1 00:00:16,079 --> 00:00:17,080 అందరూ జాగ్రత్తగా ఉండండి. 2 00:00:17,080 --> 00:00:21,668 తీగ నాకు ఊరికే చూపించీ చూపకుండా చూపిందంటే, కానీ ఈ కళాఖండం చాలా శక్తివంతమైనదని చెప్పగలను. 3 00:00:22,377 --> 00:00:24,379 కాస్త వేగంగా నడుస్తావా? 4 00:00:24,379 --> 00:00:27,465 గత కొన్ని వారాల్లో ఏమైందో తెలుసా? ఒక తోలుబొమ్మ నన్ను భారతదేశానికి లాక్కుపోయింది, 5 00:00:27,465 --> 00:00:30,051 ఇంకా ఒక కాయ, మనలోని అభద్రతాభావాలను ఆసరాగా తీసుకొని, మనతో ఒక ఆట ఆడుకుంది. 6 00:00:30,051 --> 00:00:32,052 ఇక్కడ నేను రిస్క్ తీసుకోను. 7 00:00:37,267 --> 00:00:38,351 ఇదే. 8 00:00:38,351 --> 00:00:41,396 "గుడ్ లక్ గుర్రపు కట్టు, 1886." 9 00:00:45,900 --> 00:00:47,569 కుళ్లిపోయిన గుడ్డు కంపు. 10 00:00:47,569 --> 00:00:49,487 అది గంధకం అనుకుంటా. 11 00:00:49,487 --> 00:00:53,575 చెడుకు గుర్తుగా అందరూ భావించే వాసన ఇది. సూపర్. 12 00:00:59,205 --> 00:01:00,915 ఇది మండుతోంది. జాగ్రత్త. 13 00:01:26,566 --> 00:01:29,485 గుడ్ లక్ గుర్రపు కట్టు 14 00:01:30,820 --> 00:01:33,698 ఇదేదో కౌబాయ్ కి సంబంధించిన శాపంలా ఉంది, కానీ కంపు కొడుతోందే? 15 00:01:33,698 --> 00:01:35,366 ఇది మరీ అంత దారుణం కాదేమో. 16 00:01:36,534 --> 00:01:38,453 వేసేసింది! 17 00:01:40,038 --> 00:01:41,789 కంపు మామూలుగా లేదు, బాసూ. 18 00:01:41,789 --> 00:01:46,669 అందుకే, వీలైనంత త్వరగా న్యూ మెక్సికోకి వెళ్లి, ఈ గుర్రపు కట్టుకున్న శాపాన్ని తరిమేయాలి. 19 00:01:46,669 --> 00:01:47,837 మనందరమూ వెళ్లలేం. 20 00:01:47,837 --> 00:01:50,381 చొరబాటుదారుడు ఉన్నాడాని మనకి బలమైన ఆధారం ఉంది కదా... 21 00:01:50,381 --> 00:01:51,507 అదే, నల్ల రిబ్బన్. 22 00:01:51,507 --> 00:01:54,677 నల్ల రిబ్బన్ ఈ చోటిని గుల్లగుల్ల చేస్తోంది. 23 00:01:54,677 --> 00:01:58,306 మనం ఈ యాత్రకి వెళ్తే, రహస్య ప్రదేశాన్ని చూసుకోవడానికి ఎవరూ ఉండరు. 24 00:01:58,306 --> 00:02:00,475 ఏంటి, బాబూ? 25 00:02:00,475 --> 00:02:01,809 నేను ఇక్కడే ఉంటాగా. 26 00:02:01,809 --> 00:02:04,354 లేదు. నువ్వు అనాల్సింది మనిద్దరం ఇక్కడే ఉంటామని. 27 00:02:04,354 --> 00:02:06,439 నేను కూడా ఇక్కడే ఉంటా. 28 00:02:06,439 --> 00:02:09,609 అది మంచి ఆలోచనే అంటావా? స్పృహ కోల్పోతున్నావు కదా? 29 00:02:09,609 --> 00:02:10,777 అందుకే ఉంటా. 30 00:02:10,777 --> 00:02:13,863 గత రెండు యాత్రల్లో జరిగిన దాన్ని బట్టి చూస్తే, నేను ఇంట్లో ఉండటమే మీకు మంచిది. 31 00:02:13,863 --> 00:02:16,366 అదీగాక, ఇక్కడే ఉండి, నేను ఆ చొరబాటుదారుని పని పట్టాలనుకుంటున్నా. 32 00:02:16,366 --> 00:02:18,076 నీలో ఆ కసి నాకు నచ్చింది, గురూ. 33 00:02:18,076 --> 00:02:22,914 మనం ఆ నల్ల రిబ్బన్ గాడిని పట్టుకొని, ఈ దురాగతాన్ని శాశ్వతంగా మూగించేయగలమని నాకు చాలా నమ్మకంగా ఉంది. 34 00:02:22,914 --> 00:02:24,040 ఇంతేగా, అయితే. 35 00:02:24,040 --> 00:02:26,125 మన ముగ్గురం ఉండి, ఈ బంగళాకి రక్షణగా ఉందాం. 36 00:02:26,125 --> 00:02:29,295 మేము అమ్మతో కౌబాయ్స్ రాజ్యానికి బయలుదేరుతాం. 37 00:02:29,295 --> 00:02:33,216 మనం రేవు దగ్గరికి మధ్యాహ్నం వెళ్దాం. ముందు నేను ఆఫీసుకు వెళ్లాలి. 38 00:02:33,216 --> 00:02:35,093 జార్జియా నన్ను వచ్చి కలవమంది. 39 00:02:37,595 --> 00:02:41,683 నిజం చెప్పు, స్కై. నువ్వు నీలి రాయి కోసం ఎందుకు వెతుకుతున్నావు? 40 00:02:41,683 --> 00:02:42,767 అది నీకెలా తెలిసింది? 41 00:02:42,767 --> 00:02:45,562 దాని గురించి మన ఆర్కైవ్స్ లో ఉన్న ప్రతీ దాన్ని నువ్వు వెతికావు. 42 00:02:45,562 --> 00:02:50,024 మ్యూజియం నుండి దొంగిలించబడిన ఆ నీలి రాయిని నువ్వు ఎందుకు వెతికావు? 43 00:02:50,024 --> 00:02:52,485 - దొంగిలించబడిందా? - పోయిందని మేము ఎవరికీ చెప్పలేదు. 44 00:02:52,485 --> 00:02:56,531 - జార్జియా, నాకు... - అయినా కానీ నీకు దానిపై చాలా ఆసక్తి ఉంది. 45 00:02:56,531 --> 00:02:59,868 అది దొంగిలించబడిందని నాకు అస్సలు తెలీదు, ప్రమాణపూర్తిగా చెప్తున్నా. 46 00:03:00,451 --> 00:03:02,871 నేను ముందస్తుగా ప్లాన్ చేసుకుంటున్నా. 47 00:03:02,871 --> 00:03:04,664 బాబిలోనియన్ ప్రదర్శన విభాగం తర్వాత, 48 00:03:04,664 --> 00:03:07,792 నేను ఈజిప్ట్ నిధుల విభాగానికి మారదాం అనుకుంటున్నా. 49 00:03:15,383 --> 00:03:18,011 నీ చురుకుతనం అంటే నాకు మొదట్నుంచీ ఇష్టమే. 50 00:03:18,011 --> 00:03:19,888 న్యూ మెక్సికోలో సరదాగా గడపండి. 51 00:03:20,555 --> 00:03:21,598 థ్యాంక్స్. 52 00:03:24,976 --> 00:03:28,897 స్కై వాండర్హూవెన్ తనకేమీ తెలీదని బుకాయిస్తున్నా, తనకి చాలా విషయాలు తెలుసు. 53 00:03:28,897 --> 00:03:31,441 అయితే, ఈసారి ఏం తెచ్చారేంటి? 54 00:03:32,108 --> 00:03:34,777 దీన్ని మరుగు దొడ్డి నుండి కానీ తెచ్చారా? 55 00:03:35,737 --> 00:03:36,946 గుర్రపు కట్టు. 56 00:03:36,946 --> 00:03:39,032 నాకు గుర్రాలంటే చాలా ఇష్టం. 57 00:03:39,032 --> 00:03:41,409 వాటిని నేల మీద విమానాలని అనవచ్చు. 58 00:03:41,409 --> 00:03:46,080 ఇది ఓమర్ "బిగ్ ఓ" గుడ్ లక్ అనే ఒక ప్రఖ్యాత కౌబాయ్ కి చెందినది. 59 00:03:46,080 --> 00:03:47,665 బానిసత్వ నిర్మూలన ద్వారా బానిసత్వం పోయాక, 60 00:03:47,665 --> 00:03:50,627 అతను, తన సోదరులతో పాటు పశువులను కాపు కాసే పని చేశాడు. 61 00:03:50,627 --> 00:03:54,047 ఒక్క నిమిషం. నల్ల కౌబాయ్స్ కూడా ఉండేవారని స్కూలులో మాకు చెప్పలేదే. 62 00:03:54,047 --> 00:03:57,467 చరిత్రకారుల ప్రకారం, కౌబాయ్స్ లో నల్లజాతి వారు 20% దాకా ఉంటారు. 63 00:03:57,467 --> 00:03:59,385 మన కుటుంబంలో కూడా కొందరు కౌబాయ్స్ ఉన్నారు కదా, అమ్మా? 64 00:03:59,385 --> 00:04:00,887 అవును, ఉన్నారు. 65 00:04:00,887 --> 00:04:04,933 నా ముత్తాతకు తాత బడ్, ఆ రోజుల్లో పేరు మోసిన కౌబాయ్. 66 00:04:04,933 --> 00:04:08,394 బడ్ కూడా గుడ్ లక్స్ కాలంలోని కౌబాయే. 67 00:04:08,394 --> 00:04:11,022 ప్రమాదకరంగా ఉండే భూభాగాలలో 68 00:04:11,022 --> 00:04:14,859 భారీ సంఖ్యలో ఆవులను వాళ్లు ఎలా కాసే వారో ఆయన మా కుటుంబీకులకు రకరకాల కథలు చెప్పాడు. 69 00:04:14,859 --> 00:04:18,655 వాళ్లు ఆగే ప్రతి చోట, కౌబాయ్ షోలు ప్రదర్శించేవారట. 70 00:04:19,864 --> 00:04:21,616 అందుకే వాళ్లకి చాలా పేరు వచ్చింది. 71 00:04:21,616 --> 00:04:25,203 వాళ్ల జాకెట్ల మీద 777 సంఖ్యని ముద్రించుకొనే వారట, 72 00:04:25,203 --> 00:04:27,038 అలా వాళ్లెవరో అందరికీ తెలిసిపోయేదట. 73 00:04:27,038 --> 00:04:29,582 మూడు ఏడులు. అదృష్ట సంఖ్యే అది. 74 00:04:29,582 --> 00:04:30,875 తెలివైన మార్కెటింగ్ వ్యూహమే. 75 00:04:31,376 --> 00:04:34,629 ఈ కళాఖండం నాలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. 76 00:04:34,629 --> 00:04:36,172 నేను కూడా మీతో వస్తా. 77 00:04:36,839 --> 00:04:37,966 ఏమో. 78 00:04:37,966 --> 00:04:41,928 ఈ మిషన్లు చాలా ప్రమాదకరమైనవి. మేము శాపాలను హ్యాండిల్ చేస్తున్నాం. 79 00:04:41,928 --> 00:04:44,430 నేను ప్రమాదాలతో గోలీలు ఆడుకుంటా. 80 00:04:44,430 --> 00:04:48,977 నిజం చెప్పాలంటే, ఆలెక్స్ శాపవిముక్తుడై వచ్చాక, మిషన్స్ లో ఇద్దరు పెద్దవాళ్లకు అలవాటు పడిపోయా. 81 00:04:48,977 --> 00:04:51,604 అదీగాక, మార్జీ సత్తా ఏంటో మనందరికీ తెలుసు. 82 00:04:51,604 --> 00:04:52,730 మిషన్ కి స్వాగతం. 83 00:04:57,944 --> 00:05:02,198 నల్ల రిబ్బన్ గాడిని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. వాడిని ఎలా పట్టుకోవాలి? 84 00:05:02,198 --> 00:05:03,449 నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. 85 00:05:03,449 --> 00:05:07,036 రస్ రోబోట్ సాయంతో కొన్ని కళాఖండాలను హబ్ కి తరలిద్దాం, 86 00:05:07,036 --> 00:05:09,622 దాని తర్వాత "వెళ్లిపోదాం." 87 00:05:09,622 --> 00:05:12,750 అప్పుడు నల్ల రిబ్బన్ గాడు వచ్చి కళాఖండాలను చూస్తూ ఉండగా, 88 00:05:12,750 --> 00:05:15,920 మనం దాక్కున్న చోటు నుండి వచ్చి, వాడిని అదుపులోకి తీసుకుందాం. 89 00:05:16,796 --> 00:05:18,423 ప్లాన్ అదిరింది. 90 00:05:19,007 --> 00:05:23,094 నీ వ్యూహాలు నా వ్యూహాలంత గొప్పగా ఉన్నాయి. 91 00:05:24,929 --> 00:05:26,180 {\an8}న్యూ మెక్సికో 92 00:05:26,180 --> 00:05:28,808 ఇక్కడ నిజంగా చాలా అందంగా ఉంది. 93 00:05:31,227 --> 00:05:34,939 కాలి ఏర్పడిన ఆ నల్ల గుర్తులు తప్ప. 94 00:05:35,565 --> 00:05:39,068 శాపం పని మీద కాకుండా, ఇంకెప్పుడైనా ఇక్కడికి ఓసారి వెకేషన్ కి రావాలి. 95 00:05:39,068 --> 00:05:40,987 అప్పుడు మనం పాండోరాని ఒప్పించాల్సిన పని ఉండదు. 96 00:05:41,696 --> 00:05:45,533 దీన్ని చూస్తుంటే, చిన్నప్పుడు నేను సందర్శించిన మా కుటుంబ ఫార్మ్ గుర్తొస్తోంది. 97 00:05:45,533 --> 00:05:50,914 పొయ్యి వేసుకొని వంట చేసుకునే వాళ్ళం, మా తాత కౌబాయ్ గా ఉండగా, ఆయన తాడుతో చేసిన విన్యాసాలను ప్రాక్టీస్ చేసేవాళ్లం, 98 00:05:50,914 --> 00:05:52,498 ఇక సరిగ్గా నిద్రపోయే ముందు, 99 00:05:52,498 --> 00:05:55,793 మా కుటుంబ కౌబాయ్ సాహసాలను ఆయన మాకు చెప్పేవాడు. 100 00:05:55,793 --> 00:05:57,795 నువ్వు వాటిని పుస్తకం రూపంలో రాయాలి. 101 00:05:57,795 --> 00:06:00,757 మాకు కేవలం నాన్న వైపు పూర్వీకుల గురించి మాత్రమే తెలిస్తే సరిపోతుందా ఏంటి? 102 00:06:00,757 --> 00:06:03,426 మీ తాతయ్య అద్భుతమైన కౌబాయ్ ట్రిక్స్ ని మాకు నేర్పడం ద్వారా 103 00:06:03,426 --> 00:06:06,179 ఆయన గొప్పదనాన్ని నువ్వు మాకు బదిలీ చేయాలి. 104 00:06:06,179 --> 00:06:08,806 నాకు ఒకట్రెండు ట్రిక్స్ గుర్తుండవచ్చు. 105 00:06:08,806 --> 00:06:10,725 ఆ తాడును ఓసారి చూస్తా ఆగు. 106 00:06:16,272 --> 00:06:17,899 ఇక్కడ ఏదో జరుగుతోంది. 107 00:06:28,952 --> 00:06:30,495 గుడ్ లక్ సోదరులు. 108 00:06:48,680 --> 00:06:50,723 - రస్! - నన్ను వదులు! 109 00:06:54,018 --> 00:06:57,689 అయిపోయారు నా చేతిలో, చచ్చినోళ్లారా! 110 00:06:59,566 --> 00:07:00,733 ఇక్కడి నుండి దొబ్బేయండి. 111 00:07:01,317 --> 00:07:02,986 అయ్యయ్యో! మార్జీ! 112 00:07:09,826 --> 00:07:13,496 నా వల్లే ఇలా జరిగింది. నన్ను కాపాడుతూ మార్జీ ఇరుక్కుపోయింది... 113 00:07:13,496 --> 00:07:14,789 అలా అస్సలు ఆలోచించకు. 114 00:07:14,789 --> 00:07:17,709 దీనికి కారణం ఆ కౌబాయ్స్. 115 00:07:17,709 --> 00:07:19,794 మనం మార్జీని ఎలా కాపాడాలనే దానిపై దృష్టి పెట్టాలి. 116 00:07:19,794 --> 00:07:23,006 అమ్మ అన్నది నిజమే. లే. వాళ్లని పట్టుకోవాలంటే, మనం త్వరగా బయలుదేరాలి. 117 00:07:24,924 --> 00:07:26,467 ధైర్యంగా ఉండు, మార్జీ. 118 00:07:33,182 --> 00:07:34,517 నీ వల్ల నాకు కళ్లు తిరుగుతున్నాయి. 119 00:07:34,517 --> 00:07:36,769 నాకు వాంతి వస్తే, అదంతా నీ ఒళ్లోనే పడుతుంది. 120 00:08:20,980 --> 00:08:22,482 వాటిని ఎక్కడి నుండి పట్టుకొచ్చావు? 121 00:08:22,482 --> 00:08:24,817 దగ్గర్లోని అశ్వశాల నుండి అద్దెకి తెచ్చాను. 122 00:08:24,817 --> 00:08:28,947 మనం కౌబాయ్స్ ని పట్టుకోవాలంటే, మనం కూడా వాళ్ల లాగే గుర్రాల మీద వేగంగా వెళ్లాలి. 123 00:08:28,947 --> 00:08:30,490 అలా ఉండాలి. 124 00:08:30,490 --> 00:08:33,200 ఇటు వైపు ఎవరూ వెళ్లరు అని, గుర్రాలను అద్దెకి ఇచ్చిన వ్యక్తి చెప్పాడు. 125 00:08:33,200 --> 00:08:36,663 సుమారుగా వంద సంవత్సరాల క్రితం ఆరుగురు అంతుచిక్కని విధంగా ఇక్కడ తప్పిపోయారట, 126 00:08:36,663 --> 00:08:39,748 అప్పటి నుండి ఈ చోటు శాపగ్రస్థమైపోయిందట. 127 00:08:39,748 --> 00:08:43,253 కాస్త వివరంగా చెప్పమని ఆయన్ని అడిగాను, కానీ ఆయన దీని గురించి మాట్లాడటానికి సుముఖత చూపలేదు. 128 00:08:43,253 --> 00:08:45,213 దాన్ని గుట్టు తేల్చాల్సిన పని మనపై పడింది. 129 00:08:45,213 --> 00:08:47,757 కనీసం ఈ గుడ్ లక్ వాళ్లు నల్ల గుర్తుల వల్ల వాళ్లని సులభంగా ఫాలో అవ్వవచ్చులే. 130 00:08:47,757 --> 00:08:49,050 చల్! 131 00:09:10,530 --> 00:09:11,531 చల్! 132 00:09:14,826 --> 00:09:17,078 తూర్పు తిరిగి దండం పెట్టరా, వెర్రోడా. 133 00:09:17,078 --> 00:09:18,413 యాహూ! 134 00:09:29,424 --> 00:09:32,677 అదీ. ఇది చాలు మన చొరబాటుదారుడిని బయటకు రప్పించడానికి. 135 00:09:32,677 --> 00:09:34,929 అదరగొట్టేశాం. ఇక ఇక్కడి నుండి వెళ్లిపోదాం పదండి. 136 00:09:36,514 --> 00:09:38,808 ఇక చాలు, మిత్రులారా. పడుకుందాం పదండి. 137 00:09:50,361 --> 00:09:53,406 స్టాన్! ఆలెక్స్! ఎక్కడ ఉన్నారు? 138 00:09:53,406 --> 00:09:54,782 నేను ఇక్కడ ఉన్నా. 139 00:09:54,782 --> 00:09:57,660 ప్రతిధ్వనుల వల్ల మీ మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయో కనిపెట్టడం కష్టంగా ఉంది. 140 00:09:58,161 --> 00:10:01,372 చీకట్లో మాతో తలపడుతున్నావే, అసలు నువ్వు మగాడివేనా? 141 00:10:01,372 --> 00:10:03,708 దమ్ముంటే ముందుకు రా, పిరికిపంద. 142 00:10:07,086 --> 00:10:09,297 ఏం చేస్తున్నావు? నన్ను విడుదల చేయి, దుర్మార్గుడా. 143 00:10:14,761 --> 00:10:16,596 అది నల్ల రిబ్బన్ గాడి పనే అయ్యుంటుంది. 144 00:10:16,596 --> 00:10:19,224 - మన ప్లాన్ తెలిసిపోయి ఉంటుంది వాడికి. - ఎవరు నువ్వు? 145 00:10:19,224 --> 00:10:20,683 నా మిత్రులని ఏం చేశావు? 146 00:10:22,310 --> 00:10:23,728 ఆలెక్స్ సమస్యలో ఉన్నాడు. 147 00:10:31,361 --> 00:10:33,696 వావ్. పాత కోర్టు. 148 00:10:34,280 --> 00:10:38,826 అవును. ఈ చోటు వీళ్లకి చాలా ముఖ్యమైనదని తెలిసిపోతోంది. 149 00:10:39,953 --> 00:10:42,413 మార్జీని కనుగొనడంలో మనకి ఉపయోగపడేది ఇక్కడ ఏమైనా దొరికితే బాగుండు. 150 00:10:49,504 --> 00:10:52,090 దీన్ని తెరవడానికి అద్భుతమైన, అదిరిపోయే ప్లాన్ ఏమైనా నీకు తట్టిందా? 151 00:10:52,090 --> 00:10:53,383 హా, తట్టింది. 152 00:11:07,313 --> 00:11:11,317 "గుడ్ లక్ సోదరులకు, న్యూ మెక్సికోలోని లిచ్ ఫీల్డ్ ప్రజలకు మధ్య కేసు." 153 00:11:11,317 --> 00:11:12,569 "గుడ్ లక్ గుర్రపు కట్టు 1886" 154 00:11:12,569 --> 00:11:16,072 ఒక తెల్లజాతి రైతు, గుడ్ లక్ సోదరులు తన వద్ద నుండి ఏదో దొంగతనం చేశారని ఆరోపించాడట. 155 00:11:16,072 --> 00:11:18,199 ఆ సోదరులు తాము నిర్దోషులని వాదించారు, 156 00:11:19,284 --> 00:11:22,161 కానీ ఓమర్ గుడ్ లక్ కి చెందిన చాలా ఖరీదైన గుర్రపు కట్టును రుజువుగా చూపించి, 157 00:11:22,161 --> 00:11:24,873 అక్రమార్జన వల్లే దాన్ని వాళ్లు కొనగలిగారని ఆరోపించారు. 158 00:11:24,873 --> 00:11:28,251 అది కామెడీగా ఉంది. గుడ్ లక్ వాళ్లు చాలా పేరున్న కౌబాయ్స్. 159 00:11:28,918 --> 00:11:30,753 డబ్బు కోసం దొంగిలించాల్సిన అవసరం వాళ్లకి లేదు. 160 00:11:30,753 --> 00:11:32,755 ఓమర్ కి ఆ గుర్రపు కట్టును కొనడానికి, 161 00:11:32,755 --> 00:11:34,549 వారి వేతనాలను కూడా వాడామని ఓమర్ అన్నయ్యలు చెప్పారు. 162 00:11:34,549 --> 00:11:37,427 కుటుంబ వ్యాపారంలోకి అతడిని ఆహ్వానిస్తూ ఆ కానుకని ఇవ్వడం జరిగిందని వాళ్లు చెప్పారు. 163 00:11:38,511 --> 00:11:41,097 దాన్ని వాళ్లు బెన్ హార్వుడ్ అనే ఒక తెల్ల జాతీయుడి నుండి కొనుగోలు చేశారు. 164 00:11:41,723 --> 00:11:46,102 కానీ, అతను వాళ్ల తరఫున సాక్ష్యం చెప్పడానికి నిరాకరించాడు, కనీసం అమ్మిన బిల్లును అయినా చూపలేదు. 165 00:11:46,102 --> 00:11:50,064 గమ్మత్తుగా, విచారణ తర్వాత, హార్వుడ్ పై ఉన్న దొంగతనం కేసు కొట్టివేయబడింది. 166 00:11:51,024 --> 00:11:52,817 అది అన్యాయం! 167 00:11:52,817 --> 00:11:56,487 ఆ బెన్ హార్వుడే ఆ రైతు దగ్గరి నుండి దొంగిలించి, తనని తాను కాపాడుకోవడానికి అబద్ధం ఆడి ఉంటాడు. 168 00:11:56,487 --> 00:12:00,116 ఆ అవకాశం కూడా ఉంది. పంచాయితీలలో న్యాయం చాలా అరుదుగా లభిస్తుంది. 169 00:12:00,116 --> 00:12:01,701 గుడ్ లక్ సోదరులు దోషులుగా తేల్చారు, 170 00:12:01,701 --> 00:12:05,371 సూర్యోదయం అవ్వగానే, కాలినడకన పట్టణం నుండి వెళ్లిపోవాలని, అది కూడా ఎడారి గుండా వెళ్లాలని తీర్పు ఇచ్చారు. 171 00:12:06,331 --> 00:12:10,168 అలా ఎడారిలో వెళ్తే ప్రాణాలు ఉంటాయా? అది మరణ శిక్షతో సమానమే. 172 00:12:10,168 --> 00:12:12,587 నాకు తెలిసి, ఎడారిలో ఆ సోదరులు చనిపోయాక, 173 00:12:12,587 --> 00:12:15,131 వారు శాపమై ఇలా తిరిగి వచ్చుంటారు. 174 00:12:15,131 --> 00:12:17,550 క్రోధం వల్ల వాళ్ల ఆత్మలకు శాంతి లభించట్లేదు. 175 00:12:17,550 --> 00:12:21,179 వాళ్ల విచారణలో జాత్యాహంకారం జడలు విప్పిందని వాళ్లు కోపంగా ఉండుంటారు. 176 00:12:21,179 --> 00:12:22,555 నాకు కూడా అలాగే ఉంటుంది. 177 00:12:22,555 --> 00:12:24,098 ఆరుగురు కనిపించకుండా పోయారు. 178 00:12:24,098 --> 00:12:26,476 రస్, జ్యూరీలో ఎంత మంది ఉన్నారు? 179 00:12:26,476 --> 00:12:27,560 ఆరుగురు. 180 00:12:33,233 --> 00:12:37,695 మిస్టర్ గుడ్ లక్, సర్, మాది కూడా మీ పక్షమే. 181 00:12:38,488 --> 00:12:41,449 మీ విచారణలో జరిగిన అన్యాయానికి చింతిస్తున్నాం. 182 00:12:43,868 --> 00:12:45,495 సరే, కొత్త ప్లాన్. 183 00:12:45,495 --> 00:12:46,579 పరుగెత్తండి! 184 00:13:02,136 --> 00:13:04,722 నాకు విముక్తి దక్కే దాకా ఆగు. 185 00:13:04,722 --> 00:13:06,808 అప్పుడు నీ భరతం పడతాను, బాసూ. 186 00:13:11,145 --> 00:13:12,188 అబ్బా. 187 00:13:12,188 --> 00:13:15,775 నీ దగ్గర అన్ని పిచ్చి నగలు ఉన్నాయి కదా, వాటిలో ఒక్కటైనా మనకి ఉపయోగపడేది లేదా? 188 00:13:18,152 --> 00:13:21,197 హేయ్, నీ దగ్గర కూడా మనకి పనికి వచ్చేవి ఏమీ లేవులే. 189 00:13:27,620 --> 00:13:30,498 ఇంత సేపూ ఏమైపోయావు? 190 00:13:30,498 --> 00:13:33,626 మా మీద దాడి జరుగుతున్నప్పుడు నువ్వు సాయం చేసి ఉండాల్సింది. 191 00:13:35,545 --> 00:13:37,797 త్వరగా హబ్ కి పద. ఆలెక్స్ కి గాయం అయ్యి ఉండవచ్చు. 192 00:13:37,797 --> 00:13:38,965 ఇంకా దారుణమైనది జరిగి ఉండవచ్చు. 193 00:13:40,884 --> 00:13:42,260 ఆలెక్స్! 194 00:13:43,553 --> 00:13:44,762 ఏమైంది? 195 00:13:44,762 --> 00:13:45,847 నీకు గుర్తు లేదా? 196 00:13:45,847 --> 00:13:49,434 నీకు, ఆ నల్ల రిబ్బన్ గాడికి మధ్య జగడం నేను అనుకున్న దాని కన్నా హింసాత్మకంగా జరిగింది. 197 00:13:49,434 --> 00:13:52,562 వాడు మాపై మెరుపు దాడి చేసి, ఏదో ఖైదీల్లా మమ్మల్ని బంధించాడు, 198 00:13:52,562 --> 00:13:55,190 ఆ తర్వాత నిన్ను బాగా కొట్టాడు. 199 00:13:56,357 --> 00:13:57,817 ఏంటి? అది నిజమే. 200 00:13:57,817 --> 00:13:59,277 నువ్వు అతడిని బాగా చూశావా? 201 00:13:59,277 --> 00:14:01,946 లేదు. ఇది నాకు నచ్చట్లేదు. 202 00:14:01,946 --> 00:14:04,449 నల్ల రిబ్బన్ గాడు రానురాను మరింత ప్రమాదకరంగా తయారవుతున్నాడు. 203 00:14:20,381 --> 00:14:22,508 మీరిద్దరూ ఆ తలుపుల గుండా లోపలికి వెళ్లాలి. 204 00:14:23,509 --> 00:14:25,428 నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. 205 00:14:36,356 --> 00:14:37,815 దొరికావు. 206 00:14:37,815 --> 00:14:39,609 మొదటి విషయం ఏంటంటే, ఇదంతా సూపర్ గా జరిగింది. 207 00:14:39,609 --> 00:14:41,611 రెండవ విషయానికి వస్తే, ఇప్పుడు అసలేం జరిగింది? 208 00:14:41,611 --> 00:14:42,987 పాత కౌబాయ్ రోజుల్లో, 209 00:14:42,987 --> 00:14:46,241 దెయ్యాలను దూరంగా ఉంచడానికి ఇళ్లలో గుర్రపుడెక్కలను పెట్టుకునేవారు. 210 00:14:46,241 --> 00:14:47,408 అది పని చేస్తోంది అనుకుంటా. 211 00:14:47,408 --> 00:14:48,785 మార్జీని ఏం చేశావు? 212 00:14:48,785 --> 00:14:50,161 తను ఎక్కడ ఉంది? 213 00:14:50,161 --> 00:14:52,664 కాస్త మెల్లగా, అరవకుండా అడుగుదాం. 214 00:14:52,664 --> 00:14:56,084 మీకు ఏం జరిగిందో నాకు తెలుసు, మీకు శాపం నుండి విముక్తి కలిగించాలనే చూస్తున్నాం మేము. 215 00:14:56,084 --> 00:14:58,795 కానీ మా నేస్తం బాగానే ఉందని మేము నిర్ధారించుకోవాలి. 216 00:15:14,185 --> 00:15:15,895 అతను నా గుర్రాన్ని దొంగిలించాడు. 217 00:15:15,895 --> 00:15:18,273 మంచిగా పోదాం అనుకొని, సంచి పోగొట్టుకున్నావు కదా, రస్. 218 00:15:18,273 --> 00:15:20,692 మెల్లగా, నిదానంగా వెంబడిద్దామా అతడిని? 219 00:15:23,903 --> 00:15:25,405 అతడిని ఎలా కనుగొనాలి? 220 00:15:25,405 --> 00:15:28,491 అతను చాలా దూరం వెళ్లిపోయుంటాడు, ఆ గుర్రం కూడా కాలిన నల్ల గుర్తులను వదల్లేదు. 221 00:15:28,491 --> 00:15:30,243 గంధకం వాసనని ఫాలో అవుదాం. 222 00:15:30,827 --> 00:15:31,870 చల్! 223 00:15:34,038 --> 00:15:36,875 అతను ఇటు వెళ్లాడు. ఇక బయలుదేరుదాం. 224 00:15:53,683 --> 00:15:55,143 గంధకం కంపు బాబోయ్. 225 00:15:55,143 --> 00:15:57,979 ఈ కుండల్లో గంధకం ఉంది. 226 00:16:01,649 --> 00:16:02,859 మార్జీ! 227 00:16:02,859 --> 00:16:04,277 నువ్వు బాగానే ఉన్నావా? 228 00:16:04,277 --> 00:16:06,988 లేను, నేను అస్సలు బాగాలేను. 229 00:16:19,500 --> 00:16:22,462 ఆరుగురు ఉన్నారు. వారు జ్యూరీ సభ్యులు అయ్యుంటారు. 230 00:16:22,462 --> 00:16:24,714 వాళ్లకి కూడా శాపం ఉంది. 231 00:16:24,714 --> 00:16:26,758 మనల్ని ఆ లోపలికి వెళ్లమంటున్నారా ఏంటి? 232 00:16:26,758 --> 00:16:28,426 మీరే వెళ్లవచ్చు కదా? 233 00:16:28,426 --> 00:16:30,970 కారణం నాకు తెలుసు అనుకుంటా. వాళ్లు వెళ్లలేరు. 234 00:16:30,970 --> 00:16:32,722 గుర్రపుడెక్క వల్ల వాళ్లు వెళ్లలేకపోతున్నారు. 235 00:16:32,722 --> 00:16:35,391 వాళ్లకి కావాల్సిందేదో లోపల ఉంది, దాన్ని మనమే తీసుకురావాలి. 236 00:16:35,391 --> 00:16:38,895 మీరు మార్జీని వదిలిపెడితేనే, మేము లోపలికి వెళ్తాం. 237 00:16:43,525 --> 00:16:46,194 బాబోయ్. నాకేం అవుతోంది? 238 00:16:46,194 --> 00:16:47,612 అయ్యయ్యో! తనని ఏమీ చేయకండి! 239 00:16:47,612 --> 00:16:49,447 తనకి ఎక్కువ సమయం లేదు. 240 00:16:49,447 --> 00:16:51,574 మనం వెళ్లాలి. త్వరగా వెళ్లాలి. 241 00:17:00,750 --> 00:17:03,711 దయచేసి నన్ను నలిపేయవద్దు. 242 00:17:11,802 --> 00:17:13,012 దీన్ని మనం ఎలా దాటాలి? 243 00:17:13,012 --> 00:17:15,389 అంత దూరం అంటే మన ముగ్గురిలో ఏవరమూ దూకలేము. 244 00:17:21,479 --> 00:17:23,481 వావ్. ఎలా చేశావు అలా? 245 00:17:23,481 --> 00:17:26,442 అమ్మ చెప్పింది విన్నావుగా. మనవి కౌబాయ్ జీన్స్. 246 00:17:31,406 --> 00:17:32,699 ఇక్కడికి ఊగుకుంటూ వచ్చి, తాడును పంపేయ్. 247 00:17:42,709 --> 00:17:43,710 రస్! 248 00:17:46,421 --> 00:17:48,464 అయ్యయ్యో. సారీ, అమ్మా. 249 00:17:48,464 --> 00:17:50,174 కిందకి చూడకు. 250 00:17:54,220 --> 00:17:55,930 అయ్యయ్యో! 251 00:18:00,935 --> 00:18:02,604 త్వరగా కానివ్వు! ఇది పేలిపోబోతుంది! 252 00:18:20,371 --> 00:18:21,956 - నువ్వు బాగానే ఉన్నావా? - నేను బాగానే ఉన్నా. 253 00:18:21,956 --> 00:18:23,208 తృటిలో ప్రమాదం తప్పింది. 254 00:18:23,208 --> 00:18:26,586 వెనక్కి వెళ్లేటప్పుడు ఈ సాహసం మాత్రం చేయకూడదు. 255 00:18:35,803 --> 00:18:37,222 నాకు దగ్గరగా ఉండండి. 256 00:18:37,222 --> 00:18:39,265 ఇక్కడేదీ సరిగ్గా కనిపించట్లేదు, కాబట్టి మనకేమీ... 257 00:18:41,142 --> 00:18:42,143 సర్ప్రైజులు వద్దు. 258 00:18:50,818 --> 00:18:53,696 చూస్తుంటే, ఎవరో ఇక్కడ చాలా కాలం ఉండాలని వచ్చినట్టున్నారు. 259 00:19:03,540 --> 00:19:05,500 ఈ సర్ప్రైజ్ తట్టుకోలేములే. 260 00:19:05,500 --> 00:19:07,210 ఒక్క నిమిషం, ఇక్కడ ఇంకేదో ఉంది. 261 00:19:09,629 --> 00:19:10,672 అమ్మకాల పుస్తకం. 262 00:19:10,672 --> 00:19:13,633 గుర్రపు కట్టును గుడ్ లక్ సోదరులు కొనుగోలు చేశారు అన్నదానికి ఆధారం. 263 00:19:13,633 --> 00:19:16,678 అయితే, ఈ దురదృష్టవంతుడు బెన్ హార్వుడ్ అయ్యుంటాడు. 264 00:19:16,678 --> 00:19:20,557 అమ్మకాల పుస్తకాన్ని దాచి పెట్టడానికి, అలాగే ఇతను కూడా దాక్కోవడానికి ఇక్కడికి వచ్చి ఉంటాడు. 265 00:19:21,266 --> 00:19:23,810 బండరాళ్లు పడటం వల్ల చనిపోయినట్టున్నాడు. 266 00:19:23,810 --> 00:19:26,604 గుర్రపుడెక్కని పెట్టింది ఇతనే అయ్యి ఉంటాడు. 267 00:19:26,604 --> 00:19:28,648 గుడ్ లక్ సోదరులు జ్యూరీ సభ్యుల పని పట్టాక, 268 00:19:28,648 --> 00:19:31,818 ఏ క్షణమైనా ఇతని పని పట్టడానికి కూడా వస్తారని గ్రహించి ఉంటాడు. 269 00:19:31,818 --> 00:19:34,988 దీని సాయంతో వాళ్లు అమాయకులని రుజువు చేసి, వారి శాపాన్ని కూడా తరిమివేయవచ్చు మనం. 270 00:19:34,988 --> 00:19:37,365 మార్జీ కూడా దెయ్యం కాక ముందే, త్వరగా వెళ్దాం. 271 00:19:42,537 --> 00:19:46,791 నా దగ్గర మిస్టర్ బెన్ హార్వుడ్ కి చెందిన అమ్మకాల పుస్తకం ఉంది. 272 00:19:48,710 --> 00:19:53,423 ఇందులో ఒక గుర్రపు కట్టు కొనడానికి రెండు వాయిదా పద్ధతుల్లో డబ్బును చెల్లించినట్టు రాసి ఉంది, 273 00:19:53,423 --> 00:19:55,800 ఆ వాయిదాలను, వంతుల వారీగా గుడ్ లక్ సోదరుల్లో పెద్దవారు చెల్లించినట్టు రాసుంది. 274 00:19:55,800 --> 00:19:58,887 రుజువు ఇక్కడ స్పష్టంగా ఉంది. గుర్రపు కట్టును సక్రమంగానే కొన్నారు. 275 00:19:58,887 --> 00:20:01,180 దీనికి న్యాయంగా ఓమర్ గుడ్ లకే యజమాని. 276 00:20:04,309 --> 00:20:07,145 ఇంకా, వాళ్ల విషయంలో గుర్రపు కట్టును రుజువుగా పరిగణించారు కాబట్టి, 277 00:20:07,145 --> 00:20:08,479 ఇప్పుడు వాళ్లకి విరుద్ధంగా ఆధారమే లేదు. 278 00:20:10,982 --> 00:20:15,153 మీ తీర్పును వాళ్లు నిర్దోషులు అని మార్చాలనుకుంటే, దయచేసి మీ చేతులను ఎత్తండి. 279 00:21:03,326 --> 00:21:05,787 వేరేగా అనుకోవద్దు, నాకు గుర్రాల స్వారీ అంటే ఇష్టమే, 280 00:21:05,787 --> 00:21:08,706 కానీ ఈసారి విమానాలు నడిపే పని మాత్రమే చూసుకుంటాలే. 281 00:21:08,706 --> 00:21:09,958 అబ్బా, భలే దానివే. 282 00:21:09,958 --> 00:21:12,460 అతీత శక్తులని ఎదుర్కునే క్రమంలో మన ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం అనేది 283 00:21:12,460 --> 00:21:14,504 అలవాటయ్యే కొద్దీ, పెద్ద కష్టంగా అనిపించదులే. 284 00:21:16,714 --> 00:21:20,134 చూడండి. మనపై నిఘా పెడుతున్న వ్యక్తి. నల్ల రిబ్బన్ గాడు. 285 00:21:20,134 --> 00:21:22,387 నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు? 286 00:21:23,471 --> 00:21:26,307 ఏంటి... అతను అక్కడే ఉన్నాడు, నిజంగా చెప్తున్నా. 287 00:21:26,307 --> 00:21:28,184 ఇక్కడేం జరుగుతోంది? 288 00:21:29,561 --> 00:21:31,187 మేము శాపాన్ని తరిమేశాక, 289 00:21:31,187 --> 00:21:33,189 అమ్మకాల పుస్తకాన్ని ప్రభుత్వ చారిత్రక మ్యూజియానికి తీసుకెళ్లాం, 290 00:21:33,189 --> 00:21:34,607 వాళ్లు దాన్ని గవర్నర్ వద్దకి తీసుకెళ్లారు. 291 00:21:34,607 --> 00:21:37,026 వచ్చే వారం, అధికారికంగా గుడ్ లక్ సోదరులని నిర్దోషులుగా ప్రకటిస్తారు. 292 00:21:37,026 --> 00:21:40,989 వావ్. మీరు ఎన్నో సాహసాలు చేసినా, ఈ సాహసం కొత్తగా, మరింత సూపర్ గా ఉన్నట్టుంది. 293 00:21:40,989 --> 00:21:44,576 దురదృష్టవశాత్తూ, మాకు చేదు అనుభవం ఎదురైంది. 294 00:21:44,576 --> 00:21:46,494 మాపై నల్ల రిబ్బన్ గాడు దాడి చేశాడు. 295 00:21:46,494 --> 00:21:48,288 అయ్య బాబోయ్. నీకేమీ కాలేదు కదా? 296 00:21:48,288 --> 00:21:49,372 నాకేమీ కాదులే. 297 00:21:49,372 --> 00:21:52,250 వాడిని కళ్ళారా చూసే లోపే, వాడు నన్ను కొట్టి స్పృహ తప్పేలా చేశాడు, అందుకే నాకు చిరాగ్గా ఉంది. 298 00:21:52,250 --> 00:21:56,045 ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, అదే రోజు సాయంత్రం, అక్కడికి దగ్గర్లోని పట్టణంలో ఉండే 299 00:21:56,045 --> 00:21:59,674 ఆక్షన్ల కార్యాలయం నుండి ఇంకో కళాఖండం చోరీకి గురైందని వార్తల్లో చెప్పారు. 300 00:21:59,674 --> 00:22:02,802 నేను రేవు దగ్గర చూసిన వ్యక్తే దొంగతనం చేసుంటాడు, అందులో ఏ సందేహమూ లేదు. 301 00:22:02,802 --> 00:22:05,138 దాదాపు అదే సమయంలో జరిగింది కాబట్టి, అతనే అయ్యుంటాడు. 302 00:22:05,138 --> 00:22:06,973 నీ అంచనా సరైనదే ఏమో. 303 00:22:06,973 --> 00:22:12,020 ఆ నల్ల రిబ్బన్ గాడు ఎవడో కానీ, రాను రాను దూకుడుగా, ప్రమాదకరంగా మారుతున్నాడు. 304 00:23:02,320 --> 00:23:04,322 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్