1 00:00:10,511 --> 00:00:12,262 ఎల్ డొరాడో 2 00:00:12,262 --> 00:00:13,805 అంధకారపు గది. 3 00:00:13,805 --> 00:00:16,391 నేను ఇక్కడికి వచ్చి చాలా కాలమైంది. 4 00:00:17,017 --> 00:00:18,310 పని మీద దృష్టి పెట్టు, లారీ. 5 00:00:18,310 --> 00:00:21,063 దొంగచాటుగా జరిగిన ప్రవేశానికి ఆధారాల కోసం మనం జాగ్రత్తగా, క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. 6 00:00:21,063 --> 00:00:25,859 ఈజిప్షియన్ కళాఖండాలను ఎవరో చిందరవందరగా చేసేశారు, పాచికని పైకి తీసుకెళ్లి పెట్టారు. 7 00:00:25,859 --> 00:00:28,862 వాళ్లు మళ్లీ దొంగచాటుగా ప్రవేశించే అవకాశం మనం ఇవ్వకూడదు. 8 00:00:29,988 --> 00:00:32,866 మళ్లీ సముద్ర ప్రయాణం చేయాలని నాకు ఎంత ఆశగా ఉందో! 9 00:00:32,866 --> 00:00:35,285 శత్రువుల నౌక నిన్ను ముక్కలు ముక్కలుగా పేల్చేసిందని 10 00:00:35,285 --> 00:00:38,038 నిన్నే కదా నువ్వు అన్నావు? 11 00:00:38,038 --> 00:00:41,041 అవును, నా పిచ్చి సిబ్బంది నా మాట విని ఉంటే, 12 00:00:41,041 --> 00:00:42,835 అది జరిగి ఉండేదే కాదు. 13 00:00:42,835 --> 00:00:45,754 - కానీ నువ్వు ఒక మాట అన్నావు కదా... - ఓటొమన్ చుక్కాని. 14 00:00:45,754 --> 00:00:48,090 చుక్కానిని సుందరంగా తయారు చేయాలంటే, అది వాళ్లకే సాధ్యమవుతుంది. 15 00:00:48,090 --> 00:00:49,341 అది నిజం. 16 00:00:49,341 --> 00:00:51,885 -"అందంగా చెక్కిన బ్యారెల్... -"అందంగా చెక్కిన బ్యారెల్... 17 00:00:51,885 --> 00:00:54,304 - ...అద్భుతంగా మలచిన స్పోక్స్... - ...అద్భుతంగా మలచిన స్పోక్స్... 18 00:00:54,304 --> 00:00:56,682 - ...నున్నటి అందమైన అంచు భాగం. - ...నున్నటి అందమైన అంచు భాగం. 19 00:00:56,682 --> 00:01:00,018 - ఏ లోపమూ లేని అద్భుతం." - ఏ లోపమూ లేని అద్భుతం." 20 00:01:00,018 --> 00:01:01,854 ఇప్పటికి ఒక లక్ష సార్లు చెప్పి ఉంటావు. 21 00:01:01,854 --> 00:01:04,022 ఇక్కడ ఉండాల్సినవన్నీ ఉన్నాయి. ఇక వెళ్దాం పద. 22 00:01:06,567 --> 00:01:08,694 ఒక నిమిషం, స్టాన్. ఇటు చూడు. 23 00:01:08,694 --> 00:01:10,612 దీనిలో పగులు ఏర్పడింది. 24 00:01:11,864 --> 00:01:13,991 నీ దుంపదెగ. ఇన్ని నీళ్లు వచ్చేస్తున్నాయేంటి! 25 00:01:36,138 --> 00:01:39,099 ఓటొమన్ నౌక చుక్కాని 26 00:01:41,560 --> 00:01:42,394 క్యురేషన్ డైజెస్ట్ 27 00:01:42,394 --> 00:01:43,812 నేను కవరు పేజీలో పడ్డాను. 28 00:01:43,812 --> 00:01:46,773 "స్కై వాండర్హూవెన్. ప్రాచీన బాబిలాన్ కి నేటి ప్రతినిధి." 29 00:01:46,773 --> 00:01:48,358 నువ్వంటే నాకు చాలా గర్వంగా ఉంది. 30 00:01:51,445 --> 00:01:52,946 కింద ఏదో జరుగుతోంది. 31 00:02:04,583 --> 00:02:09,378 సముద్రంలోని తుఫాను నుండి బయటపడితే, వచ్చే కిక్కే వేరబ్బా. బాగానే ప్రయత్నించావు, సముద్ర దేవా. 32 00:02:09,378 --> 00:02:11,423 మీకేమీ కానందుకు ఆనందంగా ఉంది. ఇంతకీ ఏం జరిగింది? 33 00:02:11,423 --> 00:02:16,011 ఓటొమన్ చుక్కాని నుండి నీరు భీభత్సంగా వస్తోంది. 34 00:02:16,011 --> 00:02:18,847 కానీ నాకు ఆ వరదలు కొత్తేం కాదులే. 35 00:02:19,932 --> 00:02:21,391 కొంచెం టార్ వేస్తే సరిపోతుంది. 36 00:02:21,391 --> 00:02:23,560 ఇంకా నాలో పట్టు తగ్గలేదు. 37 00:02:24,102 --> 00:02:28,232 రహస్య ప్రదేశంలో ఉన్న కళాఖండాలన్నింటినీ లెక్కించేటప్పుడు, అంధకారపు గదిని నేనే తనిఖీ చేశాను. 38 00:02:28,232 --> 00:02:32,319 హాంజ సదీక్ అనే వ్యక్తి, కెప్టెనుగా వ్యవహరించిన నౌక చుక్కాని ఇది. 39 00:02:33,320 --> 00:02:36,907 ఇది అడ్మిరల్ హాంజ సదీక్ చుక్కానా? 40 00:02:36,907 --> 00:02:40,494 ఓటొమన్ వాళ్లదని నాకు తెలుసు, కానీ హాంజ సదీక్ ది అని తెలీదు. 41 00:02:40,494 --> 00:02:42,829 నీకు అతను ఎవరో తెలిసినట్టుగా అనిపిస్తోందే. 42 00:02:42,829 --> 00:02:46,708 సదీక్ పేరు తెలీని నావికులే ఉండరు. 43 00:02:46,708 --> 00:02:49,002 వ్యక్తిగతంగా అతను నాకు ఆదర్శం. 44 00:02:49,002 --> 00:02:52,047 అవునా? అతని గురించి నువ్వు ఒక్కసారి కూడా చెప్పలేదే మరి. 45 00:02:52,047 --> 00:02:53,966 కామెడీ చేస్తున్నావా? 46 00:02:55,008 --> 00:02:56,093 అవును. 47 00:02:56,093 --> 00:02:58,345 ఎప్పుడు చూసినా అతని గురించే చెప్తుంటావు. 48 00:02:58,345 --> 00:03:00,889 నౌక చుక్కాని ఏజియన్ సముద్రంలో వేయాలన్నది 49 00:03:00,889 --> 00:03:04,017 అడ్మిరల్ ఆఖరి కోరిక అని చరిత్రకారులు నమ్ముతున్నారు. 50 00:03:04,977 --> 00:03:06,436 కానీ అది జరగలేదు. 51 00:03:06,436 --> 00:03:10,148 అలా కాకుండా, అది శతాబ్దాల తరబడి ఒక కలెక్టర్ నుండి ఇంకో కలెక్టరుకు చేతులు మారుతూ వచ్చింది. 52 00:03:10,148 --> 00:03:12,734 శాపగ్రస్త కళాఖండం విషయంలో అది మామూలే కదా. 53 00:03:12,734 --> 00:03:14,111 ఇకపై అలా జరగదులే. 54 00:03:14,111 --> 00:03:16,613 మేము నిన్ను సముద్రంలో వేసేస్తాంగా. 55 00:03:17,364 --> 00:03:21,618 మిత్రులారా, అడ్మిరల్ సదీక్ ఆఖరి కోరికను తీర్చి నా జన్మ ధన్యం చేసుకుంటాను. 56 00:03:21,618 --> 00:03:24,288 దయచేసి, ఈ పనికి నన్ను కూడా రానివ్వండి. 57 00:03:25,706 --> 00:03:27,708 నేను చక్కగా సాయపడగలను. 58 00:03:27,708 --> 00:03:30,586 ఏజియన్ సముద్రం గురించి నాకు చాలా బాగా తెలుసు, అంతా నా బుర్రలో ఫీడ్ అయిపోయి ఉంది. 59 00:03:30,586 --> 00:03:34,464 నీకు బుర్ర ఎక్కడ ఉంది బాబూ, ఏజియన్ సముద్రం గురించి నువ్వు అంతా మర్చిపోయి ఉంటావు. 60 00:03:34,464 --> 00:03:36,717 నావికుడు అనేవాడు అస్సలు మర్చిపోడు. 61 00:03:36,717 --> 00:03:39,970 చెప్తున్నా కదా, నాకున్న అనుభవంతో 62 00:03:39,970 --> 00:03:42,764 ఈ కార్యం చాలా సునాయాసంగా పూర్తి చేయగలం మనం. 63 00:03:42,764 --> 00:03:44,266 అది చాలా మంచి ఐడియా అనుకుంటా. 64 00:03:44,266 --> 00:03:46,059 లారీని దాచడం కూడా చాలా సులువే. 65 00:03:46,059 --> 00:03:48,353 అతడిని ఒక బౌలింగ్ బ్యాగులో తీసుకెళ్దాం. 66 00:03:48,353 --> 00:03:52,649 ఇది కాస్త రిస్కుతో కూడుకున్న విషయమే, కానీ లారీ అనుభవం మనకి ఉపయోగపడవచ్చు. 67 00:03:53,567 --> 00:03:56,278 నేను కూడా రాలేను, కాబట్టి లారీ వస్తాడులే. 68 00:03:56,278 --> 00:03:57,738 ఏంటి? ఎందుకు రాలేవు? 69 00:03:57,738 --> 00:04:00,949 ఇప్పుడే జార్జియా ఒక మెసేజ్ పంపింది. మ్యూజియంలో ఏదో జరిగిందట. 70 00:04:00,949 --> 00:04:04,244 రేపు అందరూ తప్పనిసరిగా రావాలంటోంది, అంటే, అదేదో పెద్ద విషయమే అయ్యి ఉంటుంది. 71 00:04:04,244 --> 00:04:05,370 అందరూ రావాల్సిందే అట. 72 00:04:05,954 --> 00:04:09,583 పెద్దవాడివి నువ్వొక్కడివే ఉండే మిషన్ నీ ముందుంది, నాన్నా. 73 00:04:09,583 --> 00:04:13,086 హేయ్, నువ్వు అదరగొట్టేస్తావులే. వేసవి అంతా నేను అలానే అదరగొట్టేశానుగా. 74 00:04:13,086 --> 00:04:16,048 విషయం ఏంటంటే, నా వయస్సు నీ కన్నా కొన్ని వందల ఏళ్లు ఎక్కువ, 75 00:04:16,048 --> 00:04:19,009 కాబట్టి ఇక్కడ నీకన్నా నేనే పెద్దవాడిని. 76 00:04:19,009 --> 00:04:22,012 ఇక సాహసానికి తెర తీయండి. 77 00:04:25,098 --> 00:04:30,521 నువ్వు సముద్రపు దొంగ పుర్రెవి అన్నమాట. 78 00:04:31,104 --> 00:04:35,067 మొండెం లేని సముద్రపు దొంగని అంటే ఇంకా బాగుంటుంది. 79 00:04:35,067 --> 00:04:38,529 మార్జీ మనం అనుకున్నంత కంగారుపడిపోలేదు, బాగానే ఉంది. 80 00:04:38,529 --> 00:04:41,615 హేయ్, మార్జీ, ఇంకా ఎంత సేపు ప్రయాణం? 81 00:04:41,615 --> 00:04:44,076 త్వరలోనే ఇస్తాంబుల్ లో దిగేస్తాం, బుడ్డోడా. 82 00:04:44,076 --> 00:04:45,160 ఇస్తాంబుల్? 83 00:04:45,160 --> 00:04:48,121 ఇస్తాంబుల్ కన్నా ఏజియన్ సముద్రానికి దగ్గరగా, చాలా నగరాలు ఉన్నాయి కద. 84 00:04:48,121 --> 00:04:49,331 అక్కడికి వెళ్లడం ఎందుకు? 85 00:04:49,331 --> 00:04:52,000 ఇస్తాంబుల్ లో పడవలు అద్దెకి బాగా దొరుకుతాయి. 86 00:04:52,000 --> 00:04:56,463 ఇస్తాంబుల్, ఓటొమన్ ప్రాబల్యానికి కేంద్రంగా ఉండింది కాబట్టి, అడ్మిరల్ సదీక్ స్మారక స్థూపం కూడా అక్కడే ఉంది. 87 00:04:56,463 --> 00:04:59,341 కాబట్టి అతని గురించి మరిన్ని వివరాలు అక్కడ మనకి తెలిసే అవకాశం ఉంది. 88 00:04:59,341 --> 00:05:00,926 నాన్న అంటే ఇంతేగా. 89 00:05:00,926 --> 00:05:04,388 ఎప్పుడు ప్రయాణం చేసినా, ఏదోక చారిత్రాత్మక భవనాన్ని చూడాలని చెప్పి, 90 00:05:04,388 --> 00:05:06,431 చుట్టూ తిప్పి తీసుకెళ్తావు నువ్వు. 91 00:05:06,431 --> 00:05:07,516 ఇస్తాంబుల్ నాకు ఓకే. 92 00:05:07,516 --> 00:05:10,394 నాకున్న ఎకైక కంటితో, ఆ అడ్మిరల్ కి ఇష్టమైన నగరాన్ని చూడాలనుకుంటున్నా. 93 00:05:11,562 --> 00:05:14,231 కానీ స్టాన్లీ ఇదంతా మిస్ అవుతున్నాడు, పాపం. 94 00:05:15,065 --> 00:05:17,025 సముద్ర ప్రయాణం అంటే నేను కిందా మీదా పడతాను. 95 00:05:17,025 --> 00:05:19,987 చుట్టూ నీటిని చూస్తే, నాకు అదోలా ఉంటుంది. 96 00:05:19,987 --> 00:05:22,489 ఏదేమైనా, నాకు సాయపడటానికి వచ్చినందుకు థ్యాంక్యూ. 97 00:05:22,489 --> 00:05:24,533 భద్రతాపరమైన ఇలాంటి దుర్ఘటనలపై దర్యాప్తు చేసేటప్పుడు 98 00:05:24,533 --> 00:05:26,994 మాట్లాడగలిగే వాళ్లు ఉంటే ఇంకా పని వేగంగా జరిగిపోతుంది. 99 00:05:31,290 --> 00:05:32,958 నాన్నా, అంతా ఓకేనా? 100 00:05:32,958 --> 00:05:33,876 నేను బాగానే ఉన్నా. 101 00:05:33,876 --> 00:05:36,795 అంటే... పిల్లలైన మీరు, ఇంకా మీ అమ్మ ఈ విషయంలో సిద్ధహస్తులు, 102 00:05:36,795 --> 00:05:38,881 నాకు ఎవరినీ నిరాశపరచాలని లేదు. 103 00:05:38,881 --> 00:05:41,967 నువ్వు అదరగొట్టేయాలని మేమేమీ ఆశించట్లేదు. నువ్వు ఇక్కడికి రావడమే మాకు పెద్ద ఆనందం. 104 00:05:42,926 --> 00:05:46,388 అన్నట్టు, మార్జీ ఇస్తాంబుల్ లో ఎందుకు ఆగిందో నీకేమైనా తెలుసా? 105 00:05:46,388 --> 00:05:48,932 ఏంటి? నీకు గుర్తు లేదా? 106 00:05:48,932 --> 00:05:50,601 ఇక్కడ ఆపాలని చెప్పింది నువ్వే కదా. 107 00:05:51,351 --> 00:05:53,812 నాకు అస్సలు గుర్తు లేదు. 108 00:05:55,022 --> 00:05:58,400 హేయ్! పడవలేవైనా అద్దెకు దొరికాయా? 109 00:05:58,400 --> 00:06:00,652 హా, అద్దెకి చాలా పడవలు ఉన్నాయి. 110 00:06:00,652 --> 00:06:02,946 ఒకరు వచ్చి పడవని అద్దెకి తీసుకొని చాలా రోజులైంది అట. 111 00:06:02,946 --> 00:06:05,908 జనాలు భయపడుతున్నారు, అందుకే వాళ్లు అద్దెకి తీసుకోవట్లేదు. 112 00:06:05,908 --> 00:06:10,037 పడవలను తీసుకొని ఏజియన్ సముద్రంలోని ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు, 113 00:06:10,037 --> 00:06:13,290 వెనక్కి వెళ్లిపొమ్మని ఒక స్వరం గట్టిగా చెప్తుందని పుకారు ఉంది. 114 00:06:13,290 --> 00:06:16,668 ఆ మాట వినని వాళ్లు సుడిగుండంలో చిక్కుకుపోతారట. 115 00:06:16,668 --> 00:06:19,838 పడవ అంతా సుడిగండంలోకి వెళ్లిపోయి మునిగిపోతుంది. 116 00:06:19,838 --> 00:06:23,717 తొక్కేం కాదు, ఈ సముద్ర ప్రయాణం గాథల్లో కొంచెం మసాలా వేస్తారులే. 117 00:06:23,717 --> 00:06:26,720 సముద్రపు దొంగ నల్లబాలు నల్లగా ఉండేవాడని అనుకుంటున్నారా? 118 00:06:26,720 --> 00:06:29,264 లేదు. వాడిది ఛామనఛాయ రంగు. 119 00:06:30,807 --> 00:06:33,101 నేను నిర్ణయిం తీసేసుకున్నా, మనం రేపే ప్రయాణం మొదలుపెడుతున్నాం. 120 00:06:33,101 --> 00:06:36,438 ఇవాళ్టికి ఇక అందరూ పడకెక్కండి. రేపు చాలాసేపు సముద్రయానం చేయాలి కాబట్టి, సిద్దంగా ఉండాలి కదా. 121 00:06:37,022 --> 00:06:38,148 వింటున్నారా? 122 00:06:38,148 --> 00:06:40,234 మీ కెప్టెన్ గా నేను ఆదేశిస్తున్నా. 123 00:06:40,234 --> 00:06:42,528 అలాగే కెప్టెన్ లారీ. 124 00:06:42,528 --> 00:06:43,445 పదండి ఇక. 125 00:06:43,445 --> 00:06:46,740 మనం చుక్కల నీడలో డెక్ పై పడుకుందాం. 126 00:06:46,740 --> 00:06:49,493 ఒక అద్భుతమైన సముద్ర ప్రయాణానికి అదే కదా అదిరిపోయే ఆరంభం. 127 00:06:49,493 --> 00:06:51,578 నేను మా రూఫస్ ని వదిలి రాలేను. 128 00:06:51,578 --> 00:06:53,163 నేను నా విమానం లోపలే పడుకుంటా. 129 00:06:53,163 --> 00:06:55,040 నేను కూడా మార్జీతో పడుకుంటా. 130 00:06:55,040 --> 00:06:58,836 తప్పుగా అనుకోకు, నాన్నా, కానీ నీ గురకకి నా చెవుల్లోంచి రక్తం కారిపోతుంది. 131 00:07:04,883 --> 00:07:06,552 నా ఆదేశాలని పాటించండి. 132 00:07:11,390 --> 00:07:13,392 కనీసం నువ్వైనా బాగా నిద్రపోతున్నావులే. 133 00:07:14,184 --> 00:07:15,185 నాన్నా? 134 00:07:18,772 --> 00:07:20,232 నువ్వేనా నాన్నా? 135 00:07:22,359 --> 00:07:24,027 లారీ, చూసుకో. 136 00:07:25,779 --> 00:07:28,949 వంటగది నుండి ఉప్పు డబ్బా తీసుకురా. 137 00:07:28,949 --> 00:07:30,909 - ఉప్పు డబ్బానా? - త్వరగా రా! 138 00:07:37,249 --> 00:07:38,959 - ఏం చేయాలి ఇప్పుడు? - దాన్ని వీడిపైకి విసిరేయ్. 139 00:07:48,510 --> 00:07:50,012 ఉప్పు డబ్బాతో పని జరుగుతుందని నీకెలా తెలుసు? 140 00:07:50,512 --> 00:07:52,431 అదొక పాత నమ్మకం. 141 00:07:52,431 --> 00:07:56,393 నావికులు ఉప్పు డబ్బాలు ఇచ్చిపుచ్చుకుంటే వాళ్లని దురదృష్టం వెంటాడుతుందని నమ్మేవారు. 142 00:07:56,393 --> 00:08:00,105 నిన్ను తీసుకొచ్చి మంచి పని అయింది. ఇలా వీలైనంత మంది చేయి వస్తే పని కాస్త సులువు అవుతుంది. 143 00:08:00,105 --> 00:08:02,566 నేను వెళ్లిపోయాక ఒక సముద్రపు దొంగ దెయ్యం వచ్చిందా? 144 00:08:02,566 --> 00:08:04,776 నువ్వు ఆలోచించాల్సింది అది కాదు. 145 00:08:04,776 --> 00:08:07,404 ఆ సముద్రపు దొంగ దెయ్యం నాపై దాడి చేసింది. 146 00:08:07,404 --> 00:08:08,864 భయపడకు, పుర్రె బాబు. 147 00:08:08,864 --> 00:08:12,117 మళ్లీ ఆ దెయ్యం వస్తే, దానికి ఉంటది నా చేతిలో. 148 00:08:13,577 --> 00:08:18,665 చెప్పాపెట్టకుండా వెళ్లిపోయినందుకు నిన్ను సముద్రంలోకి తోసేయాలి. 149 00:08:18,665 --> 00:08:20,667 నాన్నా, ఏమైపోయావు? 150 00:08:20,667 --> 00:08:22,544 నాకు తెలీదు. 151 00:08:23,086 --> 00:08:26,924 నిద్రపోయానా, ఎప్పుడు లేచానో లేచి పడవల మధ్య తిరుగుతూ ఉన్నా. 152 00:08:26,924 --> 00:08:28,634 మళ్లీ స్పృహ తప్పిపోయినట్టున్నా. 153 00:08:29,843 --> 00:08:31,011 అందరికీ సారీ. 154 00:08:31,011 --> 00:08:34,139 నా అవసరం ఉన్నప్పుడు దగ్గర లేకుండా పోయా. మీ అమ్మ లేకుండా ఇది నాకు మొదటి మిషన్, 155 00:08:34,139 --> 00:08:36,015 నా వల్ల మీ అందరికీ ప్రమాదం కలుగుతుందేమో అనిపిస్తోంది. 156 00:08:36,015 --> 00:08:37,476 ఇందులో నీ తప్పేమీ లేదులే. 157 00:08:37,476 --> 00:08:40,479 శూన్యంలో ఉన్నావు కదా, దాని దుష్ప్రభావమే అనుకుంటా ఇది. 158 00:08:40,479 --> 00:08:42,022 ఎప్పుడోకప్పుడు వెళ్లిపోతుందిలే. 159 00:08:42,856 --> 00:08:43,941 అవును కదా, రస్? 160 00:08:44,608 --> 00:08:45,609 అవును. 161 00:08:54,910 --> 00:08:58,830 నైరుతి వైపు వెళ్దాం. అప్పుడు త్వరగా వెళ్లిపోవచ్చు. 162 00:08:58,830 --> 00:09:02,042 పక్కానా? అటు వైపు వాతావరణం అస్సలు బాగా లేదని చెప్తున్నారు. 163 00:09:02,042 --> 00:09:04,378 కెప్టెన్ కి ఎప్పుడూ ఎదురు మాట్లాడకూడదు. 164 00:09:04,378 --> 00:09:08,799 ఆ మాత్రం అనుకూలం కాని వాతావరణాన్ని లారీ ముద్దు బిడ్డ చాలా సులభంగా తట్టుకోగలదు. 165 00:09:08,799 --> 00:09:11,093 ఇది ఈ పడవ పేరు, ఇప్పుడే ఆ పేరు తట్టింది నాకు. 166 00:09:11,093 --> 00:09:14,096 నువ్వు పని కానివ్వోయ్. పడవని దూసుకుపోనివ్వు. 167 00:09:15,931 --> 00:09:17,307 లారీ ముద్దు బిడ్డనా? 168 00:09:18,600 --> 00:09:19,768 నాన్న గురించి నాకు కంగారుగా ఉంది. 169 00:09:19,768 --> 00:09:21,979 నిన్న రాత్రి జరిగినట్టు, పరిస్థితి మళ్లీ ప్రమాదకరంగా ఉన్నప్పుడు, 170 00:09:21,979 --> 00:09:23,647 ఆయన మళ్లీ స్పృహ తప్పిపోతే? 171 00:09:23,647 --> 00:09:26,149 ట్రాన్సిల్వేనియాలో లాంతరును పట్టుకున్నప్పుడు కూడా అదోలా ప్రవర్తించాడు. 172 00:09:26,149 --> 00:09:28,235 భలేవాడివే. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. 173 00:09:28,235 --> 00:09:31,655 అది తెలుసు. కానీ అలా జరగకూడని సమయంలో జరిగితే, మన పరిస్థితి ఇక అంతే. 174 00:09:31,655 --> 00:09:33,991 మనం అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. 175 00:09:33,991 --> 00:09:36,410 నువ్వన్నది నిజమే ఏమో. నాన్న మీద ఓ కన్నేసి ఉంచుదాం. 176 00:09:37,786 --> 00:09:39,621 ఏం చేస్తున్నావు? 177 00:09:39,621 --> 00:09:42,833 తెరచాపని లేపుతున్నావా లేక గాడిదలు ఏమైనా కాస్తున్నావా? 178 00:09:43,584 --> 00:09:45,836 సముద్రయాన శిక్షణలో మాకు ఇలాగే నేర్పారు. 179 00:09:45,836 --> 00:09:48,755 నీ తొక్కలో శిక్షణలో అంతా తప్పుగా నేర్పించారు. 180 00:09:48,755 --> 00:09:50,257 ఇక సరిగ్గా చేయ్. 181 00:09:50,257 --> 00:09:51,884 నన్ను కాపాడు, అడ్మిరల్. 182 00:09:51,884 --> 00:09:53,594 నా సిబ్బంది నా మాట వినడం లేదు. 183 00:09:53,594 --> 00:09:56,138 పాత సిబ్బంది చేసినట్టే వీళ్లు కూడా చేస్తున్నారు. 184 00:09:58,891 --> 00:10:01,101 ఒకరు దొంగతనంగా ప్రవేశించారనడానికి ఆధారం దొరకట్లేదు. 185 00:10:01,101 --> 00:10:03,020 తలుపును బాగు చేసే పని ఎందాకా వచ్చింది, హ్యాంక్? 186 00:10:06,148 --> 00:10:08,817 నువ్వు బాదుతుంటే మంచి దరువు వేసినట్టుంది. 187 00:10:08,817 --> 00:10:10,861 ఆలెక్స్ తో సంగీతం వాయించేవాడిని, అదంతా గుర్తుకు వస్తోంది ఇప్పుడు. 188 00:10:12,696 --> 00:10:14,364 శూన్యం నుండి వచ్చినప్పటి నుండి చాలా బిజీ అయిపోయాడు, 189 00:10:14,364 --> 00:10:16,700 కాబట్టి కలిసి సంగీతం వాయించే అవకాశం మా ఇద్దరికీ దక్కలేదు, చాలా కాలమైపోయింది. 190 00:10:29,505 --> 00:10:31,465 సూపర్! పిచ్చెక్కించు. 191 00:10:38,889 --> 00:10:40,807 గమ్యానికి దగ్గర్లోనే ఉన్నాం. 192 00:10:41,433 --> 00:10:44,603 అడ్మిరల్ తుది ఆదేశాన్ని శిరసావహించే సమయం ఆసన్నమవుతోంది. 193 00:10:52,277 --> 00:10:54,238 వెనక్కి తిరిగి వెళ్లిపోండి. 194 00:10:54,238 --> 00:10:55,781 ఇప్పుడే! 195 00:10:56,448 --> 00:10:59,701 లారీ, ఇది మనం ఊహించిన దానికన్నా ఇంకా చాలా దారుణంగా ఉంది. 196 00:10:59,701 --> 00:11:02,037 మనం ఆ భయంకరమైన స్వరం చెప్పే మాట వింటే మంచిది అనిపిస్తోంది. 197 00:11:02,037 --> 00:11:05,290 మీ ఆదేశాలని పాటించండి. మీకు అప్పగించిన పనులు చేయండి! 198 00:11:05,290 --> 00:11:06,959 నీరు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. 199 00:11:06,959 --> 00:11:09,962 మనం ఇప్పుడే వెళ్లిపోతే మంచిది, లేదంటే, చిక్కుబడిపోతాం. 200 00:11:09,962 --> 00:11:11,046 తొక్కేం కాదు! 201 00:11:11,046 --> 00:11:14,383 ఒక పిరికిపంద, ఏం చేయాలో నాకు చెప్పడమా. 202 00:11:32,734 --> 00:11:34,736 ఓటొమన్స్! వాళ్లు ఓటొమన్స్! 203 00:11:37,281 --> 00:11:39,575 వాళ్లు అడ్మిరల్ సదీక్ నౌకలోని సిబ్బంది అయ్యుంటారు. 204 00:11:39,575 --> 00:11:41,326 చూస్తుంటే, వాళ్లు కోపంగా ఉన్నట్టున్నారు. 205 00:11:41,326 --> 00:11:42,578 ఆపవయ్యా. 206 00:11:42,578 --> 00:11:45,497 వీళ్లే కనుక అడ్మిరల్ సిబ్బంది అయ్యుంటే, వాళ్లు మనకి మిత్రులే అవుతారు. 207 00:11:45,497 --> 00:11:47,541 నేను చూసుకుంటాగా. 208 00:11:47,541 --> 00:11:48,876 నమస్తే, మిత్రులారా 209 00:11:48,876 --> 00:11:52,838 మీ అడ్మిరల్ హాంజ సదీక్ కి నివాళులు అర్పించడానికి మేము వచ్చాం! 210 00:11:53,338 --> 00:11:56,425 చూడండి, మా దగ్గర మీ నౌక చుక్కాని ఉంది. 211 00:12:17,070 --> 00:12:18,447 రస్, ఏం చేస్తున్నావు నువ్వు? 212 00:12:18,447 --> 00:12:20,073 నువ్వు తెరచాపల పని చూడు. 213 00:12:20,073 --> 00:12:22,492 సారీ, నాన్నా, ఇది అత్యవసర పరిస్థితి. 214 00:12:22,492 --> 00:12:24,369 నువ్వు మళ్లీ స్పృహ తప్పితే, ఇక మా పని అంతే. 215 00:12:24,369 --> 00:12:27,331 పిచ్చిగా మాట్లాడకు. నేను బాగానే ఉన్నా. స్టీరింగ్ నుండి పక్కకి జరుగు. 216 00:12:27,331 --> 00:12:29,583 ఇలా జరుగుతుందనే ఊరిలోని జనాలందరూ చెప్పారు. 217 00:12:29,583 --> 00:12:31,210 ఇక్కడి నుండి వెళ్లిపోదాం! 218 00:12:31,210 --> 00:12:33,837 అప్పుడేనా? మనం చుక్కానిని నీట్లోకి వేసేయాలి! 219 00:12:33,837 --> 00:12:36,131 వేయలేం. మనం వెళ్లిపోవాలని సిబ్బంది చెప్తున్నారు. 220 00:12:36,131 --> 00:12:38,467 సిబ్బందికి ఏం కావాలి అనేదానితో పని లేదు. 221 00:12:38,467 --> 00:12:40,385 అడ్మిరల్ కి కావాల్సింది ఏంటి అనేదే ముఖ్యం. 222 00:12:40,385 --> 00:12:41,970 ఆయన్ని నేను నిరాశపరచను. 223 00:12:44,598 --> 00:12:45,599 పని అయిపోయింది. 224 00:12:45,599 --> 00:12:48,310 నన్ను అనుమానించావు కదా, ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. 225 00:12:48,310 --> 00:12:50,020 నేను నిన్ను నమ్ముతున్నాను. 226 00:12:56,610 --> 00:12:58,195 చూశావా? వాళ్లకిది అక్కర్లేదు. 227 00:12:58,195 --> 00:13:00,280 రస్, నేను ఇంకోసారి చెప్పను. 228 00:13:00,280 --> 00:13:02,032 వెళ్లి తెరచాపల పని చూడు! 229 00:13:02,032 --> 00:13:03,700 ఆగు! ఆగు, అది లాగకు! 230 00:13:06,662 --> 00:13:07,621 ప్రధాన తెరచాపని తెరువు. 231 00:13:19,424 --> 00:13:20,759 మిత్రులారా, నన్ను మన్నించండి... 232 00:13:20,759 --> 00:13:23,554 లారీ, ప్రస్తుతానికి ఈ పనిని మాకు వదిలేసేయ్. 233 00:13:32,104 --> 00:13:35,357 కాస్త నేను చెప్పేది కూడా వినండి. నేను చెడగొట్టానని నాకు తెలుసు, కానీ... 234 00:13:35,357 --> 00:13:39,069 నువ్వు చెడగొట్టావన్న విషయాన్ని పక్కన పెట్టు. తిక్కలోడిలా వ్యవహరించావు. 235 00:13:39,069 --> 00:13:42,573 అదీగాక, సుడిగుండం గురించి మార్జీ, పాన్ హెచ్చరించినప్పుడు కూడా నువ్వు పట్టించుకోలేదు. 236 00:13:42,573 --> 00:13:45,117 నీ భయంకరమైన నిర్ణయాల వల్ల, ఇంకాస్త ఉంటే మనం మటాష్ అయిపోయి ఉండేవాళ్లం. 237 00:13:47,995 --> 00:13:49,705 మళ్లీ సాధారణ స్థితికి రావడానికి మనందరికీ కాస్త సమయం పడుతుంది. 238 00:13:51,039 --> 00:13:53,917 చుక్కాని సంగతి గురించి ఆ తర్వాత మనం ఆలోచిద్దాం. 239 00:13:55,544 --> 00:13:58,630 చూస్తుంటే, సముద్రంలో ఏదో తేడా జరిగినట్టుగా అనిపిస్తోందే? 240 00:13:58,630 --> 00:14:01,133 ఇదే నా అత్యంత దరిద్రమైన మిషన్ కావచ్చేమో. 241 00:14:01,133 --> 00:14:05,679 నా చివరి మిషన్ ని తలుచుకున్నాక, అది నిజమేనేమో అని ఇంకా బలంగా అనిపిస్తోంది. 242 00:14:05,679 --> 00:14:07,806 నీ మనస్సులో ఏముంది, మిత్రమా? 243 00:14:07,806 --> 00:14:12,060 సముద్ర దొంగగా నా ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు, నన్నెవరూ అంతగా పట్టించుకొనేవారు కాదు. 244 00:14:12,060 --> 00:14:15,230 పేరు సంపాదించడానికి చాలా కష్టపడ్డాను, 245 00:14:15,230 --> 00:14:17,566 కానీ నన్ను తక్కువగానే చూసేవారు. 246 00:14:17,566 --> 00:14:20,277 ఆ రంగంలో పేరు మీదే అంతా ఆధారపడి ఉంటుంది. 247 00:14:20,277 --> 00:14:21,945 నేను అర్థం చేసుకోగలను, పుర్రె బాసూ. 248 00:14:21,945 --> 00:14:25,532 ఈ లోకంలో నాకు రూఫస్, మంచి పేరు తప్ప ఇంకేం లేవు. 249 00:14:25,532 --> 00:14:28,285 అవును! భలే అర్థం చేసుకున్నావు. 250 00:14:28,285 --> 00:14:32,706 ఒక టర్కిష్ వ్యాపారి నుండి అడ్మిరల్ సదీక్ గొప్ప కథని తెలుసుకున్నాను, 251 00:14:32,706 --> 00:14:34,958 ఆ తర్వాత ఏం చేయాలో నాకు అర్థమైపోయింది. 252 00:14:34,958 --> 00:14:39,505 అతనిలా ఉంటే, నాకు కాస్త గౌరవం లభిస్తుందేమో అనిపించింది. 253 00:14:39,505 --> 00:14:43,759 కాబట్టి, అతని గురించి వీలైనన్ని వివరాలను తెలుసుకొని, అతను చేసినట్టే నేను కూడా చేశా. 254 00:14:43,759 --> 00:14:46,053 అది పని చేసింది కూడా! 255 00:14:46,053 --> 00:14:50,224 ఒకానొక సమయంలో, కథల్లో చెప్పుకొనే పాలరాతి పెట్టె కోసం గాలింపు మొదలుపెట్టాను. 256 00:14:50,224 --> 00:14:52,142 అది నిజమైనదని చాలా తక్కువ మంది నమ్మేవారు. 257 00:14:52,142 --> 00:14:55,270 దాని వల్ల, దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని నాలో కసి పెరిగింది. 258 00:14:55,270 --> 00:14:57,397 సిబ్బంది పట్ల చాలా క్రూరంగా వ్యవహరించాను. 259 00:14:57,397 --> 00:15:00,734 సిబ్బంది పట్ల చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నావు. నీ అత్యాశ వల్ల అందరం బలైపోతాం! 260 00:15:00,734 --> 00:15:02,569 పని చేయమని చావగొట్టేవాడిని. క్షమించేవాడినే కాదు. 261 00:15:02,569 --> 00:15:03,654 చెప్పినపని చేయండి! 262 00:15:03,654 --> 00:15:05,489 మనం వెనుదిరగాలి, కెప్టెన్! 263 00:15:05,489 --> 00:15:07,574 ఆ పెట్టె కోసం పాకులాడటం మంచిది కాదని 264 00:15:07,574 --> 00:15:10,994 వాళ్లు చెప్పినప్పుడు నేను వినలేదు. 265 00:15:11,662 --> 00:15:15,999 ఆ పెట్టె నిజమైనదే, అందులో అపారమైన నిధి కూడా ఉంది. 266 00:15:15,999 --> 00:15:17,751 కానీ నా సిబ్బంది చెప్పింది వాస్తవమే. 267 00:15:17,751 --> 00:15:19,378 అదొక ఉచ్చు. 268 00:15:19,378 --> 00:15:21,338 మా ప్రతర్థి సిబ్బంది 269 00:15:21,338 --> 00:15:24,424 మమ్మల్ని ఒక ఇరుకైన మార్గంలోకి రప్పించి, మా నౌకని ముక్కలు ముక్కలుగా పేల్చేశారు. 270 00:15:25,425 --> 00:15:32,057 కాబట్టి, అడ్మిరల్ సదీక్ లా ఈ సారి కూడా నేను వ్యవహరించలేకపోయాను. 271 00:15:33,475 --> 00:15:37,062 దీనిలోకి రా, పుర్రె బాసు. నీకొకటి చూపిస్తాను. 272 00:15:42,776 --> 00:15:45,487 అడ్మిరల్ సదీక్ స్మారక స్థూపం. 273 00:15:46,822 --> 00:15:49,658 మీరు సముద్రంలోకి వెళ్లినప్పుడు నేను ఇస్తాంబుల్ లో తీరిక లేకుండా గడిపాను. 274 00:15:49,658 --> 00:15:52,202 ఈ సదీక్ మీద కాస్త అధ్యయనం చేశా. 275 00:15:52,202 --> 00:15:55,163 అతని స్మారక స్థూపం వెనుక ఉన్నదాన్ని ఓసారి చూద్దాం. 276 00:15:55,163 --> 00:15:58,125 అడ్మిరల్ ఆఖరి మాటలు. 277 00:15:58,125 --> 00:16:02,045 ఒక ఆక్రమణ విఫలమైంది, అందుకు అతనే బాధ్యత తీసుకున్నాడు. 278 00:16:02,045 --> 00:16:03,839 అతడిని శత్రువులు చుట్టుముట్టేశారు, 279 00:16:03,839 --> 00:16:07,593 తన సిబ్బంది వెనక్కి వెళ్లిపోదాం అన్నారు, కానీ అతను పట్టించుకోలేదు. 280 00:16:07,593 --> 00:16:10,888 వాళ్లు వీరోచితంగా పోరాడారు, కానీ ఓటమి మాత్రం తప్పేలా లేదు. 281 00:16:10,888 --> 00:16:15,225 ఇక సదీక్, తనని తాను కాపాడుకోవడానికి నౌకలో నుండి సముద్రంలోకి దూకేశాడు. 282 00:16:15,225 --> 00:16:17,769 అలా ఎలా చేయగలిగాడు అతను? 283 00:16:17,769 --> 00:16:21,732 అసలైన కెప్టెన్ అంటే నౌకలోకి అందరికన్నా ముందే ఉండాలి, అలాగే అందరి బాగోగులు చూసుకుంటూ చివరిదాకా అక్కడే ఉండాలి. 284 00:16:22,316 --> 00:16:26,236 అతను, ఇంకా అతని డెప్యూటీ ఆ సొగసైన చుక్కానిని పట్టుకొని ఈదుకుంటూ వచ్చారు. 285 00:16:26,236 --> 00:16:28,113 వాళ్లు ఇస్తానంబుల్ కి తిరిగి వచ్చినప్పుడు, 286 00:16:28,113 --> 00:16:30,741 అనన్య సామాన్యమైన ధైర్యసాహసాలు కనబరిచినందుకు సదీక్ ని సత్కరించారు. 287 00:16:30,741 --> 00:16:34,369 అతని డెప్యూటీకి ఆ విషయం తెలిశాక, కోపం వచ్చి, అతను నావ సేనకు రాజీనామా చేసేశాడు. 288 00:16:34,369 --> 00:16:36,246 డెప్యూటీ. 289 00:16:36,246 --> 00:16:39,875 నిన్న రాత్రి నాపై దాడి చేసింది అతనే అనుకుంటా. 290 00:16:40,626 --> 00:16:46,173 చూస్తుంటే, ఆ డెప్యూటీ తన కోపంతో దెయ్యం అయినట్టున్నాడు. 291 00:16:47,007 --> 00:16:50,719 నేను కూడా అడ్మిరల్ సదీక్ లానే ప్రవర్తించా. 292 00:16:50,719 --> 00:16:56,016 నా తలబిరుసు తనంతో, ఆలెక్స్, ఇంకా పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాను. 293 00:16:56,016 --> 00:17:00,103 నిజమే, కానీ ఇంకా ఇతని దగ్గరి నుండి నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. 294 00:17:00,103 --> 00:17:01,855 చివరి భాగం చదువు. 295 00:17:02,940 --> 00:17:07,528 "నేను మొండిగా, పిరికిగా ప్రవర్తించి ఉండకపోతే, నా సిబ్బంది ప్రాణాలు నిలిచేవి ఏమో. 296 00:17:07,528 --> 00:17:11,531 నాకే కనుక అవకాశం ఉంటే, నీటి అడుగున ఉండే నౌకలో చుక్కాని అమర్చి, 297 00:17:11,531 --> 00:17:15,035 నా సిబ్బందికి ఆత్మశాంతి కలుగజేసి, వాళ్లని స్వర్గానికి తీసుకెళ్లడానికి నౌకని ఇచ్చేవాడిని. 298 00:17:17,829 --> 00:17:20,958 మీరు చేయాల్సింది అదే. ఏమంటారు? 299 00:17:20,958 --> 00:17:24,419 మంచి కెప్టెన్ కి, తన సిబ్బంది మాటలను ఆలకించడమూ తెలియాలి. 300 00:17:24,419 --> 00:17:26,880 నేను వెర్రివాడిగా ప్రవర్తించాను. క్షమించండి. 301 00:17:26,880 --> 00:17:28,464 కానీ మీరు నాకు ఇంకో అవకాశం ఇస్తే, 302 00:17:28,464 --> 00:17:30,759 మనం ఈ చుక్కానికి ఉన్న శాపాన్ని శాశ్వతంగా పోగొట్టేయవచ్చు. 303 00:17:30,759 --> 00:17:33,470 మనందరమూ ఇంకోసారి సముద్రంలోకి వెళ్లి మన ప్రయత్నం మనం చేయాలనుకుంటా. 304 00:17:33,470 --> 00:17:35,514 నీ ఆదేశాలకై వేచి చూస్తున్నాం, కెప్టెన్. 305 00:17:47,901 --> 00:17:51,655 పోయిన సారి సముద్రంలోకి వెళ్లినప్పుడు లారీతో పాటు నేను కూడా పొరబడ్డా. సారీ. 306 00:17:51,655 --> 00:17:54,032 నీ పరిస్థితి ఏమంత బాగాలేదని తెలుసు, 307 00:17:54,032 --> 00:17:56,869 కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నీపై మా అందరికీ సంపూర్ణ విశ్వాసం ఉంది. 308 00:17:56,869 --> 00:17:58,078 మేమందరం నిన్ను నమ్ముతున్నాం. 309 00:17:58,078 --> 00:17:59,496 థ్యాంక్స్, రస్. 310 00:17:59,496 --> 00:18:00,706 ఇలా రా, బుడ్డోడా. 311 00:18:01,206 --> 00:18:03,250 నౌక ప్రయాణానికి సిద్ధంగా ఉంది. 312 00:18:03,250 --> 00:18:06,211 నౌక దెబ్బ తిందంటే, దానికి సముద్రయాన అనుభవమున్నట్టే. 313 00:18:06,211 --> 00:18:08,505 కాబట్టి, ఇక బయలుదేరుదాం. 314 00:18:11,049 --> 00:18:15,179 వెనక్కి తిరిగి వెళ్లిపోండి. ఇప్పుడే! 315 00:18:18,390 --> 00:18:19,391 వచ్చేస్తున్నారు. 316 00:18:28,734 --> 00:18:31,653 నేను నీటి అడుగుకు వెళ్లినప్పుడు, నౌకకి ఏ ప్రమాదం జరగకుండా చూసుకోగలరుగా? 317 00:18:31,653 --> 00:18:34,406 తప్పకుండా, కెప్టెన్. కాకపోతే ఎక్కువసేపు తీసుకోకు. 318 00:18:34,406 --> 00:18:36,533 నీటి అడుగున ఎంతసేపు ఉండగలవు? 319 00:18:36,533 --> 00:18:39,411 నాకు ఊపిరితిత్తులు లేవు కదా, ఎంత సేపైనా ఉండగలను. 320 00:18:51,924 --> 00:18:53,383 లంగరు వేయండి. 321 00:19:03,435 --> 00:19:06,396 ఈ ప్లాన్ పని చేస్తోంది! నాన్నా, నువ్వు సూపర్. 322 00:19:21,453 --> 00:19:23,664 అయ్య బాబోయ్. ఏదో తేడా కొడుతోంది. 323 00:19:30,963 --> 00:19:32,714 లంగరు తాళ్లని కోసేస్తున్నారు. 324 00:19:32,714 --> 00:19:34,550 ఒక్క నిమిషం. నాకొక ఐడియా తట్టింది. 325 00:19:36,385 --> 00:19:37,928 దీన్ని ఆ దెయ్యంపైకి వేయ్. 326 00:19:39,847 --> 00:19:41,431 ఉప్పు డబ్బానా? 327 00:19:41,431 --> 00:19:44,142 లారీయే నాకు చూపించాడు. ఎలా పని చేస్తుందని మాత్రం అడగకు. 328 00:19:52,192 --> 00:19:53,235 మనోడిని మటాష్ చేసేశా! 329 00:20:15,132 --> 00:20:16,341 గట్టిగా దేన్ని అయినా పట్టుకోండి! 330 00:20:30,022 --> 00:20:32,941 ఇదుగో, నీకు ఈ పతకం వేయాల్సిందే. 331 00:20:49,750 --> 00:20:53,378 మీ అడ్మిరల్ తప్పు చేశాడు. ఆయన మీ మాటని విని ఉండాల్సింది. 332 00:20:53,962 --> 00:20:55,714 మీతో పాటు కడదాకా ఉండుండాల్సింది. 333 00:20:55,714 --> 00:20:58,509 కానీ మీ ధైర్యసాహసాలకి నివాళులర్పించమని ఆయన మమ్మల్ని పంపాడు. 334 00:20:58,509 --> 00:21:01,929 మీ కోపాన్ని వదిలేసి, ఇక్కడి నుండి వెళ్లిపోండి. 335 00:21:05,390 --> 00:21:07,100 కార్యం సఫలమైంది, అడ్మిరల్. 336 00:21:07,601 --> 00:21:09,186 ఈసారి నిజంగానే సఫలమైంది. 337 00:21:13,857 --> 00:21:14,858 లేదు... 338 00:21:16,360 --> 00:21:19,071 వాండర్హూవెన్ కుటుంబం మళ్లీ ఏకమైపోయింది! 339 00:21:19,988 --> 00:21:23,367 - మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అయ్యాను. - మేము కూడా నిన్ను మిస్ అయ్యాం, అమ్మా. 340 00:21:23,367 --> 00:21:26,203 నువ్వు నాన్నని చూసి ఉండాల్సింది. పిచ్చెక్కించాడు. 341 00:21:26,203 --> 00:21:30,624 మిషన్ పనిలో ఉండగానా, లేక రెస్టారెంటులో డాన్స్ వేస్తున్నప్పుడా? 342 00:21:30,624 --> 00:21:33,126 టర్కీలో ఊగిపోతూ వేసిన చిందులే కదా? 343 00:21:34,002 --> 00:21:37,005 ఆ జోక్ నాకు అర్థం కాలేదులే, మీరందరూ ఆనందంగా గడిపినందుకు నాకు ఆనందంగా ఉంది. 344 00:21:39,925 --> 00:21:41,635 నిన్ను చూడటం బాగుంది, గురూ. 345 00:21:41,635 --> 00:21:43,554 నాకు కూడా. ప్రయాణం ఎలా జరిగింది? 346 00:21:43,554 --> 00:21:44,972 అదిరిపోయింది. 347 00:21:44,972 --> 00:21:49,601 సముద్రయానం చేశా. ఆత్మపరిశీలన చేసుకున్నా. నా గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నా. 348 00:21:49,601 --> 00:21:51,478 మొత్తం మీద, ఈ యాత్ర నాకు బాగా ఉపయోగపడింది. 349 00:21:51,478 --> 00:21:53,897 ఇంతకీ ఆగంతకుడు ఎవరో తెలిసిందా? 350 00:21:53,897 --> 00:21:55,274 దురదృష్టవశాత్తూ, ఇంకా తెలీలేదు. 351 00:21:55,274 --> 00:21:57,818 కానీ నాకు, హ్యాంక్ కి మధ్య కొత్త స్నేహం చిగురించింది. 352 00:21:57,818 --> 00:22:00,112 సంగీతం మా ఇద్దరినీ కలిపింది. 353 00:22:01,822 --> 00:22:02,990 సరే మరి. 354 00:22:02,990 --> 00:22:05,325 గత కొన్ని రోజుల్లో బాగా పని చేయడం వల్ల అలసిపోయాను. 355 00:22:05,325 --> 00:22:07,870 ఈ సాయంత్రం త్వరగా పడుకోవాలి. 356 00:22:08,453 --> 00:22:09,746 హేయ్, స్టాన్. 357 00:22:09,746 --> 00:22:12,749 ఈ యాత్ర వల్ల నాకు ఒకటి గుర్తొచ్చింది, అది నీకు చెప్పాలని చాలా ఉంది... 358 00:22:14,084 --> 00:22:15,961 సర్లే. గుడ్ నైట్, మిత్రమా. 359 00:23:02,299 --> 00:23:04,301 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్