1 00:00:12,764 --> 00:00:14,766 ఏమైంది? నాన్న ఎందుకు రాలేదు? 2 00:00:14,849 --> 00:00:17,185 -కొంపదీసి… -ఆ మాట అనకు! మనం దగ్గర్లో ఉన్నాం. 3 00:00:17,269 --> 00:00:19,271 ఆయన్ని కాపాడి తీరుదాం. అవును కదా, అమ్మా? 4 00:00:22,357 --> 00:00:25,777 మనం రెండు ముక్కలని ఒక చోటికి చేర్చాలని జార్జియా చెప్పింది. ఆ పని చేద్దాం. 5 00:00:25,860 --> 00:00:27,445 మన ప్రయత్నం మనం చేద్దాం. 6 00:00:43,628 --> 00:00:45,589 సరే, అందరూ బయటకు వెళ్లండి. 7 00:00:45,672 --> 00:00:47,716 -ఏంటి? -ఎందుకు? 8 00:00:47,799 --> 00:00:49,676 ఇప్పుడు ఏం జరుగుతుందో మనలో ఎవరికీ తెలీదు. 9 00:00:49,759 --> 00:00:52,470 ఏమైనా ప్రమాదం జరిగితే, నాకేమీ కాకుండా ఈ హారం కాపాడుతుంది. 10 00:00:52,554 --> 00:00:54,598 మరి మీ సంగతేంటి? మీకేమీ రక్షణ లేదు. 11 00:00:55,473 --> 00:00:56,892 జాగ్రత్త, అమ్మా. 12 00:01:09,029 --> 00:01:10,864 ఇది సఫలం అవుతుందంటారా? 13 00:01:10,947 --> 00:01:13,241 అవుతుందనే అనుకుంటున్నా, కానీ మనం పురోగతి సాధించిన ప్రతిసారీ, 14 00:01:13,325 --> 00:01:15,493 ఏదోక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. 15 00:01:15,577 --> 00:01:17,162 దీనితో అంతా పరిష్కారమైపోతుందిలే. 16 00:01:17,245 --> 00:01:20,832 మనం లెక్కలేనన్ని ప్రయత్నాలు చేశాం, ఇప్పుడు మాత్రం మనకి చుక్కెదురు కాదు. 17 00:01:20,916 --> 00:01:24,336 స్టాన్లీ అన్నది నిజమే. మనం నాన్నని, ఇంకా లిండాని కూడా కాపాడుకుంటాం! 18 00:01:32,260 --> 00:01:34,346 -అంతా ఓకేనా, అమ్మా? -ఓకే అనే అనుకుంటున్నా. 19 00:01:34,429 --> 00:01:36,431 ఏదో జరగడమైతే జరుగుతోంది. 20 00:01:36,514 --> 00:01:39,100 మంచి పనే జరుగుతోంది. 21 00:01:39,184 --> 00:01:41,311 ఇది పని చేస్తోంది. నాన్న శాపం అంతమైపోతుంది! 22 00:01:41,394 --> 00:01:44,439 రండి, నాన్న మామూలు రూపంలోకి వచ్చినప్పుడు మనం అక్కడే ఉండాలి. 23 00:01:47,525 --> 00:01:50,946 మనం అంతా దిగ్విజయంగా చేశామంటే నమ్మలేకున్నా. నాన్నని చాలా మిస్ అయ్యా నేను. 24 00:01:51,029 --> 00:01:52,822 నేను కూడా మిస్ అయ్యా, కానీ మనం సాధించాం. 25 00:01:52,906 --> 00:01:56,159 నిజం చెప్పాలంటే, అతని సెంటు వాసనని నేను మిస్ అవుతున్నా. 26 00:01:57,327 --> 00:02:00,163 ఈ పీడకల అంతా ముగిసిపోయినందుకు నాకు చాలా ఉపశమనంగా ఉంది. 27 00:02:00,247 --> 00:02:03,333 ఎట్టకేలకు, మన కుటుంబమంతా మళ్లీ ఏకమవుతోంది. 28 00:02:29,109 --> 00:02:32,112 ఎర్రని హవర్ గ్లాస్, నల్లని గోళం 29 00:02:33,488 --> 00:02:35,365 నాన్న రాగానే తేరుకోవడానికి కాస్త సమయం ఇద్దాం. 30 00:02:35,448 --> 00:02:38,451 ఆయన మామూలు అవ్వగానే మీద పడ్డామంటే, బెదిరిపోతాడేమో. 31 00:02:46,877 --> 00:02:48,753 అయ్య బాబోయ్! 32 00:02:48,837 --> 00:02:51,882 భారీ స్పైడర? ఇదేం కామెడీరా బాబోయ్! 33 00:02:51,965 --> 00:02:54,759 ఇది మామూలు స్పైడర్ కాదు, బ్లాక్ విడో స్పైడర్! 34 00:02:54,843 --> 00:02:59,222 హా! ఎర్ర హవర్ గ్లాస్. ఇది ముందే నేను ఎందుకు గ్రహించలేకపోయానబ్బా? 35 00:02:59,306 --> 00:03:00,932 అందరూ ఇక్కడికి రండి! 36 00:03:05,729 --> 00:03:07,898 ఈ రహస్య వింగ్ నుండి మనం బయటపడాలి! 37 00:03:21,077 --> 00:03:22,287 అందరూ ఓకేనా? 38 00:03:22,370 --> 00:03:26,082 ఈ కళాఖండాలని కలిపితే ఒక భారీ స్పైడర్ వస్తుందని ఆన్యా మనకి చెప్పి ఉంటే బాగుండేది. 39 00:03:26,166 --> 00:03:29,586 తనకి తెలిసి ఉండకపోవచ్చు. తెలిసి ఉంటే, మనల్ని హెచ్చరించి ఉండేది. 40 00:03:29,669 --> 00:03:31,880 ఇప్పుడు మనకి తెలిసింది కదా. ఏదోకటి వేగంగా చేయాలి మనం. 41 00:03:32,756 --> 00:03:34,174 ఆ స్పైడర్ మనల్ని చంపేయాలని చూస్తోంది. 42 00:03:34,257 --> 00:03:36,676 అవును, ఆ ద్వారం అడ్డుగా ఉంది కదా, ఈ లోపే మనం 43 00:03:36,760 --> 00:03:38,511 ఒక మంచి ప్లాన్ ఆలోచించాలి. 44 00:03:42,057 --> 00:03:45,143 ద్వారం నేను అనుకున్నంత సేపు ఉండలేదే. 45 00:03:57,739 --> 00:04:00,575 కనీసం ఒక్కసారైనా మనకి ఎదురయ్యే భారీ జీవి బలహీనమైనది అయ్యుండవచ్చు కదా? 46 00:04:04,746 --> 00:04:06,414 లిండా! నువ్వు మామూలు అయిపోయావే! 47 00:04:06,498 --> 00:04:08,917 నీ టైమింగ్ బాగాలేదు, కానీ ఎలా అయితేనేం, మామూలు అయిపోవులే. 48 00:04:09,584 --> 00:04:11,169 ఎలా జరిగింది ఇది? 49 00:04:11,253 --> 00:04:14,297 స్కై, పిల్లలూ. ఉన్నారా మీరు? 50 00:04:14,881 --> 00:04:18,093 ఆలెక్స్! నువ్వు ప్రాణాలతోనే ఉన్నావు. ఏమైంది నీకు? 51 00:04:18,175 --> 00:04:20,971 ఏమో మరి, కానీ మార్పు అయితే కనిపిస్తోంది. 52 00:04:21,054 --> 00:04:25,100 ఇక్కడ చాలా కదలికలు తెలుస్తున్నాయి. ఒక క్రాక్ ద్వారా వెలుతురు కూడా వస్తోంది. 53 00:04:26,101 --> 00:04:28,311 ఆ క్రాక్ దగ్గరికి చేరుకొనే శక్తి ఉంటే బాగుండు. 54 00:04:29,479 --> 00:04:33,900 పాండోరా, చెప్తే నువ్వు నమ్మవు కానీ, లిండా నా పక్క నుండి పరుగెత్తడం చూశా. 55 00:04:34,693 --> 00:04:37,112 వెలుతురు ఉన్న వైపుకు. మీ వైపుకు. 56 00:04:38,321 --> 00:04:39,739 నావన్నీ భ్రమలేమో. 57 00:04:39,823 --> 00:04:40,991 అవి భ్రమలు కాకపోవచ్చు. 58 00:04:41,074 --> 00:04:43,076 ఆయన నిజంగానే లిండా రావడం చూశాడేమో. 59 00:04:43,159 --> 00:04:48,331 మీరంటే నాకు ప్రాణమని తెలుసుకోండి. మిమ్మల్ని కాపాడలేకపోయాను, అందుకు క్షమించండి. 60 00:04:48,415 --> 00:04:50,250 స్కై, ఈ పని ఆపవద్దు. 61 00:04:50,333 --> 00:04:54,546 నువ్వు ఈ శాపాన్ని అంతం చేసి, పిల్లలని కాపాడాలి. నువ్వు తప్పనిసరిగా… 62 00:04:57,549 --> 00:04:58,925 మనం ఇప్పటికీ ఆయన్ని కాపాడగలం. 63 00:04:59,009 --> 00:05:00,135 రస్… 64 00:05:00,218 --> 00:05:01,344 పాండోరా చెప్పింది నిజమే ఏమో. 65 00:05:01,428 --> 00:05:04,014 లిండా కూడా కొర్నీలియస్ లాగానే హవర్ గ్లాసును తాకగానే 66 00:05:04,097 --> 00:05:05,390 రాయిలా మారిపోయింది కదా? 67 00:05:05,473 --> 00:05:06,683 చెప్పు. 68 00:05:06,766 --> 00:05:10,562 కాబట్టి, లిండా కూడా ఇప్పటిదాకా నాన్న ఉన్న ప్రదేశంలోనే ఉందేమో. 69 00:05:10,645 --> 00:05:14,733 హా, ఆయన ఏదో చీకటి ప్రదేశం అన్నాడు, అక్కడ పెద్దగా ఏమీ కనిపించట్లేదని అన్నాడు. 70 00:05:14,816 --> 00:05:15,650 అవును. 71 00:05:15,734 --> 00:05:18,403 ఉన్నట్టుండి అక్కడ చాలా కదలికలు తెలుస్తున్నాయని నాన్న అన్నాడు, 72 00:05:18,486 --> 00:05:19,946 పైగా ఇప్పుడు అక్కడ వెలుతురు కూడా వస్తోంది. 73 00:05:20,030 --> 00:05:21,656 ఆ వెలుతురులో ఆయన మనల్ని చూడగలుగుతున్నాడు. 74 00:05:21,740 --> 00:05:24,951 ఇందాకే హవర్ గ్లాసుపై ఒక క్రాక్ వచ్చింది, లిండా కాంతిలోకి వెళ్లడం నాన్న చూశాడు. 75 00:05:26,036 --> 00:05:28,288 ఇప్పుడు లిండా ఇక్కడికి వచ్చేసింది. అంటే దానర్థం… 76 00:05:28,371 --> 00:05:30,832 హవర్ గ్లాసులోని క్రాకే, ఆ వెలుతురు. 77 00:05:30,916 --> 00:05:34,961 ఆలెక్స్ ఆత్మ, నల్ల గోళంలో ఇరుక్కుపోయింది. 78 00:05:39,382 --> 00:05:43,762 కానీ మనందరం ఆయన మాటలు విన్నాం. చాలా బలహీనంగా ఉన్నట్టు అనిపించింది. కాంతి దాకా ఆయన రాలేడు. 79 00:05:43,845 --> 00:05:46,848 అందుకే మనలో ఒకరం ఆయన దగ్గరికి వెళ్లి, ఆయన్ని బయటకు రప్పించడంలో సాయపడాలి. 80 00:05:46,932 --> 00:05:49,351 మనలో ఒకరం రాయిలా మారాలి. 81 00:05:55,023 --> 00:05:57,275 హేయ్! ఇక్కడికి రావే, చెత్త పురుగా! 82 00:05:57,359 --> 00:06:00,362 నిజానికి, స్పైడర్స్ పురుగులు కాదు, కానీ నేనెందుకు అలా అన్నానో తెలుసు కదా! 83 00:06:02,155 --> 00:06:03,531 హోరస్, ఏం చేస్తున్నావు? 84 00:06:03,615 --> 00:06:06,493 తర్వాత రాయి అయ్యేది నేనే కదా. ఇప్పుడు నాన్నని కాపాడటానికి నేనే అవుతా. 85 00:06:09,537 --> 00:06:12,290 -నాపై నమ్మకం ఉంచు, నేను… -నాకు తెలుసు. ఇది నువ్వు చూసుకోగలవు. 86 00:06:12,374 --> 00:06:13,917 మీరు త్వరగా వెళ్లిపోండి. 87 00:06:21,383 --> 00:06:22,884 నువ్వూ, నీ తొక్కలో వేషం! 88 00:06:28,390 --> 00:06:29,849 ఈమాత్రం దానికే రెచ్చిపోతున్నావా? 89 00:06:38,775 --> 00:06:39,943 నీ దగ్గరికే వస్తున్నా, నాన్నా. 90 00:06:44,823 --> 00:06:47,742 సరే మరి, నేను ప్రాణాలతోనే ఉన్నాను అన్నమాట. 91 00:06:51,830 --> 00:06:52,831 నాన్నా? 92 00:06:56,543 --> 00:06:58,545 నా గొంతు వినిపిస్తోందా? 93 00:06:58,628 --> 00:07:00,088 నేను రస్ ని. 94 00:07:00,171 --> 00:07:02,215 నాన్నా! ఏదోకటి మాట్లాడు! 95 00:07:05,719 --> 00:07:09,180 రాయిలా మారినవాళ్లకి ఈ గతి పడుతుంది అన్నమాట. 96 00:07:09,264 --> 00:07:12,225 వాళ్ల ఆత్మలు ఇక్కడ గుజ్జుగుజ్జు అయిపోతాయి అన్నమాట. 97 00:07:12,309 --> 00:07:13,435 లోపల నాన్న మాత్రం ఉండకూడదు. 98 00:07:14,895 --> 00:07:16,062 నాన్న మాత్రం ఉండకూడదు. 99 00:07:19,733 --> 00:07:21,568 బాబోయ్, ఇది ఖచ్చితంగా పీడకలల రూపంలో నన్ను చంపుతుంది. 100 00:07:22,402 --> 00:07:24,279 కానీ నాన్న కాదుగా, అందుకు సంతోషం. 101 00:07:30,452 --> 00:07:33,371 అవునులే, నాన్న అందరి కన్నా చివర ఉంటాడు కదా. 102 00:07:44,966 --> 00:07:47,677 హా. కిచకిచ శబ్దాలు. నాన్న ఈ శబ్దాల గురించి చెప్పాడు. 103 00:07:59,689 --> 00:08:03,026 నాన్నని కాపాడటానికి ఒక భారీ బ్లాక్ విడో స్పైడరుతో తలపడటానికి 104 00:08:03,109 --> 00:08:06,988 రస్ స్వచ్ఛందంగా ముందుకు వెళ్తాడని మూడు నెలల క్రితం నువ్వు చెప్పి ఉంటే, నమ్మే దాన్ని కాదు. 105 00:08:07,072 --> 00:08:10,450 స్వయంగా రస్ వెళ్ళడం, భారీ స్పైడర్, ఈ రెంటిలో ఏది ఎక్కువ నమ్మశక్యం కాని విషయమో తెలీట్లేదు. 106 00:08:10,533 --> 00:08:13,745 స్పైడర్ ని తన వైపు మళ్లించుకొని, రస్ మనకి చాలా ముఖ్యమైన సమయం ఇచ్చాడు. 107 00:08:13,828 --> 00:08:15,455 మనం దాన్ని వృథా చేసుకోకూడదు. 108 00:08:15,538 --> 00:08:18,041 అవును, నాన్నని స్పైడర్ లోపలి నుండి బయటకు రప్పించడంలో రస్ కి మనం సాయపడాలి. 109 00:08:18,124 --> 00:08:20,710 దాన్ని ఎలా చేయాలో నాకు భలే ఐడియా తట్టింది. 110 00:08:20,794 --> 00:08:23,922 రస్ భారీ జీవులతో తలపడుతున్నాడు, నువ్వు ప్లాన్స్ వేస్తున్నావు. 111 00:08:24,005 --> 00:08:25,507 చూడాల్సిన వింతలన్నీ చూసేస్తున్నాగా. 112 00:08:25,590 --> 00:08:28,885 నువ్వూ, నీ అన్నయ్య ఈ వేసవిలో చాలా విషయాలు నేర్చుకున్నట్టున్నారుగా. 113 00:08:28,969 --> 00:08:31,638 రస్ అంచనా నిజమే అయితే, నాన్నకి వెలుతురు సన్నగా కనిపించడానికి కారణం ఏంటంటే, 114 00:08:31,721 --> 00:08:33,890 హవర్ గ్లాసుపై ఏర్పడిన క్రాక్ చాలా చిన్నది. 115 00:08:33,974 --> 00:08:37,101 లిండా పుణ్యమా అని, బయటపడటానికి కూడా దారి అదే అని మనకి అర్థమైంది. 116 00:08:37,185 --> 00:08:38,852 కాబట్టి బయటపడటానికి ఒకటే మార్గం కాకుండా, 117 00:08:38,937 --> 00:08:42,148 ఆ ఎర్ర హవర్ గ్రాసును పగలగొట్టి చాలా క్రాక్స్ ఏర్పడేలా చేద్దాం, 118 00:08:42,231 --> 00:08:44,401 అప్పుడు బయటపడటానికి నాన్నకి, రస్ కి చాలా మార్గాలు ఉంటాయి. 119 00:08:44,484 --> 00:08:47,153 ఆ హవర్ గ్లాసును మనం నాశనం చేసేస్తే అయిపోదా? 120 00:08:47,237 --> 00:08:50,448 నాశనం చేయవచ్చు, కాకపోతే లోపల ఉన్న నాన్నని, రస్ కి ఏమైనా అవ్వవచ్చు. 121 00:08:50,532 --> 00:08:52,492 ముందు వాళ్లు క్షేమంగా బయటకు రావాలి. 122 00:08:52,576 --> 00:08:56,121 దాన్ని పగలగొట్టడమే చాలా కష్టం, అలాంటిది నాశనం చేయాలంటే గగనమే. 123 00:08:56,204 --> 00:08:59,332 హవర్ గ్లాసును పగలగొట్టడానికి మనం ఎన్ని పాట్లు పడాలో ఏమో. 124 00:08:59,416 --> 00:09:01,501 చెప్తున్నా కదా, నా ప్లాన్ కత్తిలా ఉంటుంది. 125 00:09:01,585 --> 00:09:05,755 చెప్పాలంటే, ఇది వీడియో గేమ్ లో విలన్ తో తలపడటం లాంటిదే. అందులో నన్ను తలదన్నే మొనగాడే లేడు. 126 00:09:28,987 --> 00:09:33,241 ఒక విషయం గుర్తుంచుకో, మామూలుగా అయితే ఇక్కడి వస్తువుల్లో దేన్నీ ఉపయోగించనివ్వను. 127 00:09:33,325 --> 00:09:35,285 కానీ ఇప్పుడు పరిస్థితి వేరు కదా అని ఒప్పుకుంటున్నా. 128 00:09:38,663 --> 00:09:39,664 అయినా కత్తిలా ఉందిలే. 129 00:10:02,604 --> 00:10:03,897 బాబోయ్. 130 00:10:16,409 --> 00:10:18,620 -అయ్యో! అమ్మా! -ఏమీ కాలేదులే. 131 00:10:18,703 --> 00:10:20,121 నా ఒంటి మీద… 132 00:10:21,122 --> 00:10:22,332 అయ్యయ్యో! 133 00:10:29,923 --> 00:10:31,675 ఓరి నాయనోయ్! 134 00:10:39,015 --> 00:10:40,016 ఇదే. 135 00:10:54,406 --> 00:10:55,991 -అదీలెక్క! -అదరగొట్టేశావు, పాండోరా! 136 00:10:56,074 --> 00:10:59,369 ఇంటి రక్షణ వ్యవస్థనే ఉపయోగించుకుంటూ దీనిపై భలే దాడి చేస్తున్నాం. 137 00:10:59,452 --> 00:11:03,123 పదండి. మన అతిథికి ఈ రహస్య వింగుని దగ్గర ఉండి చూపిద్దాం. 138 00:11:14,009 --> 00:11:17,345 యాక్. ఈసారి, స్పైడర్లకి చిక్కడమే మేలు. 139 00:11:29,774 --> 00:11:32,569 ఈ కొకూన్ లో ఉండే మనిషి ఆజ్టెక్ యోధుడు అనుకుంటా. 140 00:11:37,657 --> 00:11:39,618 ఈసారి పొరపాట్లకు తావు ఇవ్వకూడదు. 141 00:11:39,701 --> 00:11:42,078 సాలిగూళ్లని తాకకుండా నాన్న దగ్గరికి జాగ్రత్తగా వెళ్లాలి. 142 00:11:59,846 --> 00:12:00,931 ఇప్పుడే! 143 00:12:11,024 --> 00:12:12,192 కుంభస్థలం కొట్టాం! 144 00:12:12,275 --> 00:12:14,653 అప్పుడే పండగ చేసుకోవద్దు. మనం స్టాన్లీని కలుసుకోవాలి. 145 00:12:15,237 --> 00:12:18,073 ఈ స్పైడర్ పని పట్టడానికి మనకి ఇంకో చోటు మిగిలి ఉంది. 146 00:12:21,701 --> 00:12:24,996 అంతే, ఇంకా పగుళ్లు ఏర్పడి కాంతి లోపలికి రావాలి. బయట కుమ్మేయండి. 147 00:12:25,080 --> 00:12:26,623 నాన్న దగ్గరికి జాగ్రత్తగా చేరుకోవాలి. 148 00:12:29,960 --> 00:12:33,547 మెల్లగా వెళ్దాం. కంగారు వద్దు. 149 00:12:54,859 --> 00:12:57,445 నీ బుర్ర మామూలు బుర్ర కాదురా, వాండర్హూవెన్. 150 00:13:03,243 --> 00:13:04,244 ఆగండి… 151 00:13:06,162 --> 00:13:08,331 ఆగండి… 152 00:13:10,000 --> 00:13:11,251 ఇప్పుడే! 153 00:13:47,287 --> 00:13:49,623 సూపర్. దాన్ని తుక్కు తుక్కు చేసేశాం మనం. 154 00:13:49,706 --> 00:13:51,166 సీలింగ్ ని పైకి అను, స్టాన్లీ. 155 00:13:51,249 --> 00:13:53,418 లోపలి నుండి మనం రస్, ఆలెక్స్ ని బయటకు రావాలి కదా. 156 00:13:54,294 --> 00:13:57,881 తిక్క తీరిందా? వాండర్హూవెన్స్ తో పెట్టుకుంటే మటాష్ అయిపోతావు! 157 00:14:01,468 --> 00:14:03,011 నాన్నా? నేను రస్ ని. 158 00:14:03,094 --> 00:14:04,721 లేయ్. లేయ్, నాన్నా. 159 00:14:06,556 --> 00:14:09,851 రస్? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు ఇంకా సమయం ఉంది కదా? 160 00:14:09,935 --> 00:14:12,354 నువ్వు కూడా ఇక్కడ ఉండకూడదు. మనం ఇంటికి వెళ్తున్నాం. 161 00:14:14,814 --> 00:14:17,400 అయ్యో! ఇతని జోలికి వస్తే ఖబర్దార్! దగ్గరికి రావద్దు! 162 00:14:23,740 --> 00:14:25,617 ఏమైంది? 163 00:14:34,751 --> 00:14:37,921 నాన్నా, ఎక్కడ తప్పు జరిగిందో నాకు అర్థం కావట్లేదు. 164 00:14:38,004 --> 00:14:41,258 మేము చాలా కష్టపడి ఇక్కడి దాకా వచ్చాం… సారీ. 165 00:14:41,341 --> 00:14:43,426 సారీ చెప్పాల్సింది నువ్వు కాదు. 166 00:14:43,510 --> 00:14:46,680 నీ పూర్వీకులది, నాదే తప్పు అంతా. 167 00:14:46,763 --> 00:14:50,100 ఈ రహస్యాన్ని నాలోనే దాచుకొని, మీ అందరినీ ప్రమాదం ముంగిటకు తీసుకువచ్చాను. 168 00:14:50,642 --> 00:14:55,522 నువ్వు, పాండోరా, మీ అమ్మ, కష్టమైనా సరే, సరైన పనే చేశారు. 169 00:14:56,064 --> 00:14:59,359 వాండర్హూవెన్ వంశానికి మంచి పేరు తీసుకొచ్చారు. 170 00:15:05,824 --> 00:15:08,910 అబ్బా! దీనికి ఇన్ని ప్రాణాలు ఉంటే ఎలా? 171 00:15:19,838 --> 00:15:23,008 వావ్! హ్యాంక్ రంగప్రవేశం చేస్తున్నాడు. 172 00:15:32,809 --> 00:15:34,477 హ్యాంక్ పని అయిపోయింది. 173 00:15:34,561 --> 00:15:35,562 ఛ. 174 00:15:39,107 --> 00:15:41,484 స్కై, పాండోరా, మీరు ఇక్కడి నుండి వెళ్లిపోండి. 175 00:15:41,568 --> 00:15:44,905 ఆ మృగం సంగతి నేనూ, స్టాన్లీ చూసుకుంటాం, ఈలోపు మీరు పారిపోండి. 176 00:15:44,988 --> 00:15:48,450 అవును. మీ పనుల్లో మేము కూడా ఒక చేయి వేసి మా జన్మను సార్థకం చేసుకున్నామని చెప్పవచ్చు. 177 00:15:48,533 --> 00:15:49,659 ఇక సురక్షితమైన చోటుకు వెళ్లిపోండి. 178 00:15:50,243 --> 00:15:51,494 వద్దు, ఆగండి! 179 00:16:02,339 --> 00:16:03,840 అమ్మా, సీలింగ్ ని దించేయ్! 180 00:16:21,942 --> 00:16:23,652 మళ్లీ ఇంకెప్పుడూ అల చేయకండి. 181 00:16:23,735 --> 00:16:26,988 మనమందరం కలిసే ఉంటాం, ప్రాణాలతోనే బయటపడతాం. 182 00:16:27,072 --> 00:16:28,990 హా, మా కింద పని చేస్తున్నట్టు ఇంకెప్పుడూ మాట్లాడకండి. 183 00:16:29,074 --> 00:16:30,367 మీరు కూడా మా కుటుంబ సభ్యులే. 184 00:16:30,450 --> 00:16:31,868 మీరు కూడా వాండర్హూవెన్సే. 185 00:16:32,953 --> 00:16:34,454 నేను ఇంకా ప్రాణాలతో ఎందుకు ఉన్నానో తెలుసా? 186 00:16:35,205 --> 00:16:36,206 ఆశ. 187 00:16:36,289 --> 00:16:41,127 స్కై, పాండోరాలు మనల్ని బయటపడేసేదాకా ఆ ఆశే మనిద్దరినీ నడిపిస్తుంది. 188 00:16:41,711 --> 00:16:42,796 అర్థమైంది కదా? 189 00:16:42,879 --> 00:16:44,172 అర్థమైంది, నాన్నా. 190 00:16:44,256 --> 00:16:46,675 నువ్వు ప్రోత్సహిస్తూ బాగా మాట్లాడతావు కదా, ఈ మూడు నెలల్లో అలాంటి మాటలు విని ఉంటే, 191 00:16:46,758 --> 00:16:48,385 పిచ్చెక్కించి ఉండేవాడిని. 192 00:16:48,885 --> 00:16:50,679 మూడు నెలలేనా అయింది? 193 00:16:56,184 --> 00:16:57,644 మళ్లీ వచ్చేశాయి. 194 00:16:57,727 --> 00:17:00,730 రస్? లోపల బాగానే ఉన్నావా? 195 00:17:01,314 --> 00:17:02,440 పాండోరా! 196 00:17:02,524 --> 00:17:04,943 నాన్న దగ్గరే ఉన్నా, కానీ ఇక్కడ వెలుతురేమీ లేదు. 197 00:17:05,026 --> 00:17:06,151 అక్కడ ఏం జరుగుతోంది? 198 00:17:06,236 --> 00:17:08,737 బ్లాక్ విడో స్పైడరును ఓడించాం, కానీ అది మళ్లీ మరమ్మత్తు చేసుకొని వచ్చింది. 199 00:17:08,822 --> 00:17:10,489 చాలా అన్యాయంగా అనిపించింది. 200 00:17:10,574 --> 00:17:12,284 దానికి మరమ్మత్తులు చేసుకోవడం కూడా తెలుసా? 201 00:17:12,367 --> 00:17:15,704 దానికి భయంకరమైన ట్రిక్స్ చాలానే తెలిసినట్టున్నాయి. 202 00:17:15,786 --> 00:17:17,997 మేము హవర్ గ్లాసుని గట్టిగా కొట్టి, దానిపై ఒక పెద్ద క్రాక్ వచ్చేలా చేయాలి, 203 00:17:18,081 --> 00:17:20,583 అది మళ్లీ దాన్ని బాగు చేసుకొనే లోపే మీరు తప్పించుకొని వచ్చేయవచ్చు. 204 00:17:20,667 --> 00:17:23,837 -కానీ దాని దగ్గరికి వెళ్లడం చాలా ప్రమాదకరం. -హారం ఉంటే ఏం కాదు కదా. 205 00:17:23,920 --> 00:17:25,921 సీలింగ్ లో ఇరుకున్న హారాన్ని మనం ఎలాగైనా సంపాదించాలి. 206 00:17:26,006 --> 00:17:27,173 సీలింగ్? 207 00:17:27,257 --> 00:17:29,050 అది సీలింగ్ లో ఎలా ఇరుక్కుంది? 208 00:17:29,134 --> 00:17:30,677 దాని గురించి కంగారుపడకులే. నేను చూసుకుంటా. 209 00:17:30,760 --> 00:17:31,928 మీరు జాగ్రత్తగా ఉండండి. 210 00:17:32,012 --> 00:17:34,014 సరే, మిమ్మల్ని మేము నమ్ముతున్నాం. 211 00:17:35,181 --> 00:17:37,642 మీరు ఇంట్లోకి వెళ్లి నాకు కొన్ని తీసుకురావాలి. 212 00:17:37,726 --> 00:17:40,812 కానీ ఇంటి లోపలికి వెళ్లే మార్గం సాలె గూళ్లతో నిండిపోయింది కదా. 213 00:17:40,896 --> 00:17:43,315 తెలుసు, కానీ పై నుండి కూడా లోపలికి వెళ్లవచ్చు. 214 00:17:58,538 --> 00:18:01,041 -సిద్ధంగా ఉన్నావా? -ఆ ముక్క నేను నిన్ను అడగాలి. 215 00:18:05,712 --> 00:18:07,756 పట్టు దొరికింది. పైకి వెళ్తున్నా. 216 00:18:08,506 --> 00:18:12,385 సాలీడమ్మా సాలిడు పాకుతుందమ్మ సాలీడు 217 00:18:12,469 --> 00:18:14,012 అది త్వరలోనే ఇక్కడికి వచ్చేస్తుంది. 218 00:18:14,095 --> 00:18:16,514 అప్పుడు దాన్ని పుంగి భజాయిద్దాం. 219 00:18:16,598 --> 00:18:19,059 స్టాన్లీ, లారీలు సమయానికి వచ్చేస్తారని ఆశిద్దాం. 220 00:18:25,148 --> 00:18:26,441 ఏం జరుగుతుందో మనకి తెలుసు కదా. 221 00:18:26,524 --> 00:18:28,985 మనం భయపడాలని, తద్వారా మనల్ని పట్టేసుకోవాలని దాని ప్లాన్. 222 00:18:29,069 --> 00:18:30,362 దానికి కావాల్సింది మనం ఇవ్వకూడదు. 223 00:18:58,014 --> 00:18:59,307 అదరగొట్టేశావు, అమ్మా. 224 00:18:59,891 --> 00:19:02,060 హారం వచ్చేస్తోంది. 225 00:19:02,561 --> 00:19:05,355 దాన్ని ఎలా ఉపయోగించాలో ఇంత వేగంగా ఎలా తెలిసిపోయింది నీకు? 226 00:19:05,438 --> 00:19:08,441 దొంగిలించిన పెద్ద పెద్ద నౌకలనే నడిపిన ఘనత నాది, 227 00:19:08,525 --> 00:19:10,735 ఇది నాకు జుజుబి. 228 00:19:11,361 --> 00:19:12,571 నీ రథం ఇదుగో. 229 00:19:12,654 --> 00:19:14,239 నీకు భలే సెట్ అయింది, పాపా. 230 00:19:14,322 --> 00:19:15,574 భద్రత ముఖ్యం. 231 00:19:19,661 --> 00:19:20,996 తాడోపేడో తేల్చుకుందాం రా. 232 00:19:21,079 --> 00:19:22,497 ఇక్కడున్నానే, పిచ్చిదానా! 233 00:19:27,335 --> 00:19:29,629 అక్కడ కాదు, పైన చూడే, తిక్కదానా. 234 00:19:36,261 --> 00:19:37,262 అబ్బా. 235 00:19:37,345 --> 00:19:38,513 సారీ, రస్. 236 00:19:41,016 --> 00:19:42,726 సరే మరి, ఇక అసలైన ఆట మొదలుపెడదాం. 237 00:19:42,809 --> 00:19:43,894 అమ్మా, ఇక నీ ప్రతాపం చూపించు. 238 00:19:59,075 --> 00:20:00,660 ఇంకా పిచ్చి ట్రిక్స్ ఏవైనా ఉన్నాయా? 239 00:20:35,403 --> 00:20:37,447 హేయ్! అందరూ ఎక్కడ ఉన్నారు? 240 00:20:38,365 --> 00:20:39,407 హలో? 241 00:20:41,534 --> 00:20:42,744 నాన్న ఎక్కడ? 242 00:20:46,331 --> 00:20:47,457 ఇక్కడే ఉన్నా. 243 00:20:47,540 --> 00:20:49,417 ఇంకెక్కడికీ వెళ్లను కూడా. 244 00:20:50,168 --> 00:20:51,378 ఆలెక్స్. 245 00:21:07,269 --> 00:21:10,230 శాపం అంతమైపోయిందంటే నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంది. 246 00:21:10,313 --> 00:21:13,233 చాలా ఏళ్ల తర్వాత తొలిసారిగా నాకు విముక్తి లభించినట్టుగా అనిపిస్తోంది. 247 00:21:14,609 --> 00:21:17,696 నా అంత అదృష్టవంతమైన తండ్రి, భర్త ఇంకెవరూ ఉండరు. 248 00:21:17,779 --> 00:21:18,989 మీరు నన్ను కాపాడారు. 249 00:21:19,072 --> 00:21:20,240 మమ్మల్ని కూడా మేము కాపాడుకున్నాం! 250 00:21:20,323 --> 00:21:22,242 అయినా, విగ్రహం రూపంలో నేను కత్తిలా ఉంటాను. 251 00:21:22,325 --> 00:21:25,662 ఆ సమయం వచ్చినప్పుడు అదిరిపోయే పోజు ఒకటి ఇస్తాను, దానితో కలకలాం అదిరిపోయేలా ఉండిపోవచ్చు. 252 00:21:26,830 --> 00:21:29,541 మన ఇంట్లో మనవి కాని కళాఖండాలు 253 00:21:29,624 --> 00:21:31,167 ఇంకా చాలా ఉన్నాయి. 254 00:21:31,251 --> 00:21:33,962 వాటిని మన దగ్గర ఉంచుకోవడం సబబు కాదు. 255 00:21:34,045 --> 00:21:35,422 మనం ఎందుకు ఉంచుకుంటాం? 256 00:21:35,505 --> 00:21:39,676 వాటికి ఉన్న శాపాన్ని తీసివేసి, వాటి స్థానాలకు వాటిని చేర్చడం మన బాధ్యత. 257 00:21:39,759 --> 00:21:43,096 అప్పుడు ఆ రహస్య చోటులో చాలా ఖాళీ స్థలం ఉంటుంది కదా, 258 00:21:43,179 --> 00:21:45,599 -దాన్ని ఎలా వాడుకోవచ్చో ఊహించుకోండి. -స్కేట్ పార్క్ పెట్టుకుందామా? 259 00:21:45,682 --> 00:21:48,101 అప్పుడు నేను ఇంట్లో స్కేటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. 260 00:21:48,184 --> 00:21:49,352 అంత సీన్ లేదు. 261 00:21:49,436 --> 00:21:52,355 మనం దాన్ని ఒక అత్యాధునిక టెక్నాలజీ ల్యాబ్ గా చేసుకోవాలి, అప్పుడు నేను చాలా గొప్ప గొప్పవాటిని కనిపెడతా. 262 00:21:52,439 --> 00:21:54,274 ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరూ? 263 00:21:54,357 --> 00:21:58,653 మన పూర్వీకుల చేసిన తప్పులని సరిదిద్దవలసిన బాధ్యత మన మీద ఉంది! 264 00:21:58,737 --> 00:22:02,032 మనం ఒక తరం చేసిన పనులని సరిదిద్దాలి. 265 00:22:02,866 --> 00:22:05,410 దాని తర్వాత, నా సెలస్టియంలో ఒక స్నానపు తొట్టె పెట్టించుకుంటా. 266 00:22:05,493 --> 00:22:06,536 ఓయబ్బో. 267 00:22:27,182 --> 00:22:28,308 ఆలెక్స్? 268 00:22:29,059 --> 00:22:30,227 ఎక్కడ ఉన్నాను నేను? 269 00:22:30,810 --> 00:22:31,895 నువ్వు బాగానే ఉన్నావా? 270 00:22:32,979 --> 00:22:33,980 లేదు. 271 00:23:02,342 --> 00:23:04,344 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్