1 00:00:27,654 --> 00:00:29,906 ఈరోజు వింతలు ఆగకుండా జరుగుతూనే ఉన్నాయి! 2 00:00:35,412 --> 00:00:37,872 మీ ముగ్గురిని ఇక్కడి నుండి వీలైనంత త్వరగా బయటపడేయాలి. 3 00:00:37,956 --> 00:00:39,332 బయటకు వెళ్లే దారి ఎక్కడ? 4 00:00:39,833 --> 00:00:40,959 ఇక్కడ ఉంది. 5 00:00:42,752 --> 00:00:44,379 ఆగండి! అటు కాదు. 6 00:00:51,303 --> 00:00:54,472 మొదటేమో, కోపంగా ఉన్న ఒక కొండముచ్చు మొహం, ఇప్పుడేమో భయంకరంగా ఉన్న బొమ్మలా? 7 00:00:54,556 --> 00:00:56,850 ఈ రహస్య చోటు నాకు అస్సలు నచ్చలేదు. 8 00:01:30,842 --> 00:01:33,553 పసిడి కొండముచ్చు తల 9 00:01:37,307 --> 00:01:39,267 అది ఎందుకంత కోపంతో ఊగిపోతోంది? 10 00:01:39,351 --> 00:01:40,894 దాని మొండెం ఏమైపోయింది? 11 00:01:40,977 --> 00:01:43,772 మొండాలు లేకపోతే ఏమైనా సమస్యనా? 12 00:01:45,190 --> 00:01:46,983 మనం దాన్ని శాంతపరచవచ్చేమో. 13 00:01:47,067 --> 00:01:50,403 అరణ్య జీవులను ఎలా శాంతపరచాలో నేను కొన్ని టెక్నిక్స్ చదివాను. 14 00:01:50,487 --> 00:01:51,571 అయితే ఆ పని చేయ్. 15 00:01:51,655 --> 00:01:56,076 ప్రయత్నిస్తా. కానీ దాని దగ్గరగా నేను వెళ్లడానికి మీలో ఎవరోకరు దాని దృష్టి మరల్చాలి. 16 00:02:00,497 --> 00:02:02,666 బహుశా ఈ కోతి బొమ్మ వల్ల దాన్ని దృష్టి మరలుతుందేమో చూద్దాం. 17 00:02:30,569 --> 00:02:35,115 అంతా బాగానే ఉంది, నా బంగారు మిత్రమా. శాంతించు. 18 00:02:35,198 --> 00:02:36,616 ఇది పని చేస్తోంది. 19 00:02:42,372 --> 00:02:43,290 స్టాన్లీ! 20 00:02:49,796 --> 00:02:53,091 మనం అనుకున్నట్టు జరగకపోయినా, అది వెళ్లిపోయిందిలే. 21 00:02:58,597 --> 00:03:01,016 అయ్యయ్యో. మనం తలుపు మూయలేదు. 22 00:03:01,099 --> 00:03:02,601 అది ఇప్పుడు ఇంట్లోకి వెళ్లింది. 23 00:03:09,774 --> 00:03:10,817 రండి. 24 00:03:12,527 --> 00:03:16,114 రహస్య చోటుని మేము వదిలి వెళ్లకూడదని చాలా కాలం క్రితం మాకు సూచించడం జరిగింది. 25 00:03:16,197 --> 00:03:18,283 మీరు అక్కడ ఎంత కాలం నుండి ఉంటున్నారు? 26 00:03:18,366 --> 00:03:20,285 వంద ఏళ్లు దాటి ఉంటుంది. 27 00:03:20,368 --> 00:03:23,246 మమ్మల్ని వింతగా చూస్తారని మీ పూర్వీకలు భావించారు. 28 00:03:23,330 --> 00:03:25,165 అది నిజమే కదా. మేము ఎలా ఉన్నామో చూడండి. 29 00:03:25,749 --> 00:03:28,752 హా, అది నిజమే. బహుశా మనం… 30 00:03:28,835 --> 00:03:32,923 ఇప్పుడు అధికారం మా చేతుల్లోకి వచ్చింది. మిమ్మల్ని బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. 31 00:03:33,006 --> 00:03:34,257 ఆజ్ఞాపించాక పాటించాల్సిందే. 32 00:03:50,857 --> 00:03:53,318 థ్యాంక్యూ. మీకు రుణపడి ఉంటా నేను. 33 00:03:58,865 --> 00:04:00,283 అది ఎక్కడికి వెళ్లింది? 34 00:04:02,202 --> 00:04:05,705 అది ఎక్కడికైనా వెళ్లుండవచ్చు. ఇది చాలా పెద్ద ఇల్లు. 35 00:04:05,789 --> 00:04:07,499 మరి వెతకడం ఎక్కడి నుండి మొదలుపెడదాం? 36 00:04:07,582 --> 00:04:09,751 నా పాత సముద్ర దొంగల ఓడలో… 37 00:04:09,834 --> 00:04:11,586 నువ్వు సముద్రపు దొంగవా? 38 00:04:11,670 --> 00:04:14,422 అబ్బా. వీడికి సందు ఇవ్వకండి, రెచ్చిపోతాడు. 39 00:04:14,506 --> 00:04:16,216 మనం తర్వాత మాట్లాడుకుందాం. 40 00:04:16,298 --> 00:04:21,304 ఏదేమైనా, ఎవరైనా దొంగచాటుగా ఓడ ఎక్కినప్పుడు, మేము అంగుళం అంగుళం గాలిస్తాం. 41 00:04:21,388 --> 00:04:26,059 మొదటగా, అది ఓడ నుండి దూకేయలేదని మనం నిర్ధారించుకోవాలి. 42 00:04:28,562 --> 00:04:31,940 వీడి ఉద్దేశం ఏంటంటే, అది ఇంటి నుండి బయటకు వెళ్లిపోలేదని నిర్ధారించుకోవాలి. 43 00:04:45,120 --> 00:04:47,122 సూర్యాస్తమయాన్ని చివరగా ఎప్పుడు చూశానో కూడా నాకు గుర్తు లేదు. 44 00:04:48,123 --> 00:04:50,750 దీన్ని ఎంత మిస్ అయ్యానో ఇప్పుడే తెలుస్తోంది. 45 00:04:52,168 --> 00:04:53,503 సరే మరి, ఇక పద వెళ్దాం. 46 00:05:05,265 --> 00:05:06,600 ఆఖరిది కూడా చెక్ చేసేశాను. 47 00:05:06,683 --> 00:05:10,937 సూపర్, మొదటి దశ పూర్తయింది. తలుపులు మూసే ఉన్నాయి. కిటికీలు పగలకుండా ఉన్నాయి. 48 00:05:11,021 --> 00:05:13,189 అది ఇంకా ఇంట్లోనే ఉంది. 49 00:05:13,273 --> 00:05:15,317 ఓరి నాయనోయ్. 50 00:05:15,942 --> 00:05:18,445 రెండవ దశలో మనం ప్రతీ గదిని వెతకాలి, 51 00:05:18,528 --> 00:05:22,240 ఏయే చోట్ల దాక్కొనే అవకాశం ఉందో, వాటన్నింటినీ వెతకాలి. 52 00:05:22,324 --> 00:05:25,368 అంటే, నాన్నతో ఆడే దాగుడు మూతల ఆటల లాగా అన్నమాట. 53 00:05:25,869 --> 00:05:28,455 కాకపోతే ఇప్పుడు, దాగి ఉన్న వారిని కనిపెట్టే పని మనం చేస్తున్నాం. 54 00:05:28,538 --> 00:05:31,207 అదీగాక, ఆ దాగి ఉన్నది మనల్ని వేసేయాలని చూస్తోంది. 55 00:05:31,833 --> 00:05:32,876 ఆలస్యమైపోతోంది. 56 00:05:32,959 --> 00:05:36,046 తక్కువ సమయంలో అంతా వెతకాలంటే, మనం బృందాలుగా విడిపోయి గాలిద్దాం. 57 00:05:36,129 --> 00:05:39,716 పిల్లలూ, మీరు నాతో పాటు వెతకండి. మేము ఇటు వైపు వెతుకుతాం. 58 00:05:40,217 --> 00:05:43,678 మేము ఇటు వైపున్న గదులలో వెతుకుతాం మరి. 59 00:05:46,223 --> 00:05:51,186 ఆ భయంకరమైన జీవి ఎక్కడుందో కనిపెట్టాక, ఏం చేయాలంటారు? 60 00:05:52,771 --> 00:05:54,731 ఏం చేయాలో మూడవ దశలో చూద్దాం. 61 00:06:35,564 --> 00:06:37,399 ఈ గదిలో అది లేదు. బయటకు వెళ్దాం పదండి. 62 00:06:47,367 --> 00:06:51,705 నేను బయటకు వచ్చి చాలా కాలమైంది, ఇప్పుడు ఏది ఏదో తెలియడం లేదు. 63 00:06:52,747 --> 00:06:56,543 ఈ ఆధునిక మెషిన్లు, హింసించడానికి ఉపయోగించే పరికరాలు లాగా ఉన్నాయి. 64 00:06:56,626 --> 00:06:58,420 దీనికేనా? 65 00:06:58,503 --> 00:07:00,922 మా ఓడలో ఉండే పరికరాలను చూసుండాల్సింది నువ్వు! 66 00:07:06,970 --> 00:07:08,722 లారీ! నీకు ఏమీ కాలేదు కదా? 67 00:07:09,306 --> 00:07:11,391 నాకేమీ కాలేదు. పద. 68 00:07:16,646 --> 00:07:19,024 వావ్. ఇటే వెళ్లినట్టుందిగా అది. 69 00:07:19,107 --> 00:07:20,567 అవును, వీటన్నింటినీ పక్కన పెడదాం రండి. 70 00:07:26,031 --> 00:07:29,117 అబ్బా. తప్పించుకొని పోయింది. ఇప్పుడు ఎటు వెళ్లిందో ఏమో! 71 00:07:33,079 --> 00:07:34,956 నాకు తెలుసు అనుకుంటా. 72 00:07:36,499 --> 00:07:37,959 ఎలక్ట్రిక్ ప్యానెల్. 73 00:07:38,627 --> 00:07:40,712 అది ఇక్కడికి వచ్చిందని తెలిసిపోతోంది. 74 00:07:40,795 --> 00:07:43,173 ఉదయం అయితే కానీ, దీన్ని మనం బాగుచేయలేం. 75 00:07:43,256 --> 00:07:46,968 చూస్తుంటే, ఈ రాత్రి మనం చీకట్లోనే గడపాల్సి వచ్చేలా ఉంది. 76 00:07:57,479 --> 00:07:58,772 ఆ పిచ్చి దానితో 77 00:07:58,855 --> 00:08:01,733 మనం ఒకే ఇంట్లో ఇరుక్కుపోయామని ఆలోచిస్తేనే నాకు ఒళ్లంతా వణుకుపుడుతోంది. 78 00:08:01,816 --> 00:08:03,860 జంతు నియంత్రణ వాళ్లకి కాల్ చేద్దామా? 79 00:08:03,944 --> 00:08:06,613 డెబ్బీ క్వాడ్రా వాళ్ల ఇంట్లోని అటకలోకి దూరిన ఒక ఉడుతను వాళ్లు పట్టుకున్నారుగా. 80 00:08:06,696 --> 00:08:08,782 మనం వాళ్లకి కాల్ చేయకూడదు. 81 00:08:08,865 --> 00:08:12,827 ఈ విషయాన్ని మనం ఎవరికైనా చెప్పేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని చెప్పాలి. 82 00:08:12,911 --> 00:08:15,580 అవును. మీరు జాగ్రత్తగా ఉండాలి. 83 00:08:15,664 --> 00:08:18,625 రహస్య చోటులో ఉండే వస్తువులను హస్తగతం చేసుకోవాలని చూసే 84 00:08:18,708 --> 00:08:20,752 దుర్మార్గులు చాలా మందే ఉంటారు. 85 00:08:20,835 --> 00:08:24,714 -అయితే మనం ఫ్యాంగ్స్ ని ఎలా పట్టుకోగలం? -"ఫ్యాంగ్స్?" పేరు కూడా పెట్టేశావా? 86 00:08:25,215 --> 00:08:26,967 పేరు పెట్టేయడం నా ప్రత్యేకత కదా. 87 00:08:27,050 --> 00:08:28,718 అది నిజమే కదా, టార్చి పాపా? 88 00:08:30,554 --> 00:08:33,431 మనం ఒక వల లాంటి దాన్ని కానీ, లేదా బోనుని కానీ చేసి, 89 00:08:33,515 --> 00:08:35,140 దాన్ని పట్టే ప్రయత్నం చేద్దామా? 90 00:08:35,225 --> 00:08:38,436 శాపగ్రస్త కొండముచ్చు తలలను పట్టుకొనే బోనులు దొరకవమ్మా. 91 00:08:39,479 --> 00:08:40,938 నాకొక ఐడియా వచ్చింది. 92 00:08:41,022 --> 00:08:43,108 స్టాన్లీ, లారీ, మీరిద్దరూ నాతో రండి. 93 00:08:44,275 --> 00:08:45,735 మరి మా సంగతేంటి? 94 00:08:45,819 --> 00:08:49,364 వద్దు. అది చాలా ప్రమాదకరమైనది. 95 00:08:49,948 --> 00:08:51,199 అబ్బా. 96 00:08:52,075 --> 00:08:55,996 ఇక్కడ ఉంటే మీకు ఏమీ కాదు. మేము బయటకు వెళ్లగానే, తలుపులు మూసేసి, అడ్డంగా ఏదైనా పెట్టండి. 97 00:08:56,997 --> 00:08:58,039 అలాగే. 98 00:09:17,350 --> 00:09:21,271 కుక్క బోను పాతది ఒకటి ఉంటుంది, తెల్లగా ఉండి, హ్యాండిల్ నల్లగా ఉంటుంది. 99 00:09:25,025 --> 00:09:27,235 వీళ్ల ముగ్గురినీ చూస్తుంటే నీకు ఏమనిపిస్తోంది? 100 00:09:27,319 --> 00:09:29,195 నచ్చారు. వాళ్లలో ధైర్యం ఉంది. 101 00:09:29,279 --> 00:09:33,325 అవును. వీళ్ళలో గమ్మత్తైన అంశం ఏదో ఉంది. 102 00:09:36,661 --> 00:09:38,538 ఏ. వాండర్హూవెన్ 103 00:09:40,206 --> 00:09:42,584 ఆలెక్స్, నువ్వు ఏదీ పారేయవు కదా. 104 00:09:43,627 --> 00:09:45,587 నువ్వు నాకు కావాలి. 105 00:09:45,670 --> 00:09:46,671 దొరికింది! 106 00:09:52,636 --> 00:09:54,763 ఇలాంటి సమయంలో నీకు ఆకలి ఎలా వేస్తోంది? 107 00:09:55,555 --> 00:09:57,390 ఉదయం టిఫిన్ చేశామంతే, దాని తర్వాత ఏమీ తినలేదు మనం. 108 00:09:59,434 --> 00:10:02,270 వావ్. టిఫిన్ చేసి కొన్ని యుగాలు అయినట్టుగా అనిపిస్తోంది. 109 00:10:02,354 --> 00:10:05,065 ఈ ఉదయం తర్వాత మన జీవితాలు పూర్తిగా మారిపోయాయి. 110 00:10:07,776 --> 00:10:11,947 ముందు, నాన్న విగ్రహం అయిపోయాడు, ఇప్పుడు ఓ విగ్రహానికి ప్రాణం వచ్చింది. 111 00:10:12,030 --> 00:10:13,823 రెంటికీ, ఏదోక సంబంధం ఉండే ఉండాలి కదా? 112 00:10:14,407 --> 00:10:17,327 ఇప్పుడు నా బుర్ర పని చేసే స్థితిలో లేదు. నాకేమీ అర్థం కావట్లేదు. 113 00:10:18,745 --> 00:10:20,372 నాన్నని చాలా మిస్ అవుతున్నా. 114 00:10:23,041 --> 00:10:24,459 నేను కూడా. 115 00:10:24,542 --> 00:10:26,294 మళ్లీ ఆయన్ని చూస్తాం కదా? 116 00:10:26,378 --> 00:10:29,548 ఆయన్ని మళ్లీ మామూలుగా చేసే మార్గం మనం ఖచ్చితంగా కనిపెడతాం. 117 00:10:29,631 --> 00:10:30,882 నేనూ అదే ఆశిస్తున్నా. 118 00:10:31,508 --> 00:10:33,635 నాకు తెలిసి, ఈ శాపం అతడిని చంపేదే అయితే, 119 00:10:33,718 --> 00:10:34,928 ఆయన ఈపాటికి చనిపోయి ఉండేవారు. 120 00:10:35,011 --> 00:10:38,473 శిలలా మార్చడం శిక్షలా అనిపిస్తోంది. 121 00:10:38,557 --> 00:10:40,850 అయితే, ఆయన ప్రాణాలతో ఉన్నాడని అనుకుంటున్నావా? 122 00:10:40,934 --> 00:10:43,562 అలా అని తప్ప, నాకు వేరేలా ఆలోచించాలని అస్సలు లేదు. 123 00:10:43,645 --> 00:10:46,273 ఆయన బంధీ అయిపోనట్టుగా అనిపిస్తోంది. 124 00:10:46,356 --> 00:10:47,524 హా, అవును. 125 00:10:47,607 --> 00:10:50,735 అయితే, మనం అతడిని బంధ విముక్తిడిని చేయాలి. కానీ, ఎలా? 126 00:10:51,319 --> 00:10:52,529 ఏమో మరి. 127 00:10:52,612 --> 00:10:55,824 వీడియోలో నాన్న మనకి ఒకటి చెప్పాడు కదా, దాని గురించే ఆలోచిస్తూ ఉన్నా. 128 00:10:55,907 --> 00:10:58,577 ఈ వస్తువుల ద్వారా మనం సరిదిద్దాలి అని. 129 00:10:58,660 --> 00:11:00,996 హా. ఆయన చెప్పింది నాకు అస్సలు అర్థం కాలేదు. 130 00:11:01,079 --> 00:11:04,541 నాకు కూడా. కోపంతో ఊగిపోతున్న కొండ ముచ్చు తలతో మనం ఎలా సరి చేస్తాం? 131 00:11:07,961 --> 00:11:09,963 పిల్లలూ, తలుపు తెరవండి. 132 00:11:19,055 --> 00:11:20,390 నువ్వు వేసుకొన్న జాకెట్ బాగుంది, అమ్మా. 133 00:11:20,473 --> 00:11:21,349 థ్యాంక్స్. 134 00:11:21,433 --> 00:11:25,896 దాన్ని పట్టుకోవడానికి బోను సిద్ధంగా ఉంది. కానీ అది దీనిలోకి వచ్చేలా చేయడానికి మనకొకటి కావాలి. 135 00:11:25,979 --> 00:11:27,439 ఎర లాంటిది మనకి కావాలి. 136 00:11:27,522 --> 00:11:29,774 దానికి స్వీట్ చిల్లీ చిప్స్ నచ్చుతాయా? 137 00:11:29,858 --> 00:11:33,194 దానికి ఏం నచ్చుతుందో ఎవరికి తెలుసు? అది మొండెం లేని కోతి తలకాయ్. 138 00:11:33,278 --> 00:11:35,906 అసలు దాన్ని తెలుసుకోవాలంటే, మనం ఎక్కడికి వెళ్లాలి? 139 00:11:35,989 --> 00:11:37,782 ఎక్కడికి వెళ్లాలో నాకు తెలుసు. 140 00:11:40,535 --> 00:11:42,829 హమ్మయ్య, ఇక్కడ కరెంట్ పోలేదులే. 141 00:11:43,914 --> 00:11:45,332 వీటి ద్వారా మనకు ఏదైనా ఆధారం లభించవచ్చు. 142 00:11:45,415 --> 00:11:48,585 కొర్నీలియస్ వాండర్హూవెన్ యాత్రల వివరాలన్నీ వీటిలో ఉన్నాయి. 143 00:11:48,668 --> 00:11:50,128 చిత్తుచిత్తుగా ఉన్న ఈ పత్రాలు, 144 00:11:50,212 --> 00:11:54,174 నోట్స్, ఇంకా రాతల్లో, ఈ ఇంట్లో ఉండే ప్రతి కళాఖండానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. 145 00:11:55,675 --> 00:11:59,137 "కంచు హారం. సైయామ్, 1887, 146 00:11:59,221 --> 00:12:03,683 ఇన్యుయిట్ వాల్రస్ ప్రతిమ, అలాస్కా, 1879." 147 00:12:03,767 --> 00:12:08,521 ఇవి అసలు వరుసగా లేవు. ఏ పేజీలను పడితే వాటిని ఇలా అంటించినట్టు ఉంది. 148 00:12:09,356 --> 00:12:11,483 హా, వాండర్హూవెన్స్ కి పద్ధతి ప్రకారం పెట్టుకోవడం రాదు, 149 00:12:11,566 --> 00:12:13,318 మొదట్నుంచీ అంతే అని తెలుస్తోంది. 150 00:12:13,401 --> 00:12:16,488 లారీ, నేను వాటిని పద్ధతిగా సర్ది పెడదామని చాలా ఏళ్ల నుండీ ప్రయత్నిస్తూ ఉన్నాం. 151 00:12:16,571 --> 00:12:20,742 హా, దీని కన్నా కొండను చేతులతో పిండి పిండి చేయడం సులభం అనిపిస్తుంది. 152 00:12:20,825 --> 00:12:22,702 చెప్తున్నా కదా, ఆ ప్రయత్నం నేను చేశా. 153 00:12:25,664 --> 00:12:28,458 మొదలుపెడదాం ఇక. చాలా పనుంది. 154 00:12:29,376 --> 00:12:30,460 అబ్బా, పుస్తకాలు. 155 00:12:30,544 --> 00:12:32,254 హా, పుస్తకాలే. 156 00:12:32,754 --> 00:12:37,217 వీటిలోనే సమాధానం ఉంది, మనందరం కలిసి దాన్ని కనిపెట్టాలి. 157 00:12:38,051 --> 00:12:39,094 నేను పైకి వెళ్లి, 158 00:12:39,177 --> 00:12:41,429 ఆ కొండ ముచ్చు ముఖం ఎక్కడ ఉందో, నా కన్ను కాయ అయ్యేలా వెతుకుతా. 159 00:13:40,030 --> 00:13:41,448 నేను విరామం తీసుకుంటా. 160 00:14:00,800 --> 00:14:02,844 మా నాన్నని వదలవే, చెత్త మొక్కా. 161 00:14:04,387 --> 00:14:07,015 మనం ఎంత పీకినా, ఇది పెరుగుతూనే ఉంటుంది. 162 00:14:07,098 --> 00:14:10,143 ఈ పిచ్చి మొక్క, బంగళాను చుట్టుముట్టేసింది. 163 00:14:10,227 --> 00:14:13,605 తెలుసు, అందుకే కదా దీన్ని పిచ్చి మొక్కల బ్రయర్ స్టోన్ బంగళా అంటుంటారు. 164 00:14:13,688 --> 00:14:17,442 కానీ, అలా అని మా నాన్ననే చుట్టేస్తే ఎలా! 165 00:14:21,488 --> 00:14:24,616 అది హవర్ గ్లాసా? 166 00:14:25,200 --> 00:14:26,201 అవును. 167 00:14:28,828 --> 00:14:31,248 అది ఏ సమయాన్ని చెప్తోంది? 168 00:14:31,331 --> 00:14:35,126 అన్నీ ఒక్కసారే చెప్తే, మీరు ఉక్కిరిబిక్కిరి అయిపోతారేమో, 169 00:14:35,210 --> 00:14:38,672 అది మీ కుటుంబంపై ఉన్న శాపానికి సంబంధించిన వ్యవధిని చూపుతుంది. 170 00:14:39,339 --> 00:14:41,341 అవునా? ఎలా? 171 00:14:42,008 --> 00:14:44,761 కుటుంబంలోని ఒక వ్యక్తి రాయిలా మారిపోగానే, 172 00:14:44,844 --> 00:14:46,388 హవర్ గ్లాస్ తిరుగుతుంది, 173 00:14:46,471 --> 00:14:50,600 కుటుంబంలోని తర్వాతి వ్యక్తికి శాపం తగలడానికి ఎంత సమయం మిగిలి ఉందో అప్పుడు అది చూపుతుంది. 174 00:14:50,684 --> 00:14:54,437 అంటే, ఇప్పుడు ఇది రస్ కి శాపం తగలడానికి ఇంకా ఎంత సమయం మిగిలి ఉందో చూపుతుందా? 175 00:14:55,021 --> 00:14:57,107 అవును, రస్ తర్వాత… 176 00:14:58,900 --> 00:15:00,151 దాన్ని ఆపడం ఎలా? 177 00:15:00,777 --> 00:15:02,028 ఎవరికీ తెలీదు. 178 00:15:02,112 --> 00:15:05,949 మొదట్నుంచీ, వాండర్హూవెన్ లోని ప్రతీ ఒక్కరూ దాన్ని కనిపెట్టే ప్రయత్నమే చేశారు. 179 00:15:07,867 --> 00:15:10,120 కానీ ఒక మాట, ఇప్పటి దాకా దాన్ని ఎవరూ కనిపెట్టలేదంటే, 180 00:15:10,203 --> 00:15:12,205 దానర్థం దాన్ని ఎవరూ కనిపెట్టలేరని కాదు. 181 00:15:15,584 --> 00:15:18,253 యురేకా! నేనొకటి కనిపెట్టాను. 182 00:15:18,336 --> 00:15:21,464 ఈ పాత ఫోటో చూడండి. ఏమైనా కనిపిస్తోందా? 183 00:15:22,382 --> 00:15:24,509 అది ఫ్యాంగ్స్ లా ఉంది. 184 00:15:24,593 --> 00:15:26,469 బహుశా, దాన్ని అక్కడి నుండే తెచ్చారేమో. 185 00:15:26,553 --> 00:15:29,723 హేయ్! త్వరగా ఇక్కడికి రండి. ఇక్కడ ఒకటి జరుగుతోంది. 186 00:15:33,768 --> 00:15:35,770 ఎందుకు ఇది ఇలా మోగుతోంది? 187 00:15:35,854 --> 00:15:37,272 ఇది పాత బెల్ సిస్టమ్. 188 00:15:37,355 --> 00:15:39,941 వేర్వేరు గదులకు పనివారిని పిలవడానికి దీన్ని ఉపయోగించేవారు. 189 00:15:41,526 --> 00:15:42,944 వావ్, భవిష్యత్తు అదిరింది. 190 00:15:44,195 --> 00:15:46,281 దేని కారణంగానో ఇది సంగీత గది నుండి మోగుతోంది. 191 00:15:46,364 --> 00:15:49,242 -ఆ కొండ ముచ్చు ముఖం అక్కడే ఉందేమో. -మన ఉచ్చును పరీక్షించే సమయం ఆసన్నమైంది. 192 00:15:49,326 --> 00:15:51,578 ఈసారి మేము కూడా వస్తాం. 193 00:15:51,661 --> 00:15:52,913 మనం అంతా ఒక జట్టు. 194 00:15:54,080 --> 00:15:55,248 సరే. 195 00:16:03,715 --> 00:16:06,593 కానీ ఎరగా ఏం వాడాలో మనం ఆలోచించలేదే. 196 00:16:08,970 --> 00:16:11,514 ఏంటి? ఇవి భలే రుచిగా ఉంటాయి. 197 00:16:11,598 --> 00:16:16,061 హనీ, నీ ప్రయత్నం బాగుంది, కానీ అది అసలు తింటుందో లేదో కూడా నాకు తెలీదు. 198 00:16:16,144 --> 00:16:18,021 దాన్ని భయపెట్టి రప్పిస్తే? 199 00:16:50,971 --> 00:16:53,890 అది ఇక్కడ లేదు. ఉండుంటే, ఖచ్చితంగా భయపడి ఉండేది. 200 00:16:54,474 --> 00:16:55,642 ఇంకెక్కడ ఉంది అది? 201 00:16:55,725 --> 00:16:58,395 తలుపు మూసే ఉంది, గంట ఈ గది నుండే మోగింది. 202 00:16:58,478 --> 00:16:59,896 బహుశా గంట పని చేయడం లేదేమో. 203 00:17:02,691 --> 00:17:03,858 బాగానే పని చేస్తోంది. 204 00:17:05,610 --> 00:17:06,820 అది వేరే గదిలో ఉంది. 205 00:17:06,902 --> 00:17:08,154 ఏ గదో చూస్తా. 206 00:17:15,704 --> 00:17:17,205 అది ఆటల గదిలో ఉంది. 207 00:17:28,925 --> 00:17:33,555 నేను ఒకటి అనగానే మొదలుపెడదాం. మూడు. రెండు… 208 00:17:36,224 --> 00:17:37,684 ఆగండి. అది బాల్ రూమ్ లో ఉంది. 209 00:17:38,184 --> 00:17:40,687 ఆగండి, అది ఇప్పుడు కుటుంబ గదిలో ఉంది. 210 00:17:40,770 --> 00:17:43,064 ఏదో తేడా కొడుతోంది. 211 00:17:50,739 --> 00:17:53,700 పాండారో గది నుండి ఇప్పుడు అది జిమ్ కి వెళ్లింది. 212 00:17:54,284 --> 00:17:56,536 ఊహ్, నా వస్తువులను తాకితే, దాన్ని చంపేస్తా. 213 00:17:56,620 --> 00:17:59,873 కానీ ఆ రెండు గదులో వేర్వేరు అంతస్థుల్లో ఉన్నాయి కదా, అది అసాధ్యం. 214 00:18:00,665 --> 00:18:02,042 ఒకవేళ… 215 00:18:03,293 --> 00:18:05,921 బెల్ సిస్టమ్ అనేది అనేక తీగల ద్వారా పని చేస్తుంది, 216 00:18:06,004 --> 00:18:08,882 ఆ తీగలు, గోడల లోపలి నుండి అనేక గదుల్లోకి పంపబడి ఉంటాయి, 217 00:18:08,965 --> 00:18:10,884 అవన్నీ ఈ వంటగదిలో ఒకే చోట ఇలా గంటలకు తగిలించి ఉంటాయి. 218 00:18:11,384 --> 00:18:14,596 ఈ కొండ ముచ్చు, ఒక్కో గదికి వెళ్లి ఈ గంటలను మోగించడం లేదు, 219 00:18:15,180 --> 00:18:18,433 గోడల మధ్య నుండి మోగిస్తోంది. 220 00:18:28,151 --> 00:18:29,611 అది మనపై దాడి ఎందుకు చేయలేదు? 221 00:18:29,694 --> 00:18:30,987 దాని వెంటపడదాం పదండి. 222 00:18:35,533 --> 00:18:39,329 ఒక అడుగుజాడ ఉంది ఇక్కడ. "ఫ్యాంగ్ అడుగు" అనాలేమో? అదే "ఫ్యాంగ్ అడుగు జాడ"? 223 00:18:39,412 --> 00:18:41,122 ఏదోకటిలే, అది అటు వైపు వెళ్లింది. 224 00:18:59,057 --> 00:19:01,434 ఈ జంతువుల్లో ఒక్కటికి ప్రాణం వచ్చినా, 225 00:19:01,518 --> 00:19:03,520 నేను ఇంటికి ఓ నమస్కారం పెట్టి వెళ్లిపోతా, ఇక చచ్చినా తిరిగి రాను. 226 00:19:05,146 --> 00:19:09,234 ఇంకోసారి దాన్ని తప్పించుకోనివ్వకూడదు. వెంటనే దాన్ని మనం పట్టుకోవాలి. 227 00:19:10,485 --> 00:19:13,947 అయితే, మనమే స్వయంగా లోపలికి వెళ్లి, పట్టుకోవాలేమో. 228 00:19:14,030 --> 00:19:15,282 ఆ పని కానిద్దాం పదండి. 229 00:19:15,365 --> 00:19:18,994 మీరు వద్దు. నేను చేస్తా. 230 00:19:19,077 --> 00:19:20,829 కానీ మనం ఒక జట్టు, గుర్తుందా? 231 00:19:20,912 --> 00:19:23,290 ఇది చాలా ప్రమాదకరమని ముందే చెప్పా కదా. 232 00:19:23,373 --> 00:19:27,043 నువ్వొక్క దానివే చేస్తే అది ఇంకా ప్రమాదకరం అవుతుంది. అమ్మా, మమ్మల్ని సాయపడనివ్వు. 233 00:19:27,627 --> 00:19:29,045 కంగారు పడవద్దు. 234 00:19:30,755 --> 00:19:32,007 నేను చూసుకుంటాలే. 235 00:19:51,359 --> 00:19:53,069 బయటకు రావే. 236 00:19:55,155 --> 00:19:56,698 నువ్వు ఇక్కడే ఉన్నావని మాకు తెలుసు. 237 00:20:11,296 --> 00:20:12,380 అమ్మా, నీకు ఏమీ కాలేదు కదా? 238 00:20:28,730 --> 00:20:29,648 అమ్మా! 239 00:20:33,944 --> 00:20:36,029 -ఇప్పుడు మనమేం చేద్దాం? -నాకు తెలీట్లేదు. 240 00:20:38,531 --> 00:20:39,532 థ్యాంక్స్. 241 00:20:39,616 --> 00:20:43,703 ఆలోచించడం ఎక్కువైంది, పని చేయడం తక్కువైంది. మనం త్వరగా ఏదోకటి చేయాలి. 242 00:20:49,125 --> 00:20:50,168 ఏదోకటి చేయాలా? 243 00:20:51,878 --> 00:20:52,921 అవును. 244 00:20:57,551 --> 00:20:59,844 కాచుకో! 245 00:21:11,731 --> 00:21:16,152 సూపర్ ఐడియా, బుడ్డోడా. ఎవరినైనా ఢీకొట్టాలంటే అలానే ఢీకొట్టాలి. 246 00:21:23,868 --> 00:21:26,162 దీన్ని పట్టేసుకున్నాం కదా, ఏం చేద్దాం ఇప్పుడు? 247 00:21:26,246 --> 00:21:29,291 దీన్ని శాంతపరిస్తే, మళ్లీ నిద్రావస్థకు వెళ్లిపోతుందేమో. 248 00:21:30,667 --> 00:21:33,587 ఇప్పటిదాకా శాంతంగానే ఉంది, ఇప్పుడు దానికి ఇక్కడి నుండి బయటపడాలనుంది. 249 00:21:34,379 --> 00:21:37,716 ఎందుకు? అయినా, ఈ కొండ ముచ్చు తల ఎక్కడికని వెళ్తుంది? 250 00:21:38,884 --> 00:21:39,885 ఇంటికి. 251 00:21:40,969 --> 00:21:42,387 ఓసారి ఆలోచించండి. 252 00:21:42,470 --> 00:21:45,473 కావాలంటే, వంట గదిలో అది నాపై దాడి చేసి ఉండవచ్చు, కానీ అది ఆ పని చేయలేదు. 253 00:21:45,557 --> 00:21:47,434 ఇప్పటిదాకా అది ఇక్కడి నుండి బయట పడే ప్రయత్నమే చేస్తూ ఉండింది. 254 00:21:47,517 --> 00:21:50,437 ఎవరైనా నిన్ను ఇంత కాలం బంధిస్తే, నువ్వు ఎక్కడికి వెళ్లాలనుకుంటావు? 255 00:21:50,520 --> 00:21:51,855 ఇంటికి. 256 00:21:51,938 --> 00:21:53,565 సరిగ్గా చెప్పావు. 257 00:21:54,232 --> 00:21:57,819 దాని నివాసం ఇది కాదు. ఇక్కడున్న కళాఖండాలన్నింటి పరిస్థితీ అదే. 258 00:21:57,903 --> 00:22:00,488 అవన్నీ ఎక్కడెక్కడ నుండో తెచ్చినవే. 259 00:22:01,740 --> 00:22:04,534 దీన్ని ఎక్కడి నుండి అయితే తెచ్చారో, మనం అక్కడే దీన్ని వదిలి పెడితే సరిపోతుందేమో. 260 00:22:05,160 --> 00:22:08,163 మనం ఆ పని చేస్తే, శాప విముక్తులం అవ్వవచ్చేమో. 261 00:22:08,246 --> 00:22:11,458 కొర్నీలియస్ తప్పు చేయడం కారణంగానే ఈ శాపం తగిలి ఉంటే, 262 00:22:11,541 --> 00:22:14,711 మనం సరైన పనులు చేసి, ఆ తప్పుని దిద్దవచ్చు కదా, అదే అర్థవంతమైన పని కూడా. 263 00:22:15,629 --> 00:22:19,674 మనం దీన్ని కాంగోలో వదిలి పెట్టి రావాలి. 264 00:23:02,342 --> 00:23:04,344 సబ్ టైటిళ్లను అనువదించింది: రాంప్రసాద్