1 00:00:21,897 --> 00:00:25,400 ఇక్కడ 'ఫోర్ ఐరన్' ఉపయోగించాలేమో, కానీ, ఏదో ఒకటిలే. 2 00:00:31,949 --> 00:00:33,575 చక్కని షాట్. 3 00:00:36,453 --> 00:00:37,454 థాంక్స్. 4 00:00:38,163 --> 00:00:39,831 మీరు సౌటర్ గ్రూప్ కి సంబంధించిన వారు, కదా? 5 00:00:40,624 --> 00:00:41,875 సిసీలియా? 6 00:00:43,043 --> 00:00:45,546 అవును, నేను, సౌటర్ గ్రూపులో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ని. 7 00:00:46,213 --> 00:00:47,589 సిసీలియా వాండర్వాల్. 8 00:00:48,257 --> 00:00:50,467 వాండర్వాల్. నేను కూడా అదే అనుకున్నాను. 9 00:00:53,804 --> 00:00:55,681 నా పేరు పౌలా శాండర్స్. 10 00:00:56,932 --> 00:00:58,809 మీ కోసం పని చేసే ఒక వ్యక్తి నాకు తెలుసు. 11 00:00:59,434 --> 00:01:00,519 అది నిజమా? 12 00:01:01,186 --> 00:01:02,604 డెన్నిస్ ఓ నీల్. 13 00:01:09,820 --> 00:01:11,488 మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. 14 00:01:35,262 --> 00:01:36,346 మా మూగజీవాలను మేము ప్రేమిస్తాము 15 00:01:36,430 --> 00:01:38,307 నాకొక పిల్లి కావాలి అది అంత ముద్దుగా ఉండాలి 16 00:01:38,390 --> 00:01:40,934 నాకొక పిల్లి కావాలి అది అంత ముద్దుగా ఉండాలి 17 00:01:41,018 --> 00:01:44,354 నాకొక పిల్లి కావాలి అది అంత ముద్దుగా ఉండాలి 18 00:01:44,438 --> 00:01:47,316 నాకొక పిల్లి కావాలి అది అంత ముద్దుగా ఉండాలి 19 00:01:47,983 --> 00:01:51,028 కిట్టి, మ్యావ్, మ్యావ్ కిట్టి, మ్యావ్, మ్యావ్ 20 00:01:51,111 --> 00:01:52,529 కిట్టి, మ్యావ్, మ్యావ్ కిట్టీ… 21 00:01:57,451 --> 00:01:58,869 'పా' యూ నీడ్ ఈస్ లవ్ గ్రూమర్స్ మిస్డ్ కాల్ 22 00:01:59,661 --> 00:02:02,039 హాయ్, 'పా యూ నీడ్ ఈస్ లవ్ గ్రూమర్స్' నుంచి మాట్లాడుతున్నాను. 23 00:02:02,122 --> 00:02:04,291 చెస్టర్ స్పా డే వీడియో ఒకటి మేము ఇప్పుడే మీకు పంపాము. 24 00:02:04,833 --> 00:02:07,002 మీ స్వీటీ రెడీ అయింది, మీరు ఎప్పుడైనా వచ్చి తీసుకువెళ్లచ్చు. 25 00:02:07,669 --> 00:02:08,669 త్వరలో కలుద్దాం. 26 00:02:29,066 --> 00:02:31,109 సారీ, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు. 27 00:02:31,193 --> 00:02:33,487 మీకు డెన్నిస్ ఓ నీల్ తెలుసు. మీరు అతనితో కలిసి పని చేస్తారు. 28 00:02:33,570 --> 00:02:35,280 బ్రయాన్, మన ఆఫీసులో డెన్నిస్ ఓ నీల్ అని ఎవరైనా ఉన్నారా? 29 00:02:35,364 --> 00:02:37,449 అతను నీ పే రోల్ లో లేడని నేను ఖచ్చితంగా చెప్పగలను. 30 00:02:37,533 --> 00:02:41,203 అతనికి బహుశా మీ ఆఫీసులో క్యుబికల్ ఉండకపోవచ్చు లేదా మీ సాఫ్ట్ బాల్ జట్టులో ఆడకపోవచ్చు. 31 00:02:41,286 --> 00:02:44,957 అతను కొంతమందిని బ్లాక్ మెయిల్ చేశాడు, దాని ద్వారా మీ క్లయింట్లు నేరుగా లాభపడ్డారు. 32 00:02:45,040 --> 00:02:47,376 సరే, సెక్యూరిటీని పిలిపించు, సరేనా? 33 00:02:47,459 --> 00:02:50,629 విను, నేను… నేను ఇక్కడ గోల్ఫ్ ఆడటానికి వచ్చాను. సరేనా? 34 00:02:50,712 --> 00:02:53,173 చెత్త పనులు చేయడానికి డెన్నిస్ వాడుకున్న ఒక కుర్రవాడు, 35 00:02:53,257 --> 00:02:54,383 అతను అత్యాశకి పోయి 36 00:02:54,466 --> 00:02:56,468 సొంతంగా మోసాలు చేసే ప్రయత్నంలో నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించాడు. 37 00:02:56,552 --> 00:03:01,265 ఆ కుర్రవాడినీ, అతని సహచరుడినీ డెన్నిస్ హత్య చేశాడు దానితో ఆ రెండు హత్య కేసుల్లో నేను అరెస్ట్ అయ్యాను. 38 00:03:01,348 --> 00:03:04,393 వావ్, ఇది… నా ఉద్దేశం, ఇది, అంటే, నిజంగా నమ్మశక్యంగా లేదు. 39 00:03:04,476 --> 00:03:07,396 నేను ఈ విషయాన్ని త్వరగా ముగించేస్తాను ఎందుకంటే గోల్ఫ్ పోలీసులు వచ్చేస్తున్నారు. 40 00:03:07,479 --> 00:03:09,648 ఆమెగాన్సెట్ జోనింగ్ చట్టాలు, బాక్సయిట్ గనులు, 41 00:03:10,357 --> 00:03:12,150 పిజ్జా యీస్ట్ పేటెంట్ హక్కులు 42 00:03:12,234 --> 00:03:13,986 - దాని అసలు యజమాని నార్త్ ఈస్టర్న్ ఫుడ్ గ్రూప్. - సరే. 43 00:03:14,069 --> 00:03:15,904 మేము నార్త్ ఈస్టర్న్ సంస్థతో కలిసి పని చేస్తాము, 44 00:03:15,988 --> 00:03:19,241 ఇంకా, అవును, మాకు చాలా మైనింగ్ సంస్థలతో లావాదేవీలు ఉన్నాయి. 45 00:03:19,324 --> 00:03:20,951 - ఖచ్చితంగా అదే. - వాళ్లు మా క్లయింట్లు. 46 00:03:21,034 --> 00:03:23,495 సౌటర్ అనేది ఒక అంతర్జాతీయ రిస్క్ అడ్వైజ్ మెంట్ సంస్థ. 47 00:03:23,579 --> 00:03:24,746 మేము చట్టాల్ని ఉల్లంఘించము. 48 00:03:24,830 --> 00:03:26,957 మా క్లయింట్లతో నిజాయితీగా వ్యాపారం చేస్తాము. 49 00:03:27,040 --> 00:03:29,334 - సరేనా? ఎక్స్ క్యూజ్ మీ. - సరే, చూడు, 50 00:03:29,418 --> 00:03:32,045 మీరు ఏం చేస్తారో నాకు తెలుసు ఇంకా డెన్నిస్ మీ కోసం ఏవేం పనులు చేశాడో నాకు తెలుసు. 51 00:03:32,129 --> 00:03:33,964 వాస్తవాలు తెలుసుకోవడంలో నేను నిపుణురాలిని. 52 00:03:35,048 --> 00:03:37,342 ఇంకో గంటలో మాకు విశ్వాసాన్ని పెంపొందించుకునే కార్యక్రమం ఉంది 53 00:03:37,426 --> 00:03:39,428 కానీ నేను ఇంకా 'బ్యాక్ నైన్' ఆడాల్సి ఉంది, కాబట్టి… 54 00:03:40,053 --> 00:03:41,346 ఓహ్, దేవుడా. నువ్వు చెప్పింది నిజమే. 55 00:03:41,930 --> 00:03:42,931 నువ్వు చెప్పింది నిజమే. 56 00:03:43,015 --> 00:03:46,560 అది నిజమని నాకు తెలుసు, కానీ నా దగ్గర ఆధారాలేమీ లేవు. 57 00:03:47,352 --> 00:03:49,771 సౌటర్ గ్రూప్ ని ఎవరూ ఏమీ చేయలేరు. 58 00:03:50,731 --> 00:03:51,732 కానీ నీ విషయంలో అలా కాదు. 59 00:03:51,815 --> 00:03:53,233 మీకు ఒక కొడుకు ఉన్నాడు. 60 00:03:53,317 --> 00:03:54,568 బ్లేక్ కదా? 61 00:03:56,737 --> 00:03:59,656 - దేని గురించి మాట్లాడుతున్నావు? - అతను లాక్రోస్ ఆడతాడు, కదా? 62 00:04:00,157 --> 00:04:01,658 నా కూతురు సాకర్ ఆడుతుంది. 63 00:04:01,742 --> 00:04:02,910 నా ఉద్దేశం, నాకు ఆ ఆటంటే చిరాకు, 64 00:04:02,993 --> 00:04:05,662 కానీ తన టీమ్ కి నేను కోచ్ గా ఆట నేర్పుతాను ఎందుకంటే, మేము… 65 00:04:06,663 --> 00:04:09,958 మన పిల్లలు సంతోషంగా ఉండటం కోసం మనం ఏదైనా చేస్తాం, కదా? 66 00:04:10,042 --> 00:04:11,668 కానీ మీరు హద్దు దాటారు 67 00:04:11,752 --> 00:04:15,756 ఎలాగంటే యేల్ యూనివర్సిటీలో మీ అబ్బాయికి అడ్మిషన్ కోసం ఒక అడ్మిషన్ ఆఫీసర్ కి లంచం ఇవ్వమని 68 00:04:15,839 --> 00:04:17,548 డెన్నిస్ ఓ నీల్ కి చెప్పారు. 69 00:04:17,632 --> 00:04:20,177 అది… అది నేను రుజువు చేయగలను. 70 00:04:20,260 --> 00:04:22,930 మీ జీవితాన్ని నేను చాలా గందరగోళం చేయగలను. 71 00:04:23,013 --> 00:04:24,264 అవును. నా ఉద్దేశం, 72 00:04:24,348 --> 00:04:27,184 'ఫుల్ హౌస్' షోలో ఆ అందమైన మహిళ మాదిరిగా మీరు జైలుకి వెళ్లకపోవచ్చు, 73 00:04:27,267 --> 00:04:29,978 కానీ తను కలలు కన్న ఆ స్కూలులో అతను ఖచ్చితంగా సీటు కోల్పోతాడు. 74 00:04:30,729 --> 00:04:31,730 - నిజంగానా? - అవును. 75 00:04:31,813 --> 00:04:32,814 అదిగో ఆమెనే. 76 00:04:33,398 --> 00:04:34,858 మనం పెద్దగా గొడవ ఏమీ చేయద్దు. 77 00:04:34,942 --> 00:04:37,194 ఆ మనుషుల్ని డెన్నిస్ ఓ నీల్ చంపాడు, నేను కాదు. 78 00:04:37,277 --> 00:04:39,780 నన్ను నిర్దోషిగా బయటపడేయాలి. ఈ కేసు నుండి పూర్తిగా తప్పించాలి. 79 00:04:39,863 --> 00:04:42,449 మీరు నిజాయితీ వ్యాపారంలో ఉన్నామని చెప్పారు. ఇది నిజాయితీ ఎలా అవుతుంది? 80 00:04:42,533 --> 00:04:44,159 మీరు ఒక పోరాడే తల్లితో పెట్టుకున్నారు! 81 00:04:44,243 --> 00:04:45,661 మీరు వెళ్లిపోవాలి. 82 00:04:46,495 --> 00:04:48,413 - అలాగే, నేను వెళ్లిపోతున్నాను. - సెక్యూరిటీకి కాల్ చేయండి. 83 00:04:54,545 --> 00:04:55,754 ఏంటి సంగతి? 84 00:04:56,296 --> 00:04:58,882 తుపాకీతో కాల్చిన గాయం. అవయవాలు బాగానే పని చేస్తున్నాయి. 85 00:04:59,550 --> 00:05:00,968 అతను స్పృహలోకి వచ్చాడా? 86 00:05:01,635 --> 00:05:04,221 ఇంకా లేదు. తనని స్పృహలోకి తీసుకురాగలమేమో చూద్దాం. 87 00:05:16,608 --> 00:05:17,609 హేయ్, డెన్నిస్. 88 00:05:22,698 --> 00:05:24,074 - ఏం జరుగుతోంది? - నువ్వు బాగా కోలుకుంటున్నావు. 89 00:05:24,157 --> 00:05:25,701 ఏం జరుగుతోంది? 90 00:05:27,452 --> 00:05:28,996 నువ్వు కోలుకుంటున్నావు. 91 00:05:29,705 --> 00:05:31,164 నీ ఆరోగ్యం మెరుగవుతోంది. 92 00:05:34,543 --> 00:05:36,170 నాకు నువ్వు గుర్తున్నావు. 93 00:05:37,629 --> 00:05:40,215 కాస్త తాజా గాలి పీల్చుకునే ఓపిక ఉందా? 94 00:05:45,429 --> 00:05:47,556 నువ్వు అడగవు అనుకున్నాను. 95 00:05:47,639 --> 00:05:49,933 నువ్వు తిరిగి పనిలో పడటం మాకు చాలా ముఖ్యం. 96 00:05:50,934 --> 00:05:52,936 మూడు, రెండు, ఒకటి… 97 00:05:53,645 --> 00:05:55,689 ఇదిగో చూడు. నీ శ్వాస… 98 00:06:08,368 --> 00:06:10,662 వాస్తవాలా? నీకు వాస్తవాలు కావాలా? 99 00:06:10,746 --> 00:06:12,539 అవును, నేను వాస్తవాలు తెలుసుకోవడంలో నిపుణురాలిని. 100 00:06:14,750 --> 00:06:16,877 అయితే, ఈ గొడవంతా ట్రెవర్ తో మొదలైంది. 101 00:06:16,960 --> 00:06:18,295 ఇంటరాగేషన్ రూమ్ 3 102 00:06:18,378 --> 00:06:20,297 అతను ఒక కెమెరా కుర్రవాడు, నాకు పరిచయం అయ్యాడు. 103 00:06:22,549 --> 00:06:24,009 మాకు మంచి స్నేహం కుదిరింది. 104 00:06:24,092 --> 00:06:27,721 - సరే. - ఇంకా మేము మాట్లాడుకోవడం మొదలుపెట్టాము… 105 00:06:43,987 --> 00:06:47,366 - ఏంటి సంగతి, బ్రై? - జెన్ జెన్, ఎక్కడ ఉన్నావు? 106 00:06:47,449 --> 00:06:48,450 ఎక్కడో క్షేమంగా ఉన్నాను. 107 00:06:48,534 --> 00:06:49,701 మంచిది. 108 00:06:49,785 --> 00:06:52,454 ఆ ఆడవిలో జరిగిన ఘటన… మంచిది కాదు. 109 00:06:52,996 --> 00:06:54,623 పై అధికారుల నుంచి నాకు చాలా విమర్శలు వస్తున్నాయి. 110 00:06:54,706 --> 00:06:56,041 అవును, అది తప్పలేదు. 111 00:06:56,124 --> 00:06:57,668 అయినా కూడా పౌలా సమస్యని పూర్తి చేస్తాను. 112 00:06:57,751 --> 00:07:00,879 మంచిది. నువ్వు ప్రియస్ కారుని తగలబెట్టేశావని విన్నాను. తెలివైన పని. 113 00:07:01,672 --> 00:07:03,257 నీకు కొత్త వాహనం కావాలా? 114 00:07:07,177 --> 00:07:08,512 కావాలి. అవును, అది సాయపడుతుంది. 115 00:07:08,595 --> 00:07:11,932 సరే. యోంకర్స్ స్పాట్ దగ్గరకి నీకు ఒక కారు పంపిస్తాను. 116 00:07:12,724 --> 00:07:13,976 అది రెడీ కాగానే నీకు మెసేజ్ చేస్తాను. 117 00:07:14,059 --> 00:07:16,061 ఈ పని కోసం అన్ని వనరుల్ని రంగంలోకి దింపుతున్నాం. 118 00:07:16,144 --> 00:07:17,646 ఏం చేసైనా సరే, ఆ పనిని పూర్తి చేస్తాం. 119 00:07:39,168 --> 00:07:41,086 నువ్వు నిలబడటానికి ప్రయత్నించగలవా? 120 00:07:44,715 --> 00:07:45,757 ఇదిగో చూడు. 121 00:07:47,050 --> 00:07:48,844 మూడు, రెండు, ఒకటి… 122 00:07:51,805 --> 00:07:53,599 కొద్దిగా అడుగులు వేయడానికి ప్రయత్నించు. 123 00:07:58,145 --> 00:08:01,982 ముఖం మీద కాల్పులు జరిగిన మనిషి ఇలా నడవగలగడం గొప్ప విషయమే, హా? 124 00:08:17,748 --> 00:08:19,166 లేదు, లేదు, లేదు, లేదు. వద్దు! 125 00:08:19,249 --> 00:08:21,168 ఇలా చేయద్దు! 126 00:08:29,593 --> 00:08:31,345 ఇలా చేయద్దు! 127 00:08:37,893 --> 00:08:39,602 వుడ్ గ్లెన్ అపార్ట్మెంట్స్ 128 00:08:39,686 --> 00:08:43,148 నా జీవితంలో ప్రేమ ఇంకా సంతోషం పూర్తిగా ఉండాలని ఎప్పుడూ కలలు కనేవాడిని. 129 00:08:44,441 --> 00:08:46,568 కానీ దేవుళ్లకి వేరేలా ఆలోచించారు అనుకుంటా. 130 00:08:47,736 --> 00:08:49,279 నేను, డెన్నిస్ ఓ నీల్, 131 00:08:50,030 --> 00:08:54,493 నా బాయ్ ఫ్రెండ్ జెఫ్ థోర్వాల్డ్ ఇంకా శామ్యూల్ ఫ్రేజర్ లని హత్య చేశానని ఒప్పుకుంటున్నాను. 132 00:08:56,036 --> 00:08:59,039 వాళ్లు నన్ను మోసం చేశారు, బాధపెట్టారు. 133 00:09:00,332 --> 00:09:02,376 నేను చేసిన నేరాలని తలుచుకుంటూ జీవించాలని ప్రయత్నించాను, 134 00:09:02,459 --> 00:09:06,380 కానీ "నేను చేసినవి నేరాలు అని తెలిశాక, క్షమించడం ఎలా సాధ్యం?" 135 00:09:07,047 --> 00:09:09,675 బహుశా వచ్చే జన్మలో, నాకు సంతోషం దక్కుతుందేమో. 136 00:09:10,592 --> 00:09:12,469 - హలో? - అప్పటి వరకూ… 137 00:09:12,553 --> 00:09:13,762 - గుడ్ బై. - ఏంటి? 138 00:09:49,131 --> 00:09:50,424 హేజల్. 139 00:09:51,175 --> 00:09:52,676 అమ్మా! 140 00:09:58,891 --> 00:10:01,143 ఈ రోజు నువ్వు నా ఇంట్లో ఉండచ్చు. 141 00:10:01,226 --> 00:10:02,644 - నిజంగానా? యాయ్! - అవును! 142 00:10:02,728 --> 00:10:06,565 అవును, మనం పడుకుని మూవీ చూద్దాం. మంచం మీదనే డిన్నర్ చేద్దాం. 143 00:10:06,648 --> 00:10:08,942 మనం చాలా చికెన్ ఫింగర్స్ తినచ్చు. 144 00:10:09,443 --> 00:10:11,320 - మరి ఫ్రెంచ్ ఫ్రైస్ సంగతి ఏంటి? - ఫ్రెంచ్ ఫ్రైస్ కదా, సరే. 145 00:10:11,403 --> 00:10:14,907 - సరే. - కర్లీ, క్రింకల్, రెగ్యులర్, ట్రఫుల్… 146 00:10:14,990 --> 00:10:17,117 - ఇంకా వాఫెల్ ఫ్రైస్! - వాఫెల్ ఫ్రైస్! 147 00:10:17,201 --> 00:10:18,452 నువ్వు ఆలోచించే తీరు నాకు నచ్చుతుంది! 148 00:10:18,535 --> 00:10:22,331 ఓహ్, దేవుడా. ఇలా రా. ఈ భూగ్రహం మీద నువ్వే చాలా తెలివైన అమ్మాయివి. 149 00:10:22,414 --> 00:10:23,957 ఇంకా నువ్వు మంచిదానివి ఇంకా ధైర్యవంతురాలివి 150 00:10:24,041 --> 00:10:25,709 చాలా సరదాగా ఉంటావు ఇంకా చాలా అమాయకురాలివి 151 00:10:25,792 --> 00:10:27,211 - ఇంకా చాలా అల్లరి పిల్లవి. - అమ్మా! 152 00:10:27,294 --> 00:10:29,922 ఇంకా నిన్ను చాలా ప్రేమిస్తాను. నిన్ను విడిచి ఉండటం నిజంగా చాలా బాధగా ఉంది. 153 00:10:31,006 --> 00:10:32,007 మమ్మీ. 154 00:10:32,799 --> 00:10:33,884 అమ్మా. 155 00:10:33,967 --> 00:10:34,968 నువ్వు ఎక్కడికి వెళ్లావు? 156 00:10:40,098 --> 00:10:43,185 అమ్మా! సరే, నేను కూడా నిన్ను మిస్ అయ్యాను, కానీ నాకు వెళ్లి ఆడుకోవాలని ఉంది. 157 00:10:43,268 --> 00:10:45,103 సరే, సరే, సరే. వెళ్లి ఆడుకో. 158 00:10:48,899 --> 00:10:50,108 హేయ్, పౌలా! 159 00:10:51,193 --> 00:10:53,237 - హేయ్. - హాయ్! 160 00:10:53,320 --> 00:10:55,489 - నన్ను త్వరగా కలుసుకున్నందుకు థాంక్స్. - అవును. 161 00:10:55,572 --> 00:10:58,158 అవును, ఇంక నువ్వు ఆ పీడకల నుండి బయటపడినందుకు చాలా సంతోషంగా ఉంది. 162 00:10:58,242 --> 00:10:59,826 ఓహ్, దేవుడా, నేను ఊహించలేకపోయాను. 163 00:10:59,910 --> 00:11:01,203 అయితే, ఏం జరిగింది? 164 00:11:01,286 --> 00:11:04,706 ఆ హంతకుడు ఆత్మహత్య చేసుకున్నాడు, ఇంకా, ఆ హత్యలన్నీ తనే చేశానని ఒప్పుకున్నాడు… 165 00:11:04,790 --> 00:11:06,416 అవును, అంటే, పోలీసులు నాకు అదే చెప్పారు. 166 00:11:06,500 --> 00:11:08,502 కానీ అన్నింటికన్నా ముఖ్యమైనది నా మీద ఉన్న అభియోగాలన్నీ రద్దు చేశారు 167 00:11:08,585 --> 00:11:10,087 దానితో నేను నిర్దోషిని అని ప్రతి ఒక్కరికీ తెలిసింది. 168 00:11:10,170 --> 00:11:11,922 హేయ్, నీకు జరిగినదానికి నేను సంతోషిస్తున్నాను. 169 00:11:12,005 --> 00:11:13,423 థాంక్స్, థాంక్స్. సరే. 170 00:11:13,507 --> 00:11:18,512 ఇంక నా దృష్టి వేరేదానికి మళ్లించాలి అనుకుంటున్నాను. కాబట్టి, ఆ విషయానికి వస్తే, రేపు విచారణ ఉంది. 171 00:11:18,595 --> 00:11:20,138 ఇప్పుడు నేను నిర్దోషిని అని రుజువైంది కాబట్టి, 172 00:11:20,222 --> 00:11:23,267 మనం కస్టడీ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటా ఎందుకంటే సహజంగా… 173 00:11:23,350 --> 00:11:25,477 మనం దాని గురించి ఇక్కడ మాట్లాడుకోకూడదు అనుకుంటా, కదా? 174 00:11:25,561 --> 00:11:27,521 - ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. - మరేం ఫర్వాలేదు. 175 00:11:28,021 --> 00:11:29,898 పూర్తి కస్టడీ, మీరింకా అదే కోరుకుంటున్నారా? 176 00:11:29,982 --> 00:11:32,109 నేను మాలరీతో ఏకీభవిస్తాను. దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకోకూడదు అనుకుంటా. 177 00:11:32,192 --> 00:11:33,777 సరే, నేను నిన్ను ఒక ప్రశ్న అడిగాను. 178 00:11:34,278 --> 00:11:36,154 ఏంటి? ఇక్కడ కస్టడీ గురించి ఇక్కడే మాట్లాడమంటున్నావా? 179 00:11:36,238 --> 00:11:38,240 అవును, ఎందుకంటే రేపే విచారణ కాబట్టి. 180 00:11:39,533 --> 00:11:41,410 నీకు అలా జరిగినందుకు బాధగా ఉంది, కానీ దాని కారణంగా 181 00:11:41,493 --> 00:11:44,580 - మన మధ్య జరుగుతున్న దాంట్లో మార్పు ఉండదు. - సరే, కానీ అది మారాలి, కదా? 182 00:11:44,663 --> 00:11:45,956 - నాకు నీతో వాదించాలని లేదు. - నేను వాదించడం లేదు. 183 00:11:46,039 --> 00:11:48,041 నీతో ఇప్పుడు ఈ విషయం గురించి గొడవ పడలేను. 184 00:11:48,125 --> 00:11:50,919 సరే, మన బిడ్డకి ఏది మంచిదో అదే చేయాలి అనుకుంటున్నాం, నీ మాదిరిగానే. సరేనా? 185 00:11:51,003 --> 00:11:53,005 ప్లీజ్. ఈ రోజు సరదాగా గడుపు. 186 00:11:54,339 --> 00:11:56,258 సరే. బై, హేజ్! 187 00:11:56,967 --> 00:11:58,343 బై, హేజల్! 188 00:11:58,427 --> 00:12:01,263 - బై, నాన్నా! బై, మాల్! - హాయ్, హేజల్! 189 00:12:06,685 --> 00:12:08,604 - మనం ఎందుకు ట్రెండింగ్ లో లేము? - ఏంటి? 190 00:12:09,396 --> 00:12:12,024 టి.ఎమ్.జెడ్. ఫోన్ చేయలేదు. టిమ్మీ షాలమెట్ మెసేజ్ చేయలేదు. 191 00:12:12,107 --> 00:12:14,902 నా టిక్ టాక్ లో కొత్త ఫాలోయెర్స్ ఎవరూ రాలేదు. 192 00:12:14,985 --> 00:12:17,446 నువ్వు ఏమన్నా టీనేజ్ అమ్మాయివా? ఏం మాట్లాడుతున్నావు? 193 00:12:17,529 --> 00:12:19,406 నేను ఏం అంటున్నానంటే, ఆ కేసు నుంచి పౌలాని బయటపడేసినందుకు 194 00:12:19,489 --> 00:12:20,699 మనల్ని అందరూ ప్రేమగా పలకరించాలి కదా. 195 00:12:20,782 --> 00:12:22,201 అంటే, మనల్ని సన్మానించడమో, 196 00:12:22,284 --> 00:12:24,036 లేదా బహుశా, ఒక చిన్న పార్కుకి మన పేరు పెట్టడమో చేయాలి. 197 00:12:24,119 --> 00:12:25,329 నాకు తెలియదు. నాకు తోచింది చెబుతున్నాను. 198 00:12:25,412 --> 00:12:27,039 అతను ఆత్మహత్య చేసుకోవడం వల్ల పౌలా బయటపడింది. 199 00:12:27,122 --> 00:12:28,665 మనం నిజానికి ఏమీ చేయలేదు. 200 00:12:28,749 --> 00:12:30,626 మనం ఏమీ చేయలేదా? మనం చాలా చేశాం కదా. 201 00:12:30,709 --> 00:12:33,337 కానీ ఇప్పుడు మనం కేవలం, అంటే, గుర్తింపులేని హీరోలం అయ్యాం. 202 00:12:33,420 --> 00:12:35,589 చెత్త. నాకు హీరోగా గుర్తింపు కావాలి. 203 00:12:36,590 --> 00:12:39,384 ఓహ్, మళ్లీ మామూలే. ఎవరికీ పట్టనివాడిలా ఉండు. 204 00:12:41,762 --> 00:12:43,305 కనీసం మనం మంచిగా గడిపాం కదా. 205 00:12:44,223 --> 00:12:46,517 ఆఫీసు బయట మనం కలిసి సమయం గడపడం సరదాగా ఉంది, కదా? 206 00:12:51,146 --> 00:12:52,147 సరే. 207 00:12:52,231 --> 00:12:54,525 ఆ బోరు కొట్టే లా శాట్ పరీక్ష కోసం రాత్రంతా చదువుతూ గడిపాను, 208 00:12:54,608 --> 00:12:56,235 కాబట్టి మన కోసం కాఫీ తీసుకురానా? 209 00:12:56,318 --> 00:12:58,111 - అలాగే, థాంక్స్. - సరే. 210 00:13:18,215 --> 00:13:20,509 డ్రూ, ఏదో టాప్ సీక్రెట్ విషయం నడుస్తోంది, ఏంటి సంగతి? 211 00:13:20,592 --> 00:13:22,094 నువ్వు ఏమైనా కొత్త ఆర్టికల్ రాస్తున్నావా లేదా… 212 00:13:28,392 --> 00:13:29,768 బాగా మాట్లాడుకున్నాం. 213 00:13:29,852 --> 00:13:32,437 అయితే, అప్పుడు మేము ఆ గదిలోకి వెళ్లాము 214 00:13:33,021 --> 00:13:36,149 అక్కడ మిస్ రూసో ఇంకా మిస్టర్ చాన్ ముద్దు పెట్టుకోవడం చూశాము! 215 00:13:36,733 --> 00:13:38,110 అది చాలా అసహ్యంగా ఉంది. 216 00:13:38,193 --> 00:13:39,319 ఓహ్, దేవుడా. 217 00:13:39,403 --> 00:13:41,697 మిస్ రూసో ఇంకా మిస్టర్ చాన్ పెళ్లి చేసుకున్నారన్న విషయం నీకు తెలుసా? 218 00:13:41,780 --> 00:13:43,824 - ఆగు? ఏంటి? - అవును. 219 00:13:43,907 --> 00:13:45,450 - లేదు! - నీకు ఆశ్చర్యంగా ఉందా? 220 00:13:45,534 --> 00:13:47,369 అది అసహ్యంగా ఉంది. అవును, నువ్వు నా మతిపోగొట్టావు. 221 00:13:54,751 --> 00:13:56,545 అమ్మా, నాకు అలసటగా అనిపిస్తోంది. 222 00:13:56,628 --> 00:13:58,505 మనం మిగతాది రేపు చూద్దామా? 223 00:13:58,589 --> 00:14:00,090 - రేపు. - సరే. 224 00:14:01,508 --> 00:14:02,509 సరే. 225 00:14:05,304 --> 00:14:07,723 కానీ కాసేపు మెలకువగా ఉండి నన్ను హత్తుకుంటావా, హేజల్ఫేస్? 226 00:14:08,765 --> 00:14:10,267 మనం స్లంబర్ పార్టీ చేసుకుందాం. 227 00:14:10,767 --> 00:14:11,768 - సరే. - సరే. 228 00:14:16,857 --> 00:14:18,192 మూవీకి ఇంక గుడ్ నైట్. 229 00:14:25,199 --> 00:14:26,783 - గుడ్ నైట్, అమ్మా. - గుడ్ నైట్. 230 00:14:45,594 --> 00:14:46,762 అందరూ లేచి నిలబడండి. 231 00:14:47,554 --> 00:14:50,933 న్యూ యార్క్ కింగ్స్ కౌంటీ ఫ్యామిలీ కోర్టు ఇప్పుడు సెషన్ లో ఉంది. 232 00:14:51,016 --> 00:14:54,186 హానరబుల్ జడ్జ్ నార్లెస్కీ కోర్టుని నిర్వహిస్తారు. 233 00:14:57,523 --> 00:15:00,400 హెండ్రిక్స్ ఇంకా శాండర్స్ మధ్య కస్టడీ విషయాల గురించి 234 00:15:00,484 --> 00:15:03,195 మనం ఇప్పుడు విచారించబోతున్నాం. 235 00:15:03,278 --> 00:15:04,446 ఇంక వాదనలు మొదలుపెట్టండి. 236 00:15:06,323 --> 00:15:09,326 మార్జిన్ మ్యాగజీన్ లో నేను ఫ్యాక్ట్ చెకర్ గా పని చేస్తున్నాను. 237 00:15:09,409 --> 00:15:13,121 నా డిజైన్ పని వర్చువల్ గా ఉంటుంది, కాబట్టి నేను ఎక్కడైనా పని చేసుకోగలను. 238 00:15:13,205 --> 00:15:16,375 నేను ఈ మధ్యనే మా డిపార్ట్మెంట్ కి హెడ్ గా ప్రమోట్ అయ్యాను. 239 00:15:16,458 --> 00:15:20,754 మాలరీకి బోయెసీలో అవకాశం వచ్చినప్పుడు, అది సరైనదని అనుకున్నాను. 240 00:15:20,838 --> 00:15:23,966 ఆమె స్కూల్ విషయమా? నేను అన్నీ చూసుకుంటాను. తన సాకర్ టీమ్ నేనే కోచ్ ని. 241 00:15:24,049 --> 00:15:27,261 మాకు అక్కడ పూల్ ఉంది, ఇంకా పెద్ద పెరడు ఉంది. 242 00:15:27,761 --> 00:15:30,013 స్కీయింగ్ నేర్చుకోవాలని హేజల్ చాలా ఆసక్తిగా ఉంది. 243 00:15:30,097 --> 00:15:32,599 అవును, మా వివాహబంధం కొనసాగాలని మేము ప్రయత్నించాము. నా ఉద్దేశం, నేను… 244 00:15:33,433 --> 00:15:34,434 నేను ప్రయత్నించాను. 245 00:15:34,518 --> 00:15:36,019 నేను ఎదిగాను. 246 00:15:36,603 --> 00:15:37,938 పౌలా ఎదగలేదు. 247 00:15:38,939 --> 00:15:40,566 కానీ ఒక దశలో మేము వేరుపడిపోయాము. 248 00:15:40,649 --> 00:15:46,113 అది ఎలా అనిపిస్తుందంటే… అంటే, మన లాన్ కళ్లముందే ఎండిపోయినట్లుగా ఉంటుంది. 249 00:15:46,613 --> 00:15:47,614 ఇంకా నేను… 250 00:15:48,574 --> 00:15:50,200 నేను వేరొకరితో ప్రేమలో పడ్డాను. 251 00:15:50,284 --> 00:15:55,038 ఒక రోజు మనకి ఒక చిన్న మచ్చ కనిపిస్తుంది కానీ తరువాత, ఆ మరుసటి రోజు, అదంతా మట్టి అని తెలుస్తుంది. 252 00:15:55,122 --> 00:15:59,042 కానీ, చూడండి, నాకు నా కూతురు అంటే చాలా ఇష్టం, ఇంకా తనకి మంచి జీవితం ఉండాలని నా కోరిక. 253 00:15:59,126 --> 00:16:02,045 నిజానికి, నేను ఆలోచించేది కేవలం అదే. 254 00:16:02,546 --> 00:16:03,547 కేవలం హేజల్ గురించే. 255 00:16:06,967 --> 00:16:09,052 అవును, హేజల్ నా ప్రాణం. 256 00:16:10,304 --> 00:16:11,805 తన కోసం నేను ఏదైనా చేస్తాను. 257 00:16:13,265 --> 00:16:15,601 ఐడహోకి మకాం మార్చడం తప్ప. 258 00:16:16,810 --> 00:16:20,522 అయితే, మీరు ఈ మధ్యన రెండు హత్య కేసుల్లో అరెస్ట్ అయ్యారు, నిజమేనా? 259 00:16:21,064 --> 00:16:23,775 అవును. నేను నిర్దోషిగా బయటపడ్డాను. 260 00:16:23,859 --> 00:16:24,860 కంగ్రాట్యులేషన్స్. 261 00:16:24,943 --> 00:16:26,445 మీలాంటి ఒక మంచి తల్లి 262 00:16:26,528 --> 00:16:29,323 హంతకులతో ఇంకా సెక్స్ వర్కర్లతో అలా ఎలా కలిశారు? 263 00:16:29,406 --> 00:16:30,657 అబ్జెక్షన్. సంబంధంలేని ప్రశ్న. 264 00:16:30,741 --> 00:16:32,075 అభ్యర్థన తిరస్కరించబడింది. 265 00:16:32,159 --> 00:16:33,285 అది కేవలం ఆన్ లైన్ లో పరిచయమే. 266 00:16:33,785 --> 00:16:34,995 ఆన్ లైన్. 267 00:16:35,078 --> 00:16:39,208 అయితే, మీ ఇంటి నుండి ఒక సెక్స్ వర్కర్ తో మీరు సంబంధం పెట్టుకున్నారు. 268 00:16:40,209 --> 00:16:42,336 హేజల్ మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఆ పని చేశారా? 269 00:16:46,381 --> 00:16:47,382 బహుశా చేసి ఉండచ్చు. 270 00:16:48,467 --> 00:16:51,136 కానీ తను నిద్రపోయేది. 271 00:16:51,220 --> 00:16:53,138 యువర్ హానర్, పిల్లలు నిద్రపోయే సమయంలో పేరెంట్స్ శృంగారం చేసుకోవడం సహజం. 272 00:16:53,222 --> 00:16:55,557 మీ అభ్యంతరం చెప్పండి లేదా మీ వంతు వచ్చేవరకూ వేచి ఉండండి, మిస్టర్ వార్విక్. 273 00:16:55,641 --> 00:17:00,187 అయితే, కేవలం స్పష్టత కోసం అడుగుతున్నాను, మూడో గ్రేడ్ చదివే అమ్మాయి నిద్రపోయే సమయంలో 274 00:17:00,270 --> 00:17:02,481 జంట హత్యల కేసుతో సంబంధం ఉన్న ఒక కిరాయి సెక్స్ వర్కర్ తో కలిసి 275 00:17:02,564 --> 00:17:05,317 మీరు హస్తప్రయోగం చేసుకున్నారు కదా. 276 00:17:05,400 --> 00:17:06,401 అది మీరన్నట్లు కాదు. 277 00:17:06,484 --> 00:17:09,738 ఇంకా పోర్ట్ ల్యాండ్ లో మీరు కేలబ్ జాక్సన్ ని చంపిన సంగతి ఏంటి? 278 00:17:13,784 --> 00:17:15,618 అది ఒక ఘోరమైన ప్రమాదం. 279 00:17:16,118 --> 00:17:18,247 అవును, కానీ అప్పుడు హేజల్ ఆ కారు వెనుక సీటులో ఉంది, నిజమే కదా? 280 00:17:18,329 --> 00:17:22,251 ఆమె వెనుక సీటులో హెడ్స్ పెట్టుకుని, నిద్రపోయింది. 281 00:17:22,751 --> 00:17:25,420 ఆమె ఏదీ వినలేదు. ఆమె ఏమీ చూడలేదు. 282 00:17:25,503 --> 00:17:27,256 తనకి ఆ ప్రమాదం గురించి ఏమీ తెలియదు. 283 00:17:28,089 --> 00:17:31,009 తను అంత గాఢ నిద్రలో ఉండటం మన అదృష్టం అనుకోవాలి, కదా? 284 00:17:32,719 --> 00:17:34,263 చూడండి, నేను ఊరికే ఆలోచిస్తున్నాను, 285 00:17:34,847 --> 00:17:37,015 కేలబ్ ని కారుతో ఢీ కొట్టిన సమయంలో మీరు తాగిన మైకంలో ఉన్నారా? 286 00:17:37,099 --> 00:17:39,560 అబ్జెక్షన్. క్రిమినల్ అభియోగాలు ఏమీ ఫైల్ కాలేదు. 287 00:17:39,643 --> 00:17:40,978 సాక్షిని వేధిస్తున్నారు. సంబంధం లేని ప్రశ్న. 288 00:17:41,645 --> 00:17:43,730 నువ్వు ఎప్పుడూ ఇలా వెధవలాగే ప్రవర్తిస్తావు, స్కాట్. 289 00:17:43,814 --> 00:17:45,399 అవేవీ ప్రస్తావించద్దు, మిస్టర్ మెక్ కీనన్. 290 00:17:45,482 --> 00:17:49,653 చూడండి, ఒక తల్లిగా ఆమె ఎంపికలు ఎలాంటివో అవి చూపించాలన్నదే నా ప్రయత్నం. 291 00:17:49,736 --> 00:17:51,280 ఆమె ఎలాంటి ఆదర్శ మహిళో, కదా? 292 00:17:51,363 --> 00:17:56,159 ఆమె నిర్లక్ష్యంగా ప్రవర్తించిన సంఘటన ఖచ్చితంగా దీనికి సంబంధించినదే, కానీ అది విత్ డ్రా చేసుకుంటున్నాను. 293 00:17:57,744 --> 00:17:59,997 మళ్లీ ఆ కెమెరా కుర్రవాడి విషయానికి వద్దాం. 294 00:18:01,123 --> 00:18:02,457 హేజల్ కి అతని గురించి తెలుసా? 295 00:18:03,375 --> 00:18:04,626 మీరు నిజాలు చెబుతానని ప్రమాణం చేశారు. 296 00:18:05,794 --> 00:18:08,005 మీ పాప అతనితో మాట్లాడింది నిజమేనా? 297 00:18:09,464 --> 00:18:12,467 అవును. ఒకసారి, అవును. ఫోనులో మాట్లాడింది. ఒకసారి, అవును. 298 00:18:12,551 --> 00:18:15,846 ఒకసారి. ఫోనులో మాట్లాడింది. ఆ సెక్స్ వర్కర్ తో. 299 00:18:17,181 --> 00:18:19,641 అయితే, ఆ పాప తండ్రి ద్వారా నేను విన్నది ఏమిటంటే, 300 00:18:19,725 --> 00:18:21,977 ఆ ఒక్కసారి, 301 00:18:23,020 --> 00:18:26,064 ఫోనులో, మూడో గ్రేడ్ చదివే పాప, ఆ సెక్స్ వర్కర్ తో మాట్లాడిన సంఘటన, 302 00:18:27,065 --> 00:18:28,275 ఆ పాపని చాలా భయపెట్టిందట. 303 00:18:28,358 --> 00:18:29,359 నా వాదన ఇక పూర్తయింది. 304 00:18:37,576 --> 00:18:39,494 ఈ గదిలో నేను ఒక్కదానినే తల్లిని. 305 00:18:40,662 --> 00:18:42,706 నేను ఒక్కర్తినే తల్లిని. నువ్వు చెప్పనవసరం లేదు… 306 00:18:42,789 --> 00:18:45,959 నా చర్యల వెనుక కారణాలని 307 00:18:46,043 --> 00:18:47,961 మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? 308 00:18:48,045 --> 00:18:49,171 ఖచ్చితంగా, ఎందుకు తెలుసుకోము? 309 00:18:49,963 --> 00:18:54,635 నా వివాహబంధం తెగిపోయాక, అది నన్ను తీవ్రంగా కుంగదీసింది. 310 00:18:54,718 --> 00:18:57,054 నా పరిస్థితి అస్తవ్యస్తం అయిపోయింది. నేను… 311 00:18:58,263 --> 00:19:02,643 కానీ నాకు ఒక కూతురు ఉంది, కాబట్టి, నేను మతిస్థిమితం కోల్పోలేను. 312 00:19:02,726 --> 00:19:07,814 ఏ రైతు బజారులోనో లేదా బుక్ క్లబ్ లోనో ఒక అపరిచితుడిని పరిచయం చేసుకోలేను. 313 00:19:07,898 --> 00:19:11,193 కాబట్టి, ఒక అనుబంధం కోసం ఆన్ లైన్ ని ఆశ్రయించాను, 314 00:19:11,276 --> 00:19:17,366 అంటే, స్కూల్ పికప్ ఇంకా ఆఫీసు డెడ్ లైన్స్ మధ్య కాస్త సమయం వెచ్చించగలను అనుకున్నాను. 315 00:19:17,950 --> 00:19:20,619 చూడండి, అదే నేను చేసిన నేరం అంటారా? 316 00:19:20,702 --> 00:19:22,663 అదే నా జీవిత లక్ష్యం అనుకుంటున్నారా? 317 00:19:22,746 --> 00:19:24,248 అది కేవలం మనుగడ కోసం చేసిన పని. 318 00:19:25,541 --> 00:19:29,044 చూడండి, హేజల్ ఎవరి పాపనో కాదు. 319 00:19:31,004 --> 00:19:33,006 తను నా కడుపులో పెరిగింది. 320 00:19:33,632 --> 00:19:35,968 మేము ఇద్దరం ఒక్కరమే. 321 00:19:36,051 --> 00:19:39,304 మేము రక్తం పంచుకున్నాం. ఊపిరిని పంచుకున్నాం. 322 00:19:39,388 --> 00:19:42,307 మేము అన్ని విధాలుగా పూర్తిగా అనుబంధం కలిగి ఉన్నాం. 323 00:19:42,391 --> 00:19:46,270 కాబట్టి, నాకు తెలుసు. తనకేం కావాలో నాకు తెలుసు. 324 00:19:46,353 --> 00:19:49,523 తను ఇక్కడ తన స్నేహితులతో కలిసి ఉండాలి. 325 00:19:49,606 --> 00:19:53,944 తను ఇక్కడ ఆ చెత్త సాకర్ టీమ్ తో ఉండాలి. 326 00:19:54,027 --> 00:19:57,364 ఇంకా మా నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేసే ఆ టై క్వాన్ డో కూడా తనకి అవసరం. 327 00:19:58,198 --> 00:19:59,616 అది నాకు తెలుసు. 328 00:20:00,993 --> 00:20:03,829 తను నాతో కలిసి మరికొంతకాలం ఎదగాలి. 329 00:20:04,454 --> 00:20:07,833 హేజల్ కీ, నాకూ ఇప్పటికీ అనుబంధం ఉంది గనుక అది నాకు తెలుసు. 330 00:20:07,916 --> 00:20:09,334 మేము… 331 00:20:09,418 --> 00:20:12,504 మీరు ఇక్కడ ఏం చెప్పినా కూడా మా అనుబంధంలో మార్పు ఉండదు. 332 00:20:13,672 --> 00:20:15,966 మా మధ్య అనుబంధం విడదీయరానిది. 333 00:20:22,931 --> 00:20:24,141 చాలా అందంగా చెప్పారు. 334 00:20:24,224 --> 00:20:26,518 కానీ ప్రేమ మాత్రమే సరిపోదు. 335 00:20:26,602 --> 00:20:30,606 తన తండ్రితో ఉంటేనే ఆమె జీవితం బాగుంటుంది, అది మనం అందరం చూస్తున్నాం అనుకుంటా. 336 00:20:35,194 --> 00:20:36,778 మనం కాసేపు విరామం తీసుకుందాం. 337 00:20:44,703 --> 00:20:46,580 - నేను ఇప్పుడే వస్తాను. - సరే. 338 00:20:47,873 --> 00:20:48,874 సరే. 339 00:20:51,793 --> 00:20:55,464 నువ్వు మా ఒప్పందాన్ని స్వీకరించి, మాతో పాటు బోయెసీకి ఎందురు రావు, పౌలా? 340 00:20:56,465 --> 00:20:58,509 కొద్దిగా రాజీ పడచ్చు కదా? 341 00:21:18,695 --> 00:21:21,949 కొత్త స్టోరీ ఐడియాలు 342 00:21:24,952 --> 00:21:26,954 ఎల్ శాట్ టెస్టింగ్ 343 00:21:54,356 --> 00:21:56,358 పోలీస్ క్రైమ్ సీన్ యూనిట్ 344 00:22:07,202 --> 00:22:09,413 యూనిట్ 4జి బెడ్ రూమ్ #2 345 00:22:09,496 --> 00:22:12,499 బెడ్ రూమ్ #1 బాత్ రూమ్ 346 00:22:24,052 --> 00:22:26,138 సరే, అందరూ వినండి, విచారణ తిరిగి కొనసాగించబడుతుంది. 347 00:22:26,889 --> 00:22:28,849 ఇది సంక్లిష్టమైన పరిస్థితి. 348 00:22:29,433 --> 00:22:32,352 హేజల్ కి బోయెసీలో అందమైన జీవితం ఉంటుంది. 349 00:22:33,187 --> 00:22:36,190 ఇంకా నేను మీకు అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, మిస్టర్ హెండ్రిక్స్. 350 00:22:38,567 --> 00:22:42,905 అయితే, మీ ఇద్దరి మధ్య ముందస్తుగా ఒక ఒప్పందం ఉంది. 351 00:22:44,281 --> 00:22:47,201 దాన్ని అతిక్రమించేలా మిస్ శాండర్స్ ఎలాంటి పనీ చేయలేదు. 352 00:22:47,868 --> 00:22:51,455 వాస్తవానికి, ఆమె ఎన్ని కష్టాలు పడినప్పటికీ, 353 00:22:51,955 --> 00:22:54,917 హేజల్ నమ్ముకోగల తల్లిగానే ఉంది. 354 00:22:58,587 --> 00:23:01,173 కాబట్టి ఒక నిర్ణయానికి రావడానికి కోర్టుకి కష్టంగా ఉంది. 355 00:23:01,256 --> 00:23:06,261 అన్ని విషయాలనీ పరిగణించిన మీద, నా రూలింగ్ ఏమిటంటే, 356 00:23:07,471 --> 00:23:10,766 ప్రస్తుతం అంగీకరించిన విధంగానే కస్టడీని కొనసాగించాలి. 357 00:23:10,849 --> 00:23:13,227 హేజల్ న్యూ యార్క్ లోనే ఉంటుంది, 358 00:23:13,310 --> 00:23:16,897 ఆమె పేరెంట్స్ మధ్య ఒప్పందం కుదిరినప్పుడు వారు ఇక్కడే ఉన్నారు గనుక. 359 00:23:18,815 --> 00:23:20,859 ఈ విచారణ వాయిదా వేయడమైనది. 360 00:23:57,396 --> 00:24:00,858 బ్రయాన్ గ్రే నిసాన్. గుడ్ లక్. 361 00:24:10,450 --> 00:24:12,202 మీరు మూడు కప్ కేక్స్ మాత్రమే తీసుకోవాలి. 362 00:24:12,286 --> 00:24:13,662 ఇది రెండోదే. 363 00:24:18,500 --> 00:24:19,710 నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు? 364 00:24:19,793 --> 00:24:21,336 నేను… 365 00:24:23,005 --> 00:24:24,590 నవ్వుతుంటే నా ముఖం నొప్పి పెడుతోంది. 366 00:24:24,673 --> 00:24:27,050 అవును, అందాల పోటీ వేడుక మాదిరిగా, 367 00:24:27,134 --> 00:24:30,304 ఆ విచిత్రమైన, వికృతంగా ఉండే జూనియర్లు నవ్వినట్లు… 368 00:24:31,930 --> 00:24:32,931 ఓహ్, దేవుడా. 369 00:24:43,317 --> 00:24:45,068 - అభినందనలు. - నా కిచెన్ లో వాంతి చేసుకోకు. 370 00:24:45,152 --> 00:24:46,820 అన్నీ అనుకున్నట్లే జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 371 00:24:46,904 --> 00:24:48,614 థాంక్యూ. అవును. నేను కూడా సంతోషంగా ఉన్నాను. 372 00:24:49,114 --> 00:24:51,992 మీ ఇద్దరికీ థాంక్స్… అవును. 373 00:24:52,868 --> 00:24:53,869 సరే. 374 00:24:55,495 --> 00:24:57,873 ఆ డెన్నిస్ సూసైడ్ విషయం నాకు అర్థం కావడం లేదు. 375 00:24:58,373 --> 00:24:59,541 - ఏంటి? - ఎందుకంటే 376 00:24:59,625 --> 00:25:01,001 అతని ముఖం మీద కాల్చి చంపేశావని చెప్పావు కదా? 377 00:25:01,084 --> 00:25:02,878 నిజంగా? ఆ విషయం ఇక్కడ మాట్లాడాలి అనుకుంటున్నావా? ఇప్పుడా? 378 00:25:02,961 --> 00:25:04,755 నేను గుసగుసగా మాట్లాడచ్చు అనుకున్నా, అలా అయితే ఫర్వాలేదేమోనని. 379 00:25:04,838 --> 00:25:07,007 సరే. అంటే, నిజమే, నేను అదే చేశాను. అతడిని షూట్ చేశా అనుకున్నాను. 380 00:25:07,090 --> 00:25:08,759 నేను తనని షూట్ చేశాను, ఇంకా అతను చనిపోయాడేమో అనుకున్నాను. 381 00:25:08,842 --> 00:25:10,969 - అసలు ఏం జరిగి ఉండచ్చు? - సరే, ఇంక ఆపు. ఇంక ఆపేయ్. 382 00:25:11,053 --> 00:25:12,304 - పౌలా. - చెత్త! 383 00:25:21,396 --> 00:25:22,606 ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. 384 00:25:23,440 --> 00:25:24,441 థాంక్యూ. 385 00:25:25,150 --> 00:25:26,652 నా వెన్నంటే ఉన్నందుకు థాంక్యూ. 386 00:25:27,319 --> 00:25:28,320 నువ్వు… 387 00:25:29,112 --> 00:25:32,449 నువ్వు మంచి లాయర్ వి, కానీ నిజంగా, నిజంగా చాలా గొప్ప మనిషివి. 388 00:25:33,033 --> 00:25:34,034 అది స్వీకరిస్తాను. 389 00:25:36,078 --> 00:25:37,704 నీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా విడాకుల లాయరు కావాలేమో అని అడగడం 390 00:25:37,788 --> 00:25:39,790 అసందర్భంగా ఉంటుంది అంటావా? 391 00:25:39,873 --> 00:25:40,999 చాలా అసందర్భంగా ఉంటుంది. 392 00:25:50,050 --> 00:25:54,179 - ఓహ్, దేవుడా! ఎంత గొప్ప సర్వీస్. థాంక్యూ. - చీర్స్. 393 00:25:54,263 --> 00:25:55,264 నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? 394 00:25:56,890 --> 00:25:59,142 హా. అంటే, నిర్దోషిగా రుజువైనందుకు ఇచ్చే పార్టీల్లో నాకు తెలిసి ఇదే బెస్ట్ పార్టీ. 395 00:26:00,102 --> 00:26:03,605 ఇంకా నేను జనవరి ఆరో తేదీ కేసులు చాలా వాటికి వెళ్లాను. 396 00:26:03,689 --> 00:26:06,316 - నిన్ను అక్కడే చూసుంటాను. - అవును. అవును. 397 00:26:12,322 --> 00:26:16,118 హేయ్, నేను ఆలోచిస్తున్నాను, డిన్నర్ సంగతి ఏంటి? శనివారం ఫర్వాలేదా? 398 00:26:20,539 --> 00:26:21,665 నేను వేరే విధంగా ప్రయత్నించనా? 399 00:26:21,748 --> 00:26:22,833 అలాగే, తప్పకుండా. 400 00:26:35,512 --> 00:26:38,515 సరే. అవును, శనివారం కుదురుతుంది. 401 00:26:45,522 --> 00:26:47,733 సరే, హలో. లోపలికి రండి. తలుపు తెరిచే ఉంది. 402 00:26:57,576 --> 00:26:58,577 ఒక నిమిషం టైమ్ ఉందా? 403 00:27:18,889 --> 00:27:21,225 పని పూర్తయింది. మంచి కాలం ముందుంది. 404 00:27:23,852 --> 00:27:24,978 మీకేం కావాలి? 405 00:27:25,562 --> 00:27:27,564 డిటెక్టివ్ బాక్ స్టర్, నా భాగస్వామి తుపాకీ కాల్పుల్లో మరణించాడు. 406 00:27:27,648 --> 00:27:30,442 జైలులో నిన్ను కలిసిన నకిలీ లాయరు ఆ హత్య చేసింది. 407 00:27:30,526 --> 00:27:32,152 దేవుడా. 408 00:27:32,236 --> 00:27:35,572 నువ్వు నిర్దోషిగా విడుదల కావడం, డెన్నిస్ నేరాంగీకారం, అతని ఆత్మహత్య, 409 00:27:35,656 --> 00:27:39,993 అతని శవం ఎంత ఛిద్రమైందంటే, కనీసం అటాప్సీ చేయడానికి కూడా అవకాశం లేకపోయింది, 410 00:27:40,077 --> 00:27:41,745 ఇదంతా ఏదో కుట్రలా ఉంది. 411 00:27:42,871 --> 00:27:44,581 సరే, నాకు నీతో మాట్లాడాలని లేదు, సరేనా? 412 00:27:44,665 --> 00:27:47,918 నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. కానీ నువ్వు నన్ను జైలులో పెట్టించావు. 413 00:27:48,001 --> 00:27:49,086 నాకు ఒక అనుమానం ఉంది. 414 00:27:50,045 --> 00:27:51,088 నీకు ఏదో విషయం తెలిసి ఉండాలి. 415 00:27:51,171 --> 00:27:53,924 అసలు ఏం జరుగుతోందో ఏమిటో నాకేమీ తెలియదు. 416 00:27:54,007 --> 00:27:58,387 నాకేం తెలియదు. నేను లోపలికి వెళ్లాలని మాత్రమే నాకు తెలుసు ఇంకా నా పిల్లలకి నేను కప్ కేక్స్ తినిపించాలి 417 00:27:58,470 --> 00:28:00,472 ఆ తరువాత సోమవారంనాడు నేను ఆఫీసుకి వెళ్లాలి. 418 00:28:00,556 --> 00:28:04,434 ఇంకా బహుశా నేను డేట్ కి వెళ్తానేమో, సరే. 419 00:28:04,518 --> 00:28:06,812 కానీ నేను మిగిలినవన్నీ వదిలేస్తున్నాను. 420 00:28:06,895 --> 00:28:08,480 - పౌలా! - బహుశా నువ్వు కూడా వదిలేయాలేమో. 421 00:28:08,564 --> 00:28:11,400 - ఒక విషయం తెలుసా? బెస్ట్ ఆఫ్ లక్. - నీకు ఏదో తెలుసు. ఈ కేసు ఇంకా ముగియలేదు. 422 00:28:14,444 --> 00:28:16,113 పౌలాకి ఈ వ్యక్తి ప్రియుడు కావడం నాకు నచ్చలేదు. 423 00:28:16,905 --> 00:28:20,868 నాకు తెలియదు. బహుశా అతను పంక్చర్ అయిన టైరుని మార్చగలడేమో ఇంకా 'జి స్పాట్' ని కనిపెట్టగలడమో. 424 00:28:21,702 --> 00:28:23,537 అవి రెండూ సాధారణంగా తెలుసుకోవలసిన విషయాలు. 425 00:28:23,620 --> 00:28:25,539 అవి రెండూ ఒకదానితో ఒకటి కలవడం చాలా అరుదు. 426 00:28:26,248 --> 00:28:28,292 చాలామంది ఆడవాళ్లు ఆ రెండు పనులూ చేసుకోగలరు. 427 00:28:28,375 --> 00:28:30,127 - నిజమే. - ఎల్ శాట్ పరీక్షలు ఎలా రాశావు? 428 00:28:30,711 --> 00:28:31,712 నేను బాగానే రాశాను అనుకుంటా. 429 00:28:32,671 --> 00:28:35,757 వాస్తవానికి, నేను పారాలీగల్ కావాలని ఆలోచిస్తున్నాను. 430 00:28:36,884 --> 00:28:40,721 హా, అది దారుణంగా ఉంటుందని నా మిత్రుడు ఖాయ్ అంటాడు, కానీ అతని కంపెనీకి నిక్స్ టికెట్లు దొరుకుతాయి, కాబట్టి… 431 00:28:42,389 --> 00:28:43,724 అయితే నిజంగానే నన్ను వదిలేసి వెళ్లిపోతావా? 432 00:28:44,266 --> 00:28:47,686 హా, అంటే, నేను లాయర్ కి అయితే, అది నా బ్రాండ్ ఇమేజ్ కి సరిగ్గా సరిపోతుంది. 433 00:28:48,896 --> 00:28:53,483 సారీ, జెర్-బేర్, కానీ ఏదో ఒక సమయంలో ఎవరి దారి వాళ్లు చూసుకోవలసి వస్తుంది. 434 00:28:54,359 --> 00:28:55,360 వావ్. 435 00:28:55,861 --> 00:28:57,738 బేబీ పక్షి ఎదిగి గూడు వదిలి వెళ్లిపోతోంది. 436 00:28:57,821 --> 00:28:59,198 అవును, అంతే అనుకుంటా. 437 00:29:01,867 --> 00:29:03,243 హేయ్, మనం ఇక్కడి నుండి వెళ్లిపోదామా? 438 00:29:04,745 --> 00:29:06,413 నీకు ఒక గుడ్ లక్ కాక్ టైల్ కొనిస్తాను. 439 00:29:09,833 --> 00:29:12,753 అలాగే, అది నాకు ఇష్టమే. ఆ పనే చేద్దాం. పద… 440 00:29:13,545 --> 00:29:15,464 గుడ్ బై చెప్పకుండా ఇక్కడి నుండి మెల్లగా జారుకుందాం. 441 00:29:17,090 --> 00:29:18,091 అలాగే. 442 00:29:27,142 --> 00:29:28,769 అవును. నువ్వు దీన్ని తట్టుకోగలవా? 443 00:29:40,405 --> 00:29:43,075 హేయ్, మనం, మా ఇంటి దగ్గరలో ఉన్న బార్ కి వెళదాం, సరేనా? 444 00:29:45,661 --> 00:29:46,662 సరే. 445 00:29:46,745 --> 00:29:48,080 అయ్యో, లేదు. అందుకోసం కాదు. ఊరికే… 446 00:29:48,664 --> 00:29:50,040 వై రాత్రి పది గంటలకి వస్తోంది. 447 00:29:53,752 --> 00:29:54,753 సారీ. 448 00:29:54,837 --> 00:29:55,838 వై? 449 00:29:56,755 --> 00:30:00,259 ఆ స్వార్థపరురాలతో ఇంకెప్పుడూ మాట్లాడను అని చెప్పావు కదా? 450 00:30:00,926 --> 00:30:03,512 అవును. అవును, మేము తిరిగి మళ్లీ ఒకటయ్యాం, కాబట్టి… 451 00:30:04,221 --> 00:30:05,514 నాకు అబద్ధం చెబుతున్నావు కదా. 452 00:30:05,597 --> 00:30:07,349 అది నిజంగా ఈ మధ్యనే జరిగింది. 453 00:30:07,850 --> 00:30:09,852 హీరో కావడం ఉపయోగపడింది అనుకుంటా. 454 00:30:10,561 --> 00:30:12,396 అన్నట్లు, నువ్వే బలవంతంగా నాతో ఆ పని చేయించావు. 455 00:30:12,479 --> 00:30:15,732 కాబట్టి మేమిద్దరం మళ్లీ ఒకటి కావడానికి కారణం అయినందుకు నీకు నిజంగా థాంక్స్. 456 00:30:16,733 --> 00:30:17,734 యాయ్, నేనే. 457 00:30:18,986 --> 00:30:22,573 అలాగే, తప్పకుండా. మనం ఎక్కడికైనా వెళ్లచ్చులే. 458 00:30:25,158 --> 00:30:28,579 హేయ్, నువ్వు ఏ రకమైన మాయిశ్చరైజర్ వాడతావు? నీ చేతులు వెన్నలా మెత్తగా ఉన్నాయి. 459 00:30:29,162 --> 00:30:30,163 ఇది ఫన్నీగా ఉంది. 460 00:30:41,675 --> 00:30:43,343 - హేయ్. - కిందకి దిగి వచ్చినందుకు థాంక్స్. 461 00:30:43,427 --> 00:30:44,428 పాపాయి వస్తువులు ఇవిగో. 462 00:30:44,511 --> 00:30:45,804 - సరే. అంతే కదా? - మంచిది. 463 00:30:45,888 --> 00:30:46,889 - సరే. - అలాగే. 464 00:30:48,056 --> 00:30:49,224 మనం ఒక సెకను మాట్లాడుకుందామా? 465 00:30:52,686 --> 00:30:53,979 - ప్లీజ్? - ఓహ్, దేవుడా. 466 00:30:54,062 --> 00:30:55,939 కోర్టులో మనం చాలా మాట్లాడుకున్నాం. 467 00:30:57,191 --> 00:30:59,443 నాకు తెలుసు కానీ అందుకు సారీ. 468 00:30:59,526 --> 00:31:01,737 స్కాట్ అంత దారుణంగా వాదిస్తాడని నేను ఊహించలేదు, అది నిజం. 469 00:31:01,820 --> 00:31:04,364 అతను నీ విషయంలో అనవసరంగా చాలా మాట్లాడాడని నాకు అనిపించింది. 470 00:31:04,448 --> 00:31:05,991 - అతను హద్దు మీరాడు. - చాలా క్రూరంగా మాట్లాడాడు. 471 00:31:06,074 --> 00:31:08,160 అది చాలా బాధపెట్టింది, అందుకు సారీ. 472 00:31:08,243 --> 00:31:09,995 - సరే. - అయితే ఇప్పుడు ఏంటి? 473 00:31:12,289 --> 00:31:14,333 అది నువ్వే ఆలోచించుకోవాలేమో. 474 00:31:14,416 --> 00:31:15,959 నా ఉద్దేశం, మీరు బోయెసీకి ఎప్పుడు మారిపోతున్నారు? 475 00:31:17,044 --> 00:31:18,462 నాకు తెలియదు. త్వరలోనే. కానీ… 476 00:31:20,130 --> 00:31:21,590 నేను కేసు ఓడిపోతానని ఊహించలేదు, 477 00:31:21,673 --> 00:31:25,969 కాబట్టి ఇది ఎలా చేయాలో నేను అన్ని రకాలుగా కాస్త ఆలోచించుకోవాలి 478 00:31:26,053 --> 00:31:27,888 ఎందుకంటే ఏం ప్లాన్ చేస్తామో ఇంకా నాకు తెలియదు. 479 00:31:27,971 --> 00:31:29,139 నువ్వు ఏం అనుకుంటున్నావు? 480 00:31:29,890 --> 00:31:31,725 నేను అనుకోవడం… 481 00:31:34,102 --> 00:31:37,105 నేను హేజల్ తల్లిని, నీకు కాదు. 482 00:31:38,106 --> 00:31:39,608 నువ్వేం చేయాలో నువ్వే ఆలోచించుకోవాలి అనుకుంటా. 483 00:31:39,691 --> 00:31:41,068 నాకు అర్థమైంది. నేను ఏం చేస్తున్నానంటే 484 00:31:41,151 --> 00:31:43,946 ఇక్కడ రవాణా పరంగా కొద్దిగా నీ సాయం తీసుకోవాలి అనుకుంటున్నాను. 485 00:31:44,029 --> 00:31:47,533 నా ఉద్దేశం… నీ సమస్యల్ని నువ్వే పరిష్కరించుకోవాలి, కార్ల్. 486 00:31:54,456 --> 00:31:55,457 పౌలా. 487 00:31:58,544 --> 00:32:00,170 - పౌలా. - బై, కార్ల్. 488 00:32:05,050 --> 00:32:06,051 చెత్త. 489 00:32:06,552 --> 00:32:07,803 నేను నరకంలో ఉన్నానా? 490 00:32:08,846 --> 00:32:10,889 అంతకన్నా ఘోరమైన చోట ఉన్నావు. క్వీన్స్ లో ఉన్నావు. 491 00:32:11,682 --> 00:32:13,267 నీ కోసం ఒకటి తీసుకొచ్చాను. 492 00:32:15,394 --> 00:32:17,604 హేయ్, చిన్న బాబు. 493 00:32:18,230 --> 00:32:21,233 డామ్, ఆ క్యాట్ స్పా వాళ్లు నిన్ను సెక్సీగా మార్చేశారు. 494 00:32:21,316 --> 00:32:22,568 థాంక్స్, జి. 495 00:32:25,571 --> 00:32:26,864 చనిపోకుండా బతికినందుకు థాంక్స్. 496 00:32:31,243 --> 00:32:32,327 అన్నట్లు… 497 00:32:33,370 --> 00:32:35,038 నిన్ను షూట్ చేసిన ఆమెని వేరెవరో కాల్చి చంపేశారు. 498 00:32:35,122 --> 00:32:37,708 ఆ మనిషి ఏంటి అంత చిన్నగా ఉండి 499 00:32:38,333 --> 00:32:40,752 ముద్దుగా ఉండే ఫిలిపినో యాసలో మాట్లాడుతున్నాడా? 500 00:32:40,836 --> 00:32:43,172 అది ఎవరు చేశారో ఎందుకు చేశారో నాకు అస్సలు తెలియదు. 501 00:32:43,797 --> 00:32:46,466 నువ్వు త్వరగా కోలుకోవాలి ఎందుకంటే వాళ్లెవరో మనం పరిశోధించాలి. 502 00:33:05,277 --> 00:33:07,362 వదిలేయ్. ఎవరి దారి వాళ్లదే. 503 00:33:10,490 --> 00:33:12,743 కెమెరా కుర్రవాడు, సెక్స్, మర్డర్, ఇంకా ఒంటరి తల్లి - జెరీ సోటో కథనం 504 00:33:59,873 --> 00:34:00,874 దేవుడా. 505 00:34:10,007 --> 00:34:11,134 వద్దు. 506 00:34:29,695 --> 00:34:31,697 గుర్తుతెలియని కాలర్ 507 00:34:50,507 --> 00:34:51,675 బియుఎన్ డబ్ల్యుక్యూఓపిడబ్ల్యుసి…ఎస్ కె@7834.నెట్ 508 00:34:51,757 --> 00:34:53,427 ఫోన్ ఆన్సర్ చేయి మనం మాట్లాడుకోవాలి 509 00:34:57,306 --> 00:34:59,558 ఎటాచ్మెంట్ - ఒక మూవీ 510 00:35:00,684 --> 00:35:01,935 పంపిన వారు మీ కాంటాక్ట్ జాబితాలో లేరు 511 00:35:15,324 --> 00:35:16,909 నన్ను నిర్లక్ష్యం చేయడం ఆపు. 512 00:35:16,992 --> 00:35:18,785 జరుగు! పక్కకి జరుగు! 513 00:35:19,328 --> 00:35:21,246 నేను తప్పుకోవడం లేదు. 514 00:35:21,747 --> 00:35:23,957 నాతో మాట్లాడు లేదా నేను మాట్లాడటం మొదలుపెడతాను. 515 00:35:24,041 --> 00:35:25,334 ఇది నీకు నచ్చిందా, హా? 516 00:35:26,168 --> 00:35:28,086 - ఏంటి? - నా దారికి అడ్డులే. 517 00:35:29,880 --> 00:35:32,966 నీ కోసం పోరాడాను. నువ్వేంటి, నీకు తెలివి లేదా? 518 00:35:34,468 --> 00:35:36,220 నిన్ను చంపేస్తాను. 519 00:35:36,303 --> 00:35:38,305 నువ్వు ఇది కోరుకున్నావు, గుర్తుందా? 520 00:35:40,182 --> 00:35:41,183 నోరు మూయ్! 521 00:36:01,036 --> 00:36:03,789 నిన్ను మేము సొంతం చేసుకున్నాం. 522 00:36:03,872 --> 00:36:07,251 నువ్వు మాకు ఒక సాయం చేయాలి. 523 00:36:11,964 --> 00:36:16,009 గుర్తు తెలియని కాలర్ ఆన్సర్ చేయడానికి స్లయిడ్ చేయండి 524 00:36:29,022 --> 00:36:30,023 హలో? 525 00:37:47,184 --> 00:37:49,186 తెలుగు అనువాదకర్త: హరీష్