1 00:00:12,888 --> 00:00:16,308 జనరల్ కాన్స్టాంటిన్ ఫిలోనోవ్ లుబియాంకాకి స్టేటస్ రిపోర్ట్. 2 00:00:17,059 --> 00:00:21,313 రెండవ డైరెక్టరేట్ ఆదేశాల మేరకు, స్పేస్ ప్రోగ్రామ్ ఫోకస్ 3 00:00:21,396 --> 00:00:23,524 భూమి కక్ష్యకు మాత్రమే పరిమితం చేయబడింది. 4 00:00:24,316 --> 00:00:28,987 గత వేసవిలో ముగ్గురు కాస్మోనాట్ల విషాదకరమైన మరణాల తరువాత 5 00:00:29,071 --> 00:00:33,158 స్టార్ సిటీపై ఈ పరిమితులను పెట్టడం జరిగింది. 6 00:00:35,994 --> 00:00:39,373 సైంటిఫిక్ పరిశోధన పేరుతో నూతన స్పేస్ స్టేషన్ శాల్యూట్-1 సేకరించిన 7 00:00:39,456 --> 00:00:43,627 ఇంటెలిజెన్స్ మనం ఊహించని రీతిలో దోహదపడింది. 8 00:00:48,423 --> 00:00:51,426 ఒకప్పుడు మనం ఆకాశ మార్గాన చూడలేకపోయిన 9 00:00:51,510 --> 00:00:54,847 పాశ్చాత్య మిలిటరీ బేస్ లను పూర్తిగా గమనిస్తున్నాం. 10 00:00:56,932 --> 00:01:01,019 ఖండాంతర బాంబులు, ఎయిర్ డిఫెన్సులు, అలాగే వ్యూహాత్మక అణు సామర్థ్యాలను 11 00:01:01,103 --> 00:01:05,941 గమనించగల సామర్థ్యం దేశానికి ఎంతో అమూల్యమైనదిగా నిలిచింది. 12 00:01:09,194 --> 00:01:10,654 జనరల్ సెక్రటరీ బ్రెజ్నవ్ గారి 13 00:01:10,737 --> 00:01:12,823 సహకారం అందినంత కాలం 14 00:01:12,906 --> 00:01:15,659 ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. 15 00:01:16,660 --> 00:01:21,123 అలాగే చీఫ్ డిజైనర్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణ మరియు గైడెన్స్ తో. 16 00:01:24,251 --> 00:01:26,086 ఆయన అడిగిన ఇంటెలిజెన్స్ రిపోర్టులు. 17 00:01:26,170 --> 00:01:27,546 ఆయన మీకోసం ఎదురు చూస్తున్నారు. 18 00:01:30,591 --> 00:01:33,218 శాల్యూట్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ నుండి అందిన తాజా సమాచారం. 19 00:01:33,302 --> 00:01:34,845 థాంక్స్, కామ్రేడ్ కల్నల్. 20 00:01:49,151 --> 00:01:50,194 ఇక వెళ్లొచ్చు. 21 00:02:03,624 --> 00:02:06,210 చీఫ్ డిజైనర్ రాడిమిర్ సెర్గేవిచ్ పెట్రోవ్స్కీ 22 00:04:12,211 --> 00:04:13,504 నికొలోవ్. 23 00:04:15,255 --> 00:04:17,966 సాయంత్రానికి శాల్యూట్ నుండి వెళ్లబోయే మరొక పేలోడ్ మీద 24 00:04:18,050 --> 00:04:21,011 మరొక 100 అదనపు కిలోల బరువు మీద లోడ్ అనాలిసిస్ చేసి బైకోనుర్ కి పంపించు. 25 00:04:21,094 --> 00:04:23,931 లేదు, నేను ఇప్పటికే కొత్త ఎన్-1 బూస్టర్ కి సంబంధించిన 26 00:04:24,014 --> 00:04:25,516 థ్రస్ట్ ఈక్వేషన్స్ మీద పని చేస్తున్నా. 27 00:04:27,059 --> 00:04:28,519 అయితే ఇది కూడా చేసి లేటుగా ఇంటికి వెళ్ళు. 28 00:05:09,351 --> 00:05:10,561 తెల్లారింది. 29 00:05:23,407 --> 00:05:24,700 నాన్నా, నీకు నేను సాయం చేస్తా. 30 00:05:32,416 --> 00:05:34,001 ట్రాక్టర్ బాగు చేశాను. 31 00:05:34,501 --> 00:05:36,795 ఇప్పుడిక నువ్వు పొలంలో మొలకలు నాటొచ్చు. 32 00:05:39,840 --> 00:05:42,968 ట్రాక్టర్ బాగు చేసావు కదా. నువ్వే నాట్లు కూడా వేసేయ్. 33 00:05:46,513 --> 00:05:49,183 నేను రైతుల యూనియన్ లో మాట్లాడాలి, గుర్తుందా? 34 00:05:52,644 --> 00:05:53,896 నువ్వు ఆ పని చేయకూడదు. 35 00:05:54,897 --> 00:05:56,315 నువ్వు ఇంకా బాధపడుతున్నావు. 36 00:05:57,274 --> 00:05:58,317 ఇక తిను. 37 00:06:15,751 --> 00:06:19,755 యునైటెడ్ నేషన్స్ కి వెళ్లిన అమెరికన్ రాయబారి, జార్జ్ బుష్, 38 00:06:19,838 --> 00:06:22,674 ప్రపంచపు మొట్టమొదటి స్పేస్ స్టేషన్ అయిన శాల్యూట్ పై 39 00:06:22,758 --> 00:06:25,761 ఇవాళ అవమానకరమైన మరియు తప్పుడు ఆరోపణలు చేశారు. 40 00:06:25,844 --> 00:06:27,429 రాయబారి బుష్ 41 00:06:27,513 --> 00:06:31,433 అమెరికన్ భూమిపై రికవర్ చేయబడిన సోవియెట్ ఫిల్మ్ క్యాప్స్యూల్ 42 00:06:31,517 --> 00:06:34,603 పౌర కేంద్రాన్ని శాస్త్రీయ పరిశోధనల కోసం కాకుండా 43 00:06:34,686 --> 00:06:38,565 సైనిక ఇంటెలిజెన్స్ కోసం వాడుతున్నారనడానికి రుజువు అని పేర్కొన్నారు. 44 00:06:38,649 --> 00:06:39,900 శాల్యూట్ స్టేషన్ 45 00:06:39,983 --> 00:06:42,986 - ఇలా చేస్తుందని… యుఎస్ చెబుతున్న రుజువుని… - అమ్మా, నేను రెడీ. 46 00:06:43,070 --> 00:06:47,616 …సోవియెట్ అధికారులు అలాగే ప్రపంచంలోని ఇతర సంస్థలు కొట్టిపారేశాయి. 47 00:06:48,534 --> 00:06:50,327 గుర్తుంచుకో, సాయంత్రం ఓల్గా దగ్గరకి వెళ్ళాలి. 48 00:06:50,410 --> 00:06:52,496 నాకు నా పియానో పాఠాలు నచ్చడం లేదు. 49 00:06:53,747 --> 00:06:55,499 నువ్వు ఓర్పుగా నేర్చుకోవాలి. 50 00:06:55,582 --> 00:06:57,167 నీకు ఇంకా మంచి టీచర్ ని వెతికి పెడతానులే. 51 00:06:58,961 --> 00:07:00,420 టాన్యా సంగతి ఏంటి? 52 00:07:00,504 --> 00:07:02,506 బహుశా ఆమె తిరిగి వస్తుందేమో. 53 00:07:05,008 --> 00:07:06,051 ఆమె రాదు. 54 00:07:15,602 --> 00:07:18,188 ఈ రాస్సోల్నిక్ చాలా బాగుంది. నువ్వు కొత్తగా ఏమైనా చేసావా? 55 00:07:18,856 --> 00:07:21,483 నేను ఊరబెట్టిన కీరదోసలు ఎక్కువ వేసాను. 56 00:07:21,984 --> 00:07:23,527 ఎప్పటికంటే కొంచెం ఎక్కువ. 57 00:07:23,610 --> 00:07:26,029 అదే అయ్యుంటుంది. ఫ్లేవర్ ఇంకా బాగుంది. 58 00:07:26,113 --> 00:07:27,531 క్యారెట్లు కూడా మెత్తగా ఉన్నాయి. 59 00:07:27,614 --> 00:07:30,200 అవును. అవి చిన్నవి, కాబట్టి బాగా ఉడికాయి. 60 00:07:33,579 --> 00:07:35,998 అబ్బా, ఆ కిటికీకి మళ్ళీ తేమ పడుతోంది. 61 00:07:36,081 --> 00:07:39,418 నేను ఇందాకే గ్లాస్ ని తుడిచాను, కానీ గాలి లోనికి వస్తున్నట్టు ఉంది. 62 00:07:39,501 --> 00:07:40,544 గుడ్ మార్నింగ్, ఇరీనా. 63 00:07:40,627 --> 00:07:42,838 - నువ్వు అది బాగు చేస్తాను అన్నావు. - నేను బాగు చేశా. 64 00:07:45,257 --> 00:07:46,592 రేపు మళ్ళీ ఒకసారి చూస్తాను. 65 00:07:46,675 --> 00:07:48,010 ప్రతిసారీ రేపే అంటావు. 66 00:07:51,889 --> 00:07:53,974 మాస్కో వారికి చాలా కోపంగా ఉంది. 67 00:07:54,057 --> 00:07:56,101 సోవియెట్ స్పేస్ స్టేషన్ నుండి గూఢచర్య ఫోటోలను స్వాధీనం చేసుకున్న యుఎస్ 68 00:07:56,185 --> 00:07:59,021 శాల్యూట్ ఫిల్మ్ డ్రాప్ లో జరిగిన వైఫల్యాన్ని వార్తల్లో పదే పదే చూపిస్తున్నారు. 69 00:08:00,022 --> 00:08:02,065 పైగా మనం మన సొంత నిఘా సమాచారాన్ని తిరిగి పొందకపోవడంతో పాటు 70 00:08:02,149 --> 00:08:04,860 ఇప్పుడు అమెరికన్లకు మనం ఎక్కడ దృష్టి పెడుతున్నామో కూడా తెలిసింది. 71 00:08:04,943 --> 00:08:07,321 కక్ష్య నుండి క్యాన్ లను విసరడం 72 00:08:07,404 --> 00:08:08,989 అంత మంచి విధానం అనిపించడం లేదు. 73 00:08:09,072 --> 00:08:13,452 నేను నా రిపోర్టులో అదే చెప్పాను, దీనికి ఇంజనీరింగ్ పరిష్కారం కావాలి. 74 00:08:13,535 --> 00:08:17,497 అయినా కూడా ఇంజనీరింగ్ విభాగం నేరుగా స్టేషన్ నుండి 75 00:08:17,581 --> 00:08:19,166 మనకు ఆ ఫోటోలను పంపడానికి 76 00:08:19,249 --> 00:08:21,793 - నమ్మదగిన పద్ధతిని కనిపెట్టలేకపోతోంది. - దానికి నాతో ఏంటి సంబంధం? 77 00:08:21,877 --> 00:08:24,713 నాకు తెలిసినంత వరకు, కామ్రేడ్ బూర్కోవ్ ఇంతకు ముందు నీకే రిపోర్ట్ చేసాడు. 78 00:08:26,757 --> 00:08:29,343 అలాగే, అతను నాకు ముందు ఉండిన వ్యక్తికి నమ్మకస్తుడు. 79 00:08:31,094 --> 00:08:34,306 అతను కావాలనే పరిష్కారాన్ని కనిపెట్టడం లేదు అనుకుంటున్నావా? 80 00:08:34,389 --> 00:08:37,351 అతను ఇంతకు ముందు ఉండిన వ్యక్తి ఆధ్వర్యంలో పరిస్థితి బాగుండేదని అనుకుంటున్నాడని నా నమ్మకం. 81 00:08:38,477 --> 00:08:40,854 కాబట్టి మనం అతన్ని ఒక గుణపాఠంగా చేసి చూపాలి. 82 00:08:41,563 --> 00:08:44,858 నీ ఆధ్వర్యంలో జరిగిన నష్టం తర్వాత తిరిగి స్టార్ సిటీని లైన్ లోకి 83 00:08:44,942 --> 00:08:46,944 తీసుకొచ్చే బాధ్యత జనరల్ సెక్రటరీ నాకు ఇచ్చారు. 84 00:08:47,027 --> 00:08:48,612 నా ఆధ్వర్యంలో? 85 00:08:49,196 --> 00:08:52,157 అంటే, ముందు మీరోనవ్, తర్వాత వెనేర, ఇప్పుడు ఈ విశ్వాసం లేని ఇంజనీర్లు. 86 00:08:52,241 --> 00:08:53,909 వెనేర ప్రాజెక్టును ఆపింది నేను. 87 00:08:53,992 --> 00:08:56,411 మీరోనవ్ ని తొలగించింది నేను. 88 00:08:56,495 --> 00:08:58,956 అలాగే ఇప్పుడు కామ్రేడ్ బూర్కోవ్ తో కూడా నువ్వే డీల్ చేయాలి, 89 00:08:59,039 --> 00:09:02,459 లేదంటే స్టార్ సిటీలో మరింత తీవ్రమైన మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. 90 00:09:06,922 --> 00:09:08,215 ఇంకొక విషయం. 91 00:09:08,298 --> 00:09:09,383 చెప్పు. 92 00:09:10,300 --> 00:09:12,261 ఇరీనా మోరొజోవ, ఆమె పనితనం ఎలా ఉంది? 93 00:09:14,221 --> 00:09:15,556 పర్లేదు. ఆమె పని బాగానే ఉంది. 94 00:09:15,639 --> 00:09:18,851 వాల్య మీరోనవ్ చేష్టల గురించి ముందు కనిపెట్టింది ఆమెనే కదా? 95 00:09:18,934 --> 00:09:21,186 అవును, కానీ మెప్పించాలని ఆతృతలో, 96 00:09:21,270 --> 00:09:23,063 ఆమె నన్ను సరైన సమయానికి అలెర్ట్ చేయలేదు. 97 00:09:24,106 --> 00:09:28,360 ఆమెకు సామర్థ్యం ఉంది, అలాగే ఆశయం కూడా ఉంది, కానీ ఆమెకు క్రమశిక్షణ లేదు. 98 00:09:28,443 --> 00:09:30,070 ఆమె వయసులో నేను కూడా అలాగే ఉండేవాడిని. 99 00:09:31,321 --> 00:09:32,531 ఇప్పుడు నేను ఏ స్థాయిలో ఉన్నానో చూడు. 100 00:09:33,824 --> 00:09:34,825 అవును. 101 00:09:35,492 --> 00:09:36,952 ప్రశంసనీయమే. 102 00:09:38,954 --> 00:09:43,458 ఆమె బలహీనతల మీద మాత్రమే కాకుండా ఆమె బలాలను కూడా పరిగణిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. 103 00:09:44,334 --> 00:09:47,462 అంటే, అది నా డిపార్ట్మెంట్, కాబట్టి నాకు నచ్చిన విధంగా నడిపిస్తాను. 104 00:09:48,964 --> 00:09:50,632 ఇది సలహా మాత్రమే. 105 00:09:54,553 --> 00:09:56,054 గుడ్ డే, కామ్రేడ్ కల్నల్. 106 00:10:23,040 --> 00:10:24,458 గుడ్ ఆఫ్టర్ నూన్. 107 00:10:26,168 --> 00:10:29,838 ఇవాళ మీకు ఈ సినిమాని ప్రదర్శించడానికి నేను చాలా గర్వపడుతున్నాను, 108 00:10:30,881 --> 00:10:34,134 ఒక కాస్మోనాట్ గా నా ప్రయాణంలో నేను సాధించిన విజయాన్ని 109 00:10:35,427 --> 00:10:38,055 నేను ఎక్కడి నుండి వచ్చానో ఆ చోటును హైలైట్ చేసే సినిమా ఇది. 110 00:10:38,847 --> 00:10:42,935 రోస్టోవ్స్కయ ఓబ్లాస్ట్ లోని వ్యవసాయ భూమి. 111 00:10:59,993 --> 00:11:03,163 డెప్యూటీ చైర్మన్ టారసవ్, మీరు ఇవాళ ఇక్కడికి వస్తారని నేను అనుకోలేదు. 112 00:11:03,247 --> 00:11:05,624 అంటే, దీన్ని చూడకుండా మిస్ కాలేను కదా. 113 00:11:17,010 --> 00:11:20,430 కార్మికుల కూతురు. ఈ దేశ సింబల్. 114 00:11:20,514 --> 00:11:24,893 ఈ సినిమా సోవియెట్ యూనియన్ అంతటా ప్రదర్శించబడి తర్వాత పశ్చిమ దేశాలకు కూడా వెళ్లి 115 00:11:25,602 --> 00:11:28,272 వారి పాలకులు వారికి తెలియనివ్వని 116 00:11:28,355 --> 00:11:30,357 అనస్టాసియా బెలికోవాని వాళ్లకి చూపిస్తుంది. 117 00:11:30,440 --> 00:11:34,611 …త్యాగం మరియు సమైక్య బలం తారలను చేరుకోవడానికి సాయం చేస్తాయని నిరూపించింది. 118 00:11:36,280 --> 00:11:38,490 అంతా నిన్నే జరిగినట్టు ఉంది, కదా? 119 00:11:39,700 --> 00:11:43,871 …కర్తవ్యం, దృఢత్వం మరియు ఒకే లక్ష్యంతో ఐక్యమైన 120 00:11:43,954 --> 00:11:46,290 ప్రజల శాశ్వత స్ఫూర్తికి ప్రతిరూపం. 121 00:11:47,833 --> 00:11:53,672 తన భర్తతో ఆమె పంచుకున్న లక్ష్యం అది, అలెగ్జాండర్ డిమిట్రీయేవిచ్ పోలివనోవ్. 122 00:11:55,716 --> 00:11:58,510 వారి పరస్పర అంకితభావం అవధులు లేనిది, 123 00:11:59,511 --> 00:12:02,931 అంతరిక్షానికి అలాగే తమ దేశానికి వారి కమిట్మెంట్ కూడా అలాంటిదే. 124 00:12:05,058 --> 00:12:09,021 అతని అంతిమ త్యాగాన్ని మన ప్రజలు ఎన్నటికీ మరువరు. 125 00:12:11,982 --> 00:12:12,983 ఏమండీ. 126 00:12:13,066 --> 00:12:16,111 …మన గొప్ప దేశ భవిష్యత్ కోసం, 127 00:12:16,737 --> 00:12:18,947 కలిసి చేసిన త్యాగంలో 128 00:12:19,489 --> 00:12:21,408 అలాగే ప్రపంచాన్ని వెలిగించే మన దగ్గరున్న జ్ఞానంలో… 129 00:13:40,654 --> 00:13:43,448 మనం మొదటి మనిషిని అంతరిక్షానికి పంపాము. 130 00:13:44,908 --> 00:13:47,077 మనం చంద్రుడి మీదకి వ్యోమగాములను పంపాము. 131 00:13:47,160 --> 00:13:50,289 మనం మనుషులను మరొక గ్రహానికి కూడా పంపడానికి ట్రై చేసాం. 132 00:13:51,665 --> 00:13:53,917 అది జరిగి ఉంటే ఇంకేం జరిగేదో ఎవరు చెప్పగలరు? 133 00:13:55,711 --> 00:14:00,132 కానీ ఇప్పుడు మనం క్రిందకి చూస్తున్నాం అంతే, 134 00:14:01,592 --> 00:14:06,471 మిస్సైల్ సైట్ల ఫోటోలు తీయడం కోసం భూమి మీదకు చూస్తున్నాం. 135 00:14:08,932 --> 00:14:11,351 చాలా తేడా వచ్చిందని నీకు కూడా అనిపించాలి. 136 00:14:13,854 --> 00:14:17,858 అంటే నువ్వు ఇప్పటికీ ఒకప్పటి చీఫ్ డిజైనర్ కే కట్టుబడి ఉన్నావు అన్నమాట. 137 00:14:19,735 --> 00:14:21,695 మాకు ఒక్కరే చీఫ్ డిజైనర్. 138 00:14:23,906 --> 00:14:26,366 రాడిమిర్ పెట్రోవ్స్కీ ఒక కేజీబీ గూండా, 139 00:14:26,450 --> 00:14:29,369 వాడికి ద్రవరూపంలో ఉన్న ఆక్సిజన్ కి వోడ్కాకు తేడా తెలీదు. 140 00:14:29,453 --> 00:14:31,955 ఈ సంభాషణ రికార్డు అవుతుంది అని గుర్తుంచుకో. 141 00:14:32,039 --> 00:14:34,875 నేనైతే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడతా. 142 00:14:40,756 --> 00:14:42,633 నేను చెప్పాలనుకున్నదే చెప్పాను. 143 00:14:47,888 --> 00:14:51,725 అయితే శాల్యూట్ స్పేస్ స్టేషన్ ఆధునీకరణ చేయాలనే 144 00:14:51,808 --> 00:14:57,523 చీఫ్ డిజైనర్ పెట్రోవ్స్కీ కృషికి అడ్డుపడినట్టు ఒప్పుకున్నానని సంతకం చేస్తావా? 145 00:15:04,196 --> 00:15:07,157 అలా చేస్తే వాళ్ళు మాట వింటారు అనుకుంటున్నావు, కానీ అలా జరగదు. 146 00:15:08,575 --> 00:15:13,330 నా టీమ్ ఇంకా శాల్యూట్ ఫిల్మ్ డ్రాప్ సమస్యను పరిష్కరించకపోవడానికి కారణం 147 00:15:13,413 --> 00:15:17,709 వారికి సంకల్పం లేకపోవడమో లేక అవిధేయతో కాదు. 148 00:15:22,256 --> 00:15:25,133 ఐడియాలు అప్పటికప్పుడు పుట్టవు. 149 00:15:26,593 --> 00:15:28,470 అందుకు స్ఫూర్తి కావాలి. 150 00:15:33,600 --> 00:15:37,312 అలాగే ఆ పని చేయగల వ్యక్తి ఒక్కరే ఉన్నారని నీకు కూడా తెలుసు. 151 00:15:50,409 --> 00:15:51,577 చూసింది చాలు. 152 00:15:51,660 --> 00:15:53,036 తిరిగి పని మొదలెట్టండి. 153 00:15:57,916 --> 00:15:59,751 అభినందనలు, కామ్రేడ్ స్టెపానోవ్. 154 00:15:59,835 --> 00:16:03,172 ఇక నుండి శాల్యూట్-1కి నువ్వే లీడ్ ఇంజనీర్. 155 00:16:04,089 --> 00:16:06,842 అలాగే, కామ్రేడ్ కల్నల్. 156 00:17:32,344 --> 00:17:34,346 ఆయన్ని సంప్రదించగలిగావా? 157 00:17:35,097 --> 00:17:37,224 నువ్వు అసలు అది పరిగణిస్తున్నావంటే ఆయన ఆశ్చర్యపోయాడు. 158 00:17:38,475 --> 00:17:41,395 స్టార్ సిటీలోని ఇంజనీర్ ఆయన యూనివర్సిటీలో చదువు చెప్పాలని అనుకుంటున్నాడని. 159 00:17:41,895 --> 00:17:43,772 ఇది ఆయనకి ఇస్తున్నందుకు థాంక్స్. 160 00:17:45,357 --> 00:17:47,693 పొజిషన్ పై నేను ఆసక్తిగా ఉన్నానని రాసాను. 161 00:17:51,864 --> 00:17:53,323 అలాగే, నేను ఆయనకి అందిస్తాను. 162 00:17:53,407 --> 00:17:56,034 కానీ, సెర్గీ, నాకు ఒకటి అర్థం కావడం లేదు… 163 00:17:57,786 --> 00:18:00,247 నువ్వు ఇక్కడ ఉద్యోగం వదిలేసి ప్రొఫెసర్ ఎందుకు కావాలి అనుకుంటున్నావు? 164 00:18:02,708 --> 00:18:04,126 నాకు మార్పు కావాలి. 165 00:18:05,711 --> 00:18:07,796 స్టార్ సిటీ ఒకప్పటిలా లేదు. 166 00:18:37,201 --> 00:18:38,243 చెప్తున్నాను కదా, 167 00:18:38,327 --> 00:18:41,538 ఈ పంట చేతికి వచ్చేసరికి మీకు బీట్రూట్ సూప్ తాగి విసుగు వస్తుంది. 168 00:18:43,540 --> 00:18:44,958 డార్లింగ్. 169 00:18:45,042 --> 00:18:46,043 ఏంటి? 170 00:18:47,419 --> 00:18:48,795 డార్లింగ్. 171 00:18:49,671 --> 00:18:52,174 నిన్ను కలవడానికి ఒకరు వచ్చారు. 172 00:19:09,483 --> 00:19:11,276 బాగానే సెటిల్ అయినట్టు ఉన్నావు. 173 00:19:12,986 --> 00:19:14,363 ఇక్కడి పరిసరాలు బాగున్నాయి. 174 00:19:14,988 --> 00:19:18,158 అవును, చుట్టూ ఉన్న సాయుధ గార్డుల కారణంగా పరిసరాలకు అందం వచ్చింది. 175 00:19:18,242 --> 00:19:20,327 అంటే, గూలాగ్ కి వెళ్లడం కంటే ఇది మేలే కదా. 176 00:19:25,374 --> 00:19:27,209 త్వరగా నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు, లుడ్మీలా. 177 00:19:27,292 --> 00:19:29,962 గలీన లోపల తన చాకులు పదును పెడుతూ ఉండొచ్చు. 178 00:19:31,463 --> 00:19:35,926 మన కొత్త స్పేస్ స్టేషన్, శాల్యూట్-1, కక్ష్య నుండి ప్రపంచాన్ని గమనిస్తుంది. 179 00:19:37,344 --> 00:19:40,180 టుపోలెవ్ విమానంతో సాధ్యమైన నిఘా సామర్థ్యానికంటే 180 00:19:40,264 --> 00:19:42,224 అది ఎన్నో రెట్లు ఎక్కువ. 181 00:19:42,850 --> 00:19:45,519 ఇప్పుడు వాళ్ళు నిఘా మీద దృష్టి పెట్టడం బాగుంది. 182 00:19:46,812 --> 00:19:50,148 అవును, విషయం ఏంటంటే, స్టార్ సిటీకి నిఘా ఫోటోలను పంపడానికి 183 00:19:50,232 --> 00:19:53,193 మాకు మరింత సురక్షితమైన సిస్టమ్ ఒకటి కావాలి. 184 00:19:57,573 --> 00:20:00,200 నీ ఇంజనీర్లు కావాలని పని చేయకుండా జాప్యం చేస్తున్నారు. 185 00:20:00,868 --> 00:20:02,369 అది న్యాయమే కదా. 186 00:20:11,211 --> 00:20:12,921 నేను నీకు సాయం చేయలేను, లుడ్మీలా. 187 00:20:17,092 --> 00:20:19,344 నువ్వు నా ఈగల్స్ కి తలపెట్టిన హాని తర్వాత ఇక అది నా వల్ల కాదు. 188 00:20:20,888 --> 00:20:24,308 నేను ఎప్పటిలాగే మన దేశ భద్రతకు ఏది ముఖ్యమో అది చేశాను. 189 00:20:25,100 --> 00:20:28,145 తెలుసా, నీతో కలిసి కుట్రకు పాల్పడిన వారంతా జైలులో లేకపోవడానికి కారణం 190 00:20:28,228 --> 00:20:32,024 జరిగిన రాద్ధాంతం మొత్తానికి నువ్వు ఒక్కడివే బాధ్యత వహించడానికి నేను అంగీకరించడమే. 191 00:20:32,107 --> 00:20:34,818 ఒప్పుకున్నావా? చాలా పెద్ద మాట అన్నావు. 192 00:20:38,280 --> 00:20:41,742 మీ సమస్యకు పరిష్కారం చెప్పమని మీ కొత్త చీఫ్ డిజైనర్ ని అడగొచ్చు కదా? 193 00:20:42,534 --> 00:20:43,535 పెట్రోవ్స్కీ. 194 00:20:43,619 --> 00:20:45,871 వాళ్ళు అతన్ని తన పేరు వాడుకోనిస్తున్నట్టు ఉన్నారు కదా. 195 00:20:46,705 --> 00:20:47,706 అతను… 196 00:20:50,876 --> 00:20:52,211 నీలా కాదు. 197 00:20:54,880 --> 00:20:56,131 సెంట్రల్ కమిటీకి ఆ విషయం తెలుసు. 198 00:20:56,215 --> 00:20:58,175 నువ్వు ఇంకా ప్రాణాలతో ఉండటానికి కారణం అదే అని నా అంచనా. 199 00:20:58,258 --> 00:21:03,597 నేను సమాధానాలు ఇస్తే అతను ఇంజనీర్ల ముందు తను ఐడియాలు అన్నట్టు చెప్పడానికా? 200 00:21:07,935 --> 00:21:12,481 అలా చేయకపోతే నీ ప్రశాంతమైన రిటైర్మెంట్ చాలా దారుణంగా మారుతుంది. 201 00:21:17,528 --> 00:21:19,905 నేనేం కుర్రోడిని కాదు, లుడ్మీలా. 202 00:21:23,408 --> 00:21:25,577 నా గతి ఏమవుతుందని నాకు భయం లేదు. 203 00:21:25,661 --> 00:21:28,121 అది నిజమే కావొచ్చు, కానీ పెట్రోవ్స్కీ… 204 00:21:31,208 --> 00:21:35,170 తీసుకునే చర్యలు స్టార్ సిటీకి కోలుకోలేని విధంగా నష్టం కలిగించవచ్చు. 205 00:21:53,063 --> 00:21:54,731 అయితే నన్ను ఏం చేయమంటావు? నేను, 206 00:21:57,609 --> 00:21:58,777 హౌస్ అరెస్ట్ లో ఉన్నాను, 207 00:21:58,861 --> 00:22:01,363 బయటి ప్రపంచంతో చర్చించడానికి నాకు దారి లేదు. 208 00:22:07,452 --> 00:22:10,122 స్టాలిన్ నిన్ను అకారణంగా గులాగ్ కి పంపాడు. 209 00:22:12,416 --> 00:22:17,504 నీకు తిండి లేదు, కొట్టారు, దాదాపుగా చలికి చచ్చినంత పనైంది. 210 00:22:19,756 --> 00:22:23,594 అయినా సరే నిన్ను మళ్ళీ పిలిచినప్పుడు నువ్వు సంకోచించలేదు. 211 00:22:25,304 --> 00:22:28,473 నువ్వొక దేశభక్తి ఉన్న పౌరుడివి కాబట్టి అవసరమైంది చేసావు. 212 00:22:28,557 --> 00:22:29,641 దేశభక్తి ఉన్నోడిని. 213 00:22:34,897 --> 00:22:36,190 నేనొక వెర్రోడిని. 214 00:22:36,732 --> 00:22:38,525 కావొచ్చు, కానీ పెట్రోవ్స్కీ ఆ రెండూ కాదు. 215 00:22:40,194 --> 00:22:43,071 అలాంటప్పుడు అతను ఆశించే ఫలితాలు అతనికి అందించకపోతే, 216 00:22:43,155 --> 00:22:46,033 అప్పుడు స్టార్ సిటీని ముక్కలు చేస్తాడు. 217 00:22:46,116 --> 00:22:49,453 మనం కలిసి నిర్మించింది అంతా నాశనం అవుతుంది. 218 00:22:55,167 --> 00:22:57,544 డార్లింగ్, టిఫిన్. 219 00:23:08,722 --> 00:23:12,935 వెనేర కంప్యూటర్ లో ఒక అల్గోరిథమ్ ఉంది. 220 00:23:13,018 --> 00:23:18,565 ఉపరితలం మీద ఉండే ప్రోబ్ నుండి అందే ఎక్కువ రెసొల్యూషన్ ఉన్న ఫోటోలను 221 00:23:18,649 --> 00:23:22,277 తిరిగి భూమికి పంపడానికి వీలయ్యే విధంగా డౌన్ గ్రేడ్ చేయడానికి సహకరిస్తుంది. 222 00:23:22,361 --> 00:23:25,322 మీరు అక్కడి నుండి పని మొదలెడితే మంచిది. 223 00:23:27,991 --> 00:23:31,411 శాల్యూట్ సమాచార వ్యవస్థలో కూడా ఆ కోడ్స్ ఉండి ఉండొచ్చు. 224 00:23:32,079 --> 00:23:33,205 థాంక్స్. 225 00:23:33,705 --> 00:23:35,958 ఇక నీకు నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను, లుడ్మీలా. 226 00:23:38,669 --> 00:23:40,212 ఇక నా సమయం ముగిసింది. 227 00:23:43,632 --> 00:23:46,134 ఇక బయలుదేరు. వెళ్లి ఇంకొక వెర్రోడిని పట్టుకో. 228 00:23:53,892 --> 00:23:56,061 వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారు 229 00:23:56,144 --> 00:24:00,190 డొనెట్స్ మరియు వోల్గాలో ప్రాంతాలలో పలు భాగాలు అసాధారణమైన పొడి వాతావరణ 230 00:24:00,274 --> 00:24:01,817 ప్రభావానికి గురయ్యాయి అని ధృవీకరించారు. 231 00:24:02,401 --> 00:24:05,571 వర్షపాతం ఇంకా ఋతుపవన కాలపు సాధారణ స్థాయికి 232 00:24:05,654 --> 00:24:07,364 చేరుకోలేదని వాతావరణ కేంద్రాలు నివేదిస్తున్నాయి… 233 00:24:07,447 --> 00:24:08,991 నాన్నా, ఇంటికి వచ్చాను. 234 00:24:09,074 --> 00:24:10,659 - తిన్నావా? - మాట్లాడకు. 235 00:24:10,742 --> 00:24:12,703 - వాళ్ళు కరువు గురించి మాట్లాడుతున్నారు. - …తాత్కాలిక ఇబ్బందులు. 236 00:24:12,786 --> 00:24:15,622 స్థానిక పార్టీ కమిటీలు అలాగే ఉమ్మడి పొలాల ఛైర్మెన్లు 237 00:24:15,706 --> 00:24:17,875 కఠినమైన చర్యలతో స్పందిస్తున్నారు. 238 00:24:18,667 --> 00:24:21,295 జలాశయాలు మరియు కాలువ వ్యవస్థలను 239 00:24:21,378 --> 00:24:25,048 సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చూసేందుకు, చాలా మంది నీటిపారుదల 240 00:24:26,633 --> 00:24:30,429 బృందాలను సమీకరిస్తున్నారు పొలాలకు నీరు అందించడానికి నిరంతరం… 241 00:24:30,512 --> 00:24:33,891 నాన్న, ఎవరో వచ్చారు. 242 00:24:33,974 --> 00:24:34,975 ఏంటి? 243 00:24:40,397 --> 00:24:41,732 ఇంత రాత్రిపూటా? 244 00:24:41,815 --> 00:24:45,777 …నీటి అవసరం ఎక్కడ ఎక్కువగా ఉందో అక్కడికి మళ్లించడానికి సాయపడుతుంది. 245 00:24:53,619 --> 00:24:55,871 - గుడ్ ఈవ్నింగ్. - కామ్రేడ్ టారసవ్. 246 00:24:56,371 --> 00:24:57,873 హఠాత్తుగా వచ్చినందుకు క్షమించండి. 247 00:24:58,707 --> 00:25:00,542 లేదు, ప్లీజ్, రండి. 248 00:25:00,626 --> 00:25:02,503 - థాంక్స్. - నాస్ట్య, గ్లాసులు తీసుకురా. 249 00:25:06,381 --> 00:25:07,966 - గుడ్ ఈవ్నింగ్. - గుడ్ ఈవ్నింగ్. 250 00:25:10,469 --> 00:25:13,889 ప్లీజ్, అలా ముందుకు వెళ్లి ఎడమవైపుకు తిరగండి. 251 00:25:13,972 --> 00:25:15,057 ఆహ్-హహ్. 252 00:25:17,142 --> 00:25:19,520 ప్రాథమిక ఫోర్కాస్ట్ ప్రకారం… 253 00:25:19,603 --> 00:25:21,271 - మనం కాస్త తాగొచ్చు. - …కొన్ని జిల్లాలలో, 254 00:25:21,355 --> 00:25:25,150 యూనియన్ వారి ధాన్య సేకరణ 255 00:25:25,234 --> 00:25:27,236 ప్లాన్ ఇంకా… 256 00:25:27,319 --> 00:25:28,695 మీరు ఎందుకు వచ్చినట్టు? 257 00:25:28,779 --> 00:25:33,408 అంటే, నిజానికి నేను మీ కూతురు కామ్రేడ్ బెలికోవాతో మాట్లాడటానికి వచ్చాను. 258 00:25:34,451 --> 00:25:35,452 సరే, అలాగే. 259 00:25:35,536 --> 00:25:37,704 కాకపోతే ఒక డ్రింక్ కూడా ఇవ్వండి. 260 00:25:38,830 --> 00:25:40,541 - సరే. - థాంక్స్. 261 00:25:47,798 --> 00:25:52,052 బ్రయాన్స్క్ ఓబ్లాస్ట్ లోని నా చిన్నప్పటి ఇంటిలోని జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి, 262 00:25:52,135 --> 00:25:53,554 ఆ ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే. 263 00:26:05,399 --> 00:26:06,567 థాంక్స్. 264 00:26:14,032 --> 00:26:15,742 సరే, నేను కాసేపట్లో వస్తాను. 265 00:26:24,251 --> 00:26:26,587 సోవియెట్ యూనియన్ హీరోల కోసం. 266 00:26:38,265 --> 00:26:39,474 ప్లీజ్, కూర్చో. 267 00:26:45,230 --> 00:26:50,444 నువ్వు, కామ్రేడ్ పోలివనోవ్ కొంచెం దగ్గరై ఉంటారు, 268 00:26:50,527 --> 00:26:52,112 ట్రైనింగ్ ప్రమాదం జరగడానికి ముందు. 269 00:26:55,073 --> 00:26:56,742 అందరూ అనేది నిజమేనేమో. 270 00:26:58,243 --> 00:27:00,829 మనం ఊహించని సమయంలో ప్రేమ తారసపడుతుంది. 271 00:27:10,464 --> 00:27:12,007 నన్ను క్షమించండి, కామ్రేడ్. 272 00:27:12,090 --> 00:27:15,469 కానీ మీలాంటి పెద్ద మనిషి ఒక డ్రింక్ కోసం 273 00:27:15,552 --> 00:27:17,846 ఇంత దూరం వచ్చి ఉండరని నా ఉద్దేశం. 274 00:27:18,388 --> 00:27:19,640 అవును, అవును. 275 00:27:19,723 --> 00:27:20,849 నేను ఎందుకు వచ్చానో చెప్పనా? 276 00:27:22,100 --> 00:27:25,354 సరే, నువ్వు ఇకపై ఇక్కడే ఉండటం దేశ ప్రయోజనాలకు 277 00:27:25,437 --> 00:27:26,939 మంచిది కాదు అని చెప్పొచ్చు. 278 00:27:29,149 --> 00:27:30,692 అది నీకు కూడా మంచిది కాదు అనుకో. 279 00:27:32,528 --> 00:27:35,447 నువ్వు మేము అడిగిన ప్రతీది చేసావు, కామ్రేడ్ బెలికోవా. 280 00:27:36,073 --> 00:27:38,242 ఇప్పుడు మేము కూడా నువ్వు చేసిన దానికి ప్రత్యుపకారం చేసే సమయం వచ్చింది. 281 00:27:41,495 --> 00:27:42,788 నాకు అర్థం కావడం లేదు. 282 00:27:42,871 --> 00:27:47,835 శాల్యూట్-1 స్పేస్ స్టేషన్ కి రొటేషన్ మీద వెళ్ళడానికి మాకు ఇంకొక కాస్మోనాట్ కావాలి, 283 00:27:47,918 --> 00:27:50,671 కాబట్టి ఆ మిషన్ కమాండర్ గా నిన్ను ఎంచుకున్నాం. 284 00:27:54,007 --> 00:27:55,092 మిషన్ కమాండర్ గానా? 285 00:27:57,636 --> 00:27:59,304 నేను అందుకు అవసరమైన ట్రైనింగ్ తీసుకోలేదు. 286 00:27:59,388 --> 00:28:03,433 అవును, కానీ ఆ కారణంగా లూనా-16 మీద వెళ్లకుండా నువ్వు ఆగలేదు, నువ్వు చంద్రుడి వరకు వెళ్ళావు. 287 00:28:09,147 --> 00:28:11,608 కానీ నేను తిరిగి అంతరిక్షంలోకి వెళ్లడం 288 00:28:11,692 --> 00:28:15,404 చాలా పెద్ద రిస్క్ అని ప్రభుత్వం నమ్మింది అనుకున్నానే. 289 00:28:15,487 --> 00:28:17,781 అంటే, నువ్వు ఇక్కడే ఇలా ఉండిపోవడం 290 00:28:17,865 --> 00:28:19,491 అంతకంటే పెద్ద ప్రమాదం అనిపిస్తోంది. 291 00:28:23,120 --> 00:28:25,789 కామ్రేడ్ బెలికోవా, నువ్వు ఆశపడింది కూడా ఇదే కదా? 292 00:28:29,585 --> 00:28:31,253 నేను కోరుకున్నది ఇది ఒక్కటే. 293 00:28:32,546 --> 00:28:34,548 నేను అక్కడికి వెళ్లి వచ్చినప్పటి నుండి. 294 00:28:37,467 --> 00:28:38,468 నన్ను క్షమించండి, 295 00:28:39,303 --> 00:28:44,391 కానీ మీరు ఇది కేవలం సద్భావన కారణంగానే చేస్తున్నారని నేను నమ్మలేకపోతున్నాను. 296 00:28:51,565 --> 00:28:52,566 వావ్… 297 00:28:56,445 --> 00:29:01,074 మనం చివరిసారి కలిసినప్పటి నుండి నువ్వు చాలా ఎదిగావు. 298 00:29:03,994 --> 00:29:07,539 అమెరికన్లు మనం శాల్యూట్ ని నిఘా పెట్టడానికి వాడుతున్నాం అని ఆరోపిస్తున్నారు. 299 00:29:08,207 --> 00:29:09,208 అది నిజమేనా మరి? 300 00:29:10,375 --> 00:29:14,505 మేము పాశ్చాత్య దేశాల రెచ్చగొట్టే చర్యల నుండి సోవియెట్ యూనియన్ ని కాపాడుతున్నాం. 301 00:29:14,588 --> 00:29:17,132 కానీ పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా ఆపడానికి, 302 00:29:17,216 --> 00:29:21,094 మనం శాల్యూట్ కి ఉన్న శాంతియుత ప్రయోజనాలపై ప్రపంచాన్ని ఒప్పించాలి. 303 00:29:23,472 --> 00:29:24,806 మరి నేను తిరిగి పైకి వెళితే, అప్పుడు… 304 00:29:24,890 --> 00:29:29,770 అప్పుడు నువ్వు విజయవంతంగా మిషన్ కమాండర్ గా అంతరిక్షంలోకి తిరిగి వెళ్ళినప్పుడు, 305 00:29:30,646 --> 00:29:33,023 మనం మరొక… 306 00:29:33,106 --> 00:29:35,067 భిన్నమైన కథనాన్ని జనానికి అందించవచ్చు. 307 00:29:57,548 --> 00:29:58,674 సరే, నేను వెళ్తాను. 308 00:29:59,258 --> 00:30:01,134 మంచిది, అయితే ఇక సెటిల్ అయినట్టే. 309 00:30:02,636 --> 00:30:07,641 రేపు ఉదయం నిన్ను తగన్రోగ్ ఎయిర్ బేస్ నుండి బైకోనుర్ కి ఒక విమానం తీసుకెళ్తుంది. 310 00:30:08,600 --> 00:30:10,018 అభినందనలు. 311 00:31:28,680 --> 00:31:29,681 హలో? 312 00:33:04,193 --> 00:33:07,529 నీతో ప్రైవేట్ గా మాట్లాడాలి అని అడగడానికి ఒక కారణం ఉంది. 313 00:33:19,041 --> 00:33:21,460 నిన్ను నీ పై అధికారి చూస్తున్న తీరు నాకు నచ్చడం లేదు. 314 00:33:23,212 --> 00:33:24,796 ఆమె నీ సామర్థ్యానికి అడ్డుపడుతోంది. 315 00:33:25,380 --> 00:33:27,508 నీకు చాలా సామర్థ్యం, ప్రతిభ ఉన్నాయని నాకు తెలుసు. 316 00:33:28,133 --> 00:33:29,510 నేను ఆమె నుండి నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. 317 00:33:29,593 --> 00:33:31,553 ఆమె నుండి నువ్వు నేర్చుకోవాల్సింది ఏదీ లేదు. 318 00:33:36,975 --> 00:33:41,188 వెనేర ప్రాజెక్టు కారణంగా జరిగిన విషయాల తర్వాతే నన్ను స్టార్ సిటీకి పంపారు. 319 00:33:41,271 --> 00:33:45,192 పరిస్థితిని సరిచేయడానికే కాదు, అదే సమయంలో మార్పు తీసుకురావడానికి కూడా. 320 00:33:46,568 --> 00:33:48,529 ఈ చోటును ఆధునిక యుగంలోకి తీసుకురావడానికి. 321 00:33:48,612 --> 00:33:50,614 మన సమస్యలో ఒక భాగం ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ అనేక పురాతన జీవులు 322 00:33:50,697 --> 00:33:52,991 అంతరించిపోకుండా ఇంకా ఇక్కడే ఉన్నాయి. 323 00:33:53,825 --> 00:33:56,495 మనం గనుక సైన్స్ లో, టెక్నాలజీలో, అన్వేషణలో 324 00:33:56,578 --> 00:34:00,832 అగ్రగామిగా నిలవాలి అంటే, మనలాంటి వాళ్ళే… 325 00:34:02,417 --> 00:34:06,296 ఇరీనా, మనిద్దరమే స్టార్ సిటీని కంట్రోల్ చేయాలి. 326 00:34:16,264 --> 00:34:19,643 ఒక ఇల్లీగల్ మిషన్ సాయంతో ఒక అమెరికన్ ఏజెంట్ ని తప్పించుకోనిచ్చారు, 327 00:34:19,726 --> 00:34:23,272 అలాంటి విషయం కల్నల్ రస్కోవకి తెలీదు అంటే మనం నమ్మాలా? 328 00:34:23,355 --> 00:34:25,357 - ఆమెకు నిజంగానే తెలీదు. - ఇక్కడ ఆమె సమయం ఇక చెల్లింది. 329 00:34:27,525 --> 00:34:31,780 ఆమెను అధికారం నుండి తొలగించడం ప్రభుత్వానికి మంచిదని చూపించడానికి ప్రూఫ్ కావాలి. 330 00:34:40,163 --> 00:34:43,708 అయితే ఆ ఆధారం నన్ను తీసుకొచ్చి ఇమ్మంటావా? 331 00:34:46,962 --> 00:34:49,297 ఇక్కడ నీకు మంచి భవిష్యత్ ఉంది, ఇరీనా. 332 00:34:51,382 --> 00:34:53,677 నీ అంచనాకి మించి నువ్వు బలమైనదానివి అలాగే తెలివైనదానివి. 333 00:34:56,221 --> 00:34:57,931 నువ్వు ఏం ఎదుర్కొన్నావో నాకు తెలుసు. 334 00:35:00,726 --> 00:35:04,438 ఇక్కడికి రావడానికి ముందు నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. 335 00:35:07,691 --> 00:35:09,776 నువ్వు ఎంత వేదన… 336 00:35:11,320 --> 00:35:13,906 తట్టుకుని అలాంటి రాక్షసుల చేతుల్లో. 337 00:35:13,989 --> 00:35:15,365 నాకు వద్దులే… 338 00:35:15,449 --> 00:35:17,951 ఎంతైనా ఆఖరికి జరిగిన పరిణామాల వల్ల మంచే జరిగింది. 339 00:35:18,035 --> 00:35:19,203 నీ కూతురు, జోయా. 340 00:35:19,286 --> 00:35:22,748 అలాగే ఈ పని కారణంగా కూడా మంచే జరుగుతుంది అని నేను నమ్ముతున్నాను. 341 00:35:28,420 --> 00:35:31,548 రుబ్లియోవ్క నుండి వచ్చిన మనం ఒకరిని ఒకరం కాపాడుకోవాలి. 342 00:35:38,847 --> 00:35:41,308 - లేట్ అవుతుంది. నేను ఇక… - అలాగే. అలాగే. 343 00:35:46,355 --> 00:35:47,648 నేను అడిగిన విషయం గురించి ఆలోచించు. 344 00:35:50,359 --> 00:35:51,485 అలాగే. 345 00:35:54,154 --> 00:35:55,322 నిన్ను తర్వాత కలుస్తాను. 346 00:36:32,693 --> 00:36:34,069 ఇంకా ఎంత సేపు? 347 00:36:35,028 --> 00:36:36,196 ఎక్కువ సేపు కాదు. 348 00:36:39,575 --> 00:36:40,993 అతని కథ ఏంటి? 349 00:36:43,620 --> 00:36:44,872 అనటోలి ఫ్రోలోవ్. 350 00:36:44,955 --> 00:36:47,541 అతను లేటెస్ట్ కాస్మోనాట్ బృందం నుండి వచ్చాడు. 351 00:36:48,250 --> 00:36:49,376 అంటే అతను కేజీబీ వాడు. 352 00:36:50,961 --> 00:36:53,338 అవును, మా ఇద్దరినీ కలిపి పంపడానికి కారణం… 353 00:36:54,756 --> 00:36:56,842 ఈ మిషన్ వెనుకున్న అసలు కారణం? 354 00:37:10,189 --> 00:37:13,275 కాస్మోనాట్ బెలికోవా, తిరిగి అంతరిక్షంలోకి వెళ్తున్నందుకు సంతోషంగా ఉందా? 355 00:37:13,358 --> 00:37:16,028 అవును, ప్రపంచంలోనే మొట్టమొదటి అంతరిక్ష కేంద్రంలో 356 00:37:16,111 --> 00:37:20,616 మన శాస్త్రీయ లక్ష్యాలను సాధించడానికి ఈ యాత్ర మనకు లభించిన ఒక అద్భుతమైన అవకాశం. 357 00:37:22,117 --> 00:37:23,118 కెమెరా చూసి చేయి ఊపండి. 358 00:37:56,610 --> 00:37:58,028 ఫైరింగ్ చెయిన్ సిద్ధంగా ఉంది. 359 00:37:58,111 --> 00:37:59,404 మెయిన్ ఇంజిన్ మొదలెట్టండి. 360 00:38:01,156 --> 00:38:06,411 స్టార్ సిటీ, 11 నుండి 17 వరకు ఉన్న దహన ఛాంబర్లు పూర్తి పీడనంలో ఉన్నాయని ధృవీకరించింది. 361 00:38:07,120 --> 00:38:08,413 వినిపించింది. రెండవ బ్రోచ్. 362 00:38:10,499 --> 00:38:11,500 ఇగ్నిషన్. 363 00:38:52,749 --> 00:38:55,586 శాల్యూట్-1కి రెండు గంటల్లో చేరుకోవడానికి టార్గెట్ లో ఉన్నారు. 364 00:38:58,630 --> 00:38:59,673 అందరూ నా మాట వినండి. 365 00:39:06,847 --> 00:39:08,599 మీకు అభినందనలు తెలియజేయాలి అనుకుంటున్నాను. 366 00:39:09,474 --> 00:39:11,351 మరొక విజయవంతమైన లాంచ్ చేసి, 367 00:39:11,435 --> 00:39:14,855 మనం సోవియెట్ యూనియన్ శక్తిని మరొకసారి తెలియజేసాం. 368 00:39:15,689 --> 00:39:20,027 కానీ మనం దృష్టి నిలిపి దృఢమనస్సుతో ఉండాలి. 369 00:39:21,153 --> 00:39:23,447 మనకు అతిపెద్ద సవాళ్లు త్వరలో ఎదురవ్వబోతున్నాయి. 370 00:39:25,574 --> 00:39:26,575 అందరూ బాగా పనిచేసారు. 371 00:39:39,254 --> 00:39:40,255 అద్భుతమైన పనితనం. 372 00:39:40,339 --> 00:39:43,634 ఇదంతా జరిగిన విధానం చూసి జనరల్ సెక్రటరీ చాలా సంతోషిస్తున్నారు. 373 00:39:44,843 --> 00:39:46,678 థాంక్స్, డెప్యూటీ చైర్మన్. 374 00:39:46,762 --> 00:39:48,263 నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం. 375 00:40:10,911 --> 00:40:12,079 కిరిల్ ఎక్కడ? 376 00:40:12,162 --> 00:40:13,413 నాకు తెలీదు. 377 00:40:13,497 --> 00:40:15,082 అతను ఇవాళ ఉదయం రాలేదు. 378 00:41:12,097 --> 00:41:15,058 ట్రాజెక్టరి మామూలుగానే ఉంది. శాల్యూట్ ని చేరుకోవడానికి ట్రాక్ లో ఉన్నాం. 379 00:41:16,268 --> 00:41:19,354 సోయూజ్, దగ్గరకు వెళ్ళడానికి ముందు శాల్యూట్-1తో సమాచార వ్యవస్థని కలుపుతున్నాం. 380 00:41:20,814 --> 00:41:24,026 శాల్యూట్ స్టేషన్, మీ రిలీఫ్ బృందంతో లైన్ కలిసింది. 381 00:41:24,943 --> 00:41:26,111 మాకు కనిపిస్తున్నారు, సోయూజ్. 382 00:41:26,820 --> 00:41:28,739 మీ హైజీన్ బ్యాగులలో కొంత వోడ్కా తెచ్చుకుని ఉంటారని ఆశిస్తున్నాం, 383 00:41:28,822 --> 00:41:30,449 ఎందుకంటే మా మందుని మాతో వెనక్కి తీసుకెళ్తున్నాం. 384 00:41:40,959 --> 00:41:42,169 భలే అందంగా ఉంది. 385 00:41:55,182 --> 00:41:59,186 స్టార్ సిటీ, శాల్యూట్ స్టేషన్ తో కలయిక కోసం ఫేజింగ్ ఆర్బిట్ 386 00:41:59,269 --> 00:42:01,188 సర్క్యులరైజేషన్ బర్న్ కు సిద్ధమవుతోంది. 387 00:42:24,127 --> 00:42:26,713 డాకింగ్ చేయడానికి వెళ్తున్నాం, కమాండర్ బెలికోవా. 388 00:42:27,214 --> 00:42:28,841 ఇంధన రియాక్టర్ సెల్ నార్మల్ గా ఉంది. 389 00:42:53,991 --> 00:42:57,578 సెకనుకు 0.91 మీటర్ల వేగంతో దగ్గరవుతున్నాం. 390 00:42:58,245 --> 00:43:00,914 కొంచెం స్పీడుగా రాగలరా? మాకు ఇంటికి వెళ్లాలని ఉంది. 391 00:43:03,000 --> 00:43:04,501 అయిదు మీటర్లు. 392 00:43:04,585 --> 00:43:06,420 దగ్గరకు వచ్చే వేగాన్ని చూసుకోండి. 393 00:43:22,436 --> 00:43:24,271 లాచ్ అమరిక బాగానే ఉన్నట్టు ఉంది. 394 00:43:28,817 --> 00:43:30,068 మొదటి కాంటాక్ట్. 395 00:43:31,153 --> 00:43:32,738 రెండవ కాంటాక్ట్. 396 00:43:34,031 --> 00:43:35,991 సాఫ్ట్ క్యాప్చర్ పూర్తి అయింది. 397 00:43:37,701 --> 00:43:39,453 శాల్యూట్-1 కి స్వాగతం. 398 00:44:31,505 --> 00:44:32,923 నీకు ఇక్కడ ఏం పని? 399 00:44:33,590 --> 00:44:36,510 క్షమించండి, కామ్రేడ్ కల్నల్. శాల్యూట్-1లో ఒక సమస్య ఎదురైంది. 400 00:44:37,469 --> 00:44:38,887 రేపటి వరకు ఆగలేకపోయావా? 401 00:44:38,971 --> 00:44:40,180 అర్జెంటు అంట. 402 00:44:40,264 --> 00:44:42,850 చీఫ్ డిజైనర్ పెట్రోవ్స్కీ మొదటి శాల్యూట్ నిఘా ఫోటోలను 403 00:44:42,933 --> 00:44:46,019 హెడ్ క్వార్టర్స్ కి పంపబోతున్నారని చూసాను. 404 00:44:48,105 --> 00:44:49,356 నేను ఆమోదించకుండానా? 405 00:44:50,023 --> 00:44:51,024 అవును. 406 00:44:51,942 --> 00:44:54,361 నేను మీరు రివ్యూ చేయడానికి వాటిని తెచ్చా. 407 00:44:55,320 --> 00:44:56,655 అయితే లోనికి రా. 408 00:45:00,951 --> 00:45:02,452 నేను ఫైల్ ని చూడొచ్చా? 409 00:45:19,553 --> 00:45:21,346 ఒక నిమిషం ఉండు. నేను ఓవెన్ లో ఒకటి పెట్టాను. 410 00:46:14,983 --> 00:46:16,777 వాడి పేరు డీమ. 411 00:46:26,662 --> 00:46:28,121 వాడు యుద్ధం సమయంలో చనిపోయాడు. 412 00:46:30,749 --> 00:46:32,251 క్షమించండి, నాకు తెలియలేదు. 413 00:46:34,878 --> 00:46:36,463 అది చాలా కాలం క్రితం జరిగింది. 414 00:46:47,599 --> 00:46:49,226 దీన్ని నా దగ్గరకి తీసుకొచ్చినందుకు థాంక్స్. 415 00:46:49,309 --> 00:46:52,145 నేను ఇది లుబియాంకాకి అందేలా చూసుకుంటా. 416 00:46:52,729 --> 00:46:54,398 బాగా రాత్రి అయింది, ఇక నువ్వు వెళ్ళు. 417 00:47:03,198 --> 00:47:04,825 ఇంకొక విషయం కూడా ఉంది. 418 00:47:08,871 --> 00:47:10,080 ఏంటి? 419 00:47:19,464 --> 00:47:20,549 అది ఎక్కడ దొరికింది? 420 00:47:24,136 --> 00:47:25,596 నేనే తెచ్చాను. 421 00:47:28,182 --> 00:47:29,641 నువ్వు నా ఇంట్లో మైక్ పెట్టబోయావా? 422 00:47:34,271 --> 00:47:37,441 నన్ను ఆదేశించారు, కానీ నా వల్ల కాలేదు. 423 00:47:39,109 --> 00:47:40,110 పెట్రోవ్స్కీ? 424 00:47:42,446 --> 00:47:43,947 ఆయన మిమ్మల్ని తొలగించాలి అనుకుంటున్నాడు. 425 00:47:52,206 --> 00:47:54,124 సరే, మరి ఇంకెందుకు ఆలస్యం? 426 00:47:57,002 --> 00:47:58,003 ఏమన్నారు? 427 00:47:59,463 --> 00:48:02,216 ఇరీనా వసిలియెవ్న, స్టార్ సిటీ హెడ్ నీకు ఎప్పుడైనా ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు, 428 00:48:02,299 --> 00:48:04,510 నువ్వు చెప్పింది చెప్పినట్టు చేయాలి. 429 00:48:09,056 --> 00:48:10,057 నాకు అర్థం కావడం లేదు. 430 00:48:10,140 --> 00:48:12,434 నువ్వు అతనికి రిపోర్ట్ చేయడం కొనసాగించు. 431 00:48:14,561 --> 00:48:16,146 అలాగే నాకు కూడా. 432 00:48:21,401 --> 00:48:23,070 అలాగే, కామ్రేడ్ కల్నల్. 433 00:48:41,547 --> 00:48:43,882 - ఆగు. నీకు అనుమతి లేకుండా లోనికి… - లేదు, ప్లీజ్. విను. నేను… 434 00:48:43,966 --> 00:48:46,134 - …వెళ్లే అనుమతి లేదు. - ఇది అఫీషియల్ ప్రభుత్వ పనికి సంబంధించింది. 435 00:48:46,218 --> 00:48:48,095 నీకు లోనికి వెళ్లే అనుమతి లేదు. 436 00:49:04,444 --> 00:49:05,779 స్టెపానోవ్. 437 00:49:10,075 --> 00:49:11,118 స్టెపానోవ్. 438 00:49:11,660 --> 00:49:13,662 ప్లీజ్. ఇది… ముఖ్యమైన విషయం. 439 00:49:15,163 --> 00:49:16,957 నేను నీతో మాట్లాడటం చూస్తే నాకు ప్రమాదం. 440 00:49:17,040 --> 00:49:19,501 ఇప్పటికే చీకటి రాణి నన్ను క్షుణ్ణంగా గమనిస్తోంది. 441 00:49:20,085 --> 00:49:22,546 సరే. అయితే నువ్వు ఎంత త్వరగా నేను అడిగే దానికి 442 00:49:22,629 --> 00:49:24,590 ఒప్పుకుంటే నీకు అంత మంచిది. 443 00:49:25,549 --> 00:49:27,968 చీఫ్ డిజైనర్ ఇక్కడ ఉండి ఉంటే, నేను ఆయన్నే అడిగేవాడిని. 444 00:49:29,511 --> 00:49:31,138 సరే, నీకు ఒక్క నిమిషం ఇస్తున్నాను. 445 00:49:32,848 --> 00:49:34,766 నేను శాల్యూట్-1 వారితో మాట్లాడాలి. 446 00:49:37,394 --> 00:49:38,562 వెంటనే. 447 00:49:41,148 --> 00:49:42,858 ప్లీజ్. నాకు నీ సాయం కావాలి. 448 00:50:08,675 --> 00:50:11,553 శాల్యూట్-1, ఇది స్టార్ సిటీ. మా మాట వినిపిస్తుందా? 449 00:50:15,390 --> 00:50:16,642 శాల్యూట్-1? 450 00:50:17,851 --> 00:50:19,937 స్పందించండి, స్టార్ సిటీ, నేను బెలికోవాని. 451 00:50:20,020 --> 00:50:21,980 కమాండర్ బెలికోవా, నేను స్టెపానోవ్ ని. 452 00:50:22,814 --> 00:50:24,149 అంతా బానే ఉందా? 453 00:50:24,233 --> 00:50:25,234 అవును. 454 00:50:25,317 --> 00:50:28,195 మీరు సెక్యూరిటీ మానిటర్ మీద ఒక చిన్న టెస్ట్ చేయాలి. 455 00:50:30,572 --> 00:50:32,324 అది ఫ్రోలోవ్ కి సంబంధించిన ప్రాజెక్టు. 456 00:50:32,407 --> 00:50:34,076 - నేను అతన్ని లేపుతాను, అతను… - ఓహ్, వద్దు. వద్దు. 457 00:50:34,159 --> 00:50:35,452 వద్దు. 458 00:50:36,662 --> 00:50:37,663 ఎందుకు వద్దు? 459 00:50:38,747 --> 00:50:41,416 అంటే అది… మరీ అంత పెద్ద టెస్ట్ ఏం కాదు. 460 00:50:41,500 --> 00:50:43,460 కాబట్టి అతని నిద్ర పాడు చేయాల్సిన అవసరం లేదు. 461 00:50:44,127 --> 00:50:45,504 నువ్వు స్టెపానోవ్ కాదు. 462 00:50:45,587 --> 00:50:46,964 ఎవరిది? 463 00:50:47,798 --> 00:50:49,091 సెర్గీ నికొలోవ్. 464 00:50:50,008 --> 00:50:51,385 నికొలోవ్? 465 00:50:51,468 --> 00:50:53,011 ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉందే? 466 00:50:53,971 --> 00:50:55,931 లూనా-16 సమయంలో నీ సూట్ నుండి కార్బన్ డయాక్సైడ్ 467 00:50:56,014 --> 00:50:59,309 తగ్గించడానికి మార్గం కనిపెట్టిన ఇంజనీర్ ని నేనే. 468 00:51:01,603 --> 00:51:06,358 అయితే అంతరిక్షంలో నా సూట్ కి కన్నం పెట్టమని చెప్పింది నువ్వే అన్నమాట? 469 00:51:11,154 --> 00:51:15,617 - అవును. క్షమించు. నా ఉద్దేశం… - క్షమాపణలు అడగొద్దు, నువ్వు నా ప్రాణాలు కాపాడావు. 470 00:51:17,119 --> 00:51:18,745 నేను నా పని చేశా అంతే. 471 00:51:20,122 --> 00:51:21,999 లేదు, మిగతావాళ్ళు అందరూ కూడా అదే పని చేశారు. 472 00:51:23,292 --> 00:51:25,460 సరే, నీకు ఏం కావాలి, సెర్గీ నికొలోవ్? 473 00:51:25,544 --> 00:51:27,254 సెర్గీ, త్వరగా పని పూర్తి చెయ్. 474 00:51:29,590 --> 00:51:32,843 మన సంభాషణని సెక్యూర్ ఛానల్ కి మార్చుతున్నాను. 475 00:51:34,052 --> 00:51:35,179 సెక్యూర్? 476 00:51:36,346 --> 00:51:38,724 నీకు వెనేర ప్రోగ్రామ్ గురించి తెలుసు కదా? 477 00:51:41,268 --> 00:51:42,477 కొంచెం. 478 00:51:42,561 --> 00:51:46,732 సరే, మీ స్టేషన్ లో ఉన్న నిఘా టెక్నాలజీ 479 00:51:46,815 --> 00:51:51,069 వెనేర మిషన్ నుండి వచ్చిన ఒక కాన్సెప్ట్ ఆధారంగా తయారు చేయబడింది. 480 00:51:51,153 --> 00:51:52,654 నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు తెలీదు. 481 00:51:52,738 --> 00:51:55,032 సరే. సరే. అర్థమైంది, నిజమే. 482 00:51:56,617 --> 00:51:58,785 నేను యెవ్పటోరియా టెలిస్కోప్ నుండి నాకు 483 00:51:58,869 --> 00:52:03,999 నాకు అందిన డేటాని చూస్తుండగా ఒకటి కనిపించింది… 484 00:52:05,459 --> 00:52:06,585 ఒక వింతైన విషయం. 485 00:52:06,668 --> 00:52:08,170 వింతైన విషయం? 486 00:52:08,253 --> 00:52:12,382 అవును, ఒకసారి అది ధృవీకరించుకోవడానికి నాకు సాయం చెయ్. 487 00:52:15,302 --> 00:52:17,804 దీనికీ వెనేరతో ఏం సంబంధం ఉంది? 488 00:52:18,972 --> 00:52:20,974 నేను కూడా అదే కనుక్కోవడానికి ట్రై చేస్తున్నా. 489 00:52:21,058 --> 00:52:22,893 ఈ టెస్ట్ రన్ చెయ్. 490 00:52:23,435 --> 00:52:24,520 ప్లీజ్. 491 00:52:41,870 --> 00:52:43,664 నన్ను ఏం చేయమంటావు? 492 00:52:44,873 --> 00:52:50,879 యుహెచ్ఎఫ్ ట్రాన్స్మిటర్ ని 922.76 మెగాహెర్ట్జ్ కి సెట్ చెయ్. 493 00:52:54,466 --> 00:52:58,637 922.76 మెగాహెర్ట్జ్ కి సెట్ చేస్తున్నాను. 494 00:53:11,608 --> 00:53:13,235 నాకు ఒక సిగ్నల్ అందుతోంది. 495 00:53:17,030 --> 00:53:18,949 ఆ సిగ్నల్ ని నాకు రీలే చెయ్. 496 00:53:19,449 --> 00:53:20,534 రీలే చేస్తున్నాను. 497 00:53:40,637 --> 00:53:42,055 అది డేటా. 498 00:53:44,558 --> 00:53:48,228 - అది డేటా పైగా ఒక విధంగా కంప్రెస్ చేయబడింది… - ఏ విధంగా? 499 00:53:49,438 --> 00:53:50,772 ఏం జరుగుతోంది? 500 00:53:52,274 --> 00:53:54,193 ఏ విధంగా, సెర్గీ? 501 00:53:55,986 --> 00:53:57,821 ఏంటిది? నన్ను ఏ సమస్యలోకి లాగుతున్నావు? 502 00:53:57,905 --> 00:54:00,073 - నేను ఇలా చేస్తే… - ఇంకొక్క నిమిషమే. ప్లీజ్. ఆగు. 503 00:54:00,157 --> 00:54:01,366 నాకు క్యాలండర్ కావాలి. 504 00:54:01,450 --> 00:54:02,534 ఎవరి దగ్గర… 505 00:54:04,828 --> 00:54:06,747 - సరే, ఒక్క… ఒక్క క్షణం. - హేయ్. 506 00:54:14,379 --> 00:54:15,756 నేను చెప్పేది వినిపిస్తుందా? లైన్ లో ఉన్నావా? 507 00:54:15,839 --> 00:54:16,924 స్పందించు. 508 00:54:23,096 --> 00:54:25,265 - లేదు, ఇది అసాధ్యం. - ఏది అసాధ్యం? 509 00:54:25,349 --> 00:54:26,600 సెర్గీ. 510 00:54:29,728 --> 00:54:31,897 క్షమించు. క్షమించు. 511 00:54:31,980 --> 00:54:34,733 - సెర్గీ. ఇక చాలు. నువ్వు ఇలా… - లేదు, లేదు. ప్లీజ్. ప్లీజ్. 512 00:54:35,359 --> 00:54:36,443 లైన్ లో ఉన్నావా? 513 00:54:37,361 --> 00:54:39,821 - చెప్పేది వినిపిస్తుందా? స్పందించు. స్పందించు. - హలో, హలో, హలో. 514 00:54:40,322 --> 00:54:41,448 అవును, అవును. ఇక్కడే ఉన్నా. ఉన్నా. 515 00:54:41,532 --> 00:54:43,534 సిగ్నల్ ఎక్కడి నుండి వస్తోంది? 516 00:54:44,368 --> 00:54:49,623 కామ్రేడ్ బెలికోవా, నా అల్గోరిథమ్ వాడి ఆ ఫ్రీక్వెన్సీలో 517 00:54:49,706 --> 00:54:54,378 డేటాని పంపగల సామర్థ్యం ఉన్న ఇంకొక స్పేస్ క్రాఫ్ట్ ఒకే ఒక్కటి. 518 00:54:59,049 --> 00:55:00,342 లేదు. 519 00:55:02,386 --> 00:55:05,722 - అది… అది సాధ్యం కాదు. - ఎలాగో నాకు తెలీదు. 520 00:55:06,682 --> 00:55:10,143 కానీ ఒకవేళ అది గనుక నాశనం కాకపోయి ఉంటే, 521 00:55:11,562 --> 00:55:15,566 అప్పుడు అది భూమికి తిరిగి రాబోయే సమయం… 522 00:55:16,608 --> 00:55:17,609 ఇప్పుడే. 523 00:56:52,246 --> 00:56:54,248 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్