1 00:01:02,062 --> 00:01:04,063 లాంతరు 2 00:01:08,402 --> 00:01:10,237 చక్కని పనితీరు కనబరిచావు! 3 00:01:13,615 --> 00:01:15,993 - మరో ఏ-ప్లస్. నువ్వేమీ మారలేదబ్బా. - ఓయ్. 4 00:01:15,993 --> 00:01:19,162 మిడిల్ స్కూల్ ని ఎంత అద్భుతంగా అయితే ముగించావో, అంతే అద్భుతంగా హై స్కూల్ చదువు ప్రారంభించావు, బాగుంది. 5 00:01:19,162 --> 00:01:22,332 ఉన్న విషయం చెప్పాలంటే, ఇది బాగా అనిపిస్తోంది. అంతా... 6 00:01:22,332 --> 00:01:24,293 - మామూలుగా అనిపిస్తోందా? - అవును. 7 00:01:24,293 --> 00:01:25,377 నేను అర్థం చేసుకోగలనులే. 8 00:01:25,377 --> 00:01:27,212 నాకు మామూలు అనే పదమే నచ్చదు, 9 00:01:27,212 --> 00:01:29,423 కానీ ఈ ఏడాది వేసవిలో మనం అనుభవించిన వాటిని దృష్టిలో ఉంచుకొని చెప్తే, 10 00:01:29,423 --> 00:01:32,176 కాస్తంత మామూలుగా ఉండటం కూడా గొప్పగానే ఉంది. 11 00:01:32,176 --> 00:01:36,471 హా, కానీ నిజానికి, మనం చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది కదా. 12 00:01:36,972 --> 00:01:37,973 మనం నాన్నకి విముక్తి కలిపించినా, 13 00:01:37,973 --> 00:01:41,310 మన ఇంట్లో, కింద, శాపగ్రస్త కళాఖండాలు ఇంకా వేలల్లో ఉంటాయి. 14 00:01:41,310 --> 00:01:43,437 అయితే? అవి ఎప్పటి నుంచో ఉన్నాయి కదా? 15 00:01:43,437 --> 00:01:47,107 - కానీ అప్పుడు మనకి తెలీదు, ఇప్పుడంతా తెలుసు కదా, - అవును, నిజమే. 16 00:01:47,107 --> 00:01:49,943 కానీ ఆ సాలీడుని ఢీ కొట్టాక, నేను దేన్ని అయినా ఢీ కొట్టగలనని అనిపిస్తోంది. 17 00:01:53,071 --> 00:01:55,282 మరీ అతి విశ్వాసం పనికిరాదని గుర్తుంచుకో, చాలు. 18 00:01:55,282 --> 00:01:58,535 జాగ్రత్త. ప్రమాదం ఎటు వైపు నుండి వస్తుందో మనం ఊహించలేం. 19 00:02:00,037 --> 00:02:03,498 మీరిద్దరూ చాలా సేపు ఇక్కడ ఉండి కూడా, ఏదీ క్రమపద్ధతిలో సర్దలేకపోతున్నారు, 20 00:02:03,498 --> 00:02:06,084 దానికి కారణమేంటో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతోంది. 21 00:02:06,084 --> 00:02:07,669 తప్పు నాదే. 22 00:02:07,669 --> 00:02:12,132 పాండోరా మాకు పార్కూర్ క్రీడని నేర్పాక, నేను ఆ ఆటను ఆడకుండా ఉండలేకపోతున్నాను. 23 00:02:12,132 --> 00:02:14,259 శాపగ్రస్త కళాఖండాలకు తగలకుండా 24 00:02:14,259 --> 00:02:17,012 మేము క్షేమంగా ఆడగలిగే గది ఇదే. 25 00:02:17,012 --> 00:02:20,390 లేదు, తప్పు నాది. నేను మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. 26 00:02:21,141 --> 00:02:24,520 కానీ ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, నువ్వు చివరగా జర్నల్స్ పోగు నుండి టేబుల్ మీదకి దూకావు కదా, 27 00:02:24,520 --> 00:02:28,857 దాని వల్ల ఇవి చిందరవందరగా పడినా కూడా, అది కొత్తగానూ, సూపర్ గానూ ఉంది, 28 00:02:28,857 --> 00:02:30,400 మరి అంతే కదా. 29 00:02:30,400 --> 00:02:34,446 మనకి ఇంకా ఈ జర్నల్స్ తో పని అయిపోలేదు, కాబట్టి మీరు ఆడుకోవడానికి ఇంకే చోటైనా చూసుకోవాలి. 30 00:02:34,446 --> 00:02:36,323 సారీ, స్కై. 31 00:02:37,032 --> 00:02:40,827 ఆలెక్స్ కి చెప్పి, మీరు ఆడుకోవడానికి వీలుగా కొన్ని పెట్టెలు ఇవ్వమని చెప్తాను. 32 00:02:41,787 --> 00:02:42,788 ఆలెక్స్? 33 00:02:43,664 --> 00:02:44,748 ఎక్కడికి వెళ్లిపోయాడు మనోడు? 34 00:02:53,966 --> 00:02:56,134 మొదటి రెండుసార్లు చచ్చేంత భయం వేసింది. 35 00:02:56,134 --> 00:02:58,303 ఈసారి కూడా భయపడతానని ఎందుకు అనుకున్నావు? 36 00:02:58,303 --> 00:03:00,264 మూడోసారి ముచ్చటగా భయపడతావేమో అని. 37 00:03:02,182 --> 00:03:03,809 భలే చెప్పావబ్బా. 38 00:03:03,809 --> 00:03:05,102 థ్యాంక్యూ, లారీ. 39 00:03:05,102 --> 00:03:08,188 నేను కొత్త ఉద్యోగంలో చేరే ముందు, ఇక్కడ మీకు అన్నీ క్రమపద్ధతిలో ఉండేలా 40 00:03:08,188 --> 00:03:10,232 చూసుకోవాలనుకుంటున్నాను. 41 00:03:10,232 --> 00:03:12,609 స్కై, నీ కొత్త ఉద్యోగంలో నువ్వు కుమ్మేస్తావు. 42 00:03:12,609 --> 00:03:15,112 నువ్వు ప్యాక్స్టన్ మ్యూజియంలోని ప్రదర్శనకి క్యురేటరుగా ఉండటం, 43 00:03:15,112 --> 00:03:17,030 జార్జియా, ఇంకా ఆ మ్యూజియం అదృష్టమనే చెప్పాలి. 44 00:03:17,030 --> 00:03:18,699 నీకేం కావాలన్నా, నేను సాయం చేస్తాను. 45 00:03:18,699 --> 00:03:20,075 నాకు తెలుసు. 46 00:03:20,075 --> 00:03:23,537 కానీ సాధారణ జీవితంలోకి వెళ్లడం కాస్త విచిత్రంగా అనిపిస్తోంది, 47 00:03:23,537 --> 00:03:25,706 మరీ ముఖ్యంగా, నీకు వచ్చే పీడకలల కారణంగా. 48 00:03:25,706 --> 00:03:30,460 నేను వేరే పనిలో తీరిక లేకుండా ఉన్నప్పుడు, నువ్వు చాలా అంటే చాలా చేశావు. 49 00:03:30,961 --> 00:03:33,797 ఇప్పుడు నీ పద్ధతినే ఫాలో అవుదాం, ఈ కళాఖండాలన్నింటినీ వాటి స్థానానికి చేర్చేద్దాం. 50 00:03:33,797 --> 00:03:38,010 దాని వలన వాండర్హూవెన్ పేరును తిరగరాసే అవకాశం మన కుటుంబానికి దక్కుతుంది. 51 00:03:38,760 --> 00:03:42,389 నీ దగ్గర అంతా రహస్యంగా ఉంచినందుకు ఇంకోసారి సారీ, స్కై. 52 00:03:42,389 --> 00:03:44,600 - నేను... - గతం గతః. 53 00:03:44,600 --> 00:03:46,268 భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. 54 00:03:51,982 --> 00:03:53,192 అన్నట్టు, 55 00:03:53,192 --> 00:03:56,820 పార్కూర్ ఆడుకోవడానికి స్టాన్లీ, లారీలకి నువ్వు పెట్టెలు ఇస్తావని చెప్పాను. 56 00:03:57,321 --> 00:03:59,865 సరే, క్రీడాకారులారా. ఇస్తాను ఆగండి. 57 00:04:06,622 --> 00:04:08,248 ఆలెక్స్, బాగానే ఉన్నావా? 58 00:04:08,248 --> 00:04:11,460 నా కలకి అర్థం ఏంటో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోయింది. 59 00:04:12,127 --> 00:04:13,837 ఇప్పుడు అంతా తెలిసిపోయింది. 60 00:04:13,837 --> 00:04:16,255 నేను ఆ శూన్యంలో చాలాసేపు గడిపినందు వల్లే అనుకుంటా, 61 00:04:16,255 --> 00:04:19,801 తీగకి, నాకు ఏదో సంబంధం ఏర్పడినట్టుంది. 62 00:04:19,801 --> 00:04:22,012 నాన్నా, నువ్వు చెప్పేది ఏమీ అర్థం కావట్లేదు. 63 00:04:22,012 --> 00:04:25,265 రస్, శాస్త్రీయపరంగా దీనికి వివరణ ఉంటే బాగుంటుందని నాకు కూడా అనిపిస్తోంది, 64 00:04:25,766 --> 00:04:27,893 కానీ ఈ చోట ఉన్న వాటన్నింటికీ ఏదో సంబంధం ఉంది. 65 00:04:27,893 --> 00:04:30,395 కళాఖండాలకి, తీగకి, ఇప్పుడు నాకు కూడా. 66 00:04:30,896 --> 00:04:32,022 రండి, మీకు చూపిస్తాను. 67 00:04:34,107 --> 00:04:36,109 నేను ఇందాక తీగని తాకినప్పుడు, 68 00:04:36,109 --> 00:04:37,945 నాకు ఈ కళాఖండం కనిపించింది. 69 00:04:37,945 --> 00:04:40,364 లూసెర్నా శాల్. 70 00:04:40,364 --> 00:04:43,700 తెలుగులో దానర్థం, ఉప్పు లాంతరు. 71 00:04:45,494 --> 00:04:47,996 ఏంటీ? నాకేమీ తెలీవని అనుకుంటున్నారా? 72 00:04:50,290 --> 00:04:53,085 సరే, టేబుల్ మీద నుండి ఎలా దూకాలి అని 73 00:04:53,085 --> 00:04:56,088 ఒక జర్నల్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను, ఆ జర్నల్ లో దీని గురించి ఉందిలే. 74 00:04:58,298 --> 00:05:02,594 దీనికి, నాకు వచ్చే అస్థిపంజరం కలలకి ఏదో సంబంధం ఉంది. 75 00:05:02,594 --> 00:05:07,599 ఇంతకుముందు, ఏ కళాఖండాల సంగతి మనం చూడాలి అనేది ఎర్ర ముళ్లని ఉపయోగించి తీగలు మనకి చూపించేవి. 76 00:05:07,599 --> 00:05:10,477 మనం ఆ సాలీడును ఓడించిన తర్వాత, ఆ ఎర్ర ముళ్లని అది చూపించట్లేదు. 77 00:05:10,477 --> 00:05:12,813 ఇప్పుడు ఆ తీగలు నేరుగా నీకే చెప్తున్నాయేమో. 78 00:05:12,813 --> 00:05:14,773 ఇప్పుడు ఇదే మన మిషన్. 79 00:05:14,773 --> 00:05:16,984 నువ్వు బాగానే కోలుకున్నావంటావా? 80 00:05:16,984 --> 00:05:20,279 మనం ఈ పని చేసేదాకా, ఈ పీడకలలు ఆగవు అనుకుంటా. 81 00:05:20,779 --> 00:05:21,989 ఇక పని మొదలుపెడదాం మరి. 82 00:05:24,157 --> 00:05:25,993 అసలు దీన్ని ఇలా తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? 83 00:05:25,993 --> 00:05:29,162 శాపగ్రస్థ కళాఖండాన్ని నువ్వు తాకితే ఏమవుతుందో మాకు బాగా అర్థమైపోయింది, కనుక అవసరం లేనప్పుడు 84 00:05:29,162 --> 00:05:30,372 తాకడం ఎందుకని ఈ ఏర్పాటు, 85 00:05:30,372 --> 00:05:33,041 అందుకే నేను రోబోట్ చేయిని డిజైన్ చేస్తూ ఉన్నాను. 86 00:05:33,041 --> 00:05:35,460 అప్పటిదాకా, ఈ టాంగ్స్ ని ఉపయోగిస్తూ ఉండు. 87 00:05:37,337 --> 00:05:41,675 "గనిలో పని చేసే కార్మికులు పూర్తి శ్రద్ధతో పని చేసేలా చేయడం" కోసం 88 00:05:41,675 --> 00:05:45,262 ఈ ఉప్పు లాంతరును తయారు చేశారని కొర్నీలియస్ రాశాడు. 89 00:05:45,262 --> 00:05:47,139 ఇందులో కాస్త ఉప్పు ఉంది, అంతే. 90 00:05:47,139 --> 00:05:50,058 అంటే, అది తళుక్కుమంటుందనుకోండి, కానీ, దాని వల్లే వాళ్లకి పూర్తి శ్రద్ధ వచ్చేస్తుందా? 91 00:05:50,058 --> 00:05:53,353 గనిలో పనిచేసే వాళ్లకి ఆ రోజుల్లో వినోదం అంటే ఏంటో తెలీదేమో. 92 00:05:54,104 --> 00:05:57,941 మీ ముగ్గురూ కలిసి భలే పని చేస్తున్నారు. అందుకే నన్ను కాపాడగలిగారు. 93 00:05:57,941 --> 00:05:59,359 ఇది ఎక్కడిదో తెలుసుకున్నాను. 94 00:05:59,359 --> 00:06:02,196 పాండోరా, నువ్వైతే ఎగిరి గంతేస్తావు. 95 00:06:02,196 --> 00:06:05,157 ఈ లాంతరును రొమేనియాలోని చిన్ని ప్రాంతమైన 96 00:06:05,157 --> 00:06:07,826 ట్రాన్సిల్వేనియా నుండి దొంగిలించారట. 97 00:06:08,577 --> 00:06:10,787 ట్రాన్సిల్వేనియా! సూపర్! 98 00:06:10,787 --> 00:06:13,874 అది వ్యాంపైర్ కోట అయితే బాగుండు. నేను వెళ్లి సర్దుకుంటా. 99 00:06:22,216 --> 00:06:24,343 నాకు అనిపించేదే, నీకు కూడా అనిపిస్తోందా? 100 00:06:24,343 --> 00:06:26,386 భూగర్భ అగ్నిపర్వతాలా? 101 00:06:26,386 --> 00:06:28,639 మళ్లీనా? అది కాదు. 102 00:06:31,141 --> 00:06:34,811 ఇప్పుడు కుటుంబమంతా కలిసిపోయింది కదా, ఇక మనం చేయాల్సింది ఏముంది అంటావు? 103 00:06:35,312 --> 00:06:40,484 ఈ రహస్య ప్రదేశం ఇప్పటికీ మనదే కదా. ఇక్కడ మనమే రారాజులం. 104 00:06:40,484 --> 00:06:42,569 ఈమధ్య, అలా అనిపించట్లేదు నాకు. 105 00:06:43,195 --> 00:06:44,613 నాకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలి. 106 00:06:44,613 --> 00:06:47,658 నా కొత్త హార్మోనికాని సెలస్టియానికి వెళ్తున్నా, నా అవసరం ఉంటే, అక్కడికి రా. 107 00:06:53,664 --> 00:06:59,127 నేను బతికి ఉండగానే, మా అలెగ్జాండర్ ద గ్రేట్ తిరిగొచ్చేశాడబ్బా. 108 00:06:59,127 --> 00:07:02,673 వీర నారి, మార్జీ, నిన్ను చూడగానే మనస్సుకు ప్రశాంతంగా ఉంది. 109 00:07:02,673 --> 00:07:04,508 ఎలా ఉన్నావు? 110 00:07:06,510 --> 00:07:09,096 ఏంటి ఆ అద్భుతమైన వాసన? 111 00:07:09,596 --> 00:07:10,722 వెల్లుల్లి హారం. 112 00:07:10,722 --> 00:07:13,809 ట్రాన్సిల్వేనియాకి వెళ్తున్నాం కదా. 113 00:07:13,809 --> 00:07:17,729 ఆ శాపగ్రస్త కళాఖండం భయంకరమైనదే అయ్యుంటుంది అన్నమాట. 114 00:07:18,564 --> 00:07:20,190 నీకు తెలుసా? 115 00:07:23,151 --> 00:07:25,696 తనకి తప్ప ఇంకెవరికీ తెలీదులే. 116 00:07:35,455 --> 00:07:39,918 కళాఖండాన్ని, దాని యజమానికి ఇచ్చేసి, "మీ నుండి చాలా కాలం క్రితం తీసుకొన్న, 117 00:07:39,918 --> 00:07:43,005 మీ కుటుంబానికి చెందిన విలువైన వస్తువును మీకు ఇవ్వాలని వచ్చిన మిత్రులం మేము," 118 00:07:43,005 --> 00:07:45,048 అని త్వరగా చెప్పేయాలని ఉంది. 119 00:07:47,050 --> 00:07:49,261 నిజానికి అలా జరగదు. 120 00:07:49,261 --> 00:07:50,262 అలా జరగదా? 121 00:07:50,262 --> 00:07:53,682 జరగవచ్చు. జరగకపోవచ్చు. ఏదైనా అప్పటి పరిస్థితి మీద ఆధారపడుంటుంది. 122 00:07:54,183 --> 00:07:55,726 ఒక్కోసారి ఒక్కోలా జరుగుతుంది. 123 00:07:55,726 --> 00:07:57,895 కంగారుపడకు. మేము చూసుకుంటాంలే. 124 00:08:08,947 --> 00:08:11,783 మన గమ్యస్థానం, ట్రాన్సిల్వేనియా. 125 00:08:28,050 --> 00:08:31,261 నా జీవితంలో ఒక వ్యాంపైరును కలిసే అవకాశం నాకు దక్కిందంటే నమ్మలేకున్నాను. 126 00:08:31,261 --> 00:08:35,640 ట్రాన్సిల్వేనియాలో ఉన్న వాళ్లందరూ వ్యాంపైర్లు కాదమ్మా. 127 00:08:37,808 --> 00:08:39,727 పాండోరా అన్న మాటని నేను కూడా కొట్టిపారేయలేను. 128 00:08:49,947 --> 00:08:52,157 వెళ్లిపోండి! ఆ బిల్లు నేను కట్టేశాను. 129 00:08:52,908 --> 00:08:53,909 ఏమన్నారు? 130 00:08:53,909 --> 00:08:56,620 మీరు విద్యుత్తు శాఖ వాళ్లు కాదా? 131 00:08:57,412 --> 00:08:59,498 కాదు. మేము అమెరికా నుండి వచ్చాం. 132 00:09:10,801 --> 00:09:14,763 బిల్లులు కట్టని కారణంగా కరెంట్ కట్ చేయడానికి వచ్చిన వాళ్లని మిమ్మల్ని అనుకున్నాను. 133 00:09:14,763 --> 00:09:17,975 ఇంత పెద్ద కోటని చూసుకోవడానికి, బాగానే ఖర్చవుతుంది. 134 00:09:17,975 --> 00:09:20,561 అవును, ఈ కోట నన్ను పీల్చి పిప్పి చేసేస్తోంది. 135 00:09:20,561 --> 00:09:22,938 వ్యాంపైర్ చేసినట్టా? 136 00:09:22,938 --> 00:09:27,025 హా, అలాగే అనుకో. చాలా డబ్బు ఖర్చయిపోతోంది. 137 00:09:27,025 --> 00:09:30,153 నా చెత్త కుటుంబం నాకు వారసత్వంగా ఇచ్చినదాని కన్నా ఎక్కువ ఖర్చయిపోతోంది. 138 00:09:30,153 --> 00:09:35,534 ఒకానొకప్పుడు నాది సంపన్న కుటుంబం, కానీ గత నూరేళ్ల నుండి అది బాగా తరిగిపోతూ వచ్చింది. 139 00:09:35,534 --> 00:09:37,619 ఇప్పుడు ఏదో లాగించేస్తున్నామంతే. 140 00:09:38,120 --> 00:09:40,747 కానీ ఇదంతా నేనెందుకు చెప్తున్నాను? ఎవరు మీరంతా? 141 00:09:40,747 --> 00:09:44,501 చాలా కాలం క్రితం మీ కుటుంబం నుండి గుంజుకున్న ఒక విలువైన వస్తువును 142 00:09:44,501 --> 00:09:46,628 తిరిగి ఇచ్చేద్దామని వచ్చాం. 143 00:09:47,963 --> 00:09:50,174 లూసెర్నా శాల్. 144 00:09:55,637 --> 00:09:57,306 కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదే. 145 00:10:02,019 --> 00:10:04,563 అది కాస్త ఎబ్బెట్టుగానే అనిపించింది, 146 00:10:04,563 --> 00:10:07,691 కానీ కళాఖండాన్ని మనం చేర్చవలసిన చోటుకు చేర్చేశాం, అదే కదా ముఖ్యమైనది. 147 00:10:07,691 --> 00:10:10,611 - అది ముఖ్యమైనదని నాకు అనిపించట్లేదు. - లేదా? 148 00:10:10,611 --> 00:10:12,196 ఏదో తేడా కొడుతోంది. 149 00:10:12,779 --> 00:10:16,200 ఏ కళాఖండం నుండి అయినా శపం తొలగిపోతే, అది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. 150 00:10:16,200 --> 00:10:17,659 మనం చేసింది సరైన పనే అనిపిస్తోంది. 151 00:10:17,659 --> 00:10:19,745 ఈ కళాఖండమే అని తీగ నాకు చెప్పింది, 152 00:10:19,745 --> 00:10:21,914 వ్లాడ్ యజమాని అని రికార్డులు చెప్తున్నాయి. 153 00:10:21,914 --> 00:10:25,292 కానీ మనం సరి చేయాల్సింది కళాఖండం విషయంలో, దాని యజమాని విషయంలో కాదు. 154 00:10:25,292 --> 00:10:27,044 మనం వెళ్లి తిరిగి దాన్ని తెచ్చుకోవాలేమో. 155 00:10:27,544 --> 00:10:31,423 వద్దు. మనం దాని అసలైన చోటుకు చేర్చేశాం. అది సరిపోతుందిలే. 156 00:10:40,432 --> 00:10:42,643 మీలో ఎవరైనా అది గమనించారా? 157 00:10:42,643 --> 00:10:46,396 నువ్వు చెప్పేది, మనం ఇచ్చిన లాంతరును పట్టుకొని, వ్లాడ్ అనుమానాస్పదంగా పారిపోవడం గురించేనా? 158 00:10:48,524 --> 00:10:51,527 వాళ్లు ఎక్కడికి వెళ్తున్నారు? మన పని అయిపోయిందిగా. 159 00:10:51,527 --> 00:10:53,529 మన పని ఏంటంటే, లాంతరు విషయంలో సరైన పని చేయడం, 160 00:10:53,529 --> 00:10:54,905 ఎవరికో ఇచ్చేసి, చేతులు దులుపుకోవడం కాదు. 161 00:10:56,323 --> 00:10:57,574 సరే మరి. 162 00:11:06,250 --> 00:11:07,417 స్టాన్లీ. 163 00:11:09,169 --> 00:11:12,923 లోతుగా ఆలోచిస్తున్నప్పుడు మధ్యలో గెలకవద్దు అని చెప్పా కదా. 164 00:11:13,715 --> 00:11:18,762 కోపంగా ఉన్నప్పుడు ఈజిప్ట్ కళాఖండాలు ఉన్న చోటుకు కానీ వెళ్లావా? 165 00:11:25,435 --> 00:11:27,271 బాబోయ్, ఇక్కడేం జరిగింది? 166 00:11:28,146 --> 00:11:29,523 ఇది నీ పని కాదా? 167 00:11:29,523 --> 00:11:32,860 ఒక పుర్రె ఇంతటి గందరగోళాన్ని సృష్టిస్తుందని ఎలా అనుకున్నావు? 168 00:11:32,860 --> 00:11:35,237 అంటే, నాకు ఆ సత్తా ఉంది అనుకో, కానీ ఇది మాత్రం నా పని కాదు. 169 00:11:38,115 --> 00:11:39,575 మరి హ్యాంక్ ఏమైనా చేసి ఉంటాడంటావా? 170 00:11:39,575 --> 00:11:43,120 ఇది జరిగినప్పుడు, అతను మందుగుండు సామాగ్రి ఉండే చోట ఉన్నాడంట. 171 00:11:43,120 --> 00:11:45,080 అది నమ్మవచ్చు. 172 00:11:45,080 --> 00:11:48,000 ఒక కళాఖండానికేమైనా ప్రాణం వచ్చి, ఇదంతా చేసింది అంటావా? 173 00:11:48,000 --> 00:11:51,170 ఆ అవకాశం కూడా ఉంది. ముందు దీన్ని శుభ్రం చేసి, కళాఖండాలన్నింటీనీ చెక్ చేద్దాం. 174 00:11:51,170 --> 00:11:53,255 అప్పుడు మనకేమైనా ఆధారం దొరకవచ్చేమో. 175 00:12:16,236 --> 00:12:17,237 హేయ్. 176 00:12:17,821 --> 00:12:20,282 పర్వాలేదులే. ఇవన్నీ మాకు అలవాటు అయిపోయాయి. 177 00:12:23,452 --> 00:12:24,453 కానీ నాకు అలవాటు కాలేదు కదా. 178 00:12:47,434 --> 00:12:50,646 ఉప్పు. ఈ గోడల మీద స్వచ్ఛమైన కల్లు ఉప్పు ఉంది. 179 00:12:50,646 --> 00:12:53,440 ఒకప్పుడు తనది సంపన్న కుటుంబమని వ్లాడ్ అన్నాడు. 180 00:12:53,440 --> 00:12:55,150 దానికి ఇదే కారణం అయ్యి ఉంటుంది. 181 00:12:55,150 --> 00:12:56,527 ఉప్పు వల్లనా? 182 00:12:56,527 --> 00:12:59,988 చరిత్రలో ఎక్కువ కాలం, బంగారం కన్నా ఉప్పుకే ఎక్కువ విలువ ఉండేది. 183 00:12:59,988 --> 00:13:02,157 "శాలరీ" అనే పదం ఇంగ్లీషు "సాల్ట్" నుండి వచ్చిందే. 184 00:13:09,957 --> 00:13:14,086 కానీ మనోడి కోట కింద ఇంత ఉప్పు ఉంటే, అతనికి బాగా డబ్బు ఉండాలి కదా? 185 00:13:14,586 --> 00:13:16,588 బహుశా అతనికి పనివాళ్లు దొరకలేదేమో? 186 00:13:16,588 --> 00:13:18,924 గని కార్మికులకి జీతం చాలా తక్కువ, పని మాత్రం చాలా ఎక్కువ. 187 00:13:23,637 --> 00:13:26,515 ఒక్క నిమిషం. ఈ చోటుని ఎక్కడో చూసినట్టుందే. 188 00:13:27,391 --> 00:13:28,684 నా కలల్లో ఈ చోటును చూశా. 189 00:13:28,684 --> 00:13:29,935 అవునా? 190 00:13:29,935 --> 00:13:32,813 పనివాళ్లు అలసిపోయినప్పుడు సేద తీరడానికి ఇవి ఏర్పాటు చేసి ఉంటారు. 191 00:13:32,813 --> 00:13:34,690 ఇక్కడ హాయిగా కాసేపు పడుకోవచ్చు. 192 00:13:34,690 --> 00:13:36,984 ఇవి పాత శ్మశానవాటికలు అనుకుంటా. 193 00:13:37,651 --> 00:13:39,695 అంటే, ఇక్కడ శవాలను ఉంచేవారు. 194 00:13:40,904 --> 00:13:42,406 అంతేగా. 195 00:13:42,406 --> 00:13:46,159 ఉప్పు వస్తువులను పాడు కాకుండా చూసే సహజ వనరు. కానీ ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి ఎందుకు? 196 00:13:50,664 --> 00:13:52,374 మనం వెళ్లిపోవాలి. ఇప్పుడే. 197 00:13:52,374 --> 00:13:54,501 మనం లాంతరు కోసం కదా వచ్చింది! 198 00:13:54,501 --> 00:13:57,337 నా కలల్లో నాకు కనిపించింది కేవలం లాంతరు మాత్రమే కాదు. 199 00:14:07,347 --> 00:14:09,057 అవి మనల్ని గమనించలేదు. 200 00:14:09,057 --> 00:14:13,312 వావ్. వ్యాంపైర్లు కన్నా ఈ అస్థిపంజరాలే కత్తిలా ఉన్నాయి. 201 00:14:13,896 --> 00:14:15,689 ఏం జరుగుతోందో మనం కనిపెట్టాలి. 202 00:14:26,200 --> 00:14:29,036 కార్మికులరా, శ్రద్ధగా వినండి. ఇలా చూడండి. 203 00:14:35,709 --> 00:14:37,586 ఆ కథలన్నీ నిజమే అన్నమాట. ఇది పని చేస్తోంది. 204 00:14:38,086 --> 00:14:40,088 మీకు ఒక శుభవార్త. 205 00:14:40,088 --> 00:14:42,841 మా కుటుంబానికి చెందిన, పాతకాలపు కళాళఖండం ఒకటి మళ్లీ మన చేతికి వచ్చేసింది, 206 00:14:42,841 --> 00:14:46,637 బాషూ ఉప్పు గనులల్లో మళ్లీ త్వరలోనే పని ప్రారంభం కానుంది. 207 00:14:46,637 --> 00:14:49,056 ఇక మీ పారలను పట్టుకొని పని మొదలుపెట్టండి. 208 00:14:55,395 --> 00:14:59,816 హా, ఆ వస్తువుకు ఇంకా శాపం పోలేదబ్బా. 209 00:15:06,198 --> 00:15:07,324 ఇదే ఆఖరిది. 210 00:15:07,324 --> 00:15:09,952 ఇంకేమీ లేవని పక్కానా? 211 00:15:09,952 --> 00:15:12,704 లెక్కల్లో నన్ను మించినోడే లేడు, గురూ. పక్కానే. 212 00:15:13,288 --> 00:15:14,831 ఒక కళాఖండం లెక్క తేలట్లేదు. 213 00:15:15,332 --> 00:15:18,210 ప్రాచీన ఈజిప్ట్ రాజు సమాధి నుండి ఓ బ్రేస్ లెట్ మిస్ అవుతోంది. 214 00:15:18,794 --> 00:15:21,421 అయితే, అదే మేల్కొని వెళ్లిపోయిందంటావా? 215 00:15:21,421 --> 00:15:24,258 లేదా ఎవరైనా దొంగతనంగా వచ్చి, ఎత్తేశారా? 216 00:15:24,258 --> 00:15:27,469 లారీ, ఇప్పుడు మన ముందు ఒక మిస్టరీ ఉంది. 217 00:15:27,469 --> 00:15:31,849 ఈ చోటుకు ఇన్ ఛార్జులం ఇంకా మనమే అయితే, ఈ మిస్టరీని మనమే ఛేదించాలి. 218 00:15:31,849 --> 00:15:33,642 అలాగే, కెప్టెన్. 219 00:15:35,018 --> 00:15:36,979 వ్లాడ్ కుటుంబం, ఆ లాంతరును ఉపయోగించి, అస్థి పంజరాల ద్వారా 220 00:15:36,979 --> 00:15:38,480 పని చేయించుకుంటూ ఉండుంటుంది. 221 00:15:38,480 --> 00:15:39,982 "గనిలో పని చేసే కార్మికులు 222 00:15:39,982 --> 00:15:42,734 పూర్తి శ్రద్ధతో పని చేసేలా చేయడం" అంటే ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. 223 00:15:42,734 --> 00:15:46,029 కొర్నీలియస్ ఆ లాంతరును తీసుకున్నాక, వాటిని అదుపు చేసే అవకాశం లేకుండా పోయింది. 224 00:15:46,530 --> 00:15:49,283 ఇన్నేళ్లూ ఇవి ఏం పనీ లేక, ఊరికే అటూఅటూ తిరుగుతూ ఉన్నట్టున్నాయి. 225 00:15:49,283 --> 00:15:51,743 ఇప్పుడు వ్లాడ్ కి మనం దాన్ని తిరిగి ఇచ్చేశాం కాబట్టి, 226 00:15:51,743 --> 00:15:54,496 అతను దాని సాయంతో, మళ్లీ తన కుటుంబ వ్యాపారాన్ని ప్రారంభించేసుకుంటున్నాడు. 227 00:15:54,997 --> 00:15:57,875 ఈ అస్థిపంజరాలు తొలితరం నాటి కార్మికులకి చెందినవి అయ్యుంటాయి. 228 00:15:57,875 --> 00:16:00,085 చనిపోయాక కూడా, అవి ఇంకా బంధీలుగానే ఉన్నాయి. 229 00:16:00,085 --> 00:16:03,297 బంధీలు మాత్రమే కాదు, అవి కట్టు బానిసలని చెప్పవచ్చు. 230 00:16:03,297 --> 00:16:06,049 మనం వాటికి స్వేచ్ఛనిచ్చి, వాటి ఆత్మకు శాంతి ప్రసాదించాలి. 231 00:16:06,049 --> 00:16:08,468 ఆ లాంతరును సంపాదించి, పని ఆపమని వాటిని ఆదేశిద్దాం. 232 00:16:08,969 --> 00:16:10,137 అది పని చేస్తుందంటావా? 233 00:16:10,137 --> 00:16:11,263 ఏమో మరి. 234 00:16:11,763 --> 00:16:13,849 అయితే, ఆ లాంతరును సంపాదించాల్సిన బాధ్యత నాదే. 235 00:16:13,849 --> 00:16:15,434 పిల్లలూ, మీరు ఇక్కడే క్షేమంగా ఉండండి. 236 00:16:15,434 --> 00:16:17,728 అబ్బా, ఇప్పుడు నువ్వు కూడానా? 237 00:16:17,728 --> 00:16:21,607 పోయిన వేసవి అమ్మ కూడా మమ్మల్ని ఇలాగే విసిగించింది. అది చాలా ముఖ్యమైనది. 238 00:16:21,607 --> 00:16:23,942 తను చెప్పింది నిజమే. అది చాలా ముఖ్యమైనదే. 239 00:16:23,942 --> 00:16:26,361 అప్పుడు మన కుటుంబంలో నేను లేను కదా. 240 00:16:26,361 --> 00:16:28,238 ఇప్పుడు మేమిద్దరమూ ఉన్నాం కదా, మిమ్మల్ని కాపాడుకుంటాం, 241 00:16:28,238 --> 00:16:30,282 మీరిద్దరూ కాసేపు విశ్రమించవచ్చు. 242 00:16:31,241 --> 00:16:32,659 ఆయన్ని చేయనిద్దాం. 243 00:16:32,659 --> 00:16:34,620 కొందరికి అనుభవానికి వస్తే కానీ తెలీదు, 244 00:16:35,204 --> 00:16:36,955 బ్యాకప్ కోసం సిద్ధంగా ఉండండి. 245 00:16:39,208 --> 00:16:43,420 కష్టపడండి! మళ్లీ బాషూ వంశం సిరిసంపదలతో కళకళలాడిపోనుంది. 246 00:16:43,420 --> 00:16:46,798 వ్లాడ్ బాషూ, ఇక ఆపేయ్. 247 00:16:48,258 --> 00:16:51,678 విద్యుత్తు శాఖలో పని చేసే వ్యక్తిగా నటించిన వ్యక్తి అన్నమాట. 248 00:16:53,514 --> 00:16:55,849 లేదు మీరు అపార్థం చేసుకున్నారు. 249 00:16:55,849 --> 00:16:57,518 అయితే, మీకు ఇక్కడేం పని? 250 00:16:57,518 --> 00:16:59,186 మిమ్మల్ని అడ్డుకోవడానికి వచ్చాం మేము. 251 00:16:59,186 --> 00:17:02,356 నీ కుటుంబ వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించడానికి ఇలా బానిసత్వాన్ని ఉపయోగించుకుంటే, మేము ఊరుకోం. 252 00:17:02,356 --> 00:17:06,568 అస్థిపంజరాల సైన్యం నా చేతిలో ఉంది. నేను ఏమైనా చేయగలను. చూడండి. 253 00:17:06,568 --> 00:17:09,320 శ్రామికులారా, ఈ ఆగంతకులని పట్టుకోండి. 254 00:17:13,450 --> 00:17:15,452 హనీ, ఇప్పుడు మనం పరుగెత్తాలి. 255 00:17:35,722 --> 00:17:37,057 సంపాదించా! 256 00:17:44,565 --> 00:17:45,732 సూపర్. 257 00:17:45,732 --> 00:17:47,109 ఇది నా దగ్గరే ఉండనివ్వులే. 258 00:17:47,109 --> 00:17:49,319 అస్థిపంజరాలారా, వీళ్లని పట్టుకోండి. 259 00:17:50,612 --> 00:17:53,782 పరిగెత్తు! మైన్ కార్ట్ వైపు పరుగెత్తు! 260 00:18:00,497 --> 00:18:02,332 ఇది ఇంతకన్నా వేగంగా వెళ్లదా? 261 00:18:03,250 --> 00:18:05,002 హా, గట్టిగానే తోస్తున్నా నేను. 262 00:18:25,230 --> 00:18:26,815 మంచి పని చేశావు, పాన్. 263 00:18:27,900 --> 00:18:29,318 త్వరగా రా. దీన్ని ఎక్కుదాం. 264 00:18:37,117 --> 00:18:38,994 - థ్యాంక్స్. - నేనున్నాగా. 265 00:18:39,995 --> 00:18:41,622 అస్థిపంజరాలు వచ్చేస్తున్నాయ్. 266 00:18:42,206 --> 00:18:44,499 దీని చక్రాన్ని పట్టాల మీదకి ఎక్కించాలని చూస్తున్నా. 267 00:18:45,417 --> 00:18:47,085 అందాక వీటి సంగతి నేను చూసుకుంటాలే. 268 00:18:52,382 --> 00:18:53,675 అయిపోవచ్చింది. 269 00:19:05,479 --> 00:19:06,480 ఎక్కేసింది! 270 00:19:30,879 --> 00:19:33,340 నాకు ఈ గనుల గురించి తెలిసినంతగా మీకు తెలీదుగా. 271 00:19:36,468 --> 00:19:38,178 దుంపదెగ. 272 00:19:40,973 --> 00:19:44,601 మీరెవరో, మీకేం కావాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. 273 00:19:44,601 --> 00:19:48,689 ముందేమో వచ్చి నాకు లాంతరు ఇచ్చారు, ఇప్పుడేమో దాన్ని తీసుకెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. 274 00:19:48,689 --> 00:19:51,900 క్షమించాలి. తప్పులు అందరూ చేస్తారు కదా. 275 00:19:54,194 --> 00:19:55,612 వెల్లుల్లితో కొట్టిందే! 276 00:19:58,407 --> 00:19:59,867 లాంతరు తీసుకురండి! 277 00:20:02,452 --> 00:20:04,496 మిమ్మల్ని ఆదేశిస్తున్నా... 278 00:20:08,542 --> 00:20:09,543 పాండోరా! 279 00:20:11,336 --> 00:20:12,337 నాన్నా! 280 00:20:13,380 --> 00:20:14,381 సారీ. 281 00:20:23,891 --> 00:20:25,017 త్వరగా కానివ్వు, నాన్నా. 282 00:20:25,017 --> 00:20:27,436 లాంతరును ఉపయోగించి, అస్థిపంజరాలను ఆగమని ఆదేశించు. 283 00:20:36,737 --> 00:20:37,696 నాన్నా! 284 00:20:39,948 --> 00:20:42,117 కార్మికులారా, ఆగమని మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నా! 285 00:20:47,164 --> 00:20:50,417 ఇక విశ్రాంతి తీసుకోమని కూడా ఆజ్ఞాపిస్తున్నా. శాశ్వతంగా. 286 00:20:54,922 --> 00:20:56,757 అయ్యయ్యో! 287 00:21:10,437 --> 00:21:12,064 మీరు నా జీవితం నాశనం చేశారు. 288 00:21:12,064 --> 00:21:15,567 నా కార్మికులు లేకుండా, ఆ కోటని నేను ఎలా భరించాలి. 289 00:21:15,567 --> 00:21:17,653 అదేదో చెడ్డ విషయంలా చెప్తున్నారే. 290 00:21:17,653 --> 00:21:20,489 డబ్బులు లేకుండా బతకడం చెడ్డ విషయం కాక ఇంకేంటి? 291 00:21:20,489 --> 00:21:24,952 ఇదంతా ఎలా చూసుకోవాలి అన్న ఆలోచతోనే ఉండటం వల్ల, మీకంటూ ఒక మార్గాన్ని ఏర్పర్చుకోవాలనే ఆలోచనే రాలేదేమో మీకు. 292 00:21:24,952 --> 00:21:28,288 హా, చూస్తుంటే, ఆ అస్థిపంజరాలే కాకుండా మీరు కూడా ఈ చోటుకి 293 00:21:28,288 --> 00:21:29,206 బానిసలా ఉన్నట్టున్నారు. 294 00:21:31,625 --> 00:21:34,419 వింత అమెరికన్ కుటుంబమా, మీరు అన్నది నిజమే. 295 00:21:34,419 --> 00:21:37,005 రేపు ఉదయాన్నే, కొత్త జీవితానికి శ్రీకారం చుడతాను. 296 00:21:37,005 --> 00:21:38,632 కోటని అమ్మకానికి పెడతాను. 297 00:21:40,217 --> 00:21:42,886 మీరు కొంటారా? మీకు అదిరిపోయే ఆఫర్ ఇస్తాను. 298 00:21:43,762 --> 00:21:47,140 థ్యాంక్స్. కానీ మా ఇంటి సమస్యలు మాకు ఉన్నాయి. 299 00:21:51,228 --> 00:21:54,147 లాంతరు పట్టుకున్నప్పుడు అదోలా అయిపోయావే, ఎందుకు? 300 00:21:54,147 --> 00:21:55,482 ఎందుకు తటపటాయించావు? 301 00:21:55,482 --> 00:21:57,317 తటపటాయించానా? ఏమంటున్నావు నువ్వు? 302 00:21:57,818 --> 00:21:59,695 అస్థిపంజరాలు మనల్ని పట్టుకోవడానికి వస్తున్నప్పుడు, 303 00:21:59,695 --> 00:22:02,656 నువ్వు లాంతరు పట్టుకొనే ఉన్నావు, కానీ వాటిని ఆగిపొమ్మని నువ్వు ఆదేశించలేదు. 304 00:22:02,656 --> 00:22:05,158 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను అసలు లాంతరును పట్టుకోనే లేదే. 305 00:22:05,158 --> 00:22:08,120 నాన్నా, రన్ వే దాకా పరుగు పందెం పెట్టుకుందాం, పద. 306 00:22:08,120 --> 00:22:09,663 తప్పకుండా, పాపా. యాహూ! 307 00:22:09,663 --> 00:22:11,582 ఏమైంది నాన్నా? తాబేలు అవతారం ఎత్తావా ఏంటి? 308 00:23:02,299 --> 00:23:04,301 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్