1 00:00:17,310 --> 00:00:19,354 రా. వచ్చి తీసుకో. 2 00:00:19,938 --> 00:00:21,106 ఇదుగో మా కానుక. 3 00:00:22,649 --> 00:00:23,650 నాన్న! 4 00:00:23,733 --> 00:00:26,027 వద్దు, అక్కడే ఉండు. వెలుతురులోనే ఉండు. 5 00:00:26,111 --> 00:00:29,489 నువ్వు ఏం చేసినా కానీ, వెలుతురులోనే ఉండాలి. 6 00:00:38,623 --> 00:00:39,624 తీసుకో. 7 00:00:48,216 --> 00:00:49,259 నాన్నా! 8 00:01:16,578 --> 00:01:19,497 జోస్యం చెప్పే గిన్నె 9 00:01:20,665 --> 00:01:23,501 ఆ గిన్నె పౌర్ణమి రోజే పని చేస్తుందని జర్నల్ లో రాసి ఉంది, 10 00:01:24,377 --> 00:01:25,795 ఇవాళ పౌర్ణమి. 11 00:01:26,379 --> 00:01:29,466 జోస్యం చెప్పే గిన్నె అనే కళాఖండాన్ని మనం ఉపయోగించి 12 00:01:29,549 --> 00:01:31,635 భవిష్యత్తు తెలుసుకోవచ్చు, లేదా నాన్న ఆత్మతో మాట్లాడవచ్చు. 13 00:01:31,718 --> 00:01:34,554 ఆత్మ అనకు. నాన్న బతికే ఉన్నాడు. 14 00:01:34,638 --> 00:01:37,599 మీ నాన్న చనిపోయాడని మేము అనట్లేదు, బంగారం, 15 00:01:37,682 --> 00:01:42,062 కానీ మనం ఏమైతే చేస్తున్నామో, అవి పని చేస్తున్నాయని మనకి తెలియాలి కదా. 16 00:01:42,145 --> 00:01:45,065 అవును. ఈ జోస్యం చెప్పే గిన్నె ద్వారా మనం నాన్నతో మాట్లాడగలిగితే, 17 00:01:45,148 --> 00:01:47,734 ఆయన్ని మనం కాపాడవచ్చనే మన సిద్ధాంతం నిజం అని మనకి తెలుస్తుంది. 18 00:01:48,360 --> 00:01:50,904 రవ్వంత అవకాశమున్నా మనం ప్రయత్నించాలి. 19 00:01:50,987 --> 00:01:53,823 డిన్నర్ తర్వాత, జోస్యం చెప్పే ఆ గిన్నె ఎక్కడ ఉందో చూద్దాం. 20 00:01:58,203 --> 00:02:01,289 నిజానికి, ఆ గిన్నెని ఇప్పటిదాకా నేను చూడనేలేదు, 21 00:02:01,373 --> 00:02:03,792 కానీ అది ఎక్కడ ఉండవచ్చో నాకు బాగా తెలుసు. 22 00:02:12,801 --> 00:02:14,761 ఇది ఇంకో భద్రతాపరమైన జాగ్రత్తనా? 23 00:02:14,844 --> 00:02:16,054 అవును. 24 00:02:18,014 --> 00:02:20,850 ఈ ద్వారాలలో చాలా వాటిని బయట నుండి మాత్రమే తెరవడానికి వీలవుతుంది. 25 00:02:21,977 --> 00:02:23,144 సుస్వాగతం. 26 00:02:27,524 --> 00:02:28,608 లోపలికి వెళ్లారా? 27 00:02:29,234 --> 00:02:30,694 కానీ అక్కడ చాలా చీకటిగా ఉంది. 28 00:02:30,777 --> 00:02:32,404 కంగారు అక్కర్లేదు. 29 00:02:32,487 --> 00:02:35,198 చీకట్లో కొన్నిసార్లు మనం అనుకోనివి ఎదురవుతుంటాయి. 30 00:02:36,324 --> 00:02:38,410 నాకు అలాంటివి అంటే అస్సలు నచ్చదు. 31 00:02:46,585 --> 00:02:49,462 వావ్. చాలా అందంగా ఉంది. 32 00:02:49,546 --> 00:02:51,631 సెలస్టియానికి స్వాగతం. 33 00:02:51,715 --> 00:02:54,467 ఈ కళాఖండాలన్నీ విశ్వానికి సంబంధించినవి. 34 00:02:54,551 --> 00:02:57,387 నా హార్మోనికాని వాయించడానికి నేను ఇక్కడికి చాలాసార్లు వస్తాను. 35 00:02:57,470 --> 00:02:59,764 ఇక్కడ సంగీతం చాలా బాగా వస్తుంది. 36 00:02:59,848 --> 00:03:02,434 -ఆలెక్స్ కూడా హార్మోనికా వాయిస్తాడు. -అవును. 37 00:03:02,517 --> 00:03:04,603 నేను నేర్చుకుంది అతని దగ్గరి నుండే కదా? 38 00:03:04,686 --> 00:03:06,354 అదేనా జోస్యం చెప్పే గిన్నె? 39 00:03:07,856 --> 00:03:09,941 డిజైన్ అదిరింది. 40 00:03:10,025 --> 00:03:13,069 సరే, దీన్ని ఎలా ఉపయోగించాలి? నాన్నతో ఎలా మాట్లాడాలి? 41 00:03:13,153 --> 00:03:16,364 జర్నల్ ప్రకారం మరో లోకంలో ఉన్న మన ఆత్మీయులతో మాట్లాడటానికి, 42 00:03:16,448 --> 00:03:18,408 మనం ఈ గిన్నెలో నీళ్లు పోయాలి. 43 00:03:18,491 --> 00:03:19,743 ఆ పనే చేస్తున్నాగా. 44 00:03:19,826 --> 00:03:22,287 నీకు ఖచ్చితంగా తెలుసా ఎలా, ఏంటీ అని? 45 00:03:22,370 --> 00:03:24,539 ఇక్కడ రాసున్నదే చదువుతున్నా నేను. 46 00:03:24,623 --> 00:03:25,957 సరే. 47 00:03:26,041 --> 00:03:27,334 ఏమీ కాలేదే. 48 00:03:27,417 --> 00:03:29,294 ఏమీ ఎందుకు జరగట్లేదు? 49 00:03:29,377 --> 00:03:30,462 నన్ను కంగారుపెట్టవద్దు. 50 00:03:30,545 --> 00:03:34,549 తర్వాత, మనం ఎవరినైతె పిలుస్తున్నామో, అతనికి సంబంధించిన వస్తువు ఒకటి మనకి కావాలి. 51 00:03:35,175 --> 00:03:36,968 ఈ కీ చెయిన్ ఆలెక్స్ దే. 52 00:03:37,052 --> 00:03:39,846 కిందటి ఏడాది ఫాదర్స్ డే సందర్భంగా ఇచ్చాం మేము అది. 53 00:03:39,930 --> 00:03:42,307 ఇంకో కొత్తది ఇద్దాములే. మాటిస్తున్నా నేను. 54 00:03:42,390 --> 00:03:43,725 దాన్ని గిన్నెలో వేయ్. 55 00:03:50,523 --> 00:03:51,942 ఇప్పుడు పని చేస్తోంది. 56 00:03:52,025 --> 00:03:53,485 తర్వాత? తర్వాత ఏంటి? 57 00:03:54,152 --> 00:03:55,153 అయ్యయ్యో. 58 00:03:56,321 --> 00:03:58,281 హోరస్, ఆ పుస్తకంలో ఏం రాసుంది? 59 00:03:59,157 --> 00:04:00,575 నీళ్లు పడటం వల్ల ఇక్కడ పేజీలు పాడయ్యాయి. 60 00:04:00,659 --> 00:04:02,160 కాబట్టి ఏముందో నాకు సరిగ్గా కనిపించట్లేదు. 61 00:04:02,744 --> 00:04:05,121 సరే మరి, ఇక దీన్ని ముగిద్దాం. 62 00:04:05,205 --> 00:04:08,041 మనం చదివి, అర్థం చేసుకున్నాకే ఈ పని చేయాలి. 63 00:04:08,124 --> 00:04:10,335 కానీ అమ్మా, పౌర్ణమి ఇవాళే కదా. 64 00:04:10,418 --> 00:04:13,296 మరో అవకాశం కోసం మనం ఒక నెల ఆగాలి. 65 00:04:13,380 --> 00:04:14,756 మనం ఇప్పుడే ఇది చేయాలి… 66 00:04:22,096 --> 00:04:25,058 నువ్వు ఎవరో ఏమో కానీ, నా దగ్గరకి వస్తే అయిపోతావు. 67 00:04:25,141 --> 00:04:26,518 అందరూ ఇటు పదండి. 68 00:04:33,817 --> 00:04:36,861 ఏంటది? గిన్నె లోపలి నుండి వచ్చింది అది. 69 00:04:36,945 --> 00:04:38,530 దాని గురించి ఈ పుస్తకంలో ఏమీ లేదే. 70 00:04:38,613 --> 00:04:41,950 అందుకే చెప్పా, సమాచారమంతా లేనప్పుడు మనం ప్రయత్నించకూడదు అని. 71 00:04:42,033 --> 00:04:45,537 మనం ఇప్పుడు నాన్నతో మాట్లాడకుంటే, మనం చేసేది సఫలం అవుతుందా లేదా అనేది మనకి తెలీదు. 72 00:04:45,620 --> 00:04:47,622 కాబట్టి ఆ మాత్రం రిస్క్ తీసుకోవచ్చని అనిపించింది. 73 00:04:49,124 --> 00:04:51,418 మరేం పర్వాలేదు, రస్. దీనికి మనం పరిష్కార మార్గం కనిపెడదాం. 74 00:04:51,501 --> 00:04:54,421 మనం ఆ పని చేసేదాకా, ఈ ద్వారం దాన్ని లోపలే బంధించి ఉంచుతుందని ఆశిద్దాం. 75 00:04:54,504 --> 00:04:56,882 స్టాన్లీ? స్టాన్లీ ఎక్కడ? 76 00:04:57,924 --> 00:04:59,509 దయచేసి ద్వారాన్ని తెరవండి. 77 00:05:00,176 --> 00:05:01,177 స్టాన్లీ! 78 00:05:01,261 --> 00:05:04,556 త్వరగా కానివ్వండి. అది ఇక్కడే ఉంది. 79 00:05:05,849 --> 00:05:07,142 ఇది తెరుచుకోవట్లేదు. 80 00:05:08,852 --> 00:05:11,021 ఈ పిచ్చి మొక్క మెకానిజమ్ లో చిక్కుబడిపోయి ఉంది. 81 00:05:11,688 --> 00:05:14,190 అక్కడి నుండి నిన్ను బయట పడేస్తాం, స్టాన్లీ. కాస్త ఓపిక పట్టు. 82 00:05:14,274 --> 00:05:16,484 దీన్ని కత్తిరించడానికి మనకి ఏదొకటి కావాలి. 83 00:05:16,568 --> 00:05:18,153 ఆ పని నాకు వదిలేయండి. 84 00:05:24,993 --> 00:05:26,953 అది కాస్త వేగంగా చేయవచ్చుగా? 85 00:05:27,037 --> 00:05:29,247 ఈ బ్లేడ్లతో ఇంతకంటే వేగంగా కాదు బాబూ. 86 00:05:29,331 --> 00:05:31,041 ఈ పిచ్చి మొక్క ఎంత గట్టిదో నీకు తెలుసు కదా. 87 00:05:33,460 --> 00:05:34,961 హలో? 88 00:05:40,884 --> 00:05:44,846 గిన్నె నుండి వచ్చిన ఆ భయంకరమైన జీవికి వెలుతురు అంటే భయం అనుకుంటా. 89 00:05:44,930 --> 00:05:49,059 మంచిది. రక్షణాత్మకంగా వ్యవహరించు, నీ టార్చుని ఆయుధంలా వాడు. 90 00:05:49,142 --> 00:05:50,644 నా ప్రయత్నం నేను చేస్తా. 91 00:05:56,775 --> 00:05:58,777 అతడిని లోపలే ఇరుక్కుపోయేలా చేశానంటే నమ్మలేకపోతున్నా. 92 00:05:58,860 --> 00:06:01,363 నా అంత చెత్త స్నేహితుడు ఇంకెవరూ ఉండరు. 93 00:06:02,697 --> 00:06:04,741 ఇది సఫలం కావాలని మనందరం అనుకున్నాం. 94 00:06:04,824 --> 00:06:06,910 కానీ ఒక్కోసారి ఆశ అనేది విచక్షణని పని చేయనివ్వదు. 95 00:06:06,993 --> 00:06:09,204 అవును. మీరు మొత్తం చెడగొట్టేశారు. 96 00:06:10,538 --> 00:06:12,874 జోక్ చేశా. చెడగొట్టడంలో నేనే కదా నంబర్ వన్. 97 00:06:14,000 --> 00:06:17,837 ఆ జీవిని మళ్లీ ఆ గిన్నెలోకి ఎలా పంపించాలో మనం కనుగొనాలి. 98 00:06:17,921 --> 00:06:21,633 కానీ ఎలా? ఈ పుస్తకంలో ఉండే సూచనలు సగం సరిగ్గా కనిపించట్లేదు. 99 00:06:27,138 --> 00:06:28,390 నాకొక ఐడియా తట్టింది. 100 00:06:35,063 --> 00:06:37,941 సూపర్, పిల్లోడా. ఇప్పుడు అంతా కనిపిస్తోందా? 101 00:06:38,024 --> 00:06:39,734 కొన్నిచోట్ల ఇంకా సరిగ్గా కనిపించట్లేదు, 102 00:06:39,818 --> 00:06:42,112 కానీ ఆ జీవిని గిన్నెలోకి పంపించేయడానికి, 103 00:06:42,195 --> 00:06:43,655 వెన్నెలకి ఏదో సంబంధం ఉన్నట్టుంది. 104 00:06:46,992 --> 00:06:49,077 సీలింగులో ఒక చోట ఓపెన్ గా ఉంది. 105 00:06:49,661 --> 00:06:51,162 ఒక షాఫ్టులా ఉంది. 106 00:06:51,246 --> 00:06:53,790 అందుకే కొర్నీలియస్ దాన్ని అక్కడ పెట్టి ఉంచుంటాడు. 107 00:06:53,873 --> 00:06:55,333 వెన్నెల కోసం. 108 00:06:55,417 --> 00:06:57,669 ఆ షాప్టు అవతలి అంచు ఎక్కడ ఉందో చూడాలి మనం. 109 00:06:57,752 --> 00:07:00,255 కానీ ఇప్పటికీ ఈ గిన్నెని ఎలా ఉపయోగించాలో మనకి తెలీదు కదా. 110 00:07:00,338 --> 00:07:02,382 అది తెలిసినవాళ్లని మనం సంప్రదించాలి. 111 00:07:02,465 --> 00:07:05,510 మ్యూజియమ్ లో పని చేసే నీ స్నేహితురాలు సాయపడగలదా? ఓల్మెక్ బేబీల విషయంలో ఆమె సహాయపడింది కదా. 112 00:07:05,594 --> 00:07:09,264 -నిజమే. జార్జియాకి తెలిసి ఉండవచ్చు. -మంచిది. ఇక మనం అక్కడికే వెళ్దాం. 113 00:07:09,347 --> 00:07:10,640 మీరిద్దరూ ఈ గిన్నె సంగతేంటో చూడండి. 114 00:07:10,724 --> 00:07:12,767 నేను ఇక్కడే ఉండి వెన్నెల విషయం చూస్తా. 115 00:07:16,730 --> 00:07:18,064 మేము త్వరగానే వచ్చేస్తాం. 116 00:07:20,400 --> 00:07:21,735 గుడ్ లక్. 117 00:07:21,818 --> 00:07:23,904 హా. ప్రాణాలు పోగొట్టుకోకు, బ్రో. 118 00:07:23,987 --> 00:07:25,530 కాస్త మంచి మాటలు మాట్లాడు, పాండోరా. 119 00:07:29,242 --> 00:07:30,744 ఈ పని నువ్వు చేయగలవు, బుడ్డోడా. 120 00:07:30,827 --> 00:07:31,828 అవును. 121 00:07:32,329 --> 00:07:33,538 నేను చేయగలను. 122 00:07:33,622 --> 00:07:36,541 కానీ దీన్ని త్వరగా చేయడానికి ఏదైనా మార్గం ఉందా? 123 00:07:42,881 --> 00:07:45,634 పని వేళలు అయిపోయినా కూడా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్, జార్జియా. 124 00:07:45,717 --> 00:07:47,427 నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. 125 00:07:47,510 --> 00:07:49,846 జోస్యం చెప్పే గిన్నె. 126 00:07:49,930 --> 00:07:52,557 చాలా ఆసక్తికరంగా ఉంది. 127 00:07:52,641 --> 00:07:54,935 ఇంతకీ, దీనితో మీకేంటి పని? 128 00:07:55,018 --> 00:07:57,646 ఆలెక్స్ పుస్తకం గురించి పరిశోధన కోసం. 129 00:07:57,729 --> 00:08:00,732 వీటి గురించి నీకేమైనా తెలుసా? అవి ఎలా పని చేస్తాయో తెలుసా? 130 00:08:00,815 --> 00:08:03,360 సిద్ధాంతపరంగానే కదా? 131 00:08:03,443 --> 00:08:08,031 మ్యాజిక్ గిన్నెల లాంటి వాటిని నువ్వేమీ నమ్మవు కదా. 132 00:08:08,114 --> 00:08:10,325 ఎందుకు? అందులో పెద్ద వింతేమీ లేదు కదా. 133 00:08:12,369 --> 00:08:13,995 అవునులే, కానీ సిద్ధాంతపరంగానే. 134 00:08:15,163 --> 00:08:16,873 దురదృష్టవశాత్తూ, నాకు తెలీదు. 135 00:08:16,957 --> 00:08:19,793 కానీ ఎవరికి తెలిసి ఉండవచ్చో నాకు తెలుసు. 136 00:08:19,876 --> 00:08:23,421 అతను జోస్యం చెప్పగల కళాఖండాల గురించి బాగా తెలుసు. 137 00:08:23,505 --> 00:08:25,257 నీల్ పెక్మిన్. 138 00:08:25,340 --> 00:08:29,386 అతనికి, నాకూ పరిచయం లేదు, కానీ ఆయన ఎవరో నాకు తెలుసు. 139 00:08:29,469 --> 00:08:33,431 నీల్ చాలా విచిత్రమైన వ్యక్తి అని అంటుంటారు. 140 00:08:34,099 --> 00:08:36,726 అతను ఇంటి గడప దాటి బయటకు రాడు. 141 00:08:37,310 --> 00:08:39,645 అలాగే. థ్యాంక్స్, జార్జియా. 142 00:08:46,945 --> 00:08:49,447 లారీ, ఇంకా లోపలే ఉన్నావా? 143 00:08:49,531 --> 00:08:52,867 ఈ జీవికి నేనంటే బాగా ఇష్టం అనుకుంటా! 144 00:08:52,951 --> 00:08:54,744 నేను ఇక్కడే ఉన్నా. ఇంకా కోస్తూ ఉన్నా. 145 00:08:55,704 --> 00:08:57,080 మాట్లాడుతూ ఉండవా దయచేసి. 146 00:08:57,163 --> 00:08:59,332 ఈ నిశ్శబ్దానికి చచ్చిపోయేలా ఉన్నా నేను. 147 00:08:59,416 --> 00:09:01,209 నీ కంగారును ఎలా దూరం చేయాలో నాకు తెలుసు. 148 00:09:04,462 --> 00:09:06,298 లారీ, ఉన్నావా? 149 00:09:09,551 --> 00:09:12,220 నాకు కావాల్సింది ఇది అస్సలు కానే కాదు. 150 00:09:14,806 --> 00:09:17,434 ఇదుగో, బాసూ. నీ సమస్యలన్నింటికీ పరిష్కారం. 151 00:09:19,936 --> 00:09:21,730 కానీ నీకు ఈ శబ్దం అస్సలు నచ్చదు కదా. 152 00:09:21,813 --> 00:09:24,190 ఈసారికి భరిస్తాలే. 153 00:09:33,450 --> 00:09:37,120 వీడ్కోలు, వీడ్కోలు స్పానిష్ ముద్దుగుమ్మలు 154 00:09:37,203 --> 00:09:40,874 వీడ్కోలు, వీడ్కోలు స్పెయిన్ ముద్దుగుమ్మలు 155 00:09:40,957 --> 00:09:43,251 మాకు ఆదేశాలందాయి ఇక మేము బయలుదేరాలి… 156 00:09:47,297 --> 00:09:48,590 ఆ సంగీతం. 157 00:09:48,673 --> 00:09:51,593 అది అబ్జర్వేటరీ నుండి వస్తోంది. 158 00:09:51,676 --> 00:09:52,844 అర్థమైపోయింది! 159 00:10:17,035 --> 00:10:18,245 నేను కనిపెట్టేశా. 160 00:10:18,328 --> 00:10:20,330 నేను షాప్టు పైన ఉన్నాను. నా మాటలు వినిపిస్తున్నాయా, స్టాన్లీ? 161 00:10:20,914 --> 00:10:22,707 హా, వినిపిస్తున్నాయి. 162 00:10:22,791 --> 00:10:25,669 అక్కడ వెన్నెల పడేల చేస్తా. కాస్త ఓపిగ్గా ఉండు. 163 00:10:27,170 --> 00:10:29,172 ఇక ఓపిగ్గా ఉండటం నా వల్ల కాదు. 164 00:10:48,149 --> 00:10:49,359 ఇంటికి వెళ్లిపో, పాపా. 165 00:10:50,151 --> 00:10:52,612 ఏమన్నారు? నేనేమీ చిన్నపాపని కాదు. 166 00:10:52,696 --> 00:10:55,407 నువ్వు పాపవి అయినా కాకపోయినా, ఇక్కడి నుండి వెళ్లిపో. 167 00:10:55,490 --> 00:10:58,034 ఈరోజు రాత్రి నేను చాలా బిజీ. 168 00:10:58,785 --> 00:11:00,495 మిస్టర్ పెక్మిన్, దయచేసి మా మాట వినండి. 169 00:11:00,579 --> 00:11:02,956 దీని గురించి మేము మీతో మాట్లాడాలి. 170 00:11:12,132 --> 00:11:15,427 ఈ లైట్ల వల్ల చాలా వేడిగా ఉంది. 171 00:11:15,510 --> 00:11:16,887 ఇది వేసుకోండి. 172 00:11:16,970 --> 00:11:18,263 అలవాటు అయిపోతుందిలే. 173 00:11:19,014 --> 00:11:20,765 మీకు ఆ గిన్నె ఎక్కడ దొరికింది? 174 00:11:20,849 --> 00:11:23,059 మా బేస్మెంటులో ఉండింది. 175 00:11:23,643 --> 00:11:25,604 వీటి గురించి మీకు తెలుసని మాకు తెలిసింది. 176 00:11:25,687 --> 00:11:27,772 వీటి గురించి నాకు చాలా ఎక్కువ తెలుసు. 177 00:11:27,856 --> 00:11:31,902 ఆ భయంకరమైన గిన్నెల వల్ల మా కుటుంబమంతా శాపగ్రస్తమైపోయింది. 178 00:11:31,985 --> 00:11:35,113 చెప్తున్నా కదా, కుటుంబ శాపాల గురించి మాకు మహబాగా తెలుసు. 179 00:11:35,196 --> 00:11:36,573 ప్లీజ్. మిస్టర్ పెక్మిన్. 180 00:11:36,656 --> 00:11:37,949 నీల్. 181 00:11:38,033 --> 00:11:39,576 మాకు మీ సహయం కావాలి. 182 00:11:39,659 --> 00:11:40,911 మీకు నేనెందుకు సాయపడాలి? 183 00:11:40,994 --> 00:11:43,580 ఈ గిన్నె లోపలి నుండి ఒకటి బయటకు వచ్చింది, దానితో మా మిత్రుడొకడు ప్రమాదంలో పడిపోయాడు. 184 00:11:43,663 --> 00:11:45,707 అతను దానితో పాటు ఒక చోట ఇరుక్కునిపోయాడు, మాకు ఎక్కువ సమయం లేదు. 185 00:11:45,790 --> 00:11:47,626 దూత బయటకు వచ్చిందా? 186 00:11:47,709 --> 00:11:49,544 దానికి మీరు కానుక ఇవ్వలేదా? 187 00:11:49,628 --> 00:11:50,921 కానుక ఏంటి? 188 00:11:51,004 --> 00:11:53,423 అయ్యయ్యో. ఇది దారుణాతి దారుణం. 189 00:11:53,506 --> 00:11:55,425 మేము చేసిన పొరపాటే మీరు కూడా చేశారు. 190 00:11:55,508 --> 00:11:58,136 -మీరు నియమాలను పాటించలేదు. -నియమాలా? 191 00:11:58,220 --> 00:12:00,597 ఆ ప్రక్రియలో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. 192 00:12:00,680 --> 00:12:03,266 మీరు ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నారో, వారి వస్తువును గిన్నెలో వేయడం ద్వారా 193 00:12:03,350 --> 00:12:04,517 అది యాక్టివేట్ అవుతుంది. 194 00:12:04,601 --> 00:12:05,977 ఆ పని మేము కూడా చేశాం. 195 00:12:06,061 --> 00:12:09,648 అత్యంత మఖ్యమైన భాగం ఏంటంటే, కానుక ఇవ్వడం. 196 00:12:09,731 --> 00:12:14,194 మీకు అర్థవంతంగా ఉండేది ఏదైనా కానీ, దానికి పున్నమి వెన్నెల తగిలేలా గిన్నెలో వేయాలి. 197 00:12:14,277 --> 00:12:16,738 ఆ కానుక దూతని మెప్పిస్తుంది. 198 00:12:17,322 --> 00:12:18,448 కానుక! 199 00:12:18,531 --> 00:12:20,200 రస్ కి సరిగ్గా కనిపించని భాగం అదే అయ్యుంటుంది. 200 00:12:20,283 --> 00:12:23,286 ఇప్పుడు ఎలాగూ దూత వచ్చేసింది కాబట్టి, దాన్ని వదిలించుకోవడం ఎలా? 201 00:12:23,370 --> 00:12:25,455 గిన్నెలో కానుకని పెట్టడం ద్వారా. 202 00:12:25,538 --> 00:12:27,916 కానీ ఈ సమయంలో, అదంత తేలిక కాదు. 203 00:12:27,999 --> 00:12:30,835 చాలా కాలం క్రితం మా పూర్వీకులు ఒకరి వల్ల ఓ దూత బయటకు వచ్చింది, 204 00:12:30,919 --> 00:12:33,255 అప్పట్నుంచీ పెక్మిన్ వంశాన్ని అది పీడిస్తూ వస్తోంది. 205 00:12:33,338 --> 00:12:35,006 మాకు అర్థమవ్వడం కోసం వివరంగా చెప్పండి. 206 00:12:35,090 --> 00:12:38,176 దాని ద్వారా మాకు పరిష్కారం లభిస్తుందేమో, మీకు కూడా సాయపడగలమేమో. 207 00:12:38,260 --> 00:12:41,888 ఆ జోస్యం చెప్పే గిన్నె చాలా కాలం క్రితం మా కుటుంబం దగ్గరే ఉండేది. 208 00:12:41,972 --> 00:12:44,474 జోస్యం చెప్పగల వరం పెక్మిన్ వంశస్థులందరికీ ఉండేది. 209 00:12:45,559 --> 00:12:48,853 అది మా ముత్తాత, ఆర్థుర్ తో మొదలైంది. 210 00:12:48,937 --> 00:12:51,189 అయన ఈ గిన్నెలతో మంచి ఉద్దేశంతో ఉపయోగించేవాడు, 211 00:12:51,273 --> 00:12:54,609 ఆత్మీయులు దూరమై బాధాపడేవారికి ఆ ఆత్మీయుల ఆత్మలతో మాట్లాడే వీలు కల్పించేవాడు. 212 00:12:54,693 --> 00:12:58,572 ఇంతలో ఆయనకి ఒక కళాఖండాల కలెక్టర్ పరిచయమయ్యాడు, అప్పట్నుంచీ అంతా మారిపోయింది. 213 00:12:58,655 --> 00:13:01,992 ఈ కలెక్టర్, ఈ గిన్నెల ఉద్దేశాన్ని దుర్వినియోగం చేయసాగాడు. 214 00:13:02,075 --> 00:13:04,494 చనిపోయినవారి నిధులను హస్తగతం చేసుకోవడానికని, 215 00:13:04,578 --> 00:13:07,163 వారి ఆత్మలను పిలుస్తూ ఊడిగం చేయించుకోసాగాడు. 216 00:13:07,247 --> 00:13:11,418 అతనికి కావాల్సింది దక్కించుకొనేదాకా ఆత్మలకు శాంతి లేకుండా చేసేవాడు. 217 00:13:11,501 --> 00:13:14,129 ఆ కలెక్టర్ మాయామాటలు చెప్పి ఆర్థుర్ చేత తన పని చేయించుకుంటూ వచ్చాడు, 218 00:13:14,212 --> 00:13:16,131 కానీ ఆర్థుర్ ఇక భరించలేకపోయాడు. 219 00:13:16,214 --> 00:13:19,759 ఆఖరిగా ఒకసారి చేస్తానని, ఇక అంతే అని ఆ కలెక్టర్ అంటే ఆర్థుర్ అంగీకరించాడు. 220 00:13:19,843 --> 00:13:22,512 కానీ కలెక్టర్ అతడిని మోసగించి, కానుకని దూతకు అందించే ముందే, 221 00:13:22,596 --> 00:13:24,723 ఆ గిన్నెని తీసుకొని పారిపోయాడు. 222 00:13:24,806 --> 00:13:28,852 కాబట్టి, దూత, తనకి దక్కాల్సిన కానుకకి పరిహారంగా ఆర్థుర్ ని తీసుకెళ్లిపోయింది. 223 00:13:29,811 --> 00:13:33,231 అప్పట్నుంచీ, ఆ దూత నీడల్లో బతుకుతూ ఉంది. 224 00:13:33,315 --> 00:13:36,359 ప్రతి పౌర్ణమికి, వంశంలోని తర్వాతి పెక్మిన్ ని వశం చేసుకోవడానికి వస్తూ ఉంటుంది. 225 00:13:36,443 --> 00:13:39,195 మేము ఎక్కడికి వెళ్లినా, అది మా వెంటే వస్తూ ఉంటుంది. 226 00:13:39,946 --> 00:13:42,782 మా నాన్న కానుకని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉండగా చూశా నేను. 227 00:13:43,658 --> 00:13:45,035 అతని పాకెట్ గడియారాన్ని అన్నమాట. 228 00:13:45,619 --> 00:13:48,747 కానీ గిన్నె లేకుండా, ఆ దూత దాన్ని స్వీకరించలేదు. 229 00:13:48,830 --> 00:13:52,042 అందుకే మీరు ఎప్పుడూ లైట్స్ వేసుకొని ఉంటారు అన్నమాట. 230 00:13:52,125 --> 00:13:54,377 నీడలు ఉండవు, దూత రాదు. 231 00:13:54,461 --> 00:13:58,757 కానీ ప్రతిరోజు, ప్రతిక్షణం అది నన్ను గమనిస్తూ ఉందన్న విషయం నాకు తెలుస్తోంది. 232 00:13:59,382 --> 00:14:01,051 బాబోయ్, అది చాలా దారుణమైన విషయం. 233 00:14:01,134 --> 00:14:04,971 నీల్, ఆ కలెక్టర్ మా పూర్వీకుడే అనుకుంటా. 234 00:14:05,055 --> 00:14:06,264 అవునా? 235 00:14:06,348 --> 00:14:10,894 చూడండి, మా చెత్త ముత్తాతకు ముత్తాత కొన్ని చెడ్డ పనులు చేసి ఉండవచ్చు. 236 00:14:10,977 --> 00:14:13,396 వాటిని ఇప్పుడు మేము సరిదిద్దుతున్నాం. 237 00:14:13,480 --> 00:14:15,106 ఈ శాపాన్ని అంతం చేయడం సాధ్యపడదు. 238 00:14:15,190 --> 00:14:17,525 దాని వల్ల మా నాన్న, మా తాత బలయ్యారు. 239 00:14:17,609 --> 00:14:18,902 అది ఎప్పటికీ ఆగదు. 240 00:14:18,985 --> 00:14:22,447 అలా అని ఎందుకు అనుకుంటున్నారు? మీరు దాన్ని ఆపవచ్చు. ఆ పనే మేమూ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. 241 00:14:22,530 --> 00:14:23,990 మనం కలిసి ఆ పని చేయవచ్చు. 242 00:14:43,009 --> 00:14:44,344 గురూ, నువ్వు బాగానే ఉన్నావా? 243 00:14:51,059 --> 00:14:52,185 అయ్యో. 244 00:14:52,269 --> 00:14:55,438 -అక్కడ ఏం జరుగుతోంది? -టార్చిని నేను పాడు చేసినట్టున్నా. 245 00:14:55,522 --> 00:14:57,107 ఆ జీవి భయపెట్టేసరికి, ఇది జారి కింద పడిపోయింది. 246 00:14:58,108 --> 00:14:59,234 మేము వస్తున్నాం! 247 00:15:00,569 --> 00:15:02,696 ఇది పని చేయడం లేదు ఎందుకు? 248 00:15:02,779 --> 00:15:05,615 నీ పని ఎందాకా వచ్చింది? ఇక్కడ లైట్ సరిగ్గా వెలగట్లేదు. 249 00:15:05,699 --> 00:15:09,494 పని ముందుకు సాగట్లేదు. నేను ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, 250 00:15:09,578 --> 00:15:11,121 వెన్నెలని సెలస్టియంలోకి ప్రసరింపజేయలేకపోతున్నాను. 251 00:15:11,204 --> 00:15:12,622 అది షాఫ్ట్ దాకా రావట్లేదు. 252 00:15:12,706 --> 00:15:15,875 బహుశా ఆ కొత్త టెలిస్కోప్, పాత టెలిస్కోప్ అంత పొడవైనది కాదేమో. 253 00:15:15,959 --> 00:15:17,252 కొత్త టెలిస్కోప్? 254 00:15:17,335 --> 00:15:21,172 అవును. మీ తాతయ్య, 1969లో పాత టెలిస్కోప్ తీసేసి కొత్తది పెట్టాడు, 255 00:15:21,256 --> 00:15:23,091 మనిషి చంద్రమండలం మీద దిగేది చూద్దామని. 256 00:15:23,174 --> 00:15:25,135 దీనికి వాడాల్సింది ఈ టెలిస్కోప్ కాదు. 257 00:15:25,218 --> 00:15:26,803 దీని వల్ల వెన్నెల చేరదు. 258 00:15:51,745 --> 00:15:52,954 సిద్ధంగా ఉన్నారా, మిస్టర్ పీ? 259 00:15:54,331 --> 00:15:55,874 సిద్ధంగానే ఉన్నాననుకుంటా. 260 00:15:55,957 --> 00:15:58,501 ముందుగా నీరు పోయాలి. 261 00:16:00,545 --> 00:16:02,589 ఇప్పుడు వ్యక్తిగత వస్తువును వేయాలి కదా? 262 00:16:02,672 --> 00:16:04,758 వస్తువును వేయాల్సిన పని లేదు, 263 00:16:04,841 --> 00:16:08,136 ఎందుకంటే, ఆ పనిని మా ముత్తాత చాలా ఏళ్ల క్రితమే చేసేశాడు కాబట్టి. 264 00:16:08,220 --> 00:16:11,348 ఇప్పుడు ఆ దూతని రప్పించాలంటే ఓ పని చేయాలి. 265 00:16:37,916 --> 00:16:39,251 అది వస్తోంది. 266 00:16:50,345 --> 00:16:52,889 మనం దీన్ని కాస్త దగ్గరగా ఉంచితే సరిపోతుంది. 267 00:16:53,390 --> 00:16:54,724 వెన్నెల! 268 00:16:55,517 --> 00:16:56,685 అయ్యయ్యో. 269 00:17:02,482 --> 00:17:03,942 అయ్యయ్యో! నీల్! 270 00:17:05,569 --> 00:17:07,362 వద్దు! వదిలేయ్ వాళ్లని! 271 00:17:19,958 --> 00:17:21,001 వదులు. 272 00:17:28,884 --> 00:17:30,927 ఇదిగో నీ కానుక! తీసుకో! 273 00:17:59,956 --> 00:18:01,875 మనం సాధించామా? 274 00:18:06,421 --> 00:18:08,173 సాధించామనే అనిపిస్తోంది. 275 00:18:08,256 --> 00:18:09,674 మీరు సాధించగలరని నాకు తెలుసు! 276 00:18:12,219 --> 00:18:14,387 మా మిత్రుడిని కాపాడుకోవడానికి దీన్ని మేము తీసుకెళ్లక తప్పట్లేదు, 277 00:18:14,471 --> 00:18:16,431 కానీ మా పని అయిపోయాక, దీన్ని తప్పక మీకు తీరిగి ఇచ్చేస్తాం. 278 00:18:16,514 --> 00:18:20,352 వద్దు. మీ దగ్గరే ఉంచుకోండి. ఆ గిన్నెలకో దండం. 279 00:18:21,019 --> 00:18:23,438 రస్ కి కాల్ చేసి, మనం కనుక్కునది వాడికి చెప్పాలి. 280 00:18:47,879 --> 00:18:49,256 నా దగ్గరికి రాకు! 281 00:18:49,339 --> 00:18:51,383 హా! వాడి దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయకు! 282 00:18:56,221 --> 00:18:58,223 దూతని వదిలించుకోవడం ఎలాగో నాకు తెలిసిపోయింది. 283 00:18:58,890 --> 00:19:01,268 మంచిది. లోపలికి వెళ్లి, దాన్ని పుట్టింటికి పంపేయండి. 284 00:19:03,186 --> 00:19:04,312 స్టాన్లీ! 285 00:19:13,572 --> 00:19:15,407 నీకేం కాలేదు కదా? 286 00:19:15,490 --> 00:19:16,491 ఇంకాస్తుంటే పోయి ఉండేవాడిని. 287 00:19:19,494 --> 00:19:21,913 ఇప్పుడు నీకు చాలా ముఖ్యమైన వస్తువును ఒకదాన్ని ఇందులో వేయ్. 288 00:19:21,997 --> 00:19:24,416 -నేనే ఎందుకు? -నీ వల్లే అది వచ్చింది కాబట్టి. 289 00:19:24,499 --> 00:19:27,335 త్వరగా కానివ్వు! నీకు చాలా ముఖ్యమైనది ఏదైనా కానుకలా వెయ్. 290 00:19:27,419 --> 00:19:30,046 దాన్ని ఆ జీవి మూల్యంగా తీసుకొని, వెళ్లిపోతుంది. 291 00:19:34,092 --> 00:19:36,636 ఈ హార్మోనికా నాకు చాలా ఆనందాన్ని తీసుకొచ్చింది. 292 00:19:36,720 --> 00:19:38,054 దీన్ని దూరం చేసుకోవాలని నాకు అస్సలు లేదు. 293 00:19:38,138 --> 00:19:40,473 కానీ నిన్ను దూరం చేసుకోవాలని కూడా మాకు లేదు. 294 00:19:40,557 --> 00:19:42,225 సెంటిమెంటు ఎక్కువే నీకు. 295 00:20:07,834 --> 00:20:09,628 నువ్వు ప్రాణాలతోనే ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. 296 00:20:09,711 --> 00:20:12,464 దీన్నంతా ఒక్కడినే శుభ్రం చేయాలంటే కష్టం కదా మరి. 297 00:20:13,215 --> 00:20:15,300 లారీ అంటే అదీ! 298 00:20:15,383 --> 00:20:18,136 అతనికి ఏమీ కాలేదు కదా? సరిగ్గా సమయానికే స్టాన్లీకి వెలుతురు అందించానా? 299 00:20:20,847 --> 00:20:22,557 చాలా బాగా పని చేశావు, రస్. 300 00:20:22,641 --> 00:20:25,227 థ్యాంక్స్, అమ్మా. కానీ మీరు వచ్చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 301 00:20:26,144 --> 00:20:30,023 మిత్రులారా, ఈ గిన్నెలోని నీళ్లు మిస్టర్ పీ ఇంట్లో స్పష్టంగా మారిపోయినట్టుగా 302 00:20:30,106 --> 00:20:32,359 ఇక్కడ స్పష్టంగా మారిపోలేదు. 303 00:20:32,442 --> 00:20:34,236 ఇంకా నల్లగానే ఉన్నాయి. 304 00:20:36,905 --> 00:20:39,115 అయ్యయ్యో. మళ్లీ వద్దు. 305 00:20:39,199 --> 00:20:40,533 ఈసారి వస్తే దాని తిక్క నేను తీరుస్తా. 306 00:20:40,617 --> 00:20:44,120 నా మిత్రుల జోలికి వస్తే, ఖేల్ ఖతమ్ చేస్తా అని దానికి గుణపాఠం చెప్తా. 307 00:20:45,205 --> 00:20:46,206 హలో? 308 00:20:46,289 --> 00:20:47,874 -నాన్నా? -నాన్నా? 309 00:20:47,958 --> 00:20:49,042 పిల్లలూ? 310 00:20:49,125 --> 00:20:51,336 -నాన్నా? -మీరేనా? 311 00:20:51,419 --> 00:20:53,255 -మేమే! -హాయ్, నాన్నా! 312 00:20:53,338 --> 00:20:55,924 ఆలెక్స్, నీ గొంతు వినడం చాలా బాగుంది. 313 00:20:56,007 --> 00:20:57,342 ఎక్కడున్నావు నువ్వు? 314 00:20:57,425 --> 00:20:59,553 నాకు తెలీదు. 315 00:20:59,636 --> 00:21:02,389 ఇక్కడ చాలా చీకటిగా ఉంది. 316 00:21:02,472 --> 00:21:04,474 ఎక్కడున్నానో తెలీట్లేదు. 317 00:21:04,558 --> 00:21:06,226 మేము కనిపిస్తున్నామా, నాన్నా? 318 00:21:06,309 --> 00:21:08,061 అసలు నీకేమైనా కనిపిస్తోందా? 319 00:21:08,144 --> 00:21:11,189 మీరు నాకు కనిపించట్లేదు కానీ, మీ గొంతులు వినిపిస్తున్నాయి. 320 00:21:11,940 --> 00:21:16,528 మీ గొంతులే కాకుండా, సన్నని కిచకిచ శబ్దాలు కూడా నాకు వినిపిస్తున్నాయి. 321 00:21:16,611 --> 00:21:18,530 కిచకిచ శబ్దాలా? అంటే? 322 00:21:18,613 --> 00:21:19,698 ఏమో. 323 00:21:19,781 --> 00:21:22,492 కానీ అవేమైనా కానీ, నేను ఎక్కడున్నానో వాటికి తెలీకూడదు. 324 00:21:22,576 --> 00:21:23,952 అవి సమీపిస్తున్నాయి. 325 00:21:24,035 --> 00:21:26,413 నేనెక్కడికి వెళ్లినా, వాటి నుండి తప్పించుకోలేకపోతున్నా. 326 00:21:26,496 --> 00:21:28,123 మేము నీ వీడియో చూశాం. 327 00:21:28,206 --> 00:21:32,002 ఒక కళాఖండాన్ని అప్పగించ్చేసి, ఇసుక హవర్ గ్లాసును రివర్స్ చేసి, ఇసుక పైకి పడేలా చేశాం. 328 00:21:32,085 --> 00:21:34,546 అవునా? అది పని చేస్తుందా లేదా అని అనుకునేవాణ్ణి. 329 00:21:34,629 --> 00:21:36,965 ఇప్పుడు వీటన్నింటికీ మధ్య ఉండే సంబంధం ఏంటో మీరు కనిపెట్టాలి. 330 00:21:37,048 --> 00:21:38,508 సంబంధం. 331 00:21:39,092 --> 00:21:40,594 ఆశని కోల్పోకు, ఆలెక్స్. 332 00:21:40,677 --> 00:21:41,970 అక్కడి నుండి నిన్ను తప్పక బయటపడేస్తాం. 333 00:21:44,639 --> 00:21:46,224 అది నాకు తెలుసు. నేను… 334 00:21:54,608 --> 00:21:55,692 నాన్న వెళ్లిపోయాడు. 335 00:21:58,236 --> 00:21:59,779 ఏడవకు, పాన్. 336 00:21:59,863 --> 00:22:01,531 నాన్న బతికే ఉన్నాడని మనకి తెలిసిందిగా. 337 00:22:01,615 --> 00:22:04,284 వచ్చే పౌర్ణమికి ఆయనతో మాట్లాడతాం కూడా. 338 00:22:04,367 --> 00:22:06,119 ఇంకా ఒక నెల ఆగాలా? 339 00:22:06,202 --> 00:22:08,163 ఒక నెల ఇట్టే అయిపోతుంది. 340 00:22:08,246 --> 00:22:10,916 ఒక నెలలో మనం చాలా పనులు చేయవచ్చు. 341 00:23:02,342 --> 00:23:04,344 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్