1 00:00:29,780 --> 00:00:30,781 టాన్యా? 2 00:00:32,448 --> 00:00:33,450 టాన్యా? 3 00:04:58,632 --> 00:04:59,716 కామ్రేడ్ కల్నల్. 4 00:05:01,593 --> 00:05:03,929 నిన్న మధ్యాహ్నం ఎగ్జిట్ గేట్ దగ్గర దీన్ని వాడారు. 5 00:05:04,429 --> 00:05:06,431 - ఆమె ఒంటరిగా వెళ్లిందా? - చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. 6 00:05:06,515 --> 00:05:09,226 ఈ ఫార్మ్ మీద బారానోవ్ కి చెందిన ఆమోద స్టాంప్ ఉంది, 7 00:05:09,309 --> 00:05:10,561 కానీ ఆయన అది తన పని కాదు అంటున్నాడు. 8 00:05:10,644 --> 00:05:11,645 లేదు, అతను చెప్పేది నిజమే. 9 00:05:11,728 --> 00:05:14,147 ఈ ఫార్మ్ అసలైందే, కానీ దీని మీద సంతకం నకిలీది. 10 00:05:14,648 --> 00:05:16,441 అమెరికన్లు వాళ్ళకి సాయం చేస్తున్నట్టు ఉన్నారు. 11 00:05:16,525 --> 00:05:17,901 అలాగే మనలోనే ఫార్మ్ ని దొంగిలించడానికి 12 00:05:17,985 --> 00:05:20,946 అవసరమైన యాక్సెస్ ఉన్న వారు కూడా సాయం చేసి ఉండొచ్చు. 13 00:05:21,029 --> 00:05:22,614 సెక్యూరిటీ విభాగంలోనా? 14 00:05:23,532 --> 00:05:27,286 అవును. ముందు మనం మీరనోవని కనిపెట్టాలి, అప్పుడే ఆమెకు ఎవరు సాయం చేసారో తెలుస్తుంది. 15 00:05:27,786 --> 00:05:28,787 నువ్వు ఎక్కడికి వెళ్ళావు? 16 00:05:29,413 --> 00:05:31,081 క్షమించండి, కామ్రేడ్ కల్నల్. 17 00:05:31,164 --> 00:05:33,750 - ఏం జరిగింది? - వాళ్ళు వెళ్లిపోయారు. కలిసి పారిపోయారు. 18 00:05:33,834 --> 00:05:36,170 కచ్చితంగా వాడి భార్య కూడా ఇందులో భాగస్వామే. 19 00:05:38,005 --> 00:05:40,799 నువ్వు వాళ్ళ మాటలు విన్నావు. దేశం వదిలి వెళ్లిపోవడం గురించి ఏమైనా మాట్లాడుకున్నారా? 20 00:05:41,383 --> 00:05:42,384 లేదు. 21 00:05:43,010 --> 00:05:44,511 నాకైతే ఇందులో ఆమె చెయ్ ఉంది అనిపించడం లేదు. 22 00:05:45,095 --> 00:05:47,139 వాళ్ళ సంసారంలో ఇప్పటికే చాలా ఆటుపోట్లు ఉన్నాయి మీకు తెలుసు కదా. 23 00:05:47,222 --> 00:05:49,057 పైగా వారి మధ్య ప్రేమ తగ్గిపోయింది. 24 00:05:49,892 --> 00:05:54,229 అంటే, నా అనుభవంలో, చిన్న సమస్యలు జనాన్ని వేరు చేస్తే, పెద్దవి వారిని ఏకం చేస్తాయి. 25 00:05:56,857 --> 00:05:59,693 అతని భార్య మీరోనవ్ నుండి దూరంగా కాకుండా అతనితో కలిసి వెళ్లిపోయిందని ఎలా చెప్పగలం? 26 00:05:59,776 --> 00:06:01,904 ఎందుకంటే అతని భార్య ట్రైనింగ్ సెంటర్ లో 27 00:06:02,863 --> 00:06:06,158 మీరోనవ్ ని పిలుచుకురమ్మని గార్డుని బలవంతం చేసినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. 28 00:06:06,241 --> 00:06:09,453 అది జరిగిన కాసేపటికే వాళ్లిద్దరూ స్టార్ సిటీ నుండి మాయమైపోయారు. 29 00:06:11,830 --> 00:06:13,040 ఆమె అతన్ని హెచ్చరించిందా? 30 00:06:13,123 --> 00:06:15,375 అలాగే తన భర్త ద్రోహం గురించి తెలిసి కూడా పారిపోయింది, 31 00:06:15,459 --> 00:06:17,628 కాబట్టి ఆమెను కూడా ఒక దేశ ద్రోహిగానే చూడాలి. 32 00:06:20,005 --> 00:06:21,173 కామ్రేడ్ కల్నల్. 33 00:06:21,256 --> 00:06:23,842 ఆపరేషన్స్ డైరెక్టరేట్ వారు మీకు ఏది కావాలంటే అది అందించడానికి రెడీగా ఉన్నారు. 34 00:06:24,343 --> 00:06:26,553 సాలమోవ్, వెంటనే గాలింపు ప్రదేశాన్ని విస్తరించండి. 35 00:06:27,554 --> 00:06:29,723 వాళ్ళు సరిహద్దు దాటేలోగా మనం వాళ్ళని పట్టుకోవాలి. 36 00:06:30,557 --> 00:06:32,267 అలాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ వారి నుండి 37 00:06:32,351 --> 00:06:36,313 మాస్కోలో విదేశీ ఆపరేటర్లుగా అనుమానం ఉన్న వారిపై ఉన్న ఫైల్స్ అన్నీ రప్పించండి. 38 00:06:36,396 --> 00:06:39,066 వాళ్లలో ఒకరు అమెరికన్ల తరఫున వారికి పనిచేసే హ్యాండ్లర్ అయ్యుండొచ్చు. 39 00:06:40,526 --> 00:06:41,777 అలాగే నువ్వు, 40 00:06:43,695 --> 00:06:46,240 ఆమె ఎక్కడెక్కడికి వెళ్లి ఉండొచ్చో ఒక లిస్ట్ రాసి ఇవ్వు. 41 00:06:46,323 --> 00:06:48,867 తల్లిదండ్రులు, స్నేహితులు, స్నేహితుల స్నేహితులు. 42 00:06:48,951 --> 00:06:51,495 మనం ఆమెను కనిపెడితే అతన్ని కనిపెట్టగలం. 43 00:06:51,578 --> 00:06:52,913 అలాగే, కల్నల్. 44 00:06:52,996 --> 00:06:55,249 నేను కోజ్లొవ్ ని. కామ్రేడ్ కల్నల్ కి ఫోన్ ఇవ్వు. 45 00:06:56,708 --> 00:06:58,126 అది ఇలా ఇవ్వు. 46 00:06:59,795 --> 00:07:01,839 నేను కల్నల్ రస్కోవని. చెప్పు. 47 00:07:03,048 --> 00:07:05,217 బైకోనుర్ లో ఉన్న మన వాళ్ళ నుండి 48 00:07:05,300 --> 00:07:08,053 ఆమోదం లేని లాంచ్ జరిగినట్టు సమాచారం అందింది, కామ్రేడ్ కల్నల్. 49 00:07:09,096 --> 00:07:10,806 మీరు వెంటనే గ్రౌండ్ కంట్రోల్ కి వస్తే మంచిది. 50 00:07:25,112 --> 00:07:26,613 వ్యూ భలే ఉంది కదా, ఎహ్, వాల్యుష్? 51 00:07:28,156 --> 00:07:29,157 నువ్వు ఏం మాట్లాడటం లేదు. 52 00:07:31,743 --> 00:07:32,870 ఏం జరుగుతోంది? 53 00:07:34,872 --> 00:07:36,331 ఏం లేదు. నేను బానే ఉన్నాను. 54 00:07:37,374 --> 00:07:40,377 చాల్లే. నీ మోహంలో బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 55 00:07:40,460 --> 00:07:43,088 సరే, అలాగంటే మరి నాకు నీ కాళ్ళ వాసన వస్తోంది. మన ప్రదేశాలు మార్చుకుందామా? 56 00:07:48,760 --> 00:07:50,429 మనం ప్రేమించిన వారంతా, 57 00:07:51,930 --> 00:07:53,056 మనకు తెలిసిన వారందరూ, 58 00:07:54,183 --> 00:07:56,059 అక్కడే ఉన్నారు. 59 00:07:56,810 --> 00:07:59,771 నీ మాటలు విను. పుష్కిన్ లాగ మాట్లాడుతున్నావు. 60 00:08:13,243 --> 00:08:14,745 నువ్వు మాతో వచ్చినందుకు సంతోషంగా ఉంది, వాల్యుష్. 61 00:08:19,708 --> 00:08:21,835 కో-పైలట్ గా నీకు మించి నాకు వేరెవ్వరూ అవసరం లేదు. 62 00:08:23,128 --> 00:08:24,296 నేను కో-పైలట్ ని అని ఎవరు చెప్పారు? 63 00:08:36,225 --> 00:08:37,976 స్టార్ సిటీ నుండి వెనేర 7కి, 64 00:08:38,059 --> 00:08:39,061 చెప్పేది వినిపిస్తోందా? 65 00:08:40,020 --> 00:08:41,647 వినిపిస్తోంది, స్టార్ సిటీ. 66 00:08:43,023 --> 00:08:44,399 మాతృభూమి ఆకర్షణ నుండి విడుదల 67 00:08:44,483 --> 00:08:48,111 పొందిన నా ఈగల్స్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? 68 00:08:48,612 --> 00:08:50,697 "నిజం ఏంటంటే మేము స్వేచ్ఛ కలిగిన పక్షులం. 69 00:08:50,781 --> 00:08:53,033 ఇక సమయమైంది, కామ్రేడ్, సమయమైంది." 70 00:08:54,117 --> 00:08:56,078 ఈ ఫీలింగ్ ఎప్పటికీ ఉండిపోతే ఎంత బాగుంటుందో. 71 00:08:56,995 --> 00:08:57,996 చీఫ్, 72 00:08:58,872 --> 00:09:02,543 వాల్యకి ఉన్నట్టుండి కవిత్వం ఎక్కువైపోతోంది. 73 00:09:02,626 --> 00:09:04,294 పాపం కామ్రేడ్ చడ్డాకి మాత్రం 74 00:09:04,378 --> 00:09:07,005 ఎప్పటిలాగే మొదటిసారి వచ్చిన వాళ్లకు పట్టే జబ్బు పట్టుకుంది. 75 00:09:07,089 --> 00:09:08,549 ఉదయం నుండి ఆమెకు ఆరోగ్యం బాలేదు. 76 00:09:09,299 --> 00:09:10,509 నేను బానే ఉంటా. 77 00:09:12,219 --> 00:09:13,887 ఇంకొన్ని రోజులు గడిస్తే అప్పుడు బాగుంటావు. 78 00:09:14,847 --> 00:09:16,181 ఊరడింపుగా ఉంటుందంటే ఒక మాట, 79 00:09:17,349 --> 00:09:20,018 నువ్వు మొదటి మిషన్ లో వాల్య కంటే బాగానే తట్టుకుంటున్నావు. 80 00:09:21,103 --> 00:09:24,064 నువ్వు అత్యధికంగా వాంతులు చేసుకుని రికార్డు సృష్టించావు కదా? 81 00:09:24,147 --> 00:09:27,651 సున్నా గ్రావిటీ ట్రైనింగ్ ఫ్లైట్స్ లో అలా చేసింది నువ్వు. 82 00:09:28,819 --> 00:09:31,655 కామ్రేడ్ చడ్డా, నీకు బలహీనంగా అనిపించినందుకు చింతిస్తున్నాను. 83 00:09:31,738 --> 00:09:33,866 జోక్ చేస్తున్నారా? ఇలాంటి అవకాశం కోసం నేను ఏమైనా చేస్తాను. 84 00:09:33,949 --> 00:09:37,286 నువ్వు అక్కడ కొన్ని నెలలు గడిపిన తర్వాత ఇవే మాటలు నీకు గుర్తుచేస్తా. 85 00:09:37,828 --> 00:09:39,621 ఇక పని మొదలెట్టాలి. సెర్గీ. 86 00:09:39,705 --> 00:09:41,748 వారు వీనస్ వైపుగానే సక్రమంగా వెళ్తున్నారు. 87 00:09:52,801 --> 00:09:55,721 మార్గం మార్చాల్సిన అవసరం లేదు. మన సిస్టమ్స్ అన్నీ… 88 00:09:55,804 --> 00:09:58,640 చీఫ్ డిజైనర్. కల్నల్ రస్కోవ ఇటువైపు వస్తోంది. 89 00:10:01,894 --> 00:10:02,936 ట్రాన్స్మిషన్ ని ఆపండి. 90 00:10:03,020 --> 00:10:05,606 ఇక ఉంటాం, వెనేర. ఓవర్. 91 00:10:11,153 --> 00:10:12,529 చీఫ్ డిజైనర్. 92 00:10:13,071 --> 00:10:14,198 కామ్రేడ్ కల్నల్. 93 00:10:14,907 --> 00:10:15,991 నువ్వు చేసిన పనేంటో వివరించు. 94 00:10:16,074 --> 00:10:18,202 నేను చేసిన పనికి నీకు వివరణ ఇవ్వాల్సిన పని లేదు. 95 00:10:18,285 --> 00:10:19,828 సరే, ఆమోదం లేకుండా మిషన్ ని 96 00:10:19,912 --> 00:10:23,123 లాంచ్ చేసావని సెంట్రల్ కమిటీకి తెలిసాక వారికే వివరణ ఇచ్చుకో. 97 00:10:23,999 --> 00:10:27,503 ఇలా చూడు, ఈ మిషన్ విజయవంతం అయ్యాక నేనే వ్యక్తిగతంగా వచ్చి నీకు చెప్పాలి అనుకున్నాను, 98 00:10:27,586 --> 00:10:31,381 కానీ ఎలాగు నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి నువ్వు చరిత్ర సృష్టించబడటం చూస్తున్నావని సగర్వంగా చెప్తున్నాను. 99 00:10:31,882 --> 00:10:33,133 వెనేర 7. 100 00:10:34,426 --> 00:10:36,512 వీనస్ కి వెళ్తున్న మొట్టమొదటి మానవ సహిత మిషన్. 101 00:10:36,595 --> 00:10:37,846 మానవ సహిత? 102 00:10:39,848 --> 00:10:41,058 ఆసక్తిగా ఉందే. 103 00:10:41,141 --> 00:10:42,976 నువ్వు ఆరు వెనేర ప్రోబ్స్ ని పంపించావు, 104 00:10:43,060 --> 00:10:46,522 అవి అన్నీ కూడా ల్యాండ్ అయిన కొన్ని క్షణాల్లోనే వీనస్ వాతావరణంలో కరిగిపోయాయి. 105 00:10:46,605 --> 00:10:48,774 అలాంటిది ఇప్పుడు మనుషులను పంపుతున్నావా? ఇది సూసైడ్ మిషన్. 106 00:10:48,857 --> 00:10:50,734 వాళ్ళు ల్యాండ్ అవ్వరు. 107 00:10:50,817 --> 00:10:53,487 అలాగే నేను చంద్రుడి మీద ల్యాండ్ చేద్దాం 108 00:10:53,570 --> 00:10:55,405 అన్నప్పుడు సెంట్రల్ కమిటీ వారందరూ భయపడ్డారు 109 00:10:55,489 --> 00:10:57,157 క్రుశ్చెవ్ ఒక్కడు ఆసక్తి చూపించేవరకు. 110 00:10:58,158 --> 00:11:00,452 - నేను అప్పుడు అనుకున్నది సాధించాను కదా? - అది అప్పుడు. 111 00:11:01,036 --> 00:11:03,914 ఇప్పుడు మిలటరీ వారికి చంద్రుడి మీద బేస్ పెట్టాలని ఉంది, 112 00:11:03,997 --> 00:11:05,832 తొమ్మిది నెలల ప్రయాణం చేసి ప్రాణాంతక ఉచ్చు దగ్గరకి వెళ్లాలని కాదు. 113 00:11:05,916 --> 00:11:07,960 చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు సోవియెట్ యూనియన్ ప్రతిష్ఠ ఎంత పెరిగిందో ఆలోచించు. 114 00:11:08,043 --> 00:11:09,837 ఇప్పుడు అంతకంటే ఎక్కువ పేరు వస్తుంది. 115 00:11:16,552 --> 00:11:17,761 బృందంలో ఎవరెవరు ఉన్నారు? 116 00:11:17,845 --> 00:11:19,847 కాస్మోనాట్స్ సాష పోలివనోవ్, 117 00:11:19,930 --> 00:11:21,390 లక్ష్మీ చడ్డా, 118 00:11:22,015 --> 00:11:23,225 అలాగే వాల్య మీరోనవ్. 119 00:11:24,393 --> 00:11:26,395 - వాల్య మీరోనవ్. - అవును. 120 00:11:31,233 --> 00:11:33,068 బయటకు వెళ్ళండి! అందరూ వెళ్ళండి! 121 00:11:34,528 --> 00:11:36,029 - అందరూ వెంటనే వెళ్ళండి! - ఒక్క నిమిషం ఆగు. 122 00:11:36,113 --> 00:11:37,865 - వాళ్ళు తమ స్థానాల నుండి వెళ్లకూడదు! - సరే! 123 00:11:38,365 --> 00:11:40,075 మీరిద్దరూ ఇక్కడ ఉండండి. 124 00:11:40,158 --> 00:11:42,536 ఈ మిషన్ అత్యంత పెద్ద ప్రభుత్వ రహస్యం అనే విషయం మర్చిపోకండి! 125 00:11:42,619 --> 00:11:45,038 - నువ్వు ఏం చేస్తున్నా అనుకుంటున్నావు? - దీని గురించి ఎవరు మాట్లాడినా 126 00:11:45,122 --> 00:11:47,791 - అరెస్ట్ చేయబడతారు. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. - మీ పోస్టుల నుండి వెళ్ళకండి. ఎవరూ కూడా. 127 00:11:47,875 --> 00:11:50,544 బిల్డింగ్ ని సీల్ చేయండి. నేను ఆమోదించకుండా ఎవరూ వెళ్ళడానికి వీలు లేదు. 128 00:11:50,627 --> 00:11:53,255 - మనిద్దరం వెంటనే మాట్లాడుకోవాలి. - ఇది పిచ్చితనం. 129 00:12:00,721 --> 00:12:02,806 నేను నమ్మను. అది అసాధ్యం. వాల్య అలాంటోడు కాదు. 130 00:12:02,890 --> 00:12:05,350 అతనికి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను ఎవరూ కాదనలేరు. 131 00:12:05,434 --> 00:12:07,644 - వాడొక ద్రోహి. - అంటే యాన లాగేనా? 132 00:12:07,728 --> 00:12:09,354 ఆహ్, మళ్ళీ అదే విషయం ఎత్తొద్దు. 133 00:12:09,438 --> 00:12:12,691 యాన అఖ్మటోవ సరైన అధికారం ఉన్న ప్రతినిధి ముందు తప్పును ఒప్పుకు… 134 00:12:12,774 --> 00:12:15,444 చాల్లే. తనచేత బలవంతంగా ఒప్పించారని అందరికీ తెలుసు. 135 00:12:15,527 --> 00:12:18,155 నన్ను ఎదురు ప్రశ్నించే హక్కు నీకు లేదు! 136 00:12:18,238 --> 00:12:20,073 నువ్వు క్రెమ్లిన్ నుండి వచ్చిన డైరెక్ట్ ఆర్డర్ ని లెక్క చేయలేదు, 137 00:12:20,157 --> 00:12:21,742 లక్షల రూబుల్స్ వృధా చేసావు, 138 00:12:21,825 --> 00:12:23,785 నెలలుగా నాకు అబద్ధం చెప్పావు, 139 00:12:23,869 --> 00:12:26,997 నీది కానిది, సోవియెట్ ప్రజలకు చెందిన స్పేస్ క్రాఫ్ట్ ని శత్రువు చేతుల్లో 140 00:12:27,080 --> 00:12:30,876 పడటానికి అవకాశం కల్పించావు, పొగరుబోతు మనిషి! 141 00:12:30,959 --> 00:12:33,545 సెంట్రల్ కమిటీ వారు సోవియెట్ యూనియన్ కీర్తి కోసం 142 00:12:33,629 --> 00:12:36,798 ఈ బృందం సాధించబోయే గొప్ప విషయాల గురించి విన్నప్పుడు… 143 00:12:36,882 --> 00:12:41,512 ఏంటి? శత్రువుకు పనిచేస్తున్న గూఢచారి పాల్గొన్న 144 00:12:41,595 --> 00:12:45,682 నీ గొప్ప మిషన్ గురించి బ్రెజ్నవ్ విన్నప్పుడు లెక్కచేస్తాడని నిజంగా అనుకుంటున్నావా? 145 00:12:45,766 --> 00:12:48,352 వాల్య మిరోనవ్ నాకంటే పెద్ద గూఢచారి ఏమీ కాదు. 146 00:12:54,399 --> 00:12:56,902 నీ ఈగల్స్ లో ఒకరు, పావెల్ ఫెటిసోవ్, 147 00:12:56,985 --> 00:13:01,073 దెబ్బలతో, బంధించబడి బిల్డింగ్ 18 బేస్మెంట్ లో దాచబడి కనిపించాడు. 148 00:13:03,367 --> 00:13:04,701 ఇంకా నమ్మవా? 149 00:14:23,906 --> 00:14:25,824 పోలివనోవ్ అపార్ట్మెంట్ కి చెందిన రికార్డింగ్. 150 00:14:26,325 --> 00:14:27,701 నేను తేదీని రాసాను. 151 00:14:55,771 --> 00:14:56,980 కామ్రేడ్ రస్కోవ. 152 00:14:58,357 --> 00:15:00,317 చెప్పకుండా వచ్చినందుకు క్షమించాలి. 153 00:15:01,401 --> 00:15:02,402 దయచేసి కూర్చో. 154 00:15:02,486 --> 00:15:05,572 అడవిలోని మా ఈ చిన్న ఊరుకు రావడానికి కారణం ఏంటి? 155 00:15:05,656 --> 00:15:08,367 అంటే, చెప్తానులే, విన్నాక నువ్వు కూడా సంతోషిస్తావు. 156 00:15:10,327 --> 00:15:11,703 మీరోనవ్ కోసం జరుగుతున్న గాలింపు విషయంలో 157 00:15:11,787 --> 00:15:13,914 ఎలాంటి పురోగతి లేకపోవడంతో రెండవ డైరెక్టరేట్ కాస్త ఆందోళన చెందుతోంది. 158 00:15:17,376 --> 00:15:20,504 మేము అతన్ని కనిపెట్టడానికి మా వనరులు అన్నీ కేటాయించాము. 159 00:15:20,587 --> 00:15:23,549 మీ వనరులు సరిపోవు. 160 00:15:23,632 --> 00:15:24,675 ఇప్పటివరకు బానే మేనేజ్ చేసాం. 161 00:15:24,758 --> 00:15:26,969 ఇకపై గాలింపు బాధ్యత రెండవ డైరెక్టరేట్ తీసుకుంటోంది. 162 00:15:27,052 --> 00:15:28,595 అది అవసరం లేదు. 163 00:15:29,721 --> 00:15:31,598 ఏది అవసరమో, ఏది కాదో చెప్పే అధికారం నీకు లేదు. 164 00:15:32,349 --> 00:15:34,893 అతను ఎక్కడ ఉండొచ్చు లేదా విదేశీ ఆపరేటర్లపై 165 00:15:34,977 --> 00:15:36,937 ప్రస్తుతానికి ఏమైనా ఆధారాలు దొరికాయా? 166 00:15:37,479 --> 00:15:38,981 లేదు, ఇంకా లేదు. 167 00:15:40,691 --> 00:15:43,193 నా మనుషులు క్రింద ఉన్నారు. 168 00:15:45,487 --> 00:15:48,574 వాళ్లకు నీకు తెలిసిన విషయాలు అన్నీ తెలియాలి. దయచేసి వాళ్లకి సాయం చెయ్. 169 00:15:48,657 --> 00:15:49,867 ఇది నేను హ్యాండిల్ చేయగలను. 170 00:15:51,118 --> 00:15:52,619 అవును, కానీ ఇంతవరకు ఏం చేయలేదు. 171 00:16:00,836 --> 00:16:02,296 మరి వంట ఎవరు వండుతారు? 172 00:16:03,672 --> 00:16:05,549 నువ్వు ఇది మాట్లాడటానికే వచ్చావా? 173 00:16:05,632 --> 00:16:06,633 కాదు. 174 00:16:06,717 --> 00:16:09,094 - ఒక్క నిమిషం, కామ్రేడ్. - నేను అతన్ని ఒక మహిళతో చూశా. 175 00:16:09,678 --> 00:16:10,679 ఎవరు? 176 00:16:11,221 --> 00:16:12,264 వాల్య. 177 00:16:12,806 --> 00:16:15,267 ఒక్క నిమిషం, కామ్రేడ్. కామ్రేడ్? 178 00:16:19,396 --> 00:16:20,480 నువ్వు నాకు తెలుసు. 179 00:16:24,026 --> 00:16:26,153 మనిద్దరం రుబ్లియోవ్కలో పెరిగాం. 180 00:16:27,321 --> 00:16:31,200 నువ్వు నా కజిన్ తో కలిసి లోమోనోసోవ్ లో చదివావు, జినైడా పెట్రోవ్స్కాయ. 181 00:16:32,743 --> 00:16:33,744 నువ్వు రడ్యూష కదా? 182 00:16:35,329 --> 00:16:37,956 క్షమించు, నేను ఇంత చనువుగా మాట్లాడి ఉండకూడదు. కానీ… 183 00:16:38,457 --> 00:16:40,459 ఆమె అస్తమాను నీ గురించే మాట్లాడేది. 184 00:16:41,126 --> 00:16:42,503 ఈ అరణ్యంలో మన ప్రాంతం 185 00:16:42,586 --> 00:16:44,505 నుండి వచ్చిన వాడిని నేనొక్కడినే కాకపోవడం చాలా బాగుంది. 186 00:16:45,047 --> 00:16:47,424 అవును. అవును, నిజమే. 187 00:16:48,800 --> 00:16:50,636 అలాగే నేను నిన్ను తప్పకుండా మళ్ళీ కలుస్తా. 188 00:16:50,719 --> 00:16:54,014 నేను, నా టీమ్ వాల్య మీరోనవ్ ని, అతని భార్యని వెతకడానికి సాయం చేస్తున్నాం. 189 00:16:55,224 --> 00:16:57,309 అది… అది అద్భుతమైన విషయం. 190 00:16:57,809 --> 00:16:59,102 మేము వాళ్ళని కచ్చితంగా కనిపెడతాం, చింతించకు. 191 00:16:59,186 --> 00:17:02,606 ఏదైతేనేం, నీ అద్భుతమైన పనిని కొనసాగించు. 192 00:18:28,984 --> 00:18:32,529 ఆలస్యమైనందుకు క్షమించు. నిన్ను ఎవరూ వెంబడించడం లేదని నిర్ధారించుకోవాలి కదా. 193 00:18:34,031 --> 00:18:35,449 నిన్ను ఎలా సంప్రదించాలో తను చెప్పాడు. 194 00:18:35,532 --> 00:18:37,201 ఎందుకు? అతన్ని అరెస్ట్ చేసారా? 195 00:18:37,701 --> 00:18:38,827 నాకు తెలిసి అలా జరగలేదు. 196 00:18:41,538 --> 00:18:42,539 తను ఏమన్నాడు అంటే… 197 00:18:43,707 --> 00:18:46,585 నిన్ను నమ్మొచ్చు అని. నువ్వు నాకు సాయం చేయగలవు అని. 198 00:18:47,085 --> 00:18:48,086 నన్ను దేశం దాటించు. 199 00:18:52,049 --> 00:18:53,425 నాతో రా. 200 00:18:53,926 --> 00:18:55,135 నడకకు వెళదాం. 201 00:18:55,886 --> 00:18:57,513 ఇద్దరు స్నేహితుల్లా కలిసి వెళదాం. 202 00:19:42,432 --> 00:19:44,768 నన్ను వెళ్లనివ్వండి. నన్ను వెళ్లనివ్వండి! 203 00:19:44,852 --> 00:19:46,019 శాంతించు, కామ్రేడ్. 204 00:19:46,103 --> 00:19:48,647 లేదంటే ఏం చేస్తావు? నేను వెళ్లకుండా నువ్వు ఆపలేవు. 205 00:19:48,730 --> 00:19:51,108 - నేను వెంటనే చీఫ్ డిజైనర్ ని చూడాలి. - తప్పుకో. 206 00:19:51,191 --> 00:19:53,527 - నేను ఆయన్ని చూడాల్సిందే. నన్ను… - నేను వచ్చా. 207 00:19:55,612 --> 00:19:57,030 కామ్రేడ్ బెలికోవా. 208 00:19:57,906 --> 00:19:58,949 నేను వస్తున్నాను. 209 00:20:06,915 --> 00:20:08,750 రా. నాతో రా. 210 00:20:23,807 --> 00:20:25,684 సాష ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పండి. 211 00:20:26,393 --> 00:20:30,439 అలాగే తను సైబీరియాలో ఏదో ట్రైనింగ్ మిషన్ లో ఉన్నాడని మాత్రం చెప్పొద్దు. 212 00:20:30,522 --> 00:20:31,732 నన్ను క్షమించు, అనస్టాసియా. 213 00:20:31,815 --> 00:20:34,276 ఆ విషయం గురించి మాట్లాడొద్దు అని మాకు ఆర్డర్లు అందాయి. 214 00:20:35,444 --> 00:20:37,029 నేనేమీ సెక్యూరిటీ రిస్క్ ని కాదు. 215 00:20:38,572 --> 00:20:39,573 నేను అతని భార్యని. 216 00:20:40,908 --> 00:20:42,075 అతన్ని ఎక్కడికి పంపించారు? 217 00:20:45,412 --> 00:20:47,080 అతను వీనస్ కి వెళ్తున్నాడు. 218 00:20:57,382 --> 00:20:58,884 అసలు అది సాధ్యమేనా? 219 00:20:58,967 --> 00:21:00,677 ఇప్పుడు సాధ్యమే, అవును. 220 00:21:05,349 --> 00:21:06,517 మరి వాళ్ళు సురక్షితంగా ఉన్నారా? 221 00:21:08,435 --> 00:21:09,478 వాళ్ళు… 222 00:21:10,938 --> 00:21:12,814 ప్రస్తుతానికి అందరూ క్షేమంగానే ఉన్నారు. 223 00:21:12,898 --> 00:21:13,899 వాళ్ళు… 224 00:21:15,317 --> 00:21:16,318 అక్కడ ఒక… 225 00:21:17,694 --> 00:21:18,695 ఒక సమస్య వచ్చింది. 226 00:21:19,780 --> 00:21:21,573 కానీ క్రాఫ్ట్ కి ఎలాంటి సమస్య లేదు అనుకో. 227 00:21:21,657 --> 00:21:25,285 - ఏ విధమైన సమస్య? - నేను ఇంతకంటే ఎక్కువ నీకు చెప్పలేను. 228 00:21:25,953 --> 00:21:27,871 తను వెళ్తున్నాడు అని మీరు నాకు చెప్పి ఉండాల్సింది. 229 00:21:29,248 --> 00:21:31,416 మీరు నన్ను కూడా తనతో పంపి ఉండాల్సింది. 230 00:21:32,167 --> 00:21:33,418 బహుశా నువ్వు చెప్పేది నిజమేనేమో. 231 00:21:33,502 --> 00:21:35,504 నన్ను క్షమించు, అనస్టాసియా. నేను… 232 00:21:36,380 --> 00:21:40,092 నేను అతన్ని వెనక్కి రప్పించడానికి నాకు వీలైంది చేస్తాను, ఒట్టు. 233 00:22:00,279 --> 00:22:02,823 నాలుగు టీమ్స్ సిటీని విభజించుకుని వెతకాలి. 234 00:22:02,906 --> 00:22:04,157 నదికి పశ్చిమాన, 235 00:22:04,658 --> 00:22:05,951 నదికి తూర్పున, 236 00:22:06,451 --> 00:22:07,786 ఇక్కడి నుండి ఉత్తరానికి, 237 00:22:07,870 --> 00:22:09,496 అలాగే ఇక్కడి నుండి దక్షిణానికి. 238 00:22:10,789 --> 00:22:13,709 అలాగే విదేశీ ఆపరేటివ్ల ఫైల్స్ ని చూసుకోవడం మర్చిపోకండి. 239 00:22:14,209 --> 00:22:16,128 ఇందులో మనకు పనికొచ్చే లీడ్స్ కొన్ని ఉన్నాయి. 240 00:22:17,171 --> 00:22:19,756 ఫీల్డ్ లో వాడటానికి ముందు కొత్త ట్రాన్స్మిటర్లను మేము టెస్ట్ చేస్తాం. 241 00:22:19,840 --> 00:22:23,510 డైరెక్టరేట్ టీలోని వాళ్ళు మనకు ఇంతకు ముందు పంపిన చెత్తతో పోల్చితే 242 00:22:23,594 --> 00:22:25,554 వీటి రేంజ్ బాగా పెరిగిందన్నారు, కాబట్టి… 243 00:22:27,055 --> 00:22:28,056 ఏంటి? 244 00:22:31,393 --> 00:22:35,814 మీరనోవతో సంబంధం ఉన్నవారి లిస్టు చేయమని కల్నల్ రస్కోవ చెప్పారు. 245 00:22:49,161 --> 00:22:50,287 మంచి పని. 246 00:23:04,760 --> 00:23:06,386 నేను తను ఒక మహిళతో ఉండగా చూసా. 247 00:23:07,012 --> 00:23:08,889 అయ్యయ్యో. వాల్య అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనుకుంటున్నావా? 248 00:23:10,182 --> 00:23:13,018 వాళ్ళు దగ్గరగా ఉన్నట్టు అనిపించింది, వాళ్లకు మంచి పరిచయం ఉన్నట్టు. 249 00:23:13,560 --> 00:23:15,187 వాడికి ఎలాంటి అక్రమ సంబంధం లేదు, టాన్యా. 250 00:23:20,859 --> 00:23:22,319 ఆమె చూడటానికి ఎలా ఉంది? 251 00:23:22,402 --> 00:23:24,279 నిజం చెప్పాలంటే ఆమె పెద్ద అందగత్తె కూడా కాదు. 252 00:23:24,363 --> 00:23:26,532 - ఆమె రష్యన్ మనిషిలా అనిపించిందా? - అంటే ఏంటి నీ ఉద్దేశం? 253 00:23:26,615 --> 00:23:29,159 ఆమె విదేశీయురాలు అయ్యుండే అవకాశం ఉంది అనుకుంటున్నావా? 254 00:23:30,953 --> 00:23:32,287 నాకు ఏమని అనుకోవాలో తెలీడం లేదు. 255 00:23:32,788 --> 00:23:35,499 నాకు తెలిసినంత వరకు నేను తనని కాన్సెర్ట్ హాల్ లో ఒక మహిళతో చూసానంతే. 256 00:23:36,667 --> 00:23:39,169 …తనని కాన్సెర్ట్ హాల్ లో ఒక మహిళతో చూసానంతే. 257 00:23:53,183 --> 00:23:55,644 - ప్లీజ్. - మీరు వీళ్ళలో ఎవరినైనా గుర్తుపట్టగలరా? 258 00:23:55,727 --> 00:23:57,437 లేదు, నాకు ఎవరూ తెలీదు. 259 00:23:57,521 --> 00:24:00,190 - వీళ్ళను ఎక్కడైనా చూసావా? - లేదు, క్షమించండి. 260 00:24:01,316 --> 00:24:03,443 - లేదు, చూడలేదు. - ఈ మహిళల్లో ఎవరినైనా చూశారా? 261 00:24:04,361 --> 00:24:05,362 ఎవరినీ చూడలేదా? 262 00:24:07,531 --> 00:24:09,157 నేను ఒకరి కోసం చూస్తున్నాను. 263 00:24:12,160 --> 00:24:14,121 వీళ్ళలో ఎవరినైనా ఇక్కడ చూశారా? 264 00:24:24,339 --> 00:24:26,842 - ఈమెను గుర్తుపట్టగలవా? - అవును. నేను ఈమెని చూశా. 265 00:24:26,925 --> 00:24:32,764 ఆమె నెలకి బహుశా మూడు, నాలుగు పెర్ఫార్మన్స్ లు చూడటానికి వస్తుందేమో. 266 00:24:32,848 --> 00:24:34,474 ఆమెను చూస్తే సింఫొనీని ఇష్టపడే మనిషిలా కనిపించదు. 267 00:24:34,558 --> 00:24:36,059 తరచుగా మొదటి ఇంటర్వెల్ సమయానికే వెళ్ళిపోతుంది. 268 00:24:39,438 --> 00:24:40,480 థాంక్స్. 269 00:25:03,879 --> 00:25:05,422 వాడు అలా చేసాడంటే నమ్మలేకపోతున్నాను… 270 00:25:06,048 --> 00:25:07,216 కానీ చేసాడు కదా. 271 00:25:09,843 --> 00:25:11,720 వాడిని బలవంతం చేసి ఉండొచ్చు. 272 00:25:11,803 --> 00:25:14,014 - వాడు దేశభక్తి ఉన్న మనిషి. - అది అనవసరం. 273 00:25:14,097 --> 00:25:16,558 దేశ ద్రోహానికి ఉరి తీస్తారని వాడికి తెలుసు. వాడికి వేరే దారి లేకపోయింది. 274 00:25:16,642 --> 00:25:17,851 వాడు ఇంకేం చేయగలడో ఎవరికి తెలుసు? 275 00:25:17,935 --> 00:25:19,770 వాడి ఉద్దేశాలు ఏంటో మనం కనిపెట్టాలి. 276 00:25:20,771 --> 00:25:22,397 ఏదైనా జరగొచ్చు. అంటే, విధ్వంసం లేక… 277 00:25:22,481 --> 00:25:25,859 నువ్వు క్రితం సారి కుట్ర జరుగుతోందని భయపడినప్పుడు ఒక నిర్దోషి చనిపోయాడు. 278 00:25:25,943 --> 00:25:29,404 వాల్య మీరోనవ్ పెట్టిన పరికరం కారణంగా. 279 00:25:30,781 --> 00:25:33,992 వాళ్ళు మరొక గ్రహానికి వెళ్ళడానికి తొమ్మిది నెలల ప్రయాణం మొదలెట్టారు. 280 00:25:34,076 --> 00:25:35,536 మనం ఏం చేయగలం? 281 00:25:36,286 --> 00:25:39,665 - వాడిని ఇతరుల నుండి వేరు చేయాలి. - వేరు చేసిన తర్వాత? 282 00:25:39,748 --> 00:25:41,875 మనం వాడిని ఎక్కువ కాలం లాకప్ లో ఉంచలేం. 283 00:25:42,876 --> 00:25:45,879 ఇద్దరు పైలెట్లను పంపడానికి ఒక కారణం ఉంది. ఈ మిషన్ సక్సెస్ దాని మీదే ఆధారపడి ఉంది… 284 00:25:45,963 --> 00:25:48,006 ఇక్కడ మిషన్ కి మించిన ప్రమాదం ఉంది. 285 00:25:48,090 --> 00:25:51,510 వాల్య మీరోనవ్ మన దేశానికే ప్రమాదకరం. 286 00:25:52,135 --> 00:25:54,847 వాడిని బలవంతంగా ఒక మాడ్యూల్ లోనికి 287 00:25:55,764 --> 00:25:59,017 తొయ్యమని మనం ఇతరులను ఒప్పించాలి. 288 00:25:59,560 --> 00:26:02,354 వాళ్ళు అలా అస్సలు చేయరు. సాష వాడి బెస్ట్ ఫ్రెండ్. 289 00:26:03,480 --> 00:26:06,275 మరి వారి సహకారం లేకుండా వాడిని వేరు చేయడానికి దారి ఏమైనా ఉందా? 290 00:26:10,529 --> 00:26:12,489 మనం వాడిని యుటిలిటీ మాడ్యూల్ లోనికి పంపొచ్చు, 291 00:26:12,573 --> 00:26:15,868 తర్వాత గ్రౌండ్ కంట్రోల్ నుండి బ్రేకర్లను ట్రిప్ చేసి 292 00:26:15,951 --> 00:26:17,744 బలవంతంగా దాని తలుపులు లాక్ చేయొచ్చు. 293 00:26:17,828 --> 00:26:19,371 కానీ అందుకు కూడా మనకు 294 00:26:19,454 --> 00:26:22,958 ముందుగానే ఎలెక్ట్రికల్ రీలేని "ఆటోమేటిక్" స్థితికి మార్చడానికి ఒకరు కావాలి. 295 00:26:23,041 --> 00:26:25,127 సరే. అయితే అలా చేయమని ఆర్డర్ పంపించు. 296 00:26:27,462 --> 00:26:30,507 వాడు మన సూచనలు వింటాడు. మనం ఏం చేస్తున్నామో వాడికి తెలుస్తుంది, వాడు… 297 00:26:31,133 --> 00:26:32,676 మిగతావారికి తెలీకపోయినా వాడికి తెలుస్తుంది. 298 00:26:35,470 --> 00:26:37,181 వాడికి ఆ క్రాఫ్ట్ గురించి చాలా బాగా తెలుసు. 299 00:26:39,433 --> 00:26:42,811 సూచనలు వాడికి తెలియని భాషలో పంపితే వాడికి తెలిసే అవకాశం ఉండదు. 300 00:26:51,278 --> 00:26:54,406 - తను… - ఇది షాక్ అని తెలుసు, కామ్రేడ్ చడ్డా. 301 00:26:54,489 --> 00:26:55,657 కానీ ఇది నువ్వు గర్వించాల్సిన విషయం. 302 00:26:56,742 --> 00:26:57,784 గర్వమా? 303 00:26:57,868 --> 00:27:02,789 అంటే, నీ భార్య మీ దేశ చరిత్రలోనే అత్యంత ఫేమస్ శాస్త్రవేత్త అవుతుంది. 304 00:27:02,873 --> 00:27:04,499 మరొక గ్రహానికి వెళ్లిన మొదటి మనిషి అవుతుంది. 305 00:27:05,334 --> 00:27:07,002 ఆమెను మీరు బలవంతంగా పంపారా? 306 00:27:07,085 --> 00:27:08,212 అలా ఏం లేదు. లేదు. 307 00:27:08,295 --> 00:27:11,089 నేను ఆమెకు అవకాశం కల్పించాను, తనే ముందుకు వచ్చింది. 308 00:27:11,965 --> 00:27:17,262 ఆమె చేసే పని స్పేస్ ప్రయాణంలో ఒక విప్లవంగా మారుతుందని ప్రపంచానికి నిరూపించడానికి ఇదొక అవకాశం. 309 00:27:21,266 --> 00:27:22,851 అంటే తను నాకు అబద్ధం చెప్పింది అన్నమాట. 310 00:27:22,935 --> 00:27:26,522 తను… ఇది దురదృష్టకరమే. 311 00:27:26,605 --> 00:27:29,483 అవును, సెక్యూరిటీ కారణాల వల్ల తప్పలేదు. 312 00:27:29,566 --> 00:27:33,153 ఇప్పుడిక మిషన్ ని లాంచ్ చేసాం కాబట్టి నీకు ఈ రహస్యాన్ని తెలుపుతున్నాం. 313 00:27:33,237 --> 00:27:36,448 కానీ నువ్వు ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వకూడదు. 314 00:27:41,286 --> 00:27:42,454 తను ఎప్పుడు వెనక్కి వస్తుంది? 315 00:27:42,538 --> 00:27:45,165 ఇంకొక తొమ్మిది నెలల్లో. ట్రైనింగ్ కి పట్టినంత సమయమే. 316 00:27:45,249 --> 00:27:48,961 అంత కష్టమైన పరిస్థితుల మధ్య అంత కాలం ఉండటం కష్టమే అని మాకు తెలుసు. 317 00:27:49,044 --> 00:27:52,673 కాబట్టి, నేరుగా వారితో మాట్లాడగల అవకాశం ఉన్నప్పుడే 318 00:27:52,756 --> 00:27:56,218 మేము నీ భార్యతో మాట్లాడటానికి నీకు అవకాశం కల్పించాలి అనుకుంటున్నాం. 319 00:27:56,301 --> 00:27:58,303 అవును. అవును, నిజమే. 320 00:27:58,387 --> 00:28:02,641 అలాగే ఇంత సుదీర్ఘమైన మిషన్ లో ఆమెకు నీ సహకారం ఉందని తెలిస్తే 321 00:28:02,724 --> 00:28:04,726 ఆత్మవిశ్వాసం బలపడుతుంది. 322 00:28:12,526 --> 00:28:13,527 సరే, నేను… 323 00:28:15,028 --> 00:28:16,238 నేను తనతో మాట్లాడతాను. ఇది… 324 00:28:18,031 --> 00:28:21,743 - జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంది. - నీకు చాలా థాంక్స్. 325 00:31:08,410 --> 00:31:09,411 క్షమించండి. 326 00:31:44,112 --> 00:31:46,698 పీహెచ్ 6.8 వద్ద ఉంది. 327 00:31:46,782 --> 00:31:49,826 ఆక్సిజన్ లీటర్ కి ఏడు మిల్లీగ్రాములు ఉంది, 328 00:31:49,910 --> 00:31:54,873 ఆక్సిజన్ సైకిల్ రేట్ 99.97% ఉంది. 329 00:31:54,957 --> 00:31:57,459 మంచిది. చాలా మంచిది. అద్భుతం. 330 00:31:57,543 --> 00:32:00,045 సరే, వాల్య, ఇప్పుడు 331 00:32:00,128 --> 00:32:04,675 కంట్రోల్ మాడ్యూల్ లో మొత్తం కార్బన్ డయాక్సైడ్ రీడింగ్ ఎంత ఉందో చెప్తావా? 332 00:32:04,758 --> 00:32:06,176 చూస్తున్నాను, స్టార్ సిటీ. 333 00:32:06,260 --> 00:32:09,179 మూడు మిల్లీమీటర్ల హెచ్.జి. సరైన స్థాయుల్లోనే ఉంది. 334 00:32:09,263 --> 00:32:12,641 మంచిది. ఇంతటితో బయోస్ సిస్టమ్ చెక్ పూర్తి అయింది. 335 00:32:12,724 --> 00:32:15,602 తరువాతి సిస్టమ్స్ చెక్ చేసే వరకు స్టాండ్ బైలో ఉన్నాం. 336 00:32:15,686 --> 00:32:17,437 కాసేపట్లో అది చేద్దాం. 337 00:32:17,521 --> 00:32:21,859 అదలా ఉండగా, కామ్రేడ్ చడ్డా హ్యాండిల్ చేయాల్సిన ఒక వ్యక్తిగతమైన వ్యవహారం ఉంది. 338 00:32:21,942 --> 00:32:25,946 సాష, వాల్య, కావాలనుకుంటే కాసేపు మీలో మీరు మాట్లాడుకోవచ్చు. 339 00:32:26,029 --> 00:32:28,240 - ఓహ్, భలే. - నాకు నీతో మాట్లాడే మూడ్ లేదు. 340 00:32:30,075 --> 00:32:32,703 చీఫ్ డిజైనర్, మీరు మాట్లాడాలి అన్న విషయం ఏంటి? ఓవర్. 341 00:32:33,203 --> 00:32:36,415 మంచి వార్త, కామ్రేడ్ చడ్డా. ఇది మీ భర్త గురించి. 342 00:32:37,040 --> 00:32:40,919 ఇప్పుడిక వెనేర లాంచ్ చేయబడింది కాబట్టి 343 00:32:41,003 --> 00:32:44,423 మేము అతనికి మిషన్ గురించి చెప్పాము. 344 00:32:44,506 --> 00:32:47,467 మీరు మన్ప్రీత్ కి చెప్పాము అంటున్నారా? 345 00:32:47,551 --> 00:32:49,511 అవును, అవును, అంతే. 346 00:32:52,472 --> 00:32:53,473 అతను వచ్చాడు కూడా. 347 00:32:53,557 --> 00:32:56,351 నేను… నేను కాసేపట్లో అతన్ని నీతో మాట్లాడనిస్తా. 348 00:32:57,519 --> 00:32:59,188 ఆగండి, ఏంటి? 349 00:32:59,271 --> 00:33:00,606 అనస్టాసియా కూడా వచ్చిందా? 350 00:33:00,689 --> 00:33:01,940 దురదృష్టవశాత్తు, లేదు. 351 00:33:02,024 --> 00:33:07,196 ప్రస్తుతానికి కామ్రేడ్ చడ్డా భర్తకి మాత్రమే చెప్పడం జరిగింది. 352 00:33:07,279 --> 00:33:09,531 హలో. నువ్వు ఆమెతో మాట్లాడొచ్చు. ఆమె నీ మాటలు వినగలదు. 353 00:33:10,741 --> 00:33:11,825 అది పూర్తి అబద్ధం. 354 00:33:13,035 --> 00:33:15,120 ఈమెని గారాబం చేస్తూ స్టాసియా ఇంకా టాన్యాకు చెప్పకుండా వదిలేసారు. 355 00:33:15,204 --> 00:33:16,205 హలో. 356 00:33:16,288 --> 00:33:18,123 లక్ష్మీ? ఉన్నావా? 357 00:33:18,207 --> 00:33:19,208 మను? 358 00:33:20,834 --> 00:33:22,377 అంతా బానే ఉందా? 359 00:33:22,461 --> 00:33:23,504 అవును. 360 00:33:23,587 --> 00:33:24,755 అంతా బానే ఉంది. 361 00:33:26,006 --> 00:33:27,424 వీళ్ళు ఇప్పుడే… 362 00:33:28,050 --> 00:33:29,384 ఆఖరికి నాకు చెప్పారు. 363 00:33:29,968 --> 00:33:32,930 నీకు చెప్పాలని నాకు చాలా అనిపించింది, 364 00:33:33,013 --> 00:33:36,892 కానీ లాంచ్ సురక్షితంగా జరగాలంటే చెప్పకూడదని చెప్పారు. 365 00:33:38,310 --> 00:33:40,270 అలాగే వీళ్ళకి నా అవసరం ఉంది అన్నారు. 366 00:33:40,354 --> 00:33:41,730 సరేలే. 367 00:33:41,813 --> 00:33:44,274 నువ్వు ఈ అవకాశం కోసం చాలా కష్టపడి పనిచేసావు. 368 00:33:45,526 --> 00:33:47,736 మిగతావారు నిన్ను బానే చూసుకుంటున్నారా? 369 00:33:48,362 --> 00:33:51,114 వీళ్ళు చాలా మంచి రూమ్ మేట్స్. 370 00:33:52,115 --> 00:33:56,787 వీళ్ళు నీకు చెప్పారో లేదో, కానీ నాకు అంతరిక్షానికి చేరాక కాస్త ఒంట్లో బాలేదు. 371 00:33:56,870 --> 00:33:59,706 చింతించకు. నేను బానే ఉన్నాను. 372 00:34:00,624 --> 00:34:02,960 క్షమించు. మధ్యలో ఆపినందుకు ఏం అనుకోకు, 373 00:34:03,043 --> 00:34:06,088 కాకపోతే మేము రన్ చేసిన సిస్టమ్ చెక్ కి సంబంధించి ఒక చిన్న పని చేయాలి. 374 00:34:06,171 --> 00:34:10,425 ఆమెకు బయోస్ మాడ్యూల్ లోని ఎలెక్ట్రికల్ రీలేని రీసెట్ చేయమని చెప్తావా? 375 00:34:10,509 --> 00:34:12,469 ఓహ్, వద్దు, వద్దు. ఆమె… పర్లేదు. ఆమెకు ఏం చేయాలో తెలుసు. 376 00:34:12,553 --> 00:34:14,972 ఆమెకు అక్కడి సిస్టమ్ బాగా తెలుసు. ఆ ఒక్క మాట చెప్పు చాలు. 377 00:34:15,054 --> 00:34:17,391 ప్లీజ్. నేను ఆమె పని చేస్తుండగా ప్యానెల్ మీద దృష్టి పెట్టాలి… 378 00:34:17,474 --> 00:34:19,643 - సరే. చెప్పు. - మను? 379 00:34:19,726 --> 00:34:21,728 మను, అక్కడే ఉన్నావా? 380 00:34:21,812 --> 00:34:22,813 ఉన్నా, ఉన్నా. 381 00:34:22,896 --> 00:34:24,188 ఇక్కడే ఉన్నాను, సారీ. 382 00:34:24,940 --> 00:34:25,940 అదేంటంటే… 383 00:34:26,525 --> 00:34:28,318 చీఫ్ డిజైనర్ నిన్ను 384 00:34:28,402 --> 00:34:31,029 ఎలెక్ట్రికల్ రీలే బయోస్ ని రీసెట్ చేయమంటున్నారు. 385 00:34:41,164 --> 00:34:42,165 ఓహ్, అవునా? 386 00:34:43,041 --> 00:34:44,960 మను, మొగ్గతొడుగుతున్న ఇంజనీర్. 387 00:34:47,379 --> 00:34:48,755 సరే. 388 00:35:00,184 --> 00:35:01,185 సరే. 389 00:35:02,728 --> 00:35:03,812 పని పూర్తి అయింది. 390 00:35:06,106 --> 00:35:07,274 మరి… 391 00:35:07,357 --> 00:35:08,942 భూమి మీద అంతా ఎలా ఉంది? 392 00:35:10,569 --> 00:35:11,570 ఒంటరిగా అనిపిస్తోంది. 393 00:35:12,487 --> 00:35:14,907 కనీసం నీకు తోడుగా అక్కడ ఈగలైనా ఉన్నాయి. 394 00:35:14,990 --> 00:35:16,950 - ఇక ముగించండి. - సరే. 395 00:35:18,911 --> 00:35:22,581 లక్ష్మీ, చీఫ్ డిజైనర్ కి తన సీట్ కావాలి అనుకుంట. 396 00:35:22,664 --> 00:35:24,124 నేను ఇక వెళ్ళాలి. 397 00:35:25,083 --> 00:35:26,585 ఐ లవ్ యు, లక్ష్మీ. 398 00:35:26,668 --> 00:35:28,253 ఐ లవ్ యు టూ, మను. 399 00:35:30,214 --> 00:35:32,299 - చాలా థాంక్స్. - అర్థం చేసుకున్నందుకు చాలా థాంక్స్. 400 00:35:32,382 --> 00:35:34,051 లేదు, మీకే థాంక్స్. థాంక్స్. నువ్వు చాలా సాయం చేసావు. 401 00:35:34,134 --> 00:35:35,636 - సరే. - మిమ్మల్ని కలవడం సంతోషం. 402 00:35:35,719 --> 00:35:38,889 సరే, అలాగే ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకండి. సరేనా? 403 00:35:38,972 --> 00:35:40,641 సరే, తప్పకుండా. 404 00:35:40,724 --> 00:35:41,725 మంచిది. 405 00:35:45,020 --> 00:35:47,981 నేను చెప్పేవరకు అతన్ని హౌస్ అరెస్ట్ లో ఉంచండి. 406 00:36:00,077 --> 00:36:02,329 మీరోనవ్ తో యుటిలిటీ మాడ్యూల్ కి వెళ్ళమని చెప్పు. 407 00:36:07,584 --> 00:36:09,378 సరే, వెనేర. 408 00:36:10,212 --> 00:36:13,131 మేము వెళ్ళడానికి ముందు చివరిగా ఒక్క పని. 409 00:36:13,215 --> 00:36:16,176 సిస్టమ్ పవర్ చెక్. 410 00:36:17,594 --> 00:36:18,762 నేను చేస్తాను. 411 00:36:19,304 --> 00:36:21,098 వద్దు. వాల్యని వెళ్లనివ్వు. 412 00:36:21,181 --> 00:36:22,891 చివరిగా జాయిన్ అయింది వాడే. 413 00:36:22,975 --> 00:36:25,060 ఏం చేయాలో వాడికి చెప్పాలి. 414 00:36:25,143 --> 00:36:26,979 - ఆయనకి నువ్వే ఫేవరెట్. - నేను హ్యాండిల్ చేస్తాలే. 415 00:36:27,062 --> 00:36:32,651 మంచిది. సరే, ఏం చేయాలో నీకు తెలుసు. యుటిలిటీ మాడ్యూల్ నుండి మొదలెట్టాలి. 416 00:36:55,340 --> 00:37:00,304 స్టార్ సిటీ, వెనేర. యుటిలిటీ మాడ్యూల్ ప్యానెల్ బోర్డు దగ్గర నిలబడ్డాను. 417 00:37:01,054 --> 00:37:04,641 ప్రైమ్ మాడ్యులర్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ స్టేటస్ ఏంటి? 418 00:37:06,143 --> 00:37:10,772 స్టార్ సిటీ, వెనేర. ప్రైమ్ మాడ్యులర్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ అభ్యర్థన వినిపించింది. 419 00:37:10,856 --> 00:37:11,857 ఒక్క క్షణం ఇవ్వు. 420 00:37:17,362 --> 00:37:19,198 ఏం జరుగుతోంది? సాష… 421 00:37:24,745 --> 00:37:27,331 హేయ్, ఇక్కడ ఒత్తిడి తగ్గిపోతోంది. ఏం జరుగుతోంది? 422 00:37:27,414 --> 00:37:29,458 కంగారు పడకు. మేము నిన్ను బయటకి రప్పిస్తాం. 423 00:37:31,418 --> 00:37:32,544 వాల్వ్ ఇరుక్కుపోయింది. 424 00:37:35,380 --> 00:37:37,216 ఈక్యూ వాల్వ్ ని మాన్యువల్ గా రీసెట్ చేయడానికి ట్రై చెయ్. 425 00:37:38,050 --> 00:37:40,427 నేను మన వైపు నుండి హాచ్ ని తెరవగలమేమో చూస్తా. 426 00:37:46,016 --> 00:37:49,770 ఓహ్, ఛ. ఓవర్ రైడ్ ఇంకా పని చేయడం లేదు. 427 00:37:52,689 --> 00:37:55,651 - వాల్య. కలిసి చేద్దాం. - సరే, సరే. 428 00:37:56,318 --> 00:37:58,820 ఒకటి, రెండు, మూడు. 429 00:38:04,409 --> 00:38:07,663 ఇద్దరూ వెంటనే హాచ్ నుండి వెనక్కి వెళ్ళండి. 430 00:38:08,914 --> 00:38:10,874 నేను కల్నల్ రస్కోవని మాట్లాడుతున్నాను. 431 00:38:11,583 --> 00:38:13,252 - ఏం జరుగుతోంది? - వాల్య మీరోనవ్, 432 00:38:13,335 --> 00:38:15,212 నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్పేవరకు నిన్ను 433 00:38:15,295 --> 00:38:17,756 యుటిలిటీ మాడ్యూల్ లో లాక్ చేస్తున్నాం. 434 00:38:17,840 --> 00:38:19,675 మైక్ చీఫ్ డిజైనర్ కి ఇవ్వండి. 435 00:38:20,259 --> 00:38:21,677 నేను ఇక్కడే ఉన్నాను, వాల్య. 436 00:38:23,637 --> 00:38:25,597 నువ్వు కల్నల్ రస్కోవ చెప్పినట్టు చెయ్. 437 00:38:25,681 --> 00:38:28,267 నేను ఇది నమ్మలేకపోతున్నాను. మీరు ఎందుకు ఆమెను ఇలా చేయనిస్తున్నారు? 438 00:38:28,350 --> 00:38:30,519 దయచేసి ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పు. 439 00:38:30,602 --> 00:38:33,146 వాల్య మీరోనవ్ అమెరికన్లకు పని చేస్తున్నాడు. 440 00:38:33,230 --> 00:38:34,731 - అతను మనందరికీ ద్రోహం చేసాడు. - ఏంటి? 441 00:38:34,815 --> 00:38:36,608 అతను మీకు, అలాగే ఈ మిషన్ కి ప్రమాదకరం. 442 00:38:36,692 --> 00:38:37,985 నీకు పిచ్చా? 443 00:38:38,068 --> 00:38:39,820 ఈ మిషన్ ఇప్పటికే ప్రమాదంలో పడి ఉండొచ్చు. 444 00:38:39,903 --> 00:38:42,239 - నీకు పిచ్చా? - ఇది మనందరి బాధ్యత… 445 00:38:42,322 --> 00:38:43,699 - వాల్య? - ఆమె ఏం మాట్లాడుతుందో తెలీడం లేదు, 446 00:38:43,782 --> 00:38:45,742 కానీ నువ్వు వెంటనే ఆ రేడియోని ఆపేసి నన్ను ఇక్కడి నుండి విడిపించాలి. 447 00:38:45,826 --> 00:38:47,661 - లేదు. ఇది పిచ్చితనం. - …రహస్యంగా క్రాఫ్ట్ లోకి తీసుకొచ్చి ఉండొచ్చు. 448 00:38:47,744 --> 00:38:49,621 సాష, అది అబద్ధం. మొత్తం అబద్ధమే. 449 00:38:49,705 --> 00:38:51,123 నన్ను దయచేసి ఇక్కడి నుండి బయటపడేయ్. 450 00:38:51,206 --> 00:38:53,208 - అతను కాస్మోనాట్ ఫెటిసోవ్ పై దాడి చేసాడు… - నమ్మలేకపోతున్నాను. 451 00:38:53,292 --> 00:38:55,878 …ఈ మిషన్ లోని అతని స్థానాన్ని దొంగిలించడానికి. 452 00:38:55,961 --> 00:38:59,882 అతను అమెరికన్ల కోసం లూనా 17లో పరికరాల పనితీరు పాడు చేసే బగ్ ని పెట్టాడు. 453 00:38:59,965 --> 00:39:04,845 వెట్రోవ్ మరణానికి కారణం అతనే, నువ్వు కాదు, కాస్మోనాట్ పోలివనోవ్. 454 00:39:05,345 --> 00:39:08,056 తన నేరాలను కప్పిపుచ్చడానికి ఆ నేరాన్ని నీ మీదకు నెట్టాడు. 455 00:39:08,140 --> 00:39:09,641 లేదు, లేదు, లేదు. ఇది అసాధ్యం. 456 00:39:09,725 --> 00:39:12,936 వెట్రోవ్ భార్య ఇప్పుడు ఒక విధవరాలు. 457 00:39:14,188 --> 00:39:16,523 - అతని పిల్లలు తండ్రిని కోల్పోయారు… - పచ్చి అబద్ధం. 458 00:39:16,607 --> 00:39:18,734 - నోరు మూసుకో! సాష, రేడియోని ఆపు. - …కానీ మీరు లాంచ్ అయిన రోజునే… 459 00:39:18,817 --> 00:39:20,444 - కానివ్వు. చెయ్. - …మీరోనవ్ భార్య పారిపోయింది. 460 00:39:22,404 --> 00:39:27,159 వాల్య మీరోనవ్, నువ్వొక పిరికివాడివి ఇంకా ద్రోహివి, కానీ నీ ద్రోహం నేటితో ముగుస్తుంది. 461 00:39:27,242 --> 00:39:29,995 - ఓహ్, దేవుడా. ఈ చెత్త ముండ. - నువ్విక ఎలాంటి హాని తలపెట్టలేవు. 462 00:39:30,078 --> 00:39:35,083 నీలో ఏమాత్రం గౌరవం లేదా మర్యాద ఉన్నా, 463 00:39:35,167 --> 00:39:39,588 నీకు ఏమాత్రం పశ్చాత్తాపం ఉన్నా, వెంటనే నిజం ఒప్పుకో. 464 00:39:39,671 --> 00:39:42,007 అమెరికన్లు నీకు అప్పగించిన పని ఏంటి? 465 00:39:42,090 --> 00:39:46,803 ఇది పిచ్చితనం. సాష, నేను ఎలాంటి తప్పు చేయలేదు. 466 00:39:46,887 --> 00:39:48,972 - నువ్వు నన్ను నమ్మాలి. - నేను నిన్నే నమ్ముతాను. 467 00:39:49,056 --> 00:39:51,016 - సరే, అయితే నన్ను విడిపించు. - ఒక్క క్షణం ఉండు. 468 00:39:51,099 --> 00:39:53,185 - నువ్వొక బగ్గింగ్ పరికరాన్ని పెట్టావు… - నేను ఏం పెట్టలేదు. 469 00:39:53,268 --> 00:39:55,229 వెనేరలో అలాంటి దాన్ని ఎక్కడ పెట్టావు? 470 00:39:55,938 --> 00:39:57,814 నేనేం పెట్టలేదు. 471 00:39:57,898 --> 00:39:59,399 నీ భార్య కోసమైనా చెప్పు, మీరోనవ్… 472 00:39:59,483 --> 00:40:01,026 - టాన్యా గురించి మాట్లాడకు… - …మీరు శత్రువుకు… 473 00:40:01,109 --> 00:40:02,945 - …ఏం చేస్తామని చెప్పారు? - …కేజీబీకి చెందిన ముండా! 474 00:40:03,028 --> 00:40:05,322 - సాష. నన్ను విడిపించు! - వెంటనే సమాధానం చెప్పు. 475 00:40:05,405 --> 00:40:09,159 - నోరు మూసుకో! నోరు మూసుకో! - వెంటనే సమాధానం చెప్పు. 476 00:40:09,243 --> 00:40:10,994 నువ్వు కాస్త మూసుకో… 477 00:40:12,454 --> 00:40:13,789 ఏం జరుగుతోంది? నాకు ఏం వినిపించడం లేదు ఎందుకు? 478 00:40:13,872 --> 00:40:15,791 వాళ్ళు మైక్రోఫోన్లు డిజేబుల్ చేసి ఉంటారు. వాళ్ళు… 479 00:40:15,874 --> 00:40:17,668 సరే, అయితే, పరిస్థితిని చక్కబెట్టు. 480 00:40:17,751 --> 00:40:18,919 - సరిచేయ్. - సరే. 481 00:41:47,799 --> 00:41:48,842 ఇది నీ జుట్టు కోసం. 482 00:41:49,718 --> 00:41:51,803 క్షమించు, ఈ రంగు ఒక్కటే ఉంది. 483 00:41:54,681 --> 00:41:56,808 నీకొక మంచి వార్త ఉంది. 484 00:41:57,309 --> 00:41:59,394 నిన్ను బయటకు తీసుకెళ్లడానికి నాకు అప్రూవల్ వచ్చింది. 485 00:42:00,062 --> 00:42:01,063 ఎప్పుడు? 486 00:42:01,146 --> 00:42:04,024 - కొన్ని రోజులు పడుతుంది. - కొన్ని రోజులా? 487 00:42:04,107 --> 00:42:08,362 ఓర్పుగా ఉండు. నీకోసం వెతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు. 488 00:42:14,910 --> 00:42:18,288 నువ్వు అతన్ని గమనిస్తున్నావా? అక్కడ ఉన్న మనిషిని? 489 00:42:21,250 --> 00:42:23,544 నువ్వు జీవితం నాశనం చేయబోయే తరువాతి మనిషి అతనేనా? 490 00:42:26,296 --> 00:42:28,799 మీ ఇద్దరి జీవితాల్లో జరిగింది దురదృష్టకరమే, 491 00:42:28,882 --> 00:42:31,093 అది కాదు అనడానికి లేదు. 492 00:42:36,557 --> 00:42:38,016 నువ్వు వాల్యని ఎంత కాలంగా గమనిస్తున్నావు? 493 00:42:38,100 --> 00:42:41,645 నిజానికి జరిగింది అది కాదు. నేను గమనించింది నిన్నే. 494 00:42:42,563 --> 00:42:45,232 ఏంటి… ఏం మాట్లాడుతున్నావు? 495 00:42:46,650 --> 00:42:50,737 మీ గ్రూప్, జేట, నాకు అప్పగించిన మొదటి పని. 496 00:42:54,575 --> 00:42:57,953 నువ్వు… నువ్వు మమ్మల్ని గమనించావా? 497 00:42:58,453 --> 00:43:01,164 మొదట్లో మా దృష్టి నీ లవర్ ఆండ్రెయి మీద ఉండేది. 498 00:43:02,791 --> 00:43:03,834 ఆండ్రెయి? 499 00:43:04,334 --> 00:43:07,629 అతను చేసిన మ్యూజిక్ స్మగ్లింగ్ కార్యకలాపాల కారణంగా ఎన్నో ఏళ్లుగా అతన్ని ట్రాక్ చేస్తున్నాం. 500 00:43:08,255 --> 00:43:12,301 మాకు వీలైనప్పుడు అతనికి సాయం చేసేవాళ్ళం, అలా అతను నెమ్మదిగా ట్రెటియాక్, బ్రోడ్స్కిలను తీసుకొచ్చాడు. 501 00:43:13,135 --> 00:43:14,261 తర్వాత నిన్ను కూడా. 502 00:43:15,304 --> 00:43:17,472 ఆ బృందం వల్ల మేము ఆశించినంత ప్రభావం పడలేదు. 503 00:43:17,556 --> 00:43:21,351 నువ్వు వాల్యని కలిసేనాటికి వాషింగ్టన్ లోని మా అధికారులు ఈ ప్రాజెక్టును రద్దు చేయడానికి రెడీగా ఉన్నారు. 504 00:43:22,060 --> 00:43:24,771 స్టార్ సిటీకి వెళ్తున్న యువ ఆఫీసర్ 505 00:43:24,855 --> 00:43:27,399 మాకు నిజంగా పనికొచ్చే రహస్యాలకు అతనికి యాక్సెస్ ఉంటుంది కదా. 506 00:43:28,859 --> 00:43:30,819 అతను నిన్ను ప్రేమించడం మా అదృష్టం అంతే. 507 00:43:32,571 --> 00:43:36,617 లేదా బహుశా నేనే మన్మథుడిలా మీ ప్రేమ చిగురించడానికి సాయం చేసానేమో. 508 00:43:56,470 --> 00:44:00,974 అతను… తన దేశాన్ని ప్రేమించాడు. అతను ఒక మంచి మనిషి. 509 00:44:04,102 --> 00:44:05,562 అలాంటిది నువ్వు అతన్ని నాశనం చేసావు. 510 00:44:06,522 --> 00:44:09,483 లేదు, టాన్యా. నువ్వే నాశనం చేసావు. 511 00:44:11,318 --> 00:44:12,861 తను కొత్తగా పెళ్లాడిన అమ్మాయిని 512 00:44:12,945 --> 00:44:15,781 ప్రభుత్వ వ్యతిరేకిగా చిత్రీకరిస్తాం అని మేము వాల్యకి చెప్పాం. 513 00:44:16,532 --> 00:44:20,285 మాకు సాయం చేయకపోతే నిన్ను గూలాగ్ కి పంపడమో లేదా ఇంకా దారుణం జరగొచ్చు అని. 514 00:44:21,078 --> 00:44:24,081 వాల్య తన దేశానికి ద్రోహం చేస్తున్నానని చెప్పకపోవడానికి కారణం 515 00:44:24,164 --> 00:44:27,084 అతను నిన్ను కాపాడటానికే ఆ పని చేసాడు. 516 00:44:38,554 --> 00:44:41,223 నేను మైక్రోఫోన్లు ఆపేసాను. మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. 517 00:44:42,266 --> 00:44:43,892 నేను వాళ్ళు చెప్పేది ఏదీ నమ్మను, నువ్వు? 518 00:44:45,227 --> 00:44:46,979 లేదు, కానీ నేను నీకు ఒక విషయం చెప్పాలి. 519 00:44:47,062 --> 00:44:50,107 అతన్ని వాళ్లు అక్కడ లాక్ చేయడానికి నేనే వాళ్ళకి సాయం చేసినట్టు ఉన్నా. 520 00:44:50,607 --> 00:44:51,608 ఏంటి? 521 00:44:51,692 --> 00:44:55,195 మనుతో వాళ్ళు నాకు చెప్పి చేయించిన పని వల్లే వాల్వ్ మూసుకుపోయింది అనుకుంటున్నా. 522 00:44:57,990 --> 00:44:59,950 - నన్ను క్షమించు. నేను పిచ్చి పని చేశాను. - లేదు, లేదు, లేదు, లేదు. 523 00:45:00,033 --> 00:45:01,702 నీకు తెలిసే అవకాశమే లేదు కదా? 524 00:45:04,746 --> 00:45:05,956 వాళ్ళు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. 525 00:45:08,250 --> 00:45:09,918 వాళ్ళు జనాన్ని ఒకరికొకరికి వ్యతిరేకంగా తిప్పుతారు. 526 00:45:12,546 --> 00:45:15,799 మనం ఇలాంటప్పుడే కలిసి ఉండాలి. అందరం. 527 00:45:16,508 --> 00:45:17,551 అర్థమైందా? 528 00:45:22,181 --> 00:45:23,765 ఏమైంది? 529 00:45:25,934 --> 00:45:30,397 చీఫ్ డిజైనర్, అతను పావెల్ గురించి రస్కోవ… చెప్పేది వినమన్నారు. కానీ… 530 00:45:30,480 --> 00:45:32,482 లేదు. లేదు, లేదు, లేదు. లేదు, లేదు. వాల్య ఎవరినీ గాయపరిచే మనిషి కాదు. వాడు… 531 00:45:32,566 --> 00:45:33,567 సాష… 532 00:45:35,235 --> 00:45:37,738 పావెల్ ని అరెస్ట్ చేసారని మనకు ఎలా తెలుసు? 533 00:45:39,740 --> 00:45:41,825 వాల్యనే వచ్చి మనకు చెప్పాడు కదా. 534 00:45:49,583 --> 00:45:51,460 వాడితో మాట్లాడటానికి ఒక నిమిషం ఇవ్వు. 535 00:46:11,605 --> 00:46:12,648 వాల్యుష్. 536 00:46:16,902 --> 00:46:18,612 ఈ పని నువ్వు చేసి ఉండవని నాకు తెలుసు. 537 00:46:22,699 --> 00:46:23,784 నాకు తెలుసు. 538 00:46:26,745 --> 00:46:28,121 నేను అనుకుంటున్నది నిజమే అని చెప్పు. 539 00:46:33,126 --> 00:46:34,461 గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళు మన మాటలు వినలేరు. 540 00:46:34,545 --> 00:46:36,964 మేము మైక్రోఫోన్ ఫ్యుజ్ తీసేసాం. దయచేసి… 541 00:46:42,261 --> 00:46:43,512 నేను అనుకునేది నిజమే అని చెప్పు. 542 00:46:44,054 --> 00:46:45,597 నన్ను క్షమించు, సాష. 543 00:46:56,024 --> 00:46:57,234 లేదు, లేదు. 544 00:47:00,779 --> 00:47:02,281 అంత పని ఎలా చేయగలిగావు? 545 00:47:03,031 --> 00:47:07,452 నన్ను క్షమించు. నీకు అర్థం కాదు. నాకు వేరే దారి కనిపించలేదు. 546 00:47:07,536 --> 00:47:08,954 నీకు వేరే దారి ఉంది! 547 00:47:09,037 --> 00:47:10,664 వాళ్ళు టాన్యాని బాధపెడతాం అన్నారు. 548 00:47:12,416 --> 00:47:14,334 వాల్య, నీకు వేరే దారి ఉంది! 549 00:47:15,002 --> 00:47:16,170 నన్ను క్షమించు, సాష. 550 00:49:13,537 --> 00:49:15,998 టాన్యా? టాన్యా? 551 00:49:25,215 --> 00:49:26,633 టాన్యా, నేను ఇరీనాని. 552 00:49:50,616 --> 00:49:51,825 టాన్యా, వద్దు! 553 00:49:53,452 --> 00:49:55,746 - నన్ను వదులు. - టాన్యా! టాన్యా, వద్దు! 554 00:49:55,829 --> 00:49:57,289 - ఆగు. - నన్ను వదులు. 555 00:49:57,998 --> 00:50:00,417 - దయచేసి నా మాట విను. - లేదు, నువ్వు వాళ్లలో ఒకదానివి. 556 00:50:35,202 --> 00:50:37,287 ఎందుకు మనకు ఏం వినిపించడం లేదు? 557 00:50:38,372 --> 00:50:40,707 - ఏం జరుగుతోంది? - సరే, ఒక్క నిమిషం. 558 00:50:41,792 --> 00:50:44,795 వాళ్ళు మాన్యువల్ గా మైక్రోఫోన్లను డిజేబుల్ చేశారు, కామ్రేడ్ కల్నల్. 559 00:50:44,878 --> 00:50:47,089 అది ఓవర్ రైడ్ చేయడానికి టైమ్ పడుతుంది. 560 00:50:48,090 --> 00:50:52,052 - సరిచేయండి. - సెక్షన్ 14-6. 561 00:50:55,055 --> 00:50:57,182 వాళ్ళు మాడ్యూల్ నుండి మీరోనవ్ తప్పించుకోవడానికి సాయం చేస్తున్నారా? 562 00:50:57,266 --> 00:51:00,352 లేదు, లేదు, లేదు. దాని ఒత్తిడి ఇంకా తగ్గలేదు. వాడు ఇంకా అందులోనే ఉన్నాడు. 563 00:51:04,898 --> 00:51:05,899 సరే. 564 00:51:07,234 --> 00:51:09,403 ఇక సహించేది లేదు. ఇది ఇంతటితో ముగియాలి. 565 00:51:10,571 --> 00:51:11,613 అంటే ఏంటి నీ ఉద్దేశం? 566 00:51:11,697 --> 00:51:14,032 యుటిలిటీ మాడ్యూల్ లోని గాలి తీసేయండి. 567 00:51:19,037 --> 00:51:20,873 - క్షమించాలి, నేనేమైనా గోడతో మాట్లాడుతున్నానా? - లుడ్మీలా, వద్దు. 568 00:51:20,956 --> 00:51:23,083 - చేయండి. ఇది ఆర్డర్. - నా ఇంజనీర్లు తలారిలు కారు. 569 00:51:23,166 --> 00:51:25,210 - నేను ఒప్పుకోను! - వాళ్ళు ఇప్పుడు నీ ఇంజనీర్లు కారు! 570 00:51:25,294 --> 00:51:28,589 నేను ఆఖరిగా ఇంకొక్కసారి చెప్తాను. 571 00:51:28,672 --> 00:51:33,177 వెంటనే మీరోనవ్ మాడ్యూల్ లోని గాలి తీసేయండి. 572 00:51:33,260 --> 00:51:35,429 లేదంటే మీ అందరినీ జైలుకి పంపుతాను. 573 00:51:47,232 --> 00:51:48,901 ఏంటది? 574 00:51:52,988 --> 00:51:54,489 - సాష, నన్ను ఇక్కడి నుండి బయటకు రప్పించు. - ఏం జరుగుతోంది? 575 00:51:54,573 --> 00:51:56,617 నన్ను ఇక్కడి నుండి బయటకు రప్పించు, సాష. సాష, నన్ను కాపాడు, ప్లీజ్. 576 00:51:56,700 --> 00:51:58,577 వాళ్ళు ఈ క్యాబిన్ లోని గాలి తీసేయబోతున్నారు. 577 00:51:58,660 --> 00:52:00,162 సాష, వెంటనే నన్ను విడిపించు. 578 00:52:00,245 --> 00:52:01,455 ఇలా జరగకూడదు. 579 00:52:03,040 --> 00:52:04,166 ఛ. 580 00:52:05,042 --> 00:52:08,420 వాల్వ్ వేడెక్కిపోతోంది. మనం ఈ హాచ్ ని వెంటనే తెరవాలి. 581 00:52:21,892 --> 00:52:25,771 సాష, ఇది చూడు. వాళ్ళు హాచ్ ని తెరవడానికి ఒక దారి చెప్తున్నారు. 582 00:52:25,854 --> 00:52:26,855 ఏంటి? 583 00:52:38,367 --> 00:52:40,285 వెనేర, చెప్పింది చేయండి. వెంటనే. 584 00:52:51,713 --> 00:52:52,714 లేదు. 585 00:52:55,926 --> 00:52:57,427 చీఫ్ డిజైనర్ ని అరెస్ట్ చేయండి. 586 00:52:58,262 --> 00:53:00,264 - ఆయన్ని అరెస్ట్ చేయండి. వెంటనే. - నిన్నే. కదులు. 587 00:53:03,308 --> 00:53:04,309 అక్కరలేదు. 588 00:53:25,622 --> 00:53:27,124 నువ్వొక రాక్షసివి. 589 00:54:06,496 --> 00:54:07,497 వాల్య. 590 00:54:08,957 --> 00:54:11,710 లేదు, లేదు, లేదు. లక్ష్మీ, లక్ష్మీ, త్వరపడు. వాళ్ళు వాడిని చంపేస్తున్నారు. 591 00:54:11,793 --> 00:54:13,921 నేను హాచ్ ని తెరవడానికి పవర్ కట్ చేయడానికి చూస్తున్నా. 592 00:54:17,216 --> 00:54:19,468 వాల్య. ఓర్చుకో, వాల్య. 593 00:54:20,761 --> 00:54:24,056 కల్నల్ రస్కోవ, మేము వెనేరతో తిరిగి కమ్యూనికేషన్ స్థాపించాం. 594 00:54:24,139 --> 00:54:27,643 వాల్య, ఓర్చుకో. మేము నిన్ను బయటకు తీస్తాం. లక్ష్మీ దాదాపుగా పని పూర్తి చేసింది. 595 00:54:27,726 --> 00:54:30,437 సర్క్యూట్ ఓవర్ ఛార్జ్ అయింది. మొత్తం సిస్టమ్ కాలిపోవచ్చు. 596 00:54:30,521 --> 00:54:32,272 లేదు… మనకు వేరే దారి లేదు. 597 00:54:32,856 --> 00:54:35,150 ఓర్చుకో, వాల్య. ఇంకొన్ని క్షణాలే. 598 00:54:40,447 --> 00:54:41,448 పూర్తయింది. 599 00:54:41,532 --> 00:54:43,492 పూర్తయింది. పూర్తయింది, సాష. 600 00:54:44,535 --> 00:54:45,536 సాష. 601 00:54:45,619 --> 00:54:48,121 కాస్మోనాట్స్ పోలివనోవ్ మరియు చడ్డా, వెంటనే ఆగండి. 602 00:54:48,205 --> 00:54:49,248 ఇది ఆర్డర్. 603 00:54:49,331 --> 00:54:51,875 మీరు సోవియెట్ యూనియన్ శత్రువుకి సాయం చేస్తున్నారు. 604 00:54:51,959 --> 00:54:53,460 మీరు మీరోనవ్ ని కాపాడితే, 605 00:54:53,544 --> 00:54:57,798 నేను మొత్తం షిప్ నుండి గాలిని తీసేయాల్సి ఉంటుంది. 606 00:54:57,881 --> 00:54:59,258 మీకు అర్థమైందా? 607 00:55:01,885 --> 00:55:04,179 మీకు అర్థమైందా? 608 00:55:05,305 --> 00:55:07,140 పదా. పదా. 609 00:55:07,641 --> 00:55:09,309 హేయ్. హేయ్. 610 00:55:09,935 --> 00:55:12,479 మేలుకో, వాల్య, మేలుకో. 611 00:55:12,563 --> 00:55:14,606 వాల్య. వాల్య. 612 00:55:17,276 --> 00:55:19,361 మేలుకో. వాల్య, మేలుకో. 613 00:55:25,617 --> 00:55:26,869 షిప్ మొత్తం నుండి గాలిని తీసేయండి. 614 00:55:26,952 --> 00:55:29,496 వద్దు, కల్నల్. ప్లీజ్, ఇది సరైన పని కాదు. 615 00:55:29,580 --> 00:55:30,873 వాళ్ళని వెనక్కి రప్పించండి. 616 00:55:34,918 --> 00:55:36,044 నేను… 617 00:55:38,130 --> 00:55:41,842 నేను… నా వల్ల కాదు. నా వల్ల కాదు. 618 00:55:46,889 --> 00:55:48,515 నిన్నే. కదులు. 619 00:55:50,267 --> 00:55:51,393 వెంటనే. 620 00:56:01,403 --> 00:56:03,614 మేలుకో. మేలుకో. 621 00:56:03,697 --> 00:56:04,907 హేయ్. హేయ్. 622 00:56:06,241 --> 00:56:07,701 సరే. హేయ్. 623 00:56:12,039 --> 00:56:15,417 హేయ్. హేయ్. శ్వాస తీసుకో. శ్వాస తీసుకో. 624 00:56:26,762 --> 00:56:27,763 చెయ్. 625 00:56:48,158 --> 00:56:50,160 లక్ష్మీ, వీడిని తీసుకెళ్ళు. వెంటనే వీడిని తీసుకెళ్ళు. 626 00:56:50,911 --> 00:56:52,329 తనని నేను పట్టుకున్నా. తనని పట్టుకున్నా. 627 00:56:52,412 --> 00:56:54,665 వాళ్ళు మాడ్యూల్ నుండి మళ్ళీ గాలి తీసేస్తున్నారు. 628 00:57:08,846 --> 00:57:10,848 వాళ్ళు మొత్తం షిప్ నుండి గాలి తీసేస్తున్నారు. 629 00:57:12,266 --> 00:57:14,977 సాష. మనం కమాండ్ ట్రాన్సీవర్ ని కట్ చేయాలి. 630 00:57:15,060 --> 00:57:17,062 గాలి తీయడాన్ని ఆపడానికి అదొక్కటే దారి. 631 00:57:17,145 --> 00:57:18,397 సాష, త్వరపడు. 632 00:57:39,877 --> 00:57:43,130 ఇక్కడ కూడా ఒత్తిడి తగ్గుతోంది. వాళ్ళు మనల్ని చంపడానికి ట్రై చేస్తున్నారా? 633 00:57:44,298 --> 00:57:46,633 వాల్వ్స్ కి అడ్డు పెట్టు. ట్రాన్సీవర్ నాకు దొరికింది. 634 00:57:46,717 --> 00:57:48,051 నీకు ఏది కనిపిస్తే అది వాడు. 635 00:57:48,802 --> 00:57:50,387 వెంటనే ఈ ఎయిర్ వెంట్ ని ఆపాలి. 636 00:57:53,307 --> 00:57:55,434 అందరూ వినండి, మెల్లిగా శ్వాస తీసుకోండి. 637 00:57:59,771 --> 00:58:02,399 నేను ట్రాన్సీవర్ దగ్గర ఉన్నాను, కానీ గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళు మాత్రమే దీని ఆపగలరు. 638 00:58:02,482 --> 00:58:03,650 వాల్వ్స్ ని ఆపడానికి ట్రై చేస్తూనే ఉండు. 639 00:58:11,867 --> 00:58:14,578 - బ్రేక్. - వాల్య. 640 00:58:21,084 --> 00:58:22,085 చాలా చల్లగా ఉంది. 641 00:58:28,383 --> 00:58:29,384 సాష. 642 00:58:32,221 --> 00:58:33,222 సాష. 643 00:58:33,305 --> 00:58:36,475 ఇంకొక్క నిమిషం మాత్రమే. ఇంకొక్క నిమిషం మాత్రమే. దాదాపుగా దొరికింది. 644 00:58:37,351 --> 00:58:38,727 సాష, త్వరపడు. 645 00:58:47,110 --> 00:58:48,612 ఇది పని చేయడం లేదు. 646 00:58:49,363 --> 00:58:50,531 ఇది పని చేయడం లేదు. 647 00:58:51,490 --> 00:58:52,491 ఛ. 648 00:58:56,161 --> 00:58:58,163 నేను దీన్ని పూర్తిగా డిస్కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తా. 649 00:59:06,547 --> 00:59:07,631 చూసుకో! 650 01:00:47,356 --> 01:00:49,358 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్