1 00:00:22,649 --> 00:00:24,401 ప్యాక్స్టన్ మ్యూజియం 2 00:01:36,598 --> 00:01:39,476 ఓల్మెక్ బేబీలు 3 00:01:43,188 --> 00:01:46,650 తవ్వకాలలో, దేన్ని కూడా మనం కదిలించకూడదు. 4 00:01:46,733 --> 00:01:49,569 బ్రష్ చేయడం, గీకడం వంటివి జాగ్రత్తగా చేయాలి. 5 00:01:50,153 --> 00:01:52,239 వాడి నోటి నుండి అది తీయవా? 6 00:01:53,531 --> 00:01:56,034 మరేం పర్వాలేదులే. పళ్లు జిల పుట్టి ఊరికే అలా అంటున్నాడులే. 7 00:01:56,534 --> 00:01:59,496 పైగా, కొంచెం మట్టి తింటే వీడికే మేలు. మట్టి ఎంతైనా మన నేస్తం కదా. 8 00:01:59,579 --> 00:02:01,706 మట్టిలోనే కదా మొక్కలు పెరిగేది, ఏమంటావు? 9 00:02:02,916 --> 00:02:04,000 అయ్య బాబోయ్. 10 00:02:04,584 --> 00:02:07,712 ఏం కాలేదు, బంగారూ. ఏమీ కాలేదు, హనీ. 11 00:02:07,796 --> 00:02:09,463 సరే, ఇలా రా. 12 00:02:12,676 --> 00:02:13,760 అది నీ వరం. 13 00:02:13,843 --> 00:02:16,179 నిన్ను హత్తుకుంటే, ఎవరైనా కరిగిపోవాల్సిందే. 14 00:02:16,721 --> 00:02:19,516 ఇవి తవ్వకాల వీడియోలా, లేదా కుటుంబ వీడియోలా? 15 00:02:19,599 --> 00:02:22,894 ఆలెక్స్ చాలా వీడియోలు తీసేవాడు, ప్రతీదాన్ని రికార్డ్ చేయాలనుకునేవాడు. 16 00:02:22,978 --> 00:02:24,187 ఆ విషయంలో అతగాడు దిట్ట. 17 00:02:24,271 --> 00:02:26,690 కానీ వాటిని ఓ పద్ధతిగా ఉంచుకోవడం మాత్రం అస్సలు చేతకాదు అతనికి. 18 00:02:27,899 --> 00:02:29,150 వీటి సంగతేంటి? 19 00:02:30,860 --> 00:02:33,822 "షేవ్ చేసుకోవడం ఎలా." "స్పేర్ టైరును మార్చడం ఎలా." 20 00:02:34,322 --> 00:02:35,574 ఏంటివి? 21 00:02:36,575 --> 00:02:39,244 ఆలెక్స్, తను రాయి త్వరగానే అయిపోయే అవకాశముందని గ్రహించాడు, 22 00:02:39,327 --> 00:02:41,913 తండ్రిగా నీకు కొన్ని సలహాలు ఇవ్వలేడని ఇవి ఉంచాడు. 23 00:02:45,834 --> 00:02:47,544 అది ఏడుపు శబ్దమా? 24 00:02:48,295 --> 00:02:49,963 ఇంకో వీడియో ప్రారంభించావా? 25 00:02:50,046 --> 00:02:53,258 లేదు, ఆ శబ్దం అక్కడి నుండి వస్తున్నట్టుగా అనిపిస్తోంది. 26 00:03:06,146 --> 00:03:08,607 ఇటు వైపు మెసోఅమెరికన్ ఛాంబర్ నుండి వస్తోంది. 27 00:03:15,864 --> 00:03:18,366 ఎవరు ఏడుస్తున్నారో, ఏమో కానీ, ఆ ఏడుపు మాత్రం ఈ గది నుండి వస్తోంది. 28 00:03:20,911 --> 00:03:22,454 లైట్స్ ఆన్ చేయండి. 29 00:03:26,291 --> 00:03:28,501 ఇక్కడ లైట్స్ అప్పుడప్పుడూ వెలగవులే. 30 00:03:28,585 --> 00:03:31,129 లారీ, పక్క గదిలో వైర్స్ కనెక్షన్ ఎలా ఉందో చూసి రా. 31 00:03:31,213 --> 00:03:32,797 అలాగే, కెప్టెన్. 32 00:03:34,633 --> 00:03:36,593 లోపలికి పద. నేను ఇక్కడే ఉన్నాగా. 33 00:03:44,768 --> 00:03:46,978 నాకు ఇరుకుగా ఉంటే పరమ చిరాకు. 34 00:03:49,272 --> 00:03:52,817 హేయ్, అది లాంగ్ కౌంట్ మాయన్ క్యాలెండరా? 35 00:03:53,443 --> 00:03:55,904 వావ్. నాకు ఎప్పట్నుంచో… 36 00:03:57,364 --> 00:03:58,448 పిచ్చి మొక్క. 37 00:03:59,282 --> 00:04:02,953 బాబోయ్. ఇది నా వల్ల కాదు. లైట్స్ వచ్చేదాకా ఆగడం మేలు. 38 00:04:04,162 --> 00:04:05,413 పక్క గదిలో వైర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. 39 00:04:05,497 --> 00:04:08,416 లైట్స్ బాగా పాతవి కదా. పైకి కిందికి అంటూ ఉండు. 40 00:04:11,086 --> 00:04:14,130 కంగారుపడకు, బుడ్డోడా. ఆ ఏడిచేది ఎవరో నేను కనిపెట్టేస్తా. 41 00:04:21,137 --> 00:04:22,556 కనిపెట్టేశా. 42 00:04:27,435 --> 00:04:28,562 ఓయ్, హా. 43 00:04:28,645 --> 00:04:31,523 కళాఖండాలకు ప్రాణం ఏమిటో, నాకు పిచ్చెక్కిపోతోంది. 44 00:04:31,606 --> 00:04:33,942 హా, కానీ అన్నీ ఇంతలా చిరాకు తెప్పించవు. 45 00:04:34,025 --> 00:04:35,860 దీని ఏడుపుని ఆపడం ఎలా? 46 00:04:35,944 --> 00:04:39,406 నన్ను చూస్తావే. నేనేమైనా పిల్లలని పెంచానా ఏంటి! 47 00:04:48,665 --> 00:04:49,666 హలో. 48 00:04:50,250 --> 00:04:51,585 మరేం పర్వాలేదు, బుడ్డోడా. 49 00:04:56,673 --> 00:04:58,758 వామ్మోయ్. ఇది మనకి చేతకాని పని. 50 00:05:05,390 --> 00:05:07,517 ఏ విషయంలో సాయపడాలి? 51 00:05:16,568 --> 00:05:18,194 ఇది భరించడం నా వల్ల కావట్లేదు. 52 00:05:18,278 --> 00:05:19,529 నా వల్ల కూడా. 53 00:05:26,453 --> 00:05:29,831 కంగారుపడకండి, అబ్బాయిలూ. నాకు బోలెడంత అనుభవం ఉంది. 54 00:05:29,915 --> 00:05:31,499 స్కై వాండర్హూవెన్ బిడ్డలని బుజ్జగించే పద్ధతిని 55 00:05:31,583 --> 00:05:36,046 ఆచరించి చూపడానికి ఇదే సరైన అవకాశం. 56 00:05:38,340 --> 00:05:40,383 ముందు డైపర్ చెక్ చేయాలి. 57 00:05:40,467 --> 00:05:43,470 ఏడవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా, డైపర్ పాడవడమే. 58 00:05:45,722 --> 00:05:48,808 సరే, కానీ దీనికి డైపర్ లేదుగా. 59 00:05:48,892 --> 00:05:50,352 ఇక తర్వాత ఆకలిగా ఉందో లేదో చూడాలి. 60 00:05:50,435 --> 00:05:52,437 ఆకలేస్తే పిల్లలు తిక్క పెట్టేస్తారు. 61 00:05:52,520 --> 00:05:54,314 ఎవరి దగ్గరరైనా ఆహారం ఉందా? 62 00:05:59,236 --> 00:06:02,572 అక్కడ చాక్లెట్స్ పెట్టుకుంటావా బాబూ? 63 00:06:02,656 --> 00:06:04,157 అసలు మీరు తింటారా? 64 00:06:04,241 --> 00:06:07,661 లేదు. కానీ మంచి నావికుడు, దేనికైనా సిద్ధంగా ఉంటాడు కదా. 65 00:06:10,622 --> 00:06:12,290 కొంచెం కూడా కృతజ్ఞత లేదు. 66 00:06:13,208 --> 00:06:15,961 మరేం పర్వాలేదు. ఇప్పుడు హత్తుకొని చూద్దాం. 67 00:06:16,044 --> 00:06:19,297 స్కై హత్తుకుందంటే, ఎవరైనా కరిగిపోవాల్సిందే. 68 00:06:19,381 --> 00:06:21,800 సరే. ఆగమ్మా. 69 00:06:29,057 --> 00:06:31,643 ఇది పని చేయట్లేదు. తర్వాతి దశ ఏంటి? 70 00:06:32,477 --> 00:06:33,687 తర్వాతి దశ అంటూ ఏదీ లేదు. 71 00:06:33,770 --> 00:06:35,522 నా పద్ధతి ప్రతిసారి పని చేసింది. 72 00:06:38,900 --> 00:06:40,860 అయ్యో. దీని ఏడుపుకు ఇంకోటి లేచింది. 73 00:06:41,444 --> 00:06:42,445 మరేం పర్వాలేదు. 74 00:06:48,451 --> 00:06:49,619 మీరిద్దరూ ఆ మూడవ బిడ్డ సంగతి చూడండి. 75 00:06:49,703 --> 00:06:51,288 -కానీ ఏం చేయాలో మాకు తెలీదు… -ఆపవయ్యా. 76 00:06:51,371 --> 00:06:54,124 ఈ గోలని భరించడం కన్నా అదే మేలు. 77 00:06:59,713 --> 00:07:02,591 అన్నీ మేల్కొన్నాయిగా, ఇంత కంటే ఎక్కువ గోల రాదు ఇక. 78 00:07:05,969 --> 00:07:07,095 బాబోయ్, ఈ గోల భరించలేకపోతున్నా. 79 00:07:07,178 --> 00:07:08,722 ఏం జరుగుతోంది ఇక్కడ? 80 00:07:09,723 --> 00:07:13,643 బిడ్డ బొమ్మ? భలే ముద్దొస్తున్నాయి ఇవి. 81 00:07:17,272 --> 00:07:18,565 పడుకో బంగారు తల్లి. 82 00:07:18,648 --> 00:07:20,025 పడుకో, అమ్మా. 83 00:07:20,108 --> 00:07:21,401 చాలా ముద్దొస్తున్నావు. 84 00:07:21,484 --> 00:07:23,862 ఇక పడుకో, అమ్మా. 85 00:07:29,367 --> 00:07:30,368 ఏంటి? 86 00:07:32,120 --> 00:07:34,122 లాలించే, పాలించే గుణం నాకు పుట్టుకతోనే అబ్బినట్టుంది. 87 00:07:34,205 --> 00:07:37,918 ఏమంటావు, స్వీటీ? అవును, పుట్టుకతోనే. 88 00:07:38,001 --> 00:07:39,669 అమ్మానాన్నలకి దండం పెట్టాలబ్బా. 89 00:07:39,753 --> 00:07:41,046 ఆ ఏడుపును తట్టుకోవడమంటే మాటలు కాదు. 90 00:07:41,129 --> 00:07:42,839 నాకు బుర్ర పని చేయలేదు. 91 00:07:42,923 --> 00:07:47,135 నిజం చెప్పాలంటే, మనం ప్రేమించేవారికి మన అవసరం ఉన్నప్పుడు, ఏదోకటి చేసేస్తామంతే. 92 00:07:47,219 --> 00:07:49,554 లాలిపాటల్లో నేను పిస్తాని కాబట్టి సరిపోయింది. 93 00:07:49,638 --> 00:07:51,431 అదరగొట్టేశా. 94 00:07:51,514 --> 00:07:56,019 సరే, మనం ఇక సరి చేయాల్సిన కళాఖండాలు ఇవే అన్నమాట. 95 00:07:56,686 --> 00:07:58,813 వీటిని ఎంత త్వరగా ఇచ్చేస్తే, అంత మంచిది. 96 00:07:58,897 --> 00:07:59,981 ఇప్పటి దాకా మనకు తెలిసిన సమాచారమేంటి? 97 00:08:00,065 --> 00:08:02,234 ఇవి మెసోఅమెరికన్ గదిలో ఉన్నాయి, 98 00:08:02,317 --> 00:08:05,320 -కాబట్టి అవి దక్షిణ మెక్సికోకి చెందినవి అయ్యుండవచ్చు. -సరిగ్గా చెప్పావు. 99 00:08:05,403 --> 00:08:07,155 నాకు తెలిసి ఇలాంటి బిడ్డ బొమ్మలని 100 00:08:07,239 --> 00:08:09,741 కేవలం ఓల్మెక్ వాళ్లే చెక్కుతారు అనుకుంటా. 101 00:08:09,824 --> 00:08:11,618 ఓల్మెక్? అంటే? 102 00:08:11,701 --> 00:08:15,830 చాలా ప్రాచీన నాగరికత అది, ఆజ్టెక్స్ కంటే పురాతనమైనది అన్నమాట. 103 00:08:15,914 --> 00:08:19,167 నిజం చెప్పాలంటే, వాళ్ల సంస్కృతి గురించి పెద్దగా ఎవరికీ ఏమీ తెలీదు. 104 00:08:19,251 --> 00:08:20,293 హేయ్, దొరికాయి. 105 00:08:20,377 --> 00:08:21,211 ఓల్మెక్ శిరస్సులు 106 00:08:21,294 --> 00:08:23,129 బూమ్! మిస్టరీ పరిష్కారమైపోయింది. 107 00:08:23,672 --> 00:08:27,592 నిరాశజనకమైన వార్త చెప్పాలి ఇప్పుడు. ఇది అంత సులభంగా అయ్యే పని కాదు. 108 00:08:27,676 --> 00:08:29,970 ఏదీ అంత సులభం కాదులే. 109 00:08:30,053 --> 00:08:32,889 కొర్నీలియస్ జర్నల్స్ ప్రకారం, 110 00:08:32,972 --> 00:08:35,933 ఆ బొమ్మలని అతను చట్టవిరుద్ధంగా ఒక బ్లాక్ మార్కెట్ డీలర్ నుండి కొన్నాడు. 111 00:08:36,476 --> 00:08:37,394 వావ్. 112 00:08:37,476 --> 00:08:41,565 కాబట్టి, అవి ఏ కోవెలకి చెందినవో, ఎక్కడివో ఏమీ మనకి తెలీదు. 113 00:08:41,648 --> 00:08:44,150 అంటే, వాటిని ఇచ్చేయలేమా ఏంటి? 114 00:08:44,234 --> 00:08:46,069 ఇచ్చేయలేం అని ఖచ్చితంగా చెప్పలేం. 115 00:08:46,152 --> 00:08:49,489 మ్యూజియమ్ లో నాకు ఒక మంచి గైడ్ ఉంది, ఆమె సాయపడగలదు. 116 00:08:49,573 --> 00:08:52,492 ఏ వస్తువు ఎక్కడిదో ఆమె టక్కున చెప్పేయగలదు. 117 00:08:52,576 --> 00:08:54,369 అదే కదా మనకి కూడా కావాల్సింది. 118 00:08:54,452 --> 00:08:56,913 నేను వెళ్లి కనుక్కొని వస్తా, అందాకా ఇక్కడ అంతా చూసుకోగలరా మీరు? 119 00:08:56,997 --> 00:09:00,375 చూసుకోగలమనే అనుకుంటా. అదెలా అనేది కనిపెట్టేస్తే సరిపోతుంది అంతే. 120 00:09:04,462 --> 00:09:06,798 ఈ బిడ్డ మానిటర్లు సహాయపడతాయి. 121 00:09:06,882 --> 00:09:09,050 వీటిని నేను, మీ నాన్న చాలా బాగా ఉపయోగించుకున్నాం. 122 00:09:13,930 --> 00:09:16,892 అబ్బా. ఎందుకు ఈ మధ్య దాన్ని అంటిబెట్టుకొనే తిరుగుతున్నావు? 123 00:09:16,975 --> 00:09:20,854 "దాన్ని" అంటావేంటి? దీని పేరు లిండా. 124 00:09:20,937 --> 00:09:22,606 ఈ సమయంలో ఇది చర్మం వదులుతుంది, 125 00:09:22,689 --> 00:09:25,650 ఈ బలహీనమైన క్షణంలో దీన్ని ఒంటరిగా వదిలేస్తే ఎలా? 126 00:09:25,734 --> 00:09:26,860 తొక్కేం కాదు. 127 00:09:26,943 --> 00:09:28,653 ఇదుగో, మొదటగా నేను వెళ్తా. 128 00:09:28,737 --> 00:09:30,864 కానీ నాకు బ్యాకప్ అవరమైతే, నీ కోసం పిలుస్తా. 129 00:09:30,947 --> 00:09:32,032 సిద్ధంగా ఉండు. 130 00:09:32,824 --> 00:09:34,326 అలాగే, మిత్రమా. 131 00:09:44,711 --> 00:09:46,963 ప్యాక్స్టన్ మ్యూజియానికి స్వాగతం. 132 00:09:47,047 --> 00:09:49,257 డైనో వింగులో ఉన్న నా స్నేహితులను ఓసారి వచ్చి చూడండి. 133 00:09:51,259 --> 00:09:52,886 నా కోసం నువ్వు వచ్చావంటే భలే ఆనందంగా ఉంది, స్కై. 134 00:09:52,969 --> 00:09:54,054 హేయ్. 135 00:09:54,804 --> 00:09:56,640 చాలా కాలమైంది. 136 00:09:56,723 --> 00:09:59,392 నన్ను కలవడానికి ఓకే అన్నందుకు థ్యాంక్స్. డైరెక్టర్ స్నిట్కర్. 137 00:09:59,476 --> 00:10:00,518 దానిదేముందిలే. 138 00:10:00,602 --> 00:10:04,648 డైరెక్టర్ ఇప్పుడు అయ్యాను, కానీ నేను ఎప్పటికీ నీ జార్జియానే. 139 00:10:05,357 --> 00:10:07,317 నీ భర్త ఎలా ఉన్నాడు? 140 00:10:07,400 --> 00:10:10,070 ఆలెక్స్ గురించి నీకు తెలిసిందే కదా. ఎప్పుడూ హుషారుగానే ఉంటాడు. 141 00:10:10,779 --> 00:10:13,240 అది చాలా బాగుంది. 142 00:10:13,323 --> 00:10:15,742 మెకొడేనియనే కదా. 143 00:10:16,368 --> 00:10:17,535 అవును. 144 00:10:18,036 --> 00:10:21,331 మీ విచిత్రమైన బంగళాలో ఇలాంటివి కొన్ని ఉండే ఉంటాయి. 145 00:10:21,414 --> 00:10:25,085 ఉండవచ్చు. ఆ ఇంట్లో వింతలే వింతలు. 146 00:10:26,294 --> 00:10:27,963 ఏదో కళాఖండం గురించి అడగాలని 147 00:10:28,046 --> 00:10:31,383 ఫోనులో అన్నావు కదా. 148 00:10:31,466 --> 00:10:32,759 అవును. 149 00:10:32,842 --> 00:10:36,972 కొన్ని ఓల్మెక్ బొమ్మలు ఉన్నాయి, అవి అసలైన ఆర్కియాలజిస్ట్ తవ్వలేదు, కొన్నవి అవి, 150 00:10:37,055 --> 00:10:40,850 వాటి అసలైన స్థానానికి వాటిని చేర్చాలి, అదెలా అని కనుక్కోవడంలో సాయపడగలవా? 151 00:10:40,934 --> 00:10:42,561 అది దాదాపుగా అసంభవమనే చెప్పాలి. 152 00:10:42,644 --> 00:10:47,816 ఆ నాగరికత కాలగర్భంలో కలిసిపోయి సుమారుగా 2,500 ఏళ్లు కావస్తోంది. 153 00:10:47,899 --> 00:10:51,903 ఆ తర్వాత, వారు కట్టిన కోవెలలని చాలా మంది దొంగలు దోచేసుకున్నారు. 154 00:10:51,987 --> 00:10:53,154 అవునులే. 155 00:10:53,238 --> 00:10:56,741 కానీ కొనుగోలు రికార్డుల వంటి సమాచారం గురించి నీకేమైనా తెలుసా? 156 00:10:56,825 --> 00:10:57,659 ప్రదర్శన మూసివేయబడింది 157 00:10:57,742 --> 00:10:58,660 అయ్యో, నాకు తెలీదే. 158 00:10:58,743 --> 00:11:01,746 కొత్త ప్రదర్శన తెరుస్తున్నాం కదా, అందుకని అడుగుతున్నావు కదా. 159 00:11:01,830 --> 00:11:03,623 కొత్త ప్రదర్శన? 160 00:11:03,707 --> 00:11:07,002 అవును, ఓల్మెక్ కళాఖండాలకు సంబంధించిన మొబైల్ ప్రదర్శనశాల అన్నమాట. 161 00:11:07,085 --> 00:11:09,546 వాళ్లు మమ్మల్ని ఎంచుకోవడం మా అదృష్టం. 162 00:11:09,629 --> 00:11:12,340 ఆ అవకాశాన్ని దక్కించుకోవడానికి చాలా మ్యూజియమ్స్ ఎగబడుతున్నాయి. 163 00:11:12,424 --> 00:11:14,551 అయితే, ఈ కళాఖండాలన్నీ ఈ మధ్యే వచ్చాయా? 164 00:11:14,634 --> 00:11:17,596 అవును, ఇంకో మూడు రోజుల్లో దీన్ని ప్రదర్శనకు ఉంచుతాం. 165 00:11:17,679 --> 00:11:20,307 తెర వెనుక జరిగే వాటిని చూపిస్తా, రా. 166 00:11:30,066 --> 00:11:33,945 వీటిలో ఉన్న బ్యాటరీలు అయిపోతాయేమో, అదనంగా కొన్ని బ్యాటరీలు తెచ్చిపెట్టుకుంటే మంచిది. 167 00:11:34,029 --> 00:11:36,907 సరే. ఆలెక్స్ స్టడీ రూమ్ కి వెళ్లి తీసుకురా. 168 00:11:36,990 --> 00:11:39,034 ఆ పని నువ్వు చేయాలి. చేతులు ఉండేది నీకా, నాకా? 169 00:11:40,410 --> 00:11:41,578 నువ్వు చేయగలవు. 170 00:11:41,661 --> 00:11:45,040 బద్ధకంగా ఉన్నప్పుడే, చేతుల ప్రస్తావన తెస్తావు. 171 00:11:45,123 --> 00:11:47,208 మీరిద్దరూ నిశ్శబ్దంగా ఉంటారా? 172 00:11:49,377 --> 00:11:50,587 సరే! 173 00:11:50,670 --> 00:11:52,005 నేనే తెస్తాలే. 174 00:11:59,721 --> 00:12:01,139 అయ్యబాబోయ్, నన్ను మన్నించాలి. 175 00:12:01,223 --> 00:12:02,974 ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ. 176 00:12:03,934 --> 00:12:05,101 ఎమర్జెన్సీ. 177 00:12:06,603 --> 00:12:08,563 నువ్వేనా తాతయ్య? 178 00:12:09,731 --> 00:12:10,815 అయ్యయ్యో. 179 00:12:10,899 --> 00:12:13,693 తాతయ్య దెయ్యం అయిపోయాడు! 180 00:12:21,826 --> 00:12:23,828 అయ్యయ్యో. దీన్ని పగలగొట్టినట్టున్నా. 181 00:12:34,714 --> 00:12:36,216 ఏదో తేడాగా ఉందే! 182 00:12:49,437 --> 00:12:54,192 ఈ సందేశాల తర్వాత మళ్లీ "దెయ్యం పట్టిన తాతయ్య" సినిమా ప్రసారం అవుతుంది. 183 00:12:59,322 --> 00:13:01,408 అయ్యో. రస్ కి నేను సాయపడాలి. 184 00:13:01,491 --> 00:13:03,034 అయ్యయ్యో. 185 00:13:04,536 --> 00:13:08,582 ఈ కలెక్షనులో ఎక్కువగా రూపాన్ని మార్చగల బొమ్మలు ఉన్నాయి, 186 00:13:08,665 --> 00:13:11,251 ఓల్మెక్ వాళ్లు ఆ పవిత్రమైన వస్తువులు 187 00:13:11,334 --> 00:13:16,631 పులులు, గబ్బిలాలు, లేదా రిప్టైల్స్ గా కూడా మారిపోగలవని నమ్మేవారు. 188 00:13:23,972 --> 00:13:27,267 ఈ కళాఖండం ఈ మధ్యే వచ్చిందా? 189 00:13:27,350 --> 00:13:29,019 రెండు రోజుల క్రితమే వచ్చింది. 190 00:13:46,745 --> 00:13:47,746 దగ్గరికి రాకు! 191 00:13:58,840 --> 00:13:59,758 హమ్మయ్య, తప్పించుకున్నా. 192 00:14:30,163 --> 00:14:32,666 బిడ్డలకి ఏమైంది? 193 00:14:33,500 --> 00:14:35,252 పాన్, పారిపో! 194 00:14:47,389 --> 00:14:48,473 హా? 195 00:14:55,146 --> 00:14:58,108 పాన్, ఇందాక అవి ఏడవడం ఆపింది నీ వల్ల కాదు. 196 00:14:58,191 --> 00:14:59,234 అవి పడుకుంది లిండా వల్ల! 197 00:14:59,317 --> 00:15:01,736 తను బల్లి కాబట్టా? 198 00:15:01,820 --> 00:15:06,199 కాదు, దాన్ని చూస్తే వాటికి అమ్మ గుర్తొస్తోంది కాబట్టి. 199 00:15:09,160 --> 00:15:12,163 వీటిని అమ్మ దగ్గరికే తీసుకెళ్దాం. 200 00:15:21,756 --> 00:15:24,342 సరే, అందరం మామూలుగా ఉందాం. 201 00:15:24,426 --> 00:15:25,969 వందలాది ఏళ్ల ఎడబాటు తర్వాత 202 00:15:26,052 --> 00:15:29,055 ఒక కుటుంబాన్ని ఏకం చేయడానికి, ఆ బిడ్డ బొమ్మలను మనం మ్యూజియంలోకి తీసుకొచ్చి పెడుతున్నాం, అంతే 203 00:15:29,139 --> 00:15:30,181 షరా మామూలే ఇదంతా. 204 00:15:30,265 --> 00:15:33,476 ఈ బిడ్డలని కొంత సేపు చూసుకొన్న అనుభవంతో చెప్తున్నాను, 205 00:15:33,560 --> 00:15:35,145 నేను కూడా శిశువుగా ఉన్నప్పుడు 206 00:15:35,228 --> 00:15:37,731 మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి ఉంటాను, అందుకు నన్ను మన్నించు. 207 00:15:37,814 --> 00:15:41,151 హా, ఈ విషయంలో చాలా ఎక్కువ పని ఉంటుంది, ఒత్తిడీ కూడా ఉంటుండి. 208 00:15:41,234 --> 00:15:43,028 చాలా పని ఉంటుంది. 209 00:15:43,111 --> 00:15:44,988 కానీ అనుక్షణమూ మాకు ఆనందమే కలిగింది. 210 00:15:52,329 --> 00:15:54,623 లంచ్ బ్రేక్ ఏ క్షణంలోనైనా మొదలవ్వవచ్చు. 211 00:15:58,084 --> 00:16:00,462 సరే, అప్పుడు మనకి లోపల దూరి, 212 00:16:00,545 --> 00:16:03,215 ఈ పిల్లలని వాటి తల్లి దగ్గరికి చేర్చడానికి సమయం దొరుకుతుంది. 213 00:16:03,298 --> 00:16:04,966 మరి గార్డు సంగతేంటి? 214 00:16:05,050 --> 00:16:07,010 ఆ విషయం నాకు వదిలేయండి. 215 00:16:07,093 --> 00:16:08,845 లిండా, బిడ్డలను నువ్వు చూసుకో. 216 00:16:10,222 --> 00:16:12,057 సర్, మాకు మీ సాయం కావాలి. 217 00:16:12,140 --> 00:16:14,601 ఈజిప్షియన్ వింగులో ఒక చిన్నారి బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. 218 00:16:14,684 --> 00:16:16,394 మమ్మీకి ఉన్న గుడ్డని పీకేయాలని చూస్తున్నాడు! 219 00:16:16,478 --> 00:16:19,522 కంగారుపడకండి, మేడమ్, ఇలాంటి వాటిని అదుపు చేయడం నాకు వెన్నతో పెట్టిన విద్య. 220 00:16:32,744 --> 00:16:35,330 డైనోసార్ వింగును ఓసారి వచ్చి చూడండి. 221 00:16:35,413 --> 00:16:37,666 దానికి ఇదే సరైన సమయం! 222 00:16:40,377 --> 00:16:42,212 లిండా, ఆగు! 223 00:16:43,922 --> 00:16:44,756 అయ్యయ్యో! 224 00:16:45,549 --> 00:16:47,801 మరేం పర్వాలేదు, లిండా వచ్చేస్తుంది. 225 00:16:48,552 --> 00:16:50,262 పాన్, సహాయపడు! 226 00:16:55,475 --> 00:16:58,311 అయ్యయ్యో! ఇవి బల్లుల్లా మారబోతున్నాయి! 227 00:16:58,395 --> 00:17:00,939 కాస్త ఆ పిల్లలు ఏడవకుండా చూసుకుంటారా? 228 00:17:01,022 --> 00:17:03,316 మేము తనివితీరా ఆస్వాదిద్దామని మ్యూజియానికి వచ్చాం. 229 00:17:03,400 --> 00:17:05,485 మన్నించండి. మాకు చేతనైనంత మేం… 230 00:17:05,569 --> 00:17:08,280 పిల్లలని పెంచడం గురించి మాకు చెప్పకండి! 231 00:17:08,362 --> 00:17:10,739 మీకు ఏం తెలుసని అంటున్నారు! 232 00:17:14,535 --> 00:17:15,536 అవి పారిపోతున్నాయి! 233 00:17:16,912 --> 00:17:20,125 ఇంకా ఇక్కడే ఉన్నారే? ఈపాటికి మీరు లోపలికి వెళ్లిపోయి ఉండాలి కదా. 234 00:17:20,208 --> 00:17:21,877 పిల్లల్లో రెండు వెంట్ లోకి పాక్కుంటూ వెళ్లిపోయాయి. 235 00:17:21,959 --> 00:17:24,254 మాట్లాడేంత సమయం లేదు! అమ్మా, దీన్ని చూసుకో. 236 00:17:24,337 --> 00:17:25,421 రస్, నువ్వు నాతో రా. 237 00:17:27,257 --> 00:17:28,257 వెళ్లకు. 238 00:17:28,341 --> 00:17:31,261 ఎయిర్ వెంట్స్ లో ఇలా వెళ్లడం మంచిది కాదు. 239 00:17:33,680 --> 00:17:36,266 బాబోయ్. ఈ ఇరుకు ప్రదేశాలన్నీ నాకు తగులుతున్నాయేంటి! 240 00:17:37,684 --> 00:17:38,810 ఈ పని నువ్వు చేయగలవు. 241 00:17:43,899 --> 00:17:45,734 అయ్యబాబోయ్! బల్లి! 242 00:17:46,443 --> 00:17:47,444 లిండా! 243 00:17:59,915 --> 00:18:01,124 ఇప్పుడు ఎటు వెళ్లాలి? 244 00:18:02,208 --> 00:18:03,209 ఆ శబ్దం అక్కడి నుండి వస్తోంది! 245 00:18:04,836 --> 00:18:07,589 -మనం విడిపోవాలి. -అక్కడి నుండి కూడా వస్తోంది! 246 00:18:07,672 --> 00:18:09,341 అది అస్సలు మంచి ఐడియా కాదు. 247 00:18:09,424 --> 00:18:12,761 విడిపోవడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. మనం… 248 00:18:15,347 --> 00:18:17,140 ఒక్కడినే పిచ్చోడిలా మాట్లాడుకుంటున్నా! 249 00:18:25,315 --> 00:18:29,486 ఓయ్ బల్లి పిల్లా, ఇక్కడికి రావే! 250 00:18:34,157 --> 00:18:35,408 ప్లీజ్? 251 00:18:38,954 --> 00:18:41,289 అయ్యయ్యో. 252 00:18:56,846 --> 00:18:58,557 బాగానే తుర్రుమంటున్నావు, లిండా. 253 00:18:58,640 --> 00:19:00,350 కానీ నా దగ్గర నీ ఆటలు సాగవు. 254 00:19:03,520 --> 00:19:05,438 ఎక్కడికమ్మా వెళ్తున్నావు! 255 00:19:17,659 --> 00:19:19,077 ఇది నువ్వు చేయగలవు. 256 00:19:30,547 --> 00:19:31,631 అబ్బా. 257 00:19:39,055 --> 00:19:40,974 ఈ పని నాకు అస్సలు నచ్చట్లేదు. 258 00:19:42,934 --> 00:19:45,395 ఎక్కడున్నావే? 259 00:19:50,317 --> 00:19:52,277 నా కర్మ ఇవాళ ఇలా తగలడింది. 260 00:19:59,868 --> 00:20:01,077 తప్పించుకున్నా. 261 00:20:02,162 --> 00:20:03,830 అయ్యో, ఎటు వెళ్లిపోయింది! 262 00:20:20,972 --> 00:20:26,311 అడుగుల చప్పుడు వినిపించకుండా నడుస్తున్నావేమో, ఈ వైబ్రేషన్స్ నీ ఆచూకీని పట్టించేస్తాయి. 263 00:20:26,895 --> 00:20:28,480 దగ్గర్లోనే ఉన్నావు నువ్వు. 264 00:20:44,037 --> 00:20:44,871 హా? 265 00:20:50,460 --> 00:20:52,295 సారీ, నీ మంచి కోసమే ఇదంతా. 266 00:20:54,839 --> 00:20:56,341 రాస్, వస్తున్నా! 267 00:20:58,218 --> 00:20:59,052 పట్టేసుకున్నా! 268 00:21:01,638 --> 00:21:03,139 కుదురుగా ఉండు! 269 00:21:10,564 --> 00:21:11,856 గట్టిగా పట్టుకొని ఉండు! 270 00:21:21,741 --> 00:21:23,034 బతికే ఉన్నాం! 271 00:21:23,618 --> 00:21:26,413 -పిల్లలూ! మీకేమీ కాలేదుగా? -ఏమీ కాలేదు. 272 00:21:26,496 --> 00:21:27,706 మేము నలుగురమూ కులాసాగానే ఉన్నాం. 273 00:21:32,210 --> 00:21:33,044 హా? 274 00:21:43,722 --> 00:21:45,849 వావ్. ఇప్పుడు బొమ్మకి ఒక కళ వచ్చింది. 275 00:21:45,932 --> 00:21:48,476 సరైన పని చేయడమంటే 276 00:21:48,560 --> 00:21:51,938 కళాఖండాలను తీసుకొచ్చిన చోటే వదిలిరావడం కాదు అని ఇప్పుడు అర్థమైంది. 277 00:21:52,022 --> 00:21:56,234 అవును, ఒక్కో కళాఖండానికి మనం ఒక్కో రకమైన పని చేయాలనుకుంటా. 278 00:21:56,318 --> 00:21:58,069 ఒక్కోటి ఒక్కో పజిల్ అన్నమాట. 279 00:21:58,153 --> 00:22:01,865 అదృష్టవశాత్తూ, మీ ఇద్దరూ పజిల్స్ ని పరిష్కరించడంలో నేర్పరులు. 280 00:22:10,165 --> 00:22:13,627 ఆ బిడ్డలను నేను చూసుకున్నాను. అది సులభమైన పనేమీ కాదు, కానీ వాటికి నా అవసరం ఉంది. 281 00:22:13,710 --> 00:22:14,878 కాబట్టి, నేనే మార్గాన్ని కనుగొన్నాను. 282 00:22:15,587 --> 00:22:18,423 మన పిల్లలు సామాన్యులు కాదు, ఆలెక్స్. 283 00:22:18,506 --> 00:22:20,175 నువ్వైతే గర్వంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయేవాడివి. 284 00:22:22,552 --> 00:22:23,595 ఒక్క నిమిషం. 285 00:22:23,678 --> 00:22:25,347 ఇది పని చేయవచ్చు! 286 00:22:27,182 --> 00:22:28,975 నాన్నకి శాప విముక్తి కలిగించే దారి కనిపెట్టేశా అనుకుంటా. 287 00:23:02,342 --> 00:23:04,344 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్