1 00:01:09,404 --> 00:01:12,324 జపనీస్ పెయింటింగ్ 2 00:01:13,408 --> 00:01:15,994 రహస్య ప్రదేశంలోని ఈ విభాగాన్ని మీరు చక్కగా, పద్ధతిగా అమర్చే ప్రయత్నం చేశారని 3 00:01:16,077 --> 00:01:17,412 చెప్పారు కదా. 4 00:01:17,495 --> 00:01:18,788 కానీ ఇక్కడంతా గందరగోళంగా ఉంది. 5 00:01:18,872 --> 00:01:20,624 మేము ప్రయత్నించాం. 6 00:01:20,707 --> 00:01:22,751 కానీ ఆ పనిలో విఫలమయ్యామని చెప్పలేదంతే. 7 00:01:22,834 --> 00:01:24,461 మనం విఫలమేమీ కాలేదు. 8 00:01:24,544 --> 00:01:28,715 నీతో పని చేయడం నచ్చకే నేను ఆ పని నుండి తప్పుకున్నాను. 9 00:01:28,798 --> 00:01:31,968 హేయ్! నా మంచి మంచి ఐడియాలను నువ్వే పట్టించుకోలేదు. 10 00:01:32,052 --> 00:01:34,888 ఈ మహాత్ముడు, ఈ విభాగంలో కేవలం సముద్రపు దొంగల ఆయుధాలు మాత్రమే ఉంచాలని 11 00:01:34,971 --> 00:01:37,641 పట్టుబట్టాడు మరి. 12 00:01:38,850 --> 00:01:42,103 ఏంటి? నిజమైన సముద్రపు దొంగ ఏ ఆయుధాన్ని అయినా ఉపయోగించగలడు. 13 00:01:42,187 --> 00:01:44,231 అదృష్టవశాత్తూ, ఈ కళాఖండాలను పద్దతిగా సర్డడంలో 14 00:01:44,314 --> 00:01:46,650 మనకి సాయపడగల ఒక వ్యక్తి నాకు తెలుసు. ఆ వ్యక్తి మూడు సార్లు 15 00:01:46,733 --> 00:01:49,402 చారిత్రక వస్తువుల పరిరక్షణ అవార్డును గెలుచుకున్నారు. 16 00:01:50,028 --> 00:01:52,697 అది నేనే. నేనే ఆ అవార్డును మూడుసార్లు గెలుచుకున్నా. అది మీకు ఎప్పుడైనా చెప్పానా? 17 00:01:52,781 --> 00:01:54,407 లక్షసార్లు చెప్పి ఉంటావు. 18 00:01:54,491 --> 00:01:57,535 దీనికి చాలా శ్రమపడాల్సి వస్తుంది, కానీ మీ నాన్న ఏమన్నాడో విన్నారుగా. 19 00:01:57,619 --> 00:02:01,748 మీ నాన్న ఎక్కడైతే ఇరుక్కుపోయి ఉన్నాడో, అక్కడ ఆయనకి సమయం గడిచే కొద్దీ, ప్రమాదం కూడా పెరుగుతూ ఉంటుంది. 20 00:02:04,042 --> 00:02:07,045 అమ్మ చెప్పింది నిజమే. ఇక్కడ ఏమున్నాయో మనకి తెలియాలి, అప్పుడే మనం ఈ కళాఖండాలన్నింటి మధ్య 21 00:02:07,128 --> 00:02:09,756 సంబంధాన్ని కనుగొని, శాపాన్ని పోగొట్టగలం. 22 00:02:09,838 --> 00:02:11,091 ప్లాన్ ఏంటి? 23 00:02:11,174 --> 00:02:13,468 పాండోరా, నువ్వు పెయింటింగ్ గదికి వెళ్లి, 24 00:02:13,552 --> 00:02:15,387 అక్కడ ఏవైతే ఉన్నాయో, వాటన్నింటినీ ఇందులో రాయ్. 25 00:02:15,470 --> 00:02:17,430 కళాఖండాలను శతాబ్దాల వారీగా రాయడానికి ప్రయత్నించు. 26 00:02:17,514 --> 00:02:18,598 ఆ తర్వాత ఖండాల వారీగా రాయి. 27 00:02:18,682 --> 00:02:19,808 ఆ తర్వాత దేశాల వారీగా రాయ్. 28 00:02:20,392 --> 00:02:22,852 ఈ పని చాలా బోరింగ్ గా ఉంది. 29 00:02:22,936 --> 00:02:25,397 నేను ఈ గదిలో ఉంటాను, ఆ పని రస్ కే అప్పజెప్పవచ్చు కదా? 30 00:02:25,480 --> 00:02:29,359 ఈ గదిలో ఇన్ని ఆయుధాలు ఉండగా, నిన్ను ఒక్కదాన్నే వదిలిపెడితే ఇంకేమైనా ఉందా? 31 00:02:30,694 --> 00:02:34,948 కళాఖండాలతో ఎలా పని చేయాలి అని తెలుసుకొనే ముందు, వాటి గురించి వీలైనన్ని వివరాలు మనకి తెలియాలి. 32 00:02:35,031 --> 00:02:37,659 జోస్యం చెప్పే గిన్నెతో మనం బొక్కబోర్లా పడ్డాం కదా, అది చాలు. 33 00:02:37,742 --> 00:02:39,786 అలా అస్సలు జరగకూడదు బాబోయ్. 34 00:02:39,869 --> 00:02:43,039 రస్, నాన్న ఆఫీసుకు వెళ్లి, ఆయన వీడియోలను చూడు. 35 00:02:43,123 --> 00:02:45,792 జర్మల్స్ లో లేని సమాచారం అక్కడ ఏమైనా దొరుకుతుందేమో చూడు. 36 00:02:45,875 --> 00:02:48,461 సూపర్. వీడియోలు చూడమంటే పిచ్చెక్కిస్తాను. 37 00:02:48,545 --> 00:02:49,713 ఇది అన్యాయం. 38 00:02:49,796 --> 00:02:52,090 ముఖ్యమైన పనులన్నీ ఎప్పుడూ రస్ కే చెప్తావు? 39 00:02:52,173 --> 00:02:53,758 అలా అంటావేంటి, పాన్! అది నిజం కాదు. 40 00:02:53,842 --> 00:02:56,428 నాన్న రాయి అప్పట్నుంచీ చూస్తున్నా, ఆయన నోట్స్ ని చూసే అవకాశం, 41 00:02:56,511 --> 00:02:59,806 ఆయన రికార్డింగులని వినే అవకాశం, ఆయన వీడియోలను చూసే అవకాశం నీకే దక్కుతోంది. 42 00:02:59,890 --> 00:03:01,391 నాన్నకి సంబంధించినవన్నీ దాచుకుంటున్నావు. 43 00:03:01,474 --> 00:03:02,976 అదేం లేదు. 44 00:03:03,059 --> 00:03:06,104 కానీ ఇవి నాకూ, నాన్నకి ఇద్దరికీ ఆసక్తి ఉన్న విషయాలు. 45 00:03:06,187 --> 00:03:08,648 చారిత్రకపరమైన పరిశోధన విషయంలో నాన్నకి ఉన్నంత ఆసక్తి నువ్వు లేదని 46 00:03:08,732 --> 00:03:10,066 నువ్వే ఒప్పుకుంటావు. 47 00:03:10,150 --> 00:03:11,151 అది మేమిద్దరమూ చేసే పని. 48 00:03:11,234 --> 00:03:13,987 మేమిద్దరమూ చేసేది ఏంటో తెలుసా, సరదాగా గడపడం. 49 00:03:14,070 --> 00:03:15,530 అందుకే నాకు ఇలా శిక్ష వేస్తున్నారు. 50 00:03:15,614 --> 00:03:17,240 ఇక్కడ ఎవరినీ శిక్షించడం లేదు. 51 00:03:17,324 --> 00:03:19,451 మనం చేసేది ప్రతీది కూడా ముఖ్యమైనదే. 52 00:03:19,534 --> 00:03:21,328 -మీ నాన్నే ఇక్కడ ఉంటే… -కానీ నాన్న లేడు కదా. 53 00:03:21,411 --> 00:03:23,872 నాన్నకి రస్ పై ఉన్నంత ప్రేమ నాపై లేదు, అందుకే రస్ కి ఇష్టం లేని 54 00:03:23,955 --> 00:03:25,749 బోరింగ్ పనులన్నీ నా నెత్తి మీద వేస్తున్నారు. 55 00:03:25,832 --> 00:03:26,958 అది కాదు నా ఉద్దేశం. 56 00:03:27,042 --> 00:03:28,168 నీ ఉద్దేశం ఏమైనా నాకు అనవసరం. 57 00:03:28,251 --> 00:03:30,003 ఏదేమైనా, నేను సరదాగానే ఉంటాలే. 58 00:03:44,935 --> 00:03:46,853 ఇక్కడ ఎంత చెత్త ఉందో చూద్దాం. 59 00:03:49,022 --> 00:03:51,358 చెత్త పెయింటింగ్. చెత్త పెయింటింగ్. 60 00:03:54,819 --> 00:03:56,821 అందవికారంగా ఉన్న బిడ్డ. 61 00:04:00,075 --> 00:04:01,785 హా? పెయింట్ బ్రష్ బాగుందే. 62 00:04:04,537 --> 00:04:05,914 అక్కడ ఎవరైనా ఉన్నారా? 63 00:04:08,750 --> 00:04:10,418 ఈ పెయింటింగ్ చాలా భయంకరంగా ఉంది. 64 00:04:10,502 --> 00:04:11,628 అదిరింది. 65 00:04:12,295 --> 00:04:16,466 "ఇది జపనీస్ ఆర్టిస్ట్ అయిన హీసా గీసిన ఆఖరి చిత్రం, 66 00:04:16,550 --> 00:04:18,759 ఇందులో నొపెరా-బో అనే ముఖం లేని ఆత్మల కారణంగా 67 00:04:18,843 --> 00:04:22,722 ఒక అడవిలో విడిపోయిన ఇద్దరు వ్యక్తులను చూపడం జరిగింది." 68 00:04:23,431 --> 00:04:24,766 ముఖాలు లేని ఆత్మలా? 69 00:04:25,600 --> 00:04:27,018 బాబోయ్, భయంకరంగా ఉంది. 70 00:04:29,479 --> 00:04:31,982 ఇప్పుడు అది కదిలిందా? 71 00:04:36,319 --> 00:04:37,279 నన్ను వదులు! 72 00:04:37,362 --> 00:04:39,447 కాపాడండి! అమ్మా! రస్! 73 00:04:52,794 --> 00:04:57,215 డార్ట్స్ అని మనకు తెలిసిన ఈ ఆటను బ్రిటిష్ వాళ్లు 700 ఏళ్లుగా టైమ్ పాస్ కోసం ఆడుతున్నారు, 74 00:04:57,299 --> 00:05:00,927 ఇది సామాన్య ప్రజల నుండి ఎనిమిదవ హెన్రీ మహారాజుకు కూడా చాలా ఇష్టమైన ఆట. 75 00:05:01,011 --> 00:05:04,598 నిజానికి, ఈ డార్ట్ సెట్ ఒక రాచరిక కుటుంబానికి చెందినది. 76 00:05:05,473 --> 00:05:07,225 నాలో ఇంకా ఆ ప్రతిభ ఉందో లేదో చూద్దాం. 77 00:05:09,603 --> 00:05:12,898 అదరగొట్టేశా. హా. పిల్లలకి చూపించాలి… 78 00:05:15,734 --> 00:05:16,735 అదరగొట్టేశా. హా. 79 00:05:16,818 --> 00:05:19,112 -పిల్లలకి చూపించాలి నా… -సూపర్. 80 00:05:19,195 --> 00:05:20,488 బాగానే ఆడాను, నాన్నా. 81 00:05:20,572 --> 00:05:22,782 ఇక్కడి నుండి నేను స్టాన్లీని కొట్టగలను అనుకుంటా. 82 00:05:34,878 --> 00:05:36,630 బాబోయ్, ఏంటది? 83 00:05:36,713 --> 00:05:38,465 ఓయ్. ఏం కావాలి నీకు? 84 00:05:44,221 --> 00:05:46,681 ఇదేం చేస్తోందో ఏమో కానీ, నాకు అస్సలు నచ్చట్లేదు. 85 00:05:46,765 --> 00:05:48,683 మీరు వెళ్లి అమ్మని తీసుకురండి. నేను పాండోరా ఎక్కడ ఉందో చూస్తా. 86 00:05:52,312 --> 00:05:56,399 పాన్? పాన్, ఇక్కడ ఉన్నావా? 87 00:05:56,483 --> 00:05:57,442 పాన్? 88 00:05:57,525 --> 00:06:01,154 తను తన గదిలో ఎప్పటిలాగే ఆరాంగా ఉండాలని ఇదొక్కసారికి కోరుకుంటున్నా. 89 00:06:09,663 --> 00:06:10,914 అయ్య బాబోయ్. 90 00:06:10,997 --> 00:06:12,874 అయ్యయ్యో. 91 00:06:17,045 --> 00:06:18,380 బాబోయ్… 92 00:06:20,298 --> 00:06:22,259 ఎక్కడున్నా నేను? 93 00:06:24,761 --> 00:06:28,557 అన్నీ ఏవో పెయింటింగ్స్ లా ఉన్నాయి. 94 00:06:28,640 --> 00:06:29,641 పాన్… 95 00:06:29,724 --> 00:06:33,603 అక్కడ ఉండేది నువ్వో కాదో తెలీట్లేదు, కానీ నా మాటలు నీకు వినిపిస్తుంటే, కంగారుపడకుండా ధైర్యంగా ఉండు. 96 00:06:33,687 --> 00:06:35,188 నిన్ను బయటకు రప్పిస్తాం. 97 00:06:35,272 --> 00:06:36,606 రస్? రస్! 98 00:06:36,690 --> 00:06:39,192 నేను పెయింటింగ్ లో ఉన్నాను అనుకుంటా. 99 00:06:39,276 --> 00:06:40,652 నీకు నా మాటలు వినిపిస్తున్నాయా? 100 00:06:40,735 --> 00:06:41,570 రస్? 101 00:06:46,616 --> 00:06:49,661 హేయ్! భయంకరంగా ప్రవర్తించడం మాను, నువ్వు ఎవరివైనా కానీ, ఇక్కడి నుండి వెళ్లిపో. 102 00:06:51,830 --> 00:06:53,832 ఏం చూస్తున్నావే, కాకీ? 103 00:06:59,754 --> 00:07:02,591 మరేం పర్వాలేదు. నాకేం భయం కలగట్లేదు. 104 00:07:11,641 --> 00:07:13,560 బాబోయ్, నాకు పిచ్చ భయంగా ఉంది. 105 00:07:44,007 --> 00:07:45,717 వెళ్లిపోండి! నా మానాన నన్ను వదిలేయండి! 106 00:07:53,099 --> 00:07:57,187 సారీ, మీరు కూడా నొపెరా-బో ఆత్మ ఏమో అనుకున్నా. 107 00:08:04,444 --> 00:08:06,154 వామ్మోయ్. కాస్త ఆగండి. 108 00:08:06,238 --> 00:08:07,864 ఇది కూడా మీకు అర్థమవ్వదు కదా. 109 00:08:08,698 --> 00:08:11,868 మీరు కూడా ఇక్కడ నొపెరా-బో ఆత్మల నుండి దాక్కొని ఉంటున్నారా? 110 00:08:13,745 --> 00:08:15,455 హమ్మయ్య, కాస్త అయినా అర్థమవుతోందిలే. 111 00:08:18,375 --> 00:08:20,210 అవి ఇక్కడికి ఎందుకు రావట్లేదు? 112 00:08:24,130 --> 00:08:26,132 దీని వల్ల అవి రావట్లేదా? 113 00:08:26,675 --> 00:08:31,888 అర్థమైంది. దాన్ని అక్కడే ఉంచుదాం… నాకు మీ పేరు తెలీదు. 114 00:08:31,972 --> 00:08:33,597 అబ్బా, మీ పేరు తెలుసుకోవడం ఎలా? 115 00:08:35,100 --> 00:08:37,811 పాండోరా. పాండోరా. 116 00:08:38,477 --> 00:08:39,604 హీసా. 117 00:08:39,688 --> 00:08:41,398 పాండోరా పాండోరా. 118 00:08:41,481 --> 00:08:44,359 అది కాదు నా పేరు… ఏదోకటిలే. కొంచెమైనా కరెక్టే చెప్పారులే. 119 00:08:45,026 --> 00:08:46,319 మిమ్మల్ని కలవడం బాగుంది, హీసా. 120 00:08:46,820 --> 00:08:48,863 ఏంటి, హీసానా? 121 00:08:48,947 --> 00:08:51,366 పెయింటింగ్ లో ఉంది మీరే కదా? 122 00:08:51,449 --> 00:08:52,659 దాన్ని గీసింది కూడా మీరే. 123 00:08:52,742 --> 00:08:54,619 మరి మీరు ఇక్కడ ఎలా ఇరుక్కుపోయారు? 124 00:08:54,703 --> 00:08:55,704 అమ్మా, చూశావా? 125 00:08:55,787 --> 00:08:57,122 ఈ పెయింట్ తాజాగా ఉంది. 126 00:08:57,205 --> 00:08:59,666 అమ్మా! రస్! నా మాటలు మీకు వినిపిస్తున్నాయా? 127 00:08:59,749 --> 00:09:02,878 పాన్ ఈ పెయింటింగ్ లో తనని తాను గీసుకుందో లేదో నాకు తెలీదు కానీ, 128 00:09:03,753 --> 00:09:05,797 అది పాన్ ని అక్కడ పెట్టి, 129 00:09:05,881 --> 00:09:07,507 తన స్థానంలో ఇక్కడికి వచ్చిందని నా అనుమానం. 130 00:09:08,049 --> 00:09:09,634 నిజంగానే అంటున్నావా? 131 00:09:09,718 --> 00:09:11,678 నా బిడ్డ ఒక పెయింటింగులో ఇరుక్కుపోయిందా? 132 00:09:11,761 --> 00:09:13,555 మన కుటుంబంలోని జనాలకు, 133 00:09:13,638 --> 00:09:15,724 ఎక్కడెక్కడో ఇరుక్కుపోవడం సర్వసాధారణమైన విషయమే కదా. 134 00:09:16,224 --> 00:09:19,769 మనం పాన్ ని బయటకు రప్పించాలి, దాన్ని లోపలికి పంపించాలి. 135 00:09:19,853 --> 00:09:22,522 అది నొపెరా-బో అనే ముఖం లేని ఆత్మ. 136 00:09:22,606 --> 00:09:25,108 అవి జపనీస్ కథల్లో ఉంటాయి. 137 00:09:26,318 --> 00:09:27,736 వావ్, ఇది హీసా గీసిన పెయింటింగ్. 138 00:09:27,819 --> 00:09:33,116 సెంగోకూ కాలం నాటి మహ కళాకారులు గీసిన, ఒక అసలైన పెయింటింగ్ మన దగ్గర ఉందని ఇప్పటిదాకా నాకు తెలీలేదే! 139 00:09:35,201 --> 00:09:37,078 అర్థమైందిలే. 140 00:09:37,162 --> 00:09:40,332 ఏమీ తెలీని సముద్రపు దొంగ అని నన్ను అనుకున్నారా? 141 00:09:40,415 --> 00:09:44,419 నాకు కళలంటే ప్రాణమని తెలుసుకోండి. 142 00:09:44,502 --> 00:09:47,505 ఆ రోజుల్లో కొన్ని పెయింటింగ్స్ ని దొంగతనం చేశా కూడా. 143 00:09:47,589 --> 00:09:49,633 అది మనోడి అసలైన స్వరూపం. 144 00:09:49,716 --> 00:09:53,094 హీసా పెయింటింగ్స్ గురించి మీ తాతయ్య, అపోలో మాట్లాడుతుండగా నేను చాలా సార్లు విన్నాను. 145 00:09:53,178 --> 00:09:56,389 ఆమె పెయింటింగ్స్ ప్రపంచంలోనే అరుదైనవని చెప్పవచ్చు. 146 00:09:56,473 --> 00:09:59,184 ఎంతైనా, తను చాలా పసి వయస్సులోనే మాయమైపోయింది. 147 00:09:59,267 --> 00:10:00,310 ఆ మాట్లాడుకొనేది నా కుటుంబ సభ్యులే. 148 00:10:00,393 --> 00:10:02,479 వాళ్లు నీ గురించే మాట్లాడుకుంటున్నారు అనుకుంటా. 149 00:10:02,562 --> 00:10:04,189 ఇంతకీ తనకి ఏమైంది? 150 00:10:04,272 --> 00:10:05,732 ఆ విషయం ఖచ్చితంగా ఎవరికీ తెలీదు. 151 00:10:05,815 --> 00:10:09,277 అది 500 ఏళ్ళ క్రితం జరిగింది కదా, ఈపాటికి ఆ గాథకి చాలా మసాలాలు అద్ది ఉంటాయి. 152 00:10:09,361 --> 00:10:11,404 కానీ అపోలోకి తెలిసినంత వరకు, 153 00:10:11,488 --> 00:10:15,200 హీసాకి చాలా మంచి ప్రతిభ ఉంది, ఆ కారణంగా తను చాలా పేరు, ప్రఖ్యాతలు సంపాదించింది. 154 00:10:15,283 --> 00:10:19,162 తన ప్రతిభకి సాటి, పోటీ ఎవరైనా ఉన్నారంటే, అది తన కవల సోదరి అయిన యూకానే. 155 00:10:19,246 --> 00:10:20,664 తను కూడా చాలా గొప్ప ఆర్టిస్ట్. 156 00:10:20,747 --> 00:10:22,123 తన పెయింటింగ్స్ కూడా చాలా దొంగిలించాలే. 157 00:10:22,207 --> 00:10:24,251 ఇద్దరూ సవాళ్ళను విసురుకుంటూ 158 00:10:24,334 --> 00:10:26,086 తమ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటూనే ఉన్నారు. 159 00:10:26,169 --> 00:10:29,923 కానీ స్నేహపూర్వక పోటీ కాస్తా, పెరిగేకొద్దీ బద్ద శత్రుత్వంగా మారిపోయింది. 160 00:10:30,966 --> 00:10:36,054 ఒకరోజు, అక్కడి రాజు, ఆ ప్రాంతంలో అత్యుత్తమ పెయింటర్ ఎవరో కనుగొనాలని ఒక పోటీని ప్రకటిస్తాడు. 161 00:10:36,137 --> 00:10:39,099 హీసా, ఆ రాజు చిత్రాన్ని చాలా అద్భుతంగా గీస్తుంది, 162 00:10:39,182 --> 00:10:42,269 దాని ముందు తన పెయింటింగ్ చాలదని యూకాకి భయం పట్టుకుంటుంది. 163 00:10:43,687 --> 00:10:47,649 కాబట్టి, అర్ధరాత్రి వేళ హీసా గీసిన చిత్రాన్ని యూకా నాశనం చేసేస్తుంది. 164 00:10:47,732 --> 00:10:50,610 ఆ విధంగా, రాజు హీసాని కాకుండా తననే ఎంచుకుంటాడని తన ప్లాన్, 165 00:10:50,694 --> 00:10:52,320 చివరికి జరిగింది కూడా అదే. 166 00:10:53,071 --> 00:10:58,535 అసూయతో, కోపంతో రగిలిపోయిన హీసా, క్షణికావేశంలో దుష్ట యోకాయ్ ని, అంటే దుష్ట ఆత్మని ఆశ్రయించి, 167 00:10:58,618 --> 00:11:02,914 యూకాని బంధించడానికి ఒక జైలును గీయాలని మంత్రించబడిన పెయింట్ బ్రష్ ని తీసుకుంటుంది. 168 00:11:03,498 --> 00:11:07,878 తన సోదరి అడ్డు తొలగిపోయింది కనుక, రాజు ఇప్పుడు తననే ఎంచుకుంటాడు. 169 00:11:08,378 --> 00:11:11,089 మళ్లీ యూకా రాకూడదని, రాజు దృష్టిలో ఎప్పటికీ తనే ఉండాలని 170 00:11:11,172 --> 00:11:13,216 హీసా నిర్ధారించుకోవాలని అనుకుంది. 171 00:11:13,300 --> 00:11:16,261 కాబట్టి, తను పెయింటింగులో నొపెరా-బో ఆత్మలని గీసింది, 172 00:11:16,344 --> 00:11:18,597 అవి యూకాని లోపలే ఉంచుతాయని తన ప్లాన్. 173 00:11:18,680 --> 00:11:22,475 త్వరలోనే తను చేసిన పనికి హీసా పశ్చాత్తాప్పడింది, యూకాని విడుదల చేయడానికి ప్రయత్నించింది, 174 00:11:22,559 --> 00:11:25,353 కానీ దుష్ట యొకాయ్ హీసాని మోసగించాడు. 175 00:11:27,814 --> 00:11:31,359 ఇక, ఆ సోదరీమణులు, తమ అసూయ కారణంగా నొపెరా-బో ఆత్మల చేత 176 00:11:31,443 --> 00:11:33,737 ఎప్పటికీ పీడించబడుతూనే జైలు జీవితాన్ని బతకాలి. 177 00:11:39,117 --> 00:11:40,869 దానికి ఏం కావాలో మనకి తెలిస్తే బాగుండు. 178 00:11:40,952 --> 00:11:43,038 అప్పుడు దాన్ని వదిలించుకోవడానికి మనకొక మార్గం దొరకవచ్చు. 179 00:11:43,121 --> 00:11:44,331 చక్కటి ఆలోచన, రస్. 180 00:11:44,414 --> 00:11:47,626 దానికి ఏం కావాలో మనమే ముందు కనిపెట్టేస్తే, అప్పుడు మనకి పైచేయి దక్కవచ్చు. 181 00:11:50,921 --> 00:11:54,132 "హిరఫూడే పెయింట్ బ్రష్, మధ్య సెంగోకూ కాలం." 182 00:11:55,550 --> 00:11:58,345 డిస్ ప్లే కేసులో పెయింటింగు చుట్టూ ఉన్న తీగని చూడు. 183 00:11:58,428 --> 00:12:00,472 కొన్ని ముళ్లు ఎర్రగా ఉన్నాయి. 184 00:12:01,014 --> 00:12:02,182 హా. అది వింతగా ఉంది. 185 00:12:02,265 --> 00:12:06,186 ఇంకో విషయం, కేవలం ఎర్ర ముళ్ళు ఉండే తీగ మాత్రమే డిస్ ప్లే కేసు లోపలికి వెళ్లింది. 186 00:12:06,269 --> 00:12:08,772 అంటే, మనం ఆ తీగని అనుసరిస్తే… 187 00:12:08,855 --> 00:12:10,774 మనం పెయింట్ బ్రష్ ని కనిపెట్టవచ్చు. 188 00:12:15,320 --> 00:12:17,822 అమ్మా! స్టాన్లీ! కనిపెట్టేశా. 189 00:12:17,906 --> 00:12:19,407 సూపర్, రస్. 190 00:12:19,491 --> 00:12:22,827 దీన్ని ఈ గది నుండి తీసుకెళ్దాం, తద్వారా మనం ఏం చేయాలో ప్లాన్ చేసుకోవచ్చు. 191 00:12:30,293 --> 00:12:32,379 రస్, దాన్ని ఇక్కడి నుండి తీసుకెళ్లిపో. 192 00:12:37,717 --> 00:12:40,470 -రస్! -అతడిని వదలవే, చెత్త మొహమా! 193 00:12:40,554 --> 00:12:42,138 లారీ, ఆవేశపడకు. 194 00:12:47,185 --> 00:12:48,478 లారీ, అయ్యయ్యో! 195 00:12:56,319 --> 00:12:58,405 రస్, నీకేమైనా అయిందా? 196 00:12:58,488 --> 00:12:59,489 నాకేమీ కాలేదు. 197 00:12:59,573 --> 00:13:01,825 అవి ఈ పెయింట్ బ్రష్ కోసం ఎందుకు వెతుకుతున్నాయో మనకి ఇప్పుడు అర్థమైంది. 198 00:13:01,908 --> 00:13:05,245 వాటిని ఆపగలిగేది, మనల్ని రక్షించగలిగేది ఇది ఒక్కటే. 199 00:13:05,328 --> 00:13:06,913 కానీ లారీ ఏమైపోయాడు? 200 00:13:20,969 --> 00:13:24,764 ఒక సముద్ర రాకాసితో ఆరివీర భయంకరంగా పోరాడి ఓడిపోయినంత అలసటగా ఉంది. 201 00:13:28,602 --> 00:13:31,354 యూకా. మీరు యూకా కదా. 202 00:13:31,438 --> 00:13:33,565 మీ పెయింటింగ్స్ కి నేను వీరాభిమానిని. 203 00:13:33,648 --> 00:13:36,359 బ్లాక్ మార్కెట్ లో వాటికి భలే గిరాకీ ఉంటుంది, 204 00:13:36,443 --> 00:13:38,737 కానీ ఎప్పుడు కూడా కొన్ని నా దగ్గరే ఉంచుకొనేవాడిని. 205 00:13:42,782 --> 00:13:45,076 లేదు, లేదు. ఆగండి. నేను మిమ్మల్ని ఏమీ చేయను. 206 00:13:45,160 --> 00:13:46,745 నేను చాలా మంచివాడిని, చూశారా? 207 00:13:48,288 --> 00:13:50,332 ఏమైంది? నా ముఖంపై ఏమైనా ఉందా? 208 00:14:14,648 --> 00:14:16,274 ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాయి అవి? 209 00:14:18,318 --> 00:14:19,653 యూకా. 210 00:14:20,237 --> 00:14:22,656 ఇది తనదే అయితే కనుక, తను ప్రమాదంలో ఉందని అర్థం. 211 00:14:29,537 --> 00:14:32,791 పెయింట్ బ్రష్ ని ఉపయోగించి మనల్ని మనం కాపాడుకోగలమని తెలియడం బాగానే ఉంది, 212 00:14:32,874 --> 00:14:35,919 కానీ నొపెరా-బో ఆత్మని ఓడించడానికి సరిపడా పెయింట్, బ్రష్ మీద లేదే. 213 00:14:36,002 --> 00:14:39,297 నిజమే. దాన్ని దెబ్బ తీయాలంటే మనకి మరింత పెయింట్ కావాలి. 214 00:14:39,381 --> 00:14:40,715 అది చాలా కావాలి. 215 00:14:53,103 --> 00:14:54,354 చాలా పొడిగా ఉంది. 216 00:14:54,437 --> 00:14:55,564 మనకి కొంచెం నీరు కావాలి. 217 00:14:55,647 --> 00:14:57,023 తప్పకుండా. 218 00:14:59,192 --> 00:15:02,237 దానికి కనిపించకూడదు, ఆ బ్రష్ ని మాత్రం పోగొట్టుకోవద్దు, 219 00:15:02,320 --> 00:15:04,823 దాన్ని అవి పెయింటింగులోకి లాగేసుకున్నాయి అంటే, అది మనకి ఇక దక్కదు. 220 00:15:04,906 --> 00:15:06,491 నీ చెల్లి కూడా దక్కదు. 221 00:15:08,368 --> 00:15:11,496 మీకు ఆందోళనగా ఉందని అర్థమైంది, హీసా, మీ సోదరి యూకాని మనం కాపాడి తీరుతాం, 222 00:15:11,580 --> 00:15:13,873 కానీ ఈ శాపాన్ని ఎలా అంతం చేయాలో మనం తేల్చాలి. 223 00:15:14,749 --> 00:15:18,128 ఈ మిస్టరీలన్నింటినీ రస్ అయితే ఛేదించగలడు, అందుకని ఇప్పుడు నాకు అసూయగా ఉంది కూడా. 224 00:15:19,421 --> 00:15:20,338 అర్థమైపోయింది. 225 00:15:20,422 --> 00:15:23,049 ఇది మీ అసూయ కారణంగా ఏర్పడిన జైలు అని స్టాన్లీ అన్నాడు, 226 00:15:23,133 --> 00:15:25,969 కాబట్టి మనం మీ చెల్లికి, మీకు మధ్య ఉండే దూరాన్ని తొలగించాలి, 227 00:15:26,052 --> 00:15:28,179 అప్పుడు మీ ఇద్దరికీ విముక్తి లభిస్తుంది. 228 00:15:29,848 --> 00:15:31,266 మీకు చాలా బాధగా ఉందని అర్థమైంది. 229 00:15:31,766 --> 00:15:33,393 మీరు ఆమెని చాలా మిస్ అవుతుంటారు. 230 00:15:33,476 --> 00:15:35,729 మీ క్షమాపణని ఆమె అంగీకరించదని భయపడుతున్నారా? 231 00:15:46,531 --> 00:15:48,575 చెప్తున్నా కదా, నేను బాగా అర్థం చేసుకోగలను. 232 00:15:48,658 --> 00:15:50,285 మా అన్నయ్యని చూస్తే నాకు అసూయ కలుగుతుంది. 233 00:15:50,368 --> 00:15:54,623 అతను చాలా తెలివైనవాడు, ఏ సమస్యల్లో చిక్కుకోడు, దానితో నాకు పిచ్చ కోపం వస్తుంది. 234 00:15:54,706 --> 00:15:56,958 ఒక్కోసారి, అతనితో అసలు మాట్లాడాలనే అనిపించదు. 235 00:15:57,667 --> 00:15:59,711 మరీ 500 ఏళ్లు కాదనుకోండి. మహా అయితే ఒక వారం ఏమో, 236 00:15:59,794 --> 00:16:04,174 అప్పటికే నేను వాడిని చాలా మిస్ అయిపోతా, మళ్లీ ఇద్దరం ఒకటి అయిపోతాం. 237 00:16:04,841 --> 00:16:08,053 గొడవలు పక్కకు పెట్టాయాలని యూకాకి కూడా ఉంటుందని నా బలమైన నమ్మకం. 238 00:16:08,136 --> 00:16:09,137 ఏమంటారు? 239 00:16:14,100 --> 00:16:16,978 హీసా, మీరు యూకాని కనుగొని ఆమెకి క్షమాపణ చెప్పాలి. 240 00:16:17,062 --> 00:16:20,190 నొపెరా-బో ఆత్మల మీ దరికి రాకుండా నేను చూసుకుంటా. మీరు ఈ పని చేయగలరు. 241 00:16:29,783 --> 00:16:31,785 ఓయ్, పిచ్చి నొపెరా-బో ఆత్మలూ! 242 00:16:31,868 --> 00:16:34,788 ఇక్కడ ఉన్నా! వచ్చి నన్ను పట్టుకోండి. 243 00:16:38,667 --> 00:16:40,377 యూకా! 244 00:16:40,961 --> 00:16:42,629 యూకా! 245 00:16:44,297 --> 00:16:45,757 ఆ అరుపు మీ సోదరిదే. 246 00:16:46,341 --> 00:16:48,051 వీటిని పక్కదారి నేను పట్టిస్తాగా. 247 00:16:49,886 --> 00:16:51,513 ఇక్కడున్నానే, పిచ్చి ఆత్మలూ. 248 00:16:51,596 --> 00:16:56,685 ముఖం లేకున్నా కూడా ఇంత చండాలంగా ఉండవచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోంది. 249 00:16:56,768 --> 00:16:57,978 యూకా! 250 00:16:58,562 --> 00:16:59,771 హీసా! 251 00:17:29,301 --> 00:17:30,760 అబ్బా! 252 00:17:58,955 --> 00:18:01,541 మీరు ఉత్త చవటలు. 253 00:18:01,625 --> 00:18:04,377 అయిదు వందల ఏళ్లలో ఇద్దరిని కూడా పట్టుకోలేకపోయారు. 254 00:18:04,461 --> 00:18:06,379 ఇక నన్ను ఏం పట్టుకుంటారులే మీరు! 255 00:18:06,463 --> 00:18:08,006 లారీ? 256 00:18:08,089 --> 00:18:09,341 పాండోరా! 257 00:18:09,424 --> 00:18:13,178 నిన్ను కనుగొనగలిగినందుకు ఆనందంగా ఉంది, పాపా. నిన్ను కాపాడటానికే ఇక్కడికి వచ్చాను. 258 00:18:15,555 --> 00:18:18,016 లేదులే. ఏదో ప్రమాదవశాత్తూ ఇక్కడికి వచ్చి పడ్డా. 259 00:18:18,099 --> 00:18:19,684 నిన్ను చూడటం బాగుంది. 260 00:18:38,370 --> 00:18:40,121 రస్, మా దగ్గర కొంచెం పెయింట్ ఉంది. 261 00:18:40,205 --> 00:18:41,498 నువ్వు ఇక్కడికి రావాలి. 262 00:18:56,972 --> 00:18:58,139 అమ్మా, పట్టుకో! 263 00:19:08,858 --> 00:19:11,111 పట్టేసుకున్నా. భలే విసిరావు. 264 00:19:12,445 --> 00:19:13,530 థ్యాంక్స్, నాన్నా. 265 00:19:14,364 --> 00:19:16,950 మీకు ఇది కావాలా? వచ్చి పట్టుకోండి. 266 00:19:33,508 --> 00:19:36,303 -ఇప్పుడు ఏం చేద్దాం? -తెలీట్లేదు. ఇరుక్కుపోయాం. 267 00:19:41,141 --> 00:19:42,475 వద్దు! వద్దు! 268 00:20:19,387 --> 00:20:20,847 మీకు తగిన శాస్తే జరిగింది. 269 00:20:20,931 --> 00:20:23,767 నాతో పెట్టుకుంటే, ఎవడైనా మటాష్ అయిపోవలసిందే. 270 00:20:37,322 --> 00:20:39,658 పాండోరా! లారీ! మీకేమీ కాలేదు. 271 00:20:39,741 --> 00:20:41,243 హమ్మయ్య. 272 00:20:41,326 --> 00:20:44,412 -రస్, క్షమించు, నీ మీద అరిచాను. -అబ్బా. 273 00:20:44,496 --> 00:20:46,081 నా నడుము విరిగిందిపో. 274 00:20:46,665 --> 00:20:49,459 నాకు కుళ్లుగా అనిపించింది, ఎందుకంటే నాన్న ఇప్పుడు ఇక్కడ లేకున్నా కూడా 275 00:20:50,210 --> 00:20:52,045 ఆయనకి నువ్వు దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. 276 00:20:52,128 --> 00:20:55,173 ఆయనతో నువ్వే ఎక్కువ సేపు గడిపావు, నీకే ఎక్కువ జ్ఞాపకాలు ఉన్నాయి ఆయనతో. 277 00:20:55,799 --> 00:20:58,218 నేను ఎంత ప్రయత్నించినా కానీ నీ అంత కాలేకపోతున్నాను అనిపిస్తూ ఉంటుంది. 278 00:20:58,301 --> 00:20:59,427 మరేం పర్వాలేదు, పాన్. 279 00:21:00,053 --> 00:21:02,764 నువ్వు నాన్నతో సరదాగా గడుపుతుంటావు కదా, అప్పుడు నాకు కూడా కుళ్ళుగా ఉంటుంది. 280 00:21:02,847 --> 00:21:05,433 నీ అంత చిలిపిగా ఉండాలనిపిస్తూ ఉంటుంది. 281 00:21:05,517 --> 00:21:10,146 కానీ ఇప్పుడు, మనం చేసే ప్రతి పని, అదెంత బోరింగ్ గా ఉన్నా కూడా, 282 00:21:10,772 --> 00:21:12,399 నాన్నని ఇక్కడికి రప్పించడానికే చేస్తున్నాను. 283 00:21:14,025 --> 00:21:15,694 నువ్వు వచ్చేసినందుకు ఆనందంగా ఉంది. 284 00:21:16,319 --> 00:21:18,989 నేను పొరబడ్డాను. ఇది అస్సలు బోరింగ్ గా ఏమీ లేదు. 285 00:21:19,072 --> 00:21:21,866 లోపల ఒక లోకమే ఉంది. హీసా, యూకా ఇద్దరూ… 286 00:21:22,617 --> 00:21:25,078 ఒక్క నిమిషం, హీసా, యూకాలు ఏమైపోయారు? 287 00:21:35,005 --> 00:21:38,592 ధన్యవాదాలు, పాండోరా పాండోరా. 288 00:21:38,675 --> 00:21:40,468 దానిదేముందిలే, హీసా. 289 00:21:40,552 --> 00:21:42,053 ఇది తీసుకోండి. 290 00:21:44,347 --> 00:21:46,016 బై, యూకా. 291 00:21:51,980 --> 00:21:54,900 ఇక మనం జాబితా చేసే పనిని కొనసాగిద్దాం పదండి. 292 00:21:54,983 --> 00:21:59,112 ఆ పని చేయవచ్చు, లేదా నువ్వు కూడా నాతో నాన్న ఆఫీసుకు రా, 293 00:21:59,195 --> 00:22:01,114 ఇద్దరం ఆయన రీసెర్చ్ వీడియోలు చూద్దాం. 294 00:22:01,197 --> 00:22:04,200 నీకు ఇక్కడే ఉండి పని చేయాలి అనిపిస్తే తప్ప. 295 00:22:04,284 --> 00:22:06,202 లేదులే. పద. 296 00:23:02,342 --> 00:23:04,344 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్