు ఉంది. 265 00:22:19,090 --> 00:22:20,342 అలా మేలుకుంటాయా? 266 00:22:20,425 --> 00:22:22,427 అప్పుడప్పుడూ మేలుకుంటుంటాయి. మమ్మల్ని చూస్తుంటే తెలీట్లేదా. 267 00:22:24,638 --> 00:22:26,389 ఏంటది? 268 00:22:26,473 --> 00:22:29,184 నేనే మీ స్థానంలో ఉంటే, పరుగెత్తుతా. పరుగెత్తండి! 269 00:23:02,342 --> 00:23:04,344 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్