1 00:00:21,459 --> 00:00:22,961 నువ్వు దీని కోసమే వెతుకుతున్నావా? 2 00:00:22,961 --> 00:00:24,087 సరిగ్గా దాని కోసమే. 3 00:00:28,049 --> 00:00:30,718 తప్పకుండా, జార్జియా. వెంటనే ఆ పని మొదలుపెడతాను. 4 00:00:33,638 --> 00:00:36,307 కానివ్వు, ఆలెక్స్. నువ్వు తెలివైన వాడివి. నువ్వు దీన్ని పరిష్కరించగలవు. 5 00:01:17,390 --> 00:01:20,351 ఇనుయిట్ కళ్లద్దాలు, పెరూ దేశపు కాయ 6 00:01:28,818 --> 00:01:31,446 ఈ వేసవిలో ఎర్ర ముళ్లను జాగ్రత్తగా అధ్యయనం చేశాక, 7 00:01:31,446 --> 00:01:34,282 తీగ విషయంలో మేము నిపుణులని భావిస్తున్నాం. 8 00:01:34,282 --> 00:01:37,368 మీరు భారతదేశానికి వెళ్లినప్పుడు, మేము దాన్ని మళ్లీ సర్వే చేశాం. 9 00:01:38,411 --> 00:01:42,707 తీగలో మొత్తం 37 చోట్ల కొరకడాలు, గాట్లు వగైరా ఉన్నాయి. 10 00:01:42,707 --> 00:01:46,044 ముప్పై ఏడు చోట్లనా? వావ్. అంటే, చాలా చోట్ల అనే అర్థం. 11 00:01:46,044 --> 00:01:48,171 హా. తిండిబోతుకు అదే పని అనుకుంటా. 12 00:01:48,171 --> 00:01:50,131 తిండిబోతు. పేరు బాగుంది. 13 00:01:50,131 --> 00:01:51,591 థ్యాంక్యూ. అందులో నేను సిద్ధహస్తురాలినిలే. 14 00:01:52,091 --> 00:01:55,720 తిండిబోతు కొరకడానికి సంబంధించి, ఏమైనా ప్యాటర్న్ ఉందేమో మనం చూడాలి. 15 00:01:55,720 --> 00:01:57,889 ఆ ఐడియా నాకు ఎప్పుడో వచ్చింది, బాసూ. 16 00:02:00,058 --> 00:02:01,976 నాకు ప్యాటర్న్ లేవీ కనిపించలేదు. 17 00:02:03,061 --> 00:02:06,231 నిజమే. కానీ ఆ తిండిబోతు ఎక్కడెక్కడకి వెళ్లిందో మనకి అర్థమైతే, 18 00:02:06,231 --> 00:02:07,982 తర్వాత అది ఎక్కడికి వెళ్తుందో మనం ఒక అంచనాకి రావచ్చు. 19 00:02:07,982 --> 00:02:12,445 నాకు కూడా అదే అనిపించింది. అందుకే ఒక ప్లాన్ రూపొందించా. 20 00:02:12,445 --> 00:02:14,906 లారీ, వద్దు. మనం వద్దు అనుకున్నాం కదా... 21 00:02:17,033 --> 00:02:20,328 ఇనుయిట్ వేటగాడి కళ్లద్దాలు. 22 00:02:20,328 --> 00:02:22,580 నా కొత్త షూలతో ఇవి కత్తిలా ఉంటాయి. 23 00:02:22,580 --> 00:02:24,123 ఏదేమైనా, అవి శాపగ్రస్థమైనవే అయ్యి ఉంటాయి. 24 00:02:24,123 --> 00:02:27,293 అవును. ఓక ఇనుయిట్ వేటగాడు, తను ట్రాక్ చేసే జంతువులను పట్టుకోవడానికి 25 00:02:27,293 --> 00:02:30,129 ఈ కళ్లద్దాలను తయారు చేసుకున్నాడు. 26 00:02:30,129 --> 00:02:33,633 అవును. వాటిని ధరించి, మనం ఏం పట్టుకోవాలనుకుంటున్నామో బయటకి ప్రకటించాలి. 27 00:02:33,633 --> 00:02:36,678 ఆ అద్దాలు, ఆ ప్రాంతంలో ఒక వారం నుండి ఏ జీవి అయినా సంచరిస్తే, 28 00:02:36,678 --> 00:02:39,180 వాటి జాడను చూపుతాయి. 29 00:02:39,180 --> 00:02:42,308 మనకి కావలసిన దాని జాడని మనం కనిపెట్టి, దాన్ని అనుసరిస్తే సరి. 30 00:02:42,976 --> 00:02:44,602 ఇక తిండిబోతు ఊచలు లెక్కపెట్టక తప్పదు. 31 00:02:44,602 --> 00:02:47,313 కొర్నీలియస్ జర్నల్స్ ప్రకారం, ఆ అద్దాలను ధరించిన వ్యక్తి, 32 00:02:47,313 --> 00:02:49,983 తనకి కావాల్సిన వారిని పట్టుకున్నాకే, అద్దాలను తీయడానికి వీలవుతుంది. 33 00:02:49,983 --> 00:02:54,696 ఒక్క నిమిషం, అంటే మనకి కావాల్సిన వారిని తప్పకుండా పట్టుకోవాలన్నదేనా శాపం? ఇదేదో బాగుందే. 34 00:02:54,696 --> 00:02:58,116 కాదు, శాపం ఏంటంటే, మనం కళ్లద్దాలను ఎంత ఎక్కువ సేపు ధరిస్తే, 35 00:02:58,116 --> 00:03:01,744 మనలో కసి అంత విపరీతంగా పెరిగిపోతుంది, అప్పుడు మనం వివేకాన్ని కోల్పోతాం. 36 00:03:01,744 --> 00:03:04,414 ఒకే దాని గురించి పిచ్చి పట్టినట్టు వెతికితే, పిచ్చి ఎక్కగలదు. 37 00:03:05,498 --> 00:03:06,749 అది అంత మంచి విషయం కాదులే. 38 00:03:06,749 --> 00:03:11,004 అవును. అందుకే ఆ కళ్లద్దాలను ఒకసారి మాత్రమే ధరించడానికి వీలవుతుంది, 39 00:03:11,004 --> 00:03:13,172 అది కూడా వేరే దారి లేనప్పుడు మాత్రమే. 40 00:03:13,172 --> 00:03:15,592 అంటే, ఇలాంటి సందర్భంలో అన్నమాట. 41 00:03:15,592 --> 00:03:19,804 ఈ శాపగ్రస్థ కళాఖండాన్ని ఉద్దేశపూర్వకంగా మేల్కొలిపి, వాడదాం అంటున్నావా? 42 00:03:19,804 --> 00:03:22,682 ఆ విధంగా చెప్పినప్పుడు, వేరే అర్థం వస్తుంది... 43 00:03:22,682 --> 00:03:25,643 నేను స్కై చెప్పినదానితో ఏకీభవిస్తున్నాను, లారీ. అది చాలా ప్రమాదకరమైనది. 44 00:03:29,939 --> 00:03:31,691 ఏ విషయంలోనూ నన్ను నమ్మరు. 45 00:03:34,903 --> 00:03:38,239 ఆ తర్వాత నేను మ్యూజియంలో, ఇస్తాంబుల్ లో స్పృహ తప్పాను. 46 00:03:40,116 --> 00:03:41,743 ఇస్తాంబుల్ లో చాలా సేపు స్పృహలో లేను. 47 00:03:48,374 --> 00:03:49,626 నాన్నా. 48 00:03:49,626 --> 00:03:50,793 రస్? 49 00:03:52,503 --> 00:03:55,173 నాన్నా, నీ మీద నాకు నమ్మకం పోయింది. 50 00:04:02,388 --> 00:04:03,765 హ్యాంక్, రస్ ఇక్కడే ఉన్నాడా? 51 00:04:06,017 --> 00:04:07,310 నిజంగా నాకు వాడి గొంతు వినిపించింది... 52 00:04:07,310 --> 00:04:11,439 - నాన్నా నీ అబద్ధాల వలన నా మనస్సు ముక్కలైపోయింది. - పాండోరా? 53 00:04:11,439 --> 00:04:12,941 నీకు కూడా అది వినిపించింది, కదా? 54 00:04:15,276 --> 00:04:16,778 నాకు అర్థం కావట్లేదు. బహుశా... 55 00:04:16,778 --> 00:04:19,447 ఆలెక్స్, వాండర్హూవెన్ వంశానికి శాపం ఉందని నాకు ముందే తెలిసి ఉంటే, 56 00:04:19,447 --> 00:04:21,199 నేను అసలు నిన్ను పెళ్లి చేసుకొనే దాన్నే కాదు. 57 00:04:21,199 --> 00:04:22,617 స్కై, అలా అనకు. 58 00:04:22,617 --> 00:04:25,370 ఆలెక్స్, అంతా ఓకేనా? 59 00:04:29,791 --> 00:04:31,125 పిల్లలు ఎక్కడ ఉన్నారు? 60 00:04:31,125 --> 00:04:32,710 పైన ఉన్నారు. ఏమైంది? 61 00:04:32,710 --> 00:04:34,754 నాకు వాళ్ల గొంతులు రహస్య ప్రదేశంలో వినిపించాయి. 62 00:04:34,754 --> 00:04:37,465 వింతగా ఉందే. ఇంతకీ ఏం విన్నావు నువ్వు? 63 00:04:37,465 --> 00:04:42,595 నా మీద నమ్మకం పోయిందని రస్ అన్నాడు. నా అబద్ధాల వల్ల మనస్సు ముక్కలైపోయిందని పాండోరా అంది. 64 00:04:42,595 --> 00:04:46,683 ఆలెక్స్, పిల్లలు ఆ మాటలు అస్సలు అనరు. 65 00:04:47,350 --> 00:04:48,685 నీ గొంతు కూడా వినిపించింది. 66 00:04:48,685 --> 00:04:50,186 నేనేమన్నాను? 67 00:04:50,186 --> 00:04:53,481 మా వంశానికి ఉన్న శాపం గురించి తెలిసి ఉంటే, నన్ను పెళ్లి చేసుకొనే దాన్ని కాదు అని అన్నావు. 68 00:04:53,481 --> 00:04:57,402 అది నూటికి నూరు శాతం అవాస్తవం. ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. 69 00:04:57,402 --> 00:05:00,822 నువ్వు స్పృహ తప్పి పోతూ ఉండటానికి, లేదా తీగ కొరికివేయబడుతూ ఉండటానికి, 70 00:05:00,822 --> 00:05:02,198 ఈ స్వరాలకు సంబంధం ఉందేమో అనిపిస్తుంది. 71 00:05:02,198 --> 00:05:03,950 కానీ ఆ స్వరాలు నిజమైనవిలానే అనిపించాయి. 72 00:05:04,450 --> 00:05:08,204 లేదా కొత్త కళాఖండం మేల్కొని అయినా ఉండాలి. అదే కారణం అయ్యి ఉంటుంది. 73 00:05:08,204 --> 00:05:09,539 ఏమో మరి. 74 00:05:10,248 --> 00:05:12,876 నా మనస్సును నేనే నమ్మలేకపోతున్నాను, ఈ ఫిలింగ్ చాలా చిత్రంగా ఉంది. 75 00:05:12,876 --> 00:05:16,921 నాతో కాసేపు కూర్చో. ఇంకేదైనా వినిపిస్తే చెప్పు, సరేనా? 76 00:05:27,891 --> 00:05:28,975 ఎవరది? 77 00:05:32,312 --> 00:05:34,105 లారీ, నువ్వు పిచ్చోడివి. 78 00:05:34,105 --> 00:05:36,191 నీ వైఫల్యాల నుండి ఎప్పుడు నేర్చుకుంటావు? 79 00:05:36,191 --> 00:05:37,775 ఏమన్నావు? 80 00:05:41,613 --> 00:05:44,240 నేను బాధపడతానని కూడా లేకుండా పిచ్చి జోక్ వేస్తావా? 81 00:05:44,240 --> 00:05:47,493 సారీ. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు, గురూ. 82 00:05:47,493 --> 00:05:48,995 అర్థం కావట్లేదా? 83 00:05:53,750 --> 00:05:57,253 స్కై, నేను మళ్లీ నీతో ఇంకెప్పుడూ అబద్ధం ఆడనని మాటిచ్చాను. 84 00:05:57,253 --> 00:05:59,005 మరి నన్ను ఎందుకు నమ్మట్లేదు? 85 00:05:59,005 --> 00:06:01,341 - నేను నిన్ను నమ్ముతున్నాను. - ఏంటి? 86 00:06:01,341 --> 00:06:03,551 నువ్వు నాతో ఏమైనా చెప్పావా? 87 00:06:03,551 --> 00:06:06,888 లేదు... ఆగు, నాకు కూడా ఇలాగే జరిగింది. నీకు ఏం వినిపించింది? 88 00:06:06,888 --> 00:06:10,350 నేను నిన్ను నమ్మట్లేదని అన్నావు, కానీ నేను నమ్ముతున్నా. అందులో సందేహమే లేదు. 89 00:06:10,350 --> 00:06:12,268 మళ్లీ నువ్వు నాతో అబద్ధం ఆడేదాకా. 90 00:06:13,269 --> 00:06:14,604 వెళ్లి పిల్లలను చూద్దాం, పద. 91 00:06:14,604 --> 00:06:16,898 నువ్వు వెళ్లి చూడు. నేను రహస్య ప్రదేశానికి వెళ్తాను. 92 00:06:16,898 --> 00:06:19,609 నీకు కూడా స్వరాలు వినిపిస్తున్నాయంటే, అది ఏదో శాపమే అయ్యి ఉండాలి. 93 00:06:24,239 --> 00:06:27,909 అమ్మా, నువ్వు అసలు ఉద్యోగానికి వెళ్లకపోతే బాగుండు. 94 00:06:27,909 --> 00:06:30,495 పాచిక నుండి మమ్మల్ని కాపాడటానికి నువ్వు ఇక్కడ లేకుండా అయిపోయింది. 95 00:06:30,495 --> 00:06:32,497 పాండోరా, అలా జరగడం నా ఉద్దేశం కానే కాదు... 96 00:06:32,497 --> 00:06:36,876 తోలుబొమ్మ నుండి కూడా. మమ్మల్ని నిరాశపరుస్తున్నావు, అమ్మా. ఆ ఉద్యోగం అంత ముఖ్యమైనదా? 97 00:06:36,876 --> 00:06:38,211 రస్... 98 00:06:38,211 --> 00:06:41,130 ఒక్క నిమిషం, ఇదేదీ నిజం కాదు. అంతే కదా? 99 00:06:46,386 --> 00:06:49,305 పాండోరా, నువ్వు మ్యూజియానికి రావడం నాకు ఇష్టం లేదు. 100 00:06:49,806 --> 00:06:51,099 నువ్వు చిరాకు తెప్పిస్తున్నావు. 101 00:06:51,099 --> 00:06:52,183 అమ్మా? 102 00:06:55,144 --> 00:06:56,437 పాండోరా, అన్నయ్య ఎక్కడ? 103 00:06:56,437 --> 00:06:58,857 నేను బాగా చిరాకు తెప్పిస్తా కదా, నువ్వే వెతుక్కో. 104 00:06:58,857 --> 00:07:00,358 లేదు. పాండోరా, ఆగు. 105 00:07:01,860 --> 00:07:04,487 రస్ అంత తెలివైన దానివి నువ్వు ఎప్పటికీ కాలేవు. 106 00:07:04,487 --> 00:07:06,239 నేను కూడా రస్ అంత తెలివైన దాన్నే! 107 00:07:06,239 --> 00:07:07,574 అవును, అందులో సందేహమే లేదు. 108 00:07:07,574 --> 00:07:09,450 మరి, నేను రస్ అంత తెలివైన దాన్ని కాదని ఎందుకు అన్నావు? 109 00:07:09,450 --> 00:07:11,035 నేనేమీ అనలేదు. 110 00:07:11,536 --> 00:07:13,329 నీకు కూడా స్వరాలు వినిపిస్తున్నట్టున్నాయి. 111 00:07:19,669 --> 00:07:23,798 పాండోరా, నీ కన్నా ఆప్త స్నేహితులు నాకు చాలా మంది ఉన్నారు. 112 00:07:23,798 --> 00:07:24,883 దేవీ? 113 00:07:24,883 --> 00:07:28,553 పాండోరా, మన స్నేహం ఒకప్పటిలా ఎప్పటికీ కాలేదు. 114 00:07:28,553 --> 00:07:30,305 నేను నీ మాటలు వినడం లేదు. 115 00:07:30,305 --> 00:07:32,557 పాండోరా, నువ్వు నన్ను నిరాశపరిచావు. 116 00:07:35,310 --> 00:07:37,854 పాండోరా, నువ్వు చిరాకు తెప్పిస్తావు. 117 00:07:38,354 --> 00:07:40,523 నువ్వు నన్ను పట్టించుకోకపోవడం న్యాయం కాదు, పాండోరా! 118 00:07:44,652 --> 00:07:48,781 స్కై, శూన్యం నుండి నన్ను కాపాడటానికి, నువ్వు చాలా సమయం తీసుకున్నావు. 119 00:07:53,453 --> 00:07:55,830 రస్, నాన్నని ఎలా అనుమానించగలుగుతున్నావు నువ్వు? 120 00:07:56,414 --> 00:07:58,291 నాకు సహజంగానే సందేహాలు వస్తుంటాయి. 121 00:07:58,875 --> 00:08:00,543 హా? నీకు కూడా స్వరాలు వినిపిస్తున్నాయా? 122 00:08:00,543 --> 00:08:04,088 - రస్, నువ్వు మరీ ఎక్కువ ప్రశ్నలు అడుగుతావు. - వాటిని పట్టించుకోకు. 123 00:08:04,714 --> 00:08:06,758 ఎలా? అవి రాకుండా చేయలేకపోతున్నాను. 124 00:08:11,387 --> 00:08:12,472 పాండోరా ఎక్కడ ఉంది? 125 00:08:12,472 --> 00:08:13,973 తను ఇక్కడికే వచ్చింది అనుకున్నా. 126 00:08:13,973 --> 00:08:16,184 అమ్మా, నాకు నీతో మాట్లాడాలని లేదు. 127 00:08:16,184 --> 00:08:18,353 పాండోరా, అది కటువుగా ఉంది. 128 00:08:18,353 --> 00:08:22,190 తను ఇక్కడ లేదు. ఆ స్వరాలను పట్టించుకోకుండా ఉండాలని గుర్తుంచుకో. 129 00:08:22,190 --> 00:08:25,109 ఏది నిజమో, ఏది కాదో చెప్పలేకపోతున్నా. 130 00:08:25,777 --> 00:08:28,196 తను ఎక్కడ ఉందో నేను కనిపెడతా. తను ఎక్కడెక్కడ దాక్కుంటుందో నాకు తెలుసు. 131 00:08:28,696 --> 00:08:31,699 నాన్నా, నా గురించి బాగా తెలుసు అనుకుంటున్నావు, కానీ నీకు తెలీదు. 132 00:08:32,282 --> 00:08:33,700 పాన్. భలేదానివే. 133 00:08:34,327 --> 00:08:35,995 తను ఇక్కడ లేదు, ఆలెక్స్. 134 00:08:35,995 --> 00:08:37,872 అసలు ఈ స్వరాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? 135 00:08:38,705 --> 00:08:41,376 ఆ వైపు నుండి బిగ్గరగా వస్తున్నట్టున్నాయి. 136 00:08:54,597 --> 00:08:58,351 స్టాన్లీ, నాకున్నంత ధైర్యం నీకు లేదు. 137 00:08:58,851 --> 00:08:59,852 నాకు ధైర్యం ఉంది. 138 00:09:07,610 --> 00:09:09,571 నాకు ఎంత ధైర్యం ఉందో చూపుతాను, ఆగు. 139 00:09:10,655 --> 00:09:12,824 చొరబాటుదారుడు! చొరబాటుదారుడు! 140 00:09:15,285 --> 00:09:16,452 ఏంటి... 141 00:09:16,452 --> 00:09:21,291 ఈ కాయ, దక్షిణ అమెరికా విభాగంలో ఉండాలి. ఇక్కడికి ఎలా వచ్చింది? 142 00:09:24,294 --> 00:09:27,922 అది ఎయిర్ వెంట్. అది ప్రధాన ఇంటి భాగానికి చెందిన ఎయిర్ సిస్టమ్ కి కనెక్ట్ అయి ఉంది. 143 00:09:27,922 --> 00:09:32,218 ఆ కాయని ఇక్కడ ఎవరైతే పెట్టారో, ఈ గుసగుసలు బ్రయర్ స్టోన్ ఇల్లంతా వ్యాపించాలని, 144 00:09:32,218 --> 00:09:34,137 మన చెవుల్లో కూడా అవి మార్మోగాలనే పెట్టారు. 145 00:09:34,137 --> 00:09:36,222 ఆ కాయని అక్కడి నుండి తీసేద్దాం. 146 00:09:36,222 --> 00:09:38,182 అదృష్టవశాత్తూ, నేను "రా"కి కొత్త రిమోట్ ని తయారు చేశాను. 147 00:09:57,160 --> 00:09:58,912 వామ్మోయ్. ఏం జరుగుతోంది? 148 00:09:59,746 --> 00:10:01,789 పాండోరా, మాకు నీ అవసరం లేదు. 149 00:10:02,415 --> 00:10:05,335 నాకు ఉన్న పెద్ద, అద్భుతమైన బుర్రతో ఎల్లప్పుడూ సమస్యలను పరిష్కరించేది నేనే. 150 00:10:05,335 --> 00:10:08,171 ఓయబ్బో, నేను కూడా పరిష్కరించగలను. 151 00:10:18,223 --> 00:10:20,225 అతను మా మీద నిఘా పెడుతున్నాడా? 152 00:10:20,225 --> 00:10:23,311 ఈ కళాఖండం గురించి కొర్నీలియస్ జర్నల్స్ లో ఏముందో చూడాలి. 153 00:10:23,811 --> 00:10:25,438 నాన్నా, నేను నీకు సాయపడతా. 154 00:10:25,438 --> 00:10:29,526 థ్యాంక్స్ రా. చూడు, మళ్లీ పరిశోధన జట్టు ఏకమైపోయింది. 155 00:10:30,693 --> 00:10:32,946 నాన్నా, నాకు నీతో సన్నిహితంగా అనిపించట్లేదు. 156 00:10:38,076 --> 00:10:39,494 బయట ఒక గూఢచారిని చూశా. 157 00:10:39,494 --> 00:10:41,704 నేను చూసిన వాడే అయ్యుంటాడు. 158 00:10:41,704 --> 00:10:43,122 ఇంతకు ముందు కూడా ఓసారి చెప్పా, 159 00:10:43,122 --> 00:10:45,833 అతనికి, ఇక్కడ జరిగే వాటికి ఏదైనా సంబంధం ఉందేమో అనిపిస్తోంది. 160 00:10:45,833 --> 00:10:47,502 అంటే, ఇది కాకతాళీయం అయ్యే అవకాశం లేదు. 161 00:10:47,502 --> 00:10:51,339 స్టాన్లీ, నువ్వు రహస్య ప్రదేశాన్ని కాపాడటంలో విఫలమవుతున్నావు. 162 00:10:51,339 --> 00:10:53,550 నాకు తెలుసు. నేను మరింత కష్టపడతాను. 163 00:10:53,550 --> 00:10:57,095 నేనేమీ అనలేదు. దాన్ని పట్టించుకోకు. అది నిజం కాదు. 164 00:10:57,095 --> 00:11:00,098 అతను నల్ల దుస్తులు వేసుకొని, బైనాకులర్స్ తో మన కిటికీ వంక చూస్తూ ఉన్నాడు. 165 00:11:00,098 --> 00:11:02,058 అతడిని బాగా చూశావా? 166 00:11:02,058 --> 00:11:04,978 బాగానే చూశాను అనుకుంటా. ఫుట్ పాత్ పక్కన ఉండే పొదల మాటున ఉన్నాడు. 167 00:11:05,562 --> 00:11:07,105 నేను కూడా అతడిని అక్కడే చూశా. 168 00:11:07,939 --> 00:11:12,902 ఈ సంవత్సరం మింగుడుపడని దృశ్యాలను నేను చాలా చూశాను. చాలా అంటే చాలా చూశాను. 169 00:11:13,611 --> 00:11:15,321 నేను నిన్ను మరింత బాగా కాపాడుకోవాలి. 170 00:11:21,494 --> 00:11:23,788 "పెరూ దేశపు కాయ." ఇది... ఏంటి? 171 00:11:23,788 --> 00:11:25,874 పేజీని ఎవరో చించేశారు. 172 00:11:25,874 --> 00:11:27,834 ఎవరో ఇక్కడికి చొరబడుతున్నారు, 173 00:11:27,834 --> 00:11:30,753 ఈ శాపానికి విరుగుడు ఎలా కనిపెట్టాలో మనకి తెలియకుండా చేయాలని చూస్తున్నారు. 174 00:11:30,753 --> 00:11:33,798 అతను ముసలివాడు. 40 ఏళ్లుంటాయి. 175 00:11:33,798 --> 00:11:37,343 నలభై ఏళ్లంటే ముసలివాడు కాదు. కానీ అది కాదు ముఖ్యం. 176 00:11:37,343 --> 00:11:39,929 ముఖ్యమైన విషయం ఏంటంటే, అతనే మన ఇంట్లోకి చొరబడుతుంటాడు. 177 00:11:41,014 --> 00:11:43,516 "రా" రిమోట్ ని దొంగిలించింది, తోలుబొమ్మతో "రా" పై దాడి చేసింది, 178 00:11:43,516 --> 00:11:46,811 కోర్నీ జర్నల్ లో పేజీని చించేసింది అతనే అయ్యుంటాడు. 179 00:11:46,811 --> 00:11:48,646 అతను పెద్ద విలన్ లానే ఉన్నాడు. 180 00:11:48,646 --> 00:11:50,690 కానీ అవన్నీ ఎలా చేయాలో అతనికి ఎలా తెలుసు? 181 00:11:50,690 --> 00:11:54,652 రస్ అన్నది నిజమే. అవి మన కుటుంబానికే తెలిసిన విషయాలు కదా. 182 00:11:54,652 --> 00:11:57,739 పెద్ద విలన్లకు అన్నీ తెలుస్తాయి. అది కూడా తెలీదా మీకు? 183 00:11:57,739 --> 00:11:58,948 నాకు సపోర్టుగా మాట్లాడు, అమ్మా. 184 00:11:58,948 --> 00:12:00,033 అమ్మా? 185 00:12:01,993 --> 00:12:04,829 అమ్మా, ఎవరో మనల్ని గమనిస్తూ ఉన్నారు. 186 00:12:05,330 --> 00:12:08,124 మళ్లీ మన కుటుంబం ప్రమాదంలో పడింది! 187 00:12:08,124 --> 00:12:11,294 స్కై, మమ్మల్ని కాపాడాల్సింది నువ్వే. 188 00:12:19,844 --> 00:12:21,679 నా కుటుంబం జోలికి ఎవరు వచ్చినా, వాళ్ల అంతు చూసేదాకా వదలను. 189 00:12:24,182 --> 00:12:28,186 హేయ్, కళ్లద్దాలూ. నా ఇంట్లోకి చొరబడిన వ్యక్తిని పట్టుకోవాలనుకుంటున్నా. 190 00:12:28,186 --> 00:12:29,771 ఇక్కడికి ఎవరు వచ్చారో చూపించు. 191 00:12:46,454 --> 00:12:47,747 స్కై? 192 00:12:47,747 --> 00:12:50,959 మ్యాప్ చేయడం మొదలుపెట్టు, లారీ. మనం చొరబడిన వ్యక్తిని ట్రాక్ చేయాలి. 193 00:12:57,590 --> 00:12:59,300 పైకి వెళ్లి చూశా. అమ్మ అక్కడ లేదు. 194 00:12:59,300 --> 00:13:01,970 నేను బాగా చిరాకు తెప్పిస్తున్నానని తను దాక్కుంది ఏమో. 195 00:13:01,970 --> 00:13:03,346 ఆమెతో పాటు రస్ కూడా అదే అనుకుంటున్నారు. 196 00:13:03,346 --> 00:13:05,682 అది ఆ కాయ గుసగుసలు, అంతే. 197 00:13:05,682 --> 00:13:09,769 అవన్నీ చెప్పాలని ఆ గుసగుసలకి ఎలా తెలుసు? అవన్నీ కల్పించుకొని చెప్పడం కూడా కష్టం కదా. 198 00:13:09,769 --> 00:13:12,564 వాండర్హూవెన్స్, ఇప్పుడు మన ముందు ఒక సమస్య వచ్చి పడింది. 199 00:13:12,564 --> 00:13:14,691 కానీ సమస్య ఇప్పటికే ఒకటి ఉంది కదా. 200 00:13:14,691 --> 00:13:18,528 అవును. ఇది కొత్తది. నాతో రండి. 201 00:13:28,997 --> 00:13:29,998 అమ్మా. 202 00:13:29,998 --> 00:13:34,460 పాండోరాది ఎరుపు. రస్ ది పర్పుల్. ఆలెక్స్ ది నారింజ రంగు. 203 00:13:36,921 --> 00:13:38,673 స్కై, ఎందుకు ఆ కళ్లద్దాలు వేసుకున్నావు? 204 00:13:38,673 --> 00:13:41,968 తను బాధ్యతగా భావించి వేసుకుంది. తన నిర్ణయంతో నేను ఎకీభవిస్తున్నాను. 205 00:13:41,968 --> 00:13:45,680 కుటుంబ సభ్యులారా, మీరు కాయ శాపానికి విరుగుడు కనిపెట్టే పని చూడండి. చొరబాటుదారుని పని నేను చూసుకుంటా. 206 00:13:45,680 --> 00:13:48,683 లారీ, రా. మనం ఇంకా నీలి రిబ్బన్ ని ట్రాక్ చేయాలి. 207 00:13:50,018 --> 00:13:54,689 వింత సంఘటనలు మనకి కొత్తేం కాదు కానీ, ఒకేసారి రెండు శాపాలను తరిమేసే పని చేయడం మాత్రం మనకి ఇదే తొలిసారి. 208 00:13:54,689 --> 00:13:59,027 అమ్మ చెప్పింది విన్నారుగా. తను ఆ పని చూసుకుంటుంది. మనం ఆ కాయ శాపం సంగతి చూసుకుందాం. 209 00:13:59,027 --> 00:14:00,737 దాని గురించి మనకి తెలిసిన విషయాలు ఏమిటి? 210 00:14:00,737 --> 00:14:04,324 గుసగుసలు, మనకి ఆప్తులైన వారు, మనకి బాధ కలిగించేలా మాట్లాడుతున్న భ్రమని కలిగిస్తాయి. 211 00:14:04,324 --> 00:14:07,035 అవి నిజం కాని మాటలే అని ఆశిస్తున్నా, 212 00:14:07,827 --> 00:14:09,913 వాటిలో కొన్ని నిజమే అయ్యుండవచ్చేమో. 213 00:14:10,496 --> 00:14:12,165 ఒకవేళ వాటిని పట్టించుకోకుండా ఉండే ప్రయత్నం చేస్తే? 214 00:14:12,165 --> 00:14:15,501 ఆ పని చేశా. ఇంకా భయంకరం అయింది పరిస్థితి. 215 00:14:16,169 --> 00:14:18,171 ఇంకా రెండు రిబ్బన్ల సంగతి తేల్చాల్సి ఉంది. 216 00:14:18,671 --> 00:14:22,342 నల్లది ఎవరో తెలియట్లేదు. అది మధ్య మధ్యలో విరిగిపోయి ఉంది. 217 00:14:23,426 --> 00:14:24,844 నీలి రంగు రిబ్బన్ మళ్లీ ఇక్కడ కూడా ఉందే. 218 00:14:29,390 --> 00:14:31,559 గ్రేట్ వెనుక పక్క ఏదో ఉంది. 219 00:14:38,358 --> 00:14:40,109 నీలి రంగు రిబ్బన్ గబ్బిలానిదా? 220 00:14:41,319 --> 00:14:44,739 కాదు. అది కాదు మన చొరబాటుదారు. గబ్బిలానిది ఆకు పచ్చ రిబ్బన్ రంగు. 221 00:15:04,968 --> 00:15:05,969 స్కై! 222 00:15:08,513 --> 00:15:10,306 ఏమైంది? అందరూ ఓకేనా? 223 00:15:10,306 --> 00:15:13,142 తీగని ఎక్కుతూ స్కై కొన్ని పెట్టెలని కింద పడేసింది, 224 00:15:13,142 --> 00:15:14,727 కానీ తను ఆ విషయాన్ని గమనించినట్టు లేదు. 225 00:15:19,023 --> 00:15:20,024 అలానే అనిపిస్తోంది. 226 00:15:20,692 --> 00:15:25,321 నాన్నా, నీ వల్ల మన బతుకులు ఇక ఎప్పటికీ ఇంతే. 227 00:15:26,906 --> 00:15:30,869 తీగ కొరకబడి ఉన్న చోట్లంతా నీలి రంగు రిబ్బన్ ఉంది. అది తిండిబోతుదే. 228 00:15:30,869 --> 00:15:33,246 అది ఆలెక్స్ ఆఫీసులోని పైప్ గుండా వచ్చింది. 229 00:15:33,246 --> 00:15:34,956 అసలు అది అక్కడికి ఎలా వెళ్లింది? 230 00:15:36,124 --> 00:15:37,542 అది నేను కనుక్కుంటా. 231 00:15:41,629 --> 00:15:45,091 నల్ల రిబ్బన్ ఎవరిది? ఎందుకు అది మధ్య మధ్యలో విరిగిపోయి ఉంది? 232 00:15:45,675 --> 00:15:47,176 తెలీదు. 233 00:15:53,683 --> 00:15:56,769 తను కళ్లద్దాలు పెట్టుకొని చాలా సేపయింది. తనకి పిచ్చెక్కుతోంది. 234 00:15:56,769 --> 00:15:58,688 తనకి ఏమీ కాకుండా మనం చూసుకోవాలి. 235 00:15:58,688 --> 00:15:59,939 ఇంకెవరికి కూడా ఏమీ కాకుండా. 236 00:16:00,523 --> 00:16:03,193 అర్థమైంది. అమ్మకి సాయపడదాం, ఆ తర్వాత ఈ కాయకి సంబంధించిన శాపం సంగతి చూద్దాం. 237 00:16:03,193 --> 00:16:05,445 వాండర్హూవెన్ ఇంట్లో ఇదంతా మామూలేగా. 238 00:16:26,591 --> 00:16:28,009 అవి ఇక్కడి నుండి వచ్చాయి. 239 00:16:37,101 --> 00:16:40,021 వావ్. ఆ పొదలు అమ్మకి బాగా మండించినట్టున్నాయి. 240 00:16:40,522 --> 00:16:41,814 ఇది అసలు మంచి ఐడియానే కాదు. 241 00:16:44,776 --> 00:16:47,904 నల్ల రిబ్బన్ వ్యక్తి, తిండిబోతుని ఇక్కడ విడుదల చేసి ఉంటారు. 242 00:16:47,904 --> 00:16:51,115 ఇది రహస్య ప్రదేశానికి చేరుకునే పైప్. 243 00:16:54,619 --> 00:16:57,580 నేను కిటికీలోంచి చూసిన వ్యక్తే నల్ల రిబ్బన్ అయ్యుంటాడు. 244 00:16:57,580 --> 00:16:59,582 చూడండి, ఇతను పెరడు అంతా తిరిగాడు. 245 00:16:59,582 --> 00:17:01,751 ఒకవేళ నల్ల రిబ్బన్ వ్యక్తి నువ్వు చూసిన వాడే అయితే, 246 00:17:01,751 --> 00:17:05,338 అతని జాడ మన ఆవరణ అవతల కనిపించట్లేదు ఎందుకు? అతను ఎలా వస్తున్నాడు, ఎలా వెళ్తున్నాడు? 247 00:17:05,838 --> 00:17:10,552 రస్, నువ్వు పెద్ద మేధావివి అనుకుంటుంటావు. ఇతరుల మాటలను అస్సలు పట్టించుకోవు. 248 00:17:11,135 --> 00:17:12,262 నేను పట్టించుకుంటాను. 249 00:17:13,805 --> 00:17:15,848 ఆ... సారీ. నువ్వేదో అంటున్నావు? 250 00:17:15,848 --> 00:17:19,686 బహుశా అతను ఇంకా ఇక్కడే ఉన్నాడేమో. అందుకే అతను వచ్చేది, వెళ్లేది మనకి కనిపించట్లేదేమో. 251 00:17:19,686 --> 00:17:21,145 అదెలా సాధ్యం? 252 00:17:22,647 --> 00:17:23,648 స్కై! 253 00:17:37,120 --> 00:17:38,580 నల్ల రిబ్బన్ వ్యక్తి ఇక్కడికి వచ్చారు. 254 00:17:39,414 --> 00:17:42,083 మా ఆటలలో కనిపించకుండా పోయిన పాచికలే అవి. 255 00:17:42,083 --> 00:17:44,127 "రా"కి చెందిన అసలైన రిమోట్ కంట్రోల్ కూడా ఇక్కడే ఉంది. 256 00:17:46,754 --> 00:17:49,507 పెరూ దేశపు కాయకి సంబంధించిన జర్నల్ పేజీలు కూడా. 257 00:17:49,507 --> 00:17:52,635 అమ్మా, నువ్వు నల్ల రిబ్బన్ వ్యక్తికి చెందిన రహస్య ప్రదేశాన్ని కనిపెట్టావు. 258 00:18:04,314 --> 00:18:05,607 దొరికావు! 259 00:18:10,320 --> 00:18:11,654 చొరబాటుదారుని పట్టేసుకున్నా. 260 00:18:14,449 --> 00:18:17,327 తీగని కొరికేస్తున్న పురుగు అదే. నువ్వు దాన్ని పట్టేసుకున్నావు. 261 00:18:17,327 --> 00:18:19,704 వావ్. అదే అన్నమాట తిండిబోతు. 262 00:18:19,704 --> 00:18:21,789 నీలి రబ్బన్ తిండిబోతుదే. 263 00:18:23,249 --> 00:18:27,545 నల్ల రిబ్బన్ ఎవరో ఇంకా తేలాల్సి ఉంది. మనం కళ్లద్దాలను మళ్లీ ఉపయోగించాలి. 264 00:18:27,545 --> 00:18:30,298 కానీ మనం ఉపయోగించలేము. వాటిని ఒకసారే ఉపయోగించగలం. గుర్తుందా? 265 00:18:33,801 --> 00:18:38,264 లారీ, ఈ అద్దాలను వేసుకొనే అవకాశం నీకు రానందుకు బాధగా ఉంది. నీకు వీటిని వేసుకోవాలని చాలా ఉందని నాకు తెలుసు. 266 00:18:38,890 --> 00:18:42,977 హా. పర్వాలేదులే, స్కై. చొరబాటుదారుని నువ్వు పట్టుకున్నావు కదా. 267 00:18:43,603 --> 00:18:46,606 దాని మీద ఉన్న శాపాన్ని ఎలా తరిమివేయాలి అనేదానికి సంబంధించిన సమాచారం కూడా సంపాదించేశాం. 268 00:18:52,403 --> 00:18:55,281 "పెరూ దేశపు కాయను, ప్రాచీన కాలం నాటి ఒక కళాకారుడు రూపొందించాడు, 269 00:18:55,281 --> 00:18:57,534 దాన్ని శత్రువు రాజ్యానికి కానుకగా ఇవ్వడం జరిగింది. 270 00:18:58,117 --> 00:18:59,869 కానీ అది శాపగ్రస్థమైన కానుక. 271 00:18:59,869 --> 00:19:03,289 దాని వల్ల జనాలకు, తమకి ఏ విషయాలలో అయితే అభద్రతా భావాలు ఉంటాయో, ఆ విషయాలు 272 00:19:03,289 --> 00:19:06,209 తమ ఆత్మీయులు మాట్లాడినట్టు వినిపిస్తాయి, దానితో వాళ్ల మధ్య అపనమ్మకం ఏర్పడింది. 273 00:19:06,709 --> 00:19:10,046 దీని వల్ల రాజ్యం బలహీనపడింది, అదే అదునుగా శత్రు రాజ్యం దాన్ని ఆక్రమించుకోగలిగింది." 274 00:19:10,672 --> 00:19:11,881 అదిరింది. 275 00:19:11,881 --> 00:19:14,884 ఆక్రమించిన రాజ్యం, ఈ కాయని ట్రోజన్ గుర్రంగా పంపి, 276 00:19:14,884 --> 00:19:16,761 వాళ్ల మధ్య మనస్పర్థలు వచ్చేలా చేసి, ఆక్రమించుకుంది. 277 00:19:16,761 --> 00:19:20,974 ఆ స్వరాలు నిజమైనవి కాదని నాకు తెలుసు. అయినా కానీ, వాటిని పట్టించుకోకుండా ఉండటం కష్టంగానే అనిపించింది. 278 00:19:21,558 --> 00:19:25,979 ఆలెక్స్, నీలో ఏదో జడలు విప్పుతోంది, అది నీకు కూడా తెలుసు. 279 00:19:25,979 --> 00:19:28,022 నువ్వు మనల్ని అందరినీ ప్రమాదంలోకి నెడుతున్నావు. 280 00:19:28,022 --> 00:19:31,901 హేయ్, ఇక చాలు! నా కుటుంబానికి హాని కలిగించే పనిని నేను ఎప్పటికీ చేయను! 281 00:19:31,901 --> 00:19:34,237 ఈ మధ్య నా బుర్ర సరిగ్గా పని చేస్తూ ఉండకపోవచ్చు, 282 00:19:34,237 --> 00:19:36,364 కానీ నా మనస్సులో ఏముందో ఆ కాయకి తెలీదు. 283 00:19:36,364 --> 00:19:41,411 మీ అందరంటే నాకు ప్రాణం. నాలో ఏదైనా అసలైన ఫీలింగ్ ఉంది అంటే, అది మీ మీద ఉన్న ప్రేమే. 284 00:19:41,911 --> 00:19:43,454 మాకు కూడా నువ్వంటే ప్రాణం. 285 00:19:43,454 --> 00:19:47,083 నా బుర్రలో అనుమాన స్వరాలు మార్మోగుతూ ఉంటాయి కదా, అప్పుడప్పుడూ నేను వాటికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కన్నా 286 00:19:47,083 --> 00:19:48,251 ఎక్కువ ఇచ్చేస్తుంటాను. 287 00:19:48,251 --> 00:19:49,627 శాపం లేకపోయినా కూడా. 288 00:19:49,627 --> 00:19:51,754 హా, అవి కేవలం ఆలోచనలే, కదా? 289 00:19:51,754 --> 00:19:54,173 మనం వాటిని పట్టించుకుంటే, శాపానిదే విజయం అవుతుంది. 290 00:19:54,173 --> 00:19:56,009 కాబట్టి, ఒకటి చెప్పనా? 291 00:19:56,009 --> 00:19:59,095 చిత్రవిచిత్రమైన కుటుంబ సభ్యులారా, మీరంటే నాకు ప్రాణం. ఎప్పటికీ, ఎన్నటికీ. 292 00:19:59,762 --> 00:20:01,347 గుసగుసలూ, ఎలా ఉంది నా దెబ్బ? 293 00:20:01,347 --> 00:20:06,436 నేను ఎమోషన్లను బయటకు కనిపించనివ్వను, కానీ మీరందరంటే నాకు ప్రాణం. 294 00:20:09,814 --> 00:20:11,482 గుసగుసల శబ్దం సన్నగిల్లుతోంది. 295 00:20:15,320 --> 00:20:18,740 బహుశా శాపాన్ని తరిమేసే విధానం ఇదేనేమో. సందేహాలకు నిజాలతో చెక్ పెట్టడం. 296 00:20:19,574 --> 00:20:22,577 అవును. నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా కూడా తట్టింది. 297 00:20:22,577 --> 00:20:24,287 మన మనస్సులో ఉండే భావాలను ఒక కాగితంపై రాద్దాం, 298 00:20:24,287 --> 00:20:27,207 అ నిజాన్ని ఉపయోగించి, గుసగుసలకు అడ్డుకట్ట వేద్దాం. 299 00:20:31,461 --> 00:20:32,962 నా లెక్కలో నేను తెలివైన దాన్నే. 300 00:20:32,962 --> 00:20:34,923 నాన్న విషయంలో ఏదో జరుగుతోంది. 301 00:20:34,923 --> 00:20:38,593 నాకు అది తెలుస్తోంది, కానీ నాన్నకి మేమంటే ప్రాణమని నాకు నమ్మకం ఉంది. 302 00:20:38,593 --> 00:20:41,763 కాబట్టి, ఈ ఒక్కసారికి నా మనస్సు మాట వింటాను. ఆయన విషయంలో సానుకూలంగా ఉంటాను. 303 00:20:41,763 --> 00:20:45,934 నాకు నా ఉద్యోగమంటే ఇష్టం. కానీ నా కుటుంబమంటే నాకు ప్రాణం, 304 00:20:45,934 --> 00:20:48,728 వాళ్ళని కాపాడటానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. 305 00:20:48,728 --> 00:20:49,979 నేను పొరపాట్లు చేశాను, 306 00:20:49,979 --> 00:20:54,484 కానీ నా కుటుంబం విషయంలో సరైనదే చేయాలనుకుంటున్నా, నా పూర్వీకులు చేసిన తప్పులను సరిదిద్దాలనుకుంటున్నా. 307 00:20:54,484 --> 00:20:56,069 ఈ కుటుంబం చాలా మంచిది. 308 00:20:56,069 --> 00:20:58,071 కుటుంబం ఉంటే జీవితం బాగుంది. 309 00:21:10,542 --> 00:21:11,709 హమ్మయ్య. ఇది పని చేసింది. 310 00:21:11,709 --> 00:21:13,836 నువ్వు ఏం రాశావు? నా గురించేనా? 311 00:21:13,836 --> 00:21:15,588 అది నీకు ఎప్పటికీ తెలీదులే. 312 00:21:16,631 --> 00:21:18,258 అబ్బా. చిరాకు తెప్పిస్తున్నావుగా. 313 00:21:25,557 --> 00:21:28,601 అంతా సిద్ధంగా ఉంది. నేను ఉదయం బయలుదేరుతాను. 314 00:21:28,601 --> 00:21:31,437 కాయని తిరిగి ఇచ్చేయడానికి లీమాలోని మ్యూజియంతో అపాయింట్మెంట్ తీసుకున్నా. 315 00:21:31,437 --> 00:21:34,440 ఇంకో విషయం, కళ్లద్దాల గురించి నీ అలాస్కా నేస్తం నాకు రిప్లయి ఇచ్చారు. 316 00:21:34,440 --> 00:21:36,401 మాకు కూడా నీతో రావాలనుంది. 317 00:21:36,401 --> 00:21:39,487 నేను ఫోన్ చేస్తూనే ఉంటాగా. అదీగాక నాతో మార్జీ ఉంటుందిగా. 318 00:21:39,487 --> 00:21:42,740 నేను స్పృహ తప్పి పోతే, నాకు ఏం కాకుండా తను చూసుకుంటుంది. నేను వెళ్లి సర్దుకుంటా. 319 00:23:02,320 --> 00:23:04,322 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్