1 00:00:14,953 --> 00:00:18,206 ఆ ప్రదర్శన విభాగం గురించి తెలుసుకోవడానికి మన లండన్ మిత్రులు చాలా ఆరాటంగా ఉన్నారు, స్కై. 2 00:00:18,206 --> 00:00:22,752 సార్గోన్ సింహాసనాన్ని దక్కించుకోవడమంటే అది చిన్న విషయం కాదు. 3 00:00:23,795 --> 00:00:25,463 అంతరించిపోయిన రాజ్యం, బాబిలాన్ 4 00:00:25,463 --> 00:00:27,257 మీరిద్దరూ వెళ్లండి. 5 00:00:27,257 --> 00:00:29,008 నేను ఒకదాన్ని చూడాలి. 6 00:00:29,592 --> 00:00:30,677 చూసి వస్తాలే. 7 00:00:30,677 --> 00:00:32,136 పరధ్యానం అయిపోయి ఉండిపోకు. 8 00:01:16,222 --> 00:01:17,348 మేల్కొను. 9 00:01:48,421 --> 00:01:50,048 ఇలా రా, చిట్టి నేస్తమా. 10 00:01:50,715 --> 00:01:52,717 మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. 11 00:02:15,865 --> 00:02:18,785 లాపిస్ పురుగులు 12 00:02:19,869 --> 00:02:21,871 ఆ పురుగును దొంగిలించింది నేనని ఆలెక్స్ చెప్పాడా? 13 00:02:21,871 --> 00:02:23,998 అది పెద్ద సోదిలా ఉంది. అలా అతను ఎందుకు చెప్తాడు? 14 00:02:23,998 --> 00:02:25,833 అతను నీ గురించి కంగారుపడుతున్నాడు. 15 00:02:25,833 --> 00:02:27,669 ఈ మధ్య నువ్వు చాలా కంగారుగా ఉంటున్నావని చెప్పాడు. 16 00:02:27,669 --> 00:02:30,880 నువ్వు నిద్రలో నడుస్తున్నావట. 17 00:02:30,880 --> 00:02:33,591 నిద్రలో నడుస్తున్నానా? అతనే ఊరికే స్పృహ కోల్పోతున్నాడు. 18 00:02:33,591 --> 00:02:35,051 నువ్వు నన్ను నమ్మాలి. 19 00:02:35,051 --> 00:02:36,761 నాకూ నిన్ను నమ్మాలనే ఉంది, స్కై, 20 00:02:37,387 --> 00:02:40,723 కానీ మాకు అనుమానం కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి. 21 00:02:40,723 --> 00:02:43,768 ఆ పురుగు దొంగిలించబడిన రాత్రి, నువ్వు, నీ భర్త ఇక్కడే ఉన్నారు. 22 00:02:43,768 --> 00:02:46,020 నేను మ్యూజియం గొప్పదనాన్ని చాటాలని ఇక్కడికి వచ్చాను. 23 00:02:46,020 --> 00:02:47,939 నా పని నేను చేస్తున్నందుకు అనుమానిస్తున్నారా? 24 00:02:48,898 --> 00:02:49,983 ఆ విషయంలో కాదు. 25 00:02:49,983 --> 00:02:53,945 కానీ ఆర్కైవ్స్ నుండి పురుగుకు సంబంధించిన సమాచారాన్నంతా సేకరించావు. 26 00:02:53,945 --> 00:02:56,656 చెప్తున్నా కదా, ఆ పని చేసింది నేను కాదు. 27 00:02:56,656 --> 00:03:00,493 కాపరాజ్, నువ్వు బయటకి వెళ్లు. నేను స్కైతో ఒంటరిగా మాట్లాడాలి. 28 00:03:00,493 --> 00:03:02,203 నన్ను నిజంగానే వెళ్లమంటున్నారా? 29 00:03:02,203 --> 00:03:04,414 వెళ్లు. 30 00:03:09,752 --> 00:03:12,547 నువ్వు మా వైపు నుండి కూడా ఆలోచించాలి, స్కై. 31 00:03:12,547 --> 00:03:16,426 పురుగును దొంగిలించినందుకు నీ భర్తే నువ్వు దొంగవని చెప్పాడు. 32 00:03:16,426 --> 00:03:18,720 ఆలెక్స్ విషయంలో ఏం జరుగుతోందో నిజంగా నాకు అర్థం కావట్లేదు, 33 00:03:18,720 --> 00:03:20,471 కానీ అతను నీకు చెప్పింది నిజం కాదు. 34 00:03:20,471 --> 00:03:21,764 మరి నువ్వు చెప్పేది నిజమా? 35 00:03:21,764 --> 00:03:24,559 చాలా నెలలుగా నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని అనిపిస్తోంది. 36 00:03:24,559 --> 00:03:28,855 కళాఖండాల గురించి చాలా ప్రశ్నలు అడుగుతున్నావు, ఉన్నట్టుండి విదేశాలకు వెళ్తున్నావు, 37 00:03:28,855 --> 00:03:31,274 ఇప్పుడు దొంగతనంలో నీ పాత్ర ఉంది. ఏంటి ఇదంతా? 38 00:03:31,858 --> 00:03:34,861 నిజం చెప్తే, నీకు సాయపడగలను, స్కై. 39 00:03:35,445 --> 00:03:37,614 లేకపోతే, ఇది నా చేయి దాటిపోతుంది. 40 00:03:38,615 --> 00:03:40,491 నీకు కావాల్సింది ఏంటో నాకూ చెప్పాలనే ఉంది, 41 00:03:40,491 --> 00:03:43,161 కానీ ఆ పురుగు దొంగతనానికి, నాకు ఏ సంబంధమూ లేదు. 42 00:03:43,161 --> 00:03:46,873 స్కై, నువ్వంటే నాకు చాలా అభిమానం ఉంది. అందుకే నిన్ను కాపాడాలని చూస్తున్నాను. 43 00:03:46,873 --> 00:03:49,667 కానీ, నువ్వు నాకు వేరే దారేదీ ఇవ్వట్లేదు. 44 00:03:49,667 --> 00:03:52,045 నీకు కొంత సమయం ఇస్తాను. 45 00:03:52,045 --> 00:03:55,548 టీ చేసుకొని తాగు, దీర్ఘంగా శ్వాస ఆడించు, 46 00:03:56,341 --> 00:03:59,427 నాకు నిజం చెప్తే, ఎంత మేలో ఓసారి ఆలోచించు. 47 00:04:02,347 --> 00:04:04,265 జార్జియా, ఇలా తాళం వేసుకొని వెళ్లిపోతే, ఏంటి అర్థం! 48 00:04:04,265 --> 00:04:06,392 నన్ను బయటకి రానివ్వు! 49 00:04:07,727 --> 00:04:10,313 ఈ పని ఎందుకు చేశావో నువ్వు చెప్పాల్సిందే, ఆలెక్స్. 50 00:04:10,313 --> 00:04:11,731 నా ఫోన్ ఎక్కడ? 51 00:04:14,651 --> 00:04:16,151 అమ్మ ఇంకా ఫోన్ ఎత్తట్లేదా? 52 00:04:16,151 --> 00:04:18,571 లేదు. నాకు కంగారు వచ్చేస్తోంది. 53 00:04:20,740 --> 00:04:21,949 అతనే. 54 00:04:25,995 --> 00:04:28,581 నల్ల రిబ్బన్ గాడు. ఇనుయిట్ అద్దాల్లో అమ్మ చూసింది వీడినే. 55 00:04:28,581 --> 00:04:31,209 మన ఇంటి బయట, అలాగే రేవు దగ్గర కూడా ఉండింది ఇతనే. 56 00:04:37,924 --> 00:04:39,842 దీన్నంతటికీ, ఇతనికి ఏంటి సంబంధం? 57 00:04:39,842 --> 00:04:41,928 తెలీదు, కానీ వీడు దొంగతనంగా వచ్చి, నాన్నని కొట్టాడు. 58 00:04:42,512 --> 00:04:43,846 ఇప్పుడు మనం వీడిని చితకబాదుదాం పద. 59 00:04:44,597 --> 00:04:47,100 కాస్త ఆగు, పాన్. అతను చాలా ప్రమాదకరంగా ఉన్నాడు. 60 00:04:55,316 --> 00:04:56,651 మనం అతనికి దూరంగా ఉంటే మంచిది. 61 00:04:57,360 --> 00:05:00,530 నడుస్తూ ఉందాం. మ్యూజియాన్ని చూడటానికి వచ్చిన మామూలు వ్యక్తుల్లా ప్రవర్తిద్దాం. 62 00:05:01,489 --> 00:05:03,908 మీరిద్దరూ ఆగండి. 63 00:05:04,659 --> 00:05:05,869 హలో, సర్. 64 00:05:05,869 --> 00:05:08,621 మేము విహారయాత్రకి వచ్చిన స్కూల్ పిల్లలం, అంతే. 65 00:05:08,621 --> 00:05:11,332 మీరెవరో నాకు తెలుసు. ఇక బయలుదేరండి. 66 00:05:11,958 --> 00:05:13,543 ఓయ్, బాబూ, నేను ఇక్కడే ఉద్యోగం చేస్తాను. 67 00:05:13,543 --> 00:05:17,338 నువ్వు యువ గైడ్ వి. దాన్ని ఉద్యోగం అనడం కామెడీగా ఉంది. 68 00:05:17,922 --> 00:05:19,007 బయటకు వెళ్లు! 69 00:05:19,007 --> 00:05:21,467 చూడండి, మేము మా అమ్మానాన్నల కోసం వచ్చాం. 70 00:05:21,467 --> 00:05:26,222 మీ నాన్న ఇప్పుడే వెళ్లిపోయాడు, ఇక మీ అమ్మ జార్జియాతో సమావేశంలో ఉంది. 71 00:05:27,640 --> 00:05:31,102 మేము తనని కలవాలి, కాబట్టి అక్కడికి వెళ్తాం. 72 00:05:31,102 --> 00:05:33,271 ఆ పని చేసే సాహసం చేయకండి. 73 00:05:33,271 --> 00:05:35,481 ఏమన్నారు? ఎందుకు? 74 00:05:35,481 --> 00:05:37,734 అది మీకు చెప్పాల్సిన పని లేదు. 75 00:05:37,734 --> 00:05:41,905 కానీ చెప్తున్నా కదా, మీ అమ్మ ఇంకెక్కడికీ వెళ్లదు. 76 00:05:41,905 --> 00:05:44,199 ఇక మీరు ఇంటికి బయలుదేరండి. 77 00:05:47,118 --> 00:05:49,913 మనం అమ్మని ఇక్కడే ఇతనితో వదిలి వెళ్లకూడదు. తనకి మనం సాయపడాలి. 78 00:05:49,913 --> 00:05:53,333 అవును, నువ్వు అన్నది నిజమే. కానీ వాడిని దాటుకొని ఎలా వెళ్లగలం? 79 00:05:54,125 --> 00:05:57,128 ఒకసారి ఓల్మెక్ బేబీలను పట్టుకోవడానికి మ్యూజియం అంతా తిరిగాం, గుర్తుందా? 80 00:06:02,550 --> 00:06:05,511 - కాస్త గోల చేయకుండా ఉంటావా? - రస్? 81 00:06:05,511 --> 00:06:07,680 - అమ్మా! అమ్మా! - పిల్లలూ! 82 00:06:07,680 --> 00:06:09,265 మేము పైన ఉన్నాం. 83 00:06:09,265 --> 00:06:12,101 నేను చాలా కంగారుపడిపోయాను. మీ నాన్నకి ఏదో అయింది. 84 00:06:12,101 --> 00:06:14,604 మ్యూజియం నుండి పురుగును నేను దొంగిలించానని జార్జియాకి చెప్పాడు. 85 00:06:14,604 --> 00:06:18,066 నాన్న గురించి చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చాం. ఒక కళాఖండాన్ని ఉపయోగించి మమ్మల్ని బుడ్డోళ్లని చేశాడు. 86 00:06:18,066 --> 00:06:19,317 అంత పని చేశాడా? 87 00:06:19,317 --> 00:06:21,194 ఇంకాస్త ఉంటే లిండా, పాన్ ని హాంఫట్ చేసేసి ఉండేది. 88 00:06:21,194 --> 00:06:23,738 ఆయన్ని ఎవరైనా ఆవహించారేమో అని మాకు అనుమానం. 89 00:06:23,738 --> 00:06:25,907 నాన్న మనపై ఈగ కూడా వాలనివ్వడని మనందరికీ తెలుసు కదా. 90 00:06:25,907 --> 00:06:29,827 జనాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోగల కళాఖండాలు ఉన్నాయి, ఉదాహరణకు, తోలుబొమ్మ. 91 00:06:30,662 --> 00:06:31,829 అబ్బా, దాని గురించి గుర్తు చేయకు అమ్మో. 92 00:06:31,829 --> 00:06:35,291 విషయం ఏంటంటే, నాన్న ఇప్పుడు ప్రమాదకరంగానే ఉన్నా, ఆయనకి మన అవసరం ఉంది. 93 00:06:35,291 --> 00:06:37,335 ఇక్కడి నుండి బయట పడి, ఆయన ఎక్కడున్నాడో చూద్దాం పదండి. 94 00:06:58,273 --> 00:06:59,566 ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 95 00:07:02,443 --> 00:07:05,822 మ్యూజియాన్ని ఇవాళ్టికి మూసివేశాం. కాబట్టి మీరు అక్రమంగా ప్రవేశించినట్టే. 96 00:07:33,725 --> 00:07:37,020 తర్వాత మనం బొమ్మల గదికి వెళ్తున్నాం. 97 00:07:37,020 --> 00:07:38,688 అంతా చిందరవందరగా ఉంది, అందుకు మన్నించాలి, 98 00:07:38,688 --> 00:07:42,609 కానీ టానిక్ శాపం పోవడం వల్లే ఇలా అయింది, ఆ పని చేసింది నువ్వే కాబట్టి, దీనికి కూడా నువ్వే కారణమని చెప్పవచ్చు. 99 00:07:42,609 --> 00:07:43,776 హా. 100 00:07:44,402 --> 00:07:46,404 మిగాతవి కూడా చూసేశాక, దీన్ని శుభ్రం చేయడంలో మీకు సాయపడతా. 101 00:07:50,408 --> 00:07:54,204 ఇదేమీ టూర్ కాదమ్మా. మనం తిండిబోతు, ఇంకా దాని కవల పురుగు కోసం వెతుకుతున్నాం. 102 00:07:54,204 --> 00:07:58,082 టూరైనా, వేట అయినా, ఏదైనా సూపరే కదా. 103 00:07:58,082 --> 00:08:00,084 రహస్య ప్రదేశాన్ని నాకు చూపిస్తున్నందుకు థ్యాంక్స్. 104 00:08:05,965 --> 00:08:06,966 ఒక పురుగు కనిపించింది. 105 00:08:09,177 --> 00:08:10,428 కానీ ఇదేం చేస్తోంది? 106 00:08:11,930 --> 00:08:14,724 ఈ పిచ్చి పురుగు మళ్లీ తీగని లాగించేస్తోంది. 107 00:08:23,483 --> 00:08:24,651 అది మేల్కొంది. 108 00:08:32,242 --> 00:08:33,493 మళ్లీ ఆగిపోయింది. 109 00:08:33,493 --> 00:08:35,078 ఇప్పుడు స్పష్టంగా ఒకటి అర్థమైంది. 110 00:08:35,078 --> 00:08:38,540 శాపగ్రస్థ కళాఖండాల శక్తిని ఈ తీగే అణచివేస్తోంది. 111 00:08:38,540 --> 00:08:40,833 ఈ కళాఖండాలను తీగ మేల్కొల్పగలదంటే, 112 00:08:40,833 --> 00:08:43,836 వాటిని మళ్లీ నిద్రావస్థలోకి తీసుకుపోగల శక్తి కూడా దానికి ఉండే ఉంటుంది. 113 00:08:44,546 --> 00:08:47,924 అందుకే, ఈ పురుగులు తీగపై దాడి చేస్తున్నాయి. 114 00:08:47,924 --> 00:08:50,885 తీగ చేస్తున్న ఈ సాయాన్ని ఎవరో అడ్డుకోవాలనుకుంటున్నారు. 115 00:08:50,885 --> 00:08:53,513 ఆ కుట్రదారు తీగని నాశనం చేయాలనుకుంటున్నాడు. 116 00:08:53,513 --> 00:08:56,140 అంత దారుణానికి ఎవరైనా ఎలా పాల్పడగలరు? 117 00:08:56,140 --> 00:08:59,811 పరిస్థితి చేయి దాటిపోయే లోపే ఈ పురుగులను మనం అడ్డుకోవాలి, 118 00:08:59,811 --> 00:09:02,230 ముందు ఆ పురుగు పని పట్టాలి. 119 00:09:03,481 --> 00:09:04,566 వస్తున్నా ఆగవే. 120 00:09:11,155 --> 00:09:12,907 ఫల్టీలు కొడుతూ దూకుతున్నా! 121 00:09:15,910 --> 00:09:18,413 వావ్, దీనికి ఇంత సీన్ అవసరమా! 122 00:09:18,413 --> 00:09:20,748 ఎలా అయితేనేం, పురుగు చచ్చింది కదా. 123 00:09:20,748 --> 00:09:23,835 అవునులే. నేను వెళ్లి చీపురు తీసుకువచ్చి, దీన్ని ఊడుస్తా, 124 00:09:23,835 --> 00:09:25,169 నువ్వు కూడా నాతో రా, దేవీ? 125 00:09:33,094 --> 00:09:34,178 ఏమైంది? 126 00:09:35,054 --> 00:09:36,639 ఇంకొన్ని పురుగులు వచ్చాయి. నేను చూసుకుంటాలే. 127 00:09:36,639 --> 00:09:37,974 దేవీ, వద్దు! వద్దు! 128 00:09:39,100 --> 00:09:43,605 ఇదేదో డబుల్ బొనాంజా ఆఫరులా ఉంది. ఒక దాన్ని పగలగొడితే, రెండు పుట్టుకొస్తున్నాయి. 129 00:09:44,522 --> 00:09:47,358 మనం ఆలస్యం చేయకూడదు. వీటిని త్వరగా పట్టేసుకోవాలి, లేదంటే... 130 00:09:47,984 --> 00:09:49,068 అయ్యయ్యో, వెళ్లిపోయాయి. 131 00:10:00,455 --> 00:10:01,873 ఏమైపోయాయి అవి? 132 00:10:03,541 --> 00:10:05,710 ఏమైపోయాయి అవి? ఏమైపోయాయి? 133 00:10:08,922 --> 00:10:12,967 దొంగలు. దుర్మార్గులు. నా వస్తువును తీసుకోవడానికి ఎంత ధైర్యం? 134 00:10:14,594 --> 00:10:16,930 ఈ ఫోన్ గోల ఆగదా? 135 00:10:17,597 --> 00:10:19,599 ఏంటి? ఏం కావాలి? 136 00:10:20,475 --> 00:10:22,310 బాబోయ్! పచ్చి మిరపకాయ ఏమైనా తిన్నావా, ఆలెక్స్? 137 00:10:22,310 --> 00:10:24,479 కాల్ చేసింది నేనే. నీ పాత మిత్రురాలైన మార్జీని. 138 00:10:26,314 --> 00:10:27,148 సారీ. 139 00:10:27,148 --> 00:10:30,985 నీకు, స్కైకి లెక్కలేనన్ని సార్లు కాల్ చేశాను. ఏమైపోయారు? 140 00:10:30,985 --> 00:10:33,988 మేము, పనిలో కాస్త బిజీగా ఉన్నాం. 141 00:10:33,988 --> 00:10:35,573 తెలుస్తోందిలే. 142 00:10:35,573 --> 00:10:39,202 ఏదేమైనా, మా రూఫస్ కి నేను ప్రతీ వారం చేసినట్టుగానే, శుభ్రం చేస్తూ ఉన్నా... 143 00:10:39,202 --> 00:10:40,912 దానికి అదంటే భలే ఇష్టమని నీకు తెలుసు కదా... 144 00:10:40,912 --> 00:10:44,874 శుభ్రం చేస్తూ ఉండగా, పాడైపోయిన కొన్ని పాత రాళ్లు గోడలో ఇరుక్కుపోయి ఉండటం చూశాను. 145 00:10:44,874 --> 00:10:46,376 అవి నీవే అని గ్రహించా. 146 00:10:46,376 --> 00:10:49,379 మీరే హార్బరుకు వచ్చి తీసుకుంటారని అనుకున్నా, కానీ మీరు ఫోన్లు ఎత్తడం లేదు. 147 00:10:49,379 --> 00:10:55,009 అందుకని, నా రూఫస్ బైకును వేసుకొని మీ బంగళాకే వచ్చి ఇద్దామని వచ్చేశా. 148 00:10:56,469 --> 00:10:58,137 థ్యాంక్యూ, మార్జీ. నీ మనస్సు వెన్న అబ్బ. 149 00:10:58,805 --> 00:11:00,515 కానీ ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. 150 00:11:00,515 --> 00:11:03,184 అభ్యంతరం లేకపోతే, నన్ను వేరే చోట కలుసుకోగలవా? 151 00:11:03,768 --> 00:11:05,270 తప్పకుండా. 152 00:11:05,270 --> 00:11:06,813 ఎక్కడికి రావాలో చెప్పు. 153 00:11:12,443 --> 00:11:15,530 ఆలెక్స్ కళాఖండాలని కూడా దొంగిలిస్తున్నారని చెప్తున్నారా? 154 00:11:15,530 --> 00:11:16,906 అది అస్సలు అర్థవంతంగా లేదు. 155 00:11:17,407 --> 00:11:20,660 హా, అతని స్పృహ కోల్పోయిన సమయాలను, ఇటీవల జరిగిన దొంగతనాల సమయాలను పోల్చి చూశాను. 156 00:11:20,660 --> 00:11:23,454 దురదృష్టవశాత్తూ, అవి ఒకే సమయంలో జరిగాయి. 157 00:11:23,454 --> 00:11:25,039 అతను శాపం ప్రభావంతో అలా చేస్తూ ఉంటాడు. 158 00:11:25,039 --> 00:11:27,584 నాన్న అలా చేస్తాడంటే ఎవరైనా నమ్ముతారా? 159 00:11:27,584 --> 00:11:30,545 లేదు. ఆలెక్స్ ఎప్పుడూ సరైన పనే చేస్తాడు. 160 00:11:31,129 --> 00:11:33,631 కాలేజీలో ఉన్నప్పుడు కూడా, ఆలెక్స్ ఒక భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు, 161 00:11:33,631 --> 00:11:36,885 మా కాలేజీ దగ్గర నావహో నేషన్ నుండి తీసుకొన్న కొన్ని ఆచార సంబంధిత కళాఖండాలు ఉన్నాయి, 162 00:11:36,885 --> 00:11:38,636 వాటిని ఆ నేషన్ కి తిరిగి ఇచ్చేయాలని ఆ నిరసన. 163 00:11:38,636 --> 00:11:42,307 నిజంగానా? ఈ తిరిగి అప్పగించే కార్యక్రమాన్ని నాన్న ఎప్పటి నుండో చేస్తున్నాడన్నమాట. 164 00:11:42,307 --> 00:11:46,853 అందుకు ఆయన చాలా సమస్యల్లో చిక్కుకున్నాడు. కాలేజీ వాళ్లు ఆయన్ని ఇంటికి పంపించేయబోయారు, కానీ ఆయన పట్టించుకోలేదు. 165 00:11:46,853 --> 00:11:49,272 అదే సరైన పని అని చెప్పేవాడు. 166 00:11:49,272 --> 00:11:51,900 దొంగతనంగా సంపాదించిన కళాఖండాలను తిరిగి ఇచ్చేయాల్సిందే అని మొదట్నుంచీ నమ్మేవాడు, 167 00:11:51,900 --> 00:11:54,277 అతని కుటుంబ శాపం గురించి అతనికి తెలియక ముందు నుండి కూడా. 168 00:11:54,277 --> 00:11:55,904 అంత గొప్పవాడు మీ నాన్న. 169 00:11:55,904 --> 00:11:58,489 అతను ఏ కళాఖండాన్నీ దొంగిలించడు. 170 00:11:58,489 --> 00:11:59,699 దేవీ కాల్ వస్తోంది 171 00:12:00,491 --> 00:12:02,869 - హేయ్, దెవ్స్. ఏంటి... - మీ భయంకరమైన బేస్మెంటులో 172 00:12:02,869 --> 00:12:05,830 నీలి పురుగులు చాలా ఉన్నాయి, అవి తీగలనన్నింటినీ తినేస్తున్నాయి. 173 00:12:05,830 --> 00:12:07,665 - నేను స్పష్టంగా చెప్తాను. - హేయ్! 174 00:12:07,665 --> 00:12:10,210 రహస్య ప్రదేశమంతా లాపిస్ పురుగులతో నిండిపోయింది, 175 00:12:10,210 --> 00:12:15,548 అవి తీగని ఇష్టమొచ్చినట్టు కొరికేస్తున్నాయి, వాటన్నింటినీ మేమే పట్టుకోలేకపోతున్నాం. 176 00:12:15,548 --> 00:12:18,593 ఒక పురుగు కంటే ఎక్కువ ఉన్నాయా? అదెలా సాధ్యం? 177 00:12:18,593 --> 00:12:21,596 అదంతా తర్వాత చెప్తాం, ముందు మీరు వెంటనే ఇక్కడికి వచ్చేయాలి. 178 00:12:21,596 --> 00:12:24,307 రహస్య ప్రదేశమంతా ప్రమాదంలో ఉంది. 179 00:12:24,307 --> 00:12:26,267 కానీ ఇవాళ మేమొక బలమైన ఆధారాన్ని కూడా చూశాం, 180 00:12:26,267 --> 00:12:29,520 శాపగ్రస్థ కళాఖండాలు మేల్కోకుండా తీగే అడ్డుకుంటోంది. 181 00:12:29,520 --> 00:12:32,607 కానీ ఆ పురుగులు కొరుకుతూ ఉండటం వల్ల తీగ బాగా దెబ్బతింటోంది, 182 00:12:32,607 --> 00:12:35,193 దానితో అది కళాఖండాలపై పట్టు కోల్పోతోంది. 183 00:12:35,193 --> 00:12:37,946 పురుగులన్నీ తీగని నాశనం చేస్తున్నాయంటే, 184 00:12:38,738 --> 00:12:42,158 రహస్య ప్రదేశంలో ఉన్న కళాఖండాలన్నీ ఒకేసారి మేల్కొంటాయి కదా. 185 00:12:42,158 --> 00:12:45,328 మనం ఆ పని జరగనివ్వకూడదు. అదే కనుక జరిగితే, అంతా అల్లకల్లోలం అయిపోతుంది. 186 00:12:45,328 --> 00:12:47,455 స్థైర్యంగా ఉండండి. మనం వెళ్లి అడ్డుకుందాం. 187 00:12:48,122 --> 00:12:50,833 నాన్నని ఏదైతే ఆవహించి ఉందో, ఇదంతా దాని పనే అంటావా? 188 00:12:50,833 --> 00:12:53,962 కళాఖండాలను మనపైకి చాలాసార్లు ప్రయోగించడం జరిగింది కదా, ఇదే మొదటిసారి కాదు కదా. 189 00:12:53,962 --> 00:12:55,672 మనం దీనికి ముగింపు పలకబోతున్నాం. 190 00:12:55,672 --> 00:12:58,591 మన ఇంటిని, మీ నాన్నని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. 191 00:13:18,611 --> 00:13:20,530 హేయ్, దేవీ, ప్రస్తుత పరిస్థితి ఏంటో చెప్పు. 192 00:13:20,530 --> 00:13:23,157 బయటకు వెళ్లే మార్గాల దగ్గర కాపలాగా ఉన్నా, ఇటుగా ఏవైనా పురుగులు వస్తే, పట్టుకుందామని. 193 00:13:23,741 --> 00:13:25,410 రక్షణ బాధ్యతలు దేవీ చూసుకుంటోంది. 194 00:13:26,160 --> 00:13:27,620 పాండోరా, ఆగు! 195 00:13:30,123 --> 00:13:32,876 అయ్యయ్యో. మన బతుకు బస్టాండే. 196 00:13:32,876 --> 00:13:34,002 ఎందుకు? ఏమైంది? 197 00:13:40,049 --> 00:13:42,635 నాకు అది అస్సలంటే అస్సలు నచ్చలేదు. 198 00:13:42,635 --> 00:13:43,928 ఇంకా దారుణం కానుంది. 199 00:13:43,928 --> 00:13:47,765 లారీ, నేనూ కలిసి తలా ఒక పురుగును పగలగొట్టాం. పురుగులు చాలా ఉన్నాయి. 200 00:13:48,308 --> 00:13:50,018 అవన్నీ తీగపై దాడి చేస్తున్నాయి. 201 00:13:51,603 --> 00:13:52,896 మనం అడ్డుకోవచ్చు కదా. 202 00:13:52,896 --> 00:13:57,066 మనం పురుగులన్నింటినీ పట్టుకోవాలి, శాశ్వతంగా వాటి పీడని వదిలించుకొనే మార్గాన్ని కనుగొనాలి. 203 00:13:57,066 --> 00:14:01,112 ఒక్క దాన్ని కూడా మిస్ కాకూడదు. లేదంటే ఫలితాలు దారుణంగా ఉంటాయి. 204 00:14:01,112 --> 00:14:04,115 రహస్య ప్రదేశంలోని కళాఖండాలన్నీ మేల్కొంటాయి. 205 00:14:04,115 --> 00:14:06,242 ఆ ఆలోచనకే నా వెన్నులో వణుకు పుడుతోంది. 206 00:14:06,242 --> 00:14:09,704 అలా జరగకుండా చూసుకుందాం. దేవీ, నువ్వూ, నేను, హ్యాంక్ ఒక జట్టుగా పని చేద్దాం. 207 00:14:11,372 --> 00:14:13,541 సరే. నాకు ఇక్కడ భలే కిక్కు వస్తోంది. 208 00:14:13,541 --> 00:14:16,127 ఈ ప్రదేశాన్ని నాకు చూపించేటప్పుడు, స్టాన్లీ నాకు చాలా ఉచ్చులని చూపించాడు, 209 00:14:16,127 --> 00:14:18,338 వాటిని పన్నడం ఎంత సులువో కూడా చెప్పాడు. 210 00:14:19,172 --> 00:14:21,299 మేము పురుగులని వెతికి నీ దగ్గరికి తీసుకువస్తాం, 211 00:14:21,299 --> 00:14:22,967 వాటిని నువ్వు కూజాలో పెట్టి ఉంచు, సరేనా? 212 00:14:22,967 --> 00:14:25,553 ఆ పని నేను చేయగలనులే. 213 00:14:25,553 --> 00:14:26,930 మంచిగా వేటాడండి. 214 00:14:29,224 --> 00:14:30,058 జాగ్రత్త, హ్యాంక్. 215 00:14:37,815 --> 00:14:39,108 ఇక్కడున్నావా! 216 00:14:39,609 --> 00:14:40,985 కదలకు. 217 00:14:43,071 --> 00:14:45,740 హేయ్! వలలోకి వచ్చేయ్! 218 00:14:49,160 --> 00:14:50,745 తృటిలో ప్రమాదం తప్పింది. 219 00:14:51,538 --> 00:14:52,914 సహాయానికి థ్యాంక్స్, గురూ. 220 00:14:54,499 --> 00:14:56,209 ఓయ్, లొంగిపో! 221 00:14:56,209 --> 00:14:57,877 ఎక్కడికి వెళ్తున్నావు! పరుగెత్తడం ఆపు! 222 00:15:04,342 --> 00:15:05,718 దొరికావు! 223 00:15:12,058 --> 00:15:14,477 ఓరి దేవుడా, ఇవి చాలా దరిద్రంగా ఉన్నాయి. కూజాని తెరవండి. 224 00:15:24,195 --> 00:15:25,238 అవి చాలా ఉన్నాయి. 225 00:15:25,238 --> 00:15:27,574 వాటన్నింటినీ ఒకేసారి పట్టుకోవడం ఉత్తమం. 226 00:15:28,157 --> 00:15:30,118 సరే. పట్టేసుకుంటా. 227 00:15:31,077 --> 00:15:32,245 దాన్ని పట్టుకో, రస్! 228 00:15:36,749 --> 00:15:37,750 రస్! 229 00:15:38,334 --> 00:15:39,669 అయ్యో. అయ్యయ్యో! 230 00:15:45,800 --> 00:15:48,261 అదరగొట్టేశావు. రంగును బాగా ఉపయోగించావు. 231 00:15:52,724 --> 00:15:54,225 ఎడమ వైపు వస్తున్నాయి. 232 00:16:11,993 --> 00:16:13,119 అయ్య బాబోయ్. 233 00:16:13,119 --> 00:16:15,830 ఒక అమ్మాయిని ఇలాంటి చోటుకు పిలుస్తావా, ఆలెక్స్! 234 00:16:19,500 --> 00:16:20,585 ఆలెక్స్? 235 00:16:21,669 --> 00:16:24,464 ఇక్కడ ఉన్నావా? ఆలెక్స్? 236 00:16:25,465 --> 00:16:27,258 ఈ చెత్త ప్రదేశంలో ఎందుకు కలవమన్నాడబ్బా? 237 00:16:28,092 --> 00:16:29,093 ఆలెక్స్! 238 00:16:38,102 --> 00:16:39,437 ఖచ్చితంగా నాకు శబ్దం అయితే వినిపించింది. 239 00:16:39,437 --> 00:16:41,731 ఇక్కడ ఎక్కడో ఒక పురుగు దాక్కొని ఉంది. 240 00:16:47,028 --> 00:16:48,530 ఈ పని త్వరగా కానిచ్చేద్దాం. 241 00:16:48,530 --> 00:16:51,115 లైట్లు ఉన్నప్పుడే ఈ చోటు భయంకరంగా ఉంటుంది, ఇక ఇప్పుడు చెప్పనక్కర్లేదు. 242 00:16:54,994 --> 00:16:58,456 బాబోయ్! ఆ భారీ తీగలని చూడు. అవి ఇంకెంతో సేపు నిలవవు. 243 00:16:59,082 --> 00:17:01,042 ఆ పురుగు ఆ తీగలను నిలవనివ్వకుండా చేస్తోంది. 244 00:17:21,020 --> 00:17:24,107 బొమ్మలు మాత్రం వద్దు. ఇంకేదైనా పర్వాలేదు. 245 00:17:31,531 --> 00:17:33,157 అన్నీ ఒకేసారి మేల్కొన్నాయి ఎందుకు? 246 00:17:33,157 --> 00:17:36,035 ఆ పెద్ద తీగ వల్లే అయ్యుంటుంది. 247 00:17:36,536 --> 00:17:38,621 అదే వీటన్నింటినీ అదుపులో ఉంచి ఉంటుంది. 248 00:17:39,998 --> 00:17:41,332 మనం దాన్ని ఇప్పుడు తప్పించుకోనివ్వకూడదు. 249 00:17:43,835 --> 00:17:44,836 దొరికావు! 250 00:17:54,429 --> 00:17:56,806 అమ్మా. 251 00:17:58,433 --> 00:18:01,144 అమ్మా. 252 00:18:03,605 --> 00:18:05,356 అమ్మా! అమ్మా! 253 00:18:05,356 --> 00:18:09,027 ఇప్పుడేం చేద్దాం? ఈ కళాఖండాల శాపం సంగతి చూసేంత సమయం ఇప్పుడు మనకి లేదు. 254 00:18:09,027 --> 00:18:10,987 ముందు మనం పురుగులని ఆపాలి, నాన్నకి సాయపడాలి. 255 00:18:10,987 --> 00:18:12,864 వీటి సంగతి తర్వాత చూడవచ్చేమో. 256 00:18:14,115 --> 00:18:15,575 దేవీ, పట్టుకో! 257 00:18:17,160 --> 00:18:18,161 పరుగెత్తు! 258 00:18:52,237 --> 00:18:54,280 - అమ్మా! - వదులెహె! 259 00:18:57,742 --> 00:18:59,118 నీ సంగతి తెలీదు కానీ, 260 00:18:59,118 --> 00:19:01,913 జీవితంలో ఇంకో బొమ్మని చూడాలని నాకు లేదు. 261 00:19:06,918 --> 00:19:10,630 అమ్మా, చూడు, వాల్టులోకి వెళ్లడానికి ఈ తీగలో చాలా వరకు మనం కోసేశాం, గుర్తుందా? 262 00:19:10,630 --> 00:19:12,674 చాలా వరకు మళ్లీ పెరిగిపోయింది. 263 00:19:12,674 --> 00:19:14,968 మంచిది. అంటే దానర్థం చివరికి, 264 00:19:14,968 --> 00:19:18,846 ఈ తీగ, ఆ పిచ్చి బొమ్మలన్నింటినీ మళ్లీ నిద్రావస్థలోకి తీసుకెళ్లగలదనే ఏమో. 265 00:19:19,847 --> 00:19:21,266 రా. 266 00:19:21,266 --> 00:19:23,685 వచ్చి ఈ వలలో పడవే. 267 00:19:45,331 --> 00:19:47,792 అద్గదీ సంగతి! పురుగులను ఎలా నాశనం చేయాలో తెలిసిపోయింది. 268 00:19:47,792 --> 00:19:49,127 వాటిని వేడి నీటిలో పడేయాలి. 269 00:19:49,127 --> 00:19:51,296 మనిద్దరిదీ భలే జోడి. హై ఫై కొట్టుకో! 270 00:19:53,923 --> 00:19:56,426 దీన్ని కొడితే దెబ్బ తగులుతుందేమో. ధన్యవాదాలు. 271 00:19:57,677 --> 00:20:00,221 హ్యాంక్ ట్యాంకులోకి వెళ్లండే, పిచ్చి పురుగులారా. 272 00:20:00,930 --> 00:20:02,348 అవే ఆఖరి పురుగులు. 273 00:20:02,348 --> 00:20:04,684 మీ భయంకరమైన బేస్మెంటులో ఒక్క పురుగు కూడా లేకుండా చేసేశాం. 274 00:20:04,684 --> 00:20:07,103 పురుగులు దీన్ని బాగా నాశనం చేశాయి. 275 00:20:10,106 --> 00:20:13,610 ముళ్లు అలా మెరవడం నేనెప్పుడూ చూడలేదే. 276 00:20:14,194 --> 00:20:15,737 ఏదో తేడా జరుగుతోంది. 277 00:20:15,737 --> 00:20:18,573 ఇది మనకేదో చెప్పాలని చూస్తోంది అనుకుంటా. 278 00:20:24,412 --> 00:20:25,705 ఎక్కడ ఉన్నా నేను? 279 00:20:30,585 --> 00:20:31,586 నాన్నా? 280 00:20:40,136 --> 00:20:41,387 కొర్నీలియస్. 281 00:20:41,888 --> 00:20:43,056 ఆ కొర్నీలియస్ గాడి పనే ఇది! 282 00:20:43,056 --> 00:20:45,225 నాన్నని వాడే నియంత్రిస్తున్నాడు. 283 00:20:45,225 --> 00:20:47,060 కొర్నీలియసే శాపం. 284 00:20:47,060 --> 00:20:50,396 ఇంకా కొర్నీలియస్ బతికే ఉన్నాడా? 285 00:20:50,396 --> 00:20:53,775 ఆలెక్స్ శరీరంలో దాక్కొని ఉన్నాడా? 286 00:20:53,775 --> 00:20:55,235 అది అసలు సాధ్యమా? 287 00:20:55,235 --> 00:20:58,780 నాకు తెలీదు, కానీ తీగ నాకు అదే చెప్పాలని చూసింది. 288 00:20:58,780 --> 00:21:02,242 ఇంకా విచిత్రంగా, అది అర్థవంతంగానూ ఉంది. 289 00:21:02,242 --> 00:21:06,120 అంటే, నల్ల రిబ్బన్ గాడు కొర్నీలియసే, కాపరాజ్ కాదు. 290 00:21:06,621 --> 00:21:08,790 అందుకే అమ్మకి వాల్టులో నల్ల రిబ్బన్ కనిపించింది. 291 00:21:08,790 --> 00:21:13,294 కొర్నీలియస్ నియంత్రణలో ఉన్నప్పుడు ఇనుయిట్ అద్దాలు వేరే రంగును చూపాయి. 292 00:21:13,294 --> 00:21:15,505 అందుకే రిబ్బన్ ముక్కలు ముక్కలుగా కనిపించింది. 293 00:21:15,505 --> 00:21:20,260 సరే, కానీ కొర్నీలియస్ వచ్చాడంటే, ఏదో పన్నాగం పన్నే ఉంటాడు. 294 00:21:20,260 --> 00:21:23,513 మనం అతని జర్నల్స్ ని చాలానే చదివాం, అతనికి ఏదో ప్లాన్ ఉంటుందన్నది సత్యం. 295 00:21:24,097 --> 00:21:25,557 మరి అతనికి ఏం కావాలి? 296 00:21:25,557 --> 00:21:28,768 నాన్న దొంగిలించిన కళాఖండాలతోనే ఏదో పని ఉండుంటుంది. 297 00:21:28,768 --> 00:21:32,772 అంటే, కొర్నీలియస్ గుప్పెట్లో ఉన్న నాన్న దొంగిలించిన కళాఖండాలు, కదా? 298 00:21:32,772 --> 00:21:37,735 అవన్నీ బాబిలాన్ కి చెందిన క్యూనిఫామ్ టాబ్లెట్స్, సుమారుగా క్రీస్తు పూర్వం 3500 కాలానికి చెందినవి. 299 00:21:37,735 --> 00:21:39,612 అది అయితే కాకతాళీయం కాదు. 300 00:21:41,656 --> 00:21:44,450 అతను సార్గోన్ సింహాసనాన్ని మేల్కొల్పాలని చూస్తున్నాడు. 301 00:21:44,450 --> 00:21:45,743 ఇప్పుడు ఇదేంటి కొత్తగా? 302 00:21:45,743 --> 00:21:49,497 అతని దగ్గర ఆ కళాఖండాలన్నీ ఉంటే, అతనేం చేయబోతున్నాడో నాకు తెలుసు. 303 00:21:50,081 --> 00:21:52,500 అతను శాశ్వతంగా ఆలెక్స్ దేహాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తున్నాడు. 304 00:22:00,341 --> 00:22:01,509 వాయమ్మో, ఇక చాలు. 305 00:22:01,509 --> 00:22:05,430 ఇక్కడి నుండి నేను జంప్. గంటలో నేను పూల్ గేమ్ ఆడుకోవాలి. 306 00:22:07,557 --> 00:22:10,393 హాయ్, మార్జీ. ఎలా ఉన్నావు? 307 00:23:02,320 --> 00:23:04,322 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్