1 00:00:01,668 --> 00:00:05,463 రహదారి మధ్యలో ట్రాఫిక్ బీభత్సంగా ఉంది, 2 00:00:05,464 --> 00:00:08,633 నేను డ్రైవర్ తో ఒకటే మాట అన్నాను, "బాసూ, 3 00:00:08,634 --> 00:00:10,551 నా కొడుకు రెడీసేఫ్ ఇన్విటేషనల్ లో ఆడుతున్నాడు, 4 00:00:10,552 --> 00:00:12,346 నేను ఆ విమానం మాత్రం మిస్ కాకూడదు," అని. 5 00:00:12,846 --> 00:00:14,263 - భలే చెప్పావు. - హా. 6 00:00:14,264 --> 00:00:18,267 ఒక్క నిమిషం. నువ్వు జర్మనీకి ఎప్పుడు వెళ్ళావు? 7 00:00:18,268 --> 00:00:20,103 ఒక ఏడాది దాటి ఉంటుంది. హా. 8 00:00:20,687 --> 00:00:21,562 అది నీకు చాలా బాగా నచ్చుతుంది. 9 00:00:21,563 --> 00:00:26,317 ఎక్కడ చూసినా పాత కోటలు ఉంటాయి, చరిత్ర కనిపిస్తూ ఉంటుంది మనకి. సూపర్ గా ఉంటుందిలే. 10 00:00:26,318 --> 00:00:28,236 వచ్చే ఏడాది వచ్చి చూద్దువులే, ఏమంటావు? 11 00:00:28,237 --> 00:00:30,821 నువ్వు కూడా, జీరో. నీకు ఏ లోటూ రానివ్వను. 12 00:00:30,822 --> 00:00:31,865 థ్యాంక్యూ. 13 00:00:32,366 --> 00:00:34,201 మంచితనం ఉట్టిపడుతోందిగా నీ నుండి. 14 00:00:36,119 --> 00:00:38,496 - అమ్మ, అమ్మా. - పర్వాలేదు. సాంటి, పర్వాలేదులే. 15 00:00:38,497 --> 00:00:41,708 నేను ఇక్కడికి రావడం షాకింగ్ నే ఉంటుంది. 16 00:00:42,668 --> 00:00:43,584 చూడు, 17 00:00:43,585 --> 00:00:47,798 నేను ఇంత కాలం దూరంగా ఉన్నందుకు సారీ, సరేనా? నీకు దూరంగా ఉండాలన్నది నా ఉద్దేశమే కాదు. 18 00:00:48,632 --> 00:00:52,093 - పర్వాలేదులే. - లేదు, సాంటి, అది మంచి పని కాదు. 19 00:00:52,094 --> 00:00:53,387 నేను ఉండాల్సింది. 20 00:00:55,222 --> 00:00:58,016 అవును. కానీ నువ్వు మళ్ళీ ఆడటం చూశాక, ఆనందంతో ఉప్పొంగిపోయా. 21 00:00:59,643 --> 00:01:01,353 నాకెంత గర్వంగా ఉందో మాటల్లో చెప్పలేను. 22 00:01:05,315 --> 00:01:07,025 నేను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నా. 23 00:01:07,693 --> 00:01:11,321 ఆ పోస్టులని చూస్తున్నప్పుడు, నేను కూడా మీలో భాగమైనట్టే అనిపించింది. 24 00:01:17,911 --> 00:01:20,705 ఏదేమైనా, నీకు గుడ్ లక్ చెప్పడానికే వచ్చా నేను. 25 00:01:20,706 --> 00:01:22,999 - నీకు కూడా థ్యాంక్స్, ఎలీనా... - హా. 26 00:01:23,000 --> 00:01:25,002 ...సాంటిని మళ్ళీ గోల్ఫ్ వైపు నడిపించావు. 27 00:01:26,003 --> 00:01:27,462 హా. 28 00:01:29,006 --> 00:01:30,257 నువ్వుంటే నాకు ప్రాణం, బుడ్డోడా. 29 00:01:32,301 --> 00:01:34,468 - ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? - నేను తిరిగి హోటల్ కి వెళ్తున్నా. 30 00:01:34,469 --> 00:01:36,679 అక్కడి నుండి చూస్తా. నా వల్ల నీ ఆటకి భంగం కలగడం నాకిష్టం లేదు. 31 00:01:36,680 --> 00:01:40,474 నాన్నా, నీ వల్ల నా ఆటకేం కాదు. ఇక్కడ పాతిక వేల మంది ఉన్నారు. 32 00:01:40,475 --> 00:01:41,809 - లేదులే. - అంటే... 33 00:01:41,810 --> 00:01:43,854 ప్రైస్, ఆయనకి నువ్వు పాస్ తీసుకురాగలవు, కదా? 34 00:01:46,398 --> 00:01:47,399 కదా? 35 00:01:53,363 --> 00:01:54,989 రెడీసేఫ్ ఇన్సురెన్స్ ఇన్విటేషనల్ 36 00:01:54,990 --> 00:01:57,366 {\an8}1 - పార్ 4 483 యార్డ్స్ 37 00:01:57,367 --> 00:02:00,329 {\an8}పీజీఏ - ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా 38 00:02:03,373 --> 00:02:05,166 {\an8}- ఇదిగో. - ఇదిగో. 39 00:02:05,167 --> 00:02:06,250 {\an8}రెడీసేఫ్ ఇన్విటేషనల్ వీఐపీ 40 00:02:06,251 --> 00:02:07,418 థ్యాంక్స్, మానీ. 41 00:02:07,419 --> 00:02:08,627 ఇక నేనేం నీకు రుణపడి లేను, కదా? 42 00:02:08,628 --> 00:02:10,588 - ఇంకొంచెం ఉన్నావు. - ఇంకొంచెం ఉన్నానని ఎలా అంటావు? 43 00:02:10,589 --> 00:02:13,466 భలేవాడివే. నువ్వు ఆదివారం తెల్లవారు నాలుగు గంటలకి కాల్ చేశావు మరి. 44 00:02:13,467 --> 00:02:14,759 - అవును... - ఇంకొంచెమేలే. 45 00:02:14,760 --> 00:02:16,845 ప్రైస్, ఇది అన్యాయం. జీవితాంతం నన్ను వాడుకుంటావా, ఏంటి! 46 00:02:20,140 --> 00:02:22,142 {\an8}వీలర్ 47 00:02:23,185 --> 00:02:26,188 గ్యారీ, ఇదిగోండి. మీకన్నీటికీ యాక్సెస్ ఉంటుంది. 48 00:02:26,772 --> 00:02:29,148 - వావ్. థ్యాంక్స్, ప్రైస్. - ఏం పర్వాలేదు. 49 00:02:29,149 --> 00:02:31,984 సిసీలియా, నా మనస్సును విరగ్గొట్టేస్తున్నావు 50 00:02:31,985 --> 00:02:33,486 రోజూ నాపై నాకే నమ్మకం పోతోంది 51 00:02:33,487 --> 00:02:34,570 నీకు అభిమానులు ఉన్నారా? 52 00:02:34,571 --> 00:02:36,989 వెళ్ళు, వెళ్ళు. వెళ్లి ఆటోగ్రాఫ్స్ ఇచ్చి రా. 53 00:02:36,990 --> 00:02:38,199 నువ్వంటే మాకు పిచ్చి, సాంటి. 54 00:02:38,200 --> 00:02:40,494 - గోల్ఫ్ లో తర్వాతి సూపర్ స్టార్ ని కలిసే అవకాశమివ్వు వాళ్లకి. - నేను... 55 00:02:41,578 --> 00:02:42,495 హాయ్. 56 00:02:42,496 --> 00:02:43,914 పద. కంగారుపడిపోకు. 57 00:02:51,463 --> 00:02:52,964 మిమ్మల్ని చూసినందుకు అతను చాలా సంతోషంగా ఉన్నాడు. 58 00:02:52,965 --> 00:02:54,049 అవును. 59 00:02:55,676 --> 00:02:59,262 ఇది చాలా ముఖ్యమైన రోజు, మనిద్దరికీ మాట్లాడుకునే అవకాశం రాలేదని తెలుసు. 60 00:02:59,263 --> 00:03:01,472 - ఇబ్బందిగా అనిపించకుండా ఉండటమే నాకు కావాలి. - అవును. 61 00:03:01,473 --> 00:03:03,684 - ప్రైస్, ఇక మీరేం చెప్పక్కర్లేదు. - నేను... 62 00:03:04,393 --> 00:03:07,353 మీరు వాడికి కోచ్. నేను మధ్యలో దూరను. 63 00:03:07,354 --> 00:03:08,729 నిజంగానే చెప్తున్నా. 64 00:03:08,730 --> 00:03:12,734 నా కొడుకు పక్కన ఉండాలన్నదే నా ఉద్దేశం, అంతే. 65 00:03:14,486 --> 00:03:16,530 - ఇది ఇప్పించినందుకు థ్యాంక్స్. - పర్వాలేదు. 66 00:03:21,535 --> 00:03:24,203 మిట్స్, అతడిని పంపించేయి. అతను ఇక్కడ ఉండకూడదు. 67 00:03:24,204 --> 00:03:27,291 నేనేం చేయగలను! అతను ఉండాలా లేదా అన్నది సాంటి ఇష్టం. 68 00:03:29,084 --> 00:03:30,209 {\an8}ప్రైస్? 69 00:03:30,210 --> 00:03:32,712 {\an8}మిట్స్ అన్నది నిజమే. మేము చేయగలిగింది ఏమీ లేదనుకుంటా. 70 00:03:32,713 --> 00:03:35,882 అతను ఏకాగ్రత తప్పకుండా ఉండేలా చూసుకో. 71 00:03:35,883 --> 00:03:36,966 అది చాలు అతనికి. 72 00:03:36,967 --> 00:03:38,302 సరే. అలాగే. 73 00:03:39,219 --> 00:03:40,136 హా. 74 00:03:40,137 --> 00:03:42,723 సాంటి, ఇక వెళదామా? పద, మెగాస్టార్. 75 00:03:43,432 --> 00:03:45,100 ఇప్పుడు డ్రైవింగ్ రేంజికి వెళ్ళాలి. 76 00:03:56,153 --> 00:03:57,821 ఇండియానాకు స్వాగతం జాగ్రత్తగా నడపండి 77 00:04:28,727 --> 00:04:33,022 {\an8}రెడీసేఫ్ ఇన్విటేషనల్ లో చివరి రౌండ్ కి అందరికీ స్వాగతం. 78 00:04:33,023 --> 00:04:37,109 {\an8}హలో, మిత్రులారా. నేను జిమ్ నాంజ్, నాతో పాటు మాస్టర్స్ ఛాంపియన్, ట్రెవర్ ఇమెల్మన్ ఉన్నారు. 79 00:04:37,110 --> 00:04:39,529 ఈ వారం మనం చాలా చక్కని గోల్ఫ్ ఆటని చూశాం, జిమ్. 80 00:04:39,530 --> 00:04:43,449 చెప్పాలంటే, రెండుసార్లు మేజర్ ఛాంపియన్ అయిన, కాలిన్ మారికోవాతో పోల్చితే, 81 00:04:43,450 --> 00:04:45,868 ఒక్కరంటే ఒక్కరు కూడా బాగా ఆడలేదు. 82 00:04:45,869 --> 00:04:47,954 మారికోవా ఎంత బాగా ఆడారో అందరికీ తెలిసిందే, 83 00:04:47,955 --> 00:04:49,872 కానీ మరోవైపు ఇంకో సంచలనాన్ని కూడా మనం గమనిస్తున్నాం. 84 00:04:49,873 --> 00:04:51,958 అతనే సాంటి వీలర్, 85 00:04:51,959 --> 00:04:55,795 ఈ 17 ఏళ్ల ఏమెచర్, ఈ వారం అడ్డంకులన్నింటినీ అధిగమించి, 86 00:04:55,796 --> 00:04:57,714 తుది రౌండులో చోటు సంపాదించాడు. 87 00:04:58,298 --> 00:04:59,299 ఏమైంది? 88 00:04:59,883 --> 00:05:01,133 ఇది గోల్ఫ్ కోర్సేగా. 89 00:05:01,134 --> 00:05:02,636 అంతే. ఇక నీ ప్రతాపం చూపించు. 90 00:05:17,317 --> 00:05:18,902 మారికోవా 91 00:05:27,744 --> 00:05:30,580 ఇప్పుడు కాలిఫోర్నియాలోని లా కెన్యాడాకి చెందిన కాలిన్ మారికోవా 92 00:05:30,581 --> 00:05:31,999 బాల్ ని కొడతారు. 93 00:05:46,805 --> 00:05:48,806 వావ్, మారికోవా ఆరంభంలోనే అదరగొట్టేశాడు, 94 00:05:48,807 --> 00:05:52,769 కాస్త ఎడమ వైపుకు ఉండే ఈ హోల్ లోకి వేసే క్రమంలో, ఆయన 318 యార్డ్స్ కొట్టాడు. 95 00:05:54,688 --> 00:05:57,106 వీలర్ కి ఇప్పుడే అసలైన పరీక్ష మొదలవుతుంది. 96 00:05:57,107 --> 00:06:00,318 అట్టడుగు స్థానం నుండి ఒక్కసారిగా పైకి వచ్చినప్పుడు, చుట్టూరా జేజేలు కొట్టే జనం ఉన్నప్పుడు, 97 00:06:00,319 --> 00:06:02,320 ఆ ఒత్తిడిని తట్టుకోగలడా అనేది చూడాలి. 98 00:06:02,321 --> 00:06:04,989 ఇప్పుడు ఇండియానాలోని ఫోర్ట్ వెయిన్ కి చెందిన శాంటియాగో వీలర్, 99 00:06:04,990 --> 00:06:07,075 బాల్ ని కొడతారు. 100 00:06:19,379 --> 00:06:20,380 కానివ్వు, సాంటి. 101 00:06:40,943 --> 00:06:42,653 ఒత్తిడిని అధిగమించినట్టే ఉన్నాడు. 102 00:06:44,404 --> 00:06:47,991 సాంటి వీలర్ చాలా దూరం కొట్టాడు. 103 00:06:50,244 --> 00:06:51,578 ఇరగదీశావు. 104 00:06:52,871 --> 00:06:55,414 ఆ నడుమును ఇంకాస్త వేగంగా తిప్పడానికి ప్రయత్నించు, 105 00:06:55,415 --> 00:06:57,501 ఇంకొంచెం ఎక్కువ దూరం కొట్టగలవు. 106 00:07:12,850 --> 00:07:14,350 అదీ లెక్క! 107 00:07:14,351 --> 00:07:15,811 తుది రౌండ్ కాలిన్ మారికోవా 108 00:07:29,449 --> 00:07:30,826 మారికోవా -9 వీలర్ -6 109 00:07:52,764 --> 00:07:54,348 ట్రెవర్, ఇక్కడ లో షాట్ కొట్టాలి. 110 00:07:54,349 --> 00:07:57,018 వీలర్ ఇక్కడ దగ్గరగా కొడితే, నిర్ణీత స్ట్రోక్స్ కన్నా ఎనిమిది తక్కువలో కొట్టిన వాడవుతాడు, 111 00:07:57,019 --> 00:07:59,188 అప్పుడు మారికోవా కంటే ఒక్క షాటే వెనుకంజలో ఉంటాడు. 112 00:07:59,730 --> 00:08:01,647 అవును, కానీ ఇక్కడ కొట్టడం సులువు కాదు, జిమ్. 113 00:08:01,648 --> 00:08:02,773 ఇలాంటి షాట్లే 114 00:08:02,774 --> 00:08:05,736 టోర్నమెంటులోని ఈ క్షణంలో అటోఇటో తేల్చేస్తాయి. 115 00:08:13,952 --> 00:08:15,661 - వెళ్ళు. - వెళ్ళు! 116 00:08:15,662 --> 00:08:17,497 హోల్ లో పడు! 117 00:08:18,081 --> 00:08:19,499 పడు, పడు, పడు. 118 00:08:23,003 --> 00:08:23,921 అబ్బా. 119 00:08:26,757 --> 00:08:28,216 - సూపర్! - ఓరి దేవుడా! 120 00:08:28,217 --> 00:08:31,135 సాంటి వీలర్ ఈగల్ కొట్టేశాడు. 121 00:08:31,136 --> 00:08:34,138 పీజీఏ టూర్ చరిత్రలో ఇది ఎనిమిదవ సారే, 122 00:08:34,139 --> 00:08:37,350 ఒక ఏమెచర్, ఇలా తుది రౌండులో వేరొకరితో ఉమ్మడిగా మొదటి స్థానంలో కొనసాగడం. 123 00:08:37,351 --> 00:08:38,893 - కుమ్మేశా, నాన్నా! - అంతేగా! 124 00:08:38,894 --> 00:08:41,269 - కుమ్మేశా, నాన్నా! కుమ్మేశానంతే! - సూపర్. 125 00:08:41,270 --> 00:08:44,024 - బామ్, బామ్, బూమ్. - తస్సాదియ్యా! 126 00:08:48,987 --> 00:08:51,489 {\an8}అయ్యయ్యో. ఆకాశం మెరుస్తోంది, మిత్రులారా. 127 00:08:51,490 --> 00:08:54,033 {\an8}చూస్తుంటే, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వల్ల రెడీసేఫ్ ఇన్విటేషనల్ మ్యాచ్ కి 128 00:08:54,034 --> 00:08:56,744 {\an8}అంతరాయం ఏర్పడేలా ఉంది, ప్రస్తుతానికి "నైన్ అండర్ పార్"తో ఇద్దరు ముందంజలో ఉన్నారు. 129 00:08:56,745 --> 00:08:58,956 తుది రౌండ్ - టీ1 కాలిన్ మారికోవా టీ1 శాంటియాగో వీలర్ 130 00:09:03,502 --> 00:09:05,044 - హేయ్. - హేయ్. 131 00:09:05,045 --> 00:09:07,213 తుఫాను ఈ ప్రాంతాన్ని దాటేసినట్టు ఉంది. 132 00:09:07,214 --> 00:09:08,965 ఇంకాసేపట్లో ఆట మొదలవుతుందని అధికారి చెప్పాడు. 133 00:09:08,966 --> 00:09:11,092 - సరే. అలాగే. - అంతా ఓకేనా? 134 00:09:11,093 --> 00:09:12,970 హేయ్, హేయ్. నీకు ఆకలిగా ఉంటుందేమో అని తెచ్చా. 135 00:09:13,804 --> 00:09:15,806 హా, మంచిదే. కొంచెం తిన్నట్టు ఉంటుందిలే. 136 00:09:17,641 --> 00:09:18,809 నేను బ్యాగ్ దగ్గర ఉంటా. 137 00:09:23,021 --> 00:09:24,021 చికెన్ శాండ్విచ్ ఓకేనా? 138 00:09:24,022 --> 00:09:25,566 హా. డబుల్ ఓకే. 139 00:09:31,029 --> 00:09:32,447 అదొకసారి చూడు. 140 00:09:33,198 --> 00:09:34,824 '-9' దగ్గర సమంగా ఉన్నారు కాలిన్ మారికోవా - శాంటియాగో వీలర్ 141 00:09:34,825 --> 00:09:37,869 రెడీసేఫ్ ఇన్విటేషనల్ లో సాంటి వీలర్ మొదటి స్థానంలో ఇంకొకడితో ఉన్నాడు. 142 00:09:37,870 --> 00:09:40,288 ఇంకా ఎనిమిది హొల్స్ ఉన్నాయి. 143 00:09:40,289 --> 00:09:43,082 ఆ హొల్స్ లోకి మొదటి పది హొల్స్ లో ఆడినట్టే ఆడితే, 144 00:09:43,083 --> 00:09:45,085 ఈ కప్ నీదే. 145 00:09:47,504 --> 00:09:49,298 దేవుడా, నీకు ఆలెన్ కౌంటీ జూనియర్స్ టోర్నమెంట్ గుర్తుందా? 146 00:09:50,632 --> 00:09:53,593 గుర్తుందేమో. ఏమోలే. ఆ టోర్నమెంట్లన్నీ నాకు పెద్దగా గుర్తులేవు. 147 00:09:53,594 --> 00:09:56,804 పద్దెనిమిదవ హొల్ కి వెళ్లేసరికి పది స్ట్రోక్స్ లీడ్ లో ఉన్నావు. పది. 148 00:09:56,805 --> 00:09:59,391 బాబోయ్, సగం మంది ఆటగాళ్లు అప్పటికీ వదిలేసి వెళ్లిపోయారు. చాలా వేడిగా ఉండింది. 149 00:10:00,184 --> 00:10:04,021 కానీ నువ్వు ఏ మాత్రం తగ్గలేదు. నీపాటికి నువ్వు దూసుకెళ్తున్నావు. 150 00:10:05,522 --> 00:10:10,736 ఆరోజే నాకు అర్థమైంది, నువ్వు ఈ ఆటలో ఉన్నత శిఖరాలకు ఎదగగలవని. 151 00:10:11,445 --> 00:10:14,198 ఏమంటావు? కాబట్టి అప్పుడు చెప్పిందే ఇప్పుడూ చెప్తా. 152 00:10:18,535 --> 00:10:19,870 నువ్వు ఈ కప్ కొట్టగలవు, సాంటి. 153 00:10:22,623 --> 00:10:23,957 నిజంగా గెలవగలనని అనుకుంటున్నావా? 154 00:10:24,541 --> 00:10:26,335 నూటికి నూరు శాతం గెలవగలవు. 155 00:10:39,806 --> 00:10:41,308 నేను వెళ్ళిపోయినందుకు క్షమించు. 156 00:10:42,935 --> 00:10:44,436 నేను వెళ్ళిపోయింది నీ వల్లేమీ కాదు. 157 00:10:46,230 --> 00:10:48,690 అప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాను. నేను... 158 00:10:50,317 --> 00:10:53,862 నా బుర్ర సరిగ్గా పని చేసేది కాదు అప్పుడు. నీ కోసం దాన్ని సెట్ చేసుకుందామని వెళ్ళిపోయా. 159 00:10:54,655 --> 00:10:55,822 అలాగే మీ అమ్మ కోసం కూడా. 160 00:10:56,949 --> 00:10:58,367 ఆ తర్వాత... 161 00:10:59,993 --> 00:11:01,703 రావడానికి ముఖం చెల్లలేదు. 162 00:11:04,957 --> 00:11:09,962 నన్ను అత్యంత ఎక్కువగా బాధించే విషయం ఏంటో తెలుసా? నీకు తోడుగా లేకపోయాననే విషయం. 163 00:11:10,838 --> 00:11:15,591 ఒక తండ్రిలా గోల్ఫ్ కోర్సుపై నీతో కలిసి నడవలేకపోయాననే బాధ. 164 00:11:15,592 --> 00:11:17,094 మనం దాని గురించి కలలు కూడా కన్నాం కదా. 165 00:11:27,187 --> 00:11:28,271 నేను అప్పుడు దాన్ని 166 00:11:28,272 --> 00:11:30,189 - అరవై యార్డ్స్ దూరం కొట్టి, పచ్చగడ్డిపై నుండి... - ప్రైస్. 167 00:11:30,190 --> 00:11:32,317 వచ్చేశాడు. అంతా ఓకేనా? 168 00:11:32,901 --> 00:11:36,404 ఓకే. నేను... నేను నీతో ఒంటరిగా ఒక నిమిషం మాట్లాడొచ్చా? 169 00:11:36,405 --> 00:11:38,657 తప్పకుండా. ఏంటి సంగతి? 170 00:11:39,408 --> 00:11:41,994 ఏమీ లేదు. నేను... 171 00:11:43,704 --> 00:11:45,122 ఇదేం పెద్ద విషయమేం కాదు, కానీ నేను... 172 00:11:45,956 --> 00:11:48,542 మిగిలిన రౌండ్ కి క్యాడీగా మా నాన్న వస్తే బాగుటుంది అనిపిస్తోంది. 173 00:11:53,130 --> 00:11:54,047 ఇప్పుడా? 174 00:11:55,966 --> 00:11:59,677 జూనియర్స్ టోర్నమెంటుల్లో ఆడేటప్పుడు, చెప్పాలంటే నా జీవితమంతా ఆయనే నాకు క్యాడీగా ఉన్నాడు. 175 00:11:59,678 --> 00:12:04,015 కాబట్టి, అతను పక్కన లేకుండా దీన్ని ముగిస్తుంటే నాకు ఏదోలా ఉంది. 176 00:12:04,016 --> 00:12:06,268 అది నిజమే. కానీ... 177 00:12:07,144 --> 00:12:10,313 కానీ, నువ్వు ఇప్పుడు గోల్ప్ ని అద్భుతంగా ఆడుతున్నావు, 178 00:12:10,314 --> 00:12:13,774 అలాంటప్పుడు మధ్యలో క్యాడీలను మార్చడం నీకు ఓకేనా మరి? 179 00:12:13,775 --> 00:12:16,110 అంటే, ఆయన క్యాడీ మాత్రమే కాదు. 180 00:12:16,111 --> 00:12:18,487 - మా నాన్న... - అవును. 181 00:12:18,488 --> 00:12:20,699 ...ఈ ఆట ఎలా ఆడాలో నాకు నేర్పింది ఆయనే. 182 00:12:21,742 --> 00:12:22,826 అర్థం చేసుకోగలను. నా... 183 00:12:23,744 --> 00:12:26,621 నా భయం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా అటూఇటూ అయి, 184 00:12:26,622 --> 00:12:28,039 నువ్వు ఏకాగ్రత తప్పుతావేమో అని... 185 00:12:28,040 --> 00:12:29,457 నువ్వు నాకు నేర్పావు కదా. 186 00:12:29,458 --> 00:12:31,543 ఏకాగ్రత తప్పకుండా ఉండటం ఎలాగో నువ్వే నాకు నేర్పావు కదా. 187 00:12:32,044 --> 00:12:34,004 "అక్కర్లేని గోలని పట్టించుకోకు" అని అన్నావు కదా. 188 00:12:40,093 --> 00:12:41,678 ఈ పని నువ్వు పక్కాగా చేయాలనుకుంటున్నావా? 189 00:12:44,223 --> 00:12:45,641 నాకు ఇదే చేయాలనుంది. 190 00:12:46,850 --> 00:12:48,852 సరే. నీ ఇష్టం. 191 00:12:51,522 --> 00:12:52,855 ఆగు. హేయ్. అంటే... 192 00:12:52,856 --> 00:12:56,859 క్షమించు. నువ్వు ఫీల్ అవ్వట్లేదు కదా? 193 00:12:56,860 --> 00:12:59,862 నేనేం ఫీల్ అవ్వట్లేదులే. నా గురించి ఆలోచించకు. 194 00:12:59,863 --> 00:13:03,866 నువ్వు అద్భుతంగా ఆడటమే నాకు కావాలి. ఎలాగూ, నువ్వు అద్భుతంగానే ఆడుతావనుకో. 195 00:13:03,867 --> 00:13:06,286 అక్కర్లేని గోలని పట్టించుకోకు. నువ్వు అదరగొట్టేయగలవు. 196 00:13:07,996 --> 00:13:09,039 సరే. 197 00:13:15,295 --> 00:13:17,588 మిత్రులారా, ఒక గంట ఆలస్యమయ్యాక మళ్ళీ ఆట మొదలవుతోంది. 198 00:13:17,589 --> 00:13:20,132 ట్రెవ్, ఒక పోటీలో ఇలా విరామం తీసుకొని మళ్ళీ వచ్చినప్పుడు, 199 00:13:20,133 --> 00:13:21,843 ఏ అంశాలు కీలకం అవుతాయి? 200 00:13:21,844 --> 00:13:24,262 స్థిరత్వం, నిలకడ. 201 00:13:24,263 --> 00:13:26,013 నువ్వు బాగానే ఆడుతున్నావని నీకు తెలుసు. 202 00:13:26,014 --> 00:13:28,099 గత పది హొల్స్ లో నువ్వు ఎలా అయితే ఆడావో, 203 00:13:28,100 --> 00:13:29,934 అలాగే ఆడాలని నువ్వు గుర్తు చేసుకుంటూ ఉండాలి. 204 00:13:29,935 --> 00:13:30,978 శభాష్! 205 00:13:35,732 --> 00:13:38,192 - ఇది ఎవరూ ఊహించని పరిణామం. - నమ్మలేకపోతున్నా. 206 00:13:38,193 --> 00:13:41,028 సాంటి వీలర్ తన క్యాడీని మార్చినట్టున్నాడు. 207 00:13:41,029 --> 00:13:43,155 - సాంటి? సాంటి? - పీజీఏ టూర్ కి 208 00:13:43,156 --> 00:13:47,326 పదిహేనేళ్ళు దూరంగా ఉండి, మళ్ళీ రంగప్రవేశం చేసినందుకు, వారమంతా వార్తల్లో నిలిచిన ప్రైస్ కేహిల్, 209 00:13:47,327 --> 00:13:50,371 - ఇప్పుడు క్యాడీ స్థానంలో లేడు. - బంగారం. ఏం జరుగుతోంది? 210 00:13:50,372 --> 00:13:52,957 - ఏమీ లేదు, అంతా ఓకే. - లేదు, లేదు, అంతా ఓకే అని చెప్పకు. 211 00:13:52,958 --> 00:13:55,585 ఏం చేస్తున్నావు నువ్వు? ప్రైస్ ఎక్కడ? 212 00:13:55,586 --> 00:13:57,713 సాంటి? నువ్వే కొట్టాల్సింది ఇప్పుడు. 213 00:13:59,047 --> 00:14:00,131 నన్ను నమ్ము. 214 00:14:00,132 --> 00:14:01,216 లేదు... 215 00:14:02,342 --> 00:14:03,343 ఇరగదీసేయ్, బుడ్డోడా. 216 00:14:14,104 --> 00:14:15,105 వావ్. 217 00:14:18,442 --> 00:14:20,277 అంతే. అంతే. 218 00:14:22,279 --> 00:14:23,447 అంతే. 219 00:14:24,114 --> 00:14:26,657 {\an8}పార్ 5 545 యార్డ్స్ 220 00:14:26,658 --> 00:14:30,536 పద్నాల్గవ హోల్ దగ్గర, సాంటి వీలర్ ఫెయిర్ వే గుండా కొట్టాడు, 221 00:14:30,537 --> 00:14:32,872 కాబట్టి ఇది మారికోవాకి పెద్ద నష్టమే కలిగించవచ్చు. 222 00:14:32,873 --> 00:14:36,626 బాల్ దొరక్కపోతే, మూడు స్ట్రోక్స్ వెనక్కి వెళ్లి కొత్త బాల్ ని మళ్ళీ కొట్టాల్సి ఉంటుంది. 223 00:14:36,627 --> 00:14:40,380 వీలర్ పాయింట్లలో అతని వెన్నంటే ఉన్నాడు కాబట్టి ఇది అతనికి పెద్ద సమస్యే అవుతుంది. 224 00:14:41,798 --> 00:14:43,382 ఏం చేస్తున్నావు? 225 00:14:43,383 --> 00:14:46,010 ప్రైస్, ఇక్కడ తొమ్మిదో నంబర్ క్లబ్బు వాడి, నీటికి కాస్తంత ముందు దాకా కొట్టమన్నాడు. 226 00:14:46,011 --> 00:14:48,554 బాసూ, మారికోవా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇప్పుడే మనం మన ప్రతాపం చూపించాలి. 227 00:14:48,555 --> 00:14:50,390 నాల్గవ నంబర్ ఐరన్ తో ఆడేయ్. 228 00:14:51,892 --> 00:14:52,893 తీసుకో. 229 00:14:57,773 --> 00:14:58,690 అది మంచి విషయం కాదు. 230 00:14:59,274 --> 00:15:00,733 ఏమైంది? 231 00:15:00,734 --> 00:15:04,821 మామూలుగా సాంటి నీటి ముందుకు కొట్టాలి, కానీ గ్యారీ రిస్క్ తీసుకోమంటున్నాడు. 232 00:15:13,956 --> 00:15:16,749 దేవుడా. అది నీటిని దాటదేమో. 233 00:15:16,750 --> 00:15:19,169 - దేవుడా. - కానివ్వు, కానివ్వు. దాటు. 234 00:15:23,966 --> 00:15:26,717 అతను బాల్ ని జెండా నుండి 20 మీటర్ల దూరానికి కొట్టాడు. 235 00:15:26,718 --> 00:15:28,887 జిమ్, ఇతను రెండు స్ట్రోక్స్ తో హోల్ లో వేసేలా ఉన్నాడు. 236 00:15:29,972 --> 00:15:32,098 ఈ కుర్రాడు అదరగొట్టేస్తున్నాడు. 237 00:15:32,099 --> 00:15:34,433 సాంటి వీలర్ గురించి ఎవరైనా పుస్తకం రాస్తే, 238 00:15:34,434 --> 00:15:36,644 ఈ షాట్ ని మాత్రం తప్పక ప్రస్తావించాలి. 239 00:15:36,645 --> 00:15:37,854 ఆటను అద్భుతంగా ఆడుతున్నాడు. 240 00:15:37,855 --> 00:15:40,065 అంటే, అతని గురించి ఇప్పటిదాకా ఎవరికీ తెలీను కూడా తెలీదు కదా. 241 00:15:40,858 --> 00:15:41,942 అది నిజమే. 242 00:15:49,157 --> 00:15:52,244 సాంటి వీలర్ '-10'తో ప్రథమ స్థానంలో ఉన్నాడు 243 00:15:57,958 --> 00:15:59,585 బర్డీని సాధించేశావు. రెచ్చిపోతున్నావుగా. 244 00:16:00,210 --> 00:16:01,336 థ్యాంక్స్, కాలిన్. 245 00:16:10,596 --> 00:16:11,847 విషయం ఏంటి? ఏం ఆలోచిస్తున్నావు? 246 00:16:14,141 --> 00:16:15,683 కూల్ గా ఉండటానికి ప్రయత్నిస్తున్నా. 247 00:16:15,684 --> 00:16:17,101 కూల్. 248 00:16:17,102 --> 00:16:19,605 టోర్నమెంట్లో నువ్వే ముందంజలో ఉన్నావు. బాల్ ని ఉతికి ఆరేయ్. 249 00:16:38,207 --> 00:16:40,083 ఎడమ పక్కనున్న వాళ్ళు జరగాలి! 250 00:16:40,918 --> 00:16:43,878 దేవుడా. ఎప్పటికైనా జరగాల్సిందే ఇది. 251 00:16:43,879 --> 00:16:46,048 వీలర్ చాలా భారీ పొరపాటు చేశాడు. 252 00:16:51,011 --> 00:16:52,179 అలా కొట్టావేంటి? 253 00:16:53,597 --> 00:16:55,264 నువ్వు ఏకాగ్రత తప్పకూడదు. 254 00:16:55,265 --> 00:16:56,891 ఇతనికి నువ్వు అవకాశం ఇవ్వకూడదు. 255 00:16:56,892 --> 00:16:58,810 సరేనా? ఏకాగ్రతతో ఆడు. 256 00:17:02,481 --> 00:17:03,899 ఇలాగే మొదలవుతుంది. 257 00:17:04,691 --> 00:17:06,108 అతను సాంటికి ఏం చెప్తున్నాడు? 258 00:17:06,818 --> 00:17:08,069 పనికొచ్చేది కాదు. 259 00:17:14,742 --> 00:17:15,992 ఇది మంచిది కాదు. 260 00:17:15,993 --> 00:17:19,664 సాంటి వీలర్ విషయంలో పరిస్థితులు మరింతగా దిగజారాయి. 261 00:17:19,665 --> 00:17:21,875 బాల్ మంచి పొజిషన్లో లేదు. 262 00:17:22,584 --> 00:17:25,586 సాంటి ఇప్పుడు ఉన్న పరిస్థితి నుండి ఉత్తమంగా ఎలా బయటపడాలనే దాని గురించి, 263 00:17:25,587 --> 00:17:29,006 అతనికి, అతని క్యాడీకి మధ్య వాడివేడి చర్చలు జరుగుతున్నట్టున్నాయి. 264 00:17:29,007 --> 00:17:30,926 వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతున్నట్టున్నాయి. 265 00:17:33,679 --> 00:17:36,348 వీలర్ ఇక్కడ రిస్కీ షాట్ కొట్టబోతున్నాడు. 266 00:17:38,308 --> 00:17:42,020 అబ్బా. ఒక్కసారి అయినా రిస్క్ తీసుకోకుండా మామూలు షాట్ ఆడితే ఏమవుతుంది? 267 00:17:49,361 --> 00:17:50,487 సారీ. మనం... 268 00:17:51,363 --> 00:17:53,865 నాకు కావాల్సింది సారీ కాదు. నువ్వు బుర్ర పెట్టి ఆడటం. 269 00:17:53,866 --> 00:17:55,449 నిజంగానే చెప్తున్నా. 270 00:17:55,450 --> 00:17:57,368 కొట్టే ముందు ఒకసారి ఆలోచించు. 271 00:17:57,369 --> 00:17:59,662 అరె, ఎన్నిసార్లని చెప్పాలి నీకు? 272 00:17:59,663 --> 00:18:00,747 అనుకున్నట్టే అయింది. 273 00:18:02,040 --> 00:18:03,166 తొక్కలోది. 274 00:18:04,710 --> 00:18:06,879 నువ్వు బుర్ర పెట్టి ఆడాలి. 275 00:18:14,845 --> 00:18:16,263 సరే, పద! రా. 276 00:18:17,723 --> 00:18:18,724 వెళదాం రా. 277 00:18:23,645 --> 00:18:25,062 {\an8}'-9' వద్ద ప్రథమ స్థానం 1 మారికోవా సీ-టీ2 హోమా ఎం 278 00:18:25,063 --> 00:18:26,689 {\an8}టీ2 క్లార్క్ డబ్ల్యూ టీ4 వీలర్ ఎస్ 279 00:18:26,690 --> 00:18:29,775 పదిహేనవ హోల్ దగ్గర దారుణంగా ఆడాక, 280 00:18:29,776 --> 00:18:32,486 వీలర్, పార్-3, 16వ హోల్ దగ్గర, ఒక బోగీని సాధించడానికి 281 00:18:32,487 --> 00:18:34,155 కష్టాలు పడుతున్నాడు. 282 00:18:34,156 --> 00:18:35,240 నువ్వన్నది నిజమే. 283 00:18:38,452 --> 00:18:40,286 ఆ మాట నీ నోటి నుండి చాలా అరుదుగా వస్తుంది. 284 00:18:40,287 --> 00:18:41,705 నువ్వు కూడా అరుదుగానే నిజాలు చెప్తావు. 285 00:18:43,749 --> 00:18:45,167 ఇంతకీ నేను అన్న ఆ నిజమేంటి? 286 00:18:45,959 --> 00:18:46,960 సాంటి. 287 00:18:47,920 --> 00:18:49,921 నువ్వు అతడిని కలిసినప్పుడు, అతను ప్రతిభావంతుడని అన్నావు. 288 00:18:49,922 --> 00:18:51,464 నువ్వు అతనికి సాయపడగలవని అన్నావు. 289 00:18:51,465 --> 00:18:54,634 ఇప్పుడు, అతనికి నిజంగానే నీ సాయం కావలి. 290 00:18:54,635 --> 00:18:58,055 నన్నేం చేయమంటావు? నన్ను పక్కకు తీసేశాడు, మిట్స్? 291 00:18:58,639 --> 00:19:01,558 అర్థమవుతోందా? అతను గోల్ఫర్, నేను అతని క్యాడీని మాత్రమే. నిర్ణయం అతని చేతుల్లోనే ఉంటుంది. 292 00:19:02,768 --> 00:19:04,645 నేను గోల్ఫర్ గురించి మాట్లాడట్లేదు. 293 00:19:06,563 --> 00:19:08,106 నేను ఆ కుర్రాడి గురించి మాట్లాడుతున్నా. 294 00:19:27,793 --> 00:19:30,795 అరవై ఎనిమిది హోల్స్ లో అదిరేలా ఆడి, 295 00:19:30,796 --> 00:19:34,883 ఆ తర్వాత సాంటి వీలర్ ఆటపై పట్టు కోల్పోయాడు. 296 00:19:35,592 --> 00:19:37,677 లీడర్ బోర్డులో ఈ కుర్రాడి స్థానం పడిపోతూనే ఉంది. 297 00:19:37,678 --> 00:19:39,929 పాపం ఆ కుర్రాడు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, 298 00:19:39,930 --> 00:19:42,890 ఈ 17 ఏళ్ల కుర్రాడు, తన క్యాడీతో గొడవపడుతున్నాడు, 299 00:19:42,891 --> 00:19:44,350 ఇప్పుడు ఆటలో ఇబ్బంది పడుతున్నాడు. 300 00:19:44,351 --> 00:19:47,270 ట్రెవ్, ఇప్పుడు భూమ్మీద ఏకాంతంగా ఉండే చోటు ఏదైనా ఉందా? 301 00:19:47,271 --> 00:19:49,146 ఇది చూడటం ఇబ్బందిగానే ఉంది. 302 00:19:49,147 --> 00:19:51,233 ఇందాకంతా అతను మంచి ఊపులో ఉన్నాడు. 303 00:19:52,943 --> 00:19:55,319 ఎందుకంటే నేను గార్డెనర్ ని మాత్రమే కాదు, ఆర్టిస్ట్ ని కూడా. 304 00:19:55,320 --> 00:20:00,074 నేను గోల్ఫ్ కోర్సును నా చేతుల్లోకి తీసుకొని, దానికి ఒక రూపు ఇస్తా. దాన్ని చెక్కుతా. 305 00:20:00,075 --> 00:20:01,367 నాకు నీ సాయం కావాలి, మానీ. 306 00:20:01,368 --> 00:20:02,827 నేను ఒక పనిలో ఉన్నాను, ప్రైస్. 307 00:20:02,828 --> 00:20:04,495 తెలుసు, సారీ. అడ్డుపడుతున్నందుకు క్షమించు. 308 00:20:04,496 --> 00:20:06,664 - ఏంటి? - నీ ఆర్టిస్ట్ స్పీచ్ తర్వాత ఇచ్చుకోవచ్చు. 309 00:20:06,665 --> 00:20:07,958 దీనికి పెద్ద సమయమేం పట్టదు. 310 00:20:11,962 --> 00:20:13,129 హేయ్. 311 00:20:13,130 --> 00:20:14,755 బాల్ ని ఫెయిర్ వేలోకి కొట్టు. 312 00:20:14,756 --> 00:20:17,426 సరేనా? మూడు స్ట్రోక్స్ తో గడ్డిపైకి కొట్టి, ఇంటికి వెళ్ళిపోదాం. 313 00:20:19,386 --> 00:20:21,221 కానివ్వు, కొట్టేసేయ్. 314 00:20:41,491 --> 00:20:44,160 వీలర్ ఆ షాట్ అస్సలు బాగా కొట్టలేదు. 315 00:20:44,161 --> 00:20:46,705 పద్దెనిమిదవ హోల్ దగ్గర ఎక్కడికో కొట్టాడు. 316 00:20:47,664 --> 00:20:50,291 అతను నిరాశపడిపోతున్నాడు. అతడిని మాత్రం ఏమని అంటాం! 317 00:20:50,292 --> 00:20:51,792 టోర్నమెంట్లో ఇప్పటిదాకా అదిరిపోయేలా ఆడి, 318 00:20:51,793 --> 00:20:54,296 ఇప్పుడు ఇలా ముగుస్తుందంటే బాధగానే ఉంటుంది. 319 00:21:01,803 --> 00:21:03,347 మారికోవా -10 వీలర్ -2 320 00:21:13,315 --> 00:21:14,858 ఏంటి? ఏమైంది? 321 00:21:15,734 --> 00:21:17,819 బుజ్జగించమంటావా ఏంటి నిన్ను ఇప్పుడు? 322 00:21:18,820 --> 00:21:20,404 నేను నీకు సాయపడాలనే చూశా. 323 00:21:20,405 --> 00:21:22,950 కానీ నువ్వు వినట్లేదు. కాబట్టి తప్పు నీదే, నాది కాదు. 324 00:21:25,744 --> 00:21:27,329 మళ్ళీ ఆట మానేస్తావా ఏంటి? 325 00:21:28,539 --> 00:21:31,625 మానేస్తే, బుర్రని సెట్ చేసుకోవడానికి ఉన్నపళంగా మళ్ళీ వెళ్ళిపోతావా ఏంటి? 326 00:21:32,417 --> 00:21:33,459 నా మీద తోసేయకు ఇప్పుడు. 327 00:21:33,460 --> 00:21:37,631 నేను ఇప్పుడు వదిలేస్తే, మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? 328 00:21:39,842 --> 00:21:42,427 నువ్వు ఇలా చేస్తుంటే, ఉండాల్సిన అవసరమేంటి మరి? 329 00:21:45,472 --> 00:21:46,348 అయ్య బాబోయ్... 330 00:21:48,100 --> 00:21:49,892 స్ప్రింక్లర్లు ఆన్ అయ్యాయి. 331 00:21:49,893 --> 00:21:52,645 ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు, కానీ దీని వల్ల ఆటకి కాసేపు బ్రేక్ పడవచ్చు. 332 00:21:52,646 --> 00:21:55,023 ఓయ్! నువ్వు బాగానే ఉన్నావా? 333 00:21:57,776 --> 00:21:58,861 స్ప్రింక్లర్లని ఆన్ చేసింది నువ్వేనా? 334 00:21:59,695 --> 00:22:01,821 నీకు కాస్త బ్రేక్ కావాలి అనిపించింది. 335 00:22:01,822 --> 00:22:04,323 కానీ త్వరగా కానిచ్చేస్తాలే. మనకి కొన్ని నిమిషాల సమయమే ఉంటుంది. 336 00:22:04,324 --> 00:22:07,618 ప్రైస్, నేను... నువ్వన్నది నిజమే. క్షమించు. 337 00:22:07,619 --> 00:22:09,245 దాని గురించి ఆలోచించకు. 338 00:22:09,246 --> 00:22:11,581 హేయ్. మేము చూసుకుంటాంలే, ప్రైస్. 339 00:22:11,582 --> 00:22:14,584 అది నాకు తెలుసు, గ్యారీ, కానీ నా గోల్ఫర్ తో ఒక నిమిషం మాట్లాడే అవకాశం ఇవ్వండి. 340 00:22:14,585 --> 00:22:15,918 ఇప్పుడు అతను మీ గోల్ఫర్ కాదు. 341 00:22:15,919 --> 00:22:17,461 అతను నా గోల్ఫరే. 342 00:22:17,462 --> 00:22:20,674 ఒకే ఒక్క నిమిషం ఇవ్వండి, ఆ తర్వాత మీరే దగ్గర ఉండి అంతా చూసుకోండి. 343 00:22:22,217 --> 00:22:24,511 మిత్రులారా, ఒకే సమయంలో మీరిద్దరూ ఇక్కడ ఉండకూడదు. 344 00:22:25,179 --> 00:22:26,179 ఇతని క్యాడీని నేను. 345 00:22:26,180 --> 00:22:28,514 నిజానికి, రిజిస్టర్ అయిన క్యాడీని నేను. 346 00:22:28,515 --> 00:22:30,893 మిస్టర్ వీలర్, వీళ్ళిద్దరిలో మీ క్యాడీ ఎవరు? 347 00:22:38,317 --> 00:22:39,234 ఇతను. 348 00:22:39,985 --> 00:22:42,821 సర్, మీరు అక్కడి నుండి బయటకు వచ్చేయాలి. 349 00:22:47,075 --> 00:22:48,410 తెలివి లేదు, ఏం లేదు. 350 00:22:57,711 --> 00:22:58,712 గ్యారీ. 351 00:23:03,675 --> 00:23:04,927 మా దరిదాపుల్లోకి కూడా రాకు. 352 00:23:05,802 --> 00:23:07,137 వాడు నా కొడుకు. 353 00:23:08,889 --> 00:23:09,890 ఇప్పుడు కాదు. 354 00:23:10,807 --> 00:23:12,976 అసలు వాడు ఇక్కడి దాకా ఎలా వచ్చాడో తెలుసా, ఎలీనా? 355 00:23:14,019 --> 00:23:17,523 నా వల్లే. దానికి వాడు నాకు రుణపడి ఉండాలి. 356 00:23:21,026 --> 00:23:22,027 ఛ. 357 00:23:27,157 --> 00:23:29,575 ట్రెవర్, ఒకవైపు లీడర్ బోర్డులో కిందికి పడిపోయాడు, 358 00:23:29,576 --> 00:23:32,036 మరోవైపు దురదృష్టవశాత్తూ, ఈ స్ప్రింక్లర్స్ పొరపాటున ఆన్ అయిపోయాయి... 359 00:23:32,037 --> 00:23:35,748 ఈ సందర్భంలో ఈ కుర్రాడు ఈ రౌండ్ ని పూర్తి చేయగలడన్నది అనుమానమే. 360 00:23:35,749 --> 00:23:39,253 మిస్టర్ వీలర్, మీరు సిద్ధంగా ఉన్నప్పుడు ఆడవచ్చు. 361 00:23:40,337 --> 00:23:43,631 ఇప్పుడు వీలర్ చేయడానికి పెద్దగా ఏమీ లేదు. 362 00:23:43,632 --> 00:23:46,802 అవును, ఈ పరిస్థితుల్లో రౌండ్ ని పూర్తి చేయడమే ఎక్కువ అతను. 363 00:23:49,263 --> 00:23:50,848 ఏం చేయాలో అర్థం కావట్లేదు, ప్రైస్. 364 00:23:54,393 --> 00:23:58,397 ఇందాక బారులో నీ ఆటని చూస్తున్నప్పుడు, నాకొకటి అనిపించింది. 365 00:23:59,147 --> 00:24:01,399 అదేంటంటే, నాకు నువ్వు పరిచయమైన నాటి నుండి చూస్తున్నా, 366 00:24:01,400 --> 00:24:04,443 నువ్వు గోల్ఫ్ ని సరైన కారణాలతో ఆడట్లేదు. 367 00:24:04,444 --> 00:24:07,530 నువ్వు నా కోసం, మీ అమ్మ కోసం, 368 00:24:07,531 --> 00:24:12,326 జీరోని ఆకట్టుకోవడం కోసం, ఇప్పుడు మీ నాన్న కోసం ఆడుతున్నావు. 369 00:24:12,327 --> 00:24:15,580 కానీ నేను నిన్ను మొదటిసారిగా డ్రైవింగ్ రేంజిలో కలిశాను కదా, గుర్తుందా? 370 00:24:15,581 --> 00:24:19,000 అప్పుడు ఒంటరిగా ఉన్నావు, నీ అట ఫలితం గురించి నీకు ఆలోచన లేదు, అప్పుడెవరూ చూడట్లేదు కూడా. 371 00:24:19,001 --> 00:24:20,669 ఆ సమయంలో అదిరిపోయేలా ఆడావు. 372 00:24:22,546 --> 00:24:26,175 ఎందుకంటే, అప్పుడు నీ కోసం నువ్వు ఆడావు. నీకు ఆ ఆటంటే ప్రాణం కాబట్టి. 373 00:24:27,259 --> 00:24:29,260 నీ క్యాడీగా ఒక సలహా చెప్పనా? 374 00:24:29,261 --> 00:24:31,596 ఈ ఆటని నీకోసమే ఆడాలని నీకుంటే, 375 00:24:31,597 --> 00:24:33,849 నేను క్యాడీగా, ఆనందంగా నీ బ్యాగ్ మోస్తాను. 376 00:24:34,474 --> 00:24:36,142 కానీ నీకు ఆడాలని లేకున్నా, ఏం పర్వాలేదు. 377 00:24:36,143 --> 00:24:38,102 ఇంటికి వెళ్ళిపోదాం, సరేనా? 378 00:24:38,103 --> 00:24:42,607 మొబైల్ హోమ్ ఎక్కేసి, బార్బెక్యూ తిందాం, మంచి సంగీతం విందాం. 379 00:24:42,608 --> 00:24:45,319 లేదంటే ఇళయరాజా సంగీతాన్నే తలదన్నే 380 00:24:45,986 --> 00:24:48,947 మిట్స్ ఏడుపు విందాం. 381 00:24:51,241 --> 00:24:52,659 ఏదైనా కానీ, నీ ఇష్టం. 382 00:24:53,785 --> 00:24:56,788 నీ ఆట ఇది. ఇంకెవరిదీ కాదు. 383 00:25:10,886 --> 00:25:15,139 సిసీలియా, నా మనస్సును విరగ్గొట్టేస్తున్నావు 384 00:25:15,140 --> 00:25:18,977 రోజూ నాపై నాకే నమ్మకం పోతోంది 385 00:25:19,561 --> 00:25:24,190 సిసీలియా మోకాళ్ళ మీద కూర్చున్నా 386 00:25:24,191 --> 00:25:28,320 ఇంటికి రమ్మని నిన్ను ప్రాధేయపడుతున్నా 387 00:25:28,946 --> 00:25:33,699 సిసీలియా, నా మనస్సును విరగ్గొట్టేస్తున్నావు 388 00:25:33,700 --> 00:25:37,787 రోజూ నాపై నాకే నమ్మకం పోతోంది 389 00:25:37,788 --> 00:25:42,875 సిసీలియా మోకాళ్ళ మీద కూర్చున్నా 390 00:25:42,876 --> 00:25:46,213 ఇంటికి రమ్మని నిన్ను ప్రాధేయపడుతున్నా 391 00:25:52,302 --> 00:25:54,136 తెలివిగా ఆడాలంటే, ఏడవ నంబర్ ఐరన్ తో 392 00:25:54,137 --> 00:25:57,099 డాగ్ లెగ్ హోల్ ముందుకు కొట్టి, చెట్ల పక్క నుండి తేలిగ్గా కొట్టుకుంటూ పోవాలి. 393 00:25:58,308 --> 00:26:00,561 హా, అది తెలివైన పనే. 394 00:26:02,563 --> 00:26:04,815 కానీ పైనుండి కొట్టే అవకాశం ఉండగా, చుట్టూ తిరుక్కుంటూ వెళ్లడం దేనికి? 395 00:26:11,989 --> 00:26:14,866 డ్రైవర్ క్లబ్ తీశాడు, జిమ్. అస్సలు నమ్మలేకపోతున్నా. 396 00:26:14,867 --> 00:26:18,536 హేయ్, చూడండి, గత అయిదు హొల్స్ లో వీలర్ ఆట తీరును చూశాక, 397 00:26:18,537 --> 00:26:20,913 అతను డ్రైవర్ తీయడం నాకు పెద్ద ఆశ్చర్యంగా అనిపించట్లేదు. 398 00:26:20,914 --> 00:26:24,000 సాంటి వీలర్, కార్నర్ ని కట్ చేయాలనుకుంటున్నాడు. 399 00:26:24,001 --> 00:26:25,502 చాలా ఆశ్చర్యంగా ఉంది. 400 00:26:44,771 --> 00:26:46,439 - వీలర్ మళ్ళీ పుంజుకొని... - అదీ లెక్క! 401 00:26:46,440 --> 00:26:49,775 ...పద్దెనిమిదవ హోల్ దగ్గర భలే అద్భుతంగా కార్నర్ ని కట్ చేశాడు. 402 00:26:49,776 --> 00:26:51,944 ఈ కుర్రాడు సామాన్యుడు కాదు, జిమ్. 403 00:26:51,945 --> 00:26:55,489 ఇతని పని ఇక అయిపోయింది అని మనం అనుకున్న ప్రతిసారి, ఇతను ఇంకా రెచ్చిపోయి ఆడుతున్నాడు. 404 00:26:55,490 --> 00:26:57,326 - అంతే! - సూపర్ మ్యాన్ వీలర్. 405 00:26:58,327 --> 00:27:00,204 భలే చెప్పావు, జిమ్. ఆ పేరు అతనికి స్థిరపడిపోతుంది. 406 00:27:10,964 --> 00:27:13,799 పద్దెనిమిదవ హోల్ దగ్గర కళ్ళు చెదిరే దృశ్యం కనిపిస్తోంది. 407 00:27:13,800 --> 00:27:16,969 సాంటి వీలర్ వెనుక జనాలు ర్యాలీగా వెళ్తున్నారు, 408 00:27:16,970 --> 00:27:18,930 ఇలాంటి దృశ్యాన్ని నేనెన్నడూ చూడలేదు. 409 00:27:18,931 --> 00:27:22,351 సైమన్, గార్ ఫంకెల్ పాడిన పాటను పాడుతున్నారు. చాలా బాగుంది అంతా. 410 00:27:34,404 --> 00:27:35,572 ఏమంటావు? 411 00:27:39,159 --> 00:27:42,620 నిజానికి, ఈ హోల్ లో వేయడం కష్టంగానే అనిపిస్తోంది. 412 00:27:42,621 --> 00:27:46,250 నేనైతే నేరుగా కొట్టేస్తా, కానీ నీ ఇష్టం. 413 00:28:00,013 --> 00:28:03,267 ముప్పై అడుగుల డబుల్ బ్రేకర్ ఇది, ఒకేసారి కొట్టడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. 414 00:28:23,036 --> 00:28:26,038 వీలర్ ప్లాన్ ఏంటో అర్థమే కావట్లేదు. 415 00:28:26,039 --> 00:28:28,457 అతను హోల్ వైపు కాకుండా వేరే వైపు కొడుతున్నాడు. 416 00:28:28,458 --> 00:28:30,877 ఈ కుర్రాడికి మంచి ఊహాశక్తి ఉంది. 417 00:28:30,878 --> 00:28:34,131 నేల ఎలా ఉందనే దాన్ని బాగా పసిగడతాడు, వేరే వాళ్లకి అయితే ఆ ఆలోచనలు కూడా రావు. 418 00:29:02,159 --> 00:29:03,327 హోల్ దగ్గరికి వచ్చేయ్! 419 00:29:04,328 --> 00:29:05,536 వావ్. 420 00:29:05,537 --> 00:29:07,206 పడు, పడు, పడిపో. 421 00:29:12,336 --> 00:29:13,628 - పడు! పడు! - పడు. 422 00:29:13,629 --> 00:29:15,214 ఓరి దేవుడా. 423 00:29:22,012 --> 00:29:24,348 సాంటి అదరగొట్టేశాడు! 424 00:29:26,433 --> 00:29:27,434 ఇది సింక్ షాట్. 425 00:29:28,852 --> 00:29:29,853 - సూపర్ గా కొట్టాడు. - భలే వేశాడు. 426 00:29:31,104 --> 00:29:34,482 ఏడాదికి ఇరవై వారాలు మనం ఇక్కడ కూర్చుంటాం కదా, 427 00:29:34,483 --> 00:29:35,942 కానీ ఒక్కసారంటే ఒక్కసారి కూడా, 428 00:29:35,943 --> 00:29:39,237 ఇంత ప్రత్యేకమైన పీజీఏ టూర్ ఈవెంట్ ని మనం చూడలేదనే చెప్పాలి. 429 00:29:39,238 --> 00:29:40,571 అదీ లెక్క! 430 00:29:40,572 --> 00:29:43,950 ఓక్లహోమాలోని టుల్సాలో ఈ వారం శాంటియాగో వీలర్, ప్రైస్ కేహిల్ కలిసి 431 00:29:43,951 --> 00:29:47,620 మునుపెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో కుమ్మేశారు. 432 00:29:47,621 --> 00:29:49,330 బాగా కొట్టావు, రోబోట్. 433 00:29:49,331 --> 00:29:51,834 - ఐ లవ్ యూ. నువ్వు తోపువి. - ఐ లవ్ యూ టూ. 434 00:30:00,342 --> 00:30:02,635 ప్రైస్! మీరు అదరగొట్టేశారు. 435 00:30:02,636 --> 00:30:04,095 కానీ రెండు స్ట్రోక్స్ లో కొడితే, నాదే గెలుపు. 436 00:30:04,096 --> 00:30:07,598 అవును, క్షమించు. కానీ మనం ఒక నిమిషం ఆగుదాం. 437 00:30:07,599 --> 00:30:08,808 సరే. 438 00:30:08,809 --> 00:30:10,185 బాగా ఆడుతున్నారు. 439 00:30:22,072 --> 00:30:24,074 - హా, రండి! అందరూ రండి! - యా! 440 00:30:45,888 --> 00:30:47,890 లెన్నక్స్ మున్సిపల్ గోల్ఫ్ కోర్సుకు స్వాగతం 441 00:30:52,519 --> 00:30:53,644 ఏంటది? 442 00:30:53,645 --> 00:30:55,813 ఓపెన్ టెక్సస్ స్క్రాంబుల్ సమ్మర్ ఫన్ - గోల్ఫ్ టోర్నమెంట్ 443 00:30:55,814 --> 00:30:58,233 {\an8}యువ సంచలనం సాంటి: పీజీఏ టోర్నమెంట్ లో స్థానిక కుర్రాడి ప్రభంజనం 444 00:31:01,987 --> 00:31:03,988 {\an8}దాని గురించి నువ్వు నిజంగానే ఎప్పుడూ ఆలోచించలేదా? 445 00:31:03,989 --> 00:31:06,574 ఆలోచించకుండా ఎందుకు ఉంటా! దానితో పాటు చాలా వాటి గురించి ఆలోచిస్తా. 446 00:31:06,575 --> 00:31:09,619 నీకు ఆ సత్తా ఉంది, కదా? అంటే, నువ్వు అన్నిటినీ పక్కకు పెట్టేసి, 447 00:31:09,620 --> 00:31:13,581 రోజూ జిమ్ కి వెళ్లి, ఫిట్ గా అయితే, మళ్ళీ ఆడవచ్చు. 448 00:31:13,582 --> 00:31:14,875 లేదులే, నాకు వయస్సు అయిపోయింది. 449 00:31:15,375 --> 00:31:18,044 డేవిడ్ డువల్ కి 52 ఏళ్ళు. వచ్చే వారం జరిగే జాన్ డీర్ టోర్నమెంట్లో ఆయన ఆడుతున్నాడు. 450 00:31:18,045 --> 00:31:21,547 ఇంత కాలం తర్వాత మళ్ళీ నేను ఆడలేనులే, నీకు అది తెలీట్లేదు, అంతే. 451 00:31:21,548 --> 00:31:23,674 - ఇప్పుడు నా నడుము ఒంగదు కూడా. - అబ్బా, నేను... 452 00:31:23,675 --> 00:31:25,760 నా ముందే నువ్వు గాడ్స్ థంబ్ కొట్టావు కదా. సూపర్ గా కొట్టావు. 453 00:31:25,761 --> 00:31:26,928 ఏదో అదృష్టం కలిసి వచ్చిందంతే. 454 00:31:26,929 --> 00:31:30,681 ప్రైస్... సోది కొట్టకు. అస్సలు కొట్టకు. ఇదేమైనా... 455 00:31:30,682 --> 00:31:32,517 ఆగు, ఇప్పుడు నన్ను ఏమార్చుతున్నావా? 456 00:31:32,518 --> 00:31:34,185 అంటే, నీకంత సీన్ లేదన్నట్టు నువ్వు నటిస్తావు, 457 00:31:34,186 --> 00:31:36,646 నేనెమో ఇంకా ప్రలోభానికి గురై నిన్ను నమ్మేస్తా. అదేనా నీ ప్లాన్? 458 00:31:36,647 --> 00:31:38,689 నేనేం నిన్ను ఏమార్చట్లేదు. నిన్ను ఏమార్చి ప్రయోజనం ఏంటి! 459 00:31:38,690 --> 00:31:40,274 నీ దగ్గర ఏముంది తీసుకోవడానికి? నీ హుడీయా? 460 00:31:40,275 --> 00:31:42,402 - నీ స్కూటరా? - ఓరి దేవుడా. 461 00:31:43,654 --> 00:31:44,570 సరే, ఒక్క మాట. 462 00:31:44,571 --> 00:31:48,824 గతేడాది టూర్లో నమోదైన సగటు డ్రైవింగ్ డిస్టెన్స్, 293 యార్డులు. 463 00:31:48,825 --> 00:31:51,619 2005లో, నీ సగటు, 301 యార్డులు. 464 00:31:51,620 --> 00:31:52,912 - నా గురించి గూగుల్ చేశావా? - భలేవాడివే! 465 00:31:52,913 --> 00:31:56,582 నీ సత్తా చూడాలనుకుంటున్నా. బ్యాక్ నైన్ హొల్స్ లో ఆడదాం. నువ్వూ, నేనూ. 466 00:31:56,583 --> 00:31:57,667 నిజంగానా? 467 00:31:57,668 --> 00:31:58,752 నిజంగానే. 468 00:32:05,175 --> 00:32:06,968 నా సత్తా చూడాలనుకుంటున్నావు, కదా? 469 00:32:06,969 --> 00:32:09,303 సరే. అలాగే కానిద్దాం. 470 00:32:09,304 --> 00:32:10,514 పద. 471 00:32:34,496 --> 00:32:36,163 - బాగా కొట్టావు. - హా. 472 00:32:36,164 --> 00:32:38,083 ఇంకా కాస్త గట్టిగానే పట్టుకుంటున్నావు. 473 00:32:38,792 --> 00:32:41,378 - ఏదోక రోజు అది నీకే అర్థమవుతుందిలే. - ఏడిచావులే. 474 00:32:43,755 --> 00:32:46,132 ఒక్క మాట. నాకోసం నువ్వేం త్యాగాలు గట్రా చేయక్కర్లేదు, సరేనా? 475 00:32:46,133 --> 00:32:47,593 నీ అసలైన సత్తా చూడాలనుకుంటున్నా నేను. 476 00:32:59,730 --> 00:33:00,898 దేవుడా. 477 00:34:33,991 --> 00:34:35,993 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్