1 00:00:45,254 --> 00:00:49,007 ఫీల్డ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రిఫరెన్స్ నంబర్ ఎస్/బీఎఫ్-22 2 00:00:49,550 --> 00:00:51,510 జేట అనబడే కొత్త అసమ్మతివాద గ్రూప్ మీద. 3 00:00:51,593 --> 00:00:54,179 నవంబర్ ఎనిమిది 1963న ఇష్యు చేయబడింది. 4 00:00:55,806 --> 00:00:59,685 లేసి-జరూబిన్ కల్చరల్ ఎక్స్చేంజ్ సమయంలో మొట్టమొదటిసారిగా గుర్తించాం, 5 00:00:59,768 --> 00:01:03,856 జేట సభ్యులు సోవియెట్ ప్రభుత్వ వ్యతిరేక పనిపై ఆసక్తి చూపిస్తారు. 6 00:01:04,690 --> 00:01:08,277 మన మనిషి ఆండ్రెయి జైట్సెవ్ అసంతృప్తి చెందిన ఇతర మ్యూజిషియన్లను చేర్చుకున్న 7 00:01:08,360 --> 00:01:10,696 తర్వాత మొదటి ఫండింగ్ రిక్వెస్ట్ ని ఆమోదించారు. 8 00:01:11,655 --> 00:01:15,617 డెనిసోవ్, ష్నీట్క, గుబైడూలిన లాంటి కంపోజర్ల మ్యూజిక్ ని 9 00:01:15,701 --> 00:01:18,662 యుఎస్ఎస్ఆర్ నుండి బయటకు స్మగుల్ చేయడానికి 10 00:01:18,745 --> 00:01:23,250 వాటిని పరికరాల కేస్ల లైనింగ్ లో దాచే ఒక విధానాన్ని 11 00:01:23,834 --> 00:01:27,004 జైట్సెవ్ కనిపెట్టాడు కాబట్టి గ్రూప్ కి ఫండింగ్ కొనసాగించాలని మనవి. 12 00:01:27,796 --> 00:01:29,464 నిఘా పెట్టడం కొనసాగించమని నా సలహా. 13 00:01:35,846 --> 00:01:40,142 ఫీల్డ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రిఫరెన్స్ నంబర్ ఎస్/బీఎఫ్-26. 14 00:01:40,851 --> 00:01:43,270 మే 15, 1964న ఇష్యు చేయబడింది. 15 00:01:44,354 --> 00:01:47,274 అసమ్మతి కార్యకలాపాల వల్ల ఒత్తిడి ప్రభావం పడుతున్నట్టు ఉంది. 16 00:01:48,317 --> 00:01:50,777 గ్రూప్ లో పెద్ద సంఘర్షణ మొదలైంది. 17 00:01:51,820 --> 00:01:55,908 జైట్సెవ్ ఇంకా అతని రొమాంటిక్ భాగస్వామి టాన్యా డనీలోవ తరచుగా వాదించుకుంటున్నారు. 18 00:01:56,825 --> 00:01:59,870 బృందంలో ఉన్న ఈ అసమ్మతి కారణంగా వారి మిషన్ కి భంగం కలగొచ్చని భయపడుతున్నారు, 19 00:01:59,953 --> 00:02:02,414 కానీ ప్రస్తుతానికి ఫండింగ్ కొనసాగించమని సలహా. 20 00:02:31,652 --> 00:02:35,489 ఫీల్డ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రిఫరెన్స్ నంబర్ ఎస్/బీఎఫ్-32. 21 00:02:36,156 --> 00:02:38,408 సెప్టెంబర్ 10, 1964న ఇష్యు చేయబడింది. 22 00:02:38,951 --> 00:02:41,245 సబ్జెక్టు డనీలోవ కొత్త ప్రియుడు. 23 00:02:42,037 --> 00:02:46,708 ల్యూటెనెంట్ వాలంటీన్ మీరోనవ్, సోవియెట్ ఎయిర్ ఫోర్స్ లో పైలెట్. 24 00:02:47,292 --> 00:02:51,505 సోవియెట్ మిలటరీలో మనకు పని చేసేవారిని కనిపెట్టమని వాషింగ్టన్ ఇచ్చిన ఆదేశాల మేరకు 25 00:02:51,588 --> 00:02:53,423 ఇక్కడ మనకు ఒక అవకాశం ఉంది. 26 00:02:56,844 --> 00:03:00,764 డనీలోవకు సంబంధించిన ఇల్లీగల్ అసమ్మతి కార్యకలాపాల గురించి మీరోనవ్ కి తెలియదు. 27 00:03:01,348 --> 00:03:03,350 నిఘా కొనసాగించమని మనవి. 28 00:03:05,394 --> 00:03:09,147 ఫీల్డ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రిఫరెన్స్ నంబర్ ఎస్/బీఎఫ్-40 29 00:03:09,231 --> 00:03:11,984 డిసెంబర్ 24, 1964న ఇష్యు చేయబడింది. 30 00:03:12,776 --> 00:03:15,320 డనీలోవ మరియు మీరోనవ్ ల సంబంధం బలపడుతోంది. 31 00:03:16,321 --> 00:03:20,242 సమాచార వర్గాల మేరకు మీరోనవ్ ని సోవియెట్ స్పేస్ ప్రోగ్రామ్ లోకి తీసుకుంటున్నారట. 32 00:03:20,325 --> 00:03:22,160 నిఘా కొనసాగించడం చాలా ముఖ్యం. 33 00:03:27,374 --> 00:03:30,836 ఫీల్డ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రిఫరెన్స్ నంబర్ ఎస్/బీఎఫ్-45. 34 00:03:30,919 --> 00:03:33,547 జనవరి 15, 1965న ఇష్యు చేయబడింది. 35 00:03:34,214 --> 00:03:36,216 మీరోనవ్ కి డనీలోవకి నిశ్చితార్థం జరిగింది. 36 00:03:36,717 --> 00:03:40,012 ఫిబ్రవరిలో కాస్మోనాట్ ట్రైనింగ్ మొదలవ్వడానికి ముందు పెళ్లి చేసుకోబోతున్నారు. 37 00:03:40,554 --> 00:03:43,432 డనీలోవ ఇప్పుడు అసమ్మతి కార్యకలాపాలలో పాల్గొనడం మానేసినట్టు ఉంది. 38 00:03:54,318 --> 00:03:58,113 ఫీల్డ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రిఫరెన్స్ నంబర్ ఎస్/బీఎఫ్-51. 39 00:03:58,197 --> 00:04:01,158 ఫిబ్రవరి 28, 1965న ఇష్యు చేయబడింది. 40 00:04:01,241 --> 00:04:05,245 సమాచార వర్గాల ప్రకారం టాన్యా మరియు వాల్య మీరోనవ్ లను స్టార్ సిటీకి తరలించబోతున్నారు. 41 00:04:06,038 --> 00:04:08,624 నిఘా పెట్టడానికి అవకాశాలు చాలా తగ్గుతాయి. 42 00:04:09,124 --> 00:04:12,294 సబ్జెక్టు మీరోనవ్ ని నేరుగా సంప్రదించడానికి అర్జంటుగా అనుమతి కావాలి. 43 00:04:13,045 --> 00:04:16,005 గతంలో అతని భార్య పాల్గొన్న అసమ్మతి కార్యకలాపాలను అదునుగా వాడతాను. 44 00:04:34,024 --> 00:04:35,192 ఇవాళ భలే రోజు, కదా? 45 00:04:36,109 --> 00:04:37,110 అవును. 46 00:04:39,821 --> 00:04:41,657 అలాగే వివాహ అభినందనలు. 47 00:04:42,449 --> 00:04:43,700 నాకు పెళ్లి అయినట్టు నీకెలా తెలుసు? 48 00:05:00,217 --> 00:05:03,929 ఫీల్డ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రిఫరెన్స్ నంబర్ ఎస్/బీఎఫ్-53. 49 00:05:04,012 --> 00:05:06,348 మార్చ్ 1, 1965న ఇష్యు చేయబడింది. 50 00:05:07,015 --> 00:05:09,768 కొత్త మనిషి, కాస్మోనాట్ వాల్య మీరోనవ్. 51 00:05:10,435 --> 00:05:12,145 కోడ్ పేరు "నికొలయ్." 52 00:06:38,857 --> 00:06:40,025 చీఫ్ డిజైనర్. 53 00:06:51,995 --> 00:06:53,580 బయటకు వెళ్ళండి! అందరూ. 54 00:07:00,921 --> 00:07:01,964 ఇదుగోండి. 55 00:07:03,215 --> 00:07:04,424 ఇది ఏంటి? 56 00:07:05,050 --> 00:07:06,301 దీని వల్లే అంతా జరిగింది. 57 00:07:07,553 --> 00:07:08,804 నాకు ఒక… 58 00:07:29,366 --> 00:07:30,951 అద్భుతమైన పనితనం. 59 00:07:32,536 --> 00:07:35,247 ఈ సర్క్యుట్రీ, సిగ్నల్ యాంప్లిఫైర్ లో ఉన్నట్టే ఉంది. 60 00:07:35,330 --> 00:07:37,916 ఇలాంటిది పాత ఆర్గాన్ ప్రాసెసర్ లో కనిపిస్తుంది. 61 00:07:38,000 --> 00:07:39,793 ఇది… అవును, చూడండి. 62 00:07:39,877 --> 00:07:42,379 ఇది ఒక జీటీ-104 ట్రాన్సిస్టర్. 63 00:07:42,462 --> 00:07:44,882 సోవియెట్ ట్రాన్స్మిటర్లలో ఇది చాలా కామన్. 64 00:07:44,965 --> 00:07:46,049 ఇది సోవియెట్ పరికరమా? 65 00:07:47,301 --> 00:07:48,552 అవును. 66 00:07:49,928 --> 00:07:50,971 కానీ ఇది… 67 00:07:51,722 --> 00:07:54,474 ఇది ఒరిజినల్ టెక్నాలజీలో భాగం కాదు. 68 00:07:54,558 --> 00:07:55,559 ఇది… 69 00:07:56,518 --> 00:07:57,811 దీన్ని తర్వాత చేర్చారు. 70 00:07:59,271 --> 00:08:01,106 ఇది ఒక మైక్రో ట్రాన్స్మిటర్. 71 00:08:01,190 --> 00:08:05,027 అందుకే ఇది జోక్యం చేసుకుంటున్నట్టు కనిపించింది, కానీ నిజానికి ఇది శక్తిని లాగుకుంటోంది అంతే. 72 00:08:07,988 --> 00:08:09,489 అంటే వాళ్ళు నష్టం కలిగించడానికి దీన్ని పెట్టలేదు. 73 00:08:11,366 --> 00:08:12,826 గూఢచర్యం కోసం చేశారు. 74 00:08:17,206 --> 00:08:18,415 థాంక్స్, సెర్గీ. 75 00:08:19,666 --> 00:08:20,709 ఇక నువ్వు వెళ్లొచ్చు. 76 00:08:30,886 --> 00:08:33,179 నా ఈగల్స్ లో ఇంకొకరు చనిపోయారు. 77 00:08:33,263 --> 00:08:35,432 - అంటే ఏమని సూచిస్తున్నావు? - నేనేమి సూచించడం లేదు. 78 00:08:35,515 --> 00:08:36,725 నేను బాహాటంగా చెప్తున్నాను. 79 00:08:36,808 --> 00:08:40,854 నీ భయం కారణంగా నా పర్యవేక్షణలో ఇంకొకరు చావడానికి నేను ఇక ఒప్పుకోను. 80 00:08:41,897 --> 00:08:43,190 అది ఒక ట్రాన్స్మిటర్. 81 00:08:43,273 --> 00:08:45,984 సిస్టమ్ ని రీబూట్ చేయమని చెప్పి నువ్వు అతిగా స్పందించావు. 82 00:08:46,068 --> 00:08:49,696 అప్పుడు మనకు తెలిసిన విషయం ఆధారంగా నేను నిర్ణయం తీసుకున్నాను. 83 00:08:49,780 --> 00:08:52,282 మన ఆపరేషన్స్ భద్రంగా జరగాలి. 84 00:08:52,366 --> 00:08:53,784 "మన" కాదు. "మనవి" కాదు. 85 00:08:53,867 --> 00:08:55,827 నా కాస్మోనాట్స్ వాళ్లకి చేతనైనంత కష్టపడ్డారు. 86 00:08:55,911 --> 00:08:58,872 నువ్వు జోక్యం చేసుకోకుండా ఉండి ఉంటే నా సిస్టమ్స్ అనుకున్నట్టే పనిచేసేవి. 87 00:08:58,956 --> 00:09:00,707 నీ వైపు నువ్వు చేయాల్సినది చేయలేకపోయావు. 88 00:09:00,791 --> 00:09:03,293 మనం వేర్వేరు వైపుల ఉన్నామని నాకు తెలీదే. 89 00:09:03,877 --> 00:09:06,171 ఇంజనీరింగ్ ని హ్యాండిల్ చేసేది నేను. 90 00:09:06,255 --> 00:09:07,422 నువ్వు సెక్యూరిటీని చూసుకోవాలి. 91 00:09:07,506 --> 00:09:09,967 నువ్వు ఆ పని చేయలేకపోతే ఇక నువ్వు ఉండి ఏం లాభం? 92 00:09:13,470 --> 00:09:15,389 నీ వైఫల్యాలకు నేను బాధ్యత తీసుకోను. 93 00:09:15,889 --> 00:09:17,349 వెళ్లి ఆ మాట మాస్కోలో చెప్పు. 94 00:09:54,803 --> 00:09:55,846 ఏమండీ. 95 00:10:00,142 --> 00:10:01,143 ఏమం… 96 00:10:25,918 --> 00:10:26,919 హలో? 97 00:10:35,969 --> 00:10:37,095 కామ్రేడ్ చడ్డా? 98 00:10:37,721 --> 00:10:38,722 ఇండియా నుండి కదా? 99 00:10:39,348 --> 00:10:40,641 ఎలా గెస్ చేశావు? 100 00:10:44,061 --> 00:10:45,270 నీ పేరు బాక్సుల మీద ఉంది. 101 00:10:54,488 --> 00:10:57,449 అయితే, స్టార్ సిటీలో బాగానే సెటిల్ అయ్యారా? 102 00:10:59,159 --> 00:11:00,994 అన్నీ చాలా బాగా కుదిరాయి. 103 00:11:01,078 --> 00:11:03,247 ఎవరూ నేను దేని మీద పని చేయాలో చెప్పలేదు. 104 00:11:05,082 --> 00:11:07,584 అది మామూలే. ఇక మేము తిరిగి పని మొదలెట్టాలి. 105 00:11:19,054 --> 00:11:20,973 నా మిగతా సామాగ్రి ఎక్కడ ఉంది? 106 00:11:23,767 --> 00:11:25,686 నేను చీఫ్ డిజైనర్ ని ఎక్కడ కలవగలనో చెప్పగలరా? 107 00:11:25,769 --> 00:11:28,146 ఇక్కడ ఏదో తేడా జరిగింది అనిపిస్తోంది. 108 00:11:29,565 --> 00:11:30,649 అంత ఆశలు పెట్టుకోకు. 109 00:11:30,732 --> 00:11:32,025 ఆయన చాలా బిజీ మనిషి. 110 00:11:57,676 --> 00:11:58,677 లక్ష్మీ… 111 00:11:59,428 --> 00:12:01,263 వాళ్ళు మన మాటలు వింటున్నారు. 112 00:12:02,598 --> 00:12:04,016 నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. 113 00:12:04,099 --> 00:12:05,100 అదేం కాదు. 114 00:12:06,226 --> 00:12:11,190 నేను వస్తువులు తీస్తుండగా ఇక్కడ బోలెడన్ని ఈగలు ఉన్నాయి అని అరిచాను, ఆ తర్వాత 115 00:12:11,273 --> 00:12:12,983 నేను మార్కెట్ నుండి తిరిగి వచ్చేసరికి… 116 00:12:16,111 --> 00:12:17,112 ఇది కనిపించింది. 117 00:12:17,696 --> 00:12:18,906 ఇది ఇంతకు ముందు ఇక్కడ లేదు. 118 00:12:18,989 --> 00:12:21,658 చెప్తున్నాను కదా, వాళ్లు గోడల్లో మైక్రోఫోన్స్ పెట్టారు. 119 00:12:22,618 --> 00:12:24,620 వాటిని బాత్రూమ్ లో కూడా పెట్టి ఉంటారు అనుకుంటున్నావా? ఓహ్, అమ్మో! 120 00:12:25,704 --> 00:12:26,747 బెడ్రూమ్ లో? 121 00:12:37,174 --> 00:12:38,425 ఎందుకు నవ్వుతున్నావు? 122 00:12:42,221 --> 00:12:43,847 మనకు ఇలా జరగొచ్చు అని ముందే హెచ్చరించారు. 123 00:12:43,931 --> 00:12:45,849 - ఇలా అవుతుందని మనకు తెలుసు. - లేదు, లక్ష్మీ. 124 00:12:46,892 --> 00:12:50,729 సోవియెట్ నిఘా గురించి వినడం వేరు, దాన్ని అనుభవించడం వేరు. 125 00:12:55,067 --> 00:12:56,777 అయితే నువ్వేమైనా గూఢచారివా? 126 00:12:56,860 --> 00:12:59,446 - కాదు. అదేం కాదు. - మరి ఏంటి సమస్య, మను? 127 00:13:01,615 --> 00:13:03,617 ఇక్కడ కలత చెందాల్సింది నేను. 128 00:13:05,744 --> 00:13:08,372 ఆఖరికి నా వంతు వచ్చింది అనుకున్నాను. 129 00:13:08,455 --> 00:13:10,165 ఏదైనా చేసి చూపడానికి అవకాశం దొరికింది అనుకున్నా. 130 00:13:10,707 --> 00:13:13,502 వీళ్ళు చాలా అద్భుతమైన పనులు చేస్తున్నారు, కానీ… 131 00:13:13,585 --> 00:13:16,630 వాళ్ళు నన్ను ఎక్కడ పెట్టారో నువ్వు చూస్తే తెలుస్తుంది. 132 00:13:17,130 --> 00:13:18,841 - అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? - సారీ. 133 00:13:19,842 --> 00:13:21,343 క్షమించు, బంగారం. 134 00:13:23,762 --> 00:13:24,888 సారీ. 135 00:13:32,020 --> 00:13:33,021 దొరికింది. 136 00:13:36,275 --> 00:13:37,609 క్షమించు. 137 00:13:43,156 --> 00:13:45,158 కల్నల్ రస్కోవ నిన్ను చూడాలి అన్నారు. 138 00:14:02,926 --> 00:14:04,261 కామ్రేడ్ కల్నల్? 139 00:14:04,344 --> 00:14:05,345 చెప్పు? 140 00:14:11,685 --> 00:14:15,480 ఇటీవల జరిగిన విషయాల కారణంగా అనుమానాస్పదమైన వ్యవహారాలు జరుగుతున్నాయేమో అని కొన్ని సంకేతాలను రివ్యూ చేస్తున్నా. 141 00:14:15,564 --> 00:14:17,900 చిన్న చిన్న అనుమానాలను కూడా వదలడం లేదు. 142 00:14:19,193 --> 00:14:20,194 ఇరీనా వసిలియెవ్న, 143 00:14:20,277 --> 00:14:23,739 నువ్వు నీ జీవితమంతా చిన్న చిన్న ఊహాగానాలను రాసుకుంటూ కూర్చుంటావా? 144 00:14:24,239 --> 00:14:25,407 లేదు. 145 00:14:25,490 --> 00:14:26,742 నేను కూడా అదే అనుకున్నా. 146 00:14:27,659 --> 00:14:29,661 నీ పనులు చేయడానికి ఎవరినైనా చూసుకో. 147 00:14:30,287 --> 00:14:33,332 ఈ పరికరం ఎక్కడిదో నాకు తెలియాలి. 148 00:14:33,415 --> 00:14:34,833 త్వరగా అలాగే గోప్యంగా. 149 00:14:35,542 --> 00:14:37,294 ఇది ఎక్కడ తయారు చేయబడిందో కనుక్కో. 150 00:14:38,170 --> 00:14:39,922 దీన్ని ఎవరు ఆర్డర్ చేసారో నాకు తెలియాలి. 151 00:14:40,464 --> 00:14:42,049 అప్పుడు మనకు కావాల్సిన వాడు దొరికే అవకాశం ఉంది. 152 00:14:42,633 --> 00:14:43,926 ఇది ఏంటో కనిపెట్టు. 153 00:14:52,684 --> 00:14:53,727 దీన్ని నీతో తీసుకెళ్ళు. 154 00:15:00,484 --> 00:15:01,485 నాకు దాని అవసరం లేదు. 155 00:15:01,985 --> 00:15:04,071 నువ్వు ఫీల్డ్ లోకి ఒంటరిగా వెళ్ళేటప్పుడు నీకు ఆయుధం కావాలి. 156 00:15:08,158 --> 00:15:09,743 నీకు ట్రైనింగ్ ఇచ్చారు కదా? 157 00:15:10,536 --> 00:15:11,745 అవును. 158 00:15:13,997 --> 00:15:15,165 నువ్వు ఇక వెళ్లొచ్చు. 159 00:16:34,161 --> 00:16:35,162 హలో? 160 00:16:41,001 --> 00:16:42,169 నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు? 161 00:16:43,003 --> 00:16:46,131 ట్రైనింగ్ త్వరగా ముగిసింది. ఏమైనా తిందామని వచ్చా. 162 00:16:52,179 --> 00:16:54,181 ఏమైనా ఉత్తరాలు వచ్చాయా? ఎవరైనా వచ్చారా? 163 00:16:55,432 --> 00:16:56,433 లేదు. 164 00:16:58,310 --> 00:16:59,478 ఎందుకు వస్తారు? 165 00:17:00,479 --> 00:17:02,189 ఏమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? 166 00:17:03,482 --> 00:17:05,150 "ఇలాగా"? అంటే ఎలా? 167 00:17:43,188 --> 00:17:44,189 నన్ను క్షమించు. 168 00:17:47,734 --> 00:17:50,112 మనం మాస్కోలో బాగానే ఎంజాయ్ చేసాం అనుకున్నాను, నిజమే కదా? 169 00:17:54,157 --> 00:17:55,409 నేను ఏమైనా తప్పు చేసానా? 170 00:17:58,120 --> 00:17:59,121 చెప్పు. 171 00:18:06,003 --> 00:18:08,130 లేదు, నాకు అలసటగా ఉంది అంతే. 172 00:18:21,727 --> 00:18:22,728 ఆర్సెని. 173 00:18:24,146 --> 00:18:25,147 ఆర్సెని. 174 00:18:27,232 --> 00:18:28,650 ఆర్సెని. 175 00:18:54,301 --> 00:18:58,222 ఇవాళ మరిన్ని స్పీచ్లు ఉన్నాయి. రాత్రికి తిరిగి వస్తా. ఏ. 176 00:19:50,691 --> 00:19:52,985 నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి, మీలా అలెక్సాండ్రోవ్న, 177 00:19:53,068 --> 00:19:57,114 మిషన్లు అన్నీ, ట్రైనింగ్ అయినా లేక వేరే అయినా, అన్నీ అత్యంత రహస్యమైనవి. 178 00:19:57,823 --> 00:19:58,824 ఇదిగో… 179 00:20:00,617 --> 00:20:02,452 అతను నీకోసం రాసిన లెటర్. 180 00:20:18,260 --> 00:20:19,887 నా సంతాపం తెలుపుతున్నాను. 181 00:20:33,859 --> 00:20:37,529 కామ్రేడ్ మీరోనవ్ అతనికి ట్రైనింగ్ ఇచ్చాడు, అలాగే కామ్రేడ్ పోలివనోవ్… 182 00:20:38,447 --> 00:20:39,823 అతను చనిపోయినప్పుడు అక్కడే ఉన్నాడు. 183 00:20:42,409 --> 00:20:44,244 నువ్వు కావాలంటే వాళ్లతో మాట్లాడొచ్చు. 184 00:20:51,168 --> 00:20:53,253 అతను… అతను ఎలా కన్ను మూయాలి అనుకున్నాడో అలాగే కన్ను మూసాడు. 185 00:20:58,300 --> 00:20:59,718 ఆయన వెనక్కి రావాలి అనుకున్నాడు. 186 00:21:02,387 --> 00:21:03,514 అక్కడ ఏమైంది? 187 00:21:10,938 --> 00:21:12,314 నేను నీకు అబద్ధం చెప్పదలచుకోలేదు. 188 00:21:12,397 --> 00:21:13,607 అయితే చెప్పకు. 189 00:21:18,195 --> 00:21:19,530 నేను చేయాల్సినంత చేయలేదు. 190 00:21:20,197 --> 00:21:21,740 - నేనే చావాల్సింది. - సాష. 191 00:21:21,823 --> 00:21:23,325 ఇక ఆపు. ఆపు, ఆపు, ఆపు. 192 00:21:23,408 --> 00:21:24,660 క్షమించు. 193 00:21:26,912 --> 00:21:28,288 ఆమె అదంతా వినాల్సిన అవసరం లేదు. 194 00:21:28,872 --> 00:21:29,957 వాడిని చంపింది నువ్వు కాదు. 195 00:21:30,666 --> 00:21:31,708 నేనే పైలెట్ ని. 196 00:21:32,668 --> 00:21:34,378 వాడిని ఆ కంపార్ట్మెంట్లోకి పంపింది నేనే. 197 00:21:34,461 --> 00:21:35,963 ఆ ఇంటర్ఫియరెన్స్ కి కారణం నువ్వా? 198 00:21:39,508 --> 00:21:40,509 కాదు. 199 00:21:41,677 --> 00:21:42,678 కాదు. 200 00:21:43,929 --> 00:21:44,930 పైన… 201 00:21:46,557 --> 00:21:49,017 ఎవరూ దేనికీ బాధ్యులు కారు, 202 00:21:50,102 --> 00:21:51,520 తమ సొంత మనుగడకు తప్ప. 203 00:22:11,498 --> 00:22:13,083 నాకు అది చాలా బాగా గుర్తుంది. 204 00:22:13,667 --> 00:22:17,004 నేను జీవితమంతా శ్రమించి చేరుకున్న ఆ క్షణం. 205 00:22:20,257 --> 00:22:25,387 నేను నా పురిటిగడ్డకి నాకు చేతనైన విధానంలో సేవ చేయడానికి ఎన్నుకోబడ్డాను. 206 00:22:26,180 --> 00:22:27,806 ఒక కాస్మోనాట్ గా. 207 00:22:29,266 --> 00:22:30,434 ఒక మహిళగా. 208 00:22:32,144 --> 00:22:33,645 ఒక సోవియెట్ గా. 209 00:22:34,730 --> 00:22:39,526 అంతరిక్షాన్ని చేధించడానికి అది నా సొత్తు కాదని నాకు అర్థమైంది. 210 00:22:41,278 --> 00:22:43,238 మొదటి నుండీ అది మన అందరిదీ. 211 00:23:03,592 --> 00:23:08,722 మన దేశానికి సేవలు చేసినందుకు థాంక్స్, కామ్రేడ్ బెలికోవా. 212 00:23:08,805 --> 00:23:11,808 అలాగే ఈ అద్భుతమైన ఈవెంట్ ని ఏర్పాటు చేసినందుకు లెనిన్గ్రాడ్ సోవియెట్ మహిళల కమిటీకి 213 00:23:11,892 --> 00:23:14,019 నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 214 00:23:14,686 --> 00:23:18,023 జనరల్ సెక్రటరీ మీ పనులను చూసి చాలా గర్వపడుతున్నారు. 215 00:23:22,611 --> 00:23:25,614 లూనా 17లో నువ్వు ఏం పనులు చేసావు? 216 00:23:25,697 --> 00:23:29,660 చీఫ్ డిజైనర్ నాకు లూనార్ లాండర్ లోని ప్రొపెల్లెంట్ మార్జిన్స్ ని పరిశీలించే బాధ్యత అప్పగించారు. 217 00:23:31,578 --> 00:23:34,039 ల్యాబ్ లో నువ్వు ఏదైనా అనుమానాస్పదంగా ఉండటం గమనించావా? 218 00:23:35,123 --> 00:23:39,086 నేను కట్ చేసే సర్క్యూట్లను చూడటానికి మించి వేరే ఏదీ గమనించే టైమ్ నాకు లేదు. 219 00:23:42,130 --> 00:23:44,132 ఆఖరి బూస్టర్లను ఆమోదించింది నువ్వే కదా? 220 00:23:45,092 --> 00:23:47,177 షిప్ షేప్. ఎలాంటి సమస్యలు లేవు. 221 00:23:48,554 --> 00:23:52,266 బైకోనుర్ కి వెళ్లిన ట్రైన్ బోగీలలో ఎవరైనా ఏమైనా చేయడం చూసారా? 222 00:23:52,349 --> 00:23:53,600 అస్సలు లేదు. 223 00:23:54,184 --> 00:23:55,602 మేము 2100కి బయలుదేరాం. 224 00:23:55,686 --> 00:23:57,354 అక్కడ పరిసరాల్లో ఎవరూ లేరు. 225 00:24:00,232 --> 00:24:05,195 లాంచ్ కి ముందు క్రిందకి వెళ్ళవలసిన మాడ్యూల్ ని ఇంకెవరు చేరుకొని ఉండొచ్చు? 226 00:24:05,279 --> 00:24:06,280 ఎవరూ లేరు, 227 00:24:07,698 --> 00:24:09,616 లాంచ్ ఇంజనీర్లు ఇంకా బృందానికి మించి. 228 00:24:10,659 --> 00:24:11,827 బహుశా ట్రైనర్లు వెళ్లగలరేమో. 229 00:24:13,996 --> 00:24:15,956 మీ సహకారానికి థాంక్స్. 230 00:24:17,082 --> 00:24:18,208 ఇక వెళ్లొచ్చు. 231 00:24:25,757 --> 00:24:29,469 అవును, నేను మంచి పురోగతి సాధిస్తున్నా, కామ్రేడ్ డైరెక్టర్. 232 00:24:29,553 --> 00:24:31,763 నువ్వు ఈ ఉల్లంఘన ఎలా చోటు చేసుకుందో మాకు వ్యక్తిగతంగా 233 00:24:31,847 --> 00:24:35,184 చెప్పడానికి మాస్కోకి వస్తే మంచిదని నా ఉద్దేశం. 234 00:24:37,102 --> 00:24:39,354 అంటే, ప్రస్తుతం నా పరిశోధన ఇంకా జరుగుతోంది. 235 00:24:39,438 --> 00:24:40,939 అంతా నా కంట్రోల్ లోనే ఉంది. 236 00:24:41,815 --> 00:24:44,234 అది నిజమే కావొచ్చు, కానీ ఒకసారి రా. 237 00:24:45,819 --> 00:24:46,904 థాంక్స్, కామ్రేడ్. 238 00:24:46,987 --> 00:24:48,488 నేను రేపు వస్తాను. 239 00:24:57,915 --> 00:24:59,708 నేను బెలికోవాని వచ్చేనెల 240 00:24:59,791 --> 00:25:05,005 ఫ్యాక్టరీలో మాట్లాడటానికి పంపమని ఏడు రిక్వెస్ట్ లు పెట్టాను, కానీ ఎలాంటి స్పందన లేదు. 241 00:25:05,088 --> 00:25:08,133 భలే, పట్టుదల చాలా మంచి లక్షణం, కామ్రేడ్. 242 00:25:09,843 --> 00:25:11,887 ఆమె మళ్ళీ చంద్రుడి మీదకు వెళ్తుందనే కదా? 243 00:25:11,970 --> 00:25:12,971 ఓహ్, లేదు, లేదు, లేదు. 244 00:25:13,055 --> 00:25:15,390 ప్రభుత్వం ఇప్పుడు అలాంటి రిస్క్ చేయలేదు. ఆమె చాలా విలువైన మనిషి. 245 00:25:15,474 --> 00:25:18,810 సర్లే, నీకు విలువైన మనిషి అనే కదా? 246 00:25:20,521 --> 00:25:22,439 చాల్లే. జాగ్రత్తగా మాట్లాడు. 247 00:25:44,545 --> 00:25:46,338 తర్వాతి మీటింగ్ కి ఇంకెంత సేపు? 248 00:25:48,382 --> 00:25:49,508 ఇంకొక గంట ఉంది. 249 00:25:55,180 --> 00:25:56,515 ఇదుగో. 250 00:25:57,516 --> 00:25:58,517 వద్దు. 251 00:26:04,606 --> 00:26:06,441 నువ్వు గగారిన్ తో ఉండేవాడివి, కదా? 252 00:26:11,613 --> 00:26:13,031 అతనికి ఎప్పుడు తెలిసింది? 253 00:26:15,033 --> 00:26:16,034 ఏం తెలియడం? 254 00:26:18,203 --> 00:26:20,038 అతను ఇంకెప్పటికీ పైకి వెళ్లబోడు అని. 255 00:26:24,001 --> 00:26:25,711 అతని ప్రపంచ టూర్ ముగిసిన వెంటనే చెప్పారు. 256 00:26:45,856 --> 00:26:47,024 అది ఇలా ఇవ్వు. 257 00:27:12,841 --> 00:27:14,009 తిరిగి స్వాగతం. 258 00:27:15,552 --> 00:27:16,678 ట్రైనింగ్ మిషన్ ఎలా సాగింది? 259 00:27:21,475 --> 00:27:23,435 - నేను లోనికి రావొచ్చా? - నేను ఇల్లు శుభ్రం చేయలేదు. 260 00:27:31,985 --> 00:27:33,403 బెడ్రూమ్ లో ఎవరు పడుకుంటున్నారు? 261 00:27:35,822 --> 00:27:37,115 ఆమె. 262 00:27:37,199 --> 00:27:38,534 మరి వంట ఎవరు చేస్తారు? 263 00:27:39,701 --> 00:27:41,370 నువ్వు ఇది మాట్లాడటానికే వచ్చావా? 264 00:27:41,453 --> 00:27:42,454 లేదు. 265 00:27:49,044 --> 00:27:50,462 నేను అతను ఇంకొక మహిళతో ఉండటం చూసా. 266 00:27:52,965 --> 00:27:54,132 ఎవరు? 267 00:27:55,133 --> 00:27:56,385 వాల్య. 268 00:28:00,389 --> 00:28:01,431 అతని అమ్మా? 269 00:28:02,724 --> 00:28:03,809 నేను నిజంగా అంటున్నా. 270 00:28:05,227 --> 00:28:07,020 క్షమించు. వాల్యకి అక్రమ సంబంధం ఉంది అనుకుంటున్నావా? 271 00:28:07,104 --> 00:28:08,564 నేను ఏమనుకుంటున్నానో నాకే తెలీదు. 272 00:28:08,647 --> 00:28:11,650 అతను కాన్సర్ట్ హాల్ లో ఒక మహిళతో ఉండటం మాత్రమే నాకు తెలుసు. 273 00:28:12,317 --> 00:28:14,069 నాకు అది ఎలా వివరించాలో తెలీదు. అది… 274 00:28:14,152 --> 00:28:16,530 దగ్గరగా ఉన్నారు అనిపించింది, వాళ్ళు ఒకరికి ఒకరు బాగా తెలుసు అన్నట్టు. 275 00:28:21,743 --> 00:28:23,412 వాడికి ఎలాంటి అక్రమ సంబంధం లేదు, టాన్యా. 276 00:28:27,958 --> 00:28:29,459 వాడికి అక్రమ సంబంధం ఉండి ఉంటే బాగుండని నా ఆశ. 277 00:28:30,335 --> 00:28:31,336 అది వాడికే మంచిది. 278 00:28:32,754 --> 00:28:33,755 పోయి చావు. 279 00:28:35,549 --> 00:28:36,842 నీకు అసూయగా ఉందా? 280 00:28:36,925 --> 00:28:37,926 లేదు, నేను… 281 00:28:39,386 --> 00:28:40,679 నాకు తెలీదు. 282 00:30:30,247 --> 00:30:31,498 ఈ ప్రదేశం ఏంటి? 283 00:30:32,666 --> 00:30:34,042 నాకు ఆ రెంచ్ ఇవ్వు, సరేనా? 284 00:30:36,587 --> 00:30:37,880 శబ్దం వస్తున్నందుకు ఏం అనుకోకు. 285 00:30:39,715 --> 00:30:40,966 నేను పెద్దగా పడుకోను. 286 00:30:42,759 --> 00:30:45,179 అయితే మిమ్మల్ని కూడా ఫ్రింజుల మీదే పని చేయమన్నారా? 287 00:30:46,722 --> 00:30:48,098 అలాంటిదే. 288 00:30:51,810 --> 00:30:54,021 తెలుసా, నన్ను స్టార్ సిటీకి పంపించడానికి ముందు, 289 00:30:54,104 --> 00:30:58,233 నేను స్పేస్ ప్రయాణాన్ని ముందుండి నడిపిస్తాను అనుకున్నాను, కానీ బదులుగా నేను… 290 00:30:59,234 --> 00:31:00,235 ఇక్కడ ఉన్నా. 291 00:31:01,278 --> 00:31:02,738 పక్కకి తోసేశారు, ఆహ్? 292 00:31:06,158 --> 00:31:08,493 నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోకు, కామ్రేడ్. 293 00:31:09,453 --> 00:31:13,540 పీల్చదగిన గాలి కోసం సొంతంగా గాలిని జనరేట్ చేసే ఫీల్డ్ లో నీ పని మీదే 294 00:31:14,583 --> 00:31:16,293 భవిష్యత్ స్పేస్ ప్రయాణం ఆధారపడి ఉంది. 295 00:31:18,795 --> 00:31:19,922 మీకు నా పని గురించి తెలుసా? 296 00:31:20,005 --> 00:31:21,131 అవును. 297 00:31:22,132 --> 00:31:26,762 నిజంగా అంతరిక్షాన్ని చేధించడానికి నీ పనే ఆఖరి ముక్క. 298 00:31:31,850 --> 00:31:34,895 తెలుసా, వాళ్ళు గనుక లూనా 17లో ఆక్సిజన్ ని జనరేట్ చేయడానికి 299 00:31:34,978 --> 00:31:38,524 అసమర్థమైన లిథియం హైడ్రాక్సైడ్ ఇంకా ఆక్సిజన్ ట్యాంక్లకు బదులు నా బయోస్ సిస్టమ్ ని వాడి ఉంటే, 300 00:31:38,607 --> 00:31:41,360 దాని బరువు 77 కిలోలు తగ్గేది. 301 00:31:42,653 --> 00:31:44,821 దాన్ని డిజైన్ చేసినోళ్లని తప్పుబట్టాలని నా ఉద్దేశం కాదు. 302 00:31:46,615 --> 00:31:47,824 నేను అలా ఏం అనుకోనులే. 303 00:31:55,249 --> 00:31:56,250 మీరే ఆయన. 304 00:31:58,335 --> 00:32:00,254 మీరే చీఫ్ డిజైనర్ కదా? 305 00:32:00,796 --> 00:32:02,714 ముందే చెప్పనందుకు క్షమించు. 306 00:32:02,798 --> 00:32:05,968 నేను నిన్ను మాకు చంద్రుడి మీదకు వెళ్ళడానికి సాయం చేయడానికి రప్పించలేదు, కామ్రేడ్ చడ్డా. 307 00:32:08,178 --> 00:32:09,680 మేము ఇంతకు ముందే చంద్రుడి మీదకు వెళ్లాం. 308 00:32:22,568 --> 00:32:24,111 - మీరు వీనస్ మీదకి వెళ్తున్నారా? - లేదు. 309 00:32:25,028 --> 00:32:27,197 మనం వీనస్ మీదకి వెళ్తున్నాం. 310 00:32:30,200 --> 00:32:31,535 నా ల్యాబ్ పరికరాలు. 311 00:32:40,419 --> 00:32:42,129 అందుకు నువ్వే మాకు సాయం చేయబోతున్నావు. 312 00:32:53,640 --> 00:32:55,267 - హలో. - మీకు ఏం కావాలి? 313 00:32:55,350 --> 00:32:56,852 నేను హెడ్ ఆఫీస్ కోసం చూస్తున్నా. 314 00:32:56,935 --> 00:32:58,854 అవును. అక్కడి నుండి వెళ్ళండి. 315 00:33:26,548 --> 00:33:27,549 నీకు ఏం కావాలి? 316 00:33:33,514 --> 00:33:35,724 నువ్వు దీన్ని గుర్తుపట్టగలవా? 317 00:33:35,807 --> 00:33:36,892 అవును. 318 00:33:37,434 --> 00:33:38,602 అది మా ట్రాన్స్మిటర్లలో ఒకటి. 319 00:33:42,814 --> 00:33:44,942 దీన్ని మీ నుండి ఎవరు కొని ఉండొచ్చో చెప్పగలవా? 320 00:33:48,195 --> 00:33:50,822 అంటే, అది చెప్పడం కష్టం. మేము వీటిని రోజూ చాలా చేస్తుంటాం. 321 00:33:54,952 --> 00:33:57,204 అంత వేగంగా చేయడం కష్టమై ఉంటుందే. 322 00:33:58,413 --> 00:34:00,499 కచ్చితంగా రెగ్యులేషన్స్ తో ఇబ్బంది ఎదురవుతుంటుంది. 323 00:34:02,084 --> 00:34:04,962 చెప్పాలంటే, నేను లోనికి వస్తుండగా అనేక ఉల్లంఘనలు చూసాను. 324 00:34:06,463 --> 00:34:08,757 అలాంటి ఉల్లంఘనలకు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదురవ్వొచ్చు. 325 00:34:08,841 --> 00:34:11,885 - మేము మా కోటాలు పూర్తి చేయడానికి ట్రై చేస్తున్నాం అంతే. - నేను కూడా నా పని చేయడానికి చూస్తున్నా, కామ్రేడ్. 326 00:34:17,099 --> 00:34:18,308 ఇంకొకసారి బాగా చూడు. 327 00:34:27,192 --> 00:34:29,069 ఇది మా స్టాండర్డ్ ట్రాన్స్మిటర్. 328 00:34:30,529 --> 00:34:31,780 ఇది కనిపిస్తుందా? 329 00:34:33,197 --> 00:34:34,449 దీన్ని మార్చారు… 330 00:34:36,118 --> 00:34:38,078 - దీనితో. - అవును, నేను నిన్ను అదే అడగాలి అనుకున్నా. 331 00:34:38,161 --> 00:34:40,455 దీన్ని కొన్నవాళ్ళు తరువాత ఈ పార్టును పెట్టి ఉంటారు. 332 00:34:40,539 --> 00:34:42,040 ఇది కచ్చితంగా సోవియెట్ పార్ట్ కాదు. 333 00:34:42,875 --> 00:34:43,876 అదెలా చెప్పగలవు? 334 00:34:45,460 --> 00:34:46,670 ఇది ఒక అసాధారణమైన మిశ్రమం. 335 00:34:47,212 --> 00:34:48,964 ఇలాంటిది మేము వాడము. ఒకసారి టెస్ట్ చేస్తా. 336 00:34:58,223 --> 00:34:59,641 ఒకసారి మీటర్ ని చూడు. 337 00:34:59,725 --> 00:35:02,436 నేను ప్రోబ్స్ ని ముట్టినప్పుడు, అది ఎంత పైకి వెళ్తుందో చూ… 338 00:35:03,604 --> 00:35:04,605 ఇది నీకు ఎక్కడ దొరికింది? 339 00:35:05,731 --> 00:35:07,149 ఇలాంటిది నేను ముందెప్పుడూ చూడలేదు. 340 00:35:09,026 --> 00:35:11,612 ఇది సోవియెట్ యూనియన్ లో ఎక్కడా దొరకదు. 341 00:35:12,446 --> 00:35:13,822 దీన్ని స్మగుల్ చేసి ఉంటారు. 342 00:35:13,906 --> 00:35:16,658 దీని ఉష్ణ వాహకత రాగి కంటే నాలుగు రెట్లు ఎక్కువ. 343 00:35:18,952 --> 00:35:20,704 దీన్ని ఎందుకు పెట్టి ఉండొచ్చు? 344 00:35:20,787 --> 00:35:23,457 అంటే, దీని సాయంతో మనం పరికరం నుండి అద్భుతంగా వేడిని తీయవచ్చు. 345 00:35:24,625 --> 00:35:28,504 దానర్థం ఈ చిన్న ట్రాన్స్మిటర్ గుండా చాలా మోతాదు శక్తి ప్రసరించినా కూడా 346 00:35:28,587 --> 00:35:30,297 ఇది పాడవ్వకుండా పనిచేస్తుంది. 347 00:35:30,964 --> 00:35:35,260 మన స్టాండర్డ్ సైజ్ కంటే ఇది ఎన్నో రెట్లు ఎక్కువ కరెంట్ ని తట్టుకోగలదు. 348 00:35:37,429 --> 00:35:39,598 ఈ ట్రాన్స్మిటర్ ఎక్కడి నుండి శక్తిని అందుకుంటుంది? 349 00:35:41,266 --> 00:35:43,393 నేను మీ కొనుగోళ్ల రికార్డులు చూడాలి అనుకుంటున్నా. 350 00:36:08,126 --> 00:36:09,127 లోనికి రా. 351 00:36:17,761 --> 00:36:19,304 లుడ్మీలా ఎఫిమోవ్న. 352 00:36:19,388 --> 00:36:20,472 కోస్ట్య. 353 00:36:22,391 --> 00:36:24,601 మనం ఇంకాస్త మెరుగైన పరిస్థితుల మధ్య కలుసుకుని ఉంటే బాగుండు. 354 00:36:26,061 --> 00:36:27,187 థాంక్స్. 355 00:36:27,271 --> 00:36:31,942 నేను ఉల్లంఘనని కంట్రోల్ చేసి క్రాఫ్ట్ నుండి ఆ పరికరాన్ని కనిపెట్టా. 356 00:36:32,025 --> 00:36:35,320 దాన్ని ఎవరు పెట్టారో కనిపెట్టడానికి వెతుకులాట జరుగుతోంది. 357 00:36:38,657 --> 00:36:40,993 ఇతను రాడిమిర్ సెర్గేవిచ్ పెట్రోవ్స్కీ. 358 00:36:42,786 --> 00:36:44,121 మీ కొత్త ల్యూటెనెంట్? 359 00:36:44,204 --> 00:36:46,999 సెకండ్ చీఫ్ డైరెక్టరేట్ కి కొత్త ఫస్ట్ డెప్యూటీ. 360 00:36:51,128 --> 00:36:52,504 ఫస్ట్ డెప్యూటీ. 361 00:36:53,964 --> 00:36:55,465 మా అమ్మ మీ విభాగంలో పనిచేసేది. 362 00:36:56,300 --> 00:36:57,467 రాయ ఫమోవ. 363 00:36:58,552 --> 00:36:59,678 మీకు తను గుర్తుందా? 364 00:37:00,345 --> 00:37:02,347 ఆమె అంత త్వరగా రిటైర్ కావాల్సి రావడం దురదృష్టకరం. 365 00:37:02,431 --> 00:37:03,932 ఆమె ఒక కుటుంబాన్ని పెంచి పోషించింది. 366 00:37:04,558 --> 00:37:07,978 క్షమించాలి, మనం ఇక్కడికి మీ అమ్మ గురించి మాట్లాడటానికి వచ్చామా లేక లూనా 17 గురించి మాట్లాడటానికా? 367 00:37:10,898 --> 00:37:12,524 అమెరికన్లు ఈ అద్భుతమైన చొరబాటును 368 00:37:12,608 --> 00:37:15,777 ఎలా చేయగలిగారని మాకు ఒక పూర్తి రిపోర్ట్ కావాలి. 369 00:37:15,861 --> 00:37:17,154 ఇది చాలా దారుణమైన సంఘటన. 370 00:37:17,237 --> 00:37:18,572 నేను ఏం జరిగిందో కనిపెడతా, 371 00:37:18,655 --> 00:37:20,741 కానీ రిపోర్టులు అడిగి దయచేసి నా టైమ్ వృధా చేయొద్దు. 372 00:37:20,824 --> 00:37:23,285 అది ఎవరూ చదవని బోలెడంత పేపర్ వర్క్ మాత్రమే. 373 00:37:23,368 --> 00:37:24,995 అది తప్పకుండా చదువుతాం అని మాట ఇస్తున్నా. 374 00:37:27,039 --> 00:37:28,040 లుడ్మీలా, 375 00:37:28,749 --> 00:37:31,168 దశాబ్దాల నీ సర్వీస్ ని మెచ్చుకోని వారు ఉండరు. 376 00:37:31,251 --> 00:37:33,337 కానీ ఇకపై ఇక్కడ పని ఇలాగే జరగాలి. 377 00:37:36,798 --> 00:37:40,552 నీ పర్యవేక్షణలో ఒక సీనియర్ కాస్మోనాట్ ని చంపారు. 378 00:37:41,428 --> 00:37:43,222 - యాన… - అఖ్మటోవ. 379 00:37:43,889 --> 00:37:47,726 అవును. ఆమె అమెరికన్లతో కలిసి పని చేస్తున్నా అని ఒప్పుకుంది. 380 00:37:47,809 --> 00:37:50,103 ఇప్పుడు ఆమె ఒంటరిగా పని చేయడం లేదని తెలిసింది. 381 00:37:50,187 --> 00:37:52,773 ఇది మేము ముందు అనుకున్నదానికంటే పెద్ద ఆపరేషన్. 382 00:37:55,108 --> 00:37:58,070 సెకండ్ చీఫ్ డైరెక్టరేట్ సాయం నీకు అందించడానికి రాడిమిర్ సిద్ధంగా ఉన్నాడు. 383 00:37:58,153 --> 00:38:01,406 అతనికి స్పేస్ ప్రోగ్రామ్ మీద ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. 384 00:38:01,990 --> 00:38:04,326 నేను సెక్యూరిటీ సర్వీస్ లో చేరడానికి ముందు 385 00:38:04,409 --> 00:38:06,286 యూనివర్సిటీలో ఎలెక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివాను. 386 00:38:06,370 --> 00:38:09,915 అది మంచి విషయమే, కానీ ఇది నేను హ్యాండిల్ చేయలేని విషయం కాదు. 387 00:38:14,294 --> 00:38:19,216 అలాగే కాస్మోనాట్ ఆర్సెని వెట్రోవ్ మరణానికి కారణమైన విషయం మీద కూడా నువ్వు రిపోర్ట్ ఇవ్వాలి, 388 00:38:19,967 --> 00:38:22,553 అది టెక్నీకల్ వైఫల్యమా లేక సెక్యూరిటీ ఉల్లంఘన కారణంగానా అని. 389 00:38:22,636 --> 00:38:24,555 ఆ తర్వాత మనం ఎలా ముందుకు సాగొచ్చో… 390 00:38:25,681 --> 00:38:26,682 ఆలోచించవచ్చు. 391 00:38:26,765 --> 00:38:28,225 ఇది నేను ఆందోళన పడాల్సిన విషయమా? 392 00:38:29,518 --> 00:38:30,644 అలా ఏం కాదు. 393 00:38:30,727 --> 00:38:33,522 నువ్వు సోవియెట్ యూనియన్ కి చెందిన హీరోవి, కామ్రేడ్ రస్కోవ. 394 00:38:35,524 --> 00:38:36,817 సంస్మరణకి ఇచ్చే టైటిల్ లా ఉంది. 395 00:38:37,359 --> 00:38:38,569 లేదు. 396 00:38:39,152 --> 00:38:40,821 అది నీ సర్వీస్ కి ఇచ్చిన బిరుదు. 397 00:38:43,615 --> 00:38:45,409 నేను దీన్ని కంట్రోల్ లోకి తెస్తా. 398 00:38:45,492 --> 00:38:46,660 మీకు నా మాట ఇస్తున్నాను. 399 00:38:50,289 --> 00:38:51,290 మంచిది. 400 00:38:51,790 --> 00:38:53,041 ఆ పని మీద ఉండు. 401 00:39:04,303 --> 00:39:05,554 నాతో రండి. 402 00:39:09,141 --> 00:39:12,895 మానవ రహిత ప్రోబ్ కి సంబంధించి ఈవారం జరిపిన లేటెస్ట్ సన్నాహాలు ఏమిటి? 403 00:39:12,978 --> 00:39:15,772 దాదాపుగా అన్ని మాడ్యూల్స్ అలాగే 404 00:39:15,856 --> 00:39:20,360 ఎన్-1 కూడా ప్రస్తుతం బైకోనుర్ లోని ప్యాడ్ కి వెళ్తున్నాయి. 405 00:39:20,944 --> 00:39:23,906 చీఫ్ డిజైనర్, అన్నీ ట్రాక్ లో ఉన్నాయి. 406 00:39:24,615 --> 00:39:26,658 అలాగే ఇప్పుడు కామ్రేడ్ చడ్డా కూడా చేరింది, 407 00:39:26,742 --> 00:39:29,786 ఆమె లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ చాలా అద్భుతంగా పని చేస్తున్నాయి, 408 00:39:29,870 --> 00:39:32,247 - కాబట్టి మనం లాంచ్ కి సిద్ధంగా ఉంటాం. - మంచిది. 409 00:39:32,331 --> 00:39:35,876 ప్రస్తుతం చాలా హడావిడిగా ఉంది కాబట్టి, నేను ఏమనుకున్నా అంటే… 410 00:39:35,959 --> 00:39:38,670 మనం లాంచ్ ని కొంచెం వాయిదా వేస్తే మంచిదేమో… 411 00:39:38,754 --> 00:39:40,214 అది ఇప్పుడే జరగాలి, సెర్గీ. 412 00:39:40,297 --> 00:39:41,715 లేదంటే ఎప్పటికీ జరగదు. 413 00:39:41,798 --> 00:39:44,551 సరే. అయితే, మిషన్ కి ఎవరెవరిని పంపాలనే విషయం మనం చర్చించడం మొదలెట్టాలి. 414 00:39:45,135 --> 00:39:46,637 అది నేను హ్యాండిల్ చేశాను. 415 00:39:54,645 --> 00:39:56,146 నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చీఫ్ చెప్పారా? 416 00:40:09,618 --> 00:40:10,702 నీకు ఏమైనా కావాలా? 417 00:40:12,913 --> 00:40:13,914 లేదు. 418 00:40:14,581 --> 00:40:15,582 నీకు ఏమైనా కావాలా? 419 00:40:28,470 --> 00:40:29,555 కూర్చో, ప్లీజ్. 420 00:40:32,140 --> 00:40:33,433 మంచిది. 421 00:40:34,434 --> 00:40:37,688 మూడు రోజులలో ఒక క్రాఫ్ట్ లాంచ్ చేయబోతున్నాను, 422 00:40:37,771 --> 00:40:39,565 అందులో నాకు వెళ్ళడానికి బృందం కావాలి. 423 00:40:43,694 --> 00:40:46,238 ఈ మిషన్ చాలా రహస్యమైనది కాబట్టి 424 00:40:46,321 --> 00:40:47,948 ఇంతకంటే ముందే నోటిస్ ఇవ్వలేకపోయా. 425 00:40:51,410 --> 00:40:53,579 మీకు నా గురించి తెలుసు కదా, చీఫ్, నేను దేనికైనా రెడీ. 426 00:40:55,163 --> 00:40:58,250 కానీ కల్నల్ రస్కోవ నన్ను ఇంకా సాషని లూనా 17 మిషన్ తర్వాత ఎక్కడికీ వెళ్లొద్దు అంది. 427 00:40:58,333 --> 00:41:01,503 అందుకే ఎవరికీ తెలియకూడని ఈ మిషన్ కి నువ్వు సరిగ్గా సరిపోతావు. 428 00:41:03,922 --> 00:41:06,341 - మేము ఎక్కడికి వెళ్తున్నాము? - నువ్వు ఒప్పుకునేవరకు నేను మీకు చెప్పలేను. 429 00:41:11,054 --> 00:41:13,223 మీరు ఎవరికీ చెప్పకూడదు, మీ భార్యలకు, భర్తలకు కూడా. 430 00:41:14,766 --> 00:41:16,476 మీరు తొమ్మిది నెలల పాటు వెళ్లాల్సి ఉంటుంది. 431 00:41:18,312 --> 00:41:20,189 ఆలోచించుకోవడానికి మీకు ఇవాళ రాత్రి అంతా ఇస్తున్నా. 432 00:41:20,272 --> 00:41:21,523 రాత్రి అంతా అవసరం లేదు. 433 00:41:22,524 --> 00:41:23,984 - నేను వెళ్తాను. - మంచిది. 434 00:41:27,529 --> 00:41:29,948 మీరు నా లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ని వాడబోతున్నారా? 435 00:41:30,574 --> 00:41:31,658 వీళ్ళకి నేను ట్రైనింగ్ ఇవ్వాలా? 436 00:41:31,742 --> 00:41:34,953 అంత క్లిష్టమైనదాని మీద వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే టైమ్ మనకు లేదు. 437 00:41:35,037 --> 00:41:36,413 నువ్వు ఇక్కడికి వచ్చేవరకు క్లోరెల్ల అవసరమైనంత 438 00:41:36,496 --> 00:41:38,790 కార్బన్ డైయాక్సయిడ్ ని జీవక్రియ చేసేలా మేము కూడా చేయలేకపోయాము. 439 00:41:38,874 --> 00:41:39,875 లేదు. 440 00:41:39,958 --> 00:41:41,126 నువ్వు కూడా వీళ్ళతో కలిసి వెళ్ళాలి. 441 00:41:43,504 --> 00:41:45,005 కానీ నేను కాస్మోనాట్ ని కాదు. 442 00:41:45,088 --> 00:41:46,173 ఇకపై నువ్వు అదే. 443 00:41:49,176 --> 00:41:51,011 ఆగండి, తనా? 444 00:41:51,803 --> 00:41:53,305 మీరు జోక్ చేస్తున్నారు కదా. 445 00:41:53,889 --> 00:41:54,973 ముఖ్యంగా తనే వెళ్ళాలి. 446 00:42:05,943 --> 00:42:07,110 క్షమించండి, చీఫ్. 447 00:42:18,580 --> 00:42:20,249 బాబు, నువ్వు మదనపడుతున్నావని తెలుసు, 448 00:42:20,332 --> 00:42:22,543 కానీ నీ బాధని అధిగమించడానికి ఒకే ఒక్క మార్గం ముందుకు కొనసాగడమే. 449 00:42:22,626 --> 00:42:24,920 మనిద్దరికీ ఒక విషయం బాగా తెలుసు, నేను ఇంకెప్పటికీ మరొక షిప్ ని ముట్టుకోకూడదు. 450 00:42:25,003 --> 00:42:27,381 నువ్వు ఇప్పుడు వెళ్లకపోతే, ఇంకెప్పటికీ వెళ్ళలేవని నా భయం. 451 00:42:28,173 --> 00:42:29,591 సరే, అది మంచి విషయమేనేమో. 452 00:42:32,970 --> 00:42:33,971 నేను రాజీనామా చేస్తున్నా. 453 00:42:34,638 --> 00:42:35,681 ఇప్పుడిక పని సులభం అవుతుంది. 454 00:42:35,764 --> 00:42:38,600 నిన్ను నేను ఎయిర్ ఫోర్స్ నుంచి బయటకు రప్పించింది పని సులభం చేయడానికి అనుకున్నావా? 455 00:42:41,770 --> 00:42:43,355 అందరూ నిన్ను కంట్రోల్ చేయలేము, 456 00:42:43,438 --> 00:42:45,858 నీకు ఆవేశం ఎక్కువ అని చెప్పినా కూడా నేను నిన్ను ఇక్కడికి రప్పించా. 457 00:42:47,818 --> 00:42:49,820 ఈ మిషన్ కి మ్యాప్ ఏం లేదు. అప్పటికపుడు తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. 458 00:42:49,903 --> 00:42:53,907 అందుకు కంట్రోల్ చేయబడలేని చాకచక్యం ఉన్న మంచి పైలెట్ నాకు కావాలి. 459 00:42:55,367 --> 00:42:57,452 లేదు. నేను మరిన్ని… 460 00:42:58,662 --> 00:43:00,998 ప్రాణాలు తీయదలచుకోలేదు. 461 00:43:01,748 --> 00:43:02,749 నీకు అర్థం కావడం లేదా? 462 00:43:02,833 --> 00:43:07,254 నువ్వు గనుక తన జ్ఞాపకాన్ని ఒక సాకుగా వాడుకుంటున్నావని ఆర్సెని వెట్రోవ్ కి తెలిస్తే నిన్ను ఎప్పటికీ క్షమించడు, సాష. 463 00:43:10,424 --> 00:43:13,468 అతను ఇక ఏ మిషన్స్ పై వెళ్ళలేడు. అందుకే అతని కోసమైనా నువ్వు ముందుకు వెళ్ళాలి. 464 00:43:17,264 --> 00:43:18,515 నీకోసం నువ్వు వెళ్ళాలి. 465 00:43:39,494 --> 00:43:42,456 సామూహిక విజయమే సోవియెట్ ఆదర్శం. 466 00:43:44,583 --> 00:43:45,751 ఇదుగో. 467 00:43:47,211 --> 00:43:48,587 ఇదుగో. 468 00:43:50,756 --> 00:43:52,257 నన్ను ఏమైనా అడగాలి అనుకుంటున్నారా? 469 00:43:52,925 --> 00:43:54,259 జియోమెట్రీ ప్రశ్నలు ఏం అడగొద్దు. 470 00:43:54,343 --> 00:43:55,552 నాకు మొదటి నుండీ అది అంత గొప్పగా రాలేదు. 471 00:43:55,636 --> 00:43:57,804 మ్యాథ్స్ లో నేను ఎప్పుడూ గోల్డ్ మెడల్ గెలవలేదు. 472 00:43:57,888 --> 00:43:58,889 సిల్వర్ మాత్రమే గెలిచా. 473 00:43:59,473 --> 00:44:00,891 అయినా సరే, 474 00:44:01,642 --> 00:44:04,019 నేను నాకు వీలైనంత కష్టపడ్డాను, కానీ… 475 00:44:04,603 --> 00:44:06,271 అంతే… అంతకు మించి ఏం లేదు. 476 00:44:06,355 --> 00:44:08,148 అదే… రహస్యం. అది… 477 00:44:08,857 --> 00:44:11,068 మనం ప్రయత్నం మానుకోకూడదు, కాబట్టి… 478 00:44:12,027 --> 00:44:13,820 మేము ఎప్పటికైనా అంతరిక్షానికి వెళ్ళగలం అనుకుంటున్నారా? 479 00:44:19,243 --> 00:44:20,494 నాకంటే ముందు మీరే వెళ్తారు. 480 00:44:23,539 --> 00:44:25,290 మనల్ని కలవడానికి వచ్చినందుకు కామ్రేడ్ బెలికోవాకి థాంక్స్ చెప్పండి. 481 00:44:25,374 --> 00:44:28,001 - ఆమె చాలా బిజీ మహిళ. - థాంక్స్. 482 00:44:29,044 --> 00:44:30,379 సరే. థాంక్స్, అమ్మాయిలు. 483 00:44:35,843 --> 00:44:36,927 నాకు చాలా ఆకలిగా ఉంది. 484 00:44:37,010 --> 00:44:39,763 - ఇక్కడ తినడానికి ఏమైనా… - నేను… ప్లీజ్, ఒక్క నిమిషం. 485 00:44:39,847 --> 00:44:41,098 భోజనం మ్యాథ్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తుంది. 486 00:44:41,181 --> 00:44:43,392 - లేదు, అదేం పర్లేదు. - లేదు, ఒక్క క్షణం ఉండు. 487 00:44:50,190 --> 00:44:51,400 వాడికి నువ్వు నచ్చావు. 488 00:44:52,818 --> 00:44:54,486 అతనికి నా గురించి ఏమీ తెలీదు. 489 00:44:55,279 --> 00:44:56,947 అయితేనేం, ఆ కారణంగా ఎవరూ ఇంతవరకు ఆగలేదు. 490 00:44:59,908 --> 00:45:05,414 మేము నీకు కెఫెటేరియా తిండి పెట్టలేం, కామ్రేడ్ బెలికోవా, కాబట్టి… 491 00:45:06,206 --> 00:45:09,042 దయచేసి ఎంజాయ్ చేయండి. ఫిజిక్స్ ఫ్యాకల్టీ వారు ఏర్పాటు చేశారు. 492 00:45:20,929 --> 00:45:23,015 నన్ను అలా చూడటం ఆపుతావా? 493 00:45:26,810 --> 00:45:28,937 అంటే, నువ్వు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, కామ్రేడ్ బెలికోవా. 494 00:45:29,021 --> 00:45:30,856 నువ్వు సాధించిన విజయాలు… 495 00:45:32,065 --> 00:45:33,483 మా అందరినీ స్పూర్తితో నింపాయి. 496 00:45:33,567 --> 00:45:34,902 నిజంగా. 497 00:45:34,985 --> 00:45:38,572 సరే, కానీ నేను మాత్రం కేవలం చెప్పినట్టు విని చంద్రుడి మీదకు వెళ్లిన 498 00:45:38,655 --> 00:45:40,616 ఆకలితో పొలంలో గడిపిన ఒక సాధారణ అమ్మాయిని మాత్రమే. 499 00:45:41,158 --> 00:45:43,076 లేదు, నువ్వు అంతకంటే చాలా చాలా గొప్పదానివి. 500 00:45:44,494 --> 00:45:45,704 నువ్వు ఒక… 501 00:45:45,787 --> 00:45:47,581 ఒక మంచి భవిష్యత్ ఉందని చూపించే ప్రమాణానివి. 502 00:45:50,000 --> 00:45:51,251 అదంతా నాకు తెలీదు. 503 00:45:52,169 --> 00:45:55,214 అంటే, నిజంగా అంటున్నా, నేను ఎవరినో తెలీని 504 00:45:55,297 --> 00:45:58,133 చోటుకు వెళ్ళడానికి నేను ఇప్పుడు ఎంతైనా ఇస్తాను. 505 00:45:58,717 --> 00:46:03,472 అక్కడ తాజా టమాటాలు తినాలని ఉంది, అలాగే 506 00:46:05,182 --> 00:46:07,935 అందరూ నేను ఒక ఆవుకి పాలు పితకడం తప్ప ఇంకేం చేయలేను అనుకున్నప్పుడు 507 00:46:09,019 --> 00:46:12,940 ఎలా ఆకాశంలోని నక్షత్రాలను చూసేదాన్నో అలా చూడాలని ఉంది. 508 00:46:14,274 --> 00:46:16,360 నిజానికి నేను చాలా బాగా పాలు పితికేదాన్ని. 509 00:46:23,784 --> 00:46:25,994 నా దాచ ఇక్కడికి 20 నిమిషాల దూరంలో ఉంది. 510 00:46:27,162 --> 00:46:29,540 నువ్వు జీవితంలో ముందెప్పుడూ చూడనన్ని నక్షత్రాలను అక్కడ చూడొచ్చు. 511 00:46:29,623 --> 00:46:30,749 అంటే, నీలా కాకపోవచ్చు. 512 00:46:34,586 --> 00:46:35,921 అక్కడ ఒక ఆవు కూడా ఉండొచ్చు. 513 00:46:40,759 --> 00:46:41,927 నువ్వు వస్తే మాకు ఒక గౌరవంగా ఉంటుంది. 514 00:46:48,267 --> 00:46:49,893 సరే, కానీ ఆవు కచ్చితంగా ఉంటుంది కదా? 515 00:46:51,103 --> 00:46:52,437 ఒక మేక ఉండొచ్చు అనుకుంట. 516 00:46:56,984 --> 00:46:57,985 అలాగా. 517 00:46:59,278 --> 00:47:01,780 సరే, అది ఏంటో తెలుసుకోవాలి అంటే వెళ్లాల్సిందే కదా? 518 00:47:03,574 --> 00:47:05,659 అవునా? నిజంగా? పదండి. 519 00:47:05,742 --> 00:47:07,661 - అవును. - నాకు మేకలు కూడా ఇష్టమే. 520 00:47:07,744 --> 00:47:10,247 - అంటే, పదండి, వెళదాం. - వెళదాం. సరే! 521 00:48:24,988 --> 00:48:26,156 హలో? 522 00:49:15,247 --> 00:49:16,999 ఆగు! ఆగు! 523 00:50:22,940 --> 00:50:24,566 అద్భుతం! 524 00:50:25,776 --> 00:50:26,902 అద్భుతం! 525 00:50:32,533 --> 00:50:34,368 - సరే! పంపుతున్నా! - తర్వాతిది! 526 00:50:35,494 --> 00:50:36,537 తర్వాతిది. 527 00:50:42,251 --> 00:50:43,252 సరే. 528 00:50:44,127 --> 00:50:46,213 - అవును, అవును. - అద్భుతం, అద్భుతం, అద్భుతం, అద్భుతం! 529 00:50:46,296 --> 00:50:48,298 మూడు, రెండు, ఒకటి. 530 00:50:51,176 --> 00:50:52,219 ఓహ్, దేవుడా! 531 00:50:53,136 --> 00:50:54,304 భలే. 532 00:50:55,264 --> 00:50:57,015 అది ఎంత దూరం వెళ్ళింది? 533 00:50:57,558 --> 00:50:59,226 కనీసం 30 మీటర్లు. 534 00:51:07,234 --> 00:51:08,235 అది ఎవరు? 535 00:51:09,862 --> 00:51:12,197 అది నా భర్త. 536 00:51:14,324 --> 00:51:15,325 స్వాగతం! 537 00:51:15,409 --> 00:51:16,451 స్వాగతం! 538 00:51:16,535 --> 00:51:17,703 కాల్ చేసినందుకు థాంక్స్. 539 00:51:18,871 --> 00:51:20,080 పద! పద! 540 00:51:20,664 --> 00:51:21,665 హలో! 541 00:51:22,416 --> 00:51:23,917 - పద. - దీన్ని నువ్వు లాంచ్ చేయొచ్చు. 542 00:51:24,001 --> 00:51:25,586 - హలో! - స్వాగతం. 543 00:51:25,669 --> 00:51:26,712 సాష. 544 00:51:28,630 --> 00:51:31,258 - రా. నీళ్లు భలే ఉన్నాయి. - కారు ఎక్కు. మనం ఇంటికి వెళ్ళాలి. 545 00:51:33,802 --> 00:51:35,304 లేదు! లేదు, లోనికి రా. 546 00:51:35,387 --> 00:51:36,388 - లోనికి రా. - కారు ఎక్కు. 547 00:51:36,471 --> 00:51:38,098 - సాష. సాష! - నీ గౌరవార్థం మేము లాంచ్ చేస్తాం. 548 00:51:38,182 --> 00:51:39,349 - సరే, నీ గౌరవార్థం! - నా గౌరవార్థం! 549 00:51:41,518 --> 00:51:44,062 ఇదుగో. ఇదుగో! 550 00:51:44,146 --> 00:51:45,147 కారు ఎక్కు. 551 00:51:45,230 --> 00:51:46,398 అబ్బా, నువ్వు భలే నీరసం మనిషివి. 552 00:51:46,982 --> 00:51:47,983 నీకు సరదా అస్సలు తెలీదు. 553 00:51:54,156 --> 00:51:55,574 సరే! 554 00:51:55,657 --> 00:51:58,035 - వూ! - భలే! 555 00:52:17,429 --> 00:52:18,472 లేదు. 556 00:52:19,556 --> 00:52:20,557 నా మంచం దిగు. కంపు కొడుతున్నావు. 557 00:52:21,266 --> 00:52:23,602 - నేను స్నానం చేయాలి. - సర్లే. ముందు నేను వెళ్తున్నా. 558 00:52:23,685 --> 00:52:25,103 నేను సరస్సులోకి దిగి వచ్చాను. 559 00:52:25,187 --> 00:52:26,522 సరే, అది ఎవరి తప్పు? 560 00:52:27,231 --> 00:52:28,649 ఏం మాట్లాడుతున్నావు? 561 00:52:29,274 --> 00:52:30,776 నేనేం పైపైన అనడం లేదు, నేరుగా చెప్తున్నాను. 562 00:52:31,443 --> 00:52:34,029 ఎందుకంటే నువ్వు మొత్తం ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ని నీళ్ళలోకి దింపి గెంతులు వేస్తే 563 00:52:34,112 --> 00:52:37,032 నేను బాధ్యతగల భర్తగా నిన్ను రాత్రంతా కార్లో పెట్టుకుని తీసుకొచ్చా. 564 00:52:37,115 --> 00:52:38,992 హేయ్! ఎక్కువ మాట్లాడకు. 565 00:52:39,076 --> 00:52:42,913 వాళ్ళు నన్ను ఇంకెప్పుడూ పైకి వెళ్లనివ్వకపోతే, నేను కనీసం ఎంజాయ్ చేయడంలో తప్పేముంది? 566 00:52:43,497 --> 00:52:46,208 సరదాగా ఉండటం నీకెప్పటి నుండి నచ్చడం లేదు, ఆహ్? 567 00:52:46,291 --> 00:52:48,919 లేదా ఆ సరదాలో నువ్వు పాల్గొనకపోతేనే నీకు నచ్చదా? ముందు నేను వెళ్తున్నాను. 568 00:52:49,002 --> 00:52:51,046 షవర్ లోకి ముందు నువ్వు వెళ్ళడానికి అవకాశమే లేదు. హేయ్! 569 00:52:51,129 --> 00:52:53,715 పాపం, అందరూ ప్రేమించే అనస్టాసియా, తన మాటకి అందరూ అమితమైన గౌరవం 570 00:52:53,799 --> 00:52:56,093 - ఇచ్చే ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ మహిళ. - నేను మాట్లాడే ప్రతీ పదం 571 00:52:56,176 --> 00:52:57,678 - ఇంకొకరు నాకు చెప్పిందే! - సేవలు చేయడానికి బోలెడంత మంది. 572 00:52:57,761 --> 00:52:59,721 ఇంకెప్పుడూ ఎగరలేకపోతే ఇక తను ఏం చేయగలదు చెప్పండి, ఆహ్? 573 00:52:59,805 --> 00:53:02,808 - ఓహ్, లేదు, లేదు, లేదు, లేదు. - నువ్వు మాట్లాడకు! 574 00:53:02,891 --> 00:53:04,852 నువ్వు చేసేదల్లా… అది… 575 00:54:34,608 --> 00:54:35,859 కామ్రేడ్ నికొలోవ్. 576 00:54:37,736 --> 00:54:38,737 ఏంటి? 577 00:54:40,239 --> 00:54:41,490 ఇదేంటో నీకు తెలుసా? 578 00:54:45,577 --> 00:54:47,204 ఫిలాసఫీ ఆఫ్ కామన్ టాస్క్ పుస్తకం. 579 00:54:50,666 --> 00:54:53,126 నీ ఇంటిలో రొటీన్ సోదాలు జరిపేటప్పుడు ఇది కనిపించింది. 580 00:54:54,294 --> 00:54:56,588 ఇలాంటి సమిజ్డాట్ నిషేధించబడింది. 581 00:54:56,672 --> 00:54:58,841 అవును, నాకు… నాకు తెలుసు, కానీ, 582 00:54:59,967 --> 00:55:02,177 ఇక్కడ ఉన్న ఇంజనీర్లలో సగం మంది ఫియోదొరోవ్ పుస్తకాలు చదివినవారే. 583 00:55:03,679 --> 00:55:05,013 వాళ్ళ పేర్లు ఏంటో చెప్తావా? 584 00:55:17,276 --> 00:55:18,277 ఇతన్ని ఆధీనంలోకి తీసుకోండి. 585 00:55:21,363 --> 00:55:23,949 ప్లీజ్. ఇది… ఇదంతా ఒక అపార్థం. ఇది… 586 00:56:24,843 --> 00:56:26,929 - హాయ్. - నన్ను క్షమించు. పనిలో బిజీ అయిపోయా. 587 00:56:27,012 --> 00:56:28,764 ఓహ్, దేవుడా. లేదు, అలా మాట్లాడకు. 588 00:56:28,847 --> 00:56:29,848 లోనికి రా. 589 00:56:31,475 --> 00:56:35,812 జోయా ఇంకా నేను చాలా సేపు హాయిగా ప్రాక్టీస్ చేసాం, అలాగే మంచి భోజనం తిన్నాం కూడా. 590 00:56:35,896 --> 00:56:38,440 - తను ఇప్పుడే లోనికి వెళ్ళింది. - సరే అలాగే. 591 00:56:40,859 --> 00:56:42,736 తనని చూసుకుంటున్నందుకు థాంక్స్. 592 00:56:42,819 --> 00:56:43,862 లేదు. 593 00:56:47,866 --> 00:56:50,410 లేదు, ఇరినోచ్క, దయచేసి ఉండు. నీకు కొంచెం టీ చేయనివ్వు. 594 00:56:50,494 --> 00:56:52,496 నా వల్ల కాదు. ఇప్పటికే మేము నిన్ను చాలా ఇబ్బంది పెట్టాం. 595 00:56:52,579 --> 00:56:53,747 దయచేసి ఉండు. 596 00:56:56,750 --> 00:56:57,793 బ్లాక్ టీ త్రాగితే బాగుంటుంది. 597 00:56:59,586 --> 00:57:00,671 నీ కోట్ నాకు ఇవ్వు. 598 00:57:06,927 --> 00:57:08,470 - థాంక్స్. - సరే. 599 00:57:13,100 --> 00:57:14,768 మీ ఆయన ఇంట్లో లేరా? 600 00:57:14,852 --> 00:57:15,853 లేరు. 601 00:57:16,937 --> 00:57:18,230 వాల్య మాస్కోలో ఉన్నాడు. 602 00:57:19,147 --> 00:57:20,983 ఏదో ట్రైనింగ్ అంట. 603 00:57:21,817 --> 00:57:22,860 నాకైతే అలాగే చెప్పాడు. 604 00:57:24,987 --> 00:57:26,196 అతను ఇంకేం పని మీదే వెళ్లి ఉంటాడు? 605 00:57:26,697 --> 00:57:28,532 నేను కూడా అదే ప్రశ్న వేసుకుంటున్నాను. 606 00:57:44,882 --> 00:57:46,133 అతన్ని ఇంకొకరితో చూసాను. 607 00:57:47,676 --> 00:57:48,677 ఒక మహిళతో. 608 00:57:49,303 --> 00:57:50,721 మేము ఫిల్హార్మోనిక్ కి వెళ్ళినప్పుడు. 609 00:57:52,598 --> 00:57:54,266 అతను టాయిలెట్ కి వెళ్తున్నా అన్నాడు, 610 00:57:54,975 --> 00:57:58,020 కానీ అందుకు బదులు ఆమెతో రహస్యంగా మాట్లాడుతుండటం చూసా. 611 00:58:00,063 --> 00:58:01,064 లేదు. 612 00:58:02,733 --> 00:58:04,443 వాల్య నీకు ఎప్పటికీ ద్రోహం చేయడు. 613 00:58:04,526 --> 00:58:05,569 తనకి నువ్వంటే చాలా ఇష్టం. 614 00:58:06,820 --> 00:58:07,946 అతన్ని నువ్వెప్పుడూ కలవలేదు కదా. 615 00:58:10,240 --> 00:58:11,241 అంటే, లేదు. 616 00:58:12,034 --> 00:58:13,619 నువ్వు అతని గురించి మాట్లాడే విధానాన్ని బట్టి చెప్తున్నా. 617 00:58:14,786 --> 00:58:17,539 తను… తను కచ్చితంగా అలాంటి పని చేయడు. 618 00:58:17,623 --> 00:58:18,707 బహుశా ఒకప్పుడు ఏమో. 619 00:58:19,583 --> 00:58:21,585 కానీ ఈ మధ్యన మేము చాలా దూరమయ్యాము. 620 00:58:22,920 --> 00:58:24,546 ముఖ్యంగా పారిస్ కి వెళ్లి వచ్చినప్పటి నుండి. 621 00:58:29,801 --> 00:58:32,012 నువ్వు ఎప్పుడైనా తనకి ద్రోహం చేసావా? 622 00:58:36,183 --> 00:58:37,726 లేదు. అస్సలు లేదు. 623 00:58:50,531 --> 00:58:52,366 మీ టాయిలెట్ వాడుకోవచ్చా? 624 00:58:52,449 --> 00:58:53,575 తప్పకుండా. 625 01:02:03,557 --> 01:02:05,559 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్