1 00:00:23,899 --> 00:00:25,108 నాకు ఆశ్చర్యంగా ఉంది. 2 00:00:27,069 --> 00:00:29,196 చూడబోతే, కేడీ దాదాపు చావు తప్పించుకున్నట్లుంది, హా? 3 00:00:29,905 --> 00:00:32,824 గురి తప్పితే లెక్కలోకి రాదు, అది గుర్రపు నాడాలు లేదా హ్యాండ్ గ్రెనేడ్లు వాడితే తప్ప. 4 00:00:34,117 --> 00:00:35,452 వీళ్లని ఇక్కడి నుండి తరలించాలి. 5 00:00:41,750 --> 00:00:43,210 రెజల్ మానియా ఇక ముగిసిపోయింది. 6 00:00:47,422 --> 00:00:49,007 పై అధికారులకు సమాచారం అందిస్తావా? 7 00:00:49,091 --> 00:00:50,384 అదేంటి? 8 00:00:55,180 --> 00:00:59,268 కంట్రోల్, 10-52, వెయిట్ రూమ్. 9 00:00:59,351 --> 00:01:02,396 ఇది కమాండ్ సెంటర్. 10-52, వెయిట్ రూమ్ సందేశం అందింది. 10 00:01:02,479 --> 00:01:03,480 - ఓవర్. - నిలబడకు. 11 00:01:03,564 --> 00:01:07,317 నువ్వు కాసేపు కదలకుండా ఉంటావా, బాబూ? ఆ కాలు విరిగింది. 12 00:01:11,947 --> 00:01:14,074 నువ్వు ఏమీ చూడలేదు, అంతే కదా? 13 00:01:15,868 --> 00:01:17,494 నీతోనే మాట్లాడుతున్నాను, ముసలోడా. 14 00:01:25,377 --> 00:01:27,379 దీని తరువాత, నిన్ను కోమాలోకి పంపిస్తాను. 15 00:01:28,172 --> 00:01:30,340 కానీ ఇప్పుడు, నువ్వు మేలుకొని ఉండాలి. 16 00:01:31,800 --> 00:01:33,177 నీకు ఏమైనా నర్సరీ రైమ్స్ తెలుసా? 17 00:01:33,260 --> 00:01:38,599 పించో, పించో అది మా కుక్క 18 00:01:39,183 --> 00:01:41,810 అదేంటి? నేను తప్పు వైర్ ని కట్ చేశానా? 19 00:01:42,686 --> 00:01:48,066 బాస్క్ పాట మా అమ్మ పాడేది. 20 00:01:49,610 --> 00:01:51,195 నేను నీ పాటని అర్థం చేసుకోవాలి కదా. 21 00:01:53,071 --> 00:01:56,533 మూడు గుడ్డి ఎలుకలు 22 00:01:58,285 --> 00:02:01,246 మూడు గుడ్డి ఎలుకలు 23 00:02:01,330 --> 00:02:03,248 సరే. డ్రిల్. 24 00:02:11,423 --> 00:02:13,175 మాక్స్ కేడీకి పరోల్ పొందే అర్హత లేదు 25 00:02:13,258 --> 00:02:20,224 రెండు నెలల తరువాత 26 00:02:33,612 --> 00:02:36,240 నేరం రుజువైంది 27 00:02:36,323 --> 00:02:38,534 నువ్వు చనిపోయి ఉండాల్సింది. 28 00:02:39,701 --> 00:02:41,119 నిన్ను ఎవరు బ్రతికించారు? 29 00:02:41,912 --> 00:02:45,874 నేను మొండివాడిని. 30 00:02:49,670 --> 00:02:52,464 ఆవేశానికి ఇది సైడ్ ఎఫెక్ట్. 31 00:02:54,466 --> 00:02:56,009 నీ ఆవేశం ఎక్కడి నుంచి వస్తోంది? 32 00:03:02,558 --> 00:03:04,351 నా ఆవేశానికి కారణం… 33 00:03:04,434 --> 00:03:08,564 ఏ ఒక్కరో కాదు. వాళ్లు నన్ను ఘోరంగా చూశారు. నన్ను వాడుకున్నారు. 34 00:03:14,152 --> 00:03:18,198 వాళ్లు నాతో దారుణంగా ప్రవర్తించారు. నేను ఒంటరివాడిని. 35 00:03:19,199 --> 00:03:20,909 ఈ నరకంలో. 36 00:03:28,125 --> 00:03:29,668 నరకంలో జీవితం ఎలా ఉంటుంది? 37 00:03:31,086 --> 00:03:35,591 నేను… 38 00:03:36,508 --> 00:03:38,719 కోమాలో ఉన్నప్పుడు… 39 00:03:39,303 --> 00:03:41,513 నా కుటుంబాన్ని చూశాను. 40 00:03:42,472 --> 00:03:45,809 వాళ్లు నాకు ఏదో చెప్పడానికి వచ్చారు… 41 00:03:48,187 --> 00:03:51,148 వాళ్లు మాట్లాడారు. 42 00:03:55,152 --> 00:03:59,948 కానీ నేను వినలేకపోయాను. 43 00:04:04,286 --> 00:04:09,124 అది నాకు కోపం తెప్పించింది. 44 00:04:20,511 --> 00:04:22,554 సారీ… 45 00:04:24,264 --> 00:04:26,642 …కానీ ఆవేశం పరిష్కారం కాదు. 46 00:04:27,184 --> 00:04:29,811 నేను దేవుళ్లని సేవిస్తాను తెలుసా? 47 00:04:31,230 --> 00:04:37,945 ఆ చెత్త గురించి నాతో మాట్లాడకు, కోళ్లు, ఎలుకల తలలు నరకడం లాంటివి చెప్పకు. 48 00:04:45,536 --> 00:04:47,663 మా మతం నీకు సాయపడచ్చు. 49 00:04:49,665 --> 00:04:52,709 బానిసలుగా, అణచివేయబడిన… 50 00:04:53,210 --> 00:04:55,128 …అన్యాయానికి గురైన… 51 00:04:56,088 --> 00:04:58,674 …మనుషుల మతం అది. 52 00:05:06,849 --> 00:05:09,935 మరణించిన వారితో మనల్ని కనెక్ట్ చేసే మతం అది. 53 00:05:13,522 --> 00:05:15,399 చనిపోయిన వారితోనా? 54 00:05:17,609 --> 00:05:19,653 నాకు ఇంకా వివరాలు చెప్పు. 55 00:05:20,362 --> 00:05:21,905 ప్లీజ్. 56 00:05:47,097 --> 00:05:49,391 నువ్వు షాంగో బిడ్డవి… 57 00:05:50,392 --> 00:05:53,187 …అతను చంపుతాడు, కానీ చంపబడడు. 58 00:05:54,730 --> 00:05:56,982 అతని మాటలు పిడుగుల్లా ఉంటాయి. 59 00:05:58,275 --> 00:06:00,819 నువ్వు పండ్లు… 60 00:06:01,612 --> 00:06:03,655 …కాఫీ గింజలు… 61 00:06:04,072 --> 00:06:05,574 …సిగరెట్ బూడిద కానుకలుగా సమర్పించాలి. 62 00:06:06,867 --> 00:06:11,914 ఆయన నీకు న్యాయం ఇంకా రక్షణ అందిస్తాడు. 63 00:06:13,123 --> 00:06:18,170 నువ్వు కోల్పోయిన వారి దగ్గరకి నిన్ను చేరుస్తాడు. 64 00:06:27,137 --> 00:06:29,306 టార్వాటర్ 65 00:06:40,067 --> 00:06:42,277 కళ్లలో అగ్నిజ్వాల! 66 00:06:42,361 --> 00:06:44,613 నోటిలో అగ్నిజ్వాల! 67 00:06:44,696 --> 00:06:48,992 చిరుతపులి మేకని చంపుతుంది! 68 00:06:49,201 --> 00:06:52,371 ఇంకా దాని రక్తంతో స్నానం చేస్తుంది! 69 00:06:52,454 --> 00:06:54,540 కళ్లలో అగ్నిజ్వాల! 70 00:06:54,623 --> 00:06:57,000 నోటిలో అగ్నిజ్వాల! 71 00:06:57,084 --> 00:07:00,754 చిరుతపులి మేకని చంపుతుంది! 72 00:07:00,838 --> 00:07:03,632 దాని రక్తంతో స్నానం చేస్తుంది! 73 00:07:03,715 --> 00:07:05,551 కళ్లలో అగ్నిజ్వాల! 74 00:07:05,634 --> 00:07:08,011 నోటిలో అగ్నిజ్వాల! 75 00:07:08,095 --> 00:07:12,307 చిరుతపులి మేకని చంపుతుంది! 76 00:07:12,391 --> 00:07:15,519 ఇంకా దాని రక్తంతో స్నానం చేస్తుంది! 77 00:08:20,375 --> 00:08:21,543 "ద ఎగ్జిక్యూషనర్స్" నవల ఆధారంగా 78 00:08:21,627 --> 00:08:22,628 జాన్ డి. మాక్ డొనాల్డ్ రూపొందించినది 79 00:08:22,920 --> 00:08:24,004 "కేప్ ఫియర్" ఫిల్మ్స్ ఆధారంగా రూపొందించినది 80 00:08:24,087 --> 00:08:25,672 స్క్రీన్ ప్లే రచయితలు వెస్లీ స్ట్రిక్ ఇంకా జేమ్స్ ఆర్. వెబ్ 81 00:08:42,438 --> 00:08:43,440 సిస్టమ్ అలెర్ట్ ముందు తలుపు 82 00:08:44,566 --> 00:08:46,109 ఇల్లు సురక్షితం. 83 00:08:46,193 --> 00:08:48,195 హా, ఈ సిస్టమ్ చాలా అధునాతనమైనది. ఎవ్వరూ హ్యాక్ చేయలేేరు. 84 00:08:49,279 --> 00:08:50,489 కెమెరా రిజల్యూషన్లు చాలా బాగుంటాయి, 85 00:08:50,572 --> 00:08:52,699 మీ ఇంటి వసారాలో ఉండే ప్యాకేజ్ లేబుల్స్ ని కూడా మీరు చదవచ్చు. 86 00:08:53,700 --> 00:08:54,701 మంచిది. 87 00:08:55,577 --> 00:08:59,498 అయితే, తెలివైన నేరగాళ్లు లేజర్ ని ఉపయోగించి మీ కెమెరాని పనిచేయకుండా చేస్తారు. 88 00:08:59,581 --> 00:09:01,917 దానికి సరైన పరిష్కారం ఏమిటంటే మరొక కెమెరాల సెట్ కొని, 89 00:09:02,000 --> 00:09:04,044 మొదటి సెట్ పైన వాటిని అమర్చితే, 90 00:09:04,127 --> 00:09:06,338 అప్పుడు, ఎవరైనా కెమెరాలని పనిచేయకుండా చేసినా, రెండో సెట్ లో వీడియోలు ఉంటాయి. 91 00:09:07,422 --> 00:09:08,715 సెఫ్టీ విషయంలో ఖర్చులు చూసుకోకూడదు. 92 00:09:09,675 --> 00:09:11,134 - థాంక్యూ. - సరే. మంచి నిర్ణయం తీసుకోండి. 93 00:09:11,218 --> 00:09:12,219 థాంక్స్. 94 00:09:20,769 --> 00:09:22,020 ఏమిటా శబ్దం? 95 00:09:22,104 --> 00:09:23,730 - పీనట్ బటర్ ఆ గోడ లోపల ఉండచ్చా? - లేదు, అది… 96 00:09:23,814 --> 00:09:25,607 అక్కడ పిల్లి గనుక ఉండి ఉంటే, మ్యావ్ అని అరిచేది. 97 00:09:25,691 --> 00:09:28,569 - అయితే, మరి అది ఎక్కడ ఉంది? - నాటలీ, నువ్వు శ్రద్ధగా వింటావా, ప్లీజ్? 98 00:09:28,652 --> 00:09:30,988 పెప్పర్ స్ప్రే. అది నీ దగ్గర ఉంచుకో. 99 00:09:31,864 --> 00:09:33,365 సరే. మన కోసం కొత్త నియమాలు. 100 00:09:33,448 --> 00:09:36,034 మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా ఆ సమాచారం మాకు అందించాలి. 101 00:09:36,118 --> 00:09:38,745 ఇంకా మీరు ఎక్కడికైనా వెళ్లాలి అనుకుంటే, మేమే స్వయంగా తీసుకువెళతాము. 102 00:09:38,829 --> 00:09:40,956 మీ లొకేషన్ సర్వీసులు ఆన్ లో ఉంచండి. 103 00:09:41,582 --> 00:09:44,042 మేము మిమ్మల్ని ఎప్పటికప్పుడు గమనించడం లేదు, కేవలం సేఫ్టీ కోసం ఇదంతా చేస్తున్నాం. 104 00:09:44,126 --> 00:09:45,669 కానీ, మీరు మమ్మల్ని గమనిస్తున్నారు కదా. 105 00:09:46,795 --> 00:09:47,880 అది మంచిదే. 106 00:09:49,464 --> 00:09:50,674 సేఫ్ గా ఉండటం మంచిదే కదా. 107 00:09:54,511 --> 00:09:56,054 లాంగ్ టెర్మ్ ప్లాన్ ఏంటి? 108 00:09:56,138 --> 00:09:58,640 - ఏం చేయాలన్నది ఇంకా చర్చిస్తున్నాం. - మనకున్న అవకాశాల్ని పరిశీలిస్తున్నాం. 109 00:09:58,724 --> 00:09:59,892 కానీ, వచ్చే వారం స్కూల్ తెరుస్తారు. 110 00:09:59,975 --> 00:10:01,935 మీరు కెజిబి తరహాలో మమ్మల్ని అనుక్షణం ఫాలో చేస్తారా? 111 00:10:02,019 --> 00:10:03,645 మాక్స్ ఇంకా అతని కూతురు వల్ల ఎంత ప్రమాదం ఉంటుందో 112 00:10:03,729 --> 00:10:05,272 నీకింకా అర్థం కాలేదు అనిపిస్తుంది, నాటలీ. 113 00:10:05,355 --> 00:10:06,773 నాట్, నువ్వు మమ్మల్ని నమ్మాలి. 114 00:10:07,733 --> 00:10:08,775 నమ్మకం అంటే గుర్తొచ్చింది… 115 00:10:09,693 --> 00:10:12,070 నువ్వు ఆఫీసుకి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నావెందుకు? నీ ఉద్యోగం పోయిందా? 116 00:10:12,571 --> 00:10:14,823 - లేదు. లేదు. - లేదు. అదేమీ లేదు. 117 00:10:15,532 --> 00:10:17,868 సరే, అయితే మనం ఎప్పటికీ ఇలాగే బతుకుతామా 118 00:10:17,951 --> 00:10:19,870 లేదా వేరే ఇంటికి మారతామా? 119 00:10:19,953 --> 00:10:22,372 లేదు, మనం ఈ ఇంటిని అమ్మడం లేదు. మనం ఇక్కడే ఉంటాం. 120 00:10:22,456 --> 00:10:23,832 దుండగులతో మనం వ్యవహరించే తీరు అలా కాదు. 121 00:10:24,875 --> 00:10:27,669 సరే. అయితే, మీరు మన ఎదురింటికి వెళ్లి 122 00:10:27,753 --> 00:10:28,962 అతను ఏం కోరుకుంటున్నాడో అడగచ్చు కదా? 123 00:10:29,046 --> 00:10:30,756 - దాని వల్ల ప్రయోజనం ఉండదు. - లేదు. 124 00:10:31,256 --> 00:10:34,218 సరే. నేను నా గదిలో బందీగా ఉంటాను. 125 00:10:38,472 --> 00:10:39,806 నువ్వు ఎలా ఉన్నావు, బుజ్జీ? 126 00:10:42,392 --> 00:10:43,810 మా నాన్న గురించి ఆందోళన పడుతున్నాను అంతే. 127 00:10:47,064 --> 00:10:49,191 సరే, అది… అది నేను మెచ్చుకుంటాను. 128 00:10:49,691 --> 00:10:50,943 నేను బాగానే ఉన్నాను. 129 00:10:58,367 --> 00:11:02,287 నువ్వు ఎందుకు ఇంట్లోనే ఉంటున్నావనే విషయం వాళ్లకి ఎలా చెప్పాలో మనం ముందుగా నిర్ణయించుకోవాలి. 130 00:11:02,371 --> 00:11:04,498 ఏం జరిగిందో నేను తనకి చెప్పి ఉండాల్సింది అంటావా? 131 00:11:06,416 --> 00:11:08,293 కానీ, అది ఏం జరిగిందన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. 132 00:11:10,796 --> 00:11:13,799 అతడికి అంత త్వరగా తాత్కాలిక విడుదల మంజూరు చేయకూడదు. 133 00:11:13,882 --> 00:11:16,844 కిందటి సంవత్సరం 'విల్లిస్' ఉరిశిక్ష విషయం గవర్నర్ కి పెద్ద తలనొప్పి అయింది, 134 00:11:16,927 --> 00:11:19,471 అందుకే ఇప్పుడిలా అడ్డదారులు తొక్కుతున్నారు. అంతా దరిద్రపు రాజకీయం! 135 00:11:19,555 --> 00:11:21,223 కానీ వాళ్ల దగ్గర డి.ఎన్.ఏ. సాక్ష్యం ఉంది. 136 00:11:21,306 --> 00:11:24,142 - ఆ కత్తి, ఆ రక్తం… - నాకు తెలుసు. తెలుసు. తెలుసు. తెలుసు. 137 00:11:25,394 --> 00:11:26,854 అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? 138 00:11:26,937 --> 00:11:28,480 మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. 139 00:11:28,564 --> 00:11:30,941 మాక్స్ ఇంత కాలం శిక్ష అనుభవించిన తరువాత అతడిని మనం ఏమీ చేయలేము. 140 00:11:31,024 --> 00:11:32,776 - డామిట్. - అతను మీ ఎదురింటిలోకి మారడం 141 00:11:32,860 --> 00:11:34,111 దురదృష్టం కొద్దీ చట్టవిరుద్ధమైన పని కాదు. 142 00:11:34,194 --> 00:11:37,489 హెన్రీ, నా పిల్లల్ని వేధించడం కోసం అతను తన కూతురుని ఉసిగొల్పాడు. 143 00:11:38,240 --> 00:11:39,241 వాడు… 144 00:11:40,075 --> 00:11:43,704 నా తోటి ఉద్యోగిని నేను లైంగికంగా వేధించినట్లు వాడు ఏ.ఐ. ద్వారా సాక్ష్యం సృష్టించాడు. 145 00:11:44,246 --> 00:11:46,164 కానీ నువ్వు దాన్ని రుజువు చేయలేవు, అవునా? 146 00:11:46,248 --> 00:11:47,791 సహజంగానే రుజువు చేయలేను. లేదా చేసి ఉండేవాడినేమో. 147 00:11:47,875 --> 00:11:50,002 టామ్, నేను నీ పక్షమే, మిత్రమా. 148 00:11:50,085 --> 00:11:52,004 ఇంకా నేను నిషేధాజ్ఞ కోసం ప్రయత్నిస్తాను. 149 00:11:52,087 --> 00:11:54,840 కాస్త ఓపిక పట్టు. అతడిని ఏదైనా పొరపాటు చేయనివ్వు. 150 00:11:54,923 --> 00:11:57,176 అప్పుడు మనం అతడిని తిరిగి జైలుకి పంపించేద్దాం. 151 00:11:58,886 --> 00:11:59,970 సరే. 152 00:12:00,470 --> 00:12:01,847 అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు 153 00:12:24,244 --> 00:12:26,246 జాక్, నన్ను భయపెట్టావు. 154 00:12:29,124 --> 00:12:30,125 ఏంటి సంగతి? 155 00:12:37,466 --> 00:12:38,717 నువ్వు బాగానే ఉన్నావా? 156 00:13:19,716 --> 00:13:20,717 ఓహ్, దేవుడా. 157 00:13:27,057 --> 00:13:28,809 నాటలీ! ఓహ్, దేవుడా! 158 00:13:28,892 --> 00:13:30,477 నాటలీ, నువ్వు బాగానే ఉన్నావా? 159 00:13:30,561 --> 00:13:32,062 - నా గదిలో ఎవరో ఉన్నారు! - ఏం జరిగింది? 160 00:13:32,145 --> 00:13:33,438 ఏంటి? 161 00:13:33,522 --> 00:13:34,731 ఓహ్, దేవుడా. తన ఒళ్లు కాలిపోతోంది. 162 00:13:34,815 --> 00:13:36,733 - తను బాగా జ్వరంతో ఉంది. - లేదు, హనీ, నువ్వు కలగన్నావంతే. 163 00:13:36,817 --> 00:13:39,486 నువ్వు కలగన్నావు. నీకేం కాలేదు. నీకు జ్వరం వచ్చిందా? 164 00:13:39,570 --> 00:13:40,821 - అవును. - మరేం ఫర్వాలేదు. 165 00:13:41,780 --> 00:13:42,781 ఛ. 166 00:13:42,865 --> 00:13:44,366 ఫర్వాలేదు. నీకేం కాలేదు. 167 00:13:45,075 --> 00:13:48,036 - చెత్త. ఓహ్, చెత్త. - ఫర్వాలేదు. ఫర్వాలేదు. ఇదిగో. 168 00:13:48,579 --> 00:13:50,706 పద. నిన్ను శుభ్రం చేస్తాను, డార్లింగ్. 169 00:13:54,126 --> 00:13:57,045 - మరేం ఫర్వాలేదు. - పద. నిన్ను కడిగి శుభ్రం చేయనివ్వు. 170 00:14:01,049 --> 00:14:02,634 మరేం ఫర్వాలేదు. 171 00:14:41,882 --> 00:14:46,011 అది నిజం. తండ్రి, కుమార ఇంకా పరిశుద్ధాత్మ నామమున! 172 00:14:46,595 --> 00:14:48,889 టీవీలో 'ద మార్టిర్' ప్లే చేయి 173 00:14:48,972 --> 00:14:52,726 నాకు ఎంత ద్రోహం చేశావో నేను ఈ ప్రపంచానికి చెబితే ఏమవుతుంది? చూడు 174 00:14:52,809 --> 00:14:53,977 ఆమె బయటకి ఎలా వచ్చింది? 175 00:14:54,061 --> 00:14:55,687 ఆ రోజు ఆమె నన్ను కలవడానికి వచ్చిన సంగతి నీకు తెలుసా? 176 00:14:55,771 --> 00:14:56,813 నేను ఆమెని మళ్లీ చూడకూడదు. 177 00:14:56,897 --> 00:14:59,191 ఆమె పిచ్చిది! తను నిజంగా పిచ్చిది! 178 00:14:59,274 --> 00:15:03,904 ఇంకా తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఆ పిచ్చిదాన్ని వెంటనే అదుపులో పెట్టు. వెంటనే! వెంటనే! 179 00:15:03,987 --> 00:15:07,407 ప్రతి మనిషి అతని జీవితంలో చేసిన తప్పులకి ఫలితం అనుభవించాల్సిందే. 180 00:15:07,491 --> 00:15:08,617 ఆఖరికి నువ్వు కూడా, మాక్స్. 181 00:15:10,369 --> 00:15:12,287 సరే, ఈ విషయంలో నువ్వు ఏమీ చేయలేకపోతే, 182 00:15:12,371 --> 00:15:14,831 దాని సంగతి నేనే స్వయంగా చూసుకుంటాను. అది నీకు తెలుసు కదా? నీకు అదే కావాలి కదా? 183 00:15:14,915 --> 00:15:17,626 ఆగు, ఆగు. నోరు మూయ్! 184 00:15:18,627 --> 00:15:20,546 నువ్వు ఏమీ పిచ్చి పనులు చేయకు, మాక్స్. 185 00:15:21,463 --> 00:15:25,801 ఆమె వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా, దానికి నువ్వే కారణమని నిన్ను నువ్వే నిందించుకో. 186 00:15:25,884 --> 00:15:29,096 చెత్తవెధవ. దానికి నిన్ను నిందిస్తే ఏం చేస్తావు, ముసలోడా? 187 00:15:30,055 --> 00:15:33,225 నీ దగ్గరకి రమ్మంటావా? నన్ను మళ్లీ చూడాలి అనుకుంటున్నావా? 188 00:15:33,934 --> 00:15:36,979 దాని గురించి ఆలోచించు, చెత్తవెధవ. 189 00:15:46,530 --> 00:15:48,907 ఆ వెంట్ లో నుంచి గాలి వస్తోంది, కానీ కూలింగ్ కావడం లేదు. 190 00:15:48,991 --> 00:15:52,995 అవును, నాకు తెలుసు. కూలెంట్ ఏదో లీక్ అయినట్లుంది. 191 00:15:53,495 --> 00:15:54,913 మనం దాని గురించి మాట్లాడుకుందామా? 192 00:15:54,997 --> 00:15:56,748 ఏంటి, ఎంత వేడిగా ఉందనా? 193 00:15:56,832 --> 00:15:58,083 నా ఉద్దేశం ఏమిటో నీకు తెలుసు. 194 00:15:59,168 --> 00:16:06,175 మాక్స్ నా గొంతుతో ఆ వాయిస్ మెసేజెస్ ని సృష్టించాడని నువ్వు ఒప్పుకుంటావు, కదా? 195 00:16:06,258 --> 00:16:08,093 అయితే ఆ మెసేజెస్ లో ఏం ఉంది? 196 00:16:10,304 --> 00:16:11,388 అందులో ఏం ఉందనేది ముఖ్యం కాదు… 197 00:16:11,471 --> 00:16:14,600 కానీ ఆ పని అతనే చేశాడని నీకు అర్థమయింది, కదా? అది మాక్స్ చేసిన పని. 198 00:16:14,683 --> 00:16:16,226 లేదు, నువ్వే ఆ పని చేశావు. 199 00:16:17,144 --> 00:16:19,813 మనల్ని ఇరుకున పెట్టడానికి నువ్వు అతనికి ఒక అవకాశం ఇచ్చావు. 200 00:16:27,279 --> 00:16:30,866 జాక్ పాత థెరపిస్టుని మానిపించేశాక కొత్త థెరపిస్టుని ఎవరినైనా వెతికావా? 201 00:16:32,034 --> 00:16:33,035 ఇంకా లేదు. 202 00:16:37,164 --> 00:16:39,833 చూడు, నేను… మొదటి రోజే స్కూలుని మిస్ కావడం వాళ్లకి ఇష్టం ఉండదు, 203 00:16:39,917 --> 00:16:41,418 కానీ పిల్లలు మీ కజిన్ ఇంట్లో ఉంటే మంచిదని 204 00:16:41,502 --> 00:16:43,754 - నేను అనుకుంటున్నాను. - ఇలా చూడు, పిల్లల్ని నేను కాపాడుకోగలను. 205 00:16:43,837 --> 00:16:44,880 మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? 206 00:16:47,049 --> 00:16:48,175 ఏమీ లేదు. 207 00:16:48,258 --> 00:16:50,219 నా సీనియర్ ఇయర్ లో నేను స్కూలు మారను. 208 00:16:50,302 --> 00:16:52,346 ఆ విషయం గురించి ఎవరూ ఏమీ అనలేదు. 209 00:16:56,725 --> 00:16:58,852 పూల్ దగ్గర కూర్చుని చదువుకోవడానికి నాకు అనుమతి ఉందా? 210 00:16:59,520 --> 00:17:02,105 అలాగే, నీ ఫోన్ దగ్గర పెట్టుకో చాలు. 211 00:17:02,189 --> 00:17:04,358 నిన్న రాత్రి తరువాత ఇప్పుడు నీకెలా ఉంది? 212 00:17:06,902 --> 00:17:09,195 నేను బాగానే ఉన్నాను. నేను ఏదో తినకూడనిది తిని ఉంటాను. 213 00:17:09,780 --> 00:17:10,864 సరే. 214 00:17:11,490 --> 00:17:14,910 దాన్ని తేలికగా తీసుకో, సరేనా? 215 00:17:17,329 --> 00:17:20,582 అన్నట్లు, ఏసి పని చేయడం లేదు. ఎవరినైనా పిలిపించండి. 216 00:17:53,407 --> 00:17:54,408 రిజెక్షన్ 217 00:18:11,925 --> 00:18:14,094 బాబ్స్ లిక్కర్ స్టోర్ 218 00:18:51,632 --> 00:18:53,217 నాటలీ! హేయ్! 219 00:18:53,759 --> 00:18:55,093 హేయ్, ఆగు! 220 00:18:55,177 --> 00:18:57,638 నేను లూయిస్ పిల్ గ్రిమ్ ని! ఆ పాడ్ కాస్ట్ చేస్తుంటాను కదా! 221 00:18:59,223 --> 00:19:01,850 హేయ్, ఏం తాగుతున్నావు, హా? పార్టీ చేసుకోవాలని ఉందా? 222 00:19:01,934 --> 00:19:04,102 హేయ్, మీ అమ్మ కూడా పార్టీలు చేసుకునేది 223 00:19:04,186 --> 00:19:05,979 ఇంకా విచారణ సమయంలో కూడా తను తాగేది, తెలుసా? 224 00:19:06,605 --> 00:19:08,023 నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు. 225 00:19:08,649 --> 00:19:12,236 హేయ్, మళ్లీ నా మీద ఏదైనా చిమ్ముతావా? కిందటిసారి ఆ వీడియోకి చాలా వ్యూస్ వచ్చాయి. 226 00:19:12,819 --> 00:19:17,199 హేయ్, ఆ విచారణకి ముందు వాళ్లిద్దరూ సెక్స్ చేసుకుంటున్నారని విన్నాను, కాబట్టి… 227 00:19:17,282 --> 00:19:19,493 నా ఉద్దేశం, నీ సవతి తండ్రే నీ అసలైన తండ్రి కావచ్చేమో, కదా? 228 00:19:19,576 --> 00:19:20,911 ఇంక ఆపు. 229 00:19:21,453 --> 00:19:23,080 వాళ్లు లా స్కూలులో కలుసుకున్నారు, సరేనా? 230 00:19:23,163 --> 00:19:24,748 హా, నువ్వు చాలా మంచి ప్రశ్నలు అడుగుతావు. 231 00:19:24,831 --> 00:19:25,832 హేయ్. 232 00:19:27,918 --> 00:19:28,919 - హేయ్. - ఎలా ఉన్నావు? 233 00:19:29,002 --> 00:19:30,420 - హేయ్, మాక్స్. హా. - హేయ్, హాయ్. 234 00:19:30,504 --> 00:19:31,797 ఇది నన్ను చూడనివ్వు. సరే, ఒక్క సెకను. 235 00:19:31,880 --> 00:19:33,465 - ఒక నిమిషం ఉండు. ఇలా రా. - ఏం చేస్తున్నావు… 236 00:19:42,224 --> 00:19:43,225 నువ్వు బాగానే ఉన్నావా? 237 00:19:44,726 --> 00:19:46,395 నువ్వు కూడా నన్ను వెంబడిస్తున్నావా? 238 00:19:46,478 --> 00:19:49,022 లేదు, నా కుక్కని అక్కడ ఒక వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకువెళ్లాను. 239 00:19:49,106 --> 00:19:50,607 నేను ఇక్కడ చేస్తున్న పని అదే. నీకు గాయాలు అయ్యాయా? 240 00:19:50,691 --> 00:19:54,278 నా సంగతి నేను చూసుకోగలను. నీ సాయం అవసరం లేదు. 241 00:19:54,361 --> 00:19:56,947 అలాగే, నువ్వు మా ఇంటి ఎదురుగా రావడం చాలా వింతగా ఉంది. 242 00:19:58,615 --> 00:20:00,701 నా పేరెంట్స్ అంటే నీకు ఏదో పిచ్చి ఉన్నట్లుంది. 243 00:20:01,785 --> 00:20:03,287 మీ పేరెంట్స్ నీకు అలా చెప్పారా? 244 00:20:03,787 --> 00:20:07,624 నాకు ఎందుకు పిచ్చి పట్టిందని అనుకుంటున్నారో దానికి కారణం వాళ్లు నీకు చెప్పలేదా? 245 00:20:07,708 --> 00:20:10,085 దాని గురించి నీకు ఏమీ అవగాహన లేదా? 246 00:20:14,631 --> 00:20:15,632 నా ఉద్దేశం… 247 00:20:18,427 --> 00:20:19,761 అసలు కారణం. 248 00:20:20,929 --> 00:20:25,475 నువ్వు నేరం చేశావు కనుకే జైలుకి వెళ్లావు 249 00:20:25,559 --> 00:20:28,020 - ఇంకా… నా ఉద్దేశం, వాళ్లు… - నాటలీ… 250 00:20:28,103 --> 00:20:31,273 - వాళ్లు అలా చేయడానికి… - …ఆగు, ఆగు, ఆగు, ఆగు. 251 00:20:31,356 --> 00:20:32,608 అది మంచి నీరు కాదు. 252 00:20:33,525 --> 00:20:36,069 అది మంచి నీరు కాదు, కదా? 253 00:20:37,070 --> 00:20:38,280 ఏం చేస్తున్నావు? 254 00:20:39,948 --> 00:20:42,159 నువ్వు ఈ స్థితిలో ఇంటికి వెళ్లకూడదు. 255 00:20:44,745 --> 00:20:45,829 ఏం అంటున్నావు? 256 00:20:47,372 --> 00:20:48,415 వావ్. 257 00:20:50,918 --> 00:20:55,297 నీ లోపల ఒక తుఫాను ఉందని నాకు తెలుస్తోంది. 258 00:20:57,174 --> 00:20:58,175 అందుకే తాగుతున్నావు కదా, 259 00:20:59,551 --> 00:21:01,053 నీలోని తుఫానుని చల్లార్చడం కోసం. 260 00:21:03,305 --> 00:21:07,392 సరే, నీకు కాఫీ ఇప్పిస్తాను, అప్పుడు నువ్వు మళ్లీ మామూలు స్థితికి రావచ్చు. 261 00:21:08,101 --> 00:21:10,521 ఆ తరువాత నిన్ను మీ ఇంట్లో దిగబెడతాను. ఏం అంటావు? 262 00:21:12,606 --> 00:21:14,775 నువ్వు ఇక్కడ ఆపచ్చు. ఇక్కడే. 263 00:21:15,651 --> 00:21:19,071 - అలాగే. - నేను వెనుక వైపు నుంచి వెళతాను. 264 00:21:22,741 --> 00:21:23,951 నేను దొంగచాటుగా వచ్చాను. 265 00:21:26,161 --> 00:21:27,704 ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. 266 00:21:35,420 --> 00:21:36,421 ఏంటి? 267 00:21:37,756 --> 00:21:39,883 నా తల్లిదండ్రులు నువ్వంటే చాలా భయపడుతున్నారు. 268 00:21:43,887 --> 00:21:44,888 మరి నువ్వు? 269 00:21:49,768 --> 00:21:52,145 - నన్ను చూసి భయపడుతున్నావా? చెప్పు. - లేదు. లేదు. 270 00:21:52,229 --> 00:21:55,649 నువ్వు భయపడవని ఆశిస్తాను, ఎందుకంటే నీకంటూ సొంత అభిప్రాయాలు ఉంటాయని నాకు తెలుసు. 271 00:21:55,732 --> 00:21:57,317 అది నీకెలా కనిపించింది? 272 00:21:57,401 --> 00:21:58,986 ఎవరైనా చూడగలరు. 273 00:22:00,404 --> 00:22:01,530 వాళ్లు చూస్తే గనుక. 274 00:22:04,783 --> 00:22:07,035 నాటలీ, నువ్వు ఎలా ఉన్నావు? 275 00:22:10,998 --> 00:22:13,250 ఎవరైనా నన్ను ఇలా అడిగి చాలా కాలమైంది. 276 00:22:20,549 --> 00:22:26,597 మమ్మల్ని, లేదా నన్ను ఇబ్బంది పెట్టడానికి, అంటే, నవేయాని నువ్వే పంపించావా? 277 00:22:27,306 --> 00:22:29,266 ఆ అమ్మాయి నిన్నేమయినా చేసిందా? 278 00:22:29,850 --> 00:22:35,439 నాకు తెలియదు. తను ఒక ఫ్రెండ్ లా నటించింది, లేదా… 279 00:22:36,940 --> 00:22:37,941 ఫ్రెండ్ కన్నా ఎక్కువగా నటించింది. 280 00:22:40,736 --> 00:22:41,737 వావ్. 281 00:22:43,572 --> 00:22:45,324 నాకు నిజంగా తనతో అంత పరిచయం లేదు, 282 00:22:45,407 --> 00:22:48,160 కానీ తను నిన్ను బాధపెట్టినందుకు నేను సారీ చెబుతున్నాను. 283 00:22:49,995 --> 00:22:54,416 అవును. అది నిజంగా జరిగిందంటే నమ్మలేకపోతున్నాను. 284 00:22:54,499 --> 00:22:55,709 నాకు తెలుసు, నాకు తెలుసు. 285 00:22:55,792 --> 00:22:59,379 అవును, ఎవరైనా మనల్ని మోసం చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు, సరేనా? 286 00:23:01,215 --> 00:23:06,553 అది నువ్వు ఒంటరివి అనే ఫీలింగ్ కలిగించవచ్చు. కానీ నువ్వు ఒంటరితనాన్ని ధైర్యంగానే ఎదుర్కొంటున్నావు. 287 00:23:08,514 --> 00:23:10,682 అదే నీ అసలైన బలం. 288 00:23:12,392 --> 00:23:13,644 దాన్ని గర్వంగా స్వీకరించు. 289 00:23:16,063 --> 00:23:17,064 ఏంటి? 290 00:23:17,940 --> 00:23:21,109 ఆ పాడ్ కాస్ట్ కుర్రవాడు టామ్ గురించి ఏమన్నాడో విన్నావా? 291 00:23:21,944 --> 00:23:23,320 లేదు. 292 00:23:23,403 --> 00:23:26,573 ఆయనే నా కన్న తండ్రి అని, అంటే, అయ్యుండొచ్చు అన్నాడు. 293 00:23:29,743 --> 00:23:32,037 అప్పట్లో వాళ్ల మధ్య ఏం జరిగిందో నీకు తెలుసా? 294 00:23:37,209 --> 00:23:38,627 మీ అమ్మని అడుగు. 295 00:23:43,257 --> 00:23:45,008 నీకు సమాధానం చెప్పకపోతే, 296 00:23:46,718 --> 00:23:47,719 అప్పుడు నన్ను అడుగు. 297 00:23:49,179 --> 00:23:50,180 సరే. 298 00:23:51,849 --> 00:23:53,225 నువ్వు ఇంక వెళ్లడం మంచిది. 299 00:23:54,101 --> 00:23:56,895 నాకు తెలుసు. నాకు కూడా టెన్షన్ గానే ఉంది. 300 00:23:56,979 --> 00:23:59,147 నువ్వు బాగానే ఉన్నావా? బాగానే అనిపిస్తోందా? 301 00:23:59,231 --> 00:24:00,774 హా, చాలా నయం. 302 00:24:01,692 --> 00:24:04,152 నాకు ఖరీదైన కాఫీ ఇప్పించినందుకు థాంక్యూ. 303 00:24:05,028 --> 00:24:06,154 ఎప్పుడైనా సరే. 304 00:24:11,326 --> 00:24:12,786 - బై. - బై. 305 00:24:42,858 --> 00:24:45,027 యాంగర్ మేనేజ్మెంట్ కి స్వాగతం. 306 00:24:45,110 --> 00:24:50,407 నా పేరు డాక్టర్ అనిత. మీరందరూ కెమెరాలని ఆన్ లో ఉంచుకోండి. 307 00:24:50,490 --> 00:24:53,327 అందరూ పాల్గొంటున్నారని తెలుసుకోవడం చాలా ముఖ్యం, 308 00:24:53,410 --> 00:24:55,287 ఇంకా అది అవసరం కూడా. 309 00:25:14,765 --> 00:25:18,435 యాంగర్ మేనేజ్మెంట్ అంటే మనలో ఉన్న కోపాన్ని అణుచుకోవడం కాదు, 310 00:25:18,519 --> 00:25:21,688 ఎందుకంటే దాన్ని అణచుకుంటే, తరువాత ఎప్పుడైనా అది బయటకి వస్తే 311 00:25:21,772 --> 00:25:23,357 ఇంకా పెద్దగా, మరింత తీవ్రతతో ఉంటుంది. 312 00:25:24,483 --> 00:25:25,859 ఆనా? 313 00:25:26,443 --> 00:25:27,694 ఆనా బౌడెన్? 314 00:25:29,696 --> 00:25:30,781 సారీ, ఏంటి? 315 00:25:30,864 --> 00:25:32,699 నేను చూస్తున్నానని గుర్తుంచుకోండి. 316 00:25:33,200 --> 00:25:34,201 కెమెరాలు ఆన్ లో ఉన్నాయి. 317 00:25:34,284 --> 00:25:36,578 నేను ఇక్కడే ఉన్నాను. సారీ. 318 00:25:37,079 --> 00:25:39,081 సరే. మంచిది. 319 00:25:40,499 --> 00:25:41,875 అందరం ఒక ఎక్సర్ సైజ్ చేద్దాం. 320 00:25:41,959 --> 00:25:44,336 - నాటలీ, వద్దు. - కిందటిసారి 321 00:25:44,419 --> 00:25:46,713 మీ మెడ కండరాలు బిగుసుకుపోయినట్లు ఎప్పుడు అనిపించిందో ఆలోచించండి. 322 00:25:46,797 --> 00:25:49,299 - …నేను బాగానే ఉన్నాను. నువ్వు… - కళ్లు మూసుకోండి… 323 00:25:49,383 --> 00:25:51,510 - గొంతు తగ్గించి మాట్లాడు. - …ఇంకా ఆ పరిస్థితిని ఊహించుకోండి. 324 00:25:51,593 --> 00:25:53,637 దేవుడు క్షమించాలి, నేను ఈ చెత్త ఆల్కహాల్ కి 325 00:25:53,720 --> 00:25:55,681 - పదిహేడేళ్లకే అలవాటు పడ్డాను. - అది ఎలా మొదలైందనేది ఆలోచించకండి, 326 00:25:55,764 --> 00:25:57,224 కానీ ఏం జరిగిందనేది గుర్తుచేసుకోండి. 327 00:25:57,307 --> 00:25:59,309 - నన్ను గమనించడం ఆపండి. - ఆపు. అరవడం ఆపు. 328 00:25:59,393 --> 00:26:01,395 నీ తాగుడు గురించి ఆందోళన పడాల్సిన అవసరం ఇప్పుడు మీ అమ్మకు లేదు. 329 00:26:01,478 --> 00:26:03,021 నన్ను మనిషిలా బతకనివ్వండి 330 00:26:03,105 --> 00:26:05,524 - ఇంకా నన్ను సొంతంగా నేర్చుకోనివ్వండి. - మనిషిలాగా? మనిషిలాగా? 331 00:26:05,607 --> 00:26:08,110 - ఏం జరుగుతోంది? - నేను చూసుకుంటున్నాను. 332 00:26:09,903 --> 00:26:13,448 నాటలీ, నీకు ఆల్కహాల్ ఎక్కడిది? 333 00:26:14,616 --> 00:26:17,244 ఈ ప్రపంచంలో. చాలా దొరుకుతుంది. 334 00:26:17,744 --> 00:26:19,288 నా ప్రశ్నకి సమాధానం చెప్పు. 335 00:26:19,371 --> 00:26:21,206 నువ్వు రెండు రోజులుగా ఇంట్లోనే ఎందుకు ఉంటున్నావు? 336 00:26:21,874 --> 00:26:23,000 ఏదో చిన్న అపార్థం జరిగింది. 337 00:26:23,083 --> 00:26:24,459 నువ్వు లైంగికంగా ఎవరినైనా వేధించావా? 338 00:26:24,543 --> 00:26:25,752 - లేదు. - లేదు. 339 00:26:27,963 --> 00:26:29,506 మేడ మీదకి వెళ్లు. వెళ్లు. 340 00:26:31,675 --> 00:26:35,137 బాగుంది, బాగుంది. ఇప్పుడు నేను ఒక కామపిశాచినని తను అనుకుంటుంది. 341 00:26:35,220 --> 00:26:36,597 నేను ఒక విషపూరితమైన వ్యక్తిని అయిపోయాను. 342 00:26:36,680 --> 00:26:40,601 లేదు, లేదు, తను అలా అనుకోదు. తను అయోమయంలో ఉంది. నేను అయోమయంలో ఉన్నాను. 343 00:26:41,768 --> 00:26:43,437 ఏమీ జరగలేదని నీకు చెప్పాను కదా. 344 00:26:44,521 --> 00:26:47,900 ఏదో దాదాపు జరగబోయింది అంటే దాని అర్థం ఏమీ జరగలేదు అని కాదు. 345 00:26:51,486 --> 00:26:52,738 ఏంటి సంగతి? 346 00:26:54,072 --> 00:26:55,657 ఆమె నీ నోరు మూయించిందా? 347 00:26:57,659 --> 00:26:58,827 ఏంటి? 348 00:27:13,634 --> 00:27:14,676 ఏంటి? 349 00:27:19,014 --> 00:27:22,017 ఆ గోడలు ఎందుకో తేడాగా ఉన్నాయి. 350 00:27:24,770 --> 00:27:26,271 నాకెందుకో తేడాగా ఉంది. 351 00:27:35,614 --> 00:27:36,782 నాకు బాగా లేదు… 352 00:27:38,659 --> 00:27:39,743 ఓహ్, చెత్త. 353 00:27:40,661 --> 00:27:43,997 ఓహ్, చెత్త. నాట్. నాట్! జాక్! ఆ టీ తాగకండి! 354 00:27:44,081 --> 00:27:45,916 వాళ్లు ఆ టీ ఎందుకు తాగకూడదు? 355 00:27:48,210 --> 00:27:50,504 అందులో ఏదో యాసిడ్ కలిపారు అనుకుంటా. 356 00:27:50,587 --> 00:27:51,630 యాసిడా? 357 00:27:52,422 --> 00:27:54,258 - అవును. - యాసిడ్? ఎక్కడ? ఏంటి? 358 00:27:54,341 --> 00:27:55,968 అది ఎక్కడి నుండి వచ్చింది? 359 00:27:59,429 --> 00:28:00,472 నా సరుకుల నుంచి వచ్చింది. 360 00:28:01,473 --> 00:28:04,268 నీ సరకుల నుంచి… నీ యాసిడ్ సప్లయ్ నుంచా? 361 00:28:05,185 --> 00:28:07,062 అవును. అది… 362 00:28:07,145 --> 00:28:10,566 అది కొద్ది మోతాదులో తీసుకోవడానికి తెచ్చుకున్నాను. నేను… ఒత్తిళ్లు తగ్గించడం కోసం. 363 00:28:11,733 --> 00:28:13,110 అది సిబిడి ఆయిల్ లాంటిది. 364 00:28:13,193 --> 00:28:14,194 నాట్! 365 00:28:19,992 --> 00:28:21,326 ఓహ్, దేవుడా. 366 00:28:23,453 --> 00:28:26,039 నేను 17 ఏళ్ల పాటు డ్రగ్స్ కి దూరంగా ఉన్నాను, టామ్. 367 00:28:29,168 --> 00:28:30,252 ఆగు. 368 00:28:31,295 --> 00:28:33,839 నీ యాసిడ్ మా డ్రింక్స్ లోకి ఎలా వచ్చింది? 369 00:28:33,922 --> 00:28:37,176 నిజమే. అతను ఎలా చేయగలిగాడు? 370 00:28:39,344 --> 00:28:41,054 ఎవరికో ఈ విషయం తెలిసిపోతుంది. 371 00:28:42,389 --> 00:28:43,599 వాళ్లు పిల్లల్ని తీసుకువెళ్లిపోతారు. 372 00:28:43,682 --> 00:28:46,059 - లేదు, ఎవ్వరూ ఎవ్వరినీ తీసుకువెళ్లరు… - లేదు, లేదు, లేదు. విను, విను. 373 00:28:46,143 --> 00:28:49,271 చెడుగా ఆలోచించకు, లేదంటే… 374 00:28:49,354 --> 00:28:51,690 లేదంటే నీకు మైకం బాగా కమ్మేస్తుంది. కంగారుపడకు. 375 00:28:51,773 --> 00:28:53,358 నీకు వీటి గురించి చాలా తెలుసా, హా? 376 00:28:53,442 --> 00:28:56,320 నాకు తెలుసు, నాకు తెలుసు. నేను దీని గురించి నీకు చాలా చెప్పగలను. 377 00:28:57,362 --> 00:29:00,949 హలో? మిసెస్ బౌడెన్? 378 00:29:03,911 --> 00:29:05,704 - మీరు స్పందించడం లేదు. - అది ఏంటి? 379 00:29:06,330 --> 00:29:07,372 ఆగు. 380 00:29:07,915 --> 00:29:11,084 నాకు కొద్దిగా ఆందోళనగా ఉంది. నేను… దయచేసి మీరెలా ఉన్నదీ నాకు చెబుతారా? 381 00:29:11,168 --> 00:29:12,586 మనం మ్యూట్ లో ఉన్నామా? 382 00:29:18,383 --> 00:29:19,843 అంతా బాగానే ఉందా? 383 00:29:22,763 --> 00:29:24,097 అవును. 384 00:29:26,266 --> 00:29:29,686 అమ్మా? ఈ మెట్లు నాకు చాలా పెద్దగా అనిపిస్తున్నాయి. 385 00:29:30,229 --> 00:29:33,607 మనం ప్రశాంతంగా ఉందాం, ఈ సమస్య నుంచి బయటపడదాం. 386 00:29:33,690 --> 00:29:38,362 మనం రెడీగా ఉండాలి. అతను ఎదురుచూస్తున్నాడు. ఇక్కడికి వచ్చేస్తాడు. 387 00:29:39,071 --> 00:29:40,697 మనం పోలీసులకి ఫోన్ చేయాలి. 388 00:29:46,119 --> 00:29:48,914 బహుశా అతనికి కావాల్సింది అదేనేమో, కదా? 389 00:29:48,997 --> 00:29:52,751 బహుశా మనమే స్వయంగా పోలీసులకి ఫోన్ చేయాలని అతను కోరుకుంటున్నాడేమో. 390 00:29:53,669 --> 00:29:55,921 లేదా బహుశా… 391 00:29:58,882 --> 00:30:02,261 మనమే స్వయంగా పోలీసులకి ఫోన్ చేయాలని కోరుకుంటున్నాడని మనం అనుకోవాలని అతను ఆశిస్తున్నాడేమో. 392 00:30:04,346 --> 00:30:07,182 ఆగు, నా ఉద్దేశం మీకు అర్థమైందా? 393 00:30:07,850 --> 00:30:09,351 మనం కెమెరాల్లో గమనిద్దాం. 394 00:30:11,228 --> 00:30:12,312 నేను వెళ్లి నా షాట్ గన్ తీసుకొస్తాను. 395 00:30:12,396 --> 00:30:14,273 ఆగు, అది మంచి ఆలోచనే అంటావా? 396 00:30:15,983 --> 00:30:17,150 అదే మంచిది అనుకుంటున్నాను. 397 00:30:47,264 --> 00:30:48,473 నువ్వు ఎవరు? 398 00:30:52,436 --> 00:30:55,480 అది కేవలం ఒక మెడిసిన్ నీ శరీరం మీద ప్రభావం చూపిస్తోంది. 399 00:30:57,858 --> 00:30:59,526 నిన్న రాత్రి నువ్వు నా గదిలో ఎందుకు ఉన్నావు? 400 00:31:00,027 --> 00:31:01,737 నాటలీ, నీ తమ్ముడితో మంచిగా మాట్లాడు. 401 00:31:02,905 --> 00:31:05,490 అది నా కల అనుకున్నాను, కానీ అది కల కాదనుకుంటా. 402 00:31:06,241 --> 00:31:07,451 నాటలీ. 403 00:31:07,534 --> 00:31:09,119 ఎందుకంటే రాత్రి నాకు నీ మాట వినిపించింది. 404 00:31:09,703 --> 00:31:12,623 - ఆపు. - నువ్వు చెడ్డ పనులు చేస్తున్నావు అనుకుంటా. 405 00:31:13,123 --> 00:31:15,083 నీ తమ్ముడితో నువ్వు ఇంకా మంచిగా ప్రవర్తించాలి. 406 00:31:15,167 --> 00:31:17,169 ఇల్లంతా తిరుగుతూ, అందరి గదుల్లోకి వెళ్తున్నట్లున్నావు. 407 00:31:17,252 --> 00:31:18,295 వాడు ఏదో బాధలో ఉన్నాడు. 408 00:31:18,378 --> 00:31:19,546 నువ్వు చేస్తున్నావని తెలుసు. 409 00:31:19,630 --> 00:31:21,548 అందుకే నువ్వు వాడితో చాలా సున్నితంగా వ్యవహరించాలి. 410 00:31:21,632 --> 00:31:22,799 ఏం చేస్తున్నావు? 411 00:31:24,593 --> 00:31:25,886 హలో? 412 00:31:25,969 --> 00:31:27,471 ఆపు. 413 00:31:30,849 --> 00:31:34,853 నువ్వు ఏం చేశావు? 414 00:31:34,937 --> 00:31:36,104 నేనేం చేశాను? 415 00:31:36,188 --> 00:31:38,482 "మనం ఏం చేశామో అతనికి తెలిస్తే ఏమవుతుంది?" నువ్వు ఈ మాటే అన్నావు 416 00:31:38,565 --> 00:31:40,025 అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. 417 00:31:40,108 --> 00:31:42,528 అదేమిటో నాకు తెలుసుకోవాలని ఉంది. 418 00:31:53,872 --> 00:31:56,250 ఆ తర్వాత దాన్ని సరిదిద్దే క్రమంలో నేను అతిగా ప్రవర్తించానేమో అనిపిస్తోంది. 419 00:31:59,127 --> 00:32:02,047 అసలు నా జీవితమంతా ఒక 'ఓవర్ కరెక్షన్' లాగే అనిపిస్తోంది. 420 00:32:03,090 --> 00:32:05,175 ఏ తప్పుని అతిగా సరిదిద్దుకున్నావు? 421 00:32:11,515 --> 00:32:12,975 జాక్, ఎందుకు కూనిరాగం తీస్తున్నావు? 422 00:32:18,939 --> 00:32:20,357 జాక్ ఎవరు? 423 00:32:25,737 --> 00:32:26,738 ఆగండి. 424 00:32:30,242 --> 00:32:31,952 అది విన్నావా? 425 00:32:34,079 --> 00:32:35,163 అది నిజమైనదే అంటావా? 426 00:32:36,456 --> 00:32:37,499 అది నాకు వినిపిస్తోంది. 427 00:32:41,211 --> 00:32:42,212 టామ్. 428 00:32:44,131 --> 00:32:45,674 అది మన ఇంట్లో ఏం చేస్తోంది? 429 00:32:46,258 --> 00:32:49,887 ఓహ్, చెత్త. నాకు డ్రోన్స్ అంటే అసహ్యం. 430 00:32:49,970 --> 00:32:54,975 అందరూ, నిశ్శబ్దంగా ఉండండి. అది ఇక్కడికి నిజంగా వచ్చిందో లేదో మనకి తెలియదు. 431 00:32:55,058 --> 00:32:56,727 లేదు, అది నిజమైనదే అనుకుంటా. 432 00:33:33,764 --> 00:33:34,806 సరే. 433 00:34:05,379 --> 00:34:07,130 మనం ఏదో ఒకటి చేయాలి. 434 00:34:08,715 --> 00:34:10,259 మనం పోలీసులకి ఫోన్ చేయాలి. 435 00:34:10,759 --> 00:34:12,052 పోలీసులు ఏమీ సాయం చేయలేరు. 436 00:34:13,387 --> 00:34:17,431 మనం ఏదీ రుజువు చేయలేము. కానీ కావాలంటే వేరే మార్గాలు ఉన్నాయి. 437 00:34:20,226 --> 00:34:23,522 అతనికి ఒక మెసేజ్ ఇవ్వడానికి మనం ఎవరినైనా నియమించుకోవచ్చు. 438 00:34:24,022 --> 00:34:27,317 నాకు తెలిసిన నేరగాళ్లు అందరూ అమాయకులే, గుర్తుందా? 439 00:34:29,402 --> 00:34:32,447 అతనికి అసలు ఏం కావాలి? అంటే, ఇవన్నీ చేయడంలో అతని తుది లక్ష్యం ఏంటి? 440 00:34:33,824 --> 00:34:35,158 మనమెందుకు తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు? 441 00:34:35,659 --> 00:34:36,659 నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. 442 00:34:36,743 --> 00:34:39,288 లేదు, అతను సరిగ్గా మన ఎదురుగానే ఉన్నాడు, కదా? 443 00:34:40,121 --> 00:34:41,540 ఒక మంచి పొరుగువాడిగా నటిస్తున్నాడు. 444 00:34:41,623 --> 00:34:42,748 - అవును. - మనం ఆడదాం… 445 00:34:42,833 --> 00:34:44,251 మనం కూడా ఆ పొరుగువాడి ఆటే ఆడదాం. 446 00:34:44,333 --> 00:34:46,460 మనం అతనితో మాట్లాడించగలిగితే, అతనేం కోరుకుంటున్నాడో తెలుసుకోవచ్చు. 447 00:34:47,295 --> 00:34:48,547 ఎప్పుడు? 448 00:34:50,090 --> 00:34:51,216 ఇప్పుడే ఎందుకు వెళ్లకూడదు? 449 00:35:15,324 --> 00:35:17,576 లోపల నవేయా ఉందనే సంకేతం కోసం ఒక కన్నేసి ఉంచు. 450 00:35:17,659 --> 00:35:18,660 అలాగే. 451 00:35:18,744 --> 00:35:20,954 అతను గనుక ఆమెకి ఆశ్రయం ఇస్తే, డిస్ట్రిక్ట్ అటార్నీ అతని మీద కేసు పెడతాడు. 452 00:35:51,485 --> 00:35:53,612 తాళం తీసే ఉంది! లోపలికి పద. 453 00:35:56,114 --> 00:35:58,242 రోమియో. రోమియో… 454 00:36:01,870 --> 00:36:03,080 ఎవరది? 455 00:36:04,748 --> 00:36:06,583 లేదు. లేదు, మరేం ఫర్వాలేదు. 456 00:36:08,752 --> 00:36:10,462 హలో. ఎవరది? 457 00:36:10,546 --> 00:36:11,713 రోమియో! 458 00:36:11,797 --> 00:36:12,798 హేయ్! 459 00:36:14,383 --> 00:36:15,717 నేను… 460 00:36:15,801 --> 00:36:16,927 - హేయ్! - హాయ్. 461 00:36:17,010 --> 00:36:18,345 - టామ్. - అవును. 462 00:36:19,012 --> 00:36:20,013 ఎలా… 463 00:36:20,097 --> 00:36:22,641 వావ్, నా పొరుగింటి దంపతులు ఇద్దరూ వచ్చారు. 464 00:36:24,017 --> 00:36:26,019 భలే సర్ ప్రైజ్ ఇది. ఏం పని మీద వచ్చారు? 465 00:36:27,187 --> 00:36:29,481 ఊరికే, ఇలా వచ్చాము. హాయ్ చెప్పాలి అనుకున్నాము. 466 00:36:29,565 --> 00:36:30,566 - అవును. - హాయ్. 467 00:36:30,649 --> 00:36:32,651 ఒక విషయం చెప్పనా? మేము మళ్లీ వస్తాము, అప్పుడు మాట్లాడుకోవచ్చు. 468 00:36:32,734 --> 00:36:34,528 లేదు, లేదు, లేదు, లేదు. మంచి పని చేశారు, మంచి పని చేశారు. 469 00:36:34,611 --> 00:36:37,322 నాకు ఒక సెకను టైమ్ ఇవ్వండి. ఏదో ఒక రోజు మీరు వస్తారని ఎదురుచూస్తున్నాను. 470 00:36:37,823 --> 00:36:39,533 సరే, నన్ను చూడనివ్వండి… ఒక్క సెకను. 471 00:36:39,616 --> 00:36:42,202 మీకు కూడా సరిపడా ఫుడ్ రెడీ చేశాను అనుకుంటా. 472 00:36:42,286 --> 00:36:45,247 అవును. అంతే అనుకుంటా… అవును, అవును. కాబట్టి, ఉండండి. 473 00:36:45,330 --> 00:36:48,375 ఉండండి… ఉండండి ఇంకా… 474 00:36:49,126 --> 00:36:51,086 …నాతో కలిసి భోజనం చేయండి, అప్పుడు మాట్లాడుకుందాం. 475 00:36:53,672 --> 00:36:55,215 మీరు ఇది ఖచ్చితంగా రుచి చూడాలి. 476 00:36:58,802 --> 00:36:59,845 పంది చెవులు. 477 00:37:01,096 --> 00:37:02,764 వద్దు. థాంక్యూ. 478 00:37:02,848 --> 00:37:04,057 ఆనా. 479 00:37:05,058 --> 00:37:06,476 విచిత్రమైన కడుపు, కదా? 480 00:37:06,560 --> 00:37:08,937 కానీ, ఇవి చాలా రుచిగా ఉంటాయి. 481 00:37:10,939 --> 00:37:14,568 మాక్స్, నీ పనులకి అంతరాయం కలిగించడం మా ఉద్దేశం కాదు. మేము కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చాం… 482 00:37:16,862 --> 00:37:18,572 అది మా పిల్లా? 483 00:37:19,281 --> 00:37:20,699 ఏంటి, ఇదా? అవునా? 484 00:37:21,575 --> 00:37:24,494 నిజంగానా? ఇది నా గుమ్మం దగ్గరకి వచ్చింది. ఏదో వీధి పిల్లి అనుకున్నాను. 485 00:37:25,579 --> 00:37:28,165 నా ఉద్దేశం, మీరు దానికి సరిగ్గా తిండి పెట్టడం లేదనుకుంటా. 486 00:37:28,248 --> 00:37:29,791 దానిని చూడండి. ఆకలితో అలమటిస్తోంది. 487 00:37:30,626 --> 00:37:31,960 పీనట్ బటర్ ని నువ్వు తీసుకొచ్చావా? 488 00:37:32,044 --> 00:37:33,128 ఏంటి? 489 00:37:38,091 --> 00:37:40,886 పీనట్ బటర్? నిజంగానా? 490 00:37:41,553 --> 00:37:45,516 ఈ అందమైన జంతువుకి మీరు పీనట్ బటర్ అని పేరు పెట్టారా? 491 00:37:46,850 --> 00:37:48,101 దీని పేరు మన్నీ. 492 00:37:49,770 --> 00:37:51,605 అవును. ఓహ్, అయ్యో. 493 00:37:51,688 --> 00:37:54,316 హనీ! ఇలా వచ్చి నా ఫ్రెండ్స్ ని కలుసుకో. 494 00:37:58,987 --> 00:38:01,573 హాయ్. బౌడెన్ దంపతులు. తను హనీ. 495 00:38:02,658 --> 00:38:03,700 నాకు మీరు గుర్తున్నారు. 496 00:38:04,618 --> 00:38:05,869 అవును, టామ్. మీరు ఆ బార్ కి వచ్చారు. 497 00:38:05,953 --> 00:38:07,204 టామ్, అవును. 498 00:38:07,287 --> 00:38:08,622 అవును. నిజం. నిజం. 499 00:38:08,705 --> 00:38:09,748 హాయ్, టామ్. 500 00:38:10,290 --> 00:38:11,625 హాయ్. 501 00:38:11,708 --> 00:38:14,294 అయితే, వాళ్లు సర్ ప్రైజ్ ఇద్దామని వచ్చారు. 502 00:38:14,378 --> 00:38:15,963 ఇంకా… 503 00:38:16,046 --> 00:38:18,465 మేము కలిసి ఏకాంతంగా డిన్నర్ చేస్తే ఏమీ అనుకోవు కదా? 504 00:38:18,549 --> 00:38:19,550 ఏం ఫర్వాలేదు. 505 00:38:19,633 --> 00:38:20,634 సరే. 506 00:38:32,729 --> 00:38:35,440 హనీ, హనీ, హనీ. 507 00:38:38,402 --> 00:38:39,695 మీరు ఏమీ తినడం లేదు. 508 00:38:41,613 --> 00:38:46,201 సరే, నన్ను తిరస్కరించినట్లు ఫీల్ అవుతున్నాను. 509 00:38:46,285 --> 00:38:47,911 అది నిజం, కానీ ఏది ఏమైనా… 510 00:38:48,495 --> 00:38:49,663 మనం మాట్లాడుకుందాం, మాట్లాడుకుందాం. 511 00:38:50,998 --> 00:38:55,002 ఇప్పుడు, నాకు చెప్పండి, పొరుగిళ్ల వాళ్లు ఏం మాట్లాడుకుంటారు? 512 00:38:55,085 --> 00:38:56,253 నాకు అవగాహన లేదు. 513 00:38:56,336 --> 00:39:00,048 ఏం… ఏంటి? అంటే, ఫ్యామిలీ గురించా? లేదా, బిజినెస్ గురించా? లేదా, భవిష్యత్తు గురించా? ఏంటి? 514 00:39:00,966 --> 00:39:04,136 నీ భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తున్నావు, మాక్స్? 515 00:39:04,219 --> 00:39:06,221 నా ఉద్దేశం, నీకు ఒక మంచి భవిష్యత్తు కావాలి, కాదంటావా? 516 00:39:06,305 --> 00:39:07,723 అవును, అవును. కానీ నీ ఉద్దేశం ఏంటి? 517 00:39:07,806 --> 00:39:12,686 మా ఉద్దేశం ఏమిటంటే, నువ్వు జీవితంలో చాలా కష్టాలు పడిన విషయం మేము గుర్తించాము. 518 00:39:13,312 --> 00:39:15,272 అయితే ఇప్పుడు మేము నీకు సాయం చేయగలం. 519 00:39:16,523 --> 00:39:20,903 సరే. సరే, సరే, సరే. అయితే మీరు నష్టపరిహారం చెల్లించాలి అంటున్నారు, అంతేనా? 520 00:39:22,321 --> 00:39:25,282 సరే. ఊరికే మాట్లాడుకోవడం కోసం అడుగుతున్నాను, మీ మనసులో ఏం ఉంది? 521 00:39:25,365 --> 00:39:30,245 నువ్వు ఒక కొత్త రెస్టారెంట్ పెట్టుకోవడానికి మేము డబ్బులు ఇవ్వచ్చా? పెట్టుబడులు వచ్చేలా సాయం చేయచ్చా? 522 00:39:30,329 --> 00:39:33,373 నాకు ఇంక ఆ అవసరం లేదు ఎందుకంటే టాబితా ఫ్రెండ్ ఒకరు 523 00:39:33,457 --> 00:39:35,209 ఇప్పటికే ఆ పని మొదలుపెట్టాడు. 524 00:39:35,292 --> 00:39:37,211 రెస్టారెంట్ పెట్టే ప్రదేశం అన్నీ నిర్ణయం అయిపోయాయి. 525 00:39:37,294 --> 00:39:40,506 ఇంకా మేము నా పాత మెన్యూ ని మళ్లీ ప్రవేశపెట్టబోతున్నాం. 526 00:39:40,589 --> 00:39:42,090 ఇంకా తరువాత… 527 00:39:42,674 --> 00:39:46,386 ఆ రెస్టారెంట్ కి 'మెలీసా అండ్ ఆడమ్' అని పేరు పెట్టబోతున్నాం 528 00:39:46,470 --> 00:39:47,763 అది అద్భుతంగా ఉండబోతోంది. 529 00:39:47,846 --> 00:39:50,140 దాని కోసం నేను చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. 530 00:39:50,224 --> 00:39:53,352 ఘనంగా జరిగే ప్రారంభోత్సవానికి మీరిద్దరూ కూడా తప్పకుండా రావాలి. 531 00:39:53,435 --> 00:39:56,271 ఉత్సాహంగా ఉండే సమయం! ఉత్సాహంగా ఉండే సమయం, మిత్రులారా. 532 00:39:56,355 --> 00:39:58,357 - నీకు ఏం కావాలి? - నాకు ఏం కావాలా? 533 00:39:58,982 --> 00:40:01,944 నాకు ఏం కావాలి? నాకు నా కుటుంబాన్ని మళ్లీ కలవాలని ఉంది. 534 00:40:03,779 --> 00:40:04,988 నా కోసం మీరు ఆ పని చేయగలరా? 535 00:40:06,615 --> 00:40:08,867 లేదు, మీరు చేయలేరు. సరే, ఇంకేంటి? 536 00:40:10,244 --> 00:40:14,414 హేయ్, మీరు నా కుటుంబాన్ని మళ్లీ పుట్టించడంలో సాయం చేయచ్చు. 537 00:40:18,210 --> 00:40:22,130 ఎందుకంటే, చనిపోవడానికి ముందు, మెలీసా… 538 00:40:23,507 --> 00:40:25,884 అవును. ఆమె ఎగ్స్ ని భద్రపరిచింది. 539 00:40:28,136 --> 00:40:32,933 కాబట్టి, చనిపోయిన నా భార్య అండాన్ని ఎవరైనా గర్భం దాలిస్తే, అప్పుడు నాకు బిడ్డ పుట్టచ్చు. 540 00:40:39,273 --> 00:40:42,192 అంటే, మేము ఆ సరోగసీకి అయ్యే ఖర్చులు భరిస్తాం. 541 00:40:42,276 --> 00:40:43,986 - తప్పకుండా. - దానికి అదనంగా అయ్యే ఖర్చుల్ని కూడా. 542 00:40:44,736 --> 00:40:46,405 నువ్వే సరోగేట్ వి అయితే ఎలా ఉంటుంది? 543 00:40:50,242 --> 00:40:54,746 లేదు, ఆగండి. దానికి ఒక పరిమితమైన వయసు ఉంటుంది, కదా? 544 00:40:54,830 --> 00:40:55,831 ఎంత సిగ్గుచేటు. 545 00:40:58,542 --> 00:41:00,043 లేదు, ఇంకెవరు కావచ్చు? 546 00:41:02,045 --> 00:41:03,213 ఇంకెవరు కావచ్చు? 547 00:41:04,214 --> 00:41:05,424 దాని గురించి ఆలోచిద్దాం. 548 00:41:16,935 --> 00:41:19,980 నేను జోక్ చేశాను. నా దగ్గర ఫ్రోజెన్ ఎగ్స్ ఏమీ లేవు. 549 00:41:21,899 --> 00:41:23,692 మీ ముఖాలు చూడండి. 550 00:41:26,028 --> 00:41:27,738 మీ ముఖాల్ని మీరు చూసుకుని ఉండాల్సింది. 551 00:41:29,573 --> 00:41:32,367 లేదు. కానీ ఆగండి, మీరు నా కోసం ఏం చేయగలరు? క్షమాపణలు కోరగలరు. 552 00:41:32,451 --> 00:41:34,828 నేను క్షమాపణలు కోరాను. కొన్ని వారాల కిందట, నేను క్షమాపణలు కోరాను. 553 00:41:34,912 --> 00:41:36,038 నువ్వు నిజాయితీగా క్షమాపణలు కోరాలి. 554 00:41:36,914 --> 00:41:39,583 నేను నిజాయితీగానే చెప్పాను. మేము నిజాయితీగానే క్షమాపణలు కోరాం. 555 00:41:40,751 --> 00:41:43,128 లేదు, అది పబ్లిక్ గా చెప్పాలి 556 00:41:44,338 --> 00:41:50,719 అందరి ముందు మీరు మాట్లాడాలి ఇంకా నాకు ఎంత ద్రోహం చేశారో వివరంగా చెప్పాలి. 557 00:41:51,637 --> 00:41:55,390 ఇంకా అందుకు బాధ్యత కూడా వహించాలి అప్పుడే మీరు నిజంగా ఎవరనేది జనానికి తెలుస్తుంది. 558 00:41:55,891 --> 00:41:57,226 ఆ విధంగా క్షమాపణలు కోరాలి. 559 00:41:57,309 --> 00:42:00,646 దానితో పాటు మీ లా ప్రాక్టీసుని కూడా వదిలేయాలి. 560 00:42:00,729 --> 00:42:02,064 ఖచ్చితంగా. నా ఉద్దేశం మీరిద్దరూ అలా చేయాలి. 561 00:42:02,689 --> 00:42:04,650 మీరు ఇకపై మరెవరినీ బాధపెట్టకూడదు. 562 00:42:04,733 --> 00:42:07,569 దానికి మీరు చెల్లించే మూల్యం చాలా చిన్నది. చూడండి, దాని గురించి ఇద్దరూ ఆలోచించండి. 563 00:42:07,653 --> 00:42:09,154 ఆనా. ఆనా? 564 00:42:09,238 --> 00:42:10,239 ఏంటి? 565 00:42:10,906 --> 00:42:12,157 నేను నిన్ను నమ్మాను. 566 00:42:13,116 --> 00:42:15,202 ఎందుకంటే నువ్వు నా తరఫున వాదించావు… 567 00:42:21,667 --> 00:42:23,126 నా ఉద్దేశం నీకు తెలుసు. 568 00:42:29,591 --> 00:42:33,262 మమ్మల్ని ప్రశాంతంగా వదిలేయ్ లేదంటే నేను రంగంలోకి దిగాల్సి వస్తుంది. 569 00:42:33,345 --> 00:42:34,513 బెదిరిస్తున్నావా, టామ్? 570 00:42:34,596 --> 00:42:35,889 అవును. 571 00:42:37,599 --> 00:42:40,018 సరే. కానీ అప్పుడు నువ్వు నన్ను చంపాలి. 572 00:42:40,978 --> 00:42:42,229 నాకు తెలుసు. 573 00:42:43,021 --> 00:42:45,983 కానీ దాని గురించి ఆలోచించు. నువ్వు నీ కుటుంబాన్ని మళ్లీ ఎప్పటికీ కలవలేవు… 574 00:42:47,985 --> 00:42:49,361 ఎందుకంటే నువ్వు జైలుకి వెళతావు కాబట్టి. 575 00:42:49,903 --> 00:42:50,988 నేను వెళ్లినట్లు. 576 00:42:51,488 --> 00:42:55,242 ఇదంతా ఏదో కావ్యంలా ఉంది, కాదంటావా? 577 00:42:56,827 --> 00:42:59,538 కానీ నేను ఇక్కడే ఉన్నాను, టామ్. 578 00:43:02,583 --> 00:43:03,750 కానివ్వు. 579 00:43:04,877 --> 00:43:07,254 నువ్వు ఏం చేస్తున్నావో మాకు తెలుసు, మాక్స్. 580 00:43:08,172 --> 00:43:10,591 మాకు తెలుసు. అది నువ్వు ఇంక ఆపాలి. 581 00:43:18,640 --> 00:43:22,603 లైలా అనే ఒక అమ్మాయి కథని మీకు చెబుతాను వినండి. 582 00:43:24,980 --> 00:43:26,440 లైలా… 583 00:43:29,443 --> 00:43:32,237 తను అందరికంటే బాగుంటానని లైలా అనుకుంది. 584 00:43:32,321 --> 00:43:33,739 అది ఆమె ఆలోచన. 585 00:43:35,324 --> 00:43:38,368 ఇంకా ఆమె నిర్లక్ష్యంగా ఉండేది. ముఖ్యంగా ఒక్క అబ్బాయి పట్ల. 586 00:43:39,786 --> 00:43:42,873 ఆమె ఆ అబ్బాయిని బాగా వేధించింది. 587 00:43:47,961 --> 00:43:49,213 కానీ ఆ అబ్బాయి ఓర్పుగా సహించాడు. 588 00:43:49,296 --> 00:43:54,843 ఆ అబ్బాయి సమయం కోసం ఎదురుచూశాడు కానీ ఎప్పుడూ ఎవరితోనూ చెప్పుకోలేదు. 589 00:43:58,764 --> 00:44:04,978 ఇంకా క్రమంగా, కొన్నాళ్ల తరువాత, ఆమె నిర్లక్ష్యం కోరికగా మారింది. 590 00:44:05,896 --> 00:44:09,608 ఆ లైలా ఆ అబ్బాయి ప్రేమలో పడింది. 591 00:44:10,234 --> 00:44:12,861 నేను ఏం మాట్లాడుతున్నానో మీకు తెలుసు, అనుకుంటా. 592 00:44:14,905 --> 00:44:16,573 ఆ అబ్బాయి ఏం చేశాడో తెలుసా? 593 00:44:18,242 --> 00:44:19,535 అతను ఆమె ప్రేమని వాడుకున్నాడు… 594 00:44:22,079 --> 00:44:23,288 ఆమెని శిక్షించడం కోసం. 595 00:44:26,917 --> 00:44:31,630 అప్పుడు అతను ఆమెని పిల్లిలా ఆడించాడు, మన్నీ ఒక చిట్టెలుకతో ఆడుకున్నట్లు ఆడుకున్నాడు, 596 00:44:32,130 --> 00:44:34,675 ఆమె కుంగిపోయి సర్వనాశనం అయిపోయేలా చేశాడు. 597 00:44:37,094 --> 00:44:42,099 ఎందుకో తెలుసా? తను ఎంత బాధపడ్డాడో ఆ అమ్మాయి కూడా అంత బాధలు పడాలని కోరుకున్నాడు. 598 00:44:44,226 --> 00:44:48,480 ఎందుకంటే ఎవరైనా మనకి ద్రోహం చేస్తే… 599 00:44:56,029 --> 00:44:59,825 మనం పగ తీర్చుకునే మార్గం ఆలోచిస్తాం ఇంకా అందుకు తగిన సమయం తీసుకుంటాం 600 00:45:01,159 --> 00:45:04,705 మనం పడిన బాధల్ని ఆ ద్రోహులు కూడా అనుభవించాలని కోరుకుంటాం. 601 00:45:06,456 --> 00:45:10,169 అప్పుడు మన చేతుల్లో ఏమీ ఉండదు. 602 00:45:19,261 --> 00:45:20,679 ఇది చక్కని సాయంత్రం. 603 00:45:21,680 --> 00:45:23,432 మళ్లీసారి, మీకు కావాలంటే మీ ఇంట్లోనే కలుద్దాం. 604 00:45:24,183 --> 00:45:29,062 మన్నీ ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు మీ ఇంటికి వస్తుంది. మీరు పిల్లిని బలవంతం చేయలేరు. 605 00:45:29,146 --> 00:45:31,148 ఇంక ఇక్కడి నుండి బయటకి నడవండి. 606 00:46:20,948 --> 00:46:24,409 గతం 607 00:46:36,338 --> 00:46:37,589 షాంగోని దర్శించుకుంటున్నావా? 608 00:46:38,131 --> 00:46:39,132 అవును. 609 00:46:39,216 --> 00:46:40,384 నీ బలిపీఠాన్ని దర్శించుకుంటున్నాను. 610 00:46:41,969 --> 00:46:46,056 ఇప్పుడు ఆ షాంగో నీ మెదడులో కొలువై ఉన్నాడు కాబట్టి… 611 00:46:46,431 --> 00:46:47,933 …నీకు న్యాయం జరుగుతుంది. 612 00:46:49,101 --> 00:46:50,936 నీకు గుర్తుందా… 613 00:46:51,854 --> 00:46:55,023 …నా మీద దాడి జరిగినప్పుడు… 614 00:46:56,525 --> 00:46:58,402 …నువ్వు నాకు కొంచెం కూడా సాయం చేయలేదు. 615 00:46:59,987 --> 00:47:01,572 నేను వృద్ధుడిని. 616 00:47:01,822 --> 00:47:04,157 అవును, కానీ, నువ్వు మరీ అంత వృద్ధుడివి కావు. 617 00:47:04,825 --> 00:47:07,953 నేను పరిశోధించాను ఇంకా కొంతమందిని అడిగాను. 618 00:47:10,706 --> 00:47:14,501 నన్ను ఎటాక్ చేసిన ఆ ఆర్యన్ బ్రదర్స్ 619 00:47:14,585 --> 00:47:17,004 నిన్ను కూడా వేధిస్తున్నారని నాకు తెలిసింది, అది నిజమేనా? 620 00:47:17,838 --> 00:47:21,049 కానీ నాకు ఏ రక్షణా లేదని నువ్వు వాళ్లకి చెప్పావు. 621 00:47:21,466 --> 00:47:26,013 ఒక రకంగా ఆ గ్యాంగ్ కి నువ్వు నన్ను అప్పగించావు. 622 00:47:26,096 --> 00:47:28,807 - లేదు. లేదు, లేదు. - బలిపశువు మాదిరిగా, తోలుబొమ్మలా, కదా? 623 00:47:29,141 --> 00:47:34,396 నీలో నేను ఏదో గమనించాను. అందుకే నా రక్షణని నీకు అందించాను. 624 00:47:38,275 --> 00:47:39,902 నువ్వు ఏం చేశావంటే… 625 00:47:40,527 --> 00:47:46,408 …నా ద్వేషాన్ని విడిచిపెట్టమని, దాన్ని చంపుకోమని చెప్పావు. 626 00:47:46,783 --> 00:47:53,207 కానీ నాకు ఏం అనిపించింది అంటే నేను నా కోపాన్ని అణచుకోవాలని కోరుకున్నావు 627 00:47:53,707 --> 00:47:57,085 …ఎందుకంటే ఆ కుక్కల దగ్గరకి 628 00:47:57,169 --> 00:48:01,215 నన్ను పంపించింది నువ్వే అని నాకు తెలిసిపోతే అది నీకు ప్రమాదం కాబట్టి. 629 00:48:04,885 --> 00:48:07,804 నా కుటుంబం అంతా చనిపోయారు కాబట్టి వాళ్లు కోపంగా ఉన్నారు. 630 00:48:07,888 --> 00:48:09,973 ఇంకా నేను కూడా కోపంగా ఉండాలని వాళ్లు కోరుకుంటున్నారు. 631 00:48:10,474 --> 00:48:13,435 నేను ద్వేషంతో రగిలిపోవాలని నా కుటుంబం కోరుకుంటోంది, పడ్రినో. 632 00:48:15,437 --> 00:48:19,483 వాళ్లే నాతో అలా చేయించారు. 633 00:48:22,528 --> 00:48:25,489 కానీ నువ్వు గట్టివాడివి… 634 00:48:26,031 --> 00:48:28,992 …ఇంకా నువ్వు వాళ్లని చంపినందుకు నాకు సంతోషంగా ఉంది. 635 00:48:30,911 --> 00:48:35,123 నీకు మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పడం కోసమే నేను నీ సెల్ కి వచ్చాను… 636 00:48:35,332 --> 00:48:38,877 …ఎందుకంటే నువ్వు నన్ను దేవుళ్లకి పరిచయం చేశావు, 637 00:48:38,961 --> 00:48:40,963 దాన్ని నేను నా జీవితాంతం గుర్తుంచుకుంటాను. 638 00:48:41,046 --> 00:48:43,257 కానీ నేను ఊరికే అలా మర్చిపోలేను! 639 00:48:54,184 --> 00:48:57,187 కోల్పోయిన గతం 640 00:48:59,731 --> 00:49:03,277 దేవుళ్లు కోరుకున్నది ఇది కాదు. 641 00:49:04,820 --> 00:49:07,656 ఆ దేవుళ్లు నన్ను చూసి చాలా సంతోషిస్తారు. 642 00:49:07,739 --> 00:49:09,908 నేను వాళ్లకి ఒక కుటుంబాన్ని ఇవ్వబోతున్నాను. 643 00:49:19,501 --> 00:49:21,128 అతను దేని గురించి మాట్లాడాడు? 644 00:49:21,211 --> 00:49:22,504 ఆ అమ్మాయి కథ గురించా? 645 00:49:22,588 --> 00:49:24,840 లేదు. మీ ఇద్దరి గురించి. 646 00:49:24,923 --> 00:49:26,967 చూడు, "నా ఉద్దేశం నీకు అర్థమైంది కదా. దేని గురించి మాట్లాడుతున్నానో నీకు తెలుసు." 647 00:49:27,050 --> 00:49:30,554 నాకు తెలియదు. అతని మనసులో ఏం ఆలోచనలు ఉన్నాయో నాకు తెలియదు. నాకు అసలు అవగాహన లేదు. 648 00:49:31,805 --> 00:49:33,390 తనతో అంతసేపు మాట్లాడాక, దాని గురించి ఆలోచిస్తున్నావా? 649 00:49:33,473 --> 00:49:34,558 నువ్వు అతనితో పడుకున్నావా? 650 00:49:36,602 --> 00:49:40,314 అప్పటికి నేను గర్భవతిని కదా, టామ్? నేను అతనితో పడుకున్నానా? 651 00:49:41,190 --> 00:49:45,068 ఆ కేసు విచారణ సమయంలో నేను అక్రమంగా సంబంధం పెట్టుకున్నది నీతోనే. 652 00:49:46,987 --> 00:49:48,363 నాకు తెలియదు. 653 00:49:48,447 --> 00:49:53,577 బహుశా… బహుశా… అంటే, అతని భార్య చనిపోక ముందు, 654 00:49:53,660 --> 00:49:57,748 బహుశా మా మధ్య ఏదో జరిగి ఉంటుంది, అంటే ఏదో ఎమోషనల్ కనెక్షన్ లాంటిది. 655 00:49:57,831 --> 00:49:59,625 నీకు, లెక్సీకి మధ్య ఉన్న సంబంధం లాంటిది కావచ్చు. 656 00:49:59,708 --> 00:50:01,335 వద్దు… ఆ విషయాన్ని తిరిగి నా వైపు తిప్పకు. 657 00:50:01,418 --> 00:50:02,753 అతను నీ మెదడుతో ఆటలాడుతున్నాడు, టామ్. 658 00:50:02,836 --> 00:50:05,047 ఇలా రండి, లోపలికి రండి! ఏదో కాలిపోతోంది! 659 00:50:08,091 --> 00:50:09,968 అమ్మా. టామ్, 660 00:50:10,052 --> 00:50:12,095 - నాటలీ? - సరే. వెనక్కి వెళ్లు. వెనక్కి వెళ్లు, వెళ్లు. 661 00:50:12,179 --> 00:50:14,223 నువ్వు బాగానే ఉన్నావా? హేయ్. నువ్వు బాగానే ఉన్నావా? 662 00:50:14,306 --> 00:50:15,682 మనం కాల్ చేద్దామా… 663 00:50:15,766 --> 00:50:17,059 ఓహ్, చెత్త. 664 00:50:49,216 --> 00:50:50,467 టామ్, ఏం జరుగుతోంది? 665 00:50:50,551 --> 00:50:52,052 జాక్ మంటలు అంటించాడు. 666 00:50:52,135 --> 00:50:53,136 ఏంటి? 667 00:50:55,222 --> 00:50:56,223 జాక్, తలుపు తీయ్! 668 00:50:56,306 --> 00:50:58,016 జాక్! జాక్? 669 00:51:00,227 --> 00:51:01,311 వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? 670 00:51:01,895 --> 00:51:03,063 ఏంటి? 671 00:51:03,146 --> 00:51:04,982 - వాడితో పాటు లోపల ఎవరో ఉన్నారు. - ఓహ్, దేవుడా. 672 00:51:05,607 --> 00:51:06,650 జాక్? 673 00:51:07,943 --> 00:51:11,113 జాక్! ఎక్కడ ఉన్నావు? హేయ్… 674 00:51:13,115 --> 00:51:14,116 ఏంటిది? 675 00:51:14,616 --> 00:51:16,201 ఏం జరుగుతోంది? ఇక్కడి నుండి బయటకి రా. 676 00:51:16,285 --> 00:51:17,369 - ఇక్కడి నుండి లే. - పద. 677 00:51:17,452 --> 00:51:19,538 - పట్టుకో. వాడిని తీసుకువెళ్లు. కూర్చో. - శాంతించండి. 678 00:51:20,664 --> 00:51:23,000 దేవుడా. ఓహ్, దేవుడా. 679 00:51:24,376 --> 00:51:25,586 జాగ్రత్త. 680 00:51:29,214 --> 00:51:32,676 ఓహ్, దేవుడా. ఇది ఎక్కడికి వెళుతుందో చూస్తాను. 681 00:51:37,306 --> 00:51:38,765 ఆ మంటలు అంటించింది నువ్వేనా? 682 00:51:41,393 --> 00:51:43,145 నువ్వు ఇంకా ఏవేం చేశావు? 683 00:51:45,230 --> 00:51:46,481 మా టీలో డ్రగ్స్ కలిపింది నువ్వేనా? 684 00:51:51,111 --> 00:51:54,531 నీ కుటుంబానికి అలా ఎందుకు చేస్తున్నావు? ఎందుకు? 685 00:51:54,615 --> 00:51:56,158 మీరు నా కుటుంబం కాదు. 686 00:51:57,451 --> 00:51:59,870 జాక్, నాతో మాట్లాడు. 687 00:51:59,953 --> 00:52:01,955 ఏం చేస్కుంటావో చేస్కో, ఆనా. 688 00:52:04,374 --> 00:52:07,085 ఆనా, ఇక్కడ ఎవరో ఉన్నారు అనుకుంటా. 689 00:52:17,930 --> 00:52:18,931 టామ్? 690 00:52:20,849 --> 00:52:22,434 టామ్! 691 00:52:22,518 --> 00:52:23,810 నేను బాగానే ఉన్నాను! 692 00:52:24,937 --> 00:52:28,315 ఎక్కడ ఉన్నావు? నాకేం కనిపించడం లేదు. 693 00:52:28,982 --> 00:52:30,442 నేను మెట్ల మీద నుంచి పడ్డాను! 694 00:52:34,488 --> 00:52:37,157 ఏంటిది? ఇదంతా ఏంటి? 695 00:52:37,241 --> 00:52:40,202 - ఇక్కడ ఎవరో ఉంటున్నారు! - ఏంటి? 696 00:52:40,285 --> 00:52:42,287 మన ఇంట్లో ఎవరో ఉంటున్నారు! 697 00:52:42,371 --> 00:52:43,747 అసలు ఏంటి ఇదంతా? 698 00:52:48,544 --> 00:52:50,170 ఎవరో ఇక్కడ పడుకుంటున్నారు… 699 00:52:54,424 --> 00:52:55,425 టామ్? 700 00:52:58,387 --> 00:53:00,639 టామ్? నువ్వు బాగానే ఉన్నావా? 701 00:53:08,480 --> 00:53:10,440 నాటలీ, వచ్చి నాకు సాయం చేయి. 702 00:53:11,483 --> 00:53:12,651 నన్ను వదులు! 703 00:53:15,696 --> 00:53:17,447 నన్ను వదులు! 704 00:53:22,661 --> 00:53:25,163 టామ్! టామ్, నువ్వు బాగానే ఉన్నావా? 705 00:53:25,247 --> 00:53:26,748 ఆ గోడలో ఎవరో ఉన్నారు. 706 00:53:28,166 --> 00:53:29,168 ఏంటి? 707 00:53:35,966 --> 00:53:37,551 అది పోసమ్. 708 00:53:38,927 --> 00:53:40,220 ఆనా! 709 00:53:40,762 --> 00:53:41,847 వదులు! 710 00:54:06,997 --> 00:54:08,123 ఇలా రా. ఇలా రా. 711 00:54:13,879 --> 00:54:17,090 నా కొడుకు జోలికి రావద్దు! 712 00:54:18,509 --> 00:54:19,718 ఏ కొడుకు? 713 00:54:25,349 --> 00:54:26,350 ఏంటి? 714 00:56:22,674 --> 00:56:24,676 తెలుగు అనువాదకర్త: హరీష్