1 00:00:21,022 --> 00:00:22,315 నువ్వు చేయగలవు. 2 00:00:22,399 --> 00:00:23,942 జిమ్ క్లాస్ లాంటిదే ఇది కూడా. 3 00:00:25,443 --> 00:00:27,320 జిమ్ క్లాసులో దాదాపుగా ఫెయిల్ అయ్యా నేను. 4 00:00:32,199 --> 00:00:33,201 త్వరగా కానివ్వండి! 5 00:00:33,285 --> 00:00:35,495 ఈ తలుపును నేను ఎక్కువ సేపు ఆపలేను. 6 00:00:42,794 --> 00:00:44,254 గంట! 7 00:00:45,088 --> 00:00:46,381 పట్టేసుకున్నా. 8 00:00:50,719 --> 00:00:52,053 నిన్ను నేను పట్టేసుకున్నా. 9 00:01:05,859 --> 00:01:06,985 వచ్చేశాం! 10 00:01:07,068 --> 00:01:08,778 బూట్లూ, వేగం పుంజుకోవాలి! 11 00:01:16,703 --> 00:01:19,164 చాలా కాలం క్రితం దీన్ని మీ నుండి మా పూర్వీకులు ఒకరు దొంగిలించారు. 12 00:01:19,247 --> 00:01:20,457 కానీ దీని స్థానం ఇదే. 13 00:01:22,459 --> 00:01:25,378 మీ శాపాన్ని విరమింపజేసుకోండి, మీ ఆత్మని పంపించేయండి! 14 00:02:03,291 --> 00:02:06,169 జ్ఞాపకాల పెట్టె 15 00:02:07,629 --> 00:02:10,799 నా సున్నితమైన మనస్సు వీటిని ఇక ఎంతమాత్రం తట్టుకోగలదో ఏమో. 16 00:02:10,882 --> 00:02:14,553 హా, నాకు ప్రయాణాలు చేయడమంటే ఇష్టం, కానీ ప్రతీ ప్రయాణంలో కూడా ప్రాణానికి ముప్పు ఉంది. 17 00:02:14,636 --> 00:02:18,223 మీరిద్దరూ చాలా ధైర్యంగా వ్యవహరిస్తున్నారు, కానీ వీటన్నింటి నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుండాలేమో అని 18 00:02:18,306 --> 00:02:20,684 అప్పుడప్పుడూ నాకు అనిపిస్తూ ఉంటుంది. 19 00:02:20,767 --> 00:02:24,104 నాన్న కూడా అదే చేశాడు. ఇప్పుడు మన పరిస్థితి చూడు. 20 00:02:25,272 --> 00:02:27,899 హేయ్, మన చేతనైన ప్రయత్నం మనం చేస్తున్నాం. 21 00:02:28,817 --> 00:02:30,819 మీరిద్దరూ ఇంత తెలివిమంతులు ఎలా అయ్యారు? 22 00:02:30,902 --> 00:02:32,654 -అది మా రక్తంలోనే ఉంది. -వీడియో గేమ్స్ ఆడీ ఆడీ. 23 00:02:32,737 --> 00:02:33,738 పదండి. 24 00:02:33,822 --> 00:02:36,741 నాన్న మనకి దక్కాలంటే, మనం ఇంకా చాలా పని చేయాలి. 25 00:03:24,706 --> 00:03:27,208 లారీ మ్యాప్ లో ఉన్న వాటన్నింటినీ మనం వాటి స్థానాలకు చేర్చేశాం. 26 00:03:27,292 --> 00:03:29,669 చివరికి, ఎర్ర ముళ్ళ తీగ చివరికి వచ్చేశాం. 27 00:03:29,753 --> 00:03:32,756 నాన్నని దక్కించుకోవడానికి, ఈ ఒక్క కళాఖండం పని పట్టేస్తే సరిపోతుంది. 28 00:03:33,423 --> 00:03:36,426 కానీ ఇక్కడ కొర్నీలియస్ ఫోటోలే ఉన్నాయి. 29 00:03:36,927 --> 00:03:38,428 ఇవన్నీ శాపగ్రస్థమైనవా? 30 00:03:39,262 --> 00:03:40,764 హా! శాపగ్రస్థమైనవి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 31 00:03:44,351 --> 00:03:45,268 చూడండి. 32 00:03:45,352 --> 00:03:47,062 తీగ ఇక్కడితోనే ఆగిపోలేదు. 33 00:03:47,145 --> 00:03:49,397 ఈ గోడకి ఉన్న పగులు ద్వారా లోపలికి వెళ్తోంది అది. 34 00:04:09,668 --> 00:04:11,628 రహస్య ప్రదేశంలో రహస్య గది ఉందన్నమాట. 35 00:04:11,711 --> 00:04:14,839 ఇక్కడ ఇంకెంత భయంకరమైనవి ఉంటాయో. 36 00:04:17,384 --> 00:04:20,637 ఎర్ర ముళ్ళ తీగ ఇక్కడ ముగిసింది. 37 00:04:21,263 --> 00:04:23,807 మనం నాన్నని విడిపించడానికి ఈ ఒక్క కళాఖండం పని పడితే సరిపోతుంది. 38 00:04:23,890 --> 00:04:25,141 ఇక కానిద్దాం! 39 00:04:25,225 --> 00:04:26,226 ఆగు, దుడుకు పిట్టా. 40 00:04:26,309 --> 00:04:28,853 ఈ పెట్టె గురించి మనకేమీ తెలీదు. 41 00:04:28,937 --> 00:04:31,690 వావ్. ఇది పజిల్ బాక్స్. 42 00:04:31,773 --> 00:04:33,858 చాలా అంటే చాలా ముక్కలు ఉన్నాయి కాబట్టి, 43 00:04:33,942 --> 00:04:36,903 దీన్ని పరిష్కరించడానికి లక్షలాది మార్గాలు ఉంటాయి. 44 00:04:36,987 --> 00:04:39,656 దీన్ని నేనే పరిష్కరిస్తా. 45 00:04:40,240 --> 00:04:44,286 నువ్వు కూడా కాస్త ఆగు, రస్. జాగ్రత్తగా ఉండాలి. పజిల్స్ అంటే నీకు ఎంత పిచ్చో నాకు తెలుసు. 46 00:04:44,369 --> 00:04:49,165 అమ్మా, ప్రస్తుత పరిస్థితిని నేను అర్థం చేసుకున్నా, నన్ను నేను కంట్రోల్ చేసుకుంటా. 47 00:04:49,249 --> 00:04:52,502 మంచిది. వెళ్లి దీనికి సంబంధించిన రికార్డులు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం పదండి. 48 00:04:53,211 --> 00:04:55,881 లోపల జీనీ ఉంటే బాగుండు. 49 00:05:18,904 --> 00:05:20,238 బాసూ, ఏం చేస్తున్నావు? 50 00:05:20,739 --> 00:05:23,033 ముక్కలు కింద పడిపోతాయేమో అని సరి చేస్తున్నా. 51 00:05:23,116 --> 00:05:25,702 దీన్ని కంట్రోల్ చేసుకోవడం అనరు. 52 00:05:25,785 --> 00:05:29,706 ఎంత గొప్ప నావికుడికైనా, తుఫాను వస్తే దాన్ని తప్పించుకోవాలనే ప్రయత్నిస్తాడు. 53 00:05:29,789 --> 00:05:31,499 నేను వీటిని శుభ్రం చేస్తున్నానంతే. 54 00:05:32,000 --> 00:05:34,377 ప్రపంచంలో నేను ఛేదించలేని పజిల్ అంటూ ఏమీ లేదు. 55 00:05:35,378 --> 00:05:36,588 నేను అయితే… 56 00:05:41,009 --> 00:05:42,928 అయ్యో. రస్? 57 00:05:45,430 --> 00:05:46,514 అయ్యో. 58 00:05:47,098 --> 00:05:49,976 పజిల్స్ మీద నాకున్న పిచ్చే నా కొంప ముంచుతుందని నాకు తెలుసు. 59 00:05:53,813 --> 00:06:00,237 ఓ తెలివిమంతుడా, మీ దగ్గర నేర్చుకోవడానికి నేను చాలా రోజులు ప్రయాణించి వచ్చాను. 60 00:06:00,320 --> 00:06:02,280 కొర్నీలియస్? 61 00:06:02,364 --> 00:06:06,159 అవసరం మీద వచ్చిన యాత్రికుని కోరికని కాదనాలని నాకూ లేదు. 62 00:06:06,243 --> 00:06:09,537 కానీ మా సంఘం బయటి వారిని చేర్చుకోదు. 63 00:06:09,621 --> 00:06:11,581 నేను అర్థం చేసుకోగలను. 64 00:06:11,665 --> 00:06:13,792 పవిత్రమైన జ్ఞాపకాల పెట్టెని పరిరక్షించే వ్యక్తి నుండి 65 00:06:13,875 --> 00:06:19,089 సూచనలు అందుకోవాలని ఎదురుచూసే నాలాంటి ఔత్సాహికులు చాలా మందే ఉంటారు. 66 00:06:19,172 --> 00:06:20,423 జ్ఞాపకాలా? 67 00:06:20,507 --> 00:06:22,300 దాన్ని ఒకసారి నాకు చూపిస్తారా? 68 00:06:22,384 --> 00:06:27,055 కనీసం ఆ పెట్టెను ఒకసారి చూపినా చాలు, నా ప్రయాణ బడలికని నేను మర్చిపోతాను. 69 00:06:28,431 --> 00:06:29,558 అలాగే. 70 00:06:31,268 --> 00:06:32,852 జ్ఞాపకాల పెట్టెని మా సంఘం 71 00:06:32,936 --> 00:06:36,022 ఎన్నో తరాల నుండి డిజైన్ చేస్తూ వస్తోంది, 72 00:06:36,106 --> 00:06:38,858 మా ముఖ్యమైన జ్ఞాపకాలను స్టోర్ చేయాలని అన్నమాట. 73 00:06:42,153 --> 00:06:44,614 ప్రసంగాలు ఇవ్వడం మానేసిన మా సంఘంలోని వాళ్ల విషయంలో, 74 00:06:44,698 --> 00:06:48,285 ఒక సభ్యుని నుండి మరో సభ్యునికి మా ఆచారవ్యవహారాలను చేరవేయడానికి ఇదొక మార్గం అన్నమాట. 75 00:06:48,827 --> 00:06:54,249 కేవలం ప్రతిభావంతులైన వాళ్లు మాత్రమే పైన ఉండే పజిల్స్ ని పరిష్కరించగలరు. 76 00:06:54,332 --> 00:06:57,961 పజిల్స్ తో నేను ఆట ఆడుకుంటా. 77 00:06:58,044 --> 00:07:01,923 అది నిజమే కావచ్చు, కానీ ఇది ఆట కాదు. 78 00:07:02,007 --> 00:07:04,134 మా అస్తిత్వం, 79 00:07:04,217 --> 00:07:06,428 నాకు బాగా అర్థమైంది. 80 00:07:06,511 --> 00:07:09,389 ఇదంతా నాకు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్. 81 00:07:09,472 --> 00:07:14,227 ఇంతటి గొప్పదాన్ని భద్రంగా దాచి ఉంచాల్సిందే. 82 00:07:23,111 --> 00:07:25,739 -అయ్యో! దాన్ని ఎక్కడి నుండి తీశావో, అక్కడే పెట్టేయ్! -ఏంటి? 83 00:07:25,822 --> 00:07:27,198 ఎవరు నువ్వు? 84 00:07:27,282 --> 00:07:30,160 నీకు నేను కనిపిస్తున్నానా? 85 00:07:30,952 --> 00:07:33,079 ఎలా? నువ్వు జ్ఞాపకమనే అనుకున్నానే? 86 00:07:34,164 --> 00:07:36,291 అది నీ చేతికి ఎలా వచ్చింది? చెప్పు! 87 00:07:36,374 --> 00:07:38,668 పజిల్స్ లో నువ్వు ఒక్కడివే పిస్తా అనుకుంటున్నావా? 88 00:07:44,466 --> 00:07:46,426 రస్, నువ్వు బాగానే ఉన్నావా? 89 00:07:47,427 --> 00:07:49,679 బాగానే ఉన్నాను అనుకుంటా. 90 00:07:49,763 --> 00:07:51,973 పిచ్చిపిచ్చి పనులు చేసేది నేనొక్క దాన్నే అనుకున్నా. 91 00:07:52,057 --> 00:07:53,266 ఇప్పటిదాకా భలే గమ్మత్తుగా అనిపించింది. 92 00:07:53,350 --> 00:07:57,312 నీ దేహం ఇక్కడే ఉంది, కానీ నీ మనస్సు ఎక్కడికో వెళ్లిపోయింది, పెట్టె కూడా మాయమైపోయింది! 93 00:07:58,480 --> 00:08:00,357 నేను కొర్నీలియస్ ని చూశాను. 94 00:08:01,024 --> 00:08:02,609 అతను కూడా నన్ను చూశాడు. 95 00:08:06,529 --> 00:08:09,908 కొర్నీలియస్ జ్ఞాపకాలు ఉన్న పెట్టెనా ఇది? వాళ్లు నీతో మాట్లాడగలుగుతున్నారు కూడానా? 96 00:08:09,991 --> 00:08:11,910 బాబోయ్, నాక్కూడా ఒళ్లంతా గజగజా వణికిపోతోంది. 97 00:08:11,993 --> 00:08:13,411 థ్రిల్లింగ్ గా కాదు, భయంతో. 98 00:08:13,495 --> 00:08:16,039 ఈ మఠం ఎక్కడ ఉందో చెప్పగలవా? 99 00:08:16,122 --> 00:08:19,834 మేము జర్నల్స్ లో వెతికాం, కానీ అది ఎక్కడా దొరకట్లేదు. 100 00:08:19,918 --> 00:08:22,379 అది హిమాలయాల్లో ఎక్కడో ఉంది. 101 00:08:22,462 --> 00:08:26,424 ఈ పెట్టె ఎక్కడి నుండి వచ్చిందో తెలీకపోతే, దానికి ఉన్న శాపాన్ని మనం ఎలా వదిలించగలం? 102 00:08:27,467 --> 00:08:32,472 నేను ఇప్పుడు చెప్పే ఐడియా మీకు నచ్చకపోవచ్చు, అదేంటంటే, మనం మళ్లీ జ్ఞాపకాల పెట్టెలోకి ప్రవేశించి, 103 00:08:32,556 --> 00:08:36,183 ఇది ఎక్కడి నుండి వచ్చిందో కనుగొని, అక్కడే పెట్టి వచ్చేద్దాం, ఏమంటారు? 104 00:08:37,644 --> 00:08:39,729 ఆ ఐడియా బాగానే ఉంది. 105 00:08:39,813 --> 00:08:41,063 బాగానే ఉందా? 106 00:08:41,147 --> 00:08:43,275 అంత గొప్ప ఐడియా ఏమీ కాదు, కానీ అది పని చేస్తోందని అర్థమైంది. 107 00:08:43,358 --> 00:08:46,236 శారీరకంగా మనకి ఏ హానీ జరగదు, పైగా నిజంగా ప్రయాణించాల్సిన పని కూడా తప్పుతుంది. 108 00:08:46,319 --> 00:08:49,698 అదీగాక, మనకి వేరే మార్గాలు కూడా పెద్దగా ఏవీ లేవు. 109 00:08:49,781 --> 00:08:54,160 విలన్ గాడి బలహీనతని కనిపెట్టడానికి జేమ్స్ బండ్ అవతారం ఎత్తాల్సిందే 110 00:08:54,244 --> 00:08:55,579 నాకు డబుల్ ఓకే. 111 00:08:55,662 --> 00:08:57,455 నేనొకటి అడగవచ్చా? 112 00:08:57,539 --> 00:08:59,499 తప్పకుండా, స్టాన్లీ. ఏంటో చెప్పు. 113 00:09:00,792 --> 00:09:02,752 మీ సాహసంలో నేనూ, లారీ కూడా 114 00:09:02,836 --> 00:09:04,129 భాగం పంచుకోవాలనుకుంటున్నాం. 115 00:09:05,297 --> 00:09:06,756 మాతో రావాలనుకుంటున్నారా? 116 00:09:06,840 --> 00:09:10,051 మేము ఇల్లు వదిలి బయటకు రాకూడదు అని మీరు అనుకోవడానికి బలమైన కారణాలే ఉన్నాయి. 117 00:09:10,135 --> 00:09:12,304 కానీ ఈసారి, మేము నిజంగా ఇల్లు వదిలి వెళ్లేది లేదు కదా. 118 00:09:12,387 --> 00:09:16,057 ఎందుకంటే, మనం ఒక జ్ఞాపకంలోనే ఉంటాం, జనాలందరి ముందు ఉండం కదా. 119 00:09:16,141 --> 00:09:19,060 మీ కుటుంబానికి మేము అన్ని విధాలా సాయపడగలమనే అనుకుంటున్నాం. 120 00:09:19,144 --> 00:09:22,856 అదీగాక, నాలాంటి మాట్లాడే పుర్రెలకు బయటకు వెళ్ళే అవకాశం ఎక్కువగా రాదు కూడా. 121 00:09:22,939 --> 00:09:25,567 మీరు అలా చెప్పాక, నేను వద్దని ఎలా అనగలను? 122 00:09:27,736 --> 00:09:29,362 బయలుదేరుదాం రండి, మిత్రులారా. 123 00:09:35,243 --> 00:09:37,704 ఇప్పుడు అందరూ చేతులని పెట్టెపై పెట్టండి. 124 00:09:40,957 --> 00:09:44,336 ఒక ముఖ్యమైన విషయం, అక్కడ ఉన్నవాళ్లు మనల్ని చూడగలరు, మన మాటలు వినగలరు. 125 00:09:45,337 --> 00:09:46,838 ఇక కానిద్దాం. 126 00:10:06,316 --> 00:10:08,193 అయ్యయ్యో. లిండా ఏది? 127 00:10:08,276 --> 00:10:11,488 అది పెట్టెని తాకలేదు కదా, కాబట్టి అది జ్ఞాపకంలోకి వచ్చి ఉండకపోవచ్చు. 128 00:10:12,072 --> 00:10:14,824 అయ్యయ్యో. తనకి ఈ ట్రిప్ బాగా నచ్చి ఉండేది. 129 00:10:14,908 --> 00:10:16,868 మనం రహస్య వింగ్ లోనే ఉన్నామా? 130 00:10:16,952 --> 00:10:18,828 హిమాలయాల్లో ఉన్న మఠానికి వెళ్తామేమో అనుకున్నా. 131 00:10:18,912 --> 00:10:20,872 పోయిన సారి ఎలా అయితే చేశానో, ఇప్పుడు కూడా అలాగే చేశా. 132 00:10:20,956 --> 00:10:22,499 కానీ మనం అక్కడికి ఎందుకు వెళ్లలేదో… 133 00:10:22,582 --> 00:10:23,917 ఒక్క నిమిషం. 134 00:10:24,000 --> 00:10:26,086 ఇక్కడ ఉండాల్సిన భాగం పక్కకు జరిగి ఉంది. 135 00:10:26,169 --> 00:10:28,255 ఇక్కడున్న ఒక్కోటి ఒక్కో జ్ఞాపకానికి చెందినవి అయ్యుంటాయి. 136 00:10:28,338 --> 00:10:30,840 రిమోట్ కంట్రోల్ లో ఛానెళ్ళను మార్చడంలా అన్నమాట. 137 00:10:30,924 --> 00:10:32,050 ఇటు చూడండి. 138 00:10:32,133 --> 00:10:34,928 సెక్యూరిటీ వ్యవస్థ ఇంకా నిర్మాణంలోనే ఉంది. 139 00:10:35,011 --> 00:10:37,055 ఆరోజుల్లో ఇలా ఉన్నట్టు మీకు గుర్తుందా? 140 00:10:37,138 --> 00:10:38,723 లేదు, అప్పటికి మేమింకా నిద్రావస్థలోనే ఉన్నాం. 141 00:10:38,807 --> 00:10:42,227 కోర్నీ రాయి అయిన తర్వాతే మేము నిద్రావస్థ నుండి మేల్కొన్నాం. 142 00:10:42,310 --> 00:10:45,647 రస్, ఈ పెట్టె ఏంటి, దీన్ని ఎలా వాడాలి అనే విషయంలో నీకు గందరగోళంగా ఉందా? 143 00:10:45,730 --> 00:10:48,650 -నేను సాయపడగలను. -దీన్ని ఎలా ఆన్ చేయాలో, ఎలా ఆఫ్ చేయాలో అర్థమైంది. 144 00:10:48,733 --> 00:10:51,152 కానీ ఒక జ్ఞాపకం నుండి ఇంకో జ్ఞాపకానికి ఎలా వెళ్లాలనేది చూస్తున్నాను. 145 00:11:06,751 --> 00:11:07,752 అదీ లెక్క. 146 00:11:15,468 --> 00:11:19,681 పెద్ద కమ్మరి పెట్టెలోని పనిముట్లని చూసి ఇంతలా మురిసిపోయేవాళ్ళని నేనెప్పుడూ చూడలేదు. 147 00:11:21,308 --> 00:11:25,103 ఆ చెత్త మంత్రం ఎక్కడ చచ్చింది? 148 00:11:25,186 --> 00:11:27,898 హా, ఇక్కడ ఉంది. 149 00:11:27,981 --> 00:11:31,276 "ఉక్కు మోత మార్మోగాలి. 150 00:11:32,068 --> 00:11:36,281 అగ్ని దేవుని దీవెనలతో, మేలుకో!" 151 00:11:47,000 --> 00:11:48,460 బాబోయ్… 152 00:11:48,543 --> 00:11:49,961 ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 153 00:11:50,879 --> 00:11:52,172 మన మాటలు అతనికి వినిపించాయి! 154 00:11:52,255 --> 00:11:53,757 అగంతకులను పట్టుకో! 155 00:11:54,591 --> 00:11:56,801 అతను జ్ఞాపకం మాత్రమే. ఏమీ చేయలేడు. 156 00:11:57,552 --> 00:11:58,553 అంతే కదా, రస్? 157 00:12:00,388 --> 00:12:02,224 నాకు అంత ఖచ్చితంగా తెలీదు. 158 00:12:02,307 --> 00:12:04,601 జ్ఞాపకమైనా, కాకపోయినా ఇక్కడి నుండి వెళ్లిపోదాం పదండి. 159 00:12:08,396 --> 00:12:09,814 త్వరగా ఛానెల్ మార్చు! 160 00:12:09,898 --> 00:12:10,732 అదే ప్రయత్నిస్తున్నా. 161 00:12:10,815 --> 00:12:14,069 మన వెనుక మెటల్ మాన్స్టర్ ఉంది. ఇంకా గట్టిగా ప్రయత్నించు! 162 00:12:17,030 --> 00:12:18,448 కనిపెట్టేశా అనుకుంటా. 163 00:12:19,616 --> 00:12:21,576 స్టాన్లీ, లారీ, త్వరగా రండి! 164 00:12:22,077 --> 00:12:23,286 మీ చేతులు పెట్టెపై పెట్టండి. 165 00:12:35,257 --> 00:12:36,675 అయ్యయ్యో. 166 00:12:39,803 --> 00:12:41,221 మనం మళ్లీ వెనక్కి వెళ్లి, వాళ్ళని కాపాడాలి. 167 00:12:41,304 --> 00:12:43,014 రస్? మళ్లీ అక్కడికి తీసుకెళ్లగలవా? 168 00:12:43,098 --> 00:12:44,474 తీసుకెళ్ళగలను అనే అనుకుంటున్నా. 169 00:12:45,058 --> 00:12:46,935 కానీ, వాళ్లు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. 170 00:12:47,018 --> 00:12:48,937 ఆ విషయానికి వస్తే, మనం ఎక్కడ ఉన్నామో కూడా తెలీట్లేదు. 171 00:12:49,020 --> 00:12:50,564 జూన్ 1909. 172 00:12:50,647 --> 00:12:51,565 ఇప్పుడు ఓకేనా? 173 00:12:51,648 --> 00:12:53,275 జూన్ 1909? 174 00:12:53,358 --> 00:12:56,486 కొర్నీలియస్ జర్నల్ లోని ఎంట్రీలు దీనికి రెండు నెలల తర్వాత ఆగిపోతాయి. 175 00:12:56,570 --> 00:12:58,947 అంటే, ఇంకో రెండు నెలల్లో అతను రాయిలా అయిపోతాడేమో. 176 00:12:59,030 --> 00:13:02,284 సూపర్. అయితే స్టాన్లీ, లారీలు దీని కన్నా ముందు కాలంలోనే ఇరుక్కుపోయారని అర్థమవుతోంది. 177 00:13:02,367 --> 00:13:03,326 వెళ్లి వాళ్ళని తీసుకువద్దాం. 178 00:13:03,410 --> 00:13:05,203 మీరు చెప్పినట్టే అది అక్కడ ఉంటే… 179 00:13:05,287 --> 00:13:06,454 త్వరగా దాక్కుందాం రండి. 180 00:13:06,538 --> 00:13:09,541 …అక్కడికి వెళ్లాల్సిందే. 181 00:13:09,624 --> 00:13:11,626 ఆ ప్రాంతంపై చాలా ఏళ్ల నుండీ నేను అధ్యయనం చేస్తున్నాను. 182 00:13:11,710 --> 00:13:14,963 ట్లాతొవాని డిఫెన్స్ ఉండే చోటుకు మిమ్మల్ని నేను తప్ప ఇంకెవరూ తీసుకెళ్లలేరు. 183 00:13:15,046 --> 00:13:19,050 ఆ పెట్టె నేను సేకరించిన కళాఖండాలలోకల్లా ప్రధాన ఆకర్షణ అవుతుంది. 184 00:13:19,134 --> 00:13:20,635 ఇప్పుడు అది ఎక్కడ ఉందో చెప్పండి? 185 00:13:20,719 --> 00:13:24,973 తప్పుగా అనుకోకండి, మీరు నమ్మదగినవారు కాదని విన్నాను, మిస్టర్ వాండర్హూవెన్. 186 00:13:25,056 --> 00:13:30,103 మనం మెక్సికోకి వెళ్లాక, అది ఉండే చోటుకు తీసుకెళ్తాను. 187 00:13:30,937 --> 00:13:33,231 అలాంటిదేమీ లేదని 188 00:13:33,315 --> 00:13:36,192 యూనివర్సిటీ డిగ్రీలు ఉన్న డజను మంది నా మనుషులు చెప్తున్నప్పుడు, 189 00:13:36,276 --> 00:13:39,654 మీ మాటలను నేనెందుకు నమ్మాలి? 190 00:13:39,738 --> 00:13:42,699 ఎందుకంటే, మీ మేధావులందరూ, గత నాలుగు శతాబ్దాలలో 191 00:13:42,782 --> 00:13:46,494 నది పశ్చిమ వైపునకు మారిందనే విషయాన్ని గమనించలేదు కాబట్టి. 192 00:13:47,787 --> 00:13:49,831 నేనే నా మార్గాన్ని ఏర్పరచుకుంటాను. 193 00:13:49,915 --> 00:13:54,461 ఆ యాత్రకు మీరు నిధులు సమకూరిస్తే, ఆ మార్గంలో వెళ్తే మీకు పెట్టె దొరుకుతుంది. 194 00:13:54,544 --> 00:13:57,797 ట్లాతొవాని డిఫెన్స్ అనేది నా మనస్సులో ఎన్నో ఏళ్ల నుండి ఉంది. 195 00:13:58,798 --> 00:14:04,596 దీన్ని దక్కించుకుంటే, ఎనలేని శక్తి లభిస్తుంది, ఎవరూ ఊహించలేనంత శక్తి అన్నమాట. 196 00:14:05,597 --> 00:14:07,015 ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి. 197 00:14:07,098 --> 00:14:08,934 తప్పకుండా, మిస్టర్ వాండర్హూవెన్. 198 00:14:38,755 --> 00:14:41,883 ఈ పెట్టెకి, కుటుంబం మీద ఉన్న శాపానికి ఏమైనా సంబంధం ఉంటావా? 199 00:14:41,967 --> 00:14:43,843 టైమింగ్ ని బట్టి చూస్తే సంబంధం ఉన్నట్టే అనిపిస్తోంది. 200 00:14:43,927 --> 00:14:46,846 అయితే, ఆ ముసలాడు ఏం చేస్తున్నాడో చూద్దాం పదండి. 201 00:15:04,990 --> 00:15:06,908 ఈ సొరంగాన్ని ఇదివరకు ఎన్నడూ నేను చూడనే లేదు. 202 00:15:10,829 --> 00:15:11,997 ఇక్కడ చూడండి. 203 00:15:12,080 --> 00:15:14,416 హవర్ గ్లాస్ ఉండే చోటు అది. 204 00:15:14,499 --> 00:15:16,710 ఇంకా ఆ పిచ్చి తీగలు కూడా లేవు. 205 00:15:16,793 --> 00:15:20,171 ఇన్నేళ్ళూ ఇక్కడ ఏం దాగి ఉందబ్బా? 206 00:15:26,928 --> 00:15:29,806 పెద్ద మెటల్ తలుపు ఉంది, భీరువా లాగా. 207 00:15:29,890 --> 00:15:32,309 ఇక్కడ ఉన్న శాపగ్రస్త వస్తువులు కన్నా లోపల ఉండేది అంత ప్రమాదకరమైనదా? 208 00:15:32,392 --> 00:15:34,561 అందుకే దాన్ని లోపల లాక్ చేసి ఉంచాడా? 209 00:15:37,147 --> 00:15:39,357 ఈ జ్ఞాపకాల పెట్టె గురించి ఇప్పుడు నాకు అర్థమైంది. 210 00:15:39,858 --> 00:15:42,527 ఇది కాలం ప్రకారం డిజైన్ చేయబడిన కోడ్… 211 00:15:43,111 --> 00:15:44,237 ఎవరు నువ్వు? 212 00:15:44,321 --> 00:15:46,364 నా జ్ఞాపకాల పెట్టె నీ చేతికి ఎలా వచ్చింది? 213 00:15:46,448 --> 00:15:48,783 ఇది నీది కాదు. నువ్వు దొంగిలించావు. 214 00:15:48,867 --> 00:15:50,702 చెప్తున్నా కదా, దొంగా. 215 00:15:50,785 --> 00:15:51,995 బ్రయర్ స్టోన్ బంగళాలోకి దొంగచాటుగా 216 00:15:52,078 --> 00:15:54,706 ఎందుకు వచ్చాన అని ఏడుస్తావు చూడు. 217 00:16:03,673 --> 00:16:05,842 నేను అడిగే వాటికి సమాధానాలు చెప్పకపోతే, 218 00:16:05,926 --> 00:16:09,387 నాకు పిచ్చ కోపమొస్తుంది, ఆ తర్వాత ఏం చేస్తానో నాకే తెలీదు. 219 00:16:10,889 --> 00:16:12,641 పిచ్చ కోపమంటే ఎంత కోపం? 220 00:16:12,724 --> 00:16:16,394 కొట్టేలా చూడటం, భయపెట్టేలా తిట్టడమా? 221 00:16:16,478 --> 00:16:21,483 నీ అతి చూస్తుంటే, అంతకు మించే చేయాల్సి వచ్చేలా ఉంది. 222 00:16:28,073 --> 00:16:30,700 సరే, సరే. నీకన్నీ చెప్పేస్తాను. 223 00:16:31,868 --> 00:16:33,286 నేను మీ ముని-ముని-ముని మనవడిని. 224 00:16:33,370 --> 00:16:34,371 హోరస్ వాండర్హూవెన్. 225 00:16:34,454 --> 00:16:37,707 నువ్వు నా వంశస్థుడివా? 226 00:16:37,791 --> 00:16:39,668 ఆ అవకాశమే లేదు. 227 00:16:39,751 --> 00:16:42,045 హేయ్, నీ వంశస్థుడిగా పుట్టినందుకు నాకు ఆనందంగా ఉందనుకుంటున్నావా? 228 00:16:42,128 --> 00:16:44,923 నీ అత్యాశతో మన కుటుంబ అస్థిత్వాన్ని నాశనం చేశావు నువ్వు. 229 00:16:45,006 --> 00:16:46,424 ఎంత ధైర్యం నీకు? 230 00:16:46,508 --> 00:16:48,260 లేదు. ఆ మాట అనాల్సింది నేను! 231 00:16:48,343 --> 00:16:50,178 ఇదంతా నీ వల్లే. 232 00:16:50,262 --> 00:16:51,930 అదీగాక, నువ్వు నిజం కూడా కాదు. 233 00:16:52,013 --> 00:16:53,056 నువ్వు ఉత్త జ్ఞాపకానివి, అంతే. 234 00:16:53,139 --> 00:16:56,935 నువ్వు పనికిమాలిన దొంగవి, 235 00:16:57,018 --> 00:17:00,772 నా ఇంట్లోకి దొంగతనంగా చొరబడి నా విలువైన వస్తువులని కొల్లగొట్టాలని వచ్చావు. 236 00:17:04,526 --> 00:17:08,280 నేనే దొంగని అయితే, ఈ రహస్య ప్రదేశం గురించి, ఇందులోని దారుల గురించి నాకు ఇంత బాగా ఎలా తెలుసు? 237 00:17:08,362 --> 00:17:11,533 ఈ ప్రదేశానికి నేను ఆ పేరు పెట్టానని నీకెలా తెలుసు? 238 00:17:11,616 --> 00:17:13,159 ఎందుకంటే, ఇది నా ఇల్లు కాబట్టి. 239 00:17:13,243 --> 00:17:16,371 అలాగే, కాంగో నుండి నువ్వు దొంగిలించిన పసిడి కొండముచ్చు తల గురించి నాకు బాగా తెలుసు. 240 00:17:16,454 --> 00:17:19,082 మిస్టర్ పెక్మిన్ నుండి నువ్వు కొట్టేసిన జోస్యం చెప్పే గిన్నె గురించీ తెలుసు. 241 00:17:19,583 --> 00:17:23,003 ఈ జ్ఞాపకాల పెట్టెని హిమాలయాల్లోని ఓ మఠం నుండి ఎలా కొట్టేశావో కూడా నాకు బాగా తెలుసు. 242 00:17:23,085 --> 00:17:26,506 అదే "కాష్మనికా" పర్వతంలో ఉండే మఠం నుండి? 243 00:17:27,382 --> 00:17:31,052 అది "కాష్మనికా" కాదురా పిచ్చోడా. 244 00:17:31,136 --> 00:17:32,762 అడిరిష్యా పర్వతం. 245 00:17:32,846 --> 00:17:36,391 దీన్ని బట్టి నువ్వు ఉత్త మాయలోడివి అని తెలిసిపోతోంది. 246 00:17:36,474 --> 00:17:38,226 రస్ ఏం చేస్తున్నాడు? 247 00:17:38,310 --> 00:17:42,188 మఠం ఏ పర్వతంలో ఉందో తెలివిగా కొర్నీలియస్ చేతనే చెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. 248 00:17:42,272 --> 00:17:44,190 నువ్వు అన్నది నిజమే. నా బండారం బయటపడిపోయింది. 249 00:17:44,774 --> 00:17:47,110 కానీ నువ్వు ఆ పెట్టెని నాకు ఇచ్చేసి, నన్ను వదిలేస్తే, 250 00:17:47,193 --> 00:17:50,572 నీ రహస్యాల గురించి ఎప్పటికీ, ఎవరికీ చెప్పనని మాటిస్తాను. 251 00:17:50,655 --> 00:17:52,282 చెప్పేంత సీన్ నీకు లేదులే. 252 00:17:52,365 --> 00:17:53,950 ఎందుకంటే, నిన్ను ఇక్కడి నుండి 253 00:17:54,034 --> 00:17:55,619 నేను ఎక్కడికీ పంపించేది లేదు కాబట్టి. 254 00:17:55,702 --> 00:17:57,162 కానీ మనిద్దరిదీ ఒకే కుటుంబం కదా! 255 00:17:58,538 --> 00:18:03,460 నీ పేరులో వాండర్హూవెన్ పేరు ఉండవచ్చు, అంత మాత్రాన నువ్వు నా కుటుంబ సభ్యుడివి అయిపోవు. 256 00:18:13,178 --> 00:18:15,889 అతని నుండి చాకచక్యంగా సమాచరం భలే రాబట్టావు, అన్నాయ్. 257 00:18:16,556 --> 00:18:17,474 థ్యాంక్స్, 258 00:18:17,557 --> 00:18:20,352 కానీ మనం ఇక్కడి నుండి బయటపడాలంటే, ఆ పెట్టెని మనం సంపాదించాల్సిందే. 259 00:18:20,435 --> 00:18:22,270 స్టాన్లీని, లారీని కూడా కాపాడాలి కద. 260 00:18:37,369 --> 00:18:41,498 బఫేలో ఎన్ని ఐటెమ్స్ ఉంటాయో, మనోడి దగ్గర అన్నే రహస్యాలు ఉన్నాయి. 261 00:18:43,750 --> 00:18:45,585 హా, నాకు ఆకలిగా ఉంది మరి. 262 00:18:47,128 --> 00:18:48,797 అది బ్యాంకుల్లో ఉండే వాల్ట్ లా ఉంది. 263 00:18:48,880 --> 00:18:52,050 అతను కనుక పెట్టెని దాని లోపల పెడితే, మనం దాన్ని ఇక మర్చిపోవాల్సిందే. 264 00:18:54,719 --> 00:18:56,638 కానీ ఇప్పుడు నాకు ఒక ప్లాన్ తట్టింది. 265 00:18:56,721 --> 00:18:57,931 ఇలా రండి. 266 00:19:01,184 --> 00:19:02,185 హేయ్! 267 00:19:03,144 --> 00:19:06,106 దొంగలు ఎంతమంది వచ్చారురా నాయనోయ్! 268 00:19:06,189 --> 00:19:08,900 ఇవి పగిలిపోతే అస్సలు బాగోదు. 269 00:19:08,984 --> 00:19:12,737 వీటికి కూడా విభిన్నమైన శాపంతో కూడిన చరిత్ర ఉండే ఉంటుంది కదా. 270 00:19:12,821 --> 00:19:15,073 కింద పడేశావంటే అయిపోతావు. 271 00:19:15,156 --> 00:19:16,575 పడేయమంటావా? 272 00:19:16,658 --> 00:19:18,285 -పడేస్తున్నా. -ఆగు. 273 00:19:18,368 --> 00:19:20,495 సరే. 274 00:19:20,579 --> 00:19:22,581 ఏం కావాలి నీకు? 275 00:19:22,664 --> 00:19:25,375 ఆ పెట్టె ఇచ్చేస్తే, మేము ఇంటికి వెళ్లిపోతాం. 276 00:19:25,458 --> 00:19:27,043 అది జరగని పని. 277 00:19:27,752 --> 00:19:28,753 అరెరే. 278 00:19:28,837 --> 00:19:30,380 అయ్యయ్యో! 279 00:19:31,715 --> 00:19:33,008 రస్! దీని సంగతి చూడు! 280 00:19:38,930 --> 00:19:40,473 లేయవే, దెయ్యం! 281 00:19:40,974 --> 00:19:43,435 నీ దగ్గరికి రావడానికి నాకేమైనా సరదా అనుకున్నావా? 282 00:19:43,518 --> 00:19:45,186 నీ జ్ఞాపకమన్నా కూడా నాకు పరమ చిరాగ్గా ఉంది! 283 00:19:45,270 --> 00:19:47,272 రస్, పట్టుకో! 284 00:19:49,399 --> 00:19:50,233 సిద్ధమైంది, రండి. 285 00:19:52,569 --> 00:19:54,738 ఇంటికి వెళ్లిపోయే ముందు, మధ్యలో ఒకచోటికి వెళ్దాం. 286 00:19:59,701 --> 00:20:01,286 అయ్యయ్యో, లారీ! 287 00:20:01,369 --> 00:20:04,039 వాడిని వదలరా, చచ్చినోడా! 288 00:20:05,332 --> 00:20:06,499 హేయ్, అలా తిట్టకండి. 289 00:20:06,583 --> 00:20:10,128 నన్ను కాస్త స్మూత్ గా చేస్తున్నాడంతే. ఇతని పేరు హ్యాంక్. 290 00:20:13,089 --> 00:20:17,219 కోపంతో ఒక కమ్మరి హ్యాంక్ ని శపించాడట, కానీ ఆ ప్రస్తావన మీరు తీసుకురాకండి. 291 00:20:17,302 --> 00:20:19,221 మనోడు నొచ్చుకుంటాడు. 292 00:20:20,680 --> 00:20:23,266 సారీ, హ్యాంక్. 293 00:20:28,063 --> 00:20:29,356 స్మూత్ గా చేసినందుకు థ్యాంక్స్. 294 00:20:29,439 --> 00:20:31,399 జ్ఞాపకం బయట కలుద్దాం. 295 00:20:32,234 --> 00:20:33,109 సరే మరి. 296 00:20:34,527 --> 00:20:35,570 ఇంటికి వెళ్దాం పదండి. 297 00:20:48,917 --> 00:20:50,794 హేయ్, బల్లి పాపా. మిస్ అయ్యావా నన్ను? 298 00:20:52,170 --> 00:20:55,298 మళ్లీ ఇంటికి వచ్చేసినందుకు ఆనందంగానే ఉన్నా, నేను హ్యాంక్ ని మిస్ అవుతున్నాను. 299 00:20:55,382 --> 00:20:57,342 వాడు ఇక్కడే ఎక్కడో ఉండే ఉంటాడు. 300 00:20:57,425 --> 00:20:59,135 మనం వాడు ఎక్కడున్నాడో కనిపెట్టాలి. 301 00:20:59,219 --> 00:21:03,306 అవన్నీ మంచి పనులే, కానీ ముందు ఈ పెట్టెని అడిరిష్యా పర్వతానికి తీసుకెళ్లి, అక్కడి మఠంలో అప్పగించేద్దాం. 302 00:21:09,187 --> 00:21:12,941 కొర్నీలియస్ మీ జ్ఞాపకాల పెట్టెని దొంగిలించినందుకు మేము చాలా విచారం వ్యక్తం చేస్తున్నాము. 303 00:21:13,483 --> 00:21:16,194 మీ కథలు ఇందులో ఉన్నాయో లేవో నాకు తెలీదు మరి. 304 00:21:16,278 --> 00:21:18,655 మా జ్ఞాపకాలు ఎక్కడికీ పోలేదు. 305 00:21:18,738 --> 00:21:22,367 వాటిని భద్రంగా లాక్ చేసి ఉంచాం, ఏ దొంగా కూడా వాటిని తాకలేడు. 306 00:21:25,161 --> 00:21:27,122 హార్డ్ డ్రైవ్ ని పార్టిషన్ చేసినట్టుగా అన్నమాట. 307 00:21:27,205 --> 00:21:28,248 తెలివైన పనే. 308 00:21:28,331 --> 00:21:31,960 ఇదే ఆఖరి కళాఖండం కాబట్టి శాపం అంతమైపోయి ఉంటుంది. వెళ్లి నాన్నని చూద్దాం పదండి! 309 00:21:33,336 --> 00:21:35,589 మనం కొర్నీలియస్ ని కలిశామని ఆయనకి చెప్పాలని తెగ ఆరాటంగా ఉంది నాకు. 310 00:21:35,672 --> 00:21:37,591 ఆయన్ని నేను చాలా అడగాలి. 311 00:21:37,674 --> 00:21:39,134 మేము వచ్చేస్తున్నాం, ఆలెక్స్. 312 00:21:46,057 --> 00:21:47,350 అయ్యయ్యో. 313 00:21:47,434 --> 00:21:49,311 ఇంకా రాయిలానే ఉన్నాడే? 314 00:21:51,605 --> 00:21:52,939 నాకు అర్థం కావట్లేదు. 315 00:21:53,023 --> 00:21:55,025 అదే కదా ఆఖరి కళాఖండం! 316 00:21:55,525 --> 00:21:57,819 మనం ఇంకేం చేయాలి? 317 00:21:58,570 --> 00:22:00,405 గదులన్నింటినీ బాగా తనిఖీ చేశాం కూడా. 318 00:22:04,993 --> 00:22:09,247 ఇప్పటిదాకా మనకి ఉందనే తెలీని ఒక రహస్య ఛాంబరులో తప్ప. 319 00:22:14,377 --> 00:22:18,423 చూడండి, హవర్ గ్లాసుకు వెనుక ఉండే మార్గంలో ఒక రహస్య ఛాంబర్ ఉంది కదా. జ్ఞాపకంలో చూశాం మనం! 320 00:22:18,506 --> 00:22:21,760 అక్కడొక్క చోటే ఎర్ర ముళ్ళు ఉన్న తీగ ఉంది. 321 00:22:23,094 --> 00:22:25,430 అది కొర్నీలియస్ వాల్టులోకి వెళ్తోంది. 322 00:22:25,931 --> 00:22:28,099 అదృష్టవశాత్తూ, నాకు ఆ లాక్ కాంబినేషన్ గుర్తుంది. 323 00:23:02,342 --> 00:23:04,344 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్