1 00:00:17,789 --> 00:00:19,832 నన్ను ఎందుకు ఈతకు పంపించట్లేదు? 2 00:00:19,832 --> 00:00:22,210 నీటిలో బన్యిప్ ఉంటుంది, అది నిన్ను హాంఫట్ చేసేస్తుంది. 3 00:00:22,794 --> 00:00:27,799 ఆస్ట్రేలియాలో ఉండే సరస్సులన్నింటిలో ఒక భయంకరమైన మృగం ఉంటుంది. 4 00:00:27,799 --> 00:00:30,134 అది చాలా క్రూరమైనది, చాలా పెద్దగా ఉంటుంది, పళ్లు పదునుగా ఉంటాయి. 5 00:00:30,134 --> 00:00:31,844 పొలుసులు, ఈకలు ఉంటాయి. 6 00:00:32,344 --> 00:00:35,682 అనేక జంతువుల భాగాలతో తయారైన మృగం అది, 7 00:00:35,682 --> 00:00:38,309 ఆ జంవుతులన్నీ భయంకరమైనవే. 8 00:00:38,893 --> 00:00:41,437 దాన్ని భయంకరమైన అరుపు, కీచుమంటూ వినిపిస్తుంది. 9 00:00:42,146 --> 00:00:44,732 అది వెన్నులో వణుకు పుట్టిస్తుంది. 10 00:00:45,275 --> 00:00:51,531 ఈరోజు అమావాస్య కదా, ఇలాంటి చీకటి అమావాస్య రాత్రుళ్లో, ఆ భయంకరమైన మృగం సంచరిస్తూ ఉంటుంది. 11 00:00:52,323 --> 00:00:56,911 అందుకే రాత్రి వేళ ఒంటరిగా ఈతకి వెళ్లకూడదు. 12 00:00:56,911 --> 00:00:58,162 భలేదానివే, అమ్మా. 13 00:00:58,162 --> 00:01:00,498 బన్యిప్స్ లేవు, ఏమీ లేవు. 14 00:01:00,498 --> 00:01:01,791 అంతే అంటావా? 15 00:01:02,542 --> 00:01:03,751 నువ్వేదంటే అది. 16 00:01:29,819 --> 00:01:32,405 డిడ్జెరిడూ 17 00:01:42,040 --> 00:01:43,750 పచ్చదనపు పరిమళం. 18 00:01:44,292 --> 00:01:47,337 ఇక్కడి నుండి రవి కిరణాలు సోకిన ప్రకృతి అందాలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి. 19 00:01:47,337 --> 00:01:50,882 అయ్యయ్యో, మాకు ఇదంతా రహస్య ప్రదేశంలో ఉండదు. 20 00:01:51,382 --> 00:01:52,759 ఇంకేంటో ఉందే ఇక్కడ. 21 00:01:52,759 --> 00:01:55,386 అందులో పక్షులకు ఆహారం పెట్టవచ్చు, కానీ ఒక్క పక్షి కూడా రావట్లేదు. 22 00:01:55,386 --> 00:01:56,930 ఈ అసైన్మెంట్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, 23 00:01:56,930 --> 00:02:00,266 మనుషులు ప్రకృతితో సానుకూల పద్ధతిలో ఎలా ఇంటరాక్ట్ అవ్వగలరో చూపడం, 24 00:02:00,266 --> 00:02:03,728 కాబట్టి నేను ఇంటరాక్ట్ అవ్వడానికి నాకు కొన్ని పక్షులు కావాలి. 25 00:02:04,395 --> 00:02:07,899 ఈ కుటుంబంలో జంతువుల భాష అర్థమయ్యేది నాకే. కాబట్టి ఇది నాకు చాలా తేలికగా అయిపోతుంది. 26 00:02:08,398 --> 00:02:10,360 లిండా గార్డెన్ ని అందంగా ఎలా మార్చేశానో చూడు. 27 00:02:10,360 --> 00:02:11,653 దానికి బాగా నచ్చింది. 28 00:02:11,653 --> 00:02:14,822 శాస్త్రీయ ప్రక్రియలో వైఫల్యం కూడా భాగమే అని ఆలెక్స్ చెప్తుంటాడు. 29 00:02:15,532 --> 00:02:18,201 - ఏంటది? - అదొక పక్షి! 30 00:02:18,201 --> 00:02:20,954 చూశావా? రావడం ఆలస్యం అవుతుందేమో కానీ, రావడం మాత్రం పక్కా. 31 00:02:23,998 --> 00:02:25,416 ఏం చేస్తోంది అది? 32 00:02:25,416 --> 00:02:28,336 ఎర్ర కళ్లు! మనం అలాంటి కళ్లని గతంలో కూడా చూశాం. 33 00:02:28,336 --> 00:02:30,171 ఈ పక్షికి శాపం తగిలినట్టుగా ఉంది. 34 00:02:37,095 --> 00:02:38,513 ఏం చేస్తున్నావు! 35 00:02:40,181 --> 00:02:42,392 ఇప్పుడు నేను ఈ రంధ్రాన్ని బాగు చేసుకోవాలి. 36 00:02:45,103 --> 00:02:46,104 పరుగెత్తు! 37 00:02:59,784 --> 00:03:01,286 ఏం జరుగుతోంది? 38 00:03:01,286 --> 00:03:02,829 ఎక్కడికి వెళ్తోంది అది? 39 00:03:12,589 --> 00:03:14,424 ఏంటా శబ్దం? 40 00:03:14,424 --> 00:03:17,969 ఈ డిడ్జెరిడూ శబ్దం వినే ఈ పక్షి ఇక్కడికి వచ్చింది. 41 00:03:17,969 --> 00:03:20,513 కానీ, ఆ డిడ్జెరిడూ దానికదే ప్లే అవుతోందే. 42 00:03:21,764 --> 00:03:23,600 అయితే, మనం దాన్ని ఆపాలి. 43 00:03:23,600 --> 00:03:25,018 దీన్ని బ్లాక్ చేసేద్దాం. 44 00:03:25,018 --> 00:03:27,353 దేనితో? ఇక్కడ అన్నీ శాపగ్రస్థమైనవే. 45 00:03:28,688 --> 00:03:32,108 హబ్ లో స్టాన్లీ క్లీనింగ్ కిట్ ఉంది. మాకు సాయపడు, రస్. 46 00:03:38,781 --> 00:03:40,366 నాకు చక్కిలిగింతలు పుడుతున్నాయి. 47 00:03:40,366 --> 00:03:44,454 ఈ డిడ్జెరిడూ శబ్దానికి నా శరీరమంతా వైబ్రేట్ అవుతోంది. 48 00:03:53,463 --> 00:03:56,424 రా, పక్షి మిత్రమా. నిన్ను బయట వదిలిపెడతాను, పద. 49 00:04:00,720 --> 00:04:02,889 ఇక్కడ తీగ కొరకబడి ఉందే. 50 00:04:07,685 --> 00:04:10,188 డిడ్జెరిడూ ఆస్ట్రేలియాకి చెందినదని అర్థమైపోతోంది. 51 00:04:10,188 --> 00:04:14,526 క్వీన్స్ ల్యాండులోని ఒక వ్యాపారవేత్త నుండి కొర్నీలియస్ దీన్ని సంపాదించినట్టు ఇక్కడ రాసుంది. 52 00:04:14,526 --> 00:04:17,110 దీని శబ్దాన్ని విని పక్షులు దాడి చేస్తాయి, అదే శాపం. 53 00:04:17,110 --> 00:04:19,112 హా, అది మాకు అర్థమైందిలే. 54 00:04:21,157 --> 00:04:23,409 ఈ గుర్తును నేను ఇంతకుముందు చూశాను. 55 00:04:23,409 --> 00:04:25,745 స్థానిక ఆస్ట్రేలియన్ గుహలోని పెయింటింగ్స్ లో ఇది కూడా ఉండింది. 56 00:04:25,745 --> 00:04:27,288 ఇది నీటికి గుర్తు. 57 00:04:28,748 --> 00:04:31,042 ఈ విచిత్రమైన పక్షి ఏంటి? 58 00:04:31,626 --> 00:04:34,837 అదేంటో అర్థం కావట్లేదు, కానీ ఇతర గుర్తులను చూస్తుంటే మొసలి గుర్తొస్తోంది. 59 00:04:34,837 --> 00:04:36,965 ఈ ఫోటోలను నా స్నేహితురాలైన, ఇనాలాకి పంపిస్తాను. 60 00:04:36,965 --> 00:04:39,926 తను స్థానిక ఆస్ట్రేలియన్ వాసి, వారి జానపద చరిత్ర గురించి తను అధ్యయనం చేస్తోంది. 61 00:04:43,596 --> 00:04:45,640 ఆస్ట్రేలియాకి వెళ్తున్నందుకు నాకు చాలా ఉత్సాహంగా ఉంది. 62 00:04:45,640 --> 00:04:47,892 నాకు కూడా... ఉత్సాహంగా ఉంది అనాలా? 63 00:04:47,892 --> 00:04:52,939 ఈ అత్యంత ప్రమాదకరమైన సాహసంలో మీతో పాల్గొనడానికి నేను సర్వ సన్నద్ధంగా ఉన్నాను. 64 00:04:52,939 --> 00:04:54,190 నిజంగానేనా? 65 00:04:54,190 --> 00:04:56,860 కంగారుపడకు. ఎక్స్ ప్లోరర్ బ్యాగ్ కూడా తగిలించుకున్నా. 66 00:04:56,860 --> 00:04:58,528 అది మంచి ఆలోచన అంటావా? 67 00:04:59,195 --> 00:05:02,031 ఆలెక్స్, నల్ల రిబ్బన్ గాడు నీపై దాడి చేసినప్పుడు నేను లేను. 68 00:05:02,031 --> 00:05:04,659 ఈసారి, నీకేమైనా అయితే, దగ్గరుండి కాపాడతాను. 69 00:05:04,659 --> 00:05:09,455 రహస్య ప్రదేశానికి, ఇంకా ఈ కుటుంబానికి పరిరక్షకుడిగా అది నా బాధ్యత. 70 00:05:09,455 --> 00:05:12,125 నీకు ఇంకోసారి స్పృహ తప్పే అవకాశం ఉంది, నాన్నా. 71 00:05:12,125 --> 00:05:15,086 బయాలజీ ఫైనల్ పరీక్ష ఉంది, అందుకని నేను ఇక్కడే ఉండాలి. 72 00:05:15,086 --> 00:05:17,130 చదువులని అర్థం చేసుకొని, మనకి అనుకూలంగా వాడుకోవాలి, బాసూ. 73 00:05:17,130 --> 00:05:20,758 ఈ ట్రిప్పుకు వెళ్తున్నందుకు, నా అసైన్మెంటుపై మిస్ లీ నాకు అదనంగా ఒక క్రెడిట్ ఇస్తోంది. 74 00:05:20,758 --> 00:05:23,970 ప్రదర్శన విభాగం విషయంలో చాలా పని పెండింగ్ ఉంది, కాబట్టి నేను రాలేను. 75 00:05:23,970 --> 00:05:28,016 ఇతరులు స్టాన్లీని చూసి, బొమ్మ అనే అనుకుంటారు, 76 00:05:28,016 --> 00:05:30,018 కాకపోతే, తను బొమ్మలా నటించాలి, అంతే. 77 00:05:30,018 --> 00:05:31,936 అది నాకు తేలికే. 78 00:05:32,770 --> 00:05:34,314 స్టాన్లీ, నువ్వు బాగానే ఉన్నావా? 79 00:05:35,023 --> 00:05:36,316 నేను మాట్లాడలేను. 80 00:05:36,316 --> 00:05:39,027 నేను బొమ్మని. 81 00:05:39,027 --> 00:05:42,071 - సరే. స్టాన్లీ రావచ్చు. - థ్యాంక్యూ! 82 00:05:42,071 --> 00:05:44,616 నీకు, అస్సలు ఇబ్బంది కలిగించను. 83 00:05:45,491 --> 00:05:46,618 కంగారుపడకు, స్టాన్లీ. 84 00:05:46,618 --> 00:05:49,954 ఇందులో ఉండేది కిందపడిపోకుండా లైనింగ్ ని అంతా గట్టిగా ఉండేలా చేశాను. 85 00:05:55,168 --> 00:05:57,420 ఈసారి మనం వాపసు ఇచ్చేసేది ఇదా? 86 00:05:57,420 --> 00:05:59,297 చూడటానికి, ప్రమాదకరమైనదిలా అనిపించట్లేదే. 87 00:05:59,297 --> 00:06:01,299 మనం వాపసు ఇచ్చేసేది ఇది. 88 00:06:01,299 --> 00:06:03,843 ఇతడిని నువ్వు కలవడం ఇదే మొదటిసారి. 89 00:06:04,427 --> 00:06:06,221 ఇతను స్టాన్లీ, మా నేస్తం. 90 00:06:06,221 --> 00:06:08,014 రహస్య ప్రదేశానికి పరిరక్షకుడు ఇతను. 91 00:06:09,515 --> 00:06:11,476 నువ్వు బొమ్మలా నటించడం ఆపవచ్చు. 92 00:06:11,476 --> 00:06:13,686 నమస్కారం, వందనం. 93 00:06:15,688 --> 00:06:18,691 నీకు నేను తప్ప ఇంకో మనిషి ఎవరూ స్నేహితులు లేరా? 94 00:06:21,778 --> 00:06:23,404 విమాన ప్రయాణం గురించి పరిశోధించడానికి, 95 00:06:23,404 --> 00:06:26,407 నిజంగా ప్రయాణం చేయడానికి చాలా తేడా ఉంది. 96 00:06:26,991 --> 00:06:28,409 వచ్చేశామా? 97 00:06:30,119 --> 00:06:31,246 ఏం జరుగుతోంది? 98 00:06:31,246 --> 00:06:33,540 వాతావరణం కాస్త బాగాలేదు, మిత్రులారా. 99 00:06:35,792 --> 00:06:37,126 అయ్యయ్యో. 100 00:06:37,126 --> 00:06:38,503 ఓరి నాయనోయ్! 101 00:06:39,254 --> 00:06:40,463 పక్షి! 102 00:06:41,714 --> 00:06:44,175 ఎర్ర కళ్లు. ఎర్ర కళ్లు! 103 00:06:44,175 --> 00:06:46,302 నాకు ఎవరినీ కంగారు పెట్టాలని లేదు, 104 00:06:46,302 --> 00:06:50,223 కానీ ఈ పక్షుల్లో ఏదైనా ఇంజిన్ లోకి వెళ్తే, విమానం కూలిపోగలదు. 105 00:06:50,223 --> 00:06:52,392 అది విని కంగారుపడకుండా ఎలా ఉండగలను? 106 00:06:56,145 --> 00:06:57,313 గట్టిగా పట్టుకోండి. 107 00:07:03,570 --> 00:07:04,779 స్టాన్లీ! 108 00:07:21,254 --> 00:07:23,339 అందరూ ఓకేనా? 109 00:07:23,339 --> 00:07:25,717 మేము బాగానే ఉన్నాం. బాగా నడిపావు, మార్జీ. 110 00:07:26,551 --> 00:07:28,595 గాల్లో గిరగిరా భలే ఎగురుతున్నావు, స్టాన్లీ. 111 00:07:28,595 --> 00:07:30,805 నేల మీద రెండు కాళ్లపై దిగడం మీద ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేయాలి. 112 00:07:37,896 --> 00:07:39,314 అంతా ఓకేనా, స్కై? 113 00:07:39,314 --> 00:07:41,774 ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నావు. 114 00:07:42,358 --> 00:07:45,361 బాగానే ఉన్నాను. ఈ ప్రదర్శన విభాగం విషయంలో కాస్త ఆరాటంగా ఉంది. 115 00:07:45,361 --> 00:07:46,613 నిజంగానా? 116 00:07:46,613 --> 00:07:49,532 సార్గోన్ సింహాసనం త్వరలో రానుందని నాకు తెలుసు. 117 00:07:49,532 --> 00:07:51,659 దాని వల్ల ఒత్తిడి కదా నీకు కలగాల్సింది! 118 00:07:51,659 --> 00:07:53,661 దాని గురించి కాదులే. 119 00:07:54,245 --> 00:07:58,208 నిజానికి, ఎవరో మా ఇంట్లోకి చొరబడి కొన్ని వస్తువులని దొంగిలించారు. 120 00:07:58,208 --> 00:08:00,126 నా కుటుంబానికి ఏమైనా అవుతుందేమో అని భయంగా ఉంది. 121 00:08:00,126 --> 00:08:02,337 అయ్యయ్యో. 122 00:08:02,337 --> 00:08:06,216 మీ ఇంట్లో కూడా, చాలా మంది కోరుకునే కళాఖండాలు చాలానే ఉన్నాయి కదా. 123 00:08:06,216 --> 00:08:09,969 ఒకవేళ ఇక్కడ జరిగిన దొంగతనానికి, మీ ఇంట్లో జరిగిన దొంగతనానికి సంబంధం ఏదైనా ఉందా? 124 00:08:09,969 --> 00:08:11,512 సంబంధం ఉండి ఉండదులే. 125 00:08:11,512 --> 00:08:15,308 ఒకటి చెప్పనా, మా భద్రతా సిబ్బందిలోని ఒకరిని మీ ఇంటికి కాపలాగా పంపుతాను. 126 00:08:15,308 --> 00:08:17,477 మా సిబ్బంది బాగోగులను మేమే చూసుకుంటాం. 127 00:08:17,477 --> 00:08:19,062 అతనితో ఇప్పుడే మాట్లాడతాను. 128 00:08:27,028 --> 00:08:29,113 మనం చాలా సేపటి నుండి ప్రయాణిస్తూనే ఉన్నాం. 129 00:08:29,113 --> 00:08:31,366 ఈ దేశం నేను ఊహించిన దాని కన్నా చాలా పెద్దగా ఉంది. 130 00:08:31,366 --> 00:08:32,367 {\an8}ఇనాలా 131 00:08:33,493 --> 00:08:35,245 సరే, బొమ్మ గారు. 132 00:08:35,245 --> 00:08:39,040 - గుర్తుంది కదా. - శబ్దం చేయను. అస్సలు కదలను. 133 00:08:42,709 --> 00:08:43,628 కాల్ వస్తోంది 134 00:08:43,628 --> 00:08:46,172 హేయ్, మిత్రమా. ఆస్ట్రేలియాకి స్వాగతం. 135 00:08:46,172 --> 00:08:48,883 నాకు కూడా మీతో ఉండాలని ఉంది, కానీ నేను నీలి పర్వతాల దగ్గర ఉన్నాను. 136 00:08:48,883 --> 00:08:50,343 అవి ఎందుకు నీలంగా ఉంటాయంటే... 137 00:08:50,343 --> 00:08:53,596 యూకలిప్టస్ చెట్లలోని ఆయిల్ ఆవిరై గాల్లో కలుస్తుంది. 138 00:08:54,514 --> 00:08:56,683 వావ్, జ్ఞానంలో నువ్వే పిస్తావని నిరూపించావు. 139 00:08:57,642 --> 00:08:59,269 తను నా కూతురు, పాండోరా. 140 00:08:59,269 --> 00:09:01,354 హేయ్, ఇనాలా. మీ హారం చాలా బాగుంది. 141 00:09:01,855 --> 00:09:03,106 థ్యాంక్యూ, పాండోరా. 142 00:09:03,106 --> 00:09:06,693 మా సంస్కృతిలో, పుట్టినప్పుడు ఒక్కొక్కరికీ ఒక్కో జంతువును ఇలా గుర్తుగా ఇస్తారు. 143 00:09:06,693 --> 00:09:09,320 ఆ జంతువు మనది అయిపోతుందన్నమాట, దాన్ని మనం కాపాడుకోవాలి, దాని నుండి నేర్చుకోవాలి. 144 00:09:09,320 --> 00:09:10,697 నాకు కంగారూను కేటాయించారు. 145 00:09:10,697 --> 00:09:14,993 ఇందులో ఎనలేని శక్తి ఉంటుంది, అదే సమయంలో అది శ్రద్ధగా, ప్రేమగా కూడా చూసుకుంటుంది. 146 00:09:14,993 --> 00:09:17,537 ఎప్పటికీ పట్టువదలని అద్భుతమైన సారథి అన్నమాట. 147 00:09:18,288 --> 00:09:20,123 ఈ లక్షణాలు నాకు తెలిసిన వారికి కూడా ఉన్నాయే. 148 00:09:20,123 --> 00:09:21,416 నేను డైరెక్షన్స్ పంపాను, వచ్చాయా? 149 00:09:21,416 --> 00:09:24,836 హా. థ్యాంక్స్. మేము ఇప్పుడు ఆ సరస్సు దగ్గరికే వెళ్తున్నాం. 150 00:09:24,836 --> 00:09:27,422 గుర్తులని బట్టి చూస్తే, అది క్వీన్స్ ల్యాండ్ తెగకి చెందినదిగా అనిపిస్తోంది. 151 00:09:27,422 --> 00:09:29,799 వాళ్ళ సరస్సులో ఒక పెద్ద యూకలిప్టస్ చెట్టు ఉంది, 152 00:09:29,799 --> 00:09:31,301 ఆ చెట్టు నుండే వారు డిడ్జెరిడూలను చేసుకుంటారు. 153 00:09:31,301 --> 00:09:32,886 చాలా బాగుంటుంది. చూస్తావు కదా, నీకే అర్థమవుతుంది. 154 00:09:52,405 --> 00:09:54,157 వచ్చేశాం. 155 00:09:55,158 --> 00:09:59,037 వావ్. ఇక్కడి ప్రకృతి అందాలను చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. 156 00:09:59,037 --> 00:10:01,164 ప్రపంచమంతా ఇంతే అందంగా ఉంటుందా? 157 00:10:01,164 --> 00:10:02,832 ఇలాగే తయారయ్యేలా ఉందిలే. 158 00:10:03,917 --> 00:10:06,961 రస్ నాకు ఇంకో విషయం కూడా గుర్తు చేశాడు, అదేంటంటే ఆస్ట్రేలియాలో ఉన్నన్ని 159 00:10:06,961 --> 00:10:10,256 భయంకరమైన జీవులు ప్రపంచంలో ఇంకెక్కడా ఉండవట. 160 00:10:10,840 --> 00:10:12,425 అది సూపర్ కదా! 161 00:10:12,425 --> 00:10:16,221 పాజిటివ్ గా చూడటంలో నిన్ను కొట్టేవాడు లేడు. 162 00:10:26,814 --> 00:10:28,066 ఏం చేస్తున్నావు? 163 00:10:28,066 --> 00:10:30,235 ప్రకృతితో నాకు ఏదో కనెక్షన్ తెలుస్తోంది. 164 00:10:31,152 --> 00:10:33,404 నాకు ఏవేవో వినిపిస్తున్నాయి, మైమరిపించే అనుభూతి కలుగుతోంది. 165 00:10:34,447 --> 00:10:37,784 నీటి పరవళ్లు. జంతువుల శబ్దాలు. 166 00:10:37,784 --> 00:10:40,245 నా శరీరంలోని అణువణువునూ అవి తాకుతున్నాయి. 167 00:10:40,245 --> 00:10:41,246 మీకు వినిపించట్లేదా? 168 00:10:41,246 --> 00:10:44,791 లేదు, కానీ నేను చెక్క మనిషిని కాదు కదా. 169 00:10:44,791 --> 00:10:47,752 ఈ తెగవాళ్లు, తమ డిడ్జెరిడూలన్నీ ఈ చెట్టు నుండే చేసుకుంటారని ఇనాలా చెప్పింది. 170 00:10:47,752 --> 00:10:49,712 మన పనిని ఇక్కడి నుండే మొదలుపెడితే బాగుంటుంది అనుకుంటా. 171 00:10:54,551 --> 00:11:00,974 ఓ మహా యూకలిప్టస్ వృక్షమా, నీ శాపగ్రస్థ డిడ్జెరిడూను నీకే అప్పగించేస్తున్నాం, తీసుకో. 172 00:11:01,849 --> 00:11:04,561 సరే. దాన్ని నేను కేసు నుండి బయటకు తీస్తున్నా. 173 00:11:05,144 --> 00:11:08,523 మళ్లీ మన పైన దాడి జరిగినా జరగవచ్చు, కాబట్టి దీన్ని వెంటనే మూసేయడానికి రెడీగా ఉందాం. 174 00:11:17,782 --> 00:11:19,242 సరే, ఇది పని చేయట్లేదు. 175 00:11:19,242 --> 00:11:20,577 కానీ, దాన్ని తయారు చేసిన చోటుకే తెచ్చాం కదా. 176 00:11:20,577 --> 00:11:22,704 కానీ మనం చేయాల్సింది ఇది కాదని తెలిసిపోతుంది కదా. 177 00:11:23,204 --> 00:11:24,873 దీన్ని నీటిలో వేసి చూస్తా. 178 00:11:28,167 --> 00:11:29,669 వెనక్కి రా! 179 00:11:37,677 --> 00:11:39,888 ఏంటా శబ్దం? 180 00:11:39,888 --> 00:11:42,181 అందరం దగ్గరగా ఉందాం. 181 00:11:58,907 --> 00:12:00,700 ఏంటది? 182 00:12:03,703 --> 00:12:04,787 కారు దగ్గరికి పరుగెత్తండి! 183 00:12:15,131 --> 00:12:16,466 కాపాడండి! 184 00:12:26,726 --> 00:12:28,144 పాండోరా! 185 00:12:29,729 --> 00:12:31,105 కారు దగ్గరికి పరుగెత్తు! 186 00:12:31,689 --> 00:12:33,149 చూసుకో! 187 00:12:48,081 --> 00:12:51,125 ఆ శబ్దాన్ని మనం వెంటనే ఆపేయాలి. 188 00:12:51,125 --> 00:12:53,503 స్టాన్లీని పట్టుకోవాలని చూసిన ఆ రాకాసి మృగం ఏది? 189 00:12:53,503 --> 00:12:55,463 ఈ పక్షుల్లో అది ఎక్కడ ఉందో కనిపించట్లేదు! 190 00:12:56,297 --> 00:12:57,882 దొరికింది! సీటు బెల్టులు పెట్టుకోండి. 191 00:13:00,260 --> 00:13:01,135 నాన్నా! 192 00:13:26,202 --> 00:13:27,203 అయ్య బాబోయ్! 193 00:13:28,121 --> 00:13:30,790 ఆరుబయట చాలా థ్రిల్లింగ్ గా ఉంది, కదా? 194 00:13:31,583 --> 00:13:34,002 స్థానిక ఆక్షన్ కేంద్రం నుండి 195 00:13:34,002 --> 00:13:36,337 ఒక క్యూనిఫామ్ టాభ్లెట్ దొంగిలించబడింది, 196 00:13:36,337 --> 00:13:41,509 భారతదేశంలోని రాజస్థాన్ లోని ఓ మ్యూజియంలో మరొక టాబ్లెట్ దొంగిలించబడినప్పుడే ఈ దొంగతనం కూడా జరిగింది. 197 00:13:43,887 --> 00:13:45,013 ఒకవేళ... 198 00:13:46,389 --> 00:13:49,017 ఇక్కడే ఉంది. నాన్న, తను ఎప్పుడు స్పృహ కోల్పోయాడో ఈ పుస్తకంలోనే నోట్ చేసుకుంటున్నాడు. 199 00:13:49,017 --> 00:13:50,393 ఎంట్రీ #57 - అప్పుడు మ్యూజియంలో స్పృహ కోల్పోయా. 200 00:13:50,393 --> 00:13:51,853 ఏమైనా తెలుస్తుందేమో చూద్దాం. 201 00:13:53,730 --> 00:13:54,981 అయ్య బాబోయ్. 202 00:13:54,981 --> 00:13:56,191 ఇది మంచిది కాదు. 203 00:14:02,280 --> 00:14:05,074 నా పేరు కాపరాజ్, ప్యాక్స్టన్ మ్యూజియం సెక్యూరిటీ మనిషిని. 204 00:14:05,074 --> 00:14:08,244 మీరెవరో నాకు తెలుసు. ఒకరిని పంపిస్తానని జార్జియా చెప్పింది. 205 00:14:08,244 --> 00:14:10,538 మీ ఇంట్లో ఎవరో చొరబడ్డారని అర్థమైంది. 206 00:14:10,538 --> 00:14:12,540 ఓసారి నేను అంతా చూడవచ్చా? 207 00:14:19,839 --> 00:14:23,635 రెండు భయంకరమైన డైనోసార్లను మిక్సీలో వేసి కలిపినట్టు ఉంది అది. 208 00:14:23,635 --> 00:14:28,014 నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే, అది బన్యిప్ లా ఉంది, కానీ ఆ అవకాశం లేదే. 209 00:14:28,014 --> 00:14:30,225 బన్యిప్స్ కాల్పనిక జీవులు, నిజమైనవి కాదు. 210 00:14:30,225 --> 00:14:33,937 మా వెంట పడిన ఆ జీవి, కాల్పనిక జీవి మాత్రం అస్సలు కాదబ్బా. 211 00:14:33,937 --> 00:14:37,148 నా చిన్నప్పుడు, మా అమ్మ చలిమంట దగ్గర నాకు చాలా కథలు చెప్పింది. 212 00:14:37,148 --> 00:14:40,735 నీటి దగ్గర పిల్లలను సురక్షితంగా ఉంచడానికి అల్లిన కథలు అవని నేను అనుకున్నాను, 213 00:14:40,735 --> 00:14:43,988 కానీ నా అధ్యయనం ద్వారా, బన్యిప్ తాలూకు ప్రాచీన గాథ గురించి తెలుసుకున్నా. 214 00:14:43,988 --> 00:14:47,909 ప్రకృతిలో భాగమైన అన్నింటి మధ్య ఉండే సంబంధాన్ని చెప్పే కథ అది. 215 00:14:48,535 --> 00:14:53,039 మోంటీ, ఇంకా జియాంబా అనే ఇద్దరు మిత్రులతో ఆ కథ మొదలవుతుంది. 216 00:14:53,873 --> 00:14:56,626 వాళ్లిద్దరూ కలిసి ఒక డిడ్జెరిడూని తయారు చేశారు. 217 00:14:57,126 --> 00:14:59,754 నీటి చిహ్నం, జీవానికి మూలాన్ని సూచిస్తుంది. 218 00:14:59,754 --> 00:15:02,131 జంతువులు, వారి వ్యక్తిగత గుర్తులను సూచిస్తాయి. 219 00:15:03,007 --> 00:15:07,804 మోంటీకి చెందిన కసోవరి పక్షి, దానికేమైనా కానీ, దాని కుటుంబానికి అండగా ఉంటుంది. 220 00:15:08,513 --> 00:15:14,936 జియాంబాకి చెందిన మొసలి, అనంత మేధస్సుకు, చడీచప్పుడు కాకుండా సాగేతనానికి, వీరోచితత్వానికి ప్రతీక. 221 00:15:14,936 --> 00:15:18,648 డిడ్జెరిడూని మోంటీ వాయించినప్పుడు, అది అందమైన పక్షులని ఆకర్షించేది, 222 00:15:18,648 --> 00:15:21,192 దాన్ని తెగవారు వరంగా భావించారు. 223 00:15:22,527 --> 00:15:24,112 కానీ జియాంబా వాయించినప్పుడు, 224 00:15:24,112 --> 00:15:27,740 మొసళ్లు వచ్చేవి, దానితో తెగవారు భయపడిపోయారు. 225 00:15:27,740 --> 00:15:31,119 మళ్లీ డిడ్జెరిడూని వాయించవద్దని జియాంబాకి చెప్పారు. 226 00:15:31,119 --> 00:15:34,831 ఇది జియాంబాకి కోపం కలిగించింది, ఎందుకంటే, మొసళ్లంటే భయం ఉన్నా కానీ, 227 00:15:34,831 --> 00:15:37,709 ప్రకృతి సమతుల్యతను కొనసాగించడంలో వాటి పాత్ర చాలా కీలకమైంది, 228 00:15:37,709 --> 00:15:41,504 జీవన చక్రం సరిగ్గా ఉండాలంటే, వేటాడే జంతువులు, వేటాడబడే జంతువులు, రెండూ ఉండాలి. 229 00:15:42,130 --> 00:15:45,300 జియాంబా, తను అనుభవించింది మోంటీ కూడా అనుభవించాలి అని అనుకున్నాడు, 230 00:15:45,300 --> 00:15:48,052 అందుకని డిడ్జెరిడూపై ఒక శాపం పెట్టాడు. 231 00:15:48,052 --> 00:15:52,015 ఆ తర్వాత దాన్ని మోంటీ వాయించినప్పుడు, జియాంబా వాయించినప్పుడు వచ్చిన మొసళ్లలా, 232 00:15:52,015 --> 00:15:54,017 పక్షులు కూడా దూకుడుగా వ్యవహరించి, దాడి చేశాయి. 233 00:15:54,642 --> 00:15:59,564 మోంటీ చాలా బాధపడిపోయాడు, జియాంబాతో అస్సలు మాట్లాడకూడదని అనుకున్నాడు. 234 00:15:59,564 --> 00:16:01,900 అంతా అస్తవ్యస్తం అయిపోయింది. 235 00:16:01,900 --> 00:16:06,696 జియాంబా, తన స్వార్థాన్ని గ్రహించి, భీకరంగా ఏడ్చాడు, 236 00:16:06,696 --> 00:16:09,240 ఆ కన్నీళ్లన్నీ కలిసి ఒక సరస్సుగా మారాయి, ఆ సరస్సులో అతను మునిగిపోయాడు. 237 00:16:09,866 --> 00:16:13,661 ఇది చూసిన మోంటీ, తన మిత్రుడిని కాపాడుకోవడానికి, ఆ సరస్సులో దూకాడు. 238 00:16:14,204 --> 00:16:18,583 వాళ్లు నీటి నుండి బయటకు, ఒక జీవిలా మారి వచ్చారు, 239 00:16:18,583 --> 00:16:24,005 అది వారిద్దరి గుర్తులైన, కసోవరి పక్షి, మొసలి, రెండింటి కలయికకి ప్రతీక అన్నమాట. 240 00:16:25,673 --> 00:16:30,845 అదే బన్యిప్, ప్రకృతిలోని అన్నింటికీ మధ్య ఉన్న సంబంధానికి నిలువెత్తు రూపం అది. 241 00:16:31,387 --> 00:16:33,848 ఆ కథలో శాపానికి విరుగుడు ఏంటి అనేది కూడా ఉందా? 242 00:16:33,848 --> 00:16:38,269 కథ ప్రకారం, శాపాన్ని తరిమేయాలంటే, బన్యిప్ పాటని వాయించాల్సి ఉంటుంది, 243 00:16:38,269 --> 00:16:40,522 అంటే, మోంటీ, జియాంబా పాటలను కలిపి వాయించాలి అన్నమాట, 244 00:16:40,522 --> 00:16:43,691 ఆ పాట వాళ్లు మర్చిపోయిన ప్రకృతిలోని సమతుల్యతకు చిహ్నం. 245 00:16:43,691 --> 00:16:44,943 సూపర్. ఇంతకీ ఏంటి ఆ పాట? 246 00:16:44,943 --> 00:16:49,697 దురదృష్టవశాత్తూ, మా చరిత్రలో చాలా వరకు నోటిమాటగానే తరతరాలకు బదిలీ అయింది కనుక, ఆ పాట చరిత్రలో కలిసిపోయింది. 247 00:16:51,616 --> 00:16:54,953 గుడ్ లక్. ఈ కథ ఎలా ముగుస్తుందో వినాలని నాకు చాలా ఆత్రంగా ఉంది. 248 00:16:54,953 --> 00:16:57,455 మాకు కూడా. థ్యాంక్స్, ఇనాలా. 249 00:17:03,294 --> 00:17:05,338 స్టాన్లీ, నువ్వు ఇప్పుడు ప్లే చేస్తున్న ట్యూన్ ని, 250 00:17:05,338 --> 00:17:07,965 సరస్సు దగ్గర కూడా ప్లే చేశావు కదా. 251 00:17:07,965 --> 00:17:09,926 నాకు వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి. 252 00:17:09,926 --> 00:17:11,761 ఇది వింతగా అనిపిస్తుందని నాకు తెలుసు, 253 00:17:11,761 --> 00:17:15,431 కానీ ఈ వైబ్రేషన్స్, నేను సరస్సు దగ్గర విన్న శబ్దాలకు మ్యాచ్ అవుతున్నాయి. 254 00:17:15,431 --> 00:17:19,435 వాటిలో పక్షుల శబ్దాలు, మొసళ్ల శబ్దాలు, నీటి శబ్దాలు కలిపి ఉన్నాయి. 255 00:17:19,435 --> 00:17:20,561 పక్షులు... 256 00:17:23,648 --> 00:17:24,732 మొసలి... 257 00:17:28,194 --> 00:17:29,696 ఇంకా నీరు. 258 00:17:31,614 --> 00:17:33,992 డిడ్జెరిడూ మీద ఉన్న గుర్తులే ఇవి. 259 00:17:33,992 --> 00:17:36,160 బన్యిప్ కూడా వీటితోనే తయారైంది. 260 00:17:36,160 --> 00:17:38,079 చూస్తుంటే, నీకు కూడా కనెక్షన్ ఉన్నట్టుంది. 261 00:17:38,079 --> 00:17:41,374 డిడ్జెరిడూతో పాటు నాకు వినిపించే, నేను అనుభూతి చెందే శబ్దాలు, 262 00:17:41,374 --> 00:17:43,918 నాకు బన్యిప్ పాటను చెప్పాలని చూస్తున్నాయని అనిపిస్తోంది, 263 00:17:43,918 --> 00:17:46,462 అదే, ఇనాలా ఇందాక చెప్పిన రెండు గుర్తుల కలయిక పాట అన్నమాట. 264 00:17:46,462 --> 00:17:50,717 ఈ శబ్దాలన్నీ బన్యిప్ పాటే అయితే, దాన్ని ప్లే చేసినప్పుడు, శాపం తొలగిపోవాలి. 265 00:17:50,717 --> 00:17:51,885 మనం వెనక్కి వెళ్లాలి. 266 00:17:51,885 --> 00:17:54,470 నాకు వినిపించింది నేను డిడ్జెరిడూతో వాయిస్తాను. 267 00:17:54,470 --> 00:17:57,015 హార్మోనికాని ఎలాగూ గాలితోనే వాయిస్తా కదా, దాన్ని కూడా అలాగే వాయిస్తా. 268 00:17:57,015 --> 00:17:58,349 అదేమంత కష్టంగా ఉండదులే. 269 00:18:02,937 --> 00:18:04,230 అంతే. 270 00:18:14,073 --> 00:18:16,284 దొంగలు పడినట్టు నాకు ఏ ఆధారమూ లభించలేదు, 271 00:18:16,284 --> 00:18:18,953 కానీ నేను చూస్తున్నంత సేపూ, తను నా పక్కనే ఉంది. 272 00:18:18,953 --> 00:18:20,580 ఇక్కడేదో తేడాగా ఉంది. 273 00:18:36,137 --> 00:18:38,306 ఇది మంచి ప్లానే అంటారా? 274 00:18:38,306 --> 00:18:41,601 స్టాన్లీ, నిన్ను నువ్వు కాపాడుకొనే అవకాశమే ఉండదు. 275 00:18:42,435 --> 00:18:45,230 ఆ రిస్క్ తీసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, ఈ బాధ్యత నాకు అప్పగించబడింది. 276 00:18:45,230 --> 00:18:48,274 ఇది నా విధి, ఇది నేను ఒంటరిగా చేయాల్సిన పని. 277 00:18:50,235 --> 00:18:52,987 - నువ్వు విజయవంతంగా చేయగలవు. - రంగంలోకి దిగుతున్నా. 278 00:18:56,199 --> 00:18:57,200 నేను చేయగలను. 279 00:19:21,891 --> 00:19:24,686 అయ్యయ్యో, నేను పొరబడ్డాను. దీన్ని వాయించడం చాలా కష్టంగా ఉంది. 280 00:19:32,151 --> 00:19:33,444 మనం అతడిని నమ్మాలి. 281 00:19:50,295 --> 00:19:52,338 - ఇక చాలు! - పాండోరా! 282 00:19:54,465 --> 00:19:55,466 పాండోరా, ఆగు! 283 00:19:57,552 --> 00:19:58,845 ఈ పని నేను ఒంటరిగా చేయాలి. 284 00:20:43,348 --> 00:20:44,807 ఇది పని చేస్తోంది! 285 00:21:02,408 --> 00:21:04,452 అదరగొట్టేశావు! 286 00:21:05,203 --> 00:21:08,373 ప్రకృతి సమతుల్యత మళ్లీ పూర్వ స్థితికి చేరుకుందనే అనుకుంటున్నా. 287 00:21:08,873 --> 00:21:11,793 శాపం పోయింది. 288 00:21:11,793 --> 00:21:14,212 స్టాన్లీ, నువ్వు చాలా ధైర్యంగా వ్యవహరించావు! 289 00:21:14,212 --> 00:21:16,256 బాగా చేశావు. పుస్తకాలు రాయవచ్చు నీ గురించి. 290 00:21:16,256 --> 00:21:20,468 ఈ సంఘటన ఆధారంగా నా మీద జానపద గేయాలు కూడా రాయవచ్చుగా? 291 00:21:21,553 --> 00:21:22,762 రాయవచ్చులే. 292 00:21:28,101 --> 00:21:29,936 ఇంకో కళాఖండాన్ని వాపసు ఇచ్చేశాం. 293 00:21:31,771 --> 00:21:33,523 నువ్వు ఇంటికి వచ్చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 294 00:21:33,523 --> 00:21:35,692 నువ్వు లేకుండా ఇక్కడ నాకు అదోలా ఉండింది. 295 00:21:35,692 --> 00:21:37,068 మళ్లీ ఇక్కడికి వచ్చేయడం కూడా బాగుంది. 296 00:21:37,068 --> 00:21:41,739 మరో 100 ఏళ్ళలో మళ్లీ బయటకు వెళ్తా, అందుకు సిద్ధంగా ఉండాలి. 297 00:21:41,739 --> 00:21:45,952 ఓయ్, భలే వాడివే. ఆస్ట్రేలియా గురించి తెలుసుకోవాలని నీకు లేదా? 298 00:21:49,080 --> 00:21:50,915 మనం పైకి వెళ్లి మాట్లాడుకుందాం పద. 299 00:21:59,007 --> 00:22:01,342 నువ్వు లేనప్పుడు నాన్న ఎప్పుడైనా స్పృహ కోల్పోయాడా? 300 00:22:01,342 --> 00:22:03,303 లేదే, బాగానే ఉన్నాడే. ఏమైంది? 301 00:22:03,303 --> 00:22:06,681 ప్రపంచ నలుమూలల నుండి చాలా కళాఖండాలు దొంగిలించబడ్డాయి. 302 00:22:06,681 --> 00:22:08,266 అయితే? 303 00:22:08,266 --> 00:22:10,476 ఆ పని చేసేది నాన్నే అనుకుంటా. 304 00:22:10,476 --> 00:22:11,769 దానికి నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది. 305 00:22:14,606 --> 00:22:15,773 ఏం... 306 00:22:26,743 --> 00:22:30,079 ఇక్కడి నుండి నేను చూసుకుంటాలే, ఆలెక్స్. 307 00:23:02,320 --> 00:23:04,322 సబ్ టైటిళ్లను అనువదించింది: రాంప్రసాద్