1 00:00:17,185 --> 00:00:19,145 ఇప్పుడు సుమారుగా 500 మంది ఉన్నారు, 2 00:00:19,145 --> 00:00:22,065 అందరి ముఖాలూ అదోలా ఉన్నాయి. 3 00:00:22,065 --> 00:00:25,277 ఆ ముఖాలని... వర్ణించడం చాలా కష్టం. 4 00:00:25,277 --> 00:00:26,903 అందరూ షాక్ లో ఉన్నట్టున్నారు. 5 00:00:26,903 --> 00:00:28,863 జాన్ లెనన్ చనిపోయారంటే వాళ్లు నమ్మలేకపోతున్నారు. 6 00:00:28,863 --> 00:00:32,116 అందరి ముఖాలలో విచారం కనిపిస్తోంది. వారు ఇక్కడ ఇతరులతో ముచ్చటించడానికి రాలేదు. 7 00:00:32,116 --> 00:00:33,618 సంతాపం తెలియజేయడానికి వచ్చారు. 8 00:00:34,160 --> 00:00:37,455 జాన్ లెనన్ భార్య, యోకో యోనో, గాయకుని మరణం గురించి... 9 00:00:38,331 --> 00:00:39,249 {\an8}నువ్వంటే నాకు ప్రాణం, జాన్ 10 00:00:39,249 --> 00:00:41,042 {\an8}జాన్ చనిపోయిన మర్నాడు ఉదయం, 11 00:00:42,335 --> 00:00:43,920 {\an8}నేను ద్వారం గుండా లోపలికి వెళ్లాను, 12 00:00:43,920 --> 00:00:46,715 భవనం ముందు ఉన్న కాంపౌండులో 13 00:00:46,715 --> 00:00:49,134 పోలీసులు 'దాటరాదు' అనే లైన్ వేసేశారు. 14 00:00:50,135 --> 00:00:53,054 నేల మీద పగిలిన అద్దం ముక్కలు ఉన్నాయి. 15 00:00:54,681 --> 00:00:57,893 రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ పై జాన్ రక్తం ఉంది... 16 00:00:59,102 --> 00:01:00,103 {\an8}ఎలియట్ మింట్జ్ కుటుంబ సన్నిహితుడు 17 00:01:00,103 --> 00:01:03,356 {\an8}...భవనంలోకి ప్రవేశించే ముందు దాన్ని దాటుకొని వెళ్లాల్సి వచ్చింది. 18 00:01:05,567 --> 00:01:07,277 యోకో కుదేలైపోయి ఉండింది. 19 00:01:07,986 --> 00:01:12,365 సౌండ్ ఆపివేసి ఉన్నా, తను కాసేపు అలా టీవీ చూస్తూ ఉండిపోయింది. 20 00:01:12,365 --> 00:01:16,953 టీవీలో ఒక్కటంటే ఒక్కదాన్నే చూపుతూ ఉన్నారు. 21 00:01:17,829 --> 00:01:23,460 మేము పై అంతస్థులో ఉన్నా కానీ, కింద పాడుతూ ఉన్న పాటలు మాకు వినిపిస్తూ ఉన్నాయి. 22 00:01:24,211 --> 00:01:26,213 అవి చాలా చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. 23 00:01:28,298 --> 00:01:32,719 ఇక ఆమె నన్ను చూసి, "అతను ఎందుకు ఆ పని చేశాడు?" అని అడిగింది. 24 00:02:07,921 --> 00:02:09,421 {\an8}ద క్యాచర్ ఇన్ ద రై 25 00:02:24,104 --> 00:02:26,731 రెండవ ఎపిసోడ్ 26 00:02:26,731 --> 00:02:32,737 దర్యాప్తు 27 00:02:39,035 --> 00:02:41,663 హా. నేను న్యూయార్క్ నగర పోలీసు శాఖకి చెందిన డిటెక్టివ్స్ కి చీఫ్ ని, 28 00:02:42,205 --> 00:02:44,040 నా పేరు జేమ్స్ టీ. సల్లివన్. 29 00:02:46,751 --> 00:02:48,336 జాన్ లెనన్ హత్యకు సంబంధించి, 30 00:02:48,336 --> 00:02:50,547 మాకు ఇప్పుడు ఏం తెలుసు, ఇంకా ఇప్పటిదాకా ఏం జరిగిందో 31 00:02:51,089 --> 00:02:53,174 మీకు చెప్పడానికి 32 00:02:53,174 --> 00:02:55,802 ఇక్కడికి మిమ్మల్ని రమ్మన్నాము. 33 00:02:56,553 --> 00:02:59,723 జాన్ లెనన్ ని హత్య చేసినందుకు, 34 00:03:00,390 --> 00:03:05,520 హవాయ్ లోని 55 దక్షిణ కుకూయ్... కు-కూ-య్ వీధిలో నివాసం ఉండే 35 00:03:06,187 --> 00:03:09,816 మార్క్ డేవిడ్ చాప్మన్ ని అరెస్ట్ చేశాము. 36 00:03:09,816 --> 00:03:12,152 అతను ఏదైనా మానసిక వ్యాధికి చికిత్స తీసుకున్న దాఖలాలేవైనా ఉన్నాయా? 37 00:03:12,152 --> 00:03:13,570 ప్రస్తుతానికి మాకు అవేవీ తెలీవు. 38 00:03:13,570 --> 00:03:15,655 అతని ప్రవర్తన ఎలా ఉంది? సహేతుకంగానే ఉన్నాడా? 39 00:03:16,656 --> 00:03:19,576 - చాలా ప్రశాంతంగా వ్యవహరిస్తున్నాడు. - మిస్టర్ జాన్ లెనన్ ని ఎక్కడ కాల్చాడో... 40 00:03:19,576 --> 00:03:22,078 - కానీ సహేతుకంగానే ఉన్నాడా? - ...మీరు చెప్పగలరా? 41 00:03:22,078 --> 00:03:24,205 మొత్తం... మూడు సార్లు కాల్చడం... లేదు, లేదు. 42 00:03:24,205 --> 00:03:25,457 అతను కాల్చబడ్డాడని నేను చెప్పలేను. 43 00:03:25,457 --> 00:03:27,918 అది వైద్య పరిశీలకుడు చూసి నిర్ణయిస్తాడు. 44 00:03:27,918 --> 00:03:30,795 కానీ ఆయన మీద మొత్తం ఏడు గాయాలు ఉన్నాయి. 45 00:03:32,339 --> 00:03:34,674 అయితే, వాటిలో తూటా దిగినవే కాకుండా, తూటా బయటకు వచ్చినవి కూడా ఉండవచ్చు. 46 00:03:35,550 --> 00:03:37,093 ఎన్ని సార్లు కాల్పులు జరిపారు? 47 00:03:37,093 --> 00:03:39,304 తుపాకీ ఖాళీగా ఉంది. అయిదుసార్లు కాల్చారు. 48 00:03:40,013 --> 00:03:41,932 అతను ఎందుకు కాల్చాడో చెప్పాడా? ఏదైనా కారణముందా? 49 00:03:41,932 --> 00:03:43,225 చెప్పలేదు. 50 00:03:43,225 --> 00:03:45,143 - సరే. థ్యాంక్యూ. - థ్యాంక్యూ. 51 00:03:45,852 --> 00:03:48,438 {\an8}వ్యాఖ్యాత: కీఫర్ సదర్లాండ్ 52 00:03:48,438 --> 00:03:50,148 {\an8}ప్రపంచ మీడియా అంతా 53 00:03:50,148 --> 00:03:52,525 {\an8}న్యూయార్క్ పోలీసు శాఖకు చెందిన ఇరవయ్యో స్టేషన్ ముందు వాలిపోయింది. 54 00:03:52,525 --> 00:03:55,278 జాన్ లెనన్ ని హత్య చేసిన వ్యక్తి గురించి తెలుసుకోవాలని 55 00:03:55,278 --> 00:03:57,739 వాళ్లకి చాలా ఆత్రంగా ఉంది. 56 00:03:57,739 --> 00:03:59,908 వాళ్లు ఎక్కడ గడిపారు? వాళ్లు కలిసి పని చేశారా? 57 00:04:01,159 --> 00:04:02,160 అందరికీ థ్యాంక్యూ. 58 00:04:02,160 --> 00:04:03,995 అక్కడే ఉండటానికి విలేఖరులకి అనుమతినిచ్చారు, 59 00:04:03,995 --> 00:04:06,665 ఆ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులని ఇంటర్వ్యూ చేస్తున్నారు వాళ్లు. 60 00:04:06,665 --> 00:04:08,792 నేను... నేను పేపర్ వర్క్ చేసుకోవాలి, కాస్త ఆగండి. 61 00:04:08,792 --> 00:04:10,252 స్టేషన్ వద్ద, 62 00:04:10,252 --> 00:04:13,630 నన్ను విలేఖర్లు చుట్టుముట్టేశారు, ఎందుకంటే ఏం జరిగిందో అందరికీ తెలుసుకోవాలనుంది. 63 00:04:13,630 --> 00:04:15,298 అతడిని ఎన్నిసార్లు కాల్చడం జరిగింది? 64 00:04:15,298 --> 00:04:17,425 అతను స్పృహ తప్పిపోయాడా? 65 00:04:17,425 --> 00:04:19,469 అతను... నాకు తెలిసినంత వరకు, అతను స్పృహలో లేడు. 66 00:04:19,469 --> 00:04:21,137 అతను మూలుగుతున్నాడా, ఏమైనా చెప్పాడా? 67 00:04:21,137 --> 00:04:22,305 - లేదు. - మరి యోకో ఎలా ఉండింది? 68 00:04:23,056 --> 00:04:25,016 ఆమె బాగా కృంగిపోయి ఉండింది. హా. 69 00:04:25,016 --> 00:04:28,687 {\an8}ఇంగ్లండు నుండి వచ్చినవాళ్లు ఉన్నారు, జర్మనీ నుండి వచ్చినవాళ్లు ఉన్నారు... 70 00:04:28,687 --> 00:04:29,604 {\an8}టోనీ పాల్మా న్యూయార్క్ పోలీసు ఆఫీసర్ 71 00:04:29,604 --> 00:04:32,190 {\an8}...వాళ్లందరూ నాతో మాట్లాడాలని చూస్తూ ఉన్నారు... 72 00:04:32,190 --> 00:04:36,820 ఇది ప్రపంచాన్ని కుదిపేసిన ఒక పెద్ద కేసు, 73 00:04:36,820 --> 00:04:39,155 ఏం జరిగిందో అందరికీ తెలుసుకోవాలనుంది. 74 00:04:39,155 --> 00:04:41,157 పైనున్న అనుమానితుడి గురించి మీకు వివరాలేమైనా తెలిశాయా? 75 00:04:41,157 --> 00:04:42,993 - మీకేం సమాచారం అందింది? - నాకేమీ తెలీదు. 76 00:04:42,993 --> 00:04:45,328 మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు? 77 00:04:45,328 --> 00:04:47,330 - అప్పటికే కస్టడీలో ఉన్నాడు. - ఎవరి దగ్గర? 78 00:04:47,330 --> 00:04:48,999 పోలీస్ ఆఫీసర్ స్పీరో దగ్గర ఉన్నాడు. 79 00:04:49,583 --> 00:04:51,918 అనుమానితుని గురించి ఏమైనా చెప్పగలరా? 80 00:04:51,918 --> 00:04:53,211 అంటే, మామూలుగా మీకు అనిపించింది ఏంటో. 81 00:04:53,837 --> 00:04:58,675 డిటెక్టివ్స్ ఆఫీదు వద్ద ఉన్న చాప్మన్ ని ఓ కంట కనిపెట్టమని నాకు చెప్పినప్పుడు, 82 00:04:59,634 --> 00:05:01,344 నాకు భలే షాకింగ్ గా అనిపించీంది, 83 00:05:01,845 --> 00:05:07,017 ఎందుకంటే జాన్ లెనన్ ని చంపిన వ్యక్తితో నేను కూర్చోవాల్సి వచ్చింది. 84 00:05:08,018 --> 00:05:09,811 మొదట అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు, 85 00:05:10,604 --> 00:05:14,024 కానీ కాసేపయ్యాక కంగారుపడటం ప్రారంభించాడు, నిలువునా వణికిపోసాగాడు. 86 00:05:14,691 --> 00:05:18,320 ఇంతలో ఒక డిటెక్టివ్ వచ్చి చెప్పారు, "హవాయిలో ఉన్న మీ భార్యకు మేము సమాచారం అందించాం..." 87 00:05:18,904 --> 00:05:22,365 అప్పుడు అతను చాలా కలత చెందాడు, కంగారుపడిపోయాడు. 88 00:05:22,365 --> 00:05:24,451 "నేను బాత్రూమ్ కి వెళ్లాలి," అని అన్నాడు. 89 00:05:24,451 --> 00:05:26,745 "సరే, నేను తీసుకెళ్తా," అని అన్నాను నేను. 90 00:05:26,745 --> 00:05:28,496 అలా అతడిని బాత్రూమ్ తీసుకెళ్లాను. 91 00:05:29,456 --> 00:05:31,917 అక్కడ ఉన్నప్పుడు అతడిని ఒకటి అడిగాను, 92 00:05:31,917 --> 00:05:33,668 "నువ్వేం చేశావో నీకు అర్థమవుతోందా?" అని. 93 00:05:34,461 --> 00:05:38,381 దానికి అతను, "హా, నన్ను నేను చంపుకున్నాను. నేను జాన్ లెనన్ ని," అని అన్నాడు. 94 00:05:39,799 --> 00:05:42,761 అప్పుడు నేను అతడిని అదోలా చూశాను, 95 00:05:42,761 --> 00:05:45,180 కిటికీ నుండి అతడిని బయటకు విసిరిపారేయాలని అనిపించింది, కానీ... 96 00:05:47,807 --> 00:05:50,435 పోలీసులు, చాప్మన్ నుండి తొలి వాంగ్నూలాన్ని తీసుకున్నారు. 97 00:05:51,019 --> 00:05:53,313 ఆ తర్వాత భార్యతో మాట్లాడటానికి అతనికి అనుమతి ఇచ్చారు. 98 00:05:56,024 --> 00:05:57,067 {\an8}ఇరవయ్యో స్టేషన్ 99 00:05:57,067 --> 00:05:58,818 {\an8}న్యూయార్క్ నగర పోలీస్ శాఖ 100 00:05:58,818 --> 00:06:00,362 {\an8}- హలో, గ్లోరియా? - అవును, చెప్పండి. 101 00:06:00,362 --> 00:06:02,405 {\an8}సరే. నేను పోలీస్ ఆఫీసర్ స్పీరోని. 102 00:06:02,405 --> 00:06:04,324 - చెప్పండి. - నేను ఇప్పుడు మీ భర్తతో ఉన్నాను. 103 00:06:04,324 --> 00:06:06,117 - అయ్యో. అతనేమైనా... - ఆయనకి ఏమీ కాలేదని 104 00:06:06,117 --> 00:06:08,578 మీకు చెప్పడానికి మీకు ఫోన్ కలిపి ఇవ్వమన్నాడు. 105 00:06:08,578 --> 00:06:10,497 - హా. - ఇప్పుడు ఆయనే మీతో మాట్లాడతాడు. 106 00:06:12,582 --> 00:06:15,877 చాప్మన్ ముఖ్యమైన సమాచారం ఏమైనా చెప్తాడేమో అని 107 00:06:15,877 --> 00:06:17,671 వారి సంభాషణని రికార్డ్ చేశారు. 108 00:06:18,213 --> 00:06:19,923 {\an8}- హాయ్. - హాయ్, మార్క్. 109 00:06:20,507 --> 00:06:21,925 {\an8}నీ దగ్గర పోలీసులు ఉన్నారా? 110 00:06:21,925 --> 00:06:25,428 {\an8}లేదు. మొదట నాకు ఒక విలేఖరి నుండి ఫోన్ వచ్చింది. 111 00:06:25,428 --> 00:06:27,472 {\an8}నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు. 112 00:06:27,472 --> 00:06:31,268 {\an8}నాకు తెలుసు, కానీ నేను అక్కడికి వస్తే నీకు ఓకేనా? 113 00:06:32,394 --> 00:06:34,187 {\an8}- ఎక్కడికి? - న్యూయార్కుకి. 114 00:06:34,187 --> 00:06:38,650 {\an8}వద్దు, వద్దు. అక్కడే ఉండు. 115 00:06:39,442 --> 00:06:41,945 {\an8}నువ్వెంత పని చేశావో ఇప్పటికైనా నీకు తెలుసొచ్చిందా? 116 00:06:44,614 --> 00:06:47,951 సరే. ఏదేమైనా నీపై ప్రేమ తగ్గదు. నీపై ప్రేమ ఎప్పటికీ తగ్గదు. 117 00:06:48,660 --> 00:06:50,704 నాకు కూడా నీపై ప్రేమ ఎప్పటికీ తగ్గదు. లవ్ యూ. 118 00:06:50,704 --> 00:06:52,080 సరే మరి. బై. 119 00:06:53,957 --> 00:06:57,460 ఇక్కడ సమస్య మనకి కావాల్సిన వాడా దొరికాడా అనేది కాదు. 120 00:06:58,879 --> 00:07:00,088 {\an8}హంతకుడు దొరికేశాడు. 121 00:07:00,088 --> 00:07:01,006 {\an8}రాన్ హాఫ్మన్ న్యూయార్క్ పోలీస్ డిటెక్టివ్ 122 00:07:01,006 --> 00:07:03,800 {\an8}ఆ విషయంలో సందేహమే లేదు, కానీ అతనికి ఎవరైనా సాయం చేశారా అనే 123 00:07:03,800 --> 00:07:09,264 {\an8}కోణాన్ని కూడా పూర్తిగా దర్యాప్తు చేయాలన్నదే మా లక్ష్యం. 124 00:07:10,724 --> 00:07:13,602 అతను ఎవరితోనైనా ఉన్నప్పుడు ఎవరైనా చూశారా అనే కోణాన్ని కూడా 125 00:07:13,602 --> 00:07:16,855 నేను దర్యాప్తు చేయాలనుకున్నాను, ఆలస్యమైతే వాళ్లు అదృశ్యమైపోయే ప్రమాదముంది. 126 00:07:19,941 --> 00:07:21,651 ట్యాక్సీ డ్రైవర్ అయిన రిచర్డ్ పీటర్సన్ 127 00:07:22,152 --> 00:07:24,362 సాయం అందిస్తానని ముందుకు వచ్చి కీలక సాక్షి అయ్యాడు. 128 00:07:26,114 --> 00:07:29,326 {\an8}నేను పోలీస్ స్టేషనుకు వెళ్లినప్పుడు, అక్కడ అంతా గందరగోళంగా ఉంది. 129 00:07:29,326 --> 00:07:30,493 {\an8}రిచర్డ్ పీటర్సన్ ట్యాక్సీ డ్రైవర్ 130 00:07:30,493 --> 00:07:31,995 {\an8}చాలా గందరగోళంగా అన్నమాట. 131 00:07:32,579 --> 00:07:35,373 {\an8}మీడియా వాళ్లు అప్పుడప్పుడే అక్కడికి చేరుకుంటున్నారు. 132 00:07:35,373 --> 00:07:36,666 అది చాలా ముఖ్యమైన విషయం. 133 00:07:38,376 --> 00:07:41,755 వాళ్లు నన్ను విచారించారు, నేను చూసినది చూసినట్టు వాళ్లకి చెప్పాను. 134 00:07:41,755 --> 00:07:45,091 కానీ నా చేత వాళ్లు దాన్ని కనీసం వెయ్యిసార్లైనా చెప్పించి ఉంటారు, 135 00:07:45,634 --> 00:07:47,761 ఎందుకంటే, జరిగింది మామూలు వింత కాదు కదా. 136 00:07:49,888 --> 00:07:51,306 లెనన్ ని కాల్చిన తర్వాత, 137 00:07:52,140 --> 00:07:54,559 తుపాకీ పట్టుకొని చాప్మన్ ఎక్కడికీ పోకుండా, అక్కడే ఉన్నాడు. 138 00:07:56,978 --> 00:08:01,191 అతను తుపాకీని కింద పడేసి, కోటును తీసేశాడు, 139 00:08:01,942 --> 00:08:04,194 ఒక పుస్తకాన్ని తీసి పైకెత్తి పట్టుకున్నాడు. 140 00:08:04,194 --> 00:08:05,403 "క్యాచర్ ఆన్ ద రై" పుస్తకం. 141 00:08:09,950 --> 00:08:12,619 ఈ వింత ప్రవర్తన గురించి, నేరం జరిగిన చోటుకు 142 00:08:12,619 --> 00:08:15,121 అందరి కన్నా ముందు వచ్చిన పోలీస్ ఆఫీసర్లలో ఒకరు కూడా చెప్పారు. 143 00:08:16,623 --> 00:08:20,752 {\an8}చాప్మన్ ని అదుపులోకి తీసుకున్నప్పుడు మాకు ఎదురైన ఒక విచిత్రమైన విషయం ఏంటంటే... 144 00:08:20,752 --> 00:08:21,836 {\an8}హర్బ్ ఫ్రావున్బర్గర్ న్యూయార్క్ పోలీస్ ఆఫీసర్ 145 00:08:21,836 --> 00:08:25,298 {\an8}...అతను పారిపోయే ప్రయత్నమేమీ చేయకుండా, తాపీగా పుస్తకం చదువుతూ ఉన్నాడు. 146 00:08:26,883 --> 00:08:29,886 అతనికి ఒకట్రెండు నిమిషాల సమయం ఉండింది, 147 00:08:29,886 --> 00:08:32,889 దాన్ని ఉపయోగించుకొని అతను పార్కులోకి వెళ్లిపోయి పరారై పోయి ఉండవచ్చు, 148 00:08:33,515 --> 00:08:35,433 విమానం ఎక్కేసి హవాయికి చెక్కేసి ఉండవచ్చు. 149 00:08:35,933 --> 00:08:37,185 అప్పుడు ఎవరికీ తెలిసేది కాదు కదా? 150 00:08:41,147 --> 00:08:44,693 దర్యాప్తు అయ్యాక, పోలీసులు చాప్మన్ పై హత్య కేసు వేశారు. 151 00:08:47,028 --> 00:08:49,030 అతడిని స్టేషన్ నుండి 152 00:08:49,030 --> 00:08:51,032 {\an8}కోర్టుకు తరలించేటప్పుడు, ఒకవేళ... 153 00:08:51,032 --> 00:08:51,950 {\an8}పీటర్ కలెన్ న్యూయార్క్ పోలీసు ఆఫీసర్ 154 00:08:51,950 --> 00:08:54,077 {\an8}ఎవరైనా ఇతడిని కాల్చి చంపే అవకాశముందని అనిపించింది. 155 00:08:54,077 --> 00:08:55,996 {\an8}కాబట్టి, చాప్మన్ లా వేరే వ్యక్తిని కూడా తరలిద్దామని ప్లాన్ చేశాం. 156 00:08:57,163 --> 00:09:00,166 కానీ, దానికి సిద్ధపడి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వ్యక్తి కావాలి కదా. 157 00:09:01,293 --> 00:09:03,670 జీవితం మీద ఆశలు అంతగా లేని వ్యక్తి అన్నమాట. 158 00:09:03,670 --> 00:09:07,173 అలా ముందుకు ఎవరు వచ్చారో నాకు తెలీదు. కానీ జరిగింది మాత్రం అదే. 159 00:09:09,134 --> 00:09:12,220 స్టీవ్ ఒకరిని తీసుకెళ్తున్నట్టు ఫోటో ఉంది కదా, ఆ ఫోటోలో ఉండేది చాప్మన్ కాదు. 160 00:09:13,179 --> 00:09:15,640 పోలీస్ 161 00:09:15,640 --> 00:09:20,687 అతను వేరే తలుపు గుండా వెళ్లి ఒక పెట్రోల్ బండిలో కోర్టుకు వెళ్లాడు. 162 00:09:25,233 --> 00:09:27,861 అతడిని విచారణ కోసం కోర్టుకు తరలిస్తూ ఉండగా, 163 00:09:27,861 --> 00:09:30,155 ప్రపంచ నలుమూలలా ఉన్న విలేఖరులు 164 00:09:30,155 --> 00:09:33,450 మార్క్ చాప్మన్ ఎవరో కనుగొనే పనిలో పడ్డారు. 165 00:09:34,200 --> 00:09:37,287 బీటిల్స్ అభిమానులు సొంతంగా ప్రార్థనలు చేసుకుంటూ సంతాపం తెలియజేస్తున్నా, 166 00:09:37,287 --> 00:09:39,414 అందరి మదిలో ఒకే ప్రశ్న ఉంది. 167 00:09:39,414 --> 00:09:41,625 ఎవరైనా జాన్ లెనన్ ని ఎందుకు చంపాలనుకుంటారు? 168 00:09:41,625 --> 00:09:45,337 అనుమానితుడు, పాతికేళ్ల మార్క్ డేవిడ్ చాప్మన్ అని గుర్తించడం జరిగింది. 169 00:09:45,337 --> 00:09:47,839 మార్క్ డేవిడ్ చాప్మన్, హొనొలులూకి చెందిన, ఉద్యోగం లేని సెక్యూరిటీ గార్డ్. 170 00:09:47,839 --> 00:09:49,299 మార్క్ డేవిడ్ చాప్మన్, 171 00:09:49,299 --> 00:09:52,177 హవాయిలోని హొనొలులూకి చెందిన ఫ్రీలాన్స్ పోటోగ్రాఫరుగా గుర్తించడం జరిగింది. 172 00:09:52,177 --> 00:09:54,429 చాప్మన్, క్యాసిల్ మెమోరియల్ ఆసుపత్రిలో 173 00:09:54,429 --> 00:09:56,389 పనివాడిగా, ప్రింటర్ గా విధులు నిర్వర్తించేవాడని మాకు తెలిసింది... 174 00:09:56,389 --> 00:09:59,267 ...ఫోటో. కొత్త విషయం వెలుగులోకి వచ్చే కొద్దీ, 175 00:09:59,267 --> 00:10:02,187 మార్క్ డేవిడ్ చాప్మన్ ఎవరు అనేది కూడా మారిపోతూ ఉంది. 176 00:10:02,687 --> 00:10:05,273 జాన్ లెనన్ ఎవరు అనేది యావత్ ప్రపంచానికి తెలుసు, 177 00:10:05,273 --> 00:10:07,150 ఇప్పుడు మనం తలలు పట్టుకుంటున్నాం... 178 00:10:07,150 --> 00:10:09,694 అతడిని చంపింది ఎవరు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, 179 00:10:09,694 --> 00:10:12,113 కారణం ఏమిటి అనేది అర్థం చేసుకోవడానికేమో. 180 00:10:16,451 --> 00:10:18,662 హత్యకు ముందు రోజు రాత్రి, చాప్మన్, షెరాటన్ హోటల్ లో దిగినట్లు 181 00:10:18,662 --> 00:10:20,580 పోలీసులు కనుగొన్నారు. 182 00:10:20,580 --> 00:10:21,957 {\an8}షెరాటన్ సెంటర్ 183 00:10:25,585 --> 00:10:28,755 అతను దిగిన హోటల్ గదిని సోదా చేయడానికి, వారెంట్ ఇవ్వమని జడ్జిని కోరారు. 184 00:10:28,755 --> 00:10:30,799 డిటెక్టివ్స్ అక్కడికి చేరుకున్నారు. 185 00:10:39,724 --> 00:10:41,851 అనుమానితుడిని అరెస్ట్ చేశాక, 186 00:10:41,851 --> 00:10:46,565 మేము హొటల్ గదికి వెళ్లాం, లోపలికి ప్రవేశించడానికి అనుమతి సంపాదించాం. 187 00:10:53,363 --> 00:10:59,327 డ్రెస్సింగ్ టేబుల్ మీద ఫోటోలను ఇంకా కొన్ని... 188 00:10:59,327 --> 00:11:01,913 చాప్మన్ వస్తువులను మేము కనుగొన్నాం. 189 00:11:02,831 --> 00:11:05,417 మాకు కనిపించాలనే వాటిని అక్కడ ఉంచాడు. 190 00:11:08,128 --> 00:11:11,256 "ప్రతివాది బల్ల మీద ఈ కింద పేర్కొన్న వస్తువులని ఉంచారు: 191 00:11:12,674 --> 00:11:17,304 అతని పాస్ పోర్ట్, టాడ్ రండ్గ్రెన్ పాడిన పాటకు చెందిన 8-ట్రాక్ టేపు ఒకటి, 192 00:11:17,304 --> 00:11:21,641 ఇంకా జాన్ రాసిన అధ్యాయం గల పేజీని చూపుతూ తెరిచి పెట్టి ఉన్న బైబిల్. 193 00:11:21,641 --> 00:11:24,936 ఆ వ్యక్తిగత వస్తువుల మధ్యలో, 194 00:11:24,936 --> 00:11:27,606 అతను ఒక చిన్న "విజర్డ్ ఆఫ్ ఆజ్" పోస్టరును ఉంచాడు. 195 00:11:28,523 --> 00:11:32,193 "వియత్నాం నుండి వచ్చిన శరణార్థుల పిల్లలతో అతను పని చేసిన 196 00:11:32,944 --> 00:11:36,239 ఫోర్ట్ చాఫీలోని మాజీ వైఎంసీ సూపర్వైజర్ నుండి వచ్చిన ఒక లేఖ." 197 00:11:36,239 --> 00:11:40,619 అతను... మొదట్నుంచీ పిల్లల కోసం, లేదా ఆసరా అవసరమైన వ్యక్తుల కోసం 198 00:11:41,786 --> 00:11:43,163 పని చేసినట్టుగా అనిపించింది. 199 00:11:45,123 --> 00:11:47,834 చాప్మన్ పరిచిన వస్తువులను బట్టి, అతను హత్య చేయాలని 200 00:11:47,834 --> 00:11:50,253 ముందే అనుకున్నాడని చెప్పేయవచ్చని కొందరి వాదన. 201 00:11:50,253 --> 00:11:52,255 హత్యని ప్లాన్ చేయడమే కాకుండా, 202 00:11:52,756 --> 00:11:55,592 పోలీసులు దర్యాప్తు సాగే తీరును కూడా అతను ఊహించాడు. 203 00:11:59,930 --> 00:12:02,098 కానీ చాప్మన్ డిఫెన్స్ బృందం, 204 00:12:02,098 --> 00:12:05,101 అతను వస్తువులను అలా పరచడం, అతని మానసిక స్థితి బాగాలేదనడానికి సంకేతమని వాదించింది. 205 00:12:05,101 --> 00:12:06,019 క్రిమినల్ కోర్టు 206 00:12:06,019 --> 00:12:08,521 మార్క్ చాప్మన్ న్యాయవాది అయిన హర్బర్ట్ ఆడల్బర్గ్ 207 00:12:08,521 --> 00:12:10,857 మరొక వాదనని ముందుకు తెచ్చి, 208 00:12:10,857 --> 00:12:13,318 చాప్మన్ ని మానసిక పరిస్థితిని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని కోర్టుని నమ్మించారు. 209 00:12:14,277 --> 00:12:15,403 {\an8}అతను అయోమయంలో ఉన్నట్టున్నాడు. 210 00:12:15,403 --> 00:12:16,404 {\an8}హర్బర్ట్ ఆడల్బర్గ్ లాయర్ 211 00:12:16,404 --> 00:12:19,491 {\an8}నాకు అర్థమైనంత వరకు, ప్రస్తుతం అతని లాయరుకే 212 00:12:19,491 --> 00:12:21,952 అతను పూర్తిగా సహకరించే స్థితిలో లేడు, ఇంకా... 213 00:12:22,744 --> 00:12:23,745 అలా అని మీరెలా అంటున్నారు? 214 00:12:23,745 --> 00:12:26,665 నేను అడిగే ప్రశ్నలకు, అతని సమాధానాలకు పొంతన ఉండటం లేదు, 215 00:12:27,249 --> 00:12:29,834 మరీ ముఖ్యంగా హత్యా ఉదంతానికి సంబంధించిన ప్రశ్నలకు. 216 00:12:31,086 --> 00:12:32,712 కాబట్టి విచారణ కొనసాగించే ముందు 217 00:12:32,712 --> 00:12:36,174 అతని మానసిక పరిస్థితిని విశ్లేషించడం మంచిదని నా అభిప్రాయం. 218 00:12:36,758 --> 00:12:39,886 {\an8}బెలెవ్యూ ఆసుపత్రి 219 00:12:39,886 --> 00:12:41,846 {\an8}చాప్మన్ ని పరీక్షించడానికి కారాగార ఆసుపత్రి అయిన 220 00:12:41,846 --> 00:12:44,474 {\an8}బెలెవ్యూ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 221 00:12:46,434 --> 00:12:49,729 అసిస్టెంట్ కమిషనర్ ఎడ్ హెర్షీ అతని రాక కోసం ఎదురు చూస్తున్నారు. 222 00:12:51,356 --> 00:12:53,650 చాప్మన్ ని తీసుకొచ్చినప్పుడు నేను బెలెవ్యూలోనే ఉన్నాను. 223 00:12:57,737 --> 00:13:00,365 నేను, అతనితో, అలాగే అతనికి ఎస్కార్టుగా వచ్చిన పోలీసు ఆఫీసరుతో 224 00:13:00,365 --> 00:13:02,867 మా జైలు సముదాయం ఉన్న అంతస్థుకు 225 00:13:04,452 --> 00:13:06,746 {\an8}లిఫ్టులో వెళ్తున్నాం. 226 00:13:06,746 --> 00:13:07,831 {\an8}ఎడ్ హెర్షీ న్యూయార్క్ ప్రభుత్వ దిద్దుబాటు శాఖ 227 00:13:07,831 --> 00:13:10,959 ఇద్దరమూ పక్కపక్కనే నిలబడి ఉన్నాం. 228 00:13:10,959 --> 00:13:15,463 "నువ్వు బాగానే ఉన్నావా?" అని నేను అడిగితే, తల ఊపాడు. 229 00:13:17,716 --> 00:13:20,176 అతను చాలా మామూలు వ్యక్తిలాగానే అనిపించాడు నాకు. 230 00:13:20,176 --> 00:13:22,846 అతనిలో తేడాగా, ప్రత్యేకంగా నాకేమీ కనిపించలేదు. 231 00:13:23,847 --> 00:13:25,348 నేను ఏంటా అని ఆలోచించడం మొదలుపెట్టాను, 232 00:13:25,348 --> 00:13:28,351 ఎందుకంటే, నేను చూసిందేంటో వెళ్లి విలేఖరులకి చెప్పాలి. 233 00:13:28,351 --> 00:13:30,604 అతను ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించాడు. 234 00:13:30,604 --> 00:13:33,940 అతని హావభావాల్లో నటన అస్సలు లేదు. 235 00:13:34,566 --> 00:13:38,361 మాజీ బీటిల్స్ సభ్యుడైన జాన్ లెనన్ ని చంపాడన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన మార్క్ చాప్మన్ 236 00:13:38,361 --> 00:13:40,739 బెలెవ్యూ ఆసుపత్రి అనే ఈ కారాగార యూనిట్ లోనే ఉన్నారు, 237 00:13:40,739 --> 00:13:45,118 ఆయన రెండవ అంతస్థులో ఉండే జైల్లో ఉన్నారు, ఈ సందర్భంగా దిద్దుబాటు శాఖ 238 00:13:45,118 --> 00:13:46,912 పెద్ద ఎత్తున భద్రతా చర్యలు తీసుకుంది. 239 00:13:49,664 --> 00:13:52,500 చాప్మన్ ని ఇప్పుడు మానసిక వైద్య నిపుణులు పరిశీలిస్తున్నారు, 240 00:13:53,001 --> 00:13:57,839 డాక్టర్ నయోమీ గోల్డ్ స్టీన్, అతని మానసిక స్థితిని, విచారణని ఎదుర్కొనేంత సామర్థ్యం అతనికి ఉందా అని పరిశీలిస్తారు. 241 00:13:57,839 --> 00:14:00,675 నయోమీ గోల్డ్ స్టీన్, ఎం.డీ. 242 00:14:00,675 --> 00:14:04,304 తను కనుగొన్న వాటిని ప్రజాముఖంగా ఇప్పటిదాకా ఆమె వెల్లడించలేదు. 243 00:14:05,222 --> 00:14:07,140 {\an8}వాళ్లు అతడిని లోపలికి పంపించారు, అతను లోపలికి వచ్చాడు. 244 00:14:07,140 --> 00:14:08,058 {\an8}డాక్టర్ నయోమీ గోల్డ్ స్టీన్ మానసిక వైద్యురాలు 245 00:14:08,058 --> 00:14:11,603 {\an8}నేను "హాయ్, నేను డాక్టర్ గోల్డ్ స్టీన్ ని. ఇక్కడ కూర్చుంటారా?" అని అడిగాను. 246 00:14:12,312 --> 00:14:15,398 ఏం జరిగిందో, ఆ పని ఎందుకు చేశాడో తెలుసుకోవాలనుకున్నాను. 247 00:14:16,691 --> 00:14:18,735 నాకు గుర్తున్నంత వరకు, మేము చాలా సేపే మాట్లాడుకున్నాం. 248 00:14:19,819 --> 00:14:21,947 అతను చాలా కోణాలు చూపించాడు. 249 00:14:22,656 --> 00:14:26,701 అతను తిక్కగా మాట్లాడగలడు, చక్కగా మాట్లాడగలడు, విసుగు తెప్పించేలా కూడా మాట్లాడగలడు. 250 00:14:28,578 --> 00:14:33,667 అతను సూటిగా సమాధానాలు ఇవ్వకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు, 251 00:14:34,584 --> 00:14:36,127 కాబట్టి అది చిక్కుముడిలా అనిపించింది. 252 00:14:39,506 --> 00:14:43,260 "చక్కగా, సంబంధితంగా, హేతుబద్ధంగా మాట్లాడుతున్నాడు. 253 00:14:44,261 --> 00:14:48,098 కంగారు ఎక్కువ, అతిగా ఉద్రేకపడిపోతున్నాడు, ఊరికే అలిసిపోతున్నాడు, 254 00:14:48,640 --> 00:14:52,394 కానీ సహకరిస్తున్నాడు, సముచితంగా, అడిగిన దానికి సమాధానం ఇస్తున్నాడు." 255 00:14:52,394 --> 00:14:54,271 అంటే, అతను నాతో మాట్లాడాడనే అర్థం. 256 00:14:59,276 --> 00:15:03,530 నేను యోకోతో పాత పడకగదిలో ఉన్నప్పుడు, 257 00:15:03,530 --> 00:15:09,202 వేలాది మంది జాన్ పాటలు పాడుతూ ఉండటం మాకు వినిపించింది. 258 00:15:11,079 --> 00:15:13,039 వీడ్కోలు, జాన్ 259 00:15:17,919 --> 00:15:22,632 {\an8}అందరి కన్నా ముందు కాల్ చేసింది, వచ్చిందీ రింగోనే. 260 00:15:24,426 --> 00:15:29,139 {\an8}జాన్ కి రింగో అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ అతని గురించే, అది కూడా వెలిగిపోతూ చెప్పేవాడు. 261 00:15:30,140 --> 00:15:33,184 నేను డకోటా భవనంలోకి వెళ్లాను. 262 00:15:33,184 --> 00:15:35,687 "నీ బాధని అర్థం చేసుకోగలను," అని యోకోతో అన్నాను. 263 00:15:36,354 --> 00:15:38,398 దానికి ఆమె ఏ మాత్రం తడుముకోకుండా 264 00:15:38,398 --> 00:15:39,900 "నువ్వు అర్థం చేసుకోలేవు," అని అనేసింది. 265 00:15:39,900 --> 00:15:42,402 ఎందుకంటే, నేను అతనికి ఎంత సన్నిహితుడినైనా అయ్యుండవచ్చు, 266 00:15:43,612 --> 00:15:46,364 కానీ ఆమెతో పోల్చుకుంటే ఆ సాన్నిహిత్యం రవ్వంత మాత్రమే. 267 00:15:49,367 --> 00:15:52,412 {\an8}పోలీస్ లైన్ దాటరాదు 268 00:15:53,455 --> 00:15:55,957 మేము అక్కడ ఉన్నప్పుడు చాలా మంది జనాలు 269 00:15:55,957 --> 00:15:59,002 యోకోని ఉద్దేశించి, లేదా షాన్ ని ఉద్దేశించి "కిటికీ వద్దకు రండి," అని అరవసాగారు. 270 00:16:00,670 --> 00:16:03,006 అంటే... వాళ్లందరూ ఆమె పాటకి ఆమెని వదిలేస్తేనే మేలేమో, 271 00:16:03,006 --> 00:16:06,885 ఎందుకంటే, ఏం చేసినా అతడిని ఎవరూ వెనక్కి తీసుకురాలేరు. 272 00:16:06,885 --> 00:16:09,512 పైగా, ఇంటి బయటే అంత మంది జనం ఉండి, అతని పాటలు పాడుతూ ఉండట వలన 273 00:16:10,388 --> 00:16:11,765 ఆమెకి ఊరట కొంచెం కూడా కలగదు. 274 00:16:17,896 --> 00:16:19,522 మేము బయటకు వచ్చినప్పుడు, 275 00:16:21,149 --> 00:16:24,819 తమకి బీటిల్స్ అంటే ప్రాణమని, లేదా ఇంకోటని నాకు వాళ్లు చెప్పాల్సిన అవసరం లేదు, 276 00:16:24,819 --> 00:16:27,739 ఎందుకంటే, జాన్ మాకు అప్పుడే దూరమయ్యాడు. 277 00:16:27,739 --> 00:16:30,033 ఎందుకంటే, నేను అక్కడికి వచ్చింది మాజీ బీటిల్స్ సభ్యుడిని చూడటానికి కాదు, 278 00:16:30,533 --> 00:16:33,411 బ్యాండుతో సంబంధం లేకుండా, నా ఆప్తులని చూడటానికి వచ్చాను. 279 00:16:40,544 --> 00:16:44,130 డిసెంబర్ 9, 1980న యోకో రాసిన లేఖ ఇది. 280 00:16:44,798 --> 00:16:47,008 "జాన్ కి అంత్యక్రియలు నిర్వహించడం లేదు. 281 00:16:47,717 --> 00:16:53,056 ఈ వారం చివర్లో, అతని ఆత్మ శాంతికై నిశ్శబ్దంగా ప్రార్థన చేయడానికి ముహూర్తం చూసుకుంటాం." 282 00:16:55,058 --> 00:16:57,852 జాన్ ని ఖననం చేయాలని నిర్ణయించడం జరిగింది, 283 00:16:58,687 --> 00:17:03,275 నేటి వరకు అతడిని ఎక్కడ ఖననం చేశారో సరిగ్గా ఎవరికీ తెలీదు. 284 00:17:06,777 --> 00:17:10,489 కారణమేమీ లేకుండా ఉన్నట్టుండి లెనన్ ని హత్య చేయడంతో 285 00:17:10,489 --> 00:17:14,077 అతని ఆప్తులు సమాధానాల కోసం ఆత్రంగా ఎదురుచూడసాగారు. 286 00:17:15,078 --> 00:17:18,081 ఈ విషయాన్ని నేనెప్పుడూ వెల్లడించలేదు. 287 00:17:19,708 --> 00:17:23,169 ఒకసారి యోకో నన్ను ఒకటి అడిగింది, 288 00:17:23,169 --> 00:17:26,673 జాన్ హత్యకు సంబంధించి, పుట్టుకొచ్చిన అనేక సిద్ధాంతాలను, 289 00:17:26,673 --> 00:17:31,970 కుట్ర కోణాలను పరిశీలించమని నన్ను కోరింది. 290 00:17:34,306 --> 00:17:38,226 ఎవరో వెనుక ఉండి లెనన్ ని హత్య చేయించారు అని కొందరి నమ్మకం. 291 00:17:38,226 --> 00:17:39,644 హత్యల సంఖ్యలో యు.ఎస్.ఏ రికార్డులన్నింటినీ అధిగమించింది! 292 00:17:39,644 --> 00:17:44,316 1970ల కాలంలో, అమెరికా రాజకీయాల గురించి ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవాడు, 293 00:17:44,316 --> 00:17:47,444 అతని భారీ అభిమానుల సైన్యాన్ని ప్రెసిడెంట్ నిక్సన్ కి వ్యతిరేకంగా, వియాత్నాం యుద్ధాని వ్యతిరేకంగా 294 00:17:47,444 --> 00:17:49,446 విజయవంతంగా ఉసిగొల్పగలిగాడు. 295 00:17:52,157 --> 00:17:56,870 సైనికులని స్వదేశానికి రప్పించాలన్నదే మన ప్రయత్నం. ఆయుధాలను మర్చిపోవద్దు. 296 00:17:57,495 --> 00:18:01,166 ఆయుధాలను కూడా తీసుకురండి, అప్పుడే పురోగతి సాధ్యమవుతుంది. 297 00:18:01,166 --> 00:18:04,586 డకోటా భవనంలో, ఆ అపార్టుమెంట్ ప్రాంతంలో రహస్య మైక్రోఫోన్స్ అమర్చారని 298 00:18:04,586 --> 00:18:08,798 వాళ్లిద్దరూ బలంగా నమ్మేవారు. 299 00:18:08,798 --> 00:18:11,468 ఈ దేశంలోని నిఘా సంస్థలు, 300 00:18:11,468 --> 00:18:16,056 అది సీఐఏ అయినా, ఎఫ్.బీ.ఐ అయినా, నేషనల్ సెక్యూరిటీ అయినా 301 00:18:16,556 --> 00:18:19,976 ఆ విధంగా చేసే 302 00:18:19,976 --> 00:18:25,315 అవకాశమే లేదు. 303 00:18:26,149 --> 00:18:28,568 ఫోన్ ఎత్తినప్పుడు మామూలుగా అయితే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు, 304 00:18:28,568 --> 00:18:30,403 నేను ఫోన్ ఎత్తినప్పుడల్లా 305 00:18:30,403 --> 00:18:31,988 చాలా శబ్దాలు నాకు వినిపిస్తుంటాయి. 306 00:18:31,988 --> 00:18:35,367 నేను తలుపు తెరిచి ఎప్పుడు చూసినా వీధికి అవతలి వైపున కొందరు వ్యక్తులు నిలబడి ఉండేవారు. 307 00:18:35,367 --> 00:18:37,410 నేను కారు ఎక్కగానే, వాళ్లు నన్ను అనుసరించేవారు. 308 00:18:37,410 --> 00:18:39,454 అది చాలా తీవ్రమైనదని ఒకరోజు నాకు అనిపించింది. 309 00:18:39,454 --> 00:18:41,581 ఎలాగైనా, నాకు హాని తలపెట్టాలని వాళ్లు చూస్తున్నారు. 310 00:18:43,833 --> 00:18:46,795 జాన్, యోకోల భ్రమకి బలమైన కారణాలే ఉన్నాయి. 311 00:18:48,255 --> 00:18:50,799 రచయిత అయిన జాన్ వీనర్ సంపాదించిన 312 00:18:50,799 --> 00:18:53,593 ఈ 12 కేజీల ఎఫ్.బీ.ఐ ఫైళ్లను పరిశీలిస్తే, నిక్సన్ పాలక వర్గం 313 00:18:53,593 --> 00:18:56,846 లెనన్ ని రాజకీయ వైరిగా చూస్తోందని స్పష్టంగా తెలిసిపోతుంది. 314 00:18:59,057 --> 00:19:01,309 రిచర్డ్ నిక్సన్, ఎఫ్.బీ.ఐ డైరెక్టరుకు 315 00:19:02,018 --> 00:19:06,022 వందల కొద్దీ పేజీలను రాశాడు, 316 00:19:06,523 --> 00:19:09,818 అందులో జాన్ ని, యోకోని 317 00:19:09,818 --> 00:19:13,071 ఫాలో చేయాలని, వాళ్లపై ఓ కన్నేసి ఉంచాలని నిర్ణయించినట్టు పేర్కొని ఉంది, 318 00:19:14,072 --> 00:19:18,285 లెనన్ సమస్యను ఏదోక విధంగా పరిష్కరించడానికి... 319 00:19:18,285 --> 00:19:19,828 తీవ్రవాదులందరినీ ప్రమాదకరంగానే పరిగణించాలి 320 00:19:20,453 --> 00:19:23,331 ...ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి నుండి చర్యలు తీసుకోవడం జరిగింది. 321 00:19:23,957 --> 00:19:26,001 ఎవరూ కూడా శాంతికి పూర్తిగా అవకాశమే ఇవ్వలేదు. 322 00:19:26,001 --> 00:19:28,628 గాంధీ ప్రయత్నించాడు, మార్టిన్ లూథర్ కింగ్ ప్రయత్నించాడు, కానీ వాళ్లు హత్యకు గురయ్యారు. 323 00:19:31,840 --> 00:19:34,593 లెనన్ మరణం వెనుక వేరే పక్షం హస్తం ఉంటే, 324 00:19:34,593 --> 00:19:37,345 మార్క్ చాప్మన్ ఎక్కడి నుండి వచ్చాడు? 325 00:19:37,345 --> 00:19:42,309 మెదడును నియంత్రించే ప్రయోగాలలో అమయాకులను ఉపయోగిస్తూ 326 00:19:42,309 --> 00:19:46,646 సీఐఏ చేసిన రహస్య ప్రాజెక్ట్ పేరు, ఎంకే అల్ట్రా. 327 00:19:47,397 --> 00:19:50,734 వశీకరణలో ప్రపంచ స్థాయి నిపుణులు అయిన డాక్టర్ మిల్టన్ క్లైన్ 328 00:19:50,734 --> 00:19:54,654 సీఐఏకి చెందిన ఎంకే అల్ట్రా ప్రోగ్రామ్ లో కీలక పాత్ర పోషించారు. 329 00:19:54,654 --> 00:19:58,491 నిఘా కార్యకలాపాలు ముమ్మరంగా చేసే ప్రభుత్వ సంస్థల్లో చాలా వరకు, 330 00:19:58,491 --> 00:20:01,786 కొన్ని నిఘా కార్యకలాపాలను అమలు చేయడానికి 331 00:20:01,786 --> 00:20:05,665 వశీకరణను సాధనంగా ఉపయోగించాలని చూస్తూ ఉన్నాయి. 332 00:20:06,458 --> 00:20:10,086 తర్వాత డాక్టర్ క్లైన్, జైల్లో ఉన్న చాప్మన్ ని కలిసి, 333 00:20:10,587 --> 00:20:13,215 అతని డిఫెన్స్ బృందంలో భాగం అవుతాడు. 334 00:20:13,215 --> 00:20:16,259 సీఐఏ, వీలైనంతగా తమ గుప్పెట్లో ఉండగల ఏజెంట్లను 335 00:20:16,259 --> 00:20:20,055 రూపొందించాలని చూస్తోందని పత్రాలలో స్పష్టంగా పేర్కొని ఉంది. 336 00:20:20,639 --> 00:20:24,476 ఇప్పటిదాకా బయటపడిన, అతి పెద్ద బ్రెయిన్ వాష్ ప్రయోగాల్లో ఇదే అత్యంత పెద్దది. 337 00:20:25,060 --> 00:20:28,230 మెదడును నియంత్రించడం అనే ఆలోచన సీఐఏకి చాలా బాగా నచ్చింది, 338 00:20:28,730 --> 00:20:32,692 రాబర్ట్ కెన్నడీ హత్యలో దానికి కూడా భాగం ఉందని కొందరు అంటూ ఉంటారు. 339 00:20:34,736 --> 00:20:36,446 హత్య జరిగిన రాత్రి 340 00:20:36,446 --> 00:20:38,490 హోటల్ లో ఉన్నట్టు తనకి బాగా గుర్తుందని సర్హన్ చెప్పాడు. 341 00:20:38,490 --> 00:20:40,951 ఒక అందమైన అమ్మాయికి కాఫీ పోస్తూ ఉండటం తనకి గుర్తు ఉందని, 342 00:20:40,951 --> 00:20:42,244 ఆ తర్వాత ఏమీ గుర్తులేదని చెప్పాడు. 343 00:20:42,244 --> 00:20:46,122 ఆ తర్వాత అతను అద్దాలతో నిండి ఉన్న గదిలోకి వెళ్లడం గుర్తు ఉందని 344 00:20:46,122 --> 00:20:47,958 ఆ అద్దాలన్నీ అతడిని ఉక్కిరిబిక్కిరి చేశాయని చెప్పాడు. 345 00:20:47,958 --> 00:20:51,127 అతడిని ఒక రకమైన వశీకరణ చేశారని డిఫెన్స్ బృందం వాదించింది. 346 00:20:51,127 --> 00:20:54,965 తనకి మొదటగా కెన్నడీతో కరచాలనం చేయాలనిపించిందని సర్హన్ చెప్పాడు, 347 00:20:54,965 --> 00:20:58,176 కానీ జనాలు తన వద్దకు దూసుకురాగానే తుపాకీ తీశానని చెప్పుకొచ్చాడు. 348 00:20:58,677 --> 00:21:02,514 లెనన్ ని కాల్చాక, చాప్మన్ కనబరిచిన అసాధారణ ప్రవర్తన 349 00:21:02,514 --> 00:21:06,476 ప్రధాన డిటెక్టివ్ అయిన, రాన్ హాఫ్మన్ కి అంతుచిక్కని విషయంగా మారింది. 350 00:21:12,274 --> 00:21:13,692 అతను ఏకైక సూత్రధారా? 351 00:21:14,234 --> 00:21:17,070 వెనుక నుండి ఎవరైనా అతని చేత ఇదంతా చేయించారా? 352 00:21:17,737 --> 00:21:19,322 ఇందులో కుట్ర కోణం ఏమైనా ఉందా? 353 00:21:20,824 --> 00:21:24,911 ఈ ప్రశ్నలన్నీ నా మదిని, అలాగే ఇతరుల మదిని కూడా తొలచివేశాయి. 354 00:21:27,789 --> 00:21:29,666 చాప్మన్ కి ప్రస్తుతమున్న మిత్రులను, 355 00:21:29,666 --> 00:21:33,461 ఇంకా బంధువులని విచారించడానికి మేము హవాయికి ఒక బృందాన్ని పంపాం. 356 00:21:33,461 --> 00:21:35,005 మేము అతని కుటుంబంతో మాట్లాడాం. 357 00:21:35,672 --> 00:21:39,843 అతనితో పరిచయం ఉంది అని మాకు తెలిసిన వాళ్లందరితోనూ మాట్లాడాం. 358 00:21:41,052 --> 00:21:45,265 పెద్దగా మాట్లాడే రకం కాదు, పని చక్కగా చేస్తాడు. 359 00:21:46,016 --> 00:21:48,935 పరుష మాటలు మాట్లాడకుండా, తన పనేదో తను చేసుకొనే తెలివైన కుర్రాడు. 360 00:21:48,935 --> 00:21:52,731 అతను చాలా... చాలా తెలివైన వాడు. సహేతుకంగా నడుచుకొనే వ్యక్తి. 361 00:21:52,731 --> 00:21:56,484 చాలా రకాలుగా, చాప్మన్ జీవితం ఒక అంతుచిక్కని విషయంలా మారిపోయింది. 362 00:21:56,484 --> 00:21:59,571 అతని స్నేహితులకి ఇప్పటికీ అర్థం కావట్లేదు, 363 00:21:59,571 --> 00:22:01,281 ఇప్పటికీ ఆశ్చర్యంలోనే ఉన్నారు, 364 00:22:01,281 --> 00:22:04,993 "ఇన్నేళ్లుగా తమకి తెలిసిన మార్క్ చాప్మన్, 365 00:22:04,993 --> 00:22:09,873 జాన్ లెనన్ హత్యానేరంలో బోనులో నిలబడిన మార్క్ చాప్మన్ ఒక్కడేనా?" అని. 366 00:22:11,291 --> 00:22:12,626 చాప్మన్ ఒక మిస్టరీలా మిగిలిపోయాడు, 367 00:22:13,251 --> 00:22:16,713 అతడిని అర్థం చేసుకోవాలని పోలీసులకి ఎంత ఆత్రంగా ఉందో, ప్రపంచ మీడియాకి కూడా అంతే ఆత్రంగా ఉంది. 368 00:22:18,673 --> 00:22:23,220 మరింత సమాచారం తెలుసుకోవాలనే ఆశతో అతనికి అత్యంత సన్నిహితుల్లో ఒకరిని వేగంగానే ట్రాక్ చేశారు. 369 00:22:24,804 --> 00:22:26,681 ఈ మధ్యాహ్నం, 21వ అంతస్థులో ఉన్న 370 00:22:26,681 --> 00:22:29,017 చాప్మన్ ఇంటి వద్ద ఉండమని ఒక గార్డును నియమించడం జరిగింది. 371 00:22:29,017 --> 00:22:32,020 చాప్మన్ భార్య అయిన గ్లోరియా ఆబ్ 372 00:22:32,020 --> 00:22:34,898 ఒక స్నేహితురాలితో ఇంటి లోపల ఉన్నట్టు సమాచారం అందింది, 373 00:22:34,898 --> 00:22:36,691 ఆమె రిపోర్టర్లతో మాట్లాడటానికి నిరాకరిస్తోంది. 374 00:22:36,691 --> 00:22:39,778 గార్డును నియమించక ముందే ఉదయం సుమారుగా ఏడు గంటలకు 375 00:22:39,778 --> 00:22:42,530 మేము తలుపు దగ్గరకు వెళ్లకా, మాకు ఏడుపులు వినిపించాయి. 376 00:22:45,242 --> 00:22:48,411 మీడియాని చూసి ఆమె ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. 377 00:22:48,411 --> 00:22:52,249 తనకి చట్టపరమైన సాయం అవసరమై, నాకు కాల్ చేసింది. 378 00:22:55,919 --> 00:23:00,882 {\an8}కాబట్టి, నాకు అనిపించిన అత్యుత్తమ మార్గం ఏంటంటే, మీడియా వాళ్లందరినీ ఒక గదిలోకి రమ్మని... 379 00:23:00,882 --> 00:23:01,800 {\an8}బ్రూక్ హార్ట్ లాయర్ 380 00:23:01,800 --> 00:23:05,887 {\an8}...వాళ్లకి ఉన్న ప్రశ్నలన్నీ అడిగేయమని చెప్పి, అక్కడితో ముగించేయడం. 381 00:23:06,596 --> 00:23:08,265 ఒక బీటిల్స్ అభిమానిగా, 382 00:23:08,265 --> 00:23:12,727 జాన్ లెనన్ మరణానికి సంతాపం తెలియజేస్తున్నాను, అలాగే ఆయన భార్య, యోకోకి, ఇంకా కొడుకు, షాన్ కి 383 00:23:12,727 --> 00:23:14,563 ఇలా జరిగినందుకు బాధపడుతున్నాను. 384 00:23:15,272 --> 00:23:20,068 యోకోకి, ఆమె కుటుంబానికి ఇంత వేదన కలిగినందుకు, ఆయన మరణించినందుకు 385 00:23:21,027 --> 00:23:25,115 నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. 386 00:23:27,325 --> 00:23:29,035 ఆమె "ఆయన మరణించినందుకు" అని 387 00:23:29,035 --> 00:23:32,163 చెప్పడం నేను విన్నాక, 388 00:23:33,290 --> 00:23:38,712 గ్లోరియా సరైన పదాలను ఉపయోగించలేదేమో అని నాకు అనిపించింది. 389 00:23:39,212 --> 00:23:43,967 ఎందుకంటే, చాప్మన్ వెళ్లి చంపకుంటే, లెనన్ బతికి ఉండేవాడే. 390 00:23:45,051 --> 00:23:48,013 ప్లాన్ ప్రకారం హత్య జరిగింది అని అర్థం వచ్చేలా 391 00:23:48,013 --> 00:23:49,890 ఆమె మాటలు లేవు. 392 00:23:50,891 --> 00:23:54,311 ఆ సమయానికి, తన భర్తే హత్య చేశాడన్న విషయాన్ని 393 00:23:54,811 --> 00:23:57,898 తను ఇంకా అంగీకరించలేదని అనిపిస్తోంది. 394 00:23:59,399 --> 00:24:04,654 మార్క్ చేసిన పనికి అండగా, తనకి తెలిసి గ్లోరియా 395 00:24:04,654 --> 00:24:09,659 ఏ విధమైన సపోర్ట్ అందించలేదు, అంతేకాకుండా, ఈ పర్యటనలో 396 00:24:09,659 --> 00:24:14,039 ఏ విధంగానూ తను భాగం కాదు, తను ఏమీ చేయలేదు కూడా. 397 00:24:15,957 --> 00:24:19,878 తను ఉన్నది ఉన్నట్టుగా 398 00:24:20,462 --> 00:24:23,048 ముక్కుసూటిగా చెప్పేసింది. 399 00:24:23,673 --> 00:24:25,884 కాస్తయినా భావోద్వేగం చూపుతుందేమో అని ఆశించాను. 400 00:24:26,468 --> 00:24:28,261 తన స్వభావమే అది అనుకుంటా. 401 00:24:29,512 --> 00:24:33,558 నేను క్రైస్తవురాలిని, క్షమించడమనేది గొప్ప గుణమని నేను నమ్ముతాను. 402 00:24:34,184 --> 00:24:36,603 మొదట్నుంచీ నాకు క్షమాగుణం ఉంది. 403 00:24:38,772 --> 00:24:41,441 మీడియావాళ్లు అడిగే ప్రశ్నలకు గ్లోరియా సమాధానాలు ఇచ్చింది, 404 00:24:41,441 --> 00:24:46,279 కానీ చాప్మన్ తో తనకి ఉన్న బంధంలో భాగమైన కొన్ని అంశాలను బయటకు వెల్లడించలేదు. 405 00:24:46,780 --> 00:24:50,659 పెళ్లయ్యాక చాప్మన్ బాగా తాగడం మొదలుపెట్టాడని, 406 00:24:51,243 --> 00:24:55,455 చాలాసార్లు తన మీద చేయి కూడా చేసుకున్నాడని తను నాకు చెప్పింది. 407 00:24:56,206 --> 00:25:00,544 ఆ తర్వాత, ఆ మత్తులో అతనికి ఏం చేస్తున్నాడో స్పృహ ఉండేది కాదు. 408 00:25:02,045 --> 00:25:06,967 దీని వలన అతని మానసిక ఆరోగ్యంపై గ్లోరియాకి అనుమానాలు మొదలయ్యాయి. 409 00:25:13,014 --> 00:25:17,102 ఇక న్యూయార్కుకు వచ్చేస్తే, మానసిక వైద్యురాలైన, డాక్టర్ నయోమీ గోల్డ్ స్టీన్, 410 00:25:17,102 --> 00:25:21,690 విచారణను ఎదుర్కొనే సామర్థ్యం చాప్మన్ కి ఉందా లేదా అనే విషయంలో ఒక నిర్ధారణకు వచ్చారు. 411 00:25:22,399 --> 00:25:27,362 ఒక వ్యక్తి, తనపై ఏ ఆరోపణలు ఉన్నాయో అర్థం చేసుకొని, తన రక్షణకు 412 00:25:27,362 --> 00:25:32,367 సహకరించగల స్థితిలో ఉన్నప్పుడు, సదరు వ్యక్తి విచారణను ఎదుర్కోగలరని చెప్పవచ్చు. 413 00:25:33,326 --> 00:25:35,787 అతని మానసిక స్థితి సరిగ్గా లేదు అని సూచించేలా అతని మాటలు లేవు. 414 00:25:36,621 --> 00:25:40,125 భ్రమలు లేదా ఊహించుకోవడం వంటివి అతను చేస్తున్నట్టుగా కూడా అనిపించడం లేదు. 415 00:25:42,502 --> 00:25:45,630 తుది అంచనా: విచారణను ఎదుర్కోగలడు. 416 00:25:47,841 --> 00:25:51,469 పక్కకు జరగండి, మిత్రులారా. మిత్రులారా, పక్కకు జరగండి. జరగండి. 417 00:25:51,469 --> 00:25:54,306 విచారణ తప్పక జరగనుంది కాబట్టి, చాప్మన్ వ్యతిరేక సెంటిమెంట్ విషయంలో 418 00:25:54,848 --> 00:25:57,309 జనాల మూడ్ కాస్తా బాధ నుండి క్రోధానికి మారిపోయింది. 419 00:25:57,309 --> 00:25:58,560 న్యాయవాదికి ప్రాణహాని బెదిరింపులు! 420 00:25:58,560 --> 00:26:01,479 మిస్టర్ ఆడల్బర్గ్, మీరు ఎందుకు తప్పుకున్నారో చెప్పగలరా? 421 00:26:02,063 --> 00:26:04,774 అతని న్యాయవాది కూడా దాన్నంతటినీ తట్టుకోలేకపోయాడు. 422 00:26:05,483 --> 00:26:07,485 పిచ్చి పిచ్చి కాల్స్, ఇంకా నిజం తెలుసుకోవాలని కొందరు కాల్ చేసేవారు. 423 00:26:07,485 --> 00:26:10,238 రోకంతా నా ఫోన్లు మోగుతూనే ఉంటాయి. 424 00:26:10,238 --> 00:26:13,033 ఇలాంటి పరిస్థితుల్లో ఇతడి తరఫున 425 00:26:13,033 --> 00:26:15,118 నేను సమర్థవంతంగా వాదించలేనని అనిపించింది. 426 00:26:15,118 --> 00:26:16,828 వెనక్కి జరగండి. వెనక్కి జరగండి. 427 00:26:18,997 --> 00:26:19,831 మానసిక వైద్యాలయం 428 00:26:19,831 --> 00:26:22,876 ఒక బీటిల్స్ సభ్యుడిని కాల్చి చంపినందుకు 429 00:26:22,876 --> 00:26:25,295 అతని మీద దాడి చేయడానికి 430 00:26:26,463 --> 00:26:30,342 చాలా మంది ఖైదీలు తహతహలాడిపోతుంటారని మాకు అనిపించింది. 431 00:26:30,342 --> 00:26:34,679 కాబట్టి మా జైళ్లలో అత్యంత సురక్షితమైన జైలేదో మేము కనుగొనాల్సిన అవసరం ఉంది, 432 00:26:34,679 --> 00:26:38,141 రాత్రికి రాత్రే ఆ సురక్షితమైన ప్రాంతం, 433 00:26:38,141 --> 00:26:40,936 రైకర్స్ దీవిలోని మానసిక కేంద్రానికి తలించాం. 434 00:26:40,936 --> 00:26:43,104 చాలా పెద్ద ఎత్తున ప్రాణహాని బెదిరింపులు రావడంతో, 435 00:26:43,104 --> 00:26:46,066 నిన్న మార్క్ డేవిడ్ చాప్మన్ ని బెలెవ్యూ ఆసుపత్రి నుండి తరలించడం జరిగింది. 436 00:26:48,818 --> 00:26:51,696 ఈస్ట్ రివర్ లో ఉండే రైకర్స్ దీవి జైలుకు 437 00:26:52,280 --> 00:26:54,241 వంతెన ద్వారా మాత్రమే వెళ్లవచ్చు, 438 00:26:54,741 --> 00:26:58,245 న్యూయార్కులోని ఇతర ప్రాంతాలతో పోల్చితే, ఇది దూరాన, మారుమూల ఉన్న ప్రాంతమని చెప్పవచ్చు. 439 00:26:58,245 --> 00:27:02,415 ఇలా మారుమూల ఉండటం వల్ల చాప్మన్ లాంటి వాళ్లకి ఇది బాగా సరిపోతుంది. 440 00:27:08,338 --> 00:27:10,423 ద్వేషం పెరుగుతున్న తరుణంలో, 441 00:27:10,423 --> 00:27:14,844 అంతగా అనుభవం లేని ఒక యువ న్యాయవాది చాప్మన్ తరఫున వాదించడానికి ముందుకొచ్చాడు. 442 00:27:16,304 --> 00:27:18,598 ముప్పై ఏడేళ్ల జొనాథన్ మార్క్స్, తనకి ఈ ఉదయం ఫోన్ వచ్చిందని, 443 00:27:18,598 --> 00:27:21,309 కేసు తీసుకోగలరా అని అడిగారని చెప్పాడు. 444 00:27:21,309 --> 00:27:24,271 తిరస్కరించడానికి కారణం తనకేదీ తోచలేదని చెప్పాడు. 445 00:27:25,230 --> 00:27:27,649 మిస్టర్ చాప్మన్ పై చాలా మందికి కోపంగా ఉంది... 446 00:27:27,649 --> 00:27:29,734 అలాంటి పరిస్థితుల్లో మీరు అతని తరఫున వాదించబోతున్నారు... 447 00:27:29,734 --> 00:27:31,236 ఈ విషయంలో మీకు ఎలా అనిపిస్తోంది? 448 00:27:31,236 --> 00:27:35,865 మిస్టర్ చాప్మన్ మీద కోపంగా ఉన్న వాళ్లందరూ అదే కోపం నాపై చూపిస్తారని 449 00:27:36,491 --> 00:27:38,243 నేను అనుకోవడం లేదు. 450 00:27:38,243 --> 00:27:40,954 నేను ఒక క్లయింట్ తరఫున వాదిస్తున్నాను అంతే. 451 00:27:42,497 --> 00:27:44,583 కేసు చాలా పెద్దది అవుతూ ఉన్నందున, తనకి సాయం కోసం, 452 00:27:45,292 --> 00:27:49,045 మార్క్స్, డేవిడ్ సగ్స్ అనే జూనియర్ న్యాయవాదిని పనిలోకి పెట్టుకుంటాడు. 453 00:27:51,214 --> 00:27:53,383 ఎప్పుడైనా నా అభిప్రాయంలో, 454 00:27:53,967 --> 00:27:56,052 {\an8}జనాల దృష్టిలో విలన్ అయిన వ్యక్తి తరఫున వాదించడం కన్నా... 455 00:27:56,052 --> 00:27:57,345 {\an8}డేవిడ్ సగ్స్ చాప్మన్ న్యాయ బృందంలో సభ్యుడు 456 00:27:57,345 --> 00:28:00,974 {\an8}...ముఖ్యమైన, గొప్ప విషయం మరొకటి లేదనుకుంటా. 457 00:28:00,974 --> 00:28:05,020 కానీ మన మీద ఒత్తిడి ఉంటుంది అనడంలో ఏ సందేహమూ లేదు. 458 00:28:06,271 --> 00:28:10,108 అంతకు ముందు నేను చాలా పెద్ద పెద్ద కేసుల్లో పని చేశాను. 459 00:28:10,108 --> 00:28:13,653 కానీ నాకు అర్థమైంది ఏందంటే, నేను ఇదివరకు పని చేసిన కేసులు ఒక ఎత్తైతే 460 00:28:14,404 --> 00:28:16,489 ఈ కేసు ఒక ఎత్తు అని. 461 00:28:20,577 --> 00:28:22,370 విచారణకు సన్నద్ధం కావడానికి, 462 00:28:22,370 --> 00:28:25,916 చాప్మన్ డిఫెన్స్ బృందం, జైలులో ఉన్న అతడిని సందర్శించడం మొదలుపెట్టింది. 463 00:28:28,543 --> 00:28:30,086 ఆరోజు ఆదివారం, 464 00:28:30,086 --> 00:28:32,172 నేను మార్క్ చాప్మన్ ని చూడటానికి 465 00:28:32,172 --> 00:28:33,340 రైకర్స్ దీవికి వెళ్లాను. 466 00:28:35,467 --> 00:28:39,137 అతనితో మాట్లాడే ప్రతి సంభాషణని వాళ్లు రికార్డ్ చేయడం మొదలుపెట్టారు. 467 00:28:39,137 --> 00:28:41,389 మీ తరఫున వాదిస్తున్నందుకు 468 00:28:41,389 --> 00:28:42,849 నాకు చాలా ఆనందంగా ఉంది. 469 00:28:43,725 --> 00:28:48,104 ఈ సంభాషణలను ఇప్పటిదాకా పబ్లిక్ గా ఎప్పుడూ వినిపించలేదు. 470 00:28:48,772 --> 00:28:50,398 మీరు మాటిస్తారా... 471 00:28:50,398 --> 00:28:52,609 నేను ఇదొక్కసారే అడుగుతాను, ఇంకెప్పుడూ అడగను, ఏమనుకోకండి. 472 00:28:53,735 --> 00:28:55,278 మీరు నాకు మద్దతుగా ఉంటారా? 473 00:28:55,779 --> 00:28:56,947 మద్దతుగా ఉంటానని మాటిస్తున్నా. 474 00:28:56,947 --> 00:28:59,491 దాన్ని మీరు ఎన్నిసార్లు అయినా అడగవచ్చు. 475 00:29:00,992 --> 00:29:04,037 భలే విచిత్రంగా ఉండేది అన్నమాట, ఎందుకంటే ఒక్కోసారి 476 00:29:04,037 --> 00:29:07,249 అతను చాలా మామూలుగానే మాట్లాడేవాడు. 477 00:29:07,249 --> 00:29:09,376 కానీ హఠాత్తుగా మాట మారిపోతుంది! 478 00:29:09,376 --> 00:29:12,045 ఉన్నట్టుండి అతని నోటి నుండి 479 00:29:12,045 --> 00:29:13,922 అస్సలు ఊహించని మాటలు వస్తాయి, 480 00:29:15,090 --> 00:29:17,467 "బాబోయ్, మనోడికి కాస్త తిక్క ఉంది," అనిపిస్తుంది. 481 00:29:18,760 --> 00:29:20,387 ఏం జరిగిందో చెప్పండి. 482 00:29:21,471 --> 00:29:23,557 ఈ ఆలోచన కాస్త పిచ్చిగా ఉంటుంది. 483 00:29:23,557 --> 00:29:26,851 ఎవరినైనా చంపితే, నేను మారిపోతాను అనుకున్నా. 484 00:29:27,519 --> 00:29:29,020 ఎవరిలా మారిపోతారని అనుకున్నారు? 485 00:29:29,020 --> 00:29:30,772 "ద క్యాచర్ ఇన్ ద రై" పుస్తకం తెలుసా? 486 00:29:30,772 --> 00:29:34,401 - హా. తెలుసు. - నా దగ్గర ఆ పుస్తకం ఉంది. 487 00:29:34,401 --> 00:29:38,196 చంపాక, ఆ పుస్తకంలోని ఓ పాత్రలా మారిపోతాను అనుకున్నా. 488 00:29:38,196 --> 00:29:39,573 ఇప్పుడు అర్థమైంది... 489 00:29:40,699 --> 00:29:42,701 ఏ పాత్రలా మారిపోతారని అనుకున్నారు? 490 00:29:42,701 --> 00:29:43,994 హోల్డెన్ కాల్ఫీల్డ్ లా. 491 00:29:47,163 --> 00:29:51,126 "ద క్యాచర్ ఇన్ ద రై" పుస్తకంలోని పాత్ర అయిన హోల్డెన్ కాల్ఫీల్డ్ లా 492 00:29:51,126 --> 00:29:53,545 మారిపోతాడని అనుకున్నాడు. 493 00:29:53,545 --> 00:29:57,507 బొద్దుగా ఉండే యువకుడి నుండి 494 00:29:58,466 --> 00:30:03,763 సన్నగా, పొడుగ్గా ఉండే టీనేజరులా మారిపోతాడని అనుకున్నాడు. 495 00:30:03,763 --> 00:30:05,473 అతను హేతుబద్ధమైన మనిషిలా అనిపించలేదు. 496 00:30:05,473 --> 00:30:08,476 ఇందులో మిస్టరీ ఏమీ లేదు. లెనన్ ని కాల్చింది అతనే అనడంలో ఏ సందేహమూ లేదు. 497 00:30:08,476 --> 00:30:10,145 పారిపోయే ప్రయత్నం కూడా అతను చేయలేదు. 498 00:30:10,145 --> 00:30:11,980 అసలైన ప్రశ్న ఏంటంటే, 499 00:30:11,980 --> 00:30:16,067 "తుపాకీ కాల్చే సమయంలో అతని మానసిక స్థితి ఎలా ఉంది?" అనేదే. 500 00:30:16,067 --> 00:30:20,322 ఈ వ్యక్తికి మానసిక స్థితి బాగాలేదని, ఆ కారణంగా జైల్లో శిక్ష అనుభవించడం కన్నా 501 00:30:20,322 --> 00:30:25,452 మానసిక వైద్యాలయంలో పర్యవేక్షణలో ఉంటే... బాగుంటుందని 502 00:30:25,452 --> 00:30:29,789 జ్యూరీ వాళ్లకి నిరూపించడమే 503 00:30:29,789 --> 00:30:32,542 మా లక్ష్యం. 504 00:30:34,211 --> 00:30:39,007 కానీ ప్రాసిక్యూషన్ వాళ్లు, మానసిక స్థితి బాగాలేదు అనే చాప్మన్ వాదనను అంగీకరించలేదు. 505 00:30:39,883 --> 00:30:43,220 {\an8}ఎవరైనా తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడుతూ... 506 00:30:43,220 --> 00:30:44,721 {\an8}కిమ్ హోగ్రీఫ్ ప్రభుత్వ న్యాయవాది 507 00:30:44,721 --> 00:30:47,641 ...అరటి పండు అనుకొని తుపాకీని పట్టుకొని ఉంటే, 508 00:30:48,516 --> 00:30:52,604 అప్పుడు మానసిక స్థితి బాగాలేదని భావించవచ్చు. 509 00:30:54,564 --> 00:30:58,401 కానీ మా అభిప్రాయం ప్రకారం, అతనికి ఏ మానసిక వ్యాధీ లేదు. 510 00:30:59,194 --> 00:31:03,531 అతనేం చేస్తున్నాడో బాగా తెలుసు, తన వద్ద తుపాకీ ఉంది, కావాలనుకున్న పనికి వాడేశాడు. 511 00:31:04,241 --> 00:31:06,326 పైగా అతను చేసే పని తప్పు అని అతనికి బాగా తెలుసు, 512 00:31:06,326 --> 00:31:09,663 ఎందుకంటే హత్య చేసిన తర్వాత పోలీసుల రాక కోసం అక్కడే వేచి ఉన్నాడు. 513 00:31:09,663 --> 00:31:12,749 క్రిమినల్ కోర్టు 514 00:31:15,293 --> 00:31:17,212 మీ మానసిక వైద్యులు ఏం పరిశీలిస్తారు? 515 00:31:17,212 --> 00:31:18,838 - అది ఎప్పుడు అనా? - ఏంటి, ఎందుకు? 516 00:31:18,838 --> 00:31:19,965 దేని కోసం? 517 00:31:19,965 --> 00:31:23,134 హత్య చేసినప్పుడు అతని మానసిక స్థితి ఎలా ఉందనేది వాళ్లు చూస్తారు. 518 00:31:25,136 --> 00:31:27,556 చాప్మన్ ప్రధాన లాయరు జొనాథన్ మార్క్స్, 519 00:31:27,556 --> 00:31:30,600 ఇప్పుడు తన బృందానికి వివాదాస్పదమైన అపాయింట్మెంట్ గురించి చెప్తాడు. 520 00:31:31,643 --> 00:31:33,478 నా శక్తి మేరకు నేను మంచి డాక్టరునే ఎంచుకున్నాను. 521 00:31:33,478 --> 00:31:35,063 వారెవరో చెప్పగలరా? 522 00:31:35,063 --> 00:31:37,941 మిల్టన్ క్లైన్ హిప్నాటిస్ట్ కాదా? 523 00:31:38,650 --> 00:31:40,485 మిల్టన్ క్లైన్ ఒక క్లినికల్ సైకాలజిస్ట్, 524 00:31:40,944 --> 00:31:43,655 ఆయన విశ్లేషణ కోసం వశీకరణని ఉపయోగిస్తారంతే. 525 00:31:46,241 --> 00:31:48,201 సీఐఏ మెదడు నియంత్రణ ప్రోగ్రాముకు 526 00:31:48,201 --> 00:31:52,330 ఒకప్పుడు కన్సల్టెంటుగా పని చేసిన డాక్టర్ మిల్టన్ క్లైన్ ని ఆయన ఎంచుకున్నారు. 527 00:31:53,456 --> 00:31:56,084 {\an8}విచక్షణారహితంగా కాల్పులు జరిపేలా వారికి శిక్షణ ఇవ్వవచ్చు. 528 00:31:56,084 --> 00:31:57,419 {\an8}మిల్టన్ క్లైన్ సైకాలజిస్ట్, ఇంకా సీఐఏకి సలహాదారు 529 00:31:57,419 --> 00:31:59,963 {\an8}ఏ మాత్రం సంకోచం కానీ, చింతా కానీ లేకుండా, రవ్వంత ఫీలింగ్ లేదా ఆలోచనతో 530 00:32:00,630 --> 00:32:03,383 జనాలను కాల్చేలా వారికి శిక్షణ ఇవ్వవచ్చు. 531 00:32:05,010 --> 00:32:06,970 మార్క్, నేను డాక్టర్ మిల్టన్ క్లైన్ ని. 532 00:32:06,970 --> 00:32:09,556 ఎలా ఉన్నారు, మార్క్? మిమ్మల్ని కలవడం బాగుంది. 533 00:32:09,556 --> 00:32:12,225 హత్యలో ఏమైనా బహిర్గతం కాని అంశాలు ఉంటే, 534 00:32:12,726 --> 00:32:16,438 వాటిని వశీకరణ ద్వారా బయటపెట్టగలడని డాక్టర్ క్లైన్ భావిస్తున్నాడు. 535 00:32:16,438 --> 00:32:18,189 మీరు ఒక పని చేయాలి, మార్క్, 536 00:32:18,189 --> 00:32:20,317 మీరు దృష్టి మరల్చకుండా సీలింగును చూస్తూ ఉండండి చాలు. 537 00:32:21,234 --> 00:32:24,237 కనురెప్పలను నెమ్మదిగా మూయండి. 538 00:32:24,237 --> 00:32:26,740 తల నుండి, కాలి వేళ్ల దాకా 539 00:32:27,449 --> 00:32:31,328 మీ శరీరాన్నంతా విశ్రమించనివ్వండి. 540 00:32:32,412 --> 00:32:36,541 బాగా, ఇంకా బాగా విశ్రమించండి. 541 00:32:36,541 --> 00:32:41,171 ఇంకా, ఇంకా బాగా విశ్రమించండి. 542 00:32:43,715 --> 00:32:45,258 ఇప్పుడు నేను భలే చిత్రమైన స్థితిలో ఉన్నా. 543 00:32:45,258 --> 00:32:46,676 చాలా ప్రశాంతంగా ఉంది నాకు. 544 00:32:46,676 --> 00:32:48,303 ఆ ప్రభావం ఉంటుంది కదా? 545 00:32:49,804 --> 00:32:52,349 ఆ సన్నివేశాన్ని ఒకసారి ఊహించుకోవడానికి ప్రయత్నించండి. 546 00:32:52,349 --> 00:32:54,184 - హత్య సన్నివేశాన్నా? - అవును. 547 00:32:54,684 --> 00:32:58,063 సరే, నేను కూర్చొని ఉన్నా, ఒక కారు పక్కగా ఆగింది. 548 00:32:58,605 --> 00:33:02,359 ఆ కారు అతనిదే అని నాకు తెలుసు, కాబట్టి, "ఆ క్షణం రానే వచ్చింది," అని అనుకున్నా. 549 00:33:02,359 --> 00:33:07,739 కారు తలుపు తెరుచుకుంది. యోకో దిగింది, తనని చూసి తల ఊపాను. 550 00:33:08,240 --> 00:33:09,741 ఆ తర్వాత అతను దిగాడు. 551 00:33:10,617 --> 00:33:12,285 అతను నా పక్కగా వెళ్తున్నప్పుడు, అతడిని చూశాను. 552 00:33:12,285 --> 00:33:17,290 ఆ తర్వాత రోడ్డు పక్కన ఉండే ఆ చోటు నుండి ముందుకు వచ్చి, 553 00:33:18,124 --> 00:33:21,711 సుమారుగా ఆరు అడుగులు నడిచి, పక్కకు తిరిగి అతనికి ఎదురుగా వెళ్లాను, 554 00:33:22,546 --> 00:33:24,172 ఆ తర్వాత నా జేబులో ఉన్న తుపాకీని తీసి 555 00:33:26,800 --> 00:33:28,260 అతనికి గురి పెట్టాను, 556 00:33:28,260 --> 00:33:30,637 ఆ తర్వాత కాల్చేశాను. 557 00:33:30,637 --> 00:33:32,639 ఉన్న అయిదు తూటాలనూ ఖాళీ చేసేశాను. 558 00:33:33,139 --> 00:33:34,891 ఆ తర్వాత పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు, అప్పుడే నేను అన్నా, 559 00:33:34,891 --> 00:33:37,060 "నేను క్యాచర్ ఇన్ ద రై" అని. 560 00:33:37,602 --> 00:33:41,898 అప్పుడు మీకు ఎలా అనిపించిందో చెప్పగలరా? మీకు ఎలా అనిపించిందో మాత్రమే చెప్పండి. 561 00:33:42,941 --> 00:33:46,111 నేను నేను కాదు అనిపించింది, కానీ కాల్చింది నేనే. 562 00:33:46,111 --> 00:33:48,113 ఆ పని నేనే చేశా, చేయడం కూడా నాకు గుర్తుంది. 563 00:33:48,113 --> 00:33:52,409 కాల్చాలని మీరు పక్కాగా నిర్ణయం తీసుకున్నారా? 564 00:33:53,785 --> 00:33:55,161 నేను సంశయించాను కూడా. 565 00:33:55,161 --> 00:33:57,372 నా మనస్సులోని సగ భాగం కాల్చవద్దని చెప్తోంది, ఇంకో సగ భాగమేమో కాల్చమంటోంది. 566 00:33:58,540 --> 00:34:02,419 కానీ, అతను నా పక్క నుండి వెళ్తున్నప్పుడు 567 00:34:02,419 --> 00:34:06,298 నాకు "కాల్చేయ్, కాల్చేయ్, కాల్చేయ్" అని ఒక స్వరం చెప్పడం మాత్రం బాగా గుర్తుంది. 568 00:34:06,298 --> 00:34:08,133 ఇక నేను కాల్చేశాను. 569 00:34:15,807 --> 00:34:20,061 యోకో యోనో, జాన్ లెనన్ ఆత్మ శాంతి కోసం ప్రార్థించమని అడిగింది కాబట్టి, 570 00:34:20,061 --> 00:34:21,229 పది నిమిషాల పాటు 571 00:34:21,229 --> 00:34:23,315 - అందరమూ నిశ్శబ్దంగా ప్రార్థిద్దాం. - మిత్రులారా... 572 00:34:23,315 --> 00:34:26,651 దయచేసి రేడియోలన్నింటినీ ఆఫ్ చేయండి. 573 00:34:27,736 --> 00:34:32,324 దయచేసి వస్తువుల అమ్మకాలను నిలిపివేయండి. 574 00:34:33,115 --> 00:34:36,827 నిశ్శబ్దంగా ధ్యానం చేయండి. ఇప్పుడు ప్రార్థన మొదలుపెడదాం. 575 00:34:38,121 --> 00:34:39,831 అందరం ప్రార్థిద్దాం. థ్యాంక్యూ. 576 00:34:40,874 --> 00:34:42,959 చాప్మన్ విచారణ కోసం సన్నద్ధం అవుతూ ఉండగా, 577 00:34:42,959 --> 00:34:46,922 సెంట్రల్ పార్కులో వేలాది మంది చేరి, లెనన్ ఆత్మశాంతి కోసం ప్రార్థన చేశారు. 578 00:34:47,881 --> 00:34:52,719 ఆ జనంలోని ఒకరు, ఇటీవల జరుగుతున్న సంఘటనలన్నింటినీ ప్రత్యేకంగా గమనిస్తూ వచ్చాడు. 579 00:34:55,387 --> 00:34:57,474 అతని పేరు జాన్ హింక్లీ జూనియర్. 580 00:34:57,974 --> 00:35:01,061 అతని వద్ద కూడా "ద క్యాచర్ ఇన్ ద రై" పుస్తకం ఉంది. 581 00:35:03,063 --> 00:35:07,150 అతను యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిని కాల్చబోతున్నాడు. 582 00:35:18,036 --> 00:35:18,870 {\an8}తర్వాతి ఎపిసోడ్లలో 583 00:35:18,870 --> 00:35:20,997 {\an8}మానసిక పరిస్థితి సరిగ్గా లేనందున, హత్య విషయంలో 584 00:35:20,997 --> 00:35:22,624 {\an8}తాను నిర్దోషి అని మార్క్ చాప్మన్ కోర్టులో ప్రకటించాడు. 585 00:35:22,624 --> 00:35:24,501 {\an8}ఆ పని చేయమని దేవుడు చెప్పాడట. 586 00:35:24,501 --> 00:35:28,713 {\an8}అతను దోషే, ఎందుకంటే మానసిక స్థితి సరిగ్గా లేదనేది అసలు కారణమే కాదు. 587 00:35:28,713 --> 00:35:30,006 {\an8}అతనికి మానసిక అనారోగ్యం ఏమీ లేదు. 588 00:35:30,006 --> 00:35:32,425 {\an8}అతను పేరు సంపాదించాలని ఆ పని చేశాడు. 589 00:35:32,425 --> 00:35:33,760 {\an8}లెనన్ ని చంపిన వ్యక్తి 590 00:35:33,760 --> 00:35:35,887 {\an8}వేరే కేసులో అయితే, 591 00:35:35,887 --> 00:35:38,014 {\an8}అతని మానసిక పరిస్థితి బాగాలేదు అనే పరిగణించేవారు. 592 00:35:38,014 --> 00:35:39,307 {\an8}కానీ అతను కాల్చింది మామూలు వ్యక్తిని కాదు. 593 00:36:31,860 --> 00:36:33,862 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్