1 00:00:33,659 --> 00:00:35,661 నువ్వు చంద్రుడి మీద నడిచిన మొట్టమొదటి మహిళవి. 2 00:00:37,663 --> 00:00:39,414 కాబట్టి నీకు కొంచెం రక్షణ ఉంటుంది. 3 00:00:42,835 --> 00:00:45,128 మొదటి మనిషి అయినంత మాత్రానా గగారిన్ కూడా తప్పించుకోలేదు. 4 00:00:50,425 --> 00:00:52,302 మార్గం మిషన్ పారామీటర్స్ ప్రకారమే ఉంది. 5 00:00:52,386 --> 00:00:53,387 ఆర్డర్ ఇవ్వండి. 6 00:00:53,470 --> 00:00:56,056 లూనా 16, మీరు డీఆర్బిట్ బర్న్ మొదలెట్టడానికి అంతా క్లియర్. 7 00:00:56,139 --> 00:00:58,016 స్టార్ సిటీ, లూనా 16. 8 00:00:58,100 --> 00:01:03,564 ఆటోమేటెడ్ డీఆర్బిట్ బర్న్, యుటిసి 08:07కి మొదలవుతోంది. 9 00:01:03,647 --> 00:01:05,566 వ్యవధి, 122 సెకన్లు. 10 00:01:13,282 --> 00:01:14,533 స్టార్ సిటీ. 11 00:01:14,616 --> 00:01:16,618 డీఆర్బిట్ బర్న్ సగం వ్యవధికి చేరుకుంటోంది. 12 00:01:16,702 --> 00:01:18,328 కాపీ, లూనా 16. 13 00:01:26,295 --> 00:01:27,546 స్టార్ సిటీ, లూనా 16. 14 00:01:28,463 --> 00:01:29,923 డీఆర్బిట్ బర్న్ పూర్తి అయింది. 15 00:01:30,007 --> 00:01:33,135 కాపీ, లూనా 16. ఇక మీరు విడిపోవచ్చు. 16 00:01:33,218 --> 00:01:37,264 విడదీత మొదలెడుతున్నాం మూడు, రెండు, ఒకటి. 17 00:01:42,060 --> 00:01:43,061 విడదీత పూర్తి అయిం… 18 00:01:49,276 --> 00:01:50,694 అది ఇంకా అతుక్కునే ఉంది. 19 00:01:50,777 --> 00:01:52,029 అది విడిపోలేదు. 20 00:01:52,112 --> 00:01:54,907 స్టార్ సిటీ, మరొకసారి అంబిలికల్ బోల్ట్ లో సమస్య ఏర్పడింది. 21 00:01:54,990 --> 00:01:56,617 వాళ్ళ షిప్ సర్వీస్ మాడ్యూల్ ని లాగుతోంది. 22 00:01:56,700 --> 00:01:59,620 - హల్ ఉష్ణోగ్రత తీవ్ర స్థాయికి చేరుకుంది. - శాంతించండి. శాంతించండి. 23 00:01:59,703 --> 00:02:01,955 మనం వాళ్ళని చంద్రుడి మీదకి పంపి ఇప్పుడు ఆఖరికి వచ్చాక కోల్పోకూడదు. 24 00:02:02,039 --> 00:02:04,917 వాతావరణ చర్య వల్ల ఆ కేబుల్ కరిగిపోతుంది. 25 00:02:05,000 --> 00:02:08,127 ఒకవేళ అలా జరగకపోతే, ప్రభుత్వ మర్యాదలతో ఇంకా చాలా మందికి అంత్యక్రియలు చేయాలి. 26 00:02:08,211 --> 00:02:09,963 పిచ్చిగా మాట్లాడకు. 27 00:02:10,047 --> 00:02:11,798 మన అంత్యక్రియలకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. 28 00:02:12,841 --> 00:02:14,343 - కామ్స్ వాళ్లతో లైన్ కలుపు. - సర్. 29 00:02:21,266 --> 00:02:23,685 నా ఈగల్స్, మీకు మాట ఇస్తున్నాను, 30 00:02:23,769 --> 00:02:26,522 ఆ క్యాప్స్యూల్ ని సోవియెట్ యూనియన్ ఉత్పత్తి చేసిన 31 00:02:26,605 --> 00:02:28,774 అత్యంత నాణ్యమైన టైటానియంతో చేశారు. 32 00:02:29,650 --> 00:02:32,611 వైరు తెగే వరకు అది తట్టుకుంటుంది. 33 00:02:50,921 --> 00:02:52,798 స్టార్ సిటీ, యాటిట్యూడ్ కరెక్ట్ చేయబడింది. 34 00:02:54,007 --> 00:02:55,551 హల్ ఉష్ణోగ్రత తగ్గుతోంది. 35 00:02:55,634 --> 00:02:58,011 లూనా 16, మీ మార్గాన్ని ధృవీకరించగలరా? 36 00:02:58,095 --> 00:02:59,847 ప్లాన్ చేసినదానికన్నా నిటారుగా దిగుతోంది. 37 00:03:01,098 --> 00:03:02,099 అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళతారు? 38 00:03:03,517 --> 00:03:05,143 300… లేదు. 39 00:03:05,227 --> 00:03:08,105 అనుకున్న గమ్యానికి 450 కిలోమీటర్ల దూరంలో. 40 00:03:08,188 --> 00:03:11,275 బైకాల్ సరస్సు దగ్గర ఉన్న సెంట్రల్ సైబీరియన్ పీఠభూమికి. 41 00:03:11,358 --> 00:03:13,652 రికవరీ టీమ్, మీ దగ్గర ఆ కో-ఆర్దినేట్స్ ఉన్నాయా? 42 00:03:46,560 --> 00:03:47,978 కొంచెం బయటకు వెళదాం. 43 00:04:39,279 --> 00:04:41,990 వాళ్ళు మన దగ్గరకు రావడానికి ఎంత టైమ్ పడుతుందో చెప్పగలమా? 44 00:04:43,450 --> 00:04:46,119 నేను ఎమర్జెన్సీ కిట్ లో ఉన్న సిగ్నల్ ఫ్లేర్ ని తీసుకొస్తా. 45 00:04:48,247 --> 00:04:50,499 - వాల్య. - ఏంటది? 46 00:04:50,582 --> 00:04:52,042 తుపాకీ తీసుకురా. తుపాకీ తీసుకురా. 47 00:04:53,293 --> 00:04:54,920 కదలొద్దు. 48 00:07:18,146 --> 00:07:19,439 వెనక్కి స్వాగతం, కామ్రేడ్. 49 00:07:24,403 --> 00:07:26,613 మీకు డెప్యూటీ చైర్మన్ టారసవ్ ని పరిచయం చేయాలి అనుకుంటున్నా. 50 00:07:29,324 --> 00:07:30,325 కూర్చో. 51 00:07:34,830 --> 00:07:36,206 నువ్వు ఈ మహిళని గుర్తుపట్టగలవా? 52 00:07:40,961 --> 00:07:42,337 - లేదు. - నిజంగా? 53 00:07:42,921 --> 00:07:44,882 ఆమె పేరు అనస్టాసియా బెలికోవా, 54 00:07:44,965 --> 00:07:46,633 చంద్రుడి మీద అడుగు పెట్టిన మొదటి మహిళ. 55 00:07:46,717 --> 00:07:52,347 నీలాగ కాకుండా దేశానికి మంచి చేసే విధంగా ప్రవర్తించడం ఈమెకు తెలుసు. 56 00:07:53,682 --> 00:07:56,226 ఇక నుండి అనస్టాసియా బెలికోవా… 57 00:07:57,227 --> 00:07:59,354 అనే పేరు నీది కాదు, కామ్రేడ్. 58 00:08:03,317 --> 00:08:05,485 నాకు… ఏమని… నాకు ఏమనాలో తెలీడం లేదు. 59 00:08:05,569 --> 00:08:07,654 చంద్రుడి మీద ఉన్నప్పుడు మాత్రం నీకు ఇలా అనిపించలేదు. 60 00:08:09,489 --> 00:08:13,452 నీకంటే ముందున్న వ్యక్తిని తీసేసిన తర్వాత ఆమెకు బదులు నిన్ను పెట్టమని కల్నల్ రస్కోవ 61 00:08:13,535 --> 00:08:18,207 నాకు చెప్పినప్పుడు, నీ స్థాయి ఏమిటో నువ్వు అర్థం చేసుకోగలవు అని నాకు మాట ఇచ్చింది. 62 00:08:18,290 --> 00:08:19,791 అవును, అది నాకు తెలుసు. నాకు తెలుసు. 63 00:08:19,875 --> 00:08:24,213 అయినా సరే నేను సైబీరియాలో ఒక ట్రక్ లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. 64 00:08:25,422 --> 00:08:27,591 ఇలా గనుక మళ్ళీ జరిగింది అంటే… 65 00:08:27,674 --> 00:08:29,218 మళ్ళీ జరగదు, కల్నల్ రస్కోవ. 66 00:08:30,636 --> 00:08:31,762 ఒట్టు. 67 00:08:33,179 --> 00:08:34,515 మంచిది. 68 00:08:41,980 --> 00:08:43,482 సరే, ఇక ఆ విషయం సెటిల్ అయింది. 69 00:08:43,565 --> 00:08:48,487 ఇక్కడి నుండి నువ్వు ఉలాన్-ఊడే ఎయిర్ ఫీల్డ్ కి వెళ్లి అక్కడి నుండి స్టార్ సిటీకి వెళ్లి 70 00:08:49,196 --> 00:08:51,740 రెడ్ స్క్వేర్ లో పరేడ్ కోసం సిద్ధపడతావు. 71 00:08:51,823 --> 00:08:54,409 ఆ తర్వాత మన దేశంలో చిన్న టూర్ తిరిగాక 72 00:08:55,035 --> 00:08:56,870 మేము నిన్ను పారిస్ కి పంపాలి అనుకుంటున్నాము, 73 00:08:57,454 --> 00:09:00,916 ప్రపంచ ప్రెస్ ముందు సోవియెట్ నైతిక ఆధిక్యతకు ఒక సింబల్ గా 74 00:09:01,458 --> 00:09:04,461 నువ్వు సాధించిన ఈ చారిత్రాత్మక విషయాన్ని వేడుక చేసుకోవడానికి. 75 00:09:05,254 --> 00:09:08,674 కాకపోతే, మనం పరిష్కరించాల్సిన ఒక్క సమస్య ఉంది. 76 00:09:10,342 --> 00:09:13,554 ఒక సింగిల్ మహిళగా సోవియెట్ స్త్రీ సాధికారతకు 77 00:09:13,637 --> 00:09:14,847 ప్రతీకగా నిన్ను చూపలేము. 78 00:09:21,103 --> 00:09:22,729 కానీ నేను నిజంగానే సింగిల్ మహిళని. 79 00:09:25,023 --> 00:09:28,569 అందుకే ట్రిప్ ముగిసేసరికి నీకు పెళ్లి జరగబోతోంది. 80 00:09:28,652 --> 00:09:30,112 పెళ్లా? 81 00:09:32,698 --> 00:09:34,783 అది అవసరమా? 82 00:09:34,867 --> 00:09:36,994 నీకు సహకరించడం ఇష్టం లేదు అంటున్నావా? 83 00:09:38,704 --> 00:09:39,705 కాదు. 84 00:09:40,581 --> 00:09:41,582 కాదు, కాదు. 85 00:09:45,627 --> 00:09:46,712 నాకు… నాకు తెలీదు… నేను… 86 00:09:46,795 --> 00:09:49,715 - మా నాన్న, నేను ఆయనతో మాట్లాడా… - మీ నాన్నకి చెప్తాము. 87 00:09:49,798 --> 00:09:51,425 మేము ఇంతకు ముందే అన్ని ఏర్పాట్లు చేసాం. 88 00:09:51,508 --> 00:09:55,262 అది… చక్కని సోవియెట్ పెళ్లి అవుతుంది. 89 00:09:58,056 --> 00:09:59,141 అభినందనలు. 90 00:10:02,686 --> 00:10:05,772 నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో అడగొచ్చా? 91 00:10:10,485 --> 00:10:12,196 - జోక్ చేస్తున్నారా? - ఆమె వయసులో ఉంది, 92 00:10:12,279 --> 00:10:13,405 మరీ అంత బాగోదు అనడానికి లేదు, 93 00:10:13,488 --> 00:10:15,991 అలాగే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ మహిళ కూడా. 94 00:10:16,074 --> 00:10:18,827 - దానర్థం నాకు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉందని కాదు. - సోవియెట్ యూనియన్ లో ఉన్న 95 00:10:18,911 --> 00:10:21,205 ఏ బ్రహ్మచారైనా ఇప్పుడు నీ స్థానంలో ఉండటానికి ఏమైనా చేస్తాడు. 96 00:10:21,288 --> 00:10:22,289 సరే, అయితే వాళ్లలో ఎవరినైనా అడగండి. 97 00:10:22,372 --> 00:10:24,750 ఇప్పుడు ఎలాగూ నీకు జోడి ఎవరూ లేరు కదా? 98 00:10:24,833 --> 00:10:27,085 నువ్వు సెటిల్ అయితే నీకే మంచిది. 99 00:10:27,169 --> 00:10:29,546 సెంట్రల్ కమిటీ వారు ఆమె ఒక కాస్మోనాట్ ని పెళ్లి చేసుకోవాలి అంటున్నారు. 100 00:10:29,630 --> 00:10:32,883 అలాగే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ప్రస్తుతం నువ్వు ఒక్కడివే బ్యాచిలర్ వి. 101 00:10:34,092 --> 00:10:35,302 ఆమె నాకు నచ్చే రకం కాదు. 102 00:10:36,470 --> 00:10:38,263 అంటే, ఆమె… ఆమె వింతైన మనిషి. ఆమె… 103 00:10:38,347 --> 00:10:40,474 సాష. నువ్వు మంచి పైలట్ వి, 104 00:10:40,557 --> 00:10:43,310 కానీ నీకు ఇంకా ఎలాంటి మిషన్ ఇవ్వకపోవడానికి ఒక కారణం ఉంది. 105 00:10:44,686 --> 00:10:45,687 అవును, అదేంటో నాకు తెలుసు. 106 00:10:45,771 --> 00:10:47,856 నీ సమస్యలు అన్నిటికీ మీ తాతముత్తాతలు 50 ఏళ్ల క్రితం 107 00:10:47,940 --> 00:10:50,234 ఫాలో అయిన మతం కారణం అనుకోవద్దు. 108 00:10:50,317 --> 00:10:52,611 - అయితే నన్ను పైకి ఎందుకు పంపలేదు? - ఎందుకంటే నీకు ప్రతీది జోకే, 109 00:10:52,694 --> 00:10:56,365 సాష. నువ్వు ఈ ప్రోగ్రామ్ ని సీరియస్ గా తీసుకుంటున్నావు అని నిరూపించాలి. 110 00:10:56,448 --> 00:10:58,033 ఏంటి? ఆ యంత్రాన్ని పెళ్లి చేసుకున్నా? 111 00:10:58,116 --> 00:10:59,868 అసలు, ఇక్కడ జోక్ చేస్తున్నది ఎవరు? 112 00:10:59,952 --> 00:11:01,620 సాష, ప్రస్తుతం నాకున్న ఒత్తిడిలో నేను 113 00:11:01,703 --> 00:11:03,914 పెళ్లిళ్ల పేరయ్య పనులు చేయాలి అనుకుంటున్నా అనిపిస్తుందా? 114 00:11:03,997 --> 00:11:06,208 నా సమయాన్ని ఇలా గడపాలి అనుకుంటున్నా అనిపిస్తుందా? 115 00:11:09,002 --> 00:11:12,172 ఈ ప్రపంచంలో మనం కోరుకున్నది దక్కించుకోవడానికి కొన్ని త్యాగాలు చేయాలి 116 00:11:12,256 --> 00:11:13,799 అని నేను చాలా కాలం క్రితమే నేర్చుకున్నా. 117 00:11:14,550 --> 00:11:16,426 - మరి అందుకు నువ్వు సిద్ధమా? - అవును. 118 00:11:17,302 --> 00:11:20,764 ఆదేశాలకు ఎదురు తిరగడానికి ఇది సరైన సమయం కాదు, నన్ను నమ్ము. 119 00:11:37,698 --> 00:11:38,699 నాతో రా. 120 00:11:54,047 --> 00:11:55,215 కల్నల్ రస్కోవ? 121 00:11:55,299 --> 00:11:56,550 తలుపు మూయ్. 122 00:12:20,157 --> 00:12:22,659 బెర్లిన్ లో ఏమైనా తెలిసిందా? 123 00:12:22,743 --> 00:12:25,537 నా డెస్క్ మీద ఉన్న ఫైల్స్ చదవడం నీకు మంచి ఐడియా అనిపించిందా? 124 00:12:25,621 --> 00:12:27,414 క్షమించండి, కల్నల్. నాకు తెలీ… 125 00:12:29,208 --> 00:12:30,876 నేను ఏం ఆలోచిస్తున్నానో నాకే తెలీదు. 126 00:12:36,965 --> 00:12:40,427 స్టాసి వాళ్ళు అమెరికన్ కొరియర్ అని నమ్ముతున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. 127 00:12:41,053 --> 00:12:43,305 లూనార్ బేస్ ప్లానులు తీసుకెళ్లిన వ్యక్తా? 128 00:12:44,014 --> 00:12:46,558 నేను జర్మన్ మాట్లాడగలను, మీకు పనికొస్తుంది అంటే చెప్పండి. 129 00:12:46,642 --> 00:12:49,311 నిన్ను చూస్తుంటే ఏం అనుకోవాలో తెలీడం లేదు, ఇరీనా వసిలియెవ్న. 130 00:12:49,937 --> 00:12:51,855 నీకు గొప్ప లక్ష్యాలు ఉన్నాయి, తెలివైన దానివి, 131 00:12:51,939 --> 00:12:54,650 అలాగే నీ లక్ష్యాన్ని సాధించడానికి ఏదైనా చేయడానికి నువ్వు వెనుకాడవు. 132 00:12:54,733 --> 00:12:59,029 నీలాంటి వారు సర్వీస్ కి అలాగే నాకు చాలా పనికొస్తారు. 133 00:12:59,112 --> 00:13:02,241 నాకు చేతనైన విధంగా మీకు సహాయపడటం నాకు సంతోషమే, కల్నల్. 134 00:13:04,326 --> 00:13:05,452 కానీ కొంత వరకు మాత్రమే. 135 00:13:09,915 --> 00:13:12,125 వాల్య అలాగే టాన్యా మీరోనవ్ లు కామ్రేడ్ బెలికోవాతో 136 00:13:12,209 --> 00:13:15,879 కలిసి పారిస్ కి వెళ్ళినప్పుడు వారిపై కన్నేసి ఉంచడం కొనసాగించు. 137 00:13:15,963 --> 00:13:18,173 అలాగే మన కొత్త జంటపై కూడా ఒక కన్నేసి ఉంచు. 138 00:13:19,174 --> 00:13:21,051 బెలికోవా ప్రోటోకాల్ ని ఫాలో అయ్యేలా చూసుకో. 139 00:13:21,969 --> 00:13:25,138 ఆమెపై ఆధారపడలేం అని చూపించింది. 140 00:13:25,222 --> 00:13:26,890 అలాగే నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి. 141 00:13:26,974 --> 00:13:31,270 మనం ఒక్కసారి స్టార్ సిటీని వదిలి వెళ్లాం అంటే, బయటి వారు జోక్యం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 142 00:13:31,353 --> 00:13:32,396 అర్థమైంది. 143 00:14:10,142 --> 00:14:12,394 నన్ను క్షమించండి, కానీ మీకు చాలా థాంక్స్, చీఫ్ డిజైనర్. 144 00:14:12,477 --> 00:14:13,604 దేనికి, తల్లి? 145 00:14:13,687 --> 00:14:15,564 నువ్వే నాకు టీ పోస్తున్నావు. 146 00:14:15,647 --> 00:14:18,442 అవును, కానీ మీరు సోవియెట్ మహిళల గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా చేశారు. 147 00:14:18,525 --> 00:14:20,194 ఆమె చెప్పేది నిజమే, కామ్రేడ్. 148 00:14:20,277 --> 00:14:22,112 నువ్వు ప్రపంచమే సోవియెట్ మహిళలపై ఈర్ష్య పడేలా చేసావు, 149 00:14:22,196 --> 00:14:25,449 ఇప్పుడు మా అందరి భార్యలు అదే మాట్లాడుతున్నారు. 150 00:14:27,784 --> 00:14:31,038 జనరల్ సెక్రటరీ బ్రెజ్నవ్ కి మీ పట్టువదలని మనస్సు వల్లే 151 00:14:31,121 --> 00:14:34,499 మనం మరొకసారి అమెరికన్లను మించడానికి వీలైంది అని తెలుసు. 152 00:14:35,667 --> 00:14:39,922 ఆయన ఆ పురోగతిని కొనసాగించాలి అనుకుంటున్నాడు కాబట్టే మేము నిన్ను ఇక్కడికి రప్పించాం. 153 00:14:40,005 --> 00:14:42,174 సరే, అది వింటుంటే సంతోషంగా ఉంది. 154 00:14:42,257 --> 00:14:46,386 నేను మీ అందరికీ లూనార్ మిషన్ కి మించి నాకున్న ప్రొపోజల్స్ కి సంబంధించిన కాపీలు తెచ్చాను, 155 00:14:46,470 --> 00:14:50,933 అది మన ఆపరేషన్స్ లో ఎప్పటికీ ఒక భాగంగానే ఉంటుంది, కానీ మనం అంతకంటే పెద్దగా ఆలోచించాలి. 156 00:14:51,016 --> 00:14:52,392 మనం నిజంగా అమెరికన్లను ఓడించాలి అంటే 157 00:14:52,476 --> 00:14:55,771 ఇంకా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయాలి. 158 00:14:55,854 --> 00:14:59,024 విషయం ఏంటంటే, సోవియెట్ కాస్మోనాట్ ని పంపడానికి… థాంక్స్… 159 00:14:59,107 --> 00:15:02,194 అంటే మనకు దగ్గరలో ఉండే గ్రహాలకు, 160 00:15:02,277 --> 00:15:04,571 - నా ఉద్దేశం వీనస్ కి… - కామ్రేడ్, ఒక్క క్షణం, 161 00:15:04,655 --> 00:15:07,241 మీరు చెప్పేది అంతా ఒకవేళ అమెరికన్లు జ్వెజ్డా 162 00:15:07,950 --> 00:15:10,118 ప్లానులను దొంగిలించకపోయి ఉంటే సాధ్యం అయ్యేది. 163 00:15:11,370 --> 00:15:15,082 ప్రస్తుతం కామ్రేడ్ బ్రెజ్నవ్ లూనార్ బేస్ కే ప్రాముఖ్యత ఇస్తున్నాడు. 164 00:15:15,165 --> 00:15:16,166 ఇలా చేయడం… 165 00:15:16,959 --> 00:15:17,960 పొరపాటు అవుతుంది. 166 00:15:19,711 --> 00:15:21,255 ఏం అనుకోవద్దు. 167 00:15:21,338 --> 00:15:24,091 కానీ కామ్రేడ్ బ్రెజ్నవ్ తనకు ఏం కావాలో స్పష్టంగా చెప్పాడు. 168 00:15:24,758 --> 00:15:29,221 అమెరికన్లు మన డిజైన్ ని వాడి మనకంటే ముందు లూనార్ బేస్ ని పెట్టడం ఆయనకు ఇష్టం లేదు. 169 00:15:32,558 --> 00:15:34,142 నన్ను ఏం చేయమని అడుగుతున్నారు? 170 00:15:34,726 --> 00:15:37,729 నువ్వు జ్వెజ్డా లాంచ్ ని కొంచెం ముందుగానే చేయాలి. 171 00:15:38,480 --> 00:15:41,149 పారాట్రూపర్స్ డే వేడుకల సమయానికి అది సాధ్యం అవుతుందా? 172 00:15:41,233 --> 00:15:43,694 అందుకు కొన్ని నెలలే ఉంది. 173 00:15:44,945 --> 00:15:46,238 మన లూనార్ బేస్ రీ-డిజైన్ ని పూర్తి చేయడానికి 174 00:15:46,321 --> 00:15:49,032 ఒక ఏడాదికి మించి పడుతుంది. 175 00:15:49,116 --> 00:15:50,117 అంతేకాక అసలు చంద్రుడి 176 00:15:50,200 --> 00:15:54,454 ఉపరితలం మీద అసలు నీరు ఉందో లేదో కూడా మనం ఇంకా తెలుసుకోలేదు అనే విషయం మర్చిపోకూడదు. 177 00:15:54,538 --> 00:15:57,749 నీకు పని పూర్తి చేయడానికి ఏం కావాలంటే అది తీసుకో. డబ్బు, వనరులు, మనుషులు. 178 00:15:57,833 --> 00:15:58,917 నీకు ఏది కావాలంటే అది ఇస్తాం. 179 00:15:59,001 --> 00:16:00,169 - ఇది… - సమయం మాత్రం ఇవ్వలేం. 180 00:16:00,252 --> 00:16:01,879 క్షమించు, కామ్రేడ్, కానీ ఇది వెర్రితనం. 181 00:16:02,963 --> 00:16:04,298 అది వెర్రి వాగుడు. 182 00:16:05,048 --> 00:16:07,009 నాకు కూడా ఇక్కడ ఉన్న మీ అందరిలాగే అమెరికన్లను 183 00:16:07,092 --> 00:16:09,928 ఓడించాలని ఉంది, కానీ ఇంత త్వరగా లాంచ్ చేయడమా? 184 00:16:12,514 --> 00:16:16,435 అలా చేస్తే మనం ఆ వెళ్లేవారిని చావడానికే పంపుతున్నట్టు అవుతుంది. 185 00:16:20,439 --> 00:16:23,901 కావొచ్చు, కానీ జనరల్ సెక్రటరీ కోసం 186 00:16:25,027 --> 00:16:27,321 నువ్వు ఇది చేయగలవని నీ సామర్ధ్యంపై మాకు నమ్మకముంది. 187 00:16:27,404 --> 00:16:28,405 నువ్వు 188 00:16:29,072 --> 00:16:30,866 మాకున్న అత్యంత విలువైన వనరువి. 189 00:16:33,410 --> 00:16:37,080 సరే, కామ్రేడ్ బెలికోవా టూర్ పై మన లేటెస్ట్ ప్లానులు ఏమిటి? 190 00:16:46,590 --> 00:16:47,883 చీఫ్ డిజైనర్? 191 00:16:52,137 --> 00:16:53,722 కామ్రేడ్ బెలికోవా. 192 00:16:55,516 --> 00:16:56,725 ఒక క్షణం మాట్లాడొచ్చా? 193 00:16:59,603 --> 00:17:01,063 అవును, మాట్లాడొచ్చు. 194 00:17:11,240 --> 00:17:12,241 నేను… 195 00:17:13,659 --> 00:17:17,996 లూనా 17 బృందంలో చేరడానికి ముందుకు రావాలి అనుకుంటున్నా. 196 00:17:18,914 --> 00:17:20,790 నీకు అక్కడ బాగా నచ్చినట్టు ఉందే? 197 00:17:21,708 --> 00:17:24,252 అది నా జీవితంలోనే అత్యంత గొప్ప క్షణం. 198 00:17:24,336 --> 00:17:26,755 మా అందరికీ నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది. 199 00:17:27,756 --> 00:17:31,176 కానీ ప్రస్తుతానికి నువ్వు నీ ముందు ఉన్న మిషన్ మీద దృష్టి పెట్టాలి. 200 00:17:34,096 --> 00:17:35,931 నువ్వు నీ టూర్ కి రెడీగా ఉన్నావా? 201 00:17:36,974 --> 00:17:39,393 నిజం చెప్పాలంటే, నాకు చాలా భయంగా ఉంది. 202 00:17:42,563 --> 00:17:45,023 లియోనవ్ కి అలా తిరగడం చాలా నచ్చింది. 203 00:17:46,483 --> 00:17:48,151 నేను లియోనవ్ ని కాదు కదా. 204 00:17:48,235 --> 00:17:49,486 నాకు తెలుసు. 205 00:17:50,153 --> 00:17:51,989 నిన్ను చూస్తుంటే నాకు యూరీ గుర్తుకొస్తున్నాడు. 206 00:17:53,949 --> 00:17:56,410 అతనికి వొస్టక్ 1 నుండి బయటపడటానికి అవకాశం ఉండింది, 207 00:17:56,493 --> 00:17:59,913 కానీ నీలాగే మిషన్ కోసం అంతా రిస్క్ చేసాడు. 208 00:18:00,789 --> 00:18:04,418 అలాగే అతనిలాగే నువ్వు కూడా పబ్లిక్ లో ఉండటం ఇష్టపడతావు. 209 00:18:06,003 --> 00:18:08,839 మీరు కూడా పారిస్ కి వస్తారా, చీఫ్ డిజైనర్? 210 00:18:12,092 --> 00:18:13,093 నాకు… 211 00:18:14,845 --> 00:18:17,264 సోవియెట్ యూనియన్ వదిలి వెళ్ళడానికి వీలు లేదు. 212 00:18:21,768 --> 00:18:24,188 - నిజంగా? - నా క్షేమం కోసం… 213 00:18:25,439 --> 00:18:26,648 అని అంటున్నారు మరి. 214 00:18:28,692 --> 00:18:31,278 నువ్వు నీ ట్రిప్ ని ఎంజాయ్ చెయ్, కామ్రేడ్ బెలికోవా. 215 00:18:32,196 --> 00:18:33,614 మేము గర్వపడేలా చెయ్. 216 00:18:33,697 --> 00:18:34,698 థాంక్స్. 217 00:18:44,458 --> 00:18:45,918 ఎక్కడికి వెళ్తున్నావు? 218 00:18:46,001 --> 00:18:49,296 అంటే, నాతో కలిసి పనిచేసేవాళ్ళు ఒక ట్రిప్ మీద వెళ్తున్నారు. 219 00:18:50,339 --> 00:18:51,465 కాబట్టి నేను కూడా వెళ్ళాలి. 220 00:18:52,049 --> 00:18:54,676 నేను నటాలియా ఫోన్ లో మాట్లాడటం విన్నాను. 221 00:18:55,385 --> 00:18:59,348 ఆమె నువ్వు బిల్డింగ్ 12లో పని చేస్తుంటావు కాబట్టి నువ్వు ఉన్నప్పుడు మాట్లాడలేను అంది. 222 00:19:04,228 --> 00:19:07,064 ఓహ్, అంటే, ఆమెకు అక్కడ పని చేయడానికి అవకాశం లేదు కాబట్టి కుళ్ళు. 223 00:19:07,898 --> 00:19:08,899 పదా. 224 00:19:10,234 --> 00:19:11,735 కొంచెం టీవీ ఆపుతావా? 225 00:19:17,616 --> 00:19:20,118 మన మాతృభూమి రాజధానిలో 226 00:19:20,202 --> 00:19:22,287 ముందెన్నడూ లేనంత మందిని ఆకర్షించిన తర్వాత, 227 00:19:22,371 --> 00:19:26,375 కాస్మోనాట్ అనస్టాసియా బెలికోవా సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ లో 228 00:19:26,458 --> 00:19:29,878 ఉన్న ఇతర రాజధానులకు వెళుతూ తన టూర్ ని కొనసాగిస్తోంది. 229 00:19:30,754 --> 00:19:35,133 యుఎస్ఎస్ఆర్ లో పనిచేసే వర్కర్ల నుండి ఆమెకు అన్ని చోట్లా సాదర ఆహ్వానం అందుతోంది. 230 00:19:35,217 --> 00:19:37,594 ఆమె త్వరలోనే తన తోటి కాస్మోనాట్ ని పెళ్లి చేసుకోబోతుండటంతో, 231 00:19:37,678 --> 00:19:39,179 వారిద్దరూ ప్రపంచ ప్రెస్ లో ఆమె సాధించిన 232 00:19:39,263 --> 00:19:42,432 ఈ గొప్ప విషయాన్ని వేడుక చేయడానికి పారిస్ కి వెళ్ళబోతున్నారు. 233 00:19:55,237 --> 00:19:56,363 హలో. 234 00:19:57,030 --> 00:19:58,031 హలో! 235 00:19:58,824 --> 00:19:59,992 మాస్కో నుండి గ్రీటింగ్స్. 236 00:20:08,375 --> 00:20:09,751 ఇది భలే ఉంది. 237 00:20:10,627 --> 00:20:12,379 ఇది నేను ఊహించినదానికన్నా చాలా బాగుంది. 238 00:20:17,301 --> 00:20:18,302 కానివ్వు, కాస్త ఉత్సాహంగా ఉండు. 239 00:20:19,344 --> 00:20:21,722 వాళ్లంతా నిన్ను చూడటం కోసం లైన్ లో నిలబడ్డారు. చూడు. 240 00:20:25,934 --> 00:20:27,352 అనస్టాసియా! 241 00:21:07,726 --> 00:21:11,063 జ్వెజ్డా నిర్మాణం 15 నెలలలో పూర్తి చేయగలగడం అంటే మనకు అదృష్టం కలిసొచ్చినట్లే. 242 00:21:11,730 --> 00:21:13,565 అలాంటిది అంతకంటే చాలా ముందే ఎలా నిర్మించడం? 243 00:21:13,649 --> 00:21:17,486 మనం రిస్క్ తీసుకోకుండా అమెరికన్లను ఓడించలేదు. అలాంటప్పుడు ఇప్పుడెందుకు భయం? 244 00:21:17,569 --> 00:21:20,697 కానీ ఎన్-1 ప్రస్తుత లూనార్ మాడ్యూల్స్ ని లాంచ్ చేయడానికే తిప్పలు పడుతోంది. 245 00:21:20,781 --> 00:21:23,075 అలాంటిది మనం వాటికి ఇంకేమైనా చేర్చితే లాంచ్ చేయడం అసాధ్యం. 246 00:21:23,158 --> 00:21:24,785 అంతా మళ్ళీ మొదటికి వచ్చింది. 247 00:21:24,868 --> 00:21:26,870 నువ్వు ఎప్పుడూ ఇంత ప్రతికూలంగా మాట్లాడతావు ఎందుకు, రెమ్? 248 00:21:26,954 --> 00:21:28,872 ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం ప్రతికూలంగా ఉండటం కాదు. 249 00:21:28,956 --> 00:21:30,958 - నేను… - ఇన్ఫ్లేటబుల్స్ వాడితే ఎలా ఉంటుంది? 250 00:21:34,086 --> 00:21:35,087 మనం… 251 00:21:36,004 --> 00:21:38,799 మనం లూనార్ ల్యాండర్ లో నివసించదగ్గ ప్రదేశాన్ని 252 00:21:38,882 --> 00:21:41,051 పెంచడానికి ఇన్ఫ్లేటబుల్స్ నే వాడుతున్నాము, 253 00:21:41,134 --> 00:21:43,512 లియోనవ్ చేసిన స్పేస్ వాక్ కోసం ఎయిర్ లాక్ ని వాడినట్టు. 254 00:21:44,137 --> 00:21:45,889 మరి మనం టచ్ డౌన్ చేసిన తర్వాత కూడా అలాగే చేస్తే 255 00:21:45,973 --> 00:21:48,559 అవే ల్యాండింగ్ ప్రొటొకాల్స్ ని వాడటానికి వీలు ఉంటుంది. 256 00:21:49,101 --> 00:21:50,853 మన లూనార్ బేస్ ని టెంట్ తో ఏర్పాటు చేయమంటావా? 257 00:21:51,562 --> 00:21:53,355 వేరే ఏదీ చేయడానికి మనకు టైమ్ లేదు. 258 00:21:53,438 --> 00:21:56,149 ఈ మిషన్ కి మనం మళ్ళీ ముగ్గురుని పంపాలి. 259 00:21:56,233 --> 00:21:58,819 ఇద్దరు ఉపరితలం మీద ఉంటే ఒకరు ఆర్బిట్ లో ఉండాలి. 260 00:21:58,902 --> 00:22:01,113 ఇద్దరినీ లాంచ్ చేయడానికి నిర్మించిన ప్రస్తుత క్రాఫ్ట్ లో 261 00:22:01,196 --> 00:22:04,241 వాళ్ళను ఎలా ఇరికించాలో మనం ఎలాగూ ఆలోచించాల్సిందే, 262 00:22:04,324 --> 00:22:09,246 మరి అలాంటప్పుడు పని ఇలా మొదలెట్టి తర్వాత ఏమవుతుందో చూస్తేనే మంచిది. 263 00:22:12,666 --> 00:22:13,917 ఆసక్తికరమైన ఐడియా. 264 00:22:14,710 --> 00:22:17,588 కానీ చాలా ప్రొద్దుపోయింది. 265 00:22:18,589 --> 00:22:19,923 మనం ఇక… 266 00:22:22,301 --> 00:22:24,136 ఇంటికి వెళ్లి కాస్త పడుకుందాం, 267 00:22:25,095 --> 00:22:26,597 రేపు ఉదయం మళ్ళీ మాట్లాడదాం. 268 00:24:16,248 --> 00:24:20,002 ప్రపంచ ప్రెస్ లోని ఇతర సభ్యులను కలవడం కోసం రిసెప్షన్ కి వెళ్లేముందు మీరు బట్టలు మార్చుకోవాలి. 269 00:24:20,085 --> 00:24:21,753 తిరిగి మాస్కోకి వెళ్లే విమానం రేపు తెల్లవారుజామున వెళ్తుంది, 270 00:24:21,837 --> 00:24:23,839 అప్పుడే మీరు వివాహ సమయానికి రోస్టోవ్ కి వెళ్లగలరు. 271 00:24:25,716 --> 00:24:27,551 మాస్కో నుండి తీసిన ప్రెస్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. 272 00:24:28,343 --> 00:24:30,137 - కామ్రేడ్ కలిన్స్కి, నేను… - జాప్యం చేయొద్దు. 273 00:24:30,220 --> 00:24:31,680 నువ్వు అందరి ముందు మంచి అభిప్రాయాన్ని సాధించాలి. 274 00:25:28,862 --> 00:25:30,697 - ఏం చేస్తున్నావు? - ఏమీ లేదు. 275 00:25:30,781 --> 00:25:32,824 ఈ పెర్ఫ్యూమ్ బాటిల్ ని ఆస్వాదిస్తున్నాను. 276 00:25:32,908 --> 00:25:33,909 అది ముట్టుకోకు. 277 00:25:34,660 --> 00:25:37,496 ఎందుకు? ఇవి గిఫ్టులు. ఇవి ఇంకెందుకు ఇచ్చారు అనుకుంటున్నావు? 278 00:25:48,882 --> 00:25:50,342 వాళ్లకు నువ్వు ఇది పూసుకున్నావని తెలుస్తుంది. 279 00:25:51,552 --> 00:25:53,762 అప్పుడు వాళ్ళు పారిస్ భోగాలకు 280 00:25:54,763 --> 00:25:56,390 ఫిదా అయిపోయావు అనుకుంటారు. 281 00:25:56,473 --> 00:25:58,642 నేను నిజంగానే పారిస్ భోగాలకు ఫిదా అయిపోయా. 282 00:25:58,725 --> 00:26:00,060 తెలుసా, వాళ్ళు మన మాటలు వింటూ ఉండొచ్చు. 283 00:26:01,186 --> 00:26:02,980 నేను పెర్ఫ్యూమ్ పూసుకుంటున్నా! 284 00:26:03,605 --> 00:26:04,898 ఎవరూ లెక్క చేయరు, వాల్యుష్. 285 00:26:06,358 --> 00:26:07,943 ఇవాళ రాత్రికి కాస్త ఎంజాయ్ చేద్దాం. 286 00:26:25,210 --> 00:26:26,211 కల్నల్ రస్కోవ. 287 00:26:36,305 --> 00:26:37,389 చూసావా, వాల్యుష్? 288 00:26:37,973 --> 00:26:38,974 నువ్వేమో ఊరికే భయపడ్డావు. 289 00:26:40,684 --> 00:26:42,895 మనం కలిసి రిసెప్షన్ కి వెళితే బాగుంటుందని నేను అనుకున్నా. 290 00:26:43,645 --> 00:26:44,980 నేను ఇది పూర్తి చేయాలి. 291 00:26:45,063 --> 00:26:46,064 మీరిద్దరూ వెళ్ళండి. 292 00:26:46,148 --> 00:26:49,067 - నేను అనస్టాసియాతో క్రిందకి వస్తా. - లేదు, లేదు, డార్లింగ్, నేను ఉంటా. 293 00:26:49,151 --> 00:26:50,444 ఏం పర్లేదు. వెళ్ళు. 294 00:26:53,071 --> 00:26:54,239 సరే. 295 00:26:56,241 --> 00:26:57,284 మరీ ఎక్కువసేపు చేయకు. 296 00:27:02,456 --> 00:27:04,249 లిఫ్ట్ లో ఏదైనా పరికరం పెట్టామా? 297 00:27:05,834 --> 00:27:07,377 లేదు. లేదు, కల్నల్. 298 00:27:21,850 --> 00:27:22,893 నువ్వు నన్ను దూరం పెడుతున్నావా? 299 00:27:22,976 --> 00:27:24,019 నేను నా భర్తతో ఉన్నాను. 300 00:27:25,562 --> 00:27:27,689 నీ వాసన బాగుంది. 301 00:27:29,608 --> 00:27:30,609 ఆపు. 302 00:27:32,277 --> 00:27:33,403 రాత్రికి ఎక్కడికైనా పోదాం. 303 00:27:34,571 --> 00:27:36,573 దగ్గరలో ఒక క్లబ్ ఉందని విన్నాను, అక్కడ మ్యూజిక్… 304 00:27:36,657 --> 00:27:38,659 నేను నీతో ఎక్కడికీ రాను, సాష. 305 00:27:42,329 --> 00:27:43,664 అనస్టాసియా గురించి ఇలా మాట్లాడుతున్నావా? 306 00:27:43,747 --> 00:27:44,873 నాకు వేరే దారి లేదు. 307 00:27:44,957 --> 00:27:45,958 ఆ విషయం నాకు తెలుసు. 308 00:27:46,500 --> 00:27:47,793 మరి ఎందుకు కోపంగా ఉన్నావు? 309 00:27:49,169 --> 00:27:50,838 పెళ్లి చేసుకున్నది నువ్వు కదా. 310 00:27:53,757 --> 00:27:54,967 అవును, నువ్వు అన్నది నిజమే. 311 00:27:58,220 --> 00:28:00,430 బహుశా మనిద్దరికీ ఇలా జరగడమే మంచిదేమో. 312 00:28:03,141 --> 00:28:04,226 నువ్వు నిజంగా అలా అనడం లేదు. 313 00:28:22,035 --> 00:28:25,038 కామ్రేడ్ బెలికోవా, టూర్ లో ఇంతవరకు ఆమె ప్రవర్తన ఎలా ఉంది? 314 00:28:27,374 --> 00:28:28,792 చాలా బాగుంది. 315 00:28:28,876 --> 00:28:33,297 ఆమె చంద్రుడి మీద చూపించిన సమస్యాత్మక ప్రవర్తన ఇంత వరకు ఏం చూపలేదు. 316 00:28:35,215 --> 00:28:36,550 నీ కోట్ తెచ్చుకో. 317 00:28:38,218 --> 00:28:40,971 - ఎక్కడికి వెళ్తున్నాం? - అంటే, నువ్వు జర్మన్ మాట్లాడగలను అన్నావు కదా. 318 00:28:41,054 --> 00:28:43,724 మనం ఆఖరికి నీ చదువుని వాడబోతున్నాం. 319 00:28:43,807 --> 00:28:44,933 జెర్మనీ? 320 00:28:45,017 --> 00:28:49,021 ఆ కొరియర్ వాడు తనకు లూనార్ బేస్ ప్లానులు ఎవరిచ్చారో ఇంకా చెప్పలేదు. 321 00:28:49,104 --> 00:28:53,567 అలాగే స్టాసి వారి చేతగానితనాన్ని నేను ఇక భరించలేను. 322 00:28:53,650 --> 00:28:55,110 కామ్రేడ్ బెలికోవా సంగతి ఏమిటి? 323 00:28:55,194 --> 00:28:58,113 నీ డ్యూటీలను నువ్వు లేనప్పుడు గలిట్జిన్ హ్యాండిల్ చేస్తాడులే. 324 00:28:58,197 --> 00:28:59,948 త్వరగా కదులు, మనం విమానం వద్దకు వెళ్ళాలి. 325 00:29:03,827 --> 00:29:05,120 నా ప్రియమైన స్నేహితుల్లారా… 326 00:29:06,205 --> 00:29:07,206 నా ప్రియమైన స్నేహితుల్లారా… 327 00:29:08,790 --> 00:29:10,000 లేడీస్ అండ్ జెంటిల్మెన్ 328 00:29:10,959 --> 00:29:12,544 దయచేసి ఈ గొప్ప విజయాన్ని 329 00:29:13,045 --> 00:29:14,880 పురస్కరించుకోవడానికి 330 00:29:16,507 --> 00:29:20,093 నాతో కలిసి అనస్టాసియా బెలికోవాకి థాంక్స్ చెప్పండి. 331 00:29:20,177 --> 00:29:21,595 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రెస్ వారు 332 00:29:22,221 --> 00:29:24,598 ఇవాళ రాత్రి ఫ్రాన్స్ ప్రజలతో కలిసి నిలబడుతున్నారు 333 00:29:25,390 --> 00:29:26,808 చంద్రుడి పైన 334 00:29:27,351 --> 00:29:30,687 అడుగు పెట్టిన మొట్టమొదటి మహిళను గౌరవించడానికి. 335 00:29:49,706 --> 00:29:51,083 భలే సర్కస్. 336 00:29:52,251 --> 00:29:53,836 యాన అయితే ఇదంతా ఎలా హ్యాండిల్ చేసేదో ఏమో. 337 00:29:54,795 --> 00:29:56,922 ఆమె ఫ్రాన్స్ ని ఒక్క రోజులో పడేసి ఉండేది. 338 00:29:58,841 --> 00:30:00,008 హలో, డార్లింగ్. 339 00:30:03,929 --> 00:30:06,181 మరి మీ నిశ్చితార్థం ఎలా సాగుతోంది? ప్రేమలో పడ్డారా? 340 00:30:07,349 --> 00:30:08,350 గాడిదగుడ్డు. 341 00:30:08,433 --> 00:30:10,102 - ఆమె పక్కన నిలబడటమే… - ఇలా చూడండి! 342 00:30:10,185 --> 00:30:11,186 …టార్చర్ లాగ ఉంది. 343 00:30:12,271 --> 00:30:13,564 పెళ్లి అంటేనే అంత. 344 00:30:23,115 --> 00:30:24,283 అనస్టాసియా! 345 00:30:55,230 --> 00:30:56,481 క్షమించండి. నేను వెళ్ళాలి. 346 00:30:57,399 --> 00:30:58,400 ఏమండీ. 347 00:31:24,009 --> 00:31:26,929 - చీఫ్ డిజైనర్. - గుడ్ ఈవ్నింగ్, కామ్రేడ్ నికొలోవ్. 348 00:31:31,725 --> 00:31:33,393 క్షమించండి, చీఫ్. 349 00:31:35,562 --> 00:31:36,647 నేను లోనికి రావొచ్చా? 350 00:31:37,481 --> 00:31:38,732 రండి! రండి. 351 00:31:43,153 --> 00:31:46,240 అయ్యో, క్షమించు. ఎవరైనా వస్తున్నారా? 352 00:31:47,908 --> 00:31:48,909 లేదు. 353 00:32:14,726 --> 00:32:18,021 నాకు… నాకు ఫియోదొరోవ్ గురించి తెలుసు… 354 00:32:19,606 --> 00:32:20,607 అతని రచనలు… 355 00:32:22,234 --> 00:32:23,277 బహిష్కరించబడ్డాయి. 356 00:32:26,029 --> 00:32:27,614 నేను మీకు ఎలా సాయపడగలను, చీఫ్? 357 00:32:27,698 --> 00:32:29,449 లూనా 16 సమయంలో, 358 00:32:30,117 --> 00:32:34,663 అనస్టాసియా ఎస్-బ్యాండ్ ఆంటెన్నాని అందుకోగల దూరంలో ఉంటుందని నీకెలా తెలుసు? 359 00:32:34,746 --> 00:32:37,291 అంటే, నేను ప్లానులు గుర్తుపెట్టుకున్నాను. 360 00:32:37,374 --> 00:32:41,920 కానీ మనం ఆఖరి అసెంబ్లీ సమయంలో ఆంటెన్నా ఉండే చోటును మార్చాం కదా. 361 00:32:42,004 --> 00:32:43,172 అవును, 362 00:32:43,255 --> 00:32:46,049 కాకపోతే నేను బైకోనుర్ నుండి వచ్చే ఇంజనీరింగ్ రిపోర్టులను చదివాను. 363 00:32:46,133 --> 00:32:50,596 అవి అనేక వేల పేజీల డాక్యుమెంటేషన్. అది… 364 00:32:50,679 --> 00:32:52,890 నాకు ఖాళీ టైమ్ చాలా ఉంది. 365 00:32:52,973 --> 00:32:53,974 అవును. 366 00:32:58,187 --> 00:32:59,521 అవును. 367 00:33:00,355 --> 00:33:02,357 ఇది చాలా చక్కని సాయంత్రం, సెర్గీ. 368 00:33:04,776 --> 00:33:05,986 కొంచెం అలా బయటకు వెళ్లి నడుద్దామా? 369 00:33:58,664 --> 00:34:00,958 కొన్నిసార్లు నేను అసలు పైకి వెళ్లి ఉండకపోతే బాగుండు అనిపిస్తోంది. 370 00:34:03,752 --> 00:34:04,753 నీ ఉద్దేశం ఏంటి? 371 00:34:06,630 --> 00:34:07,923 మనం ఉపరితలం మీద ఉన్నప్పుడు… 372 00:34:11,051 --> 00:34:12,344 శబ్దం ఏం లేదు. 373 00:34:13,178 --> 00:34:14,596 నిశ్శబ్దం మాత్రమే. 374 00:34:17,516 --> 00:34:20,476 నేను ఆఖరికి శ్వాస తీసుకోగలను అనిపించింది. 375 00:34:27,067 --> 00:34:28,610 మా తాతయ్య ఒక మాట అనేవారు… 376 00:34:30,654 --> 00:34:33,824 దేవుడు నిన్ను శపించాలి అనుకున్నపుడు, నిన్ను సంతోషపడనిస్తాడు అంట. 377 00:34:53,260 --> 00:34:54,803 నీకు ఇక్కడి నుండి బయటకు వెళ్లాలని ఉందా? 378 00:35:02,477 --> 00:35:04,021 ఆమెకు బాగా ఎక్కేసింది. 379 00:35:21,830 --> 00:35:24,041 ఈమె తన రూమ్ కి వెళ్ళేలా చూసుకునే బాధ్యత నాది, సరేనా? 380 00:36:22,266 --> 00:36:23,392 మనం ఎక్కడికి వెళ్తున్నాం? 381 00:36:24,601 --> 00:36:25,602 ఇలా పదా! 382 00:37:15,485 --> 00:37:16,486 వీడికి తను వెళ్లొచ్చు అని చెప్పు. 383 00:37:18,572 --> 00:37:20,616 థాంక్స్. నువ్వు ఇక వెళ్లొచ్చు. 384 00:37:22,659 --> 00:37:24,912 నేను నీకు చెప్పేది, అలాగే వాడు తిరిగి చెప్పేది నువ్వు 385 00:37:24,995 --> 00:37:26,121 ఉన్నది ఉన్నట్టు అనువదించాలి. 386 00:37:26,205 --> 00:37:29,124 ఏమాత్రం సందిగ్ధత ఉండకూడదు. అర్థమైందా? 387 00:37:29,208 --> 00:37:30,250 అలాగే. 388 00:37:44,765 --> 00:37:47,017 వీడిని మహా దేశభక్తి యుద్ధంలో పోరాడాడో లేదో అడుగు. 389 00:37:49,686 --> 00:37:52,773 నువ్వు మహా దేశభక్తి యుద్ధంలో పోరాడావా? 390 00:37:56,944 --> 00:37:59,112 నేను కుర్స్క్ లో ముందుండి పోరాడాను. 391 00:38:03,200 --> 00:38:05,077 ఇతను కుర్స్క్ లో ముందుండి పోరాడాడు. 392 00:38:07,120 --> 00:38:09,540 అయితే మేము కలవడం ఇదే మొదటిసారి కాకపోవచ్చు అని చెప్పు. 393 00:38:10,791 --> 00:38:15,420 అయితే మీరు కలవడం ఇదే మొదటిసారి కాకపోవచ్చు అని ఈమె అంటోంది. 394 00:38:19,258 --> 00:38:21,343 ఈసారి నీకు కాస్త కలిసి రావాలని కోరుకుందాం. 395 00:38:49,288 --> 00:38:50,289 చీఫ్. 396 00:38:56,044 --> 00:38:57,045 పదా. 397 00:39:10,976 --> 00:39:11,977 ఇదేంటి? 398 00:39:14,104 --> 00:39:15,355 భూతాలు… 399 00:39:17,566 --> 00:39:18,817 ఒకప్పటి మిషన్స్ కి సంబంధించినవి. 400 00:39:20,360 --> 00:39:21,778 వోస్క్హోద్. 401 00:39:24,823 --> 00:39:25,824 వొస్టక్. 402 00:39:28,660 --> 00:39:29,661 సోయూజ్. 403 00:39:39,338 --> 00:39:40,923 కానీ మనం వీటికి తిరిగి ప్రాణం పోయొచ్చు. 404 00:39:43,050 --> 00:39:44,551 ఫియోదొరోవ్ చెప్పినట్టు. 405 00:39:46,803 --> 00:39:49,806 అమరత్వం, సెర్గీ. 406 00:39:52,017 --> 00:39:54,019 ఆఖరి శత్రువు పైన విజయం. 407 00:39:58,815 --> 00:40:00,108 బ్రెజ్నవ్ అలాగే కమిటీ వారు ఉన్నారు చూడు, 408 00:40:00,192 --> 00:40:02,903 వాళ్ళ దృష్టి చంద్రుడి మీద జెండాలు పాతడం మీదే ఉంది, 409 00:40:02,986 --> 00:40:05,364 పిడికెడు మట్టి కోసం తపిస్తున్నారు. 410 00:40:06,698 --> 00:40:08,116 మనం గనుక నిజంగా… 411 00:40:09,284 --> 00:40:12,120 విశ్వం గురించి మరింత తెలుసుకోవాలి అనుకుంటే, అంటే… 412 00:40:12,829 --> 00:40:14,665 అనంతం గురించి, అమరత్వం గురించి… 413 00:40:17,876 --> 00:40:19,378 మనం ఇక్కడే ఆగిపోకూడదు. 414 00:40:25,509 --> 00:40:26,552 వీనస్. 415 00:40:26,635 --> 00:40:27,636 అవును. 416 00:40:30,848 --> 00:40:32,224 మరి బ్రెజ్నవ్? 417 00:40:32,307 --> 00:40:35,978 సరైన సమయం వచ్చినప్పుడు అతను వాస్తవాన్ని చూసేలా మనం ఒప్పించవచ్చు. 418 00:40:37,980 --> 00:40:40,566 అదలా ఉండగా మనం రహస్యంగా ఈ పని కొనసాగించాలి. 419 00:40:42,526 --> 00:40:45,237 మనం ఇక్కడ చేస్తున్నది మనం ఎన్నుకునే కొంతమందికి మాత్రమే తెలియాలి. 420 00:40:45,320 --> 00:40:46,822 అసలు మనం ఇలాంటి పని… 421 00:40:47,823 --> 00:40:51,243 ఇలాంటి పనికి చాలా భారీ వనరులు కావాలి. 422 00:40:51,326 --> 00:40:53,120 అవును, వాళ్ళు నేను ఏదైనా లూనార్ బేస్ కోసం అడుగుతున్నా 423 00:40:53,203 --> 00:40:55,455 అనుకున్నంత కాలం నేను ఏది అడిగితే అది ఇస్తారు. 424 00:40:58,375 --> 00:41:01,879 ఈ విషయంలో నాకంటే ఎక్కువ అర్హత ఉన్న సీనియర్ ఇంజనీర్లు… 425 00:41:02,713 --> 00:41:03,714 కూడా మీకు ఉండి ఉంటారు కదా. 426 00:41:03,797 --> 00:41:06,550 - మీరు నా దగ్గరకే రావాల్సిన పనిలేదు. - నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోకు, సెర్గీ. 427 00:41:06,633 --> 00:41:07,676 నీకు పట్టుదల ఉంది. 428 00:41:09,720 --> 00:41:11,638 అలాగే నీ మనసును నువ్వు మలచుకోగలవు. 429 00:41:12,472 --> 00:41:13,640 కానీ నువ్వు దీనికి ఒప్పుకోవడానికి ముందు, 430 00:41:13,724 --> 00:41:19,354 ఈ పని చేయడం ద్వారా నువ్వు సెంట్రల్ కమిటీ వారి డైరెక్ట్ ఆర్డర్లను మీరి, ప్రభుత్వ ఆస్తులను 431 00:41:19,438 --> 00:41:22,191 ఇతర కార్యకలాపాలకు వాడబోతున్నావు అని తెలుసుకోవాలి. 432 00:41:25,652 --> 00:41:27,112 ఈ విషయం బయటపడింది అంటే… 433 00:41:29,406 --> 00:41:31,825 ఎదురయ్యే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. 434 00:41:37,539 --> 00:41:38,665 మన పని ఎప్పుడు మొదలెడుతున్నాం? 435 00:41:40,834 --> 00:41:42,044 ఇప్పుడే. 436 00:41:50,219 --> 00:41:51,345 అది ఇదే అనుకుంట. 437 00:41:59,728 --> 00:42:00,771 నేను ఏమన్నాను? 438 00:42:01,730 --> 00:42:03,065 బూ రేవ్ 439 00:42:05,651 --> 00:42:06,777 పదా. 440 00:42:08,987 --> 00:42:11,490 - సాష! సాష! - నాకు నీ మాట వినిపించడం లేదు. 441 00:42:11,573 --> 00:42:12,741 నీ మాట వినిపించడం లేదు, సారీ. 442 00:42:29,925 --> 00:42:30,926 స్టాసియా. 443 00:42:45,983 --> 00:42:46,984 ఇక్కడ. 444 00:42:47,734 --> 00:42:50,445 - సాష, ఇది మంచి ఐడియా అనిపించడం లేదు. - ఒక్క డ్రింక్. 445 00:42:50,529 --> 00:42:52,239 అలాగే నీకు వెళ్ళిపోవాలి అని ఉంటే, నిన్ను ఆర్కడి 446 00:42:52,322 --> 00:42:54,700 రాత్రికి పక్క మీద పడుకోబెట్టడం కోసం వెనక్కి తీసుకెళ్తాను. 447 00:43:03,083 --> 00:43:04,960 వాల్య, నా పెర్ఫ్యూమ్ చూశావా? 448 00:43:09,131 --> 00:43:10,382 వాల్య? 449 00:43:21,268 --> 00:43:23,437 - వాల్య? - నేను ఆలోచించలేకుండా ఉండలేకపోతున్నా… 450 00:43:24,521 --> 00:43:27,274 ఇవాళ రాత్రి ఇక్కడ వీళ్ళందరూ యానని కీర్తించాల్సింది. 451 00:43:27,357 --> 00:43:28,650 అందుకు తనే సరైన మనిషి. 452 00:43:28,734 --> 00:43:30,194 ఆమె స్పెషల్. 453 00:43:33,530 --> 00:43:36,200 మేము ట్రైనింగ్ మొదలెట్టినప్పటి నుండి మాకు ఆ విషయం తెలుసు. 454 00:43:37,075 --> 00:43:38,327 ఇది ఎలా ఉందంటే… 455 00:43:38,410 --> 00:43:40,746 నా మాట విను, నువ్వు మంచి వాడివి. 456 00:43:41,830 --> 00:43:43,332 అందుకే నేను నీతో ప్రేమలో పడ్డాను. 457 00:43:44,583 --> 00:43:46,084 కానీ ఈ విషయంలో నువ్వు చేయగలది ఏదీ లేదు. 458 00:44:50,816 --> 00:44:52,734 వెనక్కి వెళ్ళు. కొంచెం చోటు ఇవ్వు. 459 00:44:53,527 --> 00:44:55,153 అనస్టాసియా, ఇది నీకోసమే. 460 00:45:05,831 --> 00:45:07,791 హేయ్! హేయ్! 461 00:45:40,490 --> 00:45:43,118 నేను నీతో మాట్లాడే అవకాశం ఉంటుందేమో అని రాత్రంతా ఎదురుచూసా. 462 00:45:45,162 --> 00:45:47,456 సాధారణంగా నేను పబ్లిక్ లో ఇంకొకరి దగ్గరకు వెళ్ళను, 463 00:45:47,539 --> 00:45:50,709 కానీ ఇతరుల కళ్ళలో పడకుండా నీ దగ్గరకు రావడం కష్టం. 464 00:45:55,923 --> 00:45:57,424 నీకు మీ దేశంలో సంతోషంగా లేకపోతే… 465 00:45:59,343 --> 00:46:00,802 మేము నిన్ను తప్పించగలం. 466 00:46:04,097 --> 00:46:05,349 నీ ఉద్దేశం ఏంటి? 467 00:46:07,809 --> 00:46:10,812 అమెరికన్ల దగ్గర నీకోసం ఒక చోటు ఉంది. 468 00:46:17,402 --> 00:46:19,112 లేదు. 469 00:46:19,821 --> 00:46:21,990 నేను నా దేశానికి ఎప్పటికీ ద్రోహం చేయను. 470 00:46:32,501 --> 00:46:33,836 నువ్వు నీ మనసు మార్చుకుంటే సంప్రదించడానికి. 471 00:46:52,479 --> 00:46:56,191 - బానే ఉన్నావా? - అవును. ఉన్నట్టుండి నీరసంగా ఉంది. 472 00:47:10,789 --> 00:47:12,207 ఇక మనం వెళ్లే టైమ్ అయినట్టు ఉంది. 473 00:47:13,166 --> 00:47:14,501 సరే. 474 00:47:25,304 --> 00:47:28,891 అమెరికన్లకు ఇవ్వమని నీకు డాక్యుమెంట్స్ 475 00:47:28,974 --> 00:47:30,767 ఇచ్చిన మనిషి పేరు ఏంటి? 476 00:47:30,851 --> 00:47:32,895 నేను ఎన్నిసార్లు చెప్పాలి? 477 00:47:33,687 --> 00:47:35,480 నాకు వోల్క్స్ పార్క్ ఫ్రెడ్రిక్ షైన్ లోని 478 00:47:35,564 --> 00:47:40,068 ఒక గుర్తుతెలియని ప్రదేశంలో డాక్యుమెంట్స్ అందాయి అని ఒప్పుకుంటా. 479 00:47:40,152 --> 00:47:42,946 నేను పశ్చిమ బెర్లిన్ కి వెళ్ళినప్పుడు 480 00:47:43,030 --> 00:47:48,827 బోర్న్ హామెర్ స్ట్రాసేలో ఉన్న చెత్తబుట్టలోకి ఆ కవర్ ని విసిరేసాను. 481 00:47:50,037 --> 00:47:52,873 ఇతను ముందు చెప్పిందే అక్షరం తేడా లేకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. 482 00:47:53,498 --> 00:47:54,666 ఏమాత్రం మార్పు లేదు. 483 00:47:59,713 --> 00:48:00,714 కాఫీ? 484 00:48:05,260 --> 00:48:06,762 వద్దా? అయ్యో. 485 00:48:09,264 --> 00:48:10,849 బెర్లిన్ చాలా అందమైన సిటీ. 486 00:48:12,643 --> 00:48:14,686 నేను మొదటిసారి ఒక 487 00:48:15,270 --> 00:48:18,106 టి-34లో ఫ్రెడ్రిచ్ స్ట్రాసే రావడం నాకు ఇంకా గుర్తుంది. 488 00:48:18,190 --> 00:48:20,234 నేను మొదటిసారి ఇక్కడికి రావడం నాకు గుర్తుంది. 489 00:48:20,317 --> 00:48:21,610 మొదట్లో నాజీల 490 00:48:21,693 --> 00:48:23,987 శరీరాలు ఎక్కడపడితే అక్కడ ఉండటంతో నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చింది. 491 00:48:24,071 --> 00:48:27,908 నేను ఫ్రెడ్రిచ్ స్ట్రాసేలో టి-34 నడుపుతూ వచ్చా. 492 00:48:28,700 --> 00:48:30,702 - మొదట్లో నాజీల శరీరాలు ఎక్కడపడితే… - ఏంటి? 493 00:48:32,996 --> 00:48:34,998 …అక్కడ ఉండటంతో నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చింది. 494 00:48:35,082 --> 00:48:36,625 పది నిమిషాలలో వస్తాను. 495 00:48:36,708 --> 00:48:40,546 ఈలోగా వీడు మనకు ఒక పేరు చెప్పకపోతే, వీడి తల పేల్చేస్తాను. 496 00:49:04,319 --> 00:49:09,283 నీకు డాక్యుమెంట్స్ ఇచ్చిన మనిషి పేరు ఏంటి? 497 00:49:12,494 --> 00:49:14,538 నాకు ఏమీ తెలీదు. 498 00:49:40,564 --> 00:49:43,108 నేను… ఇవాళ రాత్రి నేను నీ గురించి ఒక విషయం తెలుసుకున్నాను. 499 00:49:44,776 --> 00:49:47,154 నీకు డాన్స్ వేయడం అస్సలు రాదు. 500 00:49:57,122 --> 00:49:59,875 వాళ్లు తిరిగి వచ్చారు. వాళ్ళని అరెస్ట్ చేయమంటారా? 501 00:49:59,958 --> 00:50:01,126 వద్దు. 502 00:50:02,294 --> 00:50:03,921 నేను కామ్రేడ్ డకొర్నోతో మాట్లాడాలి. 503 00:50:16,433 --> 00:50:17,601 ఏంటి? 504 00:50:17,684 --> 00:50:20,771 నేను దగ్గరకు వెళ్లాను. మీరు బెలికోవా గురించి భయపడాల్సింది ఏం లేదు. 505 00:50:20,854 --> 00:50:22,648 - ఆమె నమ్మకమైన మనిషే. - మంచిది. 506 00:50:42,626 --> 00:50:43,710 నా మాట విను. 507 00:50:43,794 --> 00:50:46,547 ఆమె తిరిగి వచ్చేలోగా నీకు తెలిసిన విషయం నాకు చెప్పాలి. 508 00:50:46,630 --> 00:50:48,757 ఆమె ఏం చేయగలదో నాకు తెలుసు. 509 00:50:48,841 --> 00:50:50,634 నాకు తెలీని విషయం నేను నీకు చెప్పలేను. 510 00:50:50,717 --> 00:50:55,222 ఆమె తిరిగి వచ్చేలోగా నీకు ప్లాన్స్ ఎవరు ఇచ్చారో నువ్వు నాకు చెప్పాలి. 511 00:50:55,889 --> 00:50:57,391 అది నీ మంచికే. 512 00:51:06,483 --> 00:51:08,151 నువ్వు మంచి మనిషివి. 513 00:51:08,235 --> 00:51:09,528 నువ్వు మంచి మనిషివి. 514 00:51:09,611 --> 00:51:11,822 నువ్వు ఈ స్టాసి పందులంత నీచమైనదానివి కాదు. 515 00:51:12,531 --> 00:51:15,325 - నాకు సాయం చెయ్. - నేను ఏం చేయడానికి ట్రై చేస్తున్నా అనుకుంటున్నావు? 516 00:51:15,951 --> 00:51:17,953 నాకు పేరు చెప్పు, నేను సాయం చేస్తా! 517 00:51:18,036 --> 00:51:19,329 నాకు తెలీదు. 518 00:51:32,759 --> 00:51:34,511 నాకు పేరు చెప్పు. 519 00:51:35,137 --> 00:51:36,930 నాకు తెలీదు. 520 00:51:41,310 --> 00:51:42,644 లేదు. లేదు. 521 00:51:58,076 --> 00:52:00,037 నాకు పేరు చెప్పు! 522 00:52:00,579 --> 00:52:02,706 నాకు పేరు చెప్పు! 523 00:52:03,207 --> 00:52:05,042 నాకు పేరు చెప్పు! 524 00:52:05,125 --> 00:52:08,045 అతను రైకేస్ట్రాసేలో ఉంటాడు! 525 00:52:08,795 --> 00:52:11,673 నాకు వేరే ఏమీ తెలీదు! 526 00:52:11,757 --> 00:52:14,635 నేను వస్తువులను బోర్డర్ దాటించగలను అంతే. 527 00:52:14,718 --> 00:52:18,680 నేను అతనికి స్టార్ సిటీలోకి ఏదీ తీసుకురాలేను అని చెప్పాను. 528 00:52:20,390 --> 00:52:24,978 స్టార్ సిటీలోకి ఏదీ తీసుకెళ్ళలేవు అంటే ఏంటి నీ ఉద్దేశం? 529 00:52:27,022 --> 00:52:28,857 …స్టార్ సిటీలోకా? 530 00:52:29,525 --> 00:52:31,276 నువ్వు అదే అన్నావు. 531 00:52:31,360 --> 00:52:34,279 లేదు. నేను అనలేదు. నేను అనలేదు. 532 00:52:34,363 --> 00:52:37,449 వాళ్ళు నిన్ను స్టార్ సిటీలోకి ఏం తీసుకెళ్లమన్నారు? 533 00:52:38,700 --> 00:52:40,994 చెప్తున్నాను కదా, అలా ఏం జరగలేదు! 534 00:52:41,078 --> 00:52:43,372 ఆ పని జరగలేదు! 535 00:52:43,455 --> 00:52:45,290 భలే చేసావు, కామ్రేడ్. 536 00:52:59,012 --> 00:53:02,850 వాళ్ళు ఏం తీసుకెళ్లాలో నాకు చెప్పనేలేదు. 537 00:53:02,933 --> 00:53:04,476 నిజంగా. 538 00:53:05,602 --> 00:53:09,356 ప్లీజ్, నా భార్య… 539 00:53:13,402 --> 00:53:18,115 ప్లీజ్, ఆమెకు ఈ విషయాలు ఏం తెలీదు… 540 00:53:21,952 --> 00:53:23,370 చింతించకు. 541 00:53:25,455 --> 00:53:28,917 నీ భార్య నిన్ను 542 00:53:30,002 --> 00:53:33,463 చాలా కాలం చూడబోదు. 543 00:54:04,369 --> 00:54:05,537 అలాగే ఇంకొకటి. 544 00:54:06,747 --> 00:54:07,748 అదేం పర్లేదు. 545 00:54:08,916 --> 00:54:09,917 మీ వాగ్దానాలు. 546 00:54:11,543 --> 00:54:13,253 నాకు వాళ్ళు ఇక్కడ రాసింది బాగా నచ్చింది. 547 00:54:13,337 --> 00:54:15,214 "ప్రేమ, అవగాహన ఇంకా గౌరవం మీద నిర్మించబడింది." 548 00:54:21,678 --> 00:54:23,013 హలో, నాన్నా. 549 00:54:25,182 --> 00:54:26,225 నాస్ట్య. 550 00:54:31,855 --> 00:54:34,566 రెడ్ స్క్వేర్ లో జరిగిన పరేడ్ లో మేము నిన్ను మిస్ అయ్యాము. 551 00:54:36,443 --> 00:54:38,779 నువ్వు మాట్లాడేటప్పుడు నిటారుగా నిలబడాలి. 552 00:54:41,323 --> 00:54:44,117 ఈయన అలెగ్జాండర్ డిమిత్రియవిచ్ పోలివనోవ్. 553 00:54:45,410 --> 00:54:47,412 కామ్రేడ్ బెలికోవ్, మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. 554 00:54:48,580 --> 00:54:50,666 అలాగే దయచేసి నన్ను సాష అని పిలవండి. 555 00:54:53,502 --> 00:54:55,212 అయితే నా నాస్ట్యని పెళ్లిచేసుకునేది నువ్వేనా? 556 00:54:57,923 --> 00:54:59,132 అవును. 557 00:55:12,604 --> 00:55:14,147 మనం హాల్ కి వెళితే మంచిది. 558 00:55:14,648 --> 00:55:17,150 పద, కామ్రేడ్ పోలివనోవ్. ఇక నువ్వు నిలబడాల్సిన చోటుకు వెళ్లే టైమ్ అయింది. 559 00:55:32,124 --> 00:55:34,042 మనం ఈ పని చేయాల్సిన అవసరం లేదు. 560 00:55:35,961 --> 00:55:36,962 నీ ఉద్దేశం ఏమిటి? 561 00:55:39,214 --> 00:55:40,215 ఈ పెళ్లి. 562 00:55:43,302 --> 00:55:45,012 అవును, కానీ మనం పెళ్లి చేసుకోకపోతే, మనం… 563 00:55:45,095 --> 00:55:46,096 పెళ్లి చేసుకోము అంతే. 564 00:55:48,515 --> 00:55:49,725 సాష, పదా. 565 00:56:22,508 --> 00:56:24,134 గూడులో ఉన్న నా డేగ ఇక్కడ ఉందా. 566 00:56:25,135 --> 00:56:26,136 చీఫ్. 567 00:56:26,678 --> 00:56:27,679 హాయ్. 568 00:56:29,765 --> 00:56:31,808 - బానే ఉన్నావా? - అవును. అంటే… 569 00:56:31,892 --> 00:56:32,893 భయంగా ఉంది. 570 00:56:33,894 --> 00:56:35,229 మా పెళ్లి రోజు కూడా ఈయన ఇలాగే ఉన్నాడు. 571 00:56:35,312 --> 00:56:38,148 బెలోయే సరస్సు దగ్గర ఉన్న నా దాచాని 572 00:56:38,232 --> 00:56:40,025 మీ హనీమూన్ కోసం ఇవ్వాలి అనుకుంటున్నా. 573 00:56:40,567 --> 00:56:41,568 థాంక్స్, చీఫ్. 574 00:56:41,652 --> 00:56:43,612 కాకపోతే కొంచెం కాలమే, సాష. 575 00:56:43,695 --> 00:56:47,574 నీ ట్రైనింగ్ మొదలెట్టడానికి నువ్వు స్టార్ సిటీకి తిరిగి రావాల్సి ఉంటుంది. 576 00:56:48,575 --> 00:56:49,701 వ్లాదిమిర్. ఎలా ఉన్నావు? 577 00:56:49,785 --> 00:56:51,703 - ఎలా ఉన్నావు? - మీ భార్య ఎలా ఉన్నారు? 578 00:57:54,099 --> 00:57:57,311 మనం ఇవాళ ఇక్కడికి అనస్టాసియా వ్లాదిమీరొవ్నా బెలికోవా 579 00:57:57,394 --> 00:58:01,064 మరియు అలెగ్జాండర్ డిమిత్రియవిచ్ పోలివనోవ్ యొక్క వివాహాన్ని అధికారికంగా 580 00:58:01,148 --> 00:58:04,860 - రిజిస్టర్ చేయడానికి కూడుకున్నాం. - ఆమె మళ్ళీ పైకి ఎప్పుడు వెళ్తుంది? 581 00:58:06,236 --> 00:58:07,321 ఆమె వెళ్ళదు. 582 00:58:07,404 --> 00:58:08,405 ఆమె… 583 00:58:09,907 --> 00:58:11,783 దేశానికి చాలా విలువైన మనిషి. 584 00:58:11,867 --> 00:58:14,453 కామ్రేడ్ పోలివనోవ్, మీరు మీ వాగ్దానాలను చెబుతారా? 585 00:58:14,536 --> 00:58:16,496 కానీ ఆమెకు ఆ విషయం చెప్పే ధైర్యం నాకు లేదు. 586 00:58:18,290 --> 00:58:21,418 అలెగ్జాండర్ డిమిత్రియవిచ్ పోలివనోవ్ అనబడే నేను… 587 00:58:23,962 --> 00:58:25,756 నా కుటుంబం, స్నేహితులు అలాగే 588 00:58:25,839 --> 00:58:29,426 సోవియెట్ ప్రభుత్వం ముందు, 589 00:58:29,510 --> 00:58:33,388 అనస్టాసియా వ్లాదిమీరొవ్నా బెలికోవా అనబడే నిన్ను 590 00:58:33,472 --> 00:58:35,224 ప్రేమ, అవగాహనా మరియు 591 00:58:35,307 --> 00:58:37,684 గౌరవాలతో నిర్మించబడిన నిష్పక్షపాతమైన బంధంతో… 592 00:58:39,895 --> 00:58:42,064 నా చట్టపరమైన భార్యగా స్వీకరిస్తున్నాను. 593 00:58:44,441 --> 00:58:48,362 కామ్రేడ్ బెలికోవా, నువ్వు నీ వాగ్దానాలను చెబుతావా? 594 00:59:07,339 --> 00:59:11,510 అనస్టాసియా వ్లాదిమీరొవ్నా బెలికోవా అనబడే నేను, 595 00:59:13,095 --> 00:59:15,597 నా కుటుంబం, స్నేహితులు అలాగే 596 00:59:15,681 --> 00:59:19,268 సోవియెట్ ప్రభుత్వం ముందు, 597 00:59:19,351 --> 00:59:22,312 అలెగ్జాండర్ డిమిత్రియవిచ్ పోలివనోవ్ అనబడే నిన్ను 598 00:59:23,105 --> 00:59:24,773 ప్రేమ, అవగాహనా మరియు 599 00:59:26,358 --> 00:59:33,323 గౌరవాలతో నిర్మించబడిన నిష్పక్షపాతమైన బంధంతో నా చట్టపరమైన భర్తగా స్వీకరిస్తున్నాను. 600 00:59:42,833 --> 00:59:44,251 మనం ప్రమాదంలో ఉన్నాం. 601 00:59:45,377 --> 00:59:48,172 సెక్యూరిటీ స్టేటస్ ని లెవల్ వన్ కి పెంచాం. 602 00:59:49,173 --> 00:59:52,926 ఇక నుండి ఎవరు ఏది చేయబోతున్నా అది వాళ్ళు చేయకముందే నాకు తెలియాలి. 603 00:59:54,469 --> 00:59:58,473 ఎవరు ఏది చెప్పబోతున్నా వాళ్ళు చెప్పడానికి ముందే నాకు తెలియాలి. 604 01:00:00,434 --> 01:00:05,814 ఎవరు ఏది ఆలోచిస్తున్నా వాళ్ళు అది ఆలోచించడానికి ముందే నాకు తెలియాలి. 605 01:00:07,566 --> 01:00:09,735 స్టార్ సిటీ ఇప్పుడు యుద్ధంలో ముందు వరసలో ఉంది. 606 01:00:11,195 --> 01:00:12,196 కాబట్టి… 607 01:00:13,780 --> 01:00:14,781 ఇక పని మొదలెట్టండి. 608 01:01:43,787 --> 01:01:45,789 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్